1
00:00:06,041 --> 00:00:08,041
{\an8}ఇంతకుముందు
2
00:00:08,916 --> 00:00:10,500
మనిషి లాంటి పర్వతం.
3
00:00:10,500 --> 00:00:14,000
దానికి సరిగా పాడితే,
మీ పాటకు తిరిగి ప్రతిబింబిస్తు౦ది,
4
00:00:14,000 --> 00:00:16,250
ఎక్కడ తవ్వాలో, ఎక్కడ సొరంగం చేయాలో...
5
00:00:16,250 --> 00:00:18,375
ఎక్కడ పర్వతాన్ని
తాకకూడదో చూపుతుంది.
6
00:00:21,000 --> 00:00:21,958
నాన్నా...
7
00:00:21,958 --> 00:00:23,833
ఇది మనం ఊహించిన దానికంటే ఎక్కువ.
8
00:00:23,833 --> 00:00:26,166
- డ్యూరిన్ మహారాజా, అక్కడ ఉన్నది...
- చాలు!
9
00:00:26,166 --> 00:00:27,416
ఎల్ఫ్‌ను పట్టుకోండి.
10
00:00:28,375 --> 00:00:30,916
ఎల్రోండ్ నా సొంత తల్లి గర్భంలో
11
00:00:30,916 --> 00:00:34,250
సాన పెట్టబడిన సోదరుడు నాకు.
12
00:00:34,250 --> 00:00:36,041
నీకు ఎంత ధైర్యం!
13
00:00:36,041 --> 00:00:38,166
నీ జాతికి ద్రోహం చేయాలనే
నీ నిర్ణయాన్ని
14
00:00:38,166 --> 00:00:41,333
సమర్థించుకోటానికి
నీ తల్లి జ్ఞాపకాన్ని వాడుకుంటావా?
15
00:00:41,333 --> 00:00:43,625
మన జాతికి ద్రోహం చేసింది మీరు!
16
00:00:43,625 --> 00:00:46,041
మీరు పెట్టుకున్న కిరీటానికి మీరు అవమానకరం!
17
00:00:49,875 --> 00:00:51,250
అది వదిలేయి.
18
00:00:51,250 --> 00:00:52,750
అది ఇకపై నీది కాదు.
19
00:00:55,125 --> 00:00:57,458
ఛాయ నుండి నువ్వు వచ్చావు.
20
00:00:57,458 --> 00:01:00,083
తిరిగి ఛాయ దగ్గరకే వెళ్ళిపో!
21
00:01:04,833 --> 00:01:07,625
నిన్న రాత్రి నీకు మళ్ళీ
ఆ కల వచ్చింది, కదా?
22
00:01:07,625 --> 00:01:10,000
కలలో, ఏదో ఒక... కొమ్మలాంటిది ఉంది.
23
00:01:10,000 --> 00:01:11,375
నక్షత్రాల కింద.
24
00:01:14,125 --> 00:01:15,500
మనల్ని ఎవరో వె౦బడుతున్నారు.
25
00:01:17,625 --> 00:01:19,583
స్యాడాక్ పాత పుస్తకం తిరగేస్తున్నా.
26
00:01:19,583 --> 00:01:21,541
అవి ఏవో దిశలు అనుకుంటా.
27
00:01:21,541 --> 00:01:23,583
ర్హున్ ధరిత్రికి స్వాగతం.
28
00:01:23,583 --> 00:01:25,500
దాన్ని ఎందుకలా చూస్తున్నావు?
29
00:01:25,500 --> 00:01:27,041
ఇదివరకు ఇక్కడికి వచ్చినట్టు.
30
00:01:27,041 --> 00:01:28,416
కలల్లో మాత్రమే.
31
00:01:34,458 --> 00:01:35,625
నాకు నీ పేరు చెప్పు.
32
00:01:35,625 --> 00:01:37,208
నాకు చాలా పేర్లు ఉండేవి.
33
00:01:38,291 --> 00:01:39,541
హాల్ బ్రాండ్ ఎక్కడ?
34
00:01:39,541 --> 00:01:42,500
అతను వెళ్ళిపోయాడు.
తిరిగొస్తాడన్న నమ్మకం లేదు.
35
00:01:42,500 --> 00:01:45,583
అతనిని ఎప్పుడూ
మనలో ఎవ్వరూ సంప్రదించకూడదు.
36
00:01:45,583 --> 00:01:49,833
నీ సహచరుడు, తను ఎవరన్నది నిజ౦ కాదని
ఇప్పుడే ఎల్రోండ్ చెప్పాడు.
37
00:01:49,833 --> 00:01:51,083
తను
నేననుకున్నవాడు కాదు.
38
00:01:51,083 --> 00:01:52,666
అతను సౌరోన్.
39
00:01:52,666 --> 00:01:55,916
ఇది స్వయంగా
కెలెబ్రింబోర్ ప్రభువుకే ఇవ్వాలి.
40
00:01:56,500 --> 00:02:00,291
ఆయనకు వెంటనే తెలియపరచండి
హాల్ బ్రాండ్‌యే సౌరోన్ అని.
41
00:02:00,291 --> 00:02:03,333
మన్నించండి, ప్రభూ,
కానీ ఇప్పుడే ఒక దూత వచ్చాడు.
42
00:02:03,833 --> 00:02:05,416
అతనిని ప్రవేశపెట్టమంటారా?
43
00:02:36,791 --> 00:02:42,791
{\an8}ఖజాద్- దుమ్
44
00:03:20,291 --> 00:03:24,583
ఎలుక తోలు పులుసు,
ఎలుక తోలు పులుసు...
45
00:03:24,583 --> 00:03:26,041
ఆగు.
46
00:03:26,041 --> 00:03:27,750
- చాలా ఖరీదైనవి.
- ఏంటి?
47
00:03:28,625 --> 00:03:30,333
మనం పేదవాళ్ళం కాదు.
48
00:03:30,333 --> 00:03:33,291
మనం డబ్బులు జాగ్రత్తగా
ఖర్చు చేయాలని చెప్పింది నువ్వే.
49
00:03:33,291 --> 00:03:36,375
లేదా నువ్వు చెప్పింది నీకు వర్తించదా?
50
00:03:42,416 --> 00:03:44,041
నీవొక రాకుమారుడిని వివాహమాడావు.
51
00:03:45,583 --> 00:03:47,583
కానీ ఇప్పుడు బహిష్కరణకు కట్టుబడ్డావు.
52
00:03:51,625 --> 00:03:54,625
నేను ప్రేమించిన మరుగుజ్జుకు కట్టుబడ్డాను.
53
00:03:56,791 --> 00:04:01,791
ఆయన మనసును మణులు నిండిన
గనులకోసం వదులుకోను.
54
00:04:08,708 --> 00:04:10,458
అయినా, మణులు ఉంటే బాగుంటుంది.
55
00:04:10,458 --> 00:04:12,375
అవును. బాగుంటుంది.
56
00:04:14,083 --> 00:04:16,083
మీ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేశావా...
57
00:04:16,083 --> 00:04:19,500
డీసా, ఆయన నన్ను కలిసేందుకు
ఎప్పటికీ ఒప్పుకోరు.
58
00:04:19,500 --> 00:04:20,875
నేను అడిగింది అది కాదు.
59
00:04:21,000 --> 00:04:23,666
కలుద్దామని నేనేందుకు అడగాలి?
60
00:04:23,666 --> 00:04:25,125
ఆయన నన్ను కాదనుకున్నారు!
61
00:04:25,625 --> 00:04:28,125
ఆయన రాతిబండలా మొండివారు.
62
00:04:28,125 --> 00:04:30,458
నీకు అదృష్టం బాగుంటే
ఆ రాతిని వంచి చూడు.
63
00:04:31,291 --> 00:04:32,458
అలాగే నువ్వు...
64
00:04:32,458 --> 00:04:33,541
డీసా?
65
00:04:34,833 --> 00:04:35,833
సిద్ధంగా ఉండ౦డి.
66
00:04:38,666 --> 00:04:40,791
సిద్ధంగా ఉండమన్నాను.
67
00:04:40,791 --> 00:04:42,000
డీసా!
68
00:05:25,541 --> 00:05:26,750
డ్యూరిన్.
69
00:05:28,708 --> 00:05:29,708
అయ్యో!
70
00:05:31,541 --> 00:05:32,666
లేదు, లేదు, లేదు.
71
00:06:49,125 --> 00:06:54,125
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్:
ది రింగ్స్ ఆఫ్ పవర్
72
00:07:15,500 --> 00:07:19,125
ఈ భూములు మిమ్ములను మోస్తూ
73
00:07:19,125 --> 00:07:22,750
మరొక్కసారి చక్కగా వికసిస్తాయి.
74
00:07:29,041 --> 00:07:30,500
నా ప్రియమైన సోదరా.
75
00:07:44,291 --> 00:07:45,541
కెలెబ్రింబోర్ ప్రభూ.
76
00:07:47,416 --> 00:07:49,333
మీరు వచ్చినట్టు నాకు చెప్ప లేదు.
77
00:07:52,125 --> 00:07:53,333
ఏంటి విషయాలు?
78
00:07:53,333 --> 00:07:55,625
ఒక ఊహించని అతిథి వచ్చారు.
79
00:07:58,666 --> 00:08:00,666
తను అప్పుడే తిరిగివచ్చేశాడా?
80
00:08:04,291 --> 00:08:07,083
గాలాడ్రియెల్? గాలాడ్రియెల్?
గాలాడ్రియెల్?
81
00:08:22,500 --> 00:08:25,083
అవి నువ్వు నాటిన విత్తనాలు కాదా?
82
00:08:28,291 --> 00:08:33,125
నింగి కింద ఎల్వెన్ రాజులకు మూడు ఉంగరాలు,
83
00:08:33,916 --> 00:08:38,375
రాతి మందిరాలలో
మరుగుజ్జు ప్రభువుల కోసం ఏడు,
84
00:08:38,375 --> 00:08:43,541
మరణించి అంతమయ్యే మర్త్య మానవులకు తొమ్మిది.
85
00:08:56,958 --> 00:08:58,583
మోర్డోర్ ఉత్తరంనుండి
దాడి చేయాలి.
86
00:08:58,583 --> 00:09:02,000
ఇక్కడ ఎరెడ్ లిధుయి,
ఎఫెల్ ఆర్నెన్‌ల మధ్య నుండి ప్రవేశిస్తాము.
87
00:09:02,583 --> 00:09:05,416
అడార్‌ను తూర్పు నుండి దాడి చేస్తే మంచిది.
88
00:09:06,666 --> 00:09:08,833
సౌరోన్ జాడ సంగతి ఏంటి?
89
00:09:08,833 --> 00:09:13,083
సౌరోన్ చివరిసారి మోర్డోర్‌కు వెళ్ళినట్టు
మన వేగులు చెప్పారు.
90
00:09:13,916 --> 00:09:17,500
అడార్‌ను స్వాధీన పరుచుకుని
తన సైన్యాలను సొంతం చేసుకోవాలని అతని ఆలోచన.
91
00:09:17,500 --> 00:09:19,375
మనం వేగంగా వెళితే,
92
00:09:19,375 --> 00:09:22,541
మనం ఒకే దెబ్బతో రెండు పిట్టలను చంపవచ్చు.
93
00:09:22,541 --> 00:09:24,958
ఉత్తర సైన్యాల దళపతి ఏమంటున్నారు?
94
00:09:25,916 --> 00:09:27,125
గాలాడ్రియెల్?
95
00:09:31,416 --> 00:09:33,791
మనం ఆండ్యుయిన్‌కు ఓడలను పంపించి,
96
00:09:34,625 --> 00:09:37,500
పశ్చిమం నుండి మోర్డోర్‌పై దాడి చేయాలి.
97
00:09:42,416 --> 00:09:43,958
దానికి సిద్ధం అవ్వండి.
98
00:09:52,250 --> 00:09:54,375
నీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయని చెప్పడానికి
99
00:09:54,375 --> 00:09:57,458
గ్రద్ద కళ్ళు అవసరం లేదు.
100
00:09:57,458 --> 00:09:59,500
వాటిని ఇబ్బందిపెడుతున్నవి ఏంటి?
101
00:10:01,375 --> 00:10:03,625
సౌరోన్ మోర్డోర్‌కు వెళ్ళి ఉండవచ్చు,
102
00:10:05,625 --> 00:10:07,791
కానీ అక్కడే ఉన్నాడని
ఖచ్చితంగా చెప్పలేము.
103
00:10:09,875 --> 00:10:11,458
అలా ఎందుకు అంటున్నావు?
104
00:10:12,041 --> 00:10:13,166
సౌరోన్...
105
00:10:15,000 --> 00:10:17,791
అతనికి తను ఒక బంజరు భూమికి
ప్రభువు కాదు
106
00:10:18,958 --> 00:10:20,750
మిడిల్ - ఎర్త్ మొత్తానికీ అనే భావన.
107
00:10:23,416 --> 00:10:26,000
దాన్ని జయించడమే కాకుండా,
దాని ప్రజలందరినీ
108
00:10:26,500 --> 00:10:31,000
తన ఆధీనంలో ఉంచుకొని
దానిని పాలించాలన్నది అతని ఆలోచన.
109
00:10:31,583 --> 00:10:33,333
దానికి, అతనికి సైన్యం కాదు...
110
00:10:35,333 --> 00:10:36,583
ఉంగరాలు కావాలి.
111
00:10:37,333 --> 00:10:40,583
అతను కెలెబ్రింబోర్ లేకుండా
వాటిని తయారు చేయలేడు.
112
00:10:40,583 --> 00:10:45,666
సౌరోన్ ఒంటరిగా ఉన్నాడు,
సైన్యం లేదు, మిత్రులూ లేరు.
113
00:10:46,208 --> 00:10:49,916
ఎరెజియోన్‌కు కొన్ని మైళ్ళ వరకూ
పది అడుగుల మందంగా ఉన్న
114
00:10:49,916 --> 00:10:55,250
డ్వార్వెన్ రాతి గోడలతో
రెండు నదులు రక్షణగా ఉన్నాయి.
115
00:10:56,916 --> 00:11:01,625
ఏమీ పరవాలేదు,
కెలెబ్రింబోర్ ఇంకా అతని కళా రహస్యాలు
116
00:11:02,416 --> 00:11:03,416
సురక్షితంగా ఉన్నాయి.
117
00:11:22,208 --> 00:11:27,708
నేను ఇది చెప్పగలను, కనబడని ఏదో దుష్టశక్తి
కెలెబ్రింబోర్‌కు దగ్గరవుతున్నది.
118
00:11:28,708 --> 00:11:32,250
సౌరోన్ ప్రళాణిక
ఇప్పటీకీ నిర్వహించబడుతోంది.
119
00:11:32,833 --> 00:11:33,958
నాకు అది తెలుసు.
120
00:11:35,666 --> 00:11:36,875
ఎలా?
121
00:11:39,916 --> 00:11:42,500
ఈ ఉంగర౦ ధరించిన దగ్గర నుండీ, నాకు...
122
00:11:44,166 --> 00:11:45,375
కనిపించాయి...
123
00:11:46,541 --> 00:11:48,750
అదృశ్య ప్రపంచ దృశ్యాలు...
124
00:11:50,916 --> 00:11:54,541
ఊహించని కలలుగా, మేల్కొని ఉన్న
నా మనసును చుట్టుముడుతున్నాయి.
125
00:11:56,041 --> 00:11:58,458
ఉంగరాలు నీలో
ఇంకా జరగనివి చూసే సామర్థ్యాన్ని
126
00:11:58,458 --> 00:12:01,416
ప్రేరేపించాయని నమ్ముతున్నావా?
127
00:12:04,291 --> 00:12:05,875
అవి మీకూ ప్రేరేపించాయా?
128
00:12:10,375 --> 00:12:12,541
నేను పర్వతాలు కూలిపోవడం చూశాను.
129
00:12:13,583 --> 00:12:18,375
నీళ్ళు ఎండిపోయాయి. నల్లటి మబ్బులు
తెల్ల కోటల మీద కమ్ముకున్నాయి.
130
00:12:18,375 --> 00:12:21,291
- అయితే నన్ను ఎరెజియోన్‌కు పంపండి.
- గాలాడ్రియెల్...
131
00:12:21,291 --> 00:12:24,625
- సౌరోన్ అక్కడుంటే, కబురు పంపుతా...
- సౌరోన్‌ను మళ్ళీ ఎదురుకోలేవు.
132
00:12:26,875 --> 00:12:31,125
ఒకసారి మోసగాడు
మనషుల నమ్మకాన్ని చూరగొన్నాక,
133
00:12:31,125 --> 00:12:34,500
అతను వారి ఆలోచనలను మార్చగల
సామర్థ్యాన్ని పొందుతాడని అంటారు.
134
00:12:35,083 --> 00:12:39,208
అతను వారి హృదయాన్ని, మనసునే కాకుండా
వారు చూసేది, వినేది కూడా ఏమార్చగలడు.
135
00:12:39,208 --> 00:12:41,708
వారి వాస్తవాన్ని మార్చేయడానికి.
136
00:12:43,041 --> 00:12:45,250
నువ్వు ఇప్పటికే ఒకసారి ప్రభావితమయ్యావు.
137
00:12:48,250 --> 00:12:49,208
అవును.
138
00:12:50,791 --> 00:12:52,208
అతనికి నా మనసు తెలుసు.
139
00:12:53,875 --> 00:12:55,333
నాకు అతని మనసు తెలుసు.
140
00:12:56,416 --> 00:12:58,541
అందుకనే అతనిని నేను ఎదుర్కోవాలి.
141
00:12:59,416 --> 00:13:01,708
ఎందుకంటే నేను మాత్రమే అతనిని చంపగలను.
142
00:13:01,708 --> 00:13:04,208
ఒకప్పుడు అతనిని స్నేహితుడిగా భావించావు.
143
00:13:04,208 --> 00:13:06,458
- హాల్ బ్రాండ్, అతను కాదు ఒక...
- సౌరోన్.
144
00:13:07,875 --> 00:13:09,750
అతనిని ఒంటరిగా ఎదుర్కోలేవు.
145
00:13:12,125 --> 00:13:14,958
ఒకవేళ... నేను ఒంటరి కాకపోతే?
146
00:13:21,458 --> 00:13:25,291
ఎరెజియోన్
ఎల్వెన్ లోహకారుల రాజ్యం
147
00:13:38,750 --> 00:13:43,166
కెలెబ్రింబోర్ ప్రభువు మీకు ప్రవేశాన్ని
అనుమతించలేరని తెలుపుటకు చింతిస్తున్నారు.
148
00:13:44,000 --> 00:13:46,708
ఆయనతో నేను స్వయంగా మాట్లాడలేనా?
149
00:13:46,708 --> 00:13:48,083
ప్రభువులకు సమయం లేదు.
150
00:13:48,083 --> 00:13:50,583
కానీ మీ ప్రయాణం
బాగా జరగాలని కోరుకుంటున్నారు.
151
00:13:51,166 --> 00:13:52,833
నన్ను వెళ్ళిపొమ్మంటున్నావా?
152
00:13:55,125 --> 00:13:57,750
ఎరెజియోన్ ప్రభువు వెళ్ళమంటున్నారు.
153
00:14:00,166 --> 00:14:02,375
బహుశా నేను ఇక్కడే వేచి ఉంటాను.
154
00:14:06,625 --> 00:14:08,375
ఆయన మనసు మార్చుకుంటారేమోనని.
155
00:14:23,791 --> 00:14:24,625
అతను వెళ్ళాడా?
156
00:14:24,625 --> 00:14:27,208
లేదు. వెళ్ళడానికి నిరాకరించాడు, ప్రభూ.
157
00:14:30,625 --> 00:14:32,291
సరే, అతను నిరాకరించవచ్చు.
158
00:14:32,291 --> 00:14:36,458
నేను అతనితో ఎప్పుడూ వ్యవహరించనని,
గాలాడ్రియెల్ వెళ్ళేముందు తనకు మాటిచ్చాను.
159
00:14:40,708 --> 00:14:42,125
ఇంకేమయినా ఉందా?
160
00:14:42,125 --> 00:14:44,375
అతనికి గాయమయింది అనుకుంటా, ప్రభూ.
161
00:14:45,708 --> 00:14:46,916
ఉండనివ్వు.
162
00:14:48,583 --> 00:14:49,583
త్వరలో వెళ్ళిపోతాడు.
163
00:14:50,541 --> 00:14:53,541
లిండోన్ నుండి దూతలు ఏరోజు అయినా
వార్త తీసుకుని రావచ్చు.
164
00:16:13,541 --> 00:16:18,500
కారస్ గేర్
పశ్చిమ ర్హున్
165
00:18:23,250 --> 00:18:25,708
తెల్లటి రెక్కలు గలవి
ఏమి సమాచారం తెచ్చాయి?
166
00:18:26,291 --> 00:18:28,291
సౌరోన్ ఛాయ విస్తరిస్తోంది.
167
00:18:29,041 --> 00:18:33,541
తన శత్రువులను మోసగించేందుకు
కొత్త రూపాన్ని పొందాడని చెబుతున్నారు.
168
00:18:33,541 --> 00:18:34,583
ఇంకా ఇస్తార్?
169
00:18:35,583 --> 00:18:41,375
నాకు వినబడుతున్నాయి, ఉప్పును
శుద్ధికారుల, మ్యూమకిల్ దొంగల గుసగుసలు.
170
00:18:42,375 --> 00:18:48,375
ఇద్దరు చిన్న పిల్లలతో తూర్పుకు ప్రయాణించే
పాత గుడ్డలు వేసుకున్న ముసలతని గుసగుసలు.
171
00:18:48,375 --> 00:18:50,375
అతను దారితప్పాడు. బలహీనుడు.
172
00:18:50,375 --> 00:18:52,666
కానీ అతను ఎక్కువ సమయం దారి తప్పి ఉండడు.
173
00:18:52,666 --> 00:18:55,916
అతను తన శక్తులను నియంత్రించే లోపే
మనం అతనిని చేరుకోవాలి.
174
00:18:56,833 --> 00:19:00,666
బహుశా, నాకంటే నీకు ప్రాముఖ్యత ఇవ్వడానికి
నేను కార్చిన రక్తాన్ని
175
00:19:00,666 --> 00:19:05,416
మరింత ఉపయోగపడే సేవకుల కోసం కార్చాల్సింది.
176
00:19:11,375 --> 00:19:12,916
ప్రభు.
177
00:19:12,916 --> 00:19:15,750
జాడ కోసం మీరు పంపిన వారిలో ఒకరు
తిరిగి వచ్చారు.
178
00:19:19,208 --> 00:19:20,541
అతనిని కనుగొన్నావా?
179
00:19:20,541 --> 00:19:23,833
నాకు అతను కనబడడమే కాదు.
అతనిని ఎలా పట్టుకోవాలో నాకు తెలిసింది.
180
00:19:23,833 --> 00:19:29,541
మనకు ఎలా శాపవిమోచనం కలుగుతుందో తెలిసింది,
మీకోసం ఇస్తార్‌ను సంకెళ్ళు వేసి తెస్తాను.
181
00:19:30,125 --> 00:19:35,166
నా అత్యంత శక్తివంతులైన శిష్యులే
ఓడించలేకపోతే, నీలాంటి మర్త్యుడు
182
00:19:35,166 --> 00:19:37,458
ఒక ఇస్తార్‌ను ఓడించగలడని
183
00:19:37,458 --> 00:19:41,833
ఎలా అనుకున్నావు?
184
00:19:42,583 --> 00:19:47,666
ఇస్తార్ నాకు లొంగిపోతాడు,
ఎందుకంటే అతను అలా చేయకపోతే,
185
00:19:47,666 --> 00:19:51,666
అతను తన మిత్రులని చెప్పుకునే
చిన్న పిల్లలను చంపేస్తాను.
186
00:19:55,291 --> 00:19:58,041
డాడరిక్ ఎలా ఉంది?
187
00:20:00,458 --> 00:20:01,750
డాడరిక్?
188
00:20:01,750 --> 00:20:04,458
సరే, సరే. అండ్‌వైస్?
189
00:20:05,083 --> 00:20:08,791
అది మంచి పేరు.
కానీ అది నా పెరు కాదు.
190
00:20:10,166 --> 00:20:11,208
నాకు తెలుసు.
191
00:20:12,125 --> 00:20:13,000
ఫ్రెడగార్డ్.
192
00:20:15,750 --> 00:20:16,833
నీకు తెలియడం లేదా?
193
00:20:17,958 --> 00:20:20,166
నీకు ఎవరూ పేరు పెట్టలేరు.
194
00:20:21,500 --> 00:20:22,833
నీకది ఇప్పటికే ఉంది.
195
00:20:24,333 --> 00:20:25,875
నువ్వు అదే.
196
00:20:27,916 --> 00:20:33,125
నిన్ను అలా పిలుస్తున్నప్పుడు,
నీ మనసు వికసిస్తున్నట్టు అనిపిస్తుంది.
197
00:20:34,291 --> 00:20:36,000
ఏదో ఒక రోజు నువ్వది వింటావు.
198
00:20:38,333 --> 00:20:39,375
ఖచ్చితంగా.
199
00:20:40,875 --> 00:20:42,291
నువ్వు ఎవరో తెలుసుకుంటాము.
200
00:20:44,916 --> 00:20:46,000
నాకు అది తెలుసు!
201
00:20:46,000 --> 00:20:47,625
మనం ఇక్కడ ఈశాన్యానికి వెళితే,
202
00:20:47,625 --> 00:20:50,125
మన ప్రయాణ దూరం సగం తగ్గుతుంది.
203
00:20:51,083 --> 00:20:52,708
అక్కడికి. రండి!
204
00:21:08,791 --> 00:21:10,708
మొదట రోజే నీళ్ళు అయిపోయి,
205
00:21:10,708 --> 00:21:12,833
రెండవ రోజు వేడికి చనిపోయే దారిలో
206
00:21:12,833 --> 00:21:15,125
వెళ్ళకుండా ఉంటే బాగు౦టు౦ది.
207
00:21:16,583 --> 00:21:18,666
కానీ బహుశా నేను అంతేనేమో?
208
00:21:23,041 --> 00:21:24,708
డాడరిక్ ఎలా ఉంది?
209
00:21:26,166 --> 00:21:27,791
డాడరిక్ ఇంతకుముందు చెప్పావు.
210
00:21:30,208 --> 00:21:31,375
లేదు, నేను చెప్పలేదు.
211
00:21:31,375 --> 00:21:33,166
- అవును, చెప్పావు.
- అవును, చెప్పావు.
212
00:21:37,458 --> 00:21:39,375
ఈసారి వేట ఎలా కొనసాగింది?
213
00:21:40,291 --> 00:21:43,208
నాకు ఒక తేలు,
ఒక గుత్తి ముండ్లజెముడు దొరికాయి అంతే.
214
00:21:43,833 --> 00:21:47,208
తేలు నన్ను కుట్టింది,
నేను పడిపోయాను, ఇంకా, అంటే...
215
00:21:47,208 --> 00:21:50,000
- అలా ముండ్లజెముడు కనిపించింది.
- నీకది అలా కనిపించింది.
216
00:21:51,375 --> 00:21:56,000
నువ్వు కాస్త
ఇంద్రజాలంతో ఇంకొంచెం నీళ్ళు తెప్పించగలవా?
217
00:21:58,500 --> 00:22:02,041
అతనికి తన మంత్రదండాన్ని
మళ్ళీ నియంత్రించలేడేమోనని భయం.
218
00:22:02,583 --> 00:22:05,000
మనం మంత్రదండం కనిపెడదాం.
ఇక్కడ కట్టెలున్నాయి.
219
00:22:05,541 --> 00:22:07,041
అలా చేయగలమని అనుకోకు, పాపీ.
220
00:22:07,541 --> 00:22:08,750
నిశ్శబ్దం.
221
00:22:10,875 --> 00:22:11,875
అది ఏంటి?
222
00:22:14,083 --> 00:22:16,916
గాలిలో. అది వినబడుతోందా?
223
00:22:18,541 --> 00:22:20,333
- ఆ శబ్దం ఎలా ఉందంటే...
- గిట్టలు.
224
00:23:32,083 --> 00:23:34,958
వాళ్లు దగ్గరలోనే ఉన్నారు. ఎక్కండి!
225
00:23:45,541 --> 00:23:47,000
ఎవరు వాళ్ళు?
226
00:23:48,791 --> 00:23:49,916
ఏమో నాకు తెలియదు.
227
00:23:51,083 --> 00:23:52,541
మన మార్గాన్ని గమనిస్తున్నారు.
228
00:23:53,416 --> 00:23:55,583
అంటే, మనం మరో మార్గం చూసుకుంటే మంచిది.
229
00:23:59,000 --> 00:24:00,333
ఇప్పటికే చూసుకున్నాము.
230
00:24:08,375 --> 00:24:09,583
ఎవరూ దారితప్పకూడదు.
231
00:24:10,541 --> 00:24:13,041
- ఎవరూ ఒంటరిగా నడవకూడదు.
- ఎవరూ ఒంటరిగా నడవకూడదు.
232
00:24:33,250 --> 00:24:35,833
భూకంపం తరువాత ప్రతి తోట ఎండిపోయింది.
233
00:24:35,833 --> 00:24:37,666
తోటలు మాత్రమే కాదు.
234
00:24:37,666 --> 00:24:42,041
మరుగుజ్జుల రాజ్యాలన్నిటిలో
చెడు శకునాల పుకార్లు పుష్కలంగా ఉన్నాయి.
235
00:24:43,166 --> 00:24:47,125
రాకుమారుడు ఆ ఎల్ఫ్‌ను రానిచ్చినప్పుడు
ఆ పర్వతానికి శాపం తగిలింది.
236
00:24:47,125 --> 00:24:49,875
మీ ఇద్దరూ ఏదో ఊహించుకుని
అక్రమ రవాణా చేయరు, కదా?
237
00:24:49,875 --> 00:24:51,416
- లేదు.
- కలలో కూడా అనుకోము.
238
00:24:51,416 --> 00:24:54,083
మంచిది. పుకార్లు కోడై కూస్తున్నాయి.
239
00:24:54,083 --> 00:24:58,250
దూరం నుండి నిండు కుండలా ఉన్నా,
దగ్గరికి వెళితే అది ఖాళీ కుండ.
240
00:24:58,958 --> 00:25:00,291
అయితే అది నిజం కాదా?
241
00:25:00,958 --> 00:25:03,083
ఏదో దారుణమైనది జరుగుతుందని?
242
00:25:04,500 --> 00:25:07,041
అలా జరగదని మనం నిరూపిస్తాము.
243
00:25:18,833 --> 00:25:20,458
- డ్యూరిన్ రాజా.
- డ్యూరిన్ రాజా.
244
00:25:20,458 --> 00:25:21,833
డీసా.
245
00:25:23,375 --> 00:25:24,916
నార్వీ, నీ నివేదిక?
246
00:25:26,333 --> 00:25:27,333
ప్రభూ.
247
00:25:28,875 --> 00:25:31,958
కొంత కాలం క్రితం,
అగ్నిపర్వతం బద్దలయింది.
248
00:25:32,625 --> 00:25:36,833
అది మన దక్షిణానికి చాలా దూరంలో ఉన్నా కూడా,
249
00:25:36,833 --> 00:25:39,625
దాని కారణంగా భూభాగంలో వివిధ ప్రాంతాలలో
250
00:25:39,625 --> 00:25:44,208
భూభాగం లోపల ప్రకంపనలు ఏర్పడ్డాయి,
251
00:25:44,208 --> 00:25:46,208
మన సూర్య గని గొయ్యిలను కూల్చేశాయి,
252
00:25:47,125 --> 00:25:50,666
అవి మన పంటల ఎదుగుదలకు తోడ్పడేవి.
253
00:25:54,208 --> 00:25:56,958
ఇప్పుడు, స్పష్టమైన పరిష్కారం ఏమిటంటే
254
00:25:56,958 --> 00:25:59,708
తవ్వకాల బృందాలను ఏర్పాటు చేసి
ఈ గని గొయ్యిలు బాగుచేసి,
255
00:25:59,708 --> 00:26:02,250
కొత్తవి కట్టాలి. ఏదిఏమైనా...
256
00:26:02,250 --> 00:26:07,208
నువ్వు తెచ్చిన శిలా-గాయకులు తవ్వకానికి
సురక్షిత దారి గుర్తించడంలో విఫలమయ్యారు.
257
00:26:07,208 --> 00:26:09,041
అది నిజమే.
258
00:26:11,791 --> 00:26:15,291
మీ అనుమతితో, ప్రభూ,
కాంతిని కనుగొంటాము.
259
00:26:15,291 --> 00:26:16,625
అనుమతి ఇస్తున్నాను.
260
00:27:23,375 --> 00:27:25,166
తొమ్మిది శతాబ్దాలుగా,
261
00:27:27,000 --> 00:27:32,375
శిలా గాయకులు ఈ రాతితో మనకున్న
పవిత్ర బంధాన్ని కాపాడారు.
262
00:27:34,041 --> 00:27:38,791
అన్నేళ్ళలో, ఒక్కసారి కూడా,
263
00:27:38,791 --> 00:27:44,875
ఒక్కసారి కూడా వాళ్ళు ఎప్పుడూ
మనకు సమకూర్చడం నిలిపివేయలేదు.
264
00:27:48,541 --> 00:27:52,916
కానీ ఇప్పుడు, కారణం ఏదైనాగానీ,
265
00:27:55,708 --> 00:27:57,500
ఆ బంధం తెగిపోయింది.
266
00:27:57,500 --> 00:28:01,583
ఖజాద్- దుమ్‌ను
చీకటి చేతులు చుట్టుముడుతున్నాయి.
267
00:28:01,583 --> 00:28:03,541
జాగ్రత్తగా తవ్వండి, తవ్వకపు-నిపుణుడా.
268
00:28:18,875 --> 00:28:20,208
డీసా.
269
00:28:22,125 --> 00:28:23,291
ఒక్క నిమిషం?
270
00:28:32,875 --> 00:28:34,791
నన్ను నిజంగా అడగమంటావా?
271
00:28:36,208 --> 00:28:39,041
మీ మనవళ్ళు, మనవరాళ్ళ సంగతా?
వాళ్ళు బాగున్నారు.
272
00:28:39,041 --> 00:28:41,125
మీ గడ్డం లాగలేకపోయారు, కానీ...
273
00:28:41,125 --> 00:28:44,416
ఇప్పటికే కష్టంగా ఉన్నదాన్ని
ఇంకా కష్టతరం చేయకు.
274
00:28:45,458 --> 00:28:48,125
విచిత్రం. తనతో కూడా నేను ఇదే అంటుంటాను.
275
00:28:49,958 --> 00:28:53,000
ఖచ్చితంగా డ్యూరిన్‌కి
నేను కోపంతో మాట్లాడానని తెలుసు!
276
00:28:53,000 --> 00:28:56,166
నేను విన్నది క్షమాపణ అయితే, మహారాజా,
అది నా భర్తకు చెప్పండి.
277
00:28:56,166 --> 00:28:58,458
నేను ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
278
00:28:59,666 --> 00:29:01,500
తప్పు చేసింది అతను!
279
00:29:02,958 --> 00:29:04,125
ఇదే చెబుతున్నా, అతను...
280
00:29:04,125 --> 00:29:07,125
భూమిలో పాతుకుపోయిన వేరు అంత మొండితనమా?
281
00:29:08,458 --> 00:29:11,041
మీ ఇద్దరిలో ఉన్న
ఒకేలాంటి స్వభావాలలో మరొకటి.
282
00:29:12,250 --> 00:29:14,541
మీరు "మొండితనం," అని
అంటున్న దాన్ని,
283
00:29:15,625 --> 00:29:18,291
కొందరు మరుగుజ్జులు "బలం" అంటారు.
284
00:29:19,375 --> 00:29:24,875
అంత భారమైన పగ మోయడానికి
అంత బలం ఉండాలనుకుంటాను.
285
00:29:26,375 --> 00:29:30,833
అంత నిగ్రహం ఉంటేనే
మీ గాయపడిన మనసు అలిసిపోదు.
286
00:29:33,041 --> 00:29:34,291
అవును, అలిసిపోతుంది.
287
00:29:38,000 --> 00:29:39,416
నిజంగా అలసిపోతుంది.
288
00:29:45,166 --> 00:29:47,875
మనకు పర్వతం వినపడకపోవడంలో ఆశ్చర్యం లేదు.
289
00:29:47,875 --> 00:29:50,875
దాని రాజుకు తన సొంత కొడుకు విషాదమే
వినబడడం లేదు.
290
00:29:50,875 --> 00:29:52,375
దెప్పిపొడుపులు ఆపు, డీసా!
291
00:29:52,375 --> 00:29:55,291
నిజమైన బలం చూపాలనుకుంటున్నారా?
292
00:29:56,166 --> 00:29:58,041
మీ కొడుకును మీ వద్దకు పిలవండి.
293
00:30:00,208 --> 00:30:01,541
సమాధానం అతనే ఇస్తాడు.
294
00:30:03,166 --> 00:30:07,458
కానీ అది తనకు వదిలెస్తె,
అప్పుడు జిరాక్ జిగిల్ శిఖరాలు
295
00:30:07,458 --> 00:30:09,375
మీ వైరం తలవంచకముందే అవి తలవంచుతాయి.
296
00:30:16,083 --> 00:30:17,416
ఇంకా సూర్యకాంతి లేదు.
297
00:30:19,333 --> 00:30:20,625
మరో ముగింపు.
298
00:30:21,416 --> 00:30:25,875
మనం రాత్రంతా పని చేయాలి.
ఇదిగో మొదలుపెడదాం.
299
00:30:27,416 --> 00:30:31,583
పెరుగుతున్న బొబ్బలు, కనబడుతున్నాయి.
సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నాకూ వచ్చాయి.
300
00:30:32,375 --> 00:30:35,416
- నీకూ వచ్చాయా?
- అవును. నాకు ఐదేళ్ళప్పటి నుండే!
301
00:30:37,000 --> 00:30:38,541
అవును, రాజరికపు చేతులు.
302
00:30:38,541 --> 00:30:40,708
తన జీవితాంతం
మణులకు మెరుగులు దిద్దేవాడు.
303
00:30:42,500 --> 00:30:45,291
భయపడకు, రాకుమారా,
ఇంకా 13 గంటలు గడవాలి అంతే.
304
00:30:45,291 --> 00:30:48,541
అవును. అతని తప్పు వలన
మనం ఈ గందరగోళంలో పడ్డాము.
305
00:30:48,541 --> 00:30:49,750
ఇంకా అతని తండ్రి వలన.
306
00:30:54,208 --> 00:30:57,958
మరొక్కసారి నా మీద వేలుపడినా,
ఆ వేలు విరిచేస్తాను.
307
00:31:20,916 --> 00:31:22,083
గని ఎలా ఉంది?
308
00:31:26,458 --> 00:31:27,458
అలాగే ఉంది.
309
00:31:30,625 --> 00:31:32,041
పిల్లలు ఎక్కడున్నారు?
310
00:31:32,041 --> 00:31:34,333
వాళ్ళు ఆకలిగా లేరన్నారు. మళ్ళీ.
311
00:31:34,791 --> 00:31:36,041
అది వాళ్ళ తప్పు కాదు.
312
00:31:36,833 --> 00:31:39,125
ఈ రొట్టె గత ఏడాది గోధుమలతో చేసినట్టు ఉంది.
313
00:31:39,125 --> 00:31:40,791
అది గత ఏడాది రొట్టే.
314
00:31:42,416 --> 00:31:45,083
తాజాగా అప్పుడే పండిన గింజలు కొందామా?
315
00:31:45,791 --> 00:31:47,416
అద్భుతమైన ఆలోచన!
316
00:31:47,416 --> 00:31:51,125
కానీ డిమ్రిల్ డేల్‌లో దానికోసం
మీ నాన్నను ఒప్పించే వాళ్ళు ఎవరు?
317
00:31:51,125 --> 00:31:53,708
- మొదలుపెట్టకు.
- నన్ను ఆలోచించనివ్వండి...
318
00:31:53,708 --> 00:31:54,916
వద్దు అన్నాను.
319
00:31:54,916 --> 00:31:57,583
మీ శిఖరాలనుండి దిగి, క్షమాపణలు చెప్పండి!
320
00:31:57,583 --> 00:32:00,541
- ఆజీర్తి కలిగిస్తున్నావు.
- మంచిది! ఇక మీ పొట్ట మాట వినండి!
321
00:32:00,541 --> 00:32:01,875
వింటున్నాను!
322
00:32:02,583 --> 00:32:05,125
అది నేను సరైన పనే చేస్తున్నానని అంటోంది.
323
00:32:05,125 --> 00:32:08,541
అతను ఎల్రోండ్‌ను
మగ్గిపోవడానికి వదిలేయకపోయి ఉంటే,
324
00:32:08,541 --> 00:32:10,708
మనకు 500 ఏళ్ళకు సరిపడ ఆహారం ఉండేది!
325
00:32:10,708 --> 00:32:12,875
ఇది ఆహారం గురించి అనుకుంటున్నారా?
326
00:32:15,958 --> 00:32:18,791
మనము పర్వతాలను వినలేకపోతున్నాము.
327
00:32:25,000 --> 00:32:26,750
నాకు భయంగా ఉంది, డ్యూరిన్.
328
00:32:29,541 --> 00:32:30,833
నాకు భయంగా ఉంది.
329
00:32:31,750 --> 00:32:34,916
డీసా... ఇలా రా.
330
00:32:42,000 --> 00:32:43,416
మనం మరుగుజ్జులం.
331
00:32:44,541 --> 00:32:45,958
ఏదోఒక మార్గం కనిపెడతాము.
332
00:32:48,458 --> 00:32:50,083
ఎప్పుడూ కనిపెట్టాము.
333
00:32:51,375 --> 00:32:52,541
ఎలా?
334
00:33:17,166 --> 00:33:21,333
కెలెబ్రింబోర్‌కు మనం వ్రాసిన ఉత్తరాలకు
జవాబు లేదు.
335
00:33:21,333 --> 00:33:23,458
సౌరోన్ ఎరెజియోన్‌లో ఉన్నాడనుకుంటాను.
336
00:33:24,750 --> 00:33:27,750
కెలెబ్రింబోర్, అతని నగరం
సురక్షితమే అని తెలుసుకోవడానికిి
337
00:33:28,583 --> 00:33:30,791
రారాజు నన్నూ, ఒక బృందాన్ని పంపుతామన్నారు.
338
00:33:32,916 --> 00:33:34,708
నిన్ను మాతో చేరమని అడుగుతున్నాను.
339
00:33:37,708 --> 00:33:40,250
నేను రాజకీయవేత్తనని గుర్తు చేస్తావు,
గాలాడ్రియెల్,
340
00:33:42,125 --> 00:33:43,416
ఎంతైనా
నేను రాజకీయవేత్తనే.
341
00:33:43,416 --> 00:33:45,750
అలాగే, నిన్ను
రారాజు గిల్- గెలాడ్ నమ్ముతారు.
342
00:33:47,375 --> 00:33:48,833
ఆయనకు
నీ స్థిరత్వంపై నమ్మకం.
343
00:33:48,833 --> 00:33:52,416
కుక్క స్థిరంగా ఉంటుంది.
పగ్గపు తాడుతో వేగంగా అనుసరించవచ్చు.
344
00:33:59,416 --> 00:34:01,250
నువ్వు లేకుండా నన్ను పంపనన్నారు.
345
00:34:03,833 --> 00:34:05,000
అలా ఎందుకు?
346
00:34:05,750 --> 00:34:08,166
- కారణం నీకు తెలుసు.
- నీకు తెలుసా అని అడుగుతున్నా.
347
00:34:10,166 --> 00:34:15,083
నేను శత్రువును ఒంటరిగా ఎదుర్కుంటే,
మోసపోతానేమో అని
348
00:34:16,291 --> 00:34:18,041
రారాజు గిల్- గెలాడ్ అనుకుంటున్నారు.
349
00:34:18,583 --> 00:34:20,000
ఆయన ఎందుకలా అనుకుంటున్నారు?
350
00:34:20,000 --> 00:34:21,041
ఆపు, ఎల్రోండ్.
351
00:34:23,375 --> 00:34:25,291
ఇదివరకు రారాజు అదేశాలు తిరస్కరించావు.
352
00:34:25,291 --> 00:34:26,875
ఇప్పుడు ఎందుకు తిరస్కరించవు?
353
00:34:28,458 --> 00:34:29,791
ఆయన అన్నది నిజమే కనుక.
354
00:34:31,000 --> 00:34:32,375
నన్ను సౌరోన్ వాడుకున్నాడు.
355
00:34:33,000 --> 00:34:37,041
అతని చేతి కింద, నా ఇష్టంతో పని లేకుండా
అతని ఇష్టానుసారం ఆడాను.
356
00:34:38,916 --> 00:34:40,916
అది పూర్తిగా నువ్వు ఎంచుకున్నదే.
357
00:34:43,083 --> 00:34:44,875
సౌరోన్ నీ అంతరంగాన్ని చూశాడు,
358
00:34:44,875 --> 00:34:48,000
నీ మనసులో ప్రతి స్వరాన్ని పసిగట్టాడు,
359
00:34:49,208 --> 00:34:51,375
నీకు కావాల్సినట్టుగా
తనను మలుచుకున్నాడు.
360
00:34:51,375 --> 00:34:53,458
"ఓడిన రాజు" నిన్ను విజయంవైపు నడిపించాడు.
361
00:34:53,458 --> 00:34:56,250
అతనికి కావాల్సినవన్నీ ఇచ్చి,
ధన్యవాదాలు తెలిపావు.
362
00:34:56,250 --> 00:34:58,250
అతనిప్పుడు గిల్- గాలాద్‌కు అదే చేశాడు.
363
00:34:58,250 --> 00:34:59,791
లిండోన్‌లోని ప్రతి ఎల్ఫ్‌కూ.
364
00:35:00,958 --> 00:35:04,291
అందుకనే మాకు నువ్వు కావాలి.
ఈ క్లిష్టపరిస్థితిలో దారి చూపేందుకు.
365
00:35:04,291 --> 00:35:06,041
దారి చూపేందుకు ఏమీ లేదు.
366
00:35:06,041 --> 00:35:08,041
ఇది అతని వ్యూహం.
367
00:35:09,416 --> 00:35:11,958
అందులో నువ్వు ఉన్నంత వరకూ,
నువ్వు ఓడిపోయినట్లే.
368
00:35:13,333 --> 00:35:16,625
- అతను నువ్వు ఎరెజియోన్ రావాలని కోరిక...
- ఆపు, ఎల్రోండ్.
369
00:35:18,833 --> 00:35:20,791
అతనిని మళ్ళీ స్వీకరించలేను.
370
00:35:22,500 --> 00:35:23,875
నా వల్ల కాదు.
371
00:35:46,041 --> 00:35:48,500
అతను ఎప్పుడూ
వదిలి వెళ్ళలేదు, గాలాడ్రియెల్.
372
00:35:50,416 --> 00:35:52,750
ఆ ఉంగరాలను ధరించాలనుకుని,
373
00:35:53,750 --> 00:35:56,583
మీరంతా అతని
సహకారులలా ఉండటానికి ఎంచుకున్నారు.
374
00:35:58,291 --> 00:36:00,083
అందులో నేను భాగం కాను.
375
00:36:01,708 --> 00:36:03,208
నాకు ఒకసారి ప్రమాణం చేశావు,
376
00:36:04,875 --> 00:36:08,458
నెను భయపడినది
నిజ౦ అవుతో౦దని "గుసగుస౦టి పుకారైనా" వస్తే
377
00:36:09,666 --> 00:36:11,833
దాన్ని సరిజేసే వరకూ విశ్రమించనని అన్నావు.
378
00:36:14,583 --> 00:36:16,833
నీకు మన స్నేహానికి విలువ ఉంటే,
379
00:36:19,708 --> 00:36:20,708
దయచేసి వెళ్ళిపో.
380
00:36:49,166 --> 00:36:50,875
నువ్వు అందమైన జీవితం కోరుకోవా?
381
00:36:51,958 --> 00:36:54,791
కిర్డాన్ ప్రభు,
నాకు ఈ ఉంగరాలపై నమ్మకం లేదు.
382
00:36:54,791 --> 00:36:57,583
అది దుష్టశక్తిలో భాగంగా ఉంటే,
అందులో అందం ఏముంటుంది?
383
00:36:58,125 --> 00:36:59,541
అందానికి తక్కువేం కాదు.
384
00:37:01,416 --> 00:37:02,583
నాకైతే కాదు.
385
00:37:02,583 --> 00:37:05,416
రూమిల్ తాగుబోతు అని అతని పద్యాలను
386
00:37:05,416 --> 00:37:07,166
మంటల్లో వేస్తారా?
387
00:37:13,250 --> 00:37:14,625
రూమిల్ తాగుబోతా?
388
00:37:16,916 --> 00:37:19,541
డాయిరోన్ విషయం అడగకు.
389
00:37:20,500 --> 00:37:21,791
భరించలే౦.
390
00:37:23,041 --> 00:37:24,791
కానీ ఆ స్వరం,
391
00:37:24,791 --> 00:37:29,750
ఆ స్వరం సూర్యుడి కంట
అగ్ని కన్నీరు కారేలా చేయగలదు.
392
00:37:32,875 --> 00:37:34,375
ఆ పనితనాన్ని చూసి,
393
00:37:36,375 --> 00:37:38,875
అది వ్రాసిన వారిపై నిర్ణయాన్ని
394
00:37:38,875 --> 00:37:41,833
అన్నీ చూడగలిగిన న్యాయనిర్ణేతకు వదిలేయాలి.
395
00:37:41,833 --> 00:37:43,791
అది అసాధ్యం అనిపిస్తోంది.
396
00:37:45,958 --> 00:37:47,458
దానిని వినయం అంటారు.
397
00:37:47,458 --> 00:37:49,791
చాలా మందికి అది కష్టమైనది.
398
00:37:49,791 --> 00:37:52,250
కానీ దృష్టికోణానికి నిజమైన రూపం.
399
00:38:03,458 --> 00:38:07,125
నాకూ మీలాగే ప్రశాంతంగా ఉండాలని ఉంది.
400
00:38:09,541 --> 00:38:10,791
ఉండగలవు.
401
00:38:17,625 --> 00:38:20,958
మనకు ఇంకా ఈ ఉంగరాలపై పూర్తి అవగాహన లేదు.
402
00:38:20,958 --> 00:38:24,875
కానీ అవి ప్రతి జీవిపై కురిపించే
శక్తిని చూడు.
403
00:38:31,250 --> 00:38:35,833
సౌరోన్ చేతుల్లో ఉంటే, అవి అందరి మనసులపై,
సంకల్పాలపై ఆధిపత్యాన్ని చెలాయించడంలో
404
00:38:35,833 --> 00:38:38,750
లెక్కకు మించిన చెడు చేయగలవు.
405
00:38:39,291 --> 00:38:43,166
అందుకనే అవి ఎల్వ్స్ చేతుల్లో ఉండాలి.
406
00:38:45,666 --> 00:38:49,458
ఈ శక్తికి భయపడడం తెలివైన పనే, ఎల్రోండ్.
407
00:38:51,875 --> 00:38:56,875
కానీ వాటిని మంచి కోసం ఉపయోగించే మార్గాలకు
ఆ భయం అడ్డుపడకుండా చూసుకో.
408
00:38:59,666 --> 00:39:02,000
ఈ ఉంగరాలు ఉండాల్సింది
నీ శత్రువు దగ్గర కాదు...
409
00:39:04,125 --> 00:39:08,083
నువ్వు ఎక్కువగా నమ్మిన స్నేహితుల దగ్గర.
410
00:39:08,708 --> 00:39:12,708
వాళ్ళు దారితప్పారని అనిపిస్తే,
వాళ్ళను వదిలేయకు,
411
00:39:12,708 --> 00:39:17,875
నీ కళ్ళు తెరిచి,
వాళ్ళకు మార్గదర్శకం చెయ్...
412
00:39:18,541 --> 00:39:22,208
మిడిల్ - ఎర్త్ అంతటా చీకటి కమ్మేసి,
413
00:39:22,208 --> 00:39:24,625
మనందరినీ గుడ్డివాళ్ళను చేయకముందే.
414
00:39:57,500 --> 00:39:58,916
నువ్వు విశ్రాంతి తీసుకోవాలి.
415
00:40:00,833 --> 00:40:03,291
ఖచ్చితంగా తీసుకోలేను, నేను...
416
00:40:09,958 --> 00:40:11,166
మేలుకో!
417
00:40:14,833 --> 00:40:17,416
ఏమి చేస్తున్నావు? వెనుకకు రా!
418
00:40:17,416 --> 00:40:19,500
నేనది చూశాను.
ఖచ్చితంగా అది చూశాను. రా.
419
00:40:19,500 --> 00:40:21,291
పాపీ, ఇతనికి ఊపిరి ఆడడం లేదు!
420
00:40:23,666 --> 00:40:25,833
అదిగో! అవును! నోరి, నాకు అది కనబడుతోంది!
421
00:40:26,541 --> 00:40:27,958
ఏమి కనబడుతోంది?
422
00:40:27,958 --> 00:40:29,583
నీళ్ళు.
423
00:40:31,458 --> 00:40:35,375
చాలా కాలంగా తినని వాళ్ళు
424
00:40:35,375 --> 00:40:37,750
ఇంత బరువు ఎలా ఉండగలరు?
425
00:40:41,000 --> 00:40:42,458
త్వరగా!
426
00:40:45,041 --> 00:40:46,416
వద్దు, వద్దు, వద్దు.
427
00:40:47,166 --> 00:40:48,291
త్వరగా, పాపీ!
428
00:41:04,625 --> 00:41:05,708
కానీయ్!
429
00:41:15,541 --> 00:41:16,583
తోడాను.
430
00:41:26,291 --> 00:41:27,541
తాగు.
431
00:41:31,166 --> 00:41:32,333
తాగు.
432
00:41:33,916 --> 00:41:35,416
నీకు ఏమీ కాదు.
433
00:41:40,541 --> 00:41:42,083
హమ్మయ్య, బ్రతికే ఉన్నావు.
434
00:41:42,083 --> 00:41:44,916
అక్కడ ఒక్క క్షణం, నిన్ను...
కోల్పోయామని అనుకున్నాను.
435
00:41:51,000 --> 00:41:53,583
మనలో ఎవరూ ఎవరినీ కోల్పోరు.
436
00:41:57,875 --> 00:42:00,208
నేను ఏడ్చేదాన్నే, కానీ కళ్ళు పొడారిపోయాయి.
437
00:42:29,833 --> 00:42:30,875
అదేంటి?
438
00:42:32,625 --> 00:42:34,000
నీకు అనిపించడంలేదా...
439
00:42:34,000 --> 00:42:39,041
ఇది నా కలలో కనిపించిన దానికి
భిన్నంగా లేదు.
440
00:42:40,000 --> 00:42:41,166
నోరి...
441
00:43:05,791 --> 00:43:07,708
మేము మంచి నీళ్ళు తాగాము అంతే.
442
00:43:23,583 --> 00:43:24,916
ఏమి చేస్తున్నావు?
443
00:43:24,916 --> 00:43:25,875
నోరి, దిగు!
444
00:44:18,541 --> 00:44:20,500
ఆపు! ఆపు! దాన్ని ఆపు!
445
00:44:26,458 --> 00:44:28,291
అతను అది ఎందుకు ఆపడం లేదు?
446
00:44:28,916 --> 00:44:30,291
అతను ఆపలేడు!
447
00:44:39,250 --> 00:44:40,416
మాకు సాయం చేయండి!
448
00:44:42,083 --> 00:44:43,500
నోరి!
449
00:44:45,958 --> 00:44:47,708
నేను వస్తున్నాను!
450
00:44:53,125 --> 00:44:57,458
పట్టుకొని ఉండండి! పట్టుకొని ఉండండి!
451
00:45:05,000 --> 00:45:06,208
నోరి!
452
00:45:07,166 --> 00:45:08,750
నోరి!
453
00:45:20,666 --> 00:45:22,083
అది పోయింది.
454
00:45:24,833 --> 00:45:26,083
అవునా?
455
00:45:39,875 --> 00:45:41,750
దాన్ని ఇథిల్డిన్ అని పిలిచాను.
456
00:45:41,750 --> 00:45:44,375
మా మిథ్రిల్ చివరి వెండితో తయారు చేయబడింది.
457
00:45:44,375 --> 00:45:48,208
వెన్నెలలో, అది దాదాపుగా కనబడదు.
458
00:45:49,125 --> 00:45:50,125
అవును.
459
00:45:51,916 --> 00:45:53,125
అస్సలు కనబడడం లేదు.
460
00:45:59,750 --> 00:46:02,375
మన అతిథి, అతను ఇంకా...
461
00:46:03,791 --> 00:46:05,958
రాత్రి చల్లగా ఉంది, ప్రభూ.
462
00:46:06,833 --> 00:46:09,000
అతనికి శాలువా తీసుకురమ్మంటారా?
463
00:47:07,791 --> 00:47:10,875
ఇక్కడ నువ్వు ఉండడానికి కారణం ఏదైనా సరే,
464
00:47:12,875 --> 00:47:16,250
నీ అంతట నువ్వే వెళ్ళకపోతే,
నిన్ను బలవంతంగా వెళ్ళగొడతాము.
465
00:47:18,208 --> 00:47:19,833
ఇక నేను నీతో వ్యవహరించలేను.
466
00:47:23,333 --> 00:47:24,750
నీవలా అంటావని ఆమె చెప్పింది.
467
00:47:29,375 --> 00:47:32,583
గాలాడ్రియెల్? తనతో మాట్లాడావా?
468
00:47:34,083 --> 00:47:35,125
నువ్వు మాట్లడలేదా?
469
00:47:35,666 --> 00:47:36,583
నేను మాట్లాడలేదు.
470
00:47:37,750 --> 00:47:39,500
తను లిండోన్‌కు వెళ్ళినప్పటి నుండి.
471
00:47:40,416 --> 00:47:42,500
అయితే జరిగింది నీకు ఏమీ తెలియదా?
472
00:47:43,875 --> 00:47:45,166
ఉంగరాల గురించేమీ తెలియదా?
473
00:47:48,375 --> 00:47:49,750
ఉంగరాల గురించి ఏంటి?
474
00:47:51,833 --> 00:47:52,833
అవి పని చేశాయా?
475
00:47:55,208 --> 00:47:56,750
నువ్వు ఆమెను అడిగితేనే మంచిది.
476
00:47:57,250 --> 00:47:58,416
ఆమె ఇక్కడ లేదు.
477
00:47:59,541 --> 00:48:00,416
నువ్వు ఉన్నావు.
478
00:48:00,416 --> 00:48:02,041
రారాజు సంగతి ఏంటి?
479
00:48:02,041 --> 00:48:04,916
ఆయన కబురు పంపడంలో నిర్లక్ష్యం చేయరు...
480
00:48:06,958 --> 00:48:08,250
అలాగా.
481
00:48:10,166 --> 00:48:13,375
ఇది పాత కథే, కదా?
482
00:48:16,375 --> 00:48:19,666
నిజమైన సృష్టికర్తలు
చేతులకు రక్తాలు కారేదాకా కష్టపడతారు,
483
00:48:20,833 --> 00:48:24,750
ఆ తరువాత ఒకటిగా చేరి,
వారికి అత్యంత లాభదాయకమైనది తీసుకుని,
484
00:48:25,708 --> 00:48:27,458
మన సంగతి మర్చిపోతారు.
485
00:48:30,666 --> 00:48:32,416
నీ సహనాన్ని అభినందిస్తున్నాను.
486
00:48:34,541 --> 00:48:36,083
ఎక్కడికి వెళుతున్నావు?
487
00:48:36,083 --> 00:48:38,500
నా అవసరం లేని చోట
నేను ఉండడంలో అర్థం లేదు.
488
00:48:40,791 --> 00:48:41,791
ఆగు.
489
00:48:55,458 --> 00:48:57,583
హాల్ బ్రాండ్. దయచేసి. చెప్పు.
490
00:48:58,916 --> 00:49:02,833
ఉంగరాలు. అవి పని చేశాయా?
491
00:49:11,708 --> 00:49:13,291
అవి అద్భుతంగా చేశాయి.
492
00:49:17,041 --> 00:49:18,625
ఆ తరువాత, ఎల్వ్స్...
493
00:49:18,625 --> 00:49:19,708
అవును.
494
00:49:24,708 --> 00:49:26,916
మరి లిండోన్?
495
00:49:26,916 --> 00:49:28,000
అవును.
496
00:49:35,041 --> 00:49:36,958
- ఏడుస్తున్నావా?
- లేదు.
497
00:49:42,583 --> 00:49:44,208
సంతోషిస్తున్నాను.
498
00:49:46,125 --> 00:49:49,083
నీకు ఏ మాత్రమూ తెలియదు...
499
00:49:51,791 --> 00:49:53,291
ఇది ఎలా అనిపిస్తుందో.
500
00:49:53,291 --> 00:49:55,708
ఇంత కాలం తరువాత,
ఎన్నో శతాబ్దాల తరువాత,
501
00:49:55,708 --> 00:49:58,375
చివరకు ఒకటి సృష్టించడం.
502
00:50:01,166 --> 00:50:02,875
మొదటి యుగం సీసా తెరుస్తున్నాను.
503
00:50:05,166 --> 00:50:08,291
ఇది దాచి ఉంచాను.
504
00:50:13,875 --> 00:50:15,125
కెలెబ్రింబోర్...
505
00:50:21,625 --> 00:50:22,958
నువ్వు నా స్నేహితుడివా?
506
00:50:24,916 --> 00:50:26,250
అవును, ఖచ్చితంగా.
507
00:50:27,791 --> 00:50:28,833
ఎందుకు?
508
00:50:28,833 --> 00:50:30,791
ఎందుకంటే సన్నిహితంగా పని చేసిన
509
00:50:30,791 --> 00:50:33,791
నీకూ నాకూ మధ్య అర్ధ సత్యాలకు స్థానం లేదు.
510
00:50:37,208 --> 00:50:40,958
అయినా నీకు తెలియనిది చాలా ఉంది.
511
00:50:42,500 --> 00:50:43,666
నీకు చాలా చెప్పాలి.
512
00:50:45,458 --> 00:50:46,458
కాకపోతే...
513
00:50:49,291 --> 00:50:50,750
నీకు భయంగా ఉంది.
514
00:50:52,458 --> 00:50:55,333
చూశావా? నీ నుండి నేను
ఎప్పుడూ ఏదీ దాచలేను.
515
00:50:56,958 --> 00:50:58,125
సరే...
516
00:51:02,750 --> 00:51:04,083
శాంతించు.
517
00:51:07,333 --> 00:51:10,583
నువ్వు నాకు చెప్పాలని అనుకున్నది ఏదైనా,
పెద్ద మనసుతో వింటాను.
518
00:51:13,166 --> 00:51:15,375
నేను ఎల్వెన్ ఉంగరాలను
అభినందించడానికి రాలేదు.
519
00:51:17,291 --> 00:51:21,041
కానీ నిన్ను మానవుల కోసం
ఉంగరాలు తయారు చేయమని అడుగుదామని వచ్చాను.
520
00:51:22,500 --> 00:51:23,833
మానవుల కోసం ఉంగరాలా?
521
00:51:24,791 --> 00:51:26,208
ఎల్వ్స్‌ను కాపాడావు.
522
00:51:28,166 --> 00:51:29,291
ఎల్వ్స్ మానవులు కాదు.
523
00:51:30,916 --> 00:51:31,875
మానవులు
అత్యాశపరులు.
524
00:51:34,208 --> 00:51:36,958
అవినీతి జరిగే ప్రమాదం చాలా ఎక్కువ.
525
00:51:37,625 --> 00:51:39,291
నేను మరిన్ని ఉంగరాలు
తయారు చేసినా,
526
00:51:39,291 --> 00:51:41,208
మరుగుజ్జులు మిథ్రిల్‌ను సమకూర్చలేరు.
527
00:51:41,208 --> 00:51:43,916
మరుగుజ్జులు వారి సొ౦త సందిగ్ధతలో
పడివున్నారు.
528
00:51:43,916 --> 00:51:46,125
ఎలాంటి సందిగ్ధత?
ఏమంటున్నావు, హాల్ బ్రాండ్?
529
00:51:48,625 --> 00:51:50,625
నా పేరు హాల్ బ్రాండ్ కాదు.
530
00:51:52,375 --> 00:51:53,291
ఏంటి?
531
00:51:53,291 --> 00:51:56,000
గాలాడ్రియెల్‌కు నిజం తెలియగానే
ఆమె నన్ను గెంటేసింది.
532
00:51:57,250 --> 00:51:59,416
నీతోనూ అలా జరిగే ముప్పు తెచ్చుకోలేను.
533
00:52:03,250 --> 00:52:06,166
నేను... అయితే నేను నువ్వు
రాజువు కాదని అనుకుంటాను.
534
00:52:06,958 --> 00:52:09,500
లేదు. రాజును కాదు.
535
00:52:10,708 --> 00:52:12,500
దక్షిణ భూముల మనిషిని కాదు.
536
00:52:13,166 --> 00:52:16,041
నేను అసలు... మనిషినే కాదు.
537
00:52:20,000 --> 00:52:21,000
నువ్వు ఎవరు?
538
00:52:22,458 --> 00:52:28,083
ప్రపంచంలో దుష్టశక్తికి మించిన
శక్తులు ఉన్నాయి, కెలెబ్రింబోర్.
539
00:52:28,708 --> 00:52:32,375
కొన్నిసార్లు, అవి రాయబారి రూపంలో,
540
00:52:33,500 --> 00:52:34,791
సహాయాన్ని పంపుతాయి.
541
00:52:34,791 --> 00:52:40,541
ఒక... ఒక దూత, తెలివైన వారికి
మార్గదర్శకం చేయడానికి పంపబడతాడు.
542
00:52:44,500 --> 00:52:46,708
ఎలాంటి మార్గదర్శకం?
543
00:52:48,083 --> 00:52:50,333
మోర్డోర్ ఎదుగుదల ప్రారంభం మాత్రమే.
544
00:52:50,333 --> 00:52:53,750
ఈ సమయంలో, మిడిల్ - ఎర్త్ అంతా
ప్రమాదం అంచున ఊగిసలాడుతుంది.
545
00:52:54,458 --> 00:52:56,791
త్వరలో, ప్రతి రాజ్యం పతనం అవుతుంది.
546
00:52:58,208 --> 00:53:02,500
ఎల్వ్స్ మాత్రమే కాదు,
మరుగుజ్జులు కూడా. ఇంకా మానవులు కూడా.
547
00:53:04,541 --> 00:53:06,291
చీకటి బలోపేతం అవుతోంది.
548
00:53:07,333 --> 00:53:10,583
మనకు ఈ శక్తివంతమైన ఉంగరాలే
కాంతి పునరుద్ధరణకు చివరి ఆశ.
549
00:53:13,791 --> 00:53:15,250
నువ్వు, నేనూ
చేయాల్సిన పనుంది.
550
00:53:21,625 --> 00:53:24,375
నేను నమ్ముతానని అనుకోకు
551
00:53:24,375 --> 00:53:28,500
నువ్వు వాలార్ నుండి పంపబడిన దూతవని...
552
00:53:38,708 --> 00:53:39,916
హాల్ బ్రాండ్?
553
00:53:42,250 --> 00:53:43,250
హాల్ బ్రాండ్!
554
00:54:01,750 --> 00:54:02,916
హాల్ బ్రాండ్!
555
00:54:31,208 --> 00:54:34,583
నేను సుదూర భూముల ఎడారి దుమ్ములో నడిచాను,
556
00:54:37,250 --> 00:54:43,041
మిడిల్ - ఎర్త్ అంతటినీ రక్షించగల
కళను పొందిన కళాకారుడి కోసం.
557
00:54:45,541 --> 00:54:47,958
ఒక తుఫాను రానున్నది, కెలెబ్రింబోర్.
558
00:54:50,250 --> 00:54:53,375
ఎవరికీ లేని జ్ఞానాన్ని నీకు అందించగలను.
559
00:54:53,958 --> 00:54:57,166
నీలోని అతిగొప్ప సామర్థ్యాలను
వెలికి తీయగలను.
560
00:54:57,958 --> 00:55:00,125
మన పని పూర్తవ్వగానే,
561
00:55:00,125 --> 00:55:05,458
ప్రపంచం నిన్ను ఇక ఎప్పటికీ
మామూలు ఫియనోర్ వారసుడిగా అలక్ష్యపెట్టదు,
562
00:55:06,041 --> 00:55:08,333
కానీ ఎప్పటికంటే ఎక్కువగా గౌరవిస్తుంది...
563
00:55:14,291 --> 00:55:16,708
ఉంగరాలకు ప్రభువుగా.
564
00:55:41,958 --> 00:55:43,666
నువ్వు నాకు తల వంచనవసరం లేదు.
565
00:55:44,416 --> 00:55:46,500
కానీ నేను నీ సహజ రూపాన్ని చూశాను.
566
00:55:49,833 --> 00:55:51,000
నిలబడు.
567
00:55:53,708 --> 00:55:55,416
ఇప్పుడే మన పని ప్రారంభవుతోంది.
568
00:55:56,666 --> 00:55:58,500
నేను నిన్ను ఏమని పిలవాలి?
569
00:55:58,500 --> 00:55:59,666
నేను నీ భాగస్వామిని.
570
00:56:02,125 --> 00:56:04,958
ఎక్కువా కాదు, తక్కువా కాదు.
571
00:56:07,000 --> 00:56:08,875
కానుకలలో భాగస్తుడిని.
572
00:56:11,375 --> 00:56:12,916
అన్నాటార్.
573
00:56:14,708 --> 00:56:16,166
అన్నాటార్.
574
00:56:19,958 --> 00:56:21,666
కానుకల ప్రభువు.
575
00:56:38,500 --> 00:56:39,583
మీరు నన్ను పిలిచారు.
576
00:56:40,416 --> 00:56:42,125
నీకు కొత్త ఆదేశాలు ఉన్నాయి, దళపతి.
577
00:56:42,916 --> 00:56:47,541
తొలి జామునే మన ధైర్యవంతులైన ఎల్వ్స్
ఐదుగురిని తీసుకొని ఎరెజియోన్ కు వెళ్ళు.
578
00:56:48,708 --> 00:56:49,708
నేను...
579
00:56:51,708 --> 00:56:54,541
పునః పరిశీలించినందుకు ధన్యవాదాలు.
580
00:56:54,541 --> 00:56:56,708
నువ్వు ధన్యవాదాలు తెలుపాల్సింది
నాకు కాదు.
581
00:56:59,833 --> 00:57:00,916
ఎల్రోండ్.
582
00:57:05,250 --> 00:57:08,458
నువ్వు నా దళంలో చేరాలని అనుకున్నందుకు
చాలా కృతజ్ఞతలు.
583
00:57:11,208 --> 00:57:13,708
నువ్వు పొరబడ్డావు, గాలాడ్రియెల్.
584
00:57:14,875 --> 00:57:17,791
ఎల్రోండ్ నీ దళంలో చేరడం లేదు.
585
00:57:18,541 --> 00:57:20,208
దానికి నాయకత్వం వహిస్తున్నాడు.
586
00:57:58,458 --> 00:58:00,958
ఇదేంటి? అది ఎల్రోండ్ నుండా?
587
00:58:01,916 --> 00:58:04,708
ఇది ఏదో అహ్వానం...
588
00:58:06,250 --> 00:58:08,916
కెలెబ్రింబోర్ ప్రభువు నుండి.
589
00:58:08,916 --> 00:58:12,041
ఆయన మరుగుజ్జులను ఎరెజియోన్ రమ్మంటున్నారు.
590
01:00:10,208 --> 01:00:12,208
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
591
01:00:12,208 --> 01:00:14,291
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని