1 00:00:07,257 --> 00:00:10,886 కమాండర్ జనరల్, బందీ అయిన టమాక్టీ జూన్ 2 00:00:10,969 --> 00:00:12,846 ఎలా తప్పించుకోగలిగాడో వివరణ ఇవ్వమని మిమ్మల్ని పిలిపించడమైంది. 3 00:00:12,930 --> 00:00:15,307 టమాక్టీ జూన్ నా బందీ కాదు. 4 00:00:15,390 --> 00:00:19,228 -కానీ బాబా వాస్ మీ బందీయే కదా. -బాబా వాస్, రిప్లబిక్ కి శత్రువు. 5 00:00:19,895 --> 00:00:21,355 అతడి మీద విచారణ జరిపి 6 00:00:21,438 --> 00:00:24,608 చట్టానికి అనుగుణంగా వెంటనే మరణ శిక్ష అమలు చేసి ఉండాల్సింది మరి. 7 00:00:24,691 --> 00:00:28,570 మీరే కనుక ఆ పని చేసుంటే, అతనికి టమాక్టీ జూన్ తో పాటు 8 00:00:28,654 --> 00:00:30,280 పరారయ్యే అవకాశమే దక్కి ఉండేది కాదు. 9 00:00:30,364 --> 00:00:32,616 మాంత్రికాంతకుని వద్ద పయాన్ రాణి యొక్క భారీ వ్యూహానికి, 10 00:00:32,698 --> 00:00:36,787 అలాగే వారి సైనిక స్థితిగతులకు సంబంధించి మనకు పనికి వచ్చే 11 00:00:36,870 --> 00:00:38,330 విశ్వసనీయ సమాచారం చాలా ఉండవచ్చు, 12 00:00:38,413 --> 00:00:41,250 అసలు వాళ్లు ఎలా తప్పించుకోగలిగారో మీకు ఏమైనా తెలుసా? 13 00:00:41,792 --> 00:00:45,170 మన భద్రతా వ్యవస్థలో ఎప్పుడూ ఇంతటి ఘోర వైఫల్యం జరగలేదు. 14 00:00:45,754 --> 00:00:48,924 వారికి ఎవరైనా సాయపడి ఉంటారు. ఎవరో మన వాళ్లే. 15 00:00:49,883 --> 00:00:53,053 అయితే మనం ఆ రాజద్రోహిని, లేదా రాజద్రోహులను కనిపెట్టి 16 00:00:53,136 --> 00:00:54,388 ఇంకెవరూ అలా చేయకుండా వారిని శిక్షించాలి. 17 00:00:54,471 --> 00:00:58,308 రాజద్రోహులు ఎవరైనా ఉంటే, నేను తప్పక వారిని కనిపెడతాను. 18 00:00:59,893 --> 00:01:03,730 జనరల్ వాస్, మీరు ఎన్నో ఏళ్ళు ప్రశ్నించలేని చిత్తశుద్ధితో, అలాగే 19 00:01:03,814 --> 00:01:06,859 ఎనలేని శౌర్యంతో ఈ కౌన్సిల్ కి సేవలను అందించారు, 20 00:01:06,942 --> 00:01:09,862 కానీ చూపు తిరిగి వస్తుందనే పుకార్లపై మీరి పెంచుకొన్న అతి నమ్మకాన్ని, 21 00:01:09,945 --> 00:01:14,783 మీ అన్నయ్యపై మీకున్న వ్యక్తిగత కక్షని పక్కన పెట్టడం చాలా ముఖ్యం. 22 00:01:14,867 --> 00:01:16,994 పశ్చిమం వైపు గానైట్ల సైన్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 23 00:01:17,077 --> 00:01:18,579 మిమ్మల్ని మించిన వ్యూహకర్త మాకు ఇంకెవరూ లేరు. 24 00:01:18,662 --> 00:01:22,583 రిపబ్లిక్ కి నిజమైన విపత్తులపై మీరు శ్రద్ధ పెట్టాలి. 25 00:01:23,542 --> 00:01:25,294 మీకు అర్థమైందా? 26 00:01:29,840 --> 00:01:34,761 అవును. అర్థమైంది, సర్. 27 00:01:42,227 --> 00:01:44,354 బాబా వాస్ తో, అలాగే టమాక్టీ జూన్ తో కాంటాక్ట్ లోకి వచ్చిన 28 00:01:44,438 --> 00:01:45,856 ప్రతీ గార్డును నువ్వు ప్రశ్నించాలి. 29 00:01:45,939 --> 00:01:48,192 అందరినీ అడిగాను, సర్. వాళ్ల దగ్గర మనకు పనికివచ్చే సమాచారమేదీ లేదు. 30 00:01:48,275 --> 00:01:52,696 అయితే వాళ్లని మళ్లీ అడుగు. ఎవరోకరు బయటపడతారు. 31 00:01:53,197 --> 00:01:54,198 అలాగే, సర్. 32 00:03:33,005 --> 00:03:35,174 ఎవరది? 33 00:03:36,675 --> 00:03:38,468 -ఏం కాలేదు. -ఓలొమన్? 34 00:03:38,552 --> 00:03:39,553 ఏం పర్వాలేదు. 35 00:03:51,982 --> 00:03:53,317 ఇంకో పీడకలనా? 36 00:03:55,444 --> 00:03:56,695 నీకు అర్థమవ్వడం లేదు. 37 00:03:58,155 --> 00:03:59,740 కలలు చాలా అందంగా ఉన్నాయి. 38 00:04:01,158 --> 00:04:05,746 నేను ప్రపంచాన్ని, నా పిల్లలను చూడగలుగుతున్నాను. 39 00:04:07,706 --> 00:04:10,000 నేను లేచినప్పుడే పీడకల మొదలవుతుంది. 40 00:04:13,003 --> 00:04:15,172 మేము ఇంకా ఇక్కడే ఉన్నాం, నాన్నా. 41 00:04:16,423 --> 00:04:17,673 మేము నిన్ను ఎన్నటికీ విడిచి వెళ్లిపోము. 42 00:04:22,721 --> 00:04:24,598 నాకు చూపు వచ్చే మార్గం ఏమైనా దొరికిందా? 43 00:04:25,307 --> 00:04:28,101 సరైన పరికరాలు ఉంటే అది సాధ్యమే అని నాకు తెలుసు. 44 00:04:29,436 --> 00:04:32,773 నీకు కావలసినది చేయడానికి మన వద్ద యంత్రాలు కానీ, సాంకేతికత కానీ లేదు. 45 00:04:45,077 --> 00:04:47,496 నేను నీకు నేర్పినదంతా మర్చిపోయావా? 46 00:04:51,917 --> 00:04:54,169 నేను ఎంతో శ్రమించి, కష్టపడి ఈ చోటిని నిర్మించాను. 47 00:04:56,338 --> 00:05:00,175 ఎన్ని అడ్డంకులూ, అవాంతరాలు ఎదురైనా నేను పరిరక్షించుకుంటూ వచ్చాను. 48 00:05:02,052 --> 00:05:03,262 మరి ఇప్పుడు నువ్వు... 49 00:05:07,140 --> 00:05:09,184 నువ్వు సవాలుకు తగ్గట్టుగా సన్నద్ధమవ్వాలి. 50 00:05:10,143 --> 00:05:14,481 అసాధ్యంగా అనిపించేదాన్ని నువ్వు సుసాధ్యం చేయాలి. 51 00:05:16,108 --> 00:05:20,320 నువ్వు ప్రతీ క్షణం నాకు చూపు తెప్పించే పని మీదే ఉండాలి, 52 00:05:20,404 --> 00:05:22,823 అప్పుడే నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేయగలను. 53 00:05:24,199 --> 00:05:25,993 ఇది ఒక్కరాత్రికే జరిగిపోయేది కాదు, 54 00:05:27,202 --> 00:05:30,956 అలా అయిపోగలదని నిన్ను నమ్మించడం నా తప్పే. 55 00:05:32,916 --> 00:05:36,336 మనిద్దరమూ ఈ సవాలుకు సన్నద్ధమవ్వాలి. 56 00:05:37,504 --> 00:05:39,173 దానికి ఎంత సమయం పట్టినా పర్వాలేదు. 57 00:05:42,634 --> 00:05:43,844 అలాగే, నాన్నా. 58 00:05:44,928 --> 00:05:45,929 సరే మరి. 59 00:05:47,472 --> 00:05:50,184 ఇప్పుడు, నీ ఉదయం వేళ సమాచారం చెప్పు. 60 00:05:51,351 --> 00:05:52,227 ఇప్పుడా? 61 00:05:52,311 --> 00:05:54,438 మన పని కొనసాగుతూనే ఉంది కదా? 62 00:05:56,690 --> 00:05:57,858 కొనసాగుతూ ఉందిలే, కానీ... 63 00:05:57,941 --> 00:06:02,446 నేను గాయపడి ఉండవచ్చు, కానీ నేను రాజీ పడే ప్రసక్తే లేదు. 64 00:06:02,529 --> 00:06:06,283 నువ్వు కూడా నన్ను అలా చూడకూడదు, లేకపోతే పిల్లలందరూ అలాగే చేస్తారు. 65 00:06:07,034 --> 00:06:08,452 ఇక త్రివాంటియన్లు... 66 00:06:11,997 --> 00:06:14,750 త్రివాంటియన్లు... 67 00:06:14,833 --> 00:06:16,502 వాళ్లకి నా గాయం గురించి తెలియకూడదు. 68 00:06:17,169 --> 00:06:19,505 నా సామర్థ్యాల కారణంగానే వారు నియంత్రణలో ఉంటున్నారు. 69 00:06:19,588 --> 00:06:20,672 నీకు అర్థమైందా? 70 00:06:23,634 --> 00:06:24,635 అర్థమైంది, నాన్నా. 71 00:06:27,137 --> 00:06:28,138 మంచిది. 72 00:06:29,306 --> 00:06:33,810 అయితే... నీ ఉదయం వేళ సమాచారం చెప్పు. 73 00:06:37,648 --> 00:06:42,402 నోనీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లకు పురోగతి సాధించింది. 74 00:06:44,071 --> 00:06:45,489 తెలివైన పిల్ల. 75 00:06:45,739 --> 00:06:48,367 నువ్వు సూచించిన టెక్స్ట్ తో తనకు చెప్పడం మొదలుపెట్టాను. 76 00:06:48,450 --> 00:06:50,661 తనకి అది ఇట్టే అర్థమైపోయింది. 77 00:07:14,268 --> 00:07:17,896 అనుకున్న సమయం కన్నా ముందే వారు వెళ్లిపోయారు. అంటే, ఏదో జరిగి ఉంటుంది. 78 00:07:17,980 --> 00:07:19,773 వారిని వెతికేంత సమయం లేదు. 79 00:07:19,857 --> 00:07:23,402 మనం ముందుగా యువరాణి మాగ్రా కోసం వెతకాలి. 80 00:07:27,531 --> 00:07:30,033 యువరాణి మాగ్రానా? అతనేం అంటున్నాడు? 81 00:07:33,036 --> 00:07:37,499 అతను చెప్పే మాటలే నిజమైతే, మీ అమ్మ, మహారాణికి చెల్లెలు అవుతుంది. 82 00:07:39,918 --> 00:07:44,006 -కేన్ మహారాణికా? అది అసంభవం. -అది నమ్మడం కష్టమని నాకూ తెలుసు. 83 00:07:44,089 --> 00:07:48,135 వాడిని కలిసిన మరుక్షణమే నువ్వు వాడిని చంపలేదు, అది నమ్మడమే కష్టంగా ఉంది. 84 00:07:48,635 --> 00:07:49,970 ఆ ఆలోచన నాకు వచ్చింది. 85 00:07:51,805 --> 00:07:54,558 -ఇది ఉచ్చు కావచ్చు, నాన్నా. -కావచ్చు. 86 00:07:54,641 --> 00:07:57,227 అయినా కానీ మనకి మార్గదర్శిగా అతడిని ఉండనిచ్చావు. ఎందుకు? 87 00:07:58,478 --> 00:08:01,565 త్రివాంటెస్ కి నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చానో, అందుకే. 88 00:08:02,858 --> 00:08:04,401 తను నా భార్య, హనీవా. 89 00:08:04,902 --> 00:08:07,154 ఆమెని తప్ప ఇంకెవరినీ నేను ప్రేమించలేను. 90 00:08:07,237 --> 00:08:09,239 తను బతికే ఉండే అవకాశం రవ్వంత ఉన్నా... 91 00:08:09,323 --> 00:08:10,532 నాకు అర్థమైంది. 92 00:08:14,244 --> 00:08:18,582 కానీ అతను చెప్పేది అబద్ధమైతే, నీతో పాటు నేను కూడా అతడిని చంపేస్తాను. 93 00:08:19,833 --> 00:08:21,210 సరే అని మాటిస్తున్నాను. 94 00:08:22,753 --> 00:08:27,132 అతను చెప్పేది అబద్ధం కాకపోతే, అమ్మ పయాన్ యువరాణి అన్నమాట. 95 00:08:27,216 --> 00:08:28,383 అదెలా? 96 00:08:30,219 --> 00:08:31,553 నాకు కూడా తెలీదు. 97 00:08:32,971 --> 00:08:35,140 మీ అమ్మ ఆచూకీ కనిపెట్టాక, అప్పుడు మీ అమ్మే చెప్తుందనుకుంటా. 98 00:08:36,433 --> 00:08:37,433 పద. 99 00:08:50,489 --> 00:08:52,699 మూడు గుర్రాలు, రెండు కుక్కలు. 100 00:08:53,992 --> 00:08:56,036 -త్రివాంటియన్లా? -మాంత్రికాంతకులు. 101 00:08:56,537 --> 00:08:57,746 వాళ్లు నా కొడుకును ఏమైనా చేస్తే... 102 00:08:57,829 --> 00:08:59,957 మాంత్రికాంతకులు మహారాణి చెప్పినట్టు నడుచుకుంటారు. 103 00:09:00,040 --> 00:09:02,751 మాగ్రా కనుక మహారాణి వద్ద ఉంటే, అప్పుడు మాగ్రా పిల్లలను 104 00:09:02,835 --> 00:09:05,045 తీసుకురమ్మని వారికి ఆదేశాలిచ్చి ఉంటుంది. 105 00:09:05,671 --> 00:09:07,756 -కానీ మహారాణి వాళ్లని దహింపజేస్తుంది. -లేదు. 106 00:09:08,340 --> 00:09:10,717 మహారాణి కొత్త శాశనాన్ని ప్రకటించిందని విన్నాను. 107 00:09:10,801 --> 00:09:13,512 చూపున్నవారిని ఇకపై మాంత్రికుల్లా చూడకూడదట. 108 00:09:15,222 --> 00:09:16,473 అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? 109 00:09:16,557 --> 00:09:20,269 తూర్పుకు. దగ్గర్లో మాంత్రికాంతకుల శిబిరం ఉంది. 110 00:09:20,769 --> 00:09:22,521 మహారాణి ఎక్కడ నివాసం ఉంటుందో వాళ్లకి తెలుస్తుంది. 111 00:09:24,773 --> 00:09:25,607 పెన్సా. 112 00:09:25,691 --> 00:09:26,859 ఏంటి? 113 00:09:27,359 --> 00:09:29,069 వాళ్ళు కొఫూన్ ని పెన్సాకి తీసుకెళ్లారు. 114 00:09:30,195 --> 00:09:32,406 -వాడు నీకేమైనా గుర్తు వదిలి వెళ్లాడా? -అవును. 115 00:09:32,489 --> 00:09:33,407 పెన్సా 116 00:09:33,490 --> 00:09:34,658 పెన్సా. 117 00:09:35,158 --> 00:09:39,746 కట్టుదిట్టమైన భద్రతతో అనుకూల ప్రదేశంలో ఉంటుంది, అది సుసంపన్నమైన ప్రదేశం. 118 00:09:40,372 --> 00:09:43,584 మహారాణి కొత్త రాజధానిని ప్రకటించి ఉంటుంది. 119 00:10:02,561 --> 00:10:06,148 అంత అత్యవసరమైన విషయమేంటి, హార్లన్ ప్రభువా? 120 00:10:06,231 --> 00:10:08,025 మిమ్మల్ని కంగారు పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు, 121 00:10:08,108 --> 00:10:12,029 కానీ మహారాణి భద్రతకు ముప్పు ఉన్నప్పుడు, 122 00:10:12,112 --> 00:10:14,990 తర్వాత అజాగ్రత్తగా ఉన్నానని బాధపడే కన్నా అతి జాగ్రత్త పడ్డానని బాధపడటమే మేలు. 123 00:10:16,033 --> 00:10:18,410 మీరు చెప్పేది ఏదైనా ఒక ప్రసంగంతోనే మొదలుపెట్టి చెప్తారా? 124 00:10:19,745 --> 00:10:21,747 ఇది ఎక్కువ సేపు కాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను. 125 00:10:23,081 --> 00:10:25,250 దీన్ని మీరు నేరుగా వినాలనుకుంటున్నాను. 126 00:10:26,293 --> 00:10:29,922 కానీ మీరు అస్సలు ఏమాత్రం శబ్దం చేయకూడదు. 127 00:10:30,923 --> 00:10:33,509 మీరు ఇక్కడ ఉన్నారని అతనికి తెలిస్తే, అతను ఉన్నది ఉన్నట్టు చెప్పడు. 128 00:10:34,968 --> 00:10:37,221 నేను బొమ్మలా పడుంటాను. 129 00:10:47,314 --> 00:10:52,945 హార్లన్ ప్రభువా, ఈయన జెచన్, మిమ్మల్ని కలవాలనుకున్నది ఈయనే. 130 00:10:53,445 --> 00:10:54,947 ధన్యవాదాలు, కెర్రిగన్. 131 00:11:06,667 --> 00:11:08,544 ఈ గదిలో ఇంకెవరైనా ఉన్నారా? 132 00:11:09,294 --> 00:11:12,714 నా కింద పని చేసే అత్యంత విశ్వాసపాత్రమైన వ్యక్తి ఉన్నారు. 133 00:11:13,674 --> 00:11:15,467 మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, జెచన్? 134 00:11:16,969 --> 00:11:18,095 కంజువా, సర్. 135 00:11:18,595 --> 00:11:21,598 మీరు కంజువాలో అంతఃపురానికి ద్వారపాలకులుగా ఉన్నారా? 136 00:11:22,307 --> 00:11:23,851 అవును, సర్. 20 ఏళ్లకు పైగా పనిచేశాను. 137 00:11:25,143 --> 00:11:28,063 మరి త్రివాంటియన్లు దాడి చేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? 138 00:11:30,858 --> 00:11:33,026 కంజువా కొట్టుకుపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. 139 00:11:34,778 --> 00:11:38,949 కానీ విషయమేమిటంటే, అస్సలు దాడి అంటూ ఏమీ జరగలేదు. 140 00:11:40,993 --> 00:11:43,537 అయితే ఆ ఆనకట్ట ఎలా ధ్వంసమైంది? 141 00:11:44,371 --> 00:11:46,123 నాకు కూడా ఖచ్చితంగా తెలీదు, సర్. 142 00:11:46,206 --> 00:11:49,418 కానీ అసలు త్రివాంటియన్లు రాలేదని మాత్రం నాకు బాగా తెలుసు. 143 00:11:50,878 --> 00:11:52,713 నాకు అర్థం కావడం లేదు. 144 00:11:55,007 --> 00:11:56,800 అన్నిరోజుల్లా అది కూడా మామూలు రోజే. 145 00:11:58,010 --> 00:11:59,428 పక్షుల కిలకిలలు, గాలులు. 146 00:12:00,554 --> 00:12:03,307 కానీ త్రివాంటియన్ల దాడి శబ్దాలు మాత్రం నాకు అస్సలు వినబడనేలేదు. 147 00:12:03,390 --> 00:12:04,766 యుద్ధం తాలూకు అరుపులు లేవు. 148 00:12:07,060 --> 00:12:12,357 మరి దానికి కారణం త్రివాంటియన్లు కాకపోతే, ఇంకెవరు అయ్యుంటారు? 149 00:12:18,197 --> 00:12:20,407 మీరు అర్థం చేసుకోవాలి, సర్. 150 00:12:20,490 --> 00:12:24,494 మా నాన్న, ఇంకా వాళ్ల నాన్న కూడా కంజువాలో ద్వారపాలకులుగా పని చేశారు. 151 00:12:24,578 --> 00:12:26,788 మేము తరతరాల నుండి రాజవంశానికి సేవలు అందిస్తూ వస్తున్నాం. 152 00:12:26,872 --> 00:12:28,332 నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. 153 00:12:35,464 --> 00:12:36,548 పర్వాలేదు. 154 00:12:37,382 --> 00:12:39,176 మీరు ఇక్కడికి ఏం చెప్పాలని వచ్చారో, అది చెప్పేయండి, సైనికుడా. 155 00:12:43,305 --> 00:12:48,393 నాకు ఆ భవనాలు, వాటిలోని దారులు, ఎవరు ఎక్కడికి వెళ్లగలరని బాగా తెలుసు. 156 00:12:48,477 --> 00:12:51,772 నాకు తెలిసి, నదిలోని నీటిని విడుదల చేసి ఉండగల ఏకైక మనిషి... 157 00:12:55,400 --> 00:12:57,236 మహారాణే అయ్యుంటుంది. 158 00:13:59,339 --> 00:14:02,050 హార్లన్ ప్రభువు, మీరు ఇలాంటివాటిని చాలా బాగా చేస్తారే. 159 00:14:03,051 --> 00:14:05,095 ఇలాంటి మాటలను... 160 00:14:06,180 --> 00:14:08,765 మనం పట్టించుకోకపోతే, అవి దావాగ్నిలా వ్యాపిస్తాయి. 161 00:14:10,726 --> 00:14:13,478 కంజువా విషయంలో మీరు చెప్పింది నిజం కాదని ప్రజలకు అనుమానం కలిగితే, 162 00:14:14,188 --> 00:14:16,690 మీరు చెప్పిన చూపు గల బిడ్డ విషయాన్ని, అలాగే దేవుడు మిమ్మల్ని ఆదేశించారని 163 00:14:17,191 --> 00:14:19,026 మీరు చెప్పిన విషయాన్ని కూడా వాళ్ళు అనుమానిస్తారు. 164 00:14:21,028 --> 00:14:22,154 మొత్తాన్ని అనుమానిస్తారు. 165 00:14:26,325 --> 00:14:28,577 అలా జరగకుండా మీరు చూసుకుంటారు. 166 00:14:30,329 --> 00:14:32,748 నా మహారాణికి అది మంచిది కాకపోతే ఆ మాత్రం నేను చేయలేనా. 167 00:14:33,248 --> 00:14:36,376 అలాగే, నా సొంత భార్య యొక్క అక్కకే ఇలా జరిగితే 168 00:14:37,085 --> 00:14:39,421 ఇంకెంత జాగరూకతగా ఉండగలనో అని కూడా మీరు ఆలోచించండి. 169 00:14:43,008 --> 00:14:44,676 మీకు ఒక అత్యవసర సందేశం, మహారాణి. 170 00:14:46,595 --> 00:14:47,679 రా. 171 00:15:15,207 --> 00:15:17,876 నిశ్చింతగా ఉండండి, హార్లన్, మీరు కోరుకున్నవారితోనే మీకు పెళ్లవుతుంది. 172 00:15:39,523 --> 00:15:44,027 సిబెత్, ఇప్పుడు వద్దు. ఇప్పుడు నీతో వాదులాడే ఓపిక నాకు లేదు. 173 00:15:44,111 --> 00:15:46,488 శాంతించు, చెల్లీ. నేను శుభవార్తతో వచ్చాను. 174 00:15:47,698 --> 00:15:49,491 కొఫూన్ ఆచూకీ తెలిసింది. 175 00:15:50,868 --> 00:15:53,704 ఇప్పుడు నా సైనికులు అతడిని వెంటబెట్టుకొని ఇక్కడికే వస్తున్నారు. 176 00:15:53,787 --> 00:15:56,832 ఏంటి? ఎప్పుడు వస్తారు? 177 00:15:56,915 --> 00:15:59,168 హనీవా మరియు బాబా వాస్ సంగతేంటి? 178 00:15:59,751 --> 00:16:01,461 వాళ్ళ ఆచూకీ మాత్రం తెలియలేదు. 179 00:16:02,880 --> 00:16:03,964 అది అర్థవంతంగా లేదు. 180 00:16:04,047 --> 00:16:06,425 ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతను అందరూ ఒకే చోట ఉండేలా చూసుకుంటాడు. 181 00:16:07,467 --> 00:16:09,928 అలా ఒకే చోట ఉండేలా అతను చూసుకోలేకపోతే తప్ప. 182 00:16:11,805 --> 00:16:14,474 ఇప్పుడు కొఫూన్ మన దగ్గరే ఉంటాడు కాబట్టి, 183 00:16:14,558 --> 00:16:17,186 మనం అతని భద్రత గురించి ఆలోచించాల్సి ఉంటుంది. 184 00:16:17,686 --> 00:16:18,562 భద్రతనా? 185 00:16:18,645 --> 00:16:22,858 నువ్వే చూశావు కదా, జనాలు కొత్త విధానానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. 186 00:16:24,193 --> 00:16:26,820 బూట్స్ విషయంలో నువ్వు ఇంతలా ఆందోళన పడలేదే. 187 00:16:28,780 --> 00:16:29,990 బూట్స్, దారిన పోయే ఒక దానయ్య. 188 00:16:30,866 --> 00:16:32,659 కేవలం నీ బిడ్డకు తండ్రి, అంతేనా? 189 00:16:36,163 --> 00:16:37,247 ఏంటి? 190 00:16:40,250 --> 00:16:42,794 నీ గుండె వేగంగా కొట్టుకోవడం నాకు వినిపిస్తోంది, సిబెత్. 191 00:16:45,631 --> 00:16:47,299 కానీ నీది మాత్రమే వినిపిస్తోంది. 192 00:16:50,177 --> 00:16:51,428 బిడ్డ. 193 00:16:53,180 --> 00:16:54,806 బిడ్డ పోయింది. 194 00:16:57,935 --> 00:17:01,396 సిబెత్. నేను చాలా చింతిస్తున్నాను. 195 00:17:37,349 --> 00:17:41,603 నీ బిడ్డ వస్తున్నాడు, కానీ నా బిడ్డ లోకంలోకే రాకూడదని అనుకున్నాడు. 196 00:17:44,022 --> 00:17:46,692 దీని వలన మన పరిస్థితి ఇంకాస్త క్లిష్టతరం అవుతుంది. 197 00:17:49,236 --> 00:17:51,989 ఇప్పటికే చూపున్న పిల్లలకు రక్షణ మాట అటుంచితే, 198 00:17:52,489 --> 00:17:54,950 నా కడుపులో బిడ్డ లేదని నలుగురికీ తెలిస్తే, ఆ రక్షణ అనే విషయాన్ని 199 00:17:55,033 --> 00:17:56,910 మనం పూర్తిగా మర్చిపోవచ్చు. 200 00:17:56,994 --> 00:17:59,162 కొఫూన్ భద్రత విషయంలో గ్యారంటీ ఉండదు. 201 00:17:59,872 --> 00:18:02,082 నాకు ఈ సంభాషణ అర్థమవ్వడం లేదు. 202 00:18:02,165 --> 00:18:05,335 -నువ్వు నా కొడుకును బెదిరిస్తున్నావా? -కాదు, జాగ్రత్తపడుతున్నాను. 203 00:18:05,419 --> 00:18:08,005 వాడిని కాపాడుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. 204 00:18:08,755 --> 00:18:13,218 కానీ ప్రజలు నాపై తిరుగుబాటు చేస్తే, మనపై తిరుగుబాటు చేస్తే, 205 00:18:14,178 --> 00:18:16,221 వాడిని కాపాడటానికి ఎవరూ ఉండరు. 206 00:18:17,306 --> 00:18:18,765 ఇదంతా హార్లన్ విషయం గురించి చెప్తున్నావు అన్నమాట. 207 00:18:20,142 --> 00:18:24,271 హార్లన్ తో బంధం కలుపుకుంటే, మనకి కేంద్ర సైన్యంపై పట్టు పెరుగుతుంది, 208 00:18:24,354 --> 00:18:27,691 అప్పుడు తిరుగుబాటు చేసే ఆలోచనే జనాలకు రాదు. 209 00:18:27,774 --> 00:18:31,403 ఎందుకు ఈ విషయంలో అంత పట్టుబడుతున్నావు? ఏం దాస్తున్నావు? 210 00:18:36,950 --> 00:18:39,620 కంజువా సంఘటనలో అందరూ చనిపోలేదు. 211 00:18:42,206 --> 00:18:44,833 -అది అందరికీ తెలిస్తే... -ఖచ్చితంగా తెలుస్తుంది. 212 00:18:44,917 --> 00:18:48,962 ఒకవేళ జనాల్లో ఏదైనా అలజడి మొదలైతే, దాన్ని అణచివేయడానికి మన దగ్గర 213 00:18:49,046 --> 00:18:51,256 అంత అధికారం ఉంటుందా, ఉండదా అనేదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. 214 00:18:52,716 --> 00:18:58,138 హార్లన్ హోదాలో ఉండే వ్యక్తి, అతని అవసరాన్ని బట్టి, 215 00:18:58,222 --> 00:18:59,890 నిప్పులు కురిపించగలడు, లేదా పూలు కూడా కురిపించగలడు. 216 00:18:59,973 --> 00:19:03,727 ఇప్పుడు అతనికి కావాల్సింది నువ్వు. 217 00:19:06,730 --> 00:19:09,691 చెల్లి. నిన్ను నేను ఏం చేయమని అడుగుతున్నానో నాకు తెలుసు. 218 00:19:10,192 --> 00:19:12,402 -నేను అడిగేదాన్ని కాదు, కానీ... -కాస్త... కాస్త... 219 00:19:34,925 --> 00:19:35,926 సరే. 220 00:19:39,388 --> 00:19:40,556 సరే. 221 00:19:40,639 --> 00:19:46,770 ఈ నాటకానికి నేను ఒప్పుకుంటాను, కానీ ఇది కేవలం అవసరం కోసం చేసుకొన్న 222 00:19:46,854 --> 00:19:49,398 ఒప్పందమని, అంతకు మించి ఏం కాదని హార్లన్ అంగీకరించాలి. 223 00:19:52,651 --> 00:19:54,361 అన్ని వివాహ బంధాలు అంతే కదా. 224 00:20:21,513 --> 00:20:24,933 అమ్మ యువరాణి అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. 225 00:20:26,101 --> 00:20:28,729 మాగ్రా కేన్ కి పసి వయస్సు నుండే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. 226 00:20:28,812 --> 00:20:30,647 తన తండ్రి లక్షణాలనే పుణికి పుచ్చుకుంది. 227 00:20:32,191 --> 00:20:34,193 అయినా తనని చంపడానికి నువ్వు పూనుకున్నావు. 228 00:20:34,276 --> 00:20:35,277 లేదు. 229 00:20:35,360 --> 00:20:39,573 జెర్లామరెల్ ని, అతని సంతానాన్ని కనిపెట్టడం మాత్రమే నా కర్తవ్యం. 230 00:20:40,365 --> 00:20:42,784 మాగ్రా చనిపోయిందని అందరినీ నమ్మించారు. 231 00:20:44,995 --> 00:20:48,290 -మనం ఇక్కడ కాసేపు విశ్రమించాలి. -ఇప్పుడే కదా మనం ప్రయాణం ఆరంభించింది. 232 00:20:48,790 --> 00:20:52,085 కొండల మధ్య ఉండే దారి గుండా పోవడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. 233 00:20:53,003 --> 00:20:54,630 మీ నాన్నకు విశ్రాంతి అవసరం. 234 00:20:55,130 --> 00:20:56,882 నా తరఫున నువ్వేమీ మాట్లాడనక్కర్లేదు, మాంత్రికాంతకా. 235 00:20:57,382 --> 00:20:59,384 సరే, నేను నా కోసమే చెప్తున్నాను. 236 00:21:00,010 --> 00:21:03,388 నీలాగే, నాకూ రక్తం పోయింది. నీలాగే, నేను కూడా సరిగ్గా తిని చాలా రోజులైంది. 237 00:21:03,472 --> 00:21:05,474 నీలాగా నన్ను సంకెళ్లతో కట్టి, నా వీపును విమానం మోత మోగించకపోయినా... 238 00:21:05,557 --> 00:21:06,767 టమాక్టీ. 239 00:21:10,771 --> 00:21:14,358 -నీకేం కనిపిస్తోంది, బంగారం? -దైవెముకతో చేసిన పంజరాలు. 240 00:21:15,359 --> 00:21:17,402 -అబ్బా. -ఏమైంది? 241 00:21:18,195 --> 00:21:19,530 ఇది బానిస వర్తకులు ఆవాసం. 242 00:21:20,280 --> 00:21:23,534 -నీకు ఈ చోటు ఇదివరకే తెలుసా? -లేదు, తెలీదు. 243 00:21:23,617 --> 00:21:25,410 టమాక్టీ, మనం త్వరగా వెళ్లిపోవాలి. పద. 244 00:21:25,494 --> 00:21:27,829 నాన్నా, ఏం పర్వాలేదు. ఇక్కడికి ఎవరూ రావడం లేదు. 245 00:21:29,540 --> 00:21:30,791 వాళ్లు ఇక్కడే ఉన్నారు. 246 00:21:35,754 --> 00:21:37,464 ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. 247 00:21:38,590 --> 00:21:40,092 నమస్తే, మిత్రమా. 248 00:21:41,343 --> 00:21:43,679 మేము అనుకోకుండా మీ ప్రాంతానికి వచ్చుంటే, మమ్మల్ని మన్నించు. 249 00:21:44,346 --> 00:21:47,307 మేము ప్రాచ్య కొండల అడుగు భాగాలకు వెళ్తున్నాం, అంతే. 250 00:21:47,891 --> 00:21:50,102 అక్కడ మీకేం పని? 251 00:21:50,894 --> 00:21:52,688 యూరీ పశు సంతకు వెళ్తున్నాం. 252 00:21:56,275 --> 00:21:57,401 మీరు వెళ్లవచ్చు. 253 00:21:57,901 --> 00:21:59,528 ధన్యవాదాలు. 254 00:22:04,032 --> 00:22:05,576 నువ్వు కాదు, అమ్మాయి. 255 00:22:05,659 --> 00:22:06,743 నాన్నా! 256 00:22:24,094 --> 00:22:25,095 నాన్నా! 257 00:22:30,684 --> 00:22:33,770 నీకు మర్యాద నేర్పాలి, అమ్మాయి. 258 00:23:44,132 --> 00:23:46,718 ఎవరక్కడ? మాట్లాడండి! 259 00:23:46,802 --> 00:23:49,263 శాంతించు, బాబా. నీకు ఏం ప్రమాదం లేదు. 260 00:23:49,346 --> 00:23:50,347 ప్యారిస్! 261 00:23:50,430 --> 00:23:51,431 హనీవా! 262 00:23:54,518 --> 00:23:57,396 -ప్యారిస్. మా కోసం పోరాడిందెవరు? -బాబా. 263 00:23:57,479 --> 00:24:00,065 ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లాక వివరంగా చెప్తాను. 264 00:24:00,148 --> 00:24:02,693 -కొఫూన్ ఎక్కడ? -కొఫూన్ పెన్సాకి వెళ్లాడు. 265 00:24:02,776 --> 00:24:04,444 నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 266 00:24:04,945 --> 00:24:06,280 మాగ్రా బతికే ఉంది. 267 00:24:06,363 --> 00:24:07,781 -నీకు ఆ విషయం తెలిసిందా? -అవును. 268 00:24:08,991 --> 00:24:10,534 నువ్వు కూడా కొఫూన్ తో పాటు వెళ్లుండాల్సింది, 269 00:24:10,617 --> 00:24:13,579 వెళ్లుంటే, ఇప్పుడు నీ పరిస్థితి ఏమయ్యుండేది, బండోడా? 270 00:24:13,662 --> 00:24:15,038 -సరే ఇక బయలుదేరుదాం పద. -లేదు. 271 00:24:15,122 --> 00:24:16,665 ప్రయాణం చేసే స్థితిలో నువ్వు లేవు. 272 00:24:17,165 --> 00:24:19,251 నీ గొంతులో నాకు తీవ్రమైన బాధ తెలుస్తోంది. 273 00:24:19,334 --> 00:24:22,171 మనం ఈ ప్రయాణం చేయాలంటే, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, కోలుకోవాలి. 274 00:24:22,254 --> 00:24:23,255 బాబా వాస్. 275 00:24:25,841 --> 00:24:26,967 ప్యారిస్. ఆగు. 276 00:24:27,050 --> 00:24:28,260 -టమాక్టీ జూన్. -ప్యారిస్. 277 00:24:29,803 --> 00:24:31,972 మాంత్రికాంతకుల జనరల్. 278 00:24:32,055 --> 00:24:33,348 భలే దొరికాడు. 279 00:24:33,432 --> 00:24:35,893 వీడిని చంపాక, వీడి చెవులను నేను విజయచిహ్నంగా ఉంచుకుంటాను. 280 00:24:35,976 --> 00:24:37,895 లేదు. మాకు అతని సాయం కావాలి. 281 00:24:38,645 --> 00:24:40,814 అతనే లేకపోతే, మేము త్రివాంటెస్ నుండి బయటపడేవాళ్ళమే కాదు. 282 00:24:40,898 --> 00:24:43,567 -అతను ఇప్పుడు మాంత్రికాంతకుడు కాదు. -అదే నిజమైనా కూడా... 283 00:24:43,650 --> 00:24:48,280 అతను రాణి సైనికుల జాడ కనిపెట్టగలడు. మాగ్రాని కనిపెట్టడంలో సాయపడుతున్నాడు. 284 00:24:48,363 --> 00:24:50,699 మేము మా నివాసానికి ఒక మాంత్రికాంతకుడిని తీసుకుపోలేము. 285 00:24:50,782 --> 00:24:53,869 మేమేమీ మీ దగ్గరికి రావడం లేదు. మేము పెన్సాకి వెళ్తున్నాం. 286 00:24:53,952 --> 00:24:58,665 హనీవా, మీ నాన్నకి విశ్రాంతి అవసరం. ఇప్పుడు కూడా, అతని స్థితి ఏం బాగాలేదు. 287 00:24:59,750 --> 00:25:00,751 నాన్నా. 288 00:25:04,213 --> 00:25:05,464 మీ నివాసం ఎక్కడ ఉంది? 289 00:25:05,964 --> 00:25:08,175 ఎక్కడున్నా అది అనవసరం. మనం నేరుగా పెన్సాకి వెళ్తున్నాం. 290 00:25:08,675 --> 00:25:11,136 బాబా, మేము దగ్గర్లోనే ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాం. 291 00:25:11,762 --> 00:25:14,473 ఈరాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకో. అక్కడి నుండే మనం పెన్సాకి వెళ్దాం. 292 00:25:14,556 --> 00:25:17,434 మీరు నిజంగానే ఈ మాంత్రికాంతకునితో వెళ్దామని అంటున్నారా. 293 00:25:17,518 --> 00:25:20,395 మేము ఎక్కడికి వెళ్తే, అతను కూడా అక్కడికి వస్తాడు. 294 00:25:20,896 --> 00:25:21,939 అలాగే. 295 00:25:22,689 --> 00:25:24,733 వియానా, కీటో, నివాసానికి వెళ్లిపోండి. 296 00:25:25,442 --> 00:25:27,986 మేము పెన్సాకి బయలుదేరుతున్నామని వాళ్ళకి చెప్పండి. 297 00:25:28,070 --> 00:25:29,738 చార్లెట్, నువ్వు శిబిరం వద్దకు రా. 298 00:25:38,163 --> 00:25:40,832 సుమారు 200 ఏళ్ళ క్రిందట, 299 00:25:40,916 --> 00:25:45,879 కొందరు పయాన్ పిల్లలు చూపుతో పుట్టారు. 300 00:25:47,422 --> 00:25:52,010 తల్లులు, తమ పిల్లలను మాంత్రికాంతకుల నుండి కాపాడటానికి కొండల్లోకి పారిపోయారు. 301 00:25:53,345 --> 00:25:57,850 కానీ, చివరికి వారిని కనిపెట్టేసి, సజీవదహనం చేసేశారు. 302 00:26:00,561 --> 00:26:03,438 పుత్రశోకంతో రగిలిపోయిన ఆ తల్లులు కంపాస్ కి శ్రీకారం చుట్టారు. 303 00:26:04,773 --> 00:26:07,192 అది సంరక్షకుల రహస్య సంఘం, 304 00:26:07,693 --> 00:26:11,029 అందులో సభ్యత్వం తల్లి నుండి కూతురికి సంక్రమిస్తుంది. 305 00:26:12,573 --> 00:26:15,409 మేము ఎన్నో తరాల నుండి రహస్యంగా ఉన్నాం, 306 00:26:15,909 --> 00:26:18,787 ప్రపంచంలోకి చూపు తిరిగివచ్చినప్పుడు, చూపున్నవారిని కాపాడే 307 00:26:18,871 --> 00:26:21,623 పవిత్రమైన కార్యం కోసం ఎదురు చూస్తున్నాం. 308 00:26:22,207 --> 00:26:24,209 ఇప్పటిదాకా మీరు ఎంతమంది చూపున్న పిల్లలను కలుసుకున్నారు? 309 00:26:25,669 --> 00:26:28,380 నీతో కలిపా? ఒకరినే. 310 00:26:28,463 --> 00:26:31,300 మా అమ్మ, లేక వాళ్ళ అమ్మ కూడా చూపు ఉన్న ఎవరినీ కలవలేదు. 311 00:26:31,383 --> 00:26:34,052 నా జీవితంలో చూపున్నవారిని కలుసుకోగలనని నేను అనుకోలేదు, కానీ కలుసుకోగలిగా. 312 00:26:35,387 --> 00:26:37,472 ప్యారిస్, వీళ్ళు నీకెలా తెలుసు? 313 00:26:40,726 --> 00:26:44,354 అది చాలా పెద్ద కథ. బాధాకరమైనది కూడా. 314 00:26:46,356 --> 00:26:47,858 నువ్వు కూడా వారిలో ఒకరివి. 315 00:26:50,736 --> 00:26:53,655 అవును. 316 00:26:58,994 --> 00:27:00,412 చాలా కాలం క్రిందట. 317 00:27:01,914 --> 00:27:04,416 నిన్నెవరూ నిందించలేదు, ప్యారిస్. 318 00:27:04,499 --> 00:27:07,878 ఏదేమైనా, అది నా బాధ్యత. 319 00:27:09,546 --> 00:27:12,424 నేను ఇప్పటిదాకా కలిసిన దివ్యదృష్టి ఉన్న వారందరికీ అదొక శాపం. 320 00:27:12,508 --> 00:27:15,844 మీకు జరగబోయేది ముందుగానే తెలియడం వల్ల, అదంతా మీ వల్లనే అని అనుకుంటుంటారు. 321 00:27:17,763 --> 00:27:21,058 చూపున్నవారు ఇకపై మాంత్రికులు కాదని కేన్ మహారాణి ప్రకటించారట, అది నిజమేనా? 322 00:27:21,683 --> 00:27:22,893 ప్రకటించారనే అందరూ అంటున్నారు. 323 00:27:22,976 --> 00:27:26,271 ఈ మహారాణి ప్రకటన వెనుక దురుద్దేశం ఉంది. 324 00:27:26,355 --> 00:27:29,525 మూఢాచారాన్ని శాశనం ద్వారా మార్చడం సాధ్యపడదు. 325 00:27:30,192 --> 00:27:32,361 ఆమె అందరి చూపు మీ మీద పడేలా చేసిందంతే. 326 00:27:36,823 --> 00:27:39,409 తన ఉద్దేశం కూడా అదే కావచ్చు. 327 00:27:48,293 --> 00:27:49,920 తనకి నిద్ర అవసరమునుకున్నా. 328 00:27:50,003 --> 00:27:51,505 నేను కూడా. 329 00:27:51,588 --> 00:27:55,092 అందుకే, బాగా మత్తు కలిగించే వేర్లను అతని మద్యంలో కలిపాను. 330 00:27:55,175 --> 00:27:58,971 ఎందుకంటే, అతను నిద్రపోకపోతే, నేను రాత్రంతా అతడిని కనిపెట్టుకొనే ఉండాలి. 331 00:28:00,180 --> 00:28:02,182 ఎవరికైనా ఇంకా తినాలనుందా? 332 00:28:05,102 --> 00:28:07,688 చెప్పేది విను, టోడ్. మనందరమూ ఒకటే శపథం చేశాం. 333 00:28:07,771 --> 00:28:10,190 పర్యవసానం ఏదైనా సరే, మాంత్రికులను ఏరిపారేయాలి. 334 00:28:10,274 --> 00:28:12,442 మన సేవలు మహారాణికి అంకితం, డాక్స్. ఆమె ఆదేశాలను మనం పాటించాలి. 335 00:28:12,526 --> 00:28:14,027 ఆ ఆదేశాలు పాపంతో కూడుకున్నవైతే వాటిని పాటించనక్కర్లేదు. 336 00:28:14,111 --> 00:28:16,738 ముందు దైవ జ్వాల, ఆ తర్వాతే మహారాణి. 337 00:28:16,822 --> 00:28:19,074 డాక్స్ అన్నది నిజమే. ఎందుకో ఇది తప్పుగా అనిపిస్తోంది. 338 00:28:19,575 --> 00:28:22,160 -మనం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాం. -అతడిని భద్రంగా ఉంచడం మన విధి. 339 00:28:22,953 --> 00:28:24,705 అతను మహారాణి చెల్లెలి కొడుకు. 340 00:28:24,788 --> 00:28:27,082 ఎవరైనా అతనికి ఏదైనా హాని తలపెడితే ఆమె ఏం చేస్తుందనుకుంటున్నారు? 341 00:28:27,165 --> 00:28:28,917 మనం మాంత్రికుడితో పెన్సాకి వెళ్లామంటే, 342 00:28:29,001 --> 00:28:30,961 మనల్ని కూడా పాపిష్ఠి వాళ్లలా వెలేయడమో లేదా అతనితోపాటు తగలబెట్టేయడమో జరుగుతుంది. 343 00:28:31,044 --> 00:28:31,879 పిచ్చిగా మాట్లాడకు. 344 00:28:31,962 --> 00:28:33,630 నిజానికి మనం అతడిని నరికేయాలి, ఇలా భద్రంగా తీసుకెళ్లకూడదు. 345 00:28:33,714 --> 00:28:35,591 నీకు అతడిని చంపాలని లేదా? సరే, చంపవద్దు. 346 00:28:35,674 --> 00:28:37,509 అతడిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోదాం, పారిపోయాడని చెప్దాం. 347 00:28:37,593 --> 00:28:38,677 అతడిని ఈ అడవికి వదిలేసి పోదాం. 348 00:28:38,760 --> 00:28:41,346 కానివ్వు, టోడ్. అతను చెప్పేది నిజమే అని నీకు కూడా తెలుసు. 349 00:28:41,430 --> 00:28:42,431 లేదు. 350 00:28:42,973 --> 00:28:46,977 ఆ పని చేస్తే వాడి పదవిని తీసి శిక్షిస్తారు అంతే. 351 00:28:47,477 --> 00:28:49,563 అతను నీ గురించి కూడా చెప్పి నీకు అదే స్థితి పట్టేలా చేస్తాడు. 352 00:28:50,731 --> 00:28:53,233 నోళ్ళు మూసుకొని, మీకు చెప్పిన పని చేయండి. 353 00:28:54,359 --> 00:28:55,611 ఒకవేళ మీకు అదృష్టముంటే, 354 00:28:56,111 --> 00:28:59,239 పెన్సాకి చేరుకొనేలోపు నేను ఈ సంభాషణని మర్చిపోతాను. 355 00:29:47,621 --> 00:29:49,456 వచ్చే ముందు మీరు చెప్పి వస్తే బాగుంటుంది. 356 00:29:49,540 --> 00:29:50,999 మన్నించండి, యువరాణి. 357 00:29:51,083 --> 00:29:53,418 ఇప్పుడు ఇది నా ఇల్లు కాదనే విషయాన్నే నేను మర్చిపోతున్నాను. 358 00:29:55,796 --> 00:29:58,215 అహా. ఊళ కత్తి, మహారాజుల ఆయుధం. 359 00:29:58,715 --> 00:30:00,008 ఆ రాజుల కుమార్తెలది కూడా. 360 00:30:01,093 --> 00:30:02,219 నన్ను రమ్మన్నారా? 361 00:30:02,928 --> 00:30:03,929 అవును. 362 00:30:05,180 --> 00:30:09,935 -మీరు చేసిన పెళ్లి ప్రతిపాదన... -నేనలాంటి ప్రతిపాదనే చేయలేదు. 363 00:30:10,018 --> 00:30:11,854 మీ తరఫునా మా అక్క చేసింది. 364 00:30:12,604 --> 00:30:14,481 అది దురదృష్టదాయకం. 365 00:30:14,565 --> 00:30:17,067 నేను చెప్తున్నా కదా, నా మనస్సులో అంతకన్నా రొమాంటిక్ విషయం ఉండింది. 366 00:30:17,150 --> 00:30:20,028 -నాకు భర్త ఉన్నాడు. -మనం అందరం తప్పులు చేస్తాం. 367 00:30:20,904 --> 00:30:24,116 నేను వెల్లకిల్లా పడుకున్నప్పుడు నాకు గురకవస్తుంది. కానీ ఒక సలహా... 368 00:30:24,199 --> 00:30:26,159 -హార్లన్. హార్లన్. -...ఒక తన్ను తంతే గురక ఆపేస్తానని 369 00:30:26,243 --> 00:30:27,619 -నాకు చెప్పారు. -హార్లన్! 370 00:30:29,413 --> 00:30:30,998 అసలు మీకేం కావాలి? 371 00:30:43,552 --> 00:30:45,762 నేను మహారాజుల కాళ్ల దగ్గర పడి ఊడిగం చేసే 372 00:30:46,847 --> 00:30:49,766 ఉన్నత వర్గానికి చెందిన మగాళ్ళ జాతిలో పుట్టాను. 373 00:30:52,519 --> 00:30:58,192 ఇప్పుడు, నేను అలుపే లేకుండా శ్రమించి 374 00:30:59,151 --> 00:31:01,653 నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాను. 375 00:31:04,573 --> 00:31:06,575 నేను అంతా ఇంతా కష్టపడలేదు. 376 00:31:07,159 --> 00:31:09,703 ఇప్పుడేమో, మహారాణి వచ్చి 377 00:31:10,621 --> 00:31:14,124 తన యుద్ధ ప్రకటనతో నా సామ్రాజ్యాన్ని నాశనం చేసేసింది. 378 00:31:14,208 --> 00:31:16,627 ఇప్పుడు నా ముందు రెండు దారులు ఉన్నాయి. 379 00:31:18,003 --> 00:31:22,132 మొదటిది, తిరుగుబాటును రేపి, ఈ అంతఃపురం మొత్తాని తగలబెట్టేయడం, 380 00:31:23,550 --> 00:31:27,221 రెండవది: మీతో చేతులు కలిపి ఆ అంతఃపురంలోకే మకాం మార్చడం. 381 00:31:30,599 --> 00:31:35,062 పరిపరి విధాలుగా ఆలోచించిన తర్వాత, ఒక నిర్ణయం తీసుకున్నా, యువరాణి. 382 00:31:36,355 --> 00:31:38,148 రెండవ ఎంపికకి పెద్ద కష్టపడాల్సిన పని లేదని గ్రహించాను. 383 00:31:40,359 --> 00:31:42,152 మీరు మనువాడాల్సింది నన్ను కాదు. 384 00:31:42,778 --> 00:31:45,906 -నేను మనువాడాల్సింది మిమ్మల్నే. -అధికారం అంతా సిబెత్ చేతిలో ఉంది. 385 00:31:46,573 --> 00:31:47,783 ప్రస్తుతానికి. 386 00:31:58,710 --> 00:32:01,338 -మనం మన నిశ్చితార్థాన్ని ప్రకటిద్దాం. -సూపర్. 387 00:32:01,421 --> 00:32:02,548 కానీ పెళ్లి జరగదు. 388 00:32:03,257 --> 00:32:04,883 ఇలా అంటున్నందుకు తప్పుకో అనుకోకండి... 389 00:32:04,967 --> 00:32:07,261 నిశ్చితార్థ ప్రకటన వల్ల మా అక్కకి కంజువా విషయంలో ఉన్న ఆందోళన 390 00:32:07,344 --> 00:32:09,513 కొంతకాలం పాటు తగ్గుతుంది. 391 00:32:10,389 --> 00:32:12,391 మీరు కౌన్సిల్ లో మీకున్న పలుకుబడిని ఉపయోగించి 392 00:32:12,474 --> 00:32:14,643 ఆమెని యుద్ధానికి వెళ్లకుండా ఆపడంలో నాకు సహాయపడతారు. 393 00:32:15,394 --> 00:32:17,980 ఇక నా భర్త, ఇంకా కూతురు యొక్క ఆచూకీ తెలిశాక, 394 00:32:18,480 --> 00:32:21,859 ఎలాంటి పరిస్థితుల్లోనైనా, వారికి ఏం కాకుండా మీరు చూసుకుంటారు. 395 00:32:25,571 --> 00:32:26,738 మరి నాకేం దక్కుతుంది? 396 00:32:28,657 --> 00:32:32,661 నేను రాజధానిని మరింత అనుకూలమైన నగరంలో పెట్టమని సిబెత్ ని ఒప్పిస్తాను, 397 00:32:32,744 --> 00:32:34,955 అప్పుడు మీ నీగరం మళ్లీ మీ సొంతమవుతుంది. 398 00:32:37,708 --> 00:32:38,709 మాగ్రా. 399 00:32:40,586 --> 00:32:42,546 మిమ్మల్ని తక్కువ అంచనా వేశాననుకుంటా. 400 00:32:44,173 --> 00:32:46,008 నేను కూడా అదే చేసుకున్నాననుకుంటా. 401 00:32:46,800 --> 00:32:48,302 కాలమే సమాధానం చెప్తుంది, యువరాణి. 402 00:33:21,126 --> 00:33:23,378 -పారాహుషార్. -పారాహుషార్. 403 00:33:27,716 --> 00:33:29,009 వేడి వేడి టీ. 404 00:33:40,354 --> 00:33:43,982 అయితే, నువ్వు ఒకప్పుడు కంపాస్ యోధురాలివా? 405 00:33:45,400 --> 00:33:49,196 సంరక్షకురాలిని. దాని మీద నాకు ఎప్పుడో ఆసక్తి పోయింది. 406 00:33:53,283 --> 00:33:54,493 ఎందుకు వదిలేశావు? 407 00:34:01,333 --> 00:34:07,130 నేను కంపాస్ లో ఉన్నప్పుడు, చాలా ఉత్తేజకరంగా ఉండేది, హనీవా. 408 00:34:08,090 --> 00:34:12,094 రెండు వందల ఏళ్ళ పాటు చూపుగల ఒక్క చిన్నారి జాడ అయిన మాకు తెలియలేదు, 409 00:34:12,177 --> 00:34:16,181 ఒకరోజు హఠాత్తుగా ఒక పిల్లాడు ప్రత్యక్షమయ్యాడు. 410 00:34:17,599 --> 00:34:19,768 అతడిని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. 411 00:34:20,268 --> 00:34:22,728 అతనికి చూపుతో పాటు ఇంకా చాలా నైపుణ్యాలు కూడా ఉన్నాయి. 412 00:34:22,813 --> 00:34:27,568 అంటే, అతని పసిబుర్రలో, జ్ఞానాన్ని సంపాదించాలని ఎనలేని ఆసక్తి ఉండేది... 413 00:34:29,277 --> 00:34:30,612 నీలాగే అన్నమాట. 414 00:34:34,699 --> 00:34:35,951 నేను నియమాలను అతిక్రమించాను. 415 00:34:38,078 --> 00:34:41,581 మేము నిల్వ ఉంచిన కళాఖండాలకు అతనికి ప్రవేశం కల్పించాను. 416 00:34:41,665 --> 00:34:42,666 పుస్తకాలు... 417 00:34:44,458 --> 00:34:47,420 ఇంకా వాటిని ఎలా చదవాలో నేర్పించే ముళ్ళ సంకేతాలు. 418 00:34:48,672 --> 00:34:53,385 కొంతకాలానికే, అతని జిజ్ఞాసకు సరిపడినన్ని పుస్తకాలను నేను అందించలేకపోయాను. 419 00:34:55,137 --> 00:34:57,639 ఒకరోజు లేచి చూసేసరికి, అతను లేడు, 420 00:34:58,473 --> 00:35:02,060 పుస్తకాలు, ముళ్ళ సంకేతాలు కూడా లేవు. 421 00:35:06,315 --> 00:35:08,066 కంపాస్ ఇచ్చిన పనిని చేయలేకపోయాను. 422 00:35:09,318 --> 00:35:13,363 నా కర్తవ్యాన్ని పాటించడంలో నేను విఫలమయ్యాను. 423 00:35:14,489 --> 00:35:17,242 కాబట్టి నేను చేయగల ఏకైక పనిని చేశాను. నేను వదిలేసి వెళ్లిపోయాను. 424 00:35:23,248 --> 00:35:26,835 ఆ పిల్లాడికి ఏమైందో నీకు తెలుసా? 425 00:35:32,007 --> 00:35:34,176 అతను నీ తండ్రి అయ్యాడు. 426 00:35:45,896 --> 00:35:47,064 జెర్లామరెల్. 427 00:35:48,106 --> 00:35:49,107 అవును. 428 00:35:52,194 --> 00:35:56,114 చాలా కాలం తర్వాత, నువ్వు గర్భంలో ఉన్నప్పుడు, జెర్లామరెల్ వచ్చాడు. 429 00:35:56,615 --> 00:35:58,075 నేను ఆల్కెన్నీ తెగతో ఉంటున్నానని అతనికి తెలుసు. 430 00:35:58,992 --> 00:36:03,705 తన పిల్లలని రక్షిస్తానని, మార్గనిర్దేశం చేస్తానని అతనికి తెలుసు. 431 00:36:04,498 --> 00:36:06,583 అలాగే, మేము చదవడం నేర్చుకొనేలా చేస్తావని కూడా. 432 00:36:09,837 --> 00:36:12,256 అది సరైన ఎంపికే అని ఆశిస్తున్నాను. 433 00:36:19,137 --> 00:36:20,389 అది సరైన ఎంపికే. 434 00:36:21,765 --> 00:36:25,727 నీ చేతులు నీకెంత ముఖ్యమైనవో, 435 00:36:27,229 --> 00:36:30,190 నా కళ్లు నాకంత ముఖ్యమైనవి. 436 00:36:32,568 --> 00:36:34,903 నేను చదవకుండా ఉండటం సరైన విషయం కాదు. 437 00:36:40,534 --> 00:36:41,743 బంగారం... 438 00:36:44,162 --> 00:36:47,457 మానవజాతికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది... 439 00:36:48,208 --> 00:36:53,922 విభిన్నమైనవారిని అసహ్యించుకోవడంలో, భయపడటంలో వారికి సుదీర్షమైన చరిత్ర ఉంది. 440 00:36:54,923 --> 00:36:56,592 ఫలానా గుణాలతో పుట్టాలి అని ఎంచుకొనే అవకాశం ఎవరికీ ఉండదు. 441 00:36:57,926 --> 00:37:02,222 అయినప్పటికీ, చూపులేనివారు చూపున్నవారిని చిన్నచూపు చూస్తారు. 442 00:37:06,810 --> 00:37:12,441 ఒకవేళ ఏదోకరోజు చూపున్నవారి సంఖ్య చూపులేనివారి సంఖ్యను మళ్లీ మించితే, 443 00:37:13,525 --> 00:37:15,235 అప్పుడు పరిస్థితులు అటూఇటూ అవుతాయి. 444 00:37:17,154 --> 00:37:22,034 చూపున్నా, చూపులేకున్నా మనందరి మనస్థత్వాలు ఒక విధంగానే ఉంటాయి. 445 00:37:54,942 --> 00:37:56,109 ఏం చేస్తున్నావు నువ్వు? 446 00:37:56,193 --> 00:37:57,611 నా కర్తవ్యం, మాంత్రికుడా. 447 00:37:58,320 --> 00:37:59,905 -టోడ్! -నోర్మూయ్. 448 00:38:00,405 --> 00:38:01,406 వాడిని కదలకుండా పట్టుకో! 449 00:38:07,788 --> 00:38:09,206 కానివ్వు, మాంత్రికుడా! 450 00:38:13,836 --> 00:38:14,878 టోడ్! 451 00:38:27,224 --> 00:38:30,811 డాక్స్! ఫ్రై! ఏం చేస్తున్నారు మీరు? 452 00:38:30,894 --> 00:38:32,145 లైన్లో నిలబడండి! 453 00:38:35,566 --> 00:38:36,400 టోడ్! 454 00:38:40,571 --> 00:38:42,281 ఫ్రై! ఆపు, ఫ్రై. 455 00:38:42,781 --> 00:38:44,616 టోడ్! టోడ్ 456 00:38:44,700 --> 00:38:46,660 టోడ్! టోడ్! టోడ్! 457 00:38:48,871 --> 00:38:50,956 టోడ్! టోడ్! టోడ్ 458 00:38:51,039 --> 00:38:53,041 టోడ్! టోడ్! 459 00:38:57,045 --> 00:38:59,965 టోడ్. టోడ్. 460 00:39:00,465 --> 00:39:03,218 -డాక్స్. డాక్స్! -టోడ్. 461 00:39:05,387 --> 00:39:06,388 ఫ్రై? 462 00:39:08,223 --> 00:39:09,224 ఫ్రై? 463 00:39:10,893 --> 00:39:12,728 -ఫ్రై! -కదలకు, డాక్స్. 464 00:39:13,812 --> 00:39:14,813 ఏం చేశావు నువ్వు? 465 00:39:15,939 --> 00:39:17,316 కదలకు అని చెప్తున్నానా. 466 00:39:18,650 --> 00:39:19,568 నువ్వు చంపేశావు. 467 00:39:20,152 --> 00:39:22,196 నువ్వు వెంటనే నీ దాడి ఆపకపోతే నిన్ను కూడా చంపేస్తాను. 468 00:39:23,906 --> 00:39:27,242 నీకేమైంది? నువ్వు ఒక మాంత్రికాంతకుడివి అయ్యుండి మాంత్రికుడిని కాపాడుతున్నావు! 469 00:39:27,326 --> 00:39:29,661 నీకు ఇంకోసారి చెప్పను, డాక్స్! 470 00:39:29,745 --> 00:39:31,872 కదలకుండా ఉన్న చోట ఉండు! ఇప్పుడే! 471 00:39:37,127 --> 00:39:38,212 నేను వెళ్లిపోతున్నాను. 472 00:39:39,213 --> 00:39:40,964 నేను ఇందులో భాగం కాలేను. 473 00:39:41,048 --> 00:39:43,091 నీకు మధ్యలో వెళ్లిపోవాలనుంటే నీ గుర్రాన్ని తీసుకొని వెళ్లిపో. 474 00:39:43,675 --> 00:39:45,427 కానీ నువ్వు ఈ మిషన్ లో వేలు పెట్టాలని చూస్తే, 475 00:39:45,511 --> 00:39:47,262 నిన్ను అక్కడికక్కడే పాతేస్తాను. 476 00:40:16,500 --> 00:40:18,210 -టోడ్. -మాట్లాడకు. 477 00:40:26,844 --> 00:40:28,136 నువ్వు గుర్రపు స్వారీ చేయగలవా? 478 00:40:30,848 --> 00:40:31,849 లేదు. 479 00:40:34,393 --> 00:40:35,978 త్వరగా నేర్చుకుంటావనే ఆశిస్తున్నా. 480 00:40:38,605 --> 00:40:40,065 ఎందుకంటే నువ్వు నాతో కాకుండా వేరుగా స్వారీ చేయాలి. 481 00:41:05,507 --> 00:41:08,010 నీకు అవకాశం ఉన్నప్పుడే ఇడోని ఎందుకు చంపలేదు? 482 00:41:12,598 --> 00:41:16,476 సోదరుడిని చంపడమంటే నీలోని ఒక భాగాన్ని చంపుకోవడమే. 483 00:41:19,938 --> 00:41:21,648 మీ నాన్నను చంపడంలాగానా? 484 00:41:32,701 --> 00:41:35,495 మా నాన్న ఇడోని చంపమని నన్ను ఆజ్ఞాపించాడు. 485 00:41:37,664 --> 00:41:39,082 దానితో నేను ఒక దారిని ఎంచుకున్నాను. 486 00:41:46,882 --> 00:41:50,219 నువ్వు ఇడోని రక్షించినట్లయితే, ఎందుకు అతనికి నీ పట్ల అంత ద్వేషం? 487 00:41:55,015 --> 00:41:58,560 కుటుంబాలలో సంక్లిష్టమైన విషయాలు అనేకం ఉండవచ్చు. 488 00:42:05,943 --> 00:42:06,818 అంతేలే... 489 00:42:08,320 --> 00:42:12,199 నన్ను మా బాబాయ్ అపహరించాడు, 490 00:42:12,282 --> 00:42:15,494 మా అమ్మ ఒక యువరాణి అని తెలిసింది. 491 00:42:18,497 --> 00:42:21,625 సంక్లిష్ట కుటుంబాల గురించి నాకు కూడా కాస్తో కూస్తో తెలుసులే. 492 00:42:33,178 --> 00:42:35,430 ఇడోకి జన్మనిస్తూ మా అమ్మ చనిపోయింది. 493 00:42:37,683 --> 00:42:39,852 ఆ విషయంలో, మా నాన్న అతడిని ఎప్పటికీ క్షమించలేదు. 494 00:42:40,978 --> 00:42:44,606 నేనప్పుడు చాలా చిన్నవాడిని, అప్పటికి మా అమ్మ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. 495 00:42:46,608 --> 00:42:49,319 మా నాన్న దృష్టికోణాన్ని కూడా ఎదిరించలేనంత చిన్నవాడిని. 496 00:43:01,999 --> 00:43:03,333 నన్ను రమ్మని పిలిచారా, సర్? 497 00:43:06,587 --> 00:43:08,547 ఆ అమ్మాయి, హనీవాకి విలు విద్యలో మంచి ప్రవేశముంది. 498 00:43:10,549 --> 00:43:11,675 అవునా? 499 00:43:12,634 --> 00:43:14,511 నా శరీరంలోకి మూడు బాణాలు దించింది. 500 00:43:16,680 --> 00:43:20,142 నా అన్నయ్య, ఇద్దరు జెర్లామరెల్ పిల్లలను పెంచాడు. 501 00:43:20,642 --> 00:43:22,895 వాళ్లందరూ కలిస్తే ఇక అంతే. 502 00:43:25,063 --> 00:43:29,818 ఇవాళ, మన్హాల్ లోని ఒక ఆవాసంలో బానిస వర్తకుల బృందం ఒకటి హతమైంది. 503 00:43:31,403 --> 00:43:32,779 అది వారి పనే అని మీరనుకుంటున్నారా? 504 00:43:36,116 --> 00:43:39,328 బాబాకి గాయాలున్నాయి. అలసిపోయున్నాడు. కనుక అంత వేగంగా వెళ్తూ ఉండడు. 505 00:43:40,871 --> 00:43:43,207 ఆ ప్రాంతంలో ఉన్న ప్రతీ అవుట్ పోస్ట్ కి వర్తమానం పంపించు... 506 00:43:44,791 --> 00:43:48,921 నాకు బాబా, ఆ అమ్మాయి ప్రాణాలతో కావాలి అని. 507 00:43:51,548 --> 00:43:52,382 అలాగే, సర్. 508 00:43:53,634 --> 00:43:54,635 లెఫ్టినెంట్? 509 00:44:06,188 --> 00:44:09,399 వాళ్ళు పారిపోవడానికి సహాయం చేసినవారి గురించి ఏమైనా తెలిసిందా? 510 00:44:12,402 --> 00:44:13,695 లేదు, సర్. ఇంకా ఏ విషయం తెలియలేదు. 511 00:44:17,699 --> 00:44:21,036 అది వింతగా ఉంది, రెన్. చాలా వింతగా ఉంది. 512 00:44:24,831 --> 00:44:27,167 కానీ దాని గురించి నాకో ఐడియా ఉందనుకుంటా. 513 00:44:29,503 --> 00:44:30,754 ఏ విషయమో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. 514 00:44:31,588 --> 00:44:32,589 అలాగే, సర్. 515 00:44:52,359 --> 00:44:54,319 -టోడ్. -ఏంటి? 516 00:44:58,949 --> 00:45:00,659 నా ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు. 517 00:45:04,621 --> 00:45:06,456 నువ్వు కృతజ్ఞత చూపి పొరబడకు. 518 00:45:07,749 --> 00:45:10,836 నువ్వు యువరాణి మాగ్రా కొడుకువి, నిన్ను కాపాడటం నా కర్తవ్యం. 519 00:45:12,421 --> 00:45:13,630 నాకు మరో దారి లేదు. 520 00:45:18,802 --> 00:45:20,345 నీకు దారి ఉండింది. 521 00:45:48,540 --> 00:45:49,708 నాకు మ్యాప్ ఇవ్వు. 522 00:46:06,266 --> 00:46:09,978 వాతావరణం ఇలాగే ఉంటే, పెన్సాకి చేరుకోవడానికి 13 రోజులు పడుతుంది. 523 00:46:10,479 --> 00:46:12,564 మనం అక్కడికి సగం సమయంలో చేరుకోవచ్చు. 524 00:46:12,648 --> 00:46:14,399 ఏంటి? ఎలా? 525 00:46:16,443 --> 00:46:17,444 ఇటు వైపు వెళ్లడం ద్వారా. 526 00:46:22,449 --> 00:46:23,742 అక్కడొక కొండ ఉంది. 527 00:46:24,368 --> 00:46:26,662 అవును, అలా అని మ్యాప్ లో ఉందంతే. 528 00:46:26,745 --> 00:46:29,498 కానీ అక్కడ కొండ లేనే లేదు. మనం నేరుగా వెళ్లిపోవచ్చు. 529 00:46:29,581 --> 00:46:30,582 ఆ విషయం నీకెలా తెలుసు? 530 00:46:31,542 --> 00:46:33,001 మ్యాపులు చేసేది వాళ్లే. 531 00:46:33,877 --> 00:46:35,379 మా అవుట్ పోస్ట్ ని మీలాంటి 532 00:46:35,462 --> 00:46:38,382 చెత్తగాళ్ళ నుండి ఇన్ని శతాబ్దాలు మేము అలాగే కాపాడుకున్నాం. 533 00:46:39,758 --> 00:46:40,759 హనీవా? 534 00:46:41,260 --> 00:46:44,721 ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను సంరక్షించమని నన్ను ఆదేశించారు. 535 00:46:45,389 --> 00:46:48,767 నువ్వు నా వెనకే ఉండాలి. 536 00:46:49,476 --> 00:46:51,854 ఎప్పుడూ నా వెనకే ఉండాలి. 537 00:46:52,521 --> 00:46:56,149 మీ నాన్న ఎప్పుడూ నీ వెనకాలే ఉండాలి. 538 00:46:56,233 --> 00:46:58,610 నాకు ఏ సంరక్షురాలి అవసరమూ లేదు. నన్ను నేను చూసుకోగలను. 539 00:47:00,153 --> 00:47:02,698 త్రివాంటెస్ లో నిన్ను దాదాపుగా ఒక సానిని చేయబోయారు. 540 00:47:02,781 --> 00:47:04,074 నేను తప్పించుకున్నాను. 541 00:47:04,157 --> 00:47:06,159 ఒక బానిస వర్తకులు శిబిరంలో చావు అంచుల దాకా వెళ్లి వచ్చావు. 542 00:47:06,243 --> 00:47:08,245 ఆ విధంగా చూస్తే, నువ్వు ఓ వారంలో చనిపోవడం ఖాయమనిపిస్తోంది. 543 00:47:09,121 --> 00:47:10,205 హనీవా. 544 00:47:15,043 --> 00:47:16,628 నా దారికి మాత్రం అడ్డు రాకు. 545 00:47:17,212 --> 00:47:19,548 నీకు కళ్ళున్నాయి కదా. నా దారికి నువ్వే అడ్డు రాకు. 546 00:47:21,717 --> 00:47:24,970 ఎప్పుడూ నా వెనుకే ఉండాలి. మీ నాన్న నీ వెనుకే ఉండాలి. 547 00:47:27,723 --> 00:47:28,807 ప్యారిస్. 548 00:47:35,105 --> 00:47:36,273 మల్లె పూలు. 549 00:47:41,737 --> 00:47:43,530 కాల్చిన పుదీనా. 550 00:47:52,039 --> 00:47:56,126 పచ్చిక బయళ్ళ మీద కురిసే వాన. 551 00:47:58,879 --> 00:48:01,173 ధన్యవాదాలు, మహారాణి. 552 00:48:05,844 --> 00:48:11,558 పెన్సన్ వాసన వంట మనుషులను మించిన నేర్పరులు ఎవరూ ఉండరని విన్నాను. 553 00:48:12,726 --> 00:48:14,561 ఇప్పుడు అది నిజమే అని నేను తెలుసుకున్నాను. 554 00:48:16,104 --> 00:48:19,816 మీ అందరికీ ఈ ప్రదర్శన బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. 555 00:48:21,527 --> 00:48:25,822 మనం ఎంత కష్టం అనుభవిస్తున్నా కూడా 556 00:48:26,406 --> 00:48:30,285 మనకి దైవజ్వాల ప్రసాదించిన ఈ అందానికి, ఆనందానికి 557 00:48:30,369 --> 00:48:32,579 సదా కృతజ్ఞతా భావంతో ఉండాలని నేను తెలుసుకున్నాను. 558 00:48:32,663 --> 00:48:36,583 ఇప్పుడు కూడా, మన ముందు ఎన్ని అడ్డంకులు ఉన్నా, 559 00:48:37,167 --> 00:48:38,836 అందులోనూ ఏదోక అందం ఉంటుంది. 560 00:48:40,003 --> 00:48:42,840 ప్రేమ ఉంటుంది. 561 00:48:44,341 --> 00:48:46,385 మరి ఎంతో ఆనందంగా, నా ఆస్థానంలో ఉన్న 562 00:48:46,468 --> 00:48:49,638 గౌరవప్రదమైన సభ్యులకు ఒక విషయం తెలియజేస్తున్నాను, 563 00:48:50,138 --> 00:48:55,853 నా సోదరి, యువరాణి మాగ్రా కేన్ కి, అలాగే పెన్సాకి చెందిన 564 00:48:56,353 --> 00:49:01,400 స్వయంగా మీవాడే అయిన హార్లన్ ప్రభువుకు నిశ్చితార్థం జరిగింది. 565 00:49:02,776 --> 00:49:05,112 ఈ విషయాన్ని ప్రకటించేది మనం అని నేను అనుకున్నాను. 566 00:49:05,195 --> 00:49:06,655 అవును, నేను కూడా అదే అనుకున్నా. 567 00:49:06,738 --> 00:49:09,366 ఇక నాలుగు రోజుల తర్వాత 568 00:49:10,200 --> 00:49:13,036 మనమందరమూ వారి వివాహాన్ని కనులారా వీక్షిస్తాము. 569 00:49:15,080 --> 00:49:16,123 మనం పయాన్ పౌరులం 570 00:49:16,206 --> 00:49:18,166 -ఇందులో మీకు కూడా భాగముందా? -లేదు. 571 00:49:18,250 --> 00:49:19,293 మనం పునీతులము 572 00:49:19,376 --> 00:49:21,003 మీ మీద నాకు నమ్మకం లేదు. 573 00:49:21,503 --> 00:49:25,424 ఇప్పుడు కాకపోతే తర్వాతైనా, మీరు నన్ను నమ్మాల్సి వస్తుంది, యువరాణి. 574 00:49:26,425 --> 00:49:28,218 మరి నమ్మేలా చేసుకోండి. 575 00:49:28,302 --> 00:49:30,762 మనం ఎన్నుకోబడినవారము 576 00:49:37,394 --> 00:49:38,604 నాన్నా. 577 00:49:41,690 --> 00:49:42,774 ఏంటి సంగతి? 578 00:49:43,275 --> 00:49:44,526 జనరల్ వచ్చాడు. 579 00:49:45,944 --> 00:49:46,945 ఏంటి? 580 00:49:48,697 --> 00:49:49,948 ఇడో వాస్ ఇక్కడికి వచ్చాడా? 581 00:49:50,532 --> 00:49:53,285 కొందరు సైనికులను వెంట పెట్టుకొని వచ్చాడు. 582 00:49:57,039 --> 00:49:59,374 నాకు చూపు పోయిందని ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి తెలియకూడదు 583 00:50:05,422 --> 00:50:08,884 జనరల్ వాస్. ఇలా హఠాత్తుగా వచ్చేశావేంటి. 584 00:50:09,843 --> 00:50:10,928 హఠాత్తుగానా? 585 00:50:14,723 --> 00:50:16,642 నువ్వు ఇంకా నేను వస్తానని అనుకుంటావనుకున్నానే. 586 00:50:18,602 --> 00:50:19,603 నేనెందుకు అనుకుంటాను? 587 00:50:25,025 --> 00:50:29,488 ఎవరో నా చెరసాలలోకి వచ్చి, బాబా వాస్ ని విడిపించి తీసుకెళ్లిపోయారు. 588 00:50:31,365 --> 00:50:32,908 నువ్వు బాబా వాస్ ను పట్టుకున్నావా? 589 00:50:35,077 --> 00:50:36,078 మా చెరసాలలోనే ఉండేవాడు. 590 00:50:37,955 --> 00:50:39,206 కానీ ఒకరోజు తప్పించుకున్నాడు. 591 00:50:40,541 --> 00:50:43,210 అంతమంది గార్డులని తుక్కుతుక్కు చేసి, త్రివాంటియన్ చెరసాలలోని 592 00:50:43,710 --> 00:50:46,505 అనేక దారులను దాటుకుంటూ బయటపడటమంటే, అది చిన్న విషయం కాదు, 593 00:50:47,756 --> 00:50:51,844 చూపు ఉంటే తప్ప. 594 00:50:53,345 --> 00:50:58,183 నన్ను అనుమానిస్తున్నావా? అసలు నేనెందుకు బాబా వాస్ ని విడిపిస్తాను? 595 00:50:58,267 --> 00:50:59,434 ఆ కొడుకు ఎక్కడ? 596 00:51:01,061 --> 00:51:02,062 కొడుకా? 597 00:51:03,313 --> 00:51:06,316 వాళ్లు ఇక్కడ ఉన్నప్పుడు, నా వాళ్లతో నువ్వు పంపని కుర్రాడు. 598 00:51:06,650 --> 00:51:08,694 -ఇప్పుడు వాడిని పిలిపించు. -నేను చెప్పేది విను. 599 00:51:08,777 --> 00:51:11,488 నువ్వు పన్నిన ఉచ్చు, బాబా వాస్ నా ఇంటి దాకా వచ్చేలా చేసింది. 600 00:51:11,572 --> 00:51:14,992 అతను నా గార్డులని చంపి, బలవంతంగా నా కొడుకుని తీసుకెళ్లిపోయాడు. 601 00:51:15,742 --> 00:51:18,287 బాబా వాస్ ఇక్కడికి వచ్చాడా, అదీగాక నిన్ను ప్రాణాలతో వదిలేశాడా? 602 00:51:20,038 --> 00:51:22,457 అతనికి నువ్వు అతని కూతురిని ఇచ్చేశాక కూడా? 603 00:51:25,002 --> 00:51:26,336 అతనికి వేరే దారి లేకుండా పోయింది. మేము చాలా మంది ఉన్నాం. 604 00:51:29,464 --> 00:51:31,925 ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? 605 00:51:32,009 --> 00:51:38,140 నేను తండ్రితో మాట్లాడుతుంటే అబ్బాయి ఎందుకు మాట్లాడుతున్నాడు? 606 00:51:39,516 --> 00:51:42,853 ఇంకా నువ్వు గొప్పని నిరూపించుకోవడానికి మనం కలిసిన ప్రతీసారి అటూఇటూ 607 00:51:43,854 --> 00:51:45,480 తిరుగుతుంటావు కదా, ఇప్పుడు ఏమైంది? 608 00:51:47,482 --> 00:51:48,984 నీ తీరు ఎలా ఉందంటే, నువ్వు... 609 00:51:49,067 --> 00:51:51,403 చూడు, జనరల్, నువ్వు ఇక్కడి దాకా కేవలం... 610 00:51:52,404 --> 00:51:54,615 అతడిని వదిలేయ్! వదిలేయ్. 611 00:51:54,698 --> 00:51:57,034 -జనరల్. -మాట్లాడకు. 612 00:52:12,966 --> 00:52:14,426 వాడు నీకు చూపు లేకుండా చేశాడు. 613 00:52:15,719 --> 00:52:17,221 ఇది తాత్కాలికమైన గాయమే. 614 00:52:17,971 --> 00:52:20,307 అది త్వరలోనే నయమైపోతుంది. 615 00:52:24,520 --> 00:52:25,521 లేదు. 616 00:52:28,398 --> 00:52:29,483 అది నయమవ్వదు. 617 00:52:33,028 --> 00:52:34,404 అయ్యో! 618 00:52:34,488 --> 00:52:36,615 అయ్యో! అయ్యో! 619 00:52:37,115 --> 00:52:40,118 అయ్యయ్యో! 620 00:52:41,161 --> 00:52:45,332 నేను నిన్ను చంపేస్తాను, ఒట్టేసి చెప్తున్నా, నిన్ను చంపేస్తాను. 621 00:52:46,708 --> 00:52:48,460 ఇక బాధపడింది చాలు, ఓలొమన్. 622 00:52:49,711 --> 00:52:52,506 నీ మిగతా కుటుంబాన్ని కాపాడుకోవడం ఇప్పుడు నీ బాధ్యత. 623 00:52:53,090 --> 00:52:56,385 అలా చేయాలంటే, నీ బుర్ర సరిగ్గా పని చేయాలి. 624 00:52:57,302 --> 00:52:59,596 ఇప్పుడు ఈ ఇల్లు నాది. 625 00:53:00,514 --> 00:53:04,226 నువ్వు, పుస్తకాలు, జ్ఞాన సంపద, ఇక్కడ ఉన్నవన్నీ. 626 00:53:05,519 --> 00:53:06,562 టోర్మాడా! 627 00:53:15,362 --> 00:53:19,116 ఇతను టోర్మాడా. మా శాస్త్రవేత్తల్లో ఒకానొక గొప్పవాడు. 628 00:53:21,577 --> 00:53:22,870 నువ్వు ఇప్పుడు ఇతని కింద పనిచేయాలి. 629 00:54:46,453 --> 00:54:48,455 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య