1 00:00:24,441 --> 00:00:25,859 బాగా నొప్పిగా ఉందా? 2 00:00:27,069 --> 00:00:28,487 కాస్తంత నొప్పి, అంతే. 3 00:00:34,993 --> 00:00:36,578 కట్లు విప్పాల్సిన సమయమైంది. 4 00:01:34,428 --> 00:01:35,512 కనబడటం లేదు. 5 00:01:36,722 --> 00:01:39,558 -ఏమీ కనబడటం లేదు! -నాన్నా. నాన్నా. 6 00:01:39,641 --> 00:01:41,935 -నేను చూడలేకపోతున్నాను. -పర్వాలేదు. శాంతించు. 7 00:01:42,019 --> 00:01:44,521 -ఓలొమన్, ఇది పని చేయలేదు. -నాన్నా, శాంతించు. 8 00:01:44,605 --> 00:01:48,817 మళ్లీ ప్రయత్నిద్దాం. శస్త్రచికిత్స మళ్లీ చేద్దాం. దాన్ని మళ్లీ ప్రయత్నించండి. 9 00:01:48,901 --> 00:01:51,236 మన్నించాలి. కానీ ఇక ఏమీ చేయలేము. 10 00:01:51,320 --> 00:01:53,864 నువ్వు పొరబడుతున్నావు! తప్పకుండా ఏదోక పద్ధతి ఉండాలి. 11 00:01:54,531 --> 00:01:55,616 -ఓలొమన్. -నాన్నా. 12 00:01:55,699 --> 00:01:58,535 నువ్వు చదవడం కొనసాగించాలి. వైద్యపరమైన పుస్తకాలను, అన్నిరకాల పుస్తకాలను చదవాలి. 13 00:01:58,619 --> 00:01:59,828 అక్కడే మనకి సమాధానాలు దొరుకుతాయి. 14 00:01:59,912 --> 00:02:02,206 నాన్నా, నేను అన్ని పుస్తకాలను చదివాను. 15 00:02:02,289 --> 00:02:05,667 వాటి ద్వారా నీ శుక్లం బాగా పాడైపోయిందని నాకు తెలిసింది. 16 00:02:06,376 --> 00:02:08,336 నువ్వు సరిగ్గా వెతకడం లేదు! 17 00:02:09,963 --> 00:02:12,007 నేను గుడ్డివాడిగా బతకలేను. 18 00:02:13,509 --> 00:02:14,760 నేను చెప్పేది అర్థమవుతోందా? 19 00:02:16,094 --> 00:02:17,804 నేను గుడ్డివాడిగా బతకలేను! 20 00:04:20,886 --> 00:04:21,887 ఏంటి? 21 00:04:28,310 --> 00:04:29,311 ఏంటి? 22 00:04:47,955 --> 00:04:49,206 పారిపోవాలనే ఆలోచన రానివ్వకు. 23 00:05:12,521 --> 00:05:14,147 లెఫ్టినెంట్ కమాండర్ రెన్. 24 00:05:14,231 --> 00:05:15,524 సరే, లెఫ్టినెంట్. 25 00:05:16,233 --> 00:05:17,651 ద్వారం తెరవండి! 26 00:05:17,734 --> 00:05:18,902 అలాగే, సర్! 27 00:06:06,867 --> 00:06:08,785 అప్పుడు... 28 00:06:09,369 --> 00:06:14,875 గాయపడిన వాడు, కానీ ఇంకా చావని వాడైన ధీరాతిధీర త్రివాంటియన్, టాలివర్... 29 00:06:17,044 --> 00:06:22,216 శక్తినంతా కూడదీసుకొని నిలబడి తన అశ్వాన్ని అధిరోహించాడు. 30 00:06:25,135 --> 00:06:27,971 ఉరుముల ఫెళఫెళలు, జోరువాన... 31 00:06:28,055 --> 00:06:30,098 అతని స్థైర్యాన్ని తగ్గించాయి, కానీ, 32 00:06:30,182 --> 00:06:34,937 తన అలసిన మనుషులను నెత్తుటి మైదానాలలో పొడవాటి గడ్డి ఉన్న చోటి నుండి... 33 00:06:36,480 --> 00:06:38,065 గానైట్ కంచుకోటకి చేర్చాడు. 34 00:06:38,941 --> 00:06:43,153 అతని సారథ్యంలో, 20 మంది త్రివాంటియన్ సైనికులు... 35 00:06:43,695 --> 00:06:46,240 గానైట్ సేనని రాత్రి నుండి... 36 00:06:47,324 --> 00:06:48,450 ఉదయం దాకా నిలువరించారు... 37 00:06:48,909 --> 00:06:53,830 చివరికి అదనపు బలగాలు అక్కడి చేరుకొని పరిస్థితిని తమ గుప్పెట్లోకి తెచ్చాయి. 38 00:07:11,932 --> 00:07:13,475 ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 39 00:07:14,184 --> 00:07:15,227 నీకే తెలుస్తుందిలే. 40 00:08:56,870 --> 00:08:59,289 ఇప్పటిదాకా నేను ఇంత ఎత్తు ఎక్కలేదు. 41 00:08:59,373 --> 00:09:00,374 అవునా? 42 00:09:01,917 --> 00:09:04,586 నా చిన్నప్పుడు, ఈ కట్టడాలన్నింటినీ ఎక్కేదాన్ని. 43 00:09:07,297 --> 00:09:09,758 నాకు చూపు ఉంది కదా, అందుకని నాకు ఈ ప్రాంతాలే సురక్షితమైనవిగా అనిపించేవి. 44 00:09:10,926 --> 00:09:13,804 ఇతరులు ఎవరూ రాలేని చోటికి వెళ్లడమంటే నాకు ఇష్టమేమో. 45 00:09:14,555 --> 00:09:16,139 నేను ఈ ఇంటిని కూడా అలాగే కనుగొన్నాను. 46 00:09:18,725 --> 00:09:20,686 అప్పటి నుండి నేనే దీన్ని చూసుకుంటున్నాను. 47 00:09:29,945 --> 00:09:32,155 జనాలు తమ చూపును బాగా సద్వినియోగపరుచుకొనేవారు. 48 00:09:32,948 --> 00:09:37,870 మనం వినడాన్ని, అనుభూతి చెందడాన్ని, ఇంకా వాసన పసిగట్టడాన్ని ఒక కళగా మలుచుకున్నాం 49 00:09:40,038 --> 00:09:42,332 కానీ వాళ్ల ప్రపంచమంతా చూపు మీదే ఆధారపడి నడిచింది. 50 00:09:45,794 --> 00:09:48,172 -జనాలు కూడా. -ఏంటి? 51 00:09:50,549 --> 00:09:52,509 మనుషులు కూడా ఒకరినొకరు చూసుకోవాలి. 52 00:10:25,584 --> 00:10:27,377 ఇది నాకు చాలా ఇష్టమైన పుస్తకం. 53 00:10:31,423 --> 00:10:34,551 ఈ చిత్రాల్లో ఉన్న అమ్మాయి గురించి నేను కథలు అల్లేదాన్ని, 54 00:10:39,014 --> 00:10:40,557 తనకి గ్వెండొలిన్ అని పేరు పెట్టాను. 55 00:10:44,353 --> 00:10:45,812 తన పేరు ఆలిస్. 56 00:10:49,066 --> 00:10:50,275 నీకు చదవడం వచ్చు. 57 00:11:02,412 --> 00:11:04,790 ఈ పుస్తకం పేరు "ఆలిసి ఇన్ వండర్ల్యాండ్". 58 00:11:10,921 --> 00:11:15,384 "ఆలీస్ కి, నది ఒడ్డున తన సోదరి పక్కన ఊరికే ఖాళీగా కూర్చొనీ కూర్చొనీ 59 00:11:16,051 --> 00:11:17,845 విసుగొచ్చేసింది." 60 00:11:18,470 --> 00:11:21,723 "ఒకట్రెండు సార్లు తన సోదరి చదువుతున్న పుస్తకంలోకి తను తొంగి చూసింది, 61 00:11:21,807 --> 00:11:24,434 కానీ అందులో బొమ్మలు కానీ సంభాషణలు కానీ లేవు." 62 00:11:24,518 --> 00:11:25,686 వద్దు! 63 00:11:26,687 --> 00:11:29,606 "బొమ్మలు, సంభాషణలు లేనప్పుడు ఈ పుస్తకం వల్ల ఉపయోగమేంటి, 64 00:11:30,732 --> 00:11:33,277 అని ఆలిస్ అనుకుంది." 65 00:11:34,820 --> 00:11:36,071 ఆపు. 66 00:11:42,911 --> 00:11:48,000 అన్నయ్య, నువ్వు బాగానే ఓర్చుకుంటున్నావు. 67 00:11:59,386 --> 00:12:02,764 నువ్వు నా వీపుకు పెట్టిన వాతల కంటే నీ వాతలు పెద్దవేమీ కాదులే. 68 00:12:08,937 --> 00:12:10,772 నువ్వు హనీవాని ఏం చేశావు? 69 00:12:11,732 --> 00:12:12,941 హనీవా? 70 00:12:15,027 --> 00:12:17,070 నీ కూతురికి ఏమవుతుందా అని నువ్వు భయపడుతున్నావు. 71 00:12:24,870 --> 00:12:26,830 భయం బాధ కన్నా భయంకరమైనది, కదా? 72 00:12:31,293 --> 00:12:33,337 నా చిన్నప్పుడు నాకు అలాగే ఉండేది. 73 00:12:36,048 --> 00:12:38,217 నువ్వు నన్ను పెట్టిన చిత్రవధ, 74 00:12:39,343 --> 00:12:44,389 ఆ బాధ మళ్లీ నాకు కలుగబోతోంది, నువ్వు మళ్లీ వస్తావు అన్న భయంతో పోల్చితే, 75 00:12:45,474 --> 00:12:47,392 అది చిన్నదే. 76 00:12:49,645 --> 00:12:51,813 నేను నీకు మాట ఇస్తున్నాను, 77 00:12:51,897 --> 00:12:56,568 ప్రతీరాత్రి నేను ఎంత భయం అనుభవించానో, అంతే భయం హనీవా కూడా అనుభవిస్తుంది. 78 00:13:02,241 --> 00:13:04,701 ఇడో, దయచేసి తనని వదిలేయ్. 79 00:13:05,786 --> 00:13:07,621 ఒకప్పుడు నువ్వు నా అన్నయ్యవి. 80 00:13:07,704 --> 00:13:10,207 ఇప్పటికీ నేను నీ అన్ననే. నేను చాలా బాధపడుతున్నాను. 81 00:13:10,290 --> 00:13:12,376 నేను నిన్ను కాపాడి ఉండాల్సింది. కానీ నేను బలవంతాన... 82 00:13:12,459 --> 00:13:17,130 నీకు బాధ అంటే ఏంటో తెలీదు. అప్పుడే నీకు తెలిసిరాదు. 83 00:13:17,965 --> 00:13:19,550 కానీ త్వరలో నీకు తెలుస్తుంది. 84 00:13:20,342 --> 00:13:22,302 ఎందుకంటే నేను నిన్ను ఇక్కడే ఉంచి... 85 00:13:23,512 --> 00:13:26,557 నువ్వు నన్ను ప్రతీరాత్రి కొట్టినట్టు, నేనూ నిన్ను కొరడాతో కొట్టిస్తాను. 86 00:13:27,349 --> 00:13:28,684 మరి ఇలా చాలా ఏళ్లు గడిచాక, 87 00:13:29,601 --> 00:13:31,687 చివరికి నిన్ను చంపాలని నేను నిర్ణయించుకున్నాక, 88 00:13:33,814 --> 00:13:36,108 అప్పుడు నువ్వు కృతజ్ఞతతో కుమిలిపోతావు. 89 00:13:37,734 --> 00:13:39,236 అతను స్పృహ కోల్పోకూడదు. 90 00:13:39,319 --> 00:13:41,363 -ఇడో. -అతను ప్రతీ దెబ్బని అనుభవించాలి. 91 00:13:41,446 --> 00:13:44,283 లేదు. ఇడో, తనని వదిలేయ్. 92 00:13:45,200 --> 00:13:48,120 ఇడో. ఇడో! 93 00:13:49,705 --> 00:13:50,706 ఇడో! 94 00:13:52,624 --> 00:13:55,294 ఇడో, వద్దు! తనని వదిలేయ్! 95 00:13:55,961 --> 00:13:57,421 ఇడో! 96 00:14:19,985 --> 00:14:20,986 అటెన్షన్. 97 00:14:22,988 --> 00:14:25,532 మూత్రం పోసి, నీళ్ళు నింపుకోవడానికి ఆగుదాం, ఆ వెంటనే ప్రయాణం మొదలుపెడదాం. 98 00:14:25,616 --> 00:14:26,617 అలాగే, సర్. 99 00:14:30,913 --> 00:14:32,497 నాకు స్నానం చేయాలనుంది. 100 00:14:33,665 --> 00:14:35,334 నువ్వు మా మనుషులకు దగ్గరగా ఉండకూడదు. 101 00:14:35,918 --> 00:14:37,628 వాళ్ళు ఆకలితో ఉన్నారు, అలసిపోయున్నారు, 102 00:14:38,295 --> 00:14:41,673 అదీగాక పరిస్థితులు బాగున్నప్పుడే వాళ్లకి మాంత్రికులు అంటే పడేది కాదు. 103 00:14:41,757 --> 00:14:42,758 పద. 104 00:14:48,972 --> 00:14:51,391 నువ్వు ఇప్పటిదాకా ఎంతమంది మాంత్రికులతో మాట్లాడావు? 105 00:14:52,059 --> 00:14:53,519 తొలిసారిగా నీతోనే మాట్లాడటం. 106 00:14:54,686 --> 00:14:58,273 మరి నేనే మొదటి వాడినైతే, మేము భయంకరమైనవాళ్లమని నీకెలా తెలుసు? 107 00:14:58,357 --> 00:15:02,986 నీలాంటి వాళ్లు పాత ప్రపంచాన్ని యంత్రాలతో, విషంతో నాశనం చేసేశారు. 108 00:15:03,070 --> 00:15:05,239 నీలాంటి వాళ్ల వల్ల కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. 109 00:15:05,322 --> 00:15:07,699 మరి నీలాంటి వాళ్ల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 110 00:15:09,368 --> 00:15:11,328 మీరు మా తెగ అయిన... 111 00:15:12,955 --> 00:15:15,541 అల్కెన్నీని భూమ్మీద లేకుండా చేసేశారు. 112 00:15:15,624 --> 00:15:18,544 మాంత్రికులకు ఆశ్రయమిస్తే పర్వవసానాలేంటో వాళ్ళకి బాగా తెలుసు. అది మా రాజ్య చట్టం. 113 00:15:18,627 --> 00:15:21,588 మీరు పిల్లలను చంపారు. పసికందులను కూడా చంపారు. 114 00:15:22,548 --> 00:15:23,757 అప్పుడు నేను అక్కడ లేను. 115 00:15:23,841 --> 00:15:25,843 ఉండుంటే ఏం చేసుండేవాడివి? 116 00:15:28,929 --> 00:15:30,681 నేను మాంత్రికుడిని. 117 00:15:30,764 --> 00:15:33,433 ఎవరు ఎక్కువ మందిని చంపారు? నువ్వా, నేనా? 118 00:15:46,280 --> 00:15:47,573 మహారాణి, 119 00:15:47,656 --> 00:15:51,952 పెన్సా యొక్క మహామహా మేధావులను, మీ రాజ్య వ్యవహరాల కౌన్సిల్ ని మీకు పరిచయం చేస్తున్నా. 120 00:15:53,120 --> 00:15:54,705 దేనికి కౌన్సిల్ అన్నారు? 121 00:15:55,873 --> 00:15:58,625 మీ రాజ్య వ్యవహరాల కౌన్సిల్, మహారాణి. 122 00:15:58,709 --> 00:16:02,129 మీకు సలహాలు ఇవ్వడానికి, మీ ఆదేశాలను అమలుపరచడానికి. 123 00:16:02,212 --> 00:16:07,509 మనం ఇక్కడ సమావేశమైంది సైనిక వ్యవహరాల కౌన్సిల్ కోసం, రాజ్య వ్యవహారాల కోసం కాదు. 124 00:16:08,635 --> 00:16:13,015 మహారాణి, ప్రోటోకాల్ ప్రకారం, యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాతే 125 00:16:13,098 --> 00:16:15,392 యుద్ధ వ్యవహరాల కౌన్సిల్ ని ఏర్పరచవలసి ఉంటుంది. 126 00:16:15,475 --> 00:16:18,604 ప్రోటోకాల్ గురించి నాకు పాఠాలు నేర్పుతున్నాడు. 127 00:16:18,687 --> 00:16:21,315 మన మీద యుద్ధం ప్రకటించబడింది. 128 00:16:21,857 --> 00:16:26,653 కెప్టెన్ గోసెట్, మీకు ఇప్పుడు ఎంత ప్రమాదం పొంచి ఉందో అర్థంకావడం లేదు. 129 00:16:26,737 --> 00:16:28,989 చింతించకండి, మహారాణి, నాకు అర్థమైంది. 130 00:16:29,781 --> 00:16:33,493 నేను ఇక్కడ చేప్పేదంతా సవినయంగా 131 00:16:33,577 --> 00:16:35,454 మీ అభీష్టానుసారమే చెప్తున్నాను. 132 00:16:36,163 --> 00:16:38,582 మనం త్రివాంటియన్ సైన్యమంతటి భారీ సైన్యాన్ని నిలువరించాలంటే, 133 00:16:38,665 --> 00:16:41,793 రాజ్యమంతా మన రక్షణ వ్యవస్థలను మనం మరింత కట్టుదిట్టం చేయాలి. 134 00:16:41,877 --> 00:16:43,837 -కెప్టెన్ గోసెట్... -రక్షణ వ్యవస్థలా? 135 00:16:44,379 --> 00:16:49,801 త్రివాంటియన్లను ఓడించమని దేవుడు మనల్ని ఆజ్ఞాపించాడు. 136 00:16:49,885 --> 00:16:52,262 మనం సిద్ధం అవ్వాల్సింది దాడి చేయడానికి, రక్షణను కట్టుదిట్టం చేయడానికి కాదు. 137 00:16:52,346 --> 00:16:53,931 -సిబెత్... -ఎవరు? 138 00:16:56,350 --> 00:16:59,228 మన్నించండి, మహారాణి. 139 00:17:00,646 --> 00:17:04,983 యువరాణి మాగ్రా, మీరేదైనా చెప్పాలనుకుంటే, చెప్పేయండి. 140 00:17:07,528 --> 00:17:09,945 కంజువా నాశనమైపోవడంతో, అలాగే మీరు చనిపోయారనుకొని చెలరేగిన గందరగోళంతో 141 00:17:10,030 --> 00:17:12,866 పయా బాగా బలహీనపడిపోయింది. 142 00:17:12,950 --> 00:17:15,410 మనం కొత్త రాజధానిని ప్రకటించి ఎంతో సమయం కూడా కాలేదు. 143 00:17:16,537 --> 00:17:19,748 బహుశా మనం మన రాజ్యా వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ, మన సేనలని 144 00:17:19,829 --> 00:17:21,834 వ్యవస్థీకరించి, కట్టుదిట్టం చేసుకోవాలేమో, 145 00:17:21,915 --> 00:17:26,171 అదే సమయంలో, త్రివాంటెస్ నుండి మనకున్న విపత్తు దృష్ట్యా జాగరూకత వహించాలి. 146 00:17:31,009 --> 00:17:33,887 అందరూ... వెళ్లిపోండి. 147 00:17:37,724 --> 00:17:39,142 వెళ్లిపోండి! 148 00:17:57,452 --> 00:17:58,620 సిబెత్... 149 00:18:00,622 --> 00:18:02,583 ఇప్పుడు ఏం జరిగిందో విన్నావా? 150 00:18:05,127 --> 00:18:06,128 ఏంటి? 151 00:18:07,421 --> 00:18:11,550 ఈ గది నిండా ఉన్న జనాలు నా అధికారాన్ని నిశ్శబ్దంగా ప్రశ్నిస్తున్నారు, 152 00:18:11,633 --> 00:18:15,387 అసలు వీళ్లు నాకు విధేయంగానే ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది. 153 00:18:17,389 --> 00:18:19,683 నాతో వాదులాడే కెప్టెన్. 154 00:18:21,310 --> 00:18:24,271 మన తలలని, మొండాలని వేరుచేయాలని, 155 00:18:24,354 --> 00:18:29,067 మన రాజ వంశాన్ని సమూలంగా అంతం చేసేయాలనే రాజ ద్రోహ ఆలోచనలను 156 00:18:29,151 --> 00:18:31,987 ప్రోత్సహించే రాజకీయ నాయకులు. 157 00:18:33,238 --> 00:18:36,158 అంతటి నమ్మకద్రోహంతో నిండి ఉన్న గదిలో, 158 00:18:36,992 --> 00:18:39,703 నా చెల్లే నాతో విభేదిస్తోంది. 159 00:18:41,997 --> 00:18:43,373 యుద్ధం అంటే మృత్యువును ఆహ్వానించడమే. 160 00:18:45,834 --> 00:18:49,296 నీ అబద్ధం కోసం ఎంతమందిని బలిపశువులను చేయాలనుకుంటున్నావు? 161 00:18:50,881 --> 00:18:54,092 చనిపోయేవారు వీరమరణం పొందుతారు... 162 00:18:55,469 --> 00:18:57,721 పయా కోసం... 163 00:18:58,722 --> 00:19:02,726 మన పిల్లలు నిర్మించే కొత్త లోకం కోసం. 164 00:19:02,809 --> 00:19:05,562 త్రివాంటియన్లు పయాను భూస్థాపితం చేసినప్పుడు, 165 00:19:05,646 --> 00:19:08,398 మనతో పాటు మన పిల్లలు కూడా చనిపోతారు. 166 00:19:08,482 --> 00:19:11,026 మనం వాళ్లని ఓడిస్తామంటే నీకు నమ్మకంగానే లేదు. 167 00:19:12,194 --> 00:19:14,821 దీని కోసం కాకపోతే, ఇక దేని కోసం నేను బతికింది? 168 00:19:16,031 --> 00:19:18,784 దేవుడు నా కడుపులో ఒక చూపున్న బిడ్డని ప్రసాదించాడు, 169 00:19:18,867 --> 00:19:21,495 ఆ బిడ్డకి మన నాన్న పేరు పెడతాను, 170 00:19:21,578 --> 00:19:27,376 మన రాజ్యం ప్రధాన కేంద్రంగా ఈ ప్రపంచంలోకి మరలా చూపు తీసుకురావాలన్నది దేవుని ఉద్దేశం. 171 00:19:27,459 --> 00:19:28,585 అదే నా విధి. 172 00:19:28,669 --> 00:19:32,506 దేవుడా. నువ్వు ఆ విషయాన్ని బాగా గుడ్డిగా నమ్ముతున్నావు. 173 00:19:34,633 --> 00:19:36,593 మనం త్రివాంటెస్ ని ఆక్రమించి, 174 00:19:36,677 --> 00:19:38,637 వారి సైన్యాన్ని మనదాంట్లోకి ఏకం చేసుకొని, 175 00:19:38,720 --> 00:19:42,766 ఈ నేలని ఏలే ఏకైక అసలైన రాజ్యంగా అవతరించనున్నాం. 176 00:19:43,892 --> 00:19:44,893 సిబెత్. 177 00:19:49,731 --> 00:19:50,774 సిబెత్. 178 00:19:53,110 --> 00:19:55,404 ఇంకో మార్గం ఖచ్చితంగా ఉంటుంది. 179 00:20:01,618 --> 00:20:03,161 స్వయంగా నువ్వే ఏం చేయలేకపోయావు... 180 00:20:04,288 --> 00:20:09,459 నీ అండతో టమాక్టీ జూన్ నన్ను చంపాలని తన కత్తిని తీసినప్పుడు. 181 00:20:09,543 --> 00:20:11,420 దేవుడు దాన్ని జరగనివ్వలేదు కదా. 182 00:20:11,837 --> 00:20:14,339 ఆ క్షణాన్ని నువ్వు మర్చిపోవద్దు, చెల్లి. 183 00:20:14,423 --> 00:20:19,469 అలాగే ఆ రోజు నేనే నిన్ను కాపాడానని, నువ్వు నన్ను కాపాడలేదని కూడా 184 00:20:19,553 --> 00:20:21,346 మర్చిపోవద్దు. 185 00:21:08,644 --> 00:21:09,645 హనీవా. 186 00:21:24,159 --> 00:21:27,663 ఇదే కనుక నా మంచం అయ్యుంటే, దీని మీద నుండి నేనస్సలు లేసేదాన్నే కాదు. 187 00:21:30,249 --> 00:21:31,667 దీన్ని చూపిస్తే ఖచ్చితంగా లేస్తావు. 188 00:21:42,135 --> 00:21:43,387 విలువైన రాళ్లు. 189 00:21:48,725 --> 00:21:51,186 ఇది ఆకాశం నుండి రాలిన ఒక ముక్కలా ఉంది. 190 00:21:54,940 --> 00:21:55,941 దాని మీద ఏం రాసుంది? 191 00:22:03,031 --> 00:22:04,032 "కలకాలం." 192 00:22:06,785 --> 00:22:08,036 చాలా బాగుంది. 193 00:22:10,289 --> 00:22:11,707 కానీ అది నిజం కాదు కదా. 194 00:22:12,541 --> 00:22:13,542 చాలా బాగుంది అనే విషయమా? 195 00:22:14,877 --> 00:22:15,919 కలకాలం అనే విషయం. 196 00:22:18,964 --> 00:22:20,299 బహుశా ఆ అనుభూతి కలకాలం పాటు ఉందేమో. 197 00:22:40,736 --> 00:22:41,904 నన్ను క్షమించు. 198 00:22:43,363 --> 00:22:44,573 లేదు. 199 00:22:44,656 --> 00:22:46,200 లేదు. 200 00:22:57,252 --> 00:23:01,089 పయాన్ రాణి తన కడుపులో చూపున్న బిడ్డ ఉందని ప్రకటించింది. 201 00:23:01,840 --> 00:23:04,218 అంతేగాక, కంజువా రాజధాని నగరాన్ని 202 00:23:04,301 --> 00:23:06,220 దాడి చేసింది మన సైన్యమేనని కేన్ మహారాణి చెప్తోంది. 203 00:23:06,303 --> 00:23:08,305 అయితే మహారాణి వాళ్ల ప్రజలకు అబద్ధం చెప్పింది. 204 00:23:08,388 --> 00:23:11,517 అలాంటప్పుడు, తన కడుపులో పెరిగేది చూపుగల బిడ్డే అని ఆమె నిజం చెప్తుందని 205 00:23:11,600 --> 00:23:13,727 మనం ఎందుకు నమ్మాలి? 206 00:23:14,186 --> 00:23:15,646 ఆమెకి ఆ విషయం ఎలా తెలుస్తుంది? 207 00:23:15,729 --> 00:23:19,525 ఆ బిడ్డ తండ్రికి చూపు ఉంటే ఆ విషయం తనకి తెలిసే అవకాశం ఉంది. 208 00:23:19,608 --> 00:23:21,693 అక్కడే ఆగండి, కమాండర్ జనరల్. 209 00:23:21,777 --> 00:23:23,904 ఎందుకంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. 210 00:23:23,987 --> 00:23:28,116 పయాన్ రాజ్యంలో చూపుగల మగవాడు కనీసం ఒక్కడైనా ఉన్నాడని అనేక కథనాలు ఉన్నాయి. 211 00:23:28,200 --> 00:23:30,244 మీరు జెర్లామరెల్ గురించి మాట్లాడుతున్నారు. 212 00:23:30,327 --> 00:23:33,288 జెర్లామరెల్ అసలు మనిషే కాదు. అది పనీపాటా లేని వాళ్ళు అల్లిన ఒక పాత్ర. 213 00:23:33,372 --> 00:23:35,791 ఆ విషయం మనకి ఖచ్చితంగా తెలీదు. 214 00:23:35,874 --> 00:23:39,920 జనరల్ వాస్, గానైట్లు మన పశ్చిమ సరిహద్దుపై ఆపకుండా 215 00:23:40,003 --> 00:23:41,505 దండయాత్రలు చేస్తూనే ఉన్నారు, 216 00:23:41,588 --> 00:23:44,258 ఇప్పుడు ఒక పుకారు, ఇంకా ఒక పాపిష్ఠి కల్పిత కథ ఆధారంగా మీరు తూర్పు సరిహద్దు ప్రాంతంలో 217 00:23:44,341 --> 00:23:45,968 కూడా సైనిక స్థావరాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు 218 00:23:46,051 --> 00:23:48,470 ప్రపంచంలోకి చూపు తిరిగి వస్తుంది. 219 00:23:49,096 --> 00:23:51,139 దాని శక్తిని ఏ దేశమైతే ముందుగా 220 00:23:51,223 --> 00:23:52,933 సద్వినియోగం చేసుకుంటుందో, అదే ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. 221 00:23:53,016 --> 00:23:56,436 కేవలం ఈ ఊహాగానాల వాదనలను వినీవినీ కౌన్సిల్ కి చిరాకు వస్తోంది. 222 00:23:57,563 --> 00:24:01,191 చూపున్నవారికి ఏ దేశమైతే తమ సమాజంలో సముచిత స్థానం ఇస్తుందో, 223 00:24:01,275 --> 00:24:03,652 అది దాని వినాశనానికే బాటలు వేసుకున్నట్టు లెక్క. 224 00:24:03,735 --> 00:24:07,489 అనుకోకుండా చూపున్న వారు ఎవరైనా పుట్టుకొస్తే, 225 00:24:07,573 --> 00:24:11,410 మన రాజ్యానికి వారిని ముప్పుగా పరిగణించి వారికి మరణ శిక్ష విధించబడుతుంది. 226 00:24:11,493 --> 00:24:14,371 ఇతర దేశాలు అలా అనుకోకపోవచ్చు. 227 00:24:15,747 --> 00:24:18,166 గత 200 ఏళ్లలో మనం ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు. 228 00:24:18,250 --> 00:24:21,128 ఇప్పుడు ఓడిపోతామని అనుకోవడానికి పెద్ద కారణం కూడా ఏమీ లేదు. 229 00:24:22,671 --> 00:24:27,384 చూపుపై మీకున్న పిచ్చి, ఒకప్పుడు వ్యూహాత్మక అభ్యాసంగా బాగానే అనిపించింది, 230 00:24:27,467 --> 00:24:29,761 కానీ ఇప్పుడు దాని వల్ల మనం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. 231 00:24:29,845 --> 00:24:33,056 మనం మన శ్రద్ధనంతా పశ్చిమం వైపు ఉంచాలి, 232 00:24:33,140 --> 00:24:36,602 అక్కడ గానైట్ల సైన్యం రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. 233 00:24:36,685 --> 00:24:38,770 జనాలు, సైన్యంతో ఏకీభవిస్తున్నారు. 234 00:24:38,854 --> 00:24:40,397 బ్యాంక్, జనాలతో ఏకీభవిస్తుంది. 235 00:24:44,526 --> 00:24:45,611 కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 236 00:24:46,612 --> 00:24:49,323 మీ సేవకు ధన్యవాదాలు, కమాండర్ జనరల్. 237 00:25:04,213 --> 00:25:05,214 శుభోదయం. 238 00:25:07,549 --> 00:25:08,800 నాకు నిద్ర వచ్చేసింది. 239 00:25:12,429 --> 00:25:14,306 నిన్ను లేపాలని నాకు అనిపించలేదు. 240 00:25:16,016 --> 00:25:17,726 దేని గురించి ఆలోచిస్తున్నావు? 241 00:25:22,439 --> 00:25:23,607 నిన్ను వదిలేస్తే... 242 00:25:25,359 --> 00:25:27,611 ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను. 243 00:25:35,285 --> 00:25:37,120 నువ్వు కూడా నాతో వచ్చేయవచ్చు. 244 00:25:38,664 --> 00:25:44,211 నాకు ఇక్కడ ఒక జీవితం, కుటుంబం, ఇంకా కెరీర్ ఉంది. 245 00:25:44,878 --> 00:25:48,715 నీకు చూపున్న కారణంగా నిన్ను చంపేస్తారు, అలాంటి చోట ఎందుకు ఉండటం? 246 00:25:51,385 --> 00:25:54,555 నాకు చూపు తప్ప ఇంకేమీ లేదన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. 247 00:25:57,015 --> 00:25:58,725 నేను త్రివాంటెస్ సైనికురాలిని. 248 00:26:00,435 --> 00:26:03,438 త్రివాంటెస్ కోసం పోరాడి ప్రాణాలు అర్పించి దాన్ని నిర్మించిన మా పూర్వీకులకు 249 00:26:03,522 --> 00:26:06,191 నేను కూతురిని, మనవరాలిని, 250 00:26:06,275 --> 00:26:08,193 మునిమనవరాలిని. 251 00:26:08,861 --> 00:26:11,405 నీ రహస్యం బయటపడితే అదంతా ఎవరూ పట్టించుకోరు. 252 00:26:13,407 --> 00:26:14,950 మనం తూర్పు వైపుకు వెళ్లవచ్చు. 253 00:26:15,784 --> 00:26:17,411 నువ్వు నా సోదరుడిని కలుసుకోవచ్చు. 254 00:26:19,705 --> 00:26:22,666 బహుశా మనలాంటి ఇతర వ్యక్తులని మనం కలుసుకోవచ్చేమో. 255 00:26:23,542 --> 00:26:25,085 మనం ప్రపంచాన్ని మార్చవచ్చు. 256 00:26:29,798 --> 00:26:31,550 మనం ప్రత్యేకమైనవాళ్ళమని నువ్వు అనుకుంటున్నావు. 257 00:26:32,926 --> 00:26:34,011 కానీ అది నిజం కాదు. 258 00:26:35,888 --> 00:26:39,266 మనం... అందరికీ భిన్నంగా ఉన్నామంతే. 259 00:26:40,976 --> 00:26:43,437 మనం భిన్నంగా ఉన్నాం కాబట్టి మనం ప్రత్యేకమైన వాళ్ళమని నా అభిప్రాయం. 260 00:26:47,232 --> 00:26:49,359 చూపు రావాలని రాసి పెట్టుంటే, ఖచ్చితంగా వస్తుంది. 261 00:26:51,904 --> 00:26:54,281 ప్రపంచాన్ని మార్చడం మన కర్తవ్యం కాదు. 262 00:26:56,074 --> 00:26:57,910 మన కర్తవ్యం... 263 00:26:59,620 --> 00:27:03,457 మనం ఉన్న ప్రాంతాన్ని మన చూపు ద్వారా మరింత మెరుగ్గా మార్చడం. 264 00:27:06,835 --> 00:27:08,212 మరి అదెలా చేస్తాం? 265 00:27:12,090 --> 00:27:13,133 అంటే... 266 00:27:16,220 --> 00:27:18,138 ముందు నాకు చదివి వినిపించడం ద్వారా నువ్వు ఆ పని ప్రారంభించవచ్చు. 267 00:27:25,479 --> 00:27:26,897 ఆనందంగా చదివి వినిపిస్తాను. 268 00:27:36,198 --> 00:27:38,659 "ఈ ఉదయం నుండి నేను చేసినవాటితో మొదలుపెట్టి 269 00:27:38,742 --> 00:27:42,412 నీకు నా సాహసాలన్నింటినీ చెప్పగలను," అని ఆలిస్ కాస్త జంకుతూ చెప్పింది. 270 00:27:43,247 --> 00:27:46,750 "కానీ నిన్న చేసిన వాటిని చెప్పి ప్రయోజనం లేదు, 271 00:27:47,334 --> 00:27:49,169 ఎందుకంటే నిన్న నేను వేరే మనిషిని." 272 00:28:05,352 --> 00:28:08,814 ఇతనేనా మహా యోధుడైన... బాబా వాస్. 273 00:28:12,943 --> 00:28:14,903 ఇప్పుడు నువ్వు అసలు యోధుడివే కాదు కదా? 274 00:28:22,077 --> 00:28:23,161 వెనక్కి వెళ్లు! 275 00:28:25,706 --> 00:28:26,707 పైకి లేవకు! 276 00:28:27,332 --> 00:28:29,835 -కిందనే ఉండు! -నా ముక్కు విరగ్గొట్టావు! 277 00:28:32,754 --> 00:28:33,881 సర్. 278 00:28:43,932 --> 00:28:45,142 బాబా వాస్. 279 00:28:46,602 --> 00:28:48,645 నాలుగు రోజులు నరకయాతన అనుభవించావు. 280 00:28:50,772 --> 00:28:52,274 నిజానికి నేను నీకు ధన్యవాదాలు చెప్పాలి. 281 00:29:00,699 --> 00:29:04,203 మన్నించు. నీళ్ళు తప్ప నీకు ఇప్పుడు మద్యం ఇచ్చే స్థితిలో నేను లేను. 282 00:29:06,622 --> 00:29:09,750 కానీ... ఇదుగో. 283 00:29:24,139 --> 00:29:26,183 నీ గొంతు నాకు సుపరిచితమే, మాంత్రికాంతకా. 284 00:29:28,602 --> 00:29:30,062 నా పీడకలల్లో దాన్ని విన్నాను. 285 00:29:33,440 --> 00:29:35,150 టమాక్టీ జూన్. 286 00:29:37,236 --> 00:29:38,445 నువ్వు నా భార్యని చంపేశావు. 287 00:29:40,822 --> 00:29:42,908 నువ్వు నేను చావాలని కోరుకోవడంలో ఏ తప్పూ లేదు. 288 00:29:42,991 --> 00:29:45,786 నీపై, నీ ప్రజలపై నేను ఎన్నో ఘోరాలు చేశాను, 289 00:29:45,869 --> 00:29:47,746 కానీ నీ భార్యను మాత్రం నేను చంపలేదు. 290 00:29:47,829 --> 00:29:50,582 ఏదోక క్షణంలో ఈ ఊచలను దాటి నీ దగ్గరికి వస్తాను. 291 00:29:50,666 --> 00:29:53,252 అప్పుడు నీకు నరకం చూపిస్తాను. 292 00:29:53,335 --> 00:29:56,839 నేను చెప్పేది విను. చంపే ప్రయత్నం మార్గా మీద జరగలేదు, నా మీద జరిగింది. 293 00:29:56,922 --> 00:29:59,591 నీ నోటితో ఆ పేరు పలకకు! నీ నోటితో ఆ పేరు పలకకు! 294 00:29:59,675 --> 00:30:02,678 నేను తనని పల్లెత్తు మాట కూడా అనలేను. తను నాకు యువరాణి. 295 00:30:02,761 --> 00:30:04,596 యువరాణా? నువ్వేం మాట్లాడుతున్నావు? 296 00:30:04,680 --> 00:30:06,139 నువ్వు నోటికొచ్చిందల్లా వాగుతున్నావు, మాంత్రికాంతకా. 297 00:30:06,223 --> 00:30:09,685 నీ భార్య రాజాదిరాజు, వుల్ఫ్ కేన్ కి పుట్టింది. 298 00:30:09,768 --> 00:30:13,480 పయాన్ సింహాసనానికి అసలైన వారసురాలిగా తనని సంరక్షించాల్సిన బాధ్యత నాపై ఉండింది. 299 00:30:13,564 --> 00:30:15,691 అది అబద్ధం. నువ్వు అబద్ధమాడుతున్నావు. 300 00:30:15,774 --> 00:30:21,780 ఈ స్థితిలో కూడా నీతో అబద్ధమాడవలసిన అవసరం ఏముంటుందని ఒకసారి ఆలోచించు. 301 00:30:21,864 --> 00:30:26,869 అయితే, నా భార్య, ఎవరి పిల్లలనైతే పుట్టిననాటి నుండి నువ్వు చంపాలని ప్రయత్నించావో, 302 00:30:28,161 --> 00:30:29,830 ఆమె నీకు యువరాణి అని అంటున్నావా? 303 00:30:29,913 --> 00:30:31,999 నేను చెప్తోంది అదే. 304 00:30:32,374 --> 00:30:35,335 మహారాణితో పాటు ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయినప్పుడు 305 00:30:35,419 --> 00:30:40,507 ఆమే బతికే ఉంది అని కూడా నీకు నేను చెప్తున్నాను. 306 00:30:53,979 --> 00:30:55,397 -అంతే. -కర్రని అటూఇటూ అనాలి, నాన్నా. 307 00:30:56,148 --> 00:30:58,233 అలా అన్నప్పుడు కింద తడుతూ ఉండాలి. 308 00:30:59,943 --> 00:31:01,320 వీలైతే నేలని ప్రతీసారి తాకుతూ ఉండేలా తట్టాలి. 309 00:31:04,198 --> 00:31:05,699 కర్రను బయటపక్కకి పెట్టి తట్టు, నాన్నా. 310 00:31:05,782 --> 00:31:08,827 నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు. అంతే. పోనుపోనూ అలవాటైపోతుంది, నాన్నా. 311 00:31:08,911 --> 00:31:10,370 నాతో నేనేదో చంటిపిల్లాడిలా మాట్లాడవద్దు. 312 00:31:15,334 --> 00:31:17,503 వదులు! 313 00:31:17,586 --> 00:31:21,048 ఎవరి సహాయం లేకుండానే నేను వెళ్లగలను! అర్థమైందా? 314 00:31:33,101 --> 00:31:34,394 ఏం చేద్దాం? 315 00:31:34,478 --> 00:31:36,563 అతనికే అలవాటైపోతుందిలే. కాస్త సమయమిస్తే సరిపోతుంది. 316 00:31:37,105 --> 00:31:38,315 దైవ జ్వాల. 317 00:31:39,900 --> 00:31:44,154 నాకు తెలిసిన, అలాగే తెలియని శత్రువుల నుండి నన్ను నువ్వు కాపాడావు. 318 00:31:46,532 --> 00:31:52,246 నీ విధేయురాలికి మార్గం చూపు. బలహీనురాలిని కాకూడదన్న నా సంకల్పానికి శక్తిని చేకూర్చు. 319 00:31:55,874 --> 00:32:00,796 నన్ను చల్లగా చూస్తున్నన్నాళ్ళు... నీ అభీష్టాన్ని నెరవేరుస్తాను. 320 00:32:00,879 --> 00:32:02,798 మహారాణీ? 321 00:32:05,300 --> 00:32:06,301 ఛీ. 322 00:32:06,385 --> 00:32:08,178 మన్నించండి, మహారాణి. 323 00:32:08,262 --> 00:32:10,848 హార్లన్ ప్రభువు, మిమ్మల్ని కలవాలంటున్నారు. 324 00:32:10,931 --> 00:32:12,808 అతని పంపించి, నువ్వు వెళ్లిపో. 325 00:32:12,891 --> 00:32:14,101 అలాగే, మహారాణి. 326 00:32:20,649 --> 00:32:21,817 అవును. 327 00:32:22,818 --> 00:32:25,779 నాకు లావెండర్ పాల స్నానం వాసన అంటే ప్రాణం. 328 00:32:27,364 --> 00:32:28,991 హార్లన్ ప్రభువు, 329 00:32:29,074 --> 00:32:31,702 మీకు హోదాలను మరిచి చొరవ తీసుకొనే అలవాటు బాగా ఉన్నట్టుంది. 330 00:32:31,785 --> 00:32:34,621 దాన్ని కొందరు అమర్యాదగా భావించే అవకాశం ఉంది. 331 00:32:34,705 --> 00:32:35,956 అదేం లేదులెండి. 332 00:32:37,165 --> 00:32:40,127 నా చిన్నతనంలో మీ నాన్న గారి ఆస్థానంలో 333 00:32:40,210 --> 00:32:42,504 మనం గడిపిన క్షణాలను తలచుకొని ఆస్వాదిస్తున్నాను. 334 00:32:44,298 --> 00:32:49,553 కేవలం మహారాణి, సేవకుడి మధ్య ఉండే విధేయత కన్నా, ఆ విధేయత చాలా దృఢమైనది. 335 00:32:50,179 --> 00:32:51,305 మీరేమంటారు? 336 00:32:52,848 --> 00:32:54,933 ఆ విధేయత గురించి మాట్లాడటానికే నేను ఇక్కడికి వచ్చాను. 337 00:32:59,062 --> 00:33:01,773 నాకు ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి. 338 00:33:03,400 --> 00:33:08,864 కొత్త రాజధానిని ప్రకటించిన వెంటనే యుద్ధం ప్రకటించడం, సాహసవంతమైన చర్యే. 339 00:33:11,408 --> 00:33:14,870 -యుద్ధం చేసే ధైర్యం మీకు లేకపోతే... -నాకు ఓడిపోవడానికి మనస్సు ఒప్పదు. 340 00:33:14,953 --> 00:33:18,665 అదృష్టవశాత్తూ, మీరు గెలిచే పక్షానే ఉన్నారులే. 341 00:33:21,210 --> 00:33:22,211 నన్ను పెళ్లి చేసుకోండి. 342 00:33:27,049 --> 00:33:31,261 అహా. ఇలాంటి ప్రతిస్పందన వస్తుందని నేను ఊహించలేదు. 343 00:33:31,345 --> 00:33:33,680 మీ ఆత్మవిశ్వాసం నన్నే ఆశ్చర్యపరిచింది, 344 00:33:33,764 --> 00:33:36,350 బహుశా మీరు ప్రపంచాన్ని కొత్త కోణం నుంచి చూడటం మొదలుపెట్టాలేమో. 345 00:33:36,433 --> 00:33:40,771 మీకు నా అవసరం, నా సైన్యం అవసరం, నా ప్రజల అవసరం ఉంది. 346 00:33:40,854 --> 00:33:42,648 మీ ఉద్దేశం, నా సైన్యం, నా ప్రజలు. 347 00:33:44,441 --> 00:33:48,070 మీరు ప్రపంచంలోనే అత్యంత పెద్ద సైనిక దేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. 348 00:33:48,153 --> 00:33:50,030 కనీసం గెలుపు అనే ఆలోచనకైనా, 349 00:33:50,113 --> 00:33:53,200 మీకు ఇక్కడి ప్రతీ వ్యక్తి నుంచి ఎన్నటికీ తరగిపోని విధేయత అవసరం అవుతుంది. 350 00:33:53,909 --> 00:33:57,538 పెన్సా మీ వశం అయితే, పయా మొత్తం మీ చేతుల్లో ఉన్నట్టే. 351 00:33:58,914 --> 00:34:00,916 పెన్సా ఇప్పుడు నా వశంలోనే ఉందనుకున్నానే. 352 00:34:02,793 --> 00:34:04,211 అవును. 353 00:34:05,295 --> 00:34:09,466 మీ ప్రజలు మిమ్మల్ని కాపాడటానికి తమ ప్రాణాలనైనా అర్పిస్తారు, కానీ... 354 00:34:10,759 --> 00:34:12,844 వాళ్లు మంత్రగత్తె అని భావించే మీ శిశువును కాపాడే విషయానికి వచ్చేసరికి, 355 00:34:12,928 --> 00:34:15,639 ఒకట్రెండు సార్లు ఆలోచించే అవకాశం ఉంది. 356 00:34:19,768 --> 00:34:21,812 అదే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే? 357 00:34:23,313 --> 00:34:25,858 నేను చాలా కాలం నుండి ఇక్క చట్టాన్ని పరిరక్షించే ప్రభువుగా ఉన్నాను. 358 00:34:27,568 --> 00:34:32,155 చూపున్నవాడికి పినతండ్రిగా, ఎవరి మనస్సులైతే మార్చాలో వాళ్ళ మనస్సులను నేను మార్చగలను. 359 00:34:34,241 --> 00:34:38,203 మీ స్థానాన్ని మరింత బలపరచడానికి నాకు ఇంతకన్నా మంచి దారి కనబడలేదు. 360 00:34:40,998 --> 00:34:42,791 అలాగే మీ స్థానాన్ని కూడా కదా. 361 00:34:44,668 --> 00:34:46,043 అవును, నాది కూడా. 362 00:34:48,255 --> 00:34:50,047 లేకపోతే నేనెందుకు ఇలా చేస్తాను? 363 00:34:55,137 --> 00:34:56,429 మీరు నా చెల్లిని పెళ్లి చేసుకోవచ్చు. 364 00:34:57,639 --> 00:35:00,434 చూపున్న తన రాజ వంశ సంతానానికి పినతండ్రిగా ఉండండి. 365 00:35:00,517 --> 00:35:01,935 తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 366 00:35:09,067 --> 00:35:11,278 మాగ్రాకి ఇదివరకే పెళ్లయింది కదా? 367 00:35:13,655 --> 00:35:15,240 బాబా వాస్ చనిపోయాడు. 368 00:35:15,324 --> 00:35:17,492 ఏదేమైనా, ఆల్కెన్నీ గుడారాల్లో చేసే సంసారం 369 00:35:17,576 --> 00:35:19,828 పయాన్ చట్టం ప్రకారం వివాహం కిందికి రాదు. 370 00:35:23,373 --> 00:35:26,210 మాగ్రా కూడా అలాగే భావిస్తుందని నాకనిపించడం లేదు. 371 00:35:28,212 --> 00:35:32,508 హార్లన్ ప్రభువు, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. 372 00:35:38,263 --> 00:35:39,640 ఆమెతో మీరు మాట్లాడతారా? 373 00:35:41,308 --> 00:35:42,309 అవును. 374 00:35:44,603 --> 00:35:48,315 ఇప్పుడు ఇలా వచ్చి మీ రాణికి పాదాభివందనం చేయండి. 375 00:35:51,276 --> 00:35:52,402 ద్వారాన్ని తెరువు! 376 00:35:57,324 --> 00:35:58,867 రెండు ఫర్లాంగులు ముందుకు. 377 00:36:01,912 --> 00:36:04,248 కుడి వైపుకు. 378 00:36:07,251 --> 00:36:08,752 రా. మనం ఇక్కడ ఉండకూడదు. 379 00:36:09,628 --> 00:36:11,171 ఒక్క నిమిషం, ఆగు. 380 00:36:13,966 --> 00:36:15,175 నేరుగా ముందుకు. 381 00:36:19,888 --> 00:36:21,473 ఎడమ వైపుకు, రెండు అడుగులు. 382 00:36:21,557 --> 00:36:22,891 ఆ పిల్లాడు చూడగలడు. 383 00:36:22,975 --> 00:36:24,560 నేను ఎడమ వైపుకు అన్నాను! 384 00:36:24,643 --> 00:36:26,228 నువ్వు ఒక్కదానివే అని అన్నావు మరి. 385 00:36:26,311 --> 00:36:28,981 అది ఇడో యొక్క రహస్య కార్యచరణ. ఆ పిల్లాడు జెర్లామరెల్ కొడుకు. 386 00:36:29,064 --> 00:36:31,066 జనరల్ తో అతనికి ఉన్న ఒప్పందం ప్రకారం అతను ఈ పిల్లాడికి శిక్షణ ఇచ్చాడు. 387 00:36:31,149 --> 00:36:33,360 జెర్లామరెల్? 388 00:36:33,443 --> 00:36:35,529 అయితే, అతను ఊరికే అలా... 389 00:36:35,612 --> 00:36:37,573 అలా తన కొడుకుని ఇచ్చేశాడా? 390 00:36:38,699 --> 00:36:40,492 రెన్, వాడొక చిన్న పిల్లాడు! 391 00:36:47,875 --> 00:36:51,503 నన్ను కూడా అలాగే వదిలేశాడు. నీకు అర్థమవుతోందా? 392 00:36:52,171 --> 00:36:53,463 నన్ను చావడానికని వదిలేశాడు. 393 00:36:54,089 --> 00:36:57,342 -నువ్వేమీ చావవులే. -ఇడో నన్ను వదలడని మనిద్దరికీ తెలుసు. 394 00:37:00,596 --> 00:37:01,722 హనీవా. 395 00:37:03,390 --> 00:37:04,725 హనీవా. 396 00:37:04,808 --> 00:37:09,146 నిన్ను సురక్షితంగా ఉంచడానికి నేను నా శాయశక్తులా కృషి చేస్తాను. మాటిస్తున్నాను. 397 00:37:09,855 --> 00:37:11,356 నువ్వు నా మీద నమ్మకం ఉంచాలి. 398 00:37:23,368 --> 00:37:24,369 నేను నమ్ముతున్నాను. 399 00:37:33,921 --> 00:37:34,922 వెళ్లు. 400 00:37:40,761 --> 00:37:42,012 జనరల్, సర్. 401 00:37:42,095 --> 00:37:46,058 లెఫ్టినెంట్. ఆ బందీని కింద ఉన్న వీధికి తీసుకురా. 402 00:37:46,683 --> 00:37:48,143 ఎందుకు? ఏం జరుగుతోంది? 403 00:37:50,646 --> 00:37:53,649 అమ్మాయిని కిందికి తీసుకురా. ఇప్పుడే. 404 00:38:39,653 --> 00:38:40,988 నాన్నా? 405 00:38:42,072 --> 00:38:43,407 నాన్నా! 406 00:38:46,952 --> 00:38:49,371 నన్ను క్షమించు. ఇదంతా నా వల్లే జరిగింది. 407 00:38:49,454 --> 00:38:53,542 కడసారిగా నీ కూతురి ఏడుపులను వినే అవకాశాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను... 408 00:38:54,877 --> 00:38:57,379 ఆ తర్వాత తనని రిపబ్లిక్ కి పంపించేస్తాను, తను వాళ్లకి ఉపయోగపడుతుంది. 409 00:39:02,009 --> 00:39:03,719 త్రివాంటెస్ ప్రజలారా, 410 00:39:04,636 --> 00:39:07,848 పరమ పిరికి పంద అయిన బాబా వాస్ ని ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాను. 411 00:39:07,931 --> 00:39:09,516 హంతకుడు! 412 00:39:10,809 --> 00:39:16,148 ఇతను నా తండ్రి టియో వాస్ ని చంపి, ఈ నగరాన్ని 413 00:39:17,024 --> 00:39:18,066 విడిచి పారిపోయి, 414 00:39:18,817 --> 00:39:20,110 ఇరవై అయిదేళ్ళు అయింది. 415 00:39:20,944 --> 00:39:26,033 కానీ వెయ్యి ఏళ్ళు అయినా కూడా, త్రివాంటియన్ న్యాయం 416 00:39:26,116 --> 00:39:28,410 మరిచిపోదు, తగ్గదు కూడా. 417 00:39:29,536 --> 00:39:31,330 ఇక పోనివ్వండి! 418 00:39:31,413 --> 00:39:32,497 ఒకసారి నగరమంతా తిప్పండి. 419 00:39:33,081 --> 00:39:35,000 అయ్యో, అయ్యయ్యో, నాన్నా. 420 00:39:35,083 --> 00:39:39,838 -వద్దు, ఆపండి. -హంతకుడు! 421 00:39:42,508 --> 00:39:43,550 పిరికిపంద! 422 00:39:45,886 --> 00:39:49,848 -హనీవా! -వద్దు! వద్దు, వద్దు. 423 00:39:49,932 --> 00:39:52,809 వద్దు, దయచేసి నా మాట వినండి. వద్దు. 424 00:39:55,646 --> 00:39:58,273 జనరల్, తనని ఇంకొంత కాలం పాటు నాతోనే ఉంచవచ్చు కదా? 425 00:39:58,690 --> 00:40:00,484 తన నుండి చాలా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. 426 00:40:00,567 --> 00:40:04,279 లేదు. ఇప్పటికే నీ మీద తన బరువు బాధ్యతలు ఎక్కువ ఉంచాను, రెన్. 427 00:40:04,363 --> 00:40:09,368 అదీగాక, విశ్వసనీయ సమాచారం కాకుండా తనతో మనకు ఇంకా ముఖ్యమైన పని ఉంది. 428 00:40:10,827 --> 00:40:12,913 బందీని నా ఇంటికి తీసుకువెళ్లండి. ఇప్పుడే. 429 00:40:12,996 --> 00:40:13,997 సర్! 430 00:40:14,081 --> 00:40:15,082 తనని తీసుకెళ్లండి! 431 00:40:17,334 --> 00:40:19,878 పద! నడువు. ఇప్పుడే! 432 00:40:19,962 --> 00:40:21,046 ప్లీజ్... 433 00:40:26,844 --> 00:40:29,638 మహరాణి కేన్. 434 00:40:30,681 --> 00:40:34,268 యువరాణి మాగ్రా. 435 00:40:39,022 --> 00:40:42,818 జనాల మధ్య నడవడమా? సాధారణంగా ఇలాంటివి నువ్వు చేయవే. 436 00:40:43,610 --> 00:40:46,905 పెన్సా పౌరులు మొదట్నుంచీ సింహాసనానికి దూరంగానే ఉన్నారు. 437 00:40:46,989 --> 00:40:50,450 వాళ్ల మనస్సులను గెలవడానికి మనం మన చేతనైనంత చేయాలి. 438 00:40:51,243 --> 00:40:54,413 ఓ. మనం చేసేది అదే అన్నమాట. మనం మనస్సులను గెలుచుకొనే పనిలో ఉన్నాం. 439 00:40:54,496 --> 00:40:58,542 అవును. కానీ నీకు ఉపయోగకరంగా ఉండాలనుందంటే, 440 00:40:59,168 --> 00:41:02,588 దీనికన్నా ముఖ్యమైన మరింత వ్యూహాత్మక అడుగులను మనం చాలా వేయవచ్చు. 441 00:41:02,671 --> 00:41:05,841 -వ్యూహాత్మక అడుగులా? -హార్లన్ కి నువ్వు పెళ్ళాడతావని చెప్పా. 442 00:41:06,508 --> 00:41:07,509 ఏంటి? 443 00:41:09,428 --> 00:41:11,763 -ఏంటి? కామెడీ చేస్తున్నావు. -లేదు. 444 00:41:11,847 --> 00:41:13,473 కేన్ మహారాణి... 445 00:41:13,557 --> 00:41:15,559 అయితే నువ్వు నేననుకున్నదాని కన్నా పిచ్చిదానివి. 446 00:41:15,642 --> 00:41:18,645 నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు. ఇది కేవలం ఒక వ్యావహారిక ఒప్పందం మాత్రమే. 447 00:41:18,729 --> 00:41:20,230 నీకు ఇదేంటో తెలుసా? 448 00:41:24,151 --> 00:41:25,986 సరిగ్గా ఏర్పడని దైవెముక. 449 00:41:26,069 --> 00:41:30,157 ఇది వివాహబంధం తాలూకు గుర్తు, నా కోసం నా భర్త బాబా వాస్ దీన్ని చేశాడు. 450 00:41:30,866 --> 00:41:33,202 ఆల్కెన్నీ వివాహాలను పయాన్ చట్టం గుర్తించదు. 451 00:41:33,285 --> 00:41:37,998 కాబట్టి ఒకవేళ బాబా వాస్ బతికే ఉన్నా కానీ అతడిని నువ్వు మోసం చేసినట్టేమీ కాదు. 452 00:41:39,666 --> 00:41:41,919 నువ్వు మామూలు తిరుగుబోతువి కాదు. 453 00:41:43,212 --> 00:41:44,796 నువ్వు నన్ను ఇష్టమొచ్చినట్టు తిట్టుకో, 454 00:41:46,048 --> 00:41:50,427 కానీ నేను నీ పిల్లలకు పయాన్ ని ఓ సురక్షిత ప్రదేశంగా చేస్తానని మాటిచ్చాను, అదే చేశాను. 455 00:41:51,136 --> 00:41:55,224 కానీ మనం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామో నువ్వు గ్రహించలేకపోతున్నావు. 456 00:41:56,016 --> 00:41:58,352 హార్లన్ కి కంజువా విషయంలో ఏదో జరిగిందని అనుమానంగానే ఉంది. 457 00:41:58,852 --> 00:42:02,147 మనం అతని నగరాన్ని తీసేసుకున్నాం. మన వల్ల అతనికి కనీసం ఒక్క ప్రయోజనమైనా దక్కకపోతే, 458 00:42:02,231 --> 00:42:04,775 మన మీద దారుణమైన తిరుగుబాటు జరిగే ప్రమాదముంది. 459 00:42:06,068 --> 00:42:11,823 నువ్వన్నట్టుగానే, మనకి హార్లన్ కావాలి, అలాగే అతని నియంత్రణలో ఉన్న సైన్యం కూడా కావాలి, 460 00:42:11,907 --> 00:42:12,908 మన అవసరాలు తీరే వరకూ మనకి కావాలి. 461 00:42:12,991 --> 00:42:15,202 -అయితే అతడిని నువ్వే పెళ్లి చేసుకో. -చేసుకొని అతడిని రాజు చేయాలా? 462 00:42:18,455 --> 00:42:20,415 నువ్వు శాంతించిన తర్వాత దీని గురించి మనం మళ్లీ ఇంకోసారి చర్చిద్దాం. 463 00:42:20,499 --> 00:42:21,500 లేదు, ఆ ప్రసక్తే లేదు. 464 00:42:21,583 --> 00:42:25,045 పాపిష్ఠిది! మహారాణి పాపిష్ఠిది. 465 00:42:25,671 --> 00:42:29,049 మాంత్రికుల పక్షపాతి! అది మహా పాపం. 466 00:42:29,132 --> 00:42:30,384 ఆ మంత్రగత్తెని తగలబెట్టండి! 467 00:42:30,467 --> 00:42:34,179 తనని కాల్చేయండి! తన కుటుంబం మొత్తాన్ని కాల్చేయండి! 468 00:42:34,263 --> 00:42:35,472 -వాళ్ళెవరో చూడు. -వెంటనే. 469 00:42:35,556 --> 00:42:38,559 -మహారాణిని కాల్చేయండి! కాల్చేయండి! -తనని కాల్చేయండి! 470 00:42:40,394 --> 00:42:41,395 మంత్రగత్తె! 471 00:42:41,478 --> 00:42:44,523 చెప్పా కదా, నువ్వు ఊహించలేనంత ప్రమాదకర పరిస్థితుల్లో మనం ఉన్నామని. 472 00:42:44,606 --> 00:42:46,191 తనని తగలబెట్టేయండి! 473 00:43:03,750 --> 00:43:04,751 లేదు. 474 00:43:12,176 --> 00:43:13,427 షో. 475 00:43:13,510 --> 00:43:16,013 -నువ్వు అబద్ధమాడుతున్నావు. -ఓటమి ఒప్పుకో, ఆ తర్వాత నువ్వే చూడవచ్చు. 476 00:43:46,585 --> 00:43:47,586 బాబా వాస్? 477 00:43:49,922 --> 00:43:50,923 బాబా వాస్? 478 00:43:53,175 --> 00:43:54,176 ఎవరు నువ్వు? 479 00:43:54,259 --> 00:43:56,303 నీకు సాయపడుతున్నాని తెలిస్తే ప్రాణం పోగొట్టుకోగల ఒక అమ్మాయిని. 480 00:43:56,386 --> 00:43:59,264 కనుక, దయచేసి మనం ఇక్కడి నుండి బయటపడేదాకా ప్రశ్నలేవీ అడగవద్దు. 481 00:43:59,348 --> 00:44:02,017 -మనం ఎక్కడికి వెళ్తున్నాం? -నిన్ను హనీవా దగ్గరికి తీసుకెళ్తున్నాను. 482 00:44:03,435 --> 00:44:05,938 -తను ఎక్కడ ఉందో నీకు తెలుసా? -తెలుసు, కానీ మనం త్వరగా బయలుదేరాలి. 483 00:44:06,021 --> 00:44:09,066 గార్డుల సంగతి నేను చూసుకున్నా, కానీ తర్వాత షిఫ్ట్ వాళ్ళు వచ్చేలోపు మనం వెళ్లిపోవాలి. 484 00:44:09,149 --> 00:44:10,442 బాబా వాస్. 485 00:44:11,109 --> 00:44:13,654 నువ్వు ప్రాణాలతో బయటపడాలనుకుంటే, నీకు చాలా సాయం అవసరమవుతుంది. 486 00:44:13,737 --> 00:44:15,113 నేను నీ కోసమే ఇక్కడికి వచ్చాను. 487 00:44:15,197 --> 00:44:17,491 నువ్వు మాగ్రా దగ్గరికి వెళ్లాలనుకుంటున్నావు, అలాగే నేను కూడా. 488 00:44:17,574 --> 00:44:20,160 తన అక్క ఈపాటికే తనని మోసం చేయకపోయుంటే, 489 00:44:20,244 --> 00:44:21,578 ఆ మోసం ఏ క్షణంలోనైనా చేయవచ్చు. 490 00:44:21,662 --> 00:44:23,497 నిన్ను ఎలా నమ్మగలను, మాంత్రికాంతకా? 491 00:44:23,580 --> 00:44:26,041 మహారాణి ఆలోచనా విధానం నాకు బాగా తెలుసు. 492 00:44:26,667 --> 00:44:28,544 తన కోసం ఎలా వెతకాలి, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో కూడా నీకు తెలీదు. 493 00:44:28,627 --> 00:44:33,882 ఒకవేళ నువ్వు తనని కనిపెట్టినా, తన చుట్టూ మాంత్రికాంతకులుంటారు. నా మాంత్రికాంతకులు. 494 00:44:33,966 --> 00:44:35,843 నేను టమాక్టీ జూన్ ని విడుదల చేయను. 495 00:44:37,928 --> 00:44:38,929 అతను కూడా వస్తాడు. 496 00:44:40,138 --> 00:44:42,307 నిన్ను విడుదల చేయడం ద్వార ఇప్పటికే నేను రాజద్రోహానికి పాల్పడుతున్నాను. 497 00:44:42,391 --> 00:44:45,310 మాంత్రికాంతకుల జనరల్ ని విడుదల చేయడం ద్వారా దాన్ని మరింత తివ్రతరం చేసుకోలేను. 498 00:44:46,103 --> 00:44:47,855 ఎంత చేసినా నిన్ను ఒక్కసారే కదా ఉరి తీయగలిగేది. 499 00:44:47,938 --> 00:44:49,690 వెళ్తే అందరం వెళ్లాలి, లేపోతే ఇక్కడే చావాలి. 500 00:44:52,442 --> 00:44:53,443 పద. 501 00:45:02,411 --> 00:45:03,745 ఇటు వైపు. 502 00:45:12,671 --> 00:45:14,298 దీని వల్ల మన మధ్య ఉన్న వైరంలో ఏ మార్పూ ఉండదు. 503 00:45:14,882 --> 00:45:17,384 నాకు నీ అవసరం తీరిపోయిన మరుక్షణం, 504 00:45:17,467 --> 00:45:20,220 నీ పేగులు తీసి, నీకే తినిపిస్తాను. 505 00:45:20,804 --> 00:45:22,097 అది న్యాయబద్ధమైనదే. 506 00:45:33,942 --> 00:45:35,611 గార్డుల ఆయుధాలను తీసుకోండి. 507 00:45:40,115 --> 00:45:43,410 నువ్వు చాలా వేగంగా నడుస్తున్నావు. నీ కర్ర నేలని సరిగ్గా తాకడం కూడా లేదు. 508 00:45:44,661 --> 00:45:46,663 నీకు చూపు ఉంది కదా? 509 00:45:46,747 --> 00:45:49,416 నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నేను ఆ రహస్యాన్ని చాలా చక్కగా దాచగలను. 510 00:45:53,712 --> 00:45:54,922 వెళ్దాం పదండి. 511 00:46:15,067 --> 00:46:16,068 హనీవా. 512 00:46:23,534 --> 00:46:27,579 కంగారు పడకు. ఆ పని నీ బాబాయ్ అయిన ఇడో చేయడు. 513 00:46:34,503 --> 00:46:38,090 నువ్వు సహకరించకుంటే... అది ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది, అంతే. 514 00:46:58,026 --> 00:46:59,820 -అంతా ఓకేనా! -ఓకే. 515 00:47:00,612 --> 00:47:01,989 ఓకే! 516 00:47:34,813 --> 00:47:38,066 సూపర్. ఇది హనీవాకి ఇవ్వు. 517 00:47:38,150 --> 00:47:40,402 తనని ఇడో ఎక్కడో పై అంతస్థులో ఉంచుంటాడు. 518 00:47:40,485 --> 00:47:42,237 మనిద్దరం విడిపోయి తనని వెతుకుదాం. 519 00:47:42,863 --> 00:47:45,282 మన వెంటపడేవారిని టమాక్టీ ఇక్కడే ఉండి అడ్డుకుంటాడు. 520 00:47:45,365 --> 00:47:47,242 దానికి ఒక్కరే సరిపోరు. 521 00:47:47,326 --> 00:47:48,869 అతనొక్కడే వంద మందితో సమానం. 522 00:47:49,453 --> 00:47:50,454 మెట్లు ఉన్నాయి. 523 00:47:55,042 --> 00:47:56,043 భయం వద్దు. 524 00:47:58,086 --> 00:47:59,588 నేను సుకుమారంగా కానిచ్చేస్తాను. 525 00:48:06,094 --> 00:48:09,640 వద్దు, వద్దు! 526 00:48:09,723 --> 00:48:10,766 వద్దు! 527 00:48:15,229 --> 00:48:19,900 [సంకేతాలతో] నువ్వు నేరుగా వెళ్లి చూడు. నేను అవతలి వైపు చూసి వచ్చి నిన్ను కలుస్తా. 528 00:49:29,386 --> 00:49:31,013 పర్వాలేదు, ఏం కాలేదు. 529 00:49:34,349 --> 00:49:36,935 నన్ను మన్నించు. 530 00:49:42,566 --> 00:49:44,902 -నువ్వు వస్తావని నాకు తెలుసు. -నన్ను క్షమించు. 531 00:49:50,741 --> 00:49:52,367 నేను ఒక్కదాన్నే రాలేదు. 532 00:49:54,453 --> 00:49:58,248 దీన్ని నీకు ఇవ్వమని బాబా వాస్ చెప్పాడు. పద. 533 00:50:24,274 --> 00:50:26,693 నువ్వు వెళ్లిపోయినప్పుడు కూడా నీకన్నా నేనే చిన్నవాడిని, 534 00:50:26,777 --> 00:50:28,654 నీకన్నా బలహీనుడిని కూడా. 535 00:50:29,238 --> 00:50:32,491 ఇప్పుడు అది అటూఇటూ అయిందని నువ్వు గ్రహించే ఉంటావు. 536 00:50:48,507 --> 00:50:52,135 నిజం చెప్పాలంటే, నీలో రవ్వంతైనా పోరాట పటిమ ఉంటుందని ఆశించాను. 537 00:51:25,752 --> 00:51:27,504 ఇది కదా సరైనదంటే... 538 00:51:28,589 --> 00:51:31,633 మన తండ్రి కత్తితోనే నేను నిన్ను చంపడం. 539 00:51:33,260 --> 00:51:36,805 ఇడో. నన్ను క్షమించు. 540 00:51:39,224 --> 00:51:43,478 కానీ దయచేసి, నా చావుతో దీన్ని ఆపేయ్. 541 00:51:45,731 --> 00:51:49,735 హనీవాని ఇక్కడి నుంచి పంపేయ్. నిన్ను వేడుకుంటున్నాను. 542 00:51:58,118 --> 00:52:00,871 చచ్చే ముందు ఓ విషయం తెలుసుకో, అన్నయ్యా. 543 00:52:03,957 --> 00:52:09,588 హనీవా తన తక్కిన జీవితమంతా నా చెరసాలలో బతుకుతుంది, 544 00:52:11,340 --> 00:52:12,966 ఒక సానిలా బతుకుతుంది... 545 00:52:14,259 --> 00:52:19,097 నా సైన్యం కోసం చూపున్న పిల్లలను కంటుంది, 546 00:52:19,181 --> 00:52:23,143 తను కనలేని స్థితికి వచ్చేదాకా కంటూనే ఉంటుంది. 547 00:52:25,062 --> 00:52:28,148 ఇక తను పిల్లలని కనలేకపోయినప్పుడు... 548 00:52:30,526 --> 00:52:32,611 నేను తన పీక కోసి, 549 00:52:33,237 --> 00:52:36,990 నిన్ను ఏ ఎరువుల గొయ్యలో అయితే పడేస్తానో 550 00:52:37,616 --> 00:52:41,537 తనని కూడా అదే గొయ్యలో పడేస్తాను. 551 00:52:41,620 --> 00:52:42,621 ఆయన్ని వదిలేయ్. 552 00:52:45,874 --> 00:52:46,875 ఆయన్ని వదిలేయ్! 553 00:52:55,843 --> 00:52:57,427 -హనీవా. -నాన్న. 554 00:52:59,596 --> 00:53:00,973 నీకు ఏం కాలేదు కదా? 555 00:53:06,478 --> 00:53:07,604 మనం వెళ్లిపోవాలి. పద. 556 00:53:07,688 --> 00:53:08,981 నన్ను అతని దగ్గరికి తీసుకెళ్లు. 557 00:53:21,076 --> 00:53:24,705 మళ్లీ నువ్వు నా పిల్లల జోలికి వస్తే, 558 00:53:25,831 --> 00:53:29,543 ఈ చెత్త నగరమంతా తగులబెట్టేసి... 559 00:53:30,502 --> 00:53:32,754 నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోతాను, 560 00:53:32,838 --> 00:53:36,592 అలా నువ్వు కూడా ఆ సెగలో కాలిపోతావు. 561 00:53:38,760 --> 00:53:39,970 అదీలెక్క. 562 00:53:40,679 --> 00:53:43,348 అదీ నాకు తెలిసిన బాబా వాస్! 563 00:53:46,226 --> 00:53:47,227 మనం బయలుదేరాలి. 564 00:54:13,462 --> 00:54:15,005 టమాక్టీ జూన్. 565 00:54:15,088 --> 00:54:16,590 హనీవా! వద్దు, వద్దు. 566 00:54:17,841 --> 00:54:20,969 హనీవా. వద్దు. అతను మన పక్షానే పోరాడుతున్నాడు. 567 00:54:21,678 --> 00:54:23,013 ఇతను అమ్మను చంపేశాడు. 568 00:54:24,348 --> 00:54:27,476 నేను చెప్పేది విను. మీ అమ్మ చనిపోలేదు. 569 00:54:28,268 --> 00:54:29,895 ఏంటి? 570 00:54:29,978 --> 00:54:31,230 నువ్వేం మాట్లాడుతున్నావు? 571 00:54:31,313 --> 00:54:32,773 నేను తర్వాత అంతా వివరంగా చెప్తాను. 572 00:54:32,856 --> 00:54:34,650 విను, ఇప్పుడు మనం వెళ్లిపోవాలి. 573 00:54:35,317 --> 00:54:36,568 తను సురక్షితంగానే ఉందా? 574 00:54:37,152 --> 00:54:39,863 అది మనకి ఇంకా తెలీదు. అందుకే మనం అతడి మీద నమ్మకం ఉంచాలి. 575 00:54:42,950 --> 00:54:49,581 హనీవా, చెప్పేది విను. నన్ను చూడు. మనం వెళ్లాలి. 576 00:54:49,665 --> 00:54:50,958 దయచేసి విను. 577 00:54:53,210 --> 00:54:55,087 ఎడమ వైపుకు, తూర్పు ద్వారం వద్దకు పదండి. 578 00:55:42,384 --> 00:55:43,385 మాతో పాటు వచ్చేయ్. 579 00:55:43,468 --> 00:55:44,678 నేను రాలేను. 580 00:55:44,761 --> 00:55:46,305 దయచేసి నా మాట విను. 581 00:55:53,729 --> 00:55:54,771 కలకాలం. 582 00:55:57,232 --> 00:55:58,442 హనీవా! 583 00:55:58,525 --> 00:55:59,526 బయలుదేరు. 584 00:56:16,793 --> 00:56:17,961 హనీవా. 585 00:56:33,435 --> 00:56:34,436 కోరా! 586 00:56:39,066 --> 00:56:40,108 కోరా? 587 00:56:46,156 --> 00:56:48,033 ఆమె, బిడ్డ చనిపోయిందని చెప్పింది. 588 00:56:49,826 --> 00:56:52,204 నా దుప్పట్ల మీద అంతా రక్తం కారిపోయింది, ఆ రక్తంలో వాడు ఉన్నాడు. 589 00:56:53,539 --> 00:56:54,623 నువ్వు ఆమెని చంపేశావే. 590 00:56:59,336 --> 00:57:00,796 ఆమె అంటోంది, 591 00:57:00,879 --> 00:57:06,134 "ఒక్కోసారి కడుపులో బిడ్డ పూర్తిగా ఎదగదు. మరీ బలహీనంగా ఉంటుంది," అట. 592 00:57:07,386 --> 00:57:08,470 మహారాణి. 593 00:57:23,610 --> 00:57:25,153 నా కడుపులో ఏం పెట్టావు నువ్వు? 594 00:57:26,405 --> 00:57:28,407 నువ్వు ఏం అడిగావో, అదే చేశాను. 595 00:57:30,117 --> 00:57:33,912 నేను అడిగింది ఇది కాదు. 596 00:57:36,290 --> 00:57:37,875 నువ్వు ఆమెని చంపుండాల్సింది కాదు. 597 00:57:37,958 --> 00:57:40,169 నేను తనని ఖచ్చితంగా చంపాలి. 598 00:57:41,712 --> 00:57:43,213 ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. 599 00:57:44,882 --> 00:57:47,676 నేను నాకు బిడ్డ పుడుతుందని, అది కూడా చూపు గల బిడ్డ పుడుతుందని ప్రకటించాను. 600 00:57:48,760 --> 00:57:50,554 నేను పిచ్చిదాన్ని అని అనుకుంటారు. 601 00:57:52,347 --> 00:57:55,142 నేను మళ్లీ నీతో పడక పంచుకుంటాను. 602 00:57:55,225 --> 00:57:58,478 నీకో శక్తివంతమైన బిడ్డని ఇస్తాను. 603 00:58:22,920 --> 00:58:25,881 అయ్యో అమాయకుడా. 604 00:58:31,428 --> 00:58:37,059 పిచ్చి అమాయకుడా. 605 00:59:53,135 --> 00:59:55,137 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య