1 00:01:50,777 --> 00:01:52,654 ది మార్నింగ్ షో 2 00:02:30,442 --> 00:02:32,778 అయిదు, నాలుగు, మూడు... 3 00:03:13,527 --> 00:03:15,070 హేయ్, హేయ్! కోరీ ఎల్లిసన్. 4 00:03:15,153 --> 00:03:17,865 మ్యాగీ బ్రెనర్ పుస్తకం విషయంలో మీ అభిప్రాయమేంటో చెప్పగలరా? 5 00:03:17,948 --> 00:03:20,450 మిట్చ్ కెస్లర్ ప్రవర్తన సరిగ్గా లేని కారణంగా, 6 00:03:20,534 --> 00:03:22,327 ఏడాది క్రితం ఆయన్ని తీసేశాం. 7 00:03:22,411 --> 00:03:25,205 ఒక్క ఏడాదిలోనే చాలా మార్పులు జరిగాయి. ఇది ఇప్పుడు కొత్త "టిఎంఎస్". 8 00:03:25,289 --> 00:03:28,292 సరే. హేయ్, మిట్చ్ కెస్లర్ కి నల్లజాతి మహిళలంటే మోజు అని మీకు అనిపిస్తోందా? 9 00:03:29,042 --> 00:03:30,043 అది నాకు ఖచ్చితంగా తెలీదు. 10 00:03:30,127 --> 00:03:32,004 సరే. అయితే, బ్రాడ్లీ సంగతేంటి? 11 00:03:32,087 --> 00:03:34,214 బ్రాడ్లీ జాక్సన్ అమ్మాయిల పట్ల ఆకర్షితురాలవుతుంది అనుకుంటున్నారా? 12 00:03:34,298 --> 00:03:35,299 -శుభోదయం. -శుభోదయం, సర్. 13 00:03:35,382 --> 00:03:36,842 లారా పీటర్సన్ యుబిఎ 365 - ఎరిక్ నొమానీతో సాయంత్రపు వార్తలు 14 00:03:39,136 --> 00:03:41,346 -శుభోదయం. -శుభోదయం. త్వరగా వచ్చేశావే. 15 00:03:41,930 --> 00:03:45,809 యుబిఎ+ ప్రపంచవ్యాప్తంగా ఉంది, స్టెల్లా. త్వరగా, ఆలస్యంగా అనే పదాలకు అర్థమే లేదు. 16 00:03:45,893 --> 00:03:48,979 లైసెన్స్ విషయంలో, నాకు షాంగాయ్ స్టూడియోస్ తో ఒక కాల్ ఉంది. 17 00:03:49,062 --> 00:03:50,063 వావ్. 18 00:03:50,147 --> 00:03:53,275 ఈ సమయంలో, అందులోనూ మనకు మంచిది కాని ప్రెస్ కవరేజీ సమయంలో బాగా జోష్ గా ఉన్నావే. 19 00:03:53,358 --> 00:03:55,611 స్టెల్లా, నువ్వు నిన్న నాతో అన్న మాట నన్ను బాగా ఇబ్బంది పెట్టింది, 20 00:03:55,694 --> 00:03:56,695 దాని గురించి నీతో మాట్లాడాలి. 21 00:03:56,778 --> 00:03:57,905 అంతలా ఏమన్నాను నేను? 22 00:03:57,988 --> 00:04:00,324 నేను బాగానే ఉన్నానా అని అడిగావు. 23 00:04:02,117 --> 00:04:04,328 నాకు బాగుందా బాగాలేదా అన్నదానితో పని లేదు. 24 00:04:05,078 --> 00:04:07,581 ఇది 200 మీటర్ల రేసు లాంటిది. 25 00:04:07,664 --> 00:04:11,210 ఇతరుల ఫీలింగ్స్ ని పట్టించుకుంటే, అది మనకి అదనపు గుదిబండలా తయారవుతుంది. 26 00:04:11,293 --> 00:04:14,546 బయట జనాలను పట్టించుకో, హుండీలో వేసుకో, ప్రేమలో పడు. ఇవన్నీ నీ ఖాళీ సమయంలో చూసుకో. 27 00:04:14,630 --> 00:04:17,132 ఇక్కడ ఇతరుల గురించి ఫీలింగ్స్ అనేవి మనలో జీవాన్ని పీల్చిపారేస్తాయి. 28 00:04:17,216 --> 00:04:19,259 అవి నీ కనులను కళావిహీనం చేస్తాయి. 29 00:04:19,343 --> 00:04:23,722 నేనెలా ఉన్నా అది నీ సమస్య కాదు. ఇతరుల గురించి పట్టించుకుంటే, 30 00:04:23,805 --> 00:04:26,934 మనకు పనికి వచ్చే నిర్ణయాలను మనం సరిగ్గా తీసుకోలేము. 31 00:04:27,017 --> 00:04:29,811 మనకి ఏది మంచిదైతే, సంస్థకి కూడా అదే మంచిది. 32 00:04:29,895 --> 00:04:31,355 -అవును. -ఎందుకంటే, నువ్వు సంస్థ మనిషివి. 33 00:04:31,438 --> 00:04:34,066 నేను కూడా సంస్థ మనిషినే. అది మనది. మనమందరం ఒకటే. 34 00:04:34,733 --> 00:04:36,944 -జీవన చక్రం. -చక్రం విరగకుండా చూసుకుందాం. 35 00:04:38,487 --> 00:04:39,488 అంతే. 36 00:04:40,489 --> 00:04:43,700 సరిగ్గా చెప్పావు. అంతే. అంతే! 37 00:04:43,784 --> 00:04:46,245 నా కాల్ అయ్యాక, జెరాల్డ్, లిండాలతో ఒకసారి నా ఆఫీసుకు రా. 38 00:04:46,328 --> 00:04:49,498 ఈ టిఎంఎస్ బహిర్గతాలను మనకు అనుకూలంగా ఎలా చేసుకోవాలో ప్లాన్ చేద్దాం. 39 00:04:49,581 --> 00:04:50,791 -అలాగే. -మంచిది. 40 00:04:55,337 --> 00:04:56,380 సూపర్! 41 00:04:57,840 --> 00:04:59,049 -చిప్. -కోరీ. 42 00:04:59,967 --> 00:05:02,636 లారా అని సలహా ఇచ్చి మంచి పని చేశావు. నిన్న రేటింగ్స్ చాలా బాగా వచ్చాయి. 43 00:05:02,719 --> 00:05:04,555 అవును, "వాల్ట్" కథనం బయటకు రాగానే రేటింగ్స్ దూసుకెళ్లాయి. 44 00:05:04,638 --> 00:05:06,348 -అవును. ఏం టైమింగ్ రా బాబూ. -అవును. 45 00:05:06,431 --> 00:05:08,767 ఆలెక్స్ ని బాగా విశ్రాంతి తీసుకోమని చెప్పు. 46 00:05:08,851 --> 00:05:09,977 -అలాగే, తప్పకుండా. -సరే. 47 00:05:10,060 --> 00:05:12,020 ఇప్పుడే తనతో మాట్లాడబోతున్నాను. 48 00:05:30,622 --> 00:05:34,001 మీ కాల్ఒ క ఆటోమేటిక్ వాయిస్ మెసేజింగ్ సిస్టమ్ కి ఫార్వర్డ్ చేయబడింది. 49 00:05:34,084 --> 00:05:35,127 ఆలెక్స్ లెవీ... 50 00:05:35,210 --> 00:05:38,380 ...అందుబాటులో లేదు. టోన్ తర్వాత మెసేజ్ ఏంటో చెప్పండి. 51 00:05:50,767 --> 00:05:52,603 అసలు నువ్వు ఏం చేస్తున్నావు? 52 00:05:52,686 --> 00:05:56,356 పనికిమాలినదానా! 53 00:05:56,440 --> 00:05:59,902 నువ్వేదో నన్ను పట్టించుకుంటున్నావని, అందుకే నన్ను అడిగావని అనుకున్నా. 54 00:05:59,985 --> 00:06:02,404 నీ అపరాధభావాన్ని తగ్గించుకోవడానికే అని నాకు తెలీలేదు. 55 00:06:02,487 --> 00:06:04,489 అంటే, వాళ్ళు నిన్ను కావాలనుకున్నారు, ఎందుకో నేను ఊహించుకోగలనులే, 56 00:06:04,573 --> 00:06:06,825 నువ్వు బయటకు వెళ్లిపోయినప్పుడు నీ పట్ల చాలా మానవత్వం లేకుండా 57 00:06:06,909 --> 00:06:10,787 బాగా అమానుషంగా ప్రవర్తించారనే 58 00:06:10,871 --> 00:06:14,458 తప్పుడు ఆలోచనతో ఉన్నారు కాబట్టి. 59 00:06:14,541 --> 00:06:16,251 అదీగాక, కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడుంటారు. 60 00:06:16,335 --> 00:06:18,462 కానీ నువ్వు పొరబడ్డావు. నువ్వు మహా దద్దమ్మవి. 61 00:06:18,545 --> 00:06:22,049 నిన్ను తీసేయబోతున్నారు, నువ్వేమో ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చావు. 62 00:06:22,132 --> 00:06:27,471 ఎందుకంటే, నీకు సాటి మనిషిని ప్రేమించడమే రాదు. 63 00:06:27,554 --> 00:06:33,227 అయితే, నువ్వు ఇప్పుడు మానవత్వమనేది వేగంగా అడుగంటుతున్న 64 00:06:33,310 --> 00:06:34,978 వ్యక్తిత్వం లేని జనుల పక్షాన చేరావు, 65 00:06:35,062 --> 00:06:38,607 వాళ్ళకి నీ నిజ స్వరూపం తెలీదు కాబట్టే వాళ్లు నిన్ను ప్రేమిస్తున్నారు. 66 00:06:39,274 --> 00:06:42,778 కానీ నిజానికి నువ్వు భావావేశాలతో ఆడుకొనే రకమైన దానివి. 67 00:06:42,861 --> 00:06:46,031 నన్ను ఎన్ని విధాలుగా మోసం చేయవచ్చో 68 00:06:46,114 --> 00:06:48,951 అన్ని విధాలుగా మోసం చేశావు. 69 00:06:49,034 --> 00:06:52,746 నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నన్ను మోసం చేశావనే విషయాన్ని 70 00:06:52,829 --> 00:06:55,290 అంత తేలిగ్గా బ్రాడ్లీ జాక్సన్ నిన్ను మరిచిపోనివ్వదు అనే 71 00:06:55,374 --> 00:06:58,252 నువ్వు మళ్లీ రమ్మని నా ఇంటి గుమ్మం వద్దకి వచ్చి అడుక్కున్నావు. 72 00:06:58,335 --> 00:07:00,754 కానీ ఓ విషయం తెలుసా? అప్పడు ఉన్నట్టే నేను ఇప్పుడు ఉండలేను, అంతే కదా? 73 00:07:00,838 --> 00:07:02,214 అవును! ఎందుకో తెలుసా? 74 00:07:03,006 --> 00:07:07,344 నా ఆత్మాభిమానాన్ని ఇంకా దెబ్బతీయడానికి పీల్చి పిప్పి చేయడానికి, 75 00:07:07,427 --> 00:07:10,514 నాలో అది మిగిలి ఉంటే కదా! 76 00:07:11,056 --> 00:07:13,600 అయినా కానీ, నేను ఇక్కడే ఉన్నా, ఆలెక్స్. 77 00:07:15,185 --> 00:07:17,354 కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? 78 00:07:18,856 --> 00:07:19,857 ...మా ఉదయం వేళలో. 79 00:07:19,940 --> 00:07:21,900 తను రాకపోవచ్చు అంటావా? 80 00:07:21,984 --> 00:07:24,278 వస్తుందనే ఆశిద్దాం. మనం తన మీద చాలా ప్రచారం చేస్తున్నాం. 81 00:07:24,361 --> 00:07:25,946 కానీ రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 82 00:07:26,029 --> 00:07:27,990 నువ్వు "అది"లో "ద"కి గుడి ఇవ్వలేదు. 83 00:07:28,073 --> 00:07:30,325 అదేముందిలే. ఆమెకి చూపే ముందు ఒకసారి నువ్వు చెక్ చేస్తావని ఇచ్చా. 84 00:07:30,993 --> 00:07:32,494 మ్యాగీ ప్రస్తావించిన నల్లజాతీయురాలైన ప్రొడ్యూసర్ ఎవరో 85 00:07:32,578 --> 00:07:36,164 కనిపెట్టడానికి పెద్ద తెలివి అవసరం లేదు. 86 00:07:40,377 --> 00:07:43,338 హేయ్, మియా. దీన్ని ఓసారి చూస్తావా? 87 00:07:43,422 --> 00:07:45,465 మ్యాగీ పుస్తకంపై మనం చేసే కథనానికి సంబంధించిన కాపీ ఇది. 88 00:07:48,886 --> 00:07:50,512 మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం కదా? 89 00:07:50,596 --> 00:07:51,638 అవును. 90 00:07:53,223 --> 00:07:54,224 అయితే పర్వాలేదులే. 91 00:07:55,309 --> 00:07:56,435 నీ మీద నాకు నమ్మకం ఉంది. 92 00:08:00,522 --> 00:08:02,900 ధన్యవాదాలు, కియానా. ఇవాళ "మార్నింగ్ షో"లో 93 00:08:02,983 --> 00:08:05,402 మనతో పాటు డాక్టర్ హెన్రీ లూయిస్ గేట్స్ జూనియర్ ఉన్నారు, 94 00:08:05,485 --> 00:08:08,655 ఇంకా తత్కాల మేకోవర్లు, ఇంకా ప్రభావవంతమైన ఎనిమిది నిమిషాల వ్యాయామాలు. 95 00:08:08,739 --> 00:08:12,034 అమె రాత్రివేళల్లో బాగా చెప్తుంది, కానీ మేము ఆమెని ఉదయం వేళల్లో మిస్ అవుతున్నాం. 96 00:08:12,117 --> 00:08:14,036 లారా పీటర్సన్ కూడా పాల్గొనబోతున్నారు. 97 00:08:14,119 --> 00:08:18,373 కాబట్టి ఓర్లాండోలో మేటి వార్తల ఛానెల్ అయిన యుబిఎ 6, డబ్ల్యూ.జీ.జెడ్.క్యూని 98 00:08:18,457 --> 00:08:20,209 ఉదయం వార్తలయ్యాక చూస్తూనే ఉండండి. 99 00:08:20,292 --> 00:08:23,003 సరిగ్గా చెప్పారు. మా వైపు నుండి అంతే, జో మరియు కియానా. 100 00:08:23,086 --> 00:08:25,464 అయిపోయింది. ముప్పై నిమిషాల్లో షో మొదలవుతుంది. 101 00:08:26,798 --> 00:08:29,009 గోర్డన్. గోర్డన్! 102 00:08:30,636 --> 00:08:33,639 తను వచ్చిందా? షో మొదలవ్వకముందు తనతో మాట్లాడాలనుకుంటున్నాను. 103 00:08:33,722 --> 00:08:36,558 త్వరలోనే వచ్చేస్తుంది, కానీ నిన్ను కలవమని లారాకి చెప్తాలే. 104 00:08:36,642 --> 00:08:37,976 సరే, ధన్యవాదాలు! 105 00:08:41,897 --> 00:08:44,525 ఆర్.జే, నీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? 106 00:08:44,608 --> 00:08:49,196 నా తమ్ముడికి ఇక్కడి నుండి చార్లస్టన్ లోని యేగర్ విమానాశ్రయానికి టికెట్ బుక్ చేయగలవా, 107 00:08:49,279 --> 00:08:51,240 అలాగే నా హోటల్ గది నుండి అతడిని పికప్ చేసుకోవడానికి ఓ కారును కూడా బుక్ చేయ్. 108 00:08:51,323 --> 00:08:52,783 అతను ఊరికి వచ్చాడని నాకు తెలీదు. 109 00:08:53,325 --> 00:08:56,161 -అవును. అవును. -మనమేమైనా... 110 00:08:56,245 --> 00:08:58,789 లేదు. షో మొదలయ్యే లోపు నాకు వేరే పని ఉంది. అది నువ్వు చూసుకోగలవా? 111 00:08:58,872 --> 00:08:59,873 -చూసుకోగలను. -ధన్యవాదాలు. 112 00:08:59,957 --> 00:09:00,958 బ్రాడ్లీ జాక్సన్ 113 00:09:09,383 --> 00:09:11,009 -హలో? -ఇప్పుడే లిప్ట్ బయటకు వచ్చాను. 114 00:09:11,093 --> 00:09:12,803 నీ డ్రెస్సింగ్ రూముకు రానా? 115 00:09:12,886 --> 00:09:14,972 వద్దు, నిన్న నువ్వన్నది నిజమే. కథనాలకు ఊతమివ్వకపోవడమే మంచిది. 116 00:09:15,055 --> 00:09:16,515 -బ్రాడ్లీ? -సరే. 117 00:09:16,598 --> 00:09:18,225 షో మొదలయ్యేలోపు నిన్ను ఓసారి కలుద్దామని అనుకుంటున్నా. 118 00:09:19,935 --> 00:09:21,395 సరే. 119 00:09:21,478 --> 00:09:23,313 నేను నా డ్రెస్సింగ్ రూములోకి వచ్చేశాను. ఏంటి సంగతి? 120 00:09:23,397 --> 00:09:27,985 అన్నింటికన్నా ముందు, నిన్ను మళ్లీ క్షమించమని అడుగుతున్నా. 121 00:09:28,610 --> 00:09:29,736 మంచిది. 122 00:09:29,820 --> 00:09:33,824 ఇంకా నిన్న రాత్రి నేను మా తమ్ముడిని వెళ్లిపొమ్మని చెప్పాను. 123 00:09:33,907 --> 00:09:36,702 వాడిని ఇంటికి పంపించేశాను. నేను అందరినీ హద్దులలో ఉంచుతున్నాను. 124 00:09:36,785 --> 00:09:38,704 బ్రాడ్లీ, ఆ పని చేయమని నేను చెప్పలేదే. 125 00:09:38,787 --> 00:09:42,040 నిన్న రాత్రి మనం మాట్లాడుకొన్నది తేలిగ్గా పరిష్కారమయ్యే విషయం కాదు. 126 00:09:42,124 --> 00:09:43,125 ఏంటి? దేనికి? 127 00:09:43,208 --> 00:09:47,421 షో మొదలయ్యేముందు ఇదంతా నేను ఆలోచిస్తూ ఉండలేను. 128 00:09:47,504 --> 00:09:49,256 నేను ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. 129 00:09:49,339 --> 00:09:51,884 నేను ఏదో చేయకూడనిది చేశానని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. 130 00:09:51,967 --> 00:09:52,968 బ్రాడ్లీ. 131 00:09:53,051 --> 00:09:54,803 నేను కాస్త మేకప్ వేసుకోవాలి. 132 00:09:54,887 --> 00:09:56,805 జరుగుతున్న విషయాల నడుమ నేను ఆనందంగా ఉన్నట్టు చూపడానికి 133 00:09:56,889 --> 00:09:58,891 నాకు ఎంత మేకప్ వేసినా చాలదు. 134 00:09:59,850 --> 00:10:00,851 సరే. 135 00:10:02,519 --> 00:10:03,520 ఏదైతే ఏంటిలే. 136 00:10:12,321 --> 00:10:14,907 సరే, ఏడు సెకన్లలో మొదలవుతుంది! అందరూ మంచిగా చేయాలి. 137 00:10:14,990 --> 00:10:17,284 అయిదు, నాలుగు, మూడు... 138 00:10:20,996 --> 00:10:22,414 -షో విషయంలో ఆల్ ద బెస్ట్. -ఆల్ ద బెస్ట్. 139 00:10:25,792 --> 00:10:29,880 అమెరికాలో పలు రాష్ట్రాలలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 140 00:10:29,963 --> 00:10:32,633 ఇప్పుడు 60కి చేరుకుంది. 141 00:10:33,967 --> 00:10:37,971 ఈ మహమ్మారి విజృంభించనుందని, ప్రజలు తమ దైనందిక జీవితాలలో 142 00:10:38,055 --> 00:10:40,766 అంతరాయాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీడీసీ హెచ్చరించింది. 143 00:10:40,849 --> 00:10:42,392 -ధన్యవాదాలు. హేయ్. -హేయ్. 144 00:10:42,476 --> 00:10:44,144 వ్యాపార సంస్థలన్నింటికీ హెచ్చరికలు... 145 00:10:44,228 --> 00:10:45,229 ధన్యవాదాలు. 146 00:10:45,896 --> 00:10:47,814 నీకు ఇచ్చిన తాళాలను మళ్లీ తీసేసుకున్నందుకు మన్నించు. రా. వచ్చి కూర్చో. 147 00:10:49,024 --> 00:10:51,235 ఈ విషయంలో నువ్వు ఏవేవో ఊహించుకోకు. అదేమీ... 148 00:10:51,318 --> 00:10:54,154 నువ్వేదంటే అదే. నువ్వు నాకు ఇప్పుడు ఋణపడి ఉన్నావు. 149 00:10:55,447 --> 00:10:57,157 మరి, తన గురించి ఏమైనా తెలిసిందా? 150 00:10:57,241 --> 00:10:59,743 తను పత్తా లేకుండా పోయింది. 151 00:10:59,826 --> 00:11:01,036 ఇటలీ, దక్షిణకొరియాలలో కరోనా వైరస్ 152 00:11:01,119 --> 00:11:05,207 తను కొంత కాలం ఒంటరిగా ఉండాలనుకుందేమో. 153 00:11:05,290 --> 00:11:08,919 అలాంటప్పుడు తను టీవీ షోలు చేసే పనికి ఒప్పుకొని ఉండకూడదేమో. 154 00:11:09,002 --> 00:11:13,465 గోప్యంగా ఉండాలనుకొనేవారికి ఈ వృత్తి తగినది కాదు కదా. 155 00:11:13,549 --> 00:11:14,883 ఏదో ఒకచోట ప్రత్యక్షమవుతుందిలే. 156 00:11:14,967 --> 00:11:17,845 -...ఇటలీ, దక్షిణకొరియాల్లో అధికం. -అవును, శ్మశానంలో ప్రత్యక్షమవుతుందిలే. 157 00:11:17,928 --> 00:11:20,681 ఆలాంటి జోకులు వేయకు. అది సరదా విషయం కాదు. 158 00:11:21,640 --> 00:11:25,227 ఎందుకు? నేను అన్నానని అలా జరిగిపోదు కదా, ఒకవేళ జరిగినా... 159 00:11:25,769 --> 00:11:27,312 ఏదైనా కానీ, తన జీవితం బాగానే గడిచింది. 160 00:11:31,400 --> 00:11:33,068 నేను ఎల్మైరా చిప్ ని మిస్ అవుతున్నా. 161 00:11:33,986 --> 00:11:36,989 ఎల్మైరా చిప్ చనిపోయాడు. ఆలెక్స్ తో పాటు శ్మశానంలో ఉన్నాడు. 162 00:11:39,116 --> 00:11:40,200 తను వస్తుందిలే. 163 00:11:40,284 --> 00:11:42,703 ఇటలీలో వైరస్ సోకిన వాళ్లందరూ కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం... 164 00:11:48,083 --> 00:11:49,084 ధన్యవాదాలు. 165 00:11:53,213 --> 00:11:55,549 నేను ఇవాళ వెళ్లిపోయే ముందు నీకు ఏమైనా కావాలా? 166 00:11:59,469 --> 00:12:01,346 ఏమో మరి. ఏమైనా కావాలేమో. 167 00:12:02,681 --> 00:12:03,765 కావాలేమో. 168 00:12:05,142 --> 00:12:07,686 ఈ వీకెండ్ అంతా నీతోనే గడుపుతాను. 169 00:12:07,769 --> 00:12:09,188 నిజంగా? 170 00:12:09,271 --> 00:12:11,315 వీకెండ్ దాకా ఎందుకు ఆగడం? ఇక్కడ ఎవరూ లేరు. 171 00:12:11,398 --> 00:12:13,817 కర్టెన్లు వేసేద్దాం. ఇక్కడే పని కానిచ్చేదాం. 172 00:12:15,402 --> 00:12:17,696 తొక్కలో ఆలెక్స్. తన ఆఫీసులోనే కానిద్దాం. చేసేద్దాం. 173 00:12:18,197 --> 00:12:19,781 మనం తనకి చూపిద్దాం. 174 00:12:22,784 --> 00:12:24,786 -నాకు... -ఏంటి? 175 00:12:24,870 --> 00:12:26,413 -ఇక్కడ... -ఏంటి? ఏంటి? 176 00:12:26,496 --> 00:12:27,873 ఇది కాస్త భయానకంగా ఉంది. 177 00:12:27,956 --> 00:12:29,791 భయానకంగానా? ఏంటి? అది... నేను... 178 00:12:30,334 --> 00:12:33,086 నువ్వు అలా అర్థం చేసుకుంటున్నావంతే. నేనేమీ భయానకంగా ప్రవర్తించట్లేదు. 179 00:12:33,170 --> 00:12:34,338 అలా నేను అనుకుంటున్నానా? 180 00:12:35,422 --> 00:12:38,675 నన్ను క్షమించు. క్షమించు, నేను... 181 00:12:42,095 --> 00:12:44,348 ఈ హడావిడి అంతా తగ్గాక, అంతా సర్దుకుంటుంది, సరేనా? 182 00:12:44,431 --> 00:12:46,183 -నేను మాటిస్తున్నాను. -ఇదంతా తగ్గాకనా? 183 00:12:46,266 --> 00:12:48,852 చిప్, నువ్వు ఇక్కడే టివీ చూస్తూ ఉండిపోయావు. 184 00:12:48,936 --> 00:12:51,438 నన్ను మన్నించు. దేవుడా! మన్నించు. 185 00:12:54,858 --> 00:12:56,944 సర్లే, నేను... నేను ఇక బయలుదేరుతాను. 186 00:12:57,027 --> 00:13:00,239 లేదు, లేదు. నేను బయట దాకా వస్తాను. బయట దకా వస్తా. సరేనా? ఏం పర్వాలేదులే. 187 00:13:01,114 --> 00:13:02,991 నేను ఒక్కదాన్నే వెళ్తాలే. 188 00:13:12,584 --> 00:13:14,962 -చెడు మీడియా అని ఏదీ ఉండదు. -నువ్వు పుస్తక సారాంశాన్ని చదివావా? 189 00:13:15,045 --> 00:13:17,339 అవును, చదివాను. మానవీయ కోణంలో చూస్తే అది చాలా దారుణంగానే ఉందని చెప్పాలి. 190 00:13:17,422 --> 00:13:19,758 కానీ మన విషయానికి వస్తే, నాకు అందులో దారుణంగా ఏదీ కనబడలేదు. 191 00:13:19,842 --> 00:13:22,845 ఇప్పుడు వాళ్లెవరూ లేరు, ఫ్రెడ్ ఏటో వెళ్లిపోయాడు. మిట్చ్ చచ్చినట్టే లెక్క. 192 00:13:22,928 --> 00:13:24,847 ఇక్కడ మనం హీరోలం. 193 00:13:24,930 --> 00:13:28,350 స్టెల్లా, నేనూ యుబిఎ వార్తలకు ఆర్థర్, లాన్సలాట్ లాగా అన్నమాట. 194 00:13:28,433 --> 00:13:30,143 జెరాల్డ్, నువ్వు మెర్లిన్ వి, లిండా... 195 00:13:30,769 --> 00:13:32,145 సరే. ఫోన్ మోగుతూనే ఉంది. 196 00:13:32,229 --> 00:13:34,231 మన్నించాలి. దాన్ని పక్కన పెట్టేస్తాలే. 197 00:13:34,314 --> 00:13:37,359 మియా ఇంకా ఇక్కడే ఉంది కదా. అందులో తన తప్పేమీ లేదు, కానీ ఈ పుస్తకం ఉందే. 198 00:13:37,442 --> 00:13:39,236 -అది తప్పుగా అర్థం చేసుకోవడం. -అందులో ఆమె గురించి అంత బాగా రాయలేదు. 199 00:13:39,319 --> 00:13:41,238 తను బయటపడుతోంది. దాన్ని అధిగమిస్తోంది. 200 00:13:41,321 --> 00:13:44,950 ఇది మరో విజయ గాథ. ఒక ధీరురాలైన శక్తివంతమైన మహిళ. 201 00:13:45,033 --> 00:13:47,578 అవును. అంటే, మనం ఆలెక్స్ మరియు చిప్ ని మళ్లీ తీసుకున్నాం కదా. 202 00:13:47,661 --> 00:13:48,996 హేయ్, మన్నించాలి, జెరాల్డ్. 203 00:13:49,079 --> 00:13:51,290 మీ అసిస్టెంట్ రెండవ లైన్లో ఉంది. ఏదో అర్జంట్ అట. 204 00:13:51,373 --> 00:13:52,833 -కొత్త అసిస్టెంట్. -వావ్. 205 00:13:52,916 --> 00:13:54,293 ఇప్పుడు ఎక్కడ కూడా పరిస్థితులు బాగా లేవు. 206 00:13:54,376 --> 00:13:57,713 అంటే, ఈ పుస్తకంలో ఆలెక్స్, చిప్ గురించి మంచిగా అయితే రాసి ఉండటానికి ఆస్కారం లేదు. 207 00:13:57,796 --> 00:13:59,590 కానీ వాళ్లు మిట్చ్, ఫ్రెడ్ కాదు కదా. 208 00:13:59,673 --> 00:14:01,800 రెండు విధాలుగా పశ్చాత్తాపాన్ని చూపవచ్చు. 209 00:14:01,884 --> 00:14:04,386 -అందరికీ పశ్చాత్తాప కథనం నచ్చుతుంది... -హాయ్, సోన్యా. ఏంటి సంగతి? 210 00:14:04,469 --> 00:14:07,556 ...ఎందుకో మీకూ తెలుసు. అందరూ తప్పులు చేస్తారు, వాటి నుండి బయటపడాలనుకుంటారు. 211 00:14:07,639 --> 00:14:09,474 సరే, మరి వీళ్లిద్దరి సంగతేంటి? 212 00:14:10,267 --> 00:14:11,935 బ్రాడ్లీకి మధ్య అమెరికాలోనే ఎక్కువ ఆదరణ ఉంది. 213 00:14:12,019 --> 00:14:15,856 మధ్య అమెరికా భాగానికి నచ్చే ఇద్దరు లెస్బియన్లు ఎవరైనా ఉన్నారాంటే, 214 00:14:15,939 --> 00:14:18,775 -అది ఆ ఇద్దరే... వాళ్లు లెస్బియన్లు అయితే. -ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగు. 215 00:14:18,859 --> 00:14:19,735 సరే. 216 00:14:20,569 --> 00:14:24,156 ఇది ఏంటో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇది మీరు కూడా వినాలి. 217 00:14:25,782 --> 00:14:27,242 సరే. మన్నించాలి. మాకు... 218 00:14:27,326 --> 00:14:29,703 ఇక్కడ లైన్స్ తో ఏదో సమస్య ఉంది, నేనే వేరే ఫోన్ కి మారానులెండి. 219 00:14:29,786 --> 00:14:31,079 ఇందాక అడిగింది మళ్లీ అడగగలరా? 220 00:14:31,663 --> 00:14:34,583 సరే. నా పేరు లూకా రొమానో. నేను ఒక విలేఖరిని. 221 00:14:34,666 --> 00:14:38,754 నేను ఇటలీలోని మెస్త్రేలో "ఇల్ గజెటీనో" అనే పత్రికలో పని చేస్తున్నాను. 222 00:14:40,005 --> 00:14:43,550 నేను మిట్చ్ కెస్లర్ మరణంపై మీరేమంటారో తెలుసుకోవడానికి కాల్ చేశాను. 223 00:14:45,552 --> 00:14:46,970 సరే, నాకు అర్థమైందనుకుంటా. 224 00:14:47,054 --> 00:14:52,017 మిట్చ్ కెస్లర్ నిజంగానే చనిపోయారని మీరు ధృవీకరించుకోగలిగారా? 225 00:14:52,100 --> 00:14:55,646 లేదు, నేను మిమ్మల్ని కామెంట్ కోసం అడుగుతున్నా. నేను ధృవీకరించనక్కర్లెదు. 226 00:14:55,729 --> 00:14:57,981 అది కాదు. మీరు ధృవీకరించుకున్నారా? 227 00:15:01,485 --> 00:15:05,030 ఈ వార్త నిజమేమని మీరు నిర్ధారించుకున్నారా? 228 00:15:06,823 --> 00:15:08,784 రీవా దగ్గర ఆయన ఒక కారు ప్రమాదంలో మరణించారని మాకు తెలిసింది. 229 00:15:08,867 --> 00:15:10,202 అది కోమో నది దగ్గరేనా? 230 00:15:10,285 --> 00:15:12,579 ఆ అమ్మాయి ఆయన మీద అరిచింది కదా, అది అక్కడే అనుకుంటా. 231 00:15:12,663 --> 00:15:13,664 మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? 232 00:15:13,747 --> 00:15:15,332 నిజానిజాలు నిర్ధారణ అయ్యేదాకా... 233 00:15:15,415 --> 00:15:17,334 -వెళ్లు! -...నెట్వర్క్ ఏం కామెంట్ చేయడం లేదు. 234 00:15:17,417 --> 00:15:18,669 కానీ ధన్యవాదాలు. 235 00:15:19,962 --> 00:15:21,380 స్టెల్లా, ఇంకో విషయం! 236 00:15:21,463 --> 00:15:24,424 ఆలెక్స్ చక్రాల కుర్చీలో ఉన్నా పర్లేదు, తను ఇక్కడ ఉండాలి! 237 00:15:24,508 --> 00:15:26,176 ఇదే మీ తాజా వాతావరణ సమాచారం. 238 00:15:26,260 --> 00:15:29,054 వెచ్చని వాతావరణం రావడానికి ఇంకెన్నో రోజులు లేవు. 239 00:15:29,137 --> 00:15:30,597 అయ్యో, నా శీతాకాల డ్రెస్సులను నేను మిస్ అయిపోతానే. 240 00:15:30,681 --> 00:15:32,766 శీతాకాల డ్రెస్సులు అంటే ఇష్టముండేది నాకొక్కదానికేనా ఏంటి? 241 00:15:32,850 --> 00:15:35,686 నువ్వు కూడా నా అంత అందంగా ఉంటే, ఆ అందాన్ని దాచుకోవాలనుకోవు. 242 00:15:35,769 --> 00:15:37,145 నేను అడిగింది అది కాదు. 243 00:15:37,229 --> 00:15:38,689 బ్రాడ్లీ, నీ సంగతేంటి? 244 00:15:40,107 --> 00:15:42,860 విరామం తర్వాత మేము కవర్ చేసే వార్తలు, యువరాజు హ్యారీ, తాను రోయల్ మెరైన్ల విధుల 245 00:15:42,943 --> 00:15:45,612 నుండి తప్పుకుంటున్నానని ప్రకటించాక యూకెకి తొలిసారి వస్తున్న వివరాలు. 246 00:15:45,696 --> 00:15:49,867 ఇంకా ఈ షోకు సంబంధించి విడుదల కాబోతున్న పుస్తకంలో మరిన్ని ఆరోపణలు బయటపడ్డాయి. 247 00:15:49,950 --> 00:15:53,745 మాజీ యాంకర్, మిట్చ్ కెస్లర్ నల్లజాతి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడా? 248 00:15:55,080 --> 00:15:56,456 విరామం తర్వాత వీటిని చూద్దాం. 249 00:15:58,792 --> 00:16:01,628 మిట్చ్ కెస్లర్ చనిపోయాడని మనకి ఒక నిర్ధారణ కాని సమాచారం అందింది. 250 00:16:04,298 --> 00:16:05,632 నువ్వు ఏం విన్నావు? 251 00:16:05,716 --> 00:16:08,719 అంతగా తెలియని ఒక ఇటాలియన్ పత్రిక వాళ్ళు కామెంట్ కోసం అడిగారు. కారు ప్రమాదమట. 252 00:16:08,802 --> 00:16:11,180 ప్రస్తుతానికి మనకి తెలిసింది ఇంతే. దీన్ని ఆలెక్స్ రిపోర్ట్ చేయాలని కోరీ అంటున్నాడు. 253 00:16:17,853 --> 00:16:21,231 గేయిల్, గోర్డన్, జోయల్, లేలా, దయచేసి ఇటు రండి. 254 00:16:26,570 --> 00:16:31,325 మిట్చ్ కెస్లర్ చనిపోయాడాని ఏదో ఇటాలియన్ పత్రిక వాళ్లు కాల్ చేశారు. 255 00:16:31,408 --> 00:16:33,035 రీవా ఊరి బయట, కోమో నది దగ్గర. 256 00:16:33,118 --> 00:16:35,037 జోయల్, లేలా, మీరు ఈ విషయంలో వీలైనంత సమాచారాన్ని సేకరించండి. 257 00:16:35,120 --> 00:16:36,997 మంచైనా చెడైనా, ఇతను మనవాడు. 258 00:16:37,080 --> 00:16:39,374 కాబట్టి, అది నిజమైనా, లేక అలా జరగాలని ఎవరైనా కోరుకొని అలా చెప్పినా, 259 00:16:39,458 --> 00:16:41,502 దాన్ని ముందుగా మనమే రిపోర్ట్ చేయాలి. 260 00:16:41,585 --> 00:16:44,630 ఈ వార్త చాలా వేగంగా వ్యాపిస్తుంది, కానీ నాకు రెండు నిర్ధారణలు కావాలి, 261 00:16:44,713 --> 00:16:48,091 ముందు ఆయన కుటుంబానికి తెలిపే మనం రిపోర్ట్ చేయాలి. సరేనా? 262 00:16:48,592 --> 00:16:50,844 -గేయిల్ మరియు గోర్డన్, మీరు సాయపడగలరా? -అలాగే. 263 00:16:50,928 --> 00:16:53,555 చేస్తాను. కానీ చిప్ కి ఈ విషయంలో మంచి పట్టు ఉంది. 264 00:16:53,639 --> 00:16:56,350 అతనికి మరో ముఖ్యమైన పనుందిలే. చాలా చాలా ధన్యవాదాలు. కానివ్వండి. 265 00:16:56,433 --> 00:16:59,394 -మియా, చెప్తున్నా కదా. ఇది నువ్వు చేయగలవు. -మియా, నువ్వు బాగానే ఉన్నావా? 266 00:16:59,478 --> 00:17:03,357 బాగానే ఉన్నా. కానీ మనం నిర్ధారించుకొనేదాకా పుస్తకానికి సంబంధించిందేదీ ప్రసారం చేయకు. 267 00:17:03,440 --> 00:17:04,525 సరే. 268 00:17:10,989 --> 00:17:12,324 ఆలెక్స్ లెవీ 269 00:17:12,406 --> 00:17:13,951 -హేయ్. -హేయ్. నేను నీతో మాట్లాడాలి. 270 00:17:14,034 --> 00:17:14,910 నువ్వు నాకు... 271 00:17:14,992 --> 00:17:16,994 నువ్వు చెప్పే ముందు, నేనే నీకొక విషయం చెప్పాలి. 272 00:17:17,079 --> 00:17:19,830 ఒక గే కాని శ్వేత జాతి మగాడిగా, నేనేమీ... 273 00:17:19,915 --> 00:17:22,084 దేవుడా. ఇక ఆపు. నాకు అది అనవసరం. నేను నీకు... 274 00:17:22,166 --> 00:17:24,670 -ఆ పుస్తకంలోని విషయం దారుణమైనదే... -చిప్, నువ్వు... ఇక నోర్మూయ్. 275 00:17:26,672 --> 00:17:27,881 మిట్చ్ చనిపోయి ఉండవచ్చు. 276 00:17:30,592 --> 00:17:33,595 అయ్యయ్యో! సరే, నేనేం చేయాలి? 277 00:17:33,679 --> 00:17:35,722 నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఆలెక్స్ ని ఇక్కడికి తీసుకురావడం. 278 00:17:35,806 --> 00:17:36,807 మిగతాదంతా నేను చూసుకుంటా. 279 00:17:36,890 --> 00:17:39,518 ఇది నకిలీ వార్తే అయ్యుండవచ్చు, కానీ అదే నిజమైతే రిపోర్ట్ చేయడానికి తనిక్కడ ఉండాలి. 280 00:17:39,601 --> 00:17:42,145 కాబట్టి ఆలెక్స్ లెవీ వెంటనే ఇక్కడ ఉండాలి. 281 00:17:43,105 --> 00:17:45,107 -అలాగే. -సరే. కానివ్వు. త్వరగా. 282 00:17:58,245 --> 00:18:01,415 కార్డ్ సర్వీసులు. మీ కాల్ ని ఎవరికి కలపాలి? 283 00:18:01,498 --> 00:18:02,791 రెప్రసెంటేటివ్ కి. 284 00:18:04,418 --> 00:18:05,752 రెప్రసెంటేటివ్ కి. 285 00:18:08,130 --> 00:18:10,465 కార్డ్ సర్వీసులకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నా పేరు షేన్. 286 00:18:10,549 --> 00:18:11,884 మీరు కాల్ చేస్తున్న ఖాతాకు సంబంధించిన 287 00:18:11,967 --> 00:18:13,719 పదిహేను అంకెల సంఖ్యను చెప్పగలరా? 288 00:18:13,802 --> 00:18:15,804 హేయ్, షేన్. ప్రస్తుతం నా దగ్గర నా ఖాతా సంఖ్య లేదు. 289 00:18:15,888 --> 00:18:18,599 -నా సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇమ్మంటారా? -తప్పకుండా. ఆ నంబర్ ఏంటో చెప్పగలరా? 290 00:18:18,682 --> 00:18:22,102 అలాగే. 740-00-5924. 291 00:18:22,186 --> 00:18:25,022 మంచిది. కొన్ని భద్రతాపరమైన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 292 00:18:25,105 --> 00:18:26,106 తప్పకుండా. 293 00:18:26,190 --> 00:18:27,816 మీ చిన్ననాటి ప్రాణ స్నేహితురాలి పేరేంటి? 294 00:18:27,900 --> 00:18:28,901 కొలీన్. 295 00:18:28,984 --> 00:18:30,944 మీ అమ్మ గారు పుట్టింటి పేరేంటి? 296 00:18:31,028 --> 00:18:32,154 లసైన్. 297 00:18:32,237 --> 00:18:34,281 మీ తొలి కారు కంపెనీ, మోడల్ ఏంటి, ఇంకా అది ఏ సంవత్సరంలో తీసుకున్నారు? 298 00:18:34,364 --> 00:18:37,618 ఒక్కటైనా కష్టమైన ప్రశ్న అడగండి. ప్లైమౌత్ డస్టర్, 1976లో కొన్నాను. 299 00:18:38,243 --> 00:18:41,371 భద్రతాపరమైన కారణాల దృష్ట్యా, మీ ఖాతా ఏ పేరుతో ఉందో చెప్పగలరా? 300 00:18:41,455 --> 00:18:42,998 నా పేరే, ఆలెక్స్ లెవీ. 301 00:18:43,081 --> 00:18:44,708 మంచిది. ఇవాళ నేను మీకు ఏ విధంగా సాయపడగలను? 302 00:18:45,959 --> 00:18:48,712 అంటే, నేను ఒక కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా, కానీ అది సఫలమవ్వట్లేదు. 303 00:18:48,795 --> 00:18:50,547 కాబట్టి, మీరేమైనా సాయపడగలరేమో అని కాల్ చేశాను. 304 00:18:51,048 --> 00:18:53,675 అలా జరిగినందుకు చింతిస్తున్నాం. ఒక్క నిమిషంలో చెక్ చేసి చెప్తాను. 305 00:18:57,137 --> 00:18:58,847 కొనుగోలు కోసం ప్రయత్నించినట్లు ఇక్కడ నాకు కనబడటం లేదు. 306 00:18:59,765 --> 00:19:02,434 అది... మీరు బాగా చూశారు కదా? అది వింతగా ఉందే. 307 00:19:02,518 --> 00:19:05,103 మీరు... చివరి సారిగా ఎక్కడ వాడినట్టు అక్కడ ఉందో చెప్పగలరా? 308 00:19:05,187 --> 00:19:07,940 ఇక్కడ నాకు కనిపిస్తున్న అత్యంత తాజా లావాదేవీ సఫలమైంది. 309 00:19:08,023 --> 00:19:12,027 అది రెండ్రోజుల క్రితం మిలాన్ లినాటే విమానాశ్రయంలో జరిగినట్టుగా చూపుతోంది. 310 00:19:18,325 --> 00:19:21,161 సర్లేండి, నేను డబ్బులిచ్చి కొనుక్కుంటానులే. ధన్యవాదాలు. 311 00:19:22,663 --> 00:19:23,914 ...నేను యుబిఎలో పని చేస్తున్నాను. 312 00:19:23,997 --> 00:19:26,333 మీకు అతనితో చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నాను, 313 00:19:26,416 --> 00:19:29,878 కానీ మాకు ఖచ్చితంగా తెలిసేదాకా, మీరు దీనికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ధన్యవాదాలు. 314 00:19:30,879 --> 00:19:32,798 -ఎక్కడ ఉన్నావు నువ్వు? -లైన్లోనే ఉన్నా. జాన్ ఏమైనా చెప్పాడా? 315 00:19:32,881 --> 00:19:34,925 -ఓరి దేవుడా. -ఏంటి? ఏమైనా దొరికిందా? 316 00:19:35,008 --> 00:19:36,635 ఎవరో ఒకడు ఇప్పుడే ఈ ఫోటోని పోస్ట్ చేశాడు. 317 00:19:37,219 --> 00:19:38,679 "మైఖెల్ కెస్లర్" అని పోస్ట్ చేశాడు. ఇది వేరేది... 318 00:19:38,762 --> 00:19:41,265 కాదు. కానీ మిగతావన్నీ సరిపోతున్నాయి. ఇతను కూడా ఉండేది రీవాలోనే. 319 00:19:41,348 --> 00:19:44,184 ఒకవేళ ఇది అతనే అనుకున్నా, ఇదేమంత పెద్ద ప్రమాదం కాదు. దీనికి ప్రాణాలు పోవు. 320 00:19:44,268 --> 00:19:46,436 లైసెన్స్ ప్లేట్ కనబడుతోంది. కారు ఎవరి పేరు మీద ఉందో చెక్ చేస్తాను. 321 00:19:46,520 --> 00:19:47,980 హలో? అవును. 322 00:19:48,063 --> 00:19:50,274 -ఇంగ్లీష్ లో మాట్లాడగలరా. -మియా జోర్డన్. 323 00:19:50,357 --> 00:19:53,902 ఇది పుస్తకానికి మేలు చేస్తుందో లేదో ఎవరికి తెలుసు? ఏదైనా కావచ్చు. 324 00:19:53,986 --> 00:19:57,155 చనిపోయిన వ్యక్తిపై వ్యతిరేక వార్తలు జనాలకు నచ్చకపోవచ్చు. 325 00:19:57,239 --> 00:19:59,950 కానీ ఇతను మిట్చ్ కెస్లర్, జెరాల్డ్. 326 00:20:00,033 --> 00:20:02,202 మనం మూకుమ్మడి దాడికి సిద్ధమవ్వాలి. మొత్తంగా పీల్చి పిప్పిచేయడానికి 327 00:20:02,286 --> 00:20:05,122 అందరికీ దక్కిన ఆఖరి సువర్ణావకాశం ఇది. 328 00:20:05,205 --> 00:20:07,291 -ఆలెక్స్ విషయం ఎంత వరకు వచ్చింది? -తనని రప్పిస్తున్నాం. 329 00:20:11,461 --> 00:20:15,132 దీన్ని ఆలెక్స్ రిపోర్ట్ చేస్తేనే బాగుంటుందని నీకు ఎందుకు అనిపిస్తోంది? 330 00:20:17,467 --> 00:20:18,886 అంటే, చెడ్డ పేరు మూటగట్టుకున్న ఆ స్త్రీలోలుడికి 331 00:20:18,969 --> 00:20:24,099 ఆమె ఇక్కడ భార్య అని చెప్పవచ్చు, అలాంటప్పుడు హఠాత్తుగా అతనికి 332 00:20:24,183 --> 00:20:26,894 అకాల మరణం సంభవిస్తే, దాన్ని ఆమె రిపోర్ట్ చేయడం మంచి నిర్ణయం కాదంటావా? 333 00:20:27,436 --> 00:20:29,188 నాకు అది సూపర్ గా అనిపిస్తోంది. 334 00:20:33,275 --> 00:20:34,651 ఆట మొదలైంది. 335 00:20:34,735 --> 00:20:36,778 అతనికి తెలుసు. అది మనది. 336 00:20:37,654 --> 00:20:40,282 వెండెల్, హాయ్. ఎలా ఉన్నావు? 337 00:20:40,365 --> 00:20:42,659 బాగానే ఉన్నాను. పుకార్లు నీ దాకా వచ్చాయా? 338 00:20:42,743 --> 00:20:44,411 వచ్చాయి. నీకేమైనా కావాలా? 339 00:20:44,494 --> 00:20:46,788 నీకు ఈ రంగం కాస్త కొత్తదే, కానీ టీవీ వార్తల రంగం ఒక కుటుంబం లాంటిది. 340 00:20:46,872 --> 00:20:50,209 అప్పుడప్పుడూ గొడవలు జరగడం సహజం, కానీ అదే కదా ఉత్సాహాన్ని కలిగించేది? 341 00:20:50,292 --> 00:20:53,003 ఇంకా "మార్నింగ్ వార్తల యుద్ధాలు" అంటూ ఏదేదో హడావిడి జరుగుతూ ఉంటుందనీ తెలుసు, 342 00:20:53,086 --> 00:20:55,464 కానీ, వాటన్నింటికీ అతీతమైనవి కొన్ని ఉంటాయి. 343 00:20:56,048 --> 00:20:58,800 వ్యక్తి మరణం అనేది, ప్రత్యేకించి పిల్లలు గల కుటుంబానికి 344 00:20:58,884 --> 00:21:00,135 తీరని విషాదాన్ని మిగుల్చుతుంది. 345 00:21:00,219 --> 00:21:03,222 ఒకవేళ ఇదే నిజమైతే, నేను నిజం కాకూడదనే కోరుకుంటున్నా, 346 00:21:03,305 --> 00:21:05,682 ఇది టిఎంఎస్ కి చెందినదే అని, మేము దూరడం లేదని నీకు చెప్తున్నాను. 347 00:21:06,725 --> 00:21:08,852 అది నిజమని ధృవీకరించే వాళ్ళు మాకు ఎవరూ దొరకలేదు, 348 00:21:08,936 --> 00:21:12,648 కానీ అతడిని కోమో బయట ఉన్న సెయింట్ ఏంజెలో ఆసుపత్రికి తరలించారని తెలిసింది. 349 00:21:12,731 --> 00:21:14,566 మీకు అది తెలిసే ఉంటుంది, కానీ... 350 00:21:15,192 --> 00:21:16,527 అవును. నీ సహకారానికి ధన్యవాదాలు, వెండెల్. 351 00:21:16,610 --> 00:21:18,237 ఇక్కడంతా హడావిడిగా ఉంది, కానీ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. 352 00:21:18,320 --> 00:21:20,989 నాకూ, అలాగే మా అందరికీ ఇది చాలా గొప్ప విషయం. నేను నీకు త్వరలోనే కాల్ చేస్తున్నా. 353 00:21:22,032 --> 00:21:25,369 నేను దీన్ని కిందున్నవారికి చెప్పాలి. దీన్ని వాడుకోవడానికి మనకో ప్లాన్ కావాలి. 354 00:21:25,452 --> 00:21:27,371 ఆ దరిద్రుని చావు ఊరికే పోకూడదు. 355 00:21:28,455 --> 00:21:31,083 బాబోయ్, స్టెల్లా, నేను చూసుకుంటాలే. ధన్యవాదాలు. 356 00:21:31,166 --> 00:21:33,710 సరే. మిట్చ్ ని ఈ ఆసుపత్రికి తీసుకెళ్ళారని సమాచారం అందింది. 357 00:21:33,794 --> 00:21:34,920 ఏమైనా సమాచారం దొరుకుతుందేమో చూడు. 358 00:21:35,003 --> 00:21:37,673 క్లే బెకర్ పేరు మీద ఉందన్నమాట. ఏమైనా సంప్రదింపు సమాచారం అందించగలరా? 359 00:21:37,756 --> 00:21:39,174 క్లే బెకర్, కేవీపీక్యూకి యజమాని. 360 00:21:39,258 --> 00:21:40,884 -అతను యుబిఎ అనుబంధ సంస్థకి ఓనర్. -ఏంటి? 361 00:21:42,427 --> 00:21:44,137 అయ్యో. 362 00:21:45,889 --> 00:21:48,725 ఇది క్లే బెకర్ సంప్రదింపు సమాచారం. అతనితో మాట్లాడి చూడు. 363 00:21:48,809 --> 00:21:50,394 జోయల్, ఇది ఆసుపత్రి సమాచారం. 364 00:21:50,477 --> 00:21:51,478 నేను ఇప్పుడే వస్తాను. 365 00:21:52,980 --> 00:21:55,023 -హేయ్, జోయల్. -హేయ్. ఆలెక్స్ గురించి ఏమైనా తెలిసిందా? 366 00:21:55,107 --> 00:21:56,400 అవును, కాసేపట్లో తెలిసిపోతుంది. 367 00:21:56,483 --> 00:21:59,570 ఈ విషయంలో తాను చాలా బాధపడుతోంది. నీకు ఏమైనా సమాచారం దొరికిందా? 368 00:21:59,653 --> 00:22:02,072 ఇది నిజం కాకపోతే, తనకి ఆ విషయం చెప్పి కాస్త ఊరట ఇవ్వగలను. 369 00:22:02,155 --> 00:22:03,448 లేదు, దౌత్యకార్యాలయం నుండి ఏమీ తెలియలేదు. 370 00:22:03,532 --> 00:22:06,118 అధికారంగా, కనీసం అనధికారికంగా అయినా ఎవరూ ఏమీ చెప్పడం లేదు. 371 00:22:06,201 --> 00:22:09,079 అంటే, నేను కొన్ని ట్వీట్లను, ప్రమాదం తాలూకు ఫోటో చూశాను. 372 00:22:09,162 --> 00:22:11,582 కారు, క్లే బెకర్ పేరుతో రిజిస్టర్ అయ్యుందట. 373 00:22:11,665 --> 00:22:13,000 యుబిఎ శాన్ ఫ్రాన్సిస్కో క్లే బెకర్ 374 00:22:13,083 --> 00:22:15,419 ఆయనే అట. నేను ఇప్పుడే ఆసుపత్రికి కాల్ చేస్తున్నాను. 375 00:22:15,502 --> 00:22:16,420 ఒక్క నిమిషం. ఆసుపత్రికా? 376 00:22:16,503 --> 00:22:18,005 అవును, కోమో బయట ఉన్న ఓ ఆసుపత్రికి 377 00:22:18,088 --> 00:22:19,882 మిట్చ్ ని తరలించారని ఎన్.బి.ఎన్ వాళ్లు మనకి సమాచారం ఇచ్చారు. 378 00:22:19,965 --> 00:22:22,176 ఆసుపత్రి పేరేంటో చెప్పు. నేను వాళ్లకి కాల్ చేస్తాను. 379 00:22:22,259 --> 00:22:25,470 నేనే వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడే వాళ్ల ఫోన్ రింగ్ అవుతోంది కూడా. 380 00:22:25,554 --> 00:22:27,556 జోయల్, నాకు ఆసుపత్రి పేరేంటో చెప్పు! 381 00:22:27,639 --> 00:22:30,100 ఓరి దేవుడా. అలాగే. అది... 382 00:22:30,184 --> 00:22:32,728 "ఆస్పడాలె సెయింట్ ఏంజలో." అది... 383 00:22:32,811 --> 00:22:33,854 నాకు తెలిసిందిలే. 384 00:22:35,105 --> 00:22:36,773 ఓరి దేవుడా. 385 00:22:36,857 --> 00:22:39,943 మియా. దీన్ని ఓసారి చూడు. 386 00:22:40,777 --> 00:22:42,613 అవును. నేను చూశాలే. 387 00:22:43,113 --> 00:22:45,741 విరామ సమయంలో నేను అందరితో మాట్లాడతాను. ధన్యవాదాలు. 388 00:22:46,658 --> 00:22:48,493 నాల్గవ కెమరా సిద్ధంగా ఉండాలి. షూట్ చేయ్, నాల్గవ కెమెరా. 389 00:22:50,412 --> 00:22:52,039 మూడవ కెమరా సిద్ధంగా ఉండాలి. షూట్ చేయ్, మూడవ కెమెరా. 390 00:22:52,122 --> 00:22:56,502 డేనియల్, ఎన్నో కష్టాలను జయించి నిలిచిన కుటుంబంతో నువ్వు సమావేశమయ్యావు. 391 00:22:56,585 --> 00:22:59,379 అవును, అది చాలా ప్రత్యేకమైన కథ. 392 00:22:59,463 --> 00:23:01,048 దాన్ని మీరందరూ చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. 393 00:23:01,131 --> 00:23:04,218 ఇంకా, ఎఫ్.డీ.ఏ ఒక కొత్త ఇన్హేలర్ ని ఆమోదించింది, 394 00:23:04,301 --> 00:23:07,513 అది ఆస్తమాతో బాధపడుతున్నవారికి డబ్బునే కాదు, ప్రాణాలను కూడా కాపాడుతుంది. 395 00:23:07,596 --> 00:23:08,680 ఇవన్నీ విరామం తర్వాత చూద్దాం. 396 00:23:10,307 --> 00:23:11,725 షూటింగ్ ఆపేశాం. నాలుగు నిమిషాల్లో మళ్లీ మొదలుపెడతాం. 397 00:23:12,768 --> 00:23:13,852 అక్కడికి నేను వెళ్లవచ్చా? 398 00:23:13,936 --> 00:23:15,979 ధన్యవాదాలు. శుభోదయం, శుభోదయం. 399 00:23:16,063 --> 00:23:17,856 -శుభోదయం, శుభోదయం. -శుభోదయం. 400 00:23:17,940 --> 00:23:19,900 దయచేసి అందరూ నా మాట వింటారా? 401 00:23:19,983 --> 00:23:22,069 డానీ, షూట్ చేయడం ఆపగలవా? 402 00:23:23,153 --> 00:23:24,488 -డానీ ఆపేశాడట. -సరే. 403 00:23:24,571 --> 00:23:26,907 ఇప్పుడే అందిన ఓ సమాచారం గురించి అందరిని హెచ్చరిద్దామనుకుంటున్నాను. 404 00:23:26,990 --> 00:23:29,451 నిజానిజాలేంటో ఇంకా ఖచ్చితంగా తెలీదు, ఇప్పటిదాకా నేనెవరికీ ఎందుకు చెప్పలేదంటే, 405 00:23:29,535 --> 00:23:32,579 అనవసరంగా మిమ్మల్ని కంగారు పెట్టడం ఇష్టం లేదు, 406 00:23:32,663 --> 00:23:34,581 కానీ పుకార్లు వ్యాపిస్తున్నాయి. 407 00:23:35,582 --> 00:23:38,919 మరి, నిన్న రాత్రి మిట్చ్ కెస్లర్ ఒక కారు ప్రమాదానికి గురయ్యాడు, 408 00:23:39,002 --> 00:23:41,129 మనకి వచ్చే సమాచారం బట్టి అతను ఆ ప్రమాదంలో చనిపోయినట్టున్నాడు. 409 00:23:42,256 --> 00:23:43,298 ఓరి దేవుడా. 410 00:23:43,966 --> 00:23:47,344 నిజానికి, అతను మరణించి ఉండే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టుంది. 411 00:23:47,427 --> 00:23:49,346 "మార్నింగ్ షో"లో మిట్చ్ కెస్లర్ పదిహేను ఏళ్లు పని చేశాడు. 412 00:23:49,429 --> 00:23:50,430 ఇది నమ్మలేకపోతున్నాను. 413 00:23:50,514 --> 00:23:54,685 ఏ విధాంగా అయినా, మీలో కొందరికి ఈ వార్త దిగమింగుకోవడానికి కష్టంగా ఉంటుంది. 414 00:23:56,228 --> 00:23:57,479 కాబట్టి, మనకి ఖచ్చితంగా తెలిసేదాకా, 415 00:23:57,563 --> 00:24:00,566 మీరందరూ ఎవరి పనులు వారు చేస్తూ ఉండమని కోరుతున్నాను. 416 00:24:01,191 --> 00:24:04,528 ఇంకా మనదో వార్తా సంస్థ అనే విషయాన్ని మర్చిపోకండి. 417 00:24:05,612 --> 00:24:11,034 ఇది చాలా అంటే చాలా గోప్యమైన, అలాగే ధృవీకరించబడని సమాచారం. 418 00:24:11,743 --> 00:24:13,245 కాబట్టి, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దు. 419 00:24:15,706 --> 00:24:19,042 మిట్చ్... మిట్చ్ ఒక మనిషే. 420 00:24:21,461 --> 00:24:22,963 అతనికి ఒక కుటుంబం ఉంది. 421 00:24:24,131 --> 00:24:28,886 మనం ఏదైనా చేసే ముందు, ఎలగైనా కానీ, ఈ సమాచారం 422 00:24:28,969 --> 00:24:30,387 ఖచ్చితమైనదో కాదో తెలుసుకోవడం మన కర్తవ్యం. 423 00:24:31,847 --> 00:24:33,724 సరే మరి. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. 424 00:24:34,725 --> 00:24:38,145 హేయ్, మియా. ఈ సమాచారం మనకి ఎంత మాత్రం ఖచ్చితంగా తెలుసు? 425 00:24:39,271 --> 00:24:41,648 ప్రమాదమైతే జరిగింది. అందులో సందేహమే లేదు. 426 00:24:43,025 --> 00:24:45,903 కానీ, ఈ వార్తలను ఆలెక్స్ చేత రిపోర్ట్ చేయించాలని నెట్వర్క్ చూస్తోంది, 427 00:24:45,986 --> 00:24:47,362 ఒకవేళ అది నిజమైనదే అయితే. 428 00:24:51,158 --> 00:24:52,159 ఎవరోకరు ఎత్తండి. 429 00:24:56,371 --> 00:24:57,789 అత్యవసర గది నుండి మాట్లాడుతున్నాం. 430 00:24:57,873 --> 00:24:59,708 హాయ్. హాయ్, ఇంగ్లీషులో మాట్లాడగలరా? 431 00:24:59,791 --> 00:25:01,043 తప్పకుండా. మీకేం కావాలో చెప్పండి. 432 00:25:01,126 --> 00:25:04,379 మీ దగ్గర ఒక అమెరికన్ పేషెంట్ ఎవరైనా ఉన్నారా? 433 00:25:04,463 --> 00:25:05,797 మీరేనా ఇందాక కాల్ చేసింది? 434 00:25:05,881 --> 00:25:07,508 ఏంటి? లేదు, లేదు. నేను ఇప్పుడే కాల్ చేశాను. 435 00:25:07,591 --> 00:25:09,426 మీ గొంతులాగానే అనిపించింది. మేము చాలా బిజీగా ఉన్నాం. 436 00:25:09,510 --> 00:25:12,387 నేను అర్థం చేసుకోగలను. మీ వద్ద ఇప్పుడు కానీ, ఇంతకు ముందు కానీ 437 00:25:12,471 --> 00:25:15,682 మిచెల్ కెస్లర్ అనే పేరు గల పేషెంట్ చేరారా అనేదే నాకు కావాలి. కే-ఈ-ఎస్-ఎస్-ఎల్-ఈ-ఆర్. 438 00:25:17,601 --> 00:25:19,061 లేదు. ఆ పేరుతో ఎవరూ చేరలేదు. 439 00:25:19,144 --> 00:25:21,396 నిజంగానా? మీకు ఖచ్చితంగా తెలుసా? 440 00:25:21,980 --> 00:25:24,942 కారు ప్రమాదానికి గురైన అమెరికన్ పేషెంట్లు ఎవరూ చేరలేదా? 441 00:25:25,609 --> 00:25:26,693 ఒక పురుషుడా? 442 00:25:26,777 --> 00:25:30,864 అవును. శ్వేతజాతీయుడు, 50 ఏళ్లుంటాయి. తెల్లని జుట్టు, గడ్డం ఉంటాయి. 443 00:25:31,448 --> 00:25:33,367 అవును. అలాంటి వ్యక్తి ఒకరు చేరారు, కానీ ఐడీ ఏమీ లేదు. 444 00:25:33,909 --> 00:25:35,285 -అతను బతికే ఉన్నాడా? -అది నాకు తెలీదు. 445 00:25:35,369 --> 00:25:37,204 నాకు మళ్లీ ఇంకోసారి చెప్పండి. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. 446 00:25:37,287 --> 00:25:38,705 చూడండి, ఆ విషయం నాకు అనవసరం. 447 00:25:38,789 --> 00:25:41,625 నాకు కావలసినదేంటంటే... అతనితో పాటు ఒక మహిళ కూడా ఉందా? 448 00:25:41,708 --> 00:25:44,461 -ఉంది. -ఆమె పరిస్థితి ఏంటి? 449 00:25:45,045 --> 00:25:46,588 నిజం చెప్పాలంటే, అంత బాగాలేదు. 450 00:25:46,672 --> 00:25:48,841 ఆమె పేరు ఆలెక్స్ లెవీయా? అది మీకు తెలుసా? 451 00:25:48,924 --> 00:25:50,092 నాకు తెలీదు. 452 00:25:58,225 --> 00:25:59,726 మీరు దయచేసి ఇంకాసేపు ఆగి చేస్తారా? 453 00:25:59,810 --> 00:26:00,811 -ఒక్క నిమిషం. -ఆగండి. 454 00:26:11,905 --> 00:26:13,115 మెసేజ్లు 455 00:26:13,198 --> 00:26:15,492 మియా జోర్డన్ నీ పని ఎంతదాకా వచ్చింది? 456 00:26:26,795 --> 00:26:27,796 క్షమించాలి. 457 00:26:30,674 --> 00:26:31,925 క్షమించండి. 458 00:26:33,427 --> 00:26:34,469 క్షమించండి. 459 00:26:34,553 --> 00:26:36,388 -అతను నా కోసమే చూస్తున్నాడు. -లేదు, అదేం లేదు. 460 00:26:36,471 --> 00:26:38,140 అవును. నేను ఇప్పుడే అతనితో మాట్లాడాను. 461 00:26:38,223 --> 00:26:39,766 లేదు, లేదు. ఏం పర్వాలేదు. 462 00:26:39,850 --> 00:26:41,435 కోరీ, నాకు నీ సాయం కావాలి. 463 00:26:43,103 --> 00:26:44,646 నేను కోరీతో మాట్లాడాలి. బయటకు వెళ్లు. 464 00:26:44,730 --> 00:26:46,106 నేను యుబిఎ వార్తల అధ్యక్షురాలిని. 465 00:26:46,190 --> 00:26:48,442 యుబిఎ వార్తలకు సంబంధించింది ఏదైనా నువ్వు నాకు చెప్పవచ్చు. 466 00:26:48,525 --> 00:26:51,361 ఒకవేళ ఇది యుబిఎ వార్తలకు సంబంధించింది కాకపోతే, మూసుకొని దొబ్బేయ్! 467 00:26:53,572 --> 00:26:55,991 -మరేమంటావు? చెప్పు. కానీ అబద్ధమాడకు. -అలాగే. 468 00:26:56,074 --> 00:26:57,659 -ఏంటి? ఆలెక్స్ వచ్చేసిందా? -లేదు. 469 00:26:57,743 --> 00:26:59,161 -నేను అదే చెప్పడానికి... -తను ఎక్కడ ఉంది? 470 00:26:59,244 --> 00:27:00,495 కాసేపు నన్ను మాట్లాడనిస్తారా? 471 00:27:00,579 --> 00:27:04,291 నేను చివరిసారిగా తనని వేగస్ లో చూశాను. తను ఇటలీలో ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. 472 00:27:06,043 --> 00:27:07,252 ఇంకా, తను... 473 00:27:10,005 --> 00:27:12,299 తను... తను చనిపోయి ఉంటుందేమో అని నాకనిపిస్తోంది. 474 00:27:12,966 --> 00:27:16,094 -అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? -ఆ విషయం ఇప్పుడు చెప్తున్నావా? 475 00:27:16,178 --> 00:27:17,721 ఎప్పుడు చెప్తే ఏంటి? దేవుడా. కావాలంటే నన్ను తీసేయండి! 476 00:27:17,804 --> 00:27:19,515 ఆలెక్స్ మిమ్మల్ని బలవంతపెట్టింది కనుకే మీరు నన్ను తీసుకున్నారు. 477 00:27:19,598 --> 00:27:22,684 కోరీ, నేను నీకే చెప్పాలని వచ్చాను, సరేనా? ఎందుకంటే, ఒకవేళ ఆ ఇటాలియన్ శివారుల్లో 478 00:27:22,768 --> 00:27:27,105 తను కొండ మీద నుండి పడి మరణించని పక్షంలో 479 00:27:27,189 --> 00:27:30,025 నువ్వు ఎవరికీ చెప్పేవాడివి కాదు, కదా? ఎందుకంటే నువ్వు తనకి అండగా ఉంటావు. 480 00:27:30,108 --> 00:27:32,444 ఆమె కుటుంబంలోని ఎవరికైనా ఈ విషయం చెప్పావా? 481 00:27:32,528 --> 00:27:34,905 వాళ్లకి కాల్ చేసి, వాళ్లని భయభ్రాంతులకి గురిచేయలేను కదా. 482 00:27:34,988 --> 00:27:37,032 తను అక్కడికి వెళ్లినట్టు ఎవరికీ తెలీదు. వాళ్లకేమీ తెలిసే అవకాశం లేదు. 483 00:27:37,115 --> 00:27:39,076 ఆగు. తను వెళ్లినట్టు ఎవరికీ తెలీదని నీకెలా తెలుసు? 484 00:27:39,660 --> 00:27:41,787 అంటే... తన అసిస్టెంట్ చెప్పింది. 485 00:27:41,870 --> 00:27:44,957 కైల్! ఆలెక్స్ లెవీ అసిస్టెంట్ ని తక్షణమే ఇక్కడికి రమ్మను. 486 00:27:45,040 --> 00:27:48,293 తను నాకు ఏమీ చెప్పదు. తనకి నాలాంటి వాళ్లు నచ్చరు, కాబట్టి... 487 00:27:48,877 --> 00:27:50,087 -తనతో నువ్వు మాట్లాడగలవా? -అలాగే. 488 00:27:50,170 --> 00:27:52,673 జనాలకు మందులను చవకగా అందుబాటులో తేవాలనే ప్రయత్నంలో భాగంగా 489 00:27:52,756 --> 00:27:56,510 ఎఫ్.డీ.ఏ ఆమోదించిన మొట్టమొదటి జనరిక్ ఆస్తమా ఇన్హేలర్ పుణ్యమా అని 490 00:27:56,593 --> 00:27:59,179 ఆస్తమాతో బాధపడేవాళ్లు, ఈ వారం కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు. 491 00:27:59,263 --> 00:28:01,473 మిట్చ్, మనం మాట్లాడి చాలా రోజులైందని నాకు తెలుసు 492 00:28:01,557 --> 00:28:02,850 నువ్వు ఎలా ఉన్నావు? 493 00:28:02,933 --> 00:28:05,018 ...ఈ మందు కూడా పెద్ద పెద్ద బ్రాండ్ల అంత ప్రభావవంతమైనదే, 494 00:28:05,102 --> 00:28:07,187 కానీ ధర మాత్రం చాలా తక్కువ. 495 00:28:07,271 --> 00:28:11,149 యుబిఎకి చెందిన టైరీస్ పార్కర్, ఈ విషయంలో మీకు మరింత సమాచారం అందిస్తారు. 496 00:28:13,402 --> 00:28:14,403 రెండవ కెమెరా, స్టాండ్ బైలో ఉండాలి. 497 00:28:19,199 --> 00:28:21,910 మియా, క్లే బెకర్ కాల్ చేశాడు. ఆయన ఆఫీసులో లైన్లో ఉన్నాడు. 498 00:28:29,042 --> 00:28:31,545 -హాయ్, క్లే? నేను మియా జోర్డన్ ని. -హాయ్, మియా. 499 00:28:31,628 --> 00:28:34,423 మన్నించాలి, కాలిఫోర్నియాలో ఇంకా తెల్లవారలేదు. 500 00:28:34,506 --> 00:28:36,550 అందుకని తిరిగి కాల్ చేసేటప్పుడు నిర్ధారించుకొని చేద్దామనుకున్నాను. 501 00:28:36,633 --> 00:28:37,676 సరే. తప్పకుండా. 502 00:28:37,759 --> 00:28:39,887 అది నా కారే. 503 00:28:39,970 --> 00:28:42,222 మిట్చ్ అక్కడ నా ఇంట్లోనే ఉంటున్నాడు, 504 00:28:42,306 --> 00:28:44,933 నాకు అందిన సమాచారం ప్రకారం, అది నిజమే అనుకుంటా. 505 00:28:45,684 --> 00:28:46,894 అయితే, అతను చనిపోయాడా? 506 00:28:48,145 --> 00:28:50,564 నాకు అర్థమైనంత వరకూ, అతను చనిపోయాడు. 507 00:28:52,900 --> 00:28:54,359 ఈ విషయం అతని కుటుంబానికి తెలుసా? 508 00:28:54,443 --> 00:28:56,612 వారికి చెప్పాల్సిన బాధ్యత నాది కాదనుకుంటా. 509 00:28:56,695 --> 00:28:58,530 మామూలుగా అయితే, ఆసుపత్రి వారే చెప్తారు, 510 00:28:58,614 --> 00:29:00,282 కానీ అక్కడ వాళ్లకి తీరికే లేదు, 511 00:29:00,365 --> 00:29:04,203 అదీగాక అతని వద్ద పాస్ పోర్ట్ కానీ లైసెన్స్ కానీ లేదు. 512 00:29:04,286 --> 00:29:06,038 సరే. అలాగే. 513 00:29:06,121 --> 00:29:09,249 సరే. నాకు ఇంకే విషయమైనా తెలిస్తే, నీకు చెప్తానులే. 514 00:29:09,833 --> 00:29:10,959 -ధన్యవాదాలు, క్లే. -పర్వాలేదు. 515 00:29:19,176 --> 00:29:21,970 అయితే, మనం దీన్ని రిపోర్ట్ చేసే ముందు మనకు ఇంకో నిర్ధారణ అవసరం. 516 00:29:24,014 --> 00:29:25,057 సరే. 517 00:29:28,268 --> 00:29:29,937 కాపీని నేనే రాస్తాను. 518 00:29:36,818 --> 00:29:39,446 మన్నించు. నన్ను మన్నించు, కాస్త తల తిరుగుతున్నట్టుగా ఉంటే 519 00:29:39,530 --> 00:29:41,490 కాసేపటికి ఊరికే అలా పడుకున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. 520 00:29:41,573 --> 00:29:43,408 సరేలే. ఎక్కడికీ వెళ్లవద్దు. నేను నీతో మాట్లాడాలి. 521 00:29:43,492 --> 00:29:45,536 పర్వాలేదు, మియా. మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, 522 00:29:46,161 --> 00:29:47,621 ఇప్పుడు కాస్త తగాదాలు పక్కన పెడదామా? 523 00:29:48,205 --> 00:29:49,373 సరే. 524 00:29:56,672 --> 00:29:58,006 నిన్న జరిగినదానికి నన్ను మన్నించు. 525 00:29:59,800 --> 00:30:01,593 నిన్న అంతా పిచ్చిపిచ్చిగా ఉండిందిలే. 526 00:30:01,677 --> 00:30:04,680 ఈ పని అంటేనే పిచ్చిపిచ్చిగా ఉంటుంది. జీవితం కూడా అలాగే ఉంటుంది. 527 00:30:06,223 --> 00:30:08,058 నువ్వు వాళ్ల చేతిలో కీలుబొమ్మవని నీకు తెలిసినా, 528 00:30:08,141 --> 00:30:09,810 తెలియనట్టు నటిస్తూ జీవించాలంతే. 529 00:30:09,893 --> 00:30:12,521 నువ్వు, అంటే... ఆఫీసులో ఒకడికి నువ్వంటే ఇష్టమని అనుకుంటావు. 530 00:30:12,604 --> 00:30:15,482 నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్నాడని అనుకొని, అది నీకు చాలు అనుకుంటావు. 531 00:30:15,566 --> 00:30:18,193 ఆ ఇష్టంతో నువ్వు అతనికి భార్య, పిల్లలు ఉన్నారని కూడా మర్చిపోతావు. 532 00:30:18,277 --> 00:30:19,945 నిన్ను నువ్వు తిట్టుకొనే రోజు వచ్చే దాకా అలానే చేస్తావు. 533 00:30:20,028 --> 00:30:22,573 ఆ తర్వాత నీకు నువ్వే కథలు చెప్పుకుంటూ ఉంటావు, చివరికి అవే నిజమనే భ్రమపడిపోతావు. 534 00:30:22,656 --> 00:30:24,575 ఎందుకో తెలుసా? అవి నిజమే ఏమో అని నువ్వు అనుకుంటావు. 535 00:30:26,159 --> 00:30:27,244 ఆ తర్వాత అది ముగిసిపోతుంది. 536 00:30:29,204 --> 00:30:30,539 అతనొక చిల్లరగాడని తెలుస్తుంది. 537 00:30:30,622 --> 00:30:32,457 అతనొక వెధవలా ప్రవర్తిస్తాడు, కానీ నువ్వు... 538 00:30:33,458 --> 00:30:35,252 నువ్వు ఓపిగ్గా ఉంటావు, అవన్నీ మర్చిపోతావు. 539 00:30:35,335 --> 00:30:38,088 ఆ తర్వాత నువ్వు కలలు కన్న పదవి నీకు దక్కుతుంది. 540 00:30:40,174 --> 00:30:43,594 ఆ తర్వాత వాళ్లొక పుస్తకం ప్రచురించి, అతను నిన్ను నిన్నుగా ప్రేమించలేదని చెప్తారు, 541 00:30:45,095 --> 00:30:46,471 కానీ నువ్వు వాళ్ళని నమ్మవు. 542 00:30:47,764 --> 00:30:51,185 ఎందుకంటే, వాళ్లని నమ్మితే, నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టే. 543 00:30:53,437 --> 00:30:55,856 ఆ తర్వాత, వాళ్లు నిన్ను కూడా ఇతర మహిళలతో పాటు జతకట్టేస్తారు. 544 00:30:56,440 --> 00:30:58,984 ఈ ఇతర మహిళలందరూ కూడా ఆ హృదయం లేని 545 00:30:59,067 --> 00:31:03,447 కామాంధుడి బారిన నిజంగా పడిన వాళ్ళే. 546 00:31:04,531 --> 00:31:06,283 మరి నీకు దక్కిన ఆ పదవి, అది నీకు దక్కడానికి కారణమేంటి? 547 00:31:06,366 --> 00:31:08,911 అతని బారిన పడినదానికి ప్రతిఫలంగా వచ్చిందా? కానీ అదేం లేదే. 548 00:31:11,330 --> 00:31:12,789 నువ్వు కేవలం ఉంచుకున్నదానివే. 549 00:31:15,667 --> 00:31:17,127 మిట్చ్ నాశనమైపోను. 550 00:31:17,211 --> 00:31:19,922 నువ్వు ఈ పరిస్థితిలోకి రావడానికి కారణమైన ఆ దరిద్రుడు నాశనమైపోను. 551 00:31:20,422 --> 00:31:23,050 మగాళ్లందరూ నాశనమైపోవాలి. వాళ్లు మన జీవితాలను నాశనం చేసేస్తారు. 552 00:31:23,592 --> 00:31:24,843 అందరూ నాశనమైపోవాలి. 553 00:31:27,221 --> 00:31:29,515 అదే ఆలోచనలో నేను నిన్నంతా ఉన్నాను, ఆ చిరాకే నీ మీద చూపాను. 554 00:31:29,598 --> 00:31:30,849 నన్ను మన్నించు. 555 00:31:32,601 --> 00:31:36,438 ఎందుకంటే, అతని నిజస్వరూపం ఏంటో నాకు తెలుసనుకున్నా, ఆ పుస్తకం అలా చూపలేదు. 556 00:31:36,980 --> 00:31:38,690 కానీ అతను చనిపోయాడు. 557 00:31:40,150 --> 00:31:42,444 ఓరి దేవుడా. నాకు చాలా బాధగా ఉంది. 558 00:31:43,320 --> 00:31:44,571 చాలా బాధగా ఉంది. 559 00:31:50,661 --> 00:31:54,081 ఇప్పుడు నేను భావావేశాలన్నింటినీ పక్కన పెట్టేసి, అతని గురించి రెండే నిమిషాల... 560 00:31:55,457 --> 00:31:57,042 ఒక కథనం రాయాలి. 561 00:31:58,085 --> 00:32:00,587 అవును, నాకు ఆమె పాస్వర్డ్స్ తెలుసు. 562 00:32:01,421 --> 00:32:04,216 కానీ తనకి అవి గుర్తుండవు కనుకే నేను వాటిని గుర్తుంచుకున్నా. 563 00:32:04,299 --> 00:32:08,428 నేను తన ఈమెయిల్ ని ఎప్పటికీ చూడను. ఆ పని చేయలేను. 564 00:32:08,512 --> 00:32:13,308 అంటే, తనకి ఆ విషయం తెలిస్తే, తను కనిపెడితే, నా ఉద్యోగం పోతుంది. 565 00:32:13,392 --> 00:32:15,686 అంటే, తనకి చాలా కోపం వస్తుంది, ఇంకా... 566 00:32:15,769 --> 00:32:17,312 తను చనిపోయిందేమో అని అనుమానంగా ఉంది. 567 00:32:19,273 --> 00:32:20,649 తనేమీ చనిపోలేదు. 568 00:32:20,732 --> 00:32:22,025 తనతో నువ్వు మాట్లాడావా? 569 00:32:22,776 --> 00:32:24,945 ఎందుకంటే, తను ఇటలీకి వెళ్లిందన్న విషయం మాకు తెలుసు. 570 00:32:25,487 --> 00:32:26,488 ఇటలీ? 571 00:32:26,572 --> 00:32:29,950 ఇంకా మిట్చ్ కారు ప్రమాదం వల్ల చనిపోయాడని మాకు తెలిసింది. 572 00:32:30,492 --> 00:32:32,536 అతనితో పాటు ఓ మహిళ ఉందని కూడా మాకు తెలిసింది. 573 00:32:34,621 --> 00:32:35,664 బాబోయ్. 574 00:32:37,833 --> 00:32:38,917 హేయ్. 575 00:32:39,501 --> 00:32:41,044 ఆలెక్స్ అర్థం చేసుకుంటుంది. 576 00:32:42,296 --> 00:32:43,755 తప్పకుండా అర్థం చేసుకుంటుంది. 577 00:32:43,839 --> 00:32:47,593 ఏదో ఆలోచించే, పని మీదే తను అక్కడికి వెళ్లి ఉంటుంది, కదా? 578 00:32:48,594 --> 00:32:51,305 మనందరికీ ఇందులో భాగముంది. తను అర్థం చేసుకోగలదు. 579 00:32:52,431 --> 00:32:53,473 ఒకవేళ తను బతికే ఉంటే. 580 00:33:00,189 --> 00:33:02,232 ఇదుగో. ఇది ఉపయోగకరం కావచ్చు. 581 00:33:02,733 --> 00:33:06,069 తను టీటర్బోరోకు విమానం బుక్ చేసుకుంది. ఇంకో అరగంటలో అది చేరుకుంటుంది. 582 00:33:06,153 --> 00:33:08,197 ధన్యవాదాలు. తను ఆ విమానంలోనే ఉందని ఆశిద్దాం. 583 00:33:08,280 --> 00:33:09,740 ఓరి దేవుడా. భగవంతుడా. 584 00:33:09,823 --> 00:33:11,742 జనాలకు తను ఎక్కడికి వెళ్లిందో తెలిసిపోతుంది. 585 00:33:13,493 --> 00:33:14,870 అవును. ఇప్పుడు మనమేం చేయాలి? 586 00:33:14,953 --> 00:33:16,747 నాకు తెలీదు. అదే కదా అందులో గమ్మత్తైన విషయం. త్వరగా వెళ్ళు. 587 00:33:22,127 --> 00:33:23,128 మన్నించు. 588 00:33:24,463 --> 00:33:25,672 సరే మరి. 589 00:33:27,883 --> 00:33:28,926 సరే. 590 00:33:29,009 --> 00:33:30,093 కైల్. 591 00:33:30,177 --> 00:33:33,472 ఎన్.సీ.ఈ.ఎస్ ప్రకారం, 2017లో, పన్నెండు నుండి 18 ఏళ్ళ మధ్య ఉండే 592 00:33:33,555 --> 00:33:38,727 అమెరికన్ విద్యార్థుల్లో ప్రతి అయిదుగురిలో ఒకరు బడిలో దౌర్జన్యానికి గురయ్యారు. 593 00:33:38,810 --> 00:33:40,103 ఆ సంఖ్యను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది కదా. 594 00:33:40,187 --> 00:33:44,650 -ఇరవై శాతమా? పిల్లలు ఎంత క్రూరులో. -అది నిజంగా హృదయాన్ని కలచివేస్తోంది. 595 00:33:44,733 --> 00:33:46,818 కానీ పిల్లలో అసాధారణమైన, ధైర్యవంతులు కూడా ఉన్నారు... 596 00:33:46,902 --> 00:33:48,570 బ్రాడ్లీ, నువ్వు హాల్ వేకి రావాలి. 597 00:33:48,654 --> 00:33:50,364 నీ తమ్ముడు వచ్చాడు. పరిస్థితి దారుణంగా ఉంది. 598 00:33:50,906 --> 00:33:52,908 నువ్వు వాళ్లలో ఒకరితో మాట్లాడావు కదా, బ్రాడ్లీ? 599 00:33:52,991 --> 00:33:54,117 అది నిజమే. 600 00:33:54,201 --> 00:33:56,662 ఈ నెల ఆరంభంలో, నేను ఒక పిల్లవాడైన లీ బావర్ ని కలిశాను. 601 00:33:56,745 --> 00:34:00,249 అతను దౌర్జన్యాలని భరింలేకపోయాడని నాతో అన్నాడు. 602 00:34:00,332 --> 00:34:02,960 దానికి అతను ఏం చేశాడు అనేది మనం గమనించవలసిన అంశం. 603 00:34:03,752 --> 00:34:05,128 ఇప్పుడు షూటింగ్ కి విరామం. 604 00:34:09,466 --> 00:34:14,638 ఎక్కడైతే న్యూ యోర్క్ లో శీతాకాలం నాకు వెచ్చగా ఉంటుందో 605 00:34:15,138 --> 00:34:17,099 నన్ను ముందుకు నడిపిస్తోందో 606 00:34:17,181 --> 00:34:19,434 హేయ్, చూడు. తను నా అక్క. 607 00:34:19,518 --> 00:34:21,018 -హేయ్. -చూశావా? 608 00:34:21,103 --> 00:34:24,313 -బ్రాడ్లీ, నువ్వు నా అక్కవని తనకి చెప్పు. -హాల్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? 609 00:34:24,398 --> 00:34:27,609 -నిన్ను చూడటానికే వచ్చాను. హేయ్, బంగారం. -సరే. అలాగే. 610 00:34:28,110 --> 00:34:29,110 సరే. 611 00:34:29,194 --> 00:34:30,779 నాకేమీ పర్వాలేదు. ఇతను నా తమ్ముడే. ఇది... 612 00:34:30,862 --> 00:34:32,697 -నీకేమీ పర్వాలేదంటావా? -అవును, పర్వాలేదు. ధన్యవాదాలు, జింబో. 613 00:34:32,781 --> 00:34:35,117 అవును. నేను ఇంత దూరం ప్రయాణించి న్యూ యోర్క్ కి వస్తే, నువ్వు కనీసం... 614 00:34:35,199 --> 00:34:37,202 -సరే. నువ్వు ఇక బయలుదేరు. -...నీ ఆఫిసుకు నన్ను పిలవలేదే? 615 00:34:37,286 --> 00:34:39,621 -సరేనా? నేను పనిలో ఉన్నాను. -ఎందుకు? నేను... 616 00:34:39,705 --> 00:34:42,791 నన్ను... నన్ను చూస్తే నీకు నాన్న గుర్తొస్తున్నాడా ఏంటి? 617 00:34:43,292 --> 00:34:45,752 -ఏంటి? -నువ్వు నన్ను చూసి సిగ్గు పడుతున్నావు. 618 00:34:45,835 --> 00:34:47,754 -అది బాధగా ఉంటుంది, బ్రాడ్లీ. -సరే, చూడు... 619 00:34:47,838 --> 00:34:50,549 -అంతా బాగానే ఉందా? -బాగానే ఉంది, రీన, నువ్వు వెళ్లులే. 620 00:34:50,632 --> 00:34:51,925 నిజంగానే. ఇవాళ వీడి పరిస్థితి అంత బాగా లేదు. 621 00:34:52,009 --> 00:34:53,260 -నన్ను వెళ్లిపొమ్మంటున్నావు కదా. -పద. 622 00:34:53,342 --> 00:34:54,844 నువ్వు వెళ్లిపోనక్కర్లేదు, కానీ కాస్త కాఫీ తాగుదువురా. 623 00:34:54,928 --> 00:34:57,681 -అర్థమైందా? కూర్చో. -నేను కాఫీ తాగుతా. కాఫీ మంచిదే. 624 00:34:57,764 --> 00:35:00,767 ఏడవ అవెన్యూలోని వేశ్యలు గోలగోల చేశారు 625 00:35:00,851 --> 00:35:02,394 నువ్వు శబ్దం చేయకూడదు, హాల్. 626 00:35:02,477 --> 00:35:06,398 ఎందుకు? ఇది టీవీ స్టేషనే కదా. నీలాగే నా ప్రతిభ కూడా తెలుస్తుంది. 627 00:35:06,481 --> 00:35:08,400 నా శీతాకాల దుస్తులను సర్దుకుంటున్నాను 628 00:35:08,483 --> 00:35:09,985 నువ్వు నోర్మూసుకొని ఉండాలి. 629 00:35:10,736 --> 00:35:12,154 ఎందుకు? 630 00:35:12,237 --> 00:35:14,281 ఎందుకంటే, నిన్న రాత్రి మిట్చ్ కెస్లర్ చనిపోయారని ఇక్కడ అనుకుంటున్నారు. 631 00:35:21,705 --> 00:35:26,877 నేను కేవలం ఒక పేదింటి పిల్లాడిని నా గాథకు ఆదరణకు తక్కువేలే 632 00:35:26,960 --> 00:35:28,253 హాల్, నువ్వేం చేస్తున్నావు? 633 00:35:29,421 --> 00:35:31,715 హేయ్, బ్రాడ్లీ, నువ్వు వస్తున్నావా? 634 00:35:33,091 --> 00:35:35,719 ఓరి దేవుడా. తనే నీ ప్రేయసి. 635 00:35:38,472 --> 00:35:39,848 దయచేసి ఇక్కడ ఇలా ప్రవర్తించకు. 636 00:35:39,932 --> 00:35:42,100 నువ్వు వెళ్లిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఇలా చేయకు. 637 00:35:43,393 --> 00:35:44,937 హేయ్, బ్రాడ్లీ. 638 00:35:45,020 --> 00:35:46,104 ఏంటి? 639 00:35:46,188 --> 00:35:47,981 మిట్చ్ కెస్లర్ ఆత్మహత్య చేసుకున్నాడా? 640 00:35:48,690 --> 00:35:50,150 లేదు, కారు ప్రమాదం జరిగింది. 641 00:35:51,693 --> 00:35:52,903 ఆ ప్రమాదంలో అతని వల్ల ఎవరైనా చనిపోయారా? 642 00:35:53,529 --> 00:35:54,821 హాల్, నాకు తెలీదు. 643 00:35:56,281 --> 00:35:58,242 అంటే... హాయ్. 644 00:35:58,867 --> 00:36:00,494 మా నాన్న, 645 00:36:00,577 --> 00:36:03,789 తాగుతూ నడిపి ఒక పిల్లాడిని చంపేశాడు. 646 00:36:03,872 --> 00:36:05,958 మేము కూడా కారులోనే ఉన్నాం. 647 00:36:06,041 --> 00:36:08,252 ఓరి దేవుడా. ఒరేయ్ దరిద్రుడా. 648 00:36:08,335 --> 00:36:10,337 -ఏంటి? ఏంటి? -ఎందుకు ఇలా చేస్తున్నావు? 649 00:36:10,420 --> 00:36:12,005 చూడు, నువ్వు... నువ్వు ప్రతీసారి ఇలాగే ప్రవర్తిస్తావు. 650 00:36:12,089 --> 00:36:13,882 -ఏదో పట్టించుకుంటున్నట్టు ప్రవర్తిస్తావు. -హాల్, వెళ్లిపో. 651 00:36:13,966 --> 00:36:15,342 -నువ్వు వినట్లేదు. -వెంటనే వెళ్లిపో! 652 00:36:15,425 --> 00:36:17,594 -నువ్వు నన్ను చావమని వదిలేశావు. లేదు. -నువ్వు బయలుదేరు. 653 00:36:17,678 --> 00:36:18,971 ఏవేవో ప్రాంతాల కోసం వెతుకుతున్నా... 654 00:36:19,054 --> 00:36:20,222 హేయ్! 655 00:36:20,305 --> 00:36:21,390 సెక్యూరిటీకి కాల్ చేయ్. 656 00:36:38,907 --> 00:36:41,660 హేయ్. నన్ను తాకకు. 657 00:36:47,416 --> 00:36:49,835 లేదు, నన్ను వదులు. 658 00:36:49,918 --> 00:36:52,713 వద్దు. వద్దు! వద్దు. 659 00:36:53,463 --> 00:36:56,884 బ్రాడ్. బ్రాడ్. బ్రాడ్లీ! వద్దు. 660 00:36:56,967 --> 00:37:00,429 హేయ్! బ్రాడ్లీ! నన్ను కాపాడు! నన్ను కాపాడు. 661 00:37:00,512 --> 00:37:02,848 నన్ను కాపాడు. బ్రాడ్. 662 00:37:02,931 --> 00:37:04,725 బ్రాడ్, దయచేసి నన్ను... దయచేసి. 663 00:37:04,808 --> 00:37:07,477 బ్రాడ్లీ, నన్ను మన్నించు. నన్ను... క్షమించు. 664 00:37:07,561 --> 00:37:08,562 కాపాడు! 665 00:37:09,062 --> 00:37:10,063 నన్ను కాపాడు! 666 00:37:52,272 --> 00:37:55,067 -ఏం కాలేదు. ఏం కాలేదు. -నేను బయటకు రాలేను. 667 00:37:55,150 --> 00:37:57,194 లేదు, నువ్వు వెళ్లగలవు. వెళ్లగలవు. 668 00:37:58,445 --> 00:37:59,821 ఏమీ పర్వాలేదు. 669 00:38:00,531 --> 00:38:02,741 జనాలు నీ గురించి ఏవేవో అనుకోవడం తప్పకుండా బాధిస్తుంది, కానీ అది నిన్ను చంపేయదు కదా. 670 00:38:02,824 --> 00:38:06,662 నాకేం చేయాలో తెలియట్లేదు. నేనేమైనా చెడ్డ మనిషినా? 671 00:38:06,745 --> 00:38:08,956 లేదు, లేదు. 672 00:38:10,374 --> 00:38:13,168 కానీ నువ్వు నీ జీవితాన్ని నిష్కర్షగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. 673 00:38:14,044 --> 00:38:17,673 నువ్వు అలా తప్పనిసరిగా చేయాలి, బ్రాడ్లీ. సరేనా? 674 00:38:17,756 --> 00:38:18,757 సరే. 675 00:38:20,217 --> 00:38:21,510 ఎప్పుడైనా మానసిక చికిత్స తీసుకున్నావా? 676 00:38:26,390 --> 00:38:28,308 నాకు పిచ్చి అనుకుంటారేమో భయం. 677 00:38:28,892 --> 00:38:29,935 నువ్వు పిచ్చిదానివేమీ కాదు. 678 00:38:30,018 --> 00:38:31,520 -కాదా? -కాదు. 679 00:38:31,603 --> 00:38:37,067 చిన్నప్పుడు ఒక పిచ్చి వాతావరణంలో మనుగడ సాగించడమెలాగో నువ్వు తెలుసుకున్నావు. 680 00:38:38,068 --> 00:38:39,862 కానీ అది నీకు ఇక్కడ సహాయపడటం లేదు. 681 00:38:39,945 --> 00:38:43,574 ఓరి దేవుడా. నా కుటుంబం నన్ను బాగా నాశనం చేసింది. 682 00:38:44,950 --> 00:38:48,370 వాళ్ల మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ నేను వాళ్లని సరిచేయలేను. 683 00:38:48,453 --> 00:38:51,874 సరే. అయితే వాళ్లకి నువ్వు దూరంగా ఉండాల్సిన సమయం వచ్చిందేమో. 684 00:38:53,792 --> 00:38:56,295 నేను హాల్ ని ఇంటికి పంపే ప్రయత్నం చేశాను. 685 00:38:56,378 --> 00:38:58,422 ఆ తర్వాత అతను వచ్చి నిన్ను మళ్లీ ఇబ్బంది పెట్టాడు కదా? 686 00:38:58,505 --> 00:39:00,424 అతను పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, కానీ అది తన తప్పు కాదు. 687 00:39:00,507 --> 00:39:03,302 అతనికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, అమ్మానాన్నలు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. 688 00:39:03,385 --> 00:39:05,345 మా అమ్మానాన్నను చాలా దారుణమైన మనుషులు. 689 00:39:05,429 --> 00:39:07,181 బ్రాడ్లీ, నా మాట విను. 690 00:39:09,558 --> 00:39:11,935 ఇది నీ తప్పు కాదని నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకోగలను. 691 00:39:13,437 --> 00:39:15,230 కానీ ఒక సమయం వచ్చేసరికి, 692 00:39:15,314 --> 00:39:18,483 అతను ఎందుకలా ఉన్నాడో అనేది అప్రస్తుతం అయిపోతుంది. 693 00:39:18,567 --> 00:39:22,404 అతను నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడని, అతనికి మారడం 694 00:39:22,487 --> 00:39:25,616 ఇష్టం లేదనే విషయాన్నే మనం గమనించాలి. 695 00:39:25,699 --> 00:39:27,284 నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. 696 00:39:27,951 --> 00:39:31,622 కదా? నీకు ఏది సరైనది? దాని గురించి ఆలోచించు. 697 00:39:35,000 --> 00:39:39,046 చూడు, నేను కూడా మా కుటుంబం నుండి దూరంగా వచ్చేశాను. అది తేలికైన విషయం కాదు. 698 00:39:39,129 --> 00:39:40,214 నువ్వు మీ కుటుంబాన్ని వదిలేశావా? 699 00:39:41,465 --> 00:39:42,925 కానీ అలా చేయకపోతే, నీకు మరింత కష్టంగా ఉంటుంది. 700 00:39:43,008 --> 00:39:44,468 ఓరి దేవుడా. 701 00:39:45,344 --> 00:39:48,555 నా తమ్ముడిని వదిలేయాలనే ఆలోచననే నేను ఊహించుకోలేకపోతున్నా. 702 00:39:48,639 --> 00:39:50,474 నేను వాడిని వదిలేయలేను. 703 00:39:50,557 --> 00:39:55,354 సరే, అతనికి మారాలనుంటే, నువ్వు అతడిని పునరావాసంలో చేర్చవచ్చు. 704 00:39:57,189 --> 00:39:59,274 కానీ నిజంగా, నిజంగా చెప్తున్నా, బంగారం, 705 00:40:00,317 --> 00:40:02,110 నువ్వు వదిలేయాలని నాకు అనిపిస్తోంది. 706 00:40:05,697 --> 00:40:06,907 ఇది నీ జీవితం, బ్రాడ్లీ. 707 00:40:06,990 --> 00:40:09,034 ఇది నీది. అతనిది కాదు. 708 00:40:49,116 --> 00:40:50,117 హేయ్. 709 00:40:52,452 --> 00:40:53,662 నీకేమీ కాలేదులే. 710 00:40:55,706 --> 00:40:59,459 -హేయ్, ఎందుకు ఏడుస్తున్నావు? -నువ్వు నా కోసం వచ్చినందుకు ఆనందంగా ఉంది. 711 00:41:02,546 --> 00:41:03,714 నువ్వు నా కోసం వచ్చినందుకు ఆనందంగా ఉంది. 712 00:41:04,882 --> 00:41:06,258 నీ గురించి నేను చాలా కంగారుపడ్డాను. 713 00:41:10,554 --> 00:41:13,223 చూడు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. 714 00:41:14,266 --> 00:41:15,267 ఏంటి? 715 00:41:21,565 --> 00:41:22,983 మిట్చ్ చనిపోయాడని అనుకుంటున్నాం. 716 00:41:28,697 --> 00:41:31,491 లేదు, నేను... లేదు. 717 00:41:32,075 --> 00:41:33,535 ఇప్పటిదాకా నేను అతనితోనే ఉన్నాను. 718 00:41:33,619 --> 00:41:35,120 -నాకు తెలుసు. -నేను అతనితోనే ఉన్నాను. 719 00:41:35,204 --> 00:41:37,122 నన్ను క్షమించు. 720 00:41:37,206 --> 00:41:39,249 లేదు, లేదు, లేదు, లేదు. 721 00:41:39,333 --> 00:41:40,584 -ఏమీ కాలేదు. -లేదు, లేదు. 722 00:41:40,667 --> 00:41:42,920 -ముందు కారు ఎక్కుదువు పద... -లేదు, లేదు, లేదు, లేదు... 723 00:41:43,003 --> 00:41:44,630 -నాకు చాలా బాధగా ఉంది. నాకు... -లేదు, లేదు. 724 00:41:44,713 --> 00:41:47,466 -అతను కారు ప్రమాదంలో చనిపోయాడు. -లేదు, లేదు. దేవుడా... కారు ప్రమాదమా? 725 00:41:47,549 --> 00:41:50,594 అవును, కారు ప్రమాదం. ఆ విషయాన్ని నీ చేత రిపోర్ట్ చేయించాలని నెట్వర్క్ ఆలోచన. 726 00:41:50,677 --> 00:41:53,889 కాబట్టి... ఏం కాలేదులే. అది... 727 00:41:53,972 --> 00:41:56,475 చూడు, వాళ్లు రెండవ నిర్ధారణ కోసం చూస్తున్నారు. 728 00:41:56,558 --> 00:41:58,143 అతని వద్ద ఐడీ లేదట. 729 00:41:58,227 --> 00:41:59,228 -కాబట్టి... -లేదు, లేదు. 730 00:41:59,311 --> 00:42:01,355 -ఇప్పుడు ఇటలీ తీవ్ర సంక్షోభంలో ఉంది. -అవును, కానీ... 731 00:42:01,438 --> 00:42:04,775 కానీ అతనితో ఎవరూ లేరు. కాబట్టి నిర్ధారించడానికి ఎవరూ లేరు. 732 00:42:04,858 --> 00:42:06,527 -నీ ఫోన్ ఇలా ఇవ్వు. -ఏంటి? 733 00:42:06,610 --> 00:42:08,070 -నీ ఫోన్ ఇవ్వు. -ఏంటి? 734 00:42:08,153 --> 00:42:10,781 -నీ ఫోన్ ఇవ్వు. -ఏంటి? ఇదుగో. ఇదుగో. 735 00:42:18,747 --> 00:42:19,998 ఫైడో. 736 00:42:32,845 --> 00:42:33,929 హలో. 737 00:42:34,680 --> 00:42:37,432 పాలా. నేను ఆలెక్స్ లెవీని. 738 00:42:48,527 --> 00:42:50,863 నన్ను క్షమించు, ఆలెక్స్. అతను చనిపోయాడు. 739 00:42:59,872 --> 00:43:01,206 నువ్వు కూడా అతనితోనే ఉన్నావా? 740 00:43:01,290 --> 00:43:03,166 కారులో లేను. నేను... 741 00:43:05,627 --> 00:43:06,628 తర్వాత చూశాను. 742 00:43:08,338 --> 00:43:09,423 ఆసుపత్రిలో. 743 00:43:09,923 --> 00:43:11,216 అతడిని గుర్తించాను. 744 00:43:12,634 --> 00:43:15,387 నాకు చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. 745 00:43:16,555 --> 00:43:17,764 నాకు కూడా. 746 00:43:19,933 --> 00:43:20,934 ఆలెక్స్... 747 00:43:22,561 --> 00:43:24,104 అతనికి నువ్వంటే చాలా ఇష్టం. 748 00:43:26,106 --> 00:43:27,232 ఉంటాను. 749 00:44:14,196 --> 00:44:16,949 ఈ విషయం పేయిజ్ కి తెలుసా? పిల్లలకి తెలుసా? 750 00:44:17,032 --> 00:44:18,659 తెలీదనుకుంట. లేదు. 751 00:44:19,451 --> 00:44:20,619 ఆమెకి నేనే చెప్పాలి. 752 00:44:21,286 --> 00:44:22,829 నువ్వు వాళ్లకి కాల్ చేయాలనుకుంటున్నావా? 753 00:44:24,748 --> 00:44:28,502 లేదు. నేను నేరుగా కలిసి చెప్పాలి. 754 00:44:28,585 --> 00:44:30,379 అదే సముచితమైన పని. 755 00:44:30,963 --> 00:44:33,632 అయితే, స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అడుగుతున్నా, ఆఫీసుకు కాకుండా ఇప్పుడు... 756 00:44:34,216 --> 00:44:35,926 ఇప్పటికిప్పుడే, అవును. అవును. 757 00:44:36,009 --> 00:44:37,052 సరే. 758 00:44:37,636 --> 00:44:41,181 అతనంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా తనకి చెప్తే బాగుంటుంది, ఏమంటావు? 759 00:44:42,307 --> 00:44:46,603 ...తదుపరి భాగం టై లేకుండా టైస్ ట్రెండ్స్. 760 00:44:46,687 --> 00:44:48,689 కనుక, మనం ఒకరి తర్వాత మరొకరం చదువుదామా... 761 00:44:48,772 --> 00:44:50,107 అంతే. 762 00:44:50,190 --> 00:44:52,860 ఎక్కడ ఉన్నావు? ఆలెక్స్ ని నువ్వు ఒక గంట క్రితమే ఇక్కడికి తెచ్చి ఉండాల్సింది. 763 00:44:52,943 --> 00:44:54,069 మియా, హాయ్. 764 00:44:55,028 --> 00:44:58,615 నేను ఇప్పుడు అక్కడికి రాట్లేదు, ఇది కేవలం నా నిర్ణయమే, సరేనా? 765 00:45:00,450 --> 00:45:01,702 కానీ నేను... 766 00:45:02,786 --> 00:45:04,538 నేను రెండవ ధృవీకరణ ఇస్తున్నాను. 767 00:45:09,293 --> 00:45:12,588 కనుక మేమే నేరుగా వెళ్లి పేయిజ్ కి ఈ విషయం చెప్తాం, సరేనా? 768 00:45:14,715 --> 00:45:18,218 మన్నించాలి, మనం మొదటి రెండు గంటల్లో దీన్ని ప్రసారం చేసే అవకాశం ఉండకపోవచ్చు, 769 00:45:18,302 --> 00:45:20,179 కానీ పేయిజ్ కి తెలిశాక, మేము మీకు చెప్తాం, 770 00:45:20,262 --> 00:45:22,139 అప్పుడు మీరు ప్రసారం చేయవచ్చు, సరేనా? 771 00:45:23,140 --> 00:45:24,683 ఆలెక్స్, ఈ పని నువ్వే చేయాల్సిన అవసరం లేదు. 772 00:45:24,766 --> 00:45:27,603 సర్లే. నేను త్వరలోనే నిన్ను కలుసుకుంటాను. 773 00:45:28,187 --> 00:45:29,188 ఫోన్ పెట్టేయ్. 774 00:45:29,855 --> 00:45:30,981 ధన్యవాదాలు, మియా. 775 00:45:33,066 --> 00:45:34,318 నాకు నిన్ను చూస్తే గర్వంగా ఉంది. 776 00:45:35,569 --> 00:45:36,653 దేవుడా. 777 00:45:38,530 --> 00:45:43,327 నువ్వు ఎన్ని మేసేజ్లు... దేవుడా. నువ్వు ఎన్ని మెసేజ్లు... 778 00:45:48,498 --> 00:45:49,833 ఏదైనా సమస్యనా? 779 00:45:50,542 --> 00:45:52,920 -ఇది మ్యాగీ పుస్తకం గురించా? -లేదు, లేదు, నేను... 780 00:45:53,003 --> 00:45:54,505 -ఏంటి? -నేను నీ గురించి కంగారుపడిపోయానంతే. 781 00:45:54,588 --> 00:45:55,881 అంతే. 782 00:45:55,964 --> 00:45:57,925 -ఏంటి? -నేను కంగారుపడిపోయాను. పర్వాలేదులే. 783 00:45:59,092 --> 00:46:02,429 ఇప్పుడు నువ్వు క్షేమంగానే ఉన్నావు కనుక, వాటిని తొలగించేయ్, ఎందుకంటే... 784 00:46:02,513 --> 00:46:05,516 -పనికిమాలినదానా! -అది, నువ్వు వాటిని... 785 00:46:05,599 --> 00:46:06,808 నువ్వు వినాల్సిన పని లేదు... ఇలా ఇవ్వు. 786 00:46:06,892 --> 00:46:08,560 ఆ మెసేజ్ వినకు. దాన్ని వినకు... 787 00:46:08,644 --> 00:46:10,812 వద్దు, వద్దు, వద్దు. ఓరి దేవుడా. 788 00:46:10,896 --> 00:46:12,606 దయచేసి చెప్పేది విను, ఆలెక్స్, వాటిని వినవద్దు. 789 00:46:12,689 --> 00:46:14,191 -నేను... వినకు. -ఓరి దేవుడా. 790 00:46:14,274 --> 00:46:16,693 నాకు అప్పుడు చాలా కోపంగా ఉండింది, దాంతో... 791 00:46:16,777 --> 00:46:18,487 -నాకు పిచ్చెక్కిపోయింది... -ఓరి నాయనోయ్. 792 00:46:18,570 --> 00:46:23,033 దేవుడా. నన్ను క్షమించు. నేను అనాలనేమీ అనలేదు. కావాలని అనలేదు. 793 00:46:23,116 --> 00:46:25,160 నేను అలా కావాలని అనలేదు. 794 00:46:25,244 --> 00:46:26,495 ...బాగా అమానుషంగా ప్రవర్తించారనే... 795 00:46:26,578 --> 00:46:28,872 -ఆలెక్స్, ఆలెక్స్, విను. దయచేసి. -...తప్పుడు ఆలోచనతో ఉన్నారు కాబట్టి... 796 00:46:28,956 --> 00:46:31,250 దీన్ని దయచేసి వినకు. దయచేసి ఆపేయ్. నిజంగానే అంటున్నా. 797 00:46:31,333 --> 00:46:33,210 -ఆపేయ్! -ఇది సరైన సమయం కాదు. 798 00:46:33,293 --> 00:46:35,337 -దయచేసి ఆపేయ్! -ఇది సరైన సమయం కాదు. 799 00:46:35,420 --> 00:46:36,922 నన్ను క్షమించు. మన్నించు. 800 00:46:37,005 --> 00:46:40,008 మనిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి, ఇప్పుడు వాటిని మనం పక్కన పెట్టేశాం. 801 00:46:40,092 --> 00:46:41,844 -అవునా? దేవుడా. తెలుసుకోవడం మంచిదైంది. -నేను వాటిని పట్టించుకోవట్లేదు. 802 00:46:41,927 --> 00:46:44,221 -మనిద్దరి మధ్య... -ఆలెక్స్, ఇప్పుడు మన మధ్య దూరం పెంచకు. 803 00:46:44,304 --> 00:46:46,014 -ఎట్టకేలకు, మనం మంచిగా ఉంటున్నాం, సరేనా? -దేవుడా. 804 00:46:46,098 --> 00:46:47,391 దయచేసి, కాస్త... 805 00:46:47,891 --> 00:46:51,562 ఇవాళ అస్సలు బాగాలేదు. 806 00:46:51,645 --> 00:46:55,274 నువ్వు చేసిన వాటన్నింటికీ నేను నిన్ను క్షమించేశానని... 807 00:46:55,357 --> 00:46:56,817 ఏంటి, క్షమించేశావా? 808 00:46:56,900 --> 00:46:59,528 ఏం చేశానని క్షమించేశావు? 809 00:46:59,611 --> 00:47:00,946 జోకులు వేస్తున్నావా? 810 00:47:01,029 --> 00:47:04,616 దేవుడా, నాకు ఇప్పుడు ఉండాల్సిన ఫీలింగ్స్ ని నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. 811 00:47:04,700 --> 00:47:06,535 నీ యెంకమ్మ! 812 00:47:06,618 --> 00:47:07,953 ఒక్క నిమిషం, నా మీద కోపం దేనికి? 813 00:47:08,036 --> 00:47:10,163 నువ్వు చేసిన వాటన్నింటినీ మర్చిపోయి, నిన్ను క్షమించబోతున్నా... 814 00:47:10,247 --> 00:47:12,749 -దేనికి? -దేనికా? దేనికా? 815 00:47:12,833 --> 00:47:13,876 అవును, దేనికి? 816 00:47:13,959 --> 00:47:15,127 చూద్దాం. చిట్టా విప్పి చూద్దాం. 817 00:47:15,210 --> 00:47:16,211 -సరే, చెప్తున్నా. -దేవుడా. 818 00:47:16,295 --> 00:47:17,546 -దేశాధ్యక్ష ఎన్నికల చర్చను... -దరిద్రుడా. 819 00:47:17,629 --> 00:47:19,047 ...మధ్యలో ఎగ్గొట్టినందుకు. 820 00:47:19,131 --> 00:47:21,550 ఆ తర్వాత, కరోనా విజృంభిస్తున్న 821 00:47:21,633 --> 00:47:24,469 -ఒక భయంకరమైన కామాంధుడిని కలిసేందుకు... -నోర్మూసుకో. 822 00:47:24,553 --> 00:47:26,555 ...ఇటలీకి చెక్కేసినందుకు. 823 00:47:26,638 --> 00:47:29,641 -నీకు అర్థం కాదు. అస్సలు కాదు. -నీకు వీపు నొప్పని నాతో అబద్ధమాడినందుకు. 824 00:47:29,725 --> 00:47:32,561 నేను మన వృత్తి జీవితాలను కాపాడే పనిలో ఉన్నాను. నేను పోతే, నువ్వు కూడా పోతావు. 825 00:47:32,644 --> 00:47:35,189 మన వృత్తి జీవితాలను కాపాడే పనిలో ఉన్నావా? ఎలా? నువ్వు ఎలా... 826 00:47:35,272 --> 00:47:37,941 -మిట్చ్ తో పడక పంచుకోవడం ద్వారానా? -నేనేమీ మిట్చ్ తో పడక పంచుకోలేదు. 827 00:47:38,025 --> 00:47:39,610 -మళ్లీనా? -ఓరి నాయనోయ్. 828 00:47:39,693 --> 00:47:41,278 నాకెలా తెలుస్తుంది? దేన్ని నమ్మాలో నాకెలా తెలుస్తుంది? 829 00:47:41,361 --> 00:47:43,197 -అసలు నాకు ఏదైనా ఎలా తెలుస్తుంది? -నీకు కుళ్ళుగా ఉందా? 830 00:47:43,280 --> 00:47:44,948 -అందుకేనా ఇలా చేస్తున్నావు? -అబ్బా! 831 00:47:45,032 --> 00:47:47,993 -నీ దురభిమానానికి ఓ అడ్డూఅదుపూ లేదు. -అయ్య బాబోయ్... 832 00:47:48,076 --> 00:47:52,706 నా జీవితాన్ని, మన జీవితాలను నాశనం చేసిన ఆ చచ్చిన దరిద్రుని చూసి కుళ్ళుకోవాలా? 833 00:47:52,789 --> 00:47:54,625 అవును, నాకు వాడిని చూసి కుళ్ళే. కుళ్ళే. 834 00:47:54,708 --> 00:47:56,752 -నాకు హిట్లర్ అన్నా కుళ్ళే. -నువ్వు అసలు మనిషివేనా? 835 00:47:56,835 --> 00:47:58,545 -దేవుడా! -భగవంతుడా. 836 00:47:58,629 --> 00:48:01,798 నీకు చావ లేకపోవడంలో అతని తప్పేముంది. 837 00:48:01,882 --> 00:48:03,592 -దాన్ని వినవద్దు అని చెప్పా కదా. -దేవుడా. 838 00:48:03,675 --> 00:48:06,261 చూశావా? ఆ మెసేజ్లు వినడం నాదే తప్పు కదా. 839 00:48:06,345 --> 00:48:09,765 దేవుడా, నీ వృత్తి జీవితానికి పనికి వచ్చేది అయితేనే, 840 00:48:09,848 --> 00:48:11,225 నువ్వు మెసేజ్లని విని స్పందిస్తావు, 841 00:48:11,308 --> 00:48:15,020 కానీ నీ కారణంగా ఒకరి ఉద్యోగం పోయాక, వారి వృత్తి జీవితం నాశనమయ్యాక, 842 00:48:15,103 --> 00:48:18,524 వాళ్ళ మనస్సులో ఉన్నదంతా నీ ఆన్సరింగ్ మెషీన్ ద్వారా వారు పంచుకున్నప్పుడు... 843 00:48:18,607 --> 00:48:20,526 -దేవుడా. అప్పుడు నీకేం కాకుండా చూస్తున్నా. -...కనీసం కాస్తయినా... 844 00:48:20,609 --> 00:48:23,862 -నీకేమీ కాకుండా చూస్తున్నారా, దరిద్రుడా. -అవునా? నువ్వు నా వృత్తిని నాశనం చేశావు! 845 00:48:23,946 --> 00:48:25,822 నీతో పడక పంచుకోవాలని నాకు లేదనే విషయం 846 00:48:25,906 --> 00:48:28,617 నీ మట్టి బుర్రకి అస్సలు అర్థ కాదు. ఎప్పటికీ అర్థం కాదు! 847 00:48:29,284 --> 00:48:32,829 సరేనా? అందుకు మన్నించు. దేవుడా. 848 00:48:35,874 --> 00:48:37,501 అమెరికా ముద్దు బిడ్డ బయటకొచ్చిందమ్మా. 849 00:48:38,210 --> 00:48:39,920 దొబ్బేయ్, నువ్వంటే నాకు పరమ అసహ్యం. 850 00:48:40,003 --> 00:48:41,880 -నువ్వంటే పరమ అసహ్యం. -నువ్వంటే కూడా నాకు అసహ్యమే. 851 00:48:41,964 --> 00:48:43,799 నీకు తెలియనిది కాకుండా ఏం చెప్పినా 852 00:48:43,882 --> 00:48:46,343 -నేను అబద్దం చెప్పినట్టే అనుకుంటావు. -నువ్వంటే చాలా అసహ్యం. 853 00:48:46,426 --> 00:48:48,136 -నువ్వంటే నాకు చాలా అంటే చాలా అసహ్యం. -నాకు కూడా. 854 00:48:48,220 --> 00:48:49,555 -దేవుడా. -నోర్మూసుకో! 855 00:48:49,638 --> 00:48:52,641 -మెసేజ్లకి ఎందుకు స్పందించలేదు? -కారి ఆపేయ్, నేను దిగిపోతా! 856 00:49:31,680 --> 00:49:33,974 ఆలెక్స్, హాయ్. 857 00:49:34,057 --> 00:49:35,726 దేవుడా. 858 00:49:35,809 --> 00:49:37,102 టెడ్డీ. 859 00:49:38,478 --> 00:49:39,813 హాయ్, బంగారం. 860 00:49:44,234 --> 00:49:47,446 దేవుడా. నిన్ను చూడటం చాలా బాగుంది. 861 00:49:47,529 --> 00:49:48,697 అమ్మ ఇంట్లోనే ఉందా? 862 00:49:49,281 --> 00:49:50,282 ధ్యానంలో ఉంది. 863 00:49:50,908 --> 00:49:53,452 -వెళ్లి పిలవనా? -పిలిస్తే మంచిది. 864 00:49:54,453 --> 00:49:56,163 -సరే. -అమ్మా? 865 00:49:56,246 --> 00:49:57,623 అమ్మా, ఆలెక్స్ వచ్చింది. 866 00:49:57,706 --> 00:49:58,790 అబ్బా. 867 00:50:02,753 --> 00:50:03,837 ఆలెక్స్. 868 00:50:03,921 --> 00:50:05,339 పేయిజ్. 869 00:50:06,006 --> 00:50:07,841 ఇలా చెప్పాపెట్టకుండా వచ్చినందుకు మన్నించు. 870 00:50:11,845 --> 00:50:13,931 నేను నీకు ఏం చెప్పాలని వచ్చానంటే... 871 00:50:16,892 --> 00:50:18,769 మిట్చ్ ఒక కారు ప్రమాదానికి గురయి... 872 00:50:21,271 --> 00:50:22,814 చనిపోయాడు. 873 00:50:34,701 --> 00:50:36,370 ధన్యవాదాలు. 874 00:50:36,453 --> 00:50:38,205 -దానిదేముందిలే. -నాకు చెప్పినందుకు. 875 00:50:38,288 --> 00:50:40,874 నువ్వేమైనా పంచుకోవాలనుకుంటున్నావా? 876 00:50:41,750 --> 00:50:43,168 నిస్సంకోచంగా నాతో పంచుకోవచ్చు. 877 00:50:48,340 --> 00:50:50,467 అంటే ఏంటి? 878 00:50:51,885 --> 00:50:52,886 ఆలెక్స్. 879 00:50:53,637 --> 00:50:55,055 నాకు మొదట్నుంచీ అతనికి సంబంధాలు ఉన్నాయని తెలుసు. 880 00:50:56,473 --> 00:51:00,435 కాకపోతే ఆ అమ్మాయిలు ఎవరో నాకు తెలీనే తెలీదు, 881 00:51:00,519 --> 00:51:02,396 కాబట్టి దాని వల్ల పెద్ద లాభమేముంది? 882 00:51:02,479 --> 00:51:03,897 కానీ మనిద్దరం సన్నిహితులం. 883 00:51:04,648 --> 00:51:08,735 కానీ పాపం ఆ అమ్మాయిలకంటే అవసరం ఉందేమో అనుకోవచ్చు, నీకు ఏమైంది? 884 00:51:12,739 --> 00:51:13,740 లేదు. 885 00:51:14,241 --> 00:51:17,703 పార్టీలలో నువ్వు నన్ను కలుసుకొని ఆలింగనం చేసుకొనేదానివి కూడా. 886 00:51:20,622 --> 00:51:22,583 పేయిజ్, నేను... 887 00:51:30,507 --> 00:51:32,217 అది రెండు సార్లే జరిగింది. 888 00:51:34,845 --> 00:51:38,015 రెండు సార్లేనా? వావ్. 889 00:51:39,224 --> 00:51:40,350 అంతటితో ఆపేసినందుకు ధన్యవాదాలు. 890 00:51:41,935 --> 00:51:43,645 మీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. 891 00:51:46,356 --> 00:51:49,776 అసలు మీ ఇద్దరినీ వేరు చేసి చెప్పడం కూడా కష్టమనుకుంటా, కాబట్టి... 892 00:51:50,569 --> 00:51:52,237 నీకు జరిగిన నష్టానికి నేను చింతిస్తున్నాను. 893 00:52:50,087 --> 00:52:51,588 హేయ్, నేను మియాని. 894 00:52:52,548 --> 00:52:53,757 హాయ్, మియా. 895 00:52:55,676 --> 00:52:57,177 ఇప్పుడే పేయిజ్ కి చెప్పేశాను. 896 00:52:59,179 --> 00:53:00,472 మీరు ఇక ఆ వార్తను ప్రసారం చేయవచ్చు. 897 00:53:01,098 --> 00:53:03,058 సరే. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. 898 00:53:03,141 --> 00:53:04,309 హేయ్, ఇంకో మాట... 899 00:53:05,769 --> 00:53:08,897 -అక్కడ బ్రాడ్లీ కూడా ఉందా? -ఉంది. 900 00:53:08,981 --> 00:53:11,108 -తనకి వినిపించేలా స్పీకర్ ఆన్ చేయగలవా? -తప్పకుండా. 901 00:53:11,191 --> 00:53:12,609 హలో? 902 00:53:13,527 --> 00:53:14,736 బ్రాడ్లీ... 903 00:53:15,946 --> 00:53:18,907 ఈ పని చేయడానికి నా దృష్టిలో 904 00:53:18,991 --> 00:53:21,285 సరైన వ్యక్తివి నువ్వే అనుకుంటా. 905 00:53:21,368 --> 00:53:23,453 అదే, ఈ వార్తను రిపోర్ట్ చేయడానికి. 906 00:53:24,454 --> 00:53:25,706 ఎందుకలా అంటున్నావు? 907 00:53:25,789 --> 00:53:27,124 ఎందుకంటే... 908 00:53:28,250 --> 00:53:29,918 అంతా మారుతోంది. 909 00:53:31,295 --> 00:53:33,922 కానీ ఆ మార్పుకు శ్రీకారం చుట్టింది నువ్వే. 910 00:53:36,133 --> 00:53:38,135 అందుకని నీకు ధన్యవాదాలు... 911 00:53:38,802 --> 00:53:40,512 తెలపాలనుకుంటున్నాను. 912 00:53:41,889 --> 00:53:43,640 నిజంగానే. అంతే. 913 00:53:46,727 --> 00:53:50,022 మళ్లీ స్వాగతం. ఇప్పుడే ఒక తాజా వార్త అందింది, ముందు ఈ తాజా వార్తను 914 00:53:50,105 --> 00:53:52,065 రిపోర్ట్ చేసి, ఆ తర్వాత సాధారణ వార్తలకు వెళ్దాం. 915 00:53:53,150 --> 00:53:54,484 బ్రాడ్లీ? 916 00:53:54,568 --> 00:53:57,905 మాజీ "మార్నింగ్ షో" యాంకర్, అలాగే ఉదయపు వార్తల చరిత్రలోనే 917 00:53:57,988 --> 00:54:01,950 అత్యద్భుతమైన శఖాన్ని లిఖించిన మిట్చ్ కెస్లర్, నిన్న రాత్రి ఉత్తర ఇటలీలో 918 00:54:02,034 --> 00:54:04,953 ఒక్కరే ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురయి ప్రాణాలు విడిచారు, 919 00:54:05,037 --> 00:54:08,999 ఈ వార్తను ముందుగా యుబిఎ నిర్ధారించి, మీ ముందుకు తెచ్చింది. 920 00:54:09,666 --> 00:54:11,043 ఆయన వయస్సు 52 ఏళ్లు. 921 00:54:11,919 --> 00:54:16,215 ఆయనకి మాజీ భార్య, పేయిజ్, ఇంకా పిల్లలైన జెఫ్, టెడ్డీలు ఉన్నారు. 922 00:54:17,090 --> 00:54:21,053 యుబిఎలో కెస్లర్ ప్రస్థానం ఇరవై ఏళ్ళకు పైగా సాగింది, 923 00:54:21,678 --> 00:54:23,805 అతని పదవీకాలంలో ఆయన ఎనిమిది ఎమ్మీ అవార్డులను గ్రహించారు. 924 00:54:24,598 --> 00:54:27,559 యుబిఎలో పని చేస్తున్న సమయంలో, ఆయన లైంగిక దుర్వినియోగానికి పాల్పడిన 925 00:54:27,643 --> 00:54:32,231 పలు ఉదంతాలు వెలుగు చూశాక, గత ఏడాడి ఆయన్ని 926 00:54:32,314 --> 00:54:34,775 అర్థాంతరంగా విధుల నుండి తొలగించడం జరిగింది. 927 00:54:35,859 --> 00:54:38,111 అతని టీవీ ప్రస్థానం అనన్యసామాన్యమైనది. 928 00:54:38,695 --> 00:54:41,156 ప్రసారకర్తగా, ఆయనకు ఆయనే సాటి, 929 00:54:41,240 --> 00:54:45,244 ఆయన వార్తలు చురుకుగా, ఆసక్తికరంగా, సరదాగా, సానుభూతి ఉట్టిపడేలా ఉండేవి. 930 00:54:45,869 --> 00:54:49,540 అతని వ్యక్తిగత జీవితం, అలాగే ఈ షో తెర వెనుక ఆయన చేసిన పనులు, 931 00:54:49,623 --> 00:54:52,084 ఆయన జీవితం నుండి ఎప్పటికీ చెరిగిపోవు. 932 00:54:52,960 --> 00:54:56,421 సమాజపరంగా మార్పు అనేది అంత సులభం కాదు. 933 00:54:57,047 --> 00:55:03,262 ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, అసలు మన లక్ష్యమేమిటని పరిశీలన చేసుకోవడం కష్టం. 934 00:55:03,887 --> 00:55:07,099 మన గతం నుండి, మనం వేటిని గుర్తుంచుకోవాలి, వేటిని క్షమించేయాలి, 935 00:55:07,182 --> 00:55:09,268 వేటి నుండి నేర్చుకోవాలి, లేదా వేటిని వదిలేయాలి అని 936 00:55:10,102 --> 00:55:11,687 తేల్చుకోవడం 937 00:55:11,770 --> 00:55:13,897 చాలా అంటే చాలా కష్టం. 938 00:55:14,481 --> 00:55:19,236 అలా మిట్చ్ చేయలేకపోయాడు కనుక, ఈ ఆఫీసులో పని చేసేవారు చాలా కష్టాలు పడ్డారు. 939 00:55:20,070 --> 00:55:23,532 ఆ విషయంలో, ఇంకా చాలా మంది మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. 940 00:56:24,593 --> 00:56:26,595 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య