1
00:01:07,720 --> 00:01:12,669
మనం ఈ అడవి మధ్యలోకి
ఏం దొరుకుతుందని వచ్చాము?
2
00:01:12,800 --> 00:01:16,679
మన దేశాన్ని, బంధువుల్ని వదిలేసి..
3
00:01:18,160 --> 00:01:20,196
...మన పూర్వీకుల ఇళ్లను కూడా.
4
00:01:23,640 --> 00:01:26,074
మనం సముద్రమంత శ్రమించాము...
5
00:01:27,200 --> 00:01:31,034
ఎందుకు? దేని కోసం?
6
00:01:31,120 --> 00:01:32,792
మీరు నిశబ్ధం పాటించాలని మేము కోరుకుంటున్నాము.
7
00:01:32,880 --> 00:01:38,830
విశ్వాసంతో, స్వచ్ఛమైన సువార్త
ప్రకటించటానికి కాదా?
8
00:01:38,920 --> 00:01:41,992
- దేవుని రాజ్యం కోసం కాదా?
- ఇక చాలు!
9
00:01:42,120 --> 00:01:45,032
మేము నీ న్యాయ నిర్ణేతలమే కానీ,
నువ్వు మా నిర్ణేత కాదు.
10
00:01:45,120 --> 00:01:47,998
అబద్దపు క్రైస్తవులు నాకు తీర్పు తీర్చ అనర్హులు.
11
00:01:48,120 --> 00:01:52,591
ఎందుకంటే నేను ఏసు గురించి తప్ప
మరే ఇతర విషయం గూర్చి సువార్త ప్రకటించలేదు.
12
00:01:52,680 --> 00:01:54,591
నువ్విలా మొండిగా, గర్వంతో,
13
00:01:54,680 --> 00:02:00,312
ప్రజల మరియు చర్చి చట్టాన్ని
కించపరచాలని కంకణం కట్టుకున్నావా?
14
00:02:04,720 --> 00:02:08,030
నా మనసు కి న్యాయం అనిపిస్తే.
15
00:02:08,120 --> 00:02:12,511
అయితే ఈ గ్రామం యిచ్చే రక్షణ నుండి
నిన్ను బహిష్కరించడం తప్పదు.
16
00:02:16,840 --> 00:02:19,308
నాకు సంతోషమే.
17
00:02:21,560 --> 00:02:26,031
అయితే పో.. పొయ్యి నీ పీడ నుంచి
మాకు విడుదల కలిపించు.
18
00:02:28,560 --> 00:02:33,031
మీరు ఆ ప్రభువుకే ముఖం చాటేశారు,
ఎంత బాధాకరం.
19
00:02:38,600 --> 00:02:40,033
కేథరీన్.
20
00:02:44,600 --> 00:02:46,272
తొమసిన్.
21
00:02:46,360 --> 00:02:48,635
పద.
22
00:03:15,080 --> 00:03:20,393
నేను యెహోవకు పరిపూర్ణ హృదయంతో
ఒప్పుకోలు చేస్తున్నాను.
23
00:03:20,480 --> 00:03:26,828
రహస్యంగా, నిజాయితీ పరుల మధ్యలో.
24
00:04:58,400 --> 00:05:03,155
నేను ఒప్పుకోలు చేస్తున్నాను
నేను పాపంలో జీవించానని.
25
00:05:03,320 --> 00:05:09,031
పనిలో బద్దకించాను,
పెద్దల మాట పెడచెవిన పెట్టాను,
26
00:05:09,160 --> 00:05:11,390
ప్రార్ధన విస్మరించాను.
27
00:05:13,400 --> 00:05:18,633
నేను, విశ్రాంతి దినమున,
చాటుగా ఆడుకున్నాను.
28
00:05:18,720 --> 00:05:22,349
ఇంకా మనసులో నీ అన్ని ఆజ్ఞలను అతిక్రమించాను.
29
00:05:24,240 --> 00:05:28,916
పరిశుద్ధాత్మ చిత్తంతో కాకుండా
నా కోరికల ప్రకారం నడుచుకున్నాను.
30
00:05:31,960 --> 00:05:35,714
నాకు తెలుసు నేను ఇంకా ఎంతో బాధకు,
అవమానానికి పాత్రురాలినని..
31
00:05:36,720 --> 00:05:39,678
...ఇంకా నరకపు అగ్నికి కూడా.
32
00:05:42,120 --> 00:05:47,592
కానీ నేను నిన్ను వేడుకుంటున్నాను...
నీ కుమారుడు కోసం...
33
00:05:48,840 --> 00:05:53,755
నన్ను క్షమించు, నీ దయ చూపు,
34
00:05:53,840 --> 00:05:56,559
నీ వెలుగు చూపించు.
35
00:05:58,760 --> 00:06:00,273
తొమసిన్.
36
00:06:27,600 --> 00:06:28,953
బూ!
37
00:06:29,040 --> 00:06:33,079
ఇక్కడున్నావ్, ఇక్కడున్నావ్.
38
00:06:34,920 --> 00:06:36,239
బూ!
39
00:06:38,800 --> 00:06:40,791
శామ్ ఎక్కడ?
ఎక్కడ శామ్?
40
00:06:40,920 --> 00:06:43,753
ఎక్కడ ఆ చిట్టి మనిషి?
41
00:06:43,880 --> 00:06:45,916
బూ!
42
00:06:46,000 --> 00:06:48,912
ఇదిగో ఇక్కడ, ఇక్కడున్నావ్.
43
00:06:51,200 --> 00:06:52,997
బూ!
44
00:06:57,520 --> 00:06:59,670
శామ్?
45
00:07:01,680 --> 00:07:04,592
శామ్యూయెల్!
46
00:10:29,560 --> 00:10:34,634
తొమసిన్.
47
00:10:47,040 --> 00:10:49,679
నిద్రపో.
48
00:10:49,760 --> 00:10:54,390
అంతా బాగానే ఉంటుంది, నిద్రపో.
49
00:11:54,560 --> 00:11:56,232
కేలెబ్.
50
00:11:56,360 --> 00:11:59,113
దేవుడు మంచి రేపటిని ఇచ్చుగాక.
51
00:11:59,200 --> 00:12:01,555
అందరూ ఇంకా నిద్రపోతున్నారు.
52
00:12:01,640 --> 00:12:04,029
అమ్మ తప్ప.
53
00:12:04,160 --> 00:12:07,072
ఈ బూడిద రంగు రోజుల్లో లేవటం
అంత తేలిక కాదు.
54
00:12:07,160 --> 00:12:09,833
ఆ సైతాను మన రెప్పలను
గట్టిగా ఆవహించి ఉంటాడు.
55
00:12:12,600 --> 00:12:14,716
- నేను వెళ్ళి లేపుతాను.
- వద్దు, వాళ్ళని అలానే ఉండనివ్వు.
56
00:12:16,640 --> 00:12:20,952
మీ అమ్మ అప్పటి నుంచి ఒక్క
రాత్రి కూడా నిద్ర పోలేదు...
57
00:12:25,880 --> 00:12:30,556
మనం ఇంకా వెతకలేం, కేలెబ్.
వెతకలేం.
58
00:12:32,160 --> 00:12:35,311
ఓ తోడేలు కాకపోతే, ఆకలి ఈ పాటికి
వాడి ప్రాణాన్ని తీసి ఉంటుంది.
59
00:12:43,880 --> 00:12:45,632
అడవిలోకి వెళ్దాం పద.
60
00:12:45,760 --> 00:12:48,320
కొంత కాలం నుంచి కొన్ని
ఉచ్చులు పన్నాను.
61
00:12:48,400 --> 00:12:50,550
ఈ బాధలు మొదలయిన కన్నా ముందు నుంచే.
62
00:12:50,640 --> 00:12:52,198
అడవి లోకా?
63
00:12:52,280 --> 00:12:54,475
మీ తండ్రికి సాయం చేస్తావా?
64
00:12:54,560 --> 00:12:57,791
నువ్వూ, అమ్మ ఎప్పుడూ అక్కడ
అడుగు పెట్టొద్దని మాకు చెప్తుంటారు గా.
65
00:12:58,840 --> 00:13:02,958
కేలెబ్, మన పంట ఈ చలికాలం
మొత్తం సరిపోదు.
66
00:13:03,040 --> 00:13:06,999
మనం ఆహారం పండించ లేకపోతే
దాన్ని పట్టుకోవాలి.
67
00:13:07,080 --> 00:13:10,789
మనం ఈ అడవిని జయిస్తాం.
అది మనల్ని మ్రింగేయలేదు.
68
00:14:35,800 --> 00:14:38,314
అయితే మరి నువ్వు పుట్టుకతోనే పాపివా?
69
00:14:38,400 --> 00:14:43,269
అవును, నేను పాపములో ధరింపబడ్డాను,
దోషములో పుట్టాను.
70
00:14:45,040 --> 00:14:47,634
అయితే మరి నీ జన్మ పాపం ఏమిటి?
71
00:14:47,720 --> 00:14:52,430
ఆదాము పాపం నాపై ఆపాదించబడినది,
అనైతికత నా స్వభావం గా మారింది.
72
00:14:52,520 --> 00:14:56,559
బాగా గుర్తుపెట్టుకున్నావ్, కేలెబ్, చాలా బాగా.
73
00:14:56,640 --> 00:14:59,234
అయితే మరి నీ అనైతిక ప్రవృత్తి ఏమిటో చెప్పగలవా?
74
00:14:59,320 --> 00:15:02,392
నా అనైతిక ప్రవృత్తి ఏమిటంటే, దయ లేకుండా,
75
00:15:02,480 --> 00:15:07,474
పాపములో, కేవలం పాపములో
జీవనం కొనసాగించడం.
76
00:15:07,560 --> 00:15:09,357
శబ్దం చేయకు.
77
00:15:23,000 --> 00:15:24,831
మనం మళ్ళీ ఉచ్చు వేయాలి.
78
00:15:43,400 --> 00:15:47,712
మరి, మరి శామ్యూయెల్ కూడా పాపేనా?
79
00:15:47,840 --> 00:15:49,193
అవును.
80
00:15:49,280 --> 00:15:50,633
అయితే మరి నేను..
81
00:15:50,760 --> 00:15:54,230
తను దేవుని రాజ్యంలోకి ప్రవేశించాడని
మనం ప్రార్దిద్దాం.
82
00:15:54,320 --> 00:15:55,673
తనేం పాపం చేశాడు?
83
00:15:55,760 --> 00:15:57,796
దేవుని యందు నమ్మకం వుంచు, కేలెబ్.
84
00:15:57,880 --> 00:16:00,519
మనం ఇంక నీ తమ్ముడు గురించి మాట్లాడబోము.
85
00:16:00,600 --> 00:16:02,431
ఎందుకు?
86
00:16:02,520 --> 00:16:05,273
తను కనిపించకుండా పోయి వారం కాలేదు.
87
00:16:05,400 --> 00:16:07,436
అయినా నువ్వూ, అమ్మ కనీసం
తన ఊసే ఎత్తటంలేదు.
88
00:16:07,520 --> 00:16:09,511
తను లేడు, కేలెబ్.
89
00:16:09,600 --> 00:16:12,433
- నాకు ఒకటి చెప్పండి.
- ఏం చెప్పాలి నీకు?
90
00:16:12,520 --> 00:16:14,351
- తను నరకానికి వెళ్లాడా?
- కేలెబ్!
91
00:16:14,440 --> 00:16:16,396
అమ్మ తన ప్రార్దన ఆపడంలేదు.
92
00:16:17,480 --> 00:16:19,596
ఒకవేళ నేను చచ్చిపోతే, ఈరోజే మరణిస్తే...
93
00:16:19,680 --> 00:16:21,910
- ఏమిటీ ఇదంతా?
- నా మనసులో చెడు మెదలుతోంది.
94
00:16:22,040 --> 00:16:23,632
- నా పాపాలు క్షమింప బడలేదు.
- నువ్వింకా చిన్నవాడివి...
95
00:16:23,720 --> 00:16:25,631
మరి దేవుడు నా ప్రార్ధనలు వినకపోతే?!
96
00:16:25,720 --> 00:16:27,870
- కేలెబ్!
- నాకు చెప్పండి!
97
00:16:28,640 --> 00:16:33,270
ఇలా చూడు,
నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను,
98
00:16:33,360 --> 00:16:34,793
కానీ మనిషి కాదు, కేవలం దేవుడు మాత్రమే,
99
00:16:34,880 --> 00:16:37,872
తెలుసుకోగలడు, ఎవరు అబ్రహం కుమారుడో,
ఎవరు కాదో,
100
00:16:38,000 --> 00:16:41,117
ఎవరు మంచో, ఎవరు చెడో.
101
00:16:41,200 --> 00:16:44,795
నాకు కూడా చెప్పాలని ఉంది,
శామ్ ఏసుతోనే ఉన్నాడని,
102
00:16:44,880 --> 00:16:47,553
నువ్వూ, నేను కూడా ఉంటామని.
103
00:16:47,640 --> 00:16:51,553
కానీ నేను అలా చెప్పలేను.
ఎవ్వరు కూడా చెప్పలేరు.
104
00:16:56,240 --> 00:16:58,549
కేలెబ్?
105
00:16:58,640 --> 00:17:00,915
ఇవి ఎక్కడివి?
106
00:17:01,040 --> 00:17:03,873
టామ్, స్లేటర్ ఇంతకు ముందు ఇటు పక్కగా
వెళ్ళినప్పుడు తీసుకున్నాను.
107
00:17:04,040 --> 00:17:05,758
దేనిని బదులిచ్చారు?
108
00:17:08,040 --> 00:17:09,712
మీ అమ్మ వెండి గిన్నె.
109
00:17:40,040 --> 00:17:43,749
దీని గురించి మీ అమ్మతో ప్రస్తావించకు. అస్సలు.
110
00:17:43,840 --> 00:17:46,274
తను ఇప్పటికే క్రుంగిపోయి ఉంది.
111
00:17:47,280 --> 00:17:51,159
తన బాధ కొంత ఉపశమించగానే
తన గిన్నె గురించి చెప్తాను.
112
00:17:51,240 --> 00:17:54,357
దీని గురించి ఇంకా మాట్లాడొద్దు.
113
00:17:54,440 --> 00:17:56,112
సరే.
114
00:17:59,640 --> 00:18:02,029
ఫౌలర్!
115
00:18:02,120 --> 00:18:04,156
వెదవ జంతువు.
116
00:18:04,240 --> 00:18:05,912
ఫౌలర్!
117
00:18:07,960 --> 00:18:10,394
ఏంటి, ఫౌలర్?
118
00:18:15,480 --> 00:18:17,869
దేవునికి స్తోత్రము కలుగుగాక.
త్వరపడు, కేలెబ్.
119
00:18:20,880 --> 00:18:22,472
ఈ పాడు తుపాకి!
120
00:18:23,600 --> 00:18:26,717
- నిప్పు ఆరిపోయింది, నాన్న.
- అవతల పక్క చూడు.
121
00:18:44,200 --> 00:18:46,270
నాన్న?
122
00:18:46,360 --> 00:18:48,157
నాన్నా!
123
00:18:50,280 --> 00:18:51,713
ఫౌలర్.
124
00:18:51,800 --> 00:18:55,429
బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్,
తలపై కిరీటం పెరుగుతుంది.
125
00:18:55,520 --> 00:18:58,990
బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్,
ముసలి రాణితో పెళ్ళయింది.
126
00:18:59,120 --> 00:19:01,350
కంచె పైకి దూకి...
127
00:19:01,440 --> 00:19:05,433
- జోనస్! మెర్సీ! ఇక్కడకు రండి!
- బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్,
128
00:19:05,520 --> 00:19:07,750
అందరికీ రాజువు...
129
00:19:07,840 --> 00:19:10,354
జోనస్! మెర్సి!
130
00:19:11,000 --> 00:19:14,470
బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్,
భూమ్యాకాశాల ప్రభువు
131
00:19:14,560 --> 00:19:18,109
బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్,
సముద్ర, సహారాల ప్రభువు
132
00:19:18,200 --> 00:19:21,795
మేము నీ బంట్లము,
మేము నీ వాళ్ళము.
133
00:19:21,880 --> 00:19:25,759
బ్లాక్ ఫిలిప్, సింహాలని
వాటి గుహలోనే తింటాడు.
134
00:19:28,840 --> 00:19:32,435
బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్,
తలపై కిరీటం పెరుగుతుంది...
135
00:19:52,680 --> 00:19:55,353
వెనక్కి పో!
ఇద్దరూ, ఆపండి!
136
00:19:55,440 --> 00:19:57,396
ఫిలిప్, వెనక్కి పో!
137
00:20:01,040 --> 00:20:02,473
స్వర్గం ఆశీర్వదించు గాక!
138
00:20:05,280 --> 00:20:07,111
కేలెబ్, తలుపు తీయి.
139
00:20:10,120 --> 00:20:11,758
కేలెబ్!
140
00:20:11,840 --> 00:20:14,035
లోపలకి పో!
141
00:20:16,560 --> 00:20:17,834
ఆ!
142
00:20:23,440 --> 00:20:25,635
నోరు ముయ్యండి!
143
00:20:26,800 --> 00:20:29,075
పొద్దున్నుంచీ నువ్వు, కేలెబ్ ఎక్కడున్నారు?
144
00:20:29,160 --> 00:20:30,388
ఎలా అలా వదిలేసి వెళ్లిపోయారు?
145
00:20:30,480 --> 00:20:34,314
ఇంకా నువ్వు, నీకు చెప్పానుగా జోనస్, మెర్శిని
కనిపెట్టుకొని ఉండమని.
146
00:20:34,400 --> 00:20:36,994
నేను ఉన్నాను అమ్మా, వాళ్ళని సహాయం చేయమన్నాను,
కానీ వాళ్ళు నా మాట వినడంలేదు.
147
00:20:37,080 --> 00:20:39,310
- ఇంకా నేను...
- ఏమైంది నీకు, తొమసిన్?
148
00:20:39,400 --> 00:20:41,391
అస్సలు ఏం చేస్తున్నావ్?
149
00:20:41,480 --> 00:20:44,313
మీ నాన్న బట్టలు కాలవ
దగ్గరకు తీసుకెళ్ళి శుభ్రపరుచు.
150
00:20:44,400 --> 00:20:47,278
- వాళ్ళు నా మాట వినడం లేదు.
- బాగా సబ్బు పెట్టు బ్రష్ చెయ్యి.
151
00:20:47,360 --> 00:20:48,634
తనకి సాయం చెయ్యి!
152
00:20:52,680 --> 00:20:57,913
నా బాధ అర్ధం చేసుకోండి,
ఎంత కంగారు పడ్డానో తెలుసా.
153
00:20:58,000 --> 00:20:59,877
నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లొద్దు.
వింటున్నావా?
154
00:21:01,280 --> 00:21:04,955
పొద్దున పనంతా మిగిలే ఉంది.
155
00:21:05,040 --> 00:21:07,156
జోనస్, నీ చెల్లిని వదిలిపెట్టు.
156
00:21:07,280 --> 00:21:09,953
- తనకి నచ్చింది.
- విలియం.
157
00:21:10,960 --> 00:21:13,474
ఏంటి, ఒక తండ్రి తన కొడుకుతో
కొంత సమయం గడపకూడదా?
158
00:21:13,560 --> 00:21:14,788
జోనస్!
159
00:21:14,880 --> 00:21:17,474
- నాన్న ఆపమని చెప్తున్నాడు.
- తొమసిన్!
160
00:21:17,560 --> 00:21:19,152
- ఆపు.
- ఆపండి!
161
00:21:19,280 --> 00:21:21,157
ఇద్దరూ, ఆపండి.
162
00:21:21,280 --> 00:21:22,838
తొమసిన్, కవలల్ని లోనికి తీసుకుపో.
163
00:21:22,920 --> 00:21:24,592
లేదు!
164
00:21:24,720 --> 00:21:28,315
లోనకి పొండి, లోనకి, లోనకి పొండి.
165
00:21:29,480 --> 00:21:31,789
నీ యిష్టం.
166
00:21:32,280 --> 00:21:34,714
మేము ఆపిల్ ల కోసం వెళ్ళాం!
167
00:21:36,840 --> 00:21:38,159
లోయ లోకి.
168
00:21:38,280 --> 00:21:40,999
నేనో ఆపిల్ చెట్టుని చూశానని అనుకున్నా.
169
00:21:41,080 --> 00:21:44,072
తోడేళ్ళు ఉంటాయేమో అని
నాన్న తుపాకి తెచ్చాడు...
170
00:21:44,160 --> 00:21:46,435
నాకెందుకు చెప్పలేదు?
171
00:21:46,520 --> 00:21:48,909
నాన్న నిన్ను ఆశ్చర్య పరుద్దామనుకున్నాడు,
ఆనంద పరుద్దామని.. కానీ..
172
00:21:50,360 --> 00:21:52,920
అక్కడేమీ లేవు.
173
00:21:53,040 --> 00:21:54,837
నేను నిజంగా చూశాను.
174
00:22:00,640 --> 00:22:05,509
నువ్వు మన తోట నుంచి బయటకి పోవటం
నాకు ఇష్టం లేదు, ఒక్క అడుగు కూడా.
175
00:22:05,600 --> 00:22:07,830
నేను అర్ధమయ్యానా?
176
00:22:10,680 --> 00:22:15,435
కేలెబ్, అమ్మకి కొంచం నీరు తీసుకురా.
177
00:22:15,560 --> 00:22:18,358
కాలవ నుంచి మరీ దూరంగా పోకు.
178
00:23:11,440 --> 00:23:13,112
ఎందుకు ఆలస్యం చేస్తున్నావు?
179
00:23:19,520 --> 00:23:21,033
సరే, ఏంటి?
180
00:23:23,560 --> 00:23:24,993
ఏంటి?
181
00:23:27,200 --> 00:23:30,590
కేలెబ్? కేలెబ్!
182
00:23:31,320 --> 00:23:32,548
ఆపు.
183
00:23:32,680 --> 00:23:34,591
నీకేం కాదులే.
184
00:23:36,720 --> 00:23:38,392
ఏమైంది నీకు?
185
00:23:40,520 --> 00:23:41,748
ఇలా రా.
186
00:23:46,680 --> 00:23:49,558
ఏమైంది నీకు, ఆ?
187
00:23:49,640 --> 00:23:52,234
ష్.
188
00:23:56,520 --> 00:24:00,229
మనం ఇంగ్లండ్ నుంచి వచ్చేసిన
తరువాత నాకు ఒక్క ఆపిల్ కూడా కనబడలేదు.
189
00:24:00,320 --> 00:24:02,436
నీకు కనబడినా బాగుండేది.
190
00:24:02,520 --> 00:24:04,192
నేనూ ఒకటి తినాలని ఎంతో ఆరాటపడుతున్నాను.
191
00:24:11,840 --> 00:24:13,068
అది విన్నావా?
192
00:24:13,160 --> 00:24:14,479
ఆ.
193
00:24:16,720 --> 00:24:17,948
ఎవరక్కడ?
194
00:24:18,040 --> 00:24:20,031
నేను అడవిలోని మంత్రగత్తె ని.
195
00:24:20,120 --> 00:24:21,553
మెర్సి, బయటకి రా.
196
00:24:21,640 --> 00:24:23,312
నేను మెర్సి ని కాదు.
197
00:24:23,480 --> 00:24:27,439
నేను అడవిలోని మంత్రగత్తె ని,
నిన్ను ఎత్తుకు పోవటానికే వచ్చాను.
198
00:24:27,520 --> 00:24:30,432
నేను కర్రపై చెట్ల
మధ్యలో ఎగరటం చూడండి:
199
00:24:30,520 --> 00:24:33,239
కరకర-కరకర,
కరకర-కరకర!
200
00:24:33,320 --> 00:24:35,436
- మెర్సి!
- కరకర-కరకర.
201
00:24:35,520 --> 00:24:36,919
ఎందుకు, తప్పు నువ్వు చేస్తే,
202
00:24:37,000 --> 00:24:39,116
బానిసలా, నేను నాన్నగారి
బట్టలు ఉతకాలి,
203
00:24:39,200 --> 00:24:41,839
- నువ్వేమో ఆడుకుంటుంటే?
- ఎందుకంటే అమ్మకు నువ్వంటే అసహ్యం..
204
00:24:41,920 --> 00:24:44,559
గడుగ్గాయి. తోట దాటి
బయటకు వచ్చావని అమ్మకి చెప్పేస్తా.
205
00:24:44,640 --> 00:24:46,790
బ్లాక్ ఫిలిప్ చెప్పాడు,
నా యిష్టం వచ్చినట్లు చేయవచ్చని.
206
00:24:46,920 --> 00:24:48,319
నీ బ్లాక్ ఫిలిప్ కి దెయ్యం పట్టింది.
207
00:24:48,400 --> 00:24:50,470
నేను బయటకి పోలేకపోవటం నీ వల్లే.
208
00:24:50,560 --> 00:24:53,870
నువ్వు శామ్ ని ఆ మంత్రగత్తె కి
వదిలేయక ముందు నేను హాయిగా తిరిగేదానిని.
209
00:24:53,960 --> 00:24:56,030
- నోరు ముయ్యి.
- శామ్ ని ఒక తోడేలు తీసుకెళ్లింది.
210
00:24:56,120 --> 00:24:59,351
ఓ మంత్రగత్తె. నేను తనని
అడవిలో ఎగురుతుండగా చూశాను.
211
00:24:59,480 --> 00:25:02,153
- నాన్న నాకు పాదం గుర్తులు చూపించాడు.
- అది ఒక మంత్రగత్తె నే.
212
00:25:02,240 --> 00:25:07,997
అవును, అది ఒక మంత్రగత్తె నే,
మెర్సి, నువ్వు నిజమే చెప్పావు.
213
00:25:08,080 --> 00:25:09,672
- తొమసిన్!
- అది నేనే.
214
00:25:09,760 --> 00:25:11,079
అబద్దం.
215
00:25:11,160 --> 00:25:15,551
అది నేనే, తనను దొంగిలించింది,
నేనే అడవిలోని మంత్రగత్తె ను.
216
00:25:15,640 --> 00:25:18,677
- అబద్దం! అబద్దం!
- కాదు నేనే.
217
00:25:18,760 --> 00:25:20,512
తన మాటలు పట్టించుకోకు, మెర్సి.
218
00:25:20,600 --> 00:25:22,795
నేనే ఆ మంత్రగత్తె ని.
219
00:25:22,880 --> 00:25:26,350
నేను నిద్రపోయినప్పుడు, నా ఆత్మ
నా శరీరం వదిలి
220
00:25:26,440 --> 00:25:29,193
సైతానుతో నగ్నంగా నాట్యం ఆడుతుంది.
221
00:25:29,280 --> 00:25:31,874
- అలాగే నేను తన పుస్తకంలో సంతకం పెట్టాను.
- లేదు.
222
00:25:31,960 --> 00:25:34,110
తను నన్ను ఒక బాప్తీజం ఇవ్వని
పసికందుని తీసుకురమ్మన్నాడు,
223
00:25:34,200 --> 00:25:38,352
అందుకే నేను శామ్ ని దొంగిలించి
నా యజమానికి ఇచ్చేశాను.
224
00:25:38,440 --> 00:25:41,716
ఇంకా నేను ఎవరినైనా, దేనినైనా సరే
మాయం చేసేయ గలను.
225
00:25:41,800 --> 00:25:43,518
- లేదు.
- అవును.
226
00:25:43,600 --> 00:25:45,670
ఇంకా నాకు కోపం తెప్పిస్తే,
నిన్ను కూడా మాయం చేసేస్తాను.
227
00:25:45,760 --> 00:25:48,513
- ఏం మాట్లాడొద్దు!
- మెర్సి, తనన్నీ కట్టుకథలు చెప్తుంది.
228
00:25:48,600 --> 00:25:51,717
ఏమో, మనకు ఆహారం దొరకటం లేదు గనుక,
నిన్ను ఉడకపెట్టి కూరవండేస్తానేమో.
229
00:25:51,800 --> 00:25:53,916
- లేదు!
- చాలు, తొమసిన్!
230
00:25:54,000 --> 00:25:55,831
- ఇది నిజం కాదు!
- నిజమే, పిల్ల.
231
00:25:55,920 --> 00:25:57,840
నీ మెత్తటి మాంసాన్ని కొరికి తినేయాలని
ఎంత కోరుకుంటున్నానో.
232
00:25:59,000 --> 00:26:00,831
నువ్వు గనుక దీని గురించి అమ్మకు చెబితే
233
00:26:00,920 --> 00:26:03,115
నీకూ, అమ్మకి మంత్రం వేసేస్తాను.
ఇంకా జోనస్ కి కూడా!
234
00:26:03,200 --> 00:26:05,156
- కేలెబ్!
- ఏడుపు ఆపి, ఎవరికీ చెప్పానని ప్రమాణం చెయ్యి.
235
00:26:05,240 --> 00:26:07,390
- సరే ఒట్టు.
- నువ్వు అమ్మకీ, నాన్నకీ ఏమీ చెప్పవుగా?
236
00:26:07,480 --> 00:26:10,074
- చెప్పను, ఒట్టు.
- తొమసిన్, తనని వదిలేయి.
237
00:26:10,160 --> 00:26:13,550
తన దగ్గరకి వెళ్లకు, కేలెబ్,
లేకపోతే తను నీకు మంత్రం వేసేస్తుంది!
238
00:26:16,280 --> 00:26:19,317
ఎందుకు మెర్సి ని అలా
భయపెట్టావ్?
239
00:26:19,640 --> 00:26:24,077
- నువ్వు కూడా నన్ను అసహ్యిస్తున్నావా?
- శామ్ ని ఒక తోడేలు ఎత్తుకెళ్లింది.
240
00:26:26,240 --> 00:26:29,437
నన్ను వదిలేయ్. వెళ్ళి అమ్మతో
నా చేష్టలన్నీ చెప్పు.
241
00:26:29,520 --> 00:26:33,308
- తొమసిన్...
- నీ జాలిని చూస్తే అసహ్యం వేస్తుంది. నాకది అక్కర్లేదు.
242
00:26:40,920 --> 00:26:43,912
మేము ఈ రోజు నీయందు చేసిన
పాపములను క్షమించి,
243
00:26:44,000 --> 00:26:47,709
మేము అర్హులైన శిక్షల నుంచి
మాకు విముక్తి కలిగించు, తండ్రి.
244
00:26:47,800 --> 00:26:51,315
సువార్తపై నమ్మకాన్ని మాలో పెంపొందించు.
245
00:26:51,400 --> 00:26:55,234
నీ నామంపై భయాన్ని,
మా పాపాలపై ఆసహ్యాన్ని,
246
00:26:55,320 --> 00:26:58,790
పరిశుద్ధాత్మ మాలో నివసించేలా..
247
00:26:58,880 --> 00:27:02,111
మేము నీ ప్రేమ, దయలో
నీ పిల్లలుగా..
248
00:27:02,200 --> 00:27:04,839
మా శరీరాలు ఆహారం కోసం
తపించేవేళ
249
00:27:04,920 --> 00:27:08,754
మా ఆత్మలు నిత్య జీవనం కోసం
తపించేలా చేయి.
250
00:27:08,840 --> 00:27:13,277
పాపంలో మా రోజులని నశింపజేసి,
251
00:27:13,400 --> 00:27:15,960
నీ కుమారుని రక్తంతో శుద్దిచేసి,
252
00:27:16,040 --> 00:27:20,272
కాపాడు మమ్ము, ఏసు క్రీస్తు ప్రభువా.
253
00:27:20,360 --> 00:27:22,954
- ఆమెన్.
- ఆమెన్.
254
00:27:58,800 --> 00:28:02,315
తొమసిన్, నా వెండి గిన్నె ఎక్కడ?
255
00:28:03,960 --> 00:28:06,394
అది ఆ అలమార పై లేదా?
256
00:28:06,480 --> 00:28:08,311
లేదు.
257
00:28:10,200 --> 00:28:11,474
అయితే, పెట్టెలో వుందేమో.
258
00:28:11,560 --> 00:28:14,597
అక్కడ కూడా లేదు.
259
00:28:14,680 --> 00:28:17,274
అది కొంత కాలం నుంచీ కనిపించటం లేదు.
260
00:28:18,320 --> 00:28:19,594
ఎక్కడన్నా పారేసుకున్నావా?
261
00:28:21,400 --> 00:28:22,719
నేను దాన్ని ముట్టుకోలేదు.
262
00:28:25,080 --> 00:28:26,832
అయితే ఎక్కడికి పోయింది మరి?
263
00:28:26,920 --> 00:28:28,160
నేను దాన్ని ముట్టుకోలేదు.
264
00:28:28,240 --> 00:28:30,196
నేను దాన్ని ఇంతకముందు
నీ చేతుల్లో చూశాను.
265
00:28:30,280 --> 00:28:32,840
తాను తీయలేదని చెప్తుందిగా, కేథరిన్.
266
00:28:34,200 --> 00:28:37,397
మా నాన్న ఇచ్చిన వెండి గిన్నె ని
ఇంత చిన్న కొంప లో ఎలా పారేశావో,
267
00:28:37,480 --> 00:28:38,833
- నాకు అర్థం కావటం లేదు.
- నేను దానిని తాకలేదు.
268
00:28:38,920 --> 00:28:41,753
వదిలేద్దాం, బిడ్డ. అది పోయింది.
269
00:28:42,760 --> 00:28:44,955
దాన్ని కూడా ఒక తోడేలే తీసుకెళ్ళిందా?
270
00:28:50,320 --> 00:28:52,231
తను దానిని తీయలేదు, కేథరిన్.
271
00:28:58,320 --> 00:29:02,233
ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ?
272
00:29:03,360 --> 00:29:04,588
ఇది సహాజమైనది కాదు.
273
00:29:16,080 --> 00:29:21,473
కేలెబ్, ఈ రాత్రికి ఓ వాక్యం చదువుతావా?
274
00:29:23,680 --> 00:29:27,195
మనం ఈ చీకట్లో వెలుగుని వెతుక్కోవాలి.
275
00:29:27,280 --> 00:29:30,795
రేపు మనం పాప ప్రక్షాళన కోసం
ఉపవాసం ఉందాం.
276
00:29:39,040 --> 00:29:44,398
తొమసిన్, తినే ముందు వాటిని
పనుకో బెట్టలేదా?
277
00:29:44,800 --> 00:29:46,199
బా.. బా..
278
00:30:40,760 --> 00:30:45,356
ఓ పరిశుద్ద ఆత్మ!
నాలో ఉండి, నా హృదయాన్ని ఆవహించు.
279
00:30:45,440 --> 00:30:47,635
నువ్వు నిద్ర పోవాలి, కేట్.
280
00:30:47,720 --> 00:30:51,952
ఈ రాత్రి, ఇంక అన్నీ రాత్రులూ, ఆమెన్.
281
00:31:11,800 --> 00:31:14,075
నేను నిన్ను ప్రేమిస్తున్నాని నీకు తెలుసా?
282
00:31:20,600 --> 00:31:21,999
తెలుసు.
283
00:31:23,000 --> 00:31:25,389
నేను చెప్పేది విను, కేట్,
284
00:31:25,480 --> 00:31:29,712
నువ్వు మన స్థితి పట్ల
ఎక్కు బాధ పడుతున్నావు.
285
00:31:32,200 --> 00:31:37,069
మనం మన ఆలోచనల్ని మన పై కాకుండా
దేవుని పైన నిలపాలి.
286
00:31:40,800 --> 00:31:45,590
తనుఇంతకుముందు మన పిల్లల్లో ఒక్కరిని కూడా తీసుకెళ్ల లేదు.
ఒక్కరిని కూడా, కేట్.
287
00:31:47,680 --> 00:31:50,478
అంత దయకి ఎవరు పాత్రులు కాగలరు?
288
00:31:54,320 --> 00:31:56,754
మనం దేవుని ప్రేమకు పాత్రులమయ్యాము.
289
00:31:59,400 --> 00:32:01,197
తను మన కుటుంబాన్ని శపించాడు.
290
00:32:01,280 --> 00:32:02,554
లేదు.
291
00:32:05,640 --> 00:32:10,430
తను మనల్ని హెచ్చించటానికే
ఇంత కిందకు తీసుకెళ్ళాడు.
292
00:32:10,520 --> 00:32:15,036
ఇంకా మరింత ప్రేమను చూపించటానికి.
293
00:32:16,760 --> 00:32:21,117
క్రీస్తు మాత్రం అడవులలో
సైతాను పీడను అనుభవించలేదా?
294
00:32:22,080 --> 00:32:24,150
మనం గూడాన్ని విడిచి ఉండాల్సింది కాదు.
295
00:32:24,240 --> 00:32:25,559
కేట్.
296
00:32:25,640 --> 00:32:28,313
- మనం వదిలి ఉండాల్సింది కాదు.
- కానీ ఆ సన్నాసి చర్చి.
297
00:32:28,400 --> 00:32:32,757
- ఇక్కడ అది కూడా లేదు.
- అయితే, ఏం కావాలి? వెండి గిన్నెలా?
298
00:32:34,360 --> 00:32:37,750
నా వెండి గిన్నె గురించి మాట్లాడితే
నీకు మర్యాద దక్కడు.
299
00:32:37,840 --> 00:32:41,071
అది నాకు కేవలం డబ్బు కాదు.
300
00:32:49,240 --> 00:32:50,593
కేథరిన్, నేను నీకొకటి చెప్పాలి...
301
00:32:50,680 --> 00:32:53,194
- మనం దానిని అమ్మి ఉండే వాళ్ళమి.
- ఏంటి?
302
00:32:53,280 --> 00:32:56,989
మన మొక్కజొన్న ని ఏ వెదవ కొంటాడు?
303
00:32:58,680 --> 00:33:04,038
మనమ్మాయి పడుచు పిల్ల లక్షణాలను చూపిస్తుంది.
304
00:33:06,600 --> 00:33:09,831
తొమసిన్? కేలెబ్?
305
00:33:09,920 --> 00:33:12,229
పనుకున్నారా?
306
00:33:12,320 --> 00:33:14,276
మెర్సి?
307
00:33:15,280 --> 00:33:16,508
జోనస్?
308
00:33:18,280 --> 00:33:23,559
తను పెద్దదయ్యింది.
తనను ఇంకొక ఇంటికి పంపించేయాలి.
309
00:33:23,640 --> 00:33:26,632
ఇందులో తన తప్పేమీ లేదు.
కేట్, నేను నీకొకటి చెప్పాలి...
310
00:33:26,720 --> 00:33:29,757
అవును, నీ కుటుంబాన్ని ఇక్కడ పడేసి
నువ్వే పెద్ద తప్పు చేశావు.
311
00:33:29,840 --> 00:33:31,159
ఇది దేవుని భూమి.
312
00:33:31,240 --> 00:33:32,673
దేవుని దా?
313
00:33:32,760 --> 00:33:34,640
మన పిల్లల్ని ఆటవికుల్లా పెంచుతున్నాము.
314
00:33:34,720 --> 00:33:35,948
కేట్!
315
00:33:36,040 --> 00:33:39,191
శామ్యూల్ కి బాప్తీజం చేయిద్దామని
ఎన్నిసార్లు వేడుకున్నాను.
316
00:33:39,280 --> 00:33:41,748
సంఘానికి బయట బాప్తీజం చేయరు.
317
00:33:41,840 --> 00:33:43,717
మన శామ్ నరకానికి వెళ్ళాడు!
318
00:33:43,800 --> 00:33:46,633
లేదు.
319
00:33:47,200 --> 00:33:50,510
దేవుని దయ వల్ల, కేలెబ్ బాగున్నాడు.
320
00:33:50,600 --> 00:33:52,511
మనం తనని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇంకా తొమసిన్ ని.
321
00:33:52,600 --> 00:33:53,953
మన మొక్కజొన్న పనికి రాదు!
322
00:33:54,040 --> 00:33:56,076
మనం ఆ చర్చి కి తిరిగి వెళ్ళటం లేదు.
323
00:33:56,160 --> 00:33:57,559
మనం పస్తులతో చస్తాం!
324
00:33:57,680 --> 00:34:02,071
నెమ్మదిగా, నెమ్మదిగా.
వాళ్ళు వింటారు, నెమ్మదిగా.
325
00:34:06,560 --> 00:34:11,475
రేపు ఉదయాన్నే గుర్రాన్ని, తొమసిన్ ని
తీసుకొని గూడానికి వెళ్తాను.
326
00:34:11,560 --> 00:34:13,994
టిల్డెన్స్, లేదా వర్తింగ్స్,
327
00:34:14,080 --> 00:34:16,640
ఎవరో ఒకరు తనను స్వీకరిస్తారు.
328
00:34:16,720 --> 00:34:19,632
వాళ్ళు మంచి మనుషులు.
329
00:34:19,720 --> 00:34:22,951
ఆపు, కేట్.
330
00:34:23,080 --> 00:34:26,755
మనకి ఆహారం దొరుకుతుంది. నాకు తెలుసు.
331
00:34:49,960 --> 00:34:51,712
కేలెబ్?
332
00:34:52,960 --> 00:34:55,428
ఏం చేస్తున్నావ్?
333
00:34:55,520 --> 00:34:57,078
వెళ్ళి పనుకో.
334
00:34:57,920 --> 00:35:01,435
ఏంటిదంతా?
నాకు చెప్పు, ఇప్పుడే.
335
00:35:04,680 --> 00:35:06,193
- పారిపోతున్నావా?
- లేదు.
336
00:35:06,280 --> 00:35:08,032
- నాతో అబద్దం చెప్పకు.
- నేను చెప్పట్లేదు.
337
00:35:08,120 --> 00:35:10,680
మరింకేంటి?
338
00:35:10,760 --> 00:35:12,239
చెప్పు!
339
00:35:12,320 --> 00:35:16,108
నువ్వు గమ్మున పోయి పనుకొని,
దీని గురించి ఎవరికీ చెప్పకపోతే,
340
00:35:16,200 --> 00:35:17,519
నేను మాటిస్తున్నాను,
341
00:35:17,600 --> 00:35:22,230
నువ్వు టిల్డన్స్ కొ ఇంకో కుటుంబానికో
బానిసలా ఊడిగం చేయాల్సిన అవసరం ఉండదు.
342
00:35:22,320 --> 00:35:24,754
నేను మధ్యానానికల్లా తిరిగి వచ్చేస్తాను.
343
00:35:27,120 --> 00:35:29,634
- సరే, నేనూ నీతో వస్తాను.
- వద్దు.
344
00:35:29,720 --> 00:35:32,314
- నన్నూ రానివ్వు.
- నేను రానివ్వలేను.
345
00:35:33,280 --> 00:35:35,191
నన్ను నీతో రానీయకపోతే,
346
00:35:35,320 --> 00:35:37,117
అమ్మా నాన్నలని ఇప్పుడే లేపేస్తాను.
347
00:35:57,400 --> 00:35:58,879
పడిందా?
348
00:36:01,800 --> 00:36:03,358
అవును, మనకు ఉన్నాయి.
349
00:36:03,440 --> 00:36:05,078
- లేవు.
- ఉన్నాయి!
350
00:36:05,160 --> 00:36:06,957
లేవు.
351
00:36:07,040 --> 00:36:08,439
ఇంగ్లండ్ లో మనకు గాజు కిటికీలు ఉండేవి.
352
00:36:08,560 --> 00:36:10,949
నువ్వు మర్చిపోయేంత కాలం క్రితమేమీ
మనం ఇక్కడకు రాలేదు.
353
00:36:11,040 --> 00:36:12,632
నీ ఇష్టం, తొమసిన్?
354
00:36:12,720 --> 00:36:14,950
నీకు కోపం వచ్చింది.
355
00:36:15,040 --> 00:36:17,952
ఫౌలర్ ఎండలో పనుకున్న రోజు
నీకు గుర్తుందా?
356
00:36:18,040 --> 00:36:20,793
- గుర్తుండే ఉంటుంది.
- లేదు.
357
00:36:20,880 --> 00:36:24,270
ఎక్కడ ఎండ వస్తే అక్కడ పనుకునే వాడు, వెచ్చగా.
358
00:36:24,360 --> 00:36:27,397
ఒకసారి అలాగే బల్ల మీద పనుకుంటే
నాన్న దాన్ని చూసి అన్నాడు
359
00:36:27,480 --> 00:36:29,277
"ఈ పూటకి దీన్ని తినేద్ధామని.
360
00:36:29,360 --> 00:36:31,999
కేట్! కేట్!
మనం ఈ మృగాన్ని వేయించుదాం"
361
00:36:32,080 --> 00:36:34,640
నీకు అదన్నా గుర్తుండే వుండాలి.
362
00:36:34,720 --> 00:36:39,236
నాకు ఆ రోజు గుర్తుంది.
కానీ గాజు గుర్తులేదు.
363
00:36:39,320 --> 00:36:42,710
మ్, అది అందంగా ఉండేది.
364
00:36:47,400 --> 00:36:48,992
ఏమయ్యింది?
365
00:36:52,360 --> 00:36:54,635
బర్ట్, శాంతించు.
366
00:36:54,720 --> 00:36:57,439
ఫౌలర్! వద్దు, ఫౌలర్!
367
00:36:58,360 --> 00:36:59,713
ఇక్కడే బర్ట్ తో వుండు.
368
00:36:59,800 --> 00:37:03,634
- కేలెబ్, వద్దు.
- నేనిప్పుడే వచ్చేస్తాను.
369
00:37:03,720 --> 00:37:05,756
దీనికి పిచ్చి పట్టింది.
370
00:37:11,320 --> 00:37:13,311
- తొమసిన్!
- కేలెబ్!
371
00:37:13,400 --> 00:37:15,118
- తొమసిన్!
- తొమసిన్!
372
00:37:15,240 --> 00:37:19,552
- కేలెబ్!
- కేలెబ్!
373
00:37:19,640 --> 00:37:24,555
- తొమసిన్!
- కేలెబ్!
374
00:37:24,640 --> 00:37:27,438
తొమసిన్!
375
00:37:27,520 --> 00:37:31,354
- తొమసిన్!
- కేలెబ్!
376
00:37:38,160 --> 00:37:40,674
తొమసిన్!
377
00:37:48,160 --> 00:37:50,196
ఫౌలర్!
378
00:37:53,440 --> 00:37:57,149
ఓ తండ్రీ, ఓ ప్రభువా, నాకు సాయం చేయి,
379
00:37:57,280 --> 00:38:00,716
నేను పశ్చాత్తాప పడుతున్నాను,
నన్ను చెడు నుంచి మరల్చు.
380
00:38:00,840 --> 00:38:04,355
నా నమ్మకాన్ని ఎవరూ నాశనం చేయలేరు.
నా మనసు సైతాను మాట వినదు.
381
00:38:04,440 --> 00:38:08,149
ఓ తండ్రీ, ఓ ప్రభువా, నాకు సాయం చేయి,
382
00:38:08,280 --> 00:38:11,670
నేను పశ్చాత్తాప పడుతున్నాను,
నన్ను చెడు నుంచి మరల్చు.
383
00:38:11,760 --> 00:38:13,318
నా నమ్మకాన్ని ఎవరూ నాశనం చేయలేరు.
384
00:38:13,400 --> 00:38:15,356
నా మనసు సైతాను మాట వినదు.
385
00:38:15,480 --> 00:38:18,631
ఓ తండ్రీ, ఓ ప్రభువా, నాకు సాయం..
386
00:38:50,320 --> 00:38:52,470
కేలెబ్!
387
00:38:59,880 --> 00:39:01,711
కేలెబ్!
388
00:40:13,000 --> 00:40:15,594
- కేలెబ్!
- తండ్రి!
389
00:40:15,680 --> 00:40:17,079
తొమసిన్!
390
00:40:18,720 --> 00:40:21,518
ఆ, నా బిడ్డ, నా బిడ్డ.
391
00:40:27,040 --> 00:40:29,076
నీ తమ్ముడు ఎక్కడ?
392
00:42:20,520 --> 00:42:23,273
అసలేంటి నీ సమస్య, తొమసిన్?
అస్సలు ఏం చేస్తున్నావు నువ్వు?
393
00:42:23,360 --> 00:42:26,989
తొలి జామునే నేను బయల్దేరతాను.
తాను దొరికే వరకూ తిరిగి రాను.
394
00:42:27,080 --> 00:42:30,038
గూడెం లో ఎవరినన్నా సహాయం కోరితే మంచిది.
నీక్కూడా ఏమన్నా...
395
00:42:30,120 --> 00:42:32,509
గూడెం ఒక రోజు దూరంలో ఉంది,
పైగా నాకు గుర్రం లేదు.
396
00:42:32,600 --> 00:42:34,113
మనకంత సమయం లేదు.
397
00:42:34,200 --> 00:42:36,998
నువ్వు పొద్దున్నే బయల్దేరుండాల్సింది.
398
00:42:37,080 --> 00:42:39,594
నీ దగ్గర తుపాకీ లేదు, విలియం,
కనీసం కుక్క కూడా.
399
00:42:39,680 --> 00:42:41,671
- వెదవ లా ప్రవర్తించకు.
- అడవిలోకి వెళ్తున్నందుకు నేను వెదవనే.
400
00:42:41,760 --> 00:42:44,149
కానీ ఈ కుటుంబానికి తోడు ఇంకే వెదవా లేడుగా.
401
00:42:46,720 --> 00:42:48,915
నన్ను వెళ్ళనీయ్.
402
00:42:49,960 --> 00:42:52,428
పైన చంద్రుడున్నాడు,
వర్షంతో నాకు ఇబ్బంది లేదు.
403
00:42:52,560 --> 00:42:55,393
నేను రెండ్రోజుల్లో తిరిగి వచ్చేస్తాను,
అదృష్టం ఉంటే ఇంకోకరితో కూడా.
404
00:42:55,480 --> 00:42:58,233
- వెళ్లొద్దు, నాన్న!
- చాలు!
405
00:43:01,840 --> 00:43:04,308
అస్సలు అడవిలోకి ఎందుకు వెళ్లారు.
406
00:43:04,400 --> 00:43:06,789
- నేను చెప్పనని మాటిచ్చాను.
- నాకు అనవసరం!
407
00:43:10,640 --> 00:43:12,596
నా మాటకు విలువ ఇవ్వు.
408
00:43:12,680 --> 00:43:15,797
ఓ, బిడ్డా, నువ్వు చెప్పు, నేను తప్పకుండా ఇస్తాను.
409
00:43:18,600 --> 00:43:19,828
నేను, అదీ...
410
00:43:22,520 --> 00:43:24,590
మాట్లాడు!
411
00:43:24,720 --> 00:43:26,312
నేను...
412
00:43:26,920 --> 00:43:29,070
నేను మీ నాన్న వెండి గిన్నెని తీశాను.
413
00:43:33,480 --> 00:43:35,152
నేనే దాన్ని అమ్మేశాను.
414
00:43:38,320 --> 00:43:42,871
నన్ను క్షమించు, కేట్.
క్షమించు, తొమసిన్.
415
00:43:46,360 --> 00:43:48,828
ఏం జరుగుతోంది?
416
00:43:53,440 --> 00:43:56,352
కేథరిన్, నేను ఒప్పుకోలు చేయాలి.
417
00:43:59,000 --> 00:44:01,958
నేను నిన్న పొద్దున కేలెబ్ ని
అడవిలోకి తీసుకెళ్ళాను.
418
00:44:06,120 --> 00:44:09,635
నేను మన ఆహారం కోసం చేశాను,
తోళ్ళు మంచిగా డబ్బులు వస్తాయని..
419
00:44:09,720 --> 00:44:11,711
నువ్వు అబద్దాల కోరువని నాకు తెలుసు.
నాకు తెలుసు.
420
00:44:11,800 --> 00:44:14,314
నేను నిన్ను ఆశ్చర్యపరుద్దామనే అలా చేశాను,
అందుకనే నీకు చెప్పలేదు.
421
00:44:14,400 --> 00:44:15,958
నేను ఆ తోడేలుని పట్టుకొని తీరతాను, కేట్.
422
00:44:16,040 --> 00:44:17,996
మన కొడుకు నాకు అబద్దం చెబుతుంటే
మీరు చూస్తూ నుంచున్నారు!
423
00:44:18,080 --> 00:44:19,911
అది నీ కోసమే, కేట్!
నువ్వంటే నాకు ఇష్టం, కేట్.
424
00:44:20,000 --> 00:44:22,560
- నువ్వు వాడిని ఆడవుల్లోకి తీసుకెళ్ళావు.
- నేను వాడిని కనిపెడతాను.
425
00:44:22,680 --> 00:44:24,557
నువ్వు భగవంతునితో చేసిన ఒప్పందాన్ని వమ్ము చేశావు.
నువ్వో అబద్దాలకోరువి.
426
00:44:24,680 --> 00:44:26,318
నువ్వు మరో బిడ్డని పొట్టన పెట్టుకున్నావు.
427
00:44:26,400 --> 00:44:28,914
- నేను ఇప్పుడే వెళ్తాను.
- నువ్వు ఆడవినుంచి తప్పించుకోలేవు.
428
00:44:29,000 --> 00:44:30,513
నేను వాడిని కనిపెడతాను.
429
00:44:30,600 --> 00:44:34,115
ఎలా, నువ్వు కూడా చచ్చా?
ఆపై ఇంటి భారం అంతా జోనస్ మోస్తాడా?
430
00:44:34,200 --> 00:44:36,191
నీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తావా?
431
00:44:36,280 --> 00:44:38,714
- కేథరిన్!
- నన్ను వదులు!
432
00:44:51,120 --> 00:44:52,951
ఆపిల్ ల కోసమంట.
433
00:45:01,680 --> 00:45:06,037
అమ్మ, మేకల్ని పనుకోబెట్టారా?
434
00:45:06,120 --> 00:45:08,350
- లేదు.
- నేను ఆ పని చూస్తాను.
435
00:45:08,440 --> 00:45:13,275
పొద్దున్న చూద్దాం.
ఈ వర్షంలో ఎక్కడికీ పారిపోవు లే.
436
00:45:13,360 --> 00:45:15,237
లేదు, నేను చూసి వస్తాను.
437
00:45:15,320 --> 00:45:18,198
మళ్ళీ పొద్దున నీకు శ్రమ, అమ్మ.
438
00:45:18,280 --> 00:45:20,191
ఇలా రా, బిడ్డ.
439
00:45:33,440 --> 00:45:34,998
త్వరగా వచ్చేయ్.
440
00:46:19,640 --> 00:46:21,949
కేలెబ్...
441
00:46:25,040 --> 00:46:26,393
నాన్న!
442
00:46:26,480 --> 00:46:27,959
కేలెబ్, కేలెబ్...
443
00:46:54,560 --> 00:46:57,791
ష్.
444
00:47:36,720 --> 00:47:38,551
ఓ, దయగల తండ్రి,
445
00:47:38,640 --> 00:47:41,313
జీవానికి ప్రభువైన,
446
00:47:41,400 --> 00:47:45,188
ఏకైక, ఏసు క్రీస్తుని మేము స్తోత్రీస్తున్నాము.
447
00:47:45,280 --> 00:47:47,271
స్వర్గం నుంచి మమ్ములను
448
00:47:47,360 --> 00:47:50,272
కరుణతో నిండిన నీ దయగల చూపుతో చూడు.
449
00:47:50,360 --> 00:47:52,032
దెబ్బతిన్న నీ బంటుపై జాలి చూపించు...
450
00:48:26,840 --> 00:48:32,119
బా, బా. బా, బా, బా.
451
00:48:32,200 --> 00:48:34,760
కేలెబ్ కి ఏమయ్యింది, బ్లాక్ ఫిలిప్?
కేలెబ్ కి ఏమయ్యింది?
452
00:48:34,840 --> 00:48:37,400
అడవిలో తొమసిన్ తనని ఇలా చేసిందా?
453
00:48:37,480 --> 00:48:38,754
ఏం అంటున్నావ్?
454
00:48:38,840 --> 00:48:40,796
బ్లాక్ ఫిలిప్ అంటున్నాడు
నువ్వు చెడ్డదానివంట.
455
00:48:40,920 --> 00:48:42,433
అవును, నాకు కూడా చెప్పాడు.
456
00:48:42,520 --> 00:48:43,794
మీ బ్లాక్ ఫిలిప్ ని చంపేస్తాను.
457
00:48:43,920 --> 00:48:48,232
తను అన్నాడు నువ్వు కేలెబ్ లో
సైతాను ని పెట్టావంట, అందుకే తనకి బాగోలేదంట.
458
00:48:48,360 --> 00:48:51,989
నేను ఎప్పటికీ కేలెబ్ ని గాయపరచను,
లేక శామ్ ని, లేక మిమ్మల్ని.
459
00:48:52,080 --> 00:48:53,911
- నువ్వు నన్ను కొట్టావు.
- అది ఊరికే, సరదాగా.
460
00:48:54,000 --> 00:48:55,638
- నువ్వు నన్ను తింటానన్నావు.
- మెర్సి!
461
00:48:55,720 --> 00:48:57,199
అమ్మా నాన్నలకి తెలిసిపోతుంది.
462
00:48:57,280 --> 00:48:59,840
- ఏంటి?
- నువ్వు ఓ మంత్రగత్తె వని!
463
00:49:01,840 --> 00:49:04,479
తొమసిన్!
464
00:49:04,840 --> 00:49:06,478
తొమసిన్?
465
00:49:44,360 --> 00:49:46,828
నేకు జాన్ కెంపె కొడుకు గుర్తున్నాడా?
466
00:49:47,000 --> 00:49:49,355
అంతక మునుపు చలి కాలంలో,
తనకు చేతబడి చేశారు.
467
00:49:49,440 --> 00:49:51,237
ఇది అది కాదు.
468
00:49:51,320 --> 00:49:55,518
- ఇది దుష్ట శక్తుల పనే.
- నాకు అలా అనిపించట్లేదు.
469
00:49:55,600 --> 00:49:57,830
నీ కొడుకుని చూడు.
470
00:49:58,680 --> 00:50:00,238
- విల్.
- ఏంటి?
471
00:50:00,320 --> 00:50:01,878
- ఆలోచించు?
- దేని గురించి?
472
00:50:02,000 --> 00:50:04,958
- ఆలోచించు!
- నాకేం గుర్తుకు రావటంలేదు.
473
00:50:05,040 --> 00:50:07,190
ఇది ఓ మంత్రగత్తె పని లాగా కనిపించటంలేదా?
474
00:50:07,280 --> 00:50:08,838
ఏమిటి, మంత్రగత్తె నా?
475
00:50:10,040 --> 00:50:12,190
మరింకెవరు చేస్తారు ఈ పని? ఎవరు?
476
00:50:13,160 --> 00:50:15,515
నువ్వు చిన్న పిల్లల్లా ఆలోచిస్తున్నావు.
477
00:50:22,200 --> 00:50:23,713
ఏం చేస్తున్నావ్?
478
00:50:24,720 --> 00:50:27,837
మనం పొద్దున్నే గూడానికి తిరిగి వెళ్తున్నాం.
479
00:50:27,960 --> 00:50:32,112
తొమసిన్ కి మంచి కుటుంబాన్ని చూసి,
కేలెబ్ ని డాక్టర్ దగ్గరకి తీసుకెళదాం.
480
00:50:33,120 --> 00:50:35,190
తాను చెప్తాడు ఇది దుష్ట శక్తి పనా కాదా అని.
481
00:50:37,200 --> 00:50:40,158
అయినప్పటికీ వట్టి చేతులతో వెళ్లలేము.
482
00:50:40,240 --> 00:50:44,711
వెళ్ళి పొలంలో వెతుకుతాను. ఈ కుళ్ళు
సోకని పండో కాయో దొరకవచ్చు.
483
00:50:44,800 --> 00:50:47,712
కేథరిన్, నువ్వు ఏమన్నా చేయగలవా తనకోసం?
484
00:50:47,800 --> 00:50:50,792
గూడెం దాకా ఎలా వెళ్దాం, గుర్రం లేకుండా?
485
00:50:50,880 --> 00:50:53,553
అదీ, ఆ మొక్కజొన్నానూ మేకల్ని
మంచి రేటుకు అమ్మవచ్చు.
486
00:50:53,640 --> 00:50:56,029
మనం.. మనం కేలెబ్ తొ వెళ్ళి,
వాటిని అమ్మేసి,
487
00:50:56,120 --> 00:50:58,111
గుర్రంపై తిరిగి వద్దాం
తొమసిన్, కవలల కోసం.
488
00:50:58,240 --> 00:51:00,629
- వాళ్ళని ఒంటరిగా వదిలేయలేము.
- తొమసిన్ ఇంకా నువ్వు...
489
00:51:00,720 --> 00:51:02,358
ఆ, పంట గురించి మర్చిపో, విల్!
490
00:51:02,440 --> 00:51:04,476
సరే, ఏం చేద్దాం?!
491
00:51:04,560 --> 00:51:07,358
ఏం కావాలి నీకు, కేథరిన్?
492
00:51:08,360 --> 00:51:10,954
ఏం కావాలో చెప్పు అది నీకు ఇస్తాను.
493
00:51:13,840 --> 00:51:16,513
నాకు ఇంటికి వెళ్లాలని ఉంది.
494
00:51:18,120 --> 00:51:20,873
రేపు రాత్రికల్లా నువ్వు ఇంట్లో ఉంటావు.
495
00:51:20,960 --> 00:51:23,394
ఇంగ్లండ్ లో.
496
00:51:29,600 --> 00:51:32,239
విల్...
497
00:51:32,320 --> 00:51:35,073
నాకు ఒక ఒప్పుకోలు చేయాలనుంది.
498
00:51:36,840 --> 00:51:39,593
నేనిలా నీ పట్ల గయ్యాళిలా
ప్రవర్తించాలని నాకు లేదు.
499
00:51:41,760 --> 00:51:45,196
నేను జోబు భార్య లాగా తయారయ్యాను.
నాకు తెలుసు.
500
00:51:47,800 --> 00:51:49,518
కానీ, శామ్, అప్పట్నుంచి...
501
00:51:53,760 --> 00:51:56,433
నా గుండె రాయిలా మారిపోయింది.
502
00:52:03,480 --> 00:52:09,032
నేను తొమసిన్ అంత వయసున్నప్పుడు
ఓ సారి కలకన్నాను,
503
00:52:09,120 --> 00:52:12,590
ఈ భూమి మీద క్రీస్తుతో ఉన్నట్లుగా.
504
00:52:14,160 --> 00:52:17,630
తనకి ఎంతో దగ్గరగా.
505
00:52:17,720 --> 00:52:22,430
నా పాపాలు నశించినందుకు
ఆనంద భాష్పాలు కార్చాను,
506
00:52:22,520 --> 00:52:26,638
తన ప్రేమ లో తడిసి ముద్దయ్యాను.
507
00:52:26,720 --> 00:52:31,157
ఏ భర్తా ఇవ్వలేని ప్రేమని పొందాను.
508
00:52:33,440 --> 00:52:35,749
కానీ శామ్ మాయమయినప్పట్నుంచీ...
509
00:52:37,600 --> 00:52:41,878
...నా నమ్మకం క్రుంగిపోతూ వస్తుంది,
కానీ నేను దానిని ఆపలేకపోయాను.
510
00:52:41,960 --> 00:52:45,475
నాకు దేవుని సాయం దగ్గరలో కనిపించడంలేదు.
511
00:52:45,560 --> 00:52:48,757
ప్రార్ధించానూ, ప్రార్ధించానూ, అయినా ఏమీ లాభం లేదు.
512
00:52:51,240 --> 00:52:55,995
నేనంతటి ప్రేమని మళ్ళీ పొందలెనేమో
అని నాకు భయమేస్తుంది.
513
00:53:02,160 --> 00:53:04,879
నీకది స్వర్గం లో దొరుకుతుంది.
514
00:53:08,760 --> 00:53:11,593
నేను పొలంలోకి వెళ్తున్నాను.
515
00:53:11,680 --> 00:53:14,513
నీకు కుదిరితే, రా.
516
00:53:14,600 --> 00:53:16,272
మనం తెల్లవారగానే వెళ్తున్నాం.
517
00:53:16,360 --> 00:53:18,112
ఇది నేను మాటిస్తున్నాను.
518
00:53:23,840 --> 00:53:26,308
జోనస్, మెర్సి, ఇలా రండి.
519
00:53:27,560 --> 00:53:29,357
అక్కడ ఏం వాగకండి.
520
00:53:40,400 --> 00:53:42,391
బ్లాక్ ఫిలిప్ ఒక ఆనందమైన రాజు,
521
00:53:42,480 --> 00:53:45,074
- ఆనందంగా ఈ భూమిని ఏలుతాడు...
- ఆపు, నీ పాటలు వినలేక పోతున్నాను.
522
00:53:45,240 --> 00:53:46,958
దయచేసి, మెర్సి.
523
00:53:47,040 --> 00:53:48,632
బ్లాక్ ఫిలిప్ దెబ్బ ఎంతో గట్టిది,
524
00:53:48,720 --> 00:53:50,472
తను నిన్ను కిందకి కొట్టేస్తాడు.
525
00:53:50,560 --> 00:53:52,755
బా, బా అను,
కింగ్ ఫిలిప్, ఆ నల్ల..
526
00:53:52,840 --> 00:53:54,512
- అను బా, బా, బా, బా, బా
- తొమసిన్: ఆపవే, సన్నాసి దానా!
527
00:53:54,600 --> 00:53:56,352
మెర్సి. తొమసిన్!
528
00:53:56,440 --> 00:53:58,351
అను బా బా, కింగ్ ఫిలిప్, ఆ నల్ల..
529
00:53:58,440 --> 00:54:00,158
- తను కొట్టేస్తాడు నీ వెనుక.
- ఇక చాలు!
530
00:54:04,840 --> 00:54:06,159
రా.
531
00:54:10,240 --> 00:54:12,959
గండ్ర గొడ్డలి తెచ్చి
తన తల నరికివెయ్యి.
532
00:54:13,040 --> 00:54:16,191
సన్న గొడ్డలి తెచ్చి
తన తల నరికివెయ్యి.
533
00:54:16,280 --> 00:54:18,748
గండ్ర గొడ్డలి తెచ్చి
తన తల నరికివెయ్యి.
534
00:54:18,840 --> 00:54:21,115
సన్న గొడ్డలి తెచ్చి
తన తల నరికివెయ్యి.
535
00:54:23,880 --> 00:54:25,552
తను నన్ను ఆవహించింది.
536
00:54:25,640 --> 00:54:27,073
తను మోకాళ్ళపై కూర్చుంది.
537
00:54:27,200 --> 00:54:28,713
నా పేగులు!
538
00:54:28,800 --> 00:54:31,030
నా పొట్ట!
539
00:54:31,160 --> 00:54:32,513
తను గిచ్చుతుంది!
540
00:54:35,680 --> 00:54:39,593
పాపం! పాపం! పాపం!!
541
00:54:39,680 --> 00:54:42,148
తొమసిన్, పిల్లల్ని బయటకి తీసుకుపో.
542
00:54:42,280 --> 00:54:44,953
ఏది చేస్తుంది నీకు ఇది?
ఏది చేస్తుంది?
543
00:54:47,880 --> 00:54:49,996
తన నోరు మూసుకుపోయింది.
544
00:54:52,600 --> 00:54:54,875
ఆ, భగవంతుడా. విలియం!
545
00:54:54,960 --> 00:54:57,110
విలియం! తనని లేపు.
546
00:54:57,200 --> 00:54:58,633
తనని పట్టుకో!
547
00:55:00,000 --> 00:55:02,878
పిల్లలూ, దూరంగా జరగండి.
తొమసిన్, సాయం చెయ్యి.
548
00:55:06,360 --> 00:55:08,032
వాడి దవడలు విరిగిపోతాయి.
549
00:55:08,200 --> 00:55:09,474
నాన్న!
550
00:55:10,680 --> 00:55:12,557
ఏంటిది...?
551
00:55:24,080 --> 00:55:27,595
విలియం.. తను మంత్రగత్తె కి దొరికాడు!
552
00:55:27,680 --> 00:55:29,398
- అది తనే!
- లేదు!
553
00:55:29,480 --> 00:55:31,800
- ఏం దరిద్రపు ఆటలు ఇవి?
- శామ్ ని దొంగిలించానని తనే చెప్పింది!
554
00:55:31,840 --> 00:55:33,273
నిశబ్దం!
555
00:55:33,360 --> 00:55:34,679
తనే అడవిలో శామ్ ని సైతానుకి ఇచ్చేసింది.
556
00:55:34,760 --> 00:55:36,239
- వాళ్ళు అబద్దం చెప్తున్నారు.
- ఏం మాట్లాడుతున్నారు మీరు?
557
00:55:36,320 --> 00:55:37,958
తను ఫ్లోరా పాలని రక్తంలా మార్చేసింది!
558
00:55:38,040 --> 00:55:39,632
తనే మమ్మల్ని ఈ విషయం మీకు చెప్పనీయ లేదు.
559
00:55:39,720 --> 00:55:42,757
- నేను ఊరికే వాళ్ళని బయపెడదామని, నేను..
- తను సైతాను తో ఒప్పందం కుదుర్చుకుంది.
560
00:55:42,840 --> 00:55:44,432
- తను అతని పుస్తకంలో సంతకం పెట్టింది!
- నిశబ్దం!
561
00:55:44,520 --> 00:55:46,909
తనని మా దగ్గరకి రానివ్వద్దు!
తాను మాపై మంత్రం వేసి శపిస్తుంది!
562
00:55:47,000 --> 00:55:49,514
- వీళ్ళు నాపై చాడీలు చెప్తున్నారు.
- తొమసిన్ ఓ మంత్రగత్తె!
563
00:55:50,720 --> 00:55:53,757
నేను విన్నది చాలు.
564
00:55:53,840 --> 00:55:56,638
నాకు సాక్ష్యం కావాలి, లేకపోతే..
565
00:55:56,720 --> 00:55:58,915
మోకాళ్ళ మీద!
566
00:55:59,040 --> 00:56:01,429
నా కళ్ళలోకి చూడు, కూతురా.
567
00:56:01,520 --> 00:56:04,830
- నీకు దేవుని వాక్యము యందు ప్రేమ ఉందా?
- ఉంది.
568
00:56:04,920 --> 00:56:07,036
బైబిల్ పై ప్రేమ?
ప్రార్ధన పై ప్రేమ?
569
00:56:07,120 --> 00:56:08,838
ఉంది. ఉంది!
570
00:56:12,040 --> 00:56:14,873
మనమందరం పాపం లో పుట్టిన వాళ్ళమే,
571
00:56:14,960 --> 00:56:18,873
కానీ నా ఇంట్లో ఏ మంత్రగత్తె
పెరిగే అవకాశమే లేదు.
572
00:56:20,640 --> 00:56:25,395
మనం భయపడాల్సిందేదీ లేదని ప్రార్దిద్దాం.
573
00:56:25,480 --> 00:56:28,392
మనం చెడుకి దొరికేలా ఉండకూడదు.
574
00:56:29,840 --> 00:56:31,831
మీ సోదరుడి కోసం ప్రార్దించండి.
575
00:56:33,560 --> 00:56:35,080
- మీరు మమ్మల్ని నమ్మాలి!
- పిల్ల రాక్షసుల్లారా!
576
00:56:35,120 --> 00:56:36,394
తొమసిన్!
577
00:56:36,480 --> 00:56:38,471
ప్రార్దించండి.
578
00:56:38,560 --> 00:56:44,112
పరలోకమునందున్న మా తండ్రి,
నీ నామమునకు స్తోత్రము...
579
00:56:44,200 --> 00:56:45,758
జోనస్, ప్రార్దించు.
580
00:56:45,880 --> 00:56:49,759
నాకు.. నాకు ప్రార్ధన గుర్తు రావటంలేదు.
581
00:56:49,840 --> 00:56:52,752
- ఏంటి?
- నాక్కూడా. నా వల్ల కావటం లేదు.
582
00:56:52,840 --> 00:56:54,432
ఇదేం పిచ్చితనం?
583
00:56:54,520 --> 00:56:56,670
చెప్పండి, పిల్లలూ.
584
00:56:56,760 --> 00:56:59,433
పరలోకమునందున్న మా తండ్రి..
585
00:56:59,560 --> 00:57:01,357
నీ నామమునకు స్తోత్రము...
586
00:57:01,480 --> 00:57:04,358
ఆపండి! ఆపండి!
587
00:57:04,480 --> 00:57:06,596
ప్రార్ధించండి, మృగాల్లారా!
588
00:57:06,680 --> 00:57:08,240
మోకాళ్ళ మీద పడి, ప్రార్ధించండి!
589
00:57:08,360 --> 00:57:11,432
తొమసిన్!
590
00:57:11,520 --> 00:57:14,956
నేను వినలేను. ఇలా జరగడం లేదు.
591
00:57:20,800 --> 00:57:22,791
తను వచ్చింది!
592
00:57:22,960 --> 00:57:24,757
ఓ పిల్లి!
593
00:57:24,840 --> 00:57:26,432
ఓ కాకి.
594
00:57:26,520 --> 00:57:31,469
ఓ మాల కాకి. ఓ మూడుకాళ్ళ కుక్క. ఓ తోడేలు!
595
00:57:31,560 --> 00:57:34,154
తను నా రక్తం కోరుతోంది!
596
00:57:34,240 --> 00:57:35,798
తను నా రక్తం కోరుతోంది!
597
00:57:35,880 --> 00:57:38,075
- సైతాను నన్ను ఆవహించాడు!
- తను నా రక్తం కోరుతోంది.
598
00:57:40,960 --> 00:57:44,794
తను వాటిని నాపై ఉసిగొల్పుతుంది.
599
00:57:44,880 --> 00:57:48,509
నా ప్రభువా, నా ఏసయ్యా!
నన్ను కాపాడు!
600
00:57:48,600 --> 00:57:51,672
- క్రీస్తు గురించే ఆలోచించు!
- తను తన దెయ్యాలని పంపుతుంది.
601
00:57:51,760 --> 00:57:56,117
నేను నీ శత్రువును, ఈ పాపపు
మడుగులో కొట్టుకుంటున్నాను.
602
00:57:56,240 --> 00:57:58,310
ఆ ప్రభువే నా కాపరి.
నాకింకేమీ వద్దు.
603
00:57:58,400 --> 00:58:00,516
తనే నన్ను పచ్చిక బయళ్ళలో
సేద తీరేలా..
604
00:58:00,600 --> 00:58:01,919
నీటిపై నడిచేలా...
605
00:58:02,040 --> 00:58:03,553
నేను నీ శత్రువును...
606
00:58:06,920 --> 00:58:08,148
నేను నీ శత్రువును..
607
00:58:08,240 --> 00:58:10,356
నా పాపపు రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాను.
608
00:58:10,480 --> 00:58:13,438
- ...నాకు దుష్ట శక్తి అంటే బయం లేదు.
- ఎందుకంటే నువ్వు నాతో వున్నావు.
609
00:58:16,320 --> 00:58:18,834
కేలెబ్... కేలెబ్...
610
00:58:23,800 --> 00:58:27,031
నా పై నీ కాంతిని చిందించు.
611
00:58:27,120 --> 00:58:30,510
నన్ను నీ ఒడిలో చేర్చుకో.
612
00:58:30,600 --> 00:58:33,717
నన్ను నీ రక్తపు జడిలో తడుపు.
613
00:58:33,800 --> 00:58:38,351
నీ వల్ల నేను పరిశుద్దుడను, నా ప్రభువా.
614
00:58:38,440 --> 00:58:44,549
నన్ను నీ పెదాలతో ముద్దు పెట్టు.
615
00:58:45,240 --> 00:58:47,390
ఎంత దయకలవాడవు, ప్రభూ.
616
00:58:47,520 --> 00:58:49,590
నీ కౌగిలి!
617
00:58:50,600 --> 00:58:52,989
నా ప్రభూ!
618
00:58:53,080 --> 00:58:55,548
నా ప్రభూ!
నా దేవా!
619
00:58:55,640 --> 00:58:57,995
నా తండ్రి!
620
00:58:58,080 --> 00:58:59,911
నన్ను నీ ఒడిలోకి తీసుకో!
621
00:59:28,640 --> 00:59:30,278
కేలెబ్...
622
00:59:32,360 --> 00:59:34,112
కేలెబ్?
623
00:59:35,240 --> 00:59:37,276
కేలెబ్?
624
00:59:37,920 --> 00:59:40,957
కేలెబ్.
625
00:59:41,040 --> 00:59:43,634
కేలెబ్...
626
00:59:44,040 --> 00:59:47,191
లే, దయచేసి! లే!
627
00:59:48,880 --> 00:59:51,838
లే, లే!
628
00:59:52,920 --> 00:59:55,673
లే.
629
01:00:00,400 --> 01:00:02,755
తను చనిపోయాడు.
630
01:00:02,840 --> 01:00:07,197
తను చనిపోయాడు!
631
01:00:10,280 --> 01:00:12,589
జోనస్, మెర్సి, లేవండి.
632
01:00:14,120 --> 01:00:15,599
లేవండి!
633
01:00:20,600 --> 01:00:24,036
తననుంచి దూరంగా పో!
ఎక్కడకన్నా పొయ్యి చావు!
634
01:00:39,120 --> 01:00:40,394
తొమసిన్!
635
01:00:40,480 --> 01:00:42,198
తొమసిన్. తొమసిన్...
636
01:00:42,280 --> 01:00:43,508
నా బిడ్డ...
637
01:00:57,320 --> 01:01:00,949
వసంతానికి ఈ చెట్టు మళ్ళీ చిగురిస్తుంది.
638
01:01:01,040 --> 01:01:03,349
మనం ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుందా?
639
01:01:05,440 --> 01:01:07,670
ఎంత బాగుండేదో.
640
01:01:10,520 --> 01:01:13,114
వచ్చే యేడు నేను గోధుమ వేస్తాను.
641
01:01:14,080 --> 01:01:16,913
ఇక్కడ మొదలెట్టి అక్కడ దాకా.
642
01:01:17,000 --> 01:01:19,434
అప్పుడు సిసలైన పొలం పండుతుంది.
643
01:01:20,480 --> 01:01:25,429
కొత్త పాడి ఆవుని కొంటాను, గడ్డి తెస్తాను.
644
01:01:28,880 --> 01:01:31,314
నువ్వు నాకు చెప్పాలి, తొమసిన్.
645
01:01:32,520 --> 01:01:35,717
రేపు నేను దీన్ని దాచలేను.
646
01:01:35,800 --> 01:01:38,394
సంఘం లో చర్చ జరుగుతుంది, ఆపై నీ ప్రాణాలకే...
647
01:01:38,480 --> 01:01:40,869
- నీ ప్రాణాలకే...
- నన్ను మీరు నమ్మరా?
648
01:01:40,960 --> 01:01:43,872
నేను నా కొడుకులో సర్పాన్ని చూశాను.
నువ్వు వాళ్ళ ప్రార్ధనను ఆపావు, తొమ...
649
01:01:43,960 --> 01:01:47,714
- వాళ్ళు అబద్దం చెప్తున్నారు!
- నేను చూశాను.
650
01:01:47,800 --> 01:01:50,837
కేలెబ్ నీతో ఉన్నప్పుడే మాయమయ్యాడు.
651
01:01:50,920 --> 01:01:54,390
- నాకు కేలెబ్ అంటే ఇష్టం..
- మరి ఎవరు తనని కనుక్కొన్నారు..
652
01:01:54,520 --> 01:01:56,078
పాలి పోయి..
653
01:01:56,160 --> 01:01:59,277
పాపం లో నగ్నంగా, మంత్రించబడి?
654
01:01:59,400 --> 01:02:01,630
తొమసిన్, నా మాట విను.
655
01:02:01,720 --> 01:02:03,870
చేసుకొన్న ఒప్పందం ఏమీ చేయలేదు.
656
01:02:03,960 --> 01:02:06,110
- నేనే ఒప్పందం చేయలేదు.
- నీ ఆత్మ క్రీస్తుకి చెందినది.
657
01:02:06,240 --> 01:02:08,879
- నేనే ఒప్పందం చేయలేదు.
- సైతానుకు నీ పట్ల ఎటువంటి ఆసక్తీ లేదు..
658
01:02:08,960 --> 01:02:12,509
- నేను ఏ మంత్రగత్తె నీ కాదు, తండ్రి.
- మరి నేను ఇంట్లో చూసిందేంటి?
659
01:02:13,520 --> 01:02:15,875
- మీరు నా మాట వినరా?
- ఒప్పుకోలు చేయి.
660
01:02:16,000 --> 01:02:17,831
ఎందుకు నాకు శత్రువులుగా మారారు.
661
01:02:17,960 --> 01:02:21,157
క్రీస్తు నిన్ను మళ్ళీ మామూలుగా మార్చగలడు
కానీ నువ్వు నిజం చెప్పాలి.
662
01:02:21,240 --> 01:02:24,869
నేను నిన్ను ప్రేమించినట్లుగా, నిజం చెప్పు.
663
01:02:24,960 --> 01:02:28,839
- నన్ను నిజం చెప్పమంటారా?
- నిన్ను వేడుకుంటున్నాను.
664
01:02:34,920 --> 01:02:38,037
నువ్వూ అమ్మా నన్ను వదిలించుకోవాలనుకున్నారు.
665
01:02:39,120 --> 01:02:42,430
అవును, నేను మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను.
666
01:02:42,520 --> 01:02:44,511
అది నిజమేనా?
667
01:02:46,920 --> 01:02:49,832
నువ్వు అమ్మ గిన్నెని తీసి,
నేను మాటలు పడుతున్నా ఏమీ చేయలేదు.
668
01:02:49,920 --> 01:02:52,309
సమయం మించిపోయేంత వరకు కూడా
నువ్వు నిజం బయట పెట్టలేదు.
669
01:02:52,400 --> 01:02:54,391
- అది నిజమేనా?
- ఆపు.
670
01:02:54,480 --> 01:02:55,754
- నేను ఆపను.
- నేను నీ తండ్రిని.
671
01:02:55,840 --> 01:02:58,991
- నువ్వో కపటివి!
- నోరు జాగ్రత్త, నా కూతురా!
672
01:02:59,080 --> 01:03:01,878
నువ్వు కేలెబ్ ని అడవికి తీసుకెళ్ళి
దానికి కూడా నన్ను బలి చేశావు.
673
01:03:01,960 --> 01:03:03,678
అది నిజమేనా?
674
01:03:06,040 --> 01:03:09,032
అమ్మ తానా అంటే నువ్వు తందానా అంటావు.
675
01:03:09,120 --> 01:03:11,839
నీకు పంటలు పండించటం చేతకాదు!
నీకు వేటాడటం చేతకాదు!
676
01:03:11,920 --> 01:03:13,638
- ఈ మాత్రం నిజం సరిపోతుందా?
- చాలు.
677
01:03:13,720 --> 01:03:15,756
నువ్వు కట్టెలు కొట్టడం తప్పించి ఏమీ పీకలేవు!
678
01:03:15,840 --> 01:03:17,068
ముండ!
679
01:03:17,160 --> 01:03:19,469
ఇంకా నువ్వు నా మాట నమ్మవు.
680
01:03:21,520 --> 01:03:24,318
నీ నోట్లో ఆడే ఆ సైతాను నాలుకను నేను వినాలా?
681
01:03:26,320 --> 01:03:28,117
అయితే ఆ కవలలను అడుగు!
682
01:03:28,240 --> 01:03:29,992
వెళ్ళు, వాళ్ళని అడుగు!
683
01:03:30,080 --> 01:03:32,514
వాళ్ళే రోజంతా ఆ కొమ్ముల మృగంతో
ఏదేదో గొణుగుతూ ఉంటారు.
684
01:03:32,600 --> 01:03:33,828
వాళ్ళకి తన గొంతు బాగా తెలుసు.
685
01:03:33,920 --> 01:03:35,239
వెళ్ళు.
686
01:03:35,320 --> 01:03:38,676
శత్రువు ఎక్కువగా
మగ-మేక రూపంలో వస్తాడు.
687
01:03:38,800 --> 01:03:41,633
వచ్చి గుసాగుసలాడతాడు.
అవును, గుసగుసలాడతాడు.
688
01:03:43,080 --> 01:03:46,470
తనే లూసిఫర్!
నీకు తెలుసు.
689
01:03:46,560 --> 01:03:48,790
- కవలలకి కూడా తెలుసు.
- నీ తోబుట్టువులపై నిందలు వేసింది చాలు.
690
01:03:48,880 --> 01:03:52,998
- అది వాళ్ళే!
- పో, నా ముందునుంచి!
691
01:03:53,080 --> 01:03:55,071
వాళ్ళూ, ఆ మేకే
ఈ ప్రాంతాన్ని శపించింది.
692
01:03:55,160 --> 01:03:56,388
అబద్దాలు.
693
01:03:57,600 --> 01:04:00,239
శామ్ ని తీసుకెళ్లింది తోడేలా?
694
01:04:00,320 --> 01:04:03,039
నేనే తోడేలునీ చూడలేదు.
695
01:04:03,120 --> 01:04:04,917
మెర్సి నే స్వయంగా చెప్పింది
ఆ కాలవ దగ్గర..
696
01:04:05,000 --> 01:04:07,468
"నేను అడవిలోని మంత్రగత్తె ని." అని
697
01:04:07,560 --> 01:04:09,232
లే. లెగువ్!
698
01:04:39,960 --> 01:04:42,076
- ఏం జరుగుతుంది?
- చెప్పు.
699
01:04:42,160 --> 01:04:43,991
నేను మంత్రగత్తె ని కాను.
700
01:04:44,080 --> 01:04:46,036
తనని నా ముందు నుంచి తీసుకెళ్లు!
తను ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు!
701
01:04:46,120 --> 01:04:47,872
తను ఏ మంత్రగత్తె కాదు, కేథరిన్.
702
01:04:47,960 --> 01:04:50,599
కారణం ఏంటి, కూతురా?
మీ అమ్మకి చెప్పు!
703
01:04:50,680 --> 01:04:52,033
నేను ఖచ్చితంగా చెప్పలేను.
704
01:04:52,120 --> 01:04:53,838
నీకు తెలుసని నాతో చెప్పావు.
705
01:04:53,920 --> 01:04:55,399
నేను దాని ముఖం చూడలేను.
706
01:04:55,480 --> 01:04:59,109
అవును, కానీ తప్పదు.
తొమసిన్. తొమసిన్!
707
01:04:59,960 --> 01:05:01,996
జోనస్, మెర్సి.
708
01:05:02,080 --> 01:05:04,958
వాళ్ళు బ్లాక్ ఫిలిప్ గా వచ్చిన
సైతాను తో ఒప్పందం చేసుకున్నారు.
709
01:05:06,120 --> 01:05:09,396
విన్నారా, మీరు?
710
01:05:09,480 --> 01:05:13,109
విన్నారా అది, రాక్షసుల్లారా?
711
01:05:13,520 --> 01:05:16,796
లేవండి! లేవండి నిద్రనుంచి!
712
01:05:17,920 --> 01:05:20,832
మీరేమన్నా ఆ మేక తో దుష్ట
ఒప్పందం కుదుర్చుకున్నారా?
713
01:05:20,920 --> 01:05:23,798
మాట్లాడండి, ఇదేమన్నా నాటకమైతే.
714
01:05:34,040 --> 01:05:38,556
దరిద్రులు!
అందరూ నటులే!
715
01:05:38,640 --> 01:05:40,471
నా మాట వినండి:
716
01:05:40,560 --> 01:05:43,552
నేను పిల్లల ఆటలకు మోసపోయే
పిచ్చివాడిని కాదు.
717
01:05:43,640 --> 01:05:45,710
ఇది ఆట కాదు, విలియం.
718
01:05:45,800 --> 01:05:49,156
మన పిల్లల నోట్లో నుంచి వచ్చే
అబద్దాల ముందు అవెంత.
719
01:05:49,240 --> 01:05:52,152
- నేనేం అబద్దాలాడలేదు.
- నిశబ్దం, దుష్టురాలా!
720
01:05:52,240 --> 01:05:56,199
నీ కొడుకు చనిపోయాడు, పాపంలో!
721
01:05:56,280 --> 01:05:58,191
- కేలెబ్ కనీసం ఏసుని శరణు వేడాడు.
- సైతాను!!
722
01:05:58,280 --> 01:05:59,508
నీకేం తెలియదు.
723
01:05:59,640 --> 01:06:02,234
- సైతాను కూడా వాక్యం వల్లిస్తుంది.
- నీకది తెలియదు.
724
01:06:02,320 --> 01:06:04,151
- అది నిజం కాదు.
- మనం పాపం లో పడ్డాము.
725
01:06:04,240 --> 01:06:05,673
లేవండి!
726
01:06:07,160 --> 01:06:08,957
బల్లెం తీసుకురా, పెళ్ళామా,
727
01:06:09,040 --> 01:06:12,077
నేను జోనస్ అంతు చూస్తాను,
ఎలాగైతే అబ్రహం తన పిల్లలను చూశాడో.
728
01:06:12,160 --> 01:06:13,434
వద్దు, ఆపు. ఆపు!
729
01:06:13,520 --> 01:06:16,512
వెళ్ళి బల్లెం తీసుకురా,
నేను వీడి పుర్రె పగులగొడతాను!
730
01:06:17,960 --> 01:06:19,951
- వద్దూ!
- చూశారా?
731
01:06:20,040 --> 01:06:22,679
- ఆపండి...
- ఇప్పుడు చూశారా?
732
01:06:24,160 --> 01:06:28,517
దయచేసి, తండ్రి.
వద్దు, ఇది మంచిది కాదు. వాళ్ళతో ఉండకూడదు.
733
01:06:29,080 --> 01:06:31,310
నన్నీ మేకకు దూరంగా ఉంచు.
734
01:06:32,160 --> 01:06:35,311
ఆ మేకే గనక నిజంగా సైతానయితే,
నేనే వాడి అంతు చూస్తాను.
735
01:06:39,000 --> 01:06:43,835
నేను నిన్ను పొద్దున్నే విడిపిస్తాను,
ఆ తరువాత మనం సరాసరి గూడానికే.
736
01:06:43,920 --> 01:06:45,831
నీ పాపాల గురించి ఆలోచించు.
737
01:07:03,760 --> 01:07:05,830
మీరు మంత్రగత్తె లా?
738
01:07:08,280 --> 01:07:10,350
నాన్న అలా అనుకుంటున్నాడా?
739
01:07:10,440 --> 01:07:11,793
నువ్వూ?
740
01:07:13,880 --> 01:07:15,393
కాదు.
741
01:07:19,280 --> 01:07:21,316
తను నిజంగా మీతో మాట్లాడాడా?
742
01:08:49,200 --> 01:08:51,555
తప్పు నాదే.
743
01:08:58,240 --> 01:09:00,276
నేను ఒప్పుకోలు చేస్తున్నాను.
744
01:09:02,280 --> 01:09:03,998
నేను ఒప్పుకోలు చేస్తున్నాను.
745
01:09:09,800 --> 01:09:12,030
ఓ నా దేవా!.
746
01:09:12,680 --> 01:09:15,353
ఇది నా స్వంత తప్పిదమే.
747
01:09:16,800 --> 01:09:20,759
నా ఒంటి నిండా గర్వంతో నిండిపోయింది.
748
01:09:22,520 --> 01:09:24,750
నాకు తెలుసు.
749
01:09:24,840 --> 01:09:26,432
నిజంగా.
750
01:09:28,040 --> 01:09:31,794
నన్ను నీ ఇష్టం వచ్చినట్లు నశింపజేయి...
751
01:09:33,600 --> 01:09:36,398
...కానీ నా పిల్లల్ని కాపాడు.
752
01:09:38,000 --> 01:09:41,959
వాళ్ళు వారిలోని సహజమైన చెడుని అదుపు చేయలేరు.
753
01:09:47,680 --> 01:09:52,037
నీ ముందు ఓ పిరికివాడిలా నిలబడ్డాను...
754
01:09:53,680 --> 01:09:55,750
...నీ శత్రువుగా.
755
01:09:56,600 --> 01:10:00,673
నీ మట్టిని తింటున్నాను.
756
01:10:09,000 --> 01:10:11,116
నిన్ను వేడుకుంటున్నాను.
757
01:10:12,200 --> 01:10:15,272
నా పిల్లల్ని రక్షించు.
758
01:10:17,240 --> 01:10:20,630
నేను నిన్ను వేడుకుంటున్నాను, నా ప్రభువా,
759
01:10:20,720 --> 01:10:24,429
నేనే నా కుటుంబాన్ని నాశనం చేయకూడదు.
760
01:11:40,680 --> 01:11:45,515
నా దేవదూతలు!
761
01:12:00,000 --> 01:12:03,549
అమ్మ, నిన్ను చూడాలని ఎంతో కోరుకున్నాం.
762
01:12:04,480 --> 01:12:06,232
నేను కూడా.
763
01:12:09,200 --> 01:12:13,637
నేను మీ నాన్నని లేపుతాను!
తను ఎంతో సంతోషిస్తాడు!
764
01:12:13,720 --> 01:12:17,918
వద్దు, తనని పడుకోనివ్వు!
765
01:12:40,880 --> 01:12:44,031
నిన్ను చూడడానికి తరచూ వస్తాం, అమ్మ.
766
01:12:44,120 --> 01:12:46,998
- నీకది ఇష్టమేనా?
- ఆ.
767
01:12:48,040 --> 01:12:51,430
నీకోసం ఒక పుస్తకం తెచ్చాం, అమ్మ.
768
01:12:51,520 --> 01:12:54,990
- మాతో పాటు చూస్తావా?
- ఆ.
769
01:12:55,080 --> 01:12:58,311
ఓ, ఒక్క నిమిషం.
శామ్యూల్ కి ఆకలిగా ఉంది.
770
01:12:59,760 --> 01:13:02,638
ఓ, రా, రా, చిట్టి శామ్.
771
01:13:03,680 --> 01:13:05,511
రా, రా.
772
01:13:17,760 --> 01:13:20,149
ఫ్లోరా? ఫ్లోరా?
773
01:16:08,040 --> 01:16:09,519
కుళ్ళు.
774
01:16:09,600 --> 01:16:11,158
అయితే నువ్వే.
775
01:17:15,720 --> 01:17:18,154
ఏం చేశావు నువ్వు?
776
01:17:19,280 --> 01:17:21,635
- వాళ్ళెక్కడ?
- నేనేం చూశానో నాకూ తెలియదు.
777
01:17:21,720 --> 01:17:23,711
- వాళ్ళు ఎక్కడ?
- నేనేం చేయలేదు!
778
01:17:23,800 --> 01:17:27,349
- తను ఆకాశం లోనుంచి వచ్చింది. తను...
- సైతాను!
779
01:17:27,440 --> 01:17:30,432
వాళ్ళ రక్తం నీ చేతులపై వుంది!
780
01:17:34,360 --> 01:17:36,271
అది నువ్వే!
781
01:17:36,360 --> 01:17:39,352
- అది నువ్వే!
- నేను నీ కూతుర్ని!
782
01:17:39,440 --> 01:17:43,069
నీలో సైతాను వుంది,
అది నిన్ను పొందింది.
783
01:17:43,160 --> 01:17:46,994
నీ ఒంటినిండా తన పాపమే.
నువ్వు దుష్ట వాసన వస్తున్నావు.
784
01:17:47,080 --> 01:17:49,719
- నువ్వు చావుతో ఒప్పందం కుదుర్చుకున్నావ్.
- అమ్మా!
785
01:17:49,800 --> 01:17:53,679
నీ తమ్ముడికే మంత్రం వేశావు కదే, బజారు దానా!
786
01:17:53,760 --> 01:17:56,957
నువ్వు వాడి వైపు చూసే కొంటె చూపులు
నేను గమనించలేదనుకున్నావా?
787
01:17:57,040 --> 01:17:59,508
ఓ వేశ్య లాగా వాడిని ముగ్గులోకి దింపడం?
788
01:17:59,600 --> 01:18:01,830
- అస్సలు ఏం మాట్లాడుతున్నావ్?
- తరువాత మీ నాన్నతో!
789
01:18:01,920 --> 01:18:04,992
లేదు.
790
01:18:06,000 --> 01:18:08,594
నువ్వు వాళ్ళని నా దగ్గర నుండి లాగేసావ్!
791
01:18:08,680 --> 01:18:10,318
- వాళ్ళిక లేరు.
- లేదు!
792
01:18:10,400 --> 01:18:13,312
- నువ్వే నా పిల్లల్ని చంపేశావ్!
- లేదు!
793
01:18:13,400 --> 01:18:16,358
నువ్వు నీ స్వంత తండ్రిని చంపేశావ్.
మంత్రగత్తె!
794
01:18:16,440 --> 01:18:18,510
నువ్వంటే నాకిష్టం! నువ్వంటే నాకిష్టం!
795
01:23:07,200 --> 01:23:12,672
బ్లాక్ ఫిలిప్,
నీ మాయ చూపించి, నాతో మాట్లాడు.
796
01:23:17,480 --> 01:23:20,278
జోనస్, మెర్సి లతో ఎలా మాట్లాడావో
అలా నాతో కూడా మాట్లాడు.
797
01:23:28,000 --> 01:23:30,639
నీకు నా ఇంగ్షీషు బాష అర్ధమవుతుందా?
798
01:23:34,600 --> 01:23:36,636
సమాధానం ఇవ్వు.
799
01:23:49,520 --> 01:23:53,308
ఏమి కావాలి నీకు?
800
01:23:56,920 --> 01:23:58,148
ఏం ఇవ్వగలవు నువ్వు?
801
01:24:00,200 --> 01:24:04,716
నీకు వెన్న రుచి మక్కువేనా?
802
01:24:05,720 --> 01:24:07,870
అందమైన దుస్తులు?
803
01:24:09,040 --> 01:24:13,079
నీకు జీవించాలని వుందా, రుచిగా?
804
01:24:14,360 --> 01:24:15,952
ఉంది.
805
01:24:17,600 --> 01:24:22,276
నీకు ప్రపంచాన్ని చూడాలని ఉందా?
806
01:24:23,520 --> 01:24:25,317
నా నుంచి నీకేం కావాలి?
807
01:24:28,400 --> 01:24:32,188
నీ ముందు వున్న పొత్తము నీకు కనిపిస్తుందా?
808
01:24:41,520 --> 01:24:44,956
నీ లోవస్త్రాన్ని తీసివేయి.
809
01:25:07,920 --> 01:25:09,990
నా పేరు వ్రాయటం నాకు రాదు.
810
01:25:11,800 --> 01:25:15,031
నేను నీ చేతిని నడిపిస్తాను.
811
01:27:36,200 --> 01:27:46,000
Subbed by: పృధ్వీ రాజ్ | Prudhvi Raj
812
01:27:53,000 --> 01:28:02,500
ఈ చిత్రం జానపద కథలు, సాహసకథలు మరియు; డైరీ లలో, పత్రికలలో, కోర్టు రికార్డు లలో నమోదు చేయబడిన చారిత్రక మంత్రసంబంధ సంఘటనల నుంచి స్పూర్తి పొందినది.
చిత్రంలోని సంభాషణలలో ఎక్కువ శాతం పై కాలావధ మూలాల్లో నుంచే సంగ్రహింపబడినవి.