1 00:01:07,401 --> 00:01:09,403 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 2 00:01:11,947 --> 00:01:16,994 Foundation 3 00:01:37,472 --> 00:01:41,602 ఆంథోర్ బెల్ట్. నాన్న దాని గురించి కథలు చెప్పేవాడు. 4 00:01:42,978 --> 00:01:44,479 ఇప్పుడైతే ఏం చెప్పేవాడో మరి. 5 00:01:56,200 --> 00:01:58,660 అలాంటి ఒక దానితో నేను పనిచేశానంటే నువ్వు నమ్ముతావా? 6 00:01:59,536 --> 00:02:01,955 మైనింగ్ పల్లాడియమ్. నాకు గుర్తుంది. 7 00:02:02,039 --> 00:02:04,416 ఈ పరికరాలన్నీ చూస్తూంటే నాకు వెన్ను నొప్పి పెడుతోంది. 8 00:02:06,043 --> 00:02:08,878 అది ఇంకా ఇక్కడ ఉందంటే నమ్మలేక పోతున్నా. మీవాళ్లు దాన్ని వదిలేసిపోయారు కదా? 9 00:02:08,961 --> 00:02:12,090 సామ్రాజ్యపు సాంకేతిక పరిజ్ఞానం లేకుంటే పరిశ్రమ పని స్తంభించి పోతుంది. 10 00:02:12,966 --> 00:02:17,137 అది నేను దూర ప్రయాణాలు మొదలుపెట్టినప్పటి సంగతి. మరో జీవితం. 11 00:02:22,309 --> 00:02:25,354 మరో మాటలో చెప్పాలంటే, మీ వాళ్లను నువ్వు వదిలిపెట్టేశావు. 12 00:02:25,437 --> 00:02:28,190 స్క్రాప్స్ తో యుద్ధం చేసేందుకు ఒక తెస్పిన్ తక్కువ ఉందని దానికి అర్థం. 13 00:02:28,899 --> 00:02:30,567 కోఆర్డినేట్లను సమీపిస్తోంది. 14 00:02:42,120 --> 00:02:43,121 ఇక్కడ ఏమీ లేదు. 15 00:02:43,997 --> 00:02:45,958 కాస్త దగ్గరగా చూడు, వార్డెన్. 16 00:02:50,879 --> 00:02:52,631 ఇన్విక్టస్? 17 00:02:57,094 --> 00:02:59,471 టారెలియాన్ మహారాజు నౌకాదళంలో ఎంతో గొప్ప నౌక ఇది. 18 00:02:59,555 --> 00:03:00,889 నీకు దాని గురించి తెలుసా? 19 00:03:00,973 --> 00:03:05,227 ఆ రోజుల్లో మహారాజు నిర్మించిన అత్యంత శక్తిమంతమైన నౌక 20 00:03:05,310 --> 00:03:07,271 ఇన్విక్టసేనని వారు చెబుతూ ఉంటారు. 21 00:03:07,354 --> 00:03:08,814 ఇది ప్రపంచ విధ్వంసకారిణి. 22 00:03:13,360 --> 00:03:16,613 అవును. 700 ఏళ్ల క్రితం ఇది జాడ తెలియకుండా పోయింది. 23 00:03:16,697 --> 00:03:19,449 శిథిలాలు కూడా కనిపించలేదు. ప్రమాదంలో ఉన్నట్లు సంకేతాలు కూడా అందలేదు. 24 00:03:19,533 --> 00:03:22,661 గేలక్సీలో అప్పుడప్పుడు తమకు కనిపించేదనీ, అయితే 25 00:03:22,744 --> 00:03:26,039 ప్రతిస్పందిచేది కాదనీ, ఒకసారి కనబడిన చోట మరొకసారి కనబడేది కాదని ఎంతోమంది చెప్పారు. 26 00:03:26,915 --> 00:03:28,584 ఇప్పుడు అది ఇక్కడ నీ కంటపడింది. 27 00:03:29,501 --> 00:03:30,961 అది నన్ను పిలుస్తున్నట్టుగా ఉంది. 28 00:03:31,044 --> 00:03:32,713 ఇన్విక్టస్ ఒక వ్యోమనౌక. 29 00:03:32,796 --> 00:03:36,466 రోదసీ పరిజ్ఞానం ప్రభుత్వానికి చెందిన రహస్యమైన విషయమని మహారాజు భావిస్తారు. 30 00:03:36,550 --> 00:03:39,803 వాళ్లు అవుటర్ రీచ్ ని పూర్తిగా ధ్వంసం చేసేసిన తర్వాతే 31 00:03:39,887 --> 00:03:41,096 ఆ నౌకలోకి మిమ్మల్ని వెళ్లనిస్తారు. 32 00:03:41,180 --> 00:03:42,639 అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. 33 00:03:42,723 --> 00:03:44,933 నువ్వు కనీసం అందులోకి ప్రవేశించలేవు కూడా. 34 00:03:45,017 --> 00:03:47,895 ఒక అనాక్రీయాన్ కోసం ఎయిర్ లాక్ ఎప్పటికీ తెరచుకోదు. 35 00:03:55,110 --> 00:03:56,820 మీ ఇంపీరియల్ నానోబోట్లు, త్వరితగతిన 36 00:03:56,904 --> 00:03:59,364 నయం చేసేందుకు, గుర్తించేందుకు ప్రోగ్రామ్ చేయబడ్డాయి... 37 00:04:01,116 --> 00:04:03,869 ఏదైనా సామ్రాజ్య ఓడలోకి ప్రవేశించేందుకు వీలుగా కోడ్ చేయబడ్డాయి. 38 00:04:05,871 --> 00:04:07,497 అందుకనే మాకు నీతో అవసరం పడింది, కమాండర్. 39 00:04:08,457 --> 00:04:09,958 కాబట్టే నిన్ను తీసుకొచ్చాం. 40 00:04:11,835 --> 00:04:14,838 ఒకవేళ అది పనిచేసినా, నౌక ఎక్కడుందో నువ్వు కనుక్కోలేవు 41 00:04:14,922 --> 00:04:16,632 లేదా నౌకా సిబ్బందికి ఏమైందో తెలుసుకోలేవు. 42 00:04:17,298 --> 00:04:19,593 దాని దగ్గరకు సురక్షితంగా వెళ్లవచ్చని నీకు ఎలా తెలుసు? 43 00:04:20,886 --> 00:04:22,053 అది సురక్షితం కాదు. 44 00:04:28,268 --> 00:04:31,855 దానిపై దిగేందుకు ప్రయత్నించి, మనం రెండు విమానాలను కోల్పోయాం. 45 00:04:33,023 --> 00:04:35,108 దాని రక్షణ వ్యవస్థలు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. 46 00:04:36,068 --> 00:04:37,277 సూట్లను సిద్ధం చెయ్యండి. 47 00:04:37,778 --> 00:04:39,071 ఇదే సరైన సమయం. 48 00:04:54,878 --> 00:04:58,423 ఆ మైనింగ్ స్థావరాల్లో ఒకదానిలో ఇంకా సమాచార వ్యవస్థ పనిచేస్తూనే ఉందా? 49 00:04:59,049 --> 00:05:01,051 చేయకపోవచ్చు. కానీ పనిచేసే అవకాశం లేకపోలేదు. 50 00:05:02,469 --> 00:05:04,221 నా దగ్గర ప్రమాద బీకన్ ఉంది. 51 00:05:06,223 --> 00:05:10,227 అదొక న్యూరల్ ఇంప్లాంట్, నేను ఏం చూసినా, విన్నా అది రికార్డు చేస్తుంది. 52 00:05:10,310 --> 00:05:14,815 ఇన్విక్టస్ లో మనం డిస్పాచ్ కాప్సూల్ ను చేరుకుంటే, అక్కడినుంచి సంకేతం పంపవచ్చు. 53 00:05:21,363 --> 00:05:24,616 సరే, వినండి. పది వేల మీటర్లు కిందకు దూకాలి. 54 00:05:24,700 --> 00:05:29,288 మీరు ఎంత త్వరగా కిందకు చేరుకుంటే అంత మంచిది. 55 00:05:29,371 --> 00:05:33,166 దానిలోకి ప్రవేశించే ముందు మీరు ఒక పక్కకు తిరిగి, బ్రేక్ వేయాలి. 56 00:05:33,750 --> 00:05:35,460 ఇన్విక్టస్ లో ఉండే ఆటోమేటెడ్ రైల్ తుపాకులు 57 00:05:35,544 --> 00:05:38,672 రెండు మీటర్ల పరిధిలో ఎలాంటి వస్తువులనూ గుర్తించలేవు. 58 00:05:38,755 --> 00:05:43,093 మనం వేరువేరుగా కదుల్తూ ఉంటే, వాటికి కనిపించకుండా ఉండవచ్చు. 59 00:05:43,177 --> 00:05:44,678 నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? 60 00:05:46,180 --> 00:05:47,181 దాదాపుగా తెలియట్లేదు, ప్రియా. 61 00:05:47,264 --> 00:05:49,057 వార్డెన్, ముందు నడువు. 62 00:05:49,141 --> 00:05:52,144 ఎయిర్ లాక్ ను తెరవాలంటే నువ్వు ఇన్నర్ రింగ్ పై దిగాలి. 63 00:05:52,227 --> 00:05:54,354 ఇన్నర్ రింగును మిస్సయ్యావో నీ ప్రాణాలు పోయినట్లే. 64 00:06:05,073 --> 00:06:06,491 మూడు అనగానే నేను దూకుతాను. 65 00:06:07,784 --> 00:06:09,661 ఒకటి, రెండు... 66 00:06:17,503 --> 00:06:18,754 ఛీ. 67 00:06:29,056 --> 00:06:30,057 దాదాపు చేరుకున్నాం. 68 00:07:03,757 --> 00:07:04,758 భలే పనిచేశావు, వార్డెన్. 69 00:07:05,884 --> 00:07:08,220 శాల్, నా దుస్తులు పనిచేయట్లేదు. ఏం బాగోలేదు. 70 00:07:08,303 --> 00:07:09,888 థ్రస్టర్లు ప్రతిస్పందించడం లేదు. 71 00:07:10,389 --> 00:07:12,349 లేదు, లేదు, లేదు. 72 00:07:12,432 --> 00:07:14,309 -నా వల్ల కావట్లేదు, నా వల్ల... -నిన్ను పట్టుకుంటా! 73 00:07:14,393 --> 00:07:17,396 -శాల్! లేదు, వెనక్కి వెళ్లిపో. -హ్యూగో! లేదు, లేదు. 74 00:07:17,479 --> 00:07:18,480 వెనక్కి వెళ్లిపో. 75 00:07:22,317 --> 00:07:25,153 -శాల్, శాల్... -హ్యూగో! 76 00:07:25,237 --> 00:07:27,656 లేదు, లేదు. హ్యూగో. 77 00:07:39,835 --> 00:07:42,713 బాధను దిగమింగుకో, వార్డెన్. మనకిక సమయం లేదు. 78 00:07:44,715 --> 00:07:47,217 ఎయిర్ లాక్ అటువైపు ఉంది. పదండి. 79 00:08:03,901 --> 00:08:05,027 మన్నించాలి, మహారాజా. 80 00:08:05,110 --> 00:08:08,864 నేను చేసిన పనిని సమ్మతించేందుకు మీరు వివేచనతో ఉన్నారని నాకు తెలుసు... 81 00:08:08,947 --> 00:08:12,242 నువ్వు ఏం చేయలేదని చెబుతావో చెప్పు. వినడానికి సిద్ధంగా ఉన్నాను. 82 00:08:12,326 --> 00:08:16,455 నేను మోకరిల్లి ఉండకపోతే, అది నా విశ్వాసానికి విరుద్ధంగా ఉండుండేది. 83 00:08:16,538 --> 00:08:19,208 అందుకని ఒక స్వార్ధపరుడి ముందు మోకరిల్లావన్నమాట. 84 00:08:19,291 --> 00:08:22,794 -నేను తల్లి ముందు మోకరిల్లాను. -క్షమించు, ఏమన్నావు? 85 00:08:22,878 --> 00:08:25,297 అలాంటి పదాన్ని నేను వినలేదే, 86 00:08:25,380 --> 00:08:27,382 నేను ఒక తల్లికి పుట్టినవాణ్ని కాదు కదా. 87 00:08:28,300 --> 00:08:30,552 హలీమా స్థానంతో నేను ఏకీభవించనని మీకు తెలుసు. 88 00:08:30,636 --> 00:08:35,682 అలా ఏకీభవించకూడదు. పునర్జన్మ ఆవృతంలో నువ్వు ఖచ్చితంగా లేవు. 89 00:08:35,765 --> 00:08:39,394 హలీమాకి ఈ విషయం తెలిస్తే, ఏమంటుందో మరి. 90 00:08:39,477 --> 00:08:42,563 నీ అసలు స్వభావం గురించి అందరికీ చెప్పడం నా పని కాదు. 91 00:08:42,648 --> 00:08:45,859 ఇది నయవంచన, డెమెర్జల్. 92 00:08:46,527 --> 00:08:48,862 ఇది నీ ఉత్తర్వును ఉల్లంఘించడమే. 93 00:08:48,946 --> 00:08:53,075 నాకు అర్థమైనంతవరకూ, నువ్వు అవిధేయత చూపించలేవు. 94 00:08:53,158 --> 00:08:56,036 అన్నింటికంటే, నిన్ను ప్రోగ్రామింగ్ చేసేటప్పుడే నీలో అపారమైన 95 00:08:56,119 --> 00:08:57,955 ప్రభుభక్తిని నింపడం జరిగింది. 96 00:08:58,038 --> 00:08:59,581 నేను చెప్పేదీ అదే. 97 00:08:59,665 --> 00:09:02,543 నేను మోకరిల్లడం ద్వారా ప్రోటోకాల్ ను ఉల్లంఘించి ఉంటే, 98 00:09:02,626 --> 00:09:05,212 అది నేను భౌతికంగా కావాలని చేసింది కాదు. 99 00:09:05,796 --> 00:09:09,550 అలా చేస్తే, వంగవలసిందిగా నా మోకాళ్లకు నేను పంపిన సంకేతాలు నిలిచిపోయి ఉండేవి. 100 00:09:10,926 --> 00:09:16,181 నీ చర్యలకు నువ్వు ఇచ్చిన వివరణ కూడా అతికినట్లు సరిపోయింది. 101 00:09:16,265 --> 00:09:17,766 నా ప్రశ్న ఏంటంటే, 102 00:09:18,433 --> 00:09:20,227 మోకరిల్లాలని నువ్వే అనుకున్నావా? అని. 103 00:09:21,436 --> 00:09:25,190 అన్నింటికీ మించి, నేను మహారాజుకి విధేయురాలిని. 104 00:09:25,274 --> 00:09:27,150 -మన్నించాలి, మహారాజా... -త్వరగా చెప్పు. 105 00:09:27,234 --> 00:09:29,903 జెఫిర్ హలీమా ఉపన్యాసం అందరినీ ఎంతో ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. 106 00:09:30,571 --> 00:09:33,866 ఇప్పుడామె పోటీలో ముందువరసలో ఉన్నట్టు రాయబారి తాన్వల్ భావిస్తున్నారు. 107 00:09:35,450 --> 00:09:36,827 సరే అయితే... 108 00:09:38,203 --> 00:09:42,082 తనకు ఇష్టమైన ఈ సబ్జెక్టునుంచి ఆమె దారిని మళ్ళించాలి. 109 00:09:44,293 --> 00:09:46,837 ఆమె నానుంచి ఏం ఆశిస్తోందో ముందుగా తెలుసుకోవాలి. 110 00:10:32,674 --> 00:10:35,469 మీరు ఇలా వస్తారని నేను ఊహించలేదు, క్లియాన్. 111 00:10:36,261 --> 00:10:38,096 "మహారాజా" అనే పదం సరైన గౌరవ వాచకం. 112 00:10:38,180 --> 00:10:41,808 స్పైరల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారంటే నాకెంతో గౌరవం. 113 00:10:41,892 --> 00:10:45,604 ప్రాక్సిమా వెళ్లేందుకు ఉద్దేశించిన ఒక పవిత్రమైన ఆచారం అది. 114 00:10:46,730 --> 00:10:50,067 నడచి వెళ్లడం దేవతాత్రయం ఎదుట విధేయత ప్రకటించుకోవడమే. 115 00:10:53,820 --> 00:10:55,989 ఎవరో మీకు బాగానే శిక్షణ ఇచ్చినట్లు ఉన్నారు. 116 00:10:57,074 --> 00:11:01,453 చెప్పండి, లేడీ డెమెర్జల్. మీరెప్పుడైనా స్పైరల్ కి నడచి వెళ్లారా? 117 00:11:01,537 --> 00:11:04,039 చాలా ఏళ్ల క్రితం, ఒకసారి వెళ్లాను. 118 00:11:06,250 --> 00:11:09,878 అయితే ఆ ప్రయాణం ఎంతటి పరివర్తన తీసుకువచ్చి ఉంటుందో, శరీరం... 119 00:11:11,213 --> 00:11:14,216 ఎన్ని బాధలకు గురవుతుందో మీకు తెలిసే ఉంటుంది. 120 00:11:15,843 --> 00:11:18,262 ఇతను సూర్యుడి కారణంగా గుడ్డివాడయ్యాడు. 121 00:11:19,429 --> 00:11:23,183 మదర్ ను చేరే క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 122 00:11:23,267 --> 00:11:25,978 అవన్నీ వీరమరణాలు, ఖచ్చితంగా. 123 00:11:26,061 --> 00:11:29,439 జెఫిర్ హలీమా, మీతో మహారాజు ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలనుకుంటున్నారు. 124 00:11:30,274 --> 00:11:33,151 మీరు వేసిన ముందస్తు ఎత్తుగడకి మిమ్మల్ని అభినందిస్తున్నాను. 125 00:11:33,235 --> 00:11:37,781 అలాగే, ఈ కష్ట సమయంలో నన్ను ఇక్కడికి రప్పించడంలో మీరు కృతకృత్యులయ్యారు. 126 00:11:37,865 --> 00:11:42,619 ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పేదంతా వింటాను. 127 00:11:43,328 --> 00:11:46,331 నేనేం చెప్పాలని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు. 128 00:11:46,415 --> 00:11:48,083 నువ్వేం అడగాలనుకుంటున్నావు? 129 00:11:50,252 --> 00:11:52,546 ఈ సార్వత్రిక సామ్రాజ్యానికి ముగింపు పలకండి. 130 00:11:52,629 --> 00:11:55,507 నువ్వు పరిగణనలోకి తీసుకోవాలనుకుంటే, నేను చెప్పేవి పరిశీలించు. 131 00:11:55,591 --> 00:11:57,509 డీశాలినేషన్ వ్యవస్థకు అదనంగా, 132 00:11:57,593 --> 00:12:00,220 మీవాళ్ళ రక్షణ కోసం మేం ఒక 133 00:12:00,304 --> 00:12:02,264 శాటిలైట్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. 134 00:12:02,347 --> 00:12:05,225 సురక్షితమైన నీటి సదుపాయం. 135 00:12:05,309 --> 00:12:07,436 మనం ఒకరినొకరం తప్పుగా అర్ధం చేసుకుంటున్నాం, క్లియాన్. 136 00:12:07,519 --> 00:12:10,105 నేను వ్యూహాత్మకంగా అడగలేదు. 137 00:12:10,189 --> 00:12:12,608 నేను నమ్మేదే అందరికీ చెబుతాను. 138 00:12:12,691 --> 00:12:16,445 మమ్మల్ని నాశనం చేస్తున్నది సార్వత్రిక సామ్రాజ్యమేనన్నది నా ప్రగాఢ విశ్వాసం. 139 00:12:16,528 --> 00:12:18,155 ల్యూమినిస్టులు భవిష్యత్తుని ఇప్పుడే చూడగలరా? 140 00:12:18,238 --> 00:12:20,699 నేను భవిష్యత్తుని చూస్తున్నానని చెప్పడం లేదు. 141 00:12:20,782 --> 00:12:26,371 ఏది సరైనదో, ఏది తప్పో అనే విషయంలో నాకు లోతైన అవగాహన ఉంది. 142 00:12:26,455 --> 00:12:27,706 తప్పా? 143 00:12:27,789 --> 00:12:31,752 నా కుటుంబం ఏం సాధించిందో నువ్వు ఏమాత్రం అర్ధం చేసుకోలేవు. 144 00:12:31,835 --> 00:12:35,047 -నా సోదరులు, నేను... -సోదరులా? మీరు సోదరులు కారు. 145 00:12:35,130 --> 00:12:37,758 ఒక చచ్చినవాడి అహానికి ప్రతిధ్వనులు మాత్రమే మీరు, 146 00:12:37,841 --> 00:12:40,844 సహజంగానే అర్థం చేసుకునే శక్తి లేనిది మీకే. 147 00:12:40,928 --> 00:12:44,056 ఆత్మ అంటూ లేని జీవి తనను తాను గుర్తించలేదు. 148 00:12:45,015 --> 00:12:48,435 దివంగత డాక్టర్ సెల్డన్ కూడా ఇదే చెప్పాడని నా అభిప్రాయం. 149 00:12:50,646 --> 00:12:53,482 నువ్వు అదే నమ్ముతుంటే, క్షమించు. 150 00:12:53,565 --> 00:12:56,610 జీవితాంతం నీ శ్రమకు గుర్తింపు ఉండదు. 151 00:12:56,693 --> 00:12:59,029 మీరు ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క కారణం 152 00:12:59,947 --> 00:13:03,534 ఏమిటంటే, జనం నా మాట వింటున్నారనే. 153 00:13:04,201 --> 00:13:06,161 మీరు ఇక్కడికి రావడానికి ముందు, 154 00:13:06,245 --> 00:13:11,291 లుమినిజమ్ ను అనుసరిస్తూ, సత్యమార్గంలో నడుస్తున్న అనుచరులు అసంఖ్యాకంగా 155 00:13:11,375 --> 00:13:16,380 ఉన్నారని మీవాళ్ళు మీకు ముందుగానే చెప్పి ఉంటారని నాకు ఖచ్చితంగా తెలుసు. 156 00:13:16,463 --> 00:13:20,342 మీ నక్షత్ర వారధి కూల్చివేతలో ఎంతమంది చనిపోయి ఉంటారో చెప్పండి? 157 00:13:21,134 --> 00:13:22,302 నన్ను బెదిరిస్తున్నావా? 158 00:13:22,386 --> 00:13:26,682 మీ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. 159 00:13:27,266 --> 00:13:30,769 నా మాటలు మిమ్మల్ని గందరగోళంలో పడేస్తే, నాకేం ఆశ్చర్యం కలగదు. 160 00:13:30,853 --> 00:13:33,647 ఇది మీకంటే ఎంతో ఉన్నతమైనది. 161 00:13:33,730 --> 00:13:37,109 మీ సలహాదారు మీకు అర్ధమయ్యేలా చెప్పగలరని అనుకుంటున్నాను. 162 00:13:37,192 --> 00:13:41,113 ఇక, మీరు అనుమతిస్తే, నేను చాలామందికి సేవ చేయాల్సి ఉంది. 163 00:14:04,011 --> 00:14:06,889 -లూయిస్, వెనక్కి రా, వెనక్కి రా, లూయిస్. -ఏమైంది, శాల్వార్? 164 00:14:06,972 --> 00:14:08,891 నువ్వూ, జసెంటా చాలా దగ్గరగా నడుస్తున్నారు. రెండు మీటర్లు! 165 00:14:08,974 --> 00:14:10,601 క్షమించు. 166 00:14:16,857 --> 00:14:18,567 దాక్కోండి! 167 00:14:37,669 --> 00:14:40,714 నేను తలుపులు తెరిస్తే, తుపాకుల మోత ఆగిపోతుంది. 168 00:14:40,797 --> 00:14:42,508 కమాండర్! 169 00:14:56,855 --> 00:14:58,190 ఇప్పుడే! 170 00:15:06,448 --> 00:15:07,741 రండి. 171 00:15:27,928 --> 00:15:29,596 అయ్యో! 172 00:15:33,934 --> 00:15:36,061 అతని జీవితం సార్ధకమైంది. 173 00:16:04,840 --> 00:16:08,594 నువ్వు కాదు, వార్డెన్. నీకు ఎంతో ప్రమాదం పొంచి ఉంది. 174 00:16:08,677 --> 00:16:10,220 నీ చేతులు ఇలా చాపు. 175 00:16:17,019 --> 00:16:18,061 ఇక, పదండి. 176 00:16:37,331 --> 00:16:38,707 నడుస్తూ ఉండండి. 177 00:16:39,499 --> 00:16:41,627 వాతావరణం స్తంభించింది. 178 00:16:42,127 --> 00:16:44,171 ఎక్కడో పైకప్పు పగిలినట్టుంది. 179 00:16:44,755 --> 00:16:49,426 పర్యావరణ వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. రెగ్యులేషన్ ప్యానెల్ ఎక్కడుందో వెతకాలి. 180 00:17:10,030 --> 00:17:12,406 ఇదిగో రెగ్యులేషన్ ప్యానెల్. 181 00:17:28,715 --> 00:17:31,093 సరే. ఈ వ్యవస్థ చాలా పాతది. 182 00:17:31,760 --> 00:17:34,221 నేను మాన్యువల్ కోడ్ లో ఇన్పుట్ కమాండ్లు ఇస్తాను. 183 00:17:35,722 --> 00:17:38,725 పగిలిన పైకప్పును పూడ్చివేశాను. ఇక వాతావరణం యధాస్థితికి వస్తుంది. 184 00:17:38,809 --> 00:17:39,893 మొదలుపెట్టు. 185 00:17:42,646 --> 00:17:45,232 బయటి వాతావరణం నియంత్రిస్తున్నందున ఇక్కడా అలాగే ఉండవచ్చు. 186 00:17:46,817 --> 00:17:49,570 ఇక గురుత్వాకర్షణ సంగతి. జాగ్రత్తగా ఉండండి. 187 00:18:00,831 --> 00:18:04,668 ఆ లైట్లు, ఏంటది? హైవోల్టేజీ విద్యుత్తా? 188 00:18:04,751 --> 00:18:06,086 నాకు సరిగ్గా తెలియదు. 189 00:18:06,170 --> 00:18:07,421 సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను అప్డేట్ చేయండి. 190 00:18:07,504 --> 00:18:09,506 ఆఫ్ లైన్ లో అంతర్గత రక్షణ వ్యవస్థలు అవసరం. 191 00:18:09,590 --> 00:18:12,467 రక్షణ అనేది విభిన్నమైన వ్యవస్థ. అది వంతెనకు అతి సమీపంలో ఉంది. 192 00:18:14,052 --> 00:18:15,429 అయితే మనం అక్కడికే వెళ్ధాం. 193 00:18:32,070 --> 00:18:33,071 పదహారు సెకండ్లు. 194 00:18:34,406 --> 00:18:39,036 హేయ్, లైట్లు ప్రతి 18 సెకండ్లకు ఒకసారి, వెలుగుతూ, ఆరుతున్నాయి, 195 00:18:39,119 --> 00:18:40,954 ఇప్పుడది 16కి తగ్గింది. 196 00:18:41,038 --> 00:18:42,915 సరే. అంటే అర్థం ఏమిటి? 197 00:18:43,457 --> 00:18:46,418 -అది ఒక కౌంట్ డౌనా? -దేనికి కౌంట్ డౌన్? 198 00:18:50,172 --> 00:18:51,381 తదుపరి జంప్ కి. 199 00:18:53,842 --> 00:18:56,929 రెండు వారాల క్రితం, నా మనుషులు స్కావెంజింగ్ రన్ కోసం బయటకు వెళ్ళారు. 200 00:18:57,763 --> 00:18:59,598 వారు ఇన్విక్టస్ జంప్ చేయడాన్ని చూశారు. 201 00:18:59,681 --> 00:19:01,892 ఒక జంప్ కూ మరొక జంప్ కూ మధ్య క్రమానుగతంగా తనంతట తానే 202 00:19:01,975 --> 00:19:04,102 జంప్ చేస్తోందని మేం అనుకున్నాం. 203 00:19:04,186 --> 00:19:07,231 నౌకపై మేం నియంత్రణ సాధించాలంటే, 204 00:19:07,314 --> 00:19:10,150 తను మళ్లీ జంప్ చేయడానికి ముందే మేం దానిపైకి దిగాలన్న సంగతి మాకు తెలుసు. 205 00:19:10,234 --> 00:19:11,527 ఎక్కడికి దూకుతుంది? 206 00:19:14,696 --> 00:19:18,951 వాళ్లకేం తెలియదు. అలా లెజెండ్ మొదలైంది. 207 00:19:19,034 --> 00:19:21,161 అందుకనే ఇన్విక్టస్ ప్రాణాలతో ఉన్నవారెవరూ లేని నౌకగా మారింది. 208 00:19:23,413 --> 00:19:25,707 బహుశా సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చు, 209 00:19:25,791 --> 00:19:30,254 దాంతో నౌక తనంతట తానే క్రమానుగతంగా జంప్ లు చేయడం మొదలుపెట్టింది. 210 00:19:31,672 --> 00:19:35,133 వారు కమ్యూనికేషన్ వ్యవస్థకి దూరంగా ఎక్కడో అంధకారంలో 211 00:19:35,217 --> 00:19:36,802 చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు... 212 00:19:38,095 --> 00:19:40,222 బహుశా పూర్తిగా గెలాక్సీకి వెలుపల కావచ్చు. 213 00:19:41,682 --> 00:19:44,977 తినడానికి తిండి లేక, ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. 214 00:19:45,060 --> 00:19:47,187 కౌంట్ డౌన్ సున్నాకి రాకముందే మనం బయటపడాలంటే ఎంత సమయం ఉంది? 215 00:19:48,230 --> 00:19:49,857 ఇప్పటికైతే... 216 00:19:50,732 --> 00:19:51,733 నాలుగు గంటలు ఉంది. 217 00:19:52,484 --> 00:19:53,485 సరే. 218 00:19:54,778 --> 00:19:58,740 ఈ నౌకపై పట్టు సాధించేందుకు నాలుగు గంటల సమయం ఉంది. లేకపోతే ఇది మళ్లీ మాయమవుతుంది. 219 00:20:16,091 --> 00:20:17,926 పని ఎంత తొందరగా ముగించాలో మీకు అర్థమైంది కదా. 220 00:20:18,802 --> 00:20:21,138 మనం విఫలమయినా, అదృష్టం తోడైతే, 221 00:20:21,221 --> 00:20:23,098 సూర్యుడి హృదయానికి చేరువ కావచ్చు 222 00:20:24,683 --> 00:20:26,643 లేదా చీకటి బిలం ముఖద్వారాన్ని చూడవచ్చు. 223 00:20:27,311 --> 00:20:31,857 ఒకవేళ దురదృష్టం వెంటాడితే, మనలో చాలామంది చనిపోతాం. 224 00:20:36,612 --> 00:20:38,447 హలీమా గురించి నువ్వేమనుకుంటున్నావు? 225 00:20:40,282 --> 00:20:41,783 ఆమె చాలా నిర్లక్ష్యమైన మనిషి. 226 00:20:42,743 --> 00:20:45,287 నాకు అనుమానమే లేదు, ఆమెది బెదిరింపే. 227 00:20:45,370 --> 00:20:47,497 ఆ చెత్త హారి సెల్డన్ చెప్పిన జోస్యమే ఇదంతా. 228 00:20:47,581 --> 00:20:51,543 "గెలాక్సీ ప్రధాన మతాల్లో ఒక దాని నుంచి లభించిన ప్రేరేపణే ఇది." 229 00:20:52,085 --> 00:20:56,131 హలీమా బెదిరింపు విషయానికొస్తే, రాజభవనంలో రక్షణ ఏర్పాట్లను మరింత పెంచుతాను. 230 00:20:56,215 --> 00:20:59,009 హలీమా సమాచారాన్ని నిరోధించేందుకు ఒక బృందాన్ని నియమించాలి, 231 00:20:59,092 --> 00:21:02,721 "సార్వత్రిక సామ్రాజ్యం" వంటి కొన్ని పదాలను డేటా ఫిల్టర్లు పసిగట్టాయి. 232 00:21:02,804 --> 00:21:03,805 వద్దు. 233 00:21:03,889 --> 00:21:06,975 ఈ మహిళతో రక్షణాత్మకంగా వ్యవహరించడానికి నేను వ్యతిరేకం. 234 00:21:08,101 --> 00:21:12,064 నన్ను మించిన దేనినో తను రప్పించాలని చూస్తుంటే, నేనూ అదే పని చేస్తాను. 235 00:21:13,315 --> 00:21:16,109 ఆమెదీ, సెల్డన్ దీ ఇద్దరి అభిప్రాయాలూ తప్పేనని రుజువు చేస్తాను. 236 00:21:23,742 --> 00:21:27,913 జెఫిర్ హలీమా చెప్పినదాని ప్రకారం, నాకు ఆత్మ లేదు, 237 00:21:28,413 --> 00:21:31,124 కాబట్టి, ఎదుగుదలకు నేను అశక్తుణ్ని. 238 00:21:31,875 --> 00:21:33,001 ఈ వాదనతో నేను ఏకీభవించను. 239 00:21:33,794 --> 00:21:37,756 కానీ తను ఏం సూచించిందంటే, ఆత్మ లేని జీవి తనను తాను గుర్తించలేదని, 240 00:21:38,465 --> 00:21:42,469 అందువల్ల వారందరికీ నేను విశాల దృక్పథంతో 241 00:21:43,220 --> 00:21:45,931 జెఫిర్లకంటే విశాలమైన దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను. 242 00:21:46,682 --> 00:21:51,144 దేవతా త్రయానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 243 00:22:02,239 --> 00:22:04,741 గొప్పదైన స్పైరల్ కు నేను నడచి వెళ్తాను. 244 00:22:05,534 --> 00:22:10,205 వాస్తవమేమిటో, ఏది సరైనదో, ఏది తప్పో మదర్ నీ, 245 00:22:11,456 --> 00:22:12,791 మెయిడెన్ నీ... 246 00:22:15,878 --> 00:22:17,212 క్రోన్ నే తేల్చమంటాను. 247 00:23:50,097 --> 00:23:51,223 ఇది ఎలా పనిచేస్తుంది? 248 00:23:51,306 --> 00:23:52,850 నీకు చూపిస్తాను. 249 00:25:05,797 --> 00:25:07,174 నీకోసం ఒకటి తెచ్చాను. 250 00:25:20,103 --> 00:25:21,647 ఇది రంగులను సరిచేస్తుంది. 251 00:25:21,730 --> 00:25:22,856 అందువల్ల నువ్వు ఎరుపు, ఆకుపచ్చ రంగులను చూడగలవు. 252 00:25:25,317 --> 00:25:26,443 ధన్యవాదాలు. 253 00:25:27,736 --> 00:25:31,907 కానీ నాకొద్దు. ఇవి అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. 254 00:25:32,658 --> 00:25:35,327 మిగతావాళ్లు, పగలు సోదరుడు, రాత్రి సోదరుడు, 255 00:25:36,203 --> 00:25:37,204 వాళ్ళకు ఈ సంగతి తెలియదు. 256 00:25:37,788 --> 00:25:39,748 వాళ్లు చూడనప్పుడు నువ్వు వీటిని ధరించు. 257 00:25:40,457 --> 00:25:42,084 వాళ్లెప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. 258 00:25:42,709 --> 00:25:45,546 వాళ్లు ఆరా తీయడం మొదలుపెడితే, అంతా తల్లకిందులవుతుంది. 259 00:25:48,173 --> 00:25:49,258 అవును, మహారాజా. 260 00:25:50,050 --> 00:25:51,260 అజూరా, దయచేసి... 261 00:25:53,095 --> 00:25:54,221 నన్ను క్లియాన్ అని పిలు. 262 00:25:56,598 --> 00:25:59,852 ఇది కేవలం వర్ణ అంధత్వం మాత్రమే కాదు. 263 00:26:00,435 --> 00:26:03,063 నా బొటనవేళ్లు ఎడమవైపుకి కాకుండా కుడివైపుకి తిరిగి ఉంటాయి. 264 00:26:04,481 --> 00:26:07,860 నా సోదరులవి కుడివైపున కాకుండా ఎడమ వైపుకి తిరిగి ఉంటాయి. 265 00:26:08,569 --> 00:26:10,612 వాళ్లకి ఆవాలు అంటే ఇష్టం. 266 00:26:11,822 --> 00:26:15,075 నాకు అవి చేదుగా ఉంటాయి. వాటిని అసలు తినలేను. 267 00:26:15,993 --> 00:26:17,953 బూట్లను కూడా అటుదిటు, ఇటుది అటు మార్చి వేసుకుంటాను. 268 00:26:18,036 --> 00:26:20,414 ఏవైనా వస్తువులను చూపించాలంటే వేలిని వంకరగా ఉంచి చూపిస్తాను. 269 00:26:20,497 --> 00:26:23,625 ఎవరైనా మాంసం తిన్నాక, పిండి పదార్ధాలు తింటారు, నేను అందుకు భిన్నం. 270 00:26:23,709 --> 00:26:27,379 వాళ్లు గనుక దీన్ని గమనిస్తే, మొత్తం గుట్టు అంతా బయటపడుతుంది. 271 00:26:29,173 --> 00:26:30,632 అదంత భయంకరంగా ఉంటుందా? 272 00:26:36,513 --> 00:26:37,890 నీకు చూపిస్తా, పద. 273 00:26:51,778 --> 00:26:54,364 ఇదే మొదటిది. 274 00:26:54,448 --> 00:26:55,699 ప్రిన్సిపియమ్. 275 00:26:56,783 --> 00:26:58,911 మేమంతా వచ్చింది ఈ క్లియాన్ నుంచే. 276 00:27:00,370 --> 00:27:01,622 ఇంకా ఉన్నాయి. 277 00:27:12,633 --> 00:27:13,717 వీళ్లంతా బతికే ఉన్నారా? 278 00:27:15,219 --> 00:27:16,678 ఒక విధంగా బతికే ఉన్నారని చెప్పాలి. 279 00:27:25,354 --> 00:27:26,855 వాళ్లు సమాచారాన్ని స్వీకరిస్తారు, 280 00:27:26,939 --> 00:27:29,191 అలా మా జీవితాల గురించి అప్డేట్ అవుతూ ఉంటారు 281 00:27:29,274 --> 00:27:30,692 అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని వినియోగిస్తారు. 282 00:27:31,235 --> 00:27:33,153 అవసరమైతే అంటే? దేనికోసం? 283 00:27:33,779 --> 00:27:39,660 ఒకవేళ ఒక క్లియాన్ పాడైనా లేక చంపబడినా ఆ క్లియాన్ కి ఇవి ప్రత్యామ్నాయంగా వస్తాయి. 284 00:27:55,342 --> 00:27:57,928 నా జీవితంలో ప్రతి క్షణమూ ఒక పరీక్షే. 285 00:27:59,513 --> 00:28:03,976 నేనెప్పుడు విఫలమైనా, నేను తమకంటే భిన్నంగా ఉన్నానని వాళ్ళు తెలుసుకున్నా, 286 00:28:05,435 --> 00:28:06,895 అదే నాకు చివరి రోజు అవుతుంది. 287 00:28:09,356 --> 00:28:10,357 ఇతనికి మొదటి రోజు అవుతుంది. 288 00:28:11,275 --> 00:28:13,652 కానీ వాళ్లు తెలుసుకోలేరు. నువ్వు మహారాజువి. 289 00:28:13,735 --> 00:28:15,028 ఇతనికంటే నేను ఎక్కువ కాదు. 290 00:28:16,738 --> 00:28:20,868 నా బాధ్యతలు, నా ఉనికికి కారణం, అన్నింట్లోనూ ఇతను నాకు నకలు. 291 00:28:20,951 --> 00:28:22,578 నేను వాటిని సరిగ్గా నిర్వర్తించలేకపోతే... 292 00:28:26,665 --> 00:28:29,334 మహారాజు పొరబాట్లు చేసినా రక్షింపబడాలి. 293 00:28:30,586 --> 00:28:31,670 నాలాగ. 294 00:28:32,296 --> 00:28:34,548 కాబట్టి నువ్విచ్చిన బహుమతిని నేను తీసుకోలేను, అజూరా. 295 00:28:34,631 --> 00:28:36,758 నా దృష్టి లోపాన్ని నేను సరిదిద్దుకుంటున్నానని వాళ్లు తెలుసుకోలేరు. 296 00:28:38,010 --> 00:28:41,555 నేను ఈ బాధను భరించాలి లేదా చావాలి. 297 00:28:42,723 --> 00:28:45,559 లేకపోతే నువ్వు పారిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. 298 00:28:46,143 --> 00:28:48,937 వాళ్లేం పట్టించుకోరు. నీ ప్రత్యామ్నాయాన్ని మేల్కొలుపుతారు. 299 00:28:49,021 --> 00:28:51,648 ఒక మూర్ఖపు మహారాజును వాళ్లు అలా వెళ్లిపోనివ్వరు. నన్ను చంపేస్తారు. 300 00:28:51,732 --> 00:28:54,276 అయితే పారిపోదాం. అప్పుడు వాళ్లు నిన్ను పట్టుకోలేరు. 301 00:28:54,359 --> 00:28:56,820 ఈ గేలక్సీలో నన్ను అందరూ గుర్తుపడతారు. 302 00:28:56,904 --> 00:28:57,905 మనం మారిపోతే ఎవరు గుర్తించలేరు. 303 00:28:58,572 --> 00:29:00,032 అజ్ఞాతంలో బయోహాకర్లు ఉన్నారు. 304 00:29:00,115 --> 00:29:01,617 వాళ్లు కత్తితో ఒకే ఒక్క గాటు పెట్టి ఇట్టే మార్చేస్తారు. 305 00:29:02,951 --> 00:29:05,662 అయినప్పటికీ నా నానోబోట్ల ఆధారంగా వాళ్లు నా ఆచూకీ లాగుతారు. 306 00:29:08,874 --> 00:29:11,126 వాళ్లని ఆపేందుకు కూడా మనుషులు ఉన్నారు. 307 00:29:12,085 --> 00:29:14,588 వాళ్లు పోవాలనుకుంటున్న మొదటి వ్యక్తి మీరేనని భావిస్తున్నారా? 308 00:29:20,427 --> 00:29:22,721 మీరు నాకు ఈ చోటును చూపించడానికి ఒక కారణం ఉంది. 309 00:29:23,847 --> 00:29:26,266 అదే కారణంతో మీరు బాల్కనీనుంచి దూకారు. 310 00:29:27,142 --> 00:29:28,769 మీరు ఇలా జీవించలేరు. 311 00:29:30,562 --> 00:29:33,732 అనుక్షణం మిమ్మల్ని కనిపెడుతూ ఉండేవారి మధ్య మీరు ఇంతకాలం జీవించారు. 312 00:29:34,942 --> 00:29:38,946 స్కార్ ప్రత్యేకమైనది. అందులో మిమ్మల్ని మీరు కోల్పోవచ్చు. 313 00:29:40,405 --> 00:29:43,075 మహారాజుకు సంబంధించినంతవరకూ, స్కార్ అంటే వైఫల్యం వంటిది. 314 00:29:44,785 --> 00:29:47,746 ట్రాంటార్ లో మిగిలిన వాళ్లకి మాత్రం అదొక అవకాశం వంటిది. 315 00:29:48,539 --> 00:29:54,711 మన సంతోషం కోసం సర్వర్లు డిజైన్ చేసిన ఆకాశాన్ని కాకుండా, ఎన్నో శతాబ్దాల తర్వాత 316 00:29:55,587 --> 00:30:00,175 మొట్టమొదటిసారిగా, మనం నిజమైన మేఘాలను, నిజమైన నక్షత్రాలను చూడవచ్చు 317 00:30:03,303 --> 00:30:05,097 భద్రతా వ్యవస్థను దాటి దీంతో లోపలికి వెళ్లేందుకు నన్ను వాళ్లు అనుమతిస్తారా? 318 00:30:05,180 --> 00:30:06,223 ఇది రహస్యంగా ఉంచబడింది. 319 00:30:16,984 --> 00:30:19,278 ఇది మీ రాజభవనం లాంటిది కాదు. 320 00:30:20,320 --> 00:30:23,448 ఇది కిటకిటలాడుతూ ఉంటుంది. గందరగోళంగా కూడా ఉంటుంది. 321 00:30:24,366 --> 00:30:25,617 కానీ ఇందులో జీవం ఉంటుంది. 322 00:30:27,703 --> 00:30:29,288 ఇది నీకోసం వేచి చూస్తోంది. 323 00:30:30,205 --> 00:30:31,665 నాతో రా. 324 00:30:42,551 --> 00:30:44,761 భోజనం గంటను నువ్వు మిస్సయ్యావు. 325 00:30:45,554 --> 00:30:50,100 -క్షమించాలి. -సమయ పాలన. దినచర్య. గౌరవం. 326 00:30:51,226 --> 00:30:54,188 ఇవి ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు కావచ్చు, 327 00:30:54,271 --> 00:30:57,316 కానీ ఇవి ఒక క్లియాన్ కి సహజసిద్ధంగా అలవడాలి. 328 00:30:57,900 --> 00:30:59,109 కనీసం, తప్పనిసరిగా అలవరచుకోవాలి. 329 00:30:59,193 --> 00:31:00,277 అలాగే. 330 00:31:01,153 --> 00:31:05,282 ట్రాంటార్ గురించి వింటూ ఉండిపోయాను. 331 00:31:05,866 --> 00:31:07,701 మనమే ట్రాంటార్. 332 00:31:08,535 --> 00:31:11,788 ఈ రాజభవనపు గోడలకు ఆవల ఉన్నవాటితో ఏమీ సంబంధం లేదు. 333 00:31:27,054 --> 00:31:28,096 హారి? 334 00:31:30,682 --> 00:31:32,768 కంప్యూటర్, నేను ఏం చూస్తున్నాను? 335 00:31:32,851 --> 00:31:35,479 హారి సెల్డన్ క్వాంటమ్ కాన్షస్ నెస్ ప్రోటోకాల్. 336 00:31:36,146 --> 00:31:37,898 ఇది ఒక రకమైన విక్షేపం. 337 00:31:39,483 --> 00:31:42,444 కంప్యూటర్, హారి సెల్డన్ ప్రోటోకాల్ తో సమస్య ఏంటో గుర్తించు. 338 00:31:42,528 --> 00:31:44,530 అసంపూర్తిగా ఉన్న న్యూరల్ అప్ లింక్. 339 00:31:44,613 --> 00:31:45,822 నన్ను బతికించు. 340 00:31:46,823 --> 00:31:48,784 కంప్యూటర్, అప్ లింక్ కు మూలాధారం ఏంటి? 341 00:31:48,867 --> 00:31:52,371 రేయిచ్ ఫాస్ ప్రోటోకాల్ తో ప్రవేశపెట్టబడింది. 342 00:31:52,454 --> 00:31:53,455 నువ్వు మళ్లీ ప్రారంభించగలవా? 343 00:31:53,539 --> 00:31:55,415 అనుమతి అవసరం. 344 00:31:56,333 --> 00:31:59,711 -హారి, నా మాటలు వినబడుతున్నాయా? -నన్ను రక్షించు. 345 00:31:59,795 --> 00:32:04,550 సరే. విను. నా మాటలపైనే దృష్టి పెట్టు. నేను గాల్ ని. 346 00:32:04,633 --> 00:32:06,093 గాల్! 347 00:32:06,176 --> 00:32:09,137 నీ స్మృతిని నువ్వు డిజిటైజ్ చేశావు, కానీ ఎక్కడో పొరబాటు జరిగింది. 348 00:32:09,221 --> 00:32:12,140 నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు. గతంలోనే కొట్టుమిట్టాడుతున్నావు. 349 00:32:12,224 --> 00:32:13,809 నా మాటలపైనే దృష్టి పెట్టు. 350 00:32:14,518 --> 00:32:16,603 ఇది వర్తమానం. ఇదే. 351 00:32:17,396 --> 00:32:19,690 అంతే, హారి. నా ామాటలు మాత్రమే విను. 352 00:32:19,773 --> 00:32:21,567 అది గతం. ఇది వర్తమానం. 353 00:32:31,076 --> 00:32:32,619 నిన్ను నువ్వు ఎలా నయం చేసుకున్నావు, హారి? 354 00:32:33,203 --> 00:32:37,082 మనం ట్రాంటార్ ను వదిలి వచ్చేముందు, నా మెదడులో ఒక డేటా యూనిట్ అమర్చబడింది... 355 00:32:38,625 --> 00:32:40,919 అది రేయిచ్ కత్తిలో ఉన్న ఒక పోర్టుకి కలపబడింది. 356 00:32:41,003 --> 00:32:45,090 అది నా ఆలోచనలను, జ్ఞాపకాలను, అన్నింటినీ రికార్డు చేసింది, ఇప్పటివరకూ... 357 00:32:47,009 --> 00:32:48,719 ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. 358 00:32:50,012 --> 00:32:51,263 నేనెక్కడ ఉన్నాను? 359 00:32:51,346 --> 00:32:54,683 హెలికాన్ వెళ్తున్న యమ కింకరుడు అనే ఒక వ్యోమనౌకపై, 360 00:32:54,766 --> 00:32:55,934 అదేగా నువ్వు పుట్టిన ప్రపంచం, హారి. 361 00:32:56,018 --> 00:32:57,519 హెలికాన్. అవును. 362 00:33:00,189 --> 00:33:01,190 ఎంత కాలమైంది? 363 00:33:03,692 --> 00:33:05,402 ముప్పై నాలుగేళ్ళు. 364 00:33:09,406 --> 00:33:11,450 నువ్వు ఇక్కడ ఉండకూడదు. 365 00:33:12,743 --> 00:33:13,744 రేయిచ్ ఎక్కడ? 366 00:33:14,745 --> 00:33:16,371 అతను తన బదులు నన్ను పంపాడు. 367 00:33:16,455 --> 00:33:19,374 అతను అలా చేయకూడదు. నువ్వు తొలి పునాదిని నడిపించి ఉండాలి. 368 00:33:19,458 --> 00:33:20,626 ఆ విషయం అతనికి తెలుసు. 369 00:33:21,168 --> 00:33:24,379 వాళ్లు త్వరలోనే తమ తొలి సంక్షోభాన్ని చవిచూస్తారు. ఇంచార్జి ఎవరు? 370 00:33:24,463 --> 00:33:26,548 లూయీస్ పైరీన్ అనుకుంటా. 371 00:33:26,632 --> 00:33:28,634 వాళ్లని అతను ఒడంబడిక దశకు తీసుకొస్తాడు, 372 00:33:28,717 --> 00:33:31,094 కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో, దానికోసం వాళ్లకు నీ సహకారం కావాల్సి వస్తుంది. 373 00:33:31,178 --> 00:33:32,471 రేయిచ్ కు ఆ సంగతి తెలుసు. ఎక్కడ రేయిచ్? 374 00:33:33,555 --> 00:33:35,682 అది చెప్పడం చాలా కష్టం. 375 00:33:37,726 --> 00:33:39,853 నువ్వు చచ్చిపోయావు, హారి. 376 00:33:42,481 --> 00:33:43,649 నీకు ఆ సంగతి తెలుసు కదా? 377 00:33:46,902 --> 00:33:48,237 నిన్ను రేయిచ్ చంపేశాడు. 378 00:33:48,320 --> 00:33:49,404 అందుకు నేను సహకరించానని అతను అనుకుంటున్నాడు. 379 00:33:50,614 --> 00:33:51,698 ఏంటి? ఎందుకు? 380 00:33:51,782 --> 00:33:55,285 నేను నీ క్యాబిన్ కి వెళ్లాను. అతనికి అడ్డు తగిలాను. 381 00:33:56,161 --> 00:34:00,165 అతను కత్తిని నీ ఛాతీలోకి దింపి నీ మీదకు వంగి ఉండగా చూశాను. 382 00:34:00,749 --> 00:34:05,003 నన్ను లైఫ్ బోట్ లోకి తోసేసి, తను వెనకాలే నిలబడ్డాడు. 383 00:34:05,087 --> 00:34:06,338 అతనికి ఏమైంది? 384 00:34:06,421 --> 00:34:07,798 వాళ్లు అతన్ని ఉరి తీశారు. 385 00:34:08,841 --> 00:34:10,551 రేయిచ్ చచ్పిపోయాడా? 386 00:34:12,511 --> 00:34:13,846 ఎందుకు, హారి? 387 00:34:15,514 --> 00:34:19,059 హారి? అతను అలా ఎందుకు చేశాడు? 388 00:34:20,018 --> 00:34:21,061 హారి? 389 00:34:23,730 --> 00:34:25,148 హారి! 390 00:34:35,367 --> 00:34:38,704 మనకు ఎంతో సమయం లేదు. మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడే. 391 00:34:38,786 --> 00:34:41,290 వాళ్ల ఆయుధాలు మనం తీసుకుని, వాళ్లతో సమానంగా నిలవాలి. 392 00:34:41,373 --> 00:34:43,750 నేను యోధుణ్ని కాను. మనలో ఎవరూ కారు. 393 00:34:44,333 --> 00:34:47,588 తమకు మరోదారి లేనంతవరకూ చాలామంది యోధులు కారు, 394 00:34:48,255 --> 00:34:49,297 ఆగండి! 395 00:35:04,771 --> 00:35:06,148 శక్తి నిరోధకం. 396 00:35:08,567 --> 00:35:11,278 ఇది టర్మినస్ పై మన కంచెకు సాంకేతిక పూర్వగామి అయి ఉండాలి. 397 00:35:11,904 --> 00:35:14,573 దీన్ని సురక్షితంగా అధిగమించగల ఒకే ఒక్క నిపుణురాలిని నేను. 398 00:35:15,991 --> 00:35:17,659 కానీ అందుకు నా సంకెళ్లు విప్పాలి. 399 00:35:21,580 --> 00:35:23,207 పని కానీ, వార్డెన్. 400 00:35:23,290 --> 00:35:24,625 లేదంటే మనమంతా అకారణంగా చచ్చిపోతాం. 401 00:35:44,645 --> 00:35:47,564 అదీ. ఇప్పుడు మనం అందరం వ్యవస్థలోకి చేరిపోయాం. 402 00:36:08,919 --> 00:36:10,587 పదిహేను సెకండ్లు. 403 00:36:12,256 --> 00:36:14,716 మళ్లీ సంకెళ్లు వేసెయ్. నీ చేతులు చాపు. 404 00:36:14,800 --> 00:36:15,968 ఏంటిది? 405 00:36:16,677 --> 00:36:20,180 పురాతన వ్యోమ నౌకలు తమ జంప్ డ్రైవ్ ల కోసం కూలింగ్ ట్యాంకులను ఉపయోగించాయి. జాగ్రత్త. 406 00:36:20,973 --> 00:36:22,099 అక్కడే ఆగు. 407 00:36:34,820 --> 00:36:36,488 ముందుకు నడుస్తూనే ఉండండి. 408 00:36:48,792 --> 00:36:49,960 లూయిస్! 409 00:37:12,357 --> 00:37:13,483 వద్దు! వద్దు! 410 00:37:29,124 --> 00:37:30,751 వద్దు, ఫారా. 411 00:37:30,834 --> 00:37:31,835 మనకింకా ఆమెతో పని ఉంది. 412 00:37:33,712 --> 00:37:37,382 ముందు ముందు మరిన్ని నిరోధకాలు ఉండొచ్చు. భద్రతాపరమైన నిబంధనలనూ దాటాల్సి ఉంటుంది. 413 00:37:44,640 --> 00:37:46,475 రోవాన్, దయచేసి. 414 00:37:47,267 --> 00:37:50,437 మనం నిపుణులందర్నీ కోల్పోతున్నాం. పైగా మన వద్ద సమయం కూడా లేదు. 415 00:37:50,521 --> 00:37:53,732 మహారాజుకి వ్యతిరేకంగా దాడులు జరిపేందుకు బతికి ఉండాలనుకుంటున్నావా? 416 00:37:53,815 --> 00:37:55,901 ఈ నౌకపై ఉంటే నువ్వు ఆ పని ఎన్నటికీ చేయలేవు. 417 00:37:55,984 --> 00:37:57,528 నేను ఇన్విక్టస్ ను వదిలి పోనేపోను. 418 00:37:58,779 --> 00:38:00,197 నువ్వు కూడా. 419 00:38:04,409 --> 00:38:07,663 ఈ నౌక మళ్లీ జంప్ చేయకముందే దీని దారి మార్చడంలో నువ్వు మాకు సాయపడాలి. 420 00:38:07,746 --> 00:38:11,124 ఆ తర్వాత మేం దీన్ని నేరుగా ట్రాంటార్ ప్రధాన భాగంలోకి పోనిస్తాం. 421 00:38:13,919 --> 00:38:16,296 మహారాజుకి పారిపోయే అవకాశం కూడా ఉండదు, 422 00:38:17,506 --> 00:38:19,299 మా ప్రజలకు మల్లే. 423 00:38:21,176 --> 00:38:25,305 విషపూరితమైన బూడిద తప్ప ట్రాంటార్ లో ఇంకేమీ మిగలదు, 424 00:38:25,389 --> 00:38:28,684 దానికి సంబంధించిన దుష్టశక్తులన్నీ ఆ బూడిద కింద నిశ్శబ్దంగా పడి ఉంటాయి. 425 00:38:29,518 --> 00:38:32,104 వాటికి మేం అలాంటి తీర్పునిస్తాం, వార్డెన్. 426 00:38:32,187 --> 00:38:37,484 ఈ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసేందుకు మేం ప్రాణాలైనా అర్పిస్తాం. 427 00:38:56,378 --> 00:38:58,380 ఆక్సిజన్ స్థాయి 2%. 428 00:38:59,047 --> 00:39:00,048 హారి? 429 00:39:01,133 --> 00:39:03,260 నువ్వు లేకుండానే నౌక ద్వారాలు మూసుకుపోయాయి. 430 00:39:04,636 --> 00:39:06,263 ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. 431 00:39:08,098 --> 00:39:10,350 నేను ఎంతోసేపు బతికి ఉంటానని అనుకోను. 432 00:39:10,434 --> 00:39:13,645 దయచేసి ప్రాణాధార వ్యవస్థల పునఃస్థాపనకు అనుమతి ఇవ్వు. 433 00:39:18,442 --> 00:39:21,904 దయచేసి ప్రాణాధార వ్యవస్థల పునఃస్థాపనకు అనుమతి ఇవ్వు. 434 00:39:25,407 --> 00:39:26,408 హారి? 435 00:39:27,576 --> 00:39:29,745 -దయచేసి ప్రాణాధార వ్యవస్థల... -హారి, దయచేసి. 436 00:39:29,828 --> 00:39:32,289 -...పునఃస్థాపనకు అనుమతి ఇవ్వు. -దయచేసి, హారి. 437 00:39:32,372 --> 00:39:33,749 దయచేసి. దయచేసి. 438 00:39:41,465 --> 00:39:43,217 అనుమతి పూర్తయింది. 439 00:40:03,028 --> 00:40:05,739 నేను నీకు ఒక వివరణ ఇవ్వవలసి ఉంది, గాల్. 440 00:40:05,822 --> 00:40:07,699 ఆ సంగతి ఇప్పుడు గుర్తించాను. 441 00:40:07,783 --> 00:40:09,284 రేయిచ్ నీపట్ల ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు? 442 00:40:09,368 --> 00:40:11,828 నాకు అర్ధం కావట్లేదు. అతను నిన్ను ఎందుకు చంపాడు? 443 00:40:12,412 --> 00:40:16,542 ప్లాన్ విజయవంతం కావాలంటే నా చావు తప్పనిసరి. 444 00:40:16,625 --> 00:40:18,210 నాకు అర్ధం కాలేదు. 445 00:40:18,293 --> 00:40:21,797 పునాదికి స్ఫూర్తినివ్వాలంటే ఒక్క మనిషి సరిపోడు. 446 00:40:21,880 --> 00:40:25,050 శతాబ్దాలపాటు భరించేందుకు తగిన ఏదో ఒక కల్పన అవసరమవుతుంది. 447 00:40:27,553 --> 00:40:29,096 అది ఫలితం ఇచ్చింది. 448 00:40:29,179 --> 00:40:32,766 టర్మినస్ కోసం మన మరణాల శాతం ఎంతో గుర్తుందా? 449 00:40:35,143 --> 00:40:37,437 34.2%. 450 00:40:37,521 --> 00:40:39,565 వాస్తవానికి మరణాల రేటు అందులో సగం మాత్రమే. 451 00:40:40,357 --> 00:40:42,651 నా మరణం పునాదిని ఉత్తేజితం చేసింది. 452 00:40:42,734 --> 00:40:45,988 పునాది ఒక మతం కాదు, హారి. 453 00:40:46,572 --> 00:40:47,573 పైగా నువ్వొక దేవుడివి కూడా కాదు. 454 00:40:47,656 --> 00:40:50,617 లేదు. దేవుళ్లు కత్తులకు గాయపడరు. 455 00:40:51,577 --> 00:40:55,330 కానీ నువ్వు వాళ్లని చంపగలవు. నువ్వు వాళ్లని నమ్మడం మానేయ్. 456 00:40:56,748 --> 00:41:00,377 నీ మాటలపై నాకు నమ్మకం లేదు. నువ్వొక అహంకారివి, 457 00:41:00,460 --> 00:41:05,299 కానీ నువ్విలా మారేందుకు నీ జీవితాన్ని త్యాగం చేయడం నేను చూడలేను. 458 00:41:05,382 --> 00:41:07,843 -ఎందుకని నువ్వు ఆగలేకపోయావు... -నాకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉంది. 459 00:41:09,261 --> 00:41:11,346 మెదడు వ్యాధి ఉంది. 460 00:41:11,430 --> 00:41:12,973 అది నా తండ్రినుంచి సంక్రమించింది. 461 00:41:13,557 --> 00:41:17,311 ఒకసారి ఆ వ్యాధి లక్షణాలు గోచరించాక, క్షీణత మరింత వేగంగా ఉంటుంది. 462 00:41:17,394 --> 00:41:18,854 ఆ కోణంలో ఆలోచించు. 463 00:41:18,937 --> 00:41:21,273 మనం టర్మినస్ ను చేరుకుని, దుర్భిక్షాన్ని, ఎన్నో శక్తుల్ని ఎదుర్కొన్నాం, 464 00:41:21,356 --> 00:41:23,358 కానీ విముక్తికి నేను ఎంతో కాలం బాధ్యుడిగా ఉండలేను, 465 00:41:23,442 --> 00:41:26,361 అందరినీ శీతల శిల వద్దకు లాక్కు వచ్చిన విచిత్ర వ్యక్తి అలా ఉండగలడు. 466 00:41:27,070 --> 00:41:29,990 కానీ టర్మినస్ ను చూడాలన్నది నీ కల అని నువ్వే చెప్పావు కదా. 467 00:41:30,073 --> 00:41:33,577 పునాదిని కలిసి ప్రారంభించాలని అనుకున్నావని కూడా చెప్పావుగా. 468 00:41:34,161 --> 00:41:35,704 అవును. 469 00:41:35,787 --> 00:41:38,832 ఆ సంగతి చాలా స్పష్టంగా, తరచూ చెప్పాను, కదా? 470 00:41:38,916 --> 00:41:41,251 ఎంత తరచుగా చెప్పేవాణ్నంటే నాకే విసుగు కలిగేంతగా. 471 00:41:42,336 --> 00:41:43,545 నువ్వు చేసి చూపించావు. 472 00:41:43,629 --> 00:41:46,006 నేను కేవలం కథను నడిపించానంతే. 473 00:41:46,089 --> 00:41:48,091 అబద్ధం చెప్పావనడానికి ఇదొక అందమైన దారి. 474 00:41:49,968 --> 00:41:51,595 డెబ్రీ డెస్కును సమీపిస్తోంది. 475 00:42:01,438 --> 00:42:04,691 హెలికాన్. ఇల్లు. 476 00:42:06,485 --> 00:42:07,903 శిథిల క్షేత్రం చుట్టూ... 477 00:42:07,986 --> 00:42:09,696 హెలికాన్ చీకటి నక్షత్రం. 478 00:42:10,697 --> 00:42:13,408 అది నీ స్వీయ ప్రపంచాన్ని ఇన్నేళ్లుగా మరుగున ఉంచింది. 479 00:42:14,201 --> 00:42:19,081 మనం ఎక్కడున్నామో నాకు తెలుసు, హారి. అందుకనే ఈ ఆరాటమంతా. 480 00:42:20,332 --> 00:42:23,168 ఇదంతా రేయిచ్ కి తెలుసా? నీ మరణం గురించి? ఈ నౌక గురించి? 481 00:42:23,252 --> 00:42:24,962 రేయిచ్ కి అంతా తెలుసు. 482 00:42:26,046 --> 00:42:30,676 నా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డాను. దీనికి కారణం చెప్పేందుకు తను ఉండిపోయాడు... 483 00:42:31,260 --> 00:42:36,223 ఆ తర్వాత, వారం రోజులు గడిచాక, తను మాయమై, ఇక్కడ నాతో చేరాడు. 484 00:42:38,934 --> 00:42:41,478 తను నిన్ను ప్రేమించాడు. అది అబద్ధం కాదు. 485 00:42:43,814 --> 00:42:45,774 నువ్వు నన్ను హెచ్చరించి ఉండాల్సింది. 486 00:42:45,858 --> 00:42:47,109 నువ్వు వినేదానివా? 487 00:42:47,860 --> 00:42:51,071 ఇది వినీ వినీ నేను అలసిపోయాను. 488 00:42:51,989 --> 00:42:55,909 నేనేం తెలుసుకోవాలో, ఎప్పుడు తెలుసుకోవాలో నువ్వే నిర్ణయిస్తున్నావు. 489 00:42:57,578 --> 00:42:59,288 నీ ప్లాన్ ఎందుకు మారింది? 490 00:43:00,163 --> 00:43:02,749 -నిజంగానే నువ్వు సమాధానం ఆశిస్తున్నావా? -చెప్పు. 491 00:43:03,542 --> 00:43:05,627 అతను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టి పోవాలనుకోలేదు. 492 00:43:08,213 --> 00:43:10,382 అయితే కావాలనే రేయిచ్ చేతిలో చచ్చిపోయావన్నమాట. 493 00:43:11,675 --> 00:43:13,594 అలా అతను నన్ను వదిలి వెళ్లేలా చేశావు. 494 00:43:15,470 --> 00:43:17,347 -నువ్వు అతన్ని వాడుకున్నావు. -ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. 495 00:43:17,431 --> 00:43:18,473 నువ్వు మమ్మల్ని ఇద్దరినీ వాడుకున్నావు. 496 00:43:18,557 --> 00:43:20,517 అసలు రేయిచ్ ఎప్పుడూ ఇక్కడే ఉండాల్సినవాడు. 497 00:43:21,101 --> 00:43:22,811 నువ్వు కాదు. రేయిచ్. 498 00:43:22,895 --> 00:43:25,355 నువ్వు టర్మినస్ లో ఉండాల్సిన దానివి. టర్మినస్ ను నడిపేందుకు. 499 00:43:25,439 --> 00:43:29,443 సరిగ్గా చెప్పావు! నేనూ, రేయిచ్ ఒకరికొకరం కాంతి సంవత్సరాల్లో 500 00:43:29,526 --> 00:43:32,196 ఉండాలన్నది అసలు నీ ప్లాన్ లోనే లేదు. 501 00:43:33,030 --> 00:43:37,701 నీ ప్లాన్ సురక్షితంగా ఉన్నంతకాలం, మాకేం కావాలో నువ్వు ఏనాడూ పట్టించుకోలేదు, 502 00:43:38,202 --> 00:43:40,412 బాధితుడితో ఆడుకునేంత తెలివి నీకు లేదు, గాల్. 503 00:43:41,955 --> 00:43:45,584 నువ్వు అబ్రాక్సస్ ను పరిష్కరించాక ఇందులోకి నీ భాగానికి స్వాగతించావు. 504 00:43:45,667 --> 00:43:46,668 నేనా? 505 00:43:46,752 --> 00:43:49,213 నీ ఊరూ పేరూ తెలియకుండా సమాధానాన్ని నువ్వు సమర్పించి ఉండవచ్చు. 506 00:43:49,296 --> 00:43:51,882 కానీ నువ్వు గుర్తింపు కోరుకున్నావు. 507 00:43:51,965 --> 00:43:54,468 ట్రాంటార్ కి రమ్మని నిన్ను ఎవరూ బలవంతపెట్టలేదు. 508 00:43:54,551 --> 00:43:56,220 తప్పుడు సాకులు చూపిన కారణంగా నేను ఇక్కడికి వచ్చాను. 509 00:43:56,303 --> 00:43:59,097 నీపై అందరి దృష్టీ పడుతుందనీ, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుందనీ 510 00:43:59,181 --> 00:44:01,517 పూర్తిగా తెలిసే వచ్చావు. 511 00:44:02,434 --> 00:44:04,436 నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు, గాల్. 512 00:44:04,520 --> 00:44:07,147 అప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం నీకొక భిన్నమైన జీవితాన్ని ఆశించావు. 513 00:44:07,231 --> 00:44:09,191 మనల్ని మహారాజు ముందు హాజరు పరిచినప్పుడు, 514 00:44:09,274 --> 00:44:11,360 ఆయనకు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నావు. 515 00:44:12,110 --> 00:44:16,198 "నువ్వు నన్ను చంపితే, పతనం వేగవంతం అవుతుంది." ఇదేగా నువ్వు ఆయనతో చెప్పింది? 516 00:44:16,281 --> 00:44:18,992 బాగుంది. మనిద్దరమూ వంచకులమే. 517 00:44:19,618 --> 00:44:22,621 ఒకవేళ ఇది సైకో హిస్టరీ నిర్దేశించిన మార్గం గురించే అయితే, 518 00:44:22,704 --> 00:44:25,791 సింహాసనం ఉన్న ఆ గదిలో క్లియాన్ నిన్ను చంపేందుకు అనుమతించి ఉండేవాడివే. 519 00:44:26,500 --> 00:44:28,126 నీ అనుచరులు దేశబహిష్కారానికి గురై ఉండేవారు, 520 00:44:28,210 --> 00:44:30,712 అనుకున్నట్లే అన్నీ జరిగి ఉండేవి. 521 00:44:32,047 --> 00:44:33,382 అది నిజమే. 522 00:44:34,716 --> 00:44:36,510 మరి ఎందుకని అలా చేయలేదు? 523 00:44:36,593 --> 00:44:37,719 నేను బతికి ఉండాలనుకున్నాను. 524 00:44:38,762 --> 00:44:40,681 బాగుంది, అలాగే రేయిచ్ కూడా అనుకున్నాడు. 525 00:44:42,182 --> 00:44:47,813 నేను టర్మినస్ లో ఉండటానికి బదులు ఇక్కడున్నాను. రేయిచ్ చనిపోయాడు. 526 00:44:48,814 --> 00:44:51,900 -అది నీ తప్పు. నాది కాదు. -అలాగా? 527 00:44:53,068 --> 00:44:55,445 నెపం నాపై నెట్టాలని ప్రయత్నించకు. 528 00:44:55,529 --> 00:44:58,532 నేను చనిపోయిన రోజు రాత్రి నువ్వు నా క్యాబిన్ దగ్గర్లో ఉండి ఉండకూడదు. 529 00:44:59,992 --> 00:45:01,577 నువ్వు అప్పుడు ఈత కొడుతూ ఉండాల్సింది. 530 00:45:01,660 --> 00:45:05,372 అనుకున్న ప్రకారం ప్రతి రోజూ రాత్రి, ఈత కొలనులో 40 సార్లు ఈత కొట్టాలి. 531 00:45:05,455 --> 00:45:07,082 నువ్వు చాలానే చెప్పావు. 532 00:45:11,587 --> 00:45:13,088 నువ్వు చనిపోతుంటే నిన్ను బాగా ఇష్టపడ్డాను. 533 00:45:13,172 --> 00:45:16,717 -నువ్వు నా క్యాబిన్ కు వచ్చావు, దేనికి? -రేయిచ్ కు ఏమైందోనని కంగారుపడ్డాను. 534 00:45:16,800 --> 00:45:19,428 -అయితే అతని దగ్గరికి ఎందుకు వెళ్లలేదు? -వెళ్లాను, కానీ అతను అక్కడ లేడు. 535 00:45:19,511 --> 00:45:21,555 -ఆ తర్వాత ఏమైంది? -ఏమో, నాకు తెలియదు, నేను... 536 00:45:23,390 --> 00:45:25,184 కంప్యూటర్, శిథిల క్షేత్రం నుంచి దారి మళ్లించు. 537 00:45:25,267 --> 00:45:27,436 అనుమతి అవసరం. 538 00:45:27,519 --> 00:45:29,188 పై కప్పును ఏదో ఛిద్రం చేయబోతోంది. 539 00:45:29,271 --> 00:45:31,857 హారి, నువ్వు మెయిన్ ఫ్రేమ్ లో ఉంటే గనుక, మమ్మల్ని వెనక్కి తిప్పవచ్చు. 540 00:45:31,940 --> 00:45:33,400 కవచాలు పటిష్టంగా ఉన్నాయి. 541 00:45:33,483 --> 00:45:35,319 చిన్నపాటి పగుళ్లు ఉన్నా, వాటంతట అవే మూసుకుపోతాయి. 542 00:45:35,402 --> 00:45:37,154 మమ్మల్ని వెనక్కి తిప్పు. ఇదీ మరీ దారుణం. 543 00:45:37,237 --> 00:45:39,281 -నీ రొటీన్ నుంచి ఎందుకు తప్పుకున్నావు? -నా వల్ల కాలేదు... 544 00:45:39,364 --> 00:45:41,283 ఈత కొలను నుంచి ఎందుకు బయటకు వచ్చావు? 545 00:45:41,366 --> 00:45:42,951 నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు. 546 00:45:43,035 --> 00:45:45,662 నువ్వు రేయిచ్ గురించి కంగారు పడుతున్నావు. అతని క్యాబిన్ లోకి వెళ్లావు. 547 00:45:45,746 --> 00:45:47,497 అతను అక్కడ లేడు. ఆ తర్వాత ఏమైంది? 548 00:45:48,957 --> 00:45:52,669 86,981,803. 549 00:45:55,380 --> 00:45:56,715 నాకు అది తెలిసింది. 550 00:45:56,798 --> 00:46:00,302 86,981,821. 551 00:46:00,385 --> 00:46:02,971 విధ్వంసం జరుగుతోందన్న భావన. 552 00:46:03,055 --> 00:46:04,681 అలా... అలా నాకు అనిపించింది. 553 00:46:04,765 --> 00:46:06,683 86,981,827. 554 00:46:06,767 --> 00:46:09,061 ఎలాంటి అనుభూతి అది? ఒక జ్ఞాపకమా? ఒక ముందుచూపా? ఏమిటి? 555 00:46:09,144 --> 00:46:10,312 ఒక అనివార్యత? 556 00:46:13,524 --> 00:46:15,609 నేను ఒక పని చేయడానికి ముందే నా శరీరానికి ఏం చేయబోతున్నానో తెలిసినట్టన్నమాట. 557 00:46:15,692 --> 00:46:17,444 హారి, ఆకాశం. 558 00:46:18,612 --> 00:46:20,906 నక్షత్ర వారధి కూలిపోతుందన్న సంగతి తెలిసినట్టు. 559 00:46:20,989 --> 00:46:23,242 వాళ్లు ఎప్పుడు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారో ముందే తెలిసినట్టు. 560 00:46:23,325 --> 00:46:24,535 మీరు ఇంకా ఎలా మేల్కొని ఉన్నారు? 561 00:46:25,118 --> 00:46:26,620 మీరు ఏమైనా అన్నారా? 562 00:46:26,703 --> 00:46:28,539 లేదు. కానీ ఏం అడగాలని అనుకుంటున్నానంటే... 563 00:46:28,622 --> 00:46:31,041 వాళ్లు మాట్లాడడానికి ముందే మరొకరు మాట్లాడతారు. 564 00:46:31,124 --> 00:46:33,043 మేధావి ఎట్టకేలకు పెదవి విప్పింది. 565 00:46:33,126 --> 00:46:35,212 86,981,000... 566 00:46:35,295 --> 00:46:36,922 మనందరమూ భిన్నమైన వాళ్ళమే, మిస్ డోర్నిక్. 567 00:46:37,005 --> 00:46:39,299 ఆ ప్రత్యేకత ఏంటో మీకు తెలియకపోతే, దాన్ని ఇతరులు కనిపెట్టి 568 00:46:39,383 --> 00:46:42,094 మీకు వ్యతిరేకంగా ఉపయోగించకముందే, అదేంటో కనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. 569 00:46:42,177 --> 00:46:44,638 86,981,827. 570 00:46:44,721 --> 00:46:45,764 టర్మినస్. 571 00:46:45,848 --> 00:46:46,932 మీరు మమ్మల్ని వెలివేస్తున్నారు. 572 00:46:47,641 --> 00:46:48,934 మీరు ఏమైనా అన్నారా? 573 00:46:50,143 --> 00:46:51,979 మేధావి ఎట్టకేలకు పెదవి విప్పింది. 574 00:46:52,479 --> 00:46:54,565 మీరు మమ్మల్ని వెలివేస్తున్నారు. 575 00:46:54,648 --> 00:46:55,732 క్షమించు. 576 00:46:56,692 --> 00:46:57,985 మీరు ఇంకా ఎలా మేల్కొని ఉన్నారు? 577 00:46:59,403 --> 00:47:01,029 మీరు ఏమైనా అన్నారా? 578 00:47:01,113 --> 00:47:02,823 -క్షమించు. -మీరు మమ్మల్ని వెలివేస్తున్నారు. 579 00:47:03,782 --> 00:47:05,868 -మీరు ఇంకా ఎలా మేల్కొని ఉన్నారు? -క్షమించు. 580 00:47:05,951 --> 00:47:07,536 మీరు ఏమైనా అన్నారా? 581 00:47:18,672 --> 00:47:22,009 అందుకే నీ క్యాబిన్ కు వచ్చాను. నువ్వు కనుక్కోలేకపోయింది అదే. 582 00:47:23,969 --> 00:47:27,181 ఏం జరగబోతోందో నాకు ముందే తెలుస్తోంది. 583 00:47:27,931 --> 00:47:30,475 గణితం ద్వారానో, లెక్కల ద్వారానో కాదు... 584 00:47:32,561 --> 00:47:34,271 నాకు భవిష్యత్తు తెలుస్తుందనుకుంటా. 585 00:48:43,465 --> 00:48:45,467 ఉపశీర్షికలను అనువదిందినది: అలేఖ్య