1 00:01:07,401 --> 00:01:09,403 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 2 00:01:27,129 --> 00:01:29,548 నా చిన్నప్పుడు, గెలాక్టిక్ సామ్రాజ్యంలో ఉన్న 3 00:01:29,631 --> 00:01:32,759 ప్రతీ గ్రహం గురించి నేర్చుకోవాలనుందని మా అమ్మకి చెప్పాను... 4 00:01:34,803 --> 00:01:37,890 సౌరమండలం మధ్య నుండి, చిట్టచివరి గ్రహం దాకా అన్ని గ్రహాల గురించి. 5 00:01:39,183 --> 00:01:41,226 ప్రతీ రాత్రి, ఆమె నాకు కథలు చెప్పేది. 6 00:01:43,645 --> 00:01:46,190 నేను ఎన్నెన్నో దూరాలు ప్రయాణించాను... 7 00:01:48,150 --> 00:01:49,151 టర్మినస్ 8 00:01:49,234 --> 00:01:51,236 ...ఎన్నెన్నో గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సొంతం చేసుకున్నాను. 9 00:01:53,947 --> 00:01:55,908 కానీ ఇప్పటిదాకా నేను టర్మినస్ పై కాలు మోపలేదు. 10 00:01:56,992 --> 00:02:01,914 నాగరికతకు అందనంత దూరాన, మనుషులు లేని ఈ గ్రహం... 11 00:02:03,248 --> 00:02:04,416 గెలాక్సీ అంచున ఉంటుంది. 12 00:02:10,839 --> 00:02:14,676 దానికి సంబంధించిన వివరాలు నాకు చాలా కాలం తర్వాత గానీ తెలియలేదు. 13 00:02:15,928 --> 00:02:17,513 అది నా గాథ అయ్యేదాకా తెలియలేదు. 14 00:02:19,473 --> 00:02:20,891 దానికే నేను అంకితమయ్యేదాకా... 15 00:02:22,017 --> 00:02:23,685 తెలియలేదు. 16 00:02:51,046 --> 00:02:53,048 -అలా భయపెట్టకు. -క్షమించు. 17 00:02:54,341 --> 00:02:57,052 -మిగతావాళ్ళు ఎక్కడ? -వాళ్ళని కంచె దగ్గర కలుసుకుంటాం. 18 00:02:57,135 --> 00:02:58,136 మనకి కాస్త ఆలస్యమైంది. 19 00:03:00,639 --> 00:03:02,057 ఇక పదండి. 20 00:03:12,484 --> 00:03:14,027 -గియా! -ఇక్కడన్నీ రాళ్లే ఉన్నాయి. 21 00:03:20,117 --> 00:03:21,118 అయ్యో. 22 00:03:23,161 --> 00:03:24,204 అది బిషప్స్ క్లా. 23 00:03:24,955 --> 00:03:27,541 -లోయ పైభాగాన. -మనం అస్సలు శబ్దం చేయకూడదు. 24 00:03:33,422 --> 00:03:36,133 శూన్య క్షేత్రం అక్కడి నుండి, ఆ బండ రాయి నుండి మొదలవుతుంది. 25 00:03:38,093 --> 00:03:40,304 దాన్ని "వాల్ట్" అని పిలుస్తారు. 26 00:03:40,387 --> 00:03:42,097 అదొక ఫీల్డ్ ని ఉత్పత్తి చేస్తుందని, 27 00:03:42,181 --> 00:03:45,100 తద్వారా జనాలను అటు రాకుండా చేస్తుందని అక్కడి వాళ్ళందరికీ తెలుసు, 28 00:03:45,851 --> 00:03:47,728 దాన్ని దాటి ఎవరూ ముందుకు వెళ్లలేరు. 29 00:03:52,900 --> 00:03:54,818 సరే మరి, ముందు నువ్వు వెళ్తావా? 30 00:03:54,902 --> 00:03:56,445 ముందు వెళ్లేది నువ్వు అనుకున్నానే? 31 00:03:57,571 --> 00:03:59,698 నువ్వు ముందు వెళ్లి, నీ గుర్తును ఆ బండరాయి అవతల పెడితే, 32 00:04:00,365 --> 00:04:02,367 -నువ్వు నన్ను అక్కడ ముట్టుకోవచ్చు. -గియా. 33 00:04:02,451 --> 00:04:03,452 ఒక నిమిషం పాటు ముట్టుకుంటాను. 34 00:04:03,535 --> 00:04:05,287 పది సెకన్లు అంతే. 35 00:04:05,370 --> 00:04:07,331 లేదా వాటిని 30 సెకన్ల పాటు నువ్వు చూడవచ్చు. 36 00:04:08,248 --> 00:04:09,499 ఒట్టేసి చెప్పు. 37 00:04:10,292 --> 00:04:11,293 మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. 38 00:04:14,254 --> 00:04:17,048 -నువ్వు గెలిస్తే నీకు ఏమీ దక్కదు. -వాడు ప్యాంటు తడుపుకోవడం చూస్తాగా. 39 00:04:19,885 --> 00:04:21,303 వాడు చేరుకోలేడు. 40 00:04:22,137 --> 00:04:23,263 ధైర్యంగా వెళ్లు, కీర్. 41 00:04:50,666 --> 00:04:51,667 కీర్. 42 00:04:52,960 --> 00:04:53,919 నువ్వు బాగానే ఉన్నావా? 43 00:04:54,002 --> 00:04:56,588 -నీ తమ్ముడు ఒక దద్ధమ్మ. -గియా, వాడిని వెక్కిరించకు. 44 00:04:57,506 --> 00:05:00,592 -వీడు ఎందుకూ పనికిరాడు. -దాదాపుగా చేరుకున్నా. దగ్గరగా వెళ్లా. 45 00:05:00,676 --> 00:05:01,802 పోలీ, ఎక్కడికి వెళ్తున్నావు? 46 00:05:01,885 --> 00:05:04,137 -అయ్యో. పోలీ! -పోలీ, వెనక్కి వచ్చేయ్! 47 00:05:04,221 --> 00:05:06,390 -మన మధ్య పందెమేమీ లేదు. -నాకు తెలుసు. 48 00:05:07,182 --> 00:05:08,517 నాకు దెయ్యాన్ని చూడాలనుంది. 49 00:05:12,563 --> 00:05:13,772 ఏం కాదు. 50 00:05:38,505 --> 00:05:39,756 అయ్య బాబోయ్. 51 00:05:42,217 --> 00:05:44,344 -పోలీ? -వాడిలో కదలిక లేదు. 52 00:05:45,137 --> 00:05:46,638 పోలీ? 53 00:05:47,431 --> 00:05:50,017 -మనం ఎవరి సాయమైనా కోరాలి. -అయితే త్వరగా వెళ్దాం పద మరి? 54 00:06:19,505 --> 00:06:21,381 వాళ్లందరూ వెళ్లిపోయారు. తిను. 55 00:06:28,055 --> 00:06:29,056 నేను దెయ్యాన్ని చూశాను. 56 00:06:29,139 --> 00:06:30,307 నువ్వు చూసింది నన్ను, దెయ్యాన్ని కాదు. 57 00:06:31,725 --> 00:06:32,726 తిను. 58 00:06:34,394 --> 00:06:36,647 నీ స్నేహితుడు కీర్ లాగా నువ్వు కూడా వెనక్కి వెళ్లిపోయుండాల్సింది. 59 00:06:36,730 --> 00:06:39,566 దగ్గరగా వెళ్లాలని ప్రయత్నించిన వాళ్లు చాలా ఘోరంగా గాయాలపాలయ్యారు. చాలా ఘోరంగా. 60 00:06:39,650 --> 00:06:40,817 మరి నీకేమీ కాలేదు కదా. 61 00:06:40,901 --> 00:06:43,195 నువ్వే రికార్డు దూరం వెళ్లావు, కానీ నీకేమీ కాలేదు. 62 00:06:44,363 --> 00:06:45,364 నాకేమీ కాలేదని నీకు తెలుసా? 63 00:06:45,447 --> 00:06:48,116 నీ గుర్తు చాలా దూరంలో ఉంటుంది, దాన్ని ఎవరూ చూడలేదు కూడా. 64 00:06:48,200 --> 00:06:52,204 ఎందుకంటే, ఆ గుర్తు అనేదే అసలు లేదు కాబట్టి. అలాగే దెయ్యం కూడా లేదు. 65 00:06:56,416 --> 00:06:59,753 అసలు అదేంటో మనకి అది ఎప్పుడు చెప్తుందంటావు, వార్డెన్? 66 00:07:00,671 --> 00:07:01,755 నన్ను శాల్వార్ అని పిలువు చాలు. 67 00:07:03,006 --> 00:07:05,092 అది మన గురించి పట్టించుకుంటుందని అనుకుంటున్నావా? 68 00:07:06,218 --> 00:07:07,219 అస్సలు పట్టించుకోదు. 69 00:07:08,637 --> 00:07:12,599 దానికి దూరంగా ఉండేది, కేవలం మనుషులు మాత్రమే కాదు పక్షులూ, పురుగులూ, అన్నీ. 70 00:07:12,683 --> 00:07:16,311 శూన్య క్షేత్రాన్ని ఇప్పటిదాకా ఎవరూ దాటలేదు, ఇకముందు దాటలేరు కూడా. 71 00:07:16,812 --> 00:07:20,399 దూరంగా ఉండమని అది హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రమాదాన్ని ఆహ్వానించవద్దు. 72 00:07:21,275 --> 00:07:23,193 వెళ్లు. జాగ్రత్త. 73 00:07:23,902 --> 00:07:27,030 -ఒక బిషప్స్ క్లా ఉంది... -లోయ పైభాగాన. నాకు తెలుసులే. 74 00:07:32,703 --> 00:07:35,998 శాల్వార్ హార్డిన్, హోబర్ మాలో, కంత్రీ. 75 00:07:36,081 --> 00:07:37,082 ట్రాంటార్ 76 00:07:37,165 --> 00:07:38,917 ఏదోకరోజు నేను వీళ్ల గురించి తెలుసుకుంటాను. 77 00:07:40,586 --> 00:07:43,130 ముప్పై అయిదేళ్ళ క్రితం 78 00:07:43,213 --> 00:07:46,884 మానవజాతి ముక్తి కోసం పోరాడుతున్న వీరులు, విలన్లు. 79 00:07:47,718 --> 00:07:49,553 కానీ మన భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి, 80 00:07:49,636 --> 00:07:52,806 మన గతాన్ని, దీనికంతటికీ కారణమైన వారిని మనం గుర్తుంచుకోవాలి. 81 00:07:54,266 --> 00:07:55,475 అతనొక గణిత శాస్త్రవేత్త. 82 00:07:56,351 --> 00:07:57,477 తన ప్రాణాలను బలి ఇచ్చిన వ్యక్తి. 83 00:07:57,978 --> 00:07:59,188 ఒక హంతకుడు. 84 00:08:00,898 --> 00:08:05,027 మిగతావాళ్లందరిలోకల్లా ముఖ్యుడు, హారి సెల్డన్. 85 00:08:15,204 --> 00:08:16,997 తను త్వరలోనే ప్రయాణమవుతుంది. 86 00:08:22,920 --> 00:08:25,047 అంతా సర్దుకుంటుంది, రేయిచ్. 87 00:08:25,672 --> 00:08:27,174 అన్నీ అంతమవ్వబోతున్నాయి. 88 00:08:27,841 --> 00:08:29,885 దానర్థం ఇది సర్దుకోదని కాదు కదా. 89 00:08:30,761 --> 00:08:33,013 మరొక దారి ఉంటే బాగుండు అని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? 90 00:08:33,096 --> 00:08:34,597 ప్రతీరోజూ కోరుకుంటూ ఉంటాను, బాబూ. 91 00:08:37,017 --> 00:08:38,894 కానీ ఇదే సరైన సమయం. 92 00:08:49,947 --> 00:08:52,491 సినాక్స్ 93 00:08:54,701 --> 00:08:57,871 86,960,947. 94 00:08:58,956 --> 00:09:02,125 86,960,957. 95 00:09:02,918 --> 00:09:05,921 86,960,971. 96 00:09:06,004 --> 00:09:09,299 -86,960,987... -సమయమైంది. 97 00:09:10,843 --> 00:09:14,054 గాల్? సిద్ధమేనా? 98 00:09:16,390 --> 00:09:17,391 అవును. 99 00:09:21,770 --> 00:09:25,023 నా జీవితమంతా, నేను ఇంకెక్కడైనా జీవించాలని కలలు కన్నాను. 100 00:09:25,774 --> 00:09:28,235 ఈ దృశ్యాన్ని ఎంతగా మిస్ అవుతానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 101 00:09:28,318 --> 00:09:30,445 నేను దీన్ని ఉన్నద్ది ఉన్నట్టుగా సరిగ్గా గుర్తుంచుకోవాలి. 102 00:09:31,738 --> 00:09:32,906 లేదు, నీకు ఆ అవసరం లేదు. 103 00:09:34,199 --> 00:09:36,159 మనం పెద్ద పూజారులకు అర్జీ పెట్టుకోవచ్చు. 104 00:09:37,286 --> 00:09:41,665 నువ్వు దీన్ని ఇప్పుడైనా ఆపవచ్చు. నువ్వు ఇప్పుడైనా ఉండిపోవచ్చు. 105 00:09:41,748 --> 00:09:42,791 లేదు. 106 00:09:44,126 --> 00:09:46,128 ఇక్కడ నేను ఉండలేను, అమ్మా. 107 00:09:46,879 --> 00:09:49,006 ఇక్కడే ఉంటే చనిపోతాను. 108 00:09:50,299 --> 00:09:52,342 కానీ ట్రాంటార్ లో, నేను సురక్షితంగా ఉండగలను. 109 00:09:53,760 --> 00:09:54,845 నన్ను అందరూ స్వాగతిస్తారు. 110 00:09:57,514 --> 00:09:58,891 నిన్ను చూసి నువ్వు గర్వపడాలి. 111 00:10:19,995 --> 00:10:21,538 తనే. 112 00:10:31,256 --> 00:10:34,384 వాళ్లందరికీ నేనంటే అసహ్యం. నువ్వేమీ నన్ను అసహ్యించుకోవడం లేదు కదా? 113 00:10:34,468 --> 00:10:37,721 లేదు, గాల్. నీ మీద నాకు ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. 114 00:10:43,769 --> 00:10:45,812 నువ్వు నా వరాల మూటవి. 115 00:11:30,357 --> 00:11:31,358 నాతో పాటు వచ్చేయ్. 116 00:11:31,859 --> 00:11:33,485 మనం అక్కడ దూరమైపోతాం. 117 00:11:37,072 --> 00:11:38,156 వెళ్లు. 118 00:11:44,663 --> 00:11:45,706 నువ్వంటే నాకు ప్రాణం. 119 00:11:47,457 --> 00:11:48,584 బయలుదేరు, బంగారం. 120 00:12:37,341 --> 00:12:39,426 రవాణా సీక్వెన్స్ ని ప్రారంభిస్తోంది. 121 00:12:39,510 --> 00:12:42,888 జంప్ పాడ్స్ కి వెళ్లి, ప్రయాణానికి సన్నద్ధంకండి. 122 00:12:47,017 --> 00:12:49,353 మీరు ఏమైనా అన్నారా? 123 00:12:49,436 --> 00:12:54,107 లేదు. కానీ ఇంపీరియల్ వ్యోమనౌకని మీరు ఎక్కడం ఇదే తొలిసారా అని అడగబోతున్నా. 124 00:12:54,691 --> 00:12:57,903 అవును. ఇదే మొదటిసారి. కాస్త కంగారుగా ఉంది. 125 00:12:57,986 --> 00:13:00,614 మీ చేతిని స్క్రీన్ మీద పెట్టండి. 126 00:13:00,697 --> 00:13:02,616 -అది మీ మెట్రిక్స్ ని స్కాన్ చేస్తుంది. -ధన్యవాదాలు. 127 00:13:05,244 --> 00:13:07,371 -నా పేరు జెర్రిల్. -నా పేరు గాల్. 128 00:13:07,454 --> 00:13:08,622 మీది సినాక్స్ 129 00:13:08,705 --> 00:13:10,749 మీ యాసను బట్టి అదే అయ్యుంటుందని ఊహించాను. 130 00:13:10,832 --> 00:13:12,459 ఆ యాస కేంద్ర భాగంలో అంతగా వినిపించదు, 131 00:13:12,543 --> 00:13:14,795 కానీ ఒక్కోసారి నేను గెలాక్సీ అంచులలో ప్రయాణిస్తూ ఉంటాను. 132 00:13:15,587 --> 00:13:17,881 ప్రార్థనా రాళ్లను ఎవరు తీశారో కానీ చాలా చక్కగా తీశారు. 133 00:13:18,465 --> 00:13:20,801 అస్సలు మచ్చలే కనబడకుండా చాలా బాగా తీశారు. 134 00:13:21,385 --> 00:13:23,178 మరీ అతిగా వాగుతుంటే మన్నించండి. 135 00:13:23,262 --> 00:13:24,263 నాకేమీ ఇబ్బంది కలగలేదు కానీ, 136 00:13:24,346 --> 00:13:26,765 మొదటిసారి ప్రయాణం చేసే కొందరికి కడుపులో తిప్పవచ్చు. 137 00:13:26,849 --> 00:13:28,559 నేను తాగనులెండి. 138 00:13:28,642 --> 00:13:31,562 మా తల్లిదండ్రుల వృత్తి ఆల్గే పెంపకం, అందుకని మేం పొద్దునే లేచేవాళ్లం. 139 00:13:31,645 --> 00:13:34,189 మీరు ప్రయాణమంతా నిద్రలోనే ఉంటారు. వాళ్ళు మీకు మెలకువ రానివ్వరనుకోండి 140 00:13:34,273 --> 00:13:36,775 ప్రయాణ సమయంలో గురుత్వాకర్షణ శక్తిని తీసేస్తారు. ఎందుకో నాకు తెలీదు మరి. 141 00:13:36,859 --> 00:13:38,944 అంటే, గురుత్వాకర్షణ శక్తి జెనరేటర్లు ఒక తరంగాన్ని ఉత్పత్తి చేస్తాయి, 142 00:13:39,027 --> 00:13:40,696 అది, మెరుపు వేగాలలో ప్రయాణించేటప్పుడు 143 00:13:40,779 --> 00:13:43,532 గమ్యస్థానాన్ని గుర్తించే జంప్ డ్రైవ్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. 144 00:13:44,533 --> 00:13:46,410 మీరు ట్రాంటార్ కి ఏం పని మీద వెళ్తున్నారు? 145 00:13:47,119 --> 00:13:49,204 నేను హారి సెల్డన్ దగ్గర పని చేయడానికి వెళ్తున్నాను. 146 00:13:49,913 --> 00:13:51,748 నేను గణిత పోటీలో నెగ్గాను. 147 00:13:51,832 --> 00:13:55,544 వావ్. హారి సెల్డన్. అందులోనూ మీరు సినాక్స్ వారు. 148 00:13:56,420 --> 00:13:58,213 అది చాలా పెద్ద పోటీ. 149 00:14:03,302 --> 00:14:07,097 ప్రయాణం మొదలవుతోంది, మూడు, రెండు, ఒకటి. 150 00:15:15,040 --> 00:15:16,500 మీరు ఇంకా మేల్కొనే ఉన్నారా? 151 00:15:32,266 --> 00:15:34,434 ప్రయాణ సమయంలో నిద్రలో ఉండటమనేది బాధాకరమైన విషయం. 152 00:15:35,185 --> 00:15:37,104 అది గొప్ప లైట్ షో లాగా ఉంటుంది. 153 00:15:38,313 --> 00:15:39,815 కానీ మీరు అంతరిక్ష ప్రయాణికులు కాకపోతే, 154 00:15:39,898 --> 00:15:43,026 మీకు అంతా అయోమయంగా, గందరగోళంగా ఉంటుంది. 155 00:15:43,110 --> 00:15:44,736 నేను ప్రయాణం జరిగేంత సేపూ నిద్రలోనే ఉన్నాను. 156 00:15:44,820 --> 00:15:46,697 ...దిగడానికి సిద్ధంగా ఉండండి. 157 00:15:49,283 --> 00:15:50,450 వావ్. 158 00:15:50,951 --> 00:15:55,038 మిగతా విషయాల సంగతి తెలీదు కానీ, సామ్రాజ్యం అద్భుతంగా నిర్మిస్తుంది. 159 00:16:00,460 --> 00:16:01,920 ఇది చాలా బాగుంది. 160 00:16:39,291 --> 00:16:43,754 సామ్రాజ్య కేంద్ర భాగమైన ట్రాంటార్ కి సుస్వాగతం. 161 00:16:46,340 --> 00:16:50,302 దయచేసి శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి. 162 00:16:58,101 --> 00:16:59,603 వాళ్లు సైనికులా? 163 00:17:01,104 --> 00:17:03,232 మీ ప్రపంచం దాకా ఈ వార్తలు చేరి ఉండకపోవచ్చు, 164 00:17:03,941 --> 00:17:06,944 గెలాక్సీ అంచున ఉన్న అనాక్రీయాన్ మరియు తెస్పిస్ గ్రహాల మధ్య 165 00:17:07,027 --> 00:17:08,819 ఏవో విభేదాలు తలెత్తాయి. 166 00:17:09,445 --> 00:17:13,242 మధ్యలో రాచరిక షరాబులు ఇరుక్కున్నారు, కనుక ఇది పెద్ద విషయమైపోయింది. 167 00:17:18,038 --> 00:17:19,790 మీ స్పాన్సర్ మరియు మీరు కలవాలనుకొనే వ్యక్తి ఎవరు? 168 00:17:19,873 --> 00:17:23,335 డాక్టర్ హారి సెల్డన్. స్ట్రీలింగ్ విశ్వవిద్యాలయం. 169 00:17:23,836 --> 00:17:25,712 మీ సొంత గ్రహానికి మళ్లీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? 170 00:17:26,380 --> 00:17:30,592 నేను తిరిగి వెళ్లడంలేదు. ఇప్పుడు ఇదే నా నివాస గ్రహం. 171 00:17:30,676 --> 00:17:35,097 ఏ లిఫ్టును అయినా ఎక్కండి. దయచేసి శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి. 172 00:17:35,180 --> 00:17:36,181 ధన్యవాదాలు. 173 00:17:39,810 --> 00:17:41,770 ఇప్పుడు మనిద్దరి మధ్య పరిచయం కాస్తంత పెరిగింది కనుక, 174 00:17:42,396 --> 00:17:44,731 నేను మీకు అంతా వివరించి నా సమయం వృథా చేసుకోను. 175 00:17:44,815 --> 00:17:46,024 కానీ ఈ భాగం మాత్రం చాలా బాగుంటుంది. 176 00:17:46,900 --> 00:17:49,570 అందుబాటులో ఉన్న కారు వద్దకు వెళ్లండి. 177 00:17:50,445 --> 00:17:53,991 ఈ కారు ఇంకాసేపట్లో కిందికి ప్రయాణం మొదలుపెట్టనుంది. 178 00:17:54,575 --> 00:17:56,243 నేను ప్రయాణమంతా మేల్కొనే ఉంటాను. 179 00:17:56,326 --> 00:17:57,327 నేను కూడా. 180 00:18:18,140 --> 00:18:23,437 ట్రాంటార్ స్టేషన్ నుండి గ్రహం ఉపరితలానికి 14 గంటల ప్రయాణం. 181 00:18:25,731 --> 00:18:28,317 సాంకేతికపరంగా అది ఉపరితలం కాదు. 182 00:18:28,942 --> 00:18:32,237 ట్రాంటార్ బయటి షెల్ లోపల కోట్లాది ప్రజలు జీవిస్తున్నారు, 183 00:18:33,155 --> 00:18:36,158 సూర్యుడిని గానీ, నక్షత్రాలను గానీ చూసే అవకాశం లేకుండా, 184 00:18:36,241 --> 00:18:38,994 ఒక వంద అంతస్థులలో పసలేని జీవనాన్ని సాగిస్తున్నారు. 185 00:18:48,295 --> 00:18:51,882 ప్రకృతిపరంగా ఉండేదంతా మహారాజుల వశం. 186 00:18:53,258 --> 00:18:54,384 వేకువ. 187 00:18:55,093 --> 00:18:56,094 పగలు. 188 00:18:57,471 --> 00:18:58,472 రాత్రి. 189 00:19:00,265 --> 00:19:02,017 సార్వత్రిక సామ్రాజ్యం. 190 00:19:02,601 --> 00:19:06,813 వీళ్లు క్లియాన్ I యొక్క క్లోన్లు, వేర్వేరు వయస్సులో సృష్టింపబడ్డారు. 191 00:19:21,745 --> 00:19:23,163 మాస్టర్ ఓర్లియో. 192 00:19:24,248 --> 00:19:25,415 రాజుగారు. 193 00:19:25,999 --> 00:19:27,918 మీరు మా వద్ద ఎంత కాలంగా పని చేస్తున్నారు? 194 00:19:28,001 --> 00:19:30,170 అరవై ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నాను, రాజుగారు. 195 00:19:31,463 --> 00:19:33,757 నాకు 12 ఏళ్ళున్నప్పుడు ఈ చిత్రాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాను. 196 00:19:33,841 --> 00:19:36,927 అప్పట్నుంచీ ఒక చివరి నుండి మరొక చివరిదాకా నాలుగు సార్లు శుభ్రం చేశాను. 197 00:19:37,010 --> 00:19:39,388 ఇక్కడున్న ప్రతీ రంగు తాలూకు లక్షణాలు నాకు బాగా తెలుసు. 198 00:19:39,471 --> 00:19:44,434 కొన్ని రంగులను, మిగతావాటితో పోలిస్తే శుభ్రపరచడం కష్టంగా ఉంటుందా? 199 00:19:45,102 --> 00:19:46,103 ప్లమ్ రంగు. 200 00:19:46,687 --> 00:19:47,688 పెరివింకిల్ రంగు. 201 00:19:48,605 --> 00:19:51,567 కాషాయాన్ని శుభ్రపరచడానికి బాగా కష్టపడాలి. 202 00:19:51,650 --> 00:19:55,529 మరి క్రిమ్సన్ సంగతేంటి? దానికి కూడా కష్టపడాలా? 203 00:19:56,280 --> 00:19:57,281 రాజుగారు? 204 00:19:57,364 --> 00:19:58,574 హారి సెల్డన్ రచించిన 205 00:19:58,657 --> 00:20:02,411 ఒక చిన్న పుస్తకం, మీ నివాసంలో కనుగొనబడిందని మాకు తెలిసింది. 206 00:20:02,494 --> 00:20:04,955 మన్నించాలి, రాజుగారు. నేను వెర్రిగా ఆలోచించాను. 207 00:20:05,038 --> 00:20:06,290 ఏంటంటే... 208 00:20:06,373 --> 00:20:09,960 అతని ప్రకటనలను విని, కాస్తంత కుతూహలం కలిగింది. 209 00:20:11,253 --> 00:20:14,965 సెల్డన్ ని "యమ కింకరుడు" అని పిలుస్తూ ఉంటారు కదా? 210 00:20:16,592 --> 00:20:20,262 అతను ఇంపీరియమ్ ని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాడని విన్నాను. 211 00:20:20,345 --> 00:20:24,516 అతను చెప్పేవన్నీ నిరాధారమైనవని, అలాగే వాటిని అతను 212 00:20:24,600 --> 00:20:26,643 దరిద్రంగా రాశాడు అని కూడా నేను మీకు చెప్పగలను. 213 00:20:26,727 --> 00:20:30,147 ఏదేమైనా, అతనికి భారీ అనుచరగణం ఉంది. 214 00:20:30,689 --> 00:20:35,611 రేవన్ సెల్డన్ నోటి నుండి జారే ప్రతీ వాక్కు మీద వాళ్లకి ఎన్నో ఆశలు ఉంటాయి. 215 00:20:37,112 --> 00:20:40,699 మాటలు దావాగ్నిలా అంతటా వ్యాపించగలవు, ఓర్లియో. 216 00:20:40,782 --> 00:20:42,826 నేను మీకు విధేయుడిని, రాజుగారు. నేనెప్పుడూ కూడా... 217 00:20:42,910 --> 00:20:46,872 మీ గురించి నాకు తెలుసు, అందుకే ఈ విషయాన్ని నేరుగా మిమ్మల్నే అడిగాను. 218 00:20:47,456 --> 00:20:48,749 రాజుగారు... 219 00:20:58,467 --> 00:21:01,345 ఈ ఉదయం ఏం నేర్చుకున్నారు, వేకువ సోదరా? 220 00:21:02,179 --> 00:21:03,847 సుదూర భాగాలలో ఉన్న రాజ్యాల గురించి. 221 00:21:03,931 --> 00:21:06,558 వేట గురించి అనాక్రీయాన్ వారి ప్రాచీన పాటను నేర్చుకున్నాను. 222 00:21:06,642 --> 00:21:10,938 సంగీతంలో సత్యం మరింతగా పొందుపరచబడి ఉంటుంది. 223 00:21:11,939 --> 00:21:15,651 ఒక అబ్బాయి ఒక జింకపిల్లని కత్తితో కోసి, దాని తోలును కప్పుకుంటాడు. 224 00:21:15,734 --> 00:21:17,694 అది వేటకు సంబంధించిన పాట కాదు. 225 00:21:17,778 --> 00:21:20,405 ఒక అబ్బాయి ఒక అమ్మాయితో జరిపే రతికి సంబంధించిన బూతు పాట అది. 226 00:21:23,867 --> 00:21:26,995 మళ్లీ మీ మనస్సులో ప్లే చేసుకోండి. ఆ రెండూ ఒకటే అనుకోకండి. 227 00:21:27,079 --> 00:21:29,957 పగటి సోదరా, నెమలి వంటకాన్ని వంటగాళ్లకు వదిలేయండి. 228 00:21:30,040 --> 00:21:32,668 మీరు ఆ పని చేసినా చేయకపోయినా మీ ఆత్మకథను గొప్పగానే రాస్తారు. 229 00:21:32,751 --> 00:21:35,212 రాత్రి సోదరుడు, నేను ఈ పనిని నలుగురి కంట్లో పడాలని చేస్తున్నానని భావిస్తున్నారు. 230 00:21:35,796 --> 00:21:38,966 పగటి సోదరునికి తినడం కన్నా, నన్నేదోకటి అనడం మీదే ఆసక్తి ఎక్కువ. 231 00:21:39,049 --> 00:21:40,425 ఇది పంది మాంసం. 232 00:21:40,509 --> 00:21:43,887 వేయించే ముందు, వంటగాళ్ళు దాని చర్మం కింద సూదితో గుచ్చుతారు. 233 00:21:43,971 --> 00:21:46,849 -సూదిని ఎందుకు వాడతారో తెలుసా? -అది మరింత బాగా పని చేస్తుందనా? 234 00:21:46,932 --> 00:21:49,017 ఎందుకంటే, పాత పద్ధతిలా వారు కత్తిని ఉపయోగించినప్పుడు, 235 00:21:49,101 --> 00:21:51,019 అది చర్మాన్ని కోసే అవకాశం ఉందని, 236 00:21:51,103 --> 00:21:54,857 అప్పుడు నేను వారిని 50 అంతస్థుల కింద ఉన్న మరుగుదొడ్డికి పంపించేస్తానని భయం. 237 00:21:55,607 --> 00:21:59,403 అదంతా సమస్యే. ఎందుకు? 238 00:21:59,486 --> 00:22:02,698 ఎందుకంటే, జనాలు తమ పనిని సరిగ్గా చేయడానికి భయపడినప్పుడు, 239 00:22:03,198 --> 00:22:05,117 వారు పొరపాటు చేస్తారని వారికి ఖచ్చితంగా తెలుసు. 240 00:22:05,200 --> 00:22:08,370 -అది మంచి పర్యవేక్షణ కాదు. -దాని వల్ల నెమలి మాంసం సరిగ్గా రాదు. 241 00:22:10,038 --> 00:22:12,291 అన్నీ నేర్పదగినవి కాదు. 242 00:22:13,041 --> 00:22:14,459 మహారాజు గారు. 243 00:22:14,543 --> 00:22:15,711 డెమెర్జల్. 244 00:22:15,794 --> 00:22:18,797 తెస్పిస్ మరియు అనాక్రీయాన్ నుండి ప్రతినిధి బృందాలు వస్తున్నాయి. 245 00:22:18,881 --> 00:22:21,008 -వారు చూడటానికి ఎలా ఉన్నారు? -చిటచిటలాడిపోతున్నారు. 246 00:22:21,717 --> 00:22:25,679 మొరటు రాజ్యాలు. వాటి వల్ల సమస్యలు తప్ప మనకే లాభమూ లేదు. 247 00:22:26,889 --> 00:22:30,142 సూదూర రాజ్యాల వర్తక విభాగం నుండి ధరల అంచనాను నా నివాసానికి పంపండి. 248 00:22:31,351 --> 00:22:34,271 మంచి బట్టలు వేసుకోండి. ఎవరికైనా చెప్పి తలను బాగా దువ్వించుకోండి. 249 00:22:35,397 --> 00:22:37,774 ఈ వారం మనం చేసే అత్యంత ముఖ్యమైన పని ఇది కాదు, 250 00:22:37,858 --> 00:22:41,403 కానీ వారి జీవితంలో వారు చేయబోయే అత్యంత ముఖ్యమైన పని ఇదే. 251 00:23:01,131 --> 00:23:05,636 అనాక్రీయాన్ మరియు తెస్పిస్. వారి తీరును గమనించండి. 252 00:23:13,769 --> 00:23:16,396 వాళ్లకి ఒకరంటే మరొకరికి పడదు. 253 00:23:18,065 --> 00:23:21,777 వాళ్ళ శతృత్వం మామూలుది కాదు. కానీ యుద్ధం చాలా ఖర్చుతో కూడుకున్నది. 254 00:23:21,860 --> 00:23:24,821 కాబట్టి వారి మధ్య సంధి కుదర్చడానికి, వారిని మందలించడానికి ఇక్కడికి పిలిపించాం. 255 00:23:38,836 --> 00:23:40,212 ఇప్పటిదాకా నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. 256 00:23:40,295 --> 00:23:43,674 కొత్త ఉద్యోగం బాగుంటుందని, హారి సెల్డన్ వద్ద పని మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. 257 00:23:43,757 --> 00:23:45,133 ధన్యవాదాలు. 258 00:23:50,055 --> 00:23:51,139 భలేగా ఉంది. 259 00:23:54,643 --> 00:23:57,229 రేయిచ్, రేయిచ్. మీరు ఎక్కడ ఉన్నారు? 260 00:24:03,735 --> 00:24:05,696 -అది నేనే. -ఏంటి? 261 00:24:06,405 --> 00:24:07,739 నేనే రేయిచ్ ని. 262 00:24:09,700 --> 00:24:13,287 నేను హారి దగ్గర పని చేస్తాను. అదే డాక్టర్ సెల్డన్ దగ్గర. 263 00:24:14,162 --> 00:24:16,206 -సామాను కోసం ఇలా వెళ్లాలి. -అదేం లేదు. 264 00:24:16,790 --> 00:24:18,834 లేదు. నేను మిగతా సామాను ఏం తెచ్చుకోలేదు. 265 00:24:19,668 --> 00:24:20,669 సరే. 266 00:24:21,461 --> 00:24:23,422 అయితే మనం ఇటు వైపు వెళ్లాలి. 267 00:24:27,926 --> 00:24:29,970 ఇది సరిగ్గా ఉపరితలం మీద ఉన్నట్టే ఉండేలా రూపొందించారు. 268 00:24:30,596 --> 00:24:32,598 బయటి షెల్ లో ఉంటే మనకి తెలీదు అనుకోండి. 269 00:24:33,098 --> 00:24:36,226 అరవై నాల్గవ అంతస్థులో సగం వరకు, సర్వర్లే ఆకాశ చిత్రాలను ప్రదర్శిస్తాయి. 270 00:24:39,396 --> 00:24:42,065 ట్రాంటార్ లో ఇంకా పూజారుల చర్చి ఉందా? 271 00:24:42,566 --> 00:24:45,611 కింద 22వ అంతస్థులో ఉందనుకుంటా. 272 00:24:48,447 --> 00:24:49,740 అక్కడికి నేను వెళ్లాలనుకుంటున్నాను. 273 00:24:52,201 --> 00:24:53,202 ఏంటి? 274 00:24:54,745 --> 00:24:55,996 మన్నించండి, నేను... 275 00:24:57,664 --> 00:25:00,000 సినాక్స్ కి చెందిన వారిని నేను కలవడం ఇదే మొదటిసారి. 276 00:25:09,426 --> 00:25:12,262 సానుభూతిని, అలాగే నాయకత్వాన్ని ప్రతిబింబించే 277 00:25:12,346 --> 00:25:14,723 ఆత్మల కుడ్యచిత్రం, 278 00:25:14,806 --> 00:25:18,685 ప్రతీరోజు దీనిపై సార్వత్రిక సామ్రాజ్యానికి చెందిన ఒక పెద్ద అధికారి పని చేస్తారు. 279 00:25:18,769 --> 00:25:23,357 నాలుగు శతాబ్దాల శాంతిని, గెలాక్టిక్ కుటుంబాన్ని ఈ చిత్రం చూపుతుంది. 280 00:25:23,440 --> 00:25:27,069 క్రీయాశీల వర్ణాలను చూశారా? రంగు కదిలీ కదలకుండా ఎలా కదులుతుందో చూశారా? 281 00:25:33,116 --> 00:25:35,077 ప్రాంతీయ రాయబారి జాండెమ్. 282 00:25:36,578 --> 00:25:39,665 చిత్రం విషయంలో మీకు సందేహాలు ఉన్నాయా లేదా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 283 00:25:40,457 --> 00:25:44,336 మేము సామ్రాజ్యపు ఎల్లలు లేని పరిధిని తలుచుకొని ఆశ్చర్యచకితులమవుతున్నాం. 284 00:25:44,837 --> 00:25:46,296 ఎందుకంటే అది చాలా అద్భుతమైనది. 285 00:25:49,091 --> 00:25:52,678 86,963,537. 286 00:25:52,761 --> 00:25:55,973 86,963,549. 287 00:25:56,056 --> 00:25:59,434 86,963,563. 288 00:25:59,518 --> 00:26:02,855 963,567. 289 00:26:03,355 --> 00:26:07,067 86,963,573… 290 00:26:07,150 --> 00:26:10,195 -మీరు ప్రార్థిస్తున్నారా? -లేదు. ఎందుకు? 291 00:26:11,530 --> 00:26:12,573 మీ పెదాలు కదులుతున్నాయి. 292 00:26:12,656 --> 00:26:15,492 అవును. నాకు కంగారుగా ఉన్నప్పుడు, నేను ప్రైమ్ నంబర్లను లెక్కిస్తాను. 293 00:26:22,332 --> 00:26:23,917 మీకు ఇది నచ్చుతుందని హారి అన్నారు. 294 00:26:46,023 --> 00:26:49,193 గాల్, హారిని కలుసుకోండి. 295 00:26:51,904 --> 00:26:53,155 డాక్టర్ సెల్డన్. 296 00:26:54,281 --> 00:26:57,409 మీరు ఇక్కడికి ఆహ్వానించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. 297 00:26:57,910 --> 00:26:59,745 ఇంపీరియల్ లైబ్రరీ ఎలా ఉంది? 298 00:26:59,828 --> 00:27:02,748 చాలా బాగుంది. ఒకే చోట చాలా పుస్తకాలు ఉన్నాయి. 299 00:27:02,831 --> 00:27:05,751 సినాక్స్ లో పుస్తకాలు తక్కువగా లభిస్తాయి అనుకుంటా. 300 00:27:07,044 --> 00:27:08,921 దయచేసి కూర్చోండి. 301 00:27:15,427 --> 00:27:18,847 మరి, మీకు కాలె యొక్క నైన్త్ ప్రూఫ్ ఆఫ్ ఫోల్డింగ్ తెలుసా? 302 00:27:19,473 --> 00:27:22,392 తెలుసు, అదే లేకపోతే నేను అబ్రాక్సాస్ ని పరిష్కరించగలిగేదాన్ని కాదు. 303 00:27:22,476 --> 00:27:26,855 దాన్ని ఉపయోగించాలనే ఆలోచనే ఎవరికీ రాలేదు. దాన్ని ఉపయోగించి 500 ఏళ్లయింది. 304 00:27:27,940 --> 00:27:29,274 దాన్ని ఉపయోగించాలని మీకు ఎందుకు అనిపించింది? 305 00:27:30,234 --> 00:27:32,778 కాలె రచనలు కవితల్లా ఉంటాయి. 306 00:27:32,861 --> 00:27:36,198 అవి చాలా అందంగా ఉంటాయి, కానీ వాటిలో గాఢత ఉన్నట్టు అనిపించదు. 307 00:27:36,949 --> 00:27:39,409 కాబట్టి పెద్ద పెద్ద పండితులు ఆమె రచనలను చదవలేదు. 308 00:27:41,995 --> 00:27:43,080 మరి మీరు ఎందుకు చదివారు? 309 00:27:43,580 --> 00:27:46,917 మొదట, పదాల అల్లిక నచ్చి కాలె రచనలను చదవడం మొదలుపెట్టాను. 310 00:27:47,000 --> 00:27:48,502 నాకు గణితం కనబడలేదు. 311 00:27:49,002 --> 00:27:51,255 కానీ వాక్యాలలోని విషయాన్ని గ్రహించాక, 312 00:27:51,338 --> 00:27:54,007 ఆమె ఆర్కిమీడియన్ యేతర స్థానిక ఫీల్డ్స్ లోని ఇంటిజర్ల రింగ్లకు 313 00:27:54,091 --> 00:27:57,177 సంబంధించిన ఒక విప్లవాత్మక సిద్ధాంతాన్ని చెప్తోందని తెలుసుకున్నాను. 314 00:27:57,261 --> 00:27:58,762 అవును, అది నిజమే. 315 00:28:00,055 --> 00:28:01,515 అయినా నాకు ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది, 316 00:28:01,598 --> 00:28:06,436 మీ ప్రపంచంలో పుస్తకాలు తక్కువగా లభిస్తాయి కనుక కాలేస్ నైన్త్ ప్రూఫ్ 317 00:28:06,520 --> 00:28:08,021 పుస్తకం అసలు మీకు ఎక్కడిది? 318 00:28:10,649 --> 00:28:15,112 ఇది సినాక్స్ కాదు, గాల్. ఇక్కడ కుతూహులాన్ని నేరంగా పరిగణించరు. 319 00:28:16,113 --> 00:28:17,322 నేను అక్కడ ఒంటరిదాన్ని. 320 00:28:18,532 --> 00:28:21,076 నాకు వచ్చే ఆలోచనలు, దాదాపుగా అక్కడ ఎవరికీ వచ్చేవి కాదు. 321 00:28:22,244 --> 00:28:25,080 కానీ గణితం పక్షపాతం చూపదు. తప్పులను లెక్కించదు. 322 00:28:25,581 --> 00:28:31,128 మీ మేధస్సుకు అలాంటి చోటు సరిపోదు, అందుకే మీకు ఒంటరిగా అనిపించి ఉంటుంది. 323 00:28:38,635 --> 00:28:43,557 స్వయంగా కాలె తన స్థానిక త్రాక్సియన్ భాషలో రాసిన ముసాయిదా రాతప్రతి ఇది. 324 00:29:00,616 --> 00:29:02,784 రేపు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు. మిమ్మల్ని కూడా. 325 00:29:02,868 --> 00:29:04,995 -ఏంటి? -అరెస్ట్ ఖాయమనే చెప్పవచు. 326 00:29:05,078 --> 00:29:06,663 అరెస్ట్? కానీ ఎందుకు? 327 00:29:06,747 --> 00:29:11,210 అది జరగకుండా ఉండటానికి అవకాశం లేదు. కానీ దాని గురించి చర్చించి లాభం లేదు. 328 00:29:12,211 --> 00:29:13,837 లేదు. ఇందులో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. 329 00:29:13,921 --> 00:29:16,715 జనాలు అబద్ధమాడతారు, గాల్. గణితం అబద్ధమాడదు. 330 00:29:16,798 --> 00:29:19,176 మీరు నా రచనని చదివారా? సైకో హిస్టరీని? 331 00:29:19,760 --> 00:29:22,554 -ప్రతీ గణిత శాస్త్రజ్ఞుడూ చదివిన... -మీరు ఆ సిద్ధాంతంతో ఏకీభవిస్తారా? 332 00:29:22,638 --> 00:29:25,015 సిద్ధాంతంతో ఏకీభవిస్తాను. కానీ దానికీ, దీనికీ సంబంధం ఏంటో... 333 00:29:25,098 --> 00:29:26,391 అది సిద్ధాంతం కాదు. 334 00:29:26,475 --> 00:29:29,645 అది అంకెల రూపంలో వ్యక్తపరచబడిన మానవజాతి తలరాత. 335 00:29:29,728 --> 00:29:31,897 అందుకే మనల్ని సామ్రాజ్యం మనుషులు అరెస్ట్ చేయబోతున్నారు. 336 00:29:31,980 --> 00:29:33,774 మీరు భవిష్యత్తు చెప్పగలరని వారు ఆందోళన పడుతున్నారు. 337 00:29:33,857 --> 00:29:37,986 నేను చెప్పగలనని జనాలు నమ్ముతారని వారి భయం. నా జోస్యం కూడా వాళ్ళకి నచ్చలేదు. 338 00:29:38,070 --> 00:29:39,154 ఏం జోస్యం? 339 00:29:42,449 --> 00:29:45,577 ట్రాంటార్ నాశనం కాబోతోంది. సామ్రాజ్యం కుప్పకూలనుంది. 340 00:29:45,661 --> 00:29:48,914 నాకేదో ప్రత్యేక ఆసక్తి ఉండి వీటిని నేను ప్రజలకు చెప్పడంలేదని అర్థంచేసుకోండి. 341 00:29:48,997 --> 00:29:50,457 గణితం నాకు ఏదైతే చెప్పిందో, అదే చెప్పాను. 342 00:29:50,541 --> 00:29:54,920 నన్నింత దూరం రప్పించింది కేవలం అరెస్ట్ చేయించడానికేనా? 343 00:29:55,003 --> 00:29:57,756 అది చాలా చక్కటి ప్రశ్న. సమాధానం మీరే చెప్పండి. 344 00:30:29,997 --> 00:30:31,790 నేను అబ్రాక్సాస్ సమస్యని పరిష్కరించాను కాబట్టి. 345 00:30:32,708 --> 00:30:35,043 మీరు చెప్పింది అసత్యమని నేను మాత్రమే రుజువు చేయగలనని అనుకుంటున్నారు. 346 00:30:35,127 --> 00:30:38,088 నేను చెప్పింది అసత్యమైతే, మీరు తప్పక రుజువు చేయగలరు. కానీ అది నిజం. 347 00:30:39,256 --> 00:30:41,633 నాకు అన్నీ తిప్పి చూపుతున్నప్పుడు మీకు ఈ విషయం తెలుసా? 348 00:30:41,717 --> 00:30:43,927 ఈ విషయం మీరు ఊహించలేనంత ముఖ్యమైనది, గాల్. 349 00:30:46,138 --> 00:30:48,473 నేను ఇక్కడికి రావడానికి నా ప్రాణాన్నే పణంగా పెట్టాను. 350 00:30:49,057 --> 00:30:52,269 మీ అంకెలు సరైనవని నిరూపించడానికి మళ్లీ దాన్ని పణంగా పెట్టమంటున్నారా? 351 00:30:52,352 --> 00:30:55,105 అది పూర్తిగా నిజం కాదు కదా, గాల్? 352 00:30:55,189 --> 00:30:57,774 మీరు అరెస్ట్ కాకూడదనే ఉద్దేశంతోనే సినాక్స్ ని వదిలి వచ్చారు. 353 00:30:57,858 --> 00:31:00,694 కాబట్టి, గణితం అనేది కేవలం అంకెలు మాత్రమే కాదని మీకు తెలుసు. 354 00:31:00,777 --> 00:31:03,113 పడకూడని వారి చేతుల్లో పడితే, అది భయంకరమైన ఆయుధం కాగలదు. 355 00:31:03,947 --> 00:31:07,201 మంచివారి చేతుల్లో పడితే, విముక్తిని ప్రసాదించగలదు. 356 00:31:11,079 --> 00:31:12,206 వెళ్ళండి. 357 00:31:14,249 --> 00:31:15,250 కాసేపు పడుకోండి. 358 00:31:15,918 --> 00:31:18,670 మీ హోటల్ ని పరిశుద్ధం చేయడానికి దాదాపుగా రాత్రంతా పడుతుంది. 359 00:31:18,754 --> 00:31:19,755 త్వరలోనే మళ్లీ కలుసుకుందాం. 360 00:31:21,882 --> 00:31:24,051 మీరు ఇక్కడికి వచ్చింది దీని కోసం కాదని నాకు తెలుసు... 361 00:31:25,594 --> 00:31:26,970 కానీ దీనితో సర్దుకోండి. 362 00:31:27,054 --> 00:31:29,473 -నేను దీన్ని తీసుకోలేను. -పర్వాలేదు తీసుకోండి. 363 00:31:29,556 --> 00:31:34,978 ఏదోకరోజు ఈ భవనం తగలబడిపోతుంది. దొంగలించడం మంచి పని అవుతుంది. 364 00:31:50,452 --> 00:31:52,579 నేను ఆయన రాసిన సైకో హిస్టరీని సంపూర్ణంగా చదివాను. 365 00:31:52,663 --> 00:31:55,707 దాన్ని ఆయన ఈ విధంగా ఉపయోగిస్తారని నేను అస్సలు అనుకోలేదు. 366 00:31:55,791 --> 00:31:58,752 సామ్రాజ్యం వాళ్లు మిమ్మల్ని ఏమీ చేయరు. వాళ్లకి మీ అవసరం ఉంది. 367 00:31:58,836 --> 00:32:00,838 ఆది మీకు తెలీదు. అది అతనికి కూడా తెలీదు. 368 00:32:00,921 --> 00:32:01,922 -గాల్... -లేదు. 369 00:32:02,005 --> 00:32:04,216 మీరు దాన్ని చూడలేదు. 370 00:32:05,050 --> 00:32:07,302 గ్రహం మిమ్మల్ని చంపేయాలనుకుంటే, మీరు తప్పించుకోలేరు. 371 00:32:09,179 --> 00:32:12,808 రాయబారి జాండెమ్, అనాక్రీయాన్ గ్రహం, సూదూర ప్రాంతం. 372 00:32:16,061 --> 00:32:17,312 మహారాజు గారు. 373 00:32:21,817 --> 00:32:25,320 టలిన్ అడవిలోని అత్యంత పాత చెట్టుకు చెందిన కలప నుండి చెక్కబడింది. 374 00:32:25,946 --> 00:32:27,698 అనాక్రీయాన్ కి చెందిన గొప్ప వేటగాడు అయిన లార్కెన్ కయీన్ విల్లు కూడా 375 00:32:27,781 --> 00:32:30,909 ఈ కలప నుండే చెక్కబడింది. 376 00:32:31,493 --> 00:32:33,036 ధన్యవాదాలు, రాయబారి. 377 00:32:34,454 --> 00:32:36,290 మీకు ఆత్మల కుడ్యచిత్రం నచ్చిందా? 378 00:32:36,373 --> 00:32:40,169 నచ్చింది, మహారాజా. అలాంటిదాన్ని ఇప్పటిదాకా నేను చూడనేలేదు. 379 00:32:41,503 --> 00:32:45,465 గౌరవనీయ రాయబారి షే అన్ షే, తెస్పిస్ గ్రహం, సూదూర భాగం. 380 00:32:49,344 --> 00:32:50,721 మహారాజు గారు. 381 00:32:53,140 --> 00:32:54,725 తెస్పిన్ వారి ప్రక్షాళన గ్రంథం. 382 00:32:55,309 --> 00:32:59,563 రాచరిక శాంతికి గౌరవసూచకంగా, ఆ అలంకరణ అంతా ఇటీవల చేయించబడింది. 383 00:33:00,397 --> 00:33:02,816 ధన్యవాదాలు, గౌరవనీయ రాయబారి. 384 00:33:03,859 --> 00:33:07,321 అలాగే, ట్రాంటార్ కి వచ్చినందుకు మీ ఇరు వర్గాలకు ధన్యవాదాలు. 385 00:33:08,405 --> 00:33:09,615 మీకు మరో దారి లేదనుకోండి. 386 00:33:11,825 --> 00:33:15,537 తొమ్మిది శతాబ్దాలుగా, ఆంథోర్ బెల్ట్ ఒడంబడిక మీ గ్రహాలకు బాగా ప్రయోజనకరంగా ఉండింది. 387 00:33:15,621 --> 00:33:18,123 గతేడాది, తెస్పిస్ ఒక గతి తప్పిన గ్రహశకలాన్ని గుర్తించింది, 388 00:33:18,207 --> 00:33:22,002 వాళ్లు దాన్ని ఒడంబడిక నియంత్రణలో ఉన్న ప్రాంతం నుండి వచ్చిందని భావించారు. 389 00:33:23,337 --> 00:33:25,047 మేము అధికారికంగా ఏమీ చేయలేదు. 390 00:33:26,507 --> 00:33:28,258 కేవలం మాకు ఇచ్చిన పది శాతం ప్రకారం నడుచుకుంటున్నాం. 391 00:33:28,842 --> 00:33:32,513 తెస్పిస్ ఒడంబడికని గౌరవించడం లేదని అనాక్రీయాన్ భావిస్తోంది. 392 00:33:32,596 --> 00:33:37,768 సామ్రాజ్యానికి 50,000 కాంతి సంవత్సరాల దూరంలో సామ్రాజ్యనికి చెందిన మనుషుల 393 00:33:37,851 --> 00:33:41,313 రక్తం ఒక చల్లటి బండరాయి మీద చిందిందని సామ్రాజ్యం భావిస్తోంది. 394 00:33:46,777 --> 00:33:50,572 ఈ మూడు నమ్మకాల పుణ్యమా అని, వేయి యుద్ధాలు జరిగి ఉంటాయి. 395 00:33:51,365 --> 00:33:54,910 రాబోయే రోజుల్లో, మరో యుద్ధం జరబోతుందా లేదా అనేది తెలుస్తుంది. 396 00:33:57,621 --> 00:34:01,542 శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి 397 00:34:01,625 --> 00:34:04,711 శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి. 398 00:34:17,349 --> 00:34:20,726 వేకువ సోదరుడా, మీ అభిప్రాయం ఏంటి? 399 00:34:20,811 --> 00:34:23,397 తెస్పిన్లు, తమ మతానికి ఆంథోర్ బెల్ట్ లోని గ్రహశకలాలు 400 00:34:23,480 --> 00:34:27,025 ఎంత ముఖ్యమైనవో మీకు గుర్తు చేయాలనుకుంటున్నారు. 401 00:34:27,109 --> 00:34:29,987 కానీ అక్కడ చూడండి. లోహపు అలంకరణని చూడండి, 402 00:34:30,070 --> 00:34:33,197 ఆ గుర్తులోని ఆకృతిని పల్లాడియమ్ ని ఉపయోగించి చేశారు. 403 00:34:33,282 --> 00:34:36,994 ఆ గతి తప్పిన గ్రహశకంలోని లోహం అది. ఆకృతిలో లోహం ఎంత వాడారో చెప్పగలరా? 404 00:34:37,077 --> 00:34:41,206 -బహుశా అయిదో వంతు? -దాదాపుగా పావు శాతం వాడారు. 405 00:34:41,290 --> 00:34:45,210 ప్రస్తుతం, తెస్పిన్లు ఆ గని నుండి మనకి పది శాతం వాటా ఇస్తున్నారు. 406 00:34:45,710 --> 00:34:47,337 మనం వాళ్ళ పక్షాన నిలబడితే 407 00:34:47,420 --> 00:34:50,799 పాతిక శాతం ఇస్తామని ఇలా వాళ్లు సైగ్గా చెప్తున్నారు. 408 00:34:50,882 --> 00:34:55,469 ఇందులో అస్సలు లోహమే లేదు. కనీసం బాణం అంచుల్లో కూడా లేదు. 409 00:34:56,054 --> 00:34:58,974 సరిగ్గానే చెప్పారు. ఎందుకు? 410 00:34:59,057 --> 00:35:01,476 అనాక్రియాన్లకు పల్లాడియమ్ కావాలి. 411 00:35:01,560 --> 00:35:02,978 వాళ్ల దగ్గర అది అస్సలు లేదు. 412 00:35:03,061 --> 00:35:07,441 ఇది కూడా వేట పాట లాగా అస్సలు వేటకు సంబంధించినదే కాదు. 413 00:35:09,610 --> 00:35:12,946 కళ అనేది రాజకీయాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే కమ్మటి మార్గం. 414 00:35:13,822 --> 00:35:17,034 సూదూర భాగానికి చెందిన వారి ఆచారాలు కాస్త మొరటుగానే ఉంటాయి. 415 00:35:17,784 --> 00:35:22,206 కానీ మనం అన్నిటినీ నిశితంగా గమనించి, శాంతి కొనసాగేలా చేయాలి. 416 00:35:22,289 --> 00:35:26,126 జనాలు గాడి తప్పితే, అప్పుడు మనం శిక్షించాలి. 417 00:35:26,210 --> 00:35:27,419 ధన్యవాదాలు. 418 00:35:32,257 --> 00:35:34,885 సెల్డన్ మరియు అమ్మాయి. 419 00:35:36,970 --> 00:35:38,597 శిక్ష గురించి అతిగా ఆలోచించవద్దు. 420 00:35:40,599 --> 00:35:43,143 పూజారుల చర్చికి వెళ్లే సమయం మనకి ఉందా? 421 00:35:46,104 --> 00:35:47,105 ఉంది. 422 00:35:54,571 --> 00:35:57,449 ఆమె కూర్చోవచ్చు. అతను నిలబడే ఉండాలి. 423 00:35:58,408 --> 00:36:00,494 కానీ అతని దగ్గరున్న ఆయుధాన్ని ఇవ్వాలి. 424 00:36:07,668 --> 00:36:09,336 నాస్తికురాలు, నేనూ మాట్లాడుకుంటాం. 425 00:36:18,762 --> 00:36:19,847 మేల్కొన్నాక... 426 00:36:20,430 --> 00:36:21,974 మేల్కొన్నాక... 427 00:36:22,057 --> 00:36:23,809 మనం ఆ పదాలను పలుకుతాం. 428 00:36:23,892 --> 00:36:25,978 ఆ పదాలు మనం కనబడటానికి కారణం అవుతాయి. 429 00:36:26,061 --> 00:36:27,688 నేనెవరో మీకు తెలుసా? 430 00:36:28,814 --> 00:36:32,484 ఆమె, నిద్రలేచాక స్లీపర్ పదాలను పలకదు అని 431 00:36:32,568 --> 00:36:34,736 అందువలన దేవునికి కనబడదని నాకు తెలుసు. 432 00:36:34,820 --> 00:36:36,572 కానీ నేనెవరో మీకు తెలుసా? 433 00:36:36,655 --> 00:36:39,074 తను అనాదిగా ఉన్న ఒక చిక్కుముడిని విప్పి, 434 00:36:39,157 --> 00:36:41,410 జీవితం తాలూకు విలువను తగ్గించింది. 435 00:36:41,493 --> 00:36:43,537 నాకు బ్రహ్మాండంగా తెలుసు. 436 00:36:46,206 --> 00:36:50,627 తన కొత్త దేవుడు, సెల్డన్ కి ఎంత పేరుందో, సినాక్స్ లో తనకి కూడా అంతే పేరుంది. 437 00:36:50,711 --> 00:36:53,630 -అతను దేవుడు కాదు. -అవును, అతను దేవుడు కాదు. 438 00:36:55,007 --> 00:37:00,220 అతను కూడా అందరి మనుషులలాగానే దైవ తలంపు లేకుండా చనిపోతాడు. 439 00:37:00,304 --> 00:37:04,099 అలాగే అతని అనుచరులు కూడా, ఆమె కూడా చనిపోతుంది. 440 00:37:05,767 --> 00:37:08,896 గాల్ డోర్నిక్, నేను ఇది ఒకసారే చెప్తాను, 441 00:37:09,730 --> 00:37:15,652 ఎందుకంటే, ఈ చేయివిడిచిన లోకంలో అందరికన్నా పెద్ద, ఇంకా ఏకైక పూజారిని నేనే. 442 00:37:17,196 --> 00:37:20,866 మీరు సమస్యలో ఉంటే, నేను మీకు సహాయం చేయగలను. 443 00:37:23,744 --> 00:37:25,162 మీకు కావాల్సింది అదేనా? 444 00:37:51,438 --> 00:37:52,981 నన్ను కూడా ఉండమంటారా? 445 00:37:53,065 --> 00:37:54,816 మీరు ఉండటం వల్ల, నన్ను అరెస్ట్ చేయకుండా వెళ్లిపోతారా? 446 00:37:55,317 --> 00:37:56,360 లేదు. 447 00:37:56,860 --> 00:37:58,278 నాకేమీ పర్వాలేదులే. 448 00:37:59,112 --> 00:38:00,948 -నేను మళ్లీ కలుస్తాను అయితే. -నిజంగా కలుస్తారా? 449 00:38:01,448 --> 00:38:02,866 ఖచ్చితంగా కలుస్తాను. 450 00:38:41,530 --> 00:38:44,449 కొందరు చివరిగా ఇంకొక్కసారి ప్రార్థించాలని అనుకుంటారు. 451 00:38:45,450 --> 00:38:46,535 మీరు కూడా అలా అనుకున్నారా? 452 00:38:47,744 --> 00:38:48,787 లేదు. 453 00:39:34,374 --> 00:39:36,084 ఆమె మీద మీ అభిప్రాయం ఏంటి? 454 00:39:36,668 --> 00:39:38,462 ఆమెని ఇంకా అరెస్ట్ చేయలేదు. 455 00:39:38,545 --> 00:39:39,630 ఇంకా చేయలేదు. 456 00:39:40,380 --> 00:39:41,632 మరి ఆమె మీద మీ అభిప్రాయమేంటి? 457 00:39:41,715 --> 00:39:44,885 తను సొంతంగా అబ్రాక్సాస్ ని పరిష్కరించింది. అది మాత్రం చెప్పగలను. 458 00:39:46,178 --> 00:39:50,349 మరో ప్రశ్న విషయానికి వస్తే, వేచి చూద్దాం మరి. 459 00:40:41,358 --> 00:40:43,318 నా పేరు లోర్స్ అవకిమ్. 460 00:40:43,402 --> 00:40:44,987 నన్ను హారి పంపారు. 461 00:40:46,572 --> 00:40:47,573 ఆయన ఎక్కడ ఉన్నాడు? 462 00:40:49,032 --> 00:40:51,910 ఆయన జోస్యం ప్రకారమే ఆయన అరెస్ట్ అయ్యాడు. 463 00:40:52,828 --> 00:40:54,913 మీ ఇద్దరి మీద తీవ్రమైన రాజద్రోహం, ఇంపీరియమ్ ని అస్థిరపరచాలనే కుట్ర 464 00:40:54,997 --> 00:40:57,708 వంటి ఆరోపణలు చేయబడ్డాయి. 465 00:40:59,001 --> 00:41:00,586 ఇది చాలా దారుణం. 466 00:41:00,669 --> 00:41:04,840 మిమ్మల్ని దీనిలోకి లాగినందుకు చాలా బాధపడుతున్నాడని హారి తెలపమన్నాడు. 467 00:41:04,923 --> 00:41:06,091 ఇది అతని తప్పు కాదు. 468 00:41:10,512 --> 00:41:11,722 నిజంగా? 469 00:41:12,764 --> 00:41:14,308 మనం ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. 470 00:41:15,184 --> 00:41:17,769 హారీ రచనల్లోని సారాంశాన్ని గ్రహించాక, ఇంపీరియమ్ వాళ్లు 471 00:41:17,853 --> 00:41:20,522 ఆ ప్రాజెక్ట్ ని అడ్డుకొనే ప్రయత్నాలను బాహాటంగానే చేశారు. 472 00:41:20,606 --> 00:41:24,193 హారి నన్ను ఇక్కడికి ఎరగా తీసుకొచ్చాడా? అతనిది తప్పని నేను నిరూపించగలనని? 473 00:41:24,276 --> 00:41:26,236 అతను చెప్పింది తప్పు కాదు, మిస్ డోర్నిక్. 474 00:41:27,196 --> 00:41:29,406 కానీ ఎర విషయం మాత్రం నిజమే. 475 00:41:50,135 --> 00:41:51,512 మీరు బాగానే ఉన్నారా? 476 00:41:51,595 --> 00:41:55,390 కొక్కెం వల్ల నొప్పిగా ఉంది, కానీ ఎక్కువ కదలకుండా ఉండేలా చూసుకుంటున్నా. 477 00:41:59,102 --> 00:42:00,312 అందరూ లేచి నిలబడండి. 478 00:42:06,068 --> 00:42:10,197 క్లియాన్ XII యొక్క న్యాయస్థానం సమావేశమైంది. 479 00:42:11,448 --> 00:42:16,870 యువర్ హానర్, ముద్దాయిలు, డాక్టర్ హారి సెల్డన్ మరియు గాల్ డోర్నిక్ మీద 480 00:42:17,538 --> 00:42:21,250 మోపబడిన ఆరోపణలు ఎంత తీవ్రమైనవంటే, అవి కేవలం ట్రాంటార్ ఉనికికే కాదు, 481 00:42:21,333 --> 00:42:23,544 మొత్తం గెలాక్సీ ఉనికికే ప్రమాదకరమైనవి. 482 00:42:24,336 --> 00:42:27,464 డాక్టర్ సెల్డన్, అలాగే అతని అనుచరులు మన సామ్రాజ్యం మీద ఉండే నమ్మకాన్ని 483 00:42:27,548 --> 00:42:31,301 నాశనం చేయాలని కుట్ర పన్నారని నేను నిరూపించగలను. 484 00:42:34,596 --> 00:42:37,182 డాక్టర్ సెల్డన్. మీరు నిలబడతారా? 485 00:42:37,891 --> 00:42:40,519 మీరు హెలికాన్ ప్రపంచానికి చెందినవారు కదా? 486 00:42:40,602 --> 00:42:41,812 అవును. 487 00:42:41,895 --> 00:42:44,398 ట్రాంటార్ లో మీరు ఇప్పుడు ఏ హోదాలో ఉన్నారో చెప్పగలరా? 488 00:42:44,481 --> 00:42:48,402 నేను స్ట్రీలింగ్ విశ్వవిద్యాలయంలో సంభావ్యత సిద్ధాంతంలో ప్రొఫెసర్ ని. 489 00:42:49,444 --> 00:42:53,031 నిర్దిష్టంగా చెప్పాలంటే, సైకో హిస్టరీలో అన్నమాట. 490 00:42:53,115 --> 00:42:54,825 అంటే ఏంటో దయచేసి మాకు వివరంగా చెప్పండి. 491 00:42:54,908 --> 00:42:58,579 సైకో హిస్టరీ అనేది భవిష్యత్తును సూచించే ఒక పద్ధతి, 492 00:42:58,662 --> 00:43:04,209 ఇది భారీ జనాభాల తీరును ముందుగానే ఊహించి చెప్పేలా రూపొందించబడింది. 493 00:43:04,293 --> 00:43:09,256 ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు జరగబోయేది చెప్పగలరని ప్రకటిస్తున్నారా? 494 00:43:09,339 --> 00:43:12,801 మీరు డిన్నర్ కి ఏం తినబోతున్నారనే అడుగుతుంటే కనుక, 495 00:43:12,885 --> 00:43:14,261 అది నాకు తెలీదు. 496 00:43:14,344 --> 00:43:15,929 నేనేం అడుగుతున్నానో మీకు తెలుసు. 497 00:43:16,013 --> 00:43:18,807 గెలాక్టిక్ సామ్రాజ్యంలో ఎనిమిది లక్ష కోట్ల మంది ఉన్నారు. 498 00:43:18,891 --> 00:43:21,810 జరగబోయేది ఊహించి చెప్పడానికి మీకు అంత పెద్ద శ్యాంపిల్ సరిపోతుందంటారా? 499 00:43:21,894 --> 00:43:22,895 సరిపోతుంది. 500 00:43:22,978 --> 00:43:26,231 మరి అంత పెద్ద శ్యాంపిల్ విషయంలో మీరు ఏదైనా జోస్యం చెప్పగలరా? 501 00:43:28,775 --> 00:43:29,776 చెప్పగలను. 502 00:43:32,321 --> 00:43:33,655 మాకు కూడా తెలియజేయండి. 503 00:43:33,739 --> 00:43:38,118 ట్రాంటార్ మరియు గెలాక్టిక్ సామ్రాజ్యం, మరో ఐదు శతాబ్ధాల్లో శిథిలావస్థకు చేరుకుంటాయి. 504 00:43:40,204 --> 00:43:41,622 నిశ్శబ్దం, సోదరులారా. 505 00:43:41,705 --> 00:43:45,876 ఒక నిమిషం పాటు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. అది నిజమని నిరూపించగలరా? 506 00:43:46,418 --> 00:43:50,255 క్రమాంక విశ్లేషణ గురించి తెలిసిన మరొక గణిత శాస్త్రవేత్తకు అయితే చూపగలను. 507 00:43:52,341 --> 00:43:53,634 బాగా మీకు అనుకూలంగా చెప్పుకున్నారు. 508 00:43:54,301 --> 00:43:58,180 మీ నిజాలు ఎంతటి క్లిష్టమైనవంటే, అవి దాదాపుగా ఏ పౌరునికీ అర్థం కావన్నమాట. 509 00:43:58,263 --> 00:44:00,891 అవి నా నిజాలు కావు. అవి విజ్ఞాన శాస్త్రం చెప్పే నిజాలు. 510 00:44:00,974 --> 00:44:05,229 ఇంపీరియమ్ ది 12,000 ఏళ్ల చరిత్ర, డాక్టర్. 511 00:44:05,312 --> 00:44:11,652 అది కేవలం 500 ఏళ్లలో తుడిచిపెట్టుకొని పోతుందంటే మేము నమ్మాలంటారా? 512 00:44:12,319 --> 00:44:14,154 -అది ఇంకా ముందుగానే జరగవచ్చు. -ఇంకా ముందుగానేనా? 513 00:44:14,238 --> 00:44:19,785 ఒక వాడిన చెట్టు మోడు, తుఫాను కారణంగా రెండుగా చీలేదాకా అది గట్టిగానే కనిపిస్తుంది. 514 00:44:20,285 --> 00:44:23,330 సూదూర భాగాలలో జరిగిన ఇటీవలి ఘటనలు ఓసారి పరిశీలిద్దాం. 515 00:44:23,413 --> 00:44:25,165 మనం ఇంకే విషయాలను పరిశీలించడానికి ఇక్కడ... 516 00:44:25,249 --> 00:44:26,667 కానీ మీరు తప్పనిసరిగా పరిశీలించాలి! 517 00:44:28,669 --> 00:44:30,337 సామ్రాజ్యం కూలిపోతుంది. 518 00:44:31,129 --> 00:44:33,215 స్థిరత్వం అంతర్దానమైపోతుంది. 519 00:44:33,298 --> 00:44:35,926 అంతరిక్ష యుద్ధాలకు అంతే ఉండదు. 520 00:44:36,009 --> 00:44:40,597 రేడియోధార్మికత పుణ్యమా అని పది వేల ప్రపంచాలు ధ్వంసమైపోతాయి. 521 00:44:41,390 --> 00:44:44,476 మనం ఏం చేసినా దీన్ని ఆపలేం. 522 00:44:45,227 --> 00:44:50,232 ఈ... ఆటవిక కాలం. 523 00:44:52,276 --> 00:44:54,111 అది ఎంత కాలం వరకు కొనసాగుతుందని మీరు అంటారు? 524 00:44:54,194 --> 00:44:56,363 ముప్పై వేల ఏళ్ళు, లాయరు గారు. 525 00:44:57,781 --> 00:45:01,910 డాక్టర్ సెల్డన్ "జోస్యం" యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రజల నమ్మకాన్ని 526 00:45:01,994 --> 00:45:05,122 దెబ్బ తీయడమే అని నేను న్యాయస్థానానికి తెలియజేస్తున్నాను. 527 00:45:05,706 --> 00:45:08,041 నేనేమీ విప్లవకారుడిని కాదు. 528 00:45:08,125 --> 00:45:09,960 అయితే, మీరు ఎవరు? 529 00:45:10,627 --> 00:45:12,838 భవిష్యత్తును మనం మార్చలేమని ఇందాకే మీరు అన్నారు కదా. 530 00:45:12,921 --> 00:45:17,509 అలాంటప్పుడు మీ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? 531 00:45:18,218 --> 00:45:21,096 నేను పతనం తాలూకు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను. 532 00:45:23,640 --> 00:45:26,185 దీన్ని మనం నిరోధించలేము, 533 00:45:26,268 --> 00:45:29,897 లెక్కలేనన్ని ఘటనలు మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 534 00:45:29,980 --> 00:45:33,650 కానీ మనం తర్వాత రాబోయే పాశవిక యుగాల వ్యవధిని తగ్గించవచ్చు. 535 00:45:33,734 --> 00:45:34,943 ఎంత వరకు తగ్గించవచ్చు? 536 00:45:36,236 --> 00:45:39,573 మీ ప్రణాళికని అనుసరిస్తే, ఎంత వరకు తగ్గించవచ్చు? 537 00:45:40,324 --> 00:45:44,286 మనం ఒక వెయ్యి సంవత్సరాలు అంధకారంలో బతకాలి, లాయరు గారు. 538 00:45:45,245 --> 00:45:50,209 దాంతోనే పోతే, మనం దేవుళ్లకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 539 00:46:09,144 --> 00:46:11,104 నిజానికి నా పేరు జెర్రిల్ కాదు. 540 00:46:12,940 --> 00:46:14,608 కానీ మీరు నన్ను ఆ పేరుతోనే పిలవవచ్చు. 541 00:46:15,817 --> 00:46:17,736 మేము మిమ్మల్ని చాలా కాలం నుండి గమనిస్తున్నాం. 542 00:46:17,819 --> 00:46:20,781 నిజం చెప్పాలంటే, మీరు అబ్రాక్సాస్ సమస్యని పరిష్కరించిన నాటి నుండి. 543 00:46:21,740 --> 00:46:22,991 నేను మీకొక కానుక తెచ్చాను. 544 00:46:23,659 --> 00:46:27,204 దీన్ని ఆయన ప్రైమ్ రేడియంట్ అని పిలుస్తాడు. చాలా అందంగా ఉంది కదా? 545 00:46:27,287 --> 00:46:31,291 దీనిలో, సామ్రాజ్యానికి సంబంధించిన జోస్యాలు అన్నీ గణిత ఈక్వేషన్ రూపంలో 546 00:46:31,375 --> 00:46:33,585 ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. 547 00:46:33,669 --> 00:46:35,754 దీన్ని పరిశీలించే అవకాశం ఆయన మీకు ఇచ్చాడా? 548 00:46:36,380 --> 00:46:37,381 లేదు. 549 00:46:38,215 --> 00:46:39,883 అది కాస్త వింతగా అనిపించడం లేదా? 550 00:46:39,967 --> 00:46:43,971 ఆయన గెలాక్సీలో ఎవరికీ అర్థంకాని విధంగా ఓ సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టాడు, 551 00:46:44,054 --> 00:46:46,223 దాన్ని అర్థం చేసుకోగల వ్యక్తి ఆయనకి తారసపడినప్పుడు, 552 00:46:46,306 --> 00:46:48,183 అసలు అందులో ఏముందో చూసే వీలును ఆయన ఆమెకు ఇవ్వలేదు. 553 00:46:48,267 --> 00:46:49,601 ఎందుకు? 554 00:46:49,685 --> 00:46:53,772 ఎందుకంటే చరిత్రని గమనిస్తే మనకి దొంగ బాబాలు, ఫకీర్లు చాలా మంది కనపడతారు. 555 00:46:54,356 --> 00:46:57,150 ఒకవేళ ఆయన చెప్పేది నిజమైతే? సైకో హిస్టరీ నిజమే అయితే? 556 00:46:57,234 --> 00:46:58,944 ఈక్వేషన్లు తప్పు అయితే, 557 00:46:59,027 --> 00:47:01,530 వాటిని బయటపెట్టాల్సిన నైతిక బాధ్యత మీపై ఉంటుంది. 558 00:47:10,455 --> 00:47:12,124 ఒకవేళ అవి సరైనవే అయితే? 559 00:47:12,207 --> 00:47:14,543 వాటిని వదిలేసి, మీ ఇంటికి వెళ్లిపోండి. 560 00:47:14,626 --> 00:47:18,797 అప్పుడు రాజు, తన కృతజ్ఞతను ఏదోక విధంగా ఖచ్చితంగా మీకు తెలియజేస్తాడు. 561 00:47:20,174 --> 00:47:22,301 మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్తాను, గాల్. 562 00:47:22,384 --> 00:47:24,887 హారి చెప్పింది అబద్ధమని మీరు చెప్తే, హారి చనిపోతాడు. 563 00:47:24,970 --> 00:47:27,181 అలా చెప్పకపోతే, మీరు చనిపోతారు. 564 00:47:27,264 --> 00:47:29,892 అయితే, మనమందరమూ మనకి ఏమీ తెలియనట్టే వ్యవహరించాలా? 565 00:47:29,975 --> 00:47:31,810 అతని ఈక్వేషన్లు సరైనవే అయితే, 566 00:47:31,894 --> 00:47:35,189 కోట్లాది ప్రజలని భయభ్రాంతులకు గురిచేయకుండా, ఎప్పటిలాగానే మహారాజు 567 00:47:35,272 --> 00:47:37,608 ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. 568 00:47:38,108 --> 00:47:40,152 ఒక గూఢాచారి అయిన మిమ్మల్ని నేను నమ్మాలా? 569 00:47:41,778 --> 00:47:44,198 మీరు ట్రాంటార్ ని నిర్మించిన మేధావులను, అలాగే జంప్ డ్రైవ్ ని, నక్షత్ర వారధిని 570 00:47:44,281 --> 00:47:46,450 నిర్మించిన మేధావులను నమ్మాలి. 571 00:47:46,533 --> 00:47:49,953 మా గ్రహంలో వారిని శాస్త్రవేత్తలని అంటారు, రాజకీయవేత్తలు కాదు. 572 00:47:50,037 --> 00:47:52,414 మీ గ్రహం గురించి నాకు బాగా తెలుసు, గాల్. 573 00:47:54,249 --> 00:47:56,126 అక్కడ వారిని పాపిష్ఠి వారిలా చూస్తారు, నీట్లో ముంచి చంపేస్తారు. 574 00:47:57,794 --> 00:48:00,506 అలాగే వ్యోమనౌకలో ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. 575 00:48:01,673 --> 00:48:03,050 ప్రయాణ సమయంలో... 576 00:48:05,052 --> 00:48:06,053 మీరు మేల్కొనే ఉన్నారు. 577 00:48:06,887 --> 00:48:07,971 మీకు ఏం జరుగుతోందో తెలుసు. 578 00:48:10,516 --> 00:48:12,893 -నాకు ఎందుకు అబద్ధం చెప్పారు? -ఏమో. 579 00:48:15,020 --> 00:48:16,104 నాకు భయం. 580 00:48:17,439 --> 00:48:18,565 ఎందుకు భయం? 581 00:48:19,066 --> 00:48:20,943 భిన్నంగా ఉండటమంటే భయం. 582 00:48:21,026 --> 00:48:22,569 మనందరమూ భిన్నమైన వాళ్ళమే, మిస్ డోర్నిక్. 583 00:48:23,362 --> 00:48:26,198 నా సోదరికి ఏడేళ్లు వచ్చేదాకా మాటలు రాలేదు. 584 00:48:26,281 --> 00:48:27,491 అప్పుడు కూడా, కేవలం పేర్లే పలకగలిగేది. 585 00:48:27,574 --> 00:48:29,535 కానీ మీరు చాలా ప్రత్యేకమైనవారు. 586 00:48:30,118 --> 00:48:32,704 ఆ ప్రత్యేకత ఏంటో మీకు తెలియకపోతే, దాన్ని ఇతరులు కనిపెట్టి 587 00:48:32,788 --> 00:48:35,541 మీకు వ్యతిరేకంగా ఉపయోగించకముందే, అదేంటో కనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. 588 00:49:28,594 --> 00:49:32,097 మీ ప్రణాళిక రాబోయే చీకటి యుగం వ్యవధిని తగ్గించగలదని మీరు చెప్తున్నారు. 589 00:49:33,098 --> 00:49:34,099 ఎలా? 590 00:49:34,183 --> 00:49:38,145 మన పూర్వీకులు ప్రపంచ విజ్ఞాన్నంతా ఒక చోట ఉంచారని పుకారు ఉంది. 591 00:49:38,228 --> 00:49:39,813 ఆ పౌరాణిక గాథ ప్రకారం, అది కాలి బూడిదైపోయింది. 592 00:49:39,897 --> 00:49:42,774 నేను వికేంద్రీకరణను ప్రతిపాదిస్తున్నాను. 593 00:49:43,358 --> 00:49:45,819 ఒక ఎన్సైక్లోపీడియా గెలాక్టికాని ప్రతిపాదిస్తున్నాను. 594 00:49:47,029 --> 00:49:51,325 పతనమయ్యాక, నాగరికత మళ్లీ అదే బూడిద నుండి ప్రాణం పోసుకుంటుంది, 595 00:49:52,284 --> 00:49:56,038 రాబోవు తరాలకు, తమ నాగరికతను నిర్మించుకోవడానికి ఒక పునాది లాంటిది 596 00:49:56,538 --> 00:49:57,956 అందుబాటులో ఉంటుంది. 597 00:49:58,790 --> 00:50:04,087 వాళ్ళు మళ్లీ కొత్తగా ఏమీ కనిపెట్టాల్సిన పనిలేదు. జ్ఞానం పదిలంగానే ఉంటుంది. 598 00:50:04,171 --> 00:50:06,715 కానీ మనం పదిలంగా దాచేది కేవలం విజ్ఞానాన్నే కాదు, 599 00:50:07,341 --> 00:50:09,343 మానవాళి గాథను కూడా. 600 00:50:10,928 --> 00:50:13,222 మన గాథను. 601 00:50:15,265 --> 00:50:18,101 ట్రాంటార్ లో ఇంపీరియల్ లైబ్రరీ ఉంది కదా. 602 00:50:18,936 --> 00:50:19,937 ఎంత కాలం ఉంటుంది? 603 00:50:20,521 --> 00:50:23,524 మీ ఆ ప్రకటనతో మనం మళ్లీ అసలు విషయానికి వద్దాం. 604 00:50:23,607 --> 00:50:28,487 క్రమాంక విశ్లేషణ గురించి తెలిసినవారికి మీ సిద్ధాంతాన్ని నిరూపించగలరని మీరన్నారు. 605 00:50:30,906 --> 00:50:32,950 గాల్ డోర్నిక్, దయచేసి నిలబడండి. 606 00:50:34,826 --> 00:50:36,453 దయచేసి వేదిక మీదికి రాగలరా. 607 00:50:45,379 --> 00:50:49,132 మీది సినాక్స్ గ్రహం కదా? అది ప్రత్యేకంగా చెప్పాలి. 608 00:50:49,216 --> 00:50:50,259 అవును. 609 00:50:50,342 --> 00:50:52,302 మీ ప్రార్థనా రాళ్ళని మీరు తీయించేసుకున్నారు. 610 00:50:52,386 --> 00:50:54,471 మీరు ఇప్పుడు దాదాపుగా మాలో ఒకరిలానే ఉన్నారు. 611 00:50:54,555 --> 00:50:57,766 మీ ప్రపంచానికి సంబంధించి నాకు తెలిసిన విషయమేంటంటే, ప్రార్థనా రాళ్లను 612 00:50:57,850 --> 00:50:59,643 తీసేయడమంటే, పూజారుల చర్చి నుండి విడిపోవడమే. 613 00:50:59,726 --> 00:51:00,727 అంతే కదా? 614 00:51:00,811 --> 00:51:03,480 చర్చి సిద్ధాంతం అదే చెప్తుంది, అవును. 615 00:51:03,564 --> 00:51:08,318 ఒకటి చెప్పండి, అక్కడ శాస్త్రవేత్తలను, గణిత పండితులను ఇంకా చంపుతున్నారా? 616 00:51:08,819 --> 00:51:11,363 మీరు మాట్లాడేది ప్రక్షాళన గురించే అయితే... 617 00:51:12,197 --> 00:51:16,743 దాన్ని చర్చి "శుద్ధి చేయడం" అని పిలుస్తుంది, యువర్ హానర్. 618 00:51:16,827 --> 00:51:18,662 చర్చి సిద్ధాంతం ప్రకారం, 619 00:51:18,745 --> 00:51:21,707 గణితం చదవడం పాపం కాదని ఎప్పుడు ప్రకటించారు? 620 00:51:21,790 --> 00:51:22,958 పాపం కాదని ఎప్పుడూ ప్రకటించలేదు. 621 00:51:23,041 --> 00:51:26,461 అయినా కానీ మీరు అబ్రాక్సాస్ సమస్యని పరిష్కరించగలిగారు. 622 00:51:27,296 --> 00:51:28,297 అవును. 623 00:51:28,380 --> 00:51:31,383 విశ్వవిద్యాలయాలను తగులబెట్టేసిన జనాలు ఉన్న ప్రపంచంలో. 624 00:51:31,466 --> 00:51:33,427 మీకు అక్కడ ఒంటరిగా అనిపించి ఉంటుంది. 625 00:51:34,094 --> 00:51:39,516 డాక్టర్ హారి సెల్డన్ మిమ్మల్ని గుర్తించాక మీకెలా అనిపించి ఉంటుందో ఊహించగలను. 626 00:51:40,893 --> 00:51:42,728 ఉద్యోగం దక్కడం. విలువ దక్కడం. 627 00:51:42,811 --> 00:51:44,188 మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? 628 00:51:44,271 --> 00:51:47,316 హారి సెల్డన్ విషయంలో మీరు పక్షపాతంగా వ్యవహరించడానికి అవకాశం ఏమైనా ఉందా... 629 00:51:49,318 --> 00:51:52,696 అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 630 00:51:54,364 --> 00:51:56,241 నాకు తెలీదు. పక్షపాతంగా వ్యవహరించనేమో. 631 00:51:57,534 --> 00:51:59,286 బహుశా అందుకే ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడేమో. 632 00:51:59,995 --> 00:52:01,580 డాక్టర్ సెల్డన్ ప్రకటనలలో నిజానిజాలను 633 00:52:01,663 --> 00:52:04,875 నిగ్గు తేల్చాల్సిందిగా నిన్న రాత్రి మీకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. 634 00:52:04,958 --> 00:52:06,627 మీకు ఏమైనా తెలిసిందా? 635 00:52:09,880 --> 00:52:11,131 తెలిసింది. 636 00:52:11,715 --> 00:52:12,674 అదేంటో చెప్పండి. 637 00:52:16,178 --> 00:52:18,764 డాక్టర్ సెల్డన్ యొక్క లెక్కలన్నీ... 638 00:52:19,598 --> 00:52:20,641 సరైనవే. 639 00:52:21,225 --> 00:52:23,519 సామ్రాజ్యం పతనమవ్వబోతోంది. 640 00:52:24,937 --> 00:52:25,979 వాళ్ళని చంపేయండి. 641 00:52:27,648 --> 00:52:28,815 దీనికి ముగింపు పలకండి. 642 00:52:42,871 --> 00:52:44,289 హారి, ఓసారి పైకి చూడండి. 643 00:52:45,499 --> 00:52:47,584 నక్షత్ర వారధిలో ఏదో సమస్య ఉన్నట్టుంది. 644 00:53:14,194 --> 00:53:16,613 దయచేసి శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి. 645 00:53:18,323 --> 00:53:20,284 మళ్లీ మీ గ్రహానికి ఎప్పుడు వెళ్తారు? 646 00:53:20,367 --> 00:53:21,577 మూడు రోజులలో. 647 00:53:21,660 --> 00:53:24,121 -శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి. -ధన్యవాదాలు. 648 00:53:30,460 --> 00:53:34,089 ఈ కారు ఇంకాసేపట్లో కిందికి ప్రయాణం మొదలుపెట్టనుంది. 649 00:53:34,631 --> 00:53:36,133 మీరు ఒక కుదుపుకు లోనుకావచ్చు. 650 00:53:36,842 --> 00:53:40,095 కిందికి ప్రయాణం ఆరంభం కాకముందే జాగ్రత్తగా కూర్చోండి. 651 00:56:58,710 --> 00:57:02,005 తాడు గ్రహాన్ని ఉరితాడులా బిగపట్టేసింది. 652 00:57:02,089 --> 00:57:03,715 అది 50 అంతస్థులను నాశనం చేసేసింది. 653 00:57:03,799 --> 00:57:05,259 -మహారాజ... -ఏం మాట్లాడవద్దు! 654 00:57:16,436 --> 00:57:22,067 పేలుడుకు ముందు అనాక్రీయాన్, తెస్పిన్ ల యుద్ధ నినాదాలు వినబడినట్టు సమాచారం. 655 00:57:22,568 --> 00:57:23,610 తిరుగుబాటు గేయాలు. 656 00:57:23,694 --> 00:57:25,946 మాకు ఇందులో ప్రమేయం లేదు, మేము... 657 00:57:26,029 --> 00:57:29,366 మేము మీ కానుకలను తిరిగి ఇచ్చేస్తున్నాం. 658 00:57:30,367 --> 00:57:36,164 86,963,777. 659 00:57:39,126 --> 00:57:44,423 86,963,791. 660 00:57:50,637 --> 00:57:51,847 మీరు ఇక్కడేం చేస్తున్నారు? 661 00:57:51,930 --> 00:57:53,557 నేను కమిటీ ముందు అర్జీ పెట్టాను. 662 00:57:56,226 --> 00:57:58,604 పది కోట్ల మంది ప్రాణాలు పోయాయని అంటున్నారు. 663 00:57:59,479 --> 00:58:01,607 సుదూరపు రాజ్యాలు తిరుగుబాటు బాట పట్టి ఉండవచ్చు. 664 00:58:02,357 --> 00:58:04,359 ఈ దాడి మొత్తాన్ని మార్చేస్తుంది. 665 00:58:07,029 --> 00:58:09,740 మీరు బతికే అవకాశమే లేదని హారి చెప్పాడు, 666 00:58:09,823 --> 00:58:11,700 కానీ నాకు అందులో అవకాశం మాత్రమే వినపడింది. 667 00:58:12,492 --> 00:58:15,245 హారిని చంపేస్తారు, గాల్. 668 00:58:17,331 --> 00:58:20,542 -మీరు కూడా అతనితో చావనక్కర్లేదు. -అతని లెక్క సరైనదేనని చెప్పేశానుగా. 669 00:58:22,085 --> 00:58:25,506 మళ్లీ పరిశీలించి చూశానని, పొరబడ్డానని చెప్పండి. 670 00:58:26,006 --> 00:58:27,508 మీకు నమ్మకం పోయింది. 671 00:58:29,176 --> 00:58:30,594 మన్నించండి. 672 00:58:30,677 --> 00:58:32,095 ఈమెకి అది అవసరం లేదు. 673 00:58:39,686 --> 00:58:40,938 పైకి లేవండి. 674 00:58:45,234 --> 00:58:48,153 ముందు నన్ను మాట్లాడమంటారా లేదా మీరే మాట్లాడతారా? 675 00:58:48,237 --> 00:58:50,239 తప్పకుండా, డాక్టర్ సెల్డన్. 676 00:58:51,406 --> 00:58:52,407 మీరే మాట్లాడండి. 677 00:58:52,491 --> 00:58:53,951 మీరు దీనికి మమ్మల్ని బాధ్యులు చేశారు. 678 00:58:54,034 --> 00:58:55,369 ఎలా చేయకుండా ఉండగలను? 679 00:58:55,452 --> 00:58:59,581 నా సైన్స్ సాంఘిక చర్యలని, ట్రెండ్లని అంచనా వేస్తుంది, వ్యక్తిగత చర్యలను కాదు. 680 00:59:00,082 --> 00:59:02,793 కానీ ఈ సంఘటన జరిగినందుకు నాకు పెద్ద ఆశ్చర్యమేమీ కలగలేదు. 681 00:59:02,876 --> 00:59:04,086 ఎందుకలా? 682 00:59:04,169 --> 00:59:05,754 అన్ని పనులనూ చూసుకోవడానికి సరిపడా వనరులు మీ వద్ద లేవు. 683 00:59:07,339 --> 00:59:10,300 అందుకే సుదూర భాగాలలోని లోకాలు మొదట దాడి చేశాయి. 684 00:59:10,384 --> 00:59:12,261 మరి తప్పు వారిదే అని అనగలమా? 685 00:59:12,970 --> 00:59:17,516 ఈ బలహీన సందర్భాన్ని ఆసరాగా తీసుకొని, ఇతరులూ ఒత్తిడి పెట్టడం ఆరంభిస్తారు. 686 00:59:17,599 --> 00:59:22,688 ఖచ్చితంగా గెలాక్సీలోని ఒక ప్రధాన మతం నుండి ప్రోత్సాహం అందుతుంది. 687 00:59:22,771 --> 00:59:25,148 లేదా ఇక్కడ ట్రాంటార్ లోనే విప్లవం మొలకెత్తవచ్చు. 688 00:59:25,232 --> 00:59:27,568 నక్షత్ర వారధి సంఘటనకి కారకులు ఎవరు? 689 00:59:28,235 --> 00:59:29,945 నాకు తెలీదు. 690 00:59:30,028 --> 00:59:33,699 మిమ్మల్ని, మీ అనుచరులని ఈ క్షణమే నేను ఎందుకు చంపకూడదో ఓ కారణం చెప్పండి. 691 00:59:33,782 --> 00:59:35,242 దీనికీ నా అనుచరులకూ ఏ సంబంధమూ లేదు! 692 00:59:35,325 --> 00:59:37,286 ఒకవేళ మీరు చంపితే, ఒక సంవత్సరంలోపే మీరు చనిపోతారు. 693 00:59:40,372 --> 00:59:42,207 మేధావి ఎట్టకేలకు పెదవి విప్పింది. 694 00:59:51,175 --> 00:59:52,426 చెప్పండి మరి. 695 00:59:54,761 --> 00:59:58,974 మీ ఏజెంట్ జెర్రిల్, డాక్టర్ సెల్డన్ పనితనాన్ని పరిశీలించమని అడిగాడు. 696 00:59:59,057 --> 01:00:01,185 నేను ఈక్వేషన్ ని ఇంకాస్త లోతుగా పరిశీలించాను. 697 01:00:01,268 --> 01:00:05,731 ఆయన్ని మీరు చంపితే, పతనం మరింత వేగవంతంగా జరుగుతుంది. 698 01:00:05,814 --> 01:00:08,901 అహా, మీకు మీరు బాగా అనుకూలంగా చెప్తున్నారుగా. 699 01:00:09,401 --> 01:00:12,070 చీకటి యుగం వ్యవధిని కేవలం ఆయన మాత్రమే తగ్గించగలడు. 700 01:00:13,322 --> 01:00:15,032 మీరు ఆయన్ని చంపేస్తే, ఆశను కూడా చంపేసినవారవుతారు. 701 01:00:16,200 --> 01:00:17,534 ఆశనే చంపేస్తే... 702 01:00:18,535 --> 01:00:19,995 మీరు హత్యకు గురవుతారు. 703 01:00:23,749 --> 01:00:25,209 దానికి అవకాశమెంత ఉంది? 704 01:00:27,669 --> 01:00:31,840 గెలాక్సీని కాపాడగల ఇద్దరూ ఈ గదిలోనే ఉన్నారు. 705 01:00:34,134 --> 01:00:36,011 వారిలో ఒకరిది తప్పు. 706 01:00:36,512 --> 01:00:37,763 నేను కూడా ఎకీభవిస్తాను. 707 01:00:39,890 --> 01:00:44,353 పతనం వేగవంతమవ్వగలదు అంటే, దాని వేగాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుందా? 708 01:00:44,853 --> 01:00:48,148 ఉంటుంది. కొన్ని శతాబ్దాలు ఆలస్యం చేయవచ్చు. 709 01:00:48,232 --> 01:00:50,067 అదెలాగో మాకు వివరంగా చెప్పండి. 710 01:00:50,692 --> 01:00:52,319 రాచరిక క్లోనింగ్ ని ఆపేయండి. 711 01:00:54,446 --> 01:00:58,116 రాచరిక క్లోనింగ్ యుద్ధాలను ఆపింది. 712 01:00:58,200 --> 01:01:00,577 రాచరిక క్లోనింగ్ శాంతిని నెలకొల్పింది. 713 01:01:00,661 --> 01:01:04,122 మా సార్వత్రిక సామ్రాజ్యం నాలుగు శతాబ్దాల నుండి పాలిస్తూ వస్తోంది. 714 01:01:04,206 --> 01:01:09,211 మీకున్న వివేకమే ఉండే యువ ఆలోచనల విలువను మీరు అర్థంచేసుకోగలరు కదా. 715 01:01:09,962 --> 01:01:13,048 నేను విలువను భిన్నత్వంలో చూస్తాను, 716 01:01:13,131 --> 01:01:14,383 కొత్తదనంలో చూస్తాను. 717 01:01:14,883 --> 01:01:16,468 మీరు కొత్తదానాన్ని అస్సలు అందించడం లేదు. 718 01:01:16,552 --> 01:01:18,971 రక్తం కొత్తది అంతే... 719 01:01:20,848 --> 01:01:22,391 అదే మనస్తత్వం, 720 01:01:22,474 --> 01:01:25,352 అవే ఆలోచనలు. 721 01:01:29,064 --> 01:01:31,441 మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు... 722 01:01:33,068 --> 01:01:35,112 కానీ మీ ప్రతిష్ఠని కాపాడుకోగలరు. 723 01:01:35,195 --> 01:01:37,948 మీదా, నాదా, డాక్టర్ సెల్డన్? 724 01:01:53,630 --> 01:01:55,215 ప్రైమ్ రేడియంట్ ని ఆన్ చేయడానికి... 725 01:01:58,385 --> 01:02:00,304 మీకు ఎంత సేపు పట్టింది? 726 01:02:00,971 --> 01:02:02,723 రెండవ ప్రయత్నంలో ఆన్ చేయగలిగాను. 727 01:02:06,101 --> 01:02:07,936 నాకు అది ఇస్తారని మీకు ముందే తెలుసు. 728 01:02:14,318 --> 01:02:15,986 హారి, దాన్ని నేను చూసినప్పుడు, నేను... 729 01:02:17,738 --> 01:02:20,699 వాళ్ల వాదన కూడా పకడ్బందీగా ఉందని చూపుతారని నేను భావించాను. 730 01:02:20,782 --> 01:02:22,659 కానీ వాళ్లు పట్టించుకోలేదు, కదా? 731 01:02:22,743 --> 01:02:23,744 మనం పట్టించుకున్నామా? 732 01:02:26,413 --> 01:02:28,123 కొక్కెం ఇంకా మిమ్మల్ని బాధిస్తోందా? 733 01:02:29,625 --> 01:02:34,505 మీరు అన్నదే జైలాస్ కూడా అన్నాడు. "మీకు ఒంటరిగా అనిపించి ఉంటుంది." 734 01:02:35,005 --> 01:02:36,965 వారు అంతా వింటున్నారు. 735 01:02:37,049 --> 01:02:38,592 వారు వింటున్నారని మీకు కూడా తెలుసు. 736 01:02:38,675 --> 01:02:41,261 -ఇప్పుడు కూడా వింటున్నారు. -సరే. 737 01:02:41,345 --> 01:02:43,055 వాళ్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? 738 01:02:43,639 --> 01:02:47,935 ఎర అబ్రాక్సాస్. మీరు కాదు. 739 01:02:48,644 --> 01:02:50,562 వారు అడుగులు వేయక ముందు నేను వేశాను అంతే. 740 01:02:51,271 --> 01:02:54,316 మీరు ఊహించినదాని కన్నా మీరు ఇక్కడ మరింత బాగా మంత్రాంగం చేయగలరు, గాల్. 741 01:03:14,878 --> 01:03:19,049 మీ మరణాల వల్ల ఇంపీరియమ్ కి ప్రయోజనం చేకూరే ఫలితం లభించదని 742 01:03:19,132 --> 01:03:20,717 మహరాజు గారు నిర్ణయం తీసుకున్నారు. 743 01:03:20,801 --> 01:03:24,054 మీ పునాదిని నిర్మించుకోవడానికి సైకో హిస్టరీ లో మీ పనిని 744 01:03:24,137 --> 01:03:25,889 మరింత మెరుగుపరుచుకొనే వీలును మీకు అందించడం జరిగింది. 745 01:03:28,642 --> 01:03:30,060 కానీ ట్రాంటార్ లో కాదు. 746 01:03:31,311 --> 01:03:32,437 టర్మినస్ లో, 747 01:03:32,521 --> 01:03:36,775 గెలాక్సీలోని సుదూర భాగంలో ఒక అంచున 748 01:03:36,859 --> 01:03:38,777 నిర్మానుష్యంగా ఉండే గ్రహం అది. 749 01:03:38,861 --> 01:03:41,405 అనాక్రీయాన్ మరియు తెస్పిస్ కూడా అంచునే ఉన్నాయి కదా. 750 01:03:41,488 --> 01:03:44,783 అవును, ఆ మొరటు రాజ్యాలు మీ పక్కనే ఉంటాయి. 751 01:03:45,742 --> 01:03:47,411 మీరు నెమ్మదిగా వెళ్లే ఒక నౌకలో ప్రయాణం చేస్తారు. 752 01:03:47,494 --> 01:03:50,539 జంప్ డ్రైవ్ సాంకేతికతను వాడే సౌలభ్యాన్ని రాజుగారు మీకు ఇవ్వలేదు. 753 01:03:50,622 --> 01:03:52,207 మీరు మమ్మల్ని వెలివేస్తున్నారు. 754 01:03:52,291 --> 01:03:56,170 మీరు టర్మినస్ లో ఉంటే, మీ వలన ట్రాంటార్ కి ఏ ఇబ్బందీ ఉండదు, 755 01:03:56,253 --> 01:03:59,131 మహారాజు గారి ప్రశాంతతకు కూడా ఏ భంగమూ వాటిల్లదు. 756 01:04:00,132 --> 01:04:02,926 మీరు పతనాన్ని ఆపడానికి పోరాడుతున్నారని గెలాక్సి అంతటికీ తెలుస్తుంది. 757 01:04:03,594 --> 01:04:06,096 ఒకవేళ సైకో హిస్టరీ అంతా బూటకమని తేలితే, 758 01:04:07,222 --> 01:04:11,643 మీ పునాది అక్కడే అంతమైపోతుంది. 759 01:04:12,186 --> 01:04:13,770 ఒకవేళ అది విజయవంతమైతే, 760 01:04:14,938 --> 01:04:19,359 మీరు దాన్ని అందిపుచ్చుకొని మీ ఏలుబడిని పటిష్టం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 761 01:04:22,946 --> 01:04:25,115 ఇప్పటిదాకా నేను టర్మినస్ అనే పేరున్న గ్రహాన్ని వినలేదు కూడా. 762 01:04:25,199 --> 01:04:28,869 అందులో ఆశ్చర్యమేమీ లేదు. అది 50,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 763 01:04:28,952 --> 01:04:31,121 జంప్ డ్రైవ్ లేకుండా, అక్కడికి చేరుకోవడానికి... 764 01:04:31,205 --> 01:04:34,917 -878 రోజులు పడుతుంది. -దాదాపుగా. 765 01:04:35,000 --> 01:04:36,668 పర్వాలేదులే. 766 01:04:36,752 --> 01:04:38,962 మనం కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది, అందులో సందేహం లేదు. 767 01:04:39,463 --> 01:04:42,633 టర్మినస్ ఒక రెడ్ డ్వార్ఫ్ చుట్టూ తిరుగుతుంది. 768 01:04:42,716 --> 01:04:45,594 అక్కడి ఋతువులు తీవ్రంగా ఉంటాయి. లోహలు, ఖనిజాలు తక్కువగా ఉంటాయి. 769 01:04:45,677 --> 01:04:46,929 దాని గురించి మీకు బాగానే తెలిసినట్టుంది. 770 01:04:49,765 --> 01:04:51,350 మొదటి నుంచీ వెలివేయాలన్నదే వాళ్ళ ప్లాన్ అన్నమాట. 771 01:04:52,226 --> 01:04:54,895 అందుకు టర్మినస్ ని మించిన సరైన ప్రాంతం మరొకటి లేదు. 772 01:04:54,978 --> 01:04:56,563 ఎక్కడో గెలాక్సీ అంచున ఉంటుంది. 773 01:04:56,647 --> 01:04:59,316 ఇంపీరియల్ నిఘా ఉండదు, ఇంపీరియల్ మద్దతు ఉంటుంది. అదే ఉత్తమ చోటు. 774 01:04:59,399 --> 01:05:00,484 ఈ విషయం ఇంకెంతమందికి తెలుసు? 775 01:05:00,567 --> 01:05:01,693 రేయిచ్ కి మాత్రమే తెలుసు. 776 01:05:04,947 --> 01:05:06,907 మీరు మహారాజుకు చెప్పింది... 777 01:05:06,990 --> 01:05:09,785 నా గణితాన్ని ఎంత లోతుగా మీరు పరిశీలించారు? 778 01:05:10,369 --> 01:05:11,703 మీకు అసలు ఏం కనబడింది? 779 01:05:12,329 --> 01:05:14,289 -నిజానికి నాకు అది అర్థం కాలేదు. -అయితే, మీరు అబద్ధం చెప్పారా? 780 01:05:14,373 --> 01:05:15,791 నేను ఊహించి చెప్పాను. 781 01:05:16,959 --> 01:05:20,337 సినాక్స్ లో సముద్ర నీటి మట్టం పెరుగుతోందంటే ఎవరూ వినలేదు, 782 01:05:21,213 --> 01:05:24,049 అందుకని, జనాలని వినేలాగా చేస్తే, వారిని కాపాడవచ్చని గ్రహించాను. 783 01:05:24,633 --> 01:05:28,679 మార్పు అనేది భయం కలిగించే అంశం. ప్రత్యేకించి అధికారంలో ఉన్నవారికి. 784 01:05:28,762 --> 01:05:30,848 నాకు మహారాజులో భయం కనబడింది. 785 01:05:32,683 --> 01:05:36,520 నేను ప్రైమ్ రేడియంట్ లో చూసినప్పుడు, నాకు అంధకారం కనిపించింది. 786 01:05:36,603 --> 01:05:40,232 మొదట దాన్ని చూసి నా నోట మాట రాలేదు. మొత్తం తలకిందులైపోయినట్టు అనిపించింది. 787 01:05:41,275 --> 01:05:43,193 కానీ నేను లోతుగా చూశాను, 788 01:05:43,277 --> 01:05:48,490 నాకు దాని అంచున రవ్వంత ఆశాకిరణం కనిపించింది. 789 01:05:50,367 --> 01:05:53,370 వారు భయపడేది పతనం విషయంలో కాదని నాకు అప్పుడు అర్థమైంది. 790 01:05:53,871 --> 01:05:56,456 మీ ప్లాన్ నిజంగా విజయవంతమయ్యే అవకాశం ఉందని వారి భయం. 791 01:05:58,542 --> 01:06:01,044 కూలగొట్టడం కన్నా కట్టడానికి మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. 792 01:06:02,004 --> 01:06:03,797 నాకు కట్టాలని ఉంది, హారి. 793 01:06:04,923 --> 01:06:06,675 మీకు తప్పకుండా అవకాశం దక్కుతుంది. 794 01:06:08,093 --> 01:06:11,722 పునాదికి సంబంధించి ఇది తొలి సంక్షోభం కాదు, అలా అని ఆఖరిది కూడా కాబోదు. 795 01:06:11,805 --> 01:06:15,309 తర్వాతి సంక్షోభం ఎప్పుడు రాబోతోందో కూడా మీకు తెలుసని నాకనిపిస్తోంది. 796 01:06:16,393 --> 01:06:19,813 మహారాజు గారి శాంతి, అలాగే కొనసాగుతుంది. 797 01:06:25,110 --> 01:06:29,239 సినాక్స్ నుండి ట్రాంటార్ కి వచ్చారు. ఇప్పుడు టర్మినస్ కి వెళ్తున్నారు. 798 01:06:29,740 --> 01:06:32,159 మీ ప్రపంచాన్ని కాపాడుకుందామనే ఆశతో మీరు ఇక్కడికి వచ్చారు. 799 01:06:32,242 --> 01:06:34,661 మీ ఆలోచన అక్కడితోనే ఆగిపోరాదని నేను కోరుతున్నాను. 800 01:06:35,746 --> 01:06:39,499 ఒక ప్రపంచంతోనే ఆగిపోవడం ఎందుకు? గెలాక్సీనే కాపాడవచ్చు కదా? 801 01:06:40,792 --> 01:06:42,085 తప్పకుండా. 802 01:06:56,225 --> 01:06:59,311 టర్మినస్ 803 01:07:06,693 --> 01:07:09,696 35 ఏళ్ల అనంతరం 804 01:07:11,406 --> 01:07:13,534 హారి కేవలం తనకి కనిపించిన విషయాలను మాత్రమే 805 01:07:13,617 --> 01:07:16,119 దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేశాడు. 806 01:07:17,120 --> 01:07:19,540 పునాది 807 01:07:19,623 --> 01:07:23,335 సైకో హిస్టరీ అనేది, మొత్తం జనాభాకు సంబంధించిన ప్రవర్తనను 808 01:07:23,418 --> 01:07:25,254 చాలా అంటే చాలా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతుంది. 809 01:07:25,337 --> 01:07:30,008 కానీ, అది వ్యక్తి స్థాయికి వచ్చినప్పుడు అందులో గందరగోళం ఏర్పడుతుంది. 810 01:07:34,680 --> 01:07:39,977 వాల్ట్ దరికి ఎవరూ చేరుకోలేరు. శాల్వార్ హార్డిన్ లాంటి అసాధారణమైన వారు తప్ప. 811 01:07:41,270 --> 01:07:42,813 నన్ను ఎప్పుడూ ఓ అనుమానం వేధించేది... 812 01:07:44,606 --> 01:07:46,650 హారి తన ప్రణాళికను రచించేటప్పుడు, దానిలో ఆమె ఏం కనుగుంటుందో, 813 01:07:47,359 --> 01:07:51,947 దాని మీద గెలాక్సీ భవితవ్యం ఆధారపడుతుందని అతను గ్రహించాడా? 814 01:07:53,156 --> 01:07:54,741 అతను గ్రహించాడనే నాకనిపిస్తోంది. 815 01:07:55,993 --> 01:07:58,370 ఇంకా అతడిని బాగా కలవరపెట్టిన విషయం కూడా అదే అని నాకనిపిస్తోంది. 816 01:08:16,680 --> 01:08:17,639 లిండా ఆన్ లెవిటన్ జ్ఞాపకార్థం 817 01:09:10,234 --> 01:09:12,236 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య