1 00:00:14,765 --> 00:00:16,975 టడాషీ అగీ & షూ ఒకిమోటో రూపొందించిన "డ్రాప్స్ ఆఫ్ గాడ్" మాంగా ఆధారితమైంది 2 00:00:18,477 --> 00:00:19,978 టిబిలిసీ జార్జియా 3 00:00:20,062 --> 00:00:21,855 లేదు, కానీ అదృష్టవశాత్తూ, ఇసెయ్ కి ఒకడు దొరికాడు, 4 00:00:21,939 --> 00:00:23,565 అతనే మమ్మల్ని ఆలయానికి తీసుకెళ్తున్నాడు. 5 00:00:23,649 --> 00:00:24,900 మీ ఆలయం ఎక్కడుంది? 6 00:00:25,776 --> 00:00:30,364 పక్కాగా యూరప్ లోనే ఎక్కడో ఉంది, అలా అని ఏషియాకి మరీ ఎక్కువ దూరంలో ఉండకపోవచ్చు. 7 00:00:30,948 --> 00:00:32,115 నువ్వు మూడు రోజులని వెళ్లావు. 8 00:00:33,450 --> 00:00:34,701 తెలుసు… చూడు, చాలా ప్రయత్నిస్తున్నా. 9 00:00:34,785 --> 00:00:36,078 ఇసెయ్ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. 10 00:00:36,787 --> 00:00:37,871 కోలుకుంటున్నాడని అనుకున్నానే. 11 00:00:38,372 --> 00:00:39,373 లేదు, అతని పరిస్థితి దిగజారిపోతోంది. 12 00:00:39,957 --> 00:00:41,375 అతను నిన్న నాకు ఏం చేశాడో తెలుసా? 13 00:00:41,458 --> 00:00:43,460 ఇంకాస్త ఉంటే నన్ను ఏథెన్స్ లోనే వదిలేసి, విమానమెక్కి వెళ్లిపోయే వాడు. 14 00:00:44,044 --> 00:00:45,254 ఎందుకు? 15 00:00:45,337 --> 00:00:46,421 తెలీదు. 16 00:00:47,130 --> 00:00:48,757 ఇప్పుడు నన్ను అతను నమ్మట్లేదని అనిపిస్తోంది. 17 00:00:48,841 --> 00:00:51,093 అతనికి పోటీతత్వ మనస్తత్వం వచ్చేసింది. 18 00:00:51,176 --> 00:00:52,177 నాకది చాలా చిరాకు తెప్పిస్తోంది. 19 00:00:52,803 --> 00:00:54,513 చెప్తున్నా కదా, కమీల్, అది వదిలేసి వచ్చేయ్. 20 00:00:54,596 --> 00:00:56,265 అదీగాక, మనం పోటీకి సిద్ధమవ్వాలి. 21 00:00:56,348 --> 00:00:57,975 తెలుసు, కానీ నేను రాలేను. 22 00:00:58,058 --> 00:00:59,184 - అతను… - హా. 23 00:00:59,268 --> 00:01:01,311 అతను నీ సోదరుడు. అది నాకు తెలుసు. 24 00:01:01,854 --> 00:01:03,105 హా. 25 00:01:03,188 --> 00:01:04,188 ఐ లవ్ యూ. 26 00:01:04,272 --> 00:01:05,274 ఐ లవ్ యూ టూ. 27 00:01:19,663 --> 00:01:21,623 - హలో. - గుడ్ మార్నింగ్. 28 00:02:04,416 --> 00:02:05,876 నా మనిషి వచ్చేశాడు. 29 00:02:17,638 --> 00:02:18,847 ఇసెయ్ టొమినె అంటే మీరేనా? 30 00:02:18,931 --> 00:02:20,641 హాయ్, నా పేరు గోచా. దాయ్ స్నేహితుడిని. 31 00:02:20,724 --> 00:02:22,309 - మిమ్మల్ని కలవడం బాగుంది. - మిమ్మల్ని కూడా. 32 00:02:22,851 --> 00:02:24,436 ఈమె పేరు కమీల్ లీజియర్. మేం కలిసి పని చేస్తున్నాం. 33 00:02:24,520 --> 00:02:25,521 హలో, మిస్ కమీల్. 34 00:02:26,980 --> 00:02:29,191 - హలో. - హలో. 35 00:02:29,274 --> 00:02:31,109 మీరు దాయ్ కి ప్రాణ స్నేహితులు, కదా? 36 00:02:31,777 --> 00:02:32,986 నాకు కాస్త కుళ్లుగా ఉంది. 37 00:02:35,822 --> 00:02:37,491 నీకు ప్రాణ స్నేహితులున్నారని నాకు తెలీదే. 38 00:02:38,617 --> 00:02:39,743 నువ్వు అడిగితే కదా! 39 00:02:42,412 --> 00:02:43,455 థ్యాంక్యూ. 40 00:02:50,671 --> 00:02:51,672 ఎంత దూరం? 41 00:02:52,297 --> 00:02:53,715 రెండున్నర గంటలు పడుతుంది. 42 00:02:54,424 --> 00:02:55,759 ఇంచుమించుగా. 43 00:02:59,847 --> 00:03:02,140 అయితే మీరు జార్జియాకి రావడం ఇదే మొదటిసారా? 44 00:03:02,224 --> 00:03:04,518 - అవును. - అదృష్టవంతులు మీరు. 45 00:03:06,353 --> 00:03:09,773 ఇది గోరీ నగరం, స్టాలిన్ పుట్టింది ఇక్కడే. 46 00:03:11,275 --> 00:03:15,654 వైన్ ని తొలిసారిగా 8,000 ఏళ్ల క్రితం తయారు చేసింది ఇక్కడే. 47 00:03:17,406 --> 00:03:18,740 కార్ట్లీకి స్వాగతం. 48 00:03:35,841 --> 00:03:38,594 ఇదే ఆలయం. 49 00:03:46,435 --> 00:03:49,313 ఇది హెర్బెమోంట్ కాదు, సపెరావీ. 50 00:03:50,981 --> 00:03:52,733 ఇక్కడ వైన్లను సపెరావీతో చేస్తారా? 51 00:03:52,816 --> 00:03:53,859 నాకెలా తెలుస్తుంది? 52 00:03:54,401 --> 00:03:55,861 విచారణ చేయడానికి వచ్చింది మీరు. 53 00:03:56,653 --> 00:03:58,363 నేను కేవలం మీకు గైడ్ ని మాత్రమే. 54 00:04:01,617 --> 00:04:02,618 హలో! 55 00:04:03,577 --> 00:04:04,703 హలో. 56 00:04:07,289 --> 00:04:08,332 హలో. 57 00:04:14,546 --> 00:04:17,048 హలో, మీకు ఇంగ్లీష్ వచ్చా? 58 00:04:18,382 --> 00:04:22,262 నా స్నేహితులు ఫ్రాన్స్, జపాన్ దేశాలకి చెందిన వారు. 59 00:04:22,346 --> 00:04:26,099 ఒక వైన్ కోసం వచ్చారు, 60 00:04:26,183 --> 00:04:29,520 దాన్ని చేసింది ఇక్కడే అని వాళ్లకి చెప్పారట. 61 00:04:30,395 --> 00:04:32,773 ఏథెన్స్ లోని ఓ బీ-కీపర్ ని కలిశారు. 62 00:04:32,856 --> 00:04:34,191 అలెక్సి పీపియాస్. 63 00:04:34,983 --> 00:04:37,986 ఆ వైన్ ని తయారు చేసింది ఇక్కడే అని వీళ్లకి అలెక్సి చెప్పారట. 64 00:04:38,070 --> 00:04:40,697 అలెక్సి పీపియా? అతను పుట్టింది పక్క ఊర్లోనే. 65 00:04:40,781 --> 00:04:42,407 మీకతను తెలుసు, కదా? తన వ్యాక్స్ ని ఇక్కడికే పంపుతాడట. 66 00:04:43,033 --> 00:04:44,952 మిమ్మల్ని అడుగుతుంటే, అలా వెళ్లిపోతారేంటి, ఫాదర్? 67 00:04:45,035 --> 00:04:46,286 ఏం జరుగుతోంది? 68 00:04:48,830 --> 00:04:50,290 ఫాదర్, ఒక్క నిమిషం ఆగండి. 69 00:04:50,374 --> 00:04:52,876 మిమ్మల్ని కొన్ని అడిగేసి, వెళ్లిపోతాం, ఫాదర్. 70 00:04:54,044 --> 00:04:55,796 మిస్టర్… ఫాదర్. 71 00:04:55,879 --> 00:04:57,381 వెళ్లిపోతున్నారేంటి? 72 00:04:57,464 --> 00:04:59,883 - ఆగండి, ఫాదర్. ఫాదర్? - హేయ్! 73 00:04:59,967 --> 00:05:02,010 మనం ఒక్కటంటే ఒక్కటే నిమిషం మాట్లాడుకోవచ్చా? 74 00:05:02,094 --> 00:05:06,181 - ఇదేందయ్యా ఇది! - ప్లీజ్, ఫాదర్. 75 00:05:06,265 --> 00:05:07,391 - హేయ్! - హేయ్! 76 00:05:07,474 --> 00:05:08,475 ఆగండి. 77 00:05:14,690 --> 00:05:15,899 ఆయనకి ఏమైంది? 78 00:05:17,067 --> 00:05:20,362 మీ వైన్ చాలా సున్నితమైనదిలా ఉంది. 79 00:05:20,863 --> 00:05:22,030 భలే వింతగా ఉందే. 80 00:05:22,865 --> 00:05:25,659 వీళ్లు సన్యాసులు. పైగా జార్జియన్లు. 81 00:05:26,159 --> 00:05:29,663 మేము అనేక దశాబ్దాల పాటు సోవియెట్ వాళ్ల నియంతృత్వ పాలనలో గడిపామని మర్చిపోకండి. 82 00:05:30,289 --> 00:05:33,625 కాబట్టి, జనాలు ఇప్పటికీ ప్రశ్నలు అడిగే అపరిచితులని నమ్మరు. 83 00:05:34,501 --> 00:05:35,752 మరి ఇప్పుడేం చేద్దాం? 84 00:05:36,420 --> 00:05:39,173 తర్వాతిసారి, మరీ ఇన్ని ప్రశ్నలు అడగకుండా ఉండండి. 85 00:05:41,341 --> 00:05:44,011 హా, నా ఉద్దేశం లంచ్ కి ఏం చేద్దామని. 86 00:05:54,188 --> 00:05:56,523 ఇక్కడ మనకి రెస్టారెంట్ల లాంటివి కనిపించేలా లేవు. 87 00:05:59,776 --> 00:06:01,820 ఎక్స్ క్యూజ్ మీ! ఎక్స్ క్యూజ్ మీ! 88 00:06:03,447 --> 00:06:07,367 దగ్గర్లో రెస్టారెంట్లు ఏమైనా ఉన్నాయా? 89 00:06:09,828 --> 00:06:10,996 లేవు, దగ్గర్లో ఏమీ లేవు. 90 00:06:11,079 --> 00:06:12,956 రెస్టారెంటుని మూసేశారు. 91 00:06:13,540 --> 00:06:14,708 అన్నీ మూసేసి ఉన్నాయట. 92 00:06:15,667 --> 00:06:16,835 - హలో. - హాయ్. 93 00:06:16,919 --> 00:06:17,920 హాయ్. 94 00:06:18,003 --> 00:06:20,339 ఇవాళ మా అమ్మానాన్నలు సూప్రా ఇస్తున్నారు. 95 00:06:20,422 --> 00:06:22,758 మేము ఇక్కడే ఉంటాం, మీకు ఆనందంగా ఆతిథ్యం ఇస్తాం. 96 00:06:24,343 --> 00:06:26,178 ఈయన మనల్ని సూప్రాకు ఆహ్వానిస్తున్నాడు. 97 00:06:26,261 --> 00:06:27,387 సూప్రా అంటే ఏంటి? 98 00:06:27,471 --> 00:06:29,181 అది జార్జియన్ సంప్రదాయం అన్నమాట. 99 00:06:29,264 --> 00:06:31,558 భారీ విందు ఉంటుంది, స్నేహితులందరూ వస్తారు, వైన్ ఉంటుంది. 100 00:06:32,100 --> 00:06:33,727 చాలా మంచి వైన్ ఉంటుంది. 101 00:06:34,770 --> 00:06:36,188 సరే. 102 00:06:36,271 --> 00:06:38,106 నన్ను ఫాలో అవ్వండి. 103 00:06:43,654 --> 00:06:44,696 దయచేసి రండి. 104 00:06:49,243 --> 00:06:50,244 స్వాగతం. 105 00:06:51,245 --> 00:06:52,496 మనం నక్క తోక తొక్కాం. 106 00:06:52,579 --> 00:06:53,872 నిజమే అది! 107 00:07:00,587 --> 00:07:01,630 చాలా బాగుంది, కదా? 108 00:07:01,713 --> 00:07:03,757 సూప్రాకి కొత్త వారు వస్తే అదృష్టంగా భావిస్తారు. 109 00:07:03,841 --> 00:07:06,134 అందరూ వినండి! ఇవాళ మనతో ముగ్గురు అతిథులు జాయిన్ అవుతారు! 110 00:07:06,218 --> 00:07:08,387 అమ్మా, నాన్నా, మీరు విందు ఇస్తున్నారు కాబట్టి, వీళ్లు మనతో కూర్చుని తినవచ్చా? 111 00:07:08,470 --> 00:07:10,806 - బ్రహ్మాండంగా. - రండి. దయచేసి రండి! 112 00:07:10,889 --> 00:07:12,558 ఇతను నా కజిన్, లెవాన్. 113 00:07:12,641 --> 00:07:13,684 హలో. 114 00:07:13,767 --> 00:07:15,602 ఇతను ఇంకో కజిన్, గియోర్గీ. 115 00:07:15,686 --> 00:07:17,145 - ఈమె అతని తల్లి, మారితా. - హాయ్. నమస్కారం. 116 00:07:17,229 --> 00:07:19,022 - ఈమె మా ఆంటీ, మరియామ్. - హాయ్. 117 00:07:19,106 --> 00:07:20,732 ఇతను మా అంకుల్, గొదెర్జీ. 118 00:07:21,233 --> 00:07:22,901 - స్వాగతం, సుస్వాగతం. - మిమ్మల్ని కలవడం బాగుంది. 119 00:07:22,985 --> 00:07:23,986 - హలో. - చీర్స్. 120 00:07:24,069 --> 00:07:25,696 ఈమె నా సోదరి, కెటెవాన్, 121 00:07:25,779 --> 00:07:27,739 - ఇతను ఆమె బాయ్ ఫ్రెండ్, రమాజ్. - మిమ్మల్ని కలవడం బాగుంది. 122 00:07:27,823 --> 00:07:29,116 - హాయ్. - మిమ్మల్ని కలవడం బాగుంది. 123 00:07:29,199 --> 00:07:30,909 అతను మా అమ్మని పరిచయం చేసుకోవడానికి వచ్చాడు. 124 00:07:30,993 --> 00:07:34,496 ఈమె మా అమ్మ, టమార్, ఈయన మా నాన్న, వసీల్. 125 00:07:34,580 --> 00:07:37,499 వీళ్లకి పెళ్లయి పాతికేళ్లు అయిన సందర్భంగానే ఈ వేడుక జరుపుకుంటున్నాం. 126 00:07:37,583 --> 00:07:38,959 - దయచేసి కూర్చోండి. - అభినందనలు. 127 00:07:39,042 --> 00:07:42,462 ఇంత ప్రత్యేకమైన రోజున మీరు రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. 128 00:07:43,297 --> 00:07:45,257 ఇక్కడున్న వారందరూ ఇంగ్లీషుని నాకన్నా బాగానే మాట్లాడుతున్నారు. 129 00:07:45,966 --> 00:07:47,217 ఆమె టిబిలిసీలో చదువుకుంది. 130 00:07:47,301 --> 00:07:50,012 మా తాతయ్య ఈమెకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నగరంలో చదివించాడు, 131 00:07:50,095 --> 00:07:51,889 కానీ ఈమె ఈ పల్లెటూర్లోనే ఉండటానికి ఇష్టపడింది. 132 00:07:51,972 --> 00:07:54,099 - అయితే… - నాకు నగరం నచ్చలేదు. 133 00:07:55,475 --> 00:07:57,144 మీరు ఒక్క షాట్లోనే తాగేయాలి. 134 00:07:57,227 --> 00:07:59,271 - ఒక్క షాట్లోనేనా? - అవును. 135 00:07:59,354 --> 00:08:00,814 - మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్స్. - పర్వాలేదు. 136 00:08:00,898 --> 00:08:02,983 మిత్రులారా, ఒక్క నిమిషం ఆగండి. 137 00:08:09,281 --> 00:08:10,991 జీవితానికి, ప్రేమకి! 138 00:08:11,074 --> 00:08:14,119 జీవితానికి, ప్రేమకి! 139 00:08:14,203 --> 00:08:15,412 జీవితానికి, ప్రేమకి! 140 00:08:16,205 --> 00:08:17,623 జీవితానికి, ప్రేమకి! 141 00:08:18,207 --> 00:08:19,499 మగవారే నిలబడాలి. 142 00:08:28,133 --> 00:08:29,760 - వేరుగా ఉంది. - అవును. 143 00:08:33,096 --> 00:08:34,181 బాగుందా? 144 00:08:57,996 --> 00:09:00,457 జార్జియన్ వైన్ చాలా బాగుంది. 145 00:09:00,541 --> 00:09:02,668 ఈ వైన్ ని ఇక్కడే స్థానికంగా చేస్తారా? 146 00:09:04,378 --> 00:09:05,379 ఏమంటున్నారు మీరు? 147 00:09:06,004 --> 00:09:07,256 ఇక్కడ అన్నీ స్థానికమైనవే. 148 00:09:07,339 --> 00:09:08,715 మా అమ్మ గొప్ప మేధావి. 149 00:09:08,799 --> 00:09:10,259 ఈ వైన్ ని తయారు చేసేది ఆమెనే. 150 00:09:10,342 --> 00:09:13,637 అంటే, పెద్ద పెద్ద జార్లలోనా? 151 00:09:13,720 --> 00:09:15,722 అవును, కానీ ఆ జార్లను మేము "కవేవ్రీల"ని అంటాం. 152 00:09:16,348 --> 00:09:17,850 - "కవేవ్రీలా"? - అవును. 153 00:09:17,933 --> 00:09:21,353 వాటిని ఆరెంజ్ వైన్లను తయారు చేయడానికే ఉపయోగిస్తారు అనుకున్నా. 154 00:09:21,436 --> 00:09:24,022 లేదు, లేదు. దాన్ని మేము "వైట్ వైన్" అంటాం. 155 00:09:24,106 --> 00:09:25,274 అవును, "వైట్", సారీ. 156 00:09:25,357 --> 00:09:29,444 హా, అవును. కానీ మేము "కవేవ్రీల"ను రెడ్ వైన్స్ చేయడానికి కుడా ఉపయోగిస్తాం. 157 00:09:29,528 --> 00:09:32,406 అమ్మా, నువ్వు చేసిన వైన్ బాగుందని థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు నీకు. 158 00:09:32,489 --> 00:09:33,490 వాళ్లకది చాలా నచ్చేసింది! 159 00:09:36,034 --> 00:09:37,911 మీకు జార్జియన్ వైన్ గురించి తెలుసా? 160 00:09:39,538 --> 00:09:41,123 అది ప్రత్యేకంగా, చాలా బాగా ఉంటుంది. 161 00:09:42,457 --> 00:09:43,500 అవును. 162 00:09:44,042 --> 00:09:45,419 మేము… 163 00:09:45,502 --> 00:09:49,006 బోటనిస్టులం, ఒక అరుదైన పువ్వును ట్రాక్ చేస్తూ ఫ్రాన్స్ నుండి వచ్చాం. 164 00:09:49,089 --> 00:09:51,508 ఆ పనిలో భాగంగా గ్రీస్ కి వెళ్ళాం, అక్కడ ఒక బీ-కీపర్ ని కలిశాం, 165 00:09:51,592 --> 00:09:55,012 అతను తన బీ-వ్యాక్స్ ని ఈ ఊర్లోని ఆలయంలో ఉన్న సన్యాసులకి పంపుతాడట. 166 00:09:55,095 --> 00:09:56,388 మీరు అబద్ధం ఆడుతున్నారు. 167 00:09:59,474 --> 00:10:01,977 ఫాదర్ జురాబ్, నన్ను హెచ్చరించాడు. 168 00:10:03,353 --> 00:10:05,689 వాళ్ల వైన్ కోసమే మీరు ఇక్కడికి వచ్చారు. 169 00:10:06,899 --> 00:10:09,776 ఇక్కడ మేమేమీ అమ్మం. 170 00:10:15,616 --> 00:10:18,577 డావీట్ కి నేనేం అదరట్లేదు బెదరట్లేదని చెప్పండి 171 00:10:19,578 --> 00:10:21,747 ఇది నా ఇల్లు. 172 00:10:23,582 --> 00:10:24,833 ఇంతకీ ఈ డావీట్ ఎవరు? 173 00:10:26,460 --> 00:10:28,879 దయచేసి మీరు వెళ్లిపోండి. 174 00:10:29,505 --> 00:10:30,631 మమ్మల్ని క్షమించండి. 175 00:10:30,714 --> 00:10:32,341 మీకు కోపం తెప్పించడం మా ఉద్దేశం కాదు. 176 00:10:32,424 --> 00:10:33,842 మీరు అపార్థం చేసుకుంటున్నారు. 177 00:10:34,760 --> 00:10:36,136 దయచేసి బయలుదేరండి. 178 00:10:50,317 --> 00:10:51,527 సారీ, మేము వెళ్లిపోవాలి. 179 00:10:51,610 --> 00:10:53,028 కానీ థ్యాంక్యూ. థ్యాంక్యూ. 180 00:10:58,283 --> 00:11:00,077 ఆమెకి ఎందుకు అబద్ధం చెప్పావు? 181 00:11:00,160 --> 00:11:02,663 ఆ సన్యాసి దగ్గర చేసిన తప్పే ఇక్కడ కూడా చేయాలనుకోలేదు, 182 00:11:02,746 --> 00:11:04,122 కానీ అసలు సమస్య అది కాదనుకుంటా. 183 00:11:04,206 --> 00:11:06,208 మనం ఈ డావీట్ మనుషులం అనుకుంటోంది. 184 00:11:06,291 --> 00:11:07,876 తర్వాతిసారి, నువ్వు అస్సలు నోరు తెరవకు. 185 00:11:07,960 --> 00:11:08,961 హేయ్! 186 00:11:09,545 --> 00:11:12,172 బహుశా ఆమెకి ఎందుకంత కోపం వచ్చిందో ఆలోచిస్తే మంచిదేమో. 187 00:11:12,256 --> 00:11:13,507 బహుశా ఆమె ఇంకేదో దాస్తోందేమో. 188 00:11:34,695 --> 00:11:35,696 థ్యాంక్యూ. 189 00:11:39,366 --> 00:11:41,201 టిఫిన్ ఎప్పుడు వడ్డిస్తారు? 190 00:11:41,285 --> 00:11:42,995 ఇక్కడ టిఫిన్ ఉండదు. 191 00:11:43,078 --> 00:11:46,498 పక్కన ఉన్న పెట్రోల్ బంకులో ఉంటుంది. 192 00:11:46,582 --> 00:11:48,000 ఇక్కడ టిఫిన్ ఉండదట. 193 00:11:48,083 --> 00:11:50,002 కానీ పెట్రోల్ బంకు దగ్గర ఉంటుందట, అక్కడ తినవచ్చట. 194 00:11:54,173 --> 00:11:57,718 చింతించకండి. రేపు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. 195 00:11:59,845 --> 00:12:02,139 మీ వెకేషన్ హాయిగా సాగాలని కోరుకుంటున్నా. 196 00:12:44,598 --> 00:12:46,600 థోమాస్ 197 00:13:35,899 --> 00:13:39,027 ఇలా వెళ్లండి, అక్కడ ఈ పక్కకు తిరగండి. 198 00:13:39,111 --> 00:13:41,154 అక్కడ మీకు కాఫీ ఉంటుంది. 199 00:13:41,238 --> 00:13:44,283 - సరే. థ్యాంక్యూ. - పర్వాలేదు. 200 00:14:03,427 --> 00:14:04,845 హేయ్, ఇసెయ్! 201 00:14:07,681 --> 00:14:09,099 నువ్వు ఇక దీన్ని ఆపాలి. 202 00:14:09,933 --> 00:14:11,393 - దేన్ని? - అంతటినీ. 203 00:14:12,019 --> 00:14:13,061 దీన్నంతటినీ. 204 00:14:13,145 --> 00:14:14,980 మనిద్దరికీ కావాల్సింది ఒక్కటే. 205 00:14:15,063 --> 00:14:17,274 - నిన్ను రమ్మని నేనేం బలవంత పెట్టలేదే. - అది నిజమే. 206 00:14:17,357 --> 00:14:20,736 కానీ మనిద్దరినీ ఇలా చూస్తే, అలెగ్జాండర్ చాలా సంతోషిస్తాడు. 207 00:14:25,365 --> 00:14:26,617 కాబట్టి చెప్పు. 208 00:14:27,409 --> 00:14:28,577 నన్ను వెళ్లిపొమ్మంటావా? 209 00:14:29,953 --> 00:14:32,289 వెళ్లిపొమ్మంటే, పోరాడటం ఆపేస్తా. 210 00:14:33,874 --> 00:14:35,209 వెళ్లిపోతా. 211 00:14:39,254 --> 00:14:40,255 సరే. 212 00:14:41,423 --> 00:14:42,591 "సరే" అంటే? 213 00:14:46,136 --> 00:14:47,137 సరే. 214 00:14:47,971 --> 00:14:49,681 ఉండు. 215 00:14:54,353 --> 00:14:57,523 మంచిది. ఉంటా. 216 00:14:59,316 --> 00:15:00,901 వెళ్లి బ్యాగులని తెచ్చుకోండి, మిత్రులారా. 217 00:15:01,401 --> 00:15:03,570 భూముల రిజిస్ట్రేషన్ శాఖలో పని చేసే నా మిత్రునికి కాల్ చేశా, 218 00:15:03,654 --> 00:15:06,114 టమార్ వైన్ యార్డ్ ఎక్కడ ఉందో చెప్పాడు. 219 00:15:07,783 --> 00:15:09,409 సరే, పద. 220 00:15:12,162 --> 00:15:13,830 అప్పుడప్పుడూ నవ్వు, ఏం కాదు. 221 00:15:14,915 --> 00:15:17,334 - బ్వాగులను తెచ్చుకోండి. - సరే. 222 00:15:21,630 --> 00:15:23,173 రండి, మిత్రులారా. రండి. 223 00:16:04,214 --> 00:16:05,215 ఇదేనా? 224 00:16:35,037 --> 00:16:36,038 కమీల్. 225 00:17:17,913 --> 00:17:19,540 - హెర్బెమోంట్. - ఓరి దేవుడా. 226 00:17:22,459 --> 00:17:23,460 హేయ్! 227 00:18:02,165 --> 00:18:03,166 వసీల్! 228 00:18:05,085 --> 00:18:06,461 వసీల్! 229 00:18:06,545 --> 00:18:07,963 నీకు ఇక్కడేం పని? 230 00:18:08,046 --> 00:18:09,923 ఇటు వైపు రావద్దని చెప్పాం కదా! 231 00:18:10,757 --> 00:18:12,885 మూసుకోండిరా. ఇది నా భూమి. 232 00:18:13,510 --> 00:18:15,262 ఇప్పుడు కాదురా, సన్నాసీ. 233 00:18:15,345 --> 00:18:16,847 ఇక్కడి నుండి వెళ్లిపోండి. 234 00:18:16,930 --> 00:18:20,100 ఈ నేల ఎవరిదో నీకు ఇంకా అర్థం కానట్టుంది. 235 00:18:20,184 --> 00:18:22,561 నాకు బాగా తెలుసు ఇది ఎవరిదో. దొబ్బేయ్! 236 00:18:26,440 --> 00:18:27,441 దరిద్రుడా! 237 00:18:29,109 --> 00:18:30,819 మేము ఇక్కడికి మరోసారి రాము. 238 00:18:30,903 --> 00:18:34,198 తర్వాతిసారి ఇంతకన్నా దారుణంగా ఉంటుందని నీ పెళ్ళానికి చెప్పు. 239 00:18:46,543 --> 00:18:47,544 నొప్పిగా ఉందా? 240 00:18:48,587 --> 00:18:50,422 ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మంచిదేమో. 241 00:18:50,506 --> 00:18:52,883 అక్కర్లేదు. ఏమీ విరగలేదులే. 242 00:18:54,134 --> 00:18:56,470 నా భర్తకి సాయపడినందుకు థ్యాంక్యూ. 243 00:18:56,553 --> 00:18:58,013 ఎవరు వాళ్లు? 244 00:18:58,805 --> 00:19:01,266 వాళ్లు నా సోదరుడు, డావీట్ ఆబషీడ్జే మనుషులు. 245 00:19:03,810 --> 00:19:05,062 ఎవరతను? 246 00:19:05,145 --> 00:19:07,064 అతను వ్యాపారవేత్త. 247 00:19:07,940 --> 00:19:09,525 ఈ ఇల్లు మా నాన్నది. 248 00:19:10,108 --> 00:19:11,109 ఆయన కిందటి ఏడాది చనిపోయాడు. 249 00:19:11,860 --> 00:19:14,780 ఇక్కడ పెట్టుకుని, అలాగే పట్టుకుని ఉండు. 250 00:19:16,323 --> 00:19:17,866 డావీట్ దీన్ని అమ్మాలనుకుంటున్నాడు. 251 00:19:18,867 --> 00:19:20,369 నేను అతడిని ఆపలేకపోతున్నా. 252 00:19:21,703 --> 00:19:22,704 టీ ఏమైనా కావాలా? 253 00:19:22,788 --> 00:19:24,873 - హా, చేసి ఇవ్వు. - ఇప్పుడే చేసి తీసుకొస్తా. 254 00:19:24,957 --> 00:19:25,999 సారీ. 255 00:19:45,686 --> 00:19:46,687 మీకు కూడా కావాలా? 256 00:19:47,771 --> 00:19:48,897 వద్దు, థ్యాంక్యూ. 257 00:20:01,910 --> 00:20:06,331 మీరు ఏ వైన్ కోసమైతే వెతుకుతున్నారో, అది మా నుండి దొంగిలించబడింది. 258 00:20:07,457 --> 00:20:08,750 మేము దాని రుచి చూశాం. 259 00:20:11,295 --> 00:20:14,089 అది… 260 00:20:16,675 --> 00:20:17,676 చాలా బాగుంది. 261 00:20:19,803 --> 00:20:21,889 మేము మీ వైన్ ని దొంగిలించడానికి రాలేదు. 262 00:20:21,972 --> 00:20:24,141 అదెవరు చేశారో తెలుసుకోవాలని వచ్చామంతే. 263 00:20:24,766 --> 00:20:26,185 ఇప్పుడు తెలిసింది కాబట్టి, ఇక మేము వెళ్లిపోవచ్చు. 264 00:20:27,644 --> 00:20:29,354 ఇప్పటికే మేము చాలా సమస్యలను సృష్టించాం. 265 00:20:30,355 --> 00:20:31,398 సారీ. 266 00:20:54,671 --> 00:20:55,672 నాతో రండి. 267 00:21:01,553 --> 00:21:03,639 గోచా, టీ సిద్ధంగా ఉంది. వెళ్లి తెచ్చివ్వు. 268 00:21:03,722 --> 00:21:05,724 - టమార్, ఎక్కడికి వెళ్తున్నావు? - ఏంటి? 269 00:21:05,807 --> 00:21:07,309 వైన్ సెల్లార్ కి వెళ్తున్నా. త్వరగానే వచ్చేస్తా. 270 00:21:07,392 --> 00:21:08,894 ఇరాక్లీ, నువ్వు కూడా రా. 271 00:21:11,522 --> 00:21:12,856 మరి మీ భర్తకి పర్వాలేదా? 272 00:21:13,482 --> 00:21:15,776 ఆయనకి ఏమీ కాదులే. చాలా గట్టోడు. 273 00:21:22,533 --> 00:21:23,992 నాకు ఇక్కడ బాగా నచ్చేసింది. 274 00:21:25,160 --> 00:21:26,870 ఆ సెల్లార్ దగ్గర్లోనే ఉంది కదా? 275 00:21:27,496 --> 00:21:29,456 - హా, దగ్గరే అది. - సరే. 276 00:21:30,749 --> 00:21:31,750 ఒక "కవేవ్రీ"! 277 00:21:32,417 --> 00:21:34,753 - హా. - వావ్, చాలా పెద్దగా ఉంది. 278 00:21:35,254 --> 00:21:37,256 - వీటిని మీరే చేస్తారా? - లేదు. 279 00:21:37,339 --> 00:21:39,675 - అది చేసే నైపుణ్యం గల వాళ్లు పెద్దగా లేరనే చెప్పాలి. - హాయ్. 280 00:21:39,758 --> 00:21:41,426 వైన్ తయారీ ప్రక్రియ దానిలోనే మొదలవుతుంది. 281 00:21:41,510 --> 00:21:44,972 ఒక "కవేవ్రీ"కి పగుళ్ళు వచ్చాయి, దాన్ని తీసేసి, దీన్ని పెడతాం. 282 00:21:45,722 --> 00:21:49,226 పంట చేతికి రాక ముందే దాన్ని పూడ్చేయాలని చూస్తున్నా. 283 00:21:49,309 --> 00:21:50,727 హా, విన్నాను. 284 00:21:50,811 --> 00:21:53,480 ఈ ఏడాది, ద్రాక్ష పళ్లు ముందే పండుతాయట. 285 00:22:14,501 --> 00:22:16,837 ఇదే మా వైన్ సెల్లార్. 286 00:22:16,920 --> 00:22:18,255 చాలా బాగుంది. 287 00:22:19,089 --> 00:22:21,216 అయితే, మీరు నిజంగానే వాటిని పూడ్చి పెడతారా? 288 00:22:21,800 --> 00:22:22,801 అవును. 289 00:22:24,136 --> 00:22:26,847 "కవేవ్రీల"లో ఫర్మెంటేషన్ అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? 290 00:22:26,930 --> 00:22:30,517 వైన్ మెచ్యూర్ అవ్వడానికి మూడేళ్ళు పడుతుంది. 291 00:22:32,102 --> 00:22:35,022 నేను దాన్ని నిత్యం గమనిస్తూనే ఉంటా. 292 00:22:36,732 --> 00:22:40,903 అప్పుడే తెలుస్తుంది నాకు, ఏ "కవేవ్రీ"లోది "చాచా"కి పనికొస్తుందో, 293 00:22:40,986 --> 00:22:44,907 ఏది వేరే దానికి పనికొస్తుందో. 294 00:22:45,449 --> 00:22:46,450 వేరే దానికా? 295 00:22:48,452 --> 00:22:49,453 హా. అవును. 296 00:22:50,329 --> 00:22:55,167 ఒక్కోసారి, ఫర్మెంటేషన్ జరిగేటప్పుడు, వైన్ కాస్త అటూఇటూ అవుతుంది. 297 00:22:55,918 --> 00:22:58,837 కానీ ఒక్కోసారి, అద్భుతం జరుగుతుంది. 298 00:23:02,174 --> 00:23:04,426 మీరు ఇక్కడికి వచ్చింది దీని కోసమే. 299 00:23:23,070 --> 00:23:27,032 మా ప్రత్యేకమైన వైన్ ని ఇక్కడే చాలా కాలం ఉంచుతాం. 300 00:23:27,991 --> 00:23:32,955 నాకన్నా ముందు, మా నాన్న, అతని సోదరుడు, తియోడోరే కలిసి వీటిని చేసేవాడు. 301 00:23:34,206 --> 00:23:37,125 అతను వయస్సులో ఉన్నప్పుడు పశ్చిమం వైపు వెళ్ళాడు, 302 00:23:38,001 --> 00:23:40,003 అక్కడ స్విట్జర్లాండ్లో, 303 00:23:40,087 --> 00:23:44,132 రుడాల్ఫ్ స్టైనర్ వారసులని కలిశాడు. 304 00:23:44,633 --> 00:23:46,385 - స్టైనర్? - అవును. 305 00:23:46,468 --> 00:23:48,428 ఆయన బయోడైనమిక్స్ కి పిత. 306 00:23:50,180 --> 00:23:52,891 ఫ్రాన్స్ లో, బయోడైనమిక్స్ రంగంలో కమీల్ ఎస్టేటే మొదటి స్థానంలో ఉంది. 307 00:23:54,685 --> 00:23:56,937 - ఇటు వెళ్తే ఏం వస్తుంది? - ఆలయం. 308 00:23:57,437 --> 00:24:00,399 సన్యాసులు ఇక్కడికి వచ్చి, సర్వీస్ కోసం వైన్ ని తీసుకెళ్తారు. 309 00:24:03,277 --> 00:24:05,404 ఈ వైన్ మాది కాదు. 310 00:24:06,572 --> 00:24:09,199 నా సోదరునిది కానీ, నాది కానీ కాదు. 311 00:24:09,700 --> 00:24:11,410 ఇది దేవుడిది. 312 00:24:12,911 --> 00:24:16,373 అందుకే దీనికి అంత ప్రత్యేకత. 313 00:24:17,499 --> 00:24:19,626 కానీ డావీట్ అంకుల్ అన్నింటినీ అమ్మేస్తున్నాడు. 314 00:24:20,586 --> 00:24:23,380 వైన్ యార్డ్. భూమి. సెల్లార్. అన్నింటినీ అమ్మేస్తున్నాడు. 315 00:24:25,591 --> 00:24:27,593 కాబట్టి ఇదంతా అంతం అయిపోతుంది. 316 00:24:44,943 --> 00:24:47,196 …మట్టిలోని మినరల్స్ మీద ఆధారపడి ఉంటుంది, 317 00:24:48,280 --> 00:24:52,159 మంచి వైన్ కి అదే చాలా ముఖ్యం. 318 00:24:53,410 --> 00:24:56,705 ఇంతకీ తియోడోరే, హెర్బెమోంట్ ని ఎందుకు ఎంచుకున్నారు? 319 00:24:58,040 --> 00:25:01,543 దానికి తెగుళ్లు పట్టవు, డైరెక్ట్ హైబ్రిడ్ అది. 320 00:25:01,627 --> 00:25:03,086 అతనేం అనే వాడంటే, 321 00:25:03,170 --> 00:25:08,467 "పనికి రాని ద్రాక్ష రకాలంటూ ఏమీ ఉండవు, వైన్ సరిగ్గా చేయడం రాని వాళ్లుంటారు, అంతే." 322 00:25:09,718 --> 00:25:12,387 - థ్యాంక్యూ. - థ్యాంక్యూ. 323 00:25:15,265 --> 00:25:16,934 ప్లీజ్, ప్లీజ్. 324 00:25:17,559 --> 00:25:18,769 థ్యాంక్యూ, ఇరాక్లీ. 325 00:25:19,311 --> 00:25:21,813 ఇంత చేసిందీ ఇందుకా? భలే వింత మనుషులబ్బా మీరు. 326 00:25:23,899 --> 00:25:26,026 జీవితానికి, ప్రేమకి. 327 00:25:26,109 --> 00:25:28,820 - జీవితానికి, ప్రేమకి. - జీవితానికి, ప్రేమకి. 328 00:25:28,904 --> 00:25:31,073 - జీవితానికి, ప్రేమకి. - ప్రేమకి. 329 00:25:31,156 --> 00:25:32,491 - చీర్స్. - చీర్స్. 330 00:25:43,502 --> 00:25:44,503 థ్యాంక్యూ. 331 00:25:45,838 --> 00:25:46,839 నాకు ఇది నచ్చింది. 332 00:26:10,654 --> 00:26:11,655 ఇలా రా. రా. 333 00:26:15,284 --> 00:26:16,326 ఓకే. 334 00:26:20,247 --> 00:26:21,248 హేయ్. 335 00:26:21,790 --> 00:26:22,833 తాగు. 336 00:26:24,459 --> 00:26:26,545 - ఏమైంది? - నువ్వు మూర్ఛపోయావు. 337 00:26:27,588 --> 00:26:28,589 నీళ్లు తాగు. 338 00:26:33,302 --> 00:26:36,180 ఇది "చుర్చ్ కేలా". నీకు చక్కెర కావాలి. 339 00:26:36,763 --> 00:26:38,182 ఇది తిను. 340 00:26:39,016 --> 00:26:41,268 పోయిన వారం ఇతను డైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. 341 00:26:41,351 --> 00:26:42,686 ఆసుపత్రి నుండి ఈమధ్యే డిశ్చార్జ్ అయ్యాడు. 342 00:26:44,062 --> 00:26:45,522 నీ ఒళ్లు చల్లగా ఉంది. 343 00:26:46,148 --> 00:26:50,903 ఇసెయ్, నన్ను అలా భయపెడితే ఎలా! 344 00:26:51,570 --> 00:26:54,239 - సారీ. - అయ్యో. 345 00:26:54,323 --> 00:26:55,365 అతడిని కాస్త ఊపిరి తీసుకోనిద్దాం. 346 00:26:56,742 --> 00:26:57,910 సరేనా? 347 00:26:57,993 --> 00:26:59,203 కమీల్, రా. 348 00:26:59,703 --> 00:27:01,914 - నీకేం పర్వాలేదు కదా? - హా. 349 00:27:19,264 --> 00:27:20,390 నేను లోపలికి రావచ్చా? 350 00:27:20,933 --> 00:27:22,017 రా. 351 00:27:29,816 --> 00:27:31,068 సారీ. 352 00:27:34,238 --> 00:27:35,489 నేను టలియన్ కి కాల్ చేశా. 353 00:27:35,572 --> 00:27:37,658 అమ్మకాన్ని ఆపే హక్కు టమార్ కి ఉంటుందని అతను అంటున్నాడు. 354 00:27:38,492 --> 00:27:41,078 టిబిలిసీలో ఉండే టాప్ లాయర్ పేరును అతను నాకు చెప్పాడు. 355 00:27:41,912 --> 00:27:43,330 రేపు నేను అతడిని కలుస్తున్నా. 356 00:27:45,749 --> 00:27:47,167 దానికి టమార్ ఓకే అందా? 357 00:27:47,835 --> 00:27:48,836 హా. 358 00:27:55,884 --> 00:27:57,678 ఏంటి, నేను చెప్పింది నమ్మట్లేదా? 359 00:27:59,096 --> 00:28:00,305 అది కాదు. 360 00:28:07,062 --> 00:28:10,023 నీకు ఇందులో భాగం కావాలనుందని తెలుసు, కానీ నీ ఆరోగ్యం బాగాలేదు. 361 00:28:11,024 --> 00:28:12,234 నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. 362 00:28:20,117 --> 00:28:21,326 త్వరలోనే నీకు అంతా బాగైపోతుంది. 363 00:28:22,536 --> 00:28:23,662 మనం దీన్ని తప్పక ముగిస్తాం. 364 00:28:28,667 --> 00:28:29,793 ఇద్దరం కలిశా? 365 00:28:34,381 --> 00:28:35,382 అవును. 366 00:28:43,682 --> 00:28:45,350 లేదు, నేను ఆ పిచ్చి జర్నలిస్ట్ ఆర్టికల్ ని చదవాలి. 367 00:28:45,434 --> 00:28:46,435 నాకు అంత సమయం లేదు. 368 00:28:46,518 --> 00:28:49,521 థోమాస్, మాకు వైన్ దొరికింది. దాని రుచి చూశాం కూడా. అదిరింది! 369 00:28:49,605 --> 00:28:52,482 అయితే, వచ్చేయ్. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరముంది. 370 00:28:52,983 --> 00:28:56,069 పోటీకి ముందు మనకి ఉండే స్పందించే హక్కును ఉపయోగించుకోవాలి మనం. 371 00:28:56,153 --> 00:28:58,280 పోటీకీ ఇంకా అయిదే రోజులుంది, కమీల్. 372 00:28:58,363 --> 00:29:00,449 తెలుసు, కానీ ఇక్కడ పని ఇంకా పూర్తి కాలేదు. 373 00:29:00,532 --> 00:29:02,159 నేను కొందరికి సాయపడాలి. 374 00:29:02,242 --> 00:29:03,619 ఇప్పుడొక న్యాయవాదిని కలవడానికి వెళ్తున్నా. 375 00:29:03,702 --> 00:29:05,120 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 376 00:29:05,204 --> 00:29:07,289 అదంతా నాకు అనవసరం. నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయాలి. 377 00:29:08,040 --> 00:29:09,958 నాకోసం కాకపోయినా కనీసం ఫిలిప్ కోసమైనా రా. 378 00:29:10,042 --> 00:29:11,752 ఈ పోటీ అతనికి ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా. 379 00:29:11,835 --> 00:29:12,836 నాకు కూడా ముఖ్యమే. 380 00:29:13,337 --> 00:29:15,088 నేను టమార్ కి మాట ఇచ్చాను. ఆ వైన్ చేసింది తనే. 381 00:29:15,172 --> 00:29:17,466 మనం సాయపడకపోతే, తను మొత్తం కోల్పోతుంది. అది కాస్త సంక్లిష్టమైందిలే. 382 00:29:17,549 --> 00:29:19,343 అంతా వివరంగా చెప్తా. కానీ ఇప్పుడు నాకు పనుంది, సరేనా? 383 00:29:19,426 --> 00:29:21,178 - లవ్ యూ. - ఆగు, కమీల్, ఎవరు టమార్? 384 00:29:27,976 --> 00:29:29,937 తన పని పూర్తయిపోయింది. 385 00:29:30,854 --> 00:29:32,147 కానీ ఇప్పుడు ఒక ఉద్యమం మొదలుపెట్టింది. 386 00:29:36,151 --> 00:29:38,904 కమీల్ లీజియర్, గారాబం వల్ల పాడైన యువతి 387 00:29:38,987 --> 00:29:41,448 - బాబోయ్… - ఏమైనా సమస్యనా? 388 00:29:41,532 --> 00:29:43,450 నేను గారాబం వల్ల పాడయ్యానని ఒక జర్నలిస్ట్ రాసింది. 389 00:29:45,619 --> 00:29:46,620 ఏమైంది? 390 00:29:54,253 --> 00:29:56,004 మిస్టర్ ఆబషీడ్జే తాకట్టు రుణాన్ని తీర్చేశాడు, 391 00:29:56,088 --> 00:29:58,298 దానితో భూమి అతని సొంతమైనట్టు అయిపోయింది. 392 00:29:58,382 --> 00:30:00,467 కానీ వారసత్వం అలా పని చేయదు కదా. 393 00:30:00,551 --> 00:30:01,677 అది అంతకన్నా సంక్లిష్జమైనది కదా. 394 00:30:03,345 --> 00:30:04,847 ఇది ఫ్రాన్స్ కాదు. 395 00:30:08,100 --> 00:30:09,518 కానీ చట్టం ఒకటే కదా. 396 00:30:10,477 --> 00:30:12,354 మిస్టర్ టలియన్ నాకు వివరించారు. 397 00:30:12,437 --> 00:30:14,648 మీరు సాయపడతారని కూడా చెప్పారు. 398 00:30:16,066 --> 00:30:18,485 చర్చలు జరపడానికి ఆస్కారం ఉంటుంది కదా. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. 399 00:30:20,612 --> 00:30:23,073 మిస్టర్ ఆబషీడ్జే చాలా శక్తిమంతమైన మనిషి. 400 00:30:25,701 --> 00:30:27,786 మీకు చాలా లాభదాయకంగా ఉంటుందని మాటిస్తున్నా. 401 00:30:30,122 --> 00:30:31,790 నేను మంచి న్యాయవాదిని. 402 00:30:32,624 --> 00:30:34,209 చాలా మంచి న్యాయవాదిని. 403 00:30:34,835 --> 00:30:37,045 కొన్నిసార్లు నేను సామాన్య పౌరుల తరఫున పోరాడుతుంటా. 404 00:30:37,754 --> 00:30:41,884 అప్పుడు నాకు పెద్ద లాభం లేకపోయినా కూడా నాకు సంతృప్తి లభిస్తుంది. 405 00:30:43,719 --> 00:30:46,972 కానీ అలాంటి వ్యక్తితో పెట్టుకోవడమంటే… 406 00:30:47,055 --> 00:30:48,223 నేనేం పిచ్చి దాన్ని కాదు. 407 00:30:49,641 --> 00:30:52,269 మీరు కూడా కాదనే అనుకుంటున్నా, మిస్ లీజియర్. 408 00:31:02,196 --> 00:31:04,031 నేను నా సామాను తీసుకొస్తా, ఆ తర్వాత వెళ్లిపోదామా? 409 00:31:04,114 --> 00:31:05,240 - అలాగే. - సరే. 410 00:31:11,205 --> 00:31:12,206 కమీల్? 411 00:31:14,666 --> 00:31:15,876 మీరు ఇక్కడేం చేస్తున్నారు? 412 00:31:16,752 --> 00:31:17,836 అన్నయ్య కాల్ చేశాడు. 413 00:31:18,712 --> 00:31:20,339 నువ్వు సాయపడాలనుకుంటున్నావని చెప్పాడు. 414 00:31:21,757 --> 00:31:23,383 నా దగ్గర ఒక ఐడియా ఉంది. 415 00:31:23,467 --> 00:31:24,551 చెప్పండి. 416 00:31:25,511 --> 00:31:26,887 మనం ఏదైనా ఏకాంతంగా ఉండే చోటికి వెళ్దామా? 417 00:31:28,889 --> 00:31:30,599 తప్పకుండా. ఇలా రండి. 418 00:31:33,477 --> 00:31:36,396 నేను టిబిలిసీకి వచ్చిన తర్వాత నాకు డావీట్ అంకుల్ గురించి తెలిసింది. 419 00:31:37,731 --> 00:31:39,399 నిజానికి నాకు, రమాజ్ ని పరిచయం చేసింది అతనే. 420 00:31:41,360 --> 00:31:42,611 నువ్వు డావీట్ కి స్నేహితుడివా? 421 00:31:44,321 --> 00:31:45,322 అవును. 422 00:31:45,948 --> 00:31:50,160 నువ్వు టమార్ కి సాయం చేస్తున్నావని తెలిస్తే, డావీట్ నీతో మాట్లాడను కూడా మాట్లాడడు. 423 00:31:50,244 --> 00:31:52,037 ఆమె అంటే అతనికి చాలా అసహ్యం. 424 00:31:52,829 --> 00:31:54,206 కాబట్టి మనం చాలా తెలివిగా వ్యవహరించాలి. 425 00:31:56,333 --> 00:31:59,086 అతను ఈ రాత్రి మీ పోష్ రెస్టారెంట్లోనే డిన్నర్ చేస్తున్నాడు. 426 00:32:01,255 --> 00:32:02,923 నాకొక టేబుల్ బుక్ చేయ్. 427 00:32:06,635 --> 00:32:08,929 వైన్ దొంగ, మిషెల్ పొలెంక్. 428 00:32:09,012 --> 00:32:10,138 మీరు అతడిని కలిశారా? 429 00:32:12,182 --> 00:32:13,600 కలిశా. 430 00:32:13,684 --> 00:32:16,520 అతను ఈ ఇంటికే వచ్చాడు. 431 00:32:17,646 --> 00:32:24,027 ప్రపంచంలోని గొప్ప గొప్ప వైన్లన్నీ ఫ్రాన్సులోనే తయారవుతాయని అన్నాడు, 432 00:32:24,111 --> 00:32:27,573 దానితో మా నాన్నకి మండిపోయింది. 433 00:32:28,115 --> 00:32:32,035 ఇక అతనికి మా నాన్న మా ప్రత్యేకమైన వైన్ ఇచ్చాడు. 434 00:32:34,079 --> 00:32:38,876 "నాకు దేవుడు కనిపిస్తున్నాడు" అని ఆ ఫ్రెంచి మనిషి అన్నాడు. 435 00:32:41,587 --> 00:32:45,591 నేను మీ వైన్ రుచి చూసినప్పుడు, నాకు దేవుడు కనిపించలేదు. 436 00:32:47,301 --> 00:32:48,844 వేరేది కనిపించింది. 437 00:32:51,096 --> 00:32:53,682 చందమామ కనిపించింది. 438 00:32:57,311 --> 00:33:02,566 అప్పట్నుంచీ, ఆ విజన్ నాకు నరకప్రాయంగా మారిపోయింది. 439 00:33:05,194 --> 00:33:08,989 నన్నేదో లాగేస్తూ నీట్లోనే ఉంచుతోంది. 440 00:33:12,618 --> 00:33:16,038 నేను డైవింగ్ ని మొదలుపెట్టినప్పటి నుండి, నాకు చీకటంటే భయం మొదలైంది. 441 00:33:17,247 --> 00:33:18,999 ఎందుకో నాకస్సలు అర్థమే కాలేదు. 442 00:33:19,082 --> 00:33:22,419 మీ వైన్, నన్ను ఒక చోటికి తీసుకెళ్లింది. 443 00:33:22,503 --> 00:33:23,879 నాకు ఒకటి చూపింది. 444 00:33:25,881 --> 00:33:27,549 రాత్రుళ్ళు నిద్రపట్టడం లేదు నాకు. 445 00:33:28,550 --> 00:33:30,135 చీకటంటే భయమేస్తోంది. 446 00:33:31,970 --> 00:33:33,222 చిన్నపిల్లాడిలా అయిపోయా. 447 00:33:39,436 --> 00:33:40,979 పట్టరాని క్రోధం వచ్చేస్తోంది. 448 00:33:43,232 --> 00:33:44,608 అది క్రోధం కాదు. 449 00:33:46,193 --> 00:33:47,819 నువ్వు బాధలో ఉన్నావంతే. 450 00:34:42,916 --> 00:34:44,126 ఎవరు? 451 00:34:45,627 --> 00:34:47,379 హిరోకజు. నేనే. 452 00:35:06,565 --> 00:35:08,108 నువ్వు ఇక్కడ ఉంటున్నావా? 453 00:35:11,195 --> 00:35:12,571 నాకు ఇక్కడ బాగుంది. 454 00:35:13,697 --> 00:35:14,990 ఏం కావాలి నీకు? 455 00:35:16,325 --> 00:35:17,701 నీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? 456 00:35:18,785 --> 00:35:20,037 ఇంత పొద్దుపోయాకనా? 457 00:35:21,788 --> 00:35:23,207 ఏమైనా తెలిసిందా? 458 00:35:24,583 --> 00:35:25,834 అతనికి కాల్ చేశావా? 459 00:35:26,752 --> 00:35:28,378 ఆసుపత్రికి కాల్ చేశా. 460 00:35:30,964 --> 00:35:32,591 కానీ వాళ్లు నాకేం చెప్పలేదు. 461 00:35:34,760 --> 00:35:35,928 ఏం జరుగుతోంది అసలు? 462 00:35:36,637 --> 00:35:37,971 నీకేమైనా తెలుసా? 463 00:35:40,891 --> 00:35:43,060 వాడికి కాల్ చేయ్. 464 00:35:45,687 --> 00:35:46,688 వాడు నీ కొడుకే. 465 00:35:48,440 --> 00:35:49,858 నిన్నేం కరవడు. 466 00:35:51,818 --> 00:35:52,819 గుడ్ నైట్. 467 00:36:28,397 --> 00:36:30,023 - గుడ్ ఈవినింగ్. - గుడ్ ఈవినింగ్. 468 00:36:30,524 --> 00:36:31,650 నేను ఒక టేబుల్ బుక్ చేసుకున్నా. 469 00:36:32,150 --> 00:36:33,986 - మీ పేరు చెప్పరా? - కమీల్ లీజియర్. 470 00:36:36,363 --> 00:36:37,364 ఇలా రండి. 471 00:36:55,883 --> 00:36:58,051 ఇంకెవరైనా వస్తున్నారా? 472 00:36:59,386 --> 00:37:00,804 లేదు, నేను ఒక్క దాన్నే. 473 00:37:17,154 --> 00:37:21,617 గియోర్గీ అలాదష్వీలీ వారి వైన్ సెల్లార్లోని "క్వవేరీ"లో, సపెరావీ ద్రాక్షతో తయారైన వైన్ ఓకేనా? 474 00:37:21,700 --> 00:37:25,537 ఆయన కాకసస్ పర్వతాల అడుగున వైన్ తయారు చేసే బయోడైనమిక్స్ మాస్టర్ అన్నమాట. 475 00:37:26,038 --> 00:37:30,501 అతని వైనరీ, లైమ్ తో నిర్మితమై, మంచుతో కప్పబడిన పర్వతాల కింద ఉంటుంది. 476 00:37:30,584 --> 00:37:34,546 క్యాండిడ్ బ్లాక్ బెర్రీ, పెన్సిల్ లెడ్ అరోమాలు మిమ్మల్ని సమ్మోహనపరుస్తాయి. 477 00:37:34,630 --> 00:37:39,259 ఇక చివర్లో తగిలే కాస్తంత ఉప్పదనం మీకు అమృతాన్ని పరిచయం చేస్తుంది. 478 00:37:41,261 --> 00:37:45,724 నేను జార్జియాకి రావడం ఇదే మొదటిసారి, నేను ఆరెంజ్ వైన్ గురించి విన్నా. 479 00:37:45,807 --> 00:37:47,142 మీ దగ్గర అది ఉందా? 480 00:37:47,226 --> 00:37:48,519 ఆరెంజ్ అంటే, మీ కేశాల రంగు. 481 00:37:48,602 --> 00:37:51,522 ఉల్లాసానికి, దాతృత్వానికి, తపనకి ప్రతీక ఆ రంగు. 482 00:37:56,693 --> 00:37:58,195 దాన్ని తర్వాత అందించగలం. 483 00:38:01,323 --> 00:38:04,076 ఇది కూడా అదే ఎస్టేట్లో తయారైనదే. 484 00:38:04,159 --> 00:38:06,787 మసరేషన్లో గియోర్గీ నేర్పరి. 485 00:38:07,746 --> 00:38:09,206 ఇది కిసీ 2020. 486 00:38:14,545 --> 00:38:16,338 అరోమాలను గుర్తించడం కాస్త కష్టంగానే ఉంటుంది. 487 00:38:16,421 --> 00:38:19,675 ప్లమ్ కంపోట్ పరిమళం తెలుస్తోందా? 488 00:38:23,095 --> 00:38:24,096 ఓరి దేవుడా. 489 00:38:26,139 --> 00:38:27,140 సారీ. 490 00:38:28,350 --> 00:38:30,811 - ఆ సీసాని ఇక్కడే పెట్టేయండి. - చాలా ఆరాటంగా ఉన్నారు. 491 00:38:32,396 --> 00:38:34,147 అది చాలా మంచి వైన్ లా అనిపిస్తోందే. 492 00:38:35,399 --> 00:38:36,608 చాలా అంటే చాలా బాగుంది. 493 00:38:38,402 --> 00:38:39,945 నేను కూడా ఒక బాటిల్ తెప్పించుకోవాలేమో. 494 00:38:40,028 --> 00:38:41,238 మీరు నా వైన్ ని షేర్ చేసుకోవచ్చు. 495 00:38:42,698 --> 00:38:45,033 అయితే, వచ్చి మాతో జాయిన్ అవ్వండి, మిస్… 496 00:38:45,117 --> 00:38:46,118 కమీల్. 497 00:38:50,998 --> 00:38:52,249 తప్పకుండా. 498 00:39:01,425 --> 00:39:03,552 మాకు కాస్త… ఎక్స్ క్యూజ్ మీ. ఇంకొన్ని గ్లాసులు తీసుకురారా? 499 00:39:03,635 --> 00:39:04,970 - హా, తప్పకుండా. - థ్యాంక్యూ. 500 00:39:18,275 --> 00:39:19,276 ఇదిగోండి. 501 00:39:26,325 --> 00:39:27,326 వావ్, బాగుంది. 502 00:39:28,118 --> 00:39:29,203 ప్లమ్. 503 00:39:30,662 --> 00:39:33,498 వీళ్లు వైన్లు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేస్తారు. 504 00:39:33,582 --> 00:39:34,791 పెద్ద పెద్ద కూజాల్లో అన్నమాట. 505 00:39:34,875 --> 00:39:37,794 వాటిని… వాటిని "క్వవేరీ" అని అంటారు. 506 00:39:39,004 --> 00:39:40,923 మిస్ లీజియర్ కి అది బాగా తెలుసనుకుంటా. 507 00:39:44,843 --> 00:39:47,638 లీజియర్ గైడ్ కి చెందిన కమీల్ లీజియరా? 508 00:39:49,264 --> 00:39:50,849 తను ఇక్కడికి నా సోదరి తరఫున మాట్లాడటానికి వచ్చింది. 509 00:39:53,060 --> 00:39:54,353 ఇవాళ సాయంత్రం నాకొక కాల్ వచ్చింది. 510 00:39:54,436 --> 00:39:56,813 నాకు మంచి స్నేహితురాలైన ఒక న్యాయవాది కాల్ చేసి, నీ గురించి హెచ్చరించింది. 511 00:39:57,689 --> 00:39:59,024 తను నేననుకున్న దాని కన్న చెత్త మనిషిలా ఉంది. 512 00:40:00,817 --> 00:40:03,070 నాకు, నా సోదరికి అస్సలు పడదు అనే విషయం యాంటన్ కి తెలుసు. 513 00:40:03,153 --> 00:40:04,613 కానీ అది మీకు తెలిసినట్టు లేదు, కదా? 514 00:40:05,948 --> 00:40:08,283 - తను కొంచెం చెప్పిందిలే. - కొంచెమా? 515 00:40:16,708 --> 00:40:18,377 క్షమించండి, డావీట్, 516 00:40:18,460 --> 00:40:21,713 మీకు మీ సోదరిపై కోపంగా ఉందని, 517 00:40:21,797 --> 00:40:25,592 ఎన్నో దశాబ్దాల నుండి మీ కుటుంబంలో భాగంగా ఉన్న వైన్ యార్డ్ ని నాశనం చేయడం తగదు. 518 00:40:28,720 --> 00:40:30,305 అసలు మీకేం కావాలి, మిస్ లీజియర్? 519 00:40:36,812 --> 00:40:38,397 మీ మనస్సాక్షిని అమ్ముకోకండి. 520 00:40:42,025 --> 00:40:45,112 చూడండి, నేను వ్యాపారవేత్తని. 521 00:40:46,405 --> 00:40:47,865 మరి నాకు లాభముండేది ఏదైనా చెప్పండి. 522 00:40:49,533 --> 00:40:51,785 ప్రస్తుతానికి, నేను ఇక్కడ నా వ్యాపార పని మీద ఉన్నా, కాబట్టి బయలుదేరండి. 523 00:40:53,203 --> 00:40:54,204 అయితే, దాన్ని నేనే కొంటా. 524 00:40:56,331 --> 00:40:57,583 దాన్ని నేను కొనగలను. 525 00:40:58,458 --> 00:41:00,210 ఇతను ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తా. 526 00:41:04,590 --> 00:41:05,591 వద్దు. 527 00:41:08,385 --> 00:41:09,386 గుడ్ నైట్. 528 00:41:42,085 --> 00:41:44,463 ఏమైంది? ఎలా జరిగింది? 529 00:41:45,297 --> 00:41:46,340 అస్సలు బాగా జరగలేదు. 530 00:41:50,969 --> 00:41:53,514 ఆబషీడ్జే వాళ్ల గురించి హెచ్చరించా కదా. 531 00:41:55,974 --> 00:41:57,392 చాలా మొండి కుటుంబం అది. 532 00:41:57,893 --> 00:41:59,019 అవునా? 533 00:42:01,438 --> 00:42:02,564 లీజియర్ కుటుంబం కన్నానా? 534 00:42:06,443 --> 00:42:08,487 టడాషీ అగీ & షూ ఒకిమోటో రూపొందించిన "డ్రాప్స్ ఆఫ్ గాడ్" మాంగా ఆధారితమైంది 535 00:42:39,810 --> 00:42:41,812 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్