1 00:01:07,734 --> 00:01:11,655 ఫిలడెల్ఫియా వాసుల ఇళ్లల్లో ఎన్ని ఇళ్లలో విద్యుత్తు పోయిందో ఇంకా స్పష్టంగా తెలీదు, 2 00:01:11,738 --> 00:01:16,159 కానీ కెన్సింగ్టన్ కి మా 8న్యూస్ మొబైల్ టీమ్ చేరుకొని 3 00:01:16,243 --> 00:01:19,162 అక్కడి నుండి కూడా ఈ విశేషాలను కవర్ చేస్తోంది. 4 00:01:19,246 --> 00:01:22,040 గ్రేటర్ ఫిలడెల్ఫియా ప్రాంతాన్ని రెండవ కేటగిరీ తుఫాను 5 00:01:22,124 --> 00:01:24,334 సమీపిస్తోందని మనకి తెలుసు కదా, వాకర్, 6 00:01:24,418 --> 00:01:27,337 ఇప్పటికే ఉన్న అకాల వాతావరణ పరిస్థితులకు ఇది అదనంగా వచ్చి చేరింది. 7 00:01:27,421 --> 00:01:30,424 ఇక్కడ నగర నడి బొడ్డున ఇప్పటికే జోరుగా గాలులు వీస్తున్నాయి. 8 00:01:30,507 --> 00:01:32,634 వరదలు వచ్చే అవకాశం ఉందా? 9 00:01:32,718 --> 00:01:35,429 అధికారులు వరదలు వస్తాయని హెచ్చరిక అయితే జారీ చేశారు. 10 00:01:35,512 --> 00:01:37,097 కార్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఉన్నాయి. 11 00:01:37,181 --> 00:01:40,309 వర్షపు నీరు డ్రైనేజీలోకి సరిగ్గా ఇంకుతున్నట్టుగా అనిపించట్లేదు. 12 00:01:40,392 --> 00:01:42,019 జెఫ్, ఇంట్లోని జనాలను షూట్ చేయవా? 13 00:01:42,978 --> 00:01:44,688 ఏంటి ఆ వింత శబ్దం? 14 00:01:51,904 --> 00:01:57,492 వావ్! ఎలుకలన్నీ బయటకు రావడం చూసి ఆమె పెట్టిన అరుపులు విన్నారు కదా. 15 00:01:57,576 --> 00:01:58,994 పరిస్థితి అలా ఉంది మరి. 16 00:01:59,077 --> 00:02:01,330 ఎలుకల విషయానికి వస్తే, రోగాల నివారణ శాఖ… 17 00:02:25,229 --> 00:02:28,398 ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయంలో 18 00:02:28,482 --> 00:02:30,609 ప్రస్తుతానికి విమాన రాకపోకలు నిలిపివేశారు, 19 00:02:30,692 --> 00:02:33,403 రోడ్డు బ్లాకులు కూడా త్వరలోనే ఏర్పాటు చేయవచ్చు. 20 00:02:33,487 --> 00:02:35,906 తుఫాను సరిగ్గా చంద్రగ్రహణం సమయంలో వచ్చింది కనుక 21 00:02:35,989 --> 00:02:38,200 ఇవాళ రాత్రంతా కటిక చీకటిగా ఉంటుంది. 22 00:02:38,283 --> 00:02:40,285 మరి జంతువుల పరిస్థితి ఏంటా అని ఆలోచించారా? 23 00:02:40,369 --> 00:02:43,205 మాటలు ఆగిపోవడం, ఇంకా అంతుచిక్కని నొప్పులపై ఒత్తిడి ప్రభావం 24 00:02:44,039 --> 00:02:45,207 ఏం చదువుతున్నావు? 25 00:02:45,290 --> 00:02:46,750 యుగాంతం 26 00:02:48,460 --> 00:02:49,461 ఏం లేదు… 27 00:02:49,962 --> 00:02:53,465 నా గురించి తెలిసిందే కదా. నేను చిత్రవిచిత్రమైన వాటిని చదువుతుంటాను. 28 00:02:54,633 --> 00:02:56,426 మానసిక సమస్యలా? 29 00:02:57,261 --> 00:02:59,054 నీకు మతిపోతోందని భయంగా ఉందా? 30 00:03:02,558 --> 00:03:06,979 ఒక్క నిమిషం. ఒకటి. రెండు. మూడు. 31 00:03:08,397 --> 00:03:09,398 మూడు సెకన్లు. 32 00:03:09,481 --> 00:03:12,150 అంటే, తుఫాను కేంద్రం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. 33 00:03:13,360 --> 00:03:14,528 భయం కలిగిందా? 34 00:03:15,112 --> 00:03:16,154 అంత సీన్ లేదు. 35 00:03:17,364 --> 00:03:18,824 నువ్వెందుకో భయపడుతున్నావు. 36 00:03:21,201 --> 00:03:24,955 భయం అంటే, రవ్వంత ఉందిలే, 37 00:03:25,038 --> 00:03:27,708 ఇలాంటి ప్రకృతి వైపరిత్యాల సమయంలో కాస్తంత భయం కలుగుతుంది నాకు. 38 00:03:27,791 --> 00:03:31,086 కానీ ప్రతి తుఫాను కూడా విధ్వంసాన్ని మిగిల్చేదే. 39 00:03:31,170 --> 00:03:32,838 అలా చెప్పే మీడియా వాళ్లు టీ.ఆర్.పీలు పెంచుకుంటారు. 40 00:03:35,424 --> 00:03:39,553 నా కోసం ఎదురుచూడకుండా పడుకో. మధ్యాహ్నం చాలా కాఫీ తాగాను. 41 00:03:40,637 --> 00:03:41,638 సరే. 42 00:03:47,436 --> 00:03:48,937 …పశ్చిమ తీరానికి వెళ్లండి. 43 00:03:49,021 --> 00:03:51,523 మిస్సోరీ నుండి ఆర్కాన్సాకు, అలాగే తూర్పు దిశగా పెన్సిల్వేనియాకు 44 00:03:51,607 --> 00:03:53,817 ఒక్క ఉదుటున వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. 45 00:03:53,901 --> 00:03:55,402 ఇక ఫిలడెల్ఫియా విషయానికి వస్తే, 46 00:03:55,485 --> 00:03:57,779 ఇది భీభత్సకరమైన తుఫానే కావచ్చు. 47 00:03:57,863 --> 00:04:00,616 స్కుయికిల్ ఎక్స్ ప్రెస్ వైపుకు వెళ్లవద్దని వాహనదారులకు సలహా. 48 00:04:00,699 --> 00:04:03,493 దక్షిణం వైపు నుండి వచ్చే తుఫానుకు సంబంధించిన వార్తలను అందిస్తూనే ఉంటాం, 49 00:04:03,577 --> 00:04:05,996 -ఆ వచ్చే వెచ్చదనం తెలుస్తూనే ఉంటుంది… -దాన్ని ఆపేస్తావా? 50 00:04:06,079 --> 00:04:07,664 అది కొనసాగి… 51 00:04:08,707 --> 00:04:09,875 అబ్బా. లేచాడు. 52 00:04:12,044 --> 00:04:15,130 అప్పుడప్పుడూ వాడి కళ్ళలోకి కళ్లు పెట్టి చూడకుంటే, వాడే నిద్రపోతాడు. 53 00:04:17,925 --> 00:04:19,510 ఉయ్యాలని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? 54 00:04:21,345 --> 00:04:22,596 ఇక్కడైతే వాడికి ఏమీ కాదు. 55 00:04:23,430 --> 00:04:27,059 అంటే, తుఫాను వల్ల వాడికి మెలకువ వస్తే, మనం ఉన్నామని వాడు భయపడుకుండా ఉంటాడు. 56 00:04:28,602 --> 00:04:31,980 -ఒక్క నిమిషం. కిటికీలన్నింటినీ చెక్ చేశావా? -చేశాగా. 57 00:04:32,064 --> 00:04:34,024 వెనుక తలుపు దగ్గర పెద్ద టవల్ పెట్టావా? 58 00:04:34,107 --> 00:04:36,485 -ఎందుకంటే, అక్కడ నీరు లీక్ అవుతుంది. -పెద్ద టవల్ పెట్టాలే. 59 00:04:45,702 --> 00:04:47,871 బేస్మెంట్ గురించి ఆలోచించాలని కూడా నాకు లేదు. 60 00:05:15,190 --> 00:05:17,860 ఇక పార్కులో ఉండటానికి వీలుపడదు. 61 00:05:17,943 --> 00:05:19,278 మమ్మల్ని ఏం చేయమంటావు? 62 00:05:20,237 --> 00:05:22,614 తుఫాను వల్ల ఇక్కడ మీరు ఉండటం కుదరకపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవద్దు. 63 00:05:23,198 --> 00:05:25,909 నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్లలేము. అది సురక్షితం కాదు. 64 00:05:26,827 --> 00:05:28,203 నా మీద నమ్మకం ఉందిగా? 65 00:05:31,874 --> 00:05:33,250 నేను నీ దాసిని. 66 00:05:34,960 --> 00:05:35,794 అయితే వెళ్లిపో. 67 00:05:37,296 --> 00:05:38,589 మిగతావాళ్లని కూడా తీసుకెళ్లు. 68 00:05:40,090 --> 00:05:41,884 నా సందేశాన్ని లోకం ముందు ఉంచు. 69 00:06:31,016 --> 00:06:32,601 సారీ, ఆలస్యమైంది. 70 00:06:32,684 --> 00:06:35,020 డొరోతీ నిద్రపోయే దాకా ఆగి వచ్చా. 71 00:06:35,979 --> 00:06:37,898 అతను ఇంకో వైపుకు రాగలడు కదా. 72 00:06:38,941 --> 00:06:41,068 తనని మనం అక్కడికి తీసుకురావాలని అన్నాడు. 73 00:06:43,111 --> 00:06:45,489 ఆయన తనతో మాట్లాడతాడు, అంతే కదా? 74 00:06:45,572 --> 00:06:48,116 తనతో మాట్లాడి, తనని మార్చేస్తాడు, అంతే కదా? 75 00:06:48,200 --> 00:06:50,702 అంతే. అది తనకే మంచిది. 76 00:06:53,080 --> 00:06:55,249 కానీ నువ్వే తనని ఇక్కడికి తీసుకురావాలి. తను నిన్నే నమ్ముతుంది. 77 00:06:55,332 --> 00:06:58,085 అంత సీన్ లేదు. నా కన్నా నిన్నే నమ్ముతుంది. 78 00:06:58,168 --> 00:06:59,795 నువ్వు తనకి నాన్నలాంటి వాడివి. 79 00:06:59,878 --> 00:07:01,922 కానీ నేను తనని వదిలించుకోవాలని చూస్తున్నానని తనకి తెలుసు. 80 00:07:02,005 --> 00:07:03,590 అయినా తనతో 81 00:07:03,674 --> 00:07:06,260 "హేయ్, అర్ధరాత్రి రెండు గంటలకు బేస్మెంటుకు రా," అని ఎలా చెప్పను? 82 00:07:07,261 --> 00:07:09,847 అదీగాక, నువ్వు అలా అడిగితే, సరసాలాడటం కోసమని తను అనుకుంటుంది. 83 00:07:09,930 --> 00:07:11,098 వావ్. 84 00:07:11,765 --> 00:07:15,894 అబ్బా, ఈ పరిస్థితిని ఇంకా దారుణంగా, నైతికపరగా చండాలంగా చేస్తున్నావుగా. 85 00:07:15,978 --> 00:07:17,271 హా, నువ్వన్నది నిజమే. 86 00:07:18,188 --> 00:07:21,733 మనం తనని జుట్టుపట్టుకొని, మెట్ల మీద నుండి ఈడ్చుకొని తీసుకురావాలి, జూలియన్. 87 00:07:21,817 --> 00:07:24,611 తను పిచ్చిది, తన జీవితంలో సగ భాగం నీ అక్క వెంటపడటానికే సరిపోయింది. 88 00:07:24,695 --> 00:07:26,530 ఈ విషయంలో నాతో కలిసి పని చేస్తావా లేదా? 89 00:07:26,613 --> 00:07:29,074 -తనని నేను తీసుకువస్తా, సరేనా? -మంచిది. 90 00:07:36,832 --> 00:07:38,000 షాన్? 91 00:07:39,626 --> 00:07:40,878 షాన్? 92 00:07:46,717 --> 00:07:47,718 బాబోయ్. 93 00:08:38,018 --> 00:08:41,313 ఈ నీటినంతా శుభ్రం చేస్తావా, లేకపోతే నేల నాశనమవుతుంది. 94 00:08:52,908 --> 00:08:53,909 లియన్. 95 00:08:55,410 --> 00:08:57,454 నీలాంటి దాన్ని నా జీవితంలో నేను కలవనే లేదు. 96 00:08:58,413 --> 00:09:00,541 ఒక్కోసారి నీలో నాకు నేనే కనిపిస్తుంటాను. 97 00:09:04,294 --> 00:09:06,004 ఆ ల్యాంప్ కింద కూడా తుడువు. 98 00:09:08,549 --> 00:09:12,344 మనిద్దరికీ… మొండితనం ఎక్కువ. 99 00:09:13,637 --> 00:09:14,847 అసలు పట్టు విడవం. 100 00:09:18,308 --> 00:09:20,519 అన్ని సమయాల్లోనూ అది మంచిది కాదు. 101 00:09:22,771 --> 00:09:25,399 నాలో ఏదో తప్పు ఉందన్నట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. 102 00:09:26,733 --> 00:09:28,610 అంటే, నన్ను వదిలించుకోవాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. 103 00:09:30,988 --> 00:09:33,448 నేనేం చేసినా నీకు ఆనందం కలగాలనే చేశా. 104 00:09:34,199 --> 00:09:37,202 నాకు ఆనందం కలిగించడం నీ పని కాదు. ముందు నుంచీ కూడా. 105 00:09:39,746 --> 00:09:42,249 నా పట్ల ప్రేమ చూపడం ఎందుకు నీకంత కష్టం? 106 00:09:42,958 --> 00:09:44,960 లియన్. 107 00:09:45,711 --> 00:09:51,091 లోకంలో చాలా మంది జనాలున్నారు. నాకొక్కదానికే ఎందుకు ప్రేమ ఇవ్వాలనుకుంటున్నావు? 108 00:09:52,676 --> 00:09:55,137 షాన్, ఇంకా జూలియన్ కూడా నన్ను అసహ్యించుకుంటున్నారు. 109 00:09:55,721 --> 00:09:58,557 నేను రాకాసిని కాదని నువ్వు వాళ్లకి చెప్పగలవా! 110 00:10:02,519 --> 00:10:05,063 -నీ బ్రేస్ విషయంలో సాయపడనా? -వద్దు. 111 00:10:05,147 --> 00:10:06,815 పర్వాలేదు. దాన్ని నేను తీసేయగలను… 112 00:10:06,899 --> 00:10:08,859 వద్దు. ఇప్పుడు నాకు దీని అవసరం లేదులే. 113 00:10:08,942 --> 00:10:11,445 -కానీ డాక్టర్ అన్నాడు… -అబ్బా, లియన్, ఇక ఆపు. 114 00:10:11,528 --> 00:10:14,281 ఈ ఒక్క విషయంలో నాకు నచ్చినట్టు ఉండనివ్వు. 115 00:10:15,824 --> 00:10:17,910 మాట్లాడుకుంటూ ఉందాంలే. 116 00:10:18,493 --> 00:10:21,205 నీకు పరిస్థితులను వేరే విధంగా ఎలా చూడాలో అర్థమయ్యేలా చెప్తాను. 117 00:11:56,675 --> 00:11:58,844 నీ ప్రతాపం ఇంతేనా? 118 00:12:10,063 --> 00:12:12,149 ఏం చేస్తున్నావు? దిగు! 119 00:12:21,658 --> 00:12:23,744 ఇదంతా నా కోసమే, జూలియన్. 120 00:12:26,914 --> 00:12:28,332 నీకు అర్థం కావట్లేదా? 121 00:12:28,415 --> 00:12:31,960 ఈ తుఫాను అంతా నా కోసమే! 122 00:12:32,044 --> 00:12:35,297 నన్ను ఓడించగలనని పైవాడు అనుకుంటున్నాడు, కానీ ఓడించడం అతని తరం కాదు. 123 00:12:36,089 --> 00:12:37,216 ఎందుకంటే, నేనే గెలిచాను. 124 00:12:39,134 --> 00:12:41,136 కిందికి రా. నేను నీకు ఒకటి చూపించాలి. 125 00:12:45,015 --> 00:12:46,266 రాను. 126 00:12:49,603 --> 00:12:50,604 షాన్! 127 00:12:51,438 --> 00:12:52,439 జూలియన్! 128 00:12:58,111 --> 00:12:59,321 షాన్! 129 00:13:00,280 --> 00:13:02,616 దయచేసి నన్ను వదిలేయండి. 130 00:13:28,141 --> 00:13:30,769 -ఏమీ కనిపించట్లేదు. -ముందుకు నడుస్తూ ఉండు. 131 00:13:56,461 --> 00:13:58,130 హలో, లియన్. 132 00:14:02,176 --> 00:14:03,594 ఎవరు వీళ్లంతా? 133 00:14:04,970 --> 00:14:06,471 ఇక మీరిద్దరూ వెళ్లిపోండి. 134 00:14:10,225 --> 00:14:11,310 మంట ఎందుకు వెలిగించి ఉంది? 135 00:14:14,646 --> 00:14:15,856 అది మనకి అనవసరం. పద. 136 00:14:16,899 --> 00:14:18,025 పద. మన పని అయిపోయింది. 137 00:15:01,360 --> 00:15:02,778 నేను వస్తున్నా, బంగారం. 138 00:15:04,530 --> 00:15:05,989 వస్తున్నా, కన్నా. 139 00:15:13,455 --> 00:15:18,168 వచ్చేశా, కన్నా. ఏం కాదు. అమ్మ వచ్చేసిందిగా. 140 00:15:26,301 --> 00:15:28,846 మన పని మనం చేశాం. అయిపోయింది. తన పీడా విరగడైంది. 141 00:15:33,225 --> 00:15:37,563 మాకు కావాల్సింది నువ్వు అసౌకర్యంగా ఉండటం కాదు, మా మాట వినడం. 142 00:15:44,361 --> 00:15:45,529 సరే మరి. 143 00:15:46,321 --> 00:15:48,365 ఈ తాళ్లు నిన్ను ఆపగలవని… 144 00:15:49,992 --> 00:15:54,788 మనం నటించనవసరం లేదులే. 145 00:15:56,164 --> 00:15:58,333 నువ్వెవరో మనిద్దరికీ తెలుసు. 146 00:16:05,048 --> 00:16:07,176 నేను నీకు ఎప్పుడైనా ప్రేమ చూపించి ఉంటే, 147 00:16:08,677 --> 00:16:10,888 దయచేసి ఆ క్షణాలని తలచుకో. 148 00:16:11,680 --> 00:16:15,893 నువ్వు మొదట ఈ ఇంటికి ప్రేమతో వచ్చావు, 149 00:16:16,768 --> 00:16:19,771 కానీ అది స్వార్థపూరితమైన ప్రేమ. 150 00:16:20,564 --> 00:16:24,985 దాని వల్ల మా అందరికీ చావు, వినాశనం తప్ప ఒరిగిందేమీ లేదు. 151 00:16:26,153 --> 00:16:30,949 ఈ లోకంలో చెడు ఏం జరిగినా, దానికి కారణం ఆయనే, నేను కాదు. 152 00:16:31,658 --> 00:16:33,243 నువ్వు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. 153 00:16:34,912 --> 00:16:37,998 ఆయన దృష్టి మనిద్దరి మీదనే ఉంటుంది అనుకోవడం పిచ్చితనం. 154 00:16:39,249 --> 00:16:43,212 ఆయన అంతా నియంత్రణలో ఉంచుతాడు, దాని తీరుతెన్నులు అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. 155 00:16:43,795 --> 00:16:46,256 మనం ఆయనకి సేవలు అందించగలం అంతే. 156 00:16:46,840 --> 00:16:49,718 నా చిన్నప్పట్నుంచీ ఆ సోదే చెప్తున్నావు. 157 00:16:51,637 --> 00:16:53,639 దానిపై నాకు నమ్మకం పోయింది. 158 00:16:54,640 --> 00:16:57,351 నేను ఆయనకు సేవలందించను. ఎప్పటికీ అందించను. 159 00:16:58,810 --> 00:17:02,481 అయితే నువ్వు నిజంగానే గాడి తప్పావు. 160 00:17:11,281 --> 00:17:12,366 ఏడవడం ఆపు. 161 00:17:12,950 --> 00:17:17,119 కన్నీళ్ళు ఆగిపోయేదాకా ఏడుస్తూనే ఉంటాను, 162 00:17:17,204 --> 00:17:19,080 ఎందుకంటే ఈ ప్రపంచం నాశనమైపోయింది. 163 00:17:19,665 --> 00:17:20,999 పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. 164 00:17:22,334 --> 00:17:25,963 ఇది ఆయనకి నచ్చే ప్రపంచం కాదు, కానీ జీవితం అనేది మామూలుగానే సాగిపోతుంది. 165 00:17:26,046 --> 00:17:28,799 సాగదు. సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. 166 00:17:29,550 --> 00:17:31,009 ఓసారి చుట్టూ జరిగేవాటిని గమనించు. 167 00:17:31,802 --> 00:17:34,054 నువ్వు ఉండకూడదు. 168 00:17:34,972 --> 00:17:41,186 నువ్వుంటే భూమి మీద గాయం లాంటిదానివి, నువ్వు ఉంటే లోకానికే ప్రమాదకరం. 169 00:17:41,270 --> 00:17:45,482 నువ్వు ప్రేమించే డొరోతీకి, ఈ కుటుంబానికి, 170 00:17:45,566 --> 00:17:48,277 నువ్వు రోజూ నరకం చూపిస్తున్నావు. 171 00:17:49,736 --> 00:17:52,447 ఈ రాత్రి వచ్చిన వరద కేవలం ఆరంభం మాత్రమే. 172 00:17:53,782 --> 00:17:57,953 లోకంలో సమతుల్యత తప్పితే, అందరికీ కష్టాలు తప్పవు, 173 00:17:58,036 --> 00:18:00,956 దాన్ని నివారించాలంటే, నువ్వు చనిపోయి 174 00:18:02,332 --> 00:18:04,293 మమ్మల్నందరినీ కాపాడాలి. 175 00:18:29,526 --> 00:18:32,529 నీకు పద్ధతిగా చావును అందించాలనుకున్నాం, 176 00:18:33,822 --> 00:18:35,699 కానీ మాలో ఎవ్వరమూ నిన్ను చంపలేం. 177 00:18:35,782 --> 00:18:41,205 నీ క్రోధం, పట్టుదల అనన్యసామాన్యమైనవి. 178 00:18:42,164 --> 00:18:45,792 నీ ప్రాణం తీయడం ఒకరి వల్లనే అవుతుంది. 179 00:18:47,419 --> 00:18:49,505 అంత శక్తి ఆ ఒక్కరికే ఉంది. 180 00:18:52,549 --> 00:18:53,842 అది నువ్వే. 181 00:18:58,639 --> 00:18:59,723 నా వల్ల కాదు. 182 00:19:00,557 --> 00:19:02,935 కావాలంటే నేను సాయపడతా, చిట్టి తల్లి. 183 00:19:03,936 --> 00:19:06,688 ముందు కళ్లని పొడుచుకొని, ఆ తర్వాత కాళ్లూ, చేతులని పొడుచుకో. 184 00:19:07,814 --> 00:19:11,902 నీకు ఈ కుటుంబం అంటే ఇష్టం అయితే, వాళ్ల మానాన వాళ్లని జీవించనివ్వు. 185 00:19:11,985 --> 00:19:13,654 వాళ్లకి విముక్తి ప్రసాదించు. 186 00:19:15,113 --> 00:19:18,200 వాళ్ల హృదయాల్లో నీ స్థానం ఎప్పటికీ చెరిగిపోదని గుర్తుంచుకో. 187 00:19:21,495 --> 00:19:25,624 అత్యంత మంచి విషయమేంటంటే, దేవుడు నీ పాపాలని, క్రూర స్వభావాన్ని… 188 00:19:27,501 --> 00:19:28,919 మన్నించేస్తాడు. 189 00:19:32,047 --> 00:19:33,632 నేను క్రూరురాలినని ఎవరు అన్నారు? 190 00:19:51,441 --> 00:19:52,442 పద. 191 00:19:55,404 --> 00:19:57,906 ఇంకా ఇక్కడే ఉన్నాం. త్వరగా రండి! 192 00:19:58,699 --> 00:19:59,700 చూసుకో! 193 00:20:01,535 --> 00:20:02,578 వద్దు! 194 00:20:43,327 --> 00:20:44,494 ఇతడిని ఏం చేసుకుంటావో చేసుకో. 195 00:20:53,921 --> 00:20:55,172 ఎవరది? 196 00:21:00,385 --> 00:21:01,803 ప్లాన్ అడ్డం తిరిగిందే. 197 00:21:10,145 --> 00:21:13,315 వద్దు. దాన్ని కిందికి పెట్టేయ్. దాని వల్ల పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. 198 00:21:15,609 --> 00:21:18,070 తను పిచ్చి అమ్మాయి, అంతే. మనం చూసుకోగలంలే. 199 00:21:24,660 --> 00:21:26,245 ఆ ఉరుము విన్నావా? 200 00:21:26,328 --> 00:21:28,497 తుఫానులు తన కోసమే సంభవిస్తున్నాయని తను అంది. 201 00:21:30,916 --> 00:21:34,253 తొక్కేం కాదు. దానికి కారణం గాలి. 202 00:22:02,364 --> 00:22:03,365 అబ్బా. 203 00:22:08,704 --> 00:22:11,623 నీకు మేము చేసిన అన్యాయానికి మమ్మల్ని క్షమించు. 204 00:22:13,876 --> 00:22:17,296 దయచేసి నన్ను వదిలేయ్. ఫోన్ టేబుల్ మీద ఉంది. 205 00:22:18,130 --> 00:22:20,299 షాన్ కోసం 911కి కాల్ చేయాలి కదా. 206 00:23:09,264 --> 00:23:10,766 వద్దు. నా దగ్గరికి రాకు. 207 00:23:16,271 --> 00:23:18,065 -నా దగ్గరికి రాకు! -షాన్! 208 00:23:28,408 --> 00:23:29,409 షాన్! 209 00:23:39,127 --> 00:23:40,587 911. మీ అత్యవసర పరిస్థితి ఏంటి? 210 00:23:40,671 --> 00:23:42,548 ఇక్కడికి రెండు ఆంబులెన్సులని పంపించండి. 211 00:23:43,048 --> 00:23:44,550 9780, స్ప్రూస్ స్ట్రీట్ కి. 212 00:23:46,051 --> 00:23:47,302 అనుకోని ప్రమాదం ఒకటి జరిగింది. 213 00:23:53,267 --> 00:23:54,351 లియన్. 214 00:23:57,396 --> 00:24:01,191 ఏమైంది? షాన్ ఎక్కడ? 215 00:24:02,985 --> 00:24:04,611 ష్. 216 00:24:05,195 --> 00:24:07,155 జెరికో బాగున్నాడో లేదో చూసుకో నువ్వు. 217 00:24:18,208 --> 00:24:19,751 ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని ఆయా అంది. 218 00:24:40,063 --> 00:24:42,482 ఇక నిన్ను ఈ ఇంట్లోకి రానిస్తే ఒట్టు. 219 00:25:29,780 --> 00:25:31,073 ఏం చేశావు? 220 00:25:35,077 --> 00:25:36,954 నేనేం చేయలేదు, మిసెస్ టర్నర్. 221 00:25:39,373 --> 00:25:40,791 ప్రమాదవశాత్తూ, అలా జరిగిపోయింది, అంతే. 222 00:25:42,960 --> 00:25:45,128 ప్రమాదాలు ఎలా జరగవచ్చో నీకు కూడా తెలుసు. 223 00:25:48,465 --> 00:25:50,050 ఇప్పుడు మనిద్దరమూ మిగిలి ఉన్నాం. 224 00:26:24,710 --> 00:26:26,712 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్