1 00:01:46,815 --> 00:01:51,778 బంగారం. బంగారం? మనం వెళ్లాలి. మనం వెళ్లాలి. ఏమైంది? 2 00:01:54,323 --> 00:01:59,536 ఏదేమైనా, అది బాగా బాధాకరంగా అనిపించింది. అదీగాక నేను అప్పుడు పసిదాన్ని. 3 00:02:02,623 --> 00:02:03,749 నేను చెప్పేది అర్థమవుతోందా? 4 00:02:06,043 --> 00:02:09,213 కానీ మా అమ్మ చేసిన ఏకైక మంచి పనేంటంటే, 5 00:02:09,295 --> 00:02:11,632 ఆసుపత్రిలో నాకు నా బిడ్డను పట్టుకోవడానికి ఇవ్వలేదు. 6 00:02:11,715 --> 00:02:15,135 నా ద్వారా చెడు ప్రభావమేదీ నా బిడ్డపై పడకుండా ఉండటానికని అలా చేసింది. 7 00:02:17,888 --> 00:02:21,099 కానీ లియన్, తను ఇక్కడే ఉంది. 8 00:02:21,183 --> 00:02:23,435 తన కళ్ళెదుటే మరో మహిళ తన బిడ్డను సాకుతోంది. 9 00:02:23,519 --> 00:02:26,104 నాకు... నాకు మతి పోతోంది. 10 00:02:28,273 --> 00:02:31,109 నాకు తెలుసు. కానీ వాడు తన బిడ్డే అయినా కూడా... 11 00:02:31,193 --> 00:02:34,696 ...షాన్, డొరోతీలు అమ్మానాన్నలుగా ఉండటం తనకి ఆనందంగానే ఉన్నట్టుంది. 12 00:02:36,281 --> 00:02:38,575 తన మానసిక స్థితి అంత బాగాలేదు, బంగారం. 13 00:02:43,163 --> 00:02:45,040 తన మానసిక స్థితి దిగజారుతోందని నీకూ అర్థమవుతోంది కదా. 14 00:02:48,001 --> 00:02:54,091 ఏదోక రోజు లియన్, తన బిడ్డని తీసుకొని చెప్పా పెట్టకుండా వెళ్లిపోతే? 15 00:02:54,174 --> 00:02:55,425 అప్పుడు ఏమవుతుంది? 16 00:02:55,509 --> 00:02:58,303 డొరోతీ, తన కొడుకు కోసం ఎల్లకాలం వెతుకుతూనే ఉంటుందా? 17 00:02:59,638 --> 00:03:01,431 అలాంటి దుర్భరమైన జీవితం పగవానికి కూడా రాకూడదు. 18 00:03:01,515 --> 00:03:03,517 నువ్వు అన్నదాంట్లో నిజముంది. 19 00:03:04,768 --> 00:03:06,562 చట్టప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే బాగుంటుంది. 20 00:03:09,022 --> 00:03:11,400 ఆ క్రమంలో బిడ్డ లియన్ కి చెందినదని నిరూపితమైతే కథ అడ్డం తిరుగుతుంది. 21 00:03:24,037 --> 00:03:25,998 ఈ వయస్సులో ఏంటి ఈ డ్రెస్, అక్కా? 22 00:03:26,081 --> 00:03:27,207 కాస్త నా మానాన నన్ను వదిలేయ్. 23 00:03:28,208 --> 00:03:33,130 మార్లిన్ మన్రోలానే ఉండేవారి పోటీని కవర్ చేసే పనిని నాకు అప్పగించారు. 24 00:03:33,630 --> 00:03:37,009 అంతే కాకుండా, ఈ డ్రెస్ వేసుకోవడానికి నాకు వయసేమీ అయిపోలేదని తెలుసుకో. 25 00:03:37,092 --> 00:03:40,971 జెరికోని లియన్ మరీ ఎక్కువసేపు పడుకోబెట్టకుండా ఉండేలా చూసుకుంటావా? 26 00:03:42,055 --> 00:03:43,849 నిన్న రాత్రి వాడు అటుఇటు కదులుతూనే ఉన్నాడు. 27 00:03:43,932 --> 00:03:46,768 నేను బాగా అలసిపోయాను, అదీగాక 28 00:03:46,852 --> 00:03:50,272 మార్లిన్ లా ఉండాలంటే, కళ్ల కింద క్యారీ బ్యాగులు ఉండకూడదు కదా. 29 00:03:52,191 --> 00:03:53,192 సరే. 30 00:03:55,027 --> 00:03:58,739 ఇంకో విషయం, ఒక మహిళకు చెందిన డైపర్ బ్యాగ్ మన వద్దే ఉండిపోయింది కదా, 31 00:03:58,822 --> 00:04:01,408 అది తీసుకోవడానికి ఆమె రేపో మాపో వస్తోందని షాన్ కి చెప్పు. 32 00:04:01,909 --> 00:04:03,118 తప్పకుండా చెప్పనులే. 33 00:04:10,167 --> 00:04:12,419 ఒక పెగ్గు వోడ్కా వేస్తే దీని రుచి అదిరిపోతుంది. 34 00:04:13,003 --> 00:04:14,087 అది నీకు కూడా బాగుంటుందిలే. 35 00:04:14,171 --> 00:04:15,464 తథాస్తు. 36 00:04:15,547 --> 00:04:17,216 బుడ్డోడిని నువ్వు అరూబాకి తీసుకెళ్తున్నావా? 37 00:04:17,298 --> 00:04:19,009 లేదు, లియన్ ని పార్కుకు తీసుకెళ్తున్నా. 38 00:04:19,091 --> 00:04:20,928 నువ్వు కూడా వస్తావా? ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంది. 39 00:04:21,011 --> 00:04:22,846 లేదు. నాతో అయితే తను పక్క సందు దాకా కూడా రాదు. 40 00:04:22,930 --> 00:04:24,848 తను పార్కులో తిరుగుతుంది అనుకుంటున్నావా? 41 00:04:24,932 --> 00:04:27,768 తను సిద్ధంగానే ఉందనుకుంటా. మనందరిలో కూడా పురోగతి ఉంది. 42 00:04:27,851 --> 00:04:30,521 అతి త్వరలోనే మన కుటుంబం కూడా అందరిలా మామూలు కుటుంబం అయిపోతుంది. 43 00:04:30,604 --> 00:04:31,605 అవును. 44 00:04:32,105 --> 00:04:33,106 ఆ విషయానికి వస్తే... 45 00:04:34,942 --> 00:04:38,278 మనం లియన్, జెరికోల డిఎన్ఏ పరీక్ష చేయించాలని నాకు అనిపిస్తోంది. 46 00:04:38,362 --> 00:04:40,197 ఇప్పుడు మళ్లీ అది ఎందుకు? 47 00:04:40,280 --> 00:04:42,074 ఖచ్చితంగా తెలుసుకోవడానికి. 48 00:04:42,741 --> 00:04:46,203 ఇంకా దత్తత ప్రక్రియని ప్రారంభించే వీలు కూడా మనకి దొరుకుతుంది కదా. 49 00:04:46,286 --> 00:04:47,746 ఈ తతంగాన్నంతా చట్టపరంగా పక్కాగా ఉండేలా చేసుకుందాం. 50 00:04:47,829 --> 00:04:51,124 జూలియన్, ఇప్పుడు అన్నీ బాగున్నాయి. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. 51 00:04:51,750 --> 00:04:54,962 -నువ్వు నీ మీద, నీ ఇంట్లో దృష్టి పెట్టుకో. -నా తపనంతా కాపాడాలనే... 52 00:04:55,045 --> 00:04:56,213 దేన్ని కాపాడాలని? 53 00:04:56,797 --> 00:04:59,883 షాన్ ని తన పిచ్చి పనుల నుండి. బీట్ రూట్ కషాయం తాగుతాడట. 54 00:04:59,967 --> 00:05:02,052 అలాంటి భయానక దృశ్యాన్ని నా కళ్లతో నేను చూడలేను. 55 00:05:02,135 --> 00:05:04,012 వాడి టోపీ నాకు కనబడట్లేదు. ఒక్క నిమిషంలో వచ్చేస్తా. 56 00:05:14,356 --> 00:05:16,942 జూలియన్, నేను అది చేసేలోపు వీడిని ఎత్తుకుంటావా? 57 00:05:17,526 --> 00:05:21,029 నా షర్ట్ అంతా క్యాబేజీ ఉంది. అది వాడికి పడకపోవచ్చు. 58 00:05:23,240 --> 00:05:24,241 సిద్దంగా ఉన్నావా? 59 00:05:42,676 --> 00:05:44,261 వాడి కళ్లద్దాలు దొరికాయి. 60 00:05:44,344 --> 00:05:45,679 ఎంత బుడ్డిగా ఉన్నాయో చూడు. 61 00:05:53,520 --> 00:05:54,980 మనం మరీ ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. 62 00:06:15,626 --> 00:06:19,755 పూలు. చూడు. 63 00:06:19,838 --> 00:06:24,009 చూడు, పూలు. చెట్లు. 64 00:06:53,580 --> 00:06:55,749 వాటిని తినవచ్చని నీకు తెలుసా? 65 00:06:55,832 --> 00:06:57,918 -పూలని తినవచ్చా? -అన్నిటినీ కాదులే. 66 00:06:58,794 --> 00:07:01,505 ఇవి గడ్డి చామంతులు. ఇక్కడ ఉన్నవాటన్నింటినీ తినవచ్చు. 67 00:07:01,588 --> 00:07:04,508 అది ఆవాల పువ్వు. ఇది గంగవల్లి. 68 00:07:07,302 --> 00:07:09,388 దీనితో కమ్మని పచ్చడి చేసుకోవచ్చు. 69 00:07:09,471 --> 00:07:11,431 విటమిన్లు, ఒమెగా 3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. 70 00:07:12,099 --> 00:07:15,269 దీనితో సూపు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, లేదా రసం కూడా చేసుకోవచ్చు. 71 00:07:20,482 --> 00:07:21,525 ఇది బాగుంది. 72 00:07:46,967 --> 00:07:49,428 -కాస్త చిల్లరుంటే ఇస్తారా? -తప్పకుండా, చూసి ఇస్తాను. 73 00:07:50,179 --> 00:07:51,180 ఇదిగో. 74 00:07:57,519 --> 00:07:58,604 నాకు ఇంటికి వెళ్లిపోవాలనుంది. 75 00:08:30,719 --> 00:08:31,929 జాగ్రత్త. చాలా వేడిగా ఉంది. 76 00:08:35,432 --> 00:08:38,184 అబ్బా, ఇక నీ ఈల ఆపు, షాన్. 77 00:08:39,144 --> 00:08:40,479 ఇప్పుడు నాకు అస్సలు మూడ్ లేదు. 78 00:08:41,563 --> 00:08:44,525 నేను అప్పుడెప్పుడో చనిపోయిన వ్యక్తి వేషం వేసుకొని తిరుగుతూ ఉంటే, 79 00:08:44,608 --> 00:08:47,319 ఇసబెల్ ఏమో ఎంచక్కా కప్లోవిట్జ్ కేసును కవర్ చేస్తుందనే విషయం తెలిసింది. 80 00:08:47,402 --> 00:08:49,530 నీ షోయే మరింత సరదాగా ఉంటుందేమో, డొరోతీ. 81 00:08:49,613 --> 00:08:51,114 అది నీ అభిమానం, లియన్. 82 00:08:51,198 --> 00:08:54,159 కానీ చెప్తున్నా కదా, ఒక మంచి హత్య కేసుకు సంబంధించిన కవరేజీకి మించింది మరేదీ ఉండదు. 83 00:08:54,243 --> 00:08:57,037 మరి నాకెందుకు మార్లిన్ పని అప్పగించారో తెలుసా? 84 00:08:57,120 --> 00:09:00,290 నా ఫిగర్ చాలా బాగుంటుందట. ఆ విషయం భలే ఆశ్చర్యంగా ఉంది కదూ? 85 00:09:04,002 --> 00:09:05,712 ఈ డ్రెస్సులో మాత్రం నువ్వు చాలా బాగున్నావు, డొరోతీ. 86 00:09:06,380 --> 00:09:09,842 హేయ్! ఏంటా సరసం! లియన్ ఇబ్బంది పడిపోతుంది కదా. 87 00:09:10,884 --> 00:09:12,344 ఇది నోట్లో పెట్టుకుంటే అట్టే కరిగిపోతోంది. 88 00:09:13,011 --> 00:09:14,388 మళ్లీ సూప్ ఆ, షాన్? 89 00:09:14,471 --> 00:09:16,056 నడకకు వెళ్లినప్పుడు కనబడిన వాటితో చేశాను. 90 00:09:16,139 --> 00:09:18,267 ఇది గడ్డి చామంతి మొక్కతో చేసిన సూప్. చాలా బాగుంది. 91 00:09:19,184 --> 00:09:20,853 నాకు అంత ఆకలిగా లేదులే. 92 00:09:22,604 --> 00:09:24,523 ఈ డ్రెస్ చాలా బిగుతుగా ఉంది. 93 00:09:24,606 --> 00:09:26,316 దీన్ని విప్పేస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. 94 00:09:27,651 --> 00:09:28,986 వీడిని తీసుకెళ్లి స్నానం చేయిస్తాను. 95 00:09:29,069 --> 00:09:33,615 అయ్యో. వీడికి వీడి అమ్మ దగ్గర ఉండాలనుంది. 96 00:09:50,007 --> 00:09:51,300 ఏంటి సంగతి? 97 00:09:51,800 --> 00:09:54,970 పరిస్థితులు అంతగా బాగాలేవు. నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు. 98 00:09:55,053 --> 00:09:57,181 నేనూ, నా భార్యా చిన్నచిన్నవాటికే గొడవపడుతున్నాం. 99 00:09:57,264 --> 00:09:59,975 ఆ మూఢ మఠం ప్రభావం నుండి మెల్లిమెల్లిగా బయటపడుతున్నావు అంతేలే. 100 00:10:00,058 --> 00:10:03,478 పూర్తిగానే బయటపడిపోతావులే. చెప్తున్నా కదా, తర్వాత నీ జీవితమంతా ఉల్లాసంగా సాగిపోతుంది. 101 00:10:04,396 --> 00:10:07,441 ఆ పిచ్చి మఠం వాళ్లు మళ్లీ నీకు కనిపించలేదు కదా? 102 00:10:07,524 --> 00:10:08,775 నిన్ను మళ్లీ ఇబ్బందికి గురి చేయట్లేదు కదా? 103 00:10:08,859 --> 00:10:10,861 లేదు. 104 00:10:10,944 --> 00:10:12,529 అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 105 00:10:13,488 --> 00:10:17,242 షాన్ కానీ మీ అక్క కానీ నన్ను చూస్తే, నానా హంగామా చేసేస్తారు. 106 00:10:18,243 --> 00:10:20,996 మొదటి కారణం, మనం ఎప్పుడూ కలుసుకొనే జిమ్ బాగా పాతపడిపోయింది, 107 00:10:21,079 --> 00:10:23,081 అది చర్మ అంటు వ్యాధికి నెలవు, ఒకసారి వస్తే తగ్గదు కూడా. 108 00:10:23,165 --> 00:10:24,625 ఓరి నాయనోయ్. 109 00:10:24,708 --> 00:10:26,210 అయ్య బాబోయ్. 110 00:10:26,293 --> 00:10:27,920 అబ్బా. 111 00:10:28,462 --> 00:10:30,047 ఓరి నాయనోయ్. 112 00:10:34,718 --> 00:10:38,972 రెండవ కారణం, లియన్, జెరికోల డీఎన్ఏను పరీక్షించడంలో నాకు నీ సాయం కావాలి. 113 00:10:40,140 --> 00:10:43,393 నీకు కావలసిన సామాగ్రి అంతా తెచ్చాను కనుక అది చాలా తేలిగ్గా చేసేయవచ్చు. 114 00:10:44,478 --> 00:10:47,898 అవును. ఆ బుడ్డోడి ముక్కులో దీన్ని పెడ్తే సరిపోతుంది. 115 00:10:48,440 --> 00:10:52,361 అంత సీన్ లేదు. కిట్స్... కిట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా. 116 00:10:52,444 --> 00:10:54,863 దానికి నమోదు చేసుకోవాలి, క్రెడిట్ కార్డ్ వాడాలి. 117 00:10:54,947 --> 00:10:58,325 చాలా వారాలు పడుతుంది. నాకు వెంటనే కావాలి. డబ్బులు బాగానే ముట్టజెప్పుతానులే. 118 00:10:58,408 --> 00:11:00,452 జూలియన్, నేను ఇక తోలుబొమ్మ డిటెక్టివ్ పాత్ర పోషించలేను. 119 00:11:02,704 --> 00:11:06,083 ఇంకా దీన్ని అలా ముక్కులోకి పెట్టేయకూడదు. అది కాదు పద్ధతి. 120 00:11:06,166 --> 00:11:10,504 ఒకప్పుడు కలిసి పని చేశాం కనుక, ఈ ఒక్క పని చేసి పెట్టు. 121 00:11:15,592 --> 00:11:18,762 నేను ఒకరికి కాల్ చేస్తాను. ఒకప్పుడు కలిసి పని చేశాం కనుక నీకు సాయపడుతున్నాను. 122 00:11:20,013 --> 00:11:23,100 నాకు ల్యాబులో పనిచేసే మిత్రుడు ఒకడున్నాడు, వాడు నాకు ఒక విషయంలో ఋణపడున్నాడు. 123 00:11:23,183 --> 00:11:25,352 కానీ నేనే వాడితో మాట్లాడతాను. 124 00:11:26,228 --> 00:11:28,981 ఆ ఇంట్లోకి నేను అడుగు మాత్రం పెట్టను, ఇంకా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కూడా. 125 00:11:30,941 --> 00:11:32,734 నువ్వు నా పాలిట దేవుడివి. 126 00:11:36,113 --> 00:11:38,574 నిరాశ్రయులో లేక దేశదిమ్మరులో అస్సలు చెప్పలేం కదా? 127 00:11:45,873 --> 00:11:47,332 అది ఎవరికి? 128 00:11:47,416 --> 00:11:50,043 పార్కులో పిల్లలకని చేశా. వాళ్ళకి బాగా ఆకలిగా ఉన్నట్టు అనిపించింది. 129 00:11:50,127 --> 00:11:51,503 దాన్ని తీసుకువెళ్లడంలో నువ్వు నాకు సాయపడతావా? 130 00:11:52,838 --> 00:11:55,424 లేదు. నేను జెరికోని నిద్రపుచ్చాలి. 131 00:12:04,016 --> 00:12:05,017 హేయ్! 132 00:12:06,602 --> 00:12:07,728 నేను ఆహారం తెచ్చాను. 133 00:12:15,903 --> 00:12:17,070 ఏంటది? 134 00:12:17,154 --> 00:12:19,615 మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా. ఇది తందూరీ పన్నీర్ పిజ్జా. 135 00:12:19,698 --> 00:12:23,619 ఇందులో మామూలు టొమాటో సాస్ వేశాను, పైన తందూరీ పన్నీర్ వేశాను, 136 00:12:23,702 --> 00:12:28,457 ఇక చివరగా... చీస్, ఇంకా ఆనియన్ మస్టర్డ్ సిరప్ వేశాను. 137 00:12:41,178 --> 00:12:43,972 ఇది వింతగా ఉంది, కానీ రుచిగా బాగానే ఉంది. 138 00:12:44,890 --> 00:12:47,893 సరే మరి, అయితే... చూడండి... నేను ఓ పని చేస్తాను. 139 00:12:47,976 --> 00:12:50,938 నేను దీన్ని ఇక్కడే పెట్టేస్తాను. మీరు ప్రశాంతంగా తినండి. 140 00:12:53,524 --> 00:12:54,608 మంచిది. 141 00:12:57,611 --> 00:12:58,612 సరే ఇక. 142 00:13:01,365 --> 00:13:04,284 సరే. లియన్, ఇంకా జెరికోల వెంట్రుకలు కావాలంతే కదా. అది చాలా తేలిక. 143 00:13:04,368 --> 00:13:06,578 అవును, కానీ వెంట్రుకలు పూర్తిగా అంచులతో సహా ఉండాలి. 144 00:13:06,662 --> 00:13:08,580 శ్యాంపిల్ పాడవ్వవచ్చు కనుక కాస్త ఎక్కువ వెంట్రుకలు తెస్తే మంచిది. 145 00:13:08,664 --> 00:13:11,083 ఇది కష్టమే. 146 00:13:11,875 --> 00:13:14,086 అప్పుడే ఏం చూశావు? అది ఇంకో 30 నిమిషాల్లో కావాలి. 147 00:13:14,795 --> 00:13:17,005 ఈ సాయంత్రం దాన్ని పరీక్షించే సమయం అతనికి దొరుకుతుంది. 148 00:13:17,089 --> 00:13:19,132 -ఫలితాలు రేపే వచ్చేస్తాయి. -సరే, వెంటనే బయలుదేరి వచ్చేయ్, 149 00:13:19,216 --> 00:13:21,552 నేను సేకరించి పెడతాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? 150 00:13:21,635 --> 00:13:23,595 ఒక బంధువును చూడటానికని ఆసుపత్రికి వచ్చాను. 151 00:13:23,679 --> 00:13:25,347 ఇంకా డబ్బు తీసుకురా. 152 00:13:25,430 --> 00:13:27,224 ఇంత వేగంగా ఫలితాలు కావాలంటే ఖర్చు అవుతుంది, జూలియన్. 153 00:13:27,933 --> 00:13:29,893 నాకు తెలుసు. ఖర్చు అవ్వకుండా ఏ పనీ కాదులే. 154 00:13:53,792 --> 00:13:55,502 జుజూ? 155 00:13:55,586 --> 00:13:57,087 నాన్నా? 156 00:13:59,631 --> 00:14:00,632 కాపాడు. 157 00:14:02,384 --> 00:14:03,760 దయచేసి మమ్మల్ని కాపాడు. 158 00:14:52,601 --> 00:14:54,269 క్షమించు, బుడ్డోడా. 159 00:14:55,062 --> 00:14:56,396 ఇది చురుక్కుమనవచ్చు. 160 00:15:10,702 --> 00:15:15,415 హేయ్. పర్వాలేదమ్మా. ఏమీ కాదు. 161 00:15:15,499 --> 00:15:21,046 నేను ఉన్నాగా. ఏమీ కాదమ్మా ఏమీ కాదు. నీకేమీ కాదు. 162 00:15:29,638 --> 00:15:30,639 ఛ. 163 00:15:52,536 --> 00:15:54,580 -ఏం చేస్తున్నావు? -అబ్బా! 164 00:15:59,918 --> 00:16:00,919 లియన్. 165 00:16:02,880 --> 00:16:05,841 నేను... ఏం చేస్తున్నానంటే... 166 00:16:06,967 --> 00:16:10,971 రెండు వారాల క్రిందట, మనిద్దరం... 167 00:16:11,722 --> 00:16:12,890 పడక పంచుకున్నప్పుడా? 168 00:16:12,973 --> 00:16:15,767 అవును. అదే. 169 00:16:17,102 --> 00:16:18,103 నేను... 170 00:16:19,354 --> 00:16:20,522 నా గడియారాన్ని పోగొట్టుకున్నాను. 171 00:16:22,316 --> 00:16:23,525 ఇప్పుడు దొరికినట్టుందిగా. 172 00:16:25,527 --> 00:16:27,529 కానీ ఇక్కడికి వచ్చాక... 173 00:16:29,281 --> 00:16:32,659 నిన్ను మిస్ అవుతున్నానని గ్రహించాను. 174 00:16:33,869 --> 00:16:36,830 నీకు దగ్గరగా ఉండటాన్ని, నిన్ను నిమురుతూ ఉండటాన్ని మిస్ అవుతున్నాను. 175 00:16:36,914 --> 00:16:37,956 నువ్వు అబద్దమాడుతున్నావు. 176 00:16:39,041 --> 00:16:40,584 నేను అనుక్షణం నీ గురించే ఆలోచిస్తుంటాను. 177 00:17:03,732 --> 00:17:04,900 అబ్బా! నొప్పి పుట్టింది. 178 00:17:06,234 --> 00:17:09,195 మన్నించు... నేను అదుపు తప్పాను. 179 00:17:10,864 --> 00:17:12,616 అబ్బా! బాబోయ్! 180 00:17:18,079 --> 00:17:19,580 లేదు, జూలియన్. 181 00:17:20,707 --> 00:17:23,085 నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియట్లేదు, కానీ ఇక్కడి నుండి వెళ్లిపో. 182 00:17:23,669 --> 00:17:24,670 ఇప్పుడే. 183 00:17:32,469 --> 00:17:34,680 -హేయ్! -నేను చేయబోయే పని తెలుసు కదా? 184 00:17:34,763 --> 00:17:36,557 బుడ్డోడి వెంట్రుకలు దొరికాయి కానీ లియన్ ది మాత్రం దొరకనే లేదు. 185 00:17:36,640 --> 00:17:38,308 తన జుట్టు అస్సలు రాలదేమో అన్నట్టుగా ఉంది. 186 00:17:38,392 --> 00:17:40,853 తన దువ్వెనని చూశావా? దిండు దగ్గర చూశావా? 187 00:17:41,603 --> 00:17:44,231 భలే ఐడియా చెప్పావులే. అవన్నీ చూశాను. 188 00:17:44,314 --> 00:17:48,110 అయితే... ఓ పని చేయ్, ఇప్పుడు డొరోతీ వెంట్రుకలను సేకరించరాదూ? 189 00:17:48,193 --> 00:17:50,320 ఆమె... ఆమె తల్లి కాదు అని నిరూపించడానికి. 190 00:17:50,404 --> 00:17:53,073 బుడ్డోడు లియన్ కి పుట్టినవాడు అని నిరూపించి, 191 00:17:53,156 --> 00:17:55,409 చట్టబద్దంగా బుడ్డోడిని ఇవ్వమని తనని ఒప్పించాలన్నదే కదా ఈ పని ఉద్దేశం. 192 00:17:55,492 --> 00:17:56,785 ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను, 193 00:17:56,869 --> 00:17:59,454 మనం ఏం చేసినా కానీ పరిస్థితుల్లో మార్పు ఉండదని నాకనిపిస్తోంది. 194 00:17:59,538 --> 00:18:01,290 డొరోతీ నిజాన్ని గ్రహించేదాకా ఏమీ మారదు. 195 00:18:01,373 --> 00:18:04,459 ఆ తర్వాత, బిడ్డ తన వద్దే ఉండేలా మనం తగిన చర్యలు తీసుకోవచ్చు. 196 00:18:09,381 --> 00:18:11,800 హేయ్. 197 00:18:14,052 --> 00:18:15,429 సోఫా మీద ఉన్న కషన్స్ లో చూడు. 198 00:18:16,763 --> 00:18:17,973 డొరోతీ వెంట్రుకలు. 199 00:18:22,019 --> 00:18:24,646 అబ్బా. రాస్కో వచ్చేశాడు. 200 00:18:24,730 --> 00:18:25,814 డొరోతీ వెంట్రుకలు. 201 00:18:28,901 --> 00:18:30,402 ఓరి దేవుడా! అస్సలు వెంట్రుకలే లేవే. 202 00:18:34,948 --> 00:18:36,325 యాహూ. 203 00:18:36,408 --> 00:18:37,492 నాకు తన దువ్వెన దొరికింది. 204 00:18:38,202 --> 00:18:39,453 -నేను మళ్లీ కాల్ చేస్తాను. -సరే. 205 00:18:51,715 --> 00:18:53,509 ఇది నువ్వు అనుకున్నంత సులభమైన పని కాదు. 206 00:18:54,343 --> 00:18:55,344 సరే. 207 00:19:18,700 --> 00:19:20,536 నువ్వు హడావిడి చేయకుండా అంతా సింపుల్ గా ఉంచుతున్నావనుకున్నానే? 208 00:19:20,619 --> 00:19:22,871 మళ్లీ ఆ దిక్కులేని వాళ్లకి ఆహారం ఇస్తున్నావా, షాన్? 209 00:19:22,955 --> 00:19:26,083 అది మంచి ఆలోచనే అంటావా? వాళ్లు ఊర కుక్కల్లాంటి వాళ్లు. 210 00:19:26,166 --> 00:19:28,502 -వాళ్లు ఇక్కడిక్కడే తిరుగుతుంటారు. -వాళ్లు ఆకలితో ఉన్న పిల్లలు, డొరోతీ. 211 00:19:30,462 --> 00:19:33,215 మన్నించు. ఇది నీకు చాలా పెద్ద విషయమని నాకు తెలుసు. 212 00:19:34,132 --> 00:19:38,387 నాకు అదోలా ఉంది, ఈస్ట్విక్ లో పెంపుడు జంతువుల కవాతును కవర్ చేయాలట. 213 00:19:39,096 --> 00:19:40,848 నా చిరుత చారల డ్రెస్. 214 00:19:51,275 --> 00:19:54,111 -హేయ్. -హేయ్. నేను మీ టాయిలెట్ ని వాడుకోవచ్చా? 215 00:19:55,195 --> 00:19:56,488 తప్పకుండా. నా వెంటే రా. 216 00:20:08,417 --> 00:20:09,585 -ఇలా వెళ్లు. -థ్యాంక్స్, బాసూ. 217 00:20:09,668 --> 00:20:10,669 పర్వాలేదులే. 218 00:20:33,442 --> 00:20:37,529 షాన్! వాళ్లు మన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తున్నారేమో ఎవరికి తెలుసు? 219 00:20:37,613 --> 00:20:39,656 మన ఇంట్లోకి ఒకసారి చొరబడ్డారు కదా, అది చాలదా నీకు? 220 00:20:39,740 --> 00:20:44,536 డొరోతీ. వాళ్లు కరుడుగట్టిన నేరస్థులు కాదు. ఆమె టాయిలెట్ కోసం వచ్చిందంతే. 221 00:20:44,620 --> 00:20:47,581 మనం మన బిడ్డ గురించి కూడా చూసుకోవాలి, షాన్. 222 00:20:48,498 --> 00:20:49,917 మనం ఆ రెండూ పనులు చేయవచ్చు. 223 00:20:51,793 --> 00:20:55,005 చూడు, నీకు ఆ పిల్లల మీద జాలి ఉందని నాకు తెలుసు... 224 00:21:01,803 --> 00:21:04,389 -హలో? -హాయ్, కార్లోస్. ఆ కవాతును రద్దు చేసేయండి. 225 00:21:04,473 --> 00:21:06,183 -ఏమంటున్నావు? -మనకి కావలసిన కథ నాకు ఒకటి దొరికింది! 226 00:21:06,266 --> 00:21:08,393 -ఏంటి? ఎక్కడ? -సిబ్బందిని అందరినీ నా ఇంటికి తీసుకురా. 227 00:21:08,477 --> 00:21:10,687 -లియోని కూడానా? -అవును, లియోని కూడా. తప్పకుండా. 228 00:21:10,771 --> 00:21:12,940 న్యూస్ 8 229 00:21:13,023 --> 00:21:15,984 హాయ్. నేను 8న్యూస్ రిపోర్టర్ అయిన డొరోతి టర్నర్ ని. 230 00:21:16,068 --> 00:21:18,445 మీ బాధాకరమైన స్థితి గురించి మీరు మాతో పంచుకోగలరా? 231 00:21:22,533 --> 00:21:25,494 మీ దుర్గతి గురించి నాకు లోతుగా చర్చించాలనుంది. 232 00:21:29,831 --> 00:21:31,917 మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. 233 00:21:32,000 --> 00:21:35,337 మీ దీన స్థితి గురించి నలుగురికీ తెలియజేయాలన్నదే నా ఆకాంక్ష. 234 00:21:43,595 --> 00:21:46,890 వీళ్లకి పెద్దల పట్ల నమ్మకం లేకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. 235 00:21:46,974 --> 00:21:52,396 ఈ వ్యవస్థ ముక్కలవ్వడానికి, తద్వారా వారు వీధిన పడటానికి కారణం మనమే. 236 00:21:55,148 --> 00:21:57,234 హాయ్. హాయ్, మీ పేరేంటి? 237 00:22:03,156 --> 00:22:04,950 ఇక్కడ ఉన్న ఈ యువకునితో మాట్లాడి చూద్దాం. 238 00:22:05,033 --> 00:22:07,619 హాయ్ అండి. నమస్తే. 239 00:22:07,703 --> 00:22:09,162 మేము మీతో కాసేపు మాట్లాడవచ్చా? 240 00:22:11,039 --> 00:22:13,083 మీరు ఇలా నిరాశ్రయులుగా ఎంత కాలం నుండీ ఉంటున్నారో చెప్పగలరా? 241 00:22:15,085 --> 00:22:16,837 నేను దత్తత కేంద్రం నుండి బయటకు వచ్చినప్పటి నుండి. 242 00:22:18,547 --> 00:22:20,048 అది చాలా దారుణమైన విషయం. 243 00:22:20,132 --> 00:22:23,427 మీరు ఎదుర్కొన్న అడ్డంకులు కొన్నింటిని మాకు చెప్పగలరా? 244 00:22:25,387 --> 00:22:28,974 చాలా ఎదుర్కొన్నాను. నాకు ఆసరాగా ఎవరూ నిలబడలేదు. 245 00:22:29,600 --> 00:22:30,893 మొదట్లో నాకు ఎవరూ అండగా ఉండలేదు. 246 00:22:31,435 --> 00:22:33,562 నా గుండె సమస్య విషయంలో కూడా... 247 00:22:33,645 --> 00:22:35,606 అబ్బా! ఇమేజ్ పోయింది. 248 00:22:36,690 --> 00:22:38,775 మనం... 249 00:22:40,694 --> 00:22:41,737 సరే మరి. 250 00:22:41,820 --> 00:22:43,238 మనకి వేరే కథనం కావాలి. 251 00:22:43,322 --> 00:22:45,115 లేదు. 252 00:22:45,199 --> 00:22:46,200 షాన్? 253 00:22:46,783 --> 00:22:48,702 -ఇవాళ నేను ఆహారం తెచ్చాను. -హేయ్, బాసూ! 254 00:22:48,785 --> 00:22:51,496 హేయ్, ఏంటి సంగతి? నీకు శ్యాండ్విచ్ తెచ్చాను. 255 00:22:52,247 --> 00:22:53,874 ఇది మామూలు శ్యాండ్విచే. చికెన్ ఇంకా చీస్ వేసి చేశా. 256 00:22:53,957 --> 00:22:55,626 మామూలు అంటే అంత మామూలు కాదనుకోండి, 257 00:22:55,709 --> 00:22:57,961 ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేయబడిన చీస్ ని వాడాను. 258 00:22:58,045 --> 00:23:00,881 మంచి నాణ్యమైన బ్రెడ్డును ఉపయోగించాను... 259 00:23:00,964 --> 00:23:02,674 దాన్ని షూట్ చేయండి. అది చాలా బాగుంది! 260 00:23:02,758 --> 00:23:04,968 శ్యాండ్విచ్? శ్యాండ్విచ్? 261 00:23:05,052 --> 00:23:07,346 అతను ఏం చేస్తున్నాడు, అలా ఎందుకు చేస్తున్నాడు అనే దాని గురించి 262 00:23:07,429 --> 00:23:08,555 అతడిని కొన్ని ప్రశ్నలు అడగవచ్చు కదా? 263 00:23:08,639 --> 00:23:10,807 దీన్ని కుటుంబ కథాంశంగా మారుద్దాం. 264 00:23:11,892 --> 00:23:13,185 పదండి. అందరూ పదండి. 265 00:23:14,686 --> 00:23:16,980 అవును, నీకే తెలుస్తుందిలే. నీ శ్యాండ్విచ్ ఇదుగో. 266 00:23:18,190 --> 00:23:19,191 శ్యాండ్విచ్? 267 00:23:21,318 --> 00:23:24,029 తినండి. మంచిగా తినండి. 268 00:23:24,112 --> 00:23:25,155 నిరాశ్రయులైన యువతకు ఆహారాన్ని అందిస్తున్న స్థానిక వ్యక్తి 269 00:23:25,239 --> 00:23:26,782 ఈ కుర్రాళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నారు. 270 00:23:26,865 --> 00:23:29,284 అబ్బా, మాటిమాటికీ ఆ పదం ఎందుకు ఉపయోగిస్తున్నావు? 271 00:23:29,368 --> 00:23:32,371 కానీ ఈ ప్రాంతానికి చెందిన ఒక మహాపురుషుడు ముందుకు వచ్చి వీళ్లకు చేయూతనిస్తున్నాడు, 272 00:23:32,454 --> 00:23:36,625 ఈ నిరాశ్రయులైన యువతకు ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. 273 00:23:36,708 --> 00:23:38,836 సరే, తీసుకోండి. శ్యాండ్విచ్ కావాలా? 274 00:23:38,919 --> 00:23:40,796 సరే మరి. చికెన్ మరియు చీస్. 275 00:23:41,421 --> 00:23:44,049 -సాయపడినందుకు థ్యాంక్స్. వాళ్లకవి నచ్చాయి. -పర్వాలేదులే. 276 00:23:44,132 --> 00:23:45,801 నేను కూడా ఒకప్పుడు నిరాశ్రయుడినే. 277 00:23:45,884 --> 00:23:48,637 ఆకలి బాధేంటో నాకు తెలుసు. మిగతావారికి అది దూరం చేద్దామనే నా ప్రయత్నం. 278 00:23:49,263 --> 00:23:51,849 టీవీ చూడు. అది మీ నాన్న! 279 00:23:51,932 --> 00:23:53,517 ఆయన పెద్ద స్టార్ కాబోతున్నాడు. 280 00:23:53,600 --> 00:23:55,936 అంత సీన్ లేదులే. 281 00:23:56,019 --> 00:23:59,356 అది జరుగుతుంది. నువ్వే చూస్తావు. 282 00:23:59,439 --> 00:24:01,400 ఇలా ఇవ్వు. వాడిని నాకు ఇవ్వు, లియన్. 283 00:24:02,401 --> 00:24:05,654 నాకు ఉండేది రెండే చేతులు కాబట్టి, మరింత మంది సాయపడతారని ఆశిస్తున్నా. 284 00:24:08,156 --> 00:24:11,159 షాన్, చాలా బాగా మాట్లాడుతున్నావు. మీడియా వాళ్లకి నువ్వు బాగా నచ్చావు. 285 00:24:11,243 --> 00:24:13,036 థ్యాంక్స్, లియన్. 286 00:24:13,120 --> 00:24:14,496 అక్కడికి నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది. 287 00:24:14,580 --> 00:24:16,206 లేదులే, వచ్చుంటే అందరూ నీపై కాకుండా నాపై ఫోకస్ పెట్టేవారు. 288 00:24:16,290 --> 00:24:19,001 మీరు చేసే ఈ పని ఇతరులకు ప్రేరణ కలిగించగలదని మీకు అనిపిస్తోందా? 289 00:24:20,043 --> 00:24:21,128 కలిగించగలదనే ఆశిస్తున్నా. 290 00:24:21,211 --> 00:24:25,507 నిరాశ్రయులను చూడటం, ప్రత్యేకించి మా ప్రాంతంలో చూడటం అనేది కలచివేస్తోంది. 291 00:24:29,052 --> 00:24:31,763 ఇదుగోండి, నేను ఇప్పుడే ఒక డైలాగుతో ముగిస్తాను. అది నాకు చాలా బాగా నచ్చింది. 292 00:24:31,847 --> 00:24:35,350 ఇది మంచి ఆరోగ్యకరమైనది, గడ్డి ఆహారంగా పెట్టిన, ఇంకా చక్కటి ఆవాసంలో పెరిగిన... 293 00:24:35,434 --> 00:24:36,268 8న్యూస్ ఫిలడెల్ఫియా 294 00:24:36,351 --> 00:24:38,437 మీకు అది నచ్చి తీరుతుంది. అసలైన హీరో అంటే అతనే. 295 00:24:38,520 --> 00:24:41,857 -ఇక కోర్ట్నీ వాతావరణ వార్తలు చెప్తారు. -సమయం మించిపోయుంటుంది అనుకుంటా. 296 00:24:41,940 --> 00:24:43,734 ...ఫిలడెల్ఫియాలోని వాతావరణం అలాగే కొనసాగుతుంది... 297 00:24:43,817 --> 00:24:46,528 చాలా మంచి పని చేశావు, బంగారం. నీ మీద నాకు చాలా గర్వంగా ఉంది. 298 00:24:48,488 --> 00:24:50,699 -అవును, చాలా గర్వంగా ఉంది. -హాయ్. 299 00:24:59,541 --> 00:25:01,168 లేదు. 300 00:25:01,251 --> 00:25:04,296 లేదు, లేదు, నేనుండగా నువ్వు మళ్లీ మందు జోలికి వెళ్లలేవు. 301 00:25:06,340 --> 00:25:07,466 అదీగాక, నాకు ఇది కావాలి. 302 00:25:09,426 --> 00:25:10,844 జుజూ, ఏమైంది? 303 00:25:11,803 --> 00:25:14,348 అబద్దాలు చెప్పాలని చూడకు. నాకు తెలిసిపోతుంది. 304 00:25:23,732 --> 00:25:25,442 నిన్ను కూడా దూరం చేసుకోవాలని నాకు లేదు, డోతి. 305 00:25:28,529 --> 00:25:30,030 నేను ఎక్కడికీ వెళ్లడం లేదు కదా. 306 00:25:33,116 --> 00:25:34,243 అమ్మ గుర్తుకు వచ్చిందా? 307 00:25:37,579 --> 00:25:41,708 బుడ్డోడు... నీ దగ్గరే ఉండాలని... నా కోరిక. 308 00:25:42,751 --> 00:25:46,421 జెరికో నా దగ్గరే ఉంటాడు కదా. 309 00:25:47,005 --> 00:25:48,799 దేని గురించి ఆందోళన పడుతున్నావు? 310 00:25:59,768 --> 00:26:00,853 ఏంటది? 311 00:26:01,645 --> 00:26:03,730 నేను జెరికో డీఎన్ఏని పరీక్ష చేయించాను. 312 00:26:04,648 --> 00:26:05,774 ఏంటి? 313 00:26:07,025 --> 00:26:08,402 -ఎందుకు? -అలాగే నీది కూడా పరీక్ష చేయించాను. 314 00:26:09,653 --> 00:26:11,697 జూలియన్, ఎందుకు ఇలా చేస్తున్నావు? 315 00:26:15,284 --> 00:26:17,160 జెరికో నీ బిడ్డ కాదు. 316 00:26:20,455 --> 00:26:23,083 జెరికో నా బిడ్డే. 317 00:26:24,001 --> 00:26:26,253 అసలు నీకేం అవుతోంది? 318 00:26:30,883 --> 00:26:33,302 దేవుడా, మళ్లీ డ్రగ్స్ తీసుకుంటున్నావా? 319 00:26:33,969 --> 00:26:37,806 జుజూ, ఈసారి మంచి చికిత్సను ఇప్పిస్తాములే. చక్కని చోట ఇప్పిస్తాం. 320 00:26:37,890 --> 00:26:40,726 -నీకు అండగా మేమందరమూ ఉన్నాం. -నీకు అర్థం కావట్లేదు. 321 00:26:41,977 --> 00:26:44,479 నేను జెరికోని చూశాను. 322 00:26:45,522 --> 00:26:46,773 నేను వాడిని... 323 00:26:47,316 --> 00:26:49,193 నేను చనిపోయినప్పుడు వాడిని చూశాను. 324 00:26:49,818 --> 00:26:51,445 వాడు కూడా నాతో పాటే ఉన్నాడు. 325 00:26:52,404 --> 00:26:53,739 వాడు చనిపోయాడు, డోతీ. 326 00:26:55,574 --> 00:26:58,619 నీ జుట్టును, వాడి జుట్టును నేను పరీక్ష చేయించాను. 327 00:27:00,495 --> 00:27:01,997 జెరికో నీ బిడ్డ కాదు. 328 00:27:02,748 --> 00:27:03,874 అందుకు ఇదే రుజువు. 329 00:27:10,672 --> 00:27:12,257 సరే, నేను నిన్ను నమ్ముతున్నాను. 330 00:27:13,258 --> 00:27:16,428 నువ్వేదో చూశావని నేను నమ్ముతున్నాను. 331 00:27:17,888 --> 00:27:20,265 ఆ రాత్రి చాలా భయంకరమైన రాత్రి. 332 00:27:20,349 --> 00:27:23,060 -డోతి. -ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోలేదు. 333 00:27:24,561 --> 00:27:26,146 కోలుకోవడానికి నీకు మరింత సమయం కావాలి. 334 00:27:27,940 --> 00:27:29,233 అది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. 335 00:27:29,316 --> 00:27:30,442 డోతి. 336 00:27:33,570 --> 00:27:34,863 ఎవరు వచ్చారో చూసి వస్తాను. 337 00:27:39,701 --> 00:27:41,119 హాయ్. 338 00:27:41,203 --> 00:27:43,872 -నేను నా బ్యాగును తీసుకెళ్లవచ్చా? -తప్పకుండా, తప్పకుండా. 339 00:27:43,956 --> 00:27:45,290 లోపలికి రండి. 340 00:27:45,374 --> 00:27:50,379 లియన్! బ్రూక్ డైపర్ బ్యాగ్ ఎక్కడ ఉందో నీకేమైనా తెలుసా? 341 00:27:56,218 --> 00:27:57,928 మీ సామానంతా ఉన్నాయనుకుంటా. 342 00:27:59,805 --> 00:28:01,598 అంతా గందరగోళంగా గడిచింది. 343 00:28:01,682 --> 00:28:03,225 మిమ్మల్ని కూడా కొరికాయా? 344 00:28:03,308 --> 00:28:05,310 నాకేం కాలేదులెండి. అది చిన్నదే. 345 00:28:06,895 --> 00:28:08,814 అది నా దువ్వెన. 346 00:28:16,280 --> 00:28:18,198 జారి పడిపోయుంటుంది. 347 00:28:18,907 --> 00:28:21,368 సరే, మంచిది. అన్నీ ఉన్నాయి. 348 00:28:22,119 --> 00:28:23,954 -చాలా చాలా థ్యాంక్స్. -ఏం పర్వాలేదు. 349 00:28:32,546 --> 00:28:34,381 నీకు ఇంకా ఏమైనా కావాలా, డొరోతీ? 350 00:28:35,007 --> 00:28:38,218 లేదులే, థ్యాంక్యూ, లియన్. నాకు నా తమ్ముడితో మాట్లాడే పనుంది. 351 00:28:42,431 --> 00:28:43,765 అది ఆమె దువ్వెన. 352 00:28:45,225 --> 00:28:46,351 ఇప్పుడు నాకు అర్థమైంది. 353 00:28:48,604 --> 00:28:52,024 నువ్వు ఆమె వెంట్రుకలను తీసుకున్నావు, నావి కాదు. 354 00:28:52,107 --> 00:28:54,067 అందుకే నీ రిపోర్ట్ లో తప్పు వచ్చింది. 355 00:28:59,114 --> 00:29:00,115 జూలియన్. 356 00:29:02,117 --> 00:29:04,161 మళ్లీ ఇలాంటి పని ఇంకెప్పుడూ చేయకు. 357 00:29:04,995 --> 00:29:06,580 అది పరస్పర నమ్మకానికి విఘాతం కలిగించేంత తీవ్రమైన పని. 358 00:29:06,663 --> 00:29:09,082 మళ్లీ ఇంకెప్పుడూ చేయను. 359 00:29:10,375 --> 00:29:11,502 మాట ఇస్తున్నాను. 360 00:30:35,961 --> 00:30:37,963 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య