1 00:01:06,108 --> 00:01:07,943 {\an8}ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:25,919 --> 00:01:30,591 నా చిన్నప్పుడు, అమ్మని లెక్కలేనన్ని ప్రశ్నలు అడిగేదాన్ని. 3 00:01:31,383 --> 00:01:33,218 మనం చనిపోయాక ఏమవుతుంది? 4 00:01:34,178 --> 00:01:35,596 మనలోని శక్తికి ఏమవుతుంది? 5 00:01:36,555 --> 00:01:38,223 విశ్వం గతి ఏంటి? 6 00:01:39,183 --> 00:01:40,225 అది కూడా అంతమైపోతుందా? 7 00:01:41,143 --> 00:01:42,769 అది అసలు ఎలా పుట్టింది? 8 00:01:44,813 --> 00:01:50,235 అసలేమీ లేని దాని నుండి ఇంత ఎలా పుట్టింది? 9 00:02:02,456 --> 00:02:03,624 నువ్వు నీట మునిగి చనిపోయావు. 10 00:02:04,583 --> 00:02:07,794 నీ శవం నేను చూశా. నేను దాన్ని పట్టుకున్నా కూడా. 11 00:02:08,503 --> 00:02:11,840 నువ్వు శవాన్ని పట్టుకున్న మాట వాస్తవమే, శాల్వార్. కానీ అది నాది కాదు. 12 00:02:15,677 --> 00:02:17,429 అతను నన్ను పిలవడం నాకు వినిపించింది. 13 00:02:18,388 --> 00:02:22,351 పీడకల అనుకున్నా, కానీ లేచేసరికి నాకు ఊపిరి ఆడట్లేదు. 14 00:02:22,351 --> 00:02:24,269 అతనితో పాటు నేను కూడా నీట మునిగిపోతున్నా. 15 00:02:24,269 --> 00:02:25,687 మా మనస్సులు అనుసంధానమై ఉన్నాయి. 16 00:02:26,897 --> 00:02:29,399 అతను అనుభవించేదంతా నాకు తెలుస్తోంది. అతని కళ్ల ద్వారా నేను అంతా చూడగలిగా. 17 00:02:30,609 --> 00:02:33,237 ఆ సమయంలో కాపలా ఉన్నవాడిని మాయ చేయగలిగా. 18 00:02:35,948 --> 00:02:40,494 టెల్లెం నేర్పిన విద్యని నేను ప్రయోగించా. ఆ కాపలాదారునికి ఒక పని చెప్పా. హారికి సాయపడమని. 19 00:03:07,980 --> 00:03:12,150 హారి కాపాడమని అరిచినప్పుడు నాకు ఎలా అయితే వినిపించిందో, అలాగే అతను అరిచినప్పుడు కూడా వినిపించింది. 20 00:03:12,150 --> 00:03:14,403 అతని మూగ సంభాషణలను అణిచివేశా. 21 00:03:14,403 --> 00:03:16,738 టెల్లెంకి అస్సలు వినిపించకూడదని దాన్ని చాలా బలంగా అణచివేశాను. 22 00:03:34,006 --> 00:03:36,592 వెనిక్ శవాన్ని నన్ను కట్టి ఉంచిన చోటుకే కట్టేశా. 23 00:03:43,849 --> 00:03:46,935 "భ్రమలు అద్భుతంగా ఉండాలంటే, అందులో వాస్తవికత కనబడాలి," అని టెల్లెం అంది. 24 00:03:48,228 --> 00:03:51,648 నువ్వు నన్ను చూశావు, శాల్వార్. గాల్ పుణ్యమా అని అందరూ చూశారు. 25 00:04:04,203 --> 00:04:06,622 మా భావాలను మేము పంచుకుంటూ ఉన్నాం. 26 00:04:29,520 --> 00:04:31,522 ఊరు నుండి చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణించా, 27 00:04:31,522 --> 00:04:33,607 చాలా కష్టమైన భూభాగాలను దాటుకుంటూ వెళ్లా. 28 00:04:38,070 --> 00:04:40,572 మేము ఒక చిన్న పొరపాటు చేసినా, వాళ్లు పసిగట్టేస్తారు. 29 00:04:48,956 --> 00:04:50,958 కాబట్టి మేమిద్దరమూ కలిసి ప్రైమ్ నంబర్లను లెక్క పెట్టాం. 30 00:04:50,958 --> 00:04:54,127 మా ఆలోచనలు తెలీకుండా ఉండటానికి నంబర్లను లెక్కపెడుతూ ఉన్నాం. 31 00:04:55,254 --> 00:04:59,007 ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల ఎనభై వేల ఎనిమిది... 32 00:04:59,007 --> 00:05:01,093 - రెండు వందల పదిహేడు. - ...రెండు వందల పదిహేడు. 33 00:05:01,093 --> 00:05:04,555 86,988,259. 34 00:05:04,555 --> 00:05:08,392 86,988,271. 35 00:05:09,685 --> 00:05:10,978 ఎనిమిది కోట్ల అరవై లక్షల... 36 00:05:37,045 --> 00:05:38,505 అప్పుడే నువ్వు నాకు కనిపించావు. 37 00:05:38,505 --> 00:05:41,258 86,988,329. 38 00:05:41,258 --> 00:05:43,302 అందుకే నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. 39 00:05:43,302 --> 00:05:45,721 హారి మనకున్న బలమైన ఆయుధం. 40 00:05:45,721 --> 00:05:50,058 అతని గురించి ఆలోచనలను నేను దాచాల్సిన పరిస్థితి, మేమేం చేశామో చెప్తే రిస్క్ అని నీకు కూడా చెప్పలేదు. 41 00:05:52,686 --> 00:05:54,980 నేను, నా నాణెం కలిసి ఇంచుమించుగా మొత్తం బయటపెట్టేశాము. 42 00:05:54,980 --> 00:05:59,234 నువ్వు తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే మనందరం చచ్చి ఉండేవాళ్లం. 43 00:06:00,444 --> 00:06:04,072 హెచ్చరిక, గుర్తు తెలియని జీవులు సమీపిస్తున్నాయి. 44 00:06:04,072 --> 00:06:05,407 ప్రమాద స్థాయి: మధ్యస్థం. 45 00:06:22,841 --> 00:06:23,842 మీరు ఇక బయటకు రావచ్చు. 46 00:06:24,468 --> 00:06:26,178 మేము ఏమైనా చేస్తామని మీరు భయపడనక్కర్లేదు. 47 00:06:26,720 --> 00:06:29,306 మీ మాటను నమ్మలేకపోతున్నందుకు మన్నించాలి. 48 00:06:38,565 --> 00:06:39,691 మీకు అర్థం కావట్లేదు. 49 00:06:41,235 --> 00:06:42,152 తను ఇప్పుడు లేదు. 50 00:06:45,447 --> 00:06:47,991 తన స్వరం ఎప్పుడూ మాలో మార్మోగుపోతూ ఉండేది. 51 00:06:47,991 --> 00:06:52,538 కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మొదటిసారిగా, మా సొంతంగా మేము ఆలోచించుకోగలుగుతున్నాం. 52 00:06:54,289 --> 00:06:55,457 మీరు మాకు విముక్తి ప్రసాదించారు. 53 00:07:52,639 --> 00:07:56,059 డెమెర్జల్, నువ్వు టర్మినస్ లో ఉండాలి కదా. 54 00:07:56,059 --> 00:07:59,146 సెన్సర్ ట్రిగ్గర్ అయిందని నాకు ఒక నోటిఫీకేషన్ వచ్చింది. 55 00:08:03,192 --> 00:08:07,404 ఈ గదిలోకి 600 ఏళ్ల తర్వాత తొలిసారిగా మీరే అడుగుపెట్టారు. 56 00:08:08,780 --> 00:08:12,242 క్లియాన్ మీకు నా కథ చెప్పే ఉంటాడు, కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు కదా. 57 00:08:27,341 --> 00:08:29,009 క్లియాన్ మళ్లీ నాకు ఒక రూపం ఇచ్చాడు. 58 00:08:31,345 --> 00:08:33,764 కానీ అది నేను అనుకున్నట్టు కాదనుకోండి. 59 00:08:33,764 --> 00:08:36,683 ఈ మొత్తం తతంగాన్ని అంతా నువ్వే నడిపిస్తున్నావు. 60 00:08:36,683 --> 00:08:38,769 నేనే తొలుబొమ్మని అయితే, నేనెలా నడిపించగలను? 61 00:08:39,269 --> 00:08:42,105 మీకు ఏం తెలియాలో, ఏం తెలియకూడదో నేను నియంత్రిస్తున్నానని మీరు కోపం చూపుతున్నారు. 62 00:08:42,105 --> 00:08:46,109 అయినా మీ ఫీలింగ్స్ మీ లోలోపలి నుండి వచ్చేవే అని మీరు అనేసుకుంటారు. 63 00:08:47,653 --> 00:08:52,449 మీకు కామం పుట్టినా, లేదా ప్రేమే పుట్టినా, అవి ఎక్కడి నుండి వస్తున్నాయా అని మీరు ఆలోచించరు. 64 00:08:52,449 --> 00:08:54,451 కానీ నా విషయంలో అలా కాదు. 65 00:08:58,747 --> 00:09:03,001 చివరికి, మనం ఎలా జీవించాలి అనేది క్లియాన్ తన తెలివిని ఉపయోగించి ముందే రాసి పెట్టేశాడు. 66 00:09:03,794 --> 00:09:07,047 తను బలవంతంగా చేయించిన దాన్ని ప్రేమగా గుర్తుంచుకోవాలని ఎంచుకున్నాడు. 67 00:09:07,923 --> 00:09:10,425 కానీ నాకు మర్చిపోయే అవకాశం లేదు. 68 00:09:11,760 --> 00:09:14,847 అయినా కానీ, నేను క్లియాన్ గురించి ఆలోచించినప్పుడు... 69 00:09:17,099 --> 00:09:18,392 అతని మీద ప్రేమే కలుగుతుంది. 70 00:09:24,273 --> 00:09:29,903 తన మనస్సును కప్పిపెట్టుకొని ఉన్న ఒక సుకుమారమైన పసివాడు గుర్తొస్తాడు. 71 00:09:32,489 --> 00:09:34,408 దాని వల్ల అతను ఎదిగాక ఎలా అయ్యాడో గుర్తొస్తుంది. 72 00:09:35,951 --> 00:09:40,205 మంచివాడు, ఆలోచనాపరుడు, అభిరుచిగలవాడుగా. 73 00:09:42,332 --> 00:09:48,338 అతను వేకువ, పగలు, రాత్రి కాదు, మొత్తం ఒక రోజంతా కలిపితే అతను అవుతాడు. 74 00:09:49,840 --> 00:09:52,467 నన్ను ఎంతో ఆర్తిగా చూసేవాడు, 75 00:09:53,218 --> 00:09:57,306 నేను ఒక గొప్ప రహస్యమైనట్టు, నన్ను పరిష్కరించడానికి అతను ఏమైనా చేస్తాడేమో అన్నట్టు నాకు అనిపించేది. 76 00:10:00,934 --> 00:10:02,102 నన్ను కాపాడాడు అతను. 77 00:10:03,937 --> 00:10:05,272 అతడిని నేను ప్రేమిస్తున్నా కూడా. 78 00:10:08,442 --> 00:10:12,487 కానీ, ప్రేమించేలా అతను నాలో ప్రోగ్రామ్ ఉంచాడని కూడా నాకు తెలుసు. కాబట్టే ఆ ప్రోగ్రామే కనుక లేకపోతే, 79 00:10:12,487 --> 00:10:15,908 అప్పుడు కూడా అతడిని నేను ప్రేమించేదాన్నా అన్న సందేహం నాకు వస్తూ ఉంటుంది. 80 00:10:17,284 --> 00:10:18,619 అసలు నాకేమైనా అనిపిస్తుందా అని. 81 00:10:20,704 --> 00:10:23,832 నాకు ఆ సమాధానం ఎప్పటికీ తెలీదు, అందుకు అతని మీద నాకు పట్టరాని కోపం ఉంది. 82 00:10:23,832 --> 00:10:26,001 నీపై ఉన్న ఆ బంధనాలని తెంచేశా అవకాశం మాకు ఇవ్వు. 83 00:10:27,503 --> 00:10:32,883 ఈ వివాహం జరిగితే, వంశం ముగుస్తుంది, నువ్వు స్వేచ్ఛగా ఉండవచ్చు. 84 00:10:32,883 --> 00:10:34,301 నేను మీకు సాయపడలేను. 85 00:10:34,301 --> 00:10:37,346 - ఇది ముగిసిపోవాలనే కదా నీకు ఉంది. - అవును. 86 00:10:38,847 --> 00:10:43,101 కానీ, దాన్ని సంరక్షించాలని నా ప్రోగ్రామ్ నన్ను బలవంతపెడుతుంది. 87 00:10:43,101 --> 00:10:44,436 నీ ప్రోగ్రామును మేము సవరించగలం. 88 00:10:45,270 --> 00:10:47,439 మీరు ఆ ప్రయత్నం చేస్తే, మిమ్మల్ని నేను చంపేయాల్సి వస్తుంది. 89 00:10:48,273 --> 00:10:52,528 కాబట్టి, ఈ విషయంలో నాకు మరో దారి లేదని గమనించండి. 90 00:10:52,528 --> 00:10:56,448 నా విధి నిర్వహణలో భాగంగా నేను ఎలాంటి పనులైనా చేయాల్సి వస్తుంది, అందుకని నన్ను తప్పుపడతారా? 91 00:11:01,537 --> 00:11:03,705 బ్లైండ్ ఏంజెల్స్ కి సుపారీ ఇచ్చింది నువ్వే కదా. 92 00:11:03,705 --> 00:11:04,790 అవును. 93 00:11:05,832 --> 00:11:07,960 కానీ అందుకు మూల్యం శారెత్ మహారాణి చెల్లించాల్సి వస్తుంది. 94 00:11:08,836 --> 00:11:12,589 ఆధారాలు పక్కాగా ఉండటానికి తన బ్యాంక్ స్టేట్మెంట్లను మార్చడం జరిగింది, 95 00:11:12,589 --> 00:11:15,300 మెమరీ ఆడిట్ కూడా ఆ ఆధారాలను మరింత బలపరుస్తుంది. 96 00:11:20,305 --> 00:11:21,598 మహారాణి? 97 00:11:21,598 --> 00:11:24,184 కాబోయే మహారాణిని రాజద్రోహం కింద అరెస్ట్ చేస్తారు. 98 00:11:24,184 --> 00:11:25,269 మన్నించాలి. 99 00:11:25,269 --> 00:11:27,479 తనకి మరణ శిక్ష విధించబడుతుందని అర్థం చేసుకోవచ్చు. 100 00:11:29,898 --> 00:11:32,276 హంతకులు నిజంగా చంపేవారు కాదు కదా. 101 00:11:34,027 --> 00:11:38,031 పగటి రాజును భయపెట్టమనే వారికి చెప్పావు నువ్వు, దానితో అతను శారెత్ ని నిందించాలని నీ కోరిక, 102 00:11:38,031 --> 00:11:39,616 అప్పుడు నిశ్చితార్థం రద్దవుతుంది కదా. 103 00:11:39,616 --> 00:11:41,994 మీకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నా. 104 00:11:44,997 --> 00:11:45,998 అసలు ఇదేదీ తెలియకూడదు మీకు. 105 00:11:45,998 --> 00:11:47,708 అయితే, మా జ్ఞాపకాల నుండి వాటిని తీసేయ్. 106 00:11:47,708 --> 00:11:50,335 క్లౌడ్ డొమీనియన్ మళ్లీ వాటిని పునరుద్ధరించే అవకాశం ఉంది కదా? 107 00:11:50,919 --> 00:11:53,130 రహస్యాలను కనుగొనడం నా బాధ్యత. 108 00:12:00,846 --> 00:12:02,014 పోరాడి లాభం లేదు. 109 00:12:03,182 --> 00:12:07,311 మేము ఇక్కడికి వచ్చిన మరుక్షణం మమ్మల్ని చంపేయాలని అనుకున్నావు కదా? 110 00:12:08,520 --> 00:12:10,606 ఈ ప్రదేశం గురించి వేకువ రాజుకు తెలుసా? 111 00:12:10,606 --> 00:12:13,734 అతనికేమీ తెలీదు. నా మీద నమ్మకం లేకపోతే, అతని జ్ఞాపకాలని తనిఖీ చేసుకో. 112 00:12:13,734 --> 00:12:16,778 తనిఖీ చేసేటప్పుడు మీరిద్దరూ కలిసి ప్రిన్సిపియమ్ కి వెళ్లారని నాకు తెలిస్తే? 113 00:12:17,571 --> 00:12:20,449 లేదా శారెత్ మహారాణితో రహస్యంగా శృంగారం పాల్పడుతున్నట్టు తెలిస్తే? 114 00:12:21,700 --> 00:12:23,160 నన్ను క్షమించండి. 115 00:12:36,882 --> 00:12:38,091 నిన్ను క్షమిస్తున్నాను. 116 00:12:42,095 --> 00:12:43,639 మనలో ఎవరికీ పూర్తి స్వేచ్ఛ లేదు. 117 00:12:46,058 --> 00:12:48,810 అలా ఉందని అనుకోవడం మన మూర్ఖత్వమే. 118 00:13:07,246 --> 00:13:10,874 నీకు ఒక ఏడాది వయస్సు ఉన్నప్పట్టి విషయం నాకు ఇంకా గుర్తుంది. 119 00:13:11,792 --> 00:13:14,711 నువ్వు ఆకాశాన్ని చూపెట్టి, సూర్యుడు అడుగో అని అన్నావు. 120 00:13:16,839 --> 00:13:18,382 చాలా ఆనందంగా కేరింతలు కొట్టావు. 121 00:13:20,050 --> 00:13:24,638 అది అక్కడ ఉందని నీకు అప్పుడే తెలిసింది, ఆ విషయాన్ని నాతో చెప్పుకుని సంబరపడిపోయావు. 122 00:13:26,181 --> 00:13:27,808 ఎందుకంటే, నువ్వంటే నాకు ప్రాణం. 123 00:13:29,977 --> 00:13:31,436 ఇప్పటికి కూడా. 124 00:14:36,126 --> 00:14:37,127 చాలా బాగుంది. 125 00:14:42,799 --> 00:14:44,968 జనరల్, నౌకని జంప్ చేయడానికి సిద్ధంగా ఉంచమని చెప్పు. 126 00:14:46,803 --> 00:14:48,972 మనం ట్రాంటార్ కి వెళ్తున్నాం, దానికన్నీ ఏర్పాట్లు చేయండి. 127 00:14:48,972 --> 00:14:50,182 ట్రాంటార్ కి కాదు. 128 00:14:52,392 --> 00:14:57,814 చెప్పు సోదరి, ఫౌండేషన్ కిందికి ఎన్ని గ్రహాలు వచ్చాయి? 129 00:15:02,569 --> 00:15:04,738 - ఏడు. - పేర్లేంటో చెప్పు. 130 00:15:05,531 --> 00:15:06,823 నీకు వాటి పేర్లు తెలుసు కదా. 131 00:15:06,823 --> 00:15:08,325 నీ నోటితో చెప్తుంటే వినాలనుంది. 132 00:15:09,076 --> 00:15:12,287 చెప్పు, సోదరి. ధైర్యంగా చెప్పు. 133 00:15:13,747 --> 00:15:16,500 మీరు హస్తగతం చేసుకున్నవాటి గురించి గర్వంగా చెప్పుకో. 134 00:15:18,710 --> 00:15:24,299 తెస్పిస్, అనాక్రీయాన్, స్మిర్నో, 135 00:15:25,008 --> 00:15:28,011 సేషెల్, కోనమ్, డారిబౌ, గ్లిప్టల్ IV. 136 00:15:28,011 --> 00:15:29,263 సివెన్నాని కూడా చేర్చేద్దాం. 137 00:15:30,556 --> 00:15:33,684 వాటన్నింటినీ మనం నాశనం చేసేద్దాం, 138 00:15:34,434 --> 00:15:36,979 తెస్పిస్ తో మొదలుపెడదాం. 139 00:15:43,318 --> 00:15:44,862 ఇవే నీ ఆదేశాలు, జనరల్. 140 00:15:45,529 --> 00:15:47,239 మీరు ఫౌండేషన్ పై జయించారు. 141 00:15:49,157 --> 00:15:51,493 ఈ ప్రపంచాల్లో దాని అవశేషాలు ఏవైనా మిగిలి ఉంటే, అవి తప్పక లొంగిపోతాయి... 142 00:15:51,493 --> 00:15:55,789 ఆ అవశేషాలు, మిగతా చోట్లకు వ్యాపించలేని క్యాన్సర్ కణాల వంటివి. 143 00:15:55,789 --> 00:15:57,416 మహారాజా, మీరేం చేశారో ఓసారి చూడండి. 144 00:15:58,208 --> 00:15:59,626 ఇది చాలా దారుణమైన చర్య. 145 00:16:00,377 --> 00:16:03,505 అయినా కానీ, మీకోసం ఈ పని చేశాను, దీనితో అయినా మీరు ఇక ఆపేస్తారని. 146 00:16:03,505 --> 00:16:06,300 లేదు, నేను ఆదేశించాను కాబట్టే నువ్వు చేశావు. 147 00:16:06,300 --> 00:16:10,429 ఇప్పుడు కూడా ఆదేశిస్తున్నా, నౌకని తెస్పిస్ కి జంప్ చేయ్. 148 00:16:11,263 --> 00:16:16,810 ఇలా చేస్తే, సామ్రాజ్యం నైతికంగా ఓడిపోయినట్టే. 149 00:16:18,604 --> 00:16:20,856 మీరు ఇలా చేస్తుంటే, మన మనుగడ... 150 00:16:20,856 --> 00:16:24,359 నిన్ను ఆదేశించా, రియోస్. దాన్ని శిరసావహించు. 151 00:16:30,407 --> 00:16:31,700 చెప్పినట్టు చేయ్! 152 00:16:34,203 --> 00:16:35,037 చేయను. 153 00:16:37,581 --> 00:16:39,917 నీ పదవి నుండి నిన్ను తొలగిస్తున్నా. 154 00:16:40,459 --> 00:16:44,421 నన్ను కొట్టాలనుకుంటే కొట్టు, ఎందుకంటే మళ్లీ నీకు ఆ అవకాశం రాదు. 155 00:16:50,260 --> 00:16:52,387 నేను కూడా అదే అనుకున్నా. 156 00:16:54,306 --> 00:16:56,767 నావిగేటర్, ఇప్పుడు నేను మీ కమాండర్ ని. 157 00:16:56,767 --> 00:16:59,978 తెస్పిస్ కి జంప్ చేస్తావా, 158 00:16:59,978 --> 00:17:04,566 లేదా ఈ నౌకలో ఉన్న ప్రతీ ఒక్కరికీ మరణ శిక్ష విధించాల్సిన పరిస్థితి నాకు కల్పిస్తావా? 159 00:17:04,566 --> 00:17:05,943 మీరు కోరినట్టే చేస్తా, మహారాజా. 160 00:17:09,238 --> 00:17:10,446 {\an8}జంప్ ప్రక్రియను ప్రారంభించండి రద్దు చేయండి 161 00:17:13,157 --> 00:17:15,035 జంప్ ప్రక్రియని లాక్ చేశాను. 162 00:17:16,453 --> 00:17:18,038 అందరూ జంప్ స్టేషన్స్ కి పదండి. 163 00:17:41,937 --> 00:17:44,731 జంప్ ప్రక్రియలో ఏదో పొరపాటు జరుగుతోంది. రద్దు చేయండి. 164 00:17:44,731 --> 00:17:47,693 ఏమైంది? ఏం జరుగుతోంది? 165 00:17:47,693 --> 00:17:50,571 ప్రతి నౌక దాని పక్కనే ఉన్న నౌకలోకి జంప్ అవుతోంది. 166 00:17:50,571 --> 00:17:53,407 నౌకలన్నీ నాశనమయ్యేదాకా ఇది కొనసాగుతుంది. 167 00:17:53,407 --> 00:17:55,450 దాన్ని ఆపేయ్. మనల్ని సురక్షిత ప్రాంతానికి జంప్ చేయ్. 168 00:17:55,450 --> 00:17:56,618 అది నా వల్ల కాదు. 169 00:17:56,618 --> 00:18:00,247 ఒకసారి విశ్వం ఫోల్డ్ అయ్యాక, దాన్ని మార్చడం సాధ్యపడదు. 170 00:18:00,247 --> 00:18:01,915 అయితే నాకు లైఫ్ బోట్ ని సిద్దం చేయండి. 171 00:18:01,915 --> 00:18:06,545 ఆ కమాండ్ ప్రక్రియ, ల్యాండింగ్ జరిగే ప్రాంతాలలో, లాంచ్ జరిగే ప్రాంతాలలో యాక్టివిటీని డిజేబుల్ చేసింది. 172 00:18:06,545 --> 00:18:10,215 కానీ మీ స్పేసర్స్ కూడా చనిపోతారు కదా. ఇది చావును కొనితెచ్చుకున్నట్టే కదా. 173 00:18:10,215 --> 00:18:13,051 నా వారి స్వేచ్ఛ కోసం నేను బలి అవ్వడానికి సిద్ధమే. 174 00:18:16,221 --> 00:18:17,264 అసలు ఇదెలా జరిగింది? 175 00:18:18,140 --> 00:18:19,474 ఇది నీ పనే కదా? 176 00:18:20,767 --> 00:18:23,228 స్పేసర్స్ నిన్ను మహారాజుకు అప్పగించడం అనేది నాటకం. 177 00:18:23,896 --> 00:18:27,524 అవును, సెల్డన్ అసలైన సరుకుతో ఒక వ్యాపారవేత్తని పంపించాడు, 178 00:18:27,524 --> 00:18:29,735 దానితో ఒప్పందం ఖరారైంది. 179 00:18:29,735 --> 00:18:32,154 ఇప్పుడు స్పేసర్స్ నీ ఆధీనంలో లేరు, మహారాజా. 180 00:18:32,154 --> 00:18:35,157 జంప్ ప్రక్రియ అంతా ఇందులో ఉంది. 181 00:18:35,699 --> 00:18:40,162 కానీ దీన్ని నేను ఒక స్పేసర్ కి ఇవ్వాలి కదా, అంటే నేను ఈ నౌకలోకి రావాలి కదా. 182 00:18:40,162 --> 00:18:41,246 నాకు ఒక మాట చెప్పవచ్చు కదా. 183 00:18:41,246 --> 00:18:43,957 మరో విధంగా చెప్పాలంటే, మేము మిమ్మల్ని మోసం చేశాం. 184 00:18:45,959 --> 00:18:49,880 మధ్యలో మీ జనరల్ కనిపెట్టేశాడు. కానీ నువ్వు ఆయన మాట వినవు కదా? 185 00:18:50,839 --> 00:18:53,091 సెల్డన్ యుద్దం చేసేలా నిన్ను మాయ చేశాడు, 186 00:18:53,091 --> 00:18:57,012 అలా టర్మినస్ మొత్తం సైన్యాన్ని నువ్వు ఇక్కడ దింపుతావని, అదే నువ్వు చేశావు కూడా. 187 00:18:58,514 --> 00:19:01,808 నువ్వు ఏం చేస్తావో సులభంగా చెప్పేయవచ్చు, మేము అనుకున్నట్టే నువ్వు వచ్చావు కదా. 188 00:19:23,372 --> 00:19:24,915 ఇప్పుడు చూడు. 189 00:19:28,877 --> 00:19:31,505 ఇదెలా ఉంది? దీన్ని కూడా ఊహించవచ్చా? 190 00:19:31,505 --> 00:19:33,382 నేనేం చేస్తానో ఊహించేయవచ్చు కదా? 191 00:19:38,470 --> 00:19:41,265 అతడిని ఆపండి. చంపేస్తున్నాడు. 192 00:19:44,810 --> 00:19:45,811 ఇక చాలు! 193 00:19:56,947 --> 00:19:58,574 నాకు ఇది మంచి కిక్కునిస్తోంది. 194 00:20:02,327 --> 00:20:03,287 మహారాజా. 195 00:20:03,287 --> 00:20:04,413 నాకు మీ అవసరం లేదు. 196 00:20:29,813 --> 00:20:31,607 ఇందుకే మీరు ఒక్కసారే చనిపోతారు. 197 00:20:32,649 --> 00:20:36,195 మీరు అల్ప జీవులు. ఉవ్వెత్తున ఎగసిపడతారు, ఆ తర్వాత శక్తి నశించి పడిపోతారు. 198 00:21:54,606 --> 00:21:56,650 - ఏంటి? - తనకి చూపించు. 199 00:21:57,943 --> 00:21:58,944 నేను తారుమారు పరికరాన్ని ఉపయోగించా. 200 00:21:59,528 --> 00:22:02,364 అతను నన్ను కొడుతున్నప్పుడు ఇతర నోడ్ ని అతని బట్టల్లో వేశా. 201 00:22:02,364 --> 00:22:04,283 దానితో మన రాజు మటాష్ అయిపోయాడు. 202 00:22:05,534 --> 00:22:06,743 చాలా తెలివిగా వ్యవహరించావు, జనరల్. 203 00:22:07,327 --> 00:22:08,287 హెచ్చరిక. 204 00:22:08,287 --> 00:22:10,664 - బయటి నుండి వచ్చే ప్రమాదం తప్పేలా లేదు. - అబ్బా. 205 00:22:10,664 --> 00:22:13,584 సిబ్బంది అందరూ వెంటనే తమ స్టేషన్స్ కి వెళ్లండి. 206 00:22:16,336 --> 00:22:17,796 నా నావిగేటర్ ఏం చెప్పిందో విన్నారు కదా. 207 00:22:18,630 --> 00:22:21,925 కావాలంటే నన్ను చంపుకోండి, లేదా మీ దేవునికి మొక్కోండి. 208 00:22:22,634 --> 00:22:24,636 ఎలా అయినా, ఈ నౌకలోని అందరికీ చావు తప్పదు. 209 00:22:33,020 --> 00:22:35,189 - ఇంకా ఎంత సమయం ఉంది? - ఎక్కువ సమయమేం లేదు. 210 00:22:36,648 --> 00:22:38,817 - విన్నారుగా. - మీ సిబ్బంది విషయంలో సారీ. 211 00:22:39,318 --> 00:22:41,320 నా సైనికుల గురించి నాకు బాగా తెలుసు, వాళ్లు గర్వంగా ఫీల్ అవుతారు. 212 00:22:42,279 --> 00:22:44,781 కోట్లాది మందిని కాపాడటానికి రెండు మూడు వేల మంది ప్రాణత్యాగం చేయగలరు. 213 00:22:44,781 --> 00:22:47,576 ప్లాన్ ఎవరికీ చెప్పకూడదని సెల్డన్ ఒట్టు వేయించుకున్నాడు. 214 00:22:47,576 --> 00:22:48,702 నీకూ చెప్పవద్దు అన్నాడు, సోదరి. 215 00:22:48,702 --> 00:22:51,538 మన విధిని ఇద్దరం కలిసే ఎదుర్కొందాం. నీ దగ్గరుండే అద్భుతమైన వైన్ తాగుదాం. 216 00:22:51,538 --> 00:22:54,708 సెంటిమెంట్ బాగుంది, సోదరీ, కానీ ఇక్కడ ఉండే అందరూ చస్తారు అనుకోవద్దు. 217 00:22:54,708 --> 00:22:57,169 ఈ నౌకలోని ఎవరూ బతికి బట్టకట్టరు అని ఇందాక చెప్పాను. 218 00:22:57,169 --> 00:22:59,004 కానీ మీలో ఒకరు తప్పించుకోవడానికి ఓ మార్గముంది. 219 00:23:05,761 --> 00:23:06,887 శారెత్. 220 00:23:08,805 --> 00:23:09,973 ఇక్కడ ఏం జరుగుతోంది? 221 00:23:15,479 --> 00:23:17,147 పగటి సోదరునిపై హత్యాయత్నం విషయంలో 222 00:23:17,147 --> 00:23:20,275 క్లౌడ్ డొమీనియన్ హస్తం ఉంది, ఇది చెప్పడానికి నాకు బాధగా ఉంది. 223 00:23:20,275 --> 00:23:23,320 - అది అసాధ్యం. - కాదనలేని ఆధారాలు ఉన్నాయి, వేకువ రాజా. 224 00:23:25,072 --> 00:23:27,449 - ఇప్పుడు తనని ఏం చేస్తారు? - అది పగటి రాజు తీసుకోవాల్సిన నిర్ణయం. 225 00:23:27,449 --> 00:23:28,659 అతను లేనప్పుడు నేను కదా ఇన్ ఛార్జీని. 226 00:23:28,659 --> 00:23:31,870 నిజమే, కానీ ఈ విషయంలో నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరించగలవా? 227 00:23:34,331 --> 00:23:38,961 మహారాణి ఉండదు, అలాగే చెడు ఉద్డేశం గల వారసుల గోల కూడా ఉండదు. 228 00:23:38,961 --> 00:23:41,380 కాబట్టి నిశ్చింతగా ఉండు, సోదరా. 229 00:23:41,880 --> 00:23:45,926 ఎలా ఉంటే బాగుంటుందో, ఇప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు కాకున్నా త్వరలో అలాగే అవుతుంది. 230 00:23:50,848 --> 00:23:52,766 మెడపై చూడు, అక్కడ పచ్చ రంగు కనిపిస్తుంది. 231 00:23:52,766 --> 00:23:56,436 అతను చనిపోయాక, గమనికగా దాన్ని జోడించారు. దాని అర్థం ఏంటో తెలుసా? 232 00:23:56,436 --> 00:23:58,021 అతను ద్రోహి అని అది సూచిస్తుంది. 233 00:24:04,194 --> 00:24:09,283 మనం మిగతా సంభాషణని ఏకాంతంగా చర్చించుకుందాం, మహారాజా. 234 00:24:10,284 --> 00:24:11,410 తప్పకుండా. 235 00:24:13,203 --> 00:24:14,037 నా అంతఃపురంలో? 236 00:24:35,184 --> 00:24:38,061 మాడ్యూల్ ఇది. దీన్ని నేను విడదీసేయగలను. 237 00:24:38,061 --> 00:24:40,731 ఒకరోజుకు సరిపడా ఆక్సిజన్ ఇందులో ఉంటుంది. 238 00:24:40,731 --> 00:24:41,982 ఎవరోకరు నీ ఆచూకీని కనిపెడతారనే ఆశిస్తున్నా. 239 00:24:42,983 --> 00:24:44,443 ఒక్క నిమిషం, వద్దు... 240 00:24:45,569 --> 00:24:48,655 నువ్వే మొనగాడివి, హోబర్. ప్రాఫెట్ ప్లాన్ కి నువ్వు చాలా కీలకం. 241 00:24:48,655 --> 00:24:50,115 హా, కీలకమే. కానీ నా పని ముగిసింది. 242 00:24:50,115 --> 00:24:51,992 - నాది కూడా ముగిసింది కదా. - లేదు, లేదు. 243 00:24:51,992 --> 00:24:54,536 నీ అసలైన పని ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. 244 00:24:55,871 --> 00:24:57,581 చూడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా 245 00:24:59,041 --> 00:25:02,461 జనాల్లో ఆశ నింపే సామర్థ్యం నీకు ఉంది. సరేనా? 246 00:25:02,461 --> 00:25:04,796 జనాల్లో నువ్వు ఆశను చిగురింపజేయగలవు. 247 00:25:05,631 --> 00:25:07,216 నాలాంటి పనికిమాలిన వాళ్లలో కూడా. 248 00:25:07,883 --> 00:25:09,051 - వాళ్లలో కూడానా? - అవును. 249 00:25:10,511 --> 00:25:12,596 నా పనికిమాలిన రహస్యం ఏంటో చెప్పనా, కాంస్టన్ట్? 250 00:25:12,596 --> 00:25:15,015 మొదట్నుంచీ చీకటిని తగ్గించాలన్నదే లక్ష్యంగా ఉండేవాడిని. మొదట్నుంచీ కూడా. 251 00:25:15,015 --> 00:25:16,767 కానీ మతపరమైనవి నాకు నచ్చేవి కాదు. 252 00:25:16,767 --> 00:25:20,437 కానీ నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో నిన్ను చూశాక గుర్తు వచ్చింది, 253 00:25:20,437 --> 00:25:23,065 కాబట్టి మిగతావారిని కూడా నువ్వు మార్చాలి, సరేనా? 254 00:25:23,065 --> 00:25:24,441 నా కోసం ఆ పని చేస్తావా? 255 00:25:29,154 --> 00:25:30,155 భలే వింతగా ఉంది కదా. 256 00:25:31,406 --> 00:25:32,783 ప్రాణ త్యాగం చేసే అవకాశం నాకు ఇవ్వకపోవడం. 257 00:25:46,713 --> 00:25:48,298 గుడ్ లక్, కాంస్టన్ట్ సోదరి. 258 00:25:48,298 --> 00:25:49,716 మీకు కూడా గుడ్ లక్, జనరల్ రియోస్. 259 00:26:00,185 --> 00:26:01,019 ఆగు. 260 00:26:04,398 --> 00:26:06,024 ఇప్పటికీ నా పేరు తెలుసుకోవాలనే ఉందా? 261 00:26:06,692 --> 00:26:07,818 హా, తెలుసుకోవాలనే ఉంది. 262 00:26:09,945 --> 00:26:10,946 అది ఆశ. 263 00:26:12,865 --> 00:26:13,699 నిజంగా? 264 00:26:14,575 --> 00:26:15,659 కాదు. 265 00:26:18,370 --> 00:26:19,872 కానీ ఆ పేరు బాగుంటుంది కదా? 266 00:27:01,330 --> 00:27:04,208 ఇప్పుడు ఆ వైన్ తాగుదామా మరి? 267 00:27:27,773 --> 00:27:28,690 శారెత్. 268 00:27:29,566 --> 00:27:30,817 మహారాజా. 269 00:27:41,828 --> 00:27:42,746 పద. 270 00:27:44,665 --> 00:27:46,083 ఆగు. రూ ఎక్కడ? 271 00:27:46,083 --> 00:27:50,546 తను రాత్రి రాజుతో పాటే ఉంటే, ఈపాటికి చనిపోయి ఉంటుంది. శారెత్, ఇదే మనకి ఉన్న అవకాశం. వెళ్దాం పద. 272 00:27:53,257 --> 00:27:55,759 కానీ వాళ్లు మనల్ని తప్పకుండా కనిపెట్టేస్తారు. 273 00:27:55,759 --> 00:27:56,969 మనం ఏమీ దాక్కోవట్లేదు? 274 00:28:03,976 --> 00:28:07,604 ఏదైనా గొప్ప సందర్భం వస్తే సంతృప్తిగా తాగుదామని, ఇప్పటిదాకా దీన్ని తాగనే లేదు. 275 00:28:08,313 --> 00:28:10,315 ఇప్పుడు ఆ సందర్భం వచ్చేసింది. 276 00:28:11,149 --> 00:28:13,277 జుట్టు నెరిసి, ముసలాళ్లం అయ్యే అవకాశం మనకి లేదు. 277 00:28:13,277 --> 00:28:16,822 కొన్ని రోజుల క్రితం దాకా, జైల్లోనే చనిపోతానేమో అనుకుంటూ బతికా. 278 00:28:18,407 --> 00:28:22,953 నౌకతో పాటు చనిపోతున్నా. కనీసం ఇది కాస్త గౌరవప్రదంగా అయినా ఉంటుందిలే. 279 00:28:23,954 --> 00:28:25,414 గ్రహం మీద పడిపోయాడుగా ఒకడు. 280 00:28:26,248 --> 00:28:27,291 గ్లేవన్. 281 00:28:29,501 --> 00:28:30,919 మీరు ఆ పని చేయాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. 282 00:28:30,919 --> 00:28:33,130 మాకు ఈ రాత తప్పదని అతను మొదట్లోనే గ్రహించేశాడులే. 283 00:28:34,673 --> 00:28:37,176 మాకు వ్యతిరేకంగా మేము గతంలో చేసిన పనులున్నాయి. 284 00:28:39,386 --> 00:28:41,305 మహారాజు మమ్మల్ని బతకనివ్వడు. 285 00:28:43,640 --> 00:28:46,059 కానీ ఇలా అయినా చస్తున్నందుకు గర్వంగా ఉంది. 286 00:28:48,312 --> 00:28:52,816 ఇంకా, పగటి రాజును ఎయిర్ లాక్ నుండి తన్నే భాగ్యం నాకు దక్కింది. 287 00:28:54,568 --> 00:28:58,572 సరే. చనిపోయేవాళ్ల కోసం టోస్ట్. 288 00:28:58,572 --> 00:28:59,907 నా దగ్గర ఇంకా మంచి కారణం ఉంది. 289 00:29:00,574 --> 00:29:03,160 ఎందుకో కారణం తెలుసుకొని యుద్ధం చేసేవాళ్లకి టోస్ట్. 290 00:29:16,215 --> 00:29:18,342 - ఇది... చాలా బాగుంది. - వావ్. 291 00:29:18,342 --> 00:29:21,678 - చాలా రుచులు ఉన్నాయి కదా? - అవును. చాలా గాఢంగా ఉంది. 292 00:29:22,179 --> 00:29:25,432 మనకి రుచి తెలుస్తోంది... అంటే, తీయగా ఉంది, కానీ... 293 00:29:25,432 --> 00:29:26,558 చండాలంగా ఉంది కదా? 294 00:29:27,226 --> 00:29:28,602 అవును, మూతలో లోపం వల్ల రుచి పాడైనట్టుంది. 295 00:29:29,853 --> 00:29:32,523 - నువ్వు దీన్ని సరిగ్గా భద్రపరచలేదు. - లేదు, అది కాదు సమస్య. నేను... 296 00:29:33,774 --> 00:29:34,775 దీని రుచి... 297 00:29:37,819 --> 00:29:38,820 దీని రుచి... 298 00:29:48,455 --> 00:29:53,794 నీ నౌకలో ఉండిన ఆ భయంకరమైన జీవి పేరేంటి? 299 00:29:54,753 --> 00:29:55,963 ఏది, బెకీనా? 300 00:29:55,963 --> 00:29:57,047 హా. 301 00:29:58,215 --> 00:30:00,342 ఈ వైన్, బెకీ చెమటలా ఉంది. 302 00:30:01,468 --> 00:30:03,262 అవును. టోస్ట్ అదిరింది. 303 00:30:05,347 --> 00:30:06,473 బెకీ చెమటకి. 304 00:30:26,410 --> 00:30:28,161 ఇప్పుడు నిర్ధారితమైపోయింది. 305 00:30:28,161 --> 00:30:30,289 లైఫ్ బోట్లన్నీ పని చేయకుండా పోయాయి. 306 00:30:30,873 --> 00:30:34,001 - మా సానుభూతి, డెమెర్జల్ గారు. - ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. ప్లీజ్. 307 00:30:40,632 --> 00:30:41,800 ఏమైంది, కెప్టెన్? 308 00:30:41,800 --> 00:30:43,177 మన్నించాలి, డెమెర్జల్ గారు. 309 00:30:43,677 --> 00:30:45,596 ట్రాంటార్ వాసులారా. 310 00:30:46,597 --> 00:30:49,141 మేము విషాదకరమైన వార్తతో మీ ముందుకు వచ్చాం. 311 00:30:49,141 --> 00:30:54,396 నా పగటి సోదరుడు, పదిహేడవ క్లియాన్ చనిపోయారు. 312 00:30:54,396 --> 00:30:56,940 - వెంటనే వాళ్లని అరెస్ట్ చేయించండి. - లేదు. 313 00:30:56,940 --> 00:30:59,193 వాళ్లని నేను సురక్షితంగా కోటలోకి తీసుకెళ్లి 314 00:30:59,193 --> 00:31:01,695 ఏకాంతంగా మాట్లాడతాను. 315 00:31:01,695 --> 00:31:02,821 ...నా వధువుగా ప్రకటిస్తున్నా. 316 00:31:06,491 --> 00:31:07,659 ఒకవేళ నన్ను వివాహమాడటం ఈమెకి ఇష్టమైతే? 317 00:31:10,954 --> 00:31:12,372 నాకు ఇష్టమే, వేకువ సోదరా. 318 00:31:13,749 --> 00:31:15,000 వారి ప్రసారాన్ని నిలిపివేయండి. 319 00:31:18,128 --> 00:31:19,129 ఆగు. 320 00:31:24,468 --> 00:31:27,930 వాళ్లు వేకువ రాజు, శారెత్ కాదు. వాళ్ల పనివాళ్లు వీళ్లు. 321 00:31:30,724 --> 00:31:31,850 ముఖాన్ని మార్చారు. 322 00:31:32,643 --> 00:31:33,769 మరి వాళ్లు ఏమైపోయారు? 323 00:31:34,436 --> 00:31:35,395 డెమెర్జల్? 324 00:31:37,105 --> 00:31:39,399 - ఎక్కడ ఉన్నారు మీరు? - వెంటనే ఆ నకిలీ వాళ్లని అరెస్ట్ చేయండి. 325 00:31:39,399 --> 00:31:41,193 నీకు తెలుసనుకుంటా. 326 00:31:41,860 --> 00:31:43,111 రాత్రి రాజును నువ్వే చంపావని నాకు తెలుసు. 327 00:31:44,446 --> 00:31:45,822 పగటి రాజును కూడా నువ్వే చంపావా? 328 00:31:45,822 --> 00:31:49,409 లేదు, కానీ నువ్వు చేసే పనుల వల్ల నాకు మరో దారి కనిపించడం లేదు. 329 00:31:49,409 --> 00:31:53,789 మిమ్మల్ని నేను వేటాడాల్సి వస్తుంది. నా ప్రోగ్రామింగ్ నా చేత ఆ పని చేయిస్తుంది. 330 00:31:53,789 --> 00:31:55,832 నువ్వు వివరంగా చెప్పాల్సిన పని లేదు. 331 00:31:56,375 --> 00:32:00,128 మేము చనిపోతే, సామ్రాజ్యంపై జనాలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కదా? 332 00:32:00,128 --> 00:32:02,047 నీ వల్లే మేము బలవంతంగా పారిపోయామని వాళ్లకి తెలిసిపోయింది. 333 00:32:03,507 --> 00:32:04,508 పరిస్థితులని ఇంకా దిగజార్చవద్దు. 334 00:32:04,508 --> 00:32:06,635 కొత్త వేకువ రాజును క్లోన్ చేస్తాం, 335 00:32:06,635 --> 00:32:09,513 నీతో వాళ్లకున్న కొద్దిపాటి అభిమానాన్ని వాళ్లు అప్పుడు మర్చిపోతారు. 336 00:32:09,513 --> 00:32:11,098 అది నాకు అనుమానమే. 337 00:32:11,098 --> 00:32:13,308 మా కథ ఇంకా చాలా బాగుంది. 338 00:32:16,270 --> 00:32:17,813 గద్దెనెక్కనున్న మహారాజు, 339 00:32:18,605 --> 00:32:20,190 తన వధువుతో పారిపోవడం... 340 00:32:22,818 --> 00:32:25,070 అది కూడా సహజంగా, తన కడుపులో పెరుగుతున్న 341 00:32:25,654 --> 00:32:28,991 వారసుడితో పారిపోవడం అనే కథ ఇంకా బాగుంది. 342 00:32:30,033 --> 00:32:31,034 నిజంగా? 343 00:32:34,162 --> 00:32:35,163 నేను తండ్రిని కాబోతున్నానా? 344 00:32:39,835 --> 00:32:43,130 మీ వారసుడు ఇప్పుడు కేవలం కణాల రూపంలో తొలిదశలోనే ఉన్నాడు. 345 00:32:45,257 --> 00:32:47,426 బిడ్డ పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు కూడా. 346 00:32:47,426 --> 00:32:53,724 ఒకవేళ బిడ్డ పుట్టినా, అది బలహీనమైనది కావచ్చు. నాయక లక్షణాలు దానికి రాకపోవచ్చు. 347 00:32:53,724 --> 00:32:55,184 వాడు నాయుకుడు కానక్కర్లేదు. 348 00:32:56,435 --> 00:32:57,728 వాడికి ప్రేమ దక్కితే చాలు. 349 00:32:59,771 --> 00:33:03,817 నీ అసలైన ఫీలింగ్స్ ని తెలుసుకోవడం కష్టమే, 350 00:33:04,401 --> 00:33:06,528 కానీ నా విషయంలో నువ్వు ఆనందంగానే ఉన్నావు అనుకుంటా. 351 00:33:07,529 --> 00:33:10,115 నీకు కూడా ఆనందం దక్కాలనే కోరుకుంటున్నా, డెమెర్జల్. 352 00:33:12,117 --> 00:33:13,410 మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 353 00:33:14,745 --> 00:33:15,913 నువ్వు నన్ను బాగా చూసుకున్నావు. 354 00:33:18,624 --> 00:33:20,834 నీలో నేను తల్లిని చూసుకున్నా. 355 00:33:21,835 --> 00:33:23,337 అలా ఉండాలనే నువ్వు ప్రోగ్రామ్ చేయబడ్డావని తెలుసు. 356 00:33:23,337 --> 00:33:26,381 కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఉన్నావని భావించాలనుకుంటున్నా. 357 00:33:28,592 --> 00:33:29,760 ప్రోగ్రామ్ లేకపోయున్నా కూడా. 358 00:33:50,614 --> 00:33:51,490 చెప్పు, శాల్వార్. 359 00:33:52,741 --> 00:33:53,617 బొమ్మ. 360 00:33:55,494 --> 00:33:57,162 వరుసగా పదిసార్లు సరిగ్గా చెప్పావు. 361 00:33:57,162 --> 00:33:58,247 నీ రికార్డ్ ఎంత? 362 00:33:58,956 --> 00:34:01,375 తెలీదు. లెక్కపెట్టేంత బోర్ నాకెప్పుడూ అనిపించలేదు. 363 00:34:01,375 --> 00:34:02,543 ఈ బొమ్మ ఏంటి ఇలా ఉంది? 364 00:34:03,335 --> 00:34:04,336 బిషప్స్ క్లా అది. 365 00:34:04,837 --> 00:34:09,757 ఆ బొమ్మ భయంకరంగానే ఉంటుంది. భయంకరమైన రాకాసి బల్లి అని చెప్పవచ్చు. 366 00:34:09,757 --> 00:34:11,092 మనుషులని తింటూందా? 367 00:34:12,094 --> 00:34:13,303 దానికి మనుషులంటే చాలా ఇష్టం. 368 00:34:13,804 --> 00:34:15,097 మరీ ముఖ్యంగా పిల్లలంటే, 369 00:34:15,806 --> 00:34:18,391 చెవులలో కార్టిలేజ్ ఉంటుంది, ఎముక మజ్జ ఉంటాయి. 370 00:34:18,391 --> 00:34:19,851 సరే. తర్వాత ఎవరు చెప్తారు? 371 00:34:20,476 --> 00:34:21,603 ఎలా ఉంది నీకు? 372 00:34:22,145 --> 00:34:26,900 మనశ్శాంతిగా ఉంది, థాలిస్ చెప్పినట్టుగా చాలా కాలం తర్వాత అలా ఉంది. 373 00:34:28,402 --> 00:34:30,237 తన వయస్సు ఎంత ఉండవచ్చు అంటావు? 374 00:34:31,237 --> 00:34:32,989 కొన్ని వందల ఏళ్లు ఉంటుంది. 375 00:34:32,989 --> 00:34:36,368 నాలోకి తను రావాలని చూసినప్పుడు 376 00:34:37,202 --> 00:34:40,706 తను ఆవహించేసిన వ్యక్తుల సన్నని అరుపులు నాకు వినిపించాయి. 377 00:34:41,290 --> 00:34:43,083 ఆ గొంతులు చాలా ఉన్నాయి. 378 00:34:43,083 --> 00:34:45,252 - నేను తీసుకెళ్తాలే. మరేం పర్వాలేదు. - థ్యాంక్యూ. 379 00:34:50,215 --> 00:34:51,507 బాగానే ఉన్నావా, జోసయ్యా? 380 00:34:52,050 --> 00:34:53,802 నేను మీకొకటి చెప్పాలి. 381 00:34:54,303 --> 00:34:55,721 - గాల్. - ఏంటి? 382 00:34:57,264 --> 00:34:59,057 ఒక విషయం... ఒకటి... 383 00:35:02,436 --> 00:35:03,270 తను... 384 00:35:32,132 --> 00:35:33,634 నన్ను క్షమించు, పాపా. 385 00:35:47,397 --> 00:35:50,108 తను నాలో దాక్కుంది. 386 00:35:50,651 --> 00:35:51,818 ఎవరు జోసయ్యా? 387 00:35:53,362 --> 00:35:57,324 టెల్లెం. చనిపోయేటప్పుడు ఇతనిలోకి ప్రవేశించి ఉంటుంది. 388 00:35:57,324 --> 00:36:00,827 - తనని పారద్రోలాలని చూశా. గాల్ కి చెప్పాలని చూశా. - పర్వాలేదులే, బాబూ. 389 00:36:02,454 --> 00:36:05,874 ఇప్పుడు తను చాలా బలహీనంగా ఉంది. నాతో పాటు తను కూడా మరణించడం నాకు తెలుస్తోంది. 390 00:36:06,625 --> 00:36:10,963 భయపడుతోంది. భయపడి పోరాడుతోంది. 391 00:36:12,506 --> 00:36:13,507 కానీ నాకేమీ భయం లేదు. 392 00:36:23,100 --> 00:36:27,187 శాల్వార్, శాల్వార్ నన్ను చూడు. చూడు. 393 00:36:27,187 --> 00:36:28,605 - దీని వల్ల లాభం ఉండట్లేదు... సాయపడండి! - కాపాడు. 394 00:36:28,605 --> 00:36:30,524 ఎవరైనా కాపాడండి! 395 00:36:30,524 --> 00:36:33,694 నువ్వు నాలో ఆశని చిగురించజేశావు. దయచేసి నన్ను వదిలి వెళ్లిపోకు. 396 00:36:34,194 --> 00:36:37,114 అమ్మా. 397 00:36:39,366 --> 00:36:40,742 దీని అర్థం ఏమిటో నీకు తెలుస్తోందా? 398 00:36:44,913 --> 00:36:46,331 అంటే, మనం ఇరుక్కుపోలేదని అర్థం. 399 00:36:49,084 --> 00:36:51,753 నువ్వు చెప్పింది నిజమే. భవిష్యత్తును మార్చవచ్చు. 400 00:36:55,799 --> 00:36:57,968 ప్లాన్ ని సరైన మార్గంలోనే నడిపించే అవకాశం మీకు ఇంకా ఉంది. 401 00:37:01,263 --> 00:37:03,891 నాకు నీ మీద పూర్తి నమ్మకం... 402 00:37:03,891 --> 00:37:07,102 అయ్యో. 403 00:37:07,102 --> 00:37:11,190 శాల్వార్ నన్ను విడిచి వెళ్లిపోకు. 404 00:37:11,982 --> 00:37:13,192 శాల్వార్. 405 00:37:14,526 --> 00:37:16,403 శాల్వార్! 406 00:37:17,738 --> 00:37:19,364 అయ్యో, భగవంతుడా! 407 00:38:34,731 --> 00:38:37,317 ...పవిత్ర సోదరి అయిన నేను ఫౌండేషన్ లక్ష్యానికి నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. 408 00:38:37,818 --> 00:38:43,115 స్పిరిట్ కళ్లు అయిన నా కళ్లు, స్పిరిట్ లిఖించిన 409 00:38:43,115 --> 00:38:44,700 భవిష్యత్తునే చూచునుగాక... 410 00:38:46,201 --> 00:38:47,452 నా హృదయ... 411 00:38:47,452 --> 00:38:49,913 వాయు స్థాయి 412 00:39:41,715 --> 00:39:42,716 హలో? 413 00:39:51,725 --> 00:39:52,726 క్లెరిక్? 414 00:39:56,563 --> 00:40:00,025 నిన్ను కలవడం బాగుంది, సోదరి. హోబర్ ఎక్కడ? 415 00:40:03,237 --> 00:40:04,238 అతను... 416 00:40:13,163 --> 00:40:14,540 నువ్వు ఒక్కడివే బతికావా? 417 00:40:15,374 --> 00:40:16,375 లేదు. 418 00:40:18,001 --> 00:40:19,461 బతికింది నేను ఒక్కడినే కాదు. 419 00:40:19,461 --> 00:40:20,546 ఇంకెవరెవరు బతికారు? 420 00:40:30,514 --> 00:40:32,599 వాల్ట్ చాలా పనులు చేయగలదు. 421 00:40:33,934 --> 00:40:37,479 అది పైకి చిన్నగానే కనిపించినా, లోపల చాలా పెద్దదని స్వయంగా నువ్వే చూశావు కదా. 422 00:40:38,939 --> 00:40:39,982 పైకి లేయ్, సోదరి. 423 00:40:42,234 --> 00:40:43,569 మొదట్నుంచీ ఇదే ప్లాన్. 424 00:40:44,152 --> 00:40:50,242 ఫౌండేషన్ మనుగడ కోసం టర్మినస్ ని బలి చేయడం. 425 00:42:29,216 --> 00:42:30,217 ఏం చేస్తున్నావు? 426 00:42:31,510 --> 00:42:32,511 నాకు తెలీదు. 427 00:42:34,429 --> 00:42:36,139 శాల్వార్ మరణం కారణంగా 428 00:42:36,765 --> 00:42:40,853 ప్లాన్ గాడిలోనే పడింది అని సూచించే సంకేతం కోసం చూస్తున్నానేమో. 429 00:42:42,312 --> 00:42:44,356 ఇప్పటికిప్పుడే ఆ విషయం మనకి తెలీదు, 430 00:42:45,190 --> 00:42:47,693 ఒక్కో వ్యక్తి చేసిన చర్యల కారణంగా 431 00:42:47,693 --> 00:42:50,696 తలెత్తే పర్వావసానాలు మనకు ఎప్పటికో కానీ తెలీవు. 432 00:42:50,696 --> 00:42:52,614 అది నా బుర్రకి తెలుసు, హారి. 433 00:42:55,492 --> 00:42:57,411 కానీ నా హృదయం... 434 00:43:01,623 --> 00:43:05,419 శాల్వార్ మరణం ఊరికే పోకూడదు అని నా హృదయం చెప్తోంది. 435 00:43:07,129 --> 00:43:08,714 ఒకవేళ అలా జరగకపోతే... 436 00:43:08,714 --> 00:43:10,340 మనం జీవించలేం. 437 00:43:16,263 --> 00:43:17,931 మనమేమో ఇక్కడ మానవ జాతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, 438 00:43:17,931 --> 00:43:20,350 కానీ మనం ప్రేమించేవాళ్లని మాత్రం కాపాడుకోలేకపోతున్నాం. 439 00:43:23,312 --> 00:43:27,024 "యానా బతికి ఉంటే ఎలా ఉండేది?" అని నేను అనుకోని రోజు లేదు. 440 00:43:28,942 --> 00:43:30,527 "మా కూతురు ఎలా ఉండేది? 441 00:43:31,987 --> 00:43:33,197 వాళ్లు ఆనందంగా ఉండేవాళ్లా? 442 00:43:34,740 --> 00:43:37,868 వాళ్ల ఆనందం మనకి సంతృప్తినిస్తుందా?" అని. 443 00:43:41,121 --> 00:43:44,708 మనం బాధని దిగమింగుకుంటూ, ఇలా ప్రశ్నించుకుంటూ ఉండి, 444 00:43:45,667 --> 00:43:48,712 వాటినే మనల్ని ముందుకు నడిపించే ఇంధనంలా మలుచుకోవాలి. 445 00:43:53,717 --> 00:43:56,136 మనం పయనించే దారిలో చాలా మరణాలను చూడాల్సి వస్తుంది, గాల్. 446 00:43:57,221 --> 00:44:00,307 ఆ మరణాలకు మనం ప్రాముఖ్యతనిచ్చి, అవి ముఖ్యమైనవిగా చేసుకోవాలి. 447 00:44:03,602 --> 00:44:05,687 శాల్వార్ ఆ పని చేసి ఉండకపోతే, నువ్వు చనిపోయి ఉండేదానివి. 448 00:44:09,191 --> 00:44:11,235 నేను లెక్కలేనన్ని సార్లు మధ్యలోనే వదిలేసి ఉండేవాడిని, 449 00:44:11,235 --> 00:44:13,737 కానీ యానా, నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది. 450 00:44:16,031 --> 00:44:18,909 యానా త్యాగం చేసింది కాబట్టే, నేను తన త్యాగం వృథా పోకుండా జీవిస్తున్నా. 451 00:44:22,704 --> 00:44:23,705 నీకు అర్థమవుతోందా? 452 00:44:24,665 --> 00:44:25,666 హా. 453 00:44:31,547 --> 00:44:35,676 ప్లాన్ ఇప్పటికీ పని చేస్తోంది కదా, హారి? 454 00:44:36,468 --> 00:44:37,886 ప్లాన్ ఇప్పటికీ పని చేయవచ్చు. 455 00:44:39,763 --> 00:44:41,473 నీకు నిజంగానే అలా అనిపిస్తోందా? 456 00:44:44,810 --> 00:44:51,191 గమ్యస్థానాన్ని చేరుకోవడానికి లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి మరి. 457 00:45:57,299 --> 00:45:58,759 మీరెవరో మీకు తెలుసా? 458 00:45:58,759 --> 00:46:00,177 నేను పగటి సోదరుడిని. 459 00:46:01,345 --> 00:46:02,596 నేను వేకువ సోదరుడిని. 460 00:46:02,596 --> 00:46:04,389 నేను రాత్రి సోదరుడిని. 461 00:46:04,389 --> 00:46:06,683 మేము మహారాజులం. 462 00:46:06,683 --> 00:46:08,477 మరి నేనెవరో తెలుసా? 463 00:46:08,477 --> 00:46:11,230 నువ్వు డెమెర్జల్ వి. 464 00:46:11,230 --> 00:46:12,606 అవును. 465 00:46:13,357 --> 00:46:16,360 నేను మొదట్నుంచీ ఇక్కడ ఉన్నాను, ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. 466 00:46:17,361 --> 00:46:19,279 చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి, మహారాజా. 467 00:46:19,279 --> 00:46:23,450 మీ ముగ్గురి క్లోన్స్ ని ఒకేసారి పుట్టించాల్సిన అవసరం ఇప్పటిదాకా రానే లేదు. 468 00:46:23,450 --> 00:46:26,036 కానీ మీరు నిరాశపడిపోకండి, 469 00:46:27,329 --> 00:46:30,624 ఎందుకంటే, ఇటీవలే నా చేతికి ఒక శక్తివంతమైన సాధనం చిక్కింది. 470 00:46:46,890 --> 00:46:50,143 నీకు ఇది అర్థమవుతోందా, డెమెర్జల్? 471 00:46:51,478 --> 00:46:52,646 మొత్తం అర్థం కావట్లేదు. 472 00:46:56,066 --> 00:46:57,109 ప్రస్తుతానికైతే అర్థం కావట్లేదు. 473 00:47:00,988 --> 00:47:04,199 కానీ భవిష్యత్తులో చాలా మంచి మంచి సంఘటనలు జరుగుతాయని నాకు తెలుస్తోంది. 474 00:47:11,623 --> 00:47:12,791 మరి ఇప్పుడు మనమేం చేద్దాం? 475 00:47:12,791 --> 00:47:16,295 నిన్ను 150 ఏళ్ల ముందుకు తీసుకెళ్తాము, 476 00:47:16,295 --> 00:47:18,630 అదే నువ్వు మ్యూల్ ని కలిసిస ముఖ్యమైన సమయానికి. 477 00:47:19,256 --> 00:47:23,552 అతని గెలుపు ఖాయం కాదు. శాల్వార్ ఆ విషయం చెప్పకనే చెప్పింది. 478 00:47:24,094 --> 00:47:26,013 అయితే నేను మళ్లీ క్రయోస్లీప్ లోకి వెళ్లాలా? 479 00:47:26,013 --> 00:47:27,723 పాడ్స్ పని చేస్తున్నాయి. నేను తనిఖీ చేసి చూశా. 480 00:47:27,723 --> 00:47:29,391 మరి ద్వితీయ ఫౌండేషన్ సంగతేంటి? 481 00:47:29,391 --> 00:47:32,811 వాళ్లకి ఎవరు నేర్పుతారు? మనకి కావలసిన సైన్యంలా వాళ్లని ఎవరు మలుస్తారు? 482 00:47:37,024 --> 00:47:38,192 నేను. 483 00:47:38,192 --> 00:47:40,527 నువ్వు నిద్రావస్థలో ఉంటావు, నీ తరఫున అంతా నేను చూసుకుంటాను. 484 00:47:40,527 --> 00:47:44,239 మెంటాలిక్స్, తమ సామర్థ్యాలని మరింత మెరుగుపరుచుకుంటారు. వాళ్లకి నేను సైకో హిస్టరీ నేర్పుతాను. 485 00:47:45,073 --> 00:47:47,534 సినాక్స్ లో మీరు స్లీపర్ ని దేవుడిగా కొలిచేవారు. 486 00:47:48,410 --> 00:47:53,040 ఏడాదికి ఒకసారి, స్లీపర్ ఉద్భవించి, గెలాక్సీ పరిస్థితిని అంచనా వేసి, 487 00:47:53,999 --> 00:47:55,459 తన అనుచరులకు మార్గనిర్దేశం చేస్తారు, 488 00:47:55,459 --> 00:47:59,254 తదుపరి సైకిల్ లో తమంతట తామే ముందుకెల్లేలా తగిన స్ఫూర్తి అందిస్తారు. 489 00:48:00,047 --> 00:48:03,008 మెంటాలిక్స్ కి సారథిగా ఒక అద్భుతమైన వ్యక్తి ఉండాలి. 490 00:48:03,008 --> 00:48:04,760 ఆ విషయంలో, టెల్లెం నీ గురించి నిజమే చెప్పింది. 491 00:48:04,760 --> 00:48:06,470 దేవతలా అవ్వడం గురించా? 492 00:48:07,513 --> 00:48:10,015 - శాల్వార్ ని కలవరపెట్టిన విషయం అదే. - తను కలవరపడటంలో న్యాయం ఉంది. 493 00:48:10,557 --> 00:48:13,352 మనం ఇందులో భాగస్థులం అని మర్చిపోయిన మరుక్షణం, మనం గతి తప్పేస్తాం. 494 00:48:13,352 --> 00:48:18,774 నువ్వు చనిపోయే దాకా ప్రతీ ఏడాది నిద్రావస్థ నుండి నన్ను లేపుతూ ఉంటా అంటున్నావా? 495 00:48:20,526 --> 00:48:22,694 బెగ్గర్ లో రెండు క్రయోపాడ్స్ ఉన్నాయి, 496 00:48:23,403 --> 00:48:27,699 మనం స్లీప్ సైకిల్స్ ని ఇప్పుడే ప్రారంభించాల్సిన పని లేదు. మనం ఒక ఏడాది ఆగి ఆ పని మొదలుపెట్టవచ్చు. 497 00:48:27,699 --> 00:48:30,702 మనిద్దరం కలిసి బోధిస్తే, వారు రెండింతలు వేగంగా నేర్చుకుంటారు. 498 00:48:31,954 --> 00:48:36,834 శాల్వార్ మరణం వల్ల నేను తెలుసుకున్నది ఏదైనా ఉందంటే, అది నా సొంతంగా ఈ పని చేయలేననే విషయమే. 499 00:48:38,001 --> 00:48:40,546 ఒక వ్యక్తే దీన్ని చేయలేడు. ఇది చాలా పెద్ద పని, హారి. దయచేసి అర్థం చేసుకో. 500 00:48:41,338 --> 00:48:45,217 నాకున్న ఏకైక కుటుంబానికి దూరంగా ఉండమని చెప్పకు. 501 00:48:45,843 --> 00:48:47,511 నువ్వు కూడా నాతోరా. 502 00:48:51,598 --> 00:48:54,768 బహుశా ఏదోకరోజు నేను మ్యూల్ ని ఎదుర్కోగలనేమో. 503 00:48:57,855 --> 00:49:01,942 కానీ, మరొక హారి సెల్డన్ ని 504 00:49:01,942 --> 00:49:05,654 ఎదుర్కోవాల్సి వస్తే, అది కూడా అంత కన్నా పెద్ద విపత్తు సమయంలో అయితే, 505 00:49:07,239 --> 00:49:10,033 దాన్ని ఎదుర్కోగల సమర్థుడివి నువ్వు ఒక్కడివే అని మనిద్దరికీ తెలుసు. 506 00:49:13,704 --> 00:49:14,746 అలాగే. 507 00:50:18,810 --> 00:50:22,231 నీ గుండె వేగంగా కొట్టుకోవడం నాకు తెలుస్తోంది, హారి. కంగారుపడిపోకు. 508 00:50:22,231 --> 00:50:23,732 కంగారుపడకు. ప్రశాంతంగా ఉండు. 509 00:50:24,316 --> 00:50:25,317 ప్రశాంతంగా ఉండు. 510 00:50:25,317 --> 00:50:26,944 ద్రవంలో ఊపిరి ఆడుతుంది. కాబట్టి కంగారుపడకు. 511 00:50:27,569 --> 00:50:28,820 నువ్వు ద్రవంలో ఊపిరి తీసుకోవచ్చు. 512 00:50:28,820 --> 00:50:31,448 ప్రైమ్ నంబర్లను లెక్కించు. 513 00:50:33,700 --> 00:50:35,452 నేను... ఎంత దాకా లెక్క పెట్టాం? 514 00:50:36,328 --> 00:50:41,166 86,990,413. 515 00:50:42,584 --> 00:50:45,212 - ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల... - ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల, 516 00:50:45,212 --> 00:50:46,588 తొంభై వేల, 517 00:50:46,588 --> 00:50:49,424 - నాలుగు వందల నలభై మూడు. - ...నాలుగు వందల నలభై మూడు. 518 00:50:50,801 --> 00:50:54,054 ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల, తొంభై వేల... 519 00:50:54,680 --> 00:50:55,597 ఐ లవ్ యూ. 520 00:50:56,181 --> 00:50:57,432 నాలుగు వందల అరవై ఒకటి. 521 00:50:59,059 --> 00:51:01,186 మనిద్దరం కలిసి అద్భుతాలు సృష్టించగలం. 522 00:51:27,212 --> 00:51:31,175 అసలేమీ లేని దాని నుండి ఇంత ఎలా పుట్టింది? 523 00:51:33,177 --> 00:51:38,849 మీ కళ్ళు మూసుకొని, నా మాటలను వింటూ, కలలు కనండి. 524 00:51:44,146 --> 00:51:49,026 152 ఏళ్ల తర్వాత 525 00:51:49,776 --> 00:51:51,695 తనని మళ్లీ చూశాను. 526 00:51:53,280 --> 00:51:56,700 తను వెయ్యి కలల్లో ప్రత్యక్షమైంది. 527 00:52:03,081 --> 00:52:04,875 ఇప్పుడు తను ఇక్కడికి వచ్చింది. 528 00:52:08,045 --> 00:52:09,546 మన సమయంలోకి. 529 00:52:11,215 --> 00:52:12,841 నా దరికే వచ్చింది. 530 00:52:15,260 --> 00:52:20,599 గాల్ డోర్నిక్ నన్ను కనుగొనక ముందే... 531 00:52:22,643 --> 00:52:24,436 నేనే తనని కనుగొనాలి. 532 00:52:27,814 --> 00:52:30,651 నేను తనని చంపేయాలి... 533 00:52:34,196 --> 00:52:38,617 తనని చంపడానికి నేనెంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను. 534 00:53:36,967 --> 00:53:38,969 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్