1 00:01:47,608 --> 00:01:48,650 ఇదిగో నీ భోజనం. 2 00:01:58,994 --> 00:01:59,995 డొరోతీ? 3 00:02:00,078 --> 00:02:02,623 నేను నీ పిజ్జాలో పెట్టిన మత్తుమందు కారణంగా నీ కడుపులో గడబిడగా ఉండవచ్చు, 4 00:02:02,706 --> 00:02:04,833 కాబట్టి నువ్వు తినగలిగినంత తినడం మేలు. 5 00:02:07,252 --> 00:02:08,544 నేను ఇక్కడికి... 6 00:02:13,258 --> 00:02:17,179 -టోబీ? -అవును, నీ మిత్రుడు, టోబీ తీసుకొచ్చాడు. 7 00:02:17,679 --> 00:02:18,847 నేను వెళ్లిపోవాలి. 8 00:02:28,774 --> 00:02:29,900 జెరికో ఎక్కడ? 9 00:02:31,860 --> 00:02:33,070 నాకు తెలీదు. 10 00:02:34,530 --> 00:02:36,615 అయితే, గుర్తొచ్చే దాకా నువ్విక్కడే ఉంటావు మరి. 11 00:02:49,795 --> 00:02:51,588 తను టాయిలెట్ కి పోవలసి వస్తే? 12 00:02:53,549 --> 00:02:55,300 నేను ఒక బకెట్ ని, ఒక టాయిలెట్ పేపర్ రోల్ ని ఉంచాను. 13 00:02:55,384 --> 00:02:57,135 మన ఇంట్లో మూడున్నర బాత్రూమ్లు ఉన్నాయి. 14 00:02:57,219 --> 00:02:59,096 ఈ విషయంలో నువ్వు నాకు సహకరించాలి. 15 00:02:59,638 --> 00:03:01,390 మనం కలిసి ఉంటేనే, ఇది సఫలమవుతుంది. 16 00:03:01,473 --> 00:03:03,308 -ఒకవేళ తను నోరు విప్పకపోతే? -విప్పి తీరుతుంది. 17 00:03:04,685 --> 00:03:07,896 మత్తు పదార్థాల బానిసల పునరావాసం మీద 2015లో నేను తీసిన ఆ కలిచివేసే రిపోర్ట్ గుర్తుందా? 18 00:03:08,689 --> 00:03:10,357 నువ్వు బానిసని వేరు చేయాలి. 19 00:03:10,440 --> 00:03:13,610 మత్తు పదార్థాలపై ఉన్న మోహాన్ని తీసివేయాలి. నువ్వు దృఢంగా, స్థిరంగా ఉండాలి. 20 00:03:13,694 --> 00:03:14,862 ఒకసారి వారు లొంగిపోయాక, 21 00:03:14,945 --> 00:03:16,738 అలాగే ఏది మంచిదో వారికి తెలియదని వారు ఒప్పుకొన్నాక, 22 00:03:16,822 --> 00:03:18,991 అప్పుడు మనకి తెలుస్తుంది, వారు డ్రగ్స్ కి దూరమయ్యే మార్గంలో ఉన్నారని. 23 00:03:19,074 --> 00:03:20,158 తను డ్రగ్స్ కి బానిస కాదు. 24 00:03:20,951 --> 00:03:23,579 హెరోయిన్, మతం, ఈ రెండింటిలో పిచ్చి అనేది ఒకటే. 25 00:03:24,663 --> 00:03:28,792 లియన్, తన జీవితంలోని అధిక భాగం, ఒక మూఢ మఠం ప్రభావంలో గడిపింది. 26 00:03:28,876 --> 00:03:30,335 తను వాళ్లకి విధేయురాలు. 27 00:03:31,837 --> 00:03:35,465 వాళ్లు జెరికోని ఎక్కడ ఉంచుతున్నారో తను చెప్పే ముందే, మనం ఆ బంధాన్ని తుంచేయాలి. 28 00:03:36,133 --> 00:03:37,134 అదంత తేలికనా? 29 00:03:39,386 --> 00:03:41,722 ఎట్టి పరిస్థితిల్లోనూ, నేను లేకుండా నువ్వు తన దగ్గరికి వెళ్లకూడదు. 30 00:03:41,805 --> 00:03:44,933 తను నిన్ను ఏమార్చేయగలదు. నువ్వు నువ్వనుకున్నంత గట్టివాడివి కాదు. 31 00:03:56,069 --> 00:03:57,571 ఏదైనా జరిగితే, నాకు కాల్ చేయి. 32 00:03:59,990 --> 00:04:01,909 చూడు, బంగారం, ఇక్కడికి బిల్డర్స్ వచ్చేశారు. 33 00:04:03,076 --> 00:04:04,620 చూశావా? మనం అన్నింటినీ సరిచేసేస్తున్నాం. 34 00:04:05,495 --> 00:04:07,372 -అందరికీ నమస్తే. -శుభోదయం. 35 00:04:10,042 --> 00:04:11,251 ఎలా ఉన్నారు? 36 00:05:25,450 --> 00:05:27,411 బిడ్డని అపహరించి దాచడం తప్పే, 37 00:05:27,494 --> 00:05:30,205 కానీ మీరు ఎత్తుకొచ్చి మీ అటకలో ఒక 18 ఏళ్ల బాలికని బంధీగా ఉంచడమనేది 38 00:05:30,289 --> 00:05:32,374 అస్సలు మామూలు విషయమే కాదు. 39 00:05:32,457 --> 00:05:33,667 తను బంధీ ఏమీ కాదు. 40 00:05:33,750 --> 00:05:37,004 అవునా? ఈ సన్నివేశానికి సరిపోయే చట్టబద్ధమైన పేరు ఏమైనా ఉందా? 41 00:05:39,214 --> 00:05:41,967 దీని వల్ల మనకి ఊరట కలిగించేది ఏదైనా ఉందా అని ఆలోచించాను. ధన్యవాదాలు. 42 00:05:42,050 --> 00:05:44,928 నా చెత్త చేయి వల్లన జరిగింది. దీని గురించి నేను మర్చిపోతూనే ఉన్నాను. 43 00:05:47,973 --> 00:05:49,183 నీకు అస్సలు స్పర్శే తెలియడం లేదా? 44 00:05:49,266 --> 00:05:51,393 లేదు. అస్సలు చేయి అనేదే లేనట్టుగా ఉంది. 45 00:05:51,476 --> 00:05:54,521 నువ్వు వైద్యుడికి చూపించుకోవాలి. నీ మెదడులో రక్తం గడ్డకట్టి ఉండవచ్చు. 46 00:05:54,605 --> 00:05:56,064 దీనికి కారణం ఎలా మెదడులో రక్తం... 47 00:05:56,148 --> 00:05:58,025 ఇప్పటిదాకా తను ఏమైనా చెప్పిందా? 48 00:05:58,108 --> 00:05:59,985 పైన అటకలో చిన్నారి ఆన్ ఫ్రాంక్ ఉంది. 49 00:06:00,068 --> 00:06:01,195 నేను తన దగ్గరికి వెళ్లలేను. 50 00:06:02,988 --> 00:06:05,157 తను డొరోతీకి ఏమైనా చెప్తూ ఉండవచ్చు. 51 00:06:05,741 --> 00:06:08,076 ఆ విషయం నాకు తెలియదనుకుంటున్నావా? 52 00:06:09,119 --> 00:06:11,622 నేను తనతో మాట్లాడగలిగితే, విషయం చెప్పి పరిస్థితిని వివరించగలిగితే, 53 00:06:11,705 --> 00:06:13,415 బహుశా వాడు ఎక్కడున్నాడో తను నాకు చెప్పవచ్చు. 54 00:06:13,874 --> 00:06:16,752 లేదా తను డొరోతీని నేరుగా ఆ తిక్క ఆంటీ దగ్గరికి పంపిస్తుందేమో. 55 00:06:16,835 --> 00:06:18,795 తను డొరోతీకి అస్సలు సహకరించదు. 56 00:06:18,879 --> 00:06:21,006 తన గురించి టోబీకి తను ఏం చెప్పిందో విన్నావు కదా. 57 00:06:21,840 --> 00:06:22,841 పీటర్ ప్యాన్ లాగా ఎగరండి 58 00:06:22,925 --> 00:06:26,929 ఎగరాలంటే, "ఆనందమయ ఆలోచనలు" ముఖ్యమని పీటర్ ప్యాన్ ఎప్పుడూ చెప్పేవాడు. 59 00:06:27,012 --> 00:06:29,640 కానీ గురుత్వాకర్షణ శక్తిని నిజంగా జయించడానికి, 60 00:06:29,723 --> 00:06:32,142 నేను కింగ్ ఆఫ్ ప్రష్యా విండ్ టన్నల్ వద్దకి రావలసి వచ్చింది. 61 00:07:20,190 --> 00:07:23,235 టొమాటోల కోసం నేను మూడు దుకాణాలకి వెళ్ళాల్సి వచ్చింది. 62 00:07:23,652 --> 00:07:25,779 శీతాకాలం కోసం ఎవరో ఎక్కువ మొత్తంలో కొని దాచుకుంటున్నట్టున్నారు. 63 00:07:27,865 --> 00:07:29,658 ఇక్కడ అంతా సౌకర్యవంతంగా చేసుకుంటున్నావు అన్నమాట. 64 00:07:31,743 --> 00:07:33,704 ఈ బట్టలు, వేసుకోవడం కోసం పెట్టినవి కాదు. 65 00:07:35,747 --> 00:07:38,876 నేను పని చేస్తున్న కుటుంబంలో, వాళ్ల అమ్మ ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు. 66 00:07:39,710 --> 00:07:44,089 ఆ చిన్న పిల్లాడు సర్జియోకి, ఆ కుటుంబానికి నా అవసరం ఉంది. 67 00:07:44,756 --> 00:07:46,133 వారి విషయంలో నాకు జాలిగా ఉంది. 68 00:07:47,301 --> 00:07:48,594 నేను వారికి మాటిచ్చాను. 69 00:07:48,677 --> 00:07:52,389 అవును, మాకు కూడా నువ్వు మాటిచ్చావు. అంగీకారం మీద సంతకం చేశావు. 70 00:07:54,224 --> 00:07:55,934 నేను జెరికోని నీకు ఇవ్వలేను. 71 00:07:58,103 --> 00:08:00,272 అయితే వాడు ఎక్కడున్నాడో, ఆ విషయమైనా చెప్పు. 72 00:08:09,489 --> 00:08:11,325 బహుశా రేపటికి నీ మనస్సు మారవచ్చేమో. 73 00:08:14,328 --> 00:08:15,746 నిదానంగా ఒక్కోరోజు చూసుకుంటూ సాగుదాం. 74 00:08:23,462 --> 00:08:26,423 ఈరాత్రి తను బాగా కోపంగా ఉండింది. 75 00:08:27,299 --> 00:08:29,009 అలా తను ఎప్పుడూ లేదు. 76 00:08:29,092 --> 00:08:32,054 నిజానికి, ఇదివరకు ఎన్నడూ మనం తనని బంధీగా ఉంచి, ఒంటేలు కోసం ఓ బక్కెట్ ని ఉంచలేదు. 77 00:08:32,136 --> 00:08:34,181 ఎందుకంటే, తను వాళ్ళ ప్రభావం నుండి దూరంగా ఉంది కాబట్టి. 78 00:08:35,015 --> 00:08:38,559 తన కోసం ఆలోచించడం తనకి తెలియదు. తన బుర్రలో ఏదేదో రుద్ది పాడు చేశారు. 79 00:08:39,852 --> 00:08:43,232 బహుశా మనం తనని కిందకి తెచ్చి, తనని రెట్టించిన జాగ్రత్తతో గమనిస్తూ ఉండవచ్చేమో. 80 00:08:43,315 --> 00:08:45,150 నేను అడిగి చూశాను, 81 00:08:45,234 --> 00:08:48,487 కానీ జెరికో ఎక్కడ ఉన్నాడు అని నేను ఎన్నిసార్లు అడిగినా తను చెప్పడం లేదు. 82 00:08:49,404 --> 00:08:50,405 నా ఉద్దేశంలో... 83 00:08:50,489 --> 00:08:53,825 ఇంకాస్త ఉంటే వాడు మన ఇంటికి వచ్చేస్తాడు, నీకేమో తనతో కులకాలని ఉంది. 84 00:08:54,910 --> 00:08:59,957 దయచేసి, ఈ ఒక్కసారికి, పరిస్థితిని నన్ను సరైన విధంగా చూసుకోనిస్తావా? 85 00:09:50,215 --> 00:09:52,759 నువ్వు వాడిని ఇక్కడికి తెచ్చేయాలి 86 00:09:52,843 --> 00:09:53,969 నేను చెప్పాను కదా మీకు. 87 00:09:55,053 --> 00:09:56,763 ఎందుకు నువ్వు నిరాకరిస్తున్నావు? 88 00:09:58,515 --> 00:10:01,101 మిసెస్ టర్నర్. ఆపండి. 89 00:10:02,561 --> 00:10:03,687 ఆపండి. 90 00:10:03,770 --> 00:10:05,772 నాకు వాడు కావాలి! 91 00:10:07,399 --> 00:10:08,984 దేవుడా, నాకు నొప్పి కలుగుతోంది! 92 00:10:19,661 --> 00:10:22,039 నిన్న ఎగిరిపడినప్పుడు నా వెన్నెముక స్ట్రెయిన్ అయిందనుకుంటా. 93 00:10:22,122 --> 00:10:25,626 -గాల్లోకి అయిదడుగుల పైకెగిరావు. -ఏదేమైనా, కండరాలు అవే కదా. 94 00:10:26,126 --> 00:10:27,920 తనకి టిఫిన్ నేను తీసుకెళ్తే మంచిదేమో. 95 00:10:29,171 --> 00:10:30,422 మనకు ఒక వ్యూహం ఉంది. 96 00:10:30,839 --> 00:10:33,509 నీకు చెప్పలేనిది ఏదైనా తను నాకు చెప్పే అవకాశముంది. 97 00:10:34,343 --> 00:10:36,011 తను నిన్ను ఎందుకు నమ్ముతుంది, నన్ను ఎందుకు నమ్మదు? 98 00:10:36,094 --> 00:10:37,846 ఏమో. అప్పుడప్పుడూ నువ్వు... 99 00:10:41,975 --> 00:10:43,060 నేను ఏంటి? 100 00:10:43,560 --> 00:10:45,812 తన నమ్మకాన్ని నేను సంపాదించగలనేమో, ఓసారి నాకు అవకాశం ఇవ్వు. 101 00:10:51,026 --> 00:10:52,027 ఒక్క గుడ్డు. 102 00:10:56,698 --> 00:10:58,534 నేను అవకాశం ఇస్తే, నువ్వు తనని నెత్తికి ఎక్కించుకుంటావు. 103 00:10:59,785 --> 00:11:01,995 -నా కారును ఆగమని చెప్పు చాలు. -అలాగే. 104 00:11:02,079 --> 00:11:03,455 టిఫిన్? 105 00:11:04,373 --> 00:11:07,084 మా అమ్మ ప్రతీరోజు ఉదయం టిఫిన్ లో తప్పకుండా మాకు ఒక గుడ్డు ఇచ్చేది. 106 00:11:10,546 --> 00:11:13,590 ఈ అలంకారాల విషయంలో జాగ్రత్త. అవి ఇక్కడ ఎప్పట్నుంచో ఉన్నాయి. 107 00:11:16,093 --> 00:11:17,511 అవి పని చేస్తున్నాయి అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. 108 00:11:22,140 --> 00:11:25,102 పెరిగేటప్పుడు, నీకు బ్రేక్ ఫాస్ట్ రొటీన్ అంటూ ఒకటి ఉండిందా? 109 00:11:28,313 --> 00:11:29,731 మేము ఎప్పుడు తిన్నా కలిసే తినేవాళ్లం. 110 00:11:30,232 --> 00:11:32,025 ఆరోజు ఏం జరిగినా కానీ, 111 00:11:32,109 --> 00:11:35,153 మేమందరమూ ఒకేచోట తింటూ, ఆ రోజు జరిగిన విషయాలను చెప్పుకొనేవాళ్ళం. 112 00:11:41,243 --> 00:11:42,578 జెరికో ఎక్కడ? 113 00:11:45,622 --> 00:11:47,332 నాకు మిస్టర్ టర్నర్ తో మాట్లాడాలనుంది. 114 00:11:48,166 --> 00:11:50,377 నువ్వు అతనితో ఏం చెప్పాలనుకుంటున్నావో, అదే నాకు చెప్పవచ్చు. 115 00:11:57,301 --> 00:11:58,302 సరేమరి. 116 00:12:02,890 --> 00:12:04,183 నువ్వు మా మధ్యలోకి దూరలేవు. 117 00:12:04,266 --> 00:12:07,102 షాన్, నేనూ ఒక కుటుంబం. నీకు అలాంటివేవీ లేవు కదా. 118 00:13:11,875 --> 00:13:13,001 హలో, లియన్. 119 00:13:17,714 --> 00:13:18,924 నువ్వు ఏంజెలాని చూశావన్నమాట. 120 00:13:21,593 --> 00:13:23,178 ఆవిడని నేను మిసెస్ బ్యారింగ్టన్ అని పిలుస్తాను. 121 00:13:25,848 --> 00:13:29,434 మేము రిటెంహౌజ్ లోని ఇంట్లో ఉన్నప్పుడు, తను కొంతకాలం పాటు మా పడకగదిలో ఉండేది. 122 00:13:31,186 --> 00:13:32,688 ఎక్కువగా స్కార్ఫ్ లను వేసుకొనేది. 123 00:13:36,900 --> 00:13:38,735 తను అలా చేస్తుందన్న విషయం నాకు తెలీదు. 124 00:13:40,279 --> 00:13:41,613 అలా నిన్ను ఇక్కడికి తెస్తుందని నాకు తెలీదు. 125 00:13:43,532 --> 00:13:45,033 తనకు మీరెందుకు చెప్పలేదు? 126 00:13:47,661 --> 00:13:49,371 అది మీలో ఎవరోకరు కావాలి. 127 00:13:50,414 --> 00:13:51,790 డొరోతీ గురించి నీకు తెలీదు. 128 00:13:53,166 --> 00:13:55,294 అది తెలిస్తే, తను ఏమవుతుందో నీకు తెలీదు. 129 00:13:55,377 --> 00:13:57,379 తనకు అది జరగాల్సిందే. 130 00:13:58,839 --> 00:14:01,967 ఎవరైనా తనని శిక్షించాలనుకుంటే, ఆ పని వారు చేసేయవచ్చు. 131 00:14:03,468 --> 00:14:06,430 కానీ తనకు తాను చేసుకోబోయేదానితో పోలిస్తే, ఆ శిక్ష చాలా చిన్నది అవుతుంది. 132 00:14:09,683 --> 00:14:11,935 మాకు సాయపడాలనే నీకు ఉంది, లియన్. అది నాకు తెలుసు. 133 00:14:14,938 --> 00:14:16,565 అందుకు బదులుగా, నన్ను కూడా నీకు సాయపడనివ్వు. 134 00:14:17,441 --> 00:14:19,026 వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పు చాలు. 135 00:14:21,236 --> 00:14:23,030 నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. 136 00:14:25,199 --> 00:14:26,825 నేను బాత్రూమ్ కి వెళ్ళాలి. 137 00:14:58,148 --> 00:14:59,566 నీ చేతికి ఏమైంది? 138 00:15:00,442 --> 00:15:01,735 అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. 139 00:15:03,445 --> 00:15:04,530 ఏమైనా నొప్పిగా ఉందా? 140 00:15:06,990 --> 00:15:07,991 బాధగా ఉంది. 141 00:15:34,059 --> 00:15:35,310 చికెన్ శ్వాండ్విచ్ ఉన్మాదం హింసకు దారి తీసింది 142 00:15:35,394 --> 00:15:38,230 ఈ జర్మన్ టౌన్ చికెన్ హోటల్ లో ఇందాక అగ్నిప్రమాదం జరిగింది. 143 00:15:38,313 --> 00:15:39,940 చికెన్ శ్యాండ్విచ్ లను ఒక్కో కస్టమర్ కి 144 00:15:40,023 --> 00:15:43,986 రెండు మాత్రమే ఇస్తామని అక్కడి సిబ్బంది ప్రకటించినప్పుడు, 145 00:15:44,069 --> 00:15:45,737 సన్నివేశం ఒక్కసారిగా దారుణంగా మారిపోయింది. 146 00:15:50,075 --> 00:15:52,744 అయ్యో. అంతే, బాసూ. అదీ! 147 00:15:52,828 --> 00:15:53,829 వాడిని దంచిపారేయ్, బాసూ! 148 00:15:53,912 --> 00:15:55,581 -దగ్గరికి రా! -మీరేం చేస్తున్నారు? 149 00:15:55,664 --> 00:15:57,124 అది నీది కాదు. 150 00:15:57,708 --> 00:15:59,293 వాడిని కొట్టు! 151 00:15:59,376 --> 00:16:00,711 వాడిని కొట్టు! 152 00:16:21,773 --> 00:16:23,025 వాడు ఎక్కడ ఉన్నాడు? 153 00:16:23,609 --> 00:16:26,195 -ఎక్కడ ఉన్నాడు? -వద్దు! 154 00:16:31,575 --> 00:16:33,076 నువ్వు నా నుండి వాడిని దూరం చేశావు! 155 00:16:34,328 --> 00:16:35,913 వాడెక్కడున్నాడో చెప్పు! 156 00:17:21,750 --> 00:17:23,001 నీకు బాగానే నిద్రపట్టిందా? 157 00:17:25,963 --> 00:17:28,006 రాత్రి రెండు గంటలకు నాకేదో కంగారులా అనిపిస్తోంది. 158 00:17:30,133 --> 00:17:34,137 నా మనస్సు మర్చిపోయిన ఏదో విషయాన్ని నా దేహం గుర్తుతెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. 159 00:17:36,640 --> 00:17:39,768 అది ఎప్పుడూ రాత్రి రెండు గంటలకే జరుగుతుందంటే, ఆశ్చర్యంగా ఉంది కదా? 160 00:17:41,645 --> 00:17:43,856 అదంతా జెరికో గురించి అని నాకనిపిస్తుంది. 161 00:17:45,065 --> 00:17:48,277 బహుశా మనం నటాలీతో మాట్లాడి, నీకు ఏదైనా మందులాంటిది ఇమ్మని అడగితే బాగుంటుందేమో. 162 00:17:49,653 --> 00:17:50,654 అవును. 163 00:17:51,196 --> 00:17:53,699 నీకది బాగా నచ్చుతుంది. నన్ను జీవచ్చవంలా చేయడం. 164 00:17:55,701 --> 00:17:56,952 నేను అలా అనలేదు. 165 00:17:59,121 --> 00:18:00,247 క్షమించు, బంగారం. 166 00:18:03,333 --> 00:18:04,626 నేను బాగా అలసిపోయాను. 167 00:18:12,718 --> 00:18:14,511 రాత్రి నిద్ర బాగా పట్టిందా? 168 00:18:18,098 --> 00:18:19,892 నేను నీ బాగు కోసం ప్రార్థించేదాన్ని, డొరోతీ. 169 00:18:22,561 --> 00:18:23,604 కానీ ఇప్పుడు అది చేయడం లేదు. 170 00:18:27,107 --> 00:18:30,485 అది మంచిదే, ఎందుకంటే ఈ ఇంట్లో మూఢనమ్మకాలను ఇప్పుడు మేము ప్రోత్సహించడం లేదు. 171 00:18:36,450 --> 00:18:39,161 నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, దీన్ని ఆపడం నీ చేతిలో ఉంది, లియన్! 172 00:19:05,103 --> 00:19:06,271 సెంచురీ గుడ్లు. 173 00:19:07,481 --> 00:19:09,983 వీటిని వాళ్లు టీలో నాన్చుతారు. అందుకే ఇవి ఆ రంగులోకి మారుతాయి. 174 00:19:13,362 --> 00:19:15,906 మేము మధ్య 30ల వయస్సుకు చేరుకొనేదాకా పిల్లల కోసం ప్రయత్నం చేయలేదు. 175 00:19:16,949 --> 00:19:20,410 అది కాస్త ముందే ప్రయత్నించినా, తన కెరీర్ కి అది తీరని నష్టం కలిగించేది. 176 00:19:20,494 --> 00:19:25,374 అందుకే జరిగినదానికంతటికీ తనని తాను నిందించుకుంటుంది. మేము దాదాపుగా వదిలేశాం. 177 00:19:26,500 --> 00:19:28,126 ఇది నేను నీకు ఎందుకు చెప్తున్నానో నాకు తెలీదు. 178 00:19:28,210 --> 00:19:30,629 ఎందుకంటే తన విషయంలో నేను జాలి చూపాలని కోరుకుంటున్నావు. 179 00:19:30,712 --> 00:19:32,297 లేదా తనని ఇంకాస్త మెరుగ్గా అర్థంచేసుకోవాలని కావచ్చు. 180 00:19:32,381 --> 00:19:35,843 నిజమేమిటంటే, వాడు మాకు దక్కితే, నీకేం కావాలో అది నేను చెప్తాను. 181 00:19:37,553 --> 00:19:38,971 ఎవరు? 182 00:19:40,889 --> 00:19:42,057 ఆటలాడవద్దు. 183 00:19:42,140 --> 00:19:44,434 నువ్వు మంచి వ్యక్తివని నాకు తెలుసు. మా కోసం ఏం చేశావో కూడా తెలుసు. 184 00:19:44,518 --> 00:19:47,062 నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో చెప్పు. 185 00:19:49,940 --> 00:19:50,941 జెరికో. 186 00:19:52,234 --> 00:19:53,569 మా జెరికో మాకు కావాలి. 187 00:19:56,822 --> 00:19:58,740 జెరికో చనిపోయాడు, మిస్టర్ టర్నర్. 188 00:20:11,295 --> 00:20:14,173 జూలియన్ రహస్య మూలికలు, మసాలాదినుసులు. 189 00:20:14,840 --> 00:20:17,009 అది మత్తుపదార్థం కానంతవరకు ఫర్వాలేదు. డొరోతీకి మత్తెక్కాలని నాకు లేదు. 190 00:20:18,302 --> 00:20:20,220 తను మళ్లీ తాగడం ఎప్పట్నుంచి మొదలుపెట్టింది? 191 00:20:20,304 --> 00:20:21,513 రోజూ రాత్రి ఒకటి తాగుతుంది. 192 00:20:21,597 --> 00:20:25,184 అలాంటివాళ్లంటే నాకు ఈర్ష్య. ఆ స్వీయ నియంత్రణ నేను పాటించలేను. 193 00:20:31,064 --> 00:20:34,443 మనం దీన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించలేం. పైన తను బిక్కుబిక్కుమంటోంది. 194 00:20:34,902 --> 00:20:36,111 తనని చూడటానికి వెళ్ళావా? 195 00:20:36,612 --> 00:20:37,988 కానీ తను నోరు విప్పడమే లేదు. 196 00:20:38,071 --> 00:20:40,073 తను విప్పదు కూడా. బంధీగా ఉన్నంత వరకు తను ఆ పని చేయదు. 197 00:20:40,782 --> 00:20:42,284 ఇక్కడ మనం చెడ్డవాళ్లం కాదు. 198 00:20:42,367 --> 00:20:44,703 కాదా? మరి మనం ఎవరం? 199 00:20:45,162 --> 00:20:47,289 మనం బాధితులం. అది సుస్పష్టమైన విషయం కదా? 200 00:20:54,505 --> 00:20:56,381 "నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును." 201 00:20:56,465 --> 00:20:58,884 యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను. 202 00:20:58,967 --> 00:20:59,968 షాన్ 203 00:21:00,052 --> 00:21:02,721 పూర్వికులు సామ్యము చెప్పినట్టు "దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును"గాని 204 00:21:02,804 --> 00:21:04,473 నేను నిన్ను చంపను. 205 00:21:04,556 --> 00:21:06,600 అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటకు వెళ్లి, 206 00:21:06,683 --> 00:21:08,393 "నా యేలినవాడా, నా రాజా!" అని సౌలుకేసి కేక వేయగా, 207 00:21:08,477 --> 00:21:10,771 సౌలు వెనుకకు చూచెను, దావీదు తన తలను వంచి, 208 00:21:10,854 --> 00:21:12,105 సాష్టాంగ నమస్కారము చేసెను. 209 00:21:12,189 --> 00:21:14,483 దావీదు సౌలుతో ఇట్లనెను "నీకు 'దావీదు కీడు చేయదలచెననను' 210 00:21:14,566 --> 00:21:15,692 జనుల మాటలను ఎందుకు వినుచున్నావు?" 211 00:21:16,944 --> 00:21:19,321 మనం జాలి చూపాల్సింది తప్పకుండా పిల్లల మీదనే. 212 00:21:19,404 --> 00:21:23,075 అంటే, ఒక ఎదిగిన వ్యక్తి ఒక మత ఛాందసంలోకి తన ఇష్టానుసారం వెళ్ళాలని భావిస్తే, 213 00:21:23,158 --> 00:21:24,201 అది వాళ్ల ఇష్టం, 214 00:21:24,284 --> 00:21:28,872 కానీ పిల్లల మనస్సు అనేది చాలా సున్నితమైంది, కాబట్టి... 215 00:21:28,956 --> 00:21:33,126 అన్నింటినీ శోషించుకొనేది అనే అర్థం వచ్చే పదం ఏంటి? 216 00:21:33,210 --> 00:21:34,211 సరంధ్రం. 217 00:21:37,339 --> 00:21:38,340 ఆ పదం నాకు గుర్తుకువస్తుందిలే. 218 00:21:39,675 --> 00:21:41,051 అది ఖచ్చితంగా సరంధ్రమే. 219 00:21:41,635 --> 00:21:43,595 నేను పైకెళ్లి కాస్త దూకుడుగా ప్రవర్తించి భయపెట్టనా? 220 00:21:43,679 --> 00:21:44,763 వద్దు, వద్దు. 221 00:21:44,847 --> 00:21:49,309 అడిగినందుకు ధన్యవాదాలు, కానీ ఫర్వాలేదు. లియన్ ఇప్పుడు పూర్తిగా నా నియంత్రణలో ఉంది. 222 00:21:51,311 --> 00:21:53,689 జర్నలిజం యొక్క మొదటి నియమం, నువ్వు ఒక తేలిక ప్రశ్న అడగాలి, 223 00:21:53,772 --> 00:21:56,441 ఇక నీకు సమాధానం వచ్చేదాకా ఆ ప్రశ్ననే అడుగుతూ ఉండాలి. 224 00:21:58,318 --> 00:22:00,696 కానీ నీకు వాడు దొరికాక, బేరసారాల పని నాకు వదిలేస్తావని, 225 00:22:00,779 --> 00:22:02,447 నువ్వు నాకు మాటివ్వు. 226 00:22:03,365 --> 00:22:05,659 భావావేశాలను పక్కకు పెట్టడం అనేది నాకు చాలా బాగా తెలుసు. 227 00:22:06,368 --> 00:22:08,662 మనలోని కొందరిలా నేను కాళ్ల మీద పడే రకం కాదు. 228 00:22:12,165 --> 00:22:13,625 -ఏంటిది? -ఏమీలేదు. 229 00:22:14,543 --> 00:22:15,627 నీకు ఇతను చెప్పలేదా? 230 00:22:18,255 --> 00:22:21,049 బ్యాప్టిజమ్ అప్పుడు నేలమాళీగలో అంకుల్ ఇతడిని కలిశాడు. 231 00:22:21,592 --> 00:22:22,926 ప్రార్థించమని బతిమాలాడు. 232 00:22:24,178 --> 00:22:25,179 ప్రార్థించమనా? 233 00:22:26,972 --> 00:22:28,015 దేని కోసం ప్రార్థించమని? 234 00:22:28,098 --> 00:22:29,516 అది నాకు గుర్తులేదు. 235 00:22:29,600 --> 00:22:31,393 నువ్వు ఇందులో చిల్లీ పెప్పర్ వేశావా? 236 00:22:32,436 --> 00:22:33,437 బాగానే ప్రయత్నించావు. 237 00:22:34,313 --> 00:22:36,773 కానీ, ఈ రెసిపీ నేను చచ్చినా ఎవ్వరికీ చెప్పను. 238 00:22:36,857 --> 00:22:38,066 లేదు, ఇంకేదో ఉంది. 239 00:22:43,030 --> 00:22:45,115 నాగా వైపర్ మిరపకాయలు. దాన్ని పెప్పరోంచీనీతో కలిపావు. 240 00:22:45,199 --> 00:22:46,992 అందుకే నీకు తీపి తెలుస్తుంది. 241 00:22:47,075 --> 00:22:49,620 పాస్తా కాస్త మాడింది, కానీ ఆ విషయం ఎవరైన చెప్పగలరు. 242 00:22:51,079 --> 00:22:52,080 నువ్వు ఊహించి చెప్పావు. 243 00:22:53,498 --> 00:22:54,499 బంగారం. 244 00:22:55,918 --> 00:22:57,211 నీకు ఇప్పుడు రుచి తెలుస్తోంది. 245 00:24:15,998 --> 00:24:19,710 పసుపు. నీ కళ్ల కింద ఏర్పడిన నల్ల మచ్చల కోసం. 246 00:24:20,794 --> 00:24:22,171 కళ్ల కింద నల్ల మచ్చలా? 247 00:24:28,010 --> 00:24:30,554 -తను మాట్లాడే రోజు దగ్గర్లోనే ఉంది. -అంతే అంటావా? 248 00:24:31,722 --> 00:24:33,348 మనం తన ఛాందస భావాలను తొలగిస్తున్నాం. 249 00:24:33,432 --> 00:24:34,975 మనం చేసేది అదే అయితే చాలు. 250 00:24:39,104 --> 00:24:40,314 నువ్వేం సూచిస్తున్నావు? 251 00:24:42,274 --> 00:24:44,693 మనం ఎలాంటి హద్దులను మీరడం లేదని నేను నిర్ధారించుకోవాలనుకుంటున్నా. 252 00:24:48,071 --> 00:24:50,699 -నువ్వు పైకి వెళ్లావా? -లేదు, వెళ్లలేదు. 253 00:25:05,130 --> 00:25:07,007 నాకు చార్కుటరీ వంటకం అంటే చాలా ఇష్టం. 254 00:25:07,090 --> 00:25:10,636 అందులో అన్ని రుచులూ ఉంటాయి. పులుపు, చేదు, తీపి. 255 00:25:13,180 --> 00:25:14,765 మళ్లీ రుచి చూడగలగడం అనేది చాలా ఊరటనిచ్చే విషయం. 256 00:25:15,390 --> 00:25:16,892 హఠాత్తుగా మళ్లీ వచ్చేసింది. 257 00:25:19,770 --> 00:25:21,355 నీ దగ్గర అది ఉండటం డొరోతీ చూసిందనుకో... 258 00:25:23,815 --> 00:25:24,816 ఏం చేస్తుంది? 259 00:25:27,819 --> 00:25:29,655 నీకో పని చేసి పెడతాను, లియన్. 260 00:25:30,781 --> 00:25:33,242 నిన్ను తిరిగి నీ కుటుంబం దగ్గరకి తీసుకెళ్తాను, ఏమంటావు? 261 00:25:40,332 --> 00:25:41,750 వాడు ఎక్కడ ఉన్నాడో నీకు నేను చెప్పలేను. 262 00:25:41,834 --> 00:25:42,835 నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. 263 00:25:43,627 --> 00:25:45,087 నువ్వు వాడిని ఇంటికి తెచ్చేస్తే చాలు. 264 00:25:45,754 --> 00:25:48,090 -అది నువ్వు చేయగలవని నాకు తెలుసు. -షాన్? 265 00:25:48,966 --> 00:25:50,217 నేను ఇంటికి వచ్చేశాను. 266 00:25:51,552 --> 00:25:54,179 నువ్వు ఇక్కడికి వచ్చావని తనకి తెలియనివ్వకపోతే మంచిది, మిస్టర్ టర్నర్. 267 00:28:14,778 --> 00:28:16,029 వాడు ఎక్కడ ఉన్నాడు? 268 00:28:19,366 --> 00:28:20,826 అతను మంచి చోటే ఉన్నాడు. 269 00:28:22,202 --> 00:28:23,954 తనని ప్రేమించేవారి మధ్య ఉన్నాడు. 270 00:28:25,747 --> 00:28:29,334 మేము అతడిని చక్కగా, ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నాం. 271 00:28:30,252 --> 00:28:31,837 వాడిని సురక్షితంగా చూసుకుంటున్నాం కూడా. 272 00:28:33,255 --> 00:28:34,590 నీ నుంచి సురక్షితంగా. 273 00:28:52,482 --> 00:28:53,859 దేవుడా... 274 00:29:00,240 --> 00:29:02,201 నా చేయి మండుతోంది, డొరోతీ. 275 00:29:02,826 --> 00:29:04,077 డొరోతీ! 276 00:29:05,037 --> 00:29:06,038 అయ్యబాబోయ్. 277 00:29:06,872 --> 00:29:07,873 డొరో... 278 00:29:36,985 --> 00:29:37,986 డొరోతీ? 279 00:29:50,415 --> 00:29:51,792 తను ఏమైపోయింది? 280 00:30:18,777 --> 00:30:20,153 నువ్వు ఏం చేశావు... 281 00:31:04,239 --> 00:31:05,574 ఏం చేశావు నువ్వు? 282 00:31:07,242 --> 00:31:08,744 తను నాకు అస్సలు చెప్పడమే లేదు. 283 00:31:10,120 --> 00:31:11,455 ఇది శృతిమించిన చర్య. 284 00:31:15,209 --> 00:31:17,252 శృతిమించడం అంటూ ఏదీ ఉండదు. 285 00:31:18,337 --> 00:31:19,713 డొరోతీ. 286 00:31:20,339 --> 00:31:21,632 డొరోతీ. 287 00:31:35,729 --> 00:31:38,607 ఏం ఫర్వాలేదు. ఏమీ కాలేదు. 288 00:31:39,733 --> 00:31:40,984 ఏమీ కాలేదు. 289 00:31:43,320 --> 00:31:44,446 ఏం ఫర్వాలేదు. 290 00:31:59,336 --> 00:32:00,671 నీకు సాయం ఏమైనా కావాలా? 291 00:32:00,754 --> 00:32:01,839 నేను చూసుకోగలనులే. 292 00:32:06,218 --> 00:32:11,390 తను అంత చెడ్డ మనిషి కాదు. తనకి వాడంటే ఎనలేని ప్రేమ, అంతే. 293 00:32:13,809 --> 00:32:15,644 నీకు మళ్లీ అది తెలుస్తుంది కదా? 294 00:32:16,895 --> 00:32:17,896 నీ చేతికి స్పర్శ. 295 00:32:19,481 --> 00:32:21,441 అందుకే కదా, నువ్వు లేచి, నన్ను కనుక్కోగలిగింది? 296 00:34:39,036 --> 00:34:41,039 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య