1 00:00:02,086 --> 00:00:04,255 "1845 లో, ఆర్కిటిక్ సముద్రంలో ప్రయాణించడానికి 2 00:00:04,380 --> 00:00:06,799 నౌకాయాన మార్గాలు కనుక్కోవడం కోసం 3 00:00:06,924 --> 00:00:09,427 రెండు రాజ నౌకాదళ ఓడలు ఇంగ్లండు నుండి బయలుదేరాయి." 4 00:00:09,552 --> 00:00:12,805 "ఆ కాలంలో అవి సాంకేతికంగా అత్యంత అధునాతక ఓడలు." 5 00:00:15,474 --> 00:00:19,395 "అవి క్లిష్టమైన ఆర్కిటిక్ నీటిలోకి వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తూ 6 00:00:19,520 --> 00:00:23,691 బాఫిన్ బే దగ్గర ఆగివుండడాన్ని ఆఖరిసారిగా యూరోపియన్ తిమింగళ వేటగాళ్ళు చూశారు." 7 00:00:26,402 --> 00:00:29,280 "తర్వాత ఆ ఓడలు మాయమైపోయాయి." 8 00:00:32,116 --> 00:00:33,576 కాలిబాటన నడిచి వెళ్తున్న చాలామందిని చూశారు. 9 00:00:34,452 --> 00:00:35,369 అందరూ ఆకలితో అలమటిస్తున్నారంట. 10 00:00:36,036 --> 00:00:36,871 అతను వాళ్ళను కలిశాడా? 11 00:00:37,621 --> 00:00:40,249 (విదేశీ భాష) 12 00:00:40,374 --> 00:00:43,502 మేము అక్కడ ఒక క్యాప్టన్ ని చూశాము. అతని పేరు అగ్లూకా. 13 00:00:47,840 --> 00:00:51,385 తను అగ్లూకా అని పిలుస్తున్న వ్యక్తి 14 00:00:51,719 --> 00:00:55,181 వీళ్ళలో ఒకరేమో చూసి చెప్పమను. 15 00:00:56,515 --> 00:00:58,476 (విదేశీ భాష) 16 00:01:06,442 --> 00:01:09,987 (విదేశీ భాష) 17 00:01:10,112 --> 00:01:11,489 అతను మా భాషలో మాట్లాడాడు. 18 00:01:12,948 --> 00:01:13,908 చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. 19 00:01:14,033 --> 00:01:17,036 (విదేశీ భాష) 20 00:01:17,161 --> 00:01:20,915 అతను దక్షిణం వైపు చూపించి, నేలపై నడిచి ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాడు. 21 00:01:21,040 --> 00:01:22,625 (విదేశీ భాష) 22 00:01:22,750 --> 00:01:24,001 కాని వాళ్ళలో నడవగలిగే స్థితిలో లేరు. 23 00:01:24,126 --> 00:01:26,253 (విదేశీ భాష) 24 00:01:29,590 --> 00:01:31,217 పైగా వాళ్ళ వెనుక టూన్బాక్ ఉన్నాడు. 25 00:01:31,884 --> 00:01:32,760 టూన్బాక్? 26 00:01:34,053 --> 00:01:35,012 (విదేశీ భాష) 27 00:01:35,638 --> 00:01:37,264 (విదేశీ భాష) 28 00:01:37,389 --> 00:01:40,267 వాళ్ళ వెనుక. వెంటాడుతూ. ఎల్లప్పుడూ వెంటాడుతూ. 29 00:01:40,392 --> 00:01:42,895 వాళ్ళని ఎవరో వెంటాడుతున్నారా? ఎస్కిమోలా? 30 00:01:43,020 --> 00:01:44,647 (విదేశీ భాష) 31 00:01:44,772 --> 00:01:45,773 మంత్రగాళ్ళ నుండి. 32 00:01:45,898 --> 00:01:49,401 (విదేశీ భాష) 33 00:01:49,527 --> 00:01:52,071 అది రెండు కాళ్ళ ప్రాణులను, ఇంకా నాలుగు కాళ్ళ ప్రాణులను తింటుంది. 34 00:01:52,196 --> 00:01:54,657 (విదేశీ భాష) 35 00:01:54,782 --> 00:01:58,702 అది కండరాళ్ళతో ఇంకా మంత్రాలతో చేయబడింది. 36 00:01:58,828 --> 00:02:00,079 నాకు అర్ధం కావడం లేదు. 37 00:02:00,204 --> 00:02:01,789 అతను ఒక మనిషిని వర్ణిస్తున్నాడా? 38 00:02:01,914 --> 00:02:03,207 సారీ, సర్ జేమ్స్. 39 00:02:04,250 --> 00:02:06,335 అతను అసలు దేన్ని వర్ణిస్తున్నాడో నాకు తెలీదు. 40 00:02:08,629 --> 00:02:10,047 ఫ్రాన్సిస్ ఏమి చెప్పాడు? 41 00:02:12,508 --> 00:02:13,592 అగ్లూకా? 42 00:02:13,717 --> 00:02:17,763 (విదేశీ భాష) 43 00:02:17,888 --> 00:02:19,431 మీ మిత్రుడు నా చేతులు పట్టుకొని, 44 00:02:19,557 --> 00:02:22,768 ఇలా అన్నాడు, "మా కోసం వచ్చేవాళ్ళను ఇక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పు." 45 00:02:22,893 --> 00:02:25,479 (విదేశీ భాష) 46 00:02:25,604 --> 00:02:29,733 "ఓడలు మాయమైపోయాయి. వెళ్ళే దారి లేదు. మార్గం లేదు." 47 00:02:29,859 --> 00:02:31,944 - (విదేశీ భాష) - మేము పోయామని చెప్పు. 48 00:02:32,069 --> 00:02:33,737 - (విదేశీ భాష) - చచ్చిపోయాము. 49 00:02:35,114 --> 00:02:35,948 నశించిపోయాము. 50 00:02:47,501 --> 00:02:50,254 "సెప్టెంబర్, 1846" 51 00:03:00,014 --> 00:03:02,892 "నాలుగు సంవత్సరాల క్రితం" 52 00:03:21,118 --> 00:03:24,204 బిల్లీ, ఇతన్ని నీతో పైకి తీసుకెళ్ళు, కళ్ళు మూసుకోని 53 00:03:24,330 --> 00:03:26,790 రెండు తాళ్ళను ముడి వేయడం నేర్చుకునే వరకూ అక్కడే ఉంచు. 54 00:03:26,916 --> 00:03:27,750 సరే, సర్. 55 00:03:28,417 --> 00:03:29,251 పద మరి. 56 00:03:31,629 --> 00:03:32,630 క్యాప్టన్, సర్. 57 00:03:46,685 --> 00:03:48,228 మన రోజువారీ పరిశీలనల్లో చాలా విచిత్రమైన విషయాలు 58 00:03:48,354 --> 00:03:49,855 కనిపిస్తున్నాయి, సర్. 59 00:03:50,397 --> 00:03:53,233 అయిస్కాంత ఉత్తర దిశలో, రోజుకి కొన్ని మైళ్ళ తేడా కనిపిస్తుంది. 60 00:03:54,151 --> 00:03:55,694 ప్రస్తుతం మనం దాని వలయంలోనే ఉన్నాము. 61 00:03:56,695 --> 00:03:58,364 మనవాళ్ళ పని ఇంకా కష్టంగా మారబోతోంది. 62 00:03:58,489 --> 00:04:00,282 టెర్రర్ సిగ్నల్ పంపిస్తోంది, సర్. 63 00:04:10,334 --> 00:04:12,503 క్యాప్టన్ క్రోజియర్ మంచు నివేదిక కావాలని కోరుతున్నాడు. 64 00:04:13,128 --> 00:04:14,421 నేను మిస్టర్ రీడ్ ని వెనక్కి పంపనా? 65 00:04:15,047 --> 00:04:18,133 వద్దు. ఫ్రాన్సిస్, జేమ్స్ ఇంకా నేను తనతో రాత్రి భోజనం చేస్తామని చెప్పు. 66 00:04:18,842 --> 00:04:22,471 మిస్టర్ టెర్రీ! జెండాల డబ్బా తెరువు! 67 00:04:23,013 --> 00:04:25,391 టెర్రర్ లో ఇంకా గొడ్డు మాంసం నాలుక వండుతున్నారని అందరూ అంటున్నారు. 68 00:04:25,516 --> 00:04:26,725 త్వరగా కానివ్వండి, అబ్బాయిలూ! 69 00:04:26,767 --> 00:04:31,105 ఎరిబస్ 70 00:04:41,031 --> 00:04:43,867 మిస్టర్ డిగ్గల్ కి చెప్పు, సర్ జాన్ ఇంకా కమాండర్ ఫిట్జ్-జేమ్స్ 71 00:04:43,993 --> 00:04:45,786 రాత్రి భోజనానికి ఇక్కడికి వస్తున్నారని. 72 00:04:46,245 --> 00:04:49,206 నా ఉగ్రాణములో నుండి ఏది కావాలంటే అది తీసుకోమని చెప్పు. సంతోషిస్తాడు. 73 00:04:49,331 --> 00:04:50,165 అవును, సర్. 74 00:04:50,290 --> 00:04:52,459 - వాళ్ళని చూశావా? - వాళ్ళని చూశాను. 75 00:04:57,339 --> 00:04:59,550 ఆవిష్కరణ సేవలో పని చేసేటప్పుడు అనుభవించే కష్టాల్లో, 76 00:04:59,675 --> 00:05:01,593 అతి పెద్ద కష్టం ఇదే కావచ్చు, థామస్. 77 00:05:01,719 --> 00:05:04,346 భోజనంలో మూడు కోర్సులు మాత్రమే ఉండేలా చూడు, మనం గ్రహించేలోగానే ముగిసిపోతుంది. 78 00:05:04,471 --> 00:05:05,764 ఫిట్జ్-జేమ్స్ ఉండగా అలా జరగదు. 79 00:05:06,348 --> 00:05:07,891 నమిబియా తీరానికి దగ్గర్లో ఉన్న 80 00:05:08,017 --> 00:05:11,812 గ్వానో ద్వీపంలో నియమాలు అమలు చేయడం గురించి అతను చెప్పే రామాయణం వినాలి. 81 00:05:12,730 --> 00:05:14,815 లేదా చైనీస్ వాళ్ళు అతనిపై తుపాకీ కాల్పులు జరపిన సంఘటన వినాలి. 82 00:05:14,940 --> 00:05:16,775 అలాంటప్పుడు అన్నం నోట్లో కాకుండా చెవుల్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది. 83 00:05:20,988 --> 00:05:23,198 - మరోసారి. - ఇప్పుడు వదిలిపెట్టు! 84 00:05:25,534 --> 00:05:26,577 పైదాకా లాగు! 85 00:05:40,883 --> 00:05:42,092 మా ఓడకు స్వాగతం, సర్ జాన్. 86 00:05:43,886 --> 00:05:45,179 క్యాప్టన్ ఫిట్జ్-జేమ్స్. 87 00:05:52,895 --> 00:05:54,188 మనం ధ్రువానికి అంత దగ్గరగా ఉంటే, 88 00:05:54,313 --> 00:05:56,482 త్వరలోనే ఏదోక రోజు కింగ్ విలియమ్ లాండ్ ని చూస్తాము. 89 00:05:56,607 --> 00:05:58,150 గొప్ప నిపుణుడిలా మాట్లాడుతున్నావు. 90 00:05:58,275 --> 00:05:59,943 మిస్టర్ ఫార్ నాకు పటం చూపించాడు. 91 00:06:00,319 --> 00:06:03,197 కింగ్ విలియమ్ లాండ్ దాటిన తర్వాత మనం అమెరికన్ తీరానికి చేరతాము 92 00:06:03,322 --> 00:06:04,865 అక్కడి నుండి అన్ని భూభాగాలు పటంలో వివరించబడ్డాయి. 93 00:06:06,992 --> 00:06:08,077 హల్లో, అబ్బాయి. 94 00:06:11,163 --> 00:06:12,664 అది రాత్రంతా మొరుగుతూనే ఉంది. 95 00:06:12,790 --> 00:06:14,208 అనారోగ్యం కావచ్చు లేదా ఏదో వాసన పసిగట్టి ఉండవచ్చు. 96 00:06:14,666 --> 00:06:17,086 గాలి సరిగ్గా వీస్తే, ఒక మైలు దూరంలో ఉన్న ఎలుగుబంటి వాసనని కూడా పసిగడుతుంది. 97 00:06:17,461 --> 00:06:18,670 ఆ కుక్క ర్యాంకు ఏంటంటావు? 98 00:06:19,546 --> 00:06:20,422 ఎప్పుడైనా అది ఆలోచించావా? 99 00:06:22,091 --> 00:06:23,300 అది రాత్రులు ఓడ పైభాగంలో ఉంటుంది. 100 00:06:23,425 --> 00:06:25,469 కాబట్టి అది కాపలా పని చేస్తుంది అనడంలో తప్పు లేదు. 101 00:06:25,594 --> 00:06:26,762 ఏమో తెలీదు. 102 00:06:26,887 --> 00:06:29,932 అంటే అది సమర్థ నావీకుడు, లేదా నౌకా సైనికుడు కావచ్చు. 103 00:06:30,057 --> 00:06:31,225 కాని అది ఓడ వెనుక భాగంలో కూడా నడవగలదు. 104 00:06:31,350 --> 00:06:33,143 కాబట్టి దానికి కనీసం ఒక చిన్న అధికారి హోదా ఉందని చెప్పవచ్చు. 105 00:06:33,977 --> 00:06:34,812 కదా? 106 00:06:34,937 --> 00:06:37,231 కొన్ని రాత్రులు అది అధికారుల గదుల దగ్గర గడుపుతుంది. 107 00:06:37,356 --> 00:06:39,525 చిన్న అధికారులు వెనుక పడుకోలేరు, 108 00:06:40,484 --> 00:06:42,569 అలాంటప్పుడు అది సైనికాధికారిగా పరిగణించబడుతుందా? 109 00:06:43,821 --> 00:06:44,655 అప్పుడు మనం దాన్ని ఏమనాలి? 110 00:06:45,906 --> 00:06:46,740 ఒక సహోద్యోగా? 111 00:06:47,658 --> 00:06:49,076 - ఒక లెఫ్టనెంటా? - మనం ఇంకా 112 00:06:49,201 --> 00:06:50,202 కుక్క గురించే మాట్లాడుతున్నామా? 113 00:06:52,955 --> 00:06:54,373 ఇది ప్రాముఖ్యమైన విషయం, కదా. 114 00:06:55,124 --> 00:06:56,083 కుక్కని మనిషికి అధికారిగా పెట్టడం. 115 00:06:56,208 --> 00:06:57,209 అంటే, ఈ పరిస్థితిలో ఎవరు ఎవరికి సేవ చేస్తున్నట్లు? 116 00:06:57,334 --> 00:06:58,418 అది ఈ ఓడకు చెందిన కుక్క. 117 00:06:59,086 --> 00:07:00,170 మనం దాన్ని సహిస్తున్నాము. 118 00:07:02,047 --> 00:07:05,551 రాత్రి భోజనంలో ఏ మద్యపానీయాలు అందించాలో ఇంకా నిర్ణయించలేదు. 119 00:07:05,676 --> 00:07:09,012 కాని మీరు ప్రత్యేకంగా కోరుకునేది ఏదైనా ఉందా, సర్? 120 00:07:12,516 --> 00:07:16,436 పసిఫిక్ వరకూ సాఫీగా సాగే అలలు, అప్పుడు మనం ఇంటికి వెళ్ళవచ్చు. 121 00:07:17,479 --> 00:07:18,564 మనం దగ్గర్లోనే ఉన్నాము, సర్. 122 00:07:19,690 --> 00:07:22,860 "దగ్గర" అనే పదాన్ని వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు. 123 00:07:24,945 --> 00:07:29,783 మనం ఆవిష్కరణ సేవలో ఉన్నాము. "దగ్గర" అంటే శూన్యం. 124 00:07:29,908 --> 00:07:31,285 నిజానికి శూన్యం కంటే ఘోరం. 125 00:07:32,452 --> 00:07:35,122 ఈ లోకంలో దేనితో పోల్చినా ఇది ఘోరమే. 126 00:07:35,581 --> 00:07:39,459 తీరానికి చేరుకున్న సైనిక దళాలు కాల్పులకు గురవుతున్నాయి, 127 00:07:39,585 --> 00:07:40,878 కాబట్టి నేను కాంగ్రీవ్లను బయటకు తెస్తున్నాను.. 128 00:07:41,003 --> 00:07:42,337 - రాకెట్లు. - అవును. 129 00:07:42,462 --> 00:07:44,506 విచిత్రం, ఎందుకంటే వాటి ఆవిష్కరణకు మద్దతిచ్చింది 130 00:07:44,631 --> 00:07:45,924 చైనీస్ వాళ్ళే కాబట్టి. 131 00:07:46,675 --> 00:07:49,636 నగర గోడలపై ఉన్న గురికాళ్ళను కాల్చి మేము గోడలు ఎక్కడం ప్రారంభించాము. 132 00:07:49,761 --> 00:07:51,638 నేను నిచ్చెన ఎక్కుతుండగా నా ఆలోచనల్లో... 133 00:07:52,681 --> 00:07:54,892 రూబికాన్ నదిని దాటుతున్న సీజర్ కనిపించాడు. 134 00:07:55,017 --> 00:07:55,934 మేము పైకి చేరుకున్నాము, 135 00:07:56,059 --> 00:07:59,396 మా కళ్ళ ఎదుట పరచబడి ఉన్న చింగ్-క్యాంగ్ నగరాన్ని చూశాను, 136 00:07:59,521 --> 00:08:01,607 ఉదయపు సూర్యకాంతిలో మెరుస్తూ కనిపించింది. 137 00:08:01,732 --> 00:08:03,400 కింద సందుల్లో ఉన్న సైనికులు 138 00:08:03,525 --> 00:08:05,444 మాపై తుపాకులతో కాల్పులు ప్రారంభించారు, 139 00:08:05,569 --> 00:08:08,906 అంటే కాగడాలతో వెలిగించాల్సి వచ్చే భుజానికి తగిలించుకునే తుపాకీలు. 140 00:08:09,031 --> 00:08:10,991 కాని ఆ మండుటెండలో, 141 00:08:11,783 --> 00:08:13,076 మేము వాళ్ళని కాల్చినప్పుడు, 142 00:08:13,202 --> 00:08:15,329 వాళ్ళు కిందవున్న కాగడాలపై పడేవాళ్ళు 143 00:08:15,454 --> 00:08:18,540 ఎండుగడ్డికి నిప్పు అంటుకున్నట్లు భగ్గుమని మండేవాళ్ళు. 144 00:08:19,041 --> 00:08:21,168 కాబట్టి కాస్త సమయం గడిచాక 145 00:08:21,293 --> 00:08:24,421 ఆ నగరమంతా మండుతున్న శవాలతో నిండిపోయింది 146 00:08:24,546 --> 00:08:26,423 కాస్సేపట్లోనే ఆ ప్రాంతమంతా కాల్చిన బాతు వాసనొచ్చింది. 147 00:08:26,548 --> 00:08:28,050 - వద్దు, థ్యాంక్ యూ. - ఆ తర్వాత, 148 00:08:28,926 --> 00:08:31,553 మేము 49వ దళానికి సహాయం చేయడానికి వీధుల్లోకి వెళ్ళాము, 149 00:08:31,678 --> 00:08:33,388 వాళ్ళపై దాడి జరుగుతున్నట్లు మాకు వినిపించింది. 150 00:08:33,513 --> 00:08:37,017 అప్పుడు, ఒక వీధిలో అడ్డుకట్ట వెనక దాగివున్న చైనీస్ సైనికులు కనిపించారు. 151 00:08:37,726 --> 00:08:42,231 కాని నేను... నేను ఒక రాకెట్ లోడ్ చేసి గురిపెట్టేలోపు, తుపాకీ గుండు తగిలింది, 152 00:08:42,356 --> 00:08:43,523 ఒక మస్కెట్ తుపాకీ గుండు, 153 00:08:44,149 --> 00:08:45,192 చెర్రీ పండంత గుండు. 154 00:08:46,193 --> 00:08:48,779 అది నా భుజాన్ని ఛేధించుకొని లోపలికి దూసుకెళ్ళి, 155 00:08:48,904 --> 00:08:50,197 ఇక్కడ మూడవ గాయం చేసి, 156 00:08:50,322 --> 00:08:51,156 నా ఛాతిలోకి ప్రవేశించింది. 157 00:08:51,281 --> 00:08:53,242 ట్రాఫల్గర్ లో లార్డ్ నెల్సన్ ని చంపిన తుపాకీ గాయంలాగ. 158 00:08:53,367 --> 00:08:55,911 కాని ఆ తుపాకీ గుండు నా భుజాన్ని తాకిన తర్వాత వేగం తగ్గకపోయి ఉంటే, 159 00:08:56,036 --> 00:08:58,372 అవును, నేను కూడా అతనిలా చనిపోయే వాడిని. 160 00:08:58,497 --> 00:09:00,082 అందరూ కలిసి చివరికి నన్ను కార్నవాలిస్ కి తీసుకొచ్చారు, 161 00:09:00,207 --> 00:09:03,377 అక్కడ మన మిత్రుడు డాక్టర్ స్టాన్లీ తుపాకీ గుండుని బయటకు తీశాడు. 162 00:09:03,502 --> 00:09:04,461 ఆ పోరాటం, యుద్ధాన్నే మార్చేసింది. 163 00:09:04,586 --> 00:09:06,880 ఐదు వారాల తర్వాత చింగ్ మిషన్ ఒప్పందంపై సంతకం పెట్టడానికి ఓడకి వచ్చారు. 164 00:09:07,005 --> 00:09:10,092 అయితే అప్పటికల్లా నేను మళ్ళీ కోలుకొని చేతికి కట్టు కట్టుకొని 165 00:09:10,217 --> 00:09:12,010 అధికారిక చిత్రం కోసం నవ్వుడూ నిలబడ్డాను. దాన్ని మీరు చూశారా? 166 00:09:12,135 --> 00:09:14,471 మాకు పక్షిరెట్టల ద్వీపం గురించి చెబుతావా, జేమ్స్? 167 00:09:15,806 --> 00:09:17,307 అది చాలా ఆసక్తికరమైన కథ. 168 00:09:24,022 --> 00:09:27,734 మిస్టర్ రీడ్ ఇంకా నేను ఈ రోజు మంచు గురించి మాట్లాడాము. 169 00:09:27,859 --> 00:09:30,612 మనం ఇప్పుడు దాటుకొని వెళ్తున్న మంచు పలకలు 170 00:09:30,737 --> 00:09:33,573 వేసవి కాలంలో విరిగిన మంచు పలకల్లా కనిపంచట్లేదని అతను చెప్పాడు. 171 00:09:33,699 --> 00:09:35,450 - పాత మంచా? - కంగారు పడాల్సిన విషయం కాదని చెప్పాడు. 172 00:09:35,951 --> 00:09:37,411 ఉత్తర దీశ నుండి ఇటువైపుకు ప్రవహిస్తూ మంచుకొండల ముక్కలు మోసుకొస్తున్న 173 00:09:37,536 --> 00:09:39,329 ఏదో పెద్ద నీటి కాలువ సముద్రంలోకి కలిసే కూడలికి దగ్గరగా, 174 00:09:39,454 --> 00:09:41,373 మనం ఉన్నామని అతని అభిప్రాయం. 175 00:09:41,498 --> 00:09:45,210 అంటే దానర్థం మన ఈ చిన్న వేసవి జలసంధి త్వరలోనే ముగిసిపోతుంది. 176 00:09:46,295 --> 00:09:47,587 దీనికి ఇంకా పేరు పెట్టలేదు 177 00:09:47,713 --> 00:09:53,343 కాబట్టి ఆ గౌరవాన్ని సర్ జేమ్స్ రాస్ కి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. 178 00:09:53,468 --> 00:09:54,720 మంచి నిర్ణయం. 179 00:09:54,845 --> 00:09:56,179 నువ్వు ఆమోదిస్తావా, ఫ్రాన్సిస్? 180 00:09:57,848 --> 00:09:59,224 అతను చాలా సంతోషిస్తాడు. 181 00:10:07,441 --> 00:10:09,901 ఇక్కడు ఉండే అయస్కాంత శక్తి కారణంగా అలా జరుగుతుంది. 182 00:10:10,027 --> 00:10:13,113 '23 వ సంవత్సరంలో సర్ జాన్ ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత, 183 00:10:13,238 --> 00:10:15,073 అతని జుట్టు వారానికి రెండు అంగుళాలు పెరిగేదంట. 184 00:10:15,198 --> 00:10:16,700 కాని వాళ్ళు మనం వచ్చినంత దూరం కూడా రాలేదు. 185 00:10:16,825 --> 00:10:18,535 నువ్వు ఈ పనిలో చేరింది అందుకేనా, స్ట్రాంగ్? 186 00:10:18,660 --> 00:10:19,870 రెండు అంగుళాల జుట్టు కోసమా? 187 00:10:22,998 --> 00:10:23,957 బానే ఉన్నావా? 188 00:10:25,000 --> 00:10:25,834 యంగ్. 189 00:10:26,793 --> 00:10:27,627 డేవిడ్? 190 00:10:29,504 --> 00:10:30,422 డేవిడ్? 191 00:10:30,547 --> 00:10:31,381 డేవిడ్. 192 00:10:31,923 --> 00:10:32,758 - బానే ఉన్నావా? - పడుకోబెట్టండి! 193 00:10:32,883 --> 00:10:33,967 తనకి ఊపిరి ఆడటం లేదు! 194 00:10:38,930 --> 00:10:40,349 వెండనే డాక్టర్ ని పిలవండి! 195 00:10:40,932 --> 00:10:42,059 త్వరగా! 196 00:10:42,184 --> 00:10:43,518 అతన్ని బోర్లా పటుకోబెట్టండి. 197 00:11:11,963 --> 00:11:14,508 "ద టెర్రర్" 198 00:11:17,594 --> 00:11:21,014 ఈ మాటలు పలికే మొదటి వ్యక్తిగా ఉండాలని నాకు లేదు, సర్ జాన్, 199 00:11:21,139 --> 00:11:22,557 కాని మనందరి మదిలో అదే ఉంది. 200 00:11:23,350 --> 00:11:26,812 బీచే దగ్గర చనిపోయిన ముగ్గురులో ఆ సూచనలు అస్సలు కనిపించలేదు. 201 00:11:27,270 --> 00:11:29,106 ఇప్పుడు ఆ సూచనలు కనిపించినా, 202 00:11:29,231 --> 00:11:30,857 అది మనవాళ్ళ ప్రాణాలు తీసే ముందే 203 00:11:30,982 --> 00:11:33,610 మనం పసిఫిక్ మహా సముద్రానికి చేరుకుంటాము. 204 00:11:33,735 --> 00:11:35,779 నీ నమ్మకం ఓదార్పుకరంగా ఉంది, అందులో సందేహం లేదు. 205 00:11:35,904 --> 00:11:37,322 నీకు నమ్మకం లేదా? 206 00:11:37,906 --> 00:11:39,116 ఇంత ప్రగతి సాధించాక కూడానా? 207 00:11:40,534 --> 00:11:41,535 ఎందుకో అర్ధం కావట్లేదు. 208 00:11:41,827 --> 00:11:44,037 మనం ఈ మార్గాన్ని ఒక్క సంవత్సరంలోనే కనుగొన్నాము. 209 00:11:44,996 --> 00:11:46,498 మనం డ్రక్కర్ పడవలు నడపట్లేదు కదా. 210 00:11:47,082 --> 00:11:51,002 ఈ ప్రాంతంలో, అదృష్టం కలిసి రాకపోతే సాంకేతికత కూడా పనికి రాదు, జేమ్స్. 211 00:11:55,757 --> 00:11:56,591 సర్. 212 00:11:57,134 --> 00:12:00,220 మేము అతనికి డోవర్స్ పొడి ఇచ్చి అతని మూర్ఛని అదుపు చేశాము. 213 00:12:00,262 --> 00:12:02,514 ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీలైనంత వరకూ. 214 00:12:02,556 --> 00:12:06,268 కాని అతని మలంలో నల్ల రక్తం ఉంది. జీర్ణించబడిన రక్తం. 215 00:12:06,309 --> 00:12:07,978 అతని పెద్దపేగు పైభాగంలో రక్తస్రావం జరుగుతోంది. 216 00:12:08,019 --> 00:12:10,564 - చాలా స్పష్టంగా వివరించావు. - అతనికి స్కర్వీ వ్యాధి ఉందా? 217 00:12:10,605 --> 00:12:12,941 అదేనని ఖచ్చితంగా చెప్పడానికి రుజువు లేదు, కాని ఆ అవకాశాన్ని కొట్టివేయలేము. 218 00:12:12,983 --> 00:12:16,820 కాని నా అభిప్రాయం ప్రకారం మాత్రం, పేషెంటుకి క్షయ వ్యాధి ఉంది. 219 00:12:17,446 --> 00:12:18,822 అది ఎప్పుడూ ఊపిరితిత్తులపైనే దాడి చేస్తుందని చెప్పలేము. 220 00:12:18,864 --> 00:12:20,532 డాక్టర్ స్టాన్లీ అతన్ని పరీక్షించాలి. 221 00:12:20,574 --> 00:12:22,409 బహుశా అతను వేరే సూచనలు ఏవైనా గుర్తించవచ్చు. 222 00:12:22,451 --> 00:12:24,578 - నేను అతని కోసం పడవ పంపిస్తాను. - లేదు, లేదు, అక్కర్లేదు. 223 00:12:25,078 --> 00:12:26,329 అతన్ని మాతోపాటు తీసుకెళతాము. 224 00:12:26,371 --> 00:12:28,248 యంగ్ నా? ఈ స్థితిలోనా? 225 00:12:28,290 --> 00:12:29,458 అవును. 226 00:12:29,499 --> 00:12:31,209 అతన్ని వెచ్చని బట్టలతో చుట్టి, మా పడవ సిద్ధం చేయండి. 227 00:12:31,251 --> 00:12:33,545 అతన్ని కదపడం అంత మంచిది కాదు, సర్. 228 00:12:33,587 --> 00:12:36,548 ఆ అబ్బాయిలో అసలు ఎంత శక్తి మిగిలివుందో చెప్పలేను. 229 00:12:36,590 --> 00:12:38,258 కాస్త చల్లగాలి తగిలితే తాజాపడతాడు. 230 00:12:38,884 --> 00:12:41,052 ఒక అర్ధగంటలో ఇక్కడ పడుకున్నట్లే వెచ్చని గదిలో పడుకుంటాడు. 231 00:12:46,141 --> 00:12:47,142 స్థిరంగా ఉంచండి. 232 00:12:48,226 --> 00:12:49,269 మెల్లగా దింపండి. 233 00:12:57,152 --> 00:12:58,361 ఓ, ఫ్రాన్సిస్. 234 00:12:58,403 --> 00:13:03,200 దూడ తల బాగుంది, కాని దానితో కలిపి వండిన కేపర్ గింజలు బాలేవని వంటవాడికి చెప్పు. 235 00:13:03,241 --> 00:13:04,409 ఈసారి మేము వచ్చనప్పుడు వండకుండా ఉంటాడు. 236 00:13:08,371 --> 00:13:09,456 గుడ్ నైట్, ఫ్రాన్సిస్. 237 00:13:10,499 --> 00:13:12,042 మరీ అంత పరాకుగా ఉండకు. 238 00:13:13,502 --> 00:13:14,377 అంతా బానే ఉంది. 239 00:13:22,177 --> 00:13:23,762 అంతా సవ్యంగా ఉంది. పదండి. 240 00:13:26,056 --> 00:13:29,017 తన సంతోషాన్ని కోల్పోయిన వ్యక్తి కంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. 241 00:13:30,310 --> 00:13:31,645 అతన్ని సహించడం కష్టంగా ఉంటుంది. 242 00:13:32,646 --> 00:13:33,980 పైగా తాగుబోతు కూడా. 243 00:13:34,022 --> 00:13:36,608 మనం అతనికి సహాయపడే మిత్రులుగా ఉండాలి, జేమ్స్. 244 00:13:37,234 --> 00:13:39,152 అసలు అతను ఇక్కడ ఎందుకు ఉన్నాడో అర్ధం కావట్లేదు. 245 00:13:39,653 --> 00:13:41,112 అతనికి కీర్తి అంటే పడదు. 246 00:13:41,404 --> 00:13:43,240 పాయసం బాగుందని పొగిడినా పడదు. 247 00:13:43,823 --> 00:13:45,408 మాలాంటి సైనికాధికారులను చాలా చులకనగా చూస్తాడు. 248 00:13:45,867 --> 00:13:49,788 అతను నావైపు ద్వేషపూరితంగా చూసిన ప్రతీసారి, నేను మోసగాడిని కాదని నాకు నేను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. 249 00:13:49,829 --> 00:13:53,416 నువ్వు అతని గురించి క్రూరంగా మాట్లాడితే నేను ఊరుకోను, జేమ్స్. 250 00:13:53,458 --> 00:13:54,584 అతను నా సహాయక అధికారి. 251 00:13:55,585 --> 00:13:57,712 నాకు ఏమైనా జరిగితే, నువ్వు అతని సహాయక అధికారిగా మారతావు. 252 00:13:58,171 --> 00:13:59,839 నువ్వు అతనిపట్ల ప్రేమగా ఉండాలి. 253 00:14:01,925 --> 00:14:05,220 ఒక్కోసారి ఆలోచిస్తే, మీరు మీ మనుష్యులను దేవుడికంటే ఎక్కువ ప్రేమిస్తారని అనిపిస్తుంది, సర్ జాన్. 254 00:14:05,262 --> 00:14:07,681 నీ ఆలోచన తప్పని ఆశిస్తున్నాను, అదే మీ అందరికి మంచిది. 255 00:14:14,437 --> 00:14:15,855 అందరూ సిద్ధంగా ఉండండి! 256 00:14:20,986 --> 00:14:23,029 తాళ్ళను వదలడానికి సిద్ధంగా ఉండండి! 257 00:14:31,997 --> 00:14:33,540 ఒక వ్యక్తి నీటిలో పడ్డాడు, కుడి వైపున! 258 00:14:33,582 --> 00:14:36,251 - అందరూ ఓడ పైభాగానికి రండి! - అందరూ ఓడ పైభాగానికి రండి! 259 00:14:36,960 --> 00:14:39,004 అందరూ నీటిలోని వ్యక్తి కోసం వెతకండి! 260 00:14:41,590 --> 00:14:43,425 ఎవరికి కనిపించాడు? 261 00:14:45,010 --> 00:14:46,011 పక్కకు జరగండి! 262 00:14:52,100 --> 00:14:53,643 - అదిగో! - వెనక్కి జరుగండి. 263 00:14:56,146 --> 00:14:57,522 తాడు పట్టుకో! 264 00:14:59,065 --> 00:15:00,275 పక్కకు జరగండి! 265 00:15:00,942 --> 00:15:02,402 పక్కకు జరగండి! 266 00:15:16,249 --> 00:15:17,292 కాల్లిన్స్! వద్దు! 267 00:15:17,334 --> 00:15:18,376 నన్ను ప్రయత్నించనివ్వు. 268 00:15:18,418 --> 00:15:20,545 ఇంకా ఎక్కువ ప్రాణాలు పోవాలని ఆ నావికుడు కోరుకోడు. 269 00:15:20,587 --> 00:15:22,881 - బిల్లీ ఆర్రెన్, అదీ అతని పేరు. - అతను చనిపోయాడు. 270 00:15:40,523 --> 00:15:43,652 ఈ సమస్య ప్రారంభమైన వెంటనే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదో 271 00:15:43,693 --> 00:15:45,570 నాకు అస్సలు అర్ధం కావట్లేదు. 272 00:15:45,612 --> 00:15:46,446 నోరు తెరువు. 273 00:15:51,993 --> 00:15:53,870 చిన్నప్పటి నుండి నాకు తలనొప్పులు వచ్చేవి. 274 00:15:54,704 --> 00:15:56,498 అవి ప్రమాదకరమని నాకు అనిపించలేదు. 275 00:15:57,791 --> 00:16:00,335 పైగా మేము ప్రతీ రాత్రి నిమ్మకాయ రసం తాగుతున్నాము. 276 00:16:00,627 --> 00:16:03,296 నౌకా సిబ్బందిలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వెంటనే తెలియజేయాలని ఖచ్చితంగా చెప్పబడింది. 277 00:16:04,964 --> 00:16:09,469 నీ సహోద్యోగులలో ముగ్గురిని బీచేలో పాటి పెట్టిన తర్వాత నువ్వు వెంటనే నా దగ్గరకు రావాల్సింది. 278 00:16:10,178 --> 00:16:12,138 ఆ నిమ్మకాయ రసం అన్ని వ్యాధులను నయం చేయలేదు. 279 00:16:15,016 --> 00:16:17,185 నేను సర్ జాన్ ని నిరాశపర్చకూడదని అనుకున్నాను. 280 00:16:18,103 --> 00:16:18,937 సరే. 281 00:16:19,354 --> 00:16:21,398 అతను నిన్ను పాతిపెట్టినప్పుడు నీ విశ్వాసాన్ని పొగుడుతాడు. 282 00:16:29,364 --> 00:16:31,074 ప్రొపెల్లర్ ని తిప్పలేక పోతున్నాము... 283 00:16:31,825 --> 00:16:32,867 వెనక్కి కూడా లాగలేక పోతున్నాము. 284 00:16:33,535 --> 00:16:36,162 నీటి లోపల ఏదైనా పెద్ద మంచు గడ్డ అతుక్కొని ఉండవచ్చని మిస్టర్ రీడ్ అంటున్నాడు. 285 00:16:36,204 --> 00:16:37,872 అంటే చిక్కుకుపోయిందా? 286 00:16:37,914 --> 00:16:38,832 అవును. 287 00:16:38,873 --> 00:16:42,043 అవును, ప్రాప్ కూపములో మంచు కూరుకొని ఉండవచ్చని మిస్టర్ గ్రెగరీ అంటున్నాడు... 288 00:16:43,002 --> 00:16:44,337 కాని తెల్లవారే వరకూ తెలుసుకోలేము. 289 00:16:45,630 --> 00:16:47,882 ఆ కూరుకుపోయిన మంచుని తీసేస్తే మనం మళ్ళీ బయలుదేరవచ్చుని... 290 00:16:48,633 --> 00:16:49,509 అతను హామీ ఇచ్చాడు. 291 00:16:50,927 --> 00:16:51,761 మంచిది. 292 00:16:52,846 --> 00:16:56,266 మనం మునిగిపోయే ప్రమాదంలో లేము కాబట్టి, ఇంక చర్చించాల్సింది ఏమీ లేదు, గ్రాహమ్. 293 00:16:57,475 --> 00:16:59,602 పరిస్థితిలో ఏదైనా మార్పు వస్తే నన్ను నిద్ర లేపు. 294 00:17:03,606 --> 00:17:09,446 "హెచ్.ఎమ్.ఎస్ టెర్రర్ అంశ పత్రం, వ్యాఖ్యలు ఎరిబస్ గాయపడ్డాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి." 295 00:17:37,891 --> 00:17:40,852 "సర్ థామస్ హార్డీ, సర్ జాన్ హెన్రీ లెఫ్రాయి ఉత్తర అమెరికా వర్ణన" 296 00:17:40,894 --> 00:17:42,395 "సర్ థామస్ కోరమ్, సర్ ఫ్రాన్సిస్ డ్రేక్, సర్ గిల్బర్టీ లేవీ, సర్ జాన్ హార్సటన్" 297 00:17:45,648 --> 00:17:49,194 అల్గానక్వేన్, మోహాక్ వ్రాసిన జనసంహారం. 298 00:17:56,117 --> 00:17:57,744 ఈ నాటకం నిన్ను కలవరపర్చిందా? 299 00:17:57,786 --> 00:17:59,162 ఏ భాగం, ఫ్రాన్సిస్? 300 00:17:59,204 --> 00:18:01,498 క్రూరమైన ఆటవికులా, లేక వాళ్ళు మారి క్యాథలిక్కులు కావడమా? 301 00:18:06,461 --> 00:18:08,797 నిన్ను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. 302 00:18:10,882 --> 00:18:13,802 నువ్వు ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు, ఫ్రాన్సిస్. 303 00:18:13,843 --> 00:18:15,094 కాని నేను చెప్పేది వినాలి. 304 00:18:22,644 --> 00:18:26,064 సర్ జేమ్స్ రాస్, దక్షిణానికి దక్షిణాన. 305 00:18:27,398 --> 00:18:28,983 నువ్వు ఆ వర్ణనను నమ్మితే, 306 00:18:29,025 --> 00:18:31,361 మనం వెనక్కి వచ్చిన తర్వాత నువ్వు బరువు తగ్గావన్నమాట. 307 00:18:32,612 --> 00:18:34,447 దంత వైద్యుడి దగ్గరికి కూడా వెళ్ళినట్లున్నాను. 308 00:18:34,489 --> 00:18:36,199 లేడీస్ ఇంకా జెంటిల్మెన్, 309 00:18:36,241 --> 00:18:39,744 ఈ రాత్రి, అసలైన సర్ జేమ్స్ రాస్ మన మధ్య కూర్చొని ఉన్నాడని 310 00:18:39,786 --> 00:18:43,081 చెప్పడానికి మేము గర్విస్తున్నాము. 311 00:18:45,041 --> 00:18:45,917 శభాష్! 312 00:18:48,628 --> 00:18:49,921 నిలబడు, పెద్దాయన. 313 00:18:51,256 --> 00:18:52,465 శభాష్! 314 00:18:56,803 --> 00:18:58,721 శభాష్, జెంటిల్మెన్. శభాష్. 315 00:19:01,975 --> 00:19:03,309 శభాష్! 316 00:19:07,230 --> 00:19:08,356 నువ్వు కూడా నిలబడు. 317 00:19:34,382 --> 00:19:38,720 నువ్వు టామ్ హార్టనెల్ తమ్ముడికి చేసినట్లు నాకు చేయకు. 318 00:19:41,681 --> 00:19:43,808 అది... అది మన సిబ్బంది క్షేమం కోసం చేశాను. 319 00:19:45,018 --> 00:19:47,604 జాన్ హార్టనెల్ చనిపోయింది స్కర్వీ వ్యాధి కారణంగానా కాదా అని తెలుసుకోడానికి. 320 00:19:47,645 --> 00:19:49,480 నేను ఇప్పుడు ఉన్నట్లే పాతిపెట్టబడాలని కోరుకుంటున్నాను. 321 00:19:51,357 --> 00:19:52,859 నా శరీరాన్ని కోయకు. 322 00:19:54,277 --> 00:19:55,403 నాకు వాగ్దానం చేస్తావా? 323 00:19:55,695 --> 00:19:58,323 సర్ జాన్ ఆజ్ఞాపిస్తే, నేను పాటించాలి. 324 00:19:59,324 --> 00:20:01,367 రాబోయే విషయాల గురించి నువ్వు మాకు హెచ్చరించవచ్చు. 325 00:20:03,870 --> 00:20:04,954 ఆగు... 326 00:20:04,996 --> 00:20:06,623 ధైర్యంగా ఉండు, డేవిడ్. 327 00:20:10,919 --> 00:20:12,587 సర్ జాన్ ఆజ్ఞాపిస్తే. 328 00:20:13,671 --> 00:20:14,714 నేను చేస్తాను. 329 00:20:15,256 --> 00:20:16,132 నీకు తెలుసా... 330 00:20:17,467 --> 00:20:18,718 కొన్నిసార్లు... 331 00:20:20,053 --> 00:20:21,804 ప్రజలు చావుకి దగ్గరగా ఉన్నప్పుడు, 332 00:20:22,722 --> 00:20:25,183 వాళ్ళు ఒక తేజోవంతమైన కాంతి గురించి మాట్లాడ్డం విన్నాను, 333 00:20:26,100 --> 00:20:29,312 వేలాది సూర్యోదయాలు ఒకేసారి వచ్చినట్లు అనిపించే కాంతి, 334 00:20:30,313 --> 00:20:33,191 దానిలోకి వాళ్ళని ఆహ్వానించడానికి వాళ్ళ ప్రియమైన వాళ్ళు వేచివుంటారంట. 335 00:20:34,067 --> 00:20:36,027 మేము అనాథలుగా పెరిగాము. 336 00:20:36,778 --> 00:20:38,404 నా తండ్రి ఎవరో నాకు తెలీదు. 337 00:20:39,489 --> 00:20:40,573 నా తల్లి కూడా తెలీదు. 338 00:20:44,202 --> 00:20:45,078 అయితే... 339 00:20:46,913 --> 00:20:48,748 అయితే నీకు దేవదూతలు కనిపిస్తారు. 340 00:20:49,749 --> 00:20:52,335 నువ్వు ఇంతవరకూ విననంత తియ్యని పాటలు పాడతారు. 341 00:20:53,753 --> 00:20:55,296 నేను ఎగరగలనా? 342 00:20:56,005 --> 00:20:57,757 - ఎగురుతూ దేవుని దగ్గరకు వెళతానా? - అవును! 343 00:20:59,342 --> 00:21:02,220 నువ్వు అలా ఎగురుతూ వెళుతుండగా, నీటి మార్గాన్ని మొదట నువ్వే చూస్తావు. 344 00:21:02,971 --> 00:21:05,974 అప్పుడు... అప్పుడు మాకు కేక వేసి అది ఎక్కడుందో చెప్పడం మర్చిపోకు. 345 00:21:11,354 --> 00:21:12,939 మనం ఆ మార్గాన్ని కనుగొన్నప్పుడు. 346 00:21:13,898 --> 00:21:15,274 నేను ఇక్కడ ఉండాలని కోరుకున్నాను. 347 00:21:15,817 --> 00:21:16,859 భయపడకు, డేవిడ్. 348 00:21:16,901 --> 00:21:20,071 ఆత్మలు వీడిపోవడాన్ని, నేను చూశాను. 349 00:21:21,030 --> 00:21:22,907 గొప్ప శాంతి వ్యాపిస్తుంది. 350 00:21:23,741 --> 00:21:26,411 అవి... అవి గాజు ముక్కలు... 351 00:21:28,413 --> 00:21:29,914 కాని ఉంగరం పూత పూయబడినది. 352 00:21:30,915 --> 00:21:34,377 అమ్మితే పెద్దగా డబ్బులేమీ రావు, కాని నా చెల్లికి ఇవ్వండి. 353 00:21:34,961 --> 00:21:36,879 కష్టమైన పనే, కాని... 354 00:21:37,797 --> 00:21:39,090 తీయలేకపోతున్నాను. 355 00:21:39,132 --> 00:21:43,094 వంటవాడిని చమురు కోసం అడుగుతాను, లేదా నా దగ్గర ఆముదం నూనే ఉంది. 356 00:21:45,430 --> 00:21:47,223 నేను చనిపోయానని నిర్ధారించుకున్నాక... 357 00:21:49,600 --> 00:21:50,810 ఏదోక విధంగా తియ్యి. 358 00:21:52,937 --> 00:21:56,190 నేను భయపడ్డానని సర్ జాన్ కి చెప్పకు. 359 00:21:56,232 --> 00:21:57,483 చెప్పనని వాగ్దానం చేస్తున్నాను. 360 00:21:59,360 --> 00:22:01,821 నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 361 00:22:19,714 --> 00:22:21,966 గాలులు వీయడం ఆగినప్పటి నుండి అలాగే మొరుగుతోంది. 362 00:22:23,760 --> 00:22:25,344 ఏ కారణం చేతనో కలవరపడుతోంది. 363 00:22:34,103 --> 00:22:35,271 మీ విగ్గులు తీయండి. 364 00:22:41,694 --> 00:22:42,737 ఆ శబ్దం వినిపిస్తోందా? 365 00:23:08,596 --> 00:23:09,597 నీ దుర్భిణి ఇలా ఇవ్వు. 366 00:23:10,098 --> 00:23:11,015 సరే. 367 00:23:11,641 --> 00:23:12,683 కింద పడకుండా చూడు. 368 00:23:12,725 --> 00:23:14,894 - ఇది లెఫ్టనెంట్ అర్వింగ్ ది. - చాల్లే ఆపు. 369 00:23:29,784 --> 00:23:30,660 వద్దు. 370 00:23:35,331 --> 00:23:36,582 వద్దు. 371 00:23:38,376 --> 00:23:39,710 అయ్యో. 372 00:23:41,045 --> 00:23:42,505 అయ్యో. 373 00:23:43,005 --> 00:23:43,881 - వద్దు. - డేవిడ్. 374 00:23:46,759 --> 00:23:47,885 డేవిడ్. డేవిడ్. 375 00:24:03,693 --> 00:24:08,239 మిస్టర్ బ్లాంకీని నిద్ర లేపు. వెంటనే. 376 00:24:09,949 --> 00:24:10,992 వద్దు. 377 00:24:12,118 --> 00:24:13,494 వద్దు! 378 00:24:14,245 --> 00:24:16,581 పారిపోండి! పారిపోండి! 379 00:24:16,622 --> 00:24:18,916 మనల్ని పారిపోమంటున్నాడు! 380 00:24:18,958 --> 00:24:21,419 - డేవిడ్, శాంతించు. - వద్దు! 381 00:24:21,460 --> 00:24:22,712 డేవిడ్. 382 00:25:11,385 --> 00:25:12,470 రండి. 383 00:25:15,431 --> 00:25:16,807 డిస్టర్బ్ చేసినందుకు సారీ. 384 00:25:18,434 --> 00:25:19,977 డేవిడ్ యంగ్ చనిపోయాడు. 385 00:25:20,019 --> 00:25:21,437 అలా జరుగుతుందని ముందే తెలుసు. 386 00:25:23,731 --> 00:25:26,108 ఆ శవాన్ని కప్పిపెట్టి విశ్రాంతి తీసుకో, మిస్టర్ గుడ్సర్. 387 00:25:32,823 --> 00:25:35,868 - ఏదో... - పనులు ప్రారంభించాక నువ్వు శవ పరీక్ష చేయవచ్చు. 388 00:25:38,287 --> 00:25:39,747 అది, అది అంత అవసరమా? 389 00:25:39,789 --> 00:25:43,251 మన మధ్య స్కర్వీ వ్యాధి వ్యాపిస్తోందని సర్ జాన్ కి అనుమానంగా ఉంది. 390 00:25:44,919 --> 00:25:46,003 అతను అడుగుతాడు. 391 00:25:46,545 --> 00:25:51,634 అతను చనిపోయే ముందు ఏదో జరిగింది. 392 00:25:54,011 --> 00:25:56,514 నాకు కనిపించనిది ఏదో అతనికి కనిపించింది. 393 00:25:57,556 --> 00:25:59,558 అది మనతోపాటే గదిలో ఉన్నట్లు అతను దానివైపు సూటిగా చూశాడు. 394 00:25:59,600 --> 00:26:02,561 భ్రాంతి అని దేనిని అంటారో నేను నీకు వివరించాలా? 395 00:26:02,603 --> 00:26:05,064 అతనికి జ్వరం లేదు. కళ్ళు స్పష్టంగా కనిపించాయి. 396 00:26:07,817 --> 00:26:09,235 గుడ్ నైట్, మిస్టర్ గుడ్సర్. 397 00:26:28,129 --> 00:26:30,631 ఆ మంచుకొండల ముక్కలపై ఉన్న మంచు చూడు. 398 00:26:30,673 --> 00:26:32,550 అవి వేసవి కాలంలో కరిగి ఉత్తర దిశ నుండి. 399 00:26:32,591 --> 00:26:33,843 ప్రవహిస్తూ వస్తున్న మంచు పలకలు కావు. 400 00:26:34,760 --> 00:26:36,304 కలిసి స్తంభించిన మంచుగడ్డలు. 401 00:26:37,138 --> 00:26:38,889 అలా అనుకోవడానికి కారణం ఉంది, కాని... 402 00:26:39,473 --> 00:26:41,475 నిన్న రాత్రి చలి ఎంత ఉండింది? 403 00:26:41,517 --> 00:26:43,769 ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తగ్గింది. 404 00:26:47,732 --> 00:26:49,233 ఎరిబస్ కి ఈ విషయం తెలుసా? 405 00:26:50,568 --> 00:26:51,652 ఇంకా జెండాలు ఏమీ ఊపలేదు. 406 00:26:51,694 --> 00:26:54,739 కాని వాళ్ళు తమ ప్రొపెల్లర్ గురించి ఆలోచిస్తూ మేలుకొనే ఉంటారు. 407 00:26:57,825 --> 00:27:00,328 సర్ జాన్ ఉదయం 10 కల్లా ఆఫీసర్ల కూటమి పిలవకపోతే, 408 00:27:00,369 --> 00:27:01,746 నేను పిలుస్తాను. 409 00:27:02,913 --> 00:27:05,541 నువ్వు మా అందరిని మించిపోతావు, అబ్బాయి. 410 00:27:05,583 --> 00:27:07,543 అసలు ఏ మానవుడూ వెళ్ళని చోటుకి నువ్వు వెళ్ళబోతున్నావు, 411 00:27:07,585 --> 00:27:08,794 స్థానికులు కూడా అక్కడికి వెళ్ళలేదు. 412 00:27:09,420 --> 00:27:12,590 ప్రొపెల్లర్ వెనుక మంచు ఇరుక్కొని ఉంటే, దాన్ని నువ్వు విడిపించగలిగితే, 413 00:27:12,631 --> 00:27:16,093 ఒక్క పూటలోనే రెండుసార్లు గొప్ప కార్యాలు చేసినవాడివి అవుతావు. 414 00:27:16,135 --> 00:27:17,428 అవును. 415 00:27:30,066 --> 00:27:31,692 నా సంకేతాల కోసం కనిపెట్టుకొని ఉండండి. 416 00:27:32,318 --> 00:27:34,945 నేను ట్యూబుని ఒకసారి లాగితే, తాడుని మూడు అడుగులు వదులు చేయమని. 417 00:27:34,987 --> 00:27:37,031 రెండుసార్లు లాగితే, ట్యూబు మడత పడిందని, బహుశా ఓడ పైఅంచు మీద. 418 00:27:37,073 --> 00:27:38,991 మూడుసార్లు లాగితే, నన్ను పైకి లాగమని. 419 00:27:43,496 --> 00:27:46,457 ఒకవేళ నా సూటు నీళ్ళతో నిండిపోతే, నన్ను పైకి లాగడం చాలా కష్టమవుతుంది 420 00:27:46,499 --> 00:27:49,585 పైగా చాలా తక్కువ సమయంలో లాగాల్సి ఉంటుంది, కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి. 421 00:27:53,089 --> 00:27:54,673 ఇక్కడ ఒక సర్జన్ ఉండడం ప్రాముఖ్యం. 422 00:27:54,715 --> 00:27:57,843 వాళ్ళు కిందే ఉన్నారు, మిస్టర్ కాల్లిన్స్. కానివ్వు. 423 00:28:04,892 --> 00:28:07,228 నువ్వు నీటి లోతుల్లోకి వెళ్తున్న భక్తుడివి. 424 00:28:07,269 --> 00:28:11,065 ఒకటి గుర్తుంచుకో, దేవుడు అన్ని చోట్లా ఉంటాడు. 425 00:28:11,107 --> 00:28:12,233 పైకి ఎత్తండి! 426 00:29:02,116 --> 00:29:03,409 స్థిరంగా. 427 00:31:21,463 --> 00:31:24,258 పైకి లాగండి! 428 00:31:47,531 --> 00:31:49,450 స్థిరంగా పట్టుకోండి. 429 00:31:56,123 --> 00:31:57,875 కణజాలాలు గట్టిపడినట్లు కనిపించట్లేదు, 430 00:31:58,459 --> 00:31:59,543 పైగా పైత్య రసం ఉంది. 431 00:32:03,088 --> 00:32:04,256 స్కర్వీ వ్యాధి సూచనలు కూడా లేవు. 432 00:32:04,798 --> 00:32:06,008 అసలు ఏమీ కనిపించట్లేదు. 433 00:32:06,050 --> 00:32:07,259 ప్రేగుని తెరువు. 434 00:32:16,602 --> 00:32:17,770 ప్రొపెల్లర్ వంగింది. 435 00:32:18,520 --> 00:32:19,605 ఒక బ్లేడు. 436 00:32:20,856 --> 00:32:22,399 వెనక నుండి కొంచెం మంచు తీశాను. 437 00:32:23,651 --> 00:32:25,027 బహుశా ఇప్పుడు తిరుగుతుందేమో, సర్. 438 00:32:25,194 --> 00:32:26,737 ఇంకా ఏదైనా గమనించావా? 439 00:32:30,991 --> 00:32:31,825 లేదు, సర్. 440 00:32:31,867 --> 00:32:33,494 పని చక్కగా పూర్తి చేశావు, మిస్టర్ కాల్లిన్స్! 441 00:32:33,911 --> 00:32:36,121 గ్రాహమ్, ఈ విషయం ఇంజనీర్లకు చెప్పు. 442 00:32:36,163 --> 00:32:37,665 ఇంకా, టెర్రర్ కి సంకేతం ఇవ్వు. 443 00:32:37,748 --> 00:32:39,667 క్యాప్టన్ క్రోజియర్ ని తన లెఫ్టనెంట్లు తీసుకొని రమ్మని చెప్పు. 444 00:32:39,708 --> 00:32:42,461 సర్, మన ముందున్న మంచు గురించి 445 00:32:42,503 --> 00:32:43,921 మనం చర్చించాలి. 446 00:32:46,799 --> 00:32:49,885 నిన్ను చూసి అసూయ పడుతున్నాను, మిస్టర్ కాల్లిన్స్. 447 00:32:50,427 --> 00:32:52,596 నాకు నీటిలోకి వెళ్ళాలని ఎప్పటి నుండో ఉంది. 448 00:32:53,389 --> 00:32:54,556 ఎలా అనిపించింది? 449 00:32:57,935 --> 00:32:59,269 కలలా అనిపించింది, సర్. 450 00:33:03,440 --> 00:33:06,193 ఎరిబస్ గురించి కబురు వచ్చింది. 451 00:33:06,485 --> 00:33:09,196 అది ఆవిరి యంత్రం సహాయంతో ముందుకి సాగగలుగుతుంది, 452 00:33:09,238 --> 00:33:12,700 కాని మన ప్రధాన ఓడ సామర్థ్యం కాస్త కుంటుపడింది. 453 00:33:12,991 --> 00:33:14,576 ఎంతగా కుంటుపడింది? 454 00:33:15,536 --> 00:33:17,454 బాయిలర్ పూర్తి శక్తిని వినియోగిస్తే, అది ఇప్పటికీ రెండు నాట్లు, 455 00:33:17,496 --> 00:33:18,789 లేదా మూడు నాట్ల వేగంతో ముందుకు సాగగలదు. 456 00:33:18,831 --> 00:33:20,374 అంటే మనుపటితో పోలిస్తే, సగం వేగం. 457 00:33:20,416 --> 00:33:21,667 అంతేకాకుండా, 458 00:33:21,709 --> 00:33:25,254 మన ముందు పరుచుకొని ఉన్న మంచు ఎంతో వేగంగా పెరుగుతోంది, 459 00:33:25,295 --> 00:33:27,339 మరింత దట్టంగా, మరింత ఎక్కువగా మారుతోంది, 460 00:33:27,381 --> 00:33:30,718 కాని మనం కింగ్ విలియమ్ లాండ్ కి దగ్గర్లోనే ఉండవచ్చు. 461 00:33:30,759 --> 00:33:35,305 తర్వాత మరో 200 మైళ్ళు వెళ్ళాక మనం పశ్చిమ పటాలను తీసుకొని 462 00:33:35,347 --> 00:33:38,726 వాటిలో ఈ ఆఖరి ముక్కని జోడించి మన పనిని పూర్తి చేయవచ్చు. 463 00:33:38,767 --> 00:33:39,727 బాగా చెప్పావు. 464 00:33:40,686 --> 00:33:44,314 మనం మీరు అనుకుంటున్న దానికంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నాము. 465 00:33:44,356 --> 00:33:45,899 చాలా నాటకీయమైన మొదటి వాక్యం! 466 00:33:46,275 --> 00:33:47,192 దయచేసి ఆపు. 467 00:33:47,234 --> 00:33:48,360 చెప్పు, ఫ్రాన్సిస్. 468 00:33:49,027 --> 00:33:51,655 మనకి కనిపిస్తున్నది కేవలం మంచు కాదు, 469 00:33:52,364 --> 00:33:53,657 అవి స్తంభించిన మంచుగడ్డలు. 470 00:33:53,699 --> 00:33:55,743 అంటే నీ అభిప్రాయం ప్రకారం మనం వాటిని, 471 00:33:55,784 --> 00:33:56,827 సెప్టెంబర్ లో దాటాలి, అంతేనా. 472 00:33:57,119 --> 00:33:59,496 సరైన మార్గాన్ని గుర్తుపట్టడానికి కావాల్సిన ఆధారాలు మన దగ్గర ఉన్నా 473 00:33:59,538 --> 00:34:01,123 ఈ మంచు గుండా ప్రయాణించడానికి ఎన్నో వారాలు పట్టవచ్చు. 474 00:34:02,291 --> 00:34:04,585 - మన దగ్గర అన్ని వారాలు లేకపోవచ్చు. - కాని, 475 00:34:04,626 --> 00:34:05,836 కొన్ని వారాల కంటే ఎక్కువ పట్టదు. 476 00:34:05,878 --> 00:34:07,629 సూర్యుడి పక్కన వచ్చే కాంతిని చూశావా, గ్రాహమ్? 477 00:34:08,297 --> 00:34:09,673 ఇప్పటి వరకూ ఎన్ని చూశావు? 478 00:34:11,467 --> 00:34:12,676 మూడు. 479 00:34:12,718 --> 00:34:14,636 ఈ సంవత్సరం గత ఏడాది కంటే చలి ఎక్కువగా ఉంది. 480 00:34:14,678 --> 00:34:17,347 - నేను ఆర్కిటిక్ కి వెళ్ళాను, ఫ్రాన్సిస్. - నడుచుకుంటూ వెళ్ళావు. 481 00:34:17,931 --> 00:34:19,391 ఆకలితో దాదాపు చనిపోయావు. 482 00:34:19,433 --> 00:34:20,934 నీ మనుష్యులలో అందరూ వెనక్కి రాలేకపోయారు. 483 00:34:20,976 --> 00:34:22,728 ఇది నేను గౌరవంతోనే చెబుతున్నాను. 484 00:34:22,770 --> 00:34:24,229 చాల్లే ఆపు, ఫ్రాన్సిస్. 485 00:34:24,605 --> 00:34:27,191 ఒక క్యాప్టన్ తన మాటని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. 486 00:34:27,232 --> 00:34:28,984 అయితే నీ సలహా ఏమిటి? 487 00:34:29,860 --> 00:34:31,779 - సీతాకాలం అయిపోయే వరకూ ఇక్కడే వేచివుందామా? - లేదు. 488 00:34:32,613 --> 00:34:35,324 కింగ్ విలియమ్ లాండ్ ఖచ్చితమైన ఆకారం ఎవ్వరికి తెలియదు. 489 00:34:35,365 --> 00:34:39,495 కార్నవాలిస్ లాండ్ విషయంలో జరిగినట్లు అది కింగ్ విలియమ్ లాండ్ కేవలం ద్వీపం కావచ్చు, 490 00:34:39,536 --> 00:34:41,830 మనం దాని తూర్పు తీరం చుట్టూ ప్రయాణించే అవకాశం ఉండవచ్చు. 491 00:34:41,872 --> 00:34:43,165 అవును, కాని తూర్పుకి వెళితే దూరం పెరుగుతంది. 492 00:34:43,207 --> 00:34:45,417 మనం ఈ ప్రయాణాన్ని ఈ సంవత్సరం పూర్తి చేయలేకపోవచ్చు. 493 00:34:45,459 --> 00:34:47,753 ఎందుకంటే ఎరిబస్ కుంటుపడింది కాబట్టి. 494 00:34:48,212 --> 00:34:51,715 మన దగ్గరున్న బొగ్గునంతా తక్కువ నష్టపోయిన ఓడపై ఏకీకృతం చేస్తే, 495 00:34:51,757 --> 00:34:55,219 మన దగ్గర ఉన్నదంతా పణంగా పెట్టి కింగ్ విలియమ్ లాండ్ తూర్పుకి వెళ్ళి, 496 00:34:55,260 --> 00:34:57,304 సీతాకాలం ముగిసేలోపు దాని చుట్టూ ప్రయాణించవచ్చు. 497 00:34:58,430 --> 00:35:01,350 మన సమస్యకు ఇదే మంచి పరిష్కారం, బహుశా ఇదే ఏకైక పరిష్కారం. 498 00:35:01,683 --> 00:35:02,601 అవును. 499 00:35:02,643 --> 00:35:03,811 మన దగ్గర ఉన్నదంతా పణంగా పెట్టాలి. 500 00:35:03,852 --> 00:35:06,438 ఎరిబస్ ని ఇక్కడే వదిలేయాలి, అదేనా నువ్వు అంటున్నది? 501 00:35:06,480 --> 00:35:07,981 ఒకవేళ మనం అనుకున్నట్లు జరగకపోతే, 502 00:35:08,023 --> 00:35:10,859 మనం సీతాకాలాన్ని సురక్షితమైన ప్రదేశంలో గడపవచ్చు 503 00:35:10,901 --> 00:35:14,363 మంచుగడ్డల మధ్య కాకుండా ఏదైనా నౌకాశ్రయంలో గడపవచ్చు. 504 00:35:14,404 --> 00:35:17,282 వసంత కాలంలో మళ్ళీ వెనక్కి రావచ్చు. 505 00:35:17,324 --> 00:35:20,536 ఒకరితో ఒకరు విసిగిపోయి ఉంటాము, కాని సజీవంగా ఉంటాము. 506 00:35:26,708 --> 00:35:30,045 నీ ఊహ చాలా ఆసక్తికరంగా ఉంది, 507 00:35:32,256 --> 00:35:35,884 కాని మనం ఎరిబస్ ని వదిలి వెళ్ళడం ఎన్నటికి జరగదు. 508 00:35:35,926 --> 00:35:37,052 ఒకవేళ టెర్రర్ కి కూడా, 509 00:35:37,970 --> 00:35:40,639 ఏవైనా చిన్న సమస్యలు ఎదురైతే దాన్ని కూడా వదిలి వెళ్ళము. 510 00:35:41,723 --> 00:35:44,434 - మనం దాదాపు చేరుకున్నాము, జెంటిల్మెన్. - నా మాట విను, జాన్. 511 00:35:44,476 --> 00:35:49,731 మనం సురక్షితమైన నీటి నుండి 200 లేదా 2,000 మైళ్ళ దూరం ఉన్నామా అన్నది ముఖ్యం కాదు. 512 00:35:49,773 --> 00:35:52,276 మార్గం గుర్తించే ఆధారాలు లేకుండా పోతే, మనం సముద్రం మధ్యలో ఉంటే, 513 00:35:52,317 --> 00:35:54,987 నీటి ప్రవాహం మంచుగడ్డలను ఎటు వైపుకి తోస్తుందో మనకి తెలీదు 514 00:35:55,028 --> 00:35:56,655 ఆ మంచుగడ్డల మధ్య మనం ఇరుక్కొని ఉంటాము. 515 00:35:58,365 --> 00:36:01,743 ఆ ప్రవాహం మనల్ని కింగ్ విలియమ్ లాండ్ తీరాలకు ఈడ్చుకెళ్ళవచ్చు 516 00:36:01,785 --> 00:36:05,247 మన ఓడలు ముక్కలుగా బద్దలవ్వవచ్చు, అప్పటి దాకా సజీవంగా ఉన్నా అప్పుడు చావడం ఖాయం. 517 00:36:06,039 --> 00:36:08,500 ఒక నమ్మకమైన స్నేహితుడు చెప్పినట్లుగా, 518 00:36:10,168 --> 00:36:11,962 ఈ ప్రాంతం మన చావుని కోరుకుంటోంది. 519 00:36:14,506 --> 00:36:15,549 ఎవరు ఆ స్నేహితుడు? 520 00:36:16,675 --> 00:36:18,176 అతను నాటకాలు వ్రాస్తాడా? 521 00:36:20,596 --> 00:36:24,558 సర్ జాన్, నేను, మిస్టర్ బ్లాంకీ, ఇంకా మిస్టర్ రీడ్. 522 00:36:25,267 --> 00:36:28,353 ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కేవలం మేము నలుగురమే ఆర్కిటిక్ అనుభవజ్ఞులము. 523 00:36:29,438 --> 00:36:31,523 ఇక్కడ నాటకాలు జరగవు. 524 00:36:33,442 --> 00:36:36,737 సజీవులు, మృతులు ఉంటారు అంతే. 525 00:36:42,075 --> 00:36:45,370 నీ ముఖం ఇలా ఎరుపెక్కడం చూసి చాలా ఆనందంగా ఉంది, ఫ్రాన్సిస్. 526 00:36:45,412 --> 00:36:49,666 కాని మనం మన లక్ష్యానికి కేవలం రెండు వారాల దూరంలో ఉన్నాము. 527 00:36:49,708 --> 00:36:54,212 ఈ సంవత్సరాంతం లోపు మనం సురక్షితమైన నీటిని చేరుకోవడాన్ని 528 00:36:54,254 --> 00:36:56,340 దేవుడు, ఇంకా సీతాకాలం ప్రత్యక్షంగా చూస్తారని నాకు నమ్మకంగా ఉంది. 529 00:36:56,798 --> 00:36:59,134 సాండ్విచ్ ద్వీపాలు. లేదా ఇంకా దూరంలో మరో ప్రదేశం. 530 00:36:59,176 --> 00:37:02,346 ఒకవేళ నువ్వు తప్పు అయితే, మనం అహంకారంతో ప్రవర్తించిన వాళ్ళము అవుతాము 531 00:37:03,138 --> 00:37:05,098 మనం బ్రతికి బయటపడకపోవచ్చు. 532 00:37:07,017 --> 00:37:10,103 మనుష్యుల ప్రాణాల మీదికి వస్తే వాళ్ళు ఏమి చేస్తారో నీకు తెలుసు. 533 00:37:11,313 --> 00:37:12,230 మనిద్దరికి తెలుసు. 534 00:37:18,445 --> 00:37:21,073 నేను ఎరిబస్ లోనే ఉండి ఆదేశాలు జారీ చేస్తాను, 535 00:37:21,114 --> 00:37:25,619 కాని అది కుంటుపడడం వల్ల, నేను టెర్రర్ ని ప్రధాన ఓడగా చేస్తున్నాను. 536 00:37:25,661 --> 00:37:27,287 అది మంచుని బద్దలుకొట్టడానికి నిర్మించిన ఓడ కాకపోవచ్చు, 537 00:37:27,329 --> 00:37:29,373 కాని ప్రస్తుతం రెండు ఓడల్లో అదే బలమైనది. 538 00:37:30,832 --> 00:37:35,128 మీ మనిషి యంగ్ ని పూడ్చిపెట్టండి, తర్వాత మనం బయలుదేరదాము. 539 00:37:35,170 --> 00:37:37,923 కింగ్ విలియమ్ లాండ్ కి పశ్చిమం వైపు. ముందు అనుకున్నట్లుగా. 540 00:37:37,965 --> 00:37:38,882 పూడ్చిపెట్టాలా? 541 00:37:39,675 --> 00:37:41,218 అవును. దయ చూపించడానికి. 542 00:37:42,135 --> 00:37:43,261 రాత్రంతా చాలా నొప్పితో గడిపాడు. 543 00:37:46,431 --> 00:37:53,146 ఎంతో కాలం క్రితం వెస్టమిన్స్టర్ లో ఎలుకలు పట్టే వ్యక్తి కూతురు ఉండేది 544 00:37:53,188 --> 00:37:55,899 మనమంతా ఇంత శ్రమ పడే బదులు శవాన్ని నీటిలోకి విసిరేస్తే సరిపోయేది. 545 00:37:57,192 --> 00:37:58,944 సర్ జాన్ చాలా దైవభక్తి గల వ్యక్తి. 546 00:38:00,320 --> 00:38:02,948 - నాకైతే అసాధ్యమైనవి కోరే వ్యక్తి అనిపిస్తోంది. - మాటలు జాగ్రత్తగా రానివ్వు. 547 00:38:03,657 --> 00:38:05,575 ఎందుకు, నేను రాజద్రోహం చేశానా, సార్జెంట్? 548 00:38:14,501 --> 00:38:16,545 వాళ్ళు మూతని గట్టిగా మూయడానికి ఇంకొన్ని మేకులు కొట్టివుండాల్సింది. 549 00:38:18,547 --> 00:38:20,716 తాళ్ళను పైకి లాగి, గుంటని పూడ్చు, మిస్టర్ హిక్కీ. 550 00:38:20,757 --> 00:38:22,009 నేనా? 551 00:38:22,050 --> 00:38:24,344 నువ్వు చలా బాధ్యతగల వ్యక్తివని మిస్టర్ హార్నబీ చెప్పాడు. 552 00:38:24,386 --> 00:38:25,470 కారణం ఏమిటో చెప్పలేదు. 553 00:38:26,888 --> 00:38:27,973 బహుశా ఫిర్యాదులు చేస్తావనేమో. 554 00:38:31,935 --> 00:38:34,229 మనం, మనం దీన్ని ఇలాగే వదిలేస్తున్నామా? 555 00:38:34,271 --> 00:38:36,857 నువ్వు లోపలికి దిగి సరి చేస్తే చెయ్యి, లేకపోతే అలాగే వదిలేస్తున్నాము. 556 00:38:37,524 --> 00:38:38,734 లోపలికి దూకు, మిస్టర్ హిక్కీ. 557 00:39:05,302 --> 00:39:06,386 మిస్టర్ హిక్కీ.... 558 00:39:11,892 --> 00:39:13,351 అది ప్రాముఖ్యం కాదు. 559 00:39:51,515 --> 00:39:53,600 అది ప్రాముఖ్యం కాదని సార్జెంట్ టోజర్ చెప్పాడు. 560 00:39:55,268 --> 00:39:57,145 కాని ఇతని తండ్రికి ఇది ప్రాముఖ్యం, అవునా కాదా? 561 00:40:02,484 --> 00:40:03,485 నన్ను పైకి లాగుతారా? 562 00:40:04,194 --> 00:40:06,279 యేసు థామస్ తో ఇలా అన్నాడు, 563 00:40:07,030 --> 00:40:10,117 "నువ్వు నన్ను చూశావు కాబట్టి నన్ను నమ్మావు, 564 00:40:10,951 --> 00:40:14,329 కాని అసలు నన్ను చూడకుండానే నన్ను నమ్మినవాళ్ళు, 565 00:40:14,996 --> 00:40:16,790 నిజంగా ధన్యులు." 566 00:40:20,127 --> 00:40:24,172 డేవిడ్ యంగ్ ద్వారాల దగ్గర ఉన్నట్లే, 567 00:40:24,881 --> 00:40:26,174 మనం కూడా ఉన్నాము. 568 00:40:27,300 --> 00:40:30,262 ఆ ద్వారాల గుండా మనం నడిచే సమయం వచ్చేసింది, 569 00:40:30,303 --> 00:40:33,098 మన కీర్తి వైపుకి, మన విధి వైపుకి. 570 00:40:34,599 --> 00:40:37,561 నేను దక్షిణానికి, నైరుతి దిశకి మార్గం నిర్ణయించాను. 571 00:40:38,019 --> 00:40:40,147 మనం పదిహేను రోజుల్లోగా ఉత్తర అమెరికా 572 00:40:40,188 --> 00:40:42,357 ప్రధాన భూభాగానికి చేరుకుంటాము, జెంటిల్మెన్. 573 00:40:42,399 --> 00:40:46,069 ఇప్పుడు మనం దాన్ని చేరుకోడానికి ఆఖరి మరియు అత్యుత్తమ ప్రయత్నం ప్రారంభించాలి 574 00:40:46,611 --> 00:40:51,575 మనం ఈ తరానికి చెందిన అత్యుత్తమ నావికులుగా కీర్తి పొందాలి. 575 00:40:57,664 --> 00:41:04,421 మన ప్రియమైన వాళ్ళ ప్రశంసలు ఇంకా ఆలింగనాలు పొందే అర్హత సంపాదిద్దాము. 576 00:41:05,630 --> 00:41:07,257 బయలుదేరండి, మిత్రులారా! 577 00:41:07,299 --> 00:41:08,466 పదండి! 578 00:41:09,092 --> 00:41:10,010 కానివ్వండి, అబ్బాయిలు. 579 00:41:10,802 --> 00:41:12,762 తాళ్ళని బిగించండి! 580 00:41:17,475 --> 00:41:18,894 తెరచాపను దించండి! 581 00:41:31,198 --> 00:41:32,657 కుడివైపుకి తిప్పండి! 582 00:41:32,699 --> 00:41:34,409 కుడివైపుకి తిప్పుతాను, సర్. 583 00:41:34,784 --> 00:41:35,785 కుడివైపుకి తిప్పండి. 584 00:41:35,827 --> 00:41:38,663 కానివ్వండి, అబ్బాయిలు. బలంగా దూసుకువెళదాము. 585 00:41:42,751 --> 00:41:44,461 స్థిరంగా. కాస్త వదులు చెయ్యి. 586 00:42:02,687 --> 00:42:04,898 ఇక్కడ ఇంకా ఎక్కువ మనుష్యులు తవ్వాలి. 587 00:42:05,440 --> 00:42:08,068 ఒక్క వ్యక్తే ఎందుకు తవ్వుతున్నాడు? 588 00:42:10,403 --> 00:42:13,156 "ఆరు రోజుల తర్వాత" 589 00:42:22,457 --> 00:42:23,416 ఆగండి, మిత్రురాలా. 590 00:42:23,667 --> 00:42:24,834 వెనక్కి జరగండి! 591 00:42:29,631 --> 00:42:31,925 సరే, అందరూ, వెనక్కి జరగండి! 592 00:43:14,050 --> 00:43:16,386 మన ప్రభువు, తండ్రి మనల్ని క్షేమంగా ఉంచుతాడు. 593 00:43:20,265 --> 00:43:21,808 ఉదయం ఎలాంటి పరిస్థితి ఏదురైనా సరే. 594 00:44:48,144 --> 00:44:50,313 మంచు లంగర్లను ఎత్తండి. మనం ఇప్పుడు దానిలో ఒక భాగంగా మారాము. 595 00:44:50,355 --> 00:44:51,314 సర్. 596 00:44:52,482 --> 00:44:54,234 మన స్థానాన్ని జాగ్రత్తగా స్థాపించు, మిస్టర్ రీడ్. 597 00:44:54,275 --> 00:44:57,529 కింగ్ విలియమ్ లాండ్ మనకి ఖచ్చితంగా ఎటు వైపున ఎంత దూరంలో ఉందో నాకు తెలియాలి. 598 00:44:57,570 --> 00:44:58,405 సరే, సర్. 599 00:45:01,157 --> 00:45:02,617 మన సిబ్బంది భోజనం చేసిన తర్వాత, 600 00:45:02,659 --> 00:45:04,452 వాళ్ళతో తెరచాపలను పైకి లాగించండి. 601 00:45:05,787 --> 00:45:08,915 మిస్టర్ గ్రెగరీ ఓడ ఇంజనుని సీతాకాలం కోసం సిద్ధం చేయడం ప్రారంభించవచ్చు. 602 00:45:08,957 --> 00:45:12,460 మీ వైఖరి సంతోషంతో నిండి వుండాలి, జెంటిల్మెన్. 603 00:45:13,837 --> 00:45:14,671 అర్ధమయ్యిందా? 604 00:45:14,712 --> 00:45:17,590 మనం కొన్ని కష్టాలు ఎదురుకోవచ్చు కాని మనం దానికి సిద్ధపడే వచ్చాము, 605 00:45:17,632 --> 00:45:19,300 రాణి కోసం, మన దేశం కోసం సాహసం చేశాము. 606 00:45:20,718 --> 00:45:21,970 జీవితంలో మరచిపోలేని సాహసం. 607 00:45:23,388 --> 00:45:24,722 సిబ్బందికి అదే చెప్పండి. 608 00:46:27,994 --> 00:46:30,997 అనువాదం: ఎస్డీఐ మీడియా