1 00:00:10,135 --> 00:00:11,386 నేను ల్యాంబ్ ని. 2 00:00:11,386 --> 00:00:14,348 నేను ఫోన్ ఎత్తట్లేదంటే, నీతో మాట్లాడాలని నాకు లేదని అర్థం. 3 00:00:20,646 --> 00:00:23,815 హలో. బోల్తా కొట్టించేశా కదా మిమ్మల్ని? నేను మార్కస్ లాంగ్రిడ్జ్ ని. మెసేజ్ ఏంటో చెప్పండి. 4 00:00:23,815 --> 00:00:26,818 - తీసుకోండి. ఆస్వాదించండి. - థ్యాంక్స్. 5 00:00:28,862 --> 00:00:30,989 నేను రివర్ ని. మెసేజ్ ఏంటో చెప్పండి. 6 00:00:36,662 --> 00:00:37,663 హలో? 7 00:00:38,539 --> 00:00:40,958 హమ్మయ్య. ఇప్పటికి ఒకరైనా ఫోన్ ఎత్తారు. 8 00:00:42,251 --> 00:00:43,752 ఎక్కడ ఉన్నావు? 9 00:00:43,752 --> 00:00:45,420 అది నీకు అనవసరం. 10 00:00:45,420 --> 00:00:47,798 హా, నువ్వు చికడూకు రావాలి కదా. 11 00:00:47,798 --> 00:00:48,882 ఎందుకు? 12 00:00:48,882 --> 00:00:51,176 మన క్రిస్మస్ పార్టీ ఉంది కదా. 13 00:00:51,176 --> 00:00:53,095 మనకి ఏ క్రిస్మస్ పార్టీ లేదు. 14 00:00:53,095 --> 00:00:56,431 ఒకవేళ పార్టీ ఉన్నా, అది క్రిస్మస్ ముందు రోజు చేసుకుంటాం, చికడూలో చేసుకోం. 15 00:00:56,431 --> 00:00:59,476 హా. బహుశా నిన్ను పిలవలేదేమో. 16 00:00:59,476 --> 00:01:01,436 ల్యాంబ్ కేవలం నాలాంటి మేధావులనే పిలిచాడేమో. 17 00:01:01,436 --> 00:01:03,313 అయినా, నీకు అది ల్యాంబే చెప్పాడు కదా? 18 00:01:04,857 --> 00:01:08,151 క్రిస్మస్ పార్టీ ఎక్కడ అని నేను అడిగితే, ఇక్కడికి రమ్మని చెప్పాడు. 19 00:01:08,151 --> 00:01:09,236 అదీ మరి. 20 00:01:09,903 --> 00:01:11,905 విషయం ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమైందో లేదో చూద్దాం. 21 00:01:17,744 --> 00:01:22,165 హా, అలా అబద్ధాలు చెప్పాలన్నా, పిస్తాలకే చెప్తారు కదా... 22 00:01:24,585 --> 00:01:25,586 హలో? 23 00:02:22,935 --> 00:02:25,020 వెస్ట్ ఏకర్స్ షాపింగ్ కేంద్రంలో. 24 00:02:25,020 --> 00:02:26,438 కారు బాంబు అని నిర్ధారితమైంది. 25 00:02:27,314 --> 00:02:30,567 వెస్ట్ ఏకర్స్ 26 00:02:32,069 --> 00:02:33,779 ఫస్ట్ డెస్క్ వస్తున్నారు. 27 00:03:00,097 --> 00:03:01,473 నేను క్లాడ్ వీలన్ ని, ఫస్ట్ డెస్క్ ని. 28 00:03:01,473 --> 00:03:02,641 - నువ్వెవరు? - ఏజెంట్ సింగ్ ని. 29 00:03:02,641 --> 00:03:04,017 - సరే. - మేడమ్. 30 00:03:05,602 --> 00:03:08,605 ఇంత ఘోరం జరిగాక, నోట... నోట మాట రాదు. 31 00:03:08,605 --> 00:03:09,815 మనం కేవలం... 32 00:03:12,484 --> 00:03:14,361 అది కారు బాంబే అని నిర్ధారించుకున్నామా? 33 00:03:14,361 --> 00:03:16,238 హా, మేడమ్. సీసీటీవీ ఫుటేజీలో చూశాం. 34 00:03:16,238 --> 00:03:18,740 డ్రైవర్ కారులోనే ఉన్నాడు, కాబట్టి దాన్ని ఆత్మాహుతి దాడి అని అనవచ్చు. 35 00:03:18,740 --> 00:03:20,951 షాపింగ్ సెంటరులోనా! దేవుడా. 36 00:03:21,618 --> 00:03:24,204 జనాలు నడిచే ప్రాంతం గుండా కారును పోనిచ్చాడు, 37 00:03:25,163 --> 00:03:26,164 జనాలు అటూ ఇటూ పరుగెత్తారు, 38 00:03:27,583 --> 00:03:30,252 అతను నేరుగా ఎంట్రెన్స్ దగ్గరికి నడిపి, పేల్చేశాడు. 39 00:03:30,252 --> 00:03:31,712 దేవుడా. 40 00:03:31,712 --> 00:03:33,380 కారుకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? 41 00:03:34,173 --> 00:03:37,926 రాబర్ట్ వింటర్స్ అనే పేరు మీద అద్దెకు తీసుకున్నాడు, అతను 28 ఏళ్ల ఫ్రీలాన్స్ ఐటీ కన్సల్టెంట్, 42 00:03:37,926 --> 00:03:41,054 కానీ అతని బ్యాక్ గ్రౌండును పరిశీలించినా, ఈ పని ఎందుకు చేశాడో తెలీట్లేదు. 43 00:03:41,054 --> 00:03:43,849 అతని ప్రయాణాన్ని సీసీటీవీలో ట్రాక్ చేయండి. అతను ఎక్కడి నుండి వచ్చాడో మనం తెలుసుకోవాలి. 44 00:03:43,849 --> 00:03:47,853 అతను అద్దెకి తీసుకొన్న కార్ల కంపెనీకి అతను ఇచ్చిన, లెస్టర్ లోని చిరునామాని చెక్ చేశాం. 45 00:03:47,853 --> 00:03:49,479 అక్కడ చాలా ఏళ్ల నుండి ఎవరూ ఉండట్లేదు. 46 00:03:49,479 --> 00:03:52,441 పొరుగువారు, వింటర్స్ ని ఎప్పుడూ చూడలేదు, అతని గురించి ఎవరికీ తెలీదు కూడా. 47 00:03:53,358 --> 00:03:54,610 దేవుడా. 48 00:03:55,527 --> 00:03:57,029 అయితే, అతను అనామకుడు అన్నమాట. 49 00:03:57,029 --> 00:03:59,615 ఒకే దాడి చేయాలని ప్లాన్ ఏమో. 50 00:04:00,866 --> 00:04:02,534 లేదా ఈ దాడి దేనికైనా ఆరంభం కూడా కావచ్చు. 51 00:04:06,872 --> 00:04:10,042 {\an8}లండనులోని ప్రజానీకంతో మాట్లాడగా, 52 00:04:10,042 --> 00:04:13,837 {\an8}జనాల్లో ఒకరకమైన భయాందోళనలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. 53 00:04:13,837 --> 00:04:17,673 తాజా చర్యలో భాగంగా, కొన్ని రైళ్లలో సాయుధ పోలీసులను కాపలాగా ఉంచారు, 54 00:04:17,673 --> 00:04:21,762 కాకపోతే జనాలు దీన్ని ఆత్మవిశ్వాసం పెంచే చర్యలో భాగంగానే చూస్తున్నారు తప్ప, 55 00:04:21,762 --> 00:04:23,805 నిర్దిష్ట ప్రమాదాన్ని పరిష్కరించే చర్యలో భాగంగా చూడటం లేదు. 56 00:04:26,141 --> 00:04:28,101 అతను ఏదైనా నెట్ వర్క్ కి చెందిన వ్యక్తి అంటావా? 57 00:04:29,269 --> 00:04:31,188 ఇప్పుడల్లా మరో దాడి జరగలేదంటే, 58 00:04:31,188 --> 00:04:33,565 అతను ఒంటరి యోధుడని అనుకోవచ్చు. 59 00:04:33,565 --> 00:04:36,235 "ఒంటరి యోధుడు" అని అనకు. ఏదో పెద్ద వీరుడి గురించి చెప్తున్నట్టుంది అది. 60 00:04:36,235 --> 00:04:38,028 వాడు హంతకుడు, అంతే. 61 00:04:38,654 --> 00:04:39,696 సరే. ఇంకోసారి చీర్స్ చెప్పుకుందాం. 62 00:04:39,696 --> 00:04:42,449 ఇప్పుడే ఒక హంతకుడి గురించి చీర్స్ చెప్పుకున్నాం. వేరే దానికి చీర్స్ చెప్పుకుందాం. 63 00:04:45,035 --> 00:04:47,913 వచ్చే ఏడాది ఈ సమయానికి స్లో హౌస్ నుండి బయటపడుతున్నందుకు చీర్స్. 64 00:04:48,539 --> 00:04:50,499 హా. అది జరగకపోవచ్చులే. 65 00:04:50,499 --> 00:04:51,792 మనం మానేస్తే తప్ప, అది జరగదు. 66 00:04:54,837 --> 00:04:56,505 అయినా, నీకు మానేయాలని లేదు కదా, 67 00:04:56,505 --> 00:04:57,589 నిజం చెప్పు! 68 00:04:58,340 --> 00:05:01,051 దాని గురించి అయితే ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటా. అది మాత్రం నిజం. 69 00:05:03,428 --> 00:05:04,555 మంచిది. 70 00:05:05,556 --> 00:05:09,351 ఏదేమైనా, ఎప్పట్నుంచో 71 00:05:09,351 --> 00:05:13,021 నీతో ఒకటి చెప్దామనుకుంటూ ఉన్నాను, అది కూడా, 72 00:05:13,021 --> 00:05:15,774 - ఆఫీసులో కాక బయట చెప్దామనుకున్నా... - సరే. 73 00:05:15,774 --> 00:05:20,529 ...దాన్ని నీతో చెప్పుకోవచ్చు అనే అనిపించింది నాకు, 74 00:05:20,529 --> 00:05:22,573 ఎందుకంటే, మన... మన మధ్య సాన్నిహిత్యం పెరిగిందనిపిస్తోంది. 75 00:05:23,490 --> 00:05:25,117 - సరే. - ఇంకా... 76 00:05:27,953 --> 00:05:29,538 హద్దులు మీరడం నా ఉద్దేశం కాదు, 77 00:05:29,538 --> 00:05:32,332 మన మధ్య పని తప్ప వేరే ఊసు ఉండకూడదని నువ్వు అనుకున్నా, దాన్ని అర్థం చేసుకోగలను. 78 00:05:32,332 --> 00:05:33,417 - రివర్. క్షమించు. - అంటే... 79 00:05:33,417 --> 00:05:35,043 - నువ్వంటే నాకు ఇష్టమే, కానీ... - మా తాతయ్యకి... 80 00:05:38,297 --> 00:05:39,548 - ఏంటి? - లేదు, మీ తాతయ్య గురించి చెప్పు. 81 00:05:39,548 --> 00:05:40,924 లేదు, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? 82 00:05:40,924 --> 00:05:43,844 - నేనేమీ... నువ్వు చెప్పు. చెప్పు. - నేనేం చెప్పబోతున్నానని అనుకున్నావు? 83 00:05:43,844 --> 00:05:46,054 - నిన్ను డేటింగ్ కి పిలుస్తున్నానని అనుకున్నావా? - లేదు. 84 00:05:46,054 --> 00:05:48,724 - అవును, నువ్వు అలానే అనుకున్నావు. అవును. - లేదు. అవును, అనుకున్నా. 85 00:05:48,724 --> 00:05:51,727 ఎందుకంటే, లంచ్ తినాల్సిన సమయంలో డ్రింక్ తాగుదామని రమ్మన్నావు, 86 00:05:51,727 --> 00:05:53,687 ఏదో చెప్పాలనుకొనే కదా రమ్మంది, 87 00:05:53,687 --> 00:05:55,439 ఆ తర్వాత, మనిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని 88 00:05:55,439 --> 00:05:57,316 - ఒకటే సోది చెప్పడం మొదలుపెట్టావు... అవును. - సోదా? 89 00:05:57,316 --> 00:06:00,360 - అది నిజమే. నువ్వు నాకు ఆప్తురాలిగా కనిపిస్తావు. - ఇక మీ తాతయ్య గురించి మాట్లాడుకుందామా? 90 00:06:01,403 --> 00:06:02,404 సరే. 91 00:06:05,365 --> 00:06:07,951 - నాకేం అనిపిస్తోందంటే ఆయనకి... - ఆయనకి ఏంటి? 92 00:06:07,951 --> 00:06:09,036 అంటే... 93 00:06:13,832 --> 00:06:16,627 ఎప్పుడూ అయోమయంగానే ఉంటున్నాడు. 94 00:06:17,252 --> 00:06:18,378 అన్నీ మర్చిపోతున్నాడు. 95 00:06:18,378 --> 00:06:20,839 వయస్సు పెరిగినప్పుడు అవన్నీ మామూలే కదా? 96 00:06:20,839 --> 00:06:22,716 - ఆయనకి 80 ఏళ్లు దాటి ఉంటాయి కదా? - అది కాదు. 97 00:06:22,716 --> 00:06:24,801 ఆయనపై స్టౌట్లు నిఘా పెట్టారని భావిస్తున్నాడు. 98 00:06:24,801 --> 00:06:25,886 స్టౌట్లు అంటే ఎవరు? 99 00:06:25,886 --> 00:06:27,596 ఆయన తరంలో, నిఘా పెట్టే ఏజెంట్లను స్టౌట్లని పిలిచే వారు. 100 00:06:28,347 --> 00:06:29,932 పక్కనే తుపాకీ పెట్టుకొని పడుకుంటున్నాడు. 101 00:06:29,932 --> 00:06:31,016 అంటే... 102 00:06:31,725 --> 00:06:34,061 ఆయన్ని వృద్ధాశ్రమంలో వేస్తే మంచిదంటావా? 103 00:06:34,061 --> 00:06:36,522 హా. నాకు కూడా అలానే అనిపిస్తోంది. కానీ ఆయనకి అది నువ్వు చెప్పగలవా? 104 00:06:37,898 --> 00:06:42,903 కిందటి సారి నేను అతడిని కలిసినప్పుడు, మొదటి పది నిమిషాల్లో 105 00:06:43,820 --> 00:06:45,614 నేనెవరో ఆయన అస్సలు గుర్తు పట్టలేకపోయాడు. 106 00:06:45,614 --> 00:06:47,199 నేనెవరో ఆయనకి అర్థం కాలేదు. 107 00:06:49,201 --> 00:06:52,079 తన మనవడైన రివర్ గురించి చెప్తూనే ఉన్నాడు. నేను అస్సలు... 108 00:06:55,207 --> 00:06:56,583 అలా ఆయన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. 109 00:06:57,709 --> 00:06:58,961 చాలా బాధాకరమైన విషయం ఇది. 110 00:07:00,754 --> 00:07:02,756 - ఏంటి? - నిన్ను పెంచింది ఆయనే. 111 00:07:02,756 --> 00:07:05,968 నువ్వు అనాథ కాకుండా, నీ ఆలనాపాలనా ఆయనే చూసుకున్నాడు. 112 00:07:06,927 --> 00:07:08,387 కాబట్టి, ఇప్పుడు నీ వంతు. 113 00:07:08,387 --> 00:07:11,557 నువ్వు ఆయన దగ్గరికి వెళ్లాలి. ఈ రాత్రికే. 114 00:07:11,557 --> 00:07:15,185 హా, అది నాకు తెలుసు. నాకు తెలుసు. 115 00:07:18,313 --> 00:07:19,898 ఆ విషయం నీ నోటి నుండి కూడా వినాలని నీకు చెప్పా. 116 00:07:58,854 --> 00:08:02,107 నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. కానివ్వు. నాకు కనిపించు. బయటకు రా. 117 00:08:05,068 --> 00:08:06,612 రా! 118 00:08:07,738 --> 00:08:10,741 బయటకు రా. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. రా. 119 00:08:10,741 --> 00:08:11,950 నా కళ్ల ముందుకు రా. 120 00:08:11,950 --> 00:08:13,368 రా! 121 00:09:43,417 --> 00:09:44,501 రివర్. 122 00:09:45,210 --> 00:09:46,712 నన్ను లోపలికి రానిస్తావా? నేను తడిసి ముద్దయిపోయా. 123 00:09:46,712 --> 00:09:48,338 హా, భలే వాడివే. లోపలికి రా. 124 00:09:49,923 --> 00:09:51,133 రా. లోపలికి రా. 125 00:09:51,967 --> 00:09:55,053 కాల్ ఎందుకు చేయలేదు నువ్వు? చేసినా నేను చూసుకోలేదేమో. 126 00:09:55,053 --> 00:09:59,016 నేను కాల్ చేశా, కానీ నువ్వు ఎత్తలేదు. నేను బాత్రూమ్ కి వెళ్లొస్తా. 127 00:09:59,683 --> 00:10:03,770 ట్రాఫిక్ దారుణంగా ఉంది. బాత్రూమ్ కి ఎలాగూ, వెళ్తున్నా కనుక, నీకు స్నానానికి ఏర్పాట్లు చేయనా? 128 00:10:03,770 --> 00:10:05,564 నువ్వు కూడా వర్షంలో తడిసినట్టున్నావు. 129 00:10:05,564 --> 00:10:06,899 వర్షం బాగా పడింది. 130 00:11:01,078 --> 00:11:02,454 అయిపోవచ్చేసింది, తాతయ్య గారు. 131 00:11:22,724 --> 00:11:24,726 నువ్వు నా మనవడివి కాదు. 132 00:11:25,269 --> 00:11:28,480 బాబోయ్. నేనే. రివర్ ని. 133 00:11:29,857 --> 00:11:32,192 అయ్యో... చెప్పేది విను. ఆ తుపాకీని కాస్త కింద పెడతావా? 134 00:11:43,787 --> 00:11:45,038 ఓరి దేవుడా. 135 00:11:47,833 --> 00:11:50,669 దేవుడా. ఎంత పని చేశాను? 136 00:12:35,047 --> 00:12:37,132 {\an8}మిక్ హెర్రన్ రాసిన స్పూక్ స్ట్రీట్ ఆధారంగా తెరకెక్కించబడింది 137 00:14:02,801 --> 00:14:03,802 అబ్బా. 138 00:14:26,450 --> 00:14:27,701 ల్యాంబ్ ని మాట్లాడుతున్నా. 139 00:14:33,415 --> 00:14:34,499 అయ్యయ్యో. 140 00:14:57,981 --> 00:14:59,650 మరింత సమాచారం అందాక నీకు కాల్ చేస్తా. 141 00:15:01,276 --> 00:15:05,155 వాళ్లు అంతా వెతుకుతున్నారు, కానీ... ఆయన ఇప్పుడే వచ్చాడు. 142 00:15:05,155 --> 00:15:06,490 నీకు మళ్లీ కాల్ చేస్తా. 143 00:15:09,326 --> 00:15:10,494 ల్యాంబ్ అంటే మీరేనా? 144 00:15:11,537 --> 00:15:13,539 ఇంత అర్థరాత్రి వచ్చానంటే, నేను ల్యాంబేనా అని నాకే అనిపిస్తోంది. 145 00:15:14,331 --> 00:15:16,708 నా పేరు ఎమ్మా ఫ్లైట్. డఫీ స్థానంలో వచ్చా. 146 00:15:17,209 --> 00:15:18,961 నువ్వు ఆయన కన్నా మేలే అని తెలిసిపోతోంది. 147 00:15:20,754 --> 00:15:23,632 అంటే, అతగాడి శరీరం చచ్చుబడిపోయి, కోమాలో ఉన్నాడు కదా. 148 00:15:23,632 --> 00:15:26,009 ఆయన కోమాలో ఉండటానికి గల కారణం మీ ఏజెంటే అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. 149 00:15:26,009 --> 00:15:29,847 గుసగుసల్లో ఏవేవో మాట్లాడుకుంటుంటారు, వాటిల్లో సగం పుకార్లే ఉంటాయి, నిజాలు ఉండవు. 150 00:15:30,764 --> 00:15:33,517 డఫీ ముందు ఉన్న వాడు ఇంకా పిస్తా అన్నమాట. 151 00:15:33,517 --> 00:15:35,143 పిచ్చి శామ్ చాప్మన్. 152 00:15:35,936 --> 00:15:37,229 అది ఉత్త పేరేలే. 153 00:15:37,229 --> 00:15:38,939 మరీ అంత పిచ్చోడేం కాదు. 154 00:15:38,939 --> 00:15:41,733 కాకపోతే, ఒకసారి పాతిక కోట్ల పౌండ్స్ ని పోగొట్టుకున్నాడు, అంతేగా! 155 00:15:42,651 --> 00:15:44,319 పిచ్చోడేం కాదని అన్నా. 156 00:15:44,319 --> 00:15:46,196 పిస్తా అని చెప్పలేదుగా. 157 00:15:48,156 --> 00:15:49,950 క్రైమ్ సీన్ ని చూపిస్తావా? 158 00:15:50,534 --> 00:15:51,743 మీకు మిస్టర్ కార్ట్ రైట్ తెలుసా? 159 00:15:52,494 --> 00:15:55,539 నేరం జరిగినప్పుడు నేను వేరే చోట ఉన్నా, డయానా మహారాణి గారితో సానాలో ఉన్నా. 160 00:15:55,539 --> 00:15:56,874 కావాలంటే, ఆమెని అడుగు. 161 00:15:56,874 --> 00:15:58,041 మీకు మిస్టర్ కార్ట్ రైట్ తెలుసా? 162 00:15:58,041 --> 00:15:59,918 - ఏ కార్ట్ రైట్? - ఇద్దరూ. 163 00:16:00,627 --> 00:16:03,088 చిన్నోడికి నేనే బాస్. 164 00:16:03,088 --> 00:16:06,133 అతని తాత ఒకసారి నాకొక పని అప్పగించాడు. 165 00:16:09,386 --> 00:16:10,888 బూట్లు బాగున్నాయి. 166 00:16:11,513 --> 00:16:13,265 నీకు బట్టలకు కూడా భత్యం లభిస్తుందా? 167 00:16:20,981 --> 00:16:21,899 నీ యెంకమ్మ. 168 00:16:29,406 --> 00:16:30,616 నువ్వు సిద్ధంగానే ఉన్నావా? 169 00:16:40,042 --> 00:16:42,002 అయితే, పనికి రాని ఏజెంట్లకు మీరు ఇన్ ఛార్జీ అన్నమాట. 170 00:16:42,586 --> 00:16:44,254 అలా పిలవడం వాళ్లకి నచ్చదు. 171 00:16:44,254 --> 00:16:46,381 - వాళ్లని మీరేమని పిలుస్తారు? - పనికి రాని ఏజెంట్లు. 172 00:16:49,218 --> 00:16:51,303 ఇక్కడ చూడు, గురూ. నువ్వు అది మిస్ అయ్యావు. 173 00:16:57,851 --> 00:16:59,228 లోపల దారుణంగా ఉంది. 174 00:17:01,104 --> 00:17:02,814 నేను ఎన్నో దారుణాలని చూశాలే. 175 00:17:16,161 --> 00:17:18,454 ఎవరో ప్యానిక్ బటన్ ని తొమ్మిది గంటల మూడు నిమిషాలకు నొక్కారు. 176 00:17:18,454 --> 00:17:20,624 స్థానిక పోలీసులు తొమ్మిది గంటల 49 నిమిషాలకు వచ్చారు. 177 00:17:21,290 --> 00:17:23,544 చాలా తొందరగా వచ్చేశారే. ఎమర్జెన్సీ కాదు కాబట్టి సరిపోయింది. 178 00:17:24,377 --> 00:17:26,964 అంతకు ముందు వారం పెద్దాయన, ప్యానిక్ బటన్ ని రెండుసార్లు నొక్కాడు. 179 00:17:26,964 --> 00:17:29,675 ఒకసారి అదేంటో మర్చిపోయాడట, ఏంటో తెలుసుకుందామని నొక్కాడట. 180 00:17:29,675 --> 00:17:33,554 ప్యానిక్ బటన్లు ఎక్కడ ఉంటాయో ట్రేస్ చేయవచ్చు, అది తెలుసా నీకు? 181 00:17:33,554 --> 00:17:34,847 థ్యాంక్స్. నోట్ చేసుకుంటాలే ఆ విషయాన్ని. 182 00:17:34,847 --> 00:17:37,516 కానీ అతను నొక్కిన ప్యానిక్ బటన్, వంట గదిలోని టేబుల్ కి పెట్టి ఉన్న బటన్ అని ట్రేస్ చేశా. 183 00:17:38,100 --> 00:17:40,310 దాని కింద చూశావా? 184 00:17:44,606 --> 00:17:45,858 ఏం వెతుకుతున్నారు మీరు? 185 00:17:45,858 --> 00:17:47,234 ఆల్క-సెల్జర్. 186 00:17:48,151 --> 00:17:51,905 నేను ఎక్కువగా తాగను, కానీ డిన్నర్ చేసే ముందు మామూలుగా ఒక పెగ్గు వేస్తుంటా. 187 00:17:51,905 --> 00:17:54,658 ఇది క్రైమ్ సీన్, మందుల షాప్ కాదు. 188 00:17:55,951 --> 00:17:58,412 అతడిని రెండుసార్లు కాల్చాడు. ఒకసారి ఛాతీపై, ఇంకోసారి ముఖంపై. 189 00:17:59,037 --> 00:18:00,873 ఒకసారి కాల్చుంటే చాలేమో. 190 00:18:00,873 --> 00:18:03,125 కానీ మనోడు భలే చిరాకు తెప్పిస్తుంటాడు అనుకో. 191 00:18:03,125 --> 00:18:04,543 మీరు ఆందోళన చెందుతున్నట్టుగా అనిపించట్లేదే. 192 00:18:05,460 --> 00:18:07,838 - నా ఏజెంట్లను చాలా మందినే కోల్పోయానులే. - అప్పుడు మీరు ఫీల్డ్ ఏజెంట్. 193 00:18:07,838 --> 00:18:10,007 హా, చడ్డీలు వేసుకున్నప్పుడు ఏజెంటునే. 194 00:18:11,675 --> 00:18:13,844 అతని దగ్గర ఇవి దొరికాయి. 195 00:18:14,636 --> 00:18:16,847 - ఫోన్, పర్సా? - రెండూ కార్ట్ రైట్ వే. 196 00:18:16,847 --> 00:18:18,807 మరి నన్నెందుకు రమ్మన్నావు? 197 00:18:18,807 --> 00:18:20,142 అధికారికంగా గుర్తించడానికి. 198 00:18:22,102 --> 00:18:23,478 ఇలా ఉన్నప్పుడు గుర్తించడం కష్టమే. 199 00:18:23,478 --> 00:18:25,314 గుర్తించడంలో సహాయపడే గుర్తులు అతనికి ఏమైనా ఉన్నాయా? 200 00:18:25,314 --> 00:18:28,066 ఇంతకుముందు ముఖం ఉండేది. అది ఉపయోగపడుతుందా? 201 00:18:28,901 --> 00:18:32,070 - టాటూలు, మచ్చలు, కమ్మలు లాంటివేవైనా? - అవన్నీ నాకెలా తెలుస్తాయి? 202 00:18:32,070 --> 00:18:34,323 ఆఫీసుకు బట్టలు వేసుకుని రమ్మని చెప్తాను నేను. 203 00:18:35,199 --> 00:18:36,575 అతనేనా? 204 00:18:43,165 --> 00:18:44,875 హా, అతనే. 205 00:18:46,043 --> 00:18:46,877 పక్కానా? 206 00:18:47,961 --> 00:18:49,755 ఇది రివర్ కార్ట్ రైట్ దేహమే. 207 00:18:59,056 --> 00:19:01,642 - అయితే, అతను ఎక్కడ? - ఎవరు? 208 00:19:02,726 --> 00:19:03,936 ముసలి నక్క. 209 00:19:05,270 --> 00:19:06,980 మేము ఆయన్ని అలానే పిలిచే వాళ్లం. 210 00:19:08,482 --> 00:19:11,985 అతను గుంట నక్కే. అది మాత్రం పక్కాగా చెప్పగలను. 211 00:19:11,985 --> 00:19:13,487 మాకు తెలీదు. 212 00:19:14,780 --> 00:19:18,992 వెస్ట్ ఏకర్స్ ఉదంతం కారణంగా, దీన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారు కదా. 213 00:19:18,992 --> 00:19:21,036 వెస్ట్ ఏకర్స్ ఉదంతానికి, దీనికి సంబంధం ఏంటి? 214 00:19:21,870 --> 00:19:22,871 ఏమీ లేదు. 215 00:19:23,830 --> 00:19:27,042 కానీ లండన్ లో బాంబు పేలితే, అది నిఘా సర్వీస్ వైఫల్యమే అవుతుంది, 216 00:19:27,042 --> 00:19:29,878 మరి వైఫల్యానికి నిలువెత్తు రూపం, మా రివర్ కార్ట్ రైట్. 217 00:19:29,878 --> 00:19:33,423 ఈ విషయం బయటకు పొక్కితే, సోషల్ మీడియా తోపులు దీనికి, దానికి లింకులు కట్టేస్తారు. 218 00:19:33,423 --> 00:19:35,092 అంత దాకా రాక ముందే, మేము విచారణని ముగించేస్తాం. 219 00:19:36,468 --> 00:19:39,763 మీ మీద నాకంత నమ్మకం లేదులే. 220 00:19:42,975 --> 00:19:43,976 సూపర్. 221 00:19:44,643 --> 00:19:46,311 ఆ పని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలరా? 222 00:19:46,311 --> 00:19:47,604 ఎందుకు? ఇంకోసారి వేయాలా? 223 00:19:49,189 --> 00:19:50,440 మీ తీరు పరుషంగా ఉంది, ఏమీ బాగాలేదు. 224 00:19:50,440 --> 00:19:53,777 నేను బాధలో ఉన్నాను. అది అసాధారణ మార్గాల్లో బయటకు వస్తూ ఉంటుంది. 225 00:19:55,237 --> 00:19:57,239 సీనియర్ కార్ట్ రైట్ ఎక్కడికి వెళ్లుండవచ్చు? 226 00:19:58,699 --> 00:20:01,410 నాకు తెలీదు. ఇక నేను వెళ్లి పడుకుంటా. 227 00:20:02,911 --> 00:20:05,122 స్నానం చేయవచ్చు కదా? 228 00:20:05,873 --> 00:20:07,124 హా, నాకు కూడా నీతో చేయాలనే ఉంది, 229 00:20:07,124 --> 00:20:09,084 కానీ ఇప్పుడు అది సముచితం అనిపించుకోదు. 230 00:20:09,084 --> 00:20:12,629 నా ఏజెంట్ ఒకడు చనిపోయాడు, ఈ సమయంలో రొమాన్స్ సరి కాదు. 231 00:20:38,780 --> 00:20:40,324 {\an8}పెనాల్టీ ఛార్జీ, నోటీసు లోపల ఉంది హెచ్చరిక 232 00:21:19,029 --> 00:21:20,113 ఫస్ట్ డెస్క్ క్లాడ్ వీలన్ 233 00:21:20,113 --> 00:21:21,198 లోపలికి రండి. 234 00:21:22,241 --> 00:21:25,869 ...ప్రకారం, వింటర్స్ ఆ ప్రదేశానికి కారులో... 235 00:21:25,869 --> 00:21:28,830 - క్లాడ్, నేను... - డయానా, వచ్చి మంచి పని చేశావు. 236 00:21:28,830 --> 00:21:31,375 ఇది నా తొలి కోబ్రా సమావేశం, కాబట్టి, అక్కడ ఏం జరగవచ్చో 237 00:21:31,375 --> 00:21:34,044 కాస్త నువ్వు నాకొక ఐడియా ఇవ్వగలవా? 238 00:21:35,629 --> 00:21:37,923 - సరే. అంటే, నేను... - దయచేసి, కూర్చో. 239 00:21:39,049 --> 00:21:40,717 - చాలా పనులు ఉన్నాయి నాకు, కాబట్టి... - అవును. హా. 240 00:21:40,717 --> 00:21:43,011 ...నీకు ఓకే అయితే, ముఖ్యమైనవి చెప్తా. 241 00:21:43,011 --> 00:21:44,471 తప్పకుండా, అవి ఓకేలే. 242 00:21:45,389 --> 00:21:47,224 - పొదుపుగా మాట్లాడాలి, కానీ విషయం ఉండాలి. - పొదుపు, విషయం. 243 00:21:47,224 --> 00:21:48,976 మానవ నిఘా అన్నాక పొరపాట్లు సహజమని నొక్కి చెప్పు. 244 00:21:49,893 --> 00:21:51,937 తెలీదు అని చెప్పడానికి భయపడనక్కర్లేదు, 245 00:21:51,937 --> 00:21:53,814 ఆధారాలు లభించగల విషయాల జోలికి వెళ్లకు, 246 00:21:53,814 --> 00:21:55,482 లీక్ కాకుండా ఉండాల్సిన సమాచారాన్ని వాళ్లకి చెప్పకు. 247 00:21:55,482 --> 00:21:57,985 - హా, తప్పకుండా. - రక్షణ శాఖ సెక్రటరీని పట్టించుకోవద్దు, 248 00:21:57,985 --> 00:22:01,738 సైనిక నిఘాయే మేలని చెప్పుకోవడానికి అతను నిన్ను తక్కువ చేసి మాట్లాడతాడు. 249 00:22:01,738 --> 00:22:04,700 ఒక హెచ్చరిక, ఒకవేళ నువ్వు సూచించిన దానికి ప్రధాన మంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తే, 250 00:22:04,700 --> 00:22:06,326 హోమ్ సెక్రెటరీ మనపై రెచ్చిపోతుంది, 251 00:22:06,326 --> 00:22:09,955 అంతకు ముందే నువ్వు చెప్పిన వాటన్నింటికీ ఆమె తలూపినా కూడా, 252 00:22:09,955 --> 00:22:12,791 - కానీ... మొత్తంగా, పెద్దగా ఏమీ కాదులే. - సరే. ఏదేమైనా థ్యాంక్స్... 253 00:22:12,791 --> 00:22:16,128 కానీ, ఇంకొక మరణం సంభవించిందని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా. 254 00:22:18,463 --> 00:22:19,548 బాబోయ్, మరొక బాంబు దాడా? 255 00:22:19,548 --> 00:22:20,924 కాదు, కాదు. 256 00:22:22,259 --> 00:22:24,011 దానికి సంబంధం లేని కాల్పుల ఘటనలో. 257 00:22:24,011 --> 00:22:28,307 - కానీ చనిపోయింది ఒక ఏజెంట్. - అయ్యయ్యో. 258 00:22:28,307 --> 00:22:33,520 రివర్ కార్ట్ రైట్ ని, తన తాతయ్య డేవిడ్ కార్ట్ రైట్ కాల్చాడు. 259 00:22:33,520 --> 00:22:34,855 డేవిడ్ కార్ట్ రైట్? 260 00:22:35,480 --> 00:22:38,317 కానీ ఆరోజుల్లో ఆయన మన ఏజెంట్లలో గొప్పవాడు కదా? 261 00:22:38,317 --> 00:22:40,068 నేను ఆయన్ని ఎప్పుడూ కలుసుకోలేదులే, కానీ... 262 00:22:41,195 --> 00:22:44,364 ఒక్క నిమిషం, అసలు అతను తన మనవడిని ఎందుకు కాల్చాడు? 263 00:22:44,364 --> 00:22:48,869 తన మనవడిని ఎవరో ఆగంతకుడని అనుకున్నాడట, కానీ ఫ్లైట్ పరిస్థితిని చూసుకుంటోందిలే. 264 00:22:48,869 --> 00:22:51,496 సరే. ఇంతకీ, తను ఎలా ఉందనిపిస్తోంది నీకు? 265 00:22:51,496 --> 00:22:53,665 - బాగానే ఉంది. - హా. నువ్వు కావాలనుకుంది తనని కాదని నాకు తెలుసు. 266 00:22:53,665 --> 00:22:55,125 తనని నేను కావాలనుకున్నా. 267 00:22:55,125 --> 00:22:57,085 కానీ, తనని ఎంచుకోవడమనేది నీ విధానం ప్రకారం జరిగింది. 268 00:22:57,085 --> 00:23:00,839 బయటి వారిని నియమించుకోవడం వల్ల జరిగే మేలును నువ్వు గ్రహిస్తావనే అనుకుంటున్నా, డయానా. 269 00:23:00,839 --> 00:23:03,383 అంటే, తను అంతర్గత రాజకీయాలకు ప్రభావితం కాదు, 270 00:23:03,884 --> 00:23:06,136 జవాబుదారీతనానికి మనం ఇస్తున్న ప్రాముఖ్యతకి అది సాయపడుతుంది. 271 00:23:06,136 --> 00:23:08,931 కార్ట్ రైట్ సంఘటన గురించి మనం జనాలకి తెలీకుండా చూసుకుందాం. 272 00:23:08,931 --> 00:23:11,725 డేవిడ్ ని కనుగొని, ఏం జరిగిందో తెలుసుకొనేదాకా దాన్ని రహస్యంగానే ఉంచుదాం. 273 00:23:11,725 --> 00:23:14,728 సరే. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. దారుణం అది. డయానా? 274 00:23:14,728 --> 00:23:15,812 హా. 275 00:23:15,812 --> 00:23:18,440 అంటే... ఈ కోబ్రా సమావేశానికి 276 00:23:18,440 --> 00:23:21,527 నా స్థానంలో నువ్వు వెళ్లగలవా? 277 00:23:21,527 --> 00:23:23,278 అది ఫస్ట్ డెస్క్ డ్యూటీ. 278 00:23:23,779 --> 00:23:25,781 ఏ విధంగా చూసినా కానీ, టియర్నీ స్థానంలోకి నేను వచ్చాక, 279 00:23:25,781 --> 00:23:27,658 అన్నీ దగ్గరుండి, చక్కగా చూసుకుంది నువ్వే. 280 00:23:27,658 --> 00:23:30,994 ఈ పరిస్థితి ప్రాముఖ్యత దృష్ట్యా, అలాగే నీకు ఉన్న అనుభవం దృష్ట్యా, 281 00:23:30,994 --> 00:23:35,123 ఆ సమావేశానికి నువ్వు వెళ్లి, ఏం జరిగిందో నాకు చెప్తేనే 282 00:23:35,123 --> 00:23:37,251 వాళ్లకి ఓకే అనుకుంటా. ఏమంటావు? 283 00:23:39,253 --> 00:23:40,087 అలాగే. 284 00:23:40,087 --> 00:23:43,507 - అలాగేనా? అంటే నీకు ఓకేనా? అంటే... సూపర్. - అవును. హా. నువ్వేదంటే అదే. 285 00:23:43,507 --> 00:23:45,008 చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్యూ. 286 00:23:54,935 --> 00:23:55,978 సరే మరి. 287 00:24:02,234 --> 00:24:04,862 వెస్ట్ ఏకర్స్ పై బాంబు దాడి ఎందుకు చేశావు? 288 00:24:06,947 --> 00:24:08,490 మీ నెట్వర్కులో మొత్తం ఎంత మంది ఉన్నారు? 289 00:24:11,910 --> 00:24:13,412 మీ తదుపరి లక్ష్యం ఏంటి? 290 00:24:15,914 --> 00:24:16,915 హేయ్. 291 00:24:17,875 --> 00:24:20,252 మీ తదుపరి లక్ష్యం ఏంటి? 292 00:24:22,379 --> 00:24:25,591 అనుమానితుల చేత మాట్లాడించాలంటే ఇలాగే చేయాలి. విచారణ గదిలోకి నన్ను పంపిస్తే చాలు. 293 00:24:27,467 --> 00:24:29,887 నీకు చెప్పకుండా దాచాలని నిజంగానే నాకు ఉంటే, ఇంకా ఎక్కువ సేపు దాచగలను. 294 00:24:29,887 --> 00:24:33,849 - లేదు, ఎవరైనా ఎప్పుడైనా కక్కేయాల్సిందే. - నేనెప్పుడు కక్కుతాను? 295 00:24:36,602 --> 00:24:38,979 - ఏడు సెకన్లలో. - అంతేనా? 296 00:24:38,979 --> 00:24:41,523 - సరే. ఇక నాకు ఇవ్వాల్సింది ఇచ్చుకో. - అబ్బా. 297 00:24:46,111 --> 00:24:48,238 - సూపర్. - రెండొందలే. 298 00:24:48,238 --> 00:24:49,448 హా, సరే. 299 00:24:51,116 --> 00:24:53,452 ఇప్పుడు నాకు అర్థమైపోయింది కదా, ఈ సారి ఒక నిమిషం దాకా ఓర్చుకోగలను. 300 00:24:53,452 --> 00:24:55,204 - అబ్బో. - అవును. 301 00:24:58,582 --> 00:25:01,168 ఇక్కడేం జరుగుతోంది? ఎక్కడి నుండైనా నీళ్లు కారుతున్నాయా? 302 00:25:01,168 --> 00:25:02,377 లేదు. ఇతను నీటితో చంపుతున్నాడు. 303 00:25:03,962 --> 00:25:04,963 ఎందుకు? 304 00:25:04,963 --> 00:25:06,673 పందెం కోసం. పేపర్ క్లిప్స్ కోసం. 305 00:25:06,673 --> 00:25:09,259 జూదానికి దూరంగా ఉండటంలో ఇతనికి పేపర్ క్లిప్స్ సాయపడతాయి. 306 00:25:11,595 --> 00:25:14,181 ఈ ఆఫీస్ ఇప్పటికే చండాలంగా ఉంది. 307 00:25:17,809 --> 00:25:19,603 తల తుడుచుకో, బంగారం. 308 00:25:21,813 --> 00:25:23,607 పార్కులో ఉన్నప్పుడు, 309 00:25:23,607 --> 00:25:26,944 నేను డేటాబేస్ క్వీన్స్ కి డెస్క్ అలొకేటర్ గా పని చేశా. 310 00:25:26,944 --> 00:25:28,237 అది ఇది వరకే చెప్పావు. 311 00:25:28,237 --> 00:25:30,197 అంటే ఏంటో ఇప్పటికీ నాకు తెలీదు. 312 00:25:30,197 --> 00:25:33,617 అంటే, ప్రతీ ఆఫీసులోని మేనేజ్ మెంట్ కి నాకు యాక్సెస్ ఉండేదని అర్థం. 313 00:25:34,284 --> 00:25:36,662 ఎవరు ఏం చేస్తున్నారో, ఎప్పుడు చేస్తున్నారో నాకు తెలిసిపోయేది. 314 00:25:36,662 --> 00:25:39,706 కానీ, ఈ ఆఫీసును చూసుకోవడం నాకు కష్టంగానే ఉంది. 315 00:25:40,666 --> 00:25:42,876 క్రిస్మస్ అలంకరణలను ఎప్పుడు తీసేస్తారు మీరు? 316 00:25:43,377 --> 00:25:45,003 మేము టాస్ వేసుకున్నాం. ఆ పని షర్లీ చేయాలి. 317 00:25:45,003 --> 00:25:46,255 నేను చేయను. టాస్ మూడుసార్లు వేద్దాం. 318 00:25:47,047 --> 00:25:49,591 త్వరగా తీసేయండి, ఆలస్యమైతే మనకి దురదృష్టం అంటుకుంటుంది. 319 00:25:50,384 --> 00:25:52,094 మనకేదో అదృష్టం ఉన్నట్టు ఇప్పుడు! 320 00:25:54,221 --> 00:25:55,305 అబ్బా. 321 00:25:56,348 --> 00:25:59,434 పోయిన వారానికి సంబంధించినవి ఇవి, ఈ పని చూడండి మీరు. 322 00:26:01,436 --> 00:26:03,230 ఏంటి, కౌన్సిళ్లకి శబ్దం ఎక్కువ వస్తుందని చేసిన ఫిర్యాదులా? 323 00:26:03,230 --> 00:26:05,899 - వాటిని తేదీల వారీగా పెట్టాలి. - సరే. 324 00:26:05,899 --> 00:26:09,361 సరే, కానీ ఇలాంటి వాటిని ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా పెట్టమని క్యాథరిన్ చెప్తుంది, కాబట్టి... 325 00:26:09,361 --> 00:26:12,114 కానీ ఇక్కడ క్యాథరిన్ లేదు కదా? 326 00:26:14,074 --> 00:26:15,075 ఏదైతే, ఏంటిలే. 327 00:26:15,784 --> 00:26:17,578 ఇదేమీ పనికి వచ్చే పని కాదు కదా. 328 00:26:19,580 --> 00:26:22,207 గుడ్ మార్నింగ్, జేకే. చూసుకొని అడుగు వేయ్. 329 00:26:23,834 --> 00:26:25,586 నిన్ను కో అని పిలవాలా? 330 00:26:28,547 --> 00:26:29,715 మిస్టర్ కో అని పిలవాలా? 331 00:26:36,221 --> 00:26:38,724 - ఇప్పటికి మనోడేమైనా నోరు విప్పి మాట్లాడాడా? - ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. 332 00:26:39,349 --> 00:26:41,351 నిజం చెప్పాలంటే, అందుకు నాకు సంతోషంగానే ఉంది. 333 00:26:44,688 --> 00:26:46,732 ఎప్పుడూ ఇలానే చేస్తుంటాడా? 334 00:26:46,732 --> 00:26:49,776 పని మధ్య ఖాళీ ఉంటే అలానే చేస్తుంటాడు. కాబట్టి అతనికి త్వరగా ఏదైనా పని అప్పజెప్పు. 335 00:27:09,254 --> 00:27:10,464 1.95 అయింది. 336 00:27:15,135 --> 00:27:16,970 రాక్షసుడి ఆలోచన 337 00:27:16,970 --> 00:27:20,182 నిండా జనాలు ఉండే షాపింగ్ మాల్ ని పేల్చాడంటే వాడసలు మనిషేనా? 338 00:27:20,724 --> 00:27:22,309 తర్వాత ఏం జరుగుతుందో అనే భయం కలుగుతుంది. 339 00:27:22,309 --> 00:27:25,979 హా. నాకు జఫ్ఫా కేక్స్ కావాలి. 340 00:27:25,979 --> 00:27:28,565 ఇంకా, ఆల్క-సెల్జర్ కూడా ఇవ్వు. 341 00:27:32,819 --> 00:27:34,404 {\an8}ఇదుగో. థ్యాంక్స్. 342 00:27:39,660 --> 00:27:42,371 మీరు నన్ను అణచివేశారు. 343 00:27:45,374 --> 00:27:47,501 నాలోని హింసని తట్టి లేపారు. 344 00:27:49,962 --> 00:27:52,339 ఇప్పుడు నాకు స్వేచ్ఛ లభించింది. 345 00:27:52,339 --> 00:27:53,465 రెండు నిమిషాల్లో చేరుకుంటాం. 346 00:27:55,300 --> 00:27:59,763 మీ వ్యవస్థ కారణంగా చాలా ఏళ్లు బంధీగా గడిపాను, దానికి మీరు శిక్ష అనుభవించాల్సిందే. 347 00:28:04,142 --> 00:28:06,353 {\an8}నాలా అనేక మంది పుట్టుకొస్తారని ఆశిస్తున్నా. 348 00:28:15,863 --> 00:28:18,699 {\an8}- త్వరలోనే నా సోదరులు మిమ్మల్ని పలకరిస్తారు. - ఏంటి సంగతి? 349 00:28:18,699 --> 00:28:20,909 {\an8}ఆ శవం రివర్ కార్ట్ రైట్ దేనని ల్యాంబ్ గుర్తించాడు. 350 00:28:20,909 --> 00:28:21,994 అయితే, అది నిర్ధారితమైపోయిందిగా? 351 00:28:21,994 --> 00:28:23,745 ల్యాంబ్ నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా? 352 00:28:23,745 --> 00:28:25,581 ల్యాంబ్ లాంటి వాళ్లు నాకు కొత్త కాదులే. 353 00:28:25,581 --> 00:28:26,874 ల్యాంబ్ నీకు కొత్తే, అతను మామూలోడు కాదు. 354 00:28:26,874 --> 00:28:28,792 - డేవిడ్ ఎక్కడ ఉన్నాడు? - ఇంకా అతని ఆచూకీ తెలీలేదు. 355 00:28:28,792 --> 00:28:31,461 అర్ధరాత్రి కారు దూసుకెళ్లిన శబ్దం వినబడిందని పొరుగున ఉండే వ్యక్తి చెప్పారు. 356 00:28:31,461 --> 00:28:32,880 ఈ కార్ట్ రైట్స్ కి ఓ దండం. 357 00:28:32,880 --> 00:28:35,424 మన దగ్గర సిబ్బంది కొరత ఉంది, అలాంటప్పుడు వాళ్లు ఇలా చేశారు, ఇంకేమనాలి? 358 00:28:36,049 --> 00:28:37,759 కార్ట్ రైట్ సీనియర్ ఆచూకీని కనుక్కో! 359 00:28:37,759 --> 00:28:39,178 నేను వెస్ట్ ఏకర్స్ పని చూస్తే మేలేమో కదా? 360 00:28:39,178 --> 00:28:41,430 బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి ఇంటిని మీరు ట్రేస్ చేశారని తెలిసింది. 361 00:28:41,430 --> 00:28:43,473 అక్కడికి ఇప్పుడు ఒక సాయుధ దళం వెళ్తోంది. 362 00:28:43,473 --> 00:28:46,018 నువ్వు కార్ట్ రైట్ హత్య కేసును చూసుకో. 363 00:28:48,812 --> 00:28:51,356 - రెండు నిమిషాల్లో చేరుకుంటారు, మేడమ్. - ఇంటిలోకి ఎవరైనా వెళ్లారా? బయటకు ఎవరైనా వచ్చారా? 364 00:28:51,356 --> 00:28:53,317 మనం దానిపై నిఘా పెట్టినప్పటి నుండి అలాంటిదేమీ జరగలేదు. 365 00:28:53,317 --> 00:28:57,321 మేడమ్, నిన్న మధ్యాహ్నం ఒంటి గంట దాటాక, వింటర్స్ బయటకు వెళ్తున్న ఫుటేజ్ ఇది. 366 00:28:57,321 --> 00:29:00,282 ఇవాళ తెల్లవారు జాము నాలుగు గంటల నుండి మనం నిఘా పెట్టాం. మన డ్రోన్స్ కూడా అదే పనిలో ఉన్నాయి. 367 00:29:00,282 --> 00:29:01,992 కర్టెన్స్ మూసే ఉన్నాయి, కాబట్టి మనకి ఖచ్చితంగా తెలీట్లేదు, 368 00:29:01,992 --> 00:29:03,619 కానీ మన అంచనా ప్రకారం, లోపల అయితే ఎవరూ లేరు. 369 00:29:03,619 --> 00:29:06,496 అది అంచనాయే కానీ, పక్కా సమాచారం కాదు కదా. సహచరులెవరైనా ఉండవచ్చు. 370 00:29:07,873 --> 00:29:09,499 ఆ పిల్లలను అక్కడి నుండి పంపించేయండి. 371 00:29:10,667 --> 00:29:12,336 సరే. ఆ పిల్లలను అక్కడి నుండి పంపించేయండి. 372 00:29:41,323 --> 00:29:42,699 హాయ్. సారీ, ఆలస్యమైంది. 373 00:29:42,699 --> 00:29:44,493 వెనుక వైపు ఏమైనా జరుగుతోందా? 374 00:29:44,493 --> 00:29:45,619 ఇంకా లేదు, మేడమ్. 375 00:30:09,434 --> 00:30:10,435 లోపలికి వెళ్లండి. 376 00:30:16,859 --> 00:30:19,194 - పోలీసోళ్లం! - ఆల్ఫా-1 అయిన మేం లోనికి వెళ్తున్నాం. 377 00:30:19,194 --> 00:30:21,238 - తలుపు తెరుస్తున్నాం! - పోలీసోళ్లం! 378 00:30:25,868 --> 00:30:26,869 ఎవరూ లేరు. 379 00:30:31,582 --> 00:30:33,375 - ఎవరూ లేరు. - ఎవరూ లేరు. 380 00:30:36,920 --> 00:30:37,921 ఎవరూ లేరు. 381 00:30:38,422 --> 00:30:40,924 ఎవరూ లేరు. 382 00:30:43,135 --> 00:30:44,136 ఎవరూ లేరు. 383 00:30:45,345 --> 00:30:46,972 - ఎవరూ లేరు! - ఎవరూ లేరు! 384 00:30:47,764 --> 00:30:48,849 ఇక్కడ ఎవరూ లేరు. 385 00:30:54,563 --> 00:30:56,190 ఇతని ఇంట్లో పెద్దగా వస్తువులు ఏమీ లేవు. 386 00:30:58,775 --> 00:31:00,110 ఇంట్లో ఎవరూ లేరు, మేడమ్. 387 00:31:00,736 --> 00:31:01,945 ఇక్కడ సోదా చేయడానికి పెద్దగా ఇంకేమీ లేదు. 388 00:31:01,945 --> 00:31:05,449 ఫోరెన్సిక్స్ ని పిలిపించండి. ఆ ఇంట్లోని అణువణువునూ క్షుణ్ణంగా పరిశీలించాలి. 389 00:31:05,449 --> 00:31:06,742 అర్థమైంది. 390 00:31:08,160 --> 00:31:12,581 సరే మరి, మిత్రులారా, తెల్లకోటోళ్లని లోపలికి పంపి, వాళ్ల సైన్స్ పనేదో వాళ్లని చేసుకోనిద్దాం. 391 00:31:12,581 --> 00:31:13,665 అలాగే, సర్. 392 00:31:14,708 --> 00:31:15,792 నాకొక పాస్ పోర్ట్ కనిపించింది. 393 00:31:16,460 --> 00:31:18,462 {\an8}కారును అద్దెకి తీసుకోవడానికి కూడా ఇతను ఉపయోగించిన గుర్తింపు పత్రమిదే. 394 00:31:18,462 --> 00:31:19,630 {\an8}వింటర్స్ రాబర్ట్ మైఖెల్ బ్రిటిష్ పౌరుడు 395 00:31:19,630 --> 00:31:21,173 {\an8}ఇతనేమీ దొంగతనంగా ఏమీ చేయలేదు. 396 00:31:22,382 --> 00:31:23,967 ఎందుకంటే, అతను చనిపోవాలని అనుకున్నాడు కదా. 397 00:31:26,803 --> 00:31:28,430 ఫోరెన్సిక్స్ వాళ్లు వచ్చేస్తున్నారు. 398 00:31:29,014 --> 00:31:31,225 మృగాలైన మీరు, ఈ ఇంటిని చెత్తచెత్త చేయలేదు కదా. 399 00:31:31,225 --> 00:31:32,935 చెత్త చెత్త చేయడానికి అసలు ఇక్కడేముంది! 400 00:31:32,935 --> 00:31:36,480 ఇళ్లంతా చూశాం, కొన్ని గుడ్డలు, బూట్లు, స్లీపింగ్ బ్యాగ్ ఉన్నాయంతే. 401 00:31:36,480 --> 00:31:37,564 అవి తప్ప ఇంకేమీ లేవు. 402 00:31:38,065 --> 00:31:39,107 సరే మరి. ఇక బయటకు దొబ్బేయండి. 403 00:31:39,107 --> 00:31:40,943 ఇంట్లోకి వెలుతురు రానిద్దాం. 404 00:31:45,197 --> 00:31:46,490 అయ్య బాబోయ్. 405 00:31:53,789 --> 00:31:55,249 ఏం జరిగింది? 406 00:31:56,458 --> 00:31:58,168 - నాకు... - చెప్పు. 407 00:31:58,168 --> 00:32:01,088 - ఇంట్లో కావాలని బాంబు పెట్టిన్నట్టున్నారు, మేడమ్. - దేవుడా. ఏంటి? 408 00:32:01,088 --> 00:32:02,756 - మేడమ్, ముగ్గురు చనిపోయారు... - ఛ. 409 00:32:02,756 --> 00:32:03,841 ...ఎక్కువ మందే గాయపడి ఉండొచ్చు. 410 00:32:04,675 --> 00:32:05,843 వాళ్లని బయటకు తెచ్చి ఆ చోటిని లాక్ చేయండి. 411 00:32:05,843 --> 00:32:08,554 ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లందరినీ బయటకు పంపించి, కొత్త టీమ్ కి బాధ్యత అప్పజెప్పండి. 412 00:32:08,554 --> 00:32:10,931 ఇంకో బాంబర్ ఉన్నాడో లేదో మనకి తెలియాలి. 413 00:32:10,931 --> 00:32:11,932 అలాగే, మేడమ్. 414 00:32:12,724 --> 00:32:15,018 దేవుడా. ఇది దారుణాతి దారుణం. 415 00:32:15,018 --> 00:32:16,979 మామూలు దారుణం కాదు. 416 00:32:18,814 --> 00:32:19,898 క్లాడ్. 417 00:32:22,025 --> 00:32:23,485 క్లాడ్? 418 00:32:24,987 --> 00:32:27,364 క్షమించాలి. ఇంతటి దారుణాన్ని నా కళ్లారా 419 00:32:27,364 --> 00:32:30,659 - నేనెప్పుడూ చూడలేదు, కాబట్టి నేను... - అవును, కానీ నువ్వు బాధ్యత తీసుకోవాలి. 420 00:32:31,326 --> 00:32:32,452 అవును, నువ్వన్నది నిజమే. 421 00:32:35,873 --> 00:32:39,126 ప్రధాన మంత్రికి ఈ విషయం చెప్పి, ఒక ప్రకటన ఇస్తాను. 422 00:32:39,126 --> 00:32:41,670 లేదు. లేదు. ముందు చనిపోయిన వారి కుటుంబాలకి విషయం చెప్పు. 423 00:32:41,670 --> 00:32:43,589 వాళ్లకి ఈ విషయం, వార్తల ద్వారా తెలియడం సబబు కాదు. 424 00:32:43,589 --> 00:32:44,715 అవునులే. 425 00:32:44,715 --> 00:32:49,052 అసలు నేనేం ఆలోచిస్తున్నానో... థ్యాంక్స్, డయానా. నువ్వు పక్కనుంటే చాలు. 426 00:32:50,387 --> 00:32:51,388 పని ఎక్కడి దాకా వచ్చింది? 427 00:32:53,765 --> 00:32:55,392 భవనంలో ఉన్న వాళ్లందరినీ ఖాళీ చేయిస్తున్నారు, మేడమ్. 428 00:32:58,687 --> 00:33:00,147 అల్లకల్లోలం అయిపోయింది. 429 00:33:18,999 --> 00:33:20,834 - రాడరిక్? - హా. 430 00:33:21,793 --> 00:33:22,836 ఏం చేస్తున్నావు? 431 00:33:23,545 --> 00:33:25,005 కార్ట్ రైట్ కంప్యూటరుని తీసుకుంటున్నా. 432 00:33:26,548 --> 00:33:27,549 ఎందుకు? 433 00:33:28,717 --> 00:33:30,385 ఎందుకంటే, అతను చనిపోయాడు కాబట్టి. 434 00:33:31,720 --> 00:33:33,138 - ఏంటి? - ఏం జరుగుతోంది? 435 00:33:34,264 --> 00:33:35,641 ఏం చేస్తున్నావు నువ్వు? 436 00:33:35,641 --> 00:33:37,726 రివర్ చనిపోయాడని రాడీ అంటున్నాడు. 437 00:33:38,560 --> 00:33:39,770 పిచ్చి జోకులేయకు, హో. 438 00:33:40,812 --> 00:33:42,773 అది జోక్ కాదు, నిజం. 439 00:33:43,649 --> 00:33:46,151 - నీకెలా తెలుసు? - ల్యాంబ్ చెప్పాడు. 440 00:33:46,151 --> 00:33:47,486 ల్యాంబ్ నీకు ఏమని చెప్పాడు? 441 00:33:47,486 --> 00:33:48,904 ఇక్కడేం జరుగుతోంది? 442 00:33:48,904 --> 00:33:50,405 కార్ట్ రైట్ చనిపోయాడు. 443 00:33:51,073 --> 00:33:52,991 - చనిపోయాడంటే? - నీ జోకుకి నవ్వానులే. 444 00:33:52,991 --> 00:33:55,744 కార్ట్ రైట్ చనిపోయాడని ల్యాంబ్ నాకు చెప్పాడు. 445 00:33:58,038 --> 00:33:59,248 "కాస్త ఆలస్యంగా వస్తా. 446 00:34:00,666 --> 00:34:03,043 రాత్రంతా కార్ట్ రైట్ దేహాన్ని గుర్తించే పనితోనే సరిపోయింది నాకు." 447 00:34:03,043 --> 00:34:05,254 - అది జోక్ అయ్యుంటుందిలే. భలేవారే మీరు. - ఏంటి? ఎక్కడ? ఏంటి? 448 00:34:05,254 --> 00:34:06,338 ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. 449 00:34:06,338 --> 00:34:09,132 అది అస్సలు అర్థవంతంగా అనిపించట్లేదు. నువ్వు ల్యాంబ్ తో మాట్లాడావా? 450 00:34:09,132 --> 00:34:10,509 - లేదు. - అయితే... 451 00:34:10,509 --> 00:34:12,511 ఏంటి... అతను చనిపోయాడు అంటూనే, అతని కంప్యూటర్ ని దొంగిలిస్తున్నావే? 452 00:34:12,511 --> 00:34:15,222 నేనేమీ దొంగిలించట్లేదు. అతను చనిపోయాడు. 453 00:34:15,222 --> 00:34:18,308 డేవిడ్ కార్ట్ రైట్ ఇంట్లో కాల్పులు జరిగాయని డ్యూటీ లాగ్ లో పేర్కొని ఉంది. 454 00:34:20,185 --> 00:34:21,270 శవం లభ్యమైంది. 455 00:34:33,447 --> 00:34:34,574 ఓరి దేవుడా. 456 00:34:37,286 --> 00:34:38,453 ఓరి దేవుడా. 457 00:34:39,371 --> 00:34:41,498 దేవుడా. నా వల్లే ఇలా జరిగింది. 458 00:34:42,373 --> 00:34:43,625 ఓరి దేవుడా. 459 00:34:43,625 --> 00:34:46,253 - దేవుడా. అక్కడికి వెళ్లమని అతనికి చెప్పింది నేనే. - ఎక్కడికి వెళ్లమని? 460 00:34:46,253 --> 00:34:50,257 అతని తాతయ్యని ఓసారి చూసి రమ్మని చెప్పాను, కానీ అతని తాతయ్య అతడిని కాల్చేశాడు. 461 00:34:50,257 --> 00:34:53,302 - బాబోయ్. ఇది నిజం కాదని ఎవరైనా చెప్పండి. - ఏంటి? 462 00:34:54,303 --> 00:34:55,929 ఇలా మళ్లీ జరగట్లేదని నాకు ఎవరైనా చెప్పండి. 463 00:34:55,929 --> 00:34:59,391 - లేదు, ఇలా మళ్లీ జరగడానికి వీల్లేదు. - మనకి ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో తెలీదు. 464 00:34:59,391 --> 00:35:02,352 కానీ అతను చనిపోయాడని అయితే మనకి తెలుసు, కదా? 465 00:35:02,853 --> 00:35:04,605 ఇంకేం తెలియాలి? అతను ఇప్పుడు లేడు. 466 00:35:08,650 --> 00:35:13,238 ఈ సమయంలో కాస్తంత మంచి వార్త చెప్తున్నా, నేనొక లవర్ ని సంపాదించా. 467 00:35:16,575 --> 00:35:17,701 దరిద్రుడా! 468 00:35:17,701 --> 00:35:18,785 లుయీ... లుయీసా! 469 00:35:20,287 --> 00:35:21,580 నీ యెంకమ్మ! 470 00:35:27,878 --> 00:35:30,672 గొడవ పడి ప్రయోజనం లేదని గ్రహించి, ఊరుకో. నీ అవకాశాన్ని నువ్వే దూరం చేసుకున్నావు. 471 00:36:03,080 --> 00:36:05,791 వెస్ట్ ఏకర్స్ షాపింగ్ మాల్ పై బాంబు దాడి కేసులో 472 00:36:05,791 --> 00:36:08,001 విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, 473 00:36:08,001 --> 00:36:11,547 {\an8}తాము ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదలట్లేదని లండన్ లోని 474 00:36:11,547 --> 00:36:13,799 {\an8}కౌంటర్ టెర్రరిజమ్ పోలీస్, సెక్యూరిటీ సర్వీస్ నొక్కి చెప్తోంది. 475 00:36:14,591 --> 00:36:17,803 రాబర్ట్ వింటర్స్, తాను రూపొందించిన బాంబుకు పదార్థాలను ఎక్కడి నుండి సంపాదించాడో 476 00:36:17,803 --> 00:36:20,597 తమకు తెలీట్లేదని ఒక ప్రతినిధి తెలిపారు, 477 00:36:20,597 --> 00:36:24,393 మరోవైపు, ఆ భవనంలోని ఇతర నివాసితులు... 478 00:36:24,393 --> 00:36:27,479 ...విచారణలో పోలీసులకి సహాయపడుతున్నారని తెలుస్తోంది. 479 00:36:27,479 --> 00:36:29,815 ఇక బాంబు దాడి విషయానికి వస్తే, 480 00:36:29,815 --> 00:36:33,569 తాజాగా పాతికేళ్ల కుర్రాడైన జాక్ వార్టన్ దేహాన్ని గుర్తించడం జరిగింది. 481 00:36:33,569 --> 00:36:36,822 ఆ పేలుడులో, అతని సోదరుడు గాయాల పాలయ్యాడని సమాచారం. 482 00:36:36,822 --> 00:36:39,366 దీంతో ఆ బాంబు దాడిలో మరణించిన 483 00:36:39,366 --> 00:36:42,077 మొత్తం ఇరవై మూడు వ్యక్తులనూ గుర్తించడం జరిగిందని చెప్పవచ్చు. 484 00:36:42,870 --> 00:36:45,372 ఈ ఉదయం, సాయుధ పోలీసులు, ముఖ్యమైన కూడళ్లలో పహారా... 485 00:36:46,832 --> 00:36:48,125 జాక్సన్, ఏం కావాలి నీకు? 486 00:36:48,709 --> 00:36:51,837 స్వాగతం బాగానే చెప్తున్నావే. కాస్త ఫీలింగ్ తో చెప్పవచ్చు కదా. 487 00:36:51,837 --> 00:36:54,673 ఫీలింగ్ తోనే చెప్పా. కానీ నువ్వు ఆశించిన ఫీలింగ్ కాదది. 488 00:36:56,091 --> 00:36:58,177 - నన్ను లోపలికి రమ్మంటావా? - లేదు. 489 00:36:58,177 --> 00:36:59,928 అయినా నేను లోపలికి రావచ్చా? 490 00:37:08,228 --> 00:37:09,479 నేను టిఫిన్ తెచ్చా. 491 00:37:09,479 --> 00:37:11,857 నేను తినేశాను, పైగా దాన్ని టిఫిన్ అని ఎవరూ అనరు. 492 00:37:12,566 --> 00:37:13,942 అయితే, ఏదైనా తాగుదామా? 493 00:37:14,526 --> 00:37:15,986 ఎంత నువ్వైనా, ఇంత పొద్దునే తాగడం తగదు. 494 00:37:17,237 --> 00:37:18,697 నేను నీళ్లు అడిగా, మందుని కాదు. 495 00:37:24,286 --> 00:37:26,413 ఇంతకి, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. 496 00:37:28,248 --> 00:37:29,917 ఎప్పట్నుంచో తెలిసిన నేస్తాన్ని చూడటానికి రాకూడదా? 497 00:37:29,917 --> 00:37:31,960 నువ్వు రావు కదా, అయినా నేను నీ నేస్తాన్ని కాదు. 498 00:37:33,086 --> 00:37:36,423 నేను రివర్ కార్ట్ రైట్ శవాన్ని గుర్తించి, ఇక్కడికి వచ్చాను. 499 00:37:36,423 --> 00:37:39,218 ముందుగా నీకే చెప్దామని వచ్చా. 500 00:37:39,885 --> 00:37:43,347 ఇదుగో, చూశావా? టిఫిన్ లో ఆరెంజ్ ఉంది. 501 00:37:43,347 --> 00:37:45,849 - పండు. చాలా ఆరోగ్యవంతమైంది. - రివర్? ఎలా? 502 00:37:46,892 --> 00:37:49,061 ఛాతీలోకి ఒక బుల్లెట్ దిగింది, ముఖంలోకి ఒక బుల్లెట్ దిగింది. 503 00:37:49,061 --> 00:37:51,104 ఆ చికాకు తెప్పించే ముఖాన్ని ఆ బుల్లెట్ చిధ్రం చేసేసింది. 504 00:37:54,358 --> 00:37:57,486 - నువ్వేమీ ప్రతిస్పందించవేంటి? - నేను ప్రతిస్పందిస్తున్నాగా. 505 00:37:59,821 --> 00:38:01,031 ఎక్కడ జరిగింది ఇది? 506 00:38:02,491 --> 00:38:03,992 బాత్రూమ్ లో. 507 00:38:04,618 --> 00:38:06,370 ఆ రోజుల్లో జరిగే హత్యల్లానే. 508 00:38:06,370 --> 00:38:09,414 ఇతరులకు కూడా ఈ విషయం చెప్తావా? 509 00:38:09,414 --> 00:38:10,832 'హో'కి మెసేజ్ పంపా. 510 00:38:10,832 --> 00:38:13,627 ఈపాటికి మిగతా వాళ్లకి చెప్పేసుంటాడు. 511 00:38:13,627 --> 00:38:15,045 మెసేజ్ పంపావా? 512 00:38:15,546 --> 00:38:16,922 దాని గురించి ట్వీట్ వేయాలా ఏంటి? 513 00:38:16,922 --> 00:38:19,049 బాబోయ్, స్టాండిష్, ఒకడు చనిపోయాడు. 514 00:38:19,049 --> 00:38:21,510 ఇది వింటే లుయీసా పరిస్థితి ఏమవుతుందో తెలుసా? 515 00:38:21,510 --> 00:38:24,388 అందుకే కదా నేను మెసేజ్ 'హో'కి పంపింది. నాకు తెలివిగా వ్యవహరించడం తెలుసులే. 516 00:38:25,180 --> 00:38:31,687 మరి... ఈ విషాదకరమైన వార్త చెప్పేశావుగా, ఇక... ఇక బయలుదేరవచ్చు నువ్వు. 517 00:38:35,065 --> 00:38:36,567 బాగా బిజీగా ఉన్నట్టున్నావే. 518 00:38:40,988 --> 00:38:44,825 - ఎవరి బాత్రూమ్ లో అని అడగవా? - ఎవరి బాత్రూమ్ లో? 519 00:38:45,576 --> 00:38:47,494 అది గోప్యమైన సమాచారం. 520 00:38:47,494 --> 00:38:48,745 నీకు సమ్మగా ఉంది కదా. 521 00:38:48,745 --> 00:38:51,707 నీళ్లు ఇస్తే, ఇంకా సమ్మగా ఉంటుంది. 522 00:38:51,707 --> 00:38:54,543 రాత్రంతా పడుకోకుండా పని చేస్తే, ఒంట్లో నీరంతా ఆవిరైపోతుందని నీకు తెలుసుగా. 523 00:38:55,043 --> 00:38:56,295 అయ్య బాబోయ్. 524 00:39:10,225 --> 00:39:11,518 ఇంట్లో ఒక్క దానివే ఉన్నావా? 525 00:39:12,477 --> 00:39:14,229 హా, అది నేను ముందే అడిగి ఉండాల్సింది. 526 00:39:14,229 --> 00:39:16,273 ఇంట్లో ఎవరైనా ఉన్నట్టు నీకు అనిపిస్తోందా? 527 00:39:16,273 --> 00:39:18,734 హా. నేను అడగాలి కదా. 528 00:39:18,734 --> 00:39:22,821 - ఒక పేరు వచ్చాక, దాన్ని పోగొట్టుకోవడం కష్టం మరి. - నీకు కూడా ఒకటి తెలియాలి. 529 00:39:22,821 --> 00:39:25,824 నేను కలిసిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు పెద్ద సన్నాసివనే చెప్పారు. 530 00:39:25,824 --> 00:39:29,369 కానీ, ఇప్పుడు నీ సోదిని భరించాల్సిన పని నాకు లేదు, ఎందుకంటే నేను మానేశా. గుర్తుందా అది? 531 00:39:30,370 --> 00:39:34,291 మానేయాలనే చూస్తున్నా. ఒకే రాజీనామా లేఖని హెచ్ఆర్ కి మూడుసార్లు రాసి పంపా. 532 00:39:34,291 --> 00:39:36,502 హా, అది నాకు తెలుసు. దాన్ని నాకు పంపిస్తూనే ఉన్నారు. 533 00:39:36,502 --> 00:39:38,795 ఏదో పేపర్ వర్క్ ని ధృవీకరించాలట నేను. 534 00:39:38,795 --> 00:39:41,131 ఏంటి ల్యాంబ్ నువ్వు! ఏంటి నీ సమస్య? 535 00:39:41,131 --> 00:39:44,843 చాలా ఏళ్లుగా నన్ను విమర్శిస్తూనే ఉన్నావు, ఇప్పుడు నీకు కావాల్సిందే కదా నేను చేశాను. 536 00:39:45,594 --> 00:39:48,180 నా పత్రాలపై సంతకం చేయ్, నా జీవితం ఏదో నన్ను బతకనివ్వు. 537 00:39:48,180 --> 00:39:50,557 మానసికంగా నీ స్థితి సరైన విధంగానే ఉందని నిర్ధారించుకోవాలనుకుంటున్నా. 538 00:39:51,266 --> 00:39:52,601 అంటే, మళ్లీ నీలో పశ్చాత్తాపమై మొదలయి, 539 00:39:52,601 --> 00:39:54,853 మళ్లీ తాగుడు బాట పట్టితే, నా పరిస్థితి ఏంటో ఊహించుకో. 540 00:39:54,853 --> 00:39:56,438 నువ్వు ఏడుస్తూ, మందు సీసా పట్టావన్న బాధ 541 00:39:56,438 --> 00:39:59,358 నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. 542 00:39:59,358 --> 00:40:02,194 తాగుబోతులు సాకు కోసమే చూస్తుంటారని అంటుంటారు. 543 00:40:02,194 --> 00:40:04,112 నేనేమీ నిన్ను నిందించట్లేదు, అదొక వ్యసనం, అంతే. 544 00:40:04,112 --> 00:40:06,073 అన్నట్టు, అది వాళ్ల తాతది. 545 00:40:06,782 --> 00:40:07,824 ఏంటి? 546 00:40:09,326 --> 00:40:13,413 అతడిని వాళ్ల తాతయ్య బాత్రూమ్ లో కాల్చారు, అది ఎలాగూ నువ్వు ముందు అడగలేదనుకో. 547 00:40:13,413 --> 00:40:15,332 ఎవరని కూడా నువ్వు అడగలేదు. 548 00:40:15,332 --> 00:40:18,961 - ఏంటి ఎవరు? - రివర్ ని కాల్చింది ఎవరు అని. 549 00:40:18,961 --> 00:40:21,046 ఎందుకంటే, మనిద్దరికీ తెలుసు అతను బతికే ఉన్నాడని. 550 00:40:23,006 --> 00:40:24,424 ఆటలు ఆడకు నాతో. 551 00:40:24,424 --> 00:40:27,010 నువ్వు అతని శవాన్ని గుర్తించావని ఇందాకే కదా నాతో అన్నావు. 552 00:40:27,010 --> 00:40:30,889 అవును, కానీ విచిత్రంగా ఏంటి, ఎలా, ఎవరు అని నువ్వు పెద్దగా ఆరాలు తీయలేదు మరి. 553 00:40:31,557 --> 00:40:33,183 నేను షాక్ లో ఉన్నాను, సరేనా? 554 00:40:33,892 --> 00:40:36,395 నువ్వు షాక్ అయింది నేను ఇక్కడికి వచ్చాననే, 555 00:40:36,395 --> 00:40:39,147 అంతే తప్ప రివర్ చనిపోయాడని కాదు, ఎందుకంటే, నువ్వు అతడిని చూశావు కాబట్టి. 556 00:40:39,147 --> 00:40:40,691 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 557 00:40:40,691 --> 00:40:42,025 - అది అర్థంపర్థం లేని వాదన. - చాల్లే ఇక. 558 00:40:42,025 --> 00:40:43,443 - ఇక ఆపు, స్టాండిష్. - లేదు... 559 00:40:43,443 --> 00:40:45,529 నీకు అబద్ధాలు ఆడటం చేత కాదు. 560 00:40:46,655 --> 00:40:48,156 అదీగాక... 561 00:40:49,741 --> 00:40:51,618 అతని కారు బయటే ఉంది. 562 00:40:58,125 --> 00:40:59,918 సరే. అతను ఇక్కడికి వచ్చిన మాట వాస్తవమే, 563 00:40:59,918 --> 00:41:02,629 - కానీ ఇప్పుడు ఇక్కడ లేడు. - సరే, ఇప్పుడు బాగుంది. 564 00:41:02,629 --> 00:41:05,507 ఇక, ఆ ముసలి నక్కని 565 00:41:05,507 --> 00:41:08,468 భద్రంగా బెడ్ రూమ్ లో దాచలేదన్నట్టు మాత్రం నటించకు. 566 00:41:08,468 --> 00:41:10,554 జాక్సన్. అతడిని కాపాడమని రివరే నన్ను కోరాడు. 567 00:41:14,224 --> 00:41:15,225 ఇప్పుడు తృప్తిగా ఉందా? 568 00:41:16,476 --> 00:41:18,187 నా గురించి నీకు బాగా తెలుసు. 569 00:41:18,187 --> 00:41:20,856 నాకెప్పుడు సంతృప్తిగా ఉండదో నీకు తెలుసు కదా. 570 00:41:20,856 --> 00:41:22,941 మంచిది. ఇక నా బెడ్ రూమ్ నుండి బయటకు పద. 571 00:41:22,941 --> 00:41:24,026 హేయ్! 572 00:41:25,944 --> 00:41:26,945 గురూ. 573 00:41:31,033 --> 00:41:32,201 రివర్ ఎక్కడ? 574 00:41:45,964 --> 00:41:50,385 {\an8}ప్యారిస్ ట్యాక్సీ 575 00:41:52,095 --> 00:41:53,347 ఎవరు నువ్వు? 576 00:41:55,933 --> 00:41:57,684 ఇంకెంత సేపు పడుతుంది? 577 00:41:57,684 --> 00:41:59,520 దగ్గరికి వచ్చేశాం. 578 00:43:36,783 --> 00:43:38,785 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్