1 00:01:24,418 --> 00:01:28,005 టామ్ క్లాన్సీస్ జాక్ రైన్ 2 00:01:38,265 --> 00:01:41,435 వియెన్నా, ఆస్ట్రియా 3 00:02:59,305 --> 00:03:01,348 సరే. తను ఇప్పుడే బయలుదేరింది. 4 00:03:15,070 --> 00:03:19,074 నీ నేస్త౦ చురుకుగా లేడు. ఎనిమిది బ్లాక్ల ము౦దే అతనిని క౦టబడ్డాదు. 5 00:03:20,159 --> 00:03:22,661 -తొందర పడుతున్నావు. -ఆపరేషన్ అటూఇటూ అయింది. 6 00:03:22,745 --> 00:03:25,623 గుర్తింపు బయటపడింది నీ ఒక్కడిదే కాదు. 7 00:03:25,706 --> 00:03:28,417 -నీ సహాయం కావాలి. -నీకు అంతా చెప్పేశాను. 8 00:03:30,544 --> 00:03:32,671 అంటే, నీకు స్పష్టంగా అబద్ధం చెప్పారు. 9 00:03:32,755 --> 00:03:34,256 అది వాళ్ల శైలి కాదు. 10 00:03:35,841 --> 00:03:38,719 -నువ్వు ఓ భేటీ ఏర్పాటు చేయాలి. -ఆ పని చేయలేను. 11 00:03:41,472 --> 00:03:42,306 జోయా... 12 00:03:44,224 --> 00:03:47,978 సోకొల్ నిజమైతే, చాలా మంది ప్రజలు చనిపోతారని నీకు తెలుసు. 13 00:03:48,062 --> 00:03:51,190 నువ్వు ఆపి ఉండాల్సిందని తెలిసి దానితో జీవించగలవా? 14 00:03:55,152 --> 00:03:58,781 భేటీ ఏర్పాటు చేస్తాను. కానీ నేను వియెన్నా దాటేవరకూ జరగదు. 15 00:04:00,532 --> 00:04:01,367 ధన్యవాదాలు. 16 00:04:06,246 --> 00:04:07,122 జాక్... 17 00:04:08,082 --> 00:04:09,041 గుడ్ లక్. 18 00:04:22,596 --> 00:04:23,806 పద, గొప్ప గూఢచారి. 19 00:04:29,520 --> 00:04:31,897 -భేటీ ఏర్పాటు చేసిందా? -అదే చెప్పింది. 20 00:04:33,607 --> 00:04:35,818 ఆమెను ఎందుకు నమ్ముతావో చెబుతావా? 21 00:04:35,901 --> 00:04:38,320 ఎందుకంటే ఆమెకు అబద్ధమాడే అవసరం లేదు. 22 00:04:38,404 --> 00:04:40,239 ఆమె నిజం చెబుతోందని నాకు తెలుసు. 23 00:04:40,322 --> 00:04:42,324 నీకు తెలుసా? మంచిది. 24 00:04:43,283 --> 00:04:46,412 -నీ జీవితంపై చాలా పణంగా ఉన్నట్లుంది. -నీకొకటి తెలుసా? 25 00:04:46,495 --> 00:04:49,331 ఇ౦కేమైనా చేసే పరిస్థిథి లో ఉన్నట్టు వు౦దా. 26 00:04:49,415 --> 00:04:50,749 నా మాట విను. 27 00:04:50,833 --> 00:04:55,212 హేయ్, నువ్వు హద్దు దాటబోతున్నావు, బహుశా వెనక్కు రాలేకపోవచ్చు. 28 00:04:55,295 --> 00:04:59,299 ఎందుకంటే సరైన పని చేయాలని నా ప్రయత్నం. ఈ సోకొల్ ప్రాజెక్ట్ నిజమే. 29 00:04:59,383 --> 00:05:00,467 నేను నిన్ను నమ్ముతా. 30 00:05:00,551 --> 00:05:03,971 కానీ దాన్ని ఆపగలిగేది నువ్వు మాత్రమే కాదని కూడా తెలుసు. 31 00:05:04,054 --> 00:05:06,265 ఎవరికి కాల్ చేయమంటావు? మిల్లర్‌కా? 32 00:05:07,307 --> 00:05:10,561 వాడు ఓ వెధవ. తనను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపగలడు. 33 00:05:11,770 --> 00:05:14,356 రైట్. గట్టి మనిషి, కానీ న్యాయంగా ఉంటుంది. 34 00:05:14,440 --> 00:05:17,151 తను ఓ రాజకీయ జంతువు, మిగతా వాళ్ల మాదిరిగానే. 35 00:05:17,234 --> 00:05:20,112 ఇంకా ఒకటి తెలుసా? తన ఎంపిక చేసేసుకుంది. 36 00:05:20,195 --> 00:05:21,447 గ్రీర్ సంగతేంటి? 37 00:05:23,282 --> 00:05:26,744 అతనిని మరింత ప్రమాదంలో నెట్టలేను. నిన్ను కూడా. 38 00:05:27,578 --> 00:05:30,956 అందుకే విను, నువ్వు వెళ్లిపోతానంటే, అర్థం చేసుకుంటాను. 39 00:05:31,040 --> 00:05:34,334 -అయితే మొత్తం ఆలోచించావా? -అవును. ఆలోచించాను. 40 00:05:34,418 --> 00:05:36,628 అయితే నేను వస్తాను. నీకు మద్దతిస్తాను. 41 00:05:37,880 --> 00:05:39,798 -మనం చావకూడదని నా ఆశ. -నాకు కూడా. 42 00:05:43,343 --> 00:05:46,555 యూ.ఎస్. దౌత్య కార్యాలయం రోమ్, ఇటలీ 43 00:05:57,691 --> 00:05:59,777 జాక్ రైన్ కేస్ ఆఫీసర్ 44 00:06:04,907 --> 00:06:08,410 ఇది ఎఫ్‌బీఐ అన్యప్రాంత దళం. వాళ్లకు రైన్ పైనే ఆసక్తి. 45 00:06:08,494 --> 00:06:10,579 ఎన్ఎస్‌డీ దీనిలో ముందడుగు వేసింది. 46 00:06:10,662 --> 00:06:13,332 -ఇన్‌చార్జ్ ఎవరు? -తన పేరు హ్యారిస్ అన్నాడు. 47 00:06:13,415 --> 00:06:16,502 నా ఆఫీస్‌ను తిరగేయకపోతే బాగు౦టు౦ది. 48 00:06:16,585 --> 00:06:20,089 మేము అన్నీ తిరిగి అమర్చుతాం. గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడంపై 49 00:06:20,172 --> 00:06:23,550 డా. జాక్ రైన్ మీద మా దగ్గరున్న వారంట్ అమలు చేయాలని వచ్చాం. 50 00:06:23,634 --> 00:06:26,470 జాక్ రైన్ ను ఎమైనా అనవచ్చు కాని ద్రోహి కాదు. 51 00:06:26,553 --> 00:06:30,265 నా నిర్ణయం కాదు. ఇది నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌ది. 52 00:06:30,349 --> 00:06:32,267 బయట ఓ పోకిరీ ఏజెంట్ ఉన్నాడు. 53 00:06:32,351 --> 00:06:35,729 అతని బుర్రలో ఉన్న విషయం విదేశీ సంస్థలకు తనను ముఖ్యంగా చేస్తుంది. 54 00:06:35,813 --> 00:06:37,397 అందుకే, తనను తీసుకొస్తాం. 55 00:06:43,278 --> 00:06:46,490 మనం వాళ్ల యాక్సెస్ పరిమితం చేయాలి. జోయా ఇవనోవాను ట్రాక్ చెయ్. 56 00:06:46,573 --> 00:06:48,033 జాక్ వేగు ఆమెకు తెలుసు. 57 00:06:48,117 --> 00:06:49,827 -తను ఆమె వెంట వెళతాడు. -అర్థమైంది. 58 00:06:59,002 --> 00:07:01,380 ప్రాగ్, చెక్ రిపబ్లిక్ 59 00:07:01,672 --> 00:07:03,507 రాజకీయ పరిస్థితి ఏమిటి? 60 00:07:03,590 --> 00:07:06,760 జాక్ కోసం ఎన్ఎస్‌డీ వస్తోంది. ఎఫ్‌బీఐ దగ్గర వారంట్ ఉంది. 61 00:07:06,844 --> 00:07:09,346 -ఆరోపణ ఏమిటి? -గూఢచర్య చట్టం. 62 00:07:09,429 --> 00:07:10,389 ఓరి దేవుడా. 63 00:07:10,472 --> 00:07:14,143 -అతనిని ద్రోహి అంటున్నారా? -నన్ను కలుపుకోలేదు కూడా. 64 00:07:14,226 --> 00:07:17,271 నువ్వు ఒక్కడివే ఇరుక్కున్నట్లుగా లేదు. 65 00:07:17,354 --> 00:07:20,023 మొదట జాక్‌ను చేరేందుకు ప్రయత్నిస్తాను. 66 00:07:21,525 --> 00:07:22,901 ప్రెసి. కోవక్‌ను కలిశావా? 67 00:07:22,985 --> 00:07:26,405 ఇంకా లేదు. నాటో పనిలో తలదూర్చడం మన పని కాదు. 68 00:07:26,488 --> 00:07:29,283 ఆమెను ఒత్తిడి చేయలేము, కానీ సాక్ష్యం అందించగలం. 69 00:07:29,366 --> 00:07:31,368 మన వైపుకు తెస్తే, మన పేరు నిలబడతు౦ది. 70 00:07:31,577 --> 00:07:34,496 రష్యా హౌస్ అధికారిగా, ఆమెకు సలహా ఇవ్వగలవు. 71 00:07:34,580 --> 00:07:36,206 ఐఎస్‌లో తనతో పని చేశావు. 72 00:07:36,290 --> 00:07:39,168 -ఆమె నీ మాట వింటుంది. -ఇప్పుడు తెలుస్తు౦ది. 73 00:07:46,341 --> 00:07:48,802 మాస్కో, రష్యా 74 00:08:15,662 --> 00:08:16,622 కెప్టెన్. 75 00:08:17,706 --> 00:08:19,416 మీ నష్టానికి నా సంతాపం. 76 00:08:20,334 --> 00:08:21,877 మీరు స్నేహితులని నాకు తెలుసు. 77 00:08:23,837 --> 00:08:25,088 ఎ౦తో మ౦ది లేరు అతనికి. 78 00:08:25,756 --> 00:08:26,882 మీకు మాదిరిగానే. 79 00:08:28,675 --> 00:08:32,721 మీరు అడ్మిరల్ పదవి తిరస్కరించారని పుకార్లు ఉన్నాయి. 80 00:08:33,805 --> 00:08:35,974 డెస్క్ వెనుక కూర్చుని ఏం మంచి చేయగలను? 81 00:08:37,851 --> 00:08:39,603 ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ. 82 00:09:04,711 --> 00:09:05,837 నా సంతాపం. 83 00:09:06,255 --> 00:09:08,048 నా భర్త గొప్ప మనిషి. 84 00:09:09,132 --> 00:09:10,384 వచ్చినందుకు ధన్యవాదాలు. 85 00:09:20,978 --> 00:09:25,148 మీకు ఏమైనా కావాలంటే, నటాలియా, ఎప్పుడైనా మీ సేవలో ఉంటానని తెలుసుకోండి. 86 00:09:26,400 --> 00:09:27,734 ఇదెవరు చేశారో తెలుసుకోండి. 87 00:09:28,610 --> 00:09:31,071 మీరలా చేసేవరకూ డిమిట్రీ శాంతించరు. 88 00:09:32,489 --> 00:09:33,615 నేను కూడా శాంతించను. 89 00:09:42,666 --> 00:09:45,127 ప్రాగ్ కోట ప్రాగ్, చెక్ రిపబ్లిక్ 90 00:10:01,893 --> 00:10:02,728 ఆయన వచ్చాడా? 91 00:10:04,730 --> 00:10:07,774 ఈ సందర్శన గురించి మీరు నాకు ముందే చెప్పాల్సింది. 92 00:10:07,858 --> 00:10:12,195 అతను నాతో ఎప్పుడూ నేరుగా ఉంటాడు. ఈ మధ్య ఏదో కొరత ఏర్పడింది. 93 00:10:12,279 --> 00:10:15,907 తను సీఐఏ. ఏదైనా తిరిగి కోరుకోకుండా వాళ్లు ఎన్నడూ కలవరు. 94 00:10:15,991 --> 00:10:19,703 సీఐఏ ఎలా పని చేస్తుందో తెలుసు, రాడెక్. కానీ అతనలా కాదు. 95 00:10:24,791 --> 00:10:25,959 మేడం ప్రెసిడెంట్. 96 00:10:26,501 --> 00:10:27,794 మిస్టర్ గ్రీర్. 97 00:10:27,878 --> 00:10:30,881 రాడెజ్ బ్రేజా, నా సెక్యూరిటీ హెడ్, జేమ్స్ గ్రీర్‌. 98 00:10:31,840 --> 00:10:33,800 మనం అలా నడుద్దామా, జేమ్స్? 99 00:10:45,187 --> 00:10:47,856 ఇది సామాజిక సందర్శన కాదని మనిద్దరికీ తెలుసు. 100 00:10:49,399 --> 00:10:52,694 మేము రష్యన్ ప్రభుత్వాన్ని, వాళ్లు మమ్మల్ని పర్యవేక్షిస్తారని, 101 00:10:52,778 --> 00:10:53,987 మన ఇద్దరకూ తెలుసు. 102 00:10:55,197 --> 00:10:59,159 డిమిట్రీ పోపొవ్ ఫోన్ కాల్‌లపై ఎన్ఎస్ఏ దగ్గర ట్రాన్స్‌క్రిప్ట్ ఉంది. 103 00:10:59,242 --> 00:11:02,037 ప్రెసిడెంట్ సురికోవ్‌తో సంభాషణలు ఉన్నాయి, 104 00:11:02,120 --> 00:11:04,831 తూర్పు ఐరోపాలోకి వెళ్లడం ద్వారా చెక్ రిపబ్లిక్‌ను 105 00:11:04,915 --> 00:11:07,209 దూరం చేయవద్దని ఆయనకు సూచించాడు. 106 00:11:08,460 --> 00:11:12,172 -కానీ డిమిట్రీవి ఒక నిష్ఠితుడే. -లేదు, అలా కనిపిస్తాడు. 107 00:11:12,964 --> 00:11:17,386 అలా ఆయన తన పార్టీలో రైట్‌వింగ్‌తో మరితంగా పరువు కాపాడుకున్నాడు. 108 00:11:17,469 --> 00:11:20,472 కానీ మీరు, ఆయన ఒకే ఆలోచనతో ఉన్నారు. 109 00:11:21,556 --> 00:11:23,600 బహుశా అదే ఆయన చావుకు కారణం. 110 00:11:28,897 --> 00:11:32,609 ఇప్పుడు కొత్త రక్షణ మంత్రి, అది వేరే కథ. 111 00:11:34,569 --> 00:11:37,322 డిమిట్రీ అంగీకరించిన ప్రతిదీ తిరస్కరించాడు. 112 00:11:37,406 --> 00:11:40,117 ఇంకా ఉక్రెయిన్‌లోకి మరింతగా రష్యా దళాలను పంపాడు. 113 00:11:41,201 --> 00:11:42,369 ఎంత దూరం వరకు? 114 00:11:44,955 --> 00:11:47,666 దాదాపుగా స్లోవోకియన్ సరిహద్దు వరకు. 115 00:11:49,042 --> 00:11:51,044 మీకు ఇది తెలియాలి, 116 00:11:51,128 --> 00:11:55,340 కారణం మీరిప్పుడు చర్య తీసుకుంటే, మా నాటో మిసైళ్లను లోపలకు తేగలం, 117 00:11:55,424 --> 00:11:56,842 వెనక్కు వెళ్లగొట్టగలం. 118 00:11:58,510 --> 00:12:00,762 మన దేశాలు సమాచారం పంచుకుంటాయి. 119 00:12:03,014 --> 00:12:05,058 ఇది నేనిప్పుడే ఎందుకు వింటున్నాను? 120 00:12:09,187 --> 00:12:13,024 మీ మిత్రులను శత్రువుల మాదిరిగా చూడరని నేను భావించాను. 121 00:12:13,108 --> 00:12:15,569 సీఐఏ దేవుడిలా ప్రవర్తింస్తు౦దని మరిచిపోయాను. 122 00:12:15,652 --> 00:12:17,821 ఓ స్నేహితునిగా మీకిది చెబుతున్నాను. 123 00:12:17,904 --> 00:12:22,075 -నేను నమ్మాలని అనుకుంటావు. -అనుకోవడం కాదు. ఆశించడం. 124 00:12:23,452 --> 00:12:26,163 మీకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉందని నాకు తెలుసు. 125 00:12:26,246 --> 00:12:28,957 నాకు ఇదీ తెలుసు, మీపై ఒత్తిడి తేలేమని. 126 00:12:29,958 --> 00:12:32,961 మీకు సమాచారం అందించడానికే నేనిక్కడకు వచ్చాను. 127 00:12:33,044 --> 00:12:36,214 దానితో మీరు ఏం చేస్తారనే నిర్ణయం అది మీదే. 128 00:12:48,226 --> 00:12:50,896 బొహీమియా, చెక్ రిపబ్లిక్ 129 00:12:57,194 --> 00:12:58,403 ఓరి దేవుడా. 130 00:13:01,656 --> 00:13:03,992 ఈ కారు నాకెంత ఖర్చయిందో తెలుసా? 131 00:13:05,744 --> 00:13:09,623 వేటకు వచ్చావని నీకు తెలుసు. అది ఎక్కడ ఉంటుందని అనుకున్నావు? 132 00:13:09,706 --> 00:13:13,001 -మొనాకోలోనా? -రోడ్డు వేసుంటారని అనుకున్నాను. 133 00:13:18,173 --> 00:13:22,677 క్షమాపణలు, మి. జుబ్‌కోవ్, మి. లిచ్‌కిన్, 134 00:13:22,761 --> 00:13:25,222 మారుమూల ప్రాంతం విషయంలో, 135 00:13:25,305 --> 00:13:30,060 కానీ ఇప్పుడు తోడేళ్లను వేటాడే ప్రదేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 136 00:13:30,894 --> 00:13:31,770 సుస్వాగతం. 137 00:13:36,858 --> 00:13:37,859 రండి. 138 00:13:38,527 --> 00:13:39,986 నోవక్, సంచులు తీసుకో. 139 00:13:40,612 --> 00:13:45,992 మనం అనుకున్న ఆయుధం దొరికి౦ది. దారిలో ఉంది. 140 00:13:46,076 --> 00:13:47,285 మంచిది. 141 00:13:47,369 --> 00:13:48,411 దాని ఖరీదెంత? 142 00:13:49,621 --> 00:13:50,872 అది 20 మిలియన్. 143 00:13:54,751 --> 00:13:59,172 ఈ బ్యాంక్ టోకెన్ డబ్బు ఉన్న ఓ సెక్యూర్‌ అకౌంట్‌కు యాక్సెస్ ఇస్తుంది. 144 00:13:59,256 --> 00:14:01,007 సగం ఇప్పుడు, సగం డెలివరీ అయ్యాక. 145 00:14:01,800 --> 00:14:04,135 కానీ మనం లావాదేవీ పూర్తి చేసే ముందు, 146 00:14:05,178 --> 00:14:07,681 మనం పరిష్కరించాల్సిన రెండు లోపాలు ఉన్నాయి. 147 00:14:09,307 --> 00:14:12,894 మొదటిది, సీఐఏ అధికారి విషయం. 148 00:14:12,978 --> 00:14:14,437 ఆ పని చూడడం జరుగుతోంది. 149 00:14:20,735 --> 00:14:21,695 రెండవది, 150 00:14:22,571 --> 00:14:23,572 మీ కుమార్తె. 151 00:14:24,614 --> 00:14:27,993 మీ ప్రభావం మీరు చెప్పినంత బలంగా లేనట్టు౦ది. 152 00:14:28,076 --> 00:14:30,328 అ౦టే, చెప్పడానికి కష్టంగా ఉంది, 153 00:14:30,412 --> 00:14:32,414 కానీ నాయకత్వ మార్పు గురించి 154 00:14:33,873 --> 00:14:36,835 ఆలోచన చేస్తున్నది నేను ఒక్కడినే కాదు. 155 00:14:40,171 --> 00:14:41,423 సర్‌హాన్. 156 00:14:42,132 --> 00:14:43,466 పర్వాలేదు, లెవన్. 157 00:14:47,554 --> 00:14:50,307 సర్‌హాన్ డబ్బు కీలకమైనది. 158 00:14:50,390 --> 00:14:52,642 తన పట్టింపులు చెప్పే హక్కు తనకుంది. 159 00:14:52,726 --> 00:14:55,604 అతని మాట నిజం, కొన్ని ఎదురుదెబ్బలు తిన్నాము. 160 00:14:57,355 --> 00:15:00,567 కానీ ఈ అడ్డంకులను అధిగమించవచ్చు. 161 00:15:02,277 --> 00:15:03,778 దానిపై మీకు మాటిస్తాను. 162 00:15:07,115 --> 00:15:08,575 అంతా సక్రమంగా జరుగుతోంది. 163 00:15:10,994 --> 00:15:13,371 నీ పట్టింపులకు పరిష్కారం దొరికిందా? 164 00:15:20,295 --> 00:15:21,171 ఇప్పటికి. 165 00:15:23,548 --> 00:15:24,382 మంచిది. 166 00:15:25,634 --> 00:15:28,553 అయితే మనం ఇక్కడున్న కారణంపై దృష్టి పెడదాము. 167 00:15:36,311 --> 00:15:39,147 -నీకేం దొరికింది? -ఈ ఉదయం వియెన్నా విమానాశ్రయం. 168 00:15:39,230 --> 00:15:40,982 ఆమె దాదాపు ఉ. 6:00కు చేరింది. 169 00:15:41,858 --> 00:15:45,403 మంచిది. నువ్వు ఆమెను కనిపెట్టావంటే, జాక్ కూడా చేసు౦టాడు. 170 00:15:45,487 --> 00:15:47,989 -అతను అక్కడే ఉన్నాడా? -అదే అనుకుంటున్నా. 171 00:16:00,168 --> 00:16:02,462 -అతనిని పట్టుకోవడంలో సాయం చేస్తా. -వీల్లేదు. 172 00:16:02,545 --> 00:16:06,091 అతనిక్కడ 10 నెలలు పని చేశాడు. ఇప్పటికే నాకు తలనొప్పిగా మారాడు. 173 00:16:07,676 --> 00:16:10,428 -ఆ సంగతి బాగా తెలుసా? -నీ కంటే బాగా. 174 00:16:12,972 --> 00:16:14,015 వియెన్నాలో ఉన్నాడు. 175 00:16:16,017 --> 00:16:18,103 అతను కావాలంటే, వేగంగా కదలడం మంచిది. 176 00:16:28,697 --> 00:16:31,366 పోపొవ్ దర్యాప్తులో ఏం జరుగుతోంది? 177 00:16:31,449 --> 00:16:34,119 హంతకుడి ఖాతాలో డబ్బును కనిపెట్టాం. 178 00:16:34,202 --> 00:16:38,540 అనేక ప్రైవేటు బ్యాంకుల నుంచి వచ్చింది. మూలం ఏంటో కచ్చితంగా తెలియలేదు. 179 00:16:38,623 --> 00:16:40,542 అది రష్యన్లని అనుకుంటున్నావు. 180 00:16:40,625 --> 00:16:43,294 దీనికి వాళ్ల ఆపరేషన్‌లలో ఒకదానిలా గుర్తులున్నాయి. 181 00:16:43,378 --> 00:16:46,005 -స్టేడియం ఫుటేజ్‌ను సమీక్షించాలి. -తప్పకుండా. 182 00:16:46,089 --> 00:16:49,008 -నా విశ్లేషకుడికి చెబుతాను. -మన్నించాలి. 183 00:16:49,968 --> 00:16:52,554 -ఓ విషయ౦ తెలిసి౦ది. -చెప్పు. 184 00:16:52,637 --> 00:16:56,266 -మన ఒప్పందం సంగతేంటి? -నీకు జీఎస్-13 ఇప్పిస్తాను. 185 00:16:56,349 --> 00:16:58,143 అది చాలా చక్కని చెల్లింపు. 186 00:17:00,562 --> 00:17:02,772 -జాక్ వియెన్నాలో ఉన్నాడ౦ట. -వియెన్నా? 187 00:17:02,856 --> 00:17:05,233 అతను ఏథెన్స్ నుంచి అసలు ఎలా... 188 00:17:08,236 --> 00:17:09,279 అబ్బా ఛ. 189 00:17:20,331 --> 00:17:22,417 -ఆలస్యంగా వచ్చావు. -షాపింగ్ చేశాను. 190 00:17:23,585 --> 00:17:26,504 -ఇదంతా చూస్తే ఏదో తేడాగావు౦ది. -ఏంటది? 191 00:17:26,588 --> 00:17:30,800 ప్రెసిడెంట్ సురికోవ్‌కు పోపొవ్ ప్రధాన సలహాదారు. తను హింసాత్మకం కావచ్చు, 192 00:17:30,884 --> 00:17:34,679 కానీ అతనెప్పుడూ అణు యుద్ధాన్ని ఆమోదించలేడు. ఇది చూడు. 193 00:17:34,763 --> 00:17:40,185 1986, ఇతను చెర్నోబిల్ లిక్విడేటర్‌గా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. 194 00:17:40,268 --> 00:17:44,856 కరిగిపోయాక రియాక్టర్‌ను నిష్క్రియం చేసే వాలంటీర్లలో ఒకడిగా ఉండాలనుకున్నాడా? 195 00:17:44,939 --> 00:17:49,986 కచ్చితంగా అది అతన్ని అనుకట్టుకు౦ది. రక్షణ మంత్రిగా అతని మొదటి పని, 196 00:17:50,069 --> 00:17:53,031 అతను యూఎస్, రష్యాల మధ్య ఐఎన్ఎఫ్ ఒప్పందాన్ని తెచ్చాడు. 197 00:17:53,114 --> 00:17:56,034 ఇతను ఎప్పుడూ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఉన్నాడు. 198 00:17:56,117 --> 00:17:57,160 తను చనిపోవడం దారుణం. 199 00:17:58,036 --> 00:17:58,912 లేదా సౌకర్యం. 200 00:18:00,455 --> 00:18:01,456 ఏమంటున్నావు? 201 00:18:03,208 --> 00:18:05,960 దీని అంతటితోను అత్యధికంగా ప్రయోజనం ఎవరికి? 202 00:18:06,044 --> 00:18:07,545 కొత్త రక్షణ మంత్రికా? 203 00:18:08,671 --> 00:18:10,757 ముందరి మంత్రిని చంపించాడనా? 204 00:18:10,840 --> 00:18:14,552 సురికోవ్‌ను ఒప్పించడానికి ఇది చాలా శక్తివంతమైన సమయం అంటున్నాను. 205 00:18:16,638 --> 00:18:17,597 నవంబర్. 206 00:18:17,680 --> 00:18:18,723 వియెన్నా ఎలా ఉంది? 207 00:18:18,807 --> 00:18:21,518 నా వ్యక్తిగత సెల్ నంబర్ ఎలా దొరికి౦ది? 208 00:18:21,601 --> 00:18:23,978 -ఆ, తనకు ఫోన్ ఇవ్వు. -లైన్‌లో ఉండు. 209 00:18:25,188 --> 00:18:27,190 -హేయ్. -నీ గొంతు వినడం బాగుంది. 210 00:18:27,273 --> 00:18:30,777 -సరే, టోనీకి ధన్యవాదాలు. -బతికే ఉన్నావు, అవునా? 211 00:18:30,860 --> 00:18:32,070 రైట్‌తో ఉన్నావా? 212 00:18:32,153 --> 00:18:35,698 నా సాయం సంగతి కనిపెట్టి, దూరం పంపింది. ప్రాగ్‌లో ఉన్నాను, 213 00:18:35,782 --> 00:18:37,659 హత్య సంగతి పరిశీలిస్తూ. 214 00:18:38,243 --> 00:18:41,830 ఇప్పుడు నీ బుర్రలో ఏముందో నేను ఊహించగలనంతే. 215 00:18:41,913 --> 00:18:43,957 ఎవరిని నమ్మాలో నీకు తెలియకపోచ్చు. 216 00:18:44,040 --> 00:18:47,043 అందుకే ఇది చెబుతున్నా, కావాలంటే తీసుకో, లేదా వదిలెయ్. 217 00:18:47,794 --> 00:18:51,339 నీ అరెస్ట్ కోసం వియెన్నాకు ఎఫ్‌బీఐ ఏజెంట్లను ఎన్‌సీడీ పంపింది. 218 00:18:53,466 --> 00:18:54,384 ఏ ఆరోపణ మీద? 219 00:18:59,764 --> 00:19:00,598 దేశద్రోహం. 220 00:19:03,059 --> 00:19:06,271 -రైట్ ఈ దిశగా తీసుకెళుతోందా. -రైట్‌ కాదు. మిల్లర్. 221 00:19:06,354 --> 00:19:09,649 అతను ఆమెకు చెప్పనుకూడా లేదు. కానీ ఆమె ఎలాగోలా చేరింది. 222 00:19:09,732 --> 00:19:11,651 మైక్ గురించి ఆమెకు చెప్పావా? 223 00:19:11,734 --> 00:19:13,903 మీ ఇద్దరూ బాగా ఇరుక్కుపోయారు, 224 00:19:13,987 --> 00:19:17,991 మీరు పారిపోయే కొద్దీ, బయటకు రాలేనంతగా కూరుకుపోతారు. 225 00:19:18,074 --> 00:19:19,993 అది నా ప్రశ్నకు జవాబు కాదు. 226 00:19:20,076 --> 00:19:22,287 -ద్రోహివి నువ్వు, నేను కాదు. -ఛా. 227 00:19:23,037 --> 00:19:25,790 విను, పోపొవ్ గురించి ఏం తెలుసుకున్నావు? 228 00:19:25,874 --> 00:19:28,376 ఏమీ తోడవలేదు. కచ్చితమైన డబ్బు మూలం లేదు, 229 00:19:28,459 --> 00:19:32,255 హంతకుడి ఫుటేజ్ లేదు, మాయమైపోయిన ఓ సాక్షి. 230 00:19:33,131 --> 00:19:36,926 ఒకటి చెప్పు, ఇదంతా పన్నాగం అయుంటే? 231 00:19:38,511 --> 00:19:42,181 ఇది సహజంగా రష్యా పనిలా లేదు, మనం అది పరిశీలించాలి. 232 00:19:42,265 --> 00:19:43,683 చేస్తాను. ఇంకా, జాక్, 233 00:19:43,766 --> 00:19:45,894 నిన్ను వెంటాడుతున్న ఆ రష్యన్... 234 00:19:45,977 --> 00:19:47,437 నాకతను తెలుసు. 235 00:19:47,520 --> 00:19:48,688 అతను ఆల్ఫా గ్రూప్. 236 00:19:50,148 --> 00:19:51,608 ఆల్ఫా గ్రూప్. బాగుంది. 237 00:19:53,067 --> 00:19:53,902 నేను వెళ్లాలి. 238 00:19:54,611 --> 00:19:55,445 ఆది ఆమెనే. 239 00:19:56,529 --> 00:19:58,573 11:00, ఆరు ట్రాక్ చెయ్. 240 00:20:09,417 --> 00:20:12,503 మన ఆఖరి అతిథి వచ్చేశాడు. 241 00:20:15,673 --> 00:20:17,383 ఆలస్యానికి మన్నించాలి. 242 00:20:17,467 --> 00:20:18,509 ఒక మాట. 243 00:20:26,935 --> 00:20:27,894 డిమిట్రీ కోసం. 244 00:20:28,853 --> 00:20:29,979 అతను మంచి మనిషి. 245 00:20:30,063 --> 00:20:31,606 అతని గురించి గొప్పగా భావించావు. 246 00:20:32,565 --> 00:20:33,858 ఆయన నుంచి నేర్చుకున్నా. 247 00:20:33,942 --> 00:20:37,528 -మా నమ్మకాలను చాలా పంచుకున్నాడు. -కానీ అతి ముఖ్యమైనది కాదు. 248 00:20:38,363 --> 00:20:39,197 లేదు. 249 00:20:41,157 --> 00:20:43,409 మీ కూతురి విషయంలో అంతా బాగుందా. 250 00:20:47,372 --> 00:20:49,332 నా కూతురు నీకు పట్టింపు కాదు. 251 00:20:49,415 --> 00:20:53,711 చెక్ నేలపై ఉన్న ఆ నాటో మిసైల్స్ మనకు కావాలి, లేదా ప్రాజెక్ట్ విజయం సాధించదు. 252 00:20:53,795 --> 00:20:58,424 ఆమెది ఎప్పుడూ బలమైన సంకల్పం, మనస్సు. వాటిని ఎన్నటికీ మార్చలేను. 253 00:20:59,842 --> 00:21:02,345 ఆమె రష్యన్, ఆమెకు తెలిసినా, తెలియకపోయినా. 254 00:21:07,642 --> 00:21:12,522 మా నాన్న ఓ సైనికుడు, కఠినమైన వాడు. 255 00:21:14,440 --> 00:21:18,277 ఆయన ఏడవడం చూసినది బెర్లిన్ గోడను కూల్చినప్పుడే. 256 00:21:20,154 --> 00:21:21,864 అది ముగింపు అని తెలుసు తనకి. 257 00:21:23,032 --> 00:21:27,787 సోవియట్ యూనియన్ తప్పులు చేయకుండా ఉంటుందనే భ్రమ ఆయనకు అసలు లేదు, 258 00:21:27,870 --> 00:21:30,248 కానీ ఆయనకంతా రష్యా భూమాతే. 259 00:21:30,832 --> 00:21:33,459 అది కూలిపోయినప్పుడు, ఆయన పోరాడినద౦తా 260 00:21:33,543 --> 00:21:34,961 అర్థం లేకుండా పోయింది. 261 00:21:35,670 --> 00:21:38,214 ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయనను అడిగితే, 262 00:21:39,632 --> 00:21:42,301 "ఒకప్పుడు మనది భూమి మీద అతి భయం గొలిపే దేశం. 263 00:21:43,177 --> 00:21:46,973 "మనం మిగతా ప్రపంచాన్ని రాత్రి పూట నిద్ర లేపి ఉంచిన రాక్షసులం." 264 00:21:49,392 --> 00:21:52,812 ఇప్పుడు, సైబర్ యుద్ధాలకు డబ్బులిస్తాం. 265 00:21:52,895 --> 00:21:55,314 అంతరాయం కలిగిస్తాం, అసౌకర్యం కలిగిస్తాం. 266 00:21:55,398 --> 00:22:00,194 అది తెలివైనది, ఖర్చు తక్కువది, కానీ ఖర్చు లేకుండా యుద్ధం అర్థరహితం. 267 00:22:01,404 --> 00:22:05,700 ఖర్చు లేకుండా, మనకు గుర్తింపు లేదు. 268 00:22:09,579 --> 00:22:10,913 మనం అతనిలా మారాం. 269 00:22:14,000 --> 00:22:19,714 -ఇదంతా ఎందుకు చెబుతున్నావు? -ఇదెంత ముఖ్యమో నీకు గుర్తు చేయడం కోసం. 270 00:22:20,548 --> 00:22:26,345 ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్లమో, అలా మారేందుకు మనకు ఒకే ఒక్క అవకాశం ఉంది. 271 00:22:27,346 --> 00:22:30,308 ఈ మార్గంలో అహంకారం తలదూర్చేందుకు అనుమతించం. 272 00:22:32,727 --> 00:22:35,063 నా స్నేహితులారా, గ్లాసు అందుకోండి. 273 00:22:37,065 --> 00:22:40,193 నా చిన్నప్పుడు, మాకు ఐస్ క్రీం, సోడా లేవు. 274 00:22:40,276 --> 00:22:41,652 మాకు క్వాస్ ఉండేది. 275 00:22:42,070 --> 00:22:44,155 నా కృతజ్ఞతలు చూపాలని ఆహ్వానించాను. 276 00:22:44,238 --> 00:22:48,159 మన కారణానికి చాలా మద్దతుదారులున్నారు, కానీ శ్రేయోభిలాషులు కొందరే. 277 00:22:48,242 --> 00:22:51,204 మీ దాతృత్వానికి కృతజ్ఞత చెబుతాను. 278 00:22:51,287 --> 00:22:54,707 ఓ సామెత ఉంది, గొప్ప నౌకకు లోతైన నీరు కావాలి. 279 00:22:54,791 --> 00:22:57,835 మీరు ఆ లోతైన నీళ్లు, నా నేస్తమా. 280 00:23:05,051 --> 00:23:05,927 వెళదాం పదండి. 281 00:23:15,436 --> 00:23:17,105 సరే, అక్కడ. లెవెల్ బీ. 282 00:23:20,775 --> 00:23:22,235 ఇంకా మరుసటిది. 283 00:23:22,318 --> 00:23:23,653 లెవెల్ ఏ. 284 00:23:23,736 --> 00:23:24,612 ఇరవై ఎనిమిది. 285 00:23:29,617 --> 00:23:32,328 -కాల్పులపై నీ దగ్గర ఫుటేజీ లేదా? -లేదు. 286 00:23:32,411 --> 00:23:34,831 కెమెరాలు ఎక్కడున్నాయో వాళ్లకు సరిగ్గా తెలుసు. 287 00:23:37,166 --> 00:23:39,961 - లే. నేను ఓ ప్రయత్నం చేస్తా. -అలాగే. 288 00:23:55,309 --> 00:23:56,227 బాగున్నావా? 289 00:23:57,019 --> 00:23:58,771 నాకు రైల్వే స్టేషన్లు నచ్చవు. 290 00:23:58,855 --> 00:24:02,483 ఏ సినిమా చూసినా, రైల్వే స్టేషన్‌లో ఎన్నడూ మంచి జరగలేదు. 291 00:24:07,405 --> 00:24:11,701 సరే, గయ్స్. సిస్టంలో ఉన్నాను. మిమ్మల్ని చూస్తున్నాను. 292 00:25:03,419 --> 00:25:05,004 ఓ సాయం అడగవచ్చా? 293 00:25:05,922 --> 00:25:08,049 మమల్ని స్టేడియంలోకి తీసుకెళతావా? 294 00:25:10,092 --> 00:25:11,385 అలాగే, ఈ రాత్రికి. 295 00:25:12,428 --> 00:25:14,513 మనం అక్కడికెళితే అర్థం అవుతు౦ది. 296 00:25:38,412 --> 00:25:40,706 అలాగే. నిన్ను ఎక్కడకు పంపాలి? 297 00:25:45,586 --> 00:25:47,129 సెమ్మెరింగ్ ఎలా ఉంటుంది? 298 00:26:29,338 --> 00:26:30,423 అతను దొరికాడు. 299 00:26:35,303 --> 00:26:38,597 -ఇది ఎక్కడ తీసినది? -వియెన్నా స్టేషన్, ప్లాట్‌ఫాం తొమ్మిది. 300 00:26:38,681 --> 00:26:40,933 మనం దిగేసరికి అన్ని వివరాలు అందుతాయి. 301 00:27:27,688 --> 00:27:29,940 అతనిని కొడుతూ ఉంటే తను మాట్లాడలేడు. 302 00:27:53,756 --> 00:27:55,049 నేనెవరో నీకు తెలుసా? 303 00:27:57,510 --> 00:28:00,596 అబద్ధం చెప్పాలని చూడకు. డ్రగ్ ప్రభావం చూపుతుంది. 304 00:28:02,139 --> 00:28:05,393 -లూకా గోచరోవ్! -మా సైంటిస్ట్ నీకేం చెప్పాడు? 305 00:28:07,019 --> 00:28:09,271 -ఏమీ లేదు! -నీ సోర్స్ ఎవరు? 306 00:28:09,897 --> 00:28:10,898 నాకు తెలియదు. 307 00:28:22,493 --> 00:28:24,620 ఆ సిరి౦జ్ లొ నీళ్ళే ఉన్నాయి. 308 00:28:24,703 --> 00:28:29,250 మనం చాలా చర్చించాలి, సోకొల్‌ను ఆపాలంటే, కొంచెం సమయమే ఉంది. 309 00:28:49,145 --> 00:28:51,772 సెమ్మెరింగ్, ఆస్ట్రియా 310 00:29:05,202 --> 00:29:07,830 -ఏజెంట్ పావ్‌లోక్, ఆస్ట్రియాకు స్వాగతం. -పదండి. 311 00:29:36,484 --> 00:29:37,568 నాకిది నచ్చలేదు. 312 00:29:38,736 --> 00:29:40,321 అది స్పష్టంగా చెప్పావు. 313 00:29:40,404 --> 00:29:41,614 నా కోసం ఇక్కడే ఆగు. 314 00:29:50,456 --> 00:29:51,916 ఇక్కడకు పిలవడంపై మన్నించాలి. 315 00:29:51,999 --> 00:29:54,668 కానీ నాకు మీరు ఓ విషయంలో సాయపడగలరు. 316 00:29:56,253 --> 00:29:57,796 విషయానికి వద్దాం. 317 00:29:57,880 --> 00:30:02,343 ఆయుధంతో టీబోర్ కసాల్ ప్రవేశించడానికి సెక్యూరిటీ బాగా పటిష్టంగా ఉంది. 318 00:30:02,426 --> 00:30:06,222 -ఎవరో లోపలే పెట్టి ఉంటారు. -లేదా షూటర్ దగ్గర ఆయుధం ము౦దే వు౦ది. 319 00:30:06,305 --> 00:30:08,807 -అది కసాల్ పని కాదంటావా? -కారణమేమీ లేదు. 320 00:30:08,891 --> 00:30:11,310 ఇలాంటి పని చేయడానికి అర్థం లేదు. 321 00:30:11,393 --> 00:30:15,189 చంపేందుకు ముందు టేజర్ చేయబడ్డాడు. తను ఓ పావు అంతే. 322 00:30:16,148 --> 00:30:17,316 ఎవరి ఆటలో? 323 00:30:17,399 --> 00:30:20,778 నాకింకా తెలియదు. కానీ మీరు ఆశించే విధంగా పోపొవ్‌తో 324 00:30:20,861 --> 00:30:24,448 ఒప్పందానికి, మీకు ఏకగ్రీవ మద్దతు లేకపోయి ఉండవచ్చు. 325 00:30:24,532 --> 00:30:25,908 ఇది లోపలి మనుషులు చేసినదే. 326 00:30:29,286 --> 00:30:31,038 అసలు ఇక్కడ నేనేం చేస్తున్నాను? 327 00:30:32,706 --> 00:30:37,503 రెండవ అంతస్తులో కెమెరాలు లేవు. కసాల్‌ను కనుగొన్న చోటుపై ఫుటేజ్ ఏమీ లేదు. 328 00:30:37,586 --> 00:30:40,881 కానీ మీకు గుర్తు లేని విషయం ఏదో మీరు చూసి ఉండవచ్చు. 329 00:30:40,965 --> 00:30:44,134 అది దృష్టిలోకి తేవడానికి ఇక్కడకు రావడం సహకరించవచ్చు. 330 00:30:46,053 --> 00:30:46,929 అలాగే. 331 00:30:49,098 --> 00:30:52,768 అది మళ్ళీ అనుభవి౦చాల౦టే, ము౦దును౦చీ చేస్తా. 332 00:30:54,478 --> 00:30:56,272 కాల్చేందుకు ముందు ఏం జరిగింది? 333 00:30:58,190 --> 00:31:00,901 ఈ దిశగా మేము వస్తున్నాం, 334 00:31:00,985 --> 00:31:02,278 మాట్లాడుతున్నాం అంతే. 335 00:31:03,195 --> 00:31:06,323 చివరకు సెక్యూరిటీ కూడా ఆశ్చర్యపోయింది మేమెంత బాగా... 336 00:31:09,702 --> 00:31:10,536 ఏంటి? 337 00:31:12,079 --> 00:31:13,163 లేదు. 338 00:31:13,247 --> 00:31:15,749 పోపొవ్‌ను కాల్చినప్పుడు రాడెక్ నాతో లేడు. 339 00:31:17,751 --> 00:31:20,671 అది గందరగోళం. అంటే, ప్లేయర్లు చెల్లాచెదురు అయ్యారు, 340 00:31:20,754 --> 00:31:23,591 మా రక్షణ కోసం రెండు వైపులా పెనుగులాడారు, కానీ... 341 00:31:25,217 --> 00:31:27,678 కాల్చేందుకు ముందే రాడెక్ వెళ్లిపోయుండాలి. 342 00:31:30,848 --> 00:31:32,933 తనెక్కడకు వెళుతున్నాడో బాగా తెలుసు. 343 00:31:35,811 --> 00:31:38,939 తను ఇందులో భాగమయ్యాడనా? అలా జరగడానికి వీల్లేదు. 344 00:31:39,023 --> 00:31:42,985 సీసీటీవీ ఫుటేజ్ అంతా చూశాను. పోపొవ్‌ను కాల్చినప్పుడు ఇక్కడ లేడు. 345 00:31:43,068 --> 00:31:46,113 పై అంతస్తులో ఉన్నాడు, కసాల్‌ను చంపే సరైన స్థితిలో. 346 00:31:49,074 --> 00:31:51,118 మేము ఏళ్ల తరబడి స్నేహితులం. 347 00:31:51,869 --> 00:31:55,080 రాడెక్ ఓ దేశభక్తుడు. అతను ఇందులో భాగం కాలేడు. 348 00:31:55,164 --> 00:31:57,041 అవును, సరే, ఇది కష్టమని తెలుసు. 349 00:31:57,124 --> 00:32:01,045 కానీ మనం ప్రతి కోణం పరిశీలించాలి, ప్రతి సంభావ్యత పరిగణించాలి. 350 00:32:01,128 --> 00:32:04,715 ప్రత్యేకించి మన ము౦దున్న వ్యక్తిని. 351 00:32:28,530 --> 00:32:30,824 రా. పద. 352 00:32:37,456 --> 00:32:39,208 మనం చాలాసేపుగా బయటే ఉన్నాం. 353 00:32:40,417 --> 00:32:42,127 అదృష్టం మనతో లేదేమో. 354 00:32:43,504 --> 00:32:47,758 ఎరను కనుగొనడానికి రాత్రి పూట తోడేళ్ల మంద వంద మైళ్లు ప్రయాణిస్తుంది. 355 00:32:47,841 --> 00:32:51,887 సామెత ఉంటుందిగా, "నీ కృషి ఆధారంగానే విజయం లభిస్తుంది." 356 00:32:53,639 --> 00:32:54,890 నా అదృష్టం కావచ్చు. 357 00:32:56,266 --> 00:32:59,645 నేను పోగు చేయాల్సిన ట్రోఫీలలో ఓ తోడేలే మిగిలి౦ది. 358 00:33:00,854 --> 00:33:04,400 అలాంటి జంతువు తలను గోడకు వేలాడతీయడం వ్యర్థం. 359 00:33:09,279 --> 00:33:10,489 దగ్గరే ఉందనుకుంటా. 360 00:33:12,449 --> 00:33:13,450 నీకు కనబడిందా? 361 00:33:16,829 --> 00:33:17,663 అక్కడ. 362 00:34:22,644 --> 00:34:25,856 నాకు అర్థం కాలేదు. సీఐఏకు ఎందుకు సాయం చేస్తున్నావు? 363 00:34:27,024 --> 00:34:30,152 ఒకసారికి మనమిద్దరం ఒకేవైపు ఉన్నామని అనుకుందాం. 364 00:34:32,905 --> 00:34:33,822 మరి నేనే ఎందుకు? 365 00:34:35,491 --> 00:34:37,493 జోయాతో పని చేస్తున్నావని తెలుసు. 366 00:34:38,368 --> 00:34:39,578 ఆమె నిన్ను నమ్ముతుంది. 367 00:34:41,747 --> 00:34:43,081 ఆమె మీ వెగు. 368 00:34:44,541 --> 00:34:48,045 సిఐఏ క౦టబడడానికి నౌకలో అణు సామగ్ర౦ గురి౦చి అబద్దమాడారు. 369 00:34:49,338 --> 00:34:51,340 నువ్వసలు స్పందించకుండా ఉండవచ్చు, 370 00:34:51,423 --> 00:34:54,259 అతని సమాచారం చాలా ముఖ్యం. 371 00:34:54,760 --> 00:34:57,554 సోకొల్. దాని గురించి నీకేం తెలుసు? 372 00:34:59,223 --> 00:35:01,099 అది ఓ భీకర ప్రమాదం. 373 00:35:02,184 --> 00:35:04,019 అంతకు మించి నాకేమీ తెలియదు. 374 00:35:06,522 --> 00:35:10,317 అతను చనిపోక ముందు, కాన్‌స్టాన్‌టీన్‌ ద్రోహి అని యూరి చెప్పాడు, ఎందుకు? 375 00:35:11,693 --> 00:35:14,321 అది మేము కాదని యూరికి తెలుసు. 376 00:35:15,948 --> 00:35:17,241 అది రష్యా పని కాదు. 377 00:35:17,991 --> 00:35:19,117 -కానీ... -రష్యావాసి. 378 00:35:20,577 --> 00:35:21,829 ఓ చెడు వర్గం. 379 00:35:24,206 --> 00:35:25,916 ఆ గుట్టు విప్పాలని 380 00:35:26,959 --> 00:35:28,210 నా నిశ్చయం. 381 00:35:28,293 --> 00:35:29,461 వాళ్లకు ఏం కావాలి? 382 00:35:30,712 --> 00:35:32,881 సోవియట్ యూనియన్ పునరుద్ధరణ. 383 00:35:34,258 --> 00:35:35,592 అయితే, పరికరం ఉందా? 384 00:35:36,593 --> 00:35:38,053 యూరి పని దాని మీదే. 385 00:35:38,136 --> 00:35:40,639 ఇంకా పరికరం కాదు. 386 00:35:40,722 --> 00:35:41,723 నీ ఉద్దేశమేంటి? 387 00:35:42,558 --> 00:35:43,475 యురేనియమా? 388 00:35:45,936 --> 00:35:49,565 అది తగినంతగా ఉండే ఆయుధ డీలర్లు ఎక్కువ మంది ఉండరు. 389 00:35:49,648 --> 00:35:54,903 ఆ జాబితాలో అగ్రభాగాన ఉండే వ్యక్తి పేరు లెవాన్‌ జుబ్‌కోవ్. 390 00:35:55,362 --> 00:35:56,280 అతను ఎవరు? 391 00:35:56,947 --> 00:35:58,282 నీ స్నేహితుడిని అడుగు. 392 00:36:01,118 --> 00:36:03,036 జుబ్‌కోవ్ నా క్లయింట్లలో ఒకడు. 393 00:36:04,413 --> 00:36:07,499 నా అంచనా అందుకే మనం బుడాపెస్ట్‌కు వెళుతున్నామా? 394 00:36:07,583 --> 00:36:10,127 నువ్వింకా బతికున్న ఏకైక కారణం అదే. 395 00:36:10,210 --> 00:36:11,837 -అందుకు అభినందిస్తాను. -ఆగు. 396 00:36:11,920 --> 00:36:14,840 ఈ వర్గంతో జుబ్‌కోవ్ పని చేస్తున్నాడంటావా? 397 00:36:14,923 --> 00:36:15,883 అవును. 398 00:36:16,675 --> 00:36:20,304 -వాళ్లెంత దగ్గరగా ఉన్నారు? -రెండు రోజుల క్రితం కజకిస్తాన్ వెళ్లాడు. 399 00:36:20,387 --> 00:36:22,180 -ఈ నెలలో మూడవ పర్యటన. -దేవుడా. 400 00:36:22,264 --> 00:36:26,894 నేను నమ్మే ఎవరూ లేరు. ఎవరూ లేరు. నా ప్రభుత్వంలో కూడా. 401 00:36:28,770 --> 00:36:30,731 సీఐఏ నా మాట నమ్మాలని కోరుకుంటావు. 402 00:36:32,149 --> 00:36:33,108 వాళ్లు నమ్మరా? 403 00:36:49,791 --> 00:36:50,626 జాక్? 404 00:36:50,709 --> 00:36:52,586 నన్ను ఊహించనీ. సెమ్మెరింగ్? 405 00:36:53,253 --> 00:36:55,589 తోడుగా వచ్చాను. నీ విహారం బాగుందా? 406 00:36:57,382 --> 00:36:59,301 -బోలెడు దృశ్యాలు. -అదే అనుకున్నా. 407 00:37:00,218 --> 00:37:02,971 రష్యన్ హంతకుడు నీ వెంటపడ్డాడు. 408 00:37:03,055 --> 00:37:04,932 -నన్ను కనుగొన్నాడు. -తనను చంపావు. 409 00:37:05,849 --> 00:37:07,559 -నేను చంపలేదు. -ఎవరు చంపారు? 410 00:37:09,269 --> 00:37:10,520 లూకా గోచరోవ్. 411 00:37:13,023 --> 00:37:15,067 గోచరోవ్ నీ అసెట్ అని నాకు చెప్పకు. 412 00:37:15,150 --> 00:37:17,277 -అతనేం చేశాడో నీకు తెలుసు. -మనకు సాయం. 413 00:37:17,361 --> 00:37:20,072 అది రష్యన్ల పని కాదు. కొత్త రక్షణ మంత్రి 414 00:37:20,155 --> 00:37:24,076 తమ సొంత ప్రభుత్వంలో స్వతంత్రంగా పని చేసే వారిలో భాగం. 415 00:37:25,285 --> 00:37:29,414 గోచరొవ్ సమాచారం ఆధారంగా చర్య తీసుకునేందుకు మిల్లర్ అంగీకరించే సమస్య లేదు. 416 00:37:29,498 --> 00:37:32,125 -నేను మిల్లర్‌కు పని చేయకపోవడం మంచిదే. -జాక్. 417 00:37:32,209 --> 00:37:34,586 యూఎస్, రష్యాలను యుద్ధంలోకి ఎర వేస్తున్నారు, 418 00:37:34,670 --> 00:37:37,881 ఇక ఇప్పుడు, ఆ దారిలో అడ్డుగా ఉన్నది మనం మాత్రమే. 419 00:37:39,174 --> 00:37:42,010 -నావల్ల కాదు... -నువ్వు నన్ను నమ్మాలి. 420 00:38:12,916 --> 00:38:15,711 -ఎక్కడకు వెళుతున్నావు? -అతనున్నది రెడ్ ట్రైన్. 421 00:38:28,807 --> 00:38:31,601 ప్రాగ్ కోట ప్రాగ్, చెక్ రిపబ్లిక్ 422 00:38:34,229 --> 00:38:37,065 పార్కింగ్ టెర్రేస్‌లో లోపలకొచ్చే వాహనాలను 423 00:38:37,149 --> 00:38:39,651 ఒక మూలనున్న కెమెరా చిత్రీకరించింది. 424 00:38:39,735 --> 00:38:41,695 కసాల్ కారును గుర్తించాము. 425 00:38:43,572 --> 00:38:47,075 ఇదిగో. కనబడిందా? కసాల్ ఒంటరిగా రాలేదు. 426 00:38:47,784 --> 00:38:49,911 కారులో అతనితో ఎవరో ఉన్నారు. 427 00:38:50,704 --> 00:38:52,748 -ఎవరు? -తెలియిదు. 428 00:38:52,831 --> 00:38:57,502 కానీ ఈ విషయం తెలివిగా ఒకరి కంటే ఎక్కువ మంది పథకం వేశారు. 429 00:38:59,671 --> 00:39:03,759 నీ సందేశం వచ్చింది. వీలైనంత త్వరగా వచ్చాను. 430 00:39:07,679 --> 00:39:10,015 జేమ్స్ గ్రీర్, నా అంచనా. 431 00:39:10,098 --> 00:39:14,603 మిస్టర్ కోవక్, అసలు మీ కూతురు ఏం చెప్పారు? 432 00:39:14,686 --> 00:39:17,981 ఆమె సెక్యూరిటీ చీఫ్ మీద మీరు చేసిన ఆరోపణ మాత్రమే. 433 00:39:18,065 --> 00:39:21,443 పదవి లేకపోయినా, మా నాన్న నాకు అత్యంత విశ్వసనీయ సలహాదారుడు. 434 00:39:21,526 --> 00:39:25,072 పోపొవ్ మరణంలో రాడెక్ పాత్ర ఉందని నిజంగా అనుకుంటున్నావా? 435 00:39:25,155 --> 00:39:28,784 ఏదో పెద్ద కుట్రలో అతను భాగమనా? 436 00:39:33,705 --> 00:39:35,499 అవును. అవును, అదే అంటున్నా. 437 00:39:37,959 --> 00:39:41,379 అయితే మీ అవకాశాలు బాగా పరిమితం, మేడం ప్రెసిడెంట్. 438 00:39:47,219 --> 00:39:48,386 ఆ పని అయిపోయి౦ది. 439 00:39:49,513 --> 00:39:53,642 నాటోకు వారి మిసైల్ ఇన్‌స్టలేషన్స్ పంపేందుకు అనుమతి ఇచ్చాను. 440 00:39:55,060 --> 00:39:57,437 రష్యా ఆడుతున్న గేమ్ ఏంటో నాకు తెలియదు, 441 00:39:57,521 --> 00:40:00,565 కానీ ఈ దేశాన్ని వాళ్లకు ఆటస్థలం కానివ్వను. 442 00:40:02,359 --> 00:40:05,028 బుడాపెస్ట్, హంగరీ 443 00:40:29,427 --> 00:40:31,930 నీకు చెప్పిన ఆ హద్దు గుర్తుందా? 444 00:40:32,806 --> 00:40:34,057 ఇప్పుడే దానిని దాటావు. 445 00:42:26,586 --> 00:42:28,588 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 446 00:42:28,672 --> 00:42:30,674 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిషా౦తి ఈవని