1 00:01:01,562 --> 00:01:03,689 నా భర్తకి, తమ్ముడికి ప్రమాదం జరిగింది. 2 00:01:03,689 --> 00:01:04,772 లైనులో ఉండగలరా? 3 00:01:04,772 --> 00:01:07,192 దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. 4 00:01:08,193 --> 00:01:12,030 వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు దక్కలేదు. వాళ్ళు బాగానే ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు. 5 00:01:12,906 --> 00:01:13,907 ఒకసారి బయట చూసుకోండి, మేడమ్. 6 00:01:13,907 --> 00:01:16,326 మీలా తమ ఆత్మీయులతో మాట్లాడాలని చాలా మంది చూస్తున్నారండి. 7 00:01:16,326 --> 00:01:17,870 కాసేపు లైనులో ఉండండి. 8 00:01:26,628 --> 00:01:27,754 నన్ను లైనులో ఉంచారు. 9 00:01:33,093 --> 00:01:36,680 చూడు, నీకు చిరాకు తెప్పించాలని కాదు కానీ, వాళ్లకి ఏమైందో చెప్పు. 10 00:01:39,057 --> 00:01:40,809 ఆందోళన పడకు, డొరోతీ. 11 00:01:41,977 --> 00:01:43,437 అంతా సర్దుకుంటుంది. 12 00:01:44,021 --> 00:01:46,148 వాళ్లు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. 13 00:01:47,482 --> 00:01:48,817 మిసెస్ టర్నర్? 14 00:01:48,817 --> 00:01:50,068 హా, లైనులోనే ఉన్నా. 15 00:01:50,944 --> 00:01:53,197 ఇప్పుడు చెప్పండి. రోగుల పేర్లు చెప్పగలరా? 16 00:01:53,697 --> 00:01:55,908 అలాగే. షాన్ టర్నర్, ఇంకా జూలియన్ పియర్స్. 17 00:01:57,034 --> 00:02:01,288 - కావాలంటే వాళ్లకి లైన్ కలుపుతాను. - తప్పకుండా. చాలా చాలా థ్యాంక్స్. 18 00:02:01,288 --> 00:02:02,372 లైనులో ఉండండి. 19 00:02:02,998 --> 00:02:03,916 హలో? 20 00:02:04,416 --> 00:02:06,668 షాన్. షాన్. 21 00:02:07,169 --> 00:02:09,630 హమ్మయ్య. నీకంతా బాగానే ఉందా? 22 00:02:09,630 --> 00:02:14,218 డొరోతీ, నేను బాగానే ఉన్నాను. చూడు, డొరోతీ. నేను నిన్ను కలవాలి. 23 00:02:14,218 --> 00:02:16,136 మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. 24 00:02:17,221 --> 00:02:18,222 పక్కన ఎవరైనా ఉన్నారా? 25 00:02:21,183 --> 00:02:24,186 హా, లియన్ పక్కనే ఉంది. 26 00:02:28,982 --> 00:02:30,359 బంగారం, ఎలా మరి? 27 00:02:32,069 --> 00:02:33,570 ఇంటి నుండి నేను బయటకు రాలేను. 28 00:02:35,155 --> 00:02:36,156 బంగారం, 29 00:02:37,157 --> 00:02:39,826 ఇప్పుడల్లా నన్ను డీశ్చార్జ్ చేయరు. 30 00:02:40,327 --> 00:02:41,537 ఆసుపత్రి బాగా రద్దీగా ఉంది. 31 00:02:43,997 --> 00:02:45,374 ఎన్ని రోజులు పడుతుందంటావు? 32 00:02:46,583 --> 00:02:49,211 తెలీదు. రోజులు పట్టవచ్చు. ఒక వారం కూడా పట్టవచ్చు. 33 00:02:52,714 --> 00:02:54,800 షాన్, అలా అయితే కష్టం అనుకుంటా. 34 00:02:56,009 --> 00:02:59,471 చూడు, డొరోతీ, నేను నీకు ఒకటి పంపిస్తాను. 35 00:03:00,097 --> 00:03:02,975 టోబీ నీకు ఆహారం తీసుకువస్తారు, నువ్వేమీ కంగారుపడనక్కర్లేదు. 36 00:03:04,226 --> 00:03:06,019 నాకు ఆహారం అక్కర్లేదు. నువ్వు ఇంట్లో ఉండటం కావాలి. 37 00:03:06,937 --> 00:03:09,231 - అది ఇప్పుడు కుదరదు. - అబ్బా. 38 00:03:09,898 --> 00:03:11,483 ఓ పని చేస్తా ఆగు. 39 00:03:11,483 --> 00:03:14,403 ప్రొష్యుటో, బ్లాక్ ట్రఫుల్స్, అన్నీ నీకు నచ్చినవే పంపిస్తాను. 40 00:03:14,403 --> 00:03:15,988 వద్దు, షాన్. 41 00:03:16,488 --> 00:03:17,489 నాకు తెలుసు, బంగారం. 42 00:03:18,824 --> 00:03:23,161 చూడు ఉదయాన్నే ఎనిమిది గంటలకి టోబీ ఆహారం తీసుకొని వస్తాడు. 43 00:03:24,371 --> 00:03:25,372 మర్చిపోకు. 44 00:03:26,540 --> 00:03:28,250 నేను చెప్తున్నా కదా, ఏమీ కాదు. 45 00:03:29,543 --> 00:03:31,295 - ఐ లవ్ యూ. - హా. 46 00:03:37,384 --> 00:03:41,013 మనం ఒకరికొకరు తోడుగా ఉన్నంత దాకా మనకేం కాదు. 47 00:03:42,806 --> 00:03:44,850 మనం భయపడుతున్నామని తనకి తెలీకూడదు. 48 00:03:46,602 --> 00:03:48,020 భయం లేనట్టు నటిద్దాం, సరేనా? 49 00:03:52,733 --> 00:03:53,734 హలో? 50 00:03:54,318 --> 00:03:55,527 హాయ్, డాక్టర్ వుడెల్. 51 00:03:56,069 --> 00:03:57,988 నేనే డొరోతి టర్నర్ ని. 52 00:03:58,655 --> 00:04:00,490 హాయ్, డొరోతీ. ఒక నిమిషం. 53 00:04:02,367 --> 00:04:03,368 డొరోతీ? 54 00:04:04,077 --> 00:04:05,787 ఎలా ఉన్నావు? 55 00:04:05,787 --> 00:04:06,872 లియన్? 56 00:04:07,497 --> 00:04:10,334 కత్తి ఇంకాస్త పక్కన దిగి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవని డాక్టర్ వుడెల్ ఏమైనా చెప్పాడా? 57 00:04:10,918 --> 00:04:12,836 నువ్వు బతికి ఉన్నావంటే, అది నీ అదృష్టమే. 58 00:04:13,587 --> 00:04:16,089 మా ఇద్దరి కన్నా డొరోతీ చాలా గట్టిది. 59 00:04:16,089 --> 00:04:17,173 తను నిన్ను ధీటుగా ఎదుర్కోగలదు. 60 00:04:17,841 --> 00:04:19,051 మంచిగా విశ్రాంతి తీసుకో, షాన్. 61 00:04:19,593 --> 00:04:22,554 పూర్తిగా కోలుకున్నాక, నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. 62 00:04:23,347 --> 00:04:24,973 దానికి కాస్త శక్తి అవసరం అవుతుంది. 63 00:04:30,771 --> 00:04:31,772 డొరోతీ? 64 00:04:37,236 --> 00:04:38,487 ఈరాత్రికి ఇక్కడే పడుకుంటా. 65 00:04:40,572 --> 00:04:42,282 తుఫాను వల్ల జెరికో భయపడే అవకాశం ఉంది. 66 00:04:42,783 --> 00:04:44,493 షాన్ లేడు కాబట్టి, నీకు భయంగానే ఉంటుంది. 67 00:05:26,243 --> 00:05:27,452 మనకి ఏమీ కాదు. 68 00:05:31,415 --> 00:05:33,542 మనకేమీ కాదు. 69 00:05:56,690 --> 00:05:59,776 సోఫా టీవీకి ఎదురుగా ఉంటే బాగుంటుందని అనిపించింది. 70 00:06:01,945 --> 00:06:02,946 ఈ పని ఎప్పుడు చేశావు? 71 00:06:04,239 --> 00:06:06,783 నిద్ర పట్టలేదు. చాలా ఆనందంగా ఉండింది. 72 00:06:08,869 --> 00:06:11,496 మన ముగ్గురం కలిసి ఒక సినిమా చూస్తే బాగుంటుందని అనిపించింది. 73 00:06:13,123 --> 00:06:14,124 సరే. 74 00:06:15,083 --> 00:06:16,084 నీకు చూడాలనిపిస్తేనేలే. 75 00:06:16,877 --> 00:06:17,878 చూద్దాం. 76 00:06:18,879 --> 00:06:20,047 సూపర్. 77 00:06:23,258 --> 00:06:24,384 టోబీ అయ్యుంటాడు. 78 00:06:26,261 --> 00:06:27,262 వెళ్లి చూడగలవా? 79 00:06:29,473 --> 00:06:30,807 నువ్వే వెళ్తే మంచిదేమో. 80 00:06:31,850 --> 00:06:32,851 టోబీకి, నాకూ... 81 00:06:34,394 --> 00:06:36,146 అదీగాక, నేను టాయిలెట్ కి వెళ్లాలి. 82 00:06:40,526 --> 00:06:41,527 వస్తున్నా. 83 00:07:07,928 --> 00:07:10,180 నిర్మాణం జరుగుతున్న చోటు వెనక్కి రా. 84 00:07:10,180 --> 00:07:12,266 టోబీతో మాట్లాడుతున్నట్టు నటించు. 85 00:07:12,266 --> 00:07:14,351 మనం మాట్లాడుకోవాలి. సమయం లేదు. 86 00:07:26,029 --> 00:07:28,365 సరే. చాలా చాలా థ్యాంక్స్, టోబీ. 87 00:07:29,950 --> 00:07:33,120 మేము మిస్ అవుతున్నాం, కానీ వాళ్లు బాగా కోలుకుంటున్నారని డాక్టర్లు అంటున్నారు. 88 00:07:35,998 --> 00:07:36,999 అవును. 89 00:07:39,668 --> 00:07:42,379 సరే, తప్పకుండా తనకి చెప్తాను. 90 00:07:43,005 --> 00:07:44,882 సరే, థ్యాంక్స్. మళ్లీ కలుద్దాం. 91 00:07:59,146 --> 00:08:00,314 టోబీ నీకు హాయ్ చెప్పమన్నాడు. 92 00:08:02,608 --> 00:08:04,318 ఆ బుట్ట లోపలికి తీసుకువస్తావా? 93 00:08:18,207 --> 00:08:19,208 ఏ సినిమా చూద్దాం? 94 00:08:20,375 --> 00:08:21,710 ఏదైనా పర్లేదు. 95 00:08:22,544 --> 00:08:23,545 ఏం చూడాలో నువ్వే చెప్పు. 96 00:08:24,087 --> 00:08:27,090 అంతా పైన ఏర్పాటు చేయ్. నేను, జెరికో కాసేపట్లో వస్తాం. 97 00:08:29,718 --> 00:08:31,345 ఇంకా నీ గురించి నాకు తెలీదు అనుకుంటున్నావా? 98 00:08:32,554 --> 00:08:34,640 నాకేదో పని చెప్పేసి, వెళ్లిపోదాం అనుకుంటున్నావు. 99 00:08:35,765 --> 00:08:36,892 ఎప్పటిలాగే. 100 00:08:37,726 --> 00:08:38,727 ఒకసారి బయట చూడు. 101 00:08:40,770 --> 00:08:44,816 నేను ఈ పరిస్థితిలో ఉండగా, జెరికోని తీసుకుని ఎక్కడికని వెళ్లగలను? 102 00:08:48,529 --> 00:08:51,031 వెళ్లే స్థితిలో ఉండుంటే, ఎప్పుడో వెళ్లిపోయి ఉండేదాన్ని. 103 00:08:54,117 --> 00:08:55,452 మనం ఇక్కడే చూద్దాం. 104 00:09:01,333 --> 00:09:03,293 వర్షం పడుతున్నప్పుడు సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు. 105 00:09:04,711 --> 00:09:06,255 ఏదైనా భయం తెప్పించే సినిమా చూద్దామా? 106 00:09:07,381 --> 00:09:10,133 అది ప్రమాదవశాత్తు జరిగింది. నేను చంపాలని చంపలేదు. 107 00:09:10,133 --> 00:09:13,512 పాపా, నేను కూడా ప్రమాదవశాత్తు ఏదోకటి చేస్తుంటా. 108 00:09:13,512 --> 00:09:15,556 రూబీ స్లిప్పర్లను మర్చిపోతున్నట్టున్నావే? 109 00:09:15,556 --> 00:09:19,309 అవును. రూబీ స్లిప్పర్లు! 110 00:09:19,309 --> 00:09:20,394 లియన్? 111 00:09:22,396 --> 00:09:23,397 చెప్పు. 112 00:09:25,190 --> 00:09:26,483 నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. 113 00:09:27,234 --> 00:09:28,235 వాళ్లు వెళ్లిపోయారు! 114 00:09:28,735 --> 00:09:30,237 నా వీపు, ఇంకా కాళ్లు నొప్పి పెడుతున్నాయి. 115 00:09:32,739 --> 00:09:35,367 ఒక మాత్ర వేసుకొని కాసేపు పడుకుంటా. 116 00:09:38,036 --> 00:09:41,415 కాసేపు జెరికోని చూసుకుంటావా? 117 00:09:43,000 --> 00:09:46,587 స్నానం చేయించి, ఏవైనా పుస్తకాలను చదివి వినిపించు. 118 00:09:49,131 --> 00:09:51,133 నాకు ఇవ్వడం నీకు ఓకేనా? 119 00:09:52,718 --> 00:09:53,927 ఓకే కాదు. 120 00:09:55,554 --> 00:09:56,555 వీడంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. 121 00:09:56,555 --> 00:09:59,516 - ...నీ శక్తులు ఇక్కడ పని చేయవు. - ఇంటిని కూల్చేయక ముందే వెళ్లిపోండి... 122 00:10:18,452 --> 00:10:20,162 వెళ్లి స్నానపు బొమ్మలని తీసుకురా. 123 00:10:20,954 --> 00:10:24,041 నేను విశ్రాంతి తీసుకుంటా, నీ బాత్రూమ్ లో స్నానం చేయించు. సరేనా? 124 00:10:24,750 --> 00:10:25,751 సరే. 125 00:10:33,550 --> 00:10:36,303 జెరికో, అమ్మ బయటకి వెళ్లి నాన్నతో మాట్లాడి వస్తుంది, 126 00:10:37,137 --> 00:10:39,640 ఇలా వెళ్లి అలా వచ్చేస్తా. నిజంగానే చెప్తున్నా. 127 00:10:41,642 --> 00:10:45,145 వెళ్లి నాన్నతో మాట్లాడతాను, ఆ తర్వాత ఇక్కడి నుండి నిన్ను తీసుకెళ్లిపోతా. 128 00:10:46,313 --> 00:10:48,065 మనం మళ్లీ తనని చూడనక్కర్లేదు. 129 00:10:50,359 --> 00:10:53,070 కాసేపు ధైర్యంగా ఉండు, చాలు. 130 00:10:55,864 --> 00:10:57,991 నువ్వు లేకుండా నేను బతకలేను, అంత ప్రేమ ఉంది నీపైన నాకు. 131 00:11:01,286 --> 00:11:03,247 హేయ్. బాబుని ఇస్తావా? 132 00:11:03,830 --> 00:11:05,165 - హా. - సరే. 133 00:11:06,917 --> 00:11:08,877 మనం స్నానం చేద్దాం దా. 134 00:11:11,421 --> 00:11:12,422 ఇలా రా. 135 00:11:13,715 --> 00:11:14,800 అదీ. 136 00:11:43,495 --> 00:11:44,788 బాగా విశ్రాంతి తీసుకో, డొరోతీ. 137 00:11:46,957 --> 00:11:48,292 అమ్మకి బై చెప్పు. 138 00:11:49,209 --> 00:11:51,128 బై. బై. 139 00:12:31,752 --> 00:12:33,754 ఇలా రా. తల స్నానం చేయిస్తా. 140 00:12:35,214 --> 00:12:39,885 జెరి, తలని ఇలా పెట్టు. ఏంటది? 141 00:12:42,763 --> 00:12:45,349 ఇలా రా. ఇలా రా. వద్దు. 142 00:13:34,857 --> 00:13:35,941 ఏం చేస్తున్నావు? 143 00:14:20,402 --> 00:14:22,446 ఏంటి? అదా? 144 00:14:22,446 --> 00:14:23,530 అదా? 145 00:14:24,031 --> 00:14:28,327 హా. అదేనా? అది కావాలన్నమాట. 146 00:15:31,849 --> 00:15:35,978 - హాయ్. హాయ్. - డొరోతీ. 147 00:15:42,109 --> 00:15:43,443 - దేవుడా. - హేయ్. 148 00:15:43,443 --> 00:15:44,528 ఓరి దేవుడా. 149 00:15:45,445 --> 00:15:47,948 అయ్యయ్యో. సారీ. అబ్బా. 150 00:15:47,948 --> 00:15:50,659 మీ ఇద్దరికీ ఏమైంది? దీనికి కారణం లియనేనా? 151 00:15:50,659 --> 00:15:53,078 అవును. తనకి పిచ్చి ఉంది. 152 00:15:53,078 --> 00:15:55,122 మొదట్నుంచీ నేను చెప్తూ వచ్చింది అదే కదా, జుజూ. 153 00:15:55,122 --> 00:15:56,206 అవును. 154 00:15:57,416 --> 00:15:58,542 నిన్ను చాలా మిస్ అయ్యా. 155 00:15:59,543 --> 00:16:01,170 నేను ఇక్కడి దాకా రాగలను అనుకోలేదు. 156 00:16:01,920 --> 00:16:02,921 ఆ బుట్ట. 157 00:16:03,839 --> 00:16:05,883 తలుపు లియన్ తీసుంటే? 158 00:16:05,883 --> 00:16:08,135 ఈ మధ్య లియన్ తనకి దూరంగా ఉంటోందని టోబీ చెప్పాడు, 159 00:16:08,135 --> 00:16:11,430 కాబట్టి, తన పేరు వింటే, తను రాకుండా నిన్నే వెళ్లమంటదని అనుకున్నా. 160 00:16:11,430 --> 00:16:13,015 వాళ్లిద్దరి మధ్య ఏదో ఉంది. 161 00:16:20,189 --> 00:16:21,190 డాటీ. 162 00:16:22,608 --> 00:16:27,154 షాన్... మనం ఈ పని వెంటనే చేయాలి. 163 00:16:27,779 --> 00:16:28,780 నాకు తెలుసు. 164 00:16:29,364 --> 00:16:30,365 ఏంటి? 165 00:16:35,537 --> 00:16:36,872 డాటీ. 166 00:16:38,957 --> 00:16:40,834 మేము నీకొక విషయం చెప్పాలి. 167 00:16:43,128 --> 00:16:45,464 ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చెప్తే మేలేమో. 168 00:16:46,089 --> 00:16:47,549 ఫ్రాంక్ వాళ్ల ఇంటికెళ్లి మాట్లాడుకుందాం. 169 00:16:48,675 --> 00:16:49,927 జోకా? నేనెక్కడికీ రాను. 170 00:16:51,011 --> 00:16:54,765 నేను నిన్ను కష్టపెడుతున్నానని తెలుసు. కానీ ఈ విషయంలో నన్ను నమ్మాలి. 171 00:16:54,765 --> 00:16:57,351 నిన్ను నమ్మాలా? తన దగ్గర జెరికో ఉన్నాడు. 172 00:17:02,689 --> 00:17:03,524 డాటీ. 173 00:17:03,524 --> 00:17:06,777 ఇక చాలు! ఇంకోసారి అడిగితే, కారు దిగేసి వెళ్లిపోతా. 174 00:17:06,777 --> 00:17:09,946 సరే. సరే. 175 00:17:12,199 --> 00:17:15,077 జూలియన్, మనం ఇక్కడే చెప్పేద్దాం. 176 00:17:58,328 --> 00:18:00,914 డొరోతీ, పోయిన ఆగస్టులో జరిగినవి నీకేమైనా గుర్తున్నాయా? 177 00:18:03,250 --> 00:18:04,251 ఆగస్టా? 178 00:18:10,299 --> 00:18:11,675 దాని గురించి మీకెలా తెలుసు? 179 00:18:17,181 --> 00:18:19,308 నీకేం గుర్తుంది? ఎప్పట్నుంచీ నీకు గుర్తు లేదు? 180 00:18:20,184 --> 00:18:21,935 షాన్, అదంతా నీకెలా తెలుసు... 181 00:18:23,437 --> 00:18:26,899 ఎంతో కాలంగా గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. పిచ్చిదాన్ని అవుతున్నానేమో అనిపిస్తోంది. 182 00:18:27,399 --> 00:18:29,818 అప్పుడు చెప్పలేకపోయా, కానీ ఇప్పుడు చెప్తున్నా. 183 00:18:29,818 --> 00:18:32,738 డొరోతీ, నీకు నేను సాయపడతాను. నీకు ఏం గుర్తుందో చెప్పు. 184 00:18:33,363 --> 00:18:34,364 ఏమీ గుర్తు లేదు. 185 00:18:37,409 --> 00:18:38,994 అస్సలేమీ గుర్తు లేదు. 186 00:18:40,662 --> 00:18:43,457 లాస్ ఏంజలెస్ లో జరిగిన గోర్మేట్ గాంట్లెట్ షోకి అతిథిగా వెళ్లాను. 187 00:18:43,457 --> 00:18:45,834 ఈ సీజన్ ని వాళ్లు నన్ను హోస్ట్ చేయమంది అందుకే. 188 00:18:45,834 --> 00:18:47,085 సరే. 189 00:18:47,085 --> 00:18:49,713 బెడ్ రూములో దీని గురించి మాట్లాడాలనుకున్నాను. గుర్తుందా? 190 00:18:49,713 --> 00:18:53,258 గుర్తు లేదు. ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? 191 00:18:54,801 --> 00:18:56,637 నేను అసలు ఆ పనికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. 192 00:18:56,637 --> 00:18:58,472 అప్పుడు కూడా ఆ విషయం నాకు తెలుసు. 193 00:19:01,099 --> 00:19:02,100 కానీ అప్పటికే అలసిపోయున్నా. 194 00:19:02,100 --> 00:19:04,436 నాన్న పాత్ర అనేది ఎంత కష్టమో ఎవరికీ తెలీదు. 195 00:19:04,436 --> 00:19:06,522 నాకు కూడా పిల్లలని చూసుకోవడం రాదు. నీ అంత బాగా నేను చూసుకోలేను. 196 00:19:06,522 --> 00:19:08,315 కొంత సేపు దూరంగా ఉందామనుకున్నా, 197 00:19:08,315 --> 00:19:12,611 కొంత సేపయినా దూరంగా ఉండే అవకాశం నాకు దక్కాల్సిందే అనుకున్నా. 198 00:19:12,611 --> 00:19:14,530 మొదట్నుంచీ నాది పిరికి గుణమే అనుకుంటా. 199 00:19:15,822 --> 00:19:17,616 షాన్, కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఏ మహిళతో అయినా కులికావు అనే 200 00:19:17,616 --> 00:19:19,701 నువ్వు చెప్పాలనుకుంటే కనుక, ముందు మన కుటుంబం 201 00:19:19,701 --> 00:19:22,246 ఈ విపత్తు నుండి బయట పడే దాకా ఆగు, ఆ తర్వాత చెప్పు. 202 00:19:24,456 --> 00:19:26,959 జూలియన్, ఏమైంది? ఏమైంది? 203 00:19:28,418 --> 00:19:31,880 నువ్వు కొన్ని రోజులు వచ్చి ఉండమని అడిగావు. 204 00:19:34,341 --> 00:19:36,593 నీకు ఇబ్బందిగా ఉందని చెప్పావు. 205 00:19:38,679 --> 00:19:40,681 నీ గొంతులో నీ కష్టం నాకు తెలిసింది. 206 00:19:40,681 --> 00:19:43,308 నేనలా ఎందుకు అంటా? నాకేం ఇబ్బంది లేదే. 207 00:19:43,308 --> 00:19:44,768 నీకు గుర్తు లేదు. 208 00:19:48,564 --> 00:19:50,983 నీకు నా తోడు అవసరమని నాకు తెలుసు. 209 00:19:54,152 --> 00:19:56,530 అయినా కానీ నేను రాలేదు. 210 00:19:57,114 --> 00:20:00,576 ఆ సమయంలో డ్రగ్స్ కొనుక్కుందామని అనుకున్నా, నేనేం అనుకున్నానంటే... 211 00:20:01,535 --> 00:20:04,413 రానందుకు క్షమించు. 212 00:20:04,997 --> 00:20:06,748 మీ ఇద్దరూ పిచ్చోళ్లలా మాట్లాడుతున్నారు. 213 00:20:08,041 --> 00:20:09,793 నేను నీకు కాల్ చేయలేదు అసలు. 214 00:20:13,755 --> 00:20:14,590 ఏంటి? 215 00:20:14,590 --> 00:20:16,133 జుజూ, నేను డాటీని. 216 00:20:18,010 --> 00:20:19,803 ముఖ్యమైన విషయం కాబట్టే కాల్ చేస్తున్నాను, 217 00:20:19,803 --> 00:20:23,974 ఏంటంటే, నాకు చాలా కష్టంగా ఉంది. 218 00:20:26,852 --> 00:20:31,857 జెరికో ఏడుపు అస్సలు ఆపట్లేదు, నేను చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు, కానీ... 219 00:20:34,359 --> 00:20:36,153 ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావట్లేదు. 220 00:20:37,613 --> 00:20:44,494 కాబట్టి, కనీసం కొంత సేపటికైనా ఇక్కడికి రా, జుజూ. 221 00:20:46,413 --> 00:20:49,583 సరే మరి. తర్వాత నాకు కాల్ చేయ్, సరేనా? 222 00:20:50,751 --> 00:20:51,752 బై. 223 00:20:53,170 --> 00:20:55,631 నాకు ఏం జరుగుతోందో అర్థమవ్వట్లేదు. 224 00:20:56,256 --> 00:20:59,593 అది జరిగాక, నటాలీ చికిత్స వల్ల నీ పరిస్థితి మెరుగవుతుంది అనుకున్నాం. 225 00:21:00,135 --> 00:21:03,680 ఒక చికిత్స ఉందని, దాని వల్ల చాలా మందికి మెరుగయిందని తను చెప్పింది. 226 00:21:03,680 --> 00:21:07,267 ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి, డొరోతీ, ఏం చేస్తే నీకు బాగు అవుతుందో మాకు తెలీలేదు. 227 00:21:07,267 --> 00:21:10,062 అంటే, నువ్వు ఏదో ఉన్నావంటే ఉన్నావు, అంతే. 228 00:21:10,062 --> 00:21:12,814 పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ నువ్వే తీసుకొనే దానివి. 229 00:21:12,814 --> 00:21:14,566 మీరేం చెప్తున్నారు? 230 00:21:15,526 --> 00:21:17,110 నాకేం అర్థం కావట్లేదు. 231 00:21:17,110 --> 00:21:19,947 ఎవరైనా కాస్త అర్థమయ్యేలా చెప్పగలరా? 232 00:21:19,947 --> 00:21:22,908 నేను ఆ పనే చేస్తున్నా. ఒక బొమ్మ ఉండింది. 233 00:21:25,953 --> 00:21:27,663 అది నీకు బాగా ఊరటనిచ్చింది. 234 00:21:28,497 --> 00:21:31,667 నువ్వు కోలుకుంటున్నట్టే కనిపించావు. దాన్ని వాడే అని అనుకొనేదానివి. 235 00:21:34,419 --> 00:21:37,631 ఉన్నట్టుండి, నువ్వు మళ్లీ మామూలు మనిషివి అయిపోయినట్టు మాకు అనిపించింది. 236 00:21:41,343 --> 00:21:45,597 అదెంత కాలం కొనసాగుతుందో నాకు తెలీదు, 237 00:21:45,597 --> 00:21:50,394 కానీ... దాని వల్ల నువ్వు నాకు దూరం కావు అని నాకు అనిపిస్తే, 238 00:21:50,394 --> 00:21:52,688 నేను అలాగే కొనసాగనిచ్చి ఉండేవాడిని. 239 00:21:54,439 --> 00:21:55,440 బొమ్మనా? 240 00:22:00,112 --> 00:22:03,532 బొమ్మని నేను ఎవడని అనుకున్నా? 241 00:22:04,616 --> 00:22:05,617 షాన్? 242 00:22:06,827 --> 00:22:08,787 డొరోతీ, తప్పంతా నీదే అని నువ్వు బాధపడిపోతావని నాకు తెలుసు. 243 00:22:08,787 --> 00:22:11,665 నీ వ్యక్తిత్వం అది. కానీ నువ్వలా చేయడం న్యాయమైన పని కాదు. 244 00:22:13,333 --> 00:22:14,877 మేమిద్దరమూ ఖాళీ లేకుండా ఉన్నాం, 245 00:22:14,877 --> 00:22:17,504 నువ్వు ఒక్క దానివే చూసుకోవాల్సి వచ్చింది. 246 00:22:22,843 --> 00:22:25,596 అది ప్రమాదవశాత్తు జరిగింది. 247 00:22:26,346 --> 00:22:28,307 నిజంగా ప్రమాదవశాత్తు జరిగింది. 248 00:22:28,307 --> 00:22:31,059 ఆ వేసవి... ఎలా ఉండిందో నీకు గుర్తుందా? 249 00:22:32,060 --> 00:22:34,104 వేడికి రోడ్డులుపై పగుళ్లు ఏర్పడ్డాయి. 250 00:22:39,026 --> 00:22:41,028 నువ్వు వాడిని సూపర్ మార్కెట్ కి తీసుకెళ్లావు. 251 00:22:42,905 --> 00:22:44,198 నీ చేతులు ఖాళీగా లేవు. 252 00:22:49,494 --> 00:22:52,706 - ఏంటి? - నీకు దాన్ని గుర్తు తెచ్చుకోవాలని లేదని తెలుసు, 253 00:22:52,706 --> 00:22:54,583 కానీ నువ్వు దాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, డొరోతీ. 254 00:22:56,001 --> 00:22:59,004 బంగారం, అదేదో ప్రమాదవశాత్తు జరిగింది. 255 00:23:01,089 --> 00:23:03,675 డాటీ, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. 256 00:24:43,358 --> 00:24:47,112 మిసెస్ టర్నర్, మీరు బాగానే ఉన్నారా? 257 00:24:51,074 --> 00:24:53,202 మిసెస్ టర్నర్, నేను పోలీసును. 258 00:24:55,412 --> 00:24:57,831 మీ అబ్బాయి గురించి అడిగితే, మీకేం అభ్యంతరం లేదు కదా? 259 00:24:59,708 --> 00:25:01,668 అతని పేరు జెరికో కదా? 260 00:25:05,297 --> 00:25:06,423 ఏం జరిగింది? 261 00:25:09,593 --> 00:25:10,802 మీకు గుర్తుందా? 262 00:25:18,435 --> 00:25:19,728 {\an8}రేయస్ 263 00:25:28,779 --> 00:25:30,197 మీకు నా సానుభూతి, మేడమ్. 264 00:25:57,391 --> 00:25:58,392 డొరోతీ. 265 00:26:00,352 --> 00:26:02,229 బంగారం, నాతో మాట్లాడు. 266 00:26:08,193 --> 00:26:09,862 డొరోతీ, తేరుకో. 267 00:26:14,908 --> 00:26:16,827 డొరోతీ, దయచేసి తేరుకో. 268 00:26:25,419 --> 00:26:27,671 - జూలియన్! జూలియన్! - డొరోతీ, ఆగు! 269 00:26:29,590 --> 00:26:32,593 డొరోతీ, ఐ లవ్ యూ. ఆగు. ఆగు! 270 00:26:33,260 --> 00:26:36,471 డొరోతీ! బాబోయ్ డొరోతీ! 271 00:26:37,306 --> 00:26:38,432 డొరోతీ... 272 00:26:40,267 --> 00:26:41,935 బాబోయ్! డొరోతీ! 273 00:26:44,479 --> 00:26:47,941 అయ్యయ్యో! దేవుడా! 274 00:26:50,736 --> 00:26:54,156 దేవుడా! భగవంతుడా! 275 00:28:14,403 --> 00:28:16,238 సరే. మనం ఇంటికి వచ్చేశాం, డాటీ. 276 00:28:17,197 --> 00:28:19,074 లియన్, కిందికి దిగి రా! 277 00:28:19,950 --> 00:28:21,702 మేము తనకి అంతా చెప్పేశాం. ఇక నీ పప్పులు ఉడకవు! 278 00:28:23,120 --> 00:28:24,121 లియన్! 279 00:28:24,872 --> 00:28:28,125 నేను ఇక్కడే ఉన్నాను. గొంతు చించుకొని అరవక్కర్లేదు. 280 00:28:29,835 --> 00:28:31,962 తనకి నిజం తెలిసిపోయింది, లియన్. ఇక నీ ఖేల్ ఖతమ్. 281 00:28:33,255 --> 00:28:35,215 ఇవాళ నిన్ను జెరికో మిస్ అయ్యాడు, డొరోతీ. 282 00:28:35,215 --> 00:28:36,300 షాన్, చూడు. 283 00:28:40,095 --> 00:28:42,014 నీ కొడుకుని ఎత్తుకోవాలని నీకు లేదా? 284 00:28:42,014 --> 00:28:42,973 అది బొమ్మ, అంతే. 285 00:28:42,973 --> 00:28:45,809 - జోకా? - జోక్ కాదు, షాన్. 286 00:28:45,809 --> 00:28:47,811 నీ పిచ్చి పిచ్చి ఆటలు ఇంకెక్కడైనా ఆడుకోపో. 287 00:28:47,811 --> 00:28:48,896 సరేనా? ఇక నీ కథ ముగిసింది. 288 00:28:49,605 --> 00:28:50,522 నీ సొరంగ మార్గాల గురించి, 289 00:28:50,522 --> 00:28:53,609 బొమ్మని, పసికందును వాటి ద్వారా మారుస్తూ మమ్మల్ని వెధవలని చేస్తున్నావని మాకు తెలిసిపోయింది. 290 00:28:53,609 --> 00:28:55,694 ఇక నువ్వు మమ్మల్ని గుప్పెట్లో ఉంచుకోలేవు. 291 00:28:56,195 --> 00:28:57,696 ఇక నీ మాటలు ఎవరూ నమ్మరు. 292 00:28:58,488 --> 00:29:00,407 నమ్మరా? అదీ చూస్తాను. 293 00:29:01,909 --> 00:29:02,910 డొరోతీ? 294 00:29:06,496 --> 00:29:08,957 ఇది నీకు చాలా కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. 295 00:29:10,125 --> 00:29:13,003 అది కూడా ఇలా జరగాల్సి వస్తున్నందుకు నాకు బాధగా ఉంది. 296 00:29:14,505 --> 00:29:16,215 కానీ ఇప్పుడు, నీకంతా తెలిసిపోయింది. 297 00:29:17,716 --> 00:29:19,510 నీ కోసం నేనేం చేశానో కూడా నీకు తెలుసు. 298 00:29:20,302 --> 00:29:22,471 నువ్వు ఈ ఇంటి నుండి బయటకు వెళ్లిపో, లియన్. 299 00:29:23,138 --> 00:29:26,892 నీకు పిచ్చి ఉంది, ఇక నువ్వు మా మానాన మమ్మల్ని వదిలేయ్. 300 00:29:27,684 --> 00:29:30,354 వాడు చనిపోవడానికి కారణం నువ్వు అని నాకు తెలిశాక... 301 00:29:30,354 --> 00:29:31,563 ఇక బయలుదేరు లియన్! 302 00:29:31,563 --> 00:29:33,524 ...నీపై నాకు చాలా కోపం వచ్చేసింది. 303 00:29:34,858 --> 00:29:37,152 ఆ తర్వాతే, నా జీవిత పరమార్థం అదే అని గ్రహించా. 304 00:29:38,278 --> 00:29:41,198 ఈ తప్పును సరిదిద్దడమే నా జీవిత పరమార్థం. 305 00:29:41,198 --> 00:29:42,950 తను సైకో, డొరోతీ. 306 00:29:42,950 --> 00:29:44,243 తనని పట్టించుకోకు. 307 00:29:45,035 --> 00:29:47,955 నేను అసాధారణమైన పనులు చేయగలను, డొరోతీ. 308 00:29:48,497 --> 00:29:50,749 అప్పుడప్పుడూ కొన్నిటిని నమ్మడం కష్టంగా ఉంటుంది. 309 00:29:51,667 --> 00:29:53,335 కానీ నా జీవితంలో నేను చేసిన అసాధారణమైన పని కూడా 310 00:29:53,335 --> 00:29:55,921 నీ కోసమే చేశాను. 311 00:29:57,089 --> 00:29:59,675 నీ కొడుక్కి మళ్లీ ప్రాణం పోశా. 312 00:29:59,675 --> 00:30:01,009 తన మాటలను పట్టించుకోకు. 313 00:30:01,009 --> 00:30:04,388 బంగారం, తను జెరికో కానే కాదు. వేరెవరో బిడ్డ తను. 314 00:30:04,388 --> 00:30:05,556 షాన్, ఇంకా జూలియన్ 315 00:30:05,556 --> 00:30:08,934 ఏవీ పెద్దగా నమ్మరు కాబట్టే, ఈ బొమ్మ ఇక్కడ ఉంది. 316 00:30:10,310 --> 00:30:11,645 వాళ్లని శిక్షించడం తప్ప నాకు మరో దారి లేదు. 317 00:30:13,605 --> 00:30:17,109 కాబట్టి, జెరికోని నేను లేని చోటికి పంపించేశా. 318 00:30:17,109 --> 00:30:19,111 తమ బిడ్డ కోసం వెతుకుతున్న 319 00:30:19,111 --> 00:30:21,905 ఒక కుటుంబాన్ని మేము కనుగొన్నాం, డొరోతీ, వాళ్లుండేది రెండు రాష్ట్రాల అవతలే. 320 00:30:23,240 --> 00:30:26,743 అవును, తను వేరే తల్లి నుండి ఆ బిడ్డని దొంగిలించింది, బంగారం. 321 00:30:26,743 --> 00:30:29,204 తను ప్రత్యేకమైన వ్యక్తి అని మనల్ని నమ్మించడానికి అలా చేసింది. 322 00:30:29,204 --> 00:30:31,123 వాడిని ఎక్కడో దాచిపెట్టి వచ్చింది. 323 00:30:31,123 --> 00:30:34,293 మా అందరినీ మాయ చేసినట్టే ఇప్పుడు నిన్ను మాయ చేస్తోంది. 324 00:30:34,293 --> 00:30:37,796 వాళ్లకి అర్థం కాదు. అర్థం చేసుకోలేరు కూడా. 325 00:30:39,131 --> 00:30:40,132 కానీ నువ్వు అర్థం చేసుకోగలవు. 326 00:30:41,675 --> 00:30:44,011 తల్లికి తన బిడ్డ ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. 327 00:30:46,138 --> 00:30:49,808 ఆ బిడ్డ అసలు జెరికో కాదు, బంగారం. దయచేసి నా మాట నమ్ము. 328 00:30:50,434 --> 00:30:52,936 మన ఊహలకి అందని విషయాలు కొన్ని ఉంటాయి. 329 00:30:53,478 --> 00:30:56,190 తల్లికి, బిడ్డకి మధ్య ఉన్న బంధంలా. 330 00:30:56,982 --> 00:30:58,901 చావుకు, పుట్టుకకి మధ్య ఉన్న సంబంధంలా. 331 00:30:58,901 --> 00:30:59,985 నాలా. 332 00:31:01,403 --> 00:31:04,156 కానీ నీకు నిజమేంటో తెలుసు కదా, డొరోతీ? 333 00:31:04,740 --> 00:31:08,243 నువ్వు వాడిని హత్తుకున్నప్పుడు, నీకు వాడి గుండె చప్పుడు వినిపించింది కదా. 334 00:31:08,744 --> 00:31:11,246 వాడు జెరికో అని నీకు తెలుసు. 335 00:31:11,246 --> 00:31:14,291 వాడు నీ కన్న బిడ్డే అని నీకు తెలుసు. నీకు తెలుసు. 336 00:31:15,042 --> 00:31:16,960 డొరోతీ, నా మాటలని నువ్వు నమ్ముతున్నావు కదా? 337 00:31:18,295 --> 00:31:21,256 నువ్వు ఇప్పుడు బలహీన స్థితిలో ఉన్నావని తనకి తెలుసు, నిన్ను అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటోంది. 338 00:31:21,256 --> 00:31:22,716 తన మాటలు వినకు. 339 00:31:23,926 --> 00:31:26,929 డొరోతీ, వాడికి మళ్లీ నేను శాశ్వతంగా ప్రాణం పోయగలను. 340 00:31:27,638 --> 00:31:30,349 నోర్మూయ్. నోరు మూసేయ్! 341 00:31:31,558 --> 00:31:33,644 మళ్లీ మనం ఇలా చేయాల్సిన పనే ఉండదు. 342 00:31:34,144 --> 00:31:36,772 నువ్వు, నేను, ఇంకా వాడు, మన ముగ్గురమే ఉందాం. 343 00:31:37,397 --> 00:31:39,024 తన మానాన తనని వదిలేయ్. 344 00:31:40,359 --> 00:31:43,403 జెరికో కోసం ఏమైనా చేస్తావని ఒకసారి నువ్వే నాకు చెప్పావు. 345 00:31:44,321 --> 00:31:45,614 ఆ అవకాశం ఇప్పుడు నీ ముందు ఉంది. 346 00:31:47,074 --> 00:31:49,284 నువ్వు "అవును" అని చెప్తే చాలు. 347 00:31:50,118 --> 00:31:51,286 వద్దు. 348 00:31:52,287 --> 00:31:56,875 "అవును" అని చెప్పు చాలు, అంతా సర్దుకుంటాయి. 349 00:31:57,376 --> 00:32:00,045 నీకేం కావాలంటే అది ఇస్తా. 350 00:32:01,463 --> 00:32:03,173 తనని పట్టించుకోకు, డొరోతీ. 351 00:32:04,091 --> 00:32:05,300 "అవును" అని చెప్పు చాలు. 352 00:32:08,804 --> 00:32:09,805 అవును. 353 00:32:45,174 --> 00:32:47,176 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్