1 00:00:01,877 --> 00:00:03,921 మీ కోసం నేను ఎంతోకాలం నుండి... 2 00:00:04,129 --> 00:00:07,216 మిమ్మల్ని మీరు ప్రకటించుకోండి, ఊరు బ్రతికిపోతుంది. 3 00:00:09,968 --> 00:00:11,303 మాంత్రికులు తప్పించుకున్నారు. 4 00:00:11,553 --> 00:00:13,013 జెర్లామరెల్ యొక్క సందేశం. 5 00:00:13,347 --> 00:00:14,515 ఈ సందేశాన్ని కళ్ళతో మాత్రమే చదవగలరు. 6 00:00:15,098 --> 00:00:16,183 "నా ప్రియమైన పిల్లలారా, 7 00:00:16,850 --> 00:00:20,395 ఈ నది, మీరు నా వద్దకు సాగించబోయే సుదిర్ఘపు ప్రయాణంలో తొలి అడుగు." 8 00:00:20,938 --> 00:00:21,980 నేను కూడా ఒకటి పోగొట్టుకున్నాను. 9 00:00:22,356 --> 00:00:24,608 నాకు చాలా ముఖ్యమైనది. మనం దాన్ని దక్కించుకోవాలి. 10 00:00:24,691 --> 00:00:26,985 మన వస్తువులని తీసిందెవరో నాకు తెలుసు. అటు చూడు. 11 00:00:28,695 --> 00:00:30,155 మీ గురించి కొత్త విషయాలు గుసగుసలాడుకుంటున్నారు. 12 00:00:30,239 --> 00:00:33,116 ఎవరు గుసగుసలాడింది? అన్ నాయకీనా? డూన్ ప్రభువా? 13 00:00:33,867 --> 00:00:35,619 తన చావులో పెనుగులాట ఉండకూడదు. 14 00:00:36,078 --> 00:00:38,205 మానవ ప్రమేయం ఉన్నదన్న ఆధారమే ఉండకూడదు. 15 00:00:38,288 --> 00:00:42,876 ఈ నగరం కోసం చావకూడదని నేను నిర్ణయించుకున్నా. ఈ నగరమే నా కోసం చావాలి. 16 00:00:43,710 --> 00:00:45,671 జెర్లామరెల్, నా కోసం నువ్వు రాలేదు. 17 00:00:45,754 --> 00:00:47,172 అందుకని నేనే నీ చెంతకు వస్తున్నాను. 18 00:01:45,570 --> 00:01:46,571 పారాహుషార్! 19 00:01:53,662 --> 00:01:54,663 పారాహుషార్! 20 00:03:20,123 --> 00:03:21,208 ఇక్కడున్నావనమాట. 21 00:03:28,423 --> 00:03:29,675 ఏం జరిగిందో చూడు. 22 00:03:31,760 --> 00:03:32,969 నేనేం చేశానో చూడు. 23 00:03:36,223 --> 00:03:37,808 నీ కథ ఇంతటితో ముగిసిపోయింది. 24 00:03:40,560 --> 00:03:43,438 మీ అందరి కథని... నేను ముగించేశాను. 25 00:03:48,193 --> 00:03:49,861 కానీ నా కథ ఇప్పుడే ఆరంభం కాబోతోంది. 26 00:03:58,745 --> 00:03:59,997 సెలవు, తండ్రి. 27 00:04:01,873 --> 00:04:05,669 నీకు నా మీద ప్రేమనేదే లేకపోయినా... నాకు నీ మీద ఎనలేని ప్రేమ ఉండేది. 28 00:04:08,255 --> 00:04:09,715 దయచేసి పదండి, మహారాణీ. 29 00:04:28,817 --> 00:04:31,528 దేవుడు మనల్ని వదిలేశాడు! 30 00:04:41,955 --> 00:04:46,752 మనం పయాన్ పౌరులం. మనం పునీతులం. మనం ఎన్నుకోబడినవారము... 31 00:04:49,880 --> 00:04:51,048 పద. 32 00:04:56,678 --> 00:04:58,263 సరేమరి. మంచి కుక్కవి. 33 00:05:06,688 --> 00:05:08,482 ఈ మృగం చాలా కాలం నిద్రావస్థలో ఉంది. 34 00:05:09,733 --> 00:05:11,108 ఇప్పుడు మేల్కొనింది. 35 00:05:19,284 --> 00:05:20,702 అంతా మన ముందరే ఉంది... 36 00:05:22,120 --> 00:05:23,580 మనకి పనికొచ్చేదంతా. 37 00:06:10,377 --> 00:06:11,378 ధన్యవాదాలు. 38 00:06:14,673 --> 00:06:15,966 ఏం చేశానని? 39 00:06:17,801 --> 00:06:19,594 నాకు కాస్త ఏకాంత సమయమిచ్చావు. 40 00:06:21,179 --> 00:06:24,641 నీకు అడగాలని ఎంతగా ఉన్నా నేను సమాధానమివ్వనని తెలిసి అడగకుండా ఉండిపోయావు. 41 00:06:29,563 --> 00:06:34,735 మీ నాన్న నీకిచ్చిన ఆ చిన్ని నగలని మరలా పొందడానికి, నీ పిల్లల జీవితాన్ని, 42 00:06:35,402 --> 00:06:39,656 ఇంకా నీ భర్త జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టావు... 43 00:06:41,450 --> 00:06:42,993 అంతగా ముఖ్యమైనది వాటిల్లో ఏముంది? 44 00:06:45,537 --> 00:06:50,876 నువ్వు చెప్పిన కథలో ఏమైనా విషయాలు నువ్వు వెల్లడించకుండా ఉండుంటే, 45 00:06:51,668 --> 00:06:54,421 నాకు చెప్పడానికి ముందు ఖచ్చితంగా నువ్వు వారికి చెప్పుండేదానివి. 46 00:06:58,633 --> 00:07:00,260 అయినా నేను ఒకటి మాత్రం చెప్పాలి... 47 00:07:01,303 --> 00:07:04,514 నా మదిలో వేరే ప్రశ్న మెదులుతోంది... 48 00:07:05,724 --> 00:07:08,435 ఇటీవలి కొద్దిపాటి సమయం... 49 00:07:09,519 --> 00:07:12,022 దాని గురించే ఆలోచిస్తూ గడిపాను. 50 00:07:15,317 --> 00:07:16,693 ఏంటా ప్రశ్న? 51 00:07:19,488 --> 00:07:21,448 నువ్వు మా జీవితాలలోకి ప్రవేశించిన రోజు... 52 00:07:22,991 --> 00:07:27,329 జెర్లామరెల్ వెళ్లేముందు చివరిగా నాకు ఏం చెప్పాడో నీకు గుర్తుందా? 53 00:07:29,206 --> 00:07:30,207 నాకు గుర్తులేదు. 54 00:07:32,751 --> 00:07:36,254 "జాగ్రత్త," అని చెప్పాడు. 55 00:07:39,257 --> 00:07:42,928 ఆ క్షణాన, ఇంకా అప్పటి నుండి, 56 00:07:43,011 --> 00:07:45,889 అతని ఆంతర్యం... 57 00:07:46,932 --> 00:07:52,688 "నేను ప్రేమించిన ఈ మహిళని, తను కనబోయే పిల్లలని జాగ్రత్తగా చూసుకో," అని భావించా. 58 00:07:55,023 --> 00:07:57,359 అతని మాటలు నన్ను నడిపించాయి... 59 00:07:59,236 --> 00:08:03,490 ఇన్నేళ్ళూ నాకు ఆధారంగా నిలిచాయి. 60 00:08:10,455 --> 00:08:14,292 కానీ మనం జలపాతాన్ని వదిలి నదీ ప్రయాణం చేసిన తర్వాత నుండీ 61 00:08:14,376 --> 00:08:16,628 మారిన పరిస్థితులని బట్టీ చూస్తుంటే... 62 00:08:18,171 --> 00:08:22,467 అతని ఉద్దేశాన్ని వేరేగా అర్థంచేసుకున్నానేమోనని అనిపిస్తుంది. 63 00:08:23,802 --> 00:08:25,429 అతని ఉద్దేశం ఇంకేమయ్యుండవచ్చు? 64 00:08:30,726 --> 00:08:32,978 నువ్వు చెప్పావు కాబట్టి నీ భర్త, నీ పిల్లలు 65 00:08:33,478 --> 00:08:37,858 నిరాయుధులుగా ఇప్పుడు పెనుప్రమాదంలోకి అడుగుపెట్టారు. 66 00:08:37,941 --> 00:08:39,651 వాళ్ళు ఏ మాత్రం సంకోచించనేలేదు. 67 00:08:42,112 --> 00:08:43,530 నువ్వు కూడా సంకోచించలేదు. 68 00:08:48,493 --> 00:08:53,874 మనం ఈ నదీప్రయాణం ఆరంభించినప్పటి నుండీ నీలో ఏదో మార్పు జరుగుతోందనిపిస్తుంది. 69 00:08:57,461 --> 00:09:02,758 ఏదో నీ స్వరంలో, నీ ప్రవర్తనలో, మాగ్రా. 70 00:09:04,384 --> 00:09:06,928 ఏదో బలీయమైనది. 71 00:09:07,888 --> 00:09:08,889 ఏదో భయంకరమైనది. 72 00:09:08,972 --> 00:09:11,975 మొదట్నుంచీ నీకు తెలిసిన అదే వ్యక్తిని నేను. 73 00:09:14,561 --> 00:09:19,274 నీ అయోమయాన్ని అర్థంచేసుకోగలను, అలాగే నీ కుతూహలాన్ని కూడా భరించగలను. 74 00:09:19,358 --> 00:09:23,612 కానీ నా కుట్రపూరిత ఆలోచనల వలన నా భర్త, ఇంకా నా పిల్లలు ప్రమాదంలో 75 00:09:23,695 --> 00:09:25,989 ఉన్నారని మాత్రం సూచించకు. 76 00:09:29,076 --> 00:09:31,202 వారి బాగోగులు నాకు పట్టవని కూడా సూచించకు. 77 00:09:44,925 --> 00:09:46,134 నా చేతిని పట్టుకో. 78 00:09:52,724 --> 00:09:53,934 నాతో పాటు ప్రార్థించు... 79 00:09:56,353 --> 00:09:59,606 వాళ్ళు భ్రద్రంగా, గాయాలపాలు కాకుండా తిరిగి రావాలని. 80 00:10:10,200 --> 00:10:11,743 ఇవి పాదముద్రలు కావచ్చు. 81 00:10:14,955 --> 00:10:15,998 ఎక్కడ? 82 00:10:22,337 --> 00:10:23,797 ఇది హాస్యాస్పదంగా ఉంది. 83 00:10:37,060 --> 00:10:38,061 మీకేం వినిపిస్తోంది? 84 00:10:41,523 --> 00:10:42,524 నాకేమీ వినపడటం లేదు. 85 00:10:45,444 --> 00:10:47,571 నాకు కూనిరాగాలు వినిపిస్తున్నాయి. 86 00:10:49,239 --> 00:10:50,240 అవును. 87 00:10:51,658 --> 00:10:55,579 కొందరు వ్యక్తులు కూనిరాగాలు తీస్తున్నారు. 88 00:10:57,831 --> 00:10:59,082 అటు వైపు నుండి వినిపిస్తున్నాయి. 89 00:11:02,127 --> 00:11:04,546 కూనిరాగాలా? ఎవరు తీస్తున్నారు? 90 00:11:32,991 --> 00:11:33,992 కూనిరాగాలు. 91 00:11:44,753 --> 00:11:45,754 ఏంటీ ప్రాంతం? 92 00:11:47,381 --> 00:11:50,050 ఒపాయోల్. వీళ్ళు దోపిడీదారులు. 93 00:12:11,113 --> 00:12:13,407 అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నిర్మానుష్యంగా ఉంది. 94 00:12:14,032 --> 00:12:15,033 కాదు. 95 00:12:15,450 --> 00:12:17,619 వీళ్ళు తమ పనంతా రాత్రి చేసేసి, పగలంతా నిద్రపోతారు. 96 00:12:18,161 --> 00:12:19,663 మన వస్తువులను తీసుకువెళ్లింది వీళ్ళే. 97 00:12:20,080 --> 00:12:21,707 అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు. 98 00:12:22,290 --> 00:12:23,917 కానీ ఎంత మంది ఉన్నారో చెప్పలేను. 99 00:12:24,334 --> 00:12:27,045 మన కన్నా ఎక్కువ మందే ఉండవచ్చని నా అంచనా. 100 00:12:27,129 --> 00:12:29,006 - సందేహమే లేదు. - మనం వెనుతిరిగేది లేదు. 101 00:12:29,089 --> 00:12:31,800 మన కన్నా తక్కువ మందే నిరాయుధులుంటారని కూడా నా అంచనా. 102 00:12:31,883 --> 00:12:33,927 మీ అమ్మ వస్తువులు ఎంత ముఖ్యమైనవైనా కానీ, 103 00:12:34,011 --> 00:12:36,054 వాటి కోసం మీ ఇద్దరిలో ఎవ్వరూ కూడా చావాలని తను కోరుకోదు. 104 00:12:36,138 --> 00:12:37,139 నేనూ కూడా అది కోరుకోవడం లేదు. 105 00:12:39,266 --> 00:12:42,310 కానీ నా ఉనికి వాళ్ళకి తెలియకుండా నేను వెళ్ళేసి రాగలను. 106 00:12:43,312 --> 00:12:44,646 ఒంటరిగా ఎవ్వరూ వెళ్ళేది లేదు. 107 00:12:44,730 --> 00:12:46,064 నేను ఒంటరిగానే వెళ్ళాలి. 108 00:12:46,982 --> 00:12:48,692 అలా అయితేనే నేను పట్టుబడటం కష్టం. 109 00:12:50,694 --> 00:12:52,279 నేను అలా వెళ్లి ఇలా వచ్చేయగలను. 110 00:12:52,362 --> 00:12:54,448 వాళ్ళు పడుకొనుండవచ్చని నువ్వే అన్నావు. 111 00:12:54,865 --> 00:12:57,200 కానీ నువ్వు ఒక్కరిని లేపినా, వెంటనే అందరూ బయటకు వచ్చేస్తారు. 112 00:12:57,284 --> 00:12:58,618 అయితే నేను వారిని తప్పించుకుంటాను. 113 00:13:01,204 --> 00:13:03,707 తన వస్తువులను కనిపెట్టడం ఎంత కష్టమో అమ్మకి తెలుసు, 114 00:13:03,790 --> 00:13:05,334 అయినా తను మనల్ని అడిగింది. 115 00:13:06,668 --> 00:13:09,755 అదెంత ముఖ్యమైనదో తనకి తెలియలేదని మనం చెప్పదలుచుకుంటున్నామా? 116 00:13:10,297 --> 00:13:12,758 ఆమెకి అలాంటి నిర్ణయం తీసుకొనే సమర్థతే లేదని చెప్పదలుచుకుంటున్నామా? 117 00:13:12,841 --> 00:13:13,925 సరే. 118 00:13:16,678 --> 00:13:17,721 సరే. 119 00:13:19,056 --> 00:13:20,849 మీరిద్దరూ ఇక్కడే ఉండండి. 120 00:13:20,932 --> 00:13:22,476 నాకు సహాయం అవసరమైతే పిలుస్తాను. 121 00:13:24,436 --> 00:13:25,771 కానీ నేను ప్రయత్నమైతే చేయాలి. 122 00:14:02,557 --> 00:14:05,602 ఇది ఒక చెత్త ఆలోచన. 123 00:14:06,937 --> 00:14:08,563 లేదు, మనం తనని ఆపుండాలి. 124 00:14:09,356 --> 00:14:10,357 ఎలా? 125 00:14:11,525 --> 00:14:13,443 మనలో ఎవ్వరికోసమైనా తను ఈ పని చేస్తుంది. 126 00:14:14,027 --> 00:14:16,405 మనలో తనని ఎవ్వరూ ఆపలేరు. 127 00:14:18,156 --> 00:14:20,909 నిజానికి, దీనికీ, మనకీ ఏ సంబందం లేదనుకుంటా. 128 00:14:21,535 --> 00:14:24,121 అమ్మ నోటి నుండి తన తండ్రి ప్రస్తావన వచ్చిన క్షణాన, 129 00:14:24,538 --> 00:14:25,831 అతనితో తనకున్న బంధం గురించి విన్నప్పుడే, 130 00:14:26,581 --> 00:14:28,375 హనీవా నిర్ణయించేసుకుంది. 131 00:14:29,292 --> 00:14:33,547 అసలు నిర్ణయమన్న ప్రశ్నే రాదు. ఇది అనివార్యమైనది. 132 00:14:59,114 --> 00:15:01,950 వదిలివెళ్లిపోయిన తండ్రి అనే ఆలోచన, 133 00:15:02,034 --> 00:15:03,577 అతడిని మళ్లీ కలిసే అవకాశం, 134 00:15:03,660 --> 00:15:04,786 అదంతా... 135 00:15:05,871 --> 00:15:07,372 అదంతా తను దిగమింగుకోలేకపోయింది. 136 00:16:39,297 --> 00:16:41,258 నా భయమేంటంటే, ఇందులో మన... 137 00:16:42,342 --> 00:16:43,510 అయ్యో. 138 00:16:43,593 --> 00:16:44,761 హనీవా! 139 00:16:59,735 --> 00:17:00,736 హనీవా! 140 00:17:05,157 --> 00:17:07,200 హనీవా. హనీవా. 141 00:17:12,289 --> 00:17:13,749 - తనకింకా శ్వాస ఆడుతోందా? - ఆడుతోంది. 142 00:17:13,832 --> 00:17:15,917 - తనకి గాయం ఎక్కడైంది? - నాకు కనబడటం లేదు. 143 00:17:16,001 --> 00:17:17,419 నాన్నా! 144 00:17:38,690 --> 00:17:40,692 ఆగు. వద్దు. ఆగు. వద్దు, వద్దు! 145 00:18:06,968 --> 00:18:09,971 వద్దు. ఆగు. ఆగు! అతనెవరో ఏంటో కూడా నీకు తెలీదు! 146 00:18:10,055 --> 00:18:11,263 వీడెవడైనా అది నాకనవసరం! 147 00:18:11,682 --> 00:18:13,308 అతని ఛాతీ. 148 00:18:14,393 --> 00:18:15,394 చూడు. అనుభూతి చెందు. అనుభూతి చెందు. 149 00:18:23,110 --> 00:18:24,903 లేయి. పైకి లేయి. 150 00:18:29,533 --> 00:18:30,742 ఇతను చూడగలడు. 151 00:19:04,151 --> 00:19:05,485 ఇక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. 152 00:19:11,742 --> 00:19:14,036 నేను ఇంజన్ల ధ్వని మద్య... 153 00:19:16,580 --> 00:19:19,458 ఉరుములు, విద్యుత్తు... 154 00:19:21,376 --> 00:19:22,377 పరమార్థం మధ్య పుట్టాను. 155 00:19:24,379 --> 00:19:26,465 నా జీవితమంతా అందులో మునిగితేలాను. 156 00:19:29,509 --> 00:19:33,555 ఆ శబ్దం వినబడనంత దూరం రాజధానిలోనే నేను వెళ్లింది లేదు. 157 00:19:35,599 --> 00:19:39,770 ఇంకాస్త ముందుకు వెళ్తే ఈ ప్రపంచం ఎలా ఉంటుందోనని నేనెప్పుడూ... 158 00:19:40,562 --> 00:19:41,605 అనుకొనేదాన్ని. 159 00:19:43,815 --> 00:19:47,277 చూస్తుంటే, పెద్దగా ఏమీ లేదనిపిస్తోంది. 160 00:19:48,445 --> 00:19:50,030 ఎంతో దుర్భరంగా ఉంది. 161 00:19:52,824 --> 00:19:54,534 నీళ్ళ పరవళ్ళని వినండి, మహారాణీ. 162 00:19:59,456 --> 00:20:00,540 గాలి శబ్దాన్ని కూడా వినండి. 163 00:20:01,667 --> 00:20:04,961 మీరు ఆలకిస్తే, అది మీకు తన రహస్యాలని కూడా చెప్పే అవకాశముంది. 164 00:20:09,716 --> 00:20:11,259 ఇక్కడ ఏ రహస్యాలూ లేవు. 165 00:20:13,095 --> 00:20:14,888 సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం లాంటిదేమీ లేదు. 166 00:20:15,472 --> 00:20:17,140 కథల అల్లిక లేదు. 167 00:20:17,891 --> 00:20:20,519 బలమూ లేదు, భయమూ లేదు. 168 00:20:22,145 --> 00:20:23,146 అసలేమీ లేదు. 169 00:20:24,982 --> 00:20:27,567 నిజంగా ప్రజలు ఇలాగే జీవనం సాగిస్తుంటారా... 170 00:20:28,527 --> 00:20:31,321 పనికొచ్చేదంటూ ఏదీ లేకుండా? 171 00:20:33,740 --> 00:20:35,575 అవుననుకుంటా, మహారాణి. 172 00:20:39,329 --> 00:20:40,747 ఈ ప్రయాణానికి అదే అవసరమేమో, 173 00:20:40,831 --> 00:20:43,542 కానీ నేను అలా ఉండలేను అనుకుంటా. 174 00:20:45,127 --> 00:20:48,296 నాలో ఏ అణువు కూడా అందుకు తగ్గట్టుగా నిర్మితమవ్వలేదనుకుంటా. 175 00:20:51,508 --> 00:20:52,592 నాకు ఆకలేస్తోంది. 176 00:21:17,868 --> 00:21:19,119 నాకు ఆకలేస్తోంది! 177 00:21:19,661 --> 00:21:21,371 నేను తినడానికి సిద్ధంగా ఉన్నాను. 178 00:21:22,331 --> 00:21:24,416 నీకు గుడ్లు ఏమైనా కనిపించాయా? ఈ కాలంలో అవి విరివిగా దొరుకుతాయి. 179 00:21:29,046 --> 00:21:30,130 డ్రైవర్? 180 00:21:32,007 --> 00:21:34,384 మంట ఆరిపోతున్నట్టుంది. ఆహారమేమైనా తెచ్చావా? 181 00:21:34,468 --> 00:21:36,136 డ్రైవర్, ఎక్కడున్నావు? 182 00:21:42,726 --> 00:21:45,479 మంట ఆరిపోకుండా చూడు. మంట పొగలు కక్కుతోంది. 183 00:21:48,106 --> 00:21:49,232 డ్రైవర్? 184 00:21:53,654 --> 00:21:56,323 డ్రైవర్? జవాబివ్వు. 185 00:22:35,529 --> 00:22:36,738 నైరీ! 186 00:22:40,492 --> 00:22:41,702 నైరీ! 187 00:23:24,161 --> 00:23:25,370 నైరీ. 188 00:23:27,873 --> 00:23:29,916 నైరీ! 189 00:23:30,625 --> 00:23:32,252 మీకేం కావాలన్నా అది నా దగ్గరుంది. 190 00:23:32,669 --> 00:23:36,590 మీకేం కావాలన్నా అది నా దగ్గరుంది. నా వద్ద ఉంగరాలున్నాయి. దైవెముక ఉంది. 191 00:23:36,673 --> 00:23:38,383 చాలా మృదువుగా ఉంది. 192 00:23:38,842 --> 00:23:40,385 నాజూకైన వేళ్ళు. 193 00:23:40,469 --> 00:23:41,678 ఉంగరాలు లేనే లేవు. 194 00:23:43,263 --> 00:23:44,514 దైవెముక కూడా లేదు. 195 00:23:46,391 --> 00:23:47,601 నిన్ను తీసుకెళ్లిపోతాం. 196 00:23:51,104 --> 00:23:52,189 నైరీ? 197 00:23:54,608 --> 00:23:58,028 నైరీ! 198 00:24:02,741 --> 00:24:04,076 అమ్మా, మేమే. 199 00:24:04,159 --> 00:24:05,160 హనీవా. 200 00:24:08,455 --> 00:24:09,498 రా. 201 00:24:13,126 --> 00:24:14,753 మీకది దొరికిందా? 202 00:24:19,383 --> 00:24:20,759 ధన్యవాదాలు. 203 00:24:26,640 --> 00:24:28,350 నాకు నలుగురున్నట్టు తెలుస్తోంది. 204 00:24:30,018 --> 00:24:32,312 ఎవరీ కొత్త నేస్తం? 205 00:24:34,564 --> 00:24:35,857 ఇతడిని బూట్స్ అని పిలుస్తారు. 206 00:24:37,109 --> 00:24:38,485 రాకూన్ తోలుతో నూలిన వస్త్రాలు. 207 00:24:40,612 --> 00:24:42,906 మన వస్తువులను దొంగలించింది ఇతనే. 208 00:24:42,990 --> 00:24:43,991 అవును. 209 00:24:45,367 --> 00:24:48,286 కానీ మనమెవ్వరమో అతనికి తెలియదు, అంతేగాక అతనికి మరో దారి లేదు కూడా. 210 00:24:49,454 --> 00:24:51,039 దయచేసి, వివరణిచ్చే అవకాశం నాకివ్వండి. 211 00:24:54,459 --> 00:24:55,502 అలాగే. 212 00:25:05,262 --> 00:25:07,055 జెర్లామరెల్ మనల్ని వదిలి వెళ్లిపోయినప్పుడు, 213 00:25:07,681 --> 00:25:11,393 ఇచ్చిన మాట ప్రకారం తను జ్ఞానోదయ నివాసానికి వెళ్ళడానికి మనల్ని వదిలివెళ్లినప్పుడు... 214 00:25:12,936 --> 00:25:14,938 అతను అక్కడికి నేరుగా వెళ్లినట్టు లేడు. 215 00:25:15,814 --> 00:25:17,566 చలికాలంలో ఒక చోట ఆగాడు. 216 00:25:19,609 --> 00:25:21,987 ఒపాయోల్ ప్రజల వద్దకి వెళ్ళాడు. 217 00:25:23,322 --> 00:25:24,906 వాళ్ళతో ఒక ఏడాది కలిసి జీవించాడు. 218 00:25:25,991 --> 00:25:27,117 ఒక ఏడాదా? 219 00:25:29,286 --> 00:25:32,831 కానీ... అతని బిడ్డ జన్మించగానే... 220 00:25:34,249 --> 00:25:35,751 అతని ప్రయాణాన్ని కొనసాగించాడు. 221 00:25:37,377 --> 00:25:39,963 ఆ బిడ్డే బూట్స్. 222 00:25:41,631 --> 00:25:43,383 జెర్లామరెల్ కొడుకే బూట్స్. 223 00:25:44,801 --> 00:25:45,844 మా సోదరుడు. 224 00:25:53,560 --> 00:25:55,729 జెర్లామరెల్ తన ప్రయాణం కొనసాగించాక... 225 00:25:57,648 --> 00:26:00,651 బూట్స్ ని ఒపాయోల్ వారు ఒక బానిసలాగా చూడసాగారు. 226 00:26:02,069 --> 00:26:05,572 బలవంతంగా ఇతని చేత దోపిడీలు, దొంగతనాలు చేయించుకొనేవాళ్ళు. 227 00:26:06,323 --> 00:26:10,202 ఈ ప్రాంతంలో మాంత్రికాంతకుడు గాలింపు చేస్తున్నాడని తెలియగానే, 228 00:26:10,285 --> 00:26:12,663 ఇంకెక్కడైనా తలదాచుకుందామని ఒపాయోల్ వాళ్ళు వెళ్లిపోయారు. 229 00:26:12,746 --> 00:26:15,165 నీ మానాన నువ్వు బ్రతుకు అని ఇతడిని ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 230 00:26:15,248 --> 00:26:17,834 తల్లీ! తల్లీ! 231 00:26:20,504 --> 00:26:22,881 ఇతడిని కూడా మనతో పాటే తీసుకెళ్దామని అంటున్నావా? 232 00:26:22,964 --> 00:26:24,132 అవును. 233 00:26:26,718 --> 00:26:30,430 ఇతడిని జంతువుగా చూసే ఆ చెర నుండి బయటపడేయవచ్చు అంతేకాకుండా... 234 00:26:31,723 --> 00:26:34,851 ఒక నేర్పుగల యోధుడిగా ఇతను మనకు బాగా పనికివస్తాడు... 235 00:26:34,935 --> 00:26:36,144 ఇతను చూడగలడు. 236 00:26:37,896 --> 00:26:38,981 చూడగలడు కదా? 237 00:26:42,359 --> 00:26:44,194 అవును, ఇతను చూడగలడు. 238 00:26:46,655 --> 00:26:49,616 మీరిరువురూ, ఒక అంగీకారానికి వచ్చారా? 239 00:26:51,660 --> 00:26:53,161 ఎందుకు అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు? 240 00:26:54,371 --> 00:26:56,707 ఇతను మన కుటుంబ సభ్యుడే. మనం ఇతడిని వదిలిపెట్టేసిపోలేము. 241 00:26:57,833 --> 00:27:00,085 నీ మదిలో ఉత్పన్నమయ్యే ప్రశ్నలన్నింటినీ నేను కూడా అడిగాను. 242 00:27:01,211 --> 00:27:02,963 నీ ఆందోళననే నేనూ వ్యక్తం చేశాను. 243 00:27:03,046 --> 00:27:04,089 మరి? 244 00:27:05,882 --> 00:27:08,385 నేనే కనుక దీన్ని అడ్డుకోవాలని అనుకుంటే, ప్యారిస్, 245 00:27:08,927 --> 00:27:10,929 ఈపాటికి నేను ఆ పనిని చేయడం నువ్వు వినుండే దానివే. 246 00:27:11,013 --> 00:27:12,139 వినుండేదానివే కదా? 247 00:27:15,058 --> 00:27:16,852 ఇతని గురించి ఇంకా నీకేం తెలుసు? 248 00:27:17,853 --> 00:27:20,105 దొంగతనాల్లో ఇతనికి ఉన్న నేర్పరితనం కాకుండా. 249 00:27:22,399 --> 00:27:23,900 నీకితని మీద నమ్మకం ఉందా? 250 00:27:25,986 --> 00:27:32,617 మీ కుటుంబ సభ్యుల పట్ల మీరు చూపిస్తున్న ఆదరణ నాకిదివరకూ ఎవ్వరూ చూపలేదు. 251 00:27:33,452 --> 00:27:34,995 అందులో భాగం పంచుకోవడానికి, 252 00:27:35,579 --> 00:27:37,831 మీరేమడిగినా చేయడానికి నేను సిద్దమే. 253 00:27:46,548 --> 00:27:47,841 అయితే అతడిని మనతో రానిద్దాం. 254 00:27:49,885 --> 00:27:55,140 కనుచూపున్నవారితో మనం ఒక సైన్యాన్ని నిర్మించుకుందాం... 255 00:27:56,350 --> 00:27:59,770 కాకపోతే వాళ్ళు మన మధ్యనున్న మన ఏకైక జనరల్ కి 256 00:27:59,853 --> 00:28:02,564 తమ విధేయతని చాటాలి. 257 00:28:03,315 --> 00:28:04,316 నేను విధేయతని చాటుతున్నాను. 258 00:28:06,026 --> 00:28:08,904 కాదు. చూపించు. 259 00:28:44,523 --> 00:28:46,191 ఎంతటి ఆహ్లాదకరమైన రోజు. 260 00:28:50,362 --> 00:28:55,742 ఆమె నిశబ్దం కన్నా మీ నిశబ్దమే నాకు బాగా ఆసక్తికరంగా ఉంది. 261 00:29:02,416 --> 00:29:06,461 ఇవాళ మీరెంతటి తప్పు చేశారో మీకు గుర్తు చేస్తూ 262 00:29:06,962 --> 00:29:10,215 మీ గొంతులను కోసేటప్పుడు నేను కూడా అక్కడే ఉంటాను. 263 00:29:22,853 --> 00:29:25,147 నీ నుండి చాలా సార్లు దూరమవ్వాల్సి వస్తోంది... 264 00:29:26,231 --> 00:29:27,941 దూరమైన ప్రతీసారి అదే ఆఖరిసారేమోనని భయం కలుగుతోంది. 265 00:29:29,818 --> 00:29:31,611 ఇకపై దూరంకాకుండా ఉందాం. 266 00:29:41,204 --> 00:29:43,081 నేను నా తండ్రి గురించి... 267 00:29:45,042 --> 00:29:46,418 నీకు అంత ఎక్కువగా చెప్పలేదు. 268 00:29:48,378 --> 00:29:49,796 చెప్పమని నేనెన్నడూ నిన్ను అడగలేదు. 269 00:29:50,589 --> 00:29:52,507 నువ్వెక్కడి నుండి వచ్చావన్నది నాకస్సలు ముఖ్యమే కాదు. 270 00:29:52,591 --> 00:29:55,218 తెలుసు. నాకు కూడా. 271 00:29:58,347 --> 00:30:00,349 చనిపోయే రోజు అతను నాకిది ఇచ్చాడు. 272 00:30:01,808 --> 00:30:04,394 అతనికి గుర్తున్నంతవరకూ అతని కుటుంబంతోనే గడిపాడు. 273 00:30:05,562 --> 00:30:06,647 తెరువు. 274 00:30:14,988 --> 00:30:16,615 దీనికోసమే అంత శ్రమపడ్డాం. 275 00:30:20,077 --> 00:30:21,703 అతనంటే నీకు చాలా ఇష్టం ఉండుంటుంది. 276 00:30:22,371 --> 00:30:23,914 అతను చాలా మంచివాడు. 277 00:30:24,498 --> 00:30:26,667 జాలిగలవాడు, తెలివైనవాడు. 278 00:30:30,045 --> 00:30:31,755 అతనికి నువ్వు నచ్చుతావనుకుంటా. 279 00:30:33,590 --> 00:30:35,217 అలా అని భ్రమపడకుండా ఉందాములే. 280 00:30:40,597 --> 00:30:41,890 అతను నాకు పరిచయమయ్యుంటే బాగుండు. 281 00:30:44,518 --> 00:30:46,645 బహుశా ఇంకెప్పుడైనా అతని గురించి నువ్వు నాకు చెప్పవచ్చులే. 282 00:30:48,522 --> 00:30:49,940 అలాగే చెప్తానులే. 283 00:30:56,405 --> 00:30:57,614 కొఫూన్ నిజమే చెప్పాడు. 284 00:30:59,157 --> 00:31:00,575 నేను బయలుదేరాలి. 285 00:31:01,743 --> 00:31:02,995 తప్పకుండా. 286 00:31:03,537 --> 00:31:06,081 ఆ అబ్బాయి, బూట్స్ ని... 287 00:31:07,290 --> 00:31:08,959 నువ్వు నమ్మడం లేదు కదా? 288 00:31:12,254 --> 00:31:14,881 కొంతకాలంపాటు కొత్తవారిని ఎవ్వరినీ నమ్మకూడదని అనుకుంటున్నాను. 289 00:31:15,674 --> 00:31:16,717 అలాగా. 290 00:31:17,676 --> 00:31:19,553 అయితే ఎందుకు సమ్మతించావు? 291 00:31:22,097 --> 00:31:23,974 ఆ విషయంలో నేనేమైనా చేయగలనని నీకు అనిపించినందుకు నేను ముగ్ధుడినయిపోతున్నాను. 292 00:31:24,057 --> 00:31:25,350 నేను నిజంగా అడుగుతున్నాను. 293 00:31:26,101 --> 00:31:27,894 - తెలుసు. - నువ్వు ఎందుకు అడ్డుచెప్పలేదు? 294 00:31:35,319 --> 00:31:36,903 ఎందుకంటే మన ఈ ప్రయాణం ముగిశాక... 295 00:31:39,364 --> 00:31:40,949 మన పిల్లలు ఓ కొత్త తండ్రిని కలుసుకుంటారు. 296 00:31:43,577 --> 00:31:46,121 వాళ్ళకి ఆ కొత్త తండ్రి అవసరముందనే ఆలోచనని నేను రానివ్వకూడదు. 297 00:31:50,292 --> 00:31:52,377 మనం ఏది ఎందుకు చేస్తున్నామో కొఫూన్ అర్థం చేసుకుంటాడు. 298 00:31:52,961 --> 00:31:54,171 వాడికి ఆ గుణం ఉంది. 299 00:31:55,172 --> 00:31:56,715 వాటికి నొచ్చుకోడు. 300 00:32:00,510 --> 00:32:01,595 కానీ ఆమె... 301 00:32:07,726 --> 00:32:09,144 తనని పోగొట్టుకోవాలని నాకు లేదు. 302 00:32:12,439 --> 00:32:13,649 నువ్వు పోగొట్టుకోవులే. 303 00:32:24,451 --> 00:32:25,494 అవును. 304 00:32:47,140 --> 00:32:48,225 నిన్ను ప్రేమిస్తున్నా. 305 00:33:06,576 --> 00:33:09,162 వాళ్ళకి నేను నచ్చలేదు కదా? 306 00:33:12,666 --> 00:33:13,875 వాళ్ళు జంకుతున్నారు... 307 00:33:14,876 --> 00:33:16,086 అంతేగాక సందిగ్ధంలో ఉన్నారు. 308 00:33:16,628 --> 00:33:19,548 కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారులే. 309 00:33:20,507 --> 00:33:21,717 మరి నువ్వంటే వాళ్ళకి ఇష్టమేనా? 310 00:33:23,385 --> 00:33:24,511 ఏమన్నావు? 311 00:33:24,928 --> 00:33:26,346 నీ మీద అరుస్తూ ఉంటారు. 312 00:33:26,430 --> 00:33:28,432 నువ్వు చేసే పనులను ప్రశ్నిస్తూ ఉంటారు, నిన్ను చిన్నబుచ్చుతుంటారు. 313 00:33:29,599 --> 00:33:31,935 మా వాళ్ళు కూడా నాతో ఎప్పుడూ అలానే ప్రవర్తించేవారు. 314 00:33:39,234 --> 00:33:40,986 నీ ముఖానికి ఎందుకు ముసుగు వేయించేవారు? 315 00:33:43,989 --> 00:33:45,991 నేను వాళ్ళలాంటివాడిని కాదని అనేవారు. 316 00:33:46,533 --> 00:33:49,911 మనిషిని కాకుండా, ఇంకేదో అని. 317 00:33:50,787 --> 00:33:52,539 ఆ ముసుగు నాకా విషయం గుర్తుచేస్తుందని వేయించేవారు. 318 00:33:59,254 --> 00:34:00,797 నా కుటుంబానికి నేనంటే ప్రాణం. 319 00:34:02,924 --> 00:34:04,634 ఎల్లపుడూ అర్థంచేసుకోరు. 320 00:34:06,053 --> 00:34:10,891 కానీ నా మీద ప్రేమ విషయంలో వారి మీద నాకు ఒక్క క్షణం కూడా సందేహం రాలేదు. 321 00:34:17,981 --> 00:34:21,610 నీ వాళ్ళు నీతో వ్యవహరించిన తీరు సరైనది కాదు. 322 00:34:22,569 --> 00:34:24,154 నిన్నింకా బాగా ఆదరించుండాలి. 323 00:34:26,114 --> 00:34:27,532 కానీ నేను మాటిస్తున్నాను... 324 00:34:28,825 --> 00:34:30,327 ఇక నుంచి నువ్వు మాలో ఒకడివే. 325 00:34:31,411 --> 00:34:33,413 ఇక మీద నీతో ఎవ్వరూ ఆ విధంగా వ్యవహరించరు. 326 00:34:40,003 --> 00:34:41,463 మీ అమ్మ. 327 00:34:43,006 --> 00:34:45,717 తను ఇప్పటికే నిన్నూ, మీ సోదరుడిని ప్రేమిస్తుంది కాబట్టి మరొక బిడ్డని 328 00:34:45,801 --> 00:34:47,594 తను ప్రేమించే ఆస్కారముంది అనుకుంటున్నావా? 329 00:34:57,688 --> 00:34:59,314 దానికి కాస్త సమయం పట్టవచ్చు. 330 00:35:01,108 --> 00:35:03,651 అది తనకి సంక్లిష్టమైన విషయం. 331 00:35:06,697 --> 00:35:07,698 కానీ... 332 00:35:09,616 --> 00:35:13,328 మా అమ్మకి ఉన్నంత విశాల హృదయం నాకు తెలిసి ఇంకెవ్వరికీ లేదు. 333 00:35:15,539 --> 00:35:16,832 ఏది సరైనదో అదే తను చేస్తుంది. 334 00:35:18,750 --> 00:35:20,377 ఎప్పుడూ సరైనదే చేస్తుంది. 335 00:35:36,267 --> 00:35:39,812 - నీ రహస్యాన్ని ఎందుకు అంత కాలం దాచావు? - అదెలా చేశావు? 336 00:35:40,772 --> 00:35:41,898 ఏం చేశాను? 337 00:35:42,316 --> 00:35:45,026 నువ్వు దొంగచాటుగా వచ్చేటప్పుడు చూడగలవారి వద్దకి దొంగచాటుగా రావడం. 338 00:35:46,194 --> 00:35:49,613 నేనేమీ దొంగచాటుగా రాలేదు. బహూశా నువ్వే శ్రద్ధ పెట్టలేదేమో. 339 00:35:53,660 --> 00:35:55,078 ఇక నా ప్రశ్నకి బదులిస్తావా? 340 00:35:55,954 --> 00:35:57,247 ఏం మాట్లాడుతున్నావు? 341 00:35:57,789 --> 00:35:58,874 రహస్యమేంటి? 342 00:36:03,253 --> 00:36:06,631 నువ్వు చాలా కాలం దాచావు కాబట్టి, అది అస్సలు రహస్యమనే నీకు అనిపించడం లేదు. 343 00:36:10,510 --> 00:36:12,471 ఆల్కెన్నీ వాసులలో ఎవ్వరికీ కూడా... 344 00:36:15,265 --> 00:36:16,558 నువ్వు చూడగలవని ఎందుకు తెలీలేదు? 345 00:36:17,434 --> 00:36:20,270 మాంత్రికాంతకుడు వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరూ స్పందించిన తీరును బట్టి చూస్తే, 346 00:36:20,354 --> 00:36:21,813 అటువంటి సమాచారం వాళ్ళకు చెప్పకుండా 347 00:36:21,897 --> 00:36:24,107 మా తల్లిదండ్రులు తెలివైన పనే చేశారని నాకనిపిస్తోంది. 348 00:36:34,701 --> 00:36:37,120 బాబా, మాగ్రా ఆల్కెన్నీలో ఇరుక్కుపోయారు. 349 00:36:38,413 --> 00:36:40,916 మీ ఇద్దరినీ కాపాడటానికే ఆ విషయం రహస్యంగా ఉంచారని నా బావన. 350 00:36:41,750 --> 00:36:43,460 అవును, అలాంటిదే. 351 00:36:46,004 --> 00:36:48,507 నువ్వు జనాలని గమనిస్తున్నావని వారికి తెలియనప్పుడు 352 00:36:48,590 --> 00:36:50,509 వారిని గమనించడం ఎలా ఉంటుందో నీకు చెప్పనా? 353 00:36:59,101 --> 00:37:01,144 వాళ్ళ జీవితం నీ గుప్పెట్లోకి వచ్చేస్తుంది. 354 00:37:03,438 --> 00:37:05,315 వాళ్ళ రహస్యాలని నువ్వు దాచుకోవచ్చు. 355 00:37:05,399 --> 00:37:07,442 వాళ్ళ శత్రువులకు వాటిని చేరవేయవచ్చు. 356 00:37:08,860 --> 00:37:10,404 ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఎలా చేశారో... 357 00:37:11,780 --> 00:37:13,865 వాళ్ళకి అస్సలు తెలియకుండా వాళ్ళ మీద 358 00:37:14,783 --> 00:37:17,536 దాడి చేయవచ్చు. 359 00:37:19,913 --> 00:37:22,249 వాళ్ళ జీవితాన్ని నువ్వు మార్చేయవచ్చు. 360 00:37:24,042 --> 00:37:25,168 వాళ్ళ జీవితాన్ని అంతమొందించేయవచ్చు... 361 00:37:27,713 --> 00:37:28,922 కారణమున్నా... 362 00:37:30,257 --> 00:37:31,633 కారణం లేకపోయినా. 363 00:37:33,593 --> 00:37:35,137 అదే దేవుళ్ళు చేసే పని. 364 00:37:37,597 --> 00:37:39,057 ఆ శక్తిని ఇతరుల మీద ఎన్నడూ 365 00:37:39,141 --> 00:37:42,394 నువ్వు ప్రయోగించలేదు కనుక నీకు అదెలా ఉంటుందో తెలియకపోవచ్చు. 366 00:37:42,477 --> 00:37:45,731 అలా నిన్ను మీ తల్లిదండ్రులు తీర్చిదిద్దారు. 367 00:37:49,484 --> 00:37:50,569 కానీ నాకు తెలుసు. 368 00:37:55,240 --> 00:37:58,660 జెర్లామరెల్ కి కూడా తెలిసే ఉంటుందని నా అనుమానం. 369 00:38:03,415 --> 00:38:06,043 నాకు మాత్రం, నేను నీడలా అనుసరించిన వారికి అది నన్ను దగ్గర చేసింది. 370 00:38:08,086 --> 00:38:09,379 జెర్లామరెల్ కి... 371 00:38:11,506 --> 00:38:15,177 వాళ్ళ మధ్య అతను ఓ కొడుకుని కని, అతడిని వదిలేశాడు. 372 00:38:15,802 --> 00:38:18,347 ఏదేమైనా, నీకూ, వీటన్నింటికీ ఏంటి సంబంధం? 373 00:38:19,890 --> 00:38:23,352 నీకు చూసే సామర్ధ్యమున్నా గమనించే సామర్ధ్యం తక్కువ ఉండటం హాస్యాస్పదంగా ఉంది. 374 00:38:39,951 --> 00:38:41,161 నేనెక్కడ ఉన్నాను? 375 00:38:41,662 --> 00:38:43,163 పురుగుల నగరంలో ఉన్నావు. 376 00:38:46,792 --> 00:38:49,795 నేనెక్కడ ఉన్నాను? 377 00:39:08,021 --> 00:39:09,356 మిత్రులారా. 378 00:39:10,899 --> 00:39:12,526 నాకోసం ఏం తెచ్చారు? 379 00:39:13,276 --> 00:39:15,737 నా వద్ద ఓ గుర్రం ఉంది. దానికి నీళ్ళు కావాలి. 380 00:39:15,821 --> 00:39:18,657 ఇంకా నాకు అలసటగా ఉంది. నేను నిద్రకు ఉపక్రమించాలి. 381 00:39:19,074 --> 00:39:20,283 రోజంతా స్వారీ చేసాను. 382 00:39:20,367 --> 00:39:22,828 నా పిరుదులకి చమురు కావాలి, అది రుద్దడానికి ఓ పనిమనిషి కావాలి. 383 00:39:22,911 --> 00:39:24,913 నేను నిద్రపోయాక, నీతో మాట్లాడతాను. 384 00:39:24,997 --> 00:39:26,331 నువ్వు పొరపాటు చేశావు... 385 00:39:39,428 --> 00:39:41,304 నాజూకైన వేళ్ళు. 386 00:39:43,473 --> 00:39:47,686 మీరిద్దరూ చక్కని పనితీరు కనబరిచారు. ధన్యవాదాలు. తను... సరిగ్గా సరిపోతుంది. 387 00:39:51,690 --> 00:39:54,276 పట్టుపురుగు అనేది అబ్బురపరిచే జీవి. 388 00:39:55,569 --> 00:39:56,862 ఎందుకో నీకు తెలుసుకోవాలనుందా? 389 00:39:59,281 --> 00:40:03,869 అది పుట్టినప్పుడు చాలా చిన్నగా, అమాయకంగా, తిన్నగా ఉంటుంది. 390 00:40:04,369 --> 00:40:07,164 కానీ తన అతి తక్కువ జీవిత ప్రాయంలో, 391 00:40:07,247 --> 00:40:10,334 తను ఎంత సుందరమైన, ఇంకా సరియైన వస్తువును సృష్టిస్తుందంటే, 392 00:40:10,417 --> 00:40:12,878 తమ భార్యలకి, ఉంపుడుగత్తెలకి, 393 00:40:12,961 --> 00:40:16,214 అలాగే దుస్తులు ధరించే ప్రపంచంలోనే అత్యంత సంపన్న మగవారు, 394 00:40:16,298 --> 00:40:18,717 తాము కోరుకున్నవాటిల్లోకల్లా, 395 00:40:19,259 --> 00:40:22,137 దీన్ని... ఎన్నుకుంటారు. 396 00:40:23,305 --> 00:40:27,267 ఇక ఆ పురుగు జీవితం చివరి దశకి చేరుకున్నాక, తన వల్ల కలిగే లాభం నశించిపోయాక, 397 00:40:27,809 --> 00:40:32,189 తన ఆఖరి రోజులు చాలా విషాదకరంగా గడుపుతుంది. 398 00:40:33,106 --> 00:40:36,652 ఎగరాలని ఆరాటపడే ఆ రెక్కల జీవికి, 399 00:40:37,110 --> 00:40:38,945 ఆ సామర్ధ్యమే దక్కదు. 400 00:40:40,155 --> 00:40:42,616 తన పొట్టు అంతా అయిపోయాక 401 00:40:43,408 --> 00:40:45,577 చావు దగ్గరపడుతుంది. 402 00:40:47,579 --> 00:40:49,539 తన గురించి ఇక్కడ నీకు బాగా తెలుస్తుంది. 403 00:40:50,540 --> 00:40:53,919 తన గురించి మంచి అవగాహన వస్తుంది. 404 00:40:55,796 --> 00:40:59,800 నేస్తమా, నేనిక్కడ ఉండటం నీకంత యోగ్యం కాదు. 405 00:41:01,551 --> 00:41:03,387 నా జీవితంలో నేను ఒక్క పురుగుని కూడా చూడలేదు. 406 00:41:05,764 --> 00:41:09,518 అవును. కొంతకాలం పాటు, అది నిన్ను నివ్వెరపరచవచ్చు. 407 00:41:12,479 --> 00:41:15,691 కానీ తొందరగానే పశ్చాత్తాప్పడతావు. 408 00:41:31,289 --> 00:41:32,541 అవునా? 409 00:41:34,292 --> 00:41:37,629 అలాంటి ప్రకటన చేయడానికి నువ్వెవరవు అయ్యుంటావు. 410 00:41:39,756 --> 00:41:42,551 పనికి అలవాటు పడని సున్నితమైన చేతులు. 411 00:41:42,634 --> 00:41:45,387 దెబ్బలకు అలవాటుపడని పెడసరి మాటలు. 412 00:41:46,346 --> 00:41:47,723 తన అధికారాన్ని కానీ... 413 00:41:48,974 --> 00:41:53,395 లేదా బహుశా తన భర్త అధికారాన్ని కానీ చెలాయించడానికి అలవాటు పడిన ఓ సంపన్న మహిళ. 414 00:41:54,688 --> 00:41:57,858 కానీ తను ఏ ప్రాంతానికి చెందినది? 415 00:42:02,863 --> 00:42:07,075 మాంత్రికాంతకుడు, తన దండయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి ఎంతో కాలం కాలేదు. 416 00:42:07,743 --> 00:42:09,745 అతను సమాచారం కోసం అడుగుతున్న సమయంలో, 417 00:42:10,662 --> 00:42:14,791 అతని యాస, విచ్చలవిడిగా డబ్బులు తగలేస్తున్న గొప్పవంశస్థులకు 418 00:42:14,875 --> 00:42:19,671 నేను సరుకులు అమ్మడానికి వెళ్లిన కంజువా ప్రాంతాన్ని గుర్తుకుతెప్పించింది. 419 00:42:22,090 --> 00:42:26,094 నీ యాస కూడా నాకు అవే జ్ఞాపకాలను గుర్తుకుతెప్పిస్తోంది. 420 00:42:31,099 --> 00:42:33,769 నువ్వో గొప్పవంశస్థురాలివని అనుకుంటున్నాను. 421 00:42:35,187 --> 00:42:38,482 ఆ దరిద్రపు మహారాణికి సలహాదారురాలివి కూడా ఆయ్యుండవచ్చు. 422 00:42:40,817 --> 00:42:41,943 కానీ ఏదైతే ఏంటి. 423 00:42:42,569 --> 00:42:45,989 ఇక్కడ నువ్వు కూడా అందరితో పాటూ సమానమే, లేదా ఇంకా తక్కువే కావచ్చేమో, 424 00:42:46,073 --> 00:42:49,201 ఎందుకంటే నువ్వు మొత్తం మొదట్నుంచీ నేర్చుకోవాలి కాబట్టి. 425 00:42:49,993 --> 00:42:52,412 నువ్వు నాకోసం కష్టపడి పనిచేస్తే, నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. 426 00:42:52,496 --> 00:42:56,375 తప్పించుకోవాలని ప్రయత్నిస్తే, ఎంతో దూరం వెళ్ళలేవు, దానికి పరిణామాలు... 427 00:42:58,043 --> 00:42:59,169 తీవ్రంగా ఉంటాయి. 428 00:43:00,921 --> 00:43:02,589 నువ్వు నన్ను ఆకట్టుకున్నావు. 429 00:43:03,715 --> 00:43:08,136 నీతో ఇక్కడ మనకి కుదిరినంత సమయం గడిపేందుకు నేను ఆత్రుతగా ఎదురుచూస్తుంటాను మరి. 430 00:43:13,725 --> 00:43:14,851 నా మాటలను ఆలకించు... 431 00:43:16,103 --> 00:43:17,270 జెర్లామరెల్. 432 00:43:18,981 --> 00:43:19,982 జెర్లామరెల్. 433 00:43:20,816 --> 00:43:21,900 కొఫూన్? 434 00:43:22,651 --> 00:43:24,861 ఆ. ఇక్కడున్నా, నాన్నా. 435 00:43:25,404 --> 00:43:26,613 పడవకి లంగరు తీసేశావా? 436 00:43:27,781 --> 00:43:30,409 లంగరు తీసేసాను కానీ, పడవ ఇరుక్కుపోయింది. 437 00:43:30,826 --> 00:43:32,703 "ఇరుక్కుపోయింది" అంటే? ఎక్కడ ఇరుక్కుపోయింది? 438 00:43:33,036 --> 00:43:34,329 అలలు లోపలికి వెళ్లిపోయాయి. 439 00:43:38,291 --> 00:43:39,376 అయితే మనమిప్పుడు ఏం చేయాలి? 440 00:43:46,008 --> 00:43:47,676 రేపు ఉదయం వరకు ఆగాలి. 441 00:44:26,882 --> 00:44:27,966 రా. 442 00:44:29,968 --> 00:44:31,011 పరిగెత్తండి. 443 00:44:31,428 --> 00:44:32,429 పదా. 444 00:44:34,181 --> 00:44:35,182 పరిగెత్తండి. 445 00:45:12,094 --> 00:45:13,720 దీని గుండా వాళ్ళు ప్రయాణించలేరు కదా? 446 00:45:13,804 --> 00:45:16,264 ప్రయాణించగలరు. కానీ, ఇది వాళ్ళ వేగాన్ని తగ్గిస్తుంది. 447 00:45:26,984 --> 00:45:28,151 నేను వారిని వినగలుగుతున్నాను. 448 00:45:30,570 --> 00:45:31,863 - హనీవా. - చెప్పు. 449 00:45:33,031 --> 00:45:35,534 అమ్మనీ, ప్యారిస్ ని ఎక్కడికైనా తలదాచుకొనే చోటుకి తీసుకెళ్ళు. 450 00:45:36,451 --> 00:45:37,869 నువ్వంటే నాకు ప్రాణం. వెళ్ళు. వెళ్ళు. 451 00:45:45,460 --> 00:45:46,670 వాళ్ళు మన చుట్టూరా ఉన్నారు. 452 00:45:50,590 --> 00:45:52,592 నాన్నా, నేను నీతో కలిసి పోరాడతాను. 453 00:45:54,886 --> 00:45:56,513 అలాగే, తప్పకుండా, బాబు. 454 00:46:18,618 --> 00:46:19,911 ఇక్కడే ఉండండి. 455 00:46:23,248 --> 00:46:24,666 అంతా సర్దుకుపోతుంది. 456 00:48:26,997 --> 00:48:27,998 మాగ్రా? 457 00:48:29,875 --> 00:48:30,876 మాగ్రా? 458 00:48:34,755 --> 00:48:36,340 బాబా వాస్? 459 00:48:44,348 --> 00:48:45,390 అమ్మ ఏది? ఏం జరిగింది? 460 00:48:45,474 --> 00:48:47,142 - తను వెళ్లిపోయింది. - హనీవా! 461 00:48:48,268 --> 00:48:49,353 - హనీవా. - లేదు. 462 00:48:49,436 --> 00:48:52,314 బాబా, తన చేతిని పట్టుకొనే ఉన్నాను. 463 00:48:52,397 --> 00:48:53,398 తనని వాళ్ళు ఎత్తుకెళ్ళారా? 464 00:48:53,482 --> 00:48:55,984 లేదు, తనే నా చేతిని వదిలేసింది. 465 00:48:56,401 --> 00:49:01,281 "జాగ్రత్త" అని నాకు గుసగుసలాడుతూ చెప్పింది. 466 00:49:04,368 --> 00:49:05,369 అమ్మా? 467 00:49:08,538 --> 00:49:09,998 అమ్మా! 468 00:49:21,885 --> 00:49:23,387 టమాక్టీ జూన్! 469 00:49:30,102 --> 00:49:33,730 నా గొంతు వినబడిందా, మాంత్రికాంతకుడా? 470 00:49:38,276 --> 00:49:39,486 నా మాటలు వినబడుతున్నాయా? 471 00:49:57,421 --> 00:49:58,547 మాట్లాడు. 472 00:50:01,216 --> 00:50:02,426 మాంత్రికాంతకా... 473 00:50:05,137 --> 00:50:06,304 నీకు నా మాటలు వినబడుతున్నాయా? 474 00:50:08,181 --> 00:50:10,976 నాకు చావబోయే మహిళ యొక్క గొంతు వినబడుతోంది. 475 00:50:12,060 --> 00:50:13,687 అయితే జాగ్రత్తగా విను. 476 00:50:50,474 --> 00:50:51,808 నా చేతిని తీసుకో. 477 00:50:59,775 --> 00:51:00,942 ఇక చెప్పు. 478 00:51:01,860 --> 00:51:02,944 కేన్... 479 00:51:04,529 --> 00:51:06,156 వంశానికి చెందిన... 480 00:51:08,492 --> 00:51:13,205 యువరాణి మాగ్రాకి... జయహో. 481 00:51:25,842 --> 00:51:27,594 భక్తిపూర్వక వందనాలు తెలియచేయండి! 482 00:52:36,997 --> 00:52:38,999 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య