1 00:01:07,442 --> 00:01:09,319 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 2 00:01:25,377 --> 00:01:28,839 మరుగుజ్జు గ్రహం ఏయిత్రా 3 00:02:06,919 --> 00:02:07,961 అయ్యయ్యో. 4 00:02:08,044 --> 00:02:09,213 హెచ్చరిక చొరబాటు జరుగుతోంది 5 00:02:10,714 --> 00:02:11,590 డేటా తొలగించబడుతోంది 6 00:02:12,591 --> 00:02:13,634 డేటాను తీసివేయండి 7 00:02:45,832 --> 00:02:49,920 జియమ్ కార్వర్, నీకు సర్వికల్ స్పైనల్ కార్డ్ గాయమైంది. 8 00:02:50,003 --> 00:02:55,425 కొన్ని క్షణాల్లో నువ్వు ఊపిరాడక చనిపోతావు, మేము ఏదైనా చేస్తే తప్ప. 9 00:02:55,926 --> 00:02:59,221 నువ్వు అక్రమ బయోహ్యాకింగ్ ల్యాబ్ ను నడుపుతున్నావని మాకు తెలుసు. 10 00:02:59,304 --> 00:03:04,184 నక్షత్ర వారధిని ధ్వంసం చేసిన బాంబర్లు ఉపయోగించిన చర్మం లోపల వేసే 11 00:03:04,268 --> 00:03:06,979 నానో బాంబులను తయారుచేసింది మీరేనని కూడా మాకు తెలుసు. 12 00:03:12,192 --> 00:03:15,863 కానీ ఈ పని చేయడానికి మీ ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకొన్న 13 00:03:15,946 --> 00:03:18,824 వ్యక్తులు ఎవరో మాకు తెలీదు. 14 00:03:22,411 --> 00:03:26,623 నా సహచరుడు నీకు ఇచ్చే పరికరం, నీ ఫ్రీనిక్ నరాలను సక్రియం చేసి... 15 00:03:26,707 --> 00:03:28,834 మళ్లీ నీకు ఊపిరి అందించగలదు. 16 00:03:28,917 --> 00:03:33,881 నువ్వు ఇప్పుడు చెప్పబోయేదాన్ని బట్టి, ఆ పరికరం పనిచేయాలో వద్దో నిర్ణయిస్తాం. 17 00:03:34,631 --> 00:03:39,011 బాంబులను ఎవరు కొన్నారు? 18 00:03:41,346 --> 00:03:44,308 మేము కొన్ని వేల మంది అనుమానితులం ప్రశ్నించాం, 19 00:03:44,391 --> 00:03:46,852 కానీ బాంబు తయారీదారుకు, ఈ దాడి చేసిన వారికి మధ్య చాలా మంది మధ్యవర్తులు 20 00:03:46,935 --> 00:03:50,105 ఉండటం వలన, ఆ దాడి చేసింది ఎవరో తెలియడం లేదు. 21 00:03:51,732 --> 00:03:55,235 ట్రాంటార్ చుట్టూ ఇంకా ఎన్ని శవాలు తిరుగుతూ ఉన్నాయి? 22 00:03:55,319 --> 00:03:57,946 లక్షా ఇరవై ఏడు వేల శవాలు, మహారాజా. 23 00:03:58,864 --> 00:04:00,949 వాటిని ఇంకా ఎందుకు మనం దించలేదు? 24 00:04:01,033 --> 00:04:04,995 ఆ పనికే మేము తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. వాటిని ఇక్కడికి తెప్పించడం... 25 00:04:05,078 --> 00:04:06,622 దానికే ప్రాధాన్యత ఇవ్వండి. 26 00:04:06,705 --> 00:04:09,625 వాయుమండలంలోకి ప్రవేశించగానే శవాలు దహింపబడుతున్నాయి. 27 00:04:09,708 --> 00:04:12,711 ఎవరైనా ఆ దృశ్యాలను చూస్తే, మన చేతకానితనాన్ని చూసి నవ్వుకుంటారు. 28 00:04:12,794 --> 00:04:14,630 మనకి ఫలితాలు కావాలి. 29 00:04:14,713 --> 00:04:17,507 మనకి కావలసింది నిజం, సోదరా. 30 00:04:24,640 --> 00:04:27,851 సెల్డన్ ని, అతని అనుచరులను వెలేసి నేను తప్పు చేశానా? 31 00:04:28,685 --> 00:04:30,896 వాళ్ళు దాడి చేశారు అనడానికి ఏ ఆధారాలూ లేవు. 32 00:04:31,772 --> 00:04:33,732 ఎంతటి ఆధారం అయినా వారి అపరాధాన్ని తుడిచివేయలేదు. 33 00:04:36,944 --> 00:04:39,738 దూరాన ఉన్నా కానీ, వారిని నేను నాశనం చేసేయగలను. 34 00:04:41,114 --> 00:04:42,616 దాడి వాళ్ళే చేశారని మనం ప్రకటించవచ్చు. 35 00:04:43,450 --> 00:04:46,411 ప్రతీ గంట గంటకీ వార్తల్లో వారు దాడి చేశారనే మనం చెప్పించాలి, 36 00:04:46,495 --> 00:04:49,998 దాడి అంటే వారే గుర్తొచ్చేంత వరకూ అలా చేస్తూ ఉండాలి. 37 00:04:50,582 --> 00:04:53,293 అసమ్మతి వర్గాన్ని బలిదానం చేయడమనేది మనకి మంచిది కాకపోవచ్చు. 38 00:04:55,754 --> 00:04:57,756 నీ మహరాజుకు చిరాకు తెప్పించడం కూడా. 39 00:05:37,838 --> 00:05:43,010 86,981,597. 40 00:05:44,386 --> 00:05:50,350 86,981,689. 41 00:05:52,352 --> 00:05:57,608 86,981,717. 42 00:05:59,693 --> 00:06:05,365 86,981,729. 43 00:06:12,122 --> 00:06:13,332 నువ్వు ఇక్కడ ఉంటావని ఊహించాను. 44 00:06:14,249 --> 00:06:15,375 క్షమించు. 45 00:06:16,668 --> 00:06:18,378 నీ నిద్ర చెడగొట్టాలనుకోలేదు. 46 00:06:18,462 --> 00:06:22,508 -నిద్రలో ప్రైమ్ నంబర్లను లెక్కపెడుతున్నావు. -ఎంత దాకా చెప్పాను? 47 00:06:23,008 --> 00:06:25,385 మొత్తం చెప్పేశావనుకుంటున్నావేమో, అలా ఏం లేదులే. 48 00:06:26,595 --> 00:06:30,349 -వాటికి అంతమంటూ ఉండదు. -నంబర్లకా లేదా సమస్యలకా? 49 00:06:30,974 --> 00:06:33,310 మనం మొత్తం గ్రహాన్ని ఆక్రమించనవసరం లేదు, గాల్. 50 00:06:34,144 --> 00:06:35,687 మనకు ఒక చిన్న మూల చాలు. 51 00:06:38,565 --> 00:06:40,609 గోళంలో మూలల్లాంటివి ఉండవు. 52 00:06:44,363 --> 00:06:45,572 నువ్వు బయటకు వస్తున్నావా? 53 00:06:46,281 --> 00:06:48,200 లేదు. నువ్వే లోపలికి రా. 54 00:06:50,953 --> 00:06:52,454 నాకు ఈత రాదని నీకు తెలుసు. 55 00:06:52,538 --> 00:06:54,873 నేర్చుకోవడానికి నీకు ఇంకా నాలుగేళ్ల నాలుగు నెలల సమయం ఉంది. 56 00:06:54,957 --> 00:06:55,999 ఆ ప్రసక్తే లేదు. 57 00:07:01,922 --> 00:07:06,552 శాంతించు. శాంతించు. నేనున్నాగా. 58 00:07:10,222 --> 00:07:12,474 నన్ను మన్నించు. క్షమించు. 59 00:08:01,023 --> 00:08:03,525 ఆ పనితీరు ఆమోదయోగ్యం కాదు... 60 00:08:05,861 --> 00:08:07,362 నీలి జట్టు విఫలమవుతోంది. 61 00:08:09,406 --> 00:08:13,076 సమయం వచ్చినప్పుడు, ఎరుపు లేదా పచ్చ జట్టులో చేరమని నా సలహా. 62 00:08:14,620 --> 00:08:17,623 తదుపరి శిక్షణా వ్యవధిలో రియాక్టర్ బృందంలో చేరుతానేమో. 63 00:08:17,706 --> 00:08:19,499 నిన్న రాత్రి డిన్నర్ లో సూప్ కాస్త చల్లగా ఉండింది. 64 00:08:19,583 --> 00:08:21,627 కాబట్టి రెండు వారాల పాటు నువ్వు వంటకాల శిక్షణ కూడా తీసుకోవాలేమో? 65 00:08:21,710 --> 00:08:22,878 నువ్వేం చెప్తున్నావో నాకర్థమైంది... 66 00:08:22,961 --> 00:08:25,255 కాలనీలోని ప్రతీ పనినీ నువ్వు నేర్చుకోవాల్సిన పని లేదు, గాల్. 67 00:08:25,339 --> 00:08:28,425 ఎవరైనా చేయలేకపోతే, అప్పుడు నేను చేయవచ్చు కదా. 68 00:08:29,426 --> 00:08:33,388 టర్మినస్ ని చేరుకోవడానికి మనకు ఇంకా 54 నెలల సమయం ఉంది. 69 00:08:33,472 --> 00:08:36,015 మనకి సమయం ఉంది. చాలా సమయం ఉంది. 70 00:08:36,099 --> 00:08:38,519 సమయం ఉందనే అనుకుంటాం, కానీ అది ఇట్టే అయిపోతుంది. 71 00:08:45,067 --> 00:08:47,945 మన్నించు. మనకున్న కాస్తంత సమయాన్ని కూడా నేనలా వృథా చేసి ఉండకూడదు. 72 00:08:49,238 --> 00:08:51,448 నన్ను మరీ అంత సీరియస్ గా తీసుకోవడం ఎప్పుడు ఆపుతావు? 73 00:09:29,236 --> 00:09:32,197 షివాన్, అక్కడ మెర్కూరీ, ఇంకా ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువ ఉన్నాయి. 74 00:09:32,281 --> 00:09:33,282 కాస్త జాగ్రత్త. 75 00:09:34,992 --> 00:09:37,578 వాటిని త్వరగా కప్పేయడానికి ప్రయత్నించు. అవి విషపూరితమైనవి. 76 00:09:37,661 --> 00:09:38,745 ఆ పని మీదే ఉన్నాను. 77 00:09:56,930 --> 00:09:58,557 హలో? 78 00:10:07,482 --> 00:10:08,567 అయ్యయ్యో. 79 00:10:10,861 --> 00:10:12,029 పరుగెత్తు, షివాన్! 80 00:10:15,908 --> 00:10:16,742 అయ్యయ్యో! నేల మీద పడుకోండి. 81 00:10:17,326 --> 00:10:18,744 వద్దు, అబ్బాస్! 82 00:10:26,627 --> 00:10:29,963 అభినందనలు, మూడు ప్రయత్నాల్లో ఒకటి కూడా సఫలం కాలేదు. 83 00:10:31,173 --> 00:10:34,510 గాల్ మరియు షివాన్, మీరు పేలుడు జరిగే చోటే ఉన్నారు కాబట్టి, 84 00:10:34,593 --> 00:10:38,388 మీ అంతర్గత అవయవాలు అధిక పీడనం వల్ల బాగా దెబ్బ తిన్నాయి. 85 00:10:38,472 --> 00:10:42,559 నేను ప్రయత్నించగలను, కానీ ఇంత కన్నా బాధాకరమైన చావు అంటే కష్టమే. 86 00:10:43,185 --> 00:10:46,104 మారి, బ్రివాన్, అబ్బాస్. 87 00:10:47,397 --> 00:10:50,359 పేలుడు దాటికి చెల్లాచెదురై దూసుకొచ్చిన శిలల వల్ల మీరు చనిపోయారు. 88 00:10:50,442 --> 00:10:52,486 మంచి విషయమేంటంటే, మీరు చచ్చినట్టు కూడా మీకు తెలీదు. 89 00:10:53,111 --> 00:10:55,155 చెడు విషయమేంటంటే, మీకు చావు తప్పలేదు. 90 00:10:55,239 --> 00:10:57,824 ఆ జంతువు చేతిలో క్రూరంగా చావడం కన్నా అదే మేలులే. 91 00:10:57,908 --> 00:10:59,618 అవును, అసలు ఏంటది? 92 00:10:59,701 --> 00:11:03,372 బిషప్స్ క్లా. సూదూర గ్రహాల్లో విరివిగా కనిపించే భారీ జంతువు. 93 00:11:04,206 --> 00:11:06,583 కానీ అబ్బాస్ చెప్పింది నిజమే. ఈ సిమ్యులేషన్ న్యాయబద్ధమైంది కాదు. 94 00:11:06,667 --> 00:11:10,295 అతను కాల్చి ఉండకపోతే, మమ్మల్ని బిషప్స్ క్లా ఖచ్చితంగా చంపేసి ఉండేది. 95 00:11:10,379 --> 00:11:12,673 అవును, అది న్యాయబద్ధమైంది కాదు. 96 00:11:13,173 --> 00:11:15,801 టర్మినస్ లో ఇలాగే ఏదీ న్యాయబద్ధంగా ఉండదు. 97 00:11:16,844 --> 00:11:20,848 కానీ పునాది విజయవంతం కావాలంటే, మనం వాటిని జయించాలి. 98 00:11:20,931 --> 00:11:22,724 మళ్లీ రేపు ఉదయం ఆరు గంటలకు ప్రయత్నిద్దాం. 99 00:11:23,433 --> 00:11:26,478 మిస్ డోర్నిక్, డాక్టర్ సెల్డన్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. 100 00:11:41,493 --> 00:11:43,871 ఇంపీరియల్ గార్డెన్స్ లో ఒక యాపిల్ తోట ఉంది, 101 00:11:43,954 --> 00:11:46,331 అది రోబోట్ యుద్ధాలు జరగక ముందు నుంచే అక్కడ ఉంది. 102 00:11:47,499 --> 00:11:50,335 కృత్రిమ మేధస్సును సపోర్ట్ చేసేవారిని ఆ చెట్లకు ఉరివేసేవారు. 103 00:11:50,419 --> 00:11:52,462 రోబోట్లను సపోర్ట్ చేసే వర్గం కూడా ఒకటి ఉండేదని నాకు తెలీదు. 104 00:11:52,546 --> 00:11:54,882 సపోర్ట్ చేసే వర్గాలు అన్నింటికీ ఉంటాయి. 105 00:11:54,965 --> 00:11:58,886 అయితే, ఈ పర్యటన ముగిసేనాటికి, ఎవరినైనా వేలాడతీసేంత 106 00:11:58,969 --> 00:12:01,346 గట్టిగా ఈ కొమ్మ తయారవుతుందని ఆశిద్దాం. 107 00:12:02,097 --> 00:12:03,182 అలాగే ఆశిద్దాం. 108 00:12:05,142 --> 00:12:07,269 నీకు అగ్నిపర్వతం విషయంలో సమస్య ఎదురైంది. 109 00:12:07,352 --> 00:12:09,062 ఆ అగ్నిపర్వతంతో మనకి మొదట్నుంచీ సమస్యే. 110 00:12:09,855 --> 00:12:11,023 దానికి పరిష్కారం ఏంటంటావు? 111 00:12:11,106 --> 00:12:13,233 పునాదిని ఆ అగ్నిపర్వతానికి దగ్గరగా ఏర్పరచవద్దు. 112 00:12:13,317 --> 00:12:14,484 విద్యుత్తు ఉత్పత్తికి అది మనకి కావాలి. 113 00:12:14,568 --> 00:12:17,571 భూతాప శక్తి కోసం మనవాళ్ళు బావులను తవ్వాల్సి ఉంటుంది. 114 00:12:18,280 --> 00:12:21,325 అది అస్థిరంగా పేలుతూనే ఉంటే, మనం ఒక్క బావిని కూడా తవ్వలేం. 115 00:12:23,869 --> 00:12:25,495 -ఇది చేదుగా ఉంది. -కానీ నిజమైనదే కదా. 116 00:12:27,456 --> 00:12:30,334 ఈ ఉదయపు సిమ్యులేషన్ డేటాతో మనుగడ ప్రొజెక్షన్స్ ని రన్ చేశావా? 117 00:12:30,417 --> 00:12:33,212 -చేశాను. -నీలి జట్టు వైఫల్యంతో సహానా? 118 00:12:33,712 --> 00:12:36,882 గ్రహానికి చేరుకున్నాక అయిదేళ్ళ తర్వాత మరణాల రేటు 34.2 శాతం అవుతుంది. 119 00:12:36,965 --> 00:12:40,552 అది తగ్గుతూ ఉంది. ఆశావాదమైన విషయమే కదా. 120 00:12:40,636 --> 00:12:42,596 ఆ మాటని ఇక్కడున్న 1,710 మందికి... 121 00:12:42,679 --> 00:12:45,098 అందుకే మనం సిమ్యులేషన్లని రన్ చేస్తున్నాం, గాల్. 122 00:12:45,182 --> 00:12:47,392 -శుభోదయం, హారి. -శుభోదయం, మాగ్నస్. 123 00:12:49,269 --> 00:12:50,479 "హారి." 124 00:12:51,688 --> 00:12:54,775 ఈ ప్రయాణం మొదట్లో, నన్ను "డాక్టర్ సెల్డన్" అని పిలిచేవాడు. 125 00:12:55,484 --> 00:12:57,653 అదంత చెడు విషయమంటారా? 126 00:12:59,196 --> 00:13:01,281 ఈ గణితం వెనుకనున్న అసలైన వ్యక్తి గురించి తెలుసుకోవడం? 127 00:13:02,866 --> 00:13:05,494 తర్వాత, పునాదికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు సమావేశం ఉంది. 128 00:13:05,577 --> 00:13:07,871 -నా బదులు నువ్వు హాజరవ్వాలి. -నేనెప్పుడూ హాజరు కాలేదు... 129 00:13:07,955 --> 00:13:09,414 అక్కడంతా సంఖ్యలే, గాల్. 130 00:13:11,250 --> 00:13:12,376 అంతా సంఖ్యలే. 131 00:13:13,460 --> 00:13:14,461 సరే. 132 00:13:46,285 --> 00:13:48,787 గణితమంటే వట్టి సంఖ్యలే కాదు. 133 00:13:50,163 --> 00:13:54,543 ప్రపంచం అంతమైపోయేటప్పుడు, దాన్ని వ్యక్తీకరించడానికి మనం గణితం వాడతాం. 134 00:13:55,669 --> 00:13:57,838 మనకి బాగా భయం కలిగించే విషయాల కోసం గణితం వాడతాం. 135 00:13:59,131 --> 00:14:01,216 విశ్యం యొక్క విస్తారత, 136 00:14:02,217 --> 00:14:04,136 సమయం యొక్క ఆకారం... 137 00:14:06,096 --> 00:14:08,307 మానవ ఆత్మ యొక్క బరువు, విలువలు. 138 00:14:44,968 --> 00:14:47,846 అది ప్రాచీన అనాక్రీయాన్ వేట పాట, కదా? 139 00:14:47,930 --> 00:14:50,390 మీరు ఏదైనా జంతువును చంపే ముందు దాన్ని పాడతారు. 140 00:14:50,849 --> 00:14:51,892 అవునా? 141 00:14:53,185 --> 00:14:55,103 ఆ పాటను ఎవరైనా పాడవచ్చు, మహారాజా. 142 00:14:55,187 --> 00:14:56,605 అది నిజం కాదు. 143 00:14:58,148 --> 00:15:02,569 మా విద్యాభ్యాసంలో భాగంగా మీ పాటలను పాడటానికి ప్రయత్నించాం. 144 00:15:03,320 --> 00:15:06,198 ఆ యాస మాత్రం మాకు రాలేదు. ఒక స్థానికుడు పాడినట్టుగా మేం పాడలేము. 145 00:15:06,281 --> 00:15:10,118 కానీ ఆ పాటలో యాస సరిగ్గానే ఉంది, కదా? 146 00:15:10,744 --> 00:15:13,080 గత రెండు వారాల నుండి చెప్తున్న విధంగానే, ఇప్పుడు కూడా 147 00:15:13,163 --> 00:15:16,166 ఇందులో అనాక్రీయాన్ కి ఏ సంబంధమూ లేదనే మేము చెప్తున్నాం... 148 00:15:17,251 --> 00:15:19,044 నాకు వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. 149 00:15:19,127 --> 00:15:21,255 నక్షత్ర వారధి వినాశనం, ఇంకా ట్రాంటార్ లో పది కోట్లకు పైగా మరణాలు, 150 00:15:21,338 --> 00:15:24,341 అవే వర్ణించదగిన మాటలు. 151 00:15:30,681 --> 00:15:33,934 అది తెస్పిన్ భాషే కదా? 152 00:15:34,434 --> 00:15:35,644 దాన్ని మీరు అనువదించగలరా? 153 00:15:38,605 --> 00:15:39,606 గట్టిగా! 154 00:15:40,858 --> 00:15:42,442 అంటే, "సూదూర భాగాల గ్రహాలు వర్థిల్లాలి" అని అర్థం. 155 00:15:42,526 --> 00:15:44,945 భ్రమణ వేదికను గతి నుండి తప్పేలా చేసిన ఆ బాంబులు పేలక ముందు 156 00:15:45,028 --> 00:15:48,240 వల్లించబడిన ఆ తెస్పిన్ ప్రార్థనను కూడా మీరు గుర్తించగలరు అనుకుంటా. 157 00:15:48,824 --> 00:15:51,660 సగౌరవంగా చెప్తున్నా, మహారాజా, ఆ ప్రార్థనను... 158 00:15:51,743 --> 00:15:54,997 చివరిసారి 88 ఏళ్ల క్రితం పాడారు. 159 00:15:55,080 --> 00:15:56,999 అలాంటి ప్రార్థనని తెస్పిన్లు పాడరు... 160 00:16:01,461 --> 00:16:03,255 నా ప్రభుత్వం ఇప్పుడు కూడా తిరస్కరిస్తోంది... 161 00:16:04,590 --> 00:16:05,716 వారికి ముసుగులేయండి. 162 00:16:10,554 --> 00:16:13,849 రికార్డింగ్ లో ఉండేది నిజమైనదే. వాళ్ల దగ్గర సమాధానాలు లేవు. 163 00:16:14,641 --> 00:16:15,893 ఖచ్చితంగా ఒకరి దగ్గర ఉండాలి. 164 00:16:17,102 --> 00:16:19,605 ఈ గ్రహాల వాళ్లకి ఒకరంటే ఒకరికి పడదు. 165 00:16:20,480 --> 00:16:24,109 -సామ్రాజ్యంపై ద్వేషం కన్నా కూడా. -చారిత్రకంగా చూస్తే, అది నిజమే. 166 00:16:24,193 --> 00:16:28,280 ఇలాంటి విషయంలో వీళ్లు కలిసి పని చేశారంటే... 167 00:16:28,363 --> 00:16:29,573 అయినా కానీ... 168 00:16:32,576 --> 00:16:35,287 ఈ విషయంలో ఒకరికి ఉరిశిక్ష తప్పదు. 169 00:16:40,751 --> 00:16:42,878 అది తప్పు చేసిన వారికే పడితే బాగుంటుందనుకుంటున్నాను. 170 00:17:00,354 --> 00:17:01,939 రాత్రి సోదరుడు ఎక్కడ? 171 00:18:41,330 --> 00:18:44,082 సరే. ధన్యవాదాలు, గాల్. 172 00:18:46,001 --> 00:18:47,336 అండం బాగానే ఉంది. 173 00:18:56,428 --> 00:18:58,138 పురుడుకు సంబంధించి నీకు ఇచ్చిన మార్గనిర్దేశాల్లో ఏమైనా మార్పు ఉందా? 174 00:18:59,640 --> 00:19:00,641 లేదు. 175 00:19:03,977 --> 00:19:05,229 జనాలు నాతో మాట్లాడుతుంటారు. 176 00:19:06,396 --> 00:19:09,149 -అవును. -ఇక్కడే కాదు, బయట కూడా. 177 00:19:11,068 --> 00:19:13,487 ఎందుకంటే, అందరూ గ్రహం చేరుకొనేదాకా ఆగలేరు కదా. 178 00:19:13,570 --> 00:19:14,905 అందులో వింతేమీ లేదులే. 179 00:19:19,952 --> 00:19:21,119 నాకెవరైనా తెలిసి ఉంటే... 180 00:19:22,412 --> 00:19:23,830 తనది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 181 00:19:24,331 --> 00:19:26,875 తను ఇప్పటికీ ప్రోటోకాల్ అనుసరించగలదు, కానీ తను రావడంలేదు. 182 00:19:28,669 --> 00:19:33,131 డాక్టర్ సెల్డన్ కి నేను చెప్పాలా? లేదా నువ్వే చెప్తావా? 183 00:19:43,976 --> 00:19:45,519 అంతా బాగానే ఉందా? 184 00:19:46,103 --> 00:19:47,271 అంతా బాగానే ఉంది. 185 00:19:49,982 --> 00:19:50,983 తర్వాత వచ్చి కలుస్తావా? 186 00:19:52,359 --> 00:19:53,402 సరే. 187 00:20:01,535 --> 00:20:04,913 అటెన్షన్. అయిదవ క్వాడ్రంట్ ఇప్పుడు క్లియర్ గా ఉంది. 188 00:20:04,997 --> 00:20:07,124 అయిదవ క్వాడ్రంట్, ఇప్పుడు అంతా క్లియర్ గా ఉంది. 189 00:20:11,962 --> 00:20:15,340 ఈరాత్రి అదనపు రియాక్టర్ సిమ్యులేషన్ రన్ చేస్తున్నామని డాక్టర్ సెల్డన్ కి చెప్పు. 190 00:20:15,424 --> 00:20:17,843 ఈసారి, ఉన్న మూడు షటిల్సూ నాశనం కాకూడదని ఆశిద్దాం. 191 00:20:17,926 --> 00:20:20,137 నేను ఇక్కడికి వచ్చింది అందుకు కాదు. 192 00:20:23,140 --> 00:20:24,183 కడుపులో ఉన్న బిడ్డ తండ్రికి విషయం తెలుసా? 193 00:20:24,933 --> 00:20:26,310 మా ఇద్దరికీ పెద్ద పరిచయం కూడా లేదు. 194 00:20:26,393 --> 00:20:29,563 అతను మంచివాడిలానే అనిపించాడు, కానీ అతనేం అనుకున్నా నాకు అనవసరం. 195 00:20:29,646 --> 00:20:31,315 ఇంకెవరైనా ఏమైనా అనుకుంటే? 196 00:20:31,398 --> 00:20:34,401 అలా అనుకొనే సీడ్ బ్యాంక్ లో షివాన్ తో మాట్లాడాను. 197 00:20:34,484 --> 00:20:35,861 దాని వల్ల నాకు ఏమైందో చూడు. 198 00:20:36,403 --> 00:20:38,906 నేను పునాదిలో సభ్యురాలిగా నీతో మాట్లాడటం లేదు. 199 00:20:38,989 --> 00:20:40,657 గాల్ గా మాట్లడుతున్నాను. 200 00:20:42,159 --> 00:20:44,870 లారీ, నువ్వు ఇంజనీర్ వి. 201 00:20:44,953 --> 00:20:46,663 నువ్వు షటిల్ టీమ్ లో చోటు సంపాదించావు. 202 00:20:46,747 --> 00:20:49,958 అండం, సీడ్ బ్యాంక్ లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో నీకు తెలుసు. 203 00:20:51,168 --> 00:20:54,713 ఈ నౌక, గర్భాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడలేదు. 204 00:20:54,796 --> 00:20:56,381 మరి టర్మినస్ గర్భానికి మంచిదేనా? 205 00:20:56,465 --> 00:20:58,008 నేను దద్దమ్మని కాదు. 206 00:20:58,091 --> 00:21:00,594 ఇక్కడ మనం రేడియేషన్ ని ఎంత ఎదుర్కుంటున్నామో నాకు తెలుసు. 207 00:21:00,677 --> 00:21:03,138 నవ మాసాలూ మోయడం కష్టం, లోపాలు, ఇంకా పాలు విషపూరితం అవుతాయి, 208 00:21:03,222 --> 00:21:04,973 ఇవన్నీ నాకు కూడా తెలుసు. 209 00:21:05,474 --> 00:21:07,017 కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా నాకు తెలుసు. 210 00:21:08,060 --> 00:21:11,605 గడ్డకట్టిన బండరాళ్లు, సుదీర్ఘ రాత్రులు ఉంటాయి, నీడ ఇచ్చే చెట్లు ఉండవు. 211 00:21:12,105 --> 00:21:15,067 మనలో ఎంత మంది చనిపోతారో తెలిపే ప్రొజెక్షన్స్ నీ వద్ద ఉన్నాయని తెలుసు, 212 00:21:15,150 --> 00:21:17,402 అ సంఖ్య మనలో గుబులు పుట్టించేదని కూడా నాకు తెలుసు. 213 00:21:17,486 --> 00:21:19,404 -లారీ, అది నిజం కాదు. -ఎవరికీ చెప్పాలని లేదు... 214 00:21:19,488 --> 00:21:20,364 నాతో అబద్ధం చెప్పకు! 215 00:21:20,447 --> 00:21:24,868 నాతో హారి సెల్డన్ అబద్ధమాడితే పర్వాలేదు. దానికి ఆశ్చర్యపోను, కానీ నువ్వు కూడానా. 216 00:21:25,827 --> 00:21:27,704 దయచేసి నాకు నిజం చెప్పు. 217 00:21:31,083 --> 00:21:34,044 దాని బట్టే నాకు మీ ఇద్దరి మధ్యా భేదం తెలుస్తుంది. 218 00:21:35,462 --> 00:21:38,382 నాకు ఏది చేస్తే మంచిదో తెలుసు, గాల్. నాకు తెలుసు. 219 00:21:39,758 --> 00:21:40,926 గణితం ఏం చెప్తోందో కూడా నాకు తెలుసు. 220 00:21:41,009 --> 00:21:43,804 నిజానికి మనం ఈ నౌకలో సాగించేది జీవనం కాదు అని నాకు తెలుసు. 221 00:21:44,596 --> 00:21:46,306 మనం జీవించడానికి సన్నద్ధమవుతున్నామంతే. 222 00:21:47,683 --> 00:21:49,184 మనలో కొందరైనా జీవించడానికి. 223 00:21:50,310 --> 00:21:51,728 అదే ప్లాన్. 224 00:21:53,021 --> 00:21:56,650 నేను నా కడుపులో పెరిగే బిడ్డని ఇప్పుడు తీయనిచ్చాక ఏదైనా జరిగి, 225 00:21:56,733 --> 00:22:00,612 తర్వాత తను నా కడుపులో పెరుగుతుందన్న ఫీలింగ్ ఇక నాకెప్పటికీ కలగకపోతే? 226 00:22:01,196 --> 00:22:03,365 తన కళ్లలోకి చూసే అవకాశం కూడా నాకు దక్కదు. 227 00:22:05,742 --> 00:22:07,452 అంత దారుణంగా ఏమీ జరగదులే. 228 00:22:16,920 --> 00:22:19,339 -రాత్రి సోదరా. -గుడ్ ఈవినింగ్, డెమెర్జల్. 229 00:22:19,423 --> 00:22:21,049 సింహాసన గదిలో మహారాజు మిమ్మల్ని తలుచుకున్నారు. 230 00:22:21,133 --> 00:22:22,551 నాకు అలా అనిపించడం లేదే. 231 00:22:23,927 --> 00:22:26,722 -మీరు ఎక్కడికి వెళ్తున్నారు? -ఆ విషయం నీకు తెలుసు. 232 00:22:56,627 --> 00:22:58,045 దేవుళ్ల వద్దకి. 233 00:23:14,186 --> 00:23:16,813 అక్కడే. మమ్మల్ని అక్కడే దించండి. 234 00:23:29,868 --> 00:23:31,745 జ్ఞానోదయం అయ్యాక, 235 00:23:31,828 --> 00:23:37,209 వారు చూసిన పాపాల నుండి వారి నేత్రాలను స్లీపర్ శుద్ధి చేయును గాక. 236 00:23:41,588 --> 00:23:44,466 -మహారాజా. -మహారాజా, ఆదుకోండి. 237 00:23:54,518 --> 00:23:56,436 ఆయుధాలను బయటే ఉంచి లోపలికి రండి. 238 00:24:01,191 --> 00:24:02,359 నా దగ్గర ఆయుధమేదీ లేదు. 239 00:24:03,151 --> 00:24:04,945 అన్ని ఆయుధాలను బయటే ఉంచాలి; 240 00:24:05,654 --> 00:24:08,490 -ఆమె వద్ద కూడా ఏదీ లేదు. -ఆమె వద్ద కాదు, అతని వద్ద ఉన్నవి. 241 00:24:10,117 --> 00:24:12,911 అతని యంత్రాలకు ఇక్కడ స్థానం లేదు. 242 00:24:12,995 --> 00:24:13,912 మహారాజా... 243 00:24:24,298 --> 00:24:29,219 మానవ స్పర్శకి దూరంగా ఉండేవారు, దైవ స్పర్శకి కూడా దూరమవుతారు. 244 00:24:29,803 --> 00:24:32,055 అయితే ఇప్పుడు నన్ను దేవుడు స్పృశించాడా? 245 00:24:32,139 --> 00:24:33,807 లేదు. నేనే. 246 00:24:34,308 --> 00:24:39,146 మహారాజా, ఈ కట్టడాలు ఇంకా కుదురుకోలేదు. మనం నౌక దగ్గరికి వెళ్లిపోవాలి. 247 00:24:39,229 --> 00:24:42,983 మీ రాళ్లు. వాటిని మీరు ప్రార్థించడానికి ఉపయోగిస్తారు. 248 00:24:43,066 --> 00:24:46,320 మేము స్లీపర్ తో మాట్లాడతాం, అప్పుడు స్లీపర్ మమ్మల్ని చూస్తారు. 249 00:24:46,403 --> 00:24:49,740 మీరు పూజారులని చెప్పుకుంటుంటారు, కదా? మీకు భవిష్యత్తు తెలుసు. 250 00:24:50,490 --> 00:24:53,619 స్లీపర్ మన భవిష్యత్తును కల కంటారు. 251 00:24:53,702 --> 00:24:56,747 గతాన్ని మార్గనిర్దేశం చేయడం వలన ఏ ఉపయోగమూ లేదు కదా? 252 00:24:56,830 --> 00:24:59,333 మీరు హారి సెల్డన్ విచారణకు ఎందుకు వచ్చారు? 253 00:24:59,416 --> 00:25:01,335 గాల్ డోర్నిక్ పై మీకున్న ఆసక్తి ఏంటి? 254 00:25:03,378 --> 00:25:05,464 తన గురించి మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు? 255 00:25:05,547 --> 00:25:08,258 కుతూహులం పాపం కాదు కదా. 256 00:25:08,342 --> 00:25:10,177 మీ గ్రహంలో అయితే అది పాపమే కదా. 257 00:25:10,260 --> 00:25:12,971 -మహారాజా, మనం వెళ్లిపోవాలి. -నాకు ఇప్పుడు అర్థమైంది. 258 00:25:13,055 --> 00:25:16,266 ఆమె నిజమైన పూజారేనా అని ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. 259 00:25:16,767 --> 00:25:20,646 సెల్డన్ చెప్పిన జోస్యాన్ని ఆమె నిజంగా చూసిందో లేదో అని. 260 00:25:20,729 --> 00:25:23,148 తన గణితం ద్వారానే దాన్ని ఆమె చూడగలిగిందా అని. 261 00:25:23,232 --> 00:25:26,026 ఆమె ఇక్కడికి వచ్చింది. ఆ విషయం నాకు తెలుసు. 262 00:25:26,109 --> 00:25:28,111 -మీరు దేని గురించి మాట్లాడుకున్నారు? -మహారాజా. 263 00:25:28,779 --> 00:25:32,783 -రాజ్యం గురించి మీ దేవుడు తనకి చెప్పాడా? -స్లీపర్ కి ఆమె ఎవరో తెలీదు. 264 00:25:32,866 --> 00:25:36,912 -మహారాజా, మాతో రండి. -తను పూజారి కాదు. మీ రాజ్య పతనం తప్పదు. 265 00:26:37,890 --> 00:26:40,976 అత్యంత అధునాతన గణితం, సిక్స్త్ సెన్స్ లాంటిది. 266 00:26:41,935 --> 00:26:45,439 లెక్క సరైనది అయితే, అది మనకి భవిష్యత్తును చూపగలదు. 267 00:26:47,191 --> 00:26:51,278 మనకి అదృష్టముంటే, భవిష్యత్తును ఎదుర్కొనేలా అది మనల్ని సిద్ధం చేయగలదు. 268 00:27:46,416 --> 00:27:50,712 86,981,767. 269 00:27:52,005 --> 00:27:56,134 86,981,771. 270 00:27:57,344 --> 00:28:01,265 86,981,779. 271 00:28:12,943 --> 00:28:14,862 నువ్వు చాలా సేపటి నుండి ఈదుతూనే ఉన్నావు. 272 00:28:16,029 --> 00:28:17,239 అవునా? 273 00:28:19,157 --> 00:28:22,744 నువ్వు ఇక పైకి రావేమో అని అనిపించడం మొదలైంది. 274 00:28:24,204 --> 00:28:26,331 ఎందుకు ఎప్పుడూ చీకట్లోనే ఉంటావు? 275 00:28:26,999 --> 00:28:28,125 వెలుతురులోనే ఎందుకు ఉండాలి? 276 00:28:29,376 --> 00:28:31,295 చీకటిలో ఉంటున్నావంటే సిగ్గుచేటుగా ఫీలవుతున్నావని అర్థం. 277 00:28:33,046 --> 00:28:34,882 నువ్వు సిగ్గుచేటుగా ఫీలవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. 278 00:28:41,305 --> 00:28:45,058 హారి, మీరు నాతో ఏమైనా మాట్లాడాలానుకుంటున్నారా? 279 00:28:45,934 --> 00:28:49,813 నిన్ను తొలిసారిగా కలిసినప్పుడు, నేను రేయిచ్ తో... 280 00:28:51,648 --> 00:28:54,193 "తను నేను ఊహించనదానికన్నా తెలివైనది," అని అన్నాను. 281 00:28:56,278 --> 00:28:57,613 మీరిద్దరూ కూడా అంతే. 282 00:28:59,406 --> 00:29:03,202 గత కొన్ని నెలలు నాకు దక్కిన వరం అని చెప్పవచ్చు. 283 00:29:04,369 --> 00:29:06,705 వెలి అనేది జరుగుతుందని అంచనా వేశాను. 284 00:29:07,247 --> 00:29:10,250 ఫలితాన్ని మార్చడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ... 285 00:29:11,668 --> 00:29:14,963 నౌకలో నేను కూడా ఒకడిగా ప్రయాణిస్తానని మాత్రం నేను అస్సలు ఊహించలేదు. 286 00:29:15,964 --> 00:29:17,090 మరి ఏం మారింది? 287 00:29:22,137 --> 00:29:24,598 పునాది సమావేశానికి ఆలస్యంగా వెళ్ళవద్దు. 288 00:29:24,681 --> 00:29:29,436 ఐదు నిమిషాలు ముందు వెళ్తే, లూయిస్ పైరీన్ దృష్టిలో మూడు నిమిషాలు ఆలస్యమైనట్టు. 289 00:29:36,985 --> 00:29:38,195 అతనికి మన గురించి తెలుసు. 290 00:29:38,278 --> 00:29:41,073 అతను సైకోహిస్టోరియన్. గణితాన్ని చదవగలడు, మనస్సులను కాదు. 291 00:29:41,573 --> 00:29:44,284 నేనూ గణితాన్నే చదవగలను, కానీ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. 292 00:29:44,952 --> 00:29:47,287 అతనికి చెప్పాలంటే నీకు భయం, నీకు దాని గురించి మాట్లాడాలని కూడా లేదు. 293 00:29:47,371 --> 00:29:49,915 -మనిద్దరమూ అంగీకరించాం కదా. -అతనికి అది నచ్చదని నువ్వే చెప్పావు. 294 00:29:49,998 --> 00:29:52,626 -అతనికి నచ్చదు. -అతనికి మనం ఆనందంగా ఉంటే నచ్చదా? 295 00:29:53,502 --> 00:29:56,421 ఎందుకంటే, బంధాలు పక్కదారి పట్టిస్తాయని అతను భావిస్తాడు. 296 00:29:56,505 --> 00:29:59,424 మానవ బంధాల కోసం కాకపోతే, ఇప్పుడు మనం చేసే ప్రయత్నం దేనికని? 297 00:29:59,508 --> 00:30:01,051 మనం రోబోట్లగా ఉండాలని అతను అనడం లేదు. 298 00:30:01,134 --> 00:30:03,428 -కానీ మనిద్దరమూ... -అయితే అతనికి ఈర్ష్యగా ఉందంటావా? 299 00:30:05,013 --> 00:30:06,473 గణితం పూర్తిగా లేదు. 300 00:30:07,266 --> 00:30:09,434 -ఏంటి? -గణితం. 301 00:30:09,518 --> 00:30:12,729 హారి యొక్క ప్లాన్. అది ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదు. 302 00:30:12,813 --> 00:30:16,316 నేను అది ప్రైమ్ రేడియంట్ లో చూశాను. కానీ నేను విచారణ సమయంలో చెప్పలేదు. 303 00:30:16,900 --> 00:30:21,488 అది చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా లేదని నేను అనడంలేదు, కానీ అంతా పరిష్కరించబడలేదు. 304 00:30:21,989 --> 00:30:24,116 అందులో చాలా చిక్కుముళ్ళు ఉన్నట్టున్నాయి. 305 00:30:24,199 --> 00:30:27,244 కొన్ని ఉంటే, పరిస్థితి ఎలా ఉండే అవకాశముందో అంచనా వేయవచ్చు, 306 00:30:27,327 --> 00:30:29,204 కానీ చిక్కుముళ్ళయితే ఉన్నాయి. 307 00:30:29,913 --> 00:30:31,582 ఎన్ని చిక్కుముళ్ళు ఉన్నాయంటావు? 308 00:30:32,207 --> 00:30:34,042 పరిస్థితినే మార్చే అన్ని ఉంటాయా? 309 00:30:34,126 --> 00:30:35,669 నాకు తెలీదు. ఉండవచ్చు. 310 00:30:35,752 --> 00:30:37,212 డాక్టర్ సెల్డన్ ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? 311 00:30:38,839 --> 00:30:40,340 ఆయన రావడం లేదు. 312 00:30:41,049 --> 00:30:43,135 -నేను వస్తున్నాను. -సరే. 313 00:30:44,219 --> 00:30:45,304 మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటే, అప్పుడు మొదలుపెడదాం. 314 00:30:56,982 --> 00:30:59,234 మారీ, బడ్జెట్ ఉపసంఘం నివేదిక గురించి 315 00:30:59,318 --> 00:31:01,403 మాకు వివరంగా తెలపగలరా? 316 00:31:01,486 --> 00:31:06,825 ప్రారంభ పరిశోధన మరియు సర్వే బడ్జెట్ లో 5.6 శాతం మొత్తాన్ని, ట్రాంటార్ కి 317 00:31:06,909 --> 00:31:11,079 సమీపానున్న మూడు శాతం గ్రహాల కోసం కేటాయించడానికి ఉపసంఘం అంగీకరించింది. 318 00:31:11,163 --> 00:31:13,415 5.6 శాతమంటే ఎక్కువ అంటారా? 319 00:31:13,498 --> 00:31:15,417 ఎక్కువలానే అనిపిస్తోంది. 320 00:31:16,418 --> 00:31:20,088 మన్నించాలి. ప్రశ్నలు అడిగితే పర్లేదు కదా? 321 00:31:21,048 --> 00:31:22,049 తప్పకుండా. 322 00:31:22,841 --> 00:31:24,927 కానీ మన పరిరక్షణా కార్యకలాపాలను ఎక్కడ మొదలుపెట్టాలి అనే విషయమై 323 00:31:25,010 --> 00:31:27,095 మనం చర్చించడం ఇది మొదటిసారి కాదు. 324 00:31:27,179 --> 00:31:31,350 బడ్జెట్ కేటాయింపు ఆల్గారిథమ్ వివిధ రకాల జాతులను లెక్కలోకి తీసుకుంటుందా, 325 00:31:31,433 --> 00:31:34,853 ఒకవేళ తీసుకుంటే, దాన్ని దేని ఆధారంగా కొలుస్తుంది? 326 00:31:35,854 --> 00:31:39,274 పునాది మిషన్ లో భిన్నత్వం, వైవిద్యం అనేవి మూల స్తంభాలు. 327 00:31:39,358 --> 00:31:42,444 లోపలి గ్రహాలలో 40 లక్షల కోట్ల మంది ఉంటున్నారు, 328 00:31:42,528 --> 00:31:44,947 మూడు గ్రహాలు ఉన్నాయి, వందకు పైగా భాషలు ఉన్నాయి. 329 00:31:45,030 --> 00:31:49,076 కేటాయింపులను మేము నిర్ణయిస్తాం, కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదు. 330 00:31:49,159 --> 00:31:54,623 విషయమేంటంటే, పునాది విలువల ఆధారంగానే కేటాయింపులు నిర్ణయించబడ్డాయి. 331 00:31:55,499 --> 00:31:59,753 మన అన్ని వర్గాలను మనం కాపాడుతున్నామని చెప్పవచ్చు. 332 00:31:59,837 --> 00:32:01,255 అవునులెండి. 333 00:32:01,755 --> 00:32:05,634 మరి బేస్ 10 గురించి పునాది ఏమనుకుంటోంది? 334 00:32:07,177 --> 00:32:09,388 -మీరేమంటున్నారు? -బేస్ 10. 335 00:32:09,471 --> 00:32:12,224 నంబరింగ్ సిస్టమ్, ఒకటి, రెండు, మూడు, నాలుగు... 336 00:32:12,307 --> 00:32:13,475 అదేంటో మాకు తెలుసు. 337 00:32:13,976 --> 00:32:15,060 మీకు తెలుసులెండి, 338 00:32:15,644 --> 00:32:17,729 ఎందుకంటే అదే ట్రాంటార్ యొక్క గణితం, అలాగే గెలాక్సీ లోపలి భాగంలో ఉన్న 339 00:32:17,813 --> 00:32:21,358 మూడు శాతం వ్యవస్థలను పరిశీలిస్తే, ప్రతీ ఒక్కటి కూడా దాన్నే ఉపయోగిస్తుంది. 340 00:32:21,441 --> 00:32:24,236 మీరు దాన్ని పరిరక్షించాలనే చూస్తున్నారనుకుంటా? 341 00:32:25,654 --> 00:32:26,780 మేము లెక్కించేదే అలా కదా. 342 00:32:26,864 --> 00:32:28,615 మీరు, అలాగే మీ పక్కనున్న గ్రహాలూ, 343 00:32:29,283 --> 00:32:30,534 అలా లెక్కిస్తాయి. 344 00:32:31,994 --> 00:32:34,246 మీరు బేస్ 12 ని ఉపయోగిస్తున్నారా లేక బేస్ 27నా? 345 00:32:34,788 --> 00:32:36,665 వేయికి పైగా ప్రపంచాలు బెస్ 12ని ఉపయోగిస్తాయి, 346 00:32:36,748 --> 00:32:39,918 ఎందుకంటే, పది కంటే 12కి భాగాహారాలు ఎక్కువ. 347 00:32:40,002 --> 00:32:42,546 మూడు వందల వ్యవస్థలు బేస్ 27ని ఉపయోగిస్తున్నాయి. 348 00:32:43,172 --> 00:32:44,506 అది శరీర అవయవాలని లెక్కించడం నుండి వచ్చింది. 349 00:32:44,590 --> 00:32:47,301 -మీరేం చెప్పాలనుకుంటున్నారు? -నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 350 00:32:47,384 --> 00:32:49,511 మనం నాగరికత తాలూకు ముఖ్యమైన భాగాలను... 351 00:32:50,596 --> 00:32:53,599 పరిరక్షించడం మొదలుపెట్టి, 352 00:32:54,558 --> 00:32:56,810 దేన్ని గుర్తుంచుకోవాలి, 353 00:32:57,769 --> 00:32:59,188 దేన్ని మర్చిపోవాలి అని తేల్చేటప్పుడు... 354 00:33:02,024 --> 00:33:04,151 అసలు వాటిని లెక్కించాలి అనే విషయంలోనే 355 00:33:05,194 --> 00:33:07,362 మనం ఒక అంగీకారానికి రాలేకపోతే, ఇక మనకి వాటి గురించి ఎలా తెలుస్తుంది? 356 00:34:34,241 --> 00:34:35,492 అంతా బాగానే ఉంది. 357 00:34:40,371 --> 00:34:41,373 నిజంగానా? 358 00:34:41,956 --> 00:34:44,418 -మీరు ఇంకా... -మీరు నా గురించి చింతించనక్కర్లేదు. 359 00:34:45,127 --> 00:34:46,335 మీరు చనిపోయుండేవారు. 360 00:34:46,920 --> 00:34:49,464 అలా కాకుండా చాలా ఏళ్ళ నుండి మేనేజ్ చేస్తున్నానులెండి. 361 00:34:50,090 --> 00:34:51,967 నా జాతి, మీ జాతి వేర్వేరు. 362 00:34:53,427 --> 00:34:55,512 మీ జాతిలోని మిగతావారు చనిపోయారు. 363 00:34:56,679 --> 00:35:01,476 చావలేదు. వాళ్లని మీవాళ్ళు చంపేశారు. 364 00:35:02,060 --> 00:35:03,270 రెండూ వేర్వేరు. 365 00:35:05,355 --> 00:35:07,900 అందుకేనా మీరు ఎవరో అని నేను చూడటం మీకు ఇష్టం లేనిది? 366 00:35:09,401 --> 00:35:11,904 అది బాగుండదు కాబట్టి అది నాకు నచ్చదు. 367 00:35:12,404 --> 00:35:14,114 -కానీ... -నేను మనిషిలా నటిస్తేనే, 368 00:35:14,198 --> 00:35:15,824 నేను మనిషిని కాగలను. 369 00:35:18,493 --> 00:35:21,163 వాస్తవం ఒకలా ఉండి, మనం వేరేలా ఉంటే అయోమయంగా ఉంటుంది. 370 00:35:33,133 --> 00:35:34,343 మీరు నన్ను తప్పించుకొని తిరుగుతున్నారు. 371 00:35:34,927 --> 00:35:36,136 అలా అని నాకనిపించడం లేదే. 372 00:35:37,596 --> 00:35:39,598 నాకు మెట్లంటే నచ్చవని మీకు తెలుసు. 373 00:35:40,641 --> 00:35:42,351 మీకు నచ్చనిది ఇది. 374 00:35:43,143 --> 00:35:45,187 ముసలి రాజులతో సెంటిమెంటల్ గా ఉండాలంటే, 375 00:35:45,270 --> 00:35:47,731 నేను డిన్నర్ టేబుల్ లో ఎదురుగా చూస్తే సరిపోతుంది. 376 00:35:50,526 --> 00:35:52,861 మీ వయస్సులో నాకూ అలాగే అనిపించింది. 377 00:35:56,865 --> 00:35:59,034 ఒకసారి ఊహించుకోగలరా... 378 00:35:59,117 --> 00:36:03,413 నీ సామర్థ్యాలు, మేధస్సు ఇంకా దమ్ము మీద 379 00:36:03,497 --> 00:36:04,831 నీకు ఎంత నమ్మకం ఉంటే, 380 00:36:04,915 --> 00:36:08,377 నువ్వు ఇప్పట్నుంచీ, నువ్వు తొలివ్యక్తివి కాదు 381 00:36:09,086 --> 00:36:13,465 నువ్వే ఏకైక వ్యక్తివి అని నిర్ణయించుకోగలవో? 382 00:36:14,341 --> 00:36:18,887 "నేను ఒక మహానదిని, నా నుండి మిగతా నదులన్నీ ఉద్భవిస్తాయి." 383 00:36:19,596 --> 00:36:20,639 అతను అన్నది నిజమే. 384 00:36:20,722 --> 00:36:22,641 అవును. అయినా మనం ఉనికిలో ఉన్నాం కదా. 385 00:36:24,142 --> 00:36:28,230 కోట్లాది మందితో ముడిపడున్న జోస్యంతో లక్షలాది మంది చనిపోయారు. 386 00:36:28,313 --> 00:36:31,358 -సెల్డన్ కేవలం ఒక మనిషి, అంతే. -మనం కూడా ఒకప్పుడు అదే కదా. 387 00:36:31,441 --> 00:36:33,569 మీరు స్కార్ కి ఎందుకు వెళ్లారు? 388 00:36:36,697 --> 00:36:37,948 పూజారిని కలవడానికా? 389 00:36:39,449 --> 00:36:41,785 శిథిలాల నుండి ఇంకా శవాల వెలికితీత కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. 390 00:36:43,245 --> 00:36:44,746 ఎన్నో వారాల నుండి అది జరుగుతూనే ఉంది. 391 00:36:44,830 --> 00:36:47,291 మన ప్రపంచానికి ఏమైందో చూడటానికి వెళ్లాను, 392 00:36:47,374 --> 00:36:49,334 ఒక మహారాజుగా మీరు చేయాల్సిన పని అది. 393 00:36:49,418 --> 00:36:52,754 నేనే మహారాజుని, కనీసం ఆ విషయమైనా నిజాయితీగా చెప్పారులే. 394 00:36:59,469 --> 00:37:02,264 నేను అనాక్రీయాన్ మరియు తెస్పిన్ ప్రతినిధులను కలవాలనుకుంటున్నాను. 395 00:37:02,347 --> 00:37:05,517 -అది మీ పని కాదు. -కాదు, కానీ అది నా హక్కు. 396 00:37:47,935 --> 00:37:49,228 ఇదేమి ట్రిక్ కాదు. 397 00:37:49,978 --> 00:37:53,315 ఒకవేళ ఇది ట్రిక్కే అయితే, ఇంత మంచి వైన్ ని వృథా చేయనులే. 398 00:37:54,399 --> 00:37:55,400 భవిష్యత్తు కోసం. 399 00:37:56,276 --> 00:37:57,903 అది మనందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. 400 00:38:03,116 --> 00:38:04,409 మీకేం కావాలి? 401 00:38:04,993 --> 00:38:06,286 నిజం కావాలి. 402 00:38:06,370 --> 00:38:09,665 ఎన్నో వారాల నుండి, మేము నిజమే చెప్తున్నాం. 403 00:38:09,748 --> 00:38:14,044 మేమే అనాక్రీయాన్ పాటని పాడి, మళ్లీ ఎందుకు అది మేము కాదని అంటాం? 404 00:38:14,127 --> 00:38:16,088 మీలో ఎవరైనా తీవ్రవాదులు ఉన్నారా? 405 00:38:16,171 --> 00:38:18,715 అది అస్సలు అర్థవంతమైనది కాదని మీరు గ్రహించాలి. 406 00:38:18,799 --> 00:38:21,885 లేదా మీ ప్రభుత్వం మీకు అన్ని విషయాలూ చెప్పలేదేమో. 407 00:38:22,886 --> 00:38:27,641 ఇంపీరియమ్ కి 3,000 ఏళ్లుగా మేము విధేయులుగా ఉన్నాం. 408 00:38:28,267 --> 00:38:30,018 దీని వలన అనాక్రీయాన్ కి దక్కే లాభమేంటి? 409 00:38:31,603 --> 00:38:35,899 ఎవరో మన వినాశనాన్ని కోరుకుంటున్నారు. 410 00:38:35,983 --> 00:38:39,278 ఎవరో మనల్ని అంధకారం వైపు నెడుతున్నారు. 411 00:38:40,028 --> 00:38:41,029 దయచేసి నా మాట వినండి. 412 00:38:41,530 --> 00:38:42,531 దయచేసి నా మాట వినండి. 413 00:38:44,616 --> 00:38:46,159 మీరు చావబోతున్నారు. 414 00:38:46,910 --> 00:38:48,912 మహారాజు మిమ్మల్ని చంపబోతున్నారు, 415 00:38:49,496 --> 00:38:52,457 మీరు చేసిన పనికి అది తక్కువే అవుతుంది. 416 00:38:53,000 --> 00:38:56,295 వాసనలకు. కళ్ళ మంటలకు. 417 00:38:57,504 --> 00:39:01,800 పిల్లల బూడిదకు, వారి తల్లీదండ్రుల మరణాలకు. 418 00:39:03,468 --> 00:39:07,222 నా నోట్లో దాని తాలూకు రుచి కూడా నాకు తెలుస్తోంది! 419 00:39:16,356 --> 00:39:18,817 ఆ రుచి ఎప్పటికీ పోయేది కాదు. 420 00:39:20,611 --> 00:39:25,449 ఇదే మీ ప్రతిష్ట. మీది, మాది. 421 00:39:26,658 --> 00:39:28,410 అది కాకూడదని మనం కోరుకోవచ్చు. 422 00:39:28,493 --> 00:39:32,331 అది న్యాయమైనది కాదని మనం గట్టిగా అరవవచ్చు, మనం కరెక్టే కావచ్చు కూడా. 423 00:39:34,416 --> 00:39:35,959 ఎందుకంటే, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. 424 00:39:38,420 --> 00:39:40,130 మీలో ఒకరు నిజం చెప్తున్నారు. 425 00:39:42,591 --> 00:39:44,134 బహుశా ఇద్దరూ నిజమే చెప్తున్నారేమో. 426 00:39:51,808 --> 00:39:53,477 మేము మిమ్మల్నందరినీ వదిలేయాలి. 427 00:39:58,065 --> 00:39:59,149 మేము వదిలేయాలి. 428 00:40:04,488 --> 00:40:05,656 కానీ మేము ఆ పని చేయం. 429 00:40:16,208 --> 00:40:18,460 ముసలాయనకు చావు దగ్గరపడుతోంది, కదా? 430 00:40:29,930 --> 00:40:31,473 డాక్టర్ సెల్డన్? 431 00:40:31,557 --> 00:40:34,309 ఏదైనా సమస్యా? మేము మీకు డెలివర్ చేసినవాటిలో ఏమైనా మిస్ అయ్యాయా? 432 00:40:34,393 --> 00:40:39,857 లేదు, లేదు. నేనొక తెల్ల చొక్కా గురించి ఆలోచిస్తున్నాను. 433 00:40:39,940 --> 00:40:42,526 దానికి కఫ్ వద్ద ఒక ఇంక్ మరక ఉంటుంది. 434 00:40:42,609 --> 00:40:45,153 ఆ మరకని మేము ఇంకా తొలగించలేకపోయాం. 435 00:40:45,779 --> 00:40:47,281 ఆ మరక తప్పితే ఇక అంతా శుభ్రంగా ఉందా? 436 00:40:47,364 --> 00:40:50,033 అలా అయితే నాకు ఇచ్చేయండి పర్వాలేదు. మరక ఉన్నా పర్వాలేదు. 437 00:40:50,617 --> 00:40:52,286 డాక్టర్ సెల్డన్? 438 00:40:54,288 --> 00:40:55,622 చెప్పండి. 439 00:40:55,706 --> 00:40:57,374 నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా, సర్? 440 00:40:57,958 --> 00:41:00,502 నిస్సంకోచంగా అడగవచ్చు. నేను కూడా ప్రశ్నిస్తూనే జీవనం సాగించాను. 441 00:41:01,712 --> 00:41:04,756 -మీరు సంతోషంగా ఉన్నారా? -సంతోషమా? 442 00:41:05,507 --> 00:41:08,969 ప్లాన్ యొక్క పురోగతితో, సన్నాహాలతో మీరు సంతోషంగా ఉన్నారా? 443 00:41:09,553 --> 00:41:10,679 మీ పేరేంటి? 444 00:41:12,014 --> 00:41:13,307 వీణా. 445 00:41:13,390 --> 00:41:14,600 వీణా. 446 00:41:17,019 --> 00:41:18,312 వీణా ఆహ్లువాలియా. 447 00:41:19,521 --> 00:41:22,316 ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం, వీణా. 448 00:41:22,399 --> 00:41:25,319 మనం సవాళ్ళను ఎదుర్కొన్నాం. ఇంకా చాలా ఎదురుకానున్నాయి కూడా. 449 00:41:25,402 --> 00:41:30,490 కానీ మన ఆశయం సఫలం అవుతుందని నాకు నమ్మకంగా ఉంది. 450 00:41:31,366 --> 00:41:34,828 దానికి ముఖ్యమైన కారణం మీరే. 451 00:41:36,538 --> 00:41:37,539 మీరందరూ కూడా. 452 00:41:38,248 --> 00:41:40,459 ప్యాసింజర్ల జాబితాని నేనే ఆమోదించాను. 453 00:41:41,210 --> 00:41:44,338 అందులో ఉన్న ప్రతీ పేరునూ. 454 00:41:44,963 --> 00:41:47,341 నేటికి నూరేళ్ళ తర్వాత, 455 00:41:47,424 --> 00:41:53,680 బహుశా వెయ్యి ఏళ్ళు కూడా కావచ్చు, మీ పేర్లను తలుచుకుంటారు. 456 00:41:55,015 --> 00:41:57,976 గెలాక్సీ యొక్క భవిష్యత్తును నిర్దేశించే ఒక అస్పష్టమైన సిద్ధాంతం మీద 457 00:41:58,560 --> 00:42:04,274 ఒక గుడ్డి నమ్మకంతో తమ ప్రాణాలనే పణంగా మీద నమ్మకస్థులు మీరు, 458 00:42:04,942 --> 00:42:05,943 ఆ సిద్ధాంతాన్ని... 459 00:42:06,902 --> 00:42:08,820 ప్రార్థన అని కూడా అనవచ్చు. 460 00:42:09,696 --> 00:42:12,950 మీరు ఏం చేశారు అనేదానితో పని లేదు, 461 00:42:14,284 --> 00:42:16,620 మీరు అల్ట్రాసౌండ్ క్లీనర్ గా ఉన్నా, హీట్ ఎక్స్ఛేంజ్ ఇంజనీర్ గా ఉన్నా, 462 00:42:16,703 --> 00:42:20,290 లేక ఇక్కడ లాండ్రీలో పని చేస్తున్నా, అదేమీ ముఖ్యం కాదు. 463 00:42:21,375 --> 00:42:26,213 ఎందుకంటే ప్రజలు లేకుండా ఆ ప్రార్థన మనుగడ సాగించలేదు. 464 00:42:27,798 --> 00:42:29,049 మీరు లేకుండా. 465 00:42:30,300 --> 00:42:31,510 కాబట్టి... 466 00:42:33,762 --> 00:42:35,264 ధన్యవాదాలు, వీణా. 467 00:42:36,765 --> 00:42:39,852 ఇంక్ విషయంలో మన్నించండి, సర్. 468 00:42:40,435 --> 00:42:43,021 పర్వాలేదు. అది నాకు అలవాటేలెండి. 469 00:42:45,190 --> 00:42:46,775 అది నా శ్రమకి గుర్తు. 470 00:42:47,693 --> 00:42:48,777 డాక్టర్ సెల్డన్? 471 00:42:49,319 --> 00:42:50,904 చెప్పండి, థెరాన్? 472 00:42:51,530 --> 00:42:52,948 నేను మీకు షేక్ హ్యాండ్ ఇవ్వవచ్చా? 473 00:42:57,327 --> 00:42:58,453 ధన్యవాదాలు. 474 00:43:01,957 --> 00:43:04,543 -ధన్యవాదాలు, డాక్టర్. -ధన్యవాదాలు. ధన్యవాదాలు. 475 00:43:05,919 --> 00:43:07,254 ధన్యవాదాలు. 476 00:43:13,427 --> 00:43:15,304 అతను నూటికి నూరు పాళ్లు ఖచ్చితం కాదని మాత్రమే చెప్తున్నా. 477 00:43:15,888 --> 00:43:19,516 అబ్బాస్, 3డీ ప్రింట్ చేయబడిన మెట్రిక్స్ సంగతేంటి? 478 00:43:19,600 --> 00:43:20,934 మేం బంక మట్టితో పని చేస్తున్నాం... 479 00:43:21,018 --> 00:43:22,019 నీ కోసమే వెతుకుతున్నా. 480 00:43:22,769 --> 00:43:26,148 బడ్జెట్ సమావేశం మధ్యలో వెళ్లిపోయావేం? తెలిసినవారు ఒక్కరైనా ఉంటే బాగుండేది. 481 00:43:27,274 --> 00:43:31,904 క్షమించు, మనం ఒక స్పేస్ వాక్ కి సిమ్యులేషన్ ప్లాన్ చేయాలని హారీ అన్నాడు. 482 00:43:31,987 --> 00:43:35,073 ఇప్పుడా? మనం మంచు మీదే నడవలేని పరిస్థితిలో ఉన్నాం. 483 00:43:35,866 --> 00:43:38,702 -అతనితో నేను మాట్లాడతాను. -లేదు, నేనే... నేనే చూస్తాలే. 484 00:43:41,705 --> 00:43:43,290 నాకు ఆ వైన్ ఇలా ఇస్తావా? 485 00:43:45,375 --> 00:43:46,627 వైన్. 486 00:43:54,718 --> 00:43:55,844 ఇక్కడ నేను కూర్చోవడానికి స్థలం ఏమైనా ఉందా? 487 00:43:56,428 --> 00:43:58,847 -ఉంది. ఎందుకు లేదు. -ధన్యవాదాలు. 488 00:44:02,017 --> 00:44:05,771 రేయిచ్, మనిద్దరం కలిసి తొలిసారిగా తిన్న సందర్భం 489 00:44:05,854 --> 00:44:07,773 నీకు గుర్తులేదు కదా? 490 00:44:09,650 --> 00:44:11,735 లేదు, నాకు అయితే గుర్తురావడం లేదు. 491 00:44:12,903 --> 00:44:15,239 అదేమంత పెద్ద సందర్భం కాదులే. 492 00:44:16,031 --> 00:44:17,199 అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. 493 00:44:18,742 --> 00:44:20,911 నేను అప్పుడు విశ్వవిద్యాలయంలో చేరాను, 494 00:44:20,994 --> 00:44:22,579 అప్పట్లో ఆహార బడ్జెట్ అంతగా లేదు. 495 00:44:22,663 --> 00:44:26,708 నేను మష్రూమ్ సూప్, ఇంకా ఆ ఉదయం చేసిన చికెన్ లెగ్ పీస్ తెచ్చుకున్నా. 496 00:44:27,459 --> 00:44:30,337 లెగ్ పీస్ బాగా చిన్నగా, బంకగా ఉండింది. 497 00:44:30,420 --> 00:44:33,090 కానీ వేడి చేసి, బ్రెడ్లో పెట్టి ఇచ్చారు. 498 00:44:35,676 --> 00:44:36,885 రుచి అదిరిపోయింది. 499 00:44:39,346 --> 00:44:41,974 అప్పుడు అతనికి ఆరు ఏడు ఏళ్ళు ఉండవచ్చు. 500 00:44:42,057 --> 00:44:44,393 నేను అతని అరుదైన పుస్తకాల విభాగంలో పట్టుకున్నాను, 501 00:44:44,977 --> 00:44:48,313 తన ప్యాంటులో రెండు అల్వారెజ్ పుస్తకాలు దోపుకొని ఉన్నాడు. 502 00:44:49,690 --> 00:44:50,691 నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు, 503 00:44:50,774 --> 00:44:53,986 వాటిని నీ షార్టులలో దోపుకోవడం సులభమే అయినా, బ్లాక్ మార్కెట్ లో ఆ పుస్తకాలకు 504 00:44:54,069 --> 00:44:56,989 డబ్బులు ఎక్కువ ఇస్తారని నీకెలా తెలిసింది అనే విషయం. 505 00:44:59,157 --> 00:45:02,452 మీ అమ్మగారు, నాకు అర్థమైనంత వరకు, ఆమె అప్పటికే మరణించింది, 506 00:45:03,036 --> 00:45:06,790 ఇంకా మీ నాన్నగారు, నువ్వెంత డబ్బులు తెస్తే, వాటితో తాగేవాడు. 507 00:45:06,874 --> 00:45:08,750 అది నిజం కాదు. 508 00:45:08,834 --> 00:45:10,252 మా నాన్న అప్పుడు తాగేవాడు కాదు. 509 00:45:11,587 --> 00:45:13,255 అతను తాగేవాడే, బాబూ. 510 00:45:13,338 --> 00:45:14,882 మా నాన్న హీట్ సింకుల్లో పని చేసేవాడు. 511 00:45:15,465 --> 00:45:17,801 ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి, అతని వీపు కాలిపోయింది. 512 00:45:17,885 --> 00:45:19,761 నేను ఆ పుస్తకాలను మందులు కొనడానికని దొంగలించాను, 513 00:45:20,429 --> 00:45:21,847 తద్వారా అతను మళ్లీ పనికి వెళ్లగలడు అని. 514 00:45:26,101 --> 00:45:27,352 అతను తర్వాత ఎప్పటికో కానీ తాగడం మొదలుపెట్టలేదు. 515 00:45:29,271 --> 00:45:31,315 మీ దగ్గరికి నేను వచ్చిన తర్వాత అన్నమాట. 516 00:45:47,581 --> 00:45:49,791 నేను గతాన్ని గుర్తుపెట్టుకోవడంలో కన్నా 517 00:45:49,875 --> 00:45:51,710 జోస్యమే బాగా చెప్తాననుకుంటా. 518 00:45:59,551 --> 00:46:00,677 హేయ్. 519 00:46:05,891 --> 00:46:07,809 ఇప్పటిదాకా నేను ఈ సెటప్ ని చూడనేలేదే. 520 00:46:08,393 --> 00:46:10,437 ఇది రెండేళ్లకొకసారే వస్తుంది, 521 00:46:10,521 --> 00:46:12,356 అందుకని దీన్ని సిమ్యులేషన్ కోసం ఉపయోగించరు. 522 00:46:12,439 --> 00:46:14,483 నీకు, హారీకి ఏమైంది? 523 00:46:18,737 --> 00:46:19,780 ఏం కాలేదు. 524 00:46:21,031 --> 00:46:22,115 ఏమీ కాలేదా? 525 00:46:23,450 --> 00:46:24,493 ఏం కాలేదు. 526 00:46:26,036 --> 00:46:28,163 నేను గణితం విషయంలో కనిపెట్టిన దాన్ని... 527 00:46:29,081 --> 00:46:30,457 నీకు చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. 528 00:46:31,542 --> 00:46:35,379 లేదు, అది... ఒకటి గుర్తు చేసి మంచి పని చేసింది. 529 00:46:38,257 --> 00:46:41,301 హారి పొరపాట్లు చేస్తాడు. అతనేమీ నూటికి నూరు శాతం ఖచ్చితమైనవాడు కాదు. 530 00:46:42,010 --> 00:46:46,515 అవును, కానీ ఏ పొరపాట్లు ముఖ్యమో నాకు అర్థం కావడం లేదు. 531 00:46:48,100 --> 00:46:51,687 చిక్కుముళ్ళని విప్పినా, అవన్నీ ఈ పరిస్థితికే దారితీస్తాయేమో. 532 00:46:53,605 --> 00:46:55,482 కానీ నువ్వు గణితాన్ని అయితే నమ్ముతావు కదా. 533 00:46:58,527 --> 00:46:59,653 నమ్ముతాను. 534 00:47:04,283 --> 00:47:05,534 ఇదే ప్లాన్. 535 00:47:08,912 --> 00:47:10,664 ఇప్పుడు వెనకడుగు వేయలేం. 536 00:47:16,420 --> 00:47:18,463 ఇప్పటికీ అతనికి కుళ్ళనే అనిపిస్తోంది. 537 00:47:20,632 --> 00:47:23,177 అవును. ఎవరికి మాత్రం ఉండదు? 538 00:47:26,722 --> 00:47:30,559 మనం టర్మినస్ కి వెళ్లాక, మనకి మరింత స్వేచ్ఛ దొరుకుతుంది. 539 00:47:32,769 --> 00:47:35,731 మనకంటూ ఒక చిన్ని చోటు దొరుకుతుంది. 540 00:47:36,940 --> 00:47:38,567 అక్కడ మనమొక ఇల్లు కట్టుకోవచ్చు. 541 00:47:39,651 --> 00:47:42,279 బహుశా ఇద్దరు పిల్లలు కూడా చలిమంట దగ్గర పడుకొని ఉంటారేమో. 542 00:47:50,996 --> 00:47:53,749 పిల్లలు అని చెప్పగానే అంతసేపు మౌనంగా ఉండిపోయావు. 543 00:47:55,125 --> 00:47:56,293 నీకు పిల్లలు కావాలి కదా? 544 00:48:02,549 --> 00:48:03,550 గాల్... 545 00:48:05,636 --> 00:48:06,803 నీతో... 546 00:48:10,224 --> 00:48:11,433 నాకు అదంతా కావాలి. 547 00:48:22,402 --> 00:48:24,238 ఉన్నంత సేపూ అది బాగా ఆహ్లాదకరంగా అనిపించింది. 548 00:48:24,988 --> 00:48:26,031 ఆగు. 549 00:49:26,842 --> 00:49:28,510 నక్షత్ర వారధి. 550 00:49:29,469 --> 00:49:33,432 అనాక్రీయాన్ మరియు తెస్పిస్ విషయంలో మనమేదోకటి తేల్చాలి. 551 00:49:33,515 --> 00:49:34,766 నేనేమనుకుంటానో నీకు తెలుసు. 552 00:49:34,850 --> 00:49:38,312 మహారాజు కాస్తంత దయ చూపితే బాగుంటుందని అనిపిస్తోంది. 553 00:49:39,062 --> 00:49:40,522 కాస్తంత ప్రయోజనం కూడా అందించవచ్చేమో. 554 00:49:40,606 --> 00:49:42,107 హరి సెల్డన్ కి సంబంధించిన అన్ని విషయాలలో 555 00:49:42,191 --> 00:49:44,776 మీరు "శిక్ష గురించి అతిగా ఆలోచించవద్దు," అని సలహాలిచ్చారు, 556 00:49:44,860 --> 00:49:47,446 ఇప్పుడేమో ఇలా అంటున్నారే. 557 00:49:48,614 --> 00:49:50,157 అదీ అన్న నేనే, ఇది కూడా అంటున్నాను. 558 00:49:51,074 --> 00:49:53,368 మనిద్దరమూ కూడా ఒకరమే. 559 00:49:58,373 --> 00:50:00,626 మీరేమంటారు, ఉదయిస్తున్న వేకువ గారూ? 560 00:50:04,838 --> 00:50:08,050 మన మీద దాడి జరిగింది? అది మీకెలా అనిపిస్తోంది? 561 00:50:08,592 --> 00:50:10,344 చెప్పండి, బాబూ. 562 00:50:11,720 --> 00:50:13,180 ఆయనకి సమాదానం చెప్పండి. 563 00:50:16,517 --> 00:50:19,019 -నాకు భయంగా ఉంది. -అవును. 564 00:50:19,102 --> 00:50:22,064 అది నిజమే. జనాలు కూడా భయం గుప్పెట్లో బతుకుతున్నారు. 565 00:50:23,982 --> 00:50:27,027 అందుకే ఇప్పుడు మనం అందరికీ స్థైర్యంగా ఉన్నామని... 566 00:50:28,820 --> 00:50:30,572 చూపాలి. 567 00:51:10,362 --> 00:51:12,030 మహారాజు గారి శాంతి. 568 00:51:13,782 --> 00:51:16,076 ఇది ఇంపీరియమ్ చేసే వాగ్దానం. 569 00:51:16,827 --> 00:51:23,333 ఇది క్లియాన్ I, అలాగే ఆ తర్వాత వచ్చిన అనేక మంది క్లియాన్లు మీకు ఇచ్చిన మాట. 570 00:51:24,710 --> 00:51:27,546 ఇది ఎన్నో శతాబ్దాలుగా సాగిన మజిలీ, 571 00:51:28,130 --> 00:51:31,884 తరతరాలుగా మేము పరిరక్షిస్తూ వస్తున్నాం. 572 00:51:33,427 --> 00:51:35,137 దాన్ని మేము ప్రమాదంలోకి నెట్టలేము. 573 00:51:36,013 --> 00:51:43,020 ఇవాళ కానీ, రేపు కానీ, లేదా ఇంకెప్పుడైనా కానీ. 574 00:51:54,865 --> 00:51:58,327 శాంతికి విఘాతం కలిగిస్తే, అందుకు మూల్యం చెల్లించాల్సిందే. 575 00:51:59,745 --> 00:52:02,956 ట్రాంటార్ కి చెరగని గాయం తగిలింది. 576 00:52:03,040 --> 00:52:06,126 ఆ గాయం పౌరులందరికీ తగిలింది. 577 00:52:07,419 --> 00:52:11,215 ఆ గాయం తాలూకు బాధను అందరూ తరతరాలుగా అనుభవించవలసి ఉంటుంది. 578 00:52:11,298 --> 00:52:15,344 ఆ మచ్చ వాళ్ళ నుండి చెరిగిపోదు, కానీ వాళ్ళు మనుగడ సాగిస్తారు. 579 00:52:16,178 --> 00:52:20,682 వాళ్లు జీవనం కొనసాగిస్తారు. మా ప్రపంచం కూడా కొనసాగుతుంది! 580 00:52:23,393 --> 00:52:24,978 కానీ మీరు... 581 00:52:25,062 --> 00:52:26,230 బతకరు. 582 00:52:27,439 --> 00:52:30,359 మీ ప్రపంచాలు కూడా బతకవు. 583 00:52:30,442 --> 00:52:34,947 గాయాలు, మచ్చలు లేకుండా అస్సలు కొనసాగనివ్వను! 584 00:53:16,905 --> 00:53:18,073 చూడండి. 585 00:55:01,468 --> 00:55:03,303 మీ ప్రపంచాలకు వెళ్లిపోండి. 586 00:55:04,263 --> 00:55:07,558 వారిని మీరు కాపాడలేకపోయారని, చనిపోయినవారికి, బతికున్నవారికి చెప్పండి. 587 00:55:33,792 --> 00:55:36,295 అన్నీ ఎంపికలూ ఇలాగే ఉండవులే. 588 00:55:36,753 --> 00:55:38,547 కొన్నిసార్లేనా? 589 00:55:39,506 --> 00:55:40,549 కొన్నిసార్లే. 590 00:55:42,176 --> 00:55:43,510 మీరు ఒంటరిగా ఉండరులే. 591 00:55:44,219 --> 00:55:46,638 మీకు తోడుగా మీ సోదరులు, ఇంకా నేను కూడా ఉంటాను. 592 00:55:47,222 --> 00:55:49,641 నేనెప్పట్నుంచో ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను కూడా. 593 00:55:51,018 --> 00:55:53,061 ఇలా ఎంత తరచుగా జరుగుతుంది? 594 00:55:53,937 --> 00:55:55,772 మనం ఎంత తరచుగా ఈ శిక్షను ఎంచుకుంటాం? 595 00:55:58,525 --> 00:56:00,152 మీరు ఎప్పుడూ చేసేదే ఇది. 596 00:56:02,321 --> 00:56:04,823 ఆచారాలు మనకి అండగా ఉంటాయి. 597 00:56:05,699 --> 00:56:08,869 ఇతరులు చేసిన ప్రయాణాన్నే మళ్లీ చేయడంలో కాస్తంత సౌకర్యం ఉంటుంది. 598 00:56:10,287 --> 00:56:13,165 ఒకానొకప్పుడు, నేను నా తల్లిదండ్రుల ప్రపంచంలో ప్రార్థించాను. 599 00:56:13,874 --> 00:56:18,754 కానీ ఆ తర్వాత, నా ప్రపంచం విస్తరించింది, నా వస్తవికత వర్ణింపసాధ్యం కానిదయింది. 600 00:56:21,006 --> 00:56:22,883 ఇప్పుడు నేను ప్రార్థించే భాష మారిపోయింది. 601 00:56:25,969 --> 00:56:30,390 86,981,803. 602 00:56:30,474 --> 00:56:34,186 86,981,821. 603 00:56:35,062 --> 00:56:39,024 86,981,827. 604 00:56:39,900 --> 00:56:44,613 86,981,848. 605 00:56:46,615 --> 00:56:48,408 కాదు. అది సరైనది కాదు. 606 00:56:49,660 --> 00:56:54,164 86,981,849. 607 00:57:01,296 --> 00:57:02,464 ఏదో జరగరానిది జరుగుతోంది. 608 00:57:18,981 --> 00:57:20,065 రేయిచ్? 609 00:57:21,233 --> 00:57:22,442 రేయిచ్? 610 00:57:53,098 --> 00:57:54,600 రేయిచ్, నువ్వేం... 611 00:57:56,310 --> 00:57:57,394 గాల్, నువ్వు ఇక్కడ ఉండకూడదు. 612 00:57:57,477 --> 00:57:59,646 -ఏం చేశావు నువ్వు? -నువ్వు ఇక్కడ ఉండకూడదు. 613 00:58:01,773 --> 00:58:03,525 -గాల్. గాల్. -హారి. 614 00:58:04,109 --> 00:58:05,235 హారి. 615 00:58:06,028 --> 00:58:07,070 హారి. హారి. 616 00:58:07,154 --> 00:58:10,407 గాల్, నువ్వు వెంటనే వెళ్లిపోవాలి! గాల్! 617 00:58:16,538 --> 00:58:18,540 హెచ్చరిక, హెచ్చరిక. 618 00:58:18,624 --> 00:58:22,085 హారి సెల్డన్ గారి జీవ క్రియలన్నీ ఆగిపోయాయి. 619 00:58:22,169 --> 00:58:23,420 హెచ్చరిక. హెచ్చరిక. 620 00:58:23,504 --> 00:58:24,922 గాల్? రేయిచ్? 621 00:58:25,005 --> 00:58:27,424 -పదా! పదా! -ఏం జరుగుతోంది? 622 00:58:27,508 --> 00:58:32,012 హెచ్చరిక. హారి సెల్డన్ గారి జీవ క్రియలన్నీ ఆగిపోయాయి. 623 00:58:32,095 --> 00:58:33,764 హెచ్చరిక. హెచ్చరిక. 624 00:58:35,974 --> 00:58:38,185 హెచ్చరిక. హెచ్చరిక. 625 00:58:38,268 --> 00:58:41,522 హారి సెల్డన్ గారి జీవ క్రియలన్నీ ఆగిపోయాయి. 626 00:58:42,773 --> 00:58:44,441 -ఓరి దేవుడా. -లోపలికి ఎక్కు. 627 00:58:45,067 --> 00:58:46,735 కంగారుపడకు. నీకేమీ కాదు. 628 00:58:52,741 --> 00:58:54,326 పెనుగులాడకు. పెనుగులాడకు. 629 00:58:54,409 --> 00:58:56,954 శాంతించు. నీకు శ్వాస ఆడుతుంది. నీకు శ్వాస ఆడుతుంది. 630 00:58:57,538 --> 00:58:59,665 ద్రవంలో కూడా శ్వాస ఆడుతుంది. శాంతంగా ఉండు. 631 00:59:00,207 --> 00:59:02,626 ప్రైమ్ నంబర్లను లెక్కిస్తూ ఉండు. ప్రైమ్ నంబర్లను లెక్కిస్తూ ఉండు. 632 00:59:03,168 --> 00:59:04,670 ప్రైమ్ నంబర్లను లెక్కిస్తూ ఉండు. 633 00:59:11,802 --> 00:59:13,053 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 634 00:59:16,181 --> 00:59:17,182 నన్ను క్షమించు. 635 00:59:48,755 --> 00:59:53,886 86,981,861. 636 00:59:55,262 --> 01:00:00,517 86,981,893. 637 01:00:02,227 --> 01:00:09,151 86,981,897. 638 01:00:10,861 --> 01:00:17,826 86,981,927. 639 01:00:19,703 --> 01:00:21,121 నీతో, నాకు అదంతా కావాలి. 640 01:00:22,748 --> 01:00:27,669 …981,953. 641 01:00:29,296 --> 01:00:33,759 ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల... 642 01:01:36,363 --> 01:01:38,365 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య