1 00:00:49,633 --> 00:00:51,260 ముఖం పచ్చడి అయిపోయింది బాబోయ్. 2 00:00:53,387 --> 00:00:56,265 నాకేం కాలేదు. భయపడిపోకండి, నేను బాగానే ఉన్నాను. 3 00:00:56,265 --> 00:00:58,016 - అందరూ వచ్చేశారా? - వచ్చేశారు. 4 00:00:58,016 --> 00:00:59,017 సూపర్, మంచిది! 5 00:01:00,769 --> 00:01:02,271 హా, ఆల్టో కూడా వచ్చేశాడు. అదీ మరి. 6 00:01:02,271 --> 00:01:06,233 నా ముఖం పచ్చడి అయిపోయింది. నాకు నా ముఖం కావాలి. నటించడానికి అది చాలా ముఖ్యం నాకు. 7 00:01:06,233 --> 00:01:07,818 హా, అవును. మనం ఎక్కడ ఉన్నాం? 8 00:01:07,818 --> 00:01:10,571 ఇది మంచు యుగం, ఈ మంచు చూస్తే తెలియట్లే! 9 00:01:10,571 --> 00:01:11,572 చాలా చలిగా ఉంది. 10 00:01:11,572 --> 00:01:12,781 చలికి గడ్డకట్టుకుపోయేలా ఉన్నా. 11 00:01:12,781 --> 00:01:15,284 కెవిన్, ఇలాంటి గడ్డకట్టుకుపోయే చలి ఉండే పరిస్థితులు ఉన్నా కూడా 12 00:01:15,284 --> 00:01:18,579 మీ అమ్మానాన్నలను కాపాడుకుంటావా? 13 00:01:18,579 --> 00:01:19,705 హా. 14 00:01:19,705 --> 00:01:21,790 వాళ్లంటే నీకు ఇష్టం కదా? అవును కదా? 15 00:01:21,790 --> 00:01:28,463 అవును. వాళ్లు గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ ఒక్కోసారి వాళ్లు గొప్పగానే ఉంటారు. 16 00:01:28,463 --> 00:01:32,092 నా పుట్టినరోజు వంటి కొన్ని సందర్భాల్లో, 17 00:01:32,092 --> 00:01:34,303 నేనేం కావాలంటే అది చేసుకోవచ్చు. 18 00:01:35,804 --> 00:01:36,972 అంటే... 19 00:01:38,056 --> 00:01:39,183 ఏం లేదులే. నువ్వు చెప్పు. 20 00:01:39,183 --> 00:01:43,520 వాళ్లు నన్ను వుడ్ హెంజ్ కి పంపించడం వంటివి చేస్తుంటారు. అంటే... 21 00:01:44,813 --> 00:01:48,192 వాళ్లకి అవన్నీ నచ్చకపోవచ్చు, కానీ నన్నైతే పంపిస్తారు. 22 00:01:48,192 --> 00:01:49,234 హా. 23 00:01:49,234 --> 00:01:52,946 అలాంటి పనుల వల్ల, ప్రపంచంలో నా అంత ముఖ్యమైన వ్యక్తి ఇంకెవరూ లేరనిపిస్తుంది. 24 00:01:54,615 --> 00:01:56,825 సూపర్. కథ అయిపోయిందా? 25 00:01:56,825 --> 00:01:59,328 ఇందాక నీకు అంతరాయం కలిగించాలనుకోలేదు. కాకపోతే, నీ వెనుక... 26 00:02:03,540 --> 00:02:06,293 అస్సలు కదలకండి, అప్పుడు అది మనల్ని గమనించకపోవచ్చు. 27 00:02:07,294 --> 00:02:11,256 అయ్యయ్యో. అది ఆ "రైనోకెలొస్"ని తినబోతోంది. 28 00:02:11,256 --> 00:02:12,674 అందరూ నిశ్శబ్దంగా ఉండండి. 29 00:02:12,674 --> 00:02:14,635 దాని దృష్టిని ఆకర్షించే పని చేయవద్దు. 30 00:02:14,635 --> 00:02:16,094 హేయ్. 31 00:02:16,094 --> 00:02:19,681 ఆహారం కావాలా, పెద్ద పళ్ల దానా? 32 00:02:19,681 --> 00:02:20,807 - బిటెలిగ్! - ఎందుకు? 33 00:02:20,807 --> 00:02:22,518 ఇటు చూడవే! 34 00:02:28,607 --> 00:02:32,819 బిటెలిగ్, ఇప్పుడే నేను ఒక సలహా ఇచ్చాను కదా. అది గుర్తుందా? 35 00:02:32,819 --> 00:02:34,863 దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. 36 00:02:34,863 --> 00:02:40,869 ఈ సందర్భంగా మీ అందరి ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టినందుకు, క్షమాపణ కోరుతున్నాను. 37 00:02:40,869 --> 00:02:43,622 కాబట్టి చింతించకండి, తప్పు నాదే. 38 00:02:43,622 --> 00:02:46,458 సరే. మనం దొంగిలించిన ఖజానాని దానిపైకి విసురుదాం. 39 00:02:46,458 --> 00:02:49,002 - నిజంగానా? - హా, నిజంగానే. 40 00:02:50,504 --> 00:02:52,047 - బాబోయ్. - దానికి తగల్లేదు. 41 00:02:54,508 --> 00:02:56,426 నేను విసిరింది కూడా తగల్లేదు. నాది కూడా. 42 00:02:57,094 --> 00:02:58,595 అంతే. ఇక మన దగ్గర ఏవీ లేవు. 43 00:02:58,595 --> 00:03:00,514 - అప్పుడే అయిపోయాయా? - ఫ్రెష్ మింట్స్ ఉన్నాయి. 44 00:03:00,514 --> 00:03:02,307 - వాటిని కూడా విసరనా? - హా, విసురు. 45 00:03:03,642 --> 00:03:04,643 నాకు భయంగా ఉంది. 46 00:03:05,352 --> 00:03:06,645 అయ్య బాబోయ్... 47 00:03:07,688 --> 00:03:10,315 - కొట్టా దాన్ని! - అదీ లెక్క! 48 00:03:10,315 --> 00:03:11,859 దెబ్బ ఎలా ఉంది! 49 00:03:21,910 --> 00:03:23,036 అది నన్నే చూస్తోందా? 50 00:03:23,036 --> 00:03:24,204 - అవును. - హా. 51 00:03:24,204 --> 00:03:26,206 నిన్నే గుచ్చిగుచ్చి చూస్తోంది. 52 00:03:26,206 --> 00:03:27,749 దాన్ని భయపెట్టండి. భయపెట్టండి. పారిపోయేలా చేయండి. 53 00:03:27,749 --> 00:03:29,376 - దాన్ని భయపెట్టాలా? - వెళ్లిపో! 54 00:03:29,376 --> 00:03:31,003 అందరం కలిసి దాని కన్నా పెద్ద క్రూర మృగం అవుదాం. 55 00:03:31,003 --> 00:03:33,881 అందరూ రండి. ఒకేసారి అందాం. వెళ్లిపో! 56 00:03:33,881 --> 00:03:36,842 వెళ్లిపో! 57 00:03:36,842 --> 00:03:39,970 - వెళ్లిపో! - మన ప్లాన్ పని చేసింది 58 00:03:39,970 --> 00:03:41,471 - సూపర్! - వావ్! 59 00:03:41,471 --> 00:03:43,891 - నటనలో ఉన్న గొప్పదనం అదే! - సూపరో సూపర్! 60 00:03:43,891 --> 00:03:46,143 యాహూ! 61 00:03:52,149 --> 00:03:54,443 పరుగెత్తండి! పరుగెత్తండిరోయ్! 62 00:04:00,449 --> 00:04:03,410 దాని వెనక్కి! త్వరగా దాని వెనక్కి పదండి. 63 00:04:03,911 --> 00:04:04,995 త్వరగా! 64 00:04:09,416 --> 00:04:11,960 సరే మరి. ఇక్కడ మనకేమీ కాదులే. 65 00:04:50,749 --> 00:04:51,583 మ్యామథ్. 66 00:04:54,753 --> 00:04:55,712 కెవిన్! 67 00:04:56,713 --> 00:04:57,798 శాఫ్రాన్? 68 00:04:57,798 --> 00:05:00,384 ఇప్పటికి కనుగొన్నాను నిన్ను, కెవిన్. ఇప్పటికి కనుగొన్నాను. 69 00:05:00,384 --> 00:05:02,886 - కెవిన్. - నీ అన్నయ అయిన కెవినా? 70 00:05:02,886 --> 00:05:04,763 - అవును. - అవునా? 71 00:05:04,763 --> 00:05:06,348 సరే. సరే. 72 00:05:06,348 --> 00:05:10,018 శాఫ్రాన్, ఎలా... ఏంటి... ఎప్పుడు... 73 00:05:10,018 --> 00:05:14,147 అసలు... అసలు ఆ మ్యామథ్ ని నడుపుతూ ఏం చేస్తున్నావు? 74 00:05:14,147 --> 00:05:15,107 ఏంటి? 75 00:05:15,107 --> 00:05:19,528 మనుషులు మ్యామథ్లను నడిపినట్టు ఆధారాల్లేవని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. 76 00:05:19,528 --> 00:05:23,115 ఆ పురావస్తు శాస్త్రవేత్తలను గంగలో దూకమను, 77 00:05:23,115 --> 00:05:25,325 నేను మ్యామథ్ ని నడిపిస్తున్నా కదా? 78 00:05:25,325 --> 00:05:27,494 కెవిన్, మీ కుటుంబాన్ని కనుగొనేశాం. 79 00:05:27,494 --> 00:05:29,746 - నాకు సాయపడండి. థ్యాంక్యూ. - అది నా కుటుంబం... కాదు. 80 00:05:29,746 --> 00:05:31,373 మిమ్మల్ని కలవడం బాగుంది. మీ కోసమే వెతుకుతూ ఉన్నాం. 81 00:05:31,373 --> 00:05:32,958 - కాదు, వాళ్లు నా... - మీరందరూ ఒకేలా ఉన్నారు. 82 00:05:34,251 --> 00:05:36,295 నాపై ఆది మానవులు దాడి చేశారు. 83 00:05:36,295 --> 00:05:38,463 కాదు... ఇది అతని కుటుంబం. 84 00:05:38,463 --> 00:05:40,674 - మన్నించాలి. కాస్త పరుషంగా మాట్లాడా. - అయ్య బాబోయ్. 85 00:05:40,674 --> 00:05:42,634 ఈ సంత ఎక్కడ తగులుకుంది నీకు? 86 00:05:42,634 --> 00:05:45,179 కానీ, తను నా చెల్లెలు. 87 00:05:45,179 --> 00:05:47,639 - నీకు చెల్లి ఉందా? - చిరాకు తెప్పించే చెల్లెలా? 88 00:05:47,639 --> 00:05:49,600 - హేయ్! - నేను ఆ మాట ఎప్పుడూ అనలేదు. 89 00:05:49,600 --> 00:05:51,310 నేను ఆ మాట ఎప్పుడూ అనలేదు. 90 00:05:51,310 --> 00:05:53,395 లేదు, నా ఉద్దేశం, ఈ చిరాకు తెప్పించే అమ్మాయి, నీ చెల్లెలా అని. 91 00:05:53,395 --> 00:05:54,396 నన్ను రెచ్చగొడుతున్నావా? 92 00:05:54,396 --> 00:05:55,898 - లేదు. - తనని రెచ్చగొడుతున్నావా? 93 00:05:55,898 --> 00:05:57,357 - తనని రెచ్చగొడుతున్నావా? - లేదు. 94 00:05:57,357 --> 00:05:59,651 - గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా? - ఆపండి. అదేం లేదు. 95 00:05:59,651 --> 00:06:01,069 - లేదు. - విడ్జిట్. 96 00:06:01,069 --> 00:06:03,864 - ఏంటి? వాళ్లే మొదలుపెట్టారు. - హా, నువ్వు వదిలేయ్. 97 00:06:03,864 --> 00:06:05,490 హా. నీ నేస్తం చెప్పినట్టు విను. 98 00:06:05,490 --> 00:06:07,409 - వదిలేయ్! - వదిలేయ్, గురూ. 99 00:06:07,409 --> 00:06:09,661 - కానివ్వు, వదిలేయ్. - వదిలేయ్, గురూ. 100 00:06:11,121 --> 00:06:13,165 కెవిన్? 101 00:06:13,165 --> 00:06:15,709 - మనోడు మూర్ఛపోయాడు. - అతనికేమీ కాలేదులే. 102 00:06:40,901 --> 00:06:42,069 నీకు స్పృహ వచ్చేసిందా, అన్నయ్యా? 103 00:06:42,069 --> 00:06:43,445 హా. 104 00:06:44,905 --> 00:06:47,032 సరే, వీళ్ళని పరిచయం చేస్తా ఆగు. 105 00:06:47,699 --> 00:06:48,867 వీళ్లు ఫాజా, హౌలర్లు. 106 00:06:48,867 --> 00:06:51,453 చెప్పాలంటే వాళ్లే నన్ను చూసుకున్నారు. 107 00:06:51,453 --> 00:06:52,955 ఒక రకంగా, నా ఆదిమ జాతి తల్లిదండ్రులు అన్నమాట. 108 00:06:52,955 --> 00:06:54,122 నమస్తే. 109 00:06:54,122 --> 00:06:56,124 వాళ్లు టూత్ టూత్, మీట్ గర్ల్ లు. 110 00:06:57,167 --> 00:06:59,336 నీ దోస్తులైన ఈ కొత్తవారిని నాకు పరిచయం చేస్తావా? 111 00:06:59,336 --> 00:07:00,879 నాకేం పర్లేదు. 112 00:07:00,879 --> 00:07:03,382 వాళ్లు తమని తాము టైమ్ ట్రావెల్ బందిపోటులని పిలుచుకుంటుంటారు. 113 00:07:04,174 --> 00:07:06,426 టైమ్ ట్రావెల్ పిచ్చోళ్లలా ఉన్నారు. 114 00:07:06,426 --> 00:07:08,220 - హలో? - హా, హాయ్. 115 00:07:08,804 --> 00:07:09,763 ఈ పిల్లకి బాగా పొగరుందే. 116 00:07:09,763 --> 00:07:11,181 ఇక్కడికి ఎలా వచ్చావు? 117 00:07:11,181 --> 00:07:12,140 మ్యామథ్ ఎక్కి. 118 00:07:12,140 --> 00:07:13,475 అది కూడా తెలీదా, కెవిన్! 119 00:07:13,475 --> 00:07:15,143 - దద్దమ్మలా ఉన్నాడే. - దద్దమ్మలా ఉన్నాడే. 120 00:07:15,143 --> 00:07:18,981 మీట్ గర్ల్, టూత్ టూత్, నోర్మూసుకోండి. అతను నా అన్నయ్య. 121 00:07:18,981 --> 00:07:21,567 సారీ. హహ. 122 00:07:21,567 --> 00:07:23,485 నా ఉద్దేశం, టైమ్ ట్రావెల్ చేసి వెనక్కి ఎలా వచ్చావు అని. 123 00:07:23,485 --> 00:07:25,654 మాయగలదో, ఇంకేదైనా శక్తిగలదో నీ పడక గది ఉందిగా. దాని ద్వారా వచ్చా. 124 00:07:25,654 --> 00:07:29,366 ఆ తర్వాత నేను జనాలను, "ఈ పుస్తకాల పిచ్చోడిని చూశారా?" అని అడగడం మొదలుపెట్టా. దానికి వారు 125 00:07:29,366 --> 00:07:33,912 "చూశాం, విచిత్రమైన వ్యక్తులతో అటు వెళ్లాడు," అని సమాధానమిచ్చారు. విచిత్రమైన వాళ్లంటే మీరే కదా. 126 00:07:33,912 --> 00:07:34,997 అయ్యయ్యో. 127 00:07:35,497 --> 00:07:38,750 ఇది బొచ్చుగల రైనోసరస్. దీని కాలు విరిగింది. 128 00:07:39,543 --> 00:07:40,711 దీనికి మనం సాయం చేయలేమా? 129 00:07:41,211 --> 00:07:44,381 సరే, కానీ మనం దాన్ని ఉంచుకోలేం. పెంపుడు జంతువులేమీ వద్దు. పైగా అది చాలా పెద్దది. 130 00:07:44,381 --> 00:07:46,592 వాటిని నేను రైనోస్ యూనికార్న్స్ అని పిలుస్తా. 131 00:07:47,176 --> 00:07:51,305 కానీ అది యూనికార్న్ కాదు కదా? ఎందుకంటే, దానికి రెండు కొమ్ములున్నాయి. 132 00:07:51,305 --> 00:07:53,515 అయితే తొక్కలో "టూనికార్న్" అని పిలుద్దాం. 133 00:07:53,515 --> 00:07:54,433 కాదు. 134 00:07:54,433 --> 00:07:56,768 - అవును. అవును. అవును. - కాదు. కాదు. కాదు. 135 00:07:59,313 --> 00:08:01,899 నేను ఇక్కడే ఉంటున్నా. కాస్త మామూలుగా ఉండు. 136 00:08:04,776 --> 00:08:06,195 బాగానే ఉన్నావా, బిజ్జా? 137 00:08:10,073 --> 00:08:12,993 ఎలా ఉన్నావు, ఇగ్గీ? షీనా? 138 00:08:34,640 --> 00:08:35,557 శాఫ్. 139 00:08:35,557 --> 00:08:38,393 మాంబో 2 ఇక్కడే వేచి ఉండు. ఎక్కడికీ వెళ్లకు. 140 00:08:38,393 --> 00:08:41,020 ఎలా దిగాలో నాకు తెలీదు... శాఫ్. 141 00:08:48,737 --> 00:08:51,448 బిగ్గర స్వరమా, నీ లెక్క ఎలా సాగుతోంది? 142 00:08:51,448 --> 00:08:53,492 ఒకటి, రెండు, మూడు! 143 00:08:53,492 --> 00:08:54,826 అదరగొట్టేస్తున్నావు, బాసూ. 144 00:08:57,579 --> 00:08:58,413 హేయ్, గ్రంట్. 145 00:08:59,498 --> 00:09:01,166 ఇతను మా అన్నయ్య. 146 00:09:01,166 --> 00:09:02,376 హలో, "గ్రాంట్." 147 00:09:03,252 --> 00:09:06,255 లేదు. ముక్కాలి. అతను అలానే పలకరిస్తాడు. 148 00:09:09,842 --> 00:09:12,469 నియాన్ డెర్తల్స్ జనాలను ఇలాగే పలకరిస్తారా? 149 00:09:12,469 --> 00:09:14,054 అలా పదమూడేళ్ల పిల్లలు పలకరిస్తారు. 150 00:09:14,054 --> 00:09:15,222 జాత్యాహంకార బుద్ది పక్కకు పెట్టు. 151 00:09:18,642 --> 00:09:20,435 ఇవన్నీ నీకెలా తెలుసు? 152 00:09:20,435 --> 00:09:23,438 అనువాదకులు ఎవరూ లేకుండా వీళ్లతో ఎలా మాట్లాడగలుగుతున్నావు? 153 00:09:23,438 --> 00:09:26,066 మ్యామథ్ ని నడపడం ఎలా నేర్చుకున్నావు? 154 00:09:26,066 --> 00:09:27,568 ఈటెలను విసరడం కూడా ఎలా నేర్చుకున్నావు? 155 00:09:27,568 --> 00:09:29,611 అదీగాక, అందరూ నువ్వంటే ఎందుకు అభిమానం చూపిస్తున్నారు? 156 00:09:29,611 --> 00:09:32,072 నేను నేర్చుకున్నా. వీళ్లకు నేర్పించా. 157 00:09:32,072 --> 00:09:33,740 కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఎక్కువ కాలమేం అయ్యుండదే. 158 00:09:33,740 --> 00:09:35,826 నేను ఇక్కడికి ఎప్పుడో వచ్చా, కెవ్. 159 00:09:36,869 --> 00:09:39,580 నేను వచ్చి దాదాపుగా మూడేళ్లవుతోంది. 160 00:09:39,580 --> 00:09:41,290 ఏంటి? 161 00:09:46,545 --> 00:09:49,756 నేను ఇక్కడికి వచ్చి 32 నెలలైంది. ప్రతిరోజును ఇక్కడ గుర్తు పెట్టుకుంటూ ఉన్నా. 162 00:09:49,756 --> 00:09:51,258 నా చేతిని ట్రేస్ చేసుకున్నా. 163 00:09:51,258 --> 00:09:52,801 సూపర్, బిగ్గర స్వరమా. 164 00:09:52,801 --> 00:09:53,802 హా. 165 00:09:55,053 --> 00:09:56,930 ఈ చిన్ని ఎర్ర సర్కిల్స్ ఏంటి? 166 00:09:57,431 --> 00:09:58,807 అవి నా పుట్టినరోజులు. 167 00:09:59,766 --> 00:10:02,060 నేను నీ పుట్టినరోజులను మిస్ అయ్యానా? 168 00:10:02,561 --> 00:10:03,562 పర్వాలేదులే. 169 00:10:05,105 --> 00:10:06,356 ఓరి దేవుడా. 170 00:10:06,356 --> 00:10:08,233 అంటే, నేనే నీ కన్నా పెద్ద దాన్ని. 171 00:10:08,233 --> 00:10:10,694 శాఫ్, నేను నీకొకటి చెప్పాలి. 172 00:10:10,694 --> 00:10:12,029 నేనే పెద్ద దాన్ని. 173 00:10:12,029 --> 00:10:14,198 అంటే, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నోర్మూసుకోమని నీకు చెప్పవచ్చు. 174 00:10:14,198 --> 00:10:16,450 మొదట్నుంచీ నువ్వు ఆ పని చేస్తున్నావుగా. 175 00:10:16,450 --> 00:10:19,578 అంటే, అమ్మానాన్నలు ఇక్కడ లేరు కాబట్టి, ఇప్పుడు పెత్తనం నాదే. 176 00:10:20,329 --> 00:10:21,705 శాఫ్, అమ్మానాన్నలు... 177 00:10:21,705 --> 00:10:23,540 నీకన్నా పొడుగ్గా ఉన్నా. 178 00:10:24,124 --> 00:10:26,585 - శాఫ్... - ఈ క్షణాన్ని ఆస్వాదించనివ్వు, కెవిన్! 179 00:10:30,881 --> 00:10:34,426 - సరే. - నేను పెద్ద దాన్ని. పొడుగైన దాన్ని. 180 00:10:34,426 --> 00:10:36,470 నేను పెద్ద దాన్ని. పిస్తాని. 181 00:10:40,933 --> 00:10:43,393 దీన్ని నువ్వు ఒక్కడివే ఇక్కడికి తెచ్చి ఉండవచ్చు. 182 00:10:43,393 --> 00:10:46,647 పెనెలోపీ, నా కన్నీళ్లు గడ్డకట్టుకుపోయాయి, నాకేమీ కనిపించడం లేదు. 183 00:10:47,314 --> 00:10:49,107 ప్రతీ విషయంలో నేనే పిస్తాని. 184 00:10:49,107 --> 00:10:50,567 చిరాకు తెప్పించే నీ చెల్లి ఎలా ఉంది, కెవిన్? 185 00:10:50,567 --> 00:10:53,111 తనని ఇంత ఆనందంగా నేనెన్నడూ చూడలేదు. 186 00:10:53,111 --> 00:10:56,073 వంట ఇక్కడ చేస్తారా? అంతా మాంసమే తింటారా? 187 00:10:56,073 --> 00:10:57,241 - ఏంటి? - ఏమన్నావు? 188 00:10:58,992 --> 00:11:00,410 నాకు వీళ్లు పిచ్చపిచ్చగా నచ్చేశారు. 189 00:11:00,410 --> 00:11:02,037 వీళ్ళకు నేను నాటక రంగం గురించి నేర్పిస్తాను. 190 00:11:03,872 --> 00:11:05,582 ఇప్పుడు అంతా సర్దుకుంటుందిలే. 191 00:11:05,582 --> 00:11:07,376 నీకు తోడుగా బిటెలిగ్ ఉన్నాడు కదా. 192 00:11:08,085 --> 00:11:09,795 - ఇప్పుడు తినేద్దామా? - లేదు. 193 00:11:10,629 --> 00:11:11,547 ఇప్పుడు తిందామా? 194 00:11:11,547 --> 00:11:13,131 లేదు, మనం దీన్ని తినకూడదు. 195 00:11:14,132 --> 00:11:15,425 మనం దీన్ని కాపాడాలి. 196 00:11:15,425 --> 00:11:17,010 ఇప్పుడు తినడానికా? 197 00:11:17,010 --> 00:11:21,014 కాదు, కాదు. దీన్ని కాపాడి, ప్రాణాలు నిలబెడతాం అన్నమాట. 198 00:11:21,014 --> 00:11:22,891 భవిష్యత్తును ఇస్తాం అన్నమాట. 199 00:11:22,891 --> 00:11:24,810 - తర్వాతనా? - భవిష్యత్తు. 200 00:11:24,810 --> 00:11:26,103 ప్రతీ విషయంలో నేనే పిస్తాని. 201 00:11:26,103 --> 00:11:28,856 ఇప్పుడు చెప్పు, నీ కుటుంబంలో ఎక్కువ చిరాకు తెప్పించేది ఎవరు? 202 00:11:28,856 --> 00:11:30,983 - ప్రతీ విషయంలో నేనే పిస్తాని. - ఎక్కువగా తనే కదా? 203 00:11:30,983 --> 00:11:32,150 మీ ఇద్దరినీ పోల్చి చూస్తే, తనే అన్నమాట. 204 00:11:32,150 --> 00:11:34,820 పిస్తాని. ఏం చూస్తున్నావు? దొబ్బేయ్. 205 00:11:34,820 --> 00:11:36,905 నువ్వే దొబ్బేయ్... దొబ్బించుకో. దొబ్బేసుకో. 206 00:11:36,905 --> 00:11:39,700 లేదు, నువ్వే తట్టా బుట్టా సర్దుకొని, దొబ్బేయ్. 207 00:11:39,700 --> 00:11:40,951 దొబ్బేయ్. 208 00:11:40,951 --> 00:11:43,036 కొంపదీసి తను మనతో రాదు కదా? 209 00:11:45,706 --> 00:11:47,875 ఇక మనం చీఫ్ ని కలవాలి. 210 00:11:47,875 --> 00:11:52,629 అతను, పెదరాయుడిలా అన్నమాట, ఈ ఆది మానవులకి ప్రధాన మంత్రిలా అన్నమాట. 211 00:12:00,596 --> 00:12:01,471 బాగానే ఉన్నావా, శాఫ్, హా? 212 00:12:01,471 --> 00:12:02,598 బాగానే ఉన్నా. నువ్వు? 213 00:12:04,183 --> 00:12:06,476 ఇతను నా అన్నయ్య. ఇతని గురించే నీకు చెప్పాను. 214 00:12:09,521 --> 00:12:10,898 కెవిన్? 215 00:12:14,693 --> 00:12:15,694 హా. 216 00:12:15,694 --> 00:12:18,363 నేనేమీ అలా లొడలొడా మాట్లాడను. జనాలు ఎందుకలా అనుకుంటారో నాకు అర్థం కాదు. 217 00:12:18,363 --> 00:12:19,823 నేనేమీ... 218 00:12:21,033 --> 00:12:22,201 అంతే కదా? 219 00:12:22,201 --> 00:12:25,162 - హహ. - హహ. హహహ, అవును. 220 00:12:25,162 --> 00:12:28,332 నేను సోదిగాడినని అందరికీ చెప్పావా? 221 00:12:28,332 --> 00:12:30,000 కనీసం నీ గురించి మాట్లాడాను నేను. 222 00:12:30,959 --> 00:12:34,004 ఇతను ఈ అపరిచితులతో తిరుగుతుంటాడు. 223 00:12:37,883 --> 00:12:40,010 - అపరిచితులా? - హా, అది మేమే. 224 00:12:41,929 --> 00:12:45,349 శాఫ్, ఇక్కడికి అపరిచితులని తీసుకొచ్చావా? 225 00:12:45,349 --> 00:12:47,434 - అవునా? - అవును, సారీ. 226 00:12:53,148 --> 00:12:55,526 ఈ అమ్మాయిని మాతో పాటు తీసుకెళ్తాం. 227 00:12:56,360 --> 00:12:59,029 - శాఫ్ ని తీసుకెళ్తారా? - మీకు అది ఆనందదాయకమైన విషయమే అయ్యుంటుంది. 228 00:12:59,029 --> 00:13:04,868 లేదు. హహ. శాఫ్ మా మనిషి. అంతే కదా? 229 00:13:06,119 --> 00:13:07,871 తను నా చెల్లెలు. 230 00:13:07,871 --> 00:13:09,831 తను నాకు కూడా చెల్లెలే. 231 00:13:09,831 --> 00:13:11,959 నా చెల్లెలు. నా చెల్లెలు. నా చెల్లెలు. 232 00:13:11,959 --> 00:13:14,044 నేను మా అమ్మానాన్నలని చూడాలి కదా. 233 00:13:16,672 --> 00:13:20,592 మాకు శాఫ్ కావాలి. తను చాలా గొప్పది, కదా? అంతే కదా? 234 00:13:20,592 --> 00:13:21,552 శాఫ్ గొప్పది. 235 00:13:21,552 --> 00:13:23,846 - శాఫ్ చాలా గొప్పది. - మామూలు గొప్పది కాదు. హా. 236 00:13:23,846 --> 00:13:26,807 నేను చాలా గొప్ప దాన్ని, అర్థమైందా? నువ్వే చూస్తున్నావుగా. 237 00:13:26,807 --> 00:13:28,016 ఏ విధంగా? 238 00:13:28,600 --> 00:13:30,894 అంటే, అన్ని విధాలా. 239 00:13:30,894 --> 00:13:33,230 నేను సరదాగా మాట్లాడతాను. వాళ్లకి సరదాగా మాట్లాడటం ఎలాగో నేర్పించాను. 240 00:13:34,106 --> 00:13:35,691 కుర్చీని కనిపెట్టాను. 241 00:13:35,691 --> 00:13:39,903 చూడు. కత్తిలాంటి కుర్చీ, కదా? పుర్రె కూడా ఉంది దాని మీద. 242 00:13:41,446 --> 00:13:42,990 "యోలో." 243 00:13:44,449 --> 00:13:47,703 మనకి ఉండేది ఒక్కటే జీవితం. 244 00:13:48,203 --> 00:13:49,830 యోలో. 245 00:13:49,830 --> 00:13:51,248 - యోలో. - యోలో. 246 00:13:51,248 --> 00:13:52,624 యోలో. 247 00:14:03,927 --> 00:14:05,095 అతను ప్రదర్శన ఇస్తున్నాడు. 248 00:14:05,095 --> 00:14:06,388 నీ దగ్గరికే వస్తున్నాడు. 249 00:14:13,979 --> 00:14:15,022 అతను బెదిరిస్తున్నాడు. 250 00:14:16,231 --> 00:14:17,232 అవును, అదరగొట్టేస్తున్నాడు. 251 00:14:24,156 --> 00:14:25,949 - సవాలును స్వీకరిస్తున్నా. - ఏంటి? 252 00:14:25,949 --> 00:14:27,451 లేదు, లేదు, నేనేమీ సవాలు చేయలేదు... 253 00:14:27,451 --> 00:14:29,453 నిజం చెప్తున్నా, నువ్వు సవాలు చేశావు. 254 00:14:29,453 --> 00:14:32,206 అతను "నిజం చెప్తున్నా, నువ్వు సవాలు చేశావు," అని అంటున్నాడు. 255 00:14:32,206 --> 00:14:34,082 లేదు, లేదు. అది నమస్కారం చెప్పడం అనుకున్నా. 256 00:14:34,082 --> 00:14:37,878 నువ్వు మరొక నాయకురాలివి కాబట్టి, నీ వల్ల అతని నాయకత్వానికి ప్రమాదమని అనుకుంటున్నాడు. 257 00:14:37,878 --> 00:14:40,672 అది చాలా పెద్ద విషయం. పురుషాధిక్యత లాంటిదే అనుకో. 258 00:14:40,672 --> 00:14:44,259 అది సరే. కానీ, నేనేమీ నాయకురాలిని కాదు. 259 00:14:44,259 --> 00:14:45,677 లేదు, నువ్వు నాయకురాలివే. 260 00:14:45,677 --> 00:14:46,678 - కాదు. - నువ్వు నాయకురాలివే. 261 00:14:46,678 --> 00:14:48,055 అతని మాటలు నాకు అర్థమవుతున్నాయిలే. 262 00:14:48,055 --> 00:14:49,765 కానీ మేము ఓట్లు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. 263 00:14:49,765 --> 00:14:51,433 నువ్వు నాయకురాలివే, ఎందుకంటే అదే పద్ధతి, 264 00:14:51,433 --> 00:14:53,227 కాబట్టి నువ్వే నాయకురాలివి. అంతే కదా? 265 00:14:54,019 --> 00:14:55,646 నేను నాయకురాలిని కాదు. 266 00:14:55,646 --> 00:14:58,023 - నువ్వే నాయకురాలివి, అంతే కదా? నువ్వే. - కాదు, కానీ... 267 00:14:58,023 --> 00:14:59,233 అతనికి నువ్వంటే ఇష్టం లేదు. 268 00:14:59,233 --> 00:15:00,734 అది నాకు అర్థమవుతోంది. 269 00:15:00,734 --> 00:15:03,779 అవును, నువ్వే నాయకురాలివి. 270 00:15:03,779 --> 00:15:05,614 - నేను... సరే, అలాగే. - వదిలేసేయ్. 271 00:15:05,614 --> 00:15:07,658 - ఇక్కడితో ముగిసిపోలేదు. ఏమంటారు? - సరే. 272 00:15:07,658 --> 00:15:09,034 ఇక మనం వెళ్దాం. 273 00:15:09,034 --> 00:15:10,577 - తర్వాత కలుద్దాం. - సరే. 274 00:15:14,289 --> 00:15:15,457 సరే. 275 00:15:15,457 --> 00:15:17,918 ఇంకా ఇది ముగిసిపోలేదు! 276 00:15:21,922 --> 00:15:26,552 టూనికార్న్, ఇప్పుడు నీ కాలిని సరైన స్థానంలోకి అమర్చుతాం, కాబట్టి నీకు కాస్త నొప్పి కలగవచ్చు. 277 00:15:26,552 --> 00:15:29,137 నా దగ్గర కావాల్సినవన్నీ ఉన్నాయి. 278 00:15:29,137 --> 00:15:34,184 కాబట్టి నువ్వేమీ కంగారుపడకు. భయపడాల్సిన పని లేదు. 279 00:15:36,770 --> 00:15:37,980 సిద్ధంగా ఉన్నావా? 280 00:15:41,608 --> 00:15:44,278 నువ్వు సిద్ధంగా లేవా? సరే. 281 00:15:44,278 --> 00:15:47,197 హా, నేను సిద్ధంగా ఉన్నా, కానీ నువ్వు సిద్ధంగా లేవు. పర్వాలేదులే. 282 00:15:47,197 --> 00:15:48,407 ఈ పని తర్వాత చేద్దాం. 283 00:15:48,907 --> 00:15:53,996 హా, ఈ పని ఇది సిద్ధంగా ఉన్నప్పుడు చేద్దాంలే... 284 00:15:53,996 --> 00:15:55,789 - ఇప్పుడు తిందాం. - వద్దు. 285 00:15:55,789 --> 00:15:58,292 ఇప్పుడే తినేద్దామా? 286 00:15:58,292 --> 00:15:59,376 తినే ఆలోచన వద్దు. 287 00:15:59,376 --> 00:16:00,419 - వద్దు. - కోసి తిందాం. 288 00:16:00,419 --> 00:16:01,420 ఇక్కడి నుండి బయలుదేరండి. 289 00:16:02,588 --> 00:16:03,422 దరిద్రుడా. 290 00:16:04,756 --> 00:16:06,258 - "శాస్క్వాచ్." - నా పేరు శాఫ్రాన్. 291 00:16:06,258 --> 00:16:07,342 అవును, అదే. 292 00:16:07,342 --> 00:16:11,388 చీఫ్ ఉద్దేశం ఏంటి... అదే... "సవాలు" అంటే? 293 00:16:11,388 --> 00:16:12,472 కంగారుపడాల్సిన పని లేదు. 294 00:16:12,472 --> 00:16:14,683 - బాహాబాహి పోరు అయ్యుంటుందేమో. - ఏంటి? 295 00:16:14,683 --> 00:16:16,351 మీరు నన్ను తీసుకెళ్లాలని చూస్తున్నారు కదా. 296 00:16:16,351 --> 00:16:19,605 - ముష్టియుద్ధం ఏమో. జంతువుతో పోరాడటమేమో. - ఏంటి? 297 00:16:19,605 --> 00:16:21,773 గడ్డకట్టుకుపోయేంత చల్లగా ఉండే సరస్సులోకి విసిరేయడం. 298 00:16:21,773 --> 00:16:23,150 ఏంటి? 299 00:16:23,150 --> 00:16:24,568 నువ్వు ఎన్ని కొరడా దెబ్బలు తినగలవో చూడటం. 300 00:16:24,568 --> 00:16:26,945 ఏంటి... అయ్య బాబోయ్. మనం వెళ్లిపోతే మంచిది అనుకుంటా. 301 00:16:26,945 --> 00:16:28,780 - నేను కూడా ఏకీభవిస్తున్నా. - బయట ఉంటే రాత్రి చస్తారు. 302 00:16:28,780 --> 00:16:30,741 హా, అవును, మనం బయట ఉంటే బతకలేం. 303 00:16:30,741 --> 00:16:31,658 అతను చెప్పింది నిజమే. 304 00:16:31,658 --> 00:16:35,204 ఏదేమైనా, రాత్రి చల్లగా అయిపోతుంది కాబట్టి, మీకు ఇవి అవసరం అవుతాయి. 305 00:16:35,204 --> 00:16:37,456 రాత్రి వేళ ఏంటి? ఇప్పుడు కూడా చల్లగానే ఉంది కదా. 306 00:16:37,456 --> 00:16:40,626 హా, ఇది మంచు యుగం, వెచ్చని, సౌకర్యవంతమైన యుగం కాదు. 307 00:16:40,626 --> 00:16:41,919 ఇది చాలా బాగుంది. 308 00:16:42,669 --> 00:16:43,504 కంపు కొడుతున్నాయి ఇవి. 309 00:16:43,504 --> 00:16:45,172 ఏంటి నీ సమస్య? 310 00:16:45,172 --> 00:16:47,424 నువ్వెవరో అతనికి తెలీదు కదా, అందుకని నువ్వంటే అతనికి ఇష్టం లేదు. 311 00:16:47,424 --> 00:16:49,343 హా, నాకు అతను తెలుసు, అందుకని అతనంటే నాకు ఇష్టం లేదు. 312 00:16:59,311 --> 00:17:00,145 ఏంటిది? 313 00:17:00,145 --> 00:17:01,813 నిన్ను వెచ్చగా ఉంచే వస్త్రం అది. 314 00:17:01,813 --> 00:17:03,232 నన్ను వెచ్చగా ఉంచుతుందా ఇది? 315 00:17:04,441 --> 00:17:05,651 సారీ. 316 00:17:07,819 --> 00:17:10,696 కానీ, నేను టూనికార్న్ ని చూసుకుంటూ బిజీగా ఉండిపోయా. 317 00:17:10,696 --> 00:17:12,406 అది యూనికార్న్ కాదు. 318 00:17:12,406 --> 00:17:13,492 మాకు యూనికార్నే అది. 319 00:17:13,492 --> 00:17:15,618 అది మాకు యూనికార్నే, కెవిన్. అద్భుతమైన జంతువు అది. 320 00:17:15,618 --> 00:17:17,287 - అది యూనికార్న్ కాదు. - నోర్మూసుకో. 321 00:17:17,287 --> 00:17:19,164 - అది యూనికార్న్ కాదు. కాదు. - నోర్మూసుకో. నోర్మూసుకో. 322 00:17:19,164 --> 00:17:21,458 - శాఫ్. - కెవిన్, నోర్మూసుకో. 323 00:17:23,710 --> 00:17:24,962 అతడిని కొండ మీద నుండి తోసేద్దాం. 324 00:17:26,003 --> 00:17:27,005 వద్దు. 325 00:17:28,257 --> 00:17:29,883 కానీ థ్యాంక్స్, హౌలర్. 326 00:17:37,349 --> 00:17:40,978 పెట్టవద్దు. అది చాలా వేడిగా ఉంటుంది. గుర్తుందా? వేడిగా ఉంటుంది. 327 00:17:41,728 --> 00:17:43,272 - చేయి కాలిపోతుంది. - అవును కదా? 328 00:17:43,272 --> 00:17:44,481 అవును. కాలుతుంది. 329 00:17:47,901 --> 00:17:50,112 - ఇప్పుడే చెప్పా కదా, దాన్ని తాకవద్దని. - సారీ. 330 00:17:50,696 --> 00:17:52,739 అంతా సర్దుకుంటుందిలే. 331 00:17:53,615 --> 00:17:55,450 నీ కాలును మేము బాగు చేస్తాం. 332 00:17:55,951 --> 00:17:59,663 నువ్వు మళ్లీ నడవగలవు. అవును. 333 00:18:00,914 --> 00:18:03,333 మేము సూసన్ ని కోల్పోయాం, జూడీని కోల్పోయాం. 334 00:18:03,834 --> 00:18:06,420 నిన్ను కోల్పోయే ప్రసక్తే లేదు, మిత్రమా. 335 00:18:07,087 --> 00:18:10,757 శాఫ్, నేను నీకొకటి చెప్పాలి. 336 00:18:11,508 --> 00:18:14,136 ఇది చెప్పడం కష్టంగా ఉంది, కానీ... 337 00:18:14,136 --> 00:18:15,053 ఆగు. 338 00:18:15,053 --> 00:18:16,972 పెదరాయుడు వచ్చాడు. 339 00:18:19,391 --> 00:18:22,644 - అయ్య బాబోయ్. మనోడు వచ్చాడు. - పెనెలోపీ. 340 00:18:24,021 --> 00:18:25,230 గుహలో మనం కలిసిన వాడు వచ్చాడు. 341 00:18:25,230 --> 00:18:27,316 హా, నేను గుర్తుపట్టా అతడిని. 342 00:18:27,316 --> 00:18:28,650 అతను నిన్నే చూస్తున్నాడు. 343 00:18:30,986 --> 00:18:32,070 నేనేం చేశానో తెలీట్లేదు. 344 00:18:32,070 --> 00:18:33,822 నువ్వేం చేయలేదు, పెనెలోపీ. 345 00:18:33,822 --> 00:18:34,740 థ్యాంక్యూ. 346 00:18:34,740 --> 00:18:37,409 నిన్ను చూస్తే జనాలకు, జంతువులకు ఎందుకో అదోలా అనిపిస్తుంది. 347 00:18:37,409 --> 00:18:38,577 అంటే? 348 00:18:38,577 --> 00:18:40,162 చూడు. అతను నిన్ను తదేకంగా చూస్తున్నాడు. 349 00:18:40,162 --> 00:18:41,246 ఏంటి? 350 00:18:44,833 --> 00:18:45,709 నన్ను ఐటెమ్ ని చేస్తున్నావా? 351 00:18:46,877 --> 00:18:49,004 - ఏంటి? - నన్ను ఐటెమ్ ని చేస్తున్నావా? 352 00:18:49,922 --> 00:18:51,048 అంటే ఏంటి? 353 00:18:51,048 --> 00:18:52,382 తనని ఐటెమ్ చేస్తున్నావని అనుకుంటున్నాడు. 354 00:18:52,382 --> 00:18:53,842 అంటే అర్థం ఏంటి అసలు? 355 00:18:53,842 --> 00:18:57,054 నువ్వు అతడిని ఐటెమ్ చేస్తున్నావని అనుకుంటున్నాడు. అంటే, అతడిని ఐటెమ్ లా చూస్తున్నావట. 356 00:18:58,263 --> 00:19:00,682 - అంటే ఏంటి అసలు? - అతడిని వెధవని చేయడం. 357 00:19:00,682 --> 00:19:02,518 నన్ను ఐటెమ్ ని చేస్తున్నావా? అంతేనా? 358 00:19:02,518 --> 00:19:05,854 - నన్ను ఐటెమ్ ని చేస్తున్నావు, కదా? - కదా? "కాదా"? "కాదు కదా"? 359 00:19:05,854 --> 00:19:07,564 - హా! - నేనేమీ చేయట్లేదు. ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. 360 00:19:07,564 --> 00:19:08,857 దీని నుండి బయటపడే మార్గం ఏమైనా ఉందా? 361 00:19:08,857 --> 00:19:11,235 శాఫ్, నీకు నేను ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. 362 00:19:11,235 --> 00:19:13,320 లేదు. నేనేమీ... నేను వెక్కిరించడం లేదు. 363 00:19:13,320 --> 00:19:15,531 - ఏం జరిగింది ఇప్పుడు? - మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందామా? 364 00:19:15,531 --> 00:19:18,825 - సరే. - కెవిన్, నన్ను ఒక్క దాన్నే వదిలేసి వెళ్లకు... 365 00:19:19,368 --> 00:19:20,744 నువ్వు... సరే. 366 00:19:34,967 --> 00:19:37,886 శాఫ్, నేను అమ్మానాన్నల గురించి చెప్పాలి. 367 00:19:38,595 --> 00:19:40,681 నేను వాళ్లని మిస్ అవుతున్నా. నువ్వు మిస్ అవుతున్నావా? 368 00:19:41,223 --> 00:19:43,892 అంటే, నేను మిస్ అయినంత కాలం నువ్వు మిస్ కాలేదు, కాబట్టి నీకు పర్వలేదు. 369 00:19:43,892 --> 00:19:45,936 అయినా కానీ నువ్వు వాళ్లని మిస్ అవుతున్నావు కదా? అంటే... 370 00:19:48,772 --> 00:19:49,606 ఏంటవి? 371 00:19:49,606 --> 00:19:52,651 ఇవి వాళ్లే. ఒకటి అమ్మ, ఒకటి నాన్న. 372 00:19:54,486 --> 00:19:55,571 బొగ్గు ముద్దలు కదా అవి. 373 00:19:56,280 --> 00:19:58,949 - అవును. చాలా దారుణం. - "చాలా దారుణమా?" 374 00:19:58,949 --> 00:20:00,492 ఏమైంది వాళ్లకి? 375 00:20:00,492 --> 00:20:02,786 ఒక రాకాసి వాళ్లని బొగ్గు ముద్దల్లా మార్చేసింది. 376 00:20:02,786 --> 00:20:04,872 రాకాసా? ఏంటి? 377 00:20:06,164 --> 00:20:07,624 దానికి ఒక రకంగా కారణం నువ్వేనా? 378 00:20:10,002 --> 00:20:11,670 నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. 379 00:20:14,256 --> 00:20:15,090 వాళ్లు చనిపోయారా? 380 00:20:15,883 --> 00:20:17,217 అవును. 381 00:20:17,217 --> 00:20:19,970 కానీ మా దగ్గర ఒక మ్యాప్ ఉంది, దాని ద్వారా టైమ్ ట్రావెల్ చేయగలం. 382 00:20:19,970 --> 00:20:23,223 మేము ఏమనుకుంటున్నామంటే, సరైన ద్వారం కనుగొనగలిగితే, మేము... 383 00:20:23,223 --> 00:20:24,975 ఆ రాక్షసుడిని కనుగొని, వాడి మక్కెలు విరగ్గొట్టండి. 384 00:20:24,975 --> 00:20:28,020 రాక్షసుడు కాదు, రాక్షసి. లింగ భేదాలు చూపకు. 385 00:20:28,770 --> 00:20:31,481 అది కాదు, వాళ్ల చావును ఆపవచ్చని చెప్తున్నా. 386 00:20:31,481 --> 00:20:35,152 ఆ రాకాసికి, నారింజ రంగులో మెరిసే కళ్లు, పిచిక గూడు లాంటి జుట్టు ఉంటుందా? 387 00:20:35,152 --> 00:20:37,738 నువ్వు తనని చూశావా? మన ఇంట్లో చూశావా? 388 00:20:37,738 --> 00:20:41,450 కాదు. ఆ పిచ్చిది ఓ అడవిలో నన్ను వెంబడించింది. 389 00:20:41,450 --> 00:20:42,910 నాకు తిక్క కలిగించింది. 390 00:20:44,369 --> 00:20:46,246 - తను భయంకరంగా ఉంటుంది. - తనే. 391 00:20:46,246 --> 00:20:48,832 ఇప్పుడు కనుక తను నా మీద దాడి చేస్తే, తనకి చావే. 392 00:20:48,832 --> 00:20:50,000 తను చాలా శక్తిమంతమైనది. 393 00:20:50,000 --> 00:20:53,921 నేనొక ఈటెని అందుకుంటాను. ఆ తర్వాత నా మిత్రులైన కాగాని, మీట్ గర్ల్ ని, స్కార్లెట్ ని పిలుస్తాను. 394 00:20:53,921 --> 00:20:57,341 వాళ్లు నాకు స్కూల్ లో పరిచయం. ఇక ఆ రాకాసికి దడేల్, డమాల్, దబ్బిడి దిబ్బిడే. 395 00:20:57,341 --> 00:20:58,967 తను ఒక రాకాసి, శాఫ్. 396 00:21:04,014 --> 00:21:07,059 ఆ సంఘటన జరిగినప్పటి నుండి అమ్మానాన్నలను చేరుకోవాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నా. 397 00:21:07,059 --> 00:21:09,311 కానీ ఎలా చేరుకోవాలో తెలీదు. 398 00:21:09,311 --> 00:21:10,979 ఎక్కడికి వెళ్లాలో తెలీదు. 399 00:21:10,979 --> 00:21:12,523 ఎప్పుడు వెళ్లాలో తెలీదు. 400 00:21:12,523 --> 00:21:14,107 అసలు అది సాధ్యమో కాదో కూడా నాకు తెలీదు. 401 00:21:15,317 --> 00:21:16,902 ఆశలు వదిలేసుకున్నాననే చెప్పాలి. 402 00:21:19,571 --> 00:21:21,323 నేను అయితే నిజంగానే వదిలేసుకున్నా, కెవిన్. 403 00:21:22,157 --> 00:21:24,117 ఇక్కడి నుండి బయటపడే మార్గం కనుగొనలేకపోయాను. 404 00:21:24,117 --> 00:21:28,121 వెతికాను, వెతికాను, చాలా వెతికాను. ఇక అలసిపోయి, ఆశలు వదిలేసుకున్నా. 405 00:21:28,789 --> 00:21:30,123 ముందు బతికి ఉండటంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. 406 00:21:31,416 --> 00:21:32,918 కానీ ఇప్పుడు ఒకరినొకరం కలుసుకున్నాం. 407 00:21:32,918 --> 00:21:34,586 అమ్మానాన్నలను ఇద్దరం కలిసి కనిపెడదాం, అంతే కదా? 408 00:21:34,586 --> 00:21:36,171 హా. 409 00:21:36,171 --> 00:21:37,548 - అంతే కదా? - హా. 410 00:21:37,548 --> 00:21:39,174 మనం ఎట్టి పరిస్థితుల్లో ఆశలు వదులుకోకూడదు. 411 00:21:40,133 --> 00:21:41,927 ఓసారి నీ పిచ్చి స్నేహితులని చూడు. 412 00:21:43,345 --> 00:21:45,305 ఇలా ఏమో. 413 00:21:46,056 --> 00:21:47,558 లేకపోతే ఇలా ఏమో. 414 00:21:48,100 --> 00:21:50,811 ఇప్పుడు నేను లేడీ క్యాపులెట్ ని. "ఇక పడకెక్కి విశ్రమించండి, మీకు అది చాలా ముఖ్యం." 415 00:21:50,811 --> 00:21:53,564 ఇప్పుడు జ్యూలియెట్ పాత్ర పోషిస్తా. కంగారుపడకు, మీట్ గర్ల్. ఆ రోజంటూ వస్తే, ఆ అవకాశం నీకే. 416 00:21:53,564 --> 00:21:57,234 వాళ్లు ఎందుకూ పనికి రాని బఫూన్ల వేషం వేసుకొన్న, పిల్లలని ఎత్తుకుపోయే వాళ్లలా ఉన్నారు. 417 00:21:57,234 --> 00:22:00,654 కానీ, మళ్లీ ఆ యూనికార్న్ లేచి నడిచే దాకా అతను పట్టు విడవడు. 418 00:22:00,654 --> 00:22:03,615 ఈ ఆది మానవులకి నటన నేర్పించే దాకా ఇతను పట్టు విడవడు. 419 00:22:04,575 --> 00:22:06,702 ఇక వాళ్లక్కడ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 420 00:22:06,702 --> 00:22:09,580 నువ్వు నన్ను బాగా ఐటెమ్ ని చేస్తున్నావు కదా? 421 00:22:09,580 --> 00:22:11,206 కానీ వాళ్లు పట్టు విడవరు. 422 00:22:11,206 --> 00:22:12,165 మనం కూడా అంతే. 423 00:22:12,165 --> 00:22:15,335 రేపు వెళ్లి ఆ ద్వారం ఎక్కడుందో కనుగొందాం. 424 00:22:15,335 --> 00:22:17,671 మన అమ్మానాన్నలని తప్పక కాపాడతాం. 425 00:22:17,671 --> 00:22:19,339 - అవును. - అవును. 426 00:22:21,800 --> 00:22:23,177 మనం పట్టు విడవకూడదు. 427 00:22:24,678 --> 00:22:26,180 నీ మిత్రుల్లానే. 428 00:22:26,180 --> 00:22:29,433 ఇది నా వల్ల కాదు. నాకు చికిత్స ఎలా చేయాలో తెలీదు. 429 00:22:30,809 --> 00:22:34,062 నేను పట్టు విడిచేస్తున్నా, టూనికార్న్. నేను పట్టు విడిచేస్తున్నా. 430 00:22:34,062 --> 00:22:35,689 - నేను బతికే ఉన్నా, అర్థమవుతోందా? - నువ్వు చచ్చావు. 431 00:22:35,689 --> 00:22:39,776 లేదు, నాటికలోని జ్యూలియెట్ చచ్చాడు, కానీ నేను బతికే ఉన్నాను. దాన్ని నటన అని అంటారు. 432 00:22:39,776 --> 00:22:41,528 - నువ్వు చనిపోయావు! - బాబోయ్. మీకు అర్థం కావట్లేదు. 433 00:22:41,528 --> 00:22:44,031 - నువ్వు చనిపోయావు! - మీకు అర్థమవ్వట్లేదు... నేను వదిలేస్తున్నా. 434 00:22:44,031 --> 00:22:46,074 - నేను వదిలేస్తున్నా. - నన్ను ఐటెమ్ చేస్తున్నావా? 435 00:22:47,201 --> 00:22:49,369 - "చిఫాన్." - నువ్వు నన్ను బాగా వెక్కిరిస్తున్నావు. 436 00:22:49,369 --> 00:22:52,456 - ఓరి నాయనోయ్. అతను మళ్లీ నీ స్నేహితురాలి మీద పడ్డాడు. - నన్ను వెక్కిరిస్తున్నావా? 437 00:22:52,456 --> 00:22:54,374 సవాలు విషయంలో తనతో తేల్చుకొనే సమయం ఆసన్నమైంది. 438 00:22:55,792 --> 00:22:57,211 లేదు! 439 00:22:57,211 --> 00:23:03,342 శాఫ్ ని తీసుకుపోవాలంటే "పెనెపొలీ" ఏదోక సవాలును ఎంచుకోవాలి, అంతే కదా? 440 00:23:04,426 --> 00:23:05,469 ఎంచుకోవాలి, అంతే కదా? 441 00:23:05,469 --> 00:23:07,554 నువ్వు ఒక సవాలును ఎంచుకోవాలి. 442 00:23:07,554 --> 00:23:10,057 లేదంటే, నేను మీతో రాలేను. 443 00:23:13,143 --> 00:23:16,021 కాబట్టి, నువ్వు కాగాతో ముష్టి యుద్ధమైనా చేయాలి, లేదా... 444 00:23:16,939 --> 00:23:18,690 కాగా వజ్రం కన్నా గట్టిది. 445 00:23:18,690 --> 00:23:20,234 తను నిన్ను మట్టికరిపించేస్తుంది. 446 00:23:20,234 --> 00:23:22,486 మట్టికరిపించి పారేస్తా. 447 00:23:22,486 --> 00:23:25,989 - కాగా! - ఆహా? 448 00:23:25,989 --> 00:23:28,492 లేదా నువ్వు దడ పుట్టించే నడక సాగించాల్సి ఉంటుంది. 449 00:23:29,076 --> 00:23:30,827 సరే. దడ పుట్టించే నడక అంటే? 450 00:23:30,827 --> 00:23:31,745 ఏదో భయంకరమైనదిలా ఉంది. 451 00:23:31,745 --> 00:23:34,998 నువ్వు ఆ బండరాయి దాకా వెళ్లి, మళ్లీ ఇక్కడికి రావాలి. ఒంటరిగా. 452 00:23:37,501 --> 00:23:39,211 మరి అందులో ప్రమాదమేముంది? 453 00:23:39,211 --> 00:23:42,339 అంటే, ఇవాళ ఉదయం నేను ఫ్రెష్ మింట్స్ ప్యాకెట్ ని 454 00:23:42,339 --> 00:23:46,677 ఒక కేవ్ లయన్ మీదకి విసిరాను, అది ఇంకా ఈ దగ్గర్లోనే ఉందనుకుంటా. 455 00:23:46,677 --> 00:23:48,929 - బయలుదేరు. - బయలుదేరు. 456 00:23:48,929 --> 00:23:50,347 - సరే. అలాగే. - బయలుదేరు. కానివ్వు. 457 00:23:50,347 --> 00:23:51,765 ఇక కానివ్వు. 458 00:24:00,232 --> 00:24:01,692 బాగా చీకటిగా ఉందే. 459 00:24:03,902 --> 00:24:05,904 దీని వల్ల పెద్దగా లాభం లేదు, కదా? 460 00:24:06,780 --> 00:24:08,907 తను బతుకుతుందా? 461 00:24:09,616 --> 00:24:11,743 జంతువులతో తను పోరాడగలిగితే బతకగలుగుతుంది. 462 00:24:14,830 --> 00:24:16,874 నాకు బాగా చలిగా ఉంది, విడ్జిట్. 463 00:24:16,874 --> 00:24:18,542 చలికి చచ్చిపోయేలా ఉన్నా, గురూ. 464 00:24:19,042 --> 00:24:20,961 హా, నా పరిస్థితి కూడా అలాగే ఉంది, బిటెలిగ్. 465 00:24:22,671 --> 00:24:25,674 ఈ వస్త్రం నాకు అస్సలు సరిపోదు, కదా? 466 00:24:25,674 --> 00:24:27,176 అవును. అస్సలు సరిపోదు. 467 00:24:29,219 --> 00:24:30,220 చూడు... 468 00:24:31,555 --> 00:24:33,932 కానీ మనం మరింత ఉన్నిని సంపాదించే మార్గం ఒకటుంది. 469 00:24:33,932 --> 00:24:35,976 - అవునా? ఏంటి ఆ మార్గం? - హా. 470 00:24:47,029 --> 00:24:48,071 లేదు. 471 00:24:51,408 --> 00:24:55,621 నన్ను బెదిరించగలవని అనుకుంటున్నావా! అది కూడా ఒక నియాన్ డెర్తల్ అయ్యుండి. 472 00:24:56,413 --> 00:24:59,958 నాపైనే గుర్రుమంటున్నావే. తిరిగి నేను కూడా గుర్రుమనగలను. 473 00:25:00,459 --> 00:25:02,336 నేను గుర్రుమంటే అలా ఉంటుంది, సరేనా? 474 00:25:04,004 --> 00:25:05,214 ఇంతకీ ఎక్కడ ఉన్నాను నేను? 475 00:25:07,508 --> 00:25:08,467 నాకు తెలీదు. 476 00:25:09,426 --> 00:25:10,427 సరే. 477 00:25:12,763 --> 00:25:15,849 అడుగుల గుర్తులు. ఇక్కడ, అక్కడ ఉన్నాయి. 478 00:25:17,434 --> 00:25:19,478 హా! నాయకురాలివి అంటే నువ్వే. నన్ను మించిన నాయకులెవరూ ఉండరు. 479 00:25:20,979 --> 00:25:22,231 బాబోయ్. అది మంచు, అంతే. 480 00:25:22,231 --> 00:25:23,690 మరేం పర్వాలేదు. 481 00:25:23,690 --> 00:25:26,735 చూశారా? దడ పుట్టించే నడకంటే నాకేం దడ లేదు. 482 00:25:26,735 --> 00:25:29,363 నేను అగ్గిపిడుగుని. 483 00:25:29,363 --> 00:25:31,865 నాకు భయమంటే ఏంటో తెలీదు. నా డిక్షనరీలో అసలు ఆ పదమే లేదు. 484 00:25:33,283 --> 00:25:34,701 భయమంటే అదేనేమో. 485 00:25:39,957 --> 00:25:43,168 లేదు, అది నా వల్ల కాదు. ఆ "రైనోకెలొస్" అంటే నాకు చాలా ఇష్టం. 486 00:25:43,168 --> 00:25:44,378 అది నాకు తెలుసు, బాసూ. 487 00:25:44,378 --> 00:25:46,922 నేను దాని కళ్లను చూశాను, విడ్జిట్. 488 00:25:46,922 --> 00:25:49,716 అదంటే నాకు ప్రాణం. ఆ పని నేను చేయలేను. 489 00:25:49,716 --> 00:25:52,177 ఆ జంతువును చంపకపోతే, మనం చస్తాం. 490 00:25:53,095 --> 00:25:57,224 ఈ కొండ మనుషులకి బొచ్చు బాగా ఉంది, వాళ్లు తట్టుకోగలరు. 491 00:25:57,850 --> 00:25:59,518 కానీ, ఈ చలికి నేను తట్టుకోలేను. 492 00:26:00,143 --> 00:26:01,395 ఓసారి ఆల్టోని చూడు. 493 00:26:02,646 --> 00:26:04,273 ఇతను ఈ లోకం వదిలి వెళ్లిపోయేలా ఉన్నాడు. 494 00:26:04,273 --> 00:26:05,816 విడ్జిట్, అతను ఎక్కడికి వెళ్తున్నాడు? 495 00:26:05,816 --> 00:26:07,401 నా నోటితో చెప్పించకు. 496 00:26:07,901 --> 00:26:10,404 - అది ఎలా ఉందో ఇంకోసారి చూస్తాను. - సరే. 497 00:26:25,502 --> 00:26:27,004 అక్కడే ఉంది అది. 498 00:26:27,504 --> 00:26:28,547 సరే మరి. 499 00:26:46,440 --> 00:26:47,900 యమ కింకరుని కళ్లు. 500 00:26:50,944 --> 00:26:52,863 అవి నన్నే చూస్తున్నాయి. 501 00:26:54,489 --> 00:26:57,075 నన్ను క్షమించు. 502 00:26:57,075 --> 00:27:01,455 నీ మీదకి ఫ్రెష్ మింట్స్ ప్యాకెట్ వేసి... 503 00:27:02,164 --> 00:27:03,874 నీ తలని గాయపరిచాను. 504 00:27:04,708 --> 00:27:05,959 క్షమించేయ్. 505 00:27:08,003 --> 00:27:09,463 దయచేసి నన్ను క్షమించు. 506 00:27:10,172 --> 00:27:13,342 నేను... పర్వాలేదా నేను ఇలా... 507 00:27:14,718 --> 00:27:15,719 నేను ఇప్పుడు... 508 00:27:18,472 --> 00:27:20,057 హమ్మయ్య. పని అయిపోయింది. బై-బై. 509 00:27:20,057 --> 00:27:24,561 యమ కింకరుని కళ్లు. యమ కింకరుని కళ్లు. యమ కింకరుని కళ్లు. 510 00:27:24,561 --> 00:27:25,896 యమ కింకరుని కళ్లు. 511 00:27:33,695 --> 00:27:38,867 యమ కింకరుని కళ్లు. యమ కింకరుని కళ్లు. 512 00:28:13,694 --> 00:28:16,989 యమ కింకరుని కళ్లు. 513 00:28:39,928 --> 00:28:41,221 నువ్వు దీన్ని చంపలేకపోయావు కదా? 514 00:28:43,932 --> 00:28:44,933 లేదు. 515 00:28:44,933 --> 00:28:48,061 సరే మరి, బయలుదేరే సమయం వచ్చేసింది, వెర్రి పుష్పాలారా. 516 00:28:48,061 --> 00:28:49,813 లేదు, మేము టైమ్ ట్రావెల్ బందిపోటులం. 517 00:28:49,813 --> 00:28:51,356 తక్షణమే బయలుదేరుదాం. 518 00:28:51,857 --> 00:28:53,442 నేను పెద్ద దాన్ని కాబట్టి నేను ముందు ఉండి నడిపిస్తా. 519 00:28:53,442 --> 00:28:54,902 ముందు పుట్టింది నేను. 520 00:28:54,902 --> 00:28:56,028 కానీ నేను పెద్ద దాన్ని. 521 00:28:56,028 --> 00:28:58,280 - వయస్సు, ఎవరు ముందు పుట్టారనేదానిపై ఆధారపడుంటుంది. - దేవుడా. కెవిన్... 522 00:28:58,280 --> 00:29:00,741 - నేను ముందు పుట్టా కాబట్టి, నేనే పెద్ద వాడిని. - ...నేనిక్కడికి వచ్చి మూడేళ్లవుతోంది. 523 00:29:00,741 --> 00:29:02,284 - హా, కానీ ఇది గతం. - నాకు సుమారుగా 13 ఏళ్లు. 524 00:29:02,284 --> 00:29:03,660 - నీకు 11 ఏళ్లే. - ఇది గతంలోని సమయం. 525 00:29:03,660 --> 00:29:05,370 - నాకు సుమారుగా 13 ఏళ్లు. - ఇది వర్తమానం కాదు. 526 00:29:05,370 --> 00:29:09,166 అందరినీ కాపాడటానికి, నేను ముందు ఉండి నడిపిస్తాను. 527 00:29:09,666 --> 00:29:12,920 మంచిదే. పెద్ద పులులు ముందున్న వారిపై కానీ, వెనకనున్న వారిపై కానీ దాడి చేస్తాయి. 528 00:29:13,587 --> 00:29:16,256 సరే. నిజానికి నేను మధ్యలో ఉంటాను. 529 00:29:16,256 --> 00:29:18,926 అప్పుడైతే, అందరినీ గమనించడం సులువు అవుతుంది. 530 00:29:18,926 --> 00:29:21,345 "పెనొపీ" నా గౌరవం సంపాదించింది. అవును, కదా? 531 00:29:21,345 --> 00:29:24,598 ఇప్పటిదాకా బండరాయి దాకా ఎవరూ వెళ్లలేదు కాబట్టి, నీ పట్ల ఆయనకి గౌరవముందని చెప్తున్నాడు. 532 00:29:24,598 --> 00:29:26,391 - వాళ్లకి భయం. - అది చాలా గొప్ప విషయం. 533 00:29:26,391 --> 00:29:27,976 థ్యాంక్యూ. 534 00:29:27,976 --> 00:29:29,269 నన్ను వెక్కిరిస్తున్నావా? 535 00:29:29,269 --> 00:29:30,646 లేదు, లేదు. 536 00:29:30,646 --> 00:29:33,482 - నేను జోక్ చేశా. హహ. - హహ. 537 00:29:33,482 --> 00:29:34,483 జోక్ అదిరింది. 538 00:29:34,483 --> 00:29:36,318 - నన్ను పెళ్లి చేసుకో. - ఏంటి? 539 00:29:36,318 --> 00:29:40,531 నువ్వు, నేను కలిసి ఈ ప్రాంతాన్ని ఏలవచ్చు. 540 00:29:40,531 --> 00:29:41,740 నీపై అతను మనస్సు పారేసుకున్నాడు. 541 00:29:41,740 --> 00:29:43,075 మరి నువ్వు? 542 00:29:43,784 --> 00:29:47,371 అంటే, నేను ఒకరితో అనుబంధంలో ఉన్నా. కాబట్టి... 543 00:29:48,413 --> 00:29:50,290 - అర్థమైంది. - భర్త కాబోయే వాడు ఒకడున్నాడు. 544 00:29:50,290 --> 00:29:51,667 గొప్పదా? అవునా? హా. 545 00:29:51,667 --> 00:29:53,961 అతను ఎక్కడున్నాడో నీకు తెలీదు, కాబట్టి నువ్వు ఇతనికి... 546 00:29:53,961 --> 00:29:56,964 కానీ నాకు కాబోయే భర్త ఒకడున్నాడు, కాబట్టి నేను వేరే బంధంలోకి అడుగుపెట్టలేను. 547 00:29:56,964 --> 00:29:58,465 కుళ్లు. 548 00:29:58,465 --> 00:30:01,718 నాకు చాలా కుళ్లుగా ఉంది. చాలా కుళ్లుగా ఉంది. 549 00:30:01,718 --> 00:30:04,096 - మీరు ఇప్పుడే వెళ్లిపోతున్నారా? - మేము మా కుటుంబాన్ని కాపాడుకోవాలి కదా. 550 00:30:04,096 --> 00:30:05,472 మేమే కదా కుటుంబమంటే? 551 00:30:05,472 --> 00:30:06,807 నా వేరే కుటుంబాన్ని అన్నమాట. 552 00:30:06,807 --> 00:30:08,976 మా అమ్మానాన్నలను కాపాడగలమో లేదో చూడాలనుకుంటున్నాం. 553 00:30:08,976 --> 00:30:10,102 ఏం జరిగింది? 554 00:30:10,102 --> 00:30:12,062 వాళ్లు చనిపోయారు. 555 00:30:12,062 --> 00:30:13,397 - చనిపోయారా? - అవును. 556 00:30:13,397 --> 00:30:15,774 కానీ వాళ్లని మళ్లీ బతికించగలమో లేదో చూడాలనుకుంటున్నాం. 557 00:30:17,317 --> 00:30:20,320 బతికించడమా? మళ్లీ? 558 00:30:20,863 --> 00:30:22,656 కానీ యోలో కదా. ఒకసారి మాత్రమే కదా జీవించగలం. 559 00:30:22,656 --> 00:30:26,660 యోలో. 560 00:30:26,660 --> 00:30:30,038 బహుశా ఒకటి కంటే ఎక్కువసార్లు జీవించవచ్చేమో. యోల్ట్ సాధ్యమే ఏమో. 561 00:30:30,038 --> 00:30:33,250 యోల్ట్. 562 00:30:33,250 --> 00:30:34,376 ఆమె చనిపోయింది. 563 00:30:34,376 --> 00:30:36,170 లేదు, లేదు. నేను బతికే ఉన్నా, థ్యాంక్యూ. 564 00:30:36,170 --> 00:30:37,462 కానీ, అది నటన. 565 00:30:37,462 --> 00:30:38,463 నువ్వు చనిపోయావు. 566 00:30:38,463 --> 00:30:40,966 - అది నటన. - ఈ ఆది మానవులని మిస్ అవుతాను. 567 00:30:40,966 --> 00:30:43,427 చుట్టూ ఉన్న వాళ్లలో మనమే తెలివైన వాళ్లమైతే, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా? 568 00:30:44,136 --> 00:30:45,387 హా. 569 00:30:45,387 --> 00:30:47,055 "రైనోకెరొస్"ని తినకండి. 570 00:30:47,055 --> 00:30:47,973 - మేము తింటాం. - తింటాం. 571 00:30:47,973 --> 00:30:49,683 లేదు, నేను మళ్లీ వస్తాను. 572 00:30:49,683 --> 00:30:52,186 వద్దు, తినకండి. మేము మళ్లీ వస్తాం. 573 00:30:52,186 --> 00:30:53,270 మళ్లీ వస్తామా? 574 00:30:53,270 --> 00:30:54,438 - సరే, శాఫ్. - సరే, శాఫ్. 575 00:30:54,438 --> 00:30:55,814 నన్ను పెళ్లి చేసుకో, ఏమంటావు? 576 00:30:55,814 --> 00:30:58,025 - సరే. ఇక బయలుదేరుదాం పదండి. - హా, ఇలా రండి. 577 00:30:58,025 --> 00:31:00,903 - అంటే అవకాశం ఉందనా, "పెనొపీ"? - బై! 578 00:31:00,903 --> 00:31:02,362 బాబోయ్. 579 00:31:04,281 --> 00:31:06,491 పెనెలోపీ, ఇక్కడికి మళ్లీ ఎప్పుడు వద్దాం? 580 00:31:06,491 --> 00:31:08,118 మళ్లీ రావడమా? మళ్లీ వచ్చేది లేదు, ఎందుకు? 581 00:31:08,118 --> 00:31:10,412 - ఆ "రైనోకెరొస్"కి మనం సాయపడాలి. - నేను నా మిత్రులని చూడాలి. 582 00:31:10,412 --> 00:31:11,914 - నువ్వు ఇప్పుడు చూసిన వారినేనా? - హా. 583 00:31:11,914 --> 00:31:14,208 మంచు యుగం గురించి ఒక గమ్మత్తైన విషయం చెప్పమంటారా? 584 00:31:14,208 --> 00:31:16,376 - వద్దులే. - వద్దు. 585 00:31:23,967 --> 00:31:24,885 టెర్రీ గిలియమ్, మైఖెల్ పాలిన్ 586 00:31:24,885 --> 00:31:25,886 రూపొందించిన పాత్రల ఆధారితమైనది 587 00:31:31,975 --> 00:31:33,393 'TIME BANDITS' సినిమా ఆధారంగా తెరకెక్కించబడింది 588 00:32:36,957 --> 00:32:38,959 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్