1 00:01:06,108 --> 00:01:07,943 {\an8}ఇసాక్ అసిమోవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:32,509 --> 00:01:33,510 నా మీద నీకు నమ్మకం ఉందా? 3 00:01:34,511 --> 00:01:36,138 నిన్ను అసలు కలిసి ఉండకపోతే బాగుండు. 4 00:01:36,138 --> 00:01:40,392 కానీ కలిశావు, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం మనం, 5 00:01:41,435 --> 00:01:46,148 గెలాక్సీ అంతా ఇప్పుడు ఒక్కగానొక్క వ్యక్తి చర్యల మీదే ఆధారపడుంది, అది నువ్వే. 6 00:01:47,941 --> 00:01:50,319 రేయిచ్, రేయిచ్... 7 00:01:52,404 --> 00:01:55,157 ఈ పని నేను చేయలేను. 8 00:01:55,157 --> 00:02:00,245 ఇదెంత ముఖ్యమైన పనో అందరికన్నా నీకే బాగా తెలుసు. 9 00:02:02,331 --> 00:02:03,916 మాకు చేసిన పాపానికి నువ్వంటే అసహ్యంగా ఉంది. 10 00:02:04,583 --> 00:02:07,794 నాకు తెలుసు. కోపంగా ఉంటే ఈ పని చేసేయ్, కాస్త ఊరటగా ఉంటుంది. 11 00:02:08,294 --> 00:02:09,420 నాకు కోపం లేదు, నాకు... 12 00:02:13,383 --> 00:02:14,384 ఐ లవ్ యూ. 13 00:02:17,387 --> 00:02:18,805 అది నాకు కూడా తెలుసు, బాబూ. 14 00:02:32,528 --> 00:02:33,529 కానివ్వు. 15 00:02:34,613 --> 00:02:37,616 నేరుగా క్రయోపాడ్ కి వెళ్లు. నీ కోసమే అది ప్రోగ్రామ్ చేయబడి ఉంది. 16 00:02:38,242 --> 00:02:40,994 తన దగ్గరికి వెళ్లి బై చెప్పడం లాంటివి చేయకు. 17 00:02:42,454 --> 00:02:44,164 ఇందులో తనని దూర్చకు. 18 00:03:27,583 --> 00:03:28,625 రేయిచ్. 19 00:03:33,422 --> 00:03:35,340 నేను ఇంకా కలలోనే ఉన్నా కదా? 20 00:03:35,841 --> 00:03:37,176 ఇది కల కాదు. 21 00:03:41,847 --> 00:03:43,140 మరి ఎలా బతికి ఉన్నావు? 22 00:03:44,308 --> 00:03:47,311 నేను ప్రాణంతో లేను. డెలివరెన్స్ నౌకలో చనిపోయాను. 23 00:03:48,937 --> 00:03:50,147 వాళ్లందరినీ నువ్వు భలే మోసం చేశావు. 24 00:03:50,939 --> 00:03:52,441 వాళ్లు అంటే నీకు మమకారం ఉందనే భ్రమలో ఉన్నారు. 25 00:03:53,358 --> 00:03:55,611 కానీ నిజం ఏంటంటే, నువ్వు ఎవరినీ పట్టించుకోవు. 26 00:03:56,195 --> 00:03:58,780 అందరూ నీ లెక్కలో భాగాలు మాత్రమే. 27 00:04:00,115 --> 00:04:01,450 అందుకే నువ్వు విఫలమవుతావు. 28 00:04:01,450 --> 00:04:03,869 ఎందుకంటే, ఎవరు బతికినా, ఎవరు చచ్చినా నీకు అనవసరం. 29 00:04:03,869 --> 00:04:07,331 - నువ్వు చావకూడదు. - కానీ నువ్వు ప్లాన్ ని మార్చేశావు. 30 00:04:07,331 --> 00:04:12,586 నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నన్ను ఇరికించేశావు. నువ్వలా చేసి ఉండకపోతే, ఇంకా బతికి ఉండేవాడినే. 31 00:04:12,586 --> 00:04:16,214 నన్ను చెత్తలాగా ఎయిర్ లాక్ నుండి బయటకు విసిరేశారు. 32 00:04:17,882 --> 00:04:20,719 విశ్వంలో ఎప్పటికీ గడ్డకట్టుకుపోయుండి తేలుతూ ఉండేలా నన్ను వదిలేశారు. 33 00:04:21,553 --> 00:04:22,679 నువ్వు చెత్తవి కాదు. 34 00:04:23,514 --> 00:04:24,515 కాదు. 35 00:04:33,023 --> 00:04:38,195 నేను నీ కొడుకుని, కానీ నువ్వు నా చావుకు కారణమయ్యావు. 36 00:04:40,906 --> 00:04:46,078 అయినా ఆశ్చర్యపోవాల్సిందేముందిలే? అది మొదటిసారి కాదని మనిద్దరికీ తెలుసు కదా. 37 00:05:58,692 --> 00:06:00,027 బాగానే ఉన్నావా? 38 00:06:00,027 --> 00:06:01,820 అతను కాళ్లను ఉపయోగించి శతాబ్దానికి పైగానే అయిందిగా. 39 00:06:01,820 --> 00:06:04,323 కాళ్లంటే గుర్తొచ్చింది, అవి అసలు నీకెలా వచ్చాయి, హారి? 40 00:06:04,323 --> 00:06:08,660 చెప్పా కదా, నాకు తెలీదని. కాలె నన్ను ఊనాస్ వరల్డ్ కి రమ్మంది. 41 00:06:08,660 --> 00:06:10,662 ఎలా? అప్పుడు నువ్వు ప్రైమ్ రేడియంట్ లో ఇరుక్కుపోయి ఉన్నావు. 42 00:06:10,662 --> 00:06:14,166 తను నాకు కనిపించింది. అప్పటికే నా మతి పోయి ఉంది. 43 00:06:14,166 --> 00:06:18,212 తను ప్రైమ్ రేడియంట్ యొక్క స్వరూపమే అని చెప్పింది. 44 00:06:18,212 --> 00:06:22,299 నేను తనని కలిశా. తను మనిషిలానే అనిపించినా, ఎందుకో బతికి ఉన్న మనిషిలా అనిపించలేదు. 45 00:06:22,299 --> 00:06:23,258 మరి నేను? 46 00:06:23,258 --> 00:06:24,510 హా. 47 00:06:25,219 --> 00:06:28,388 సరిగ్గా నేను చనిపోయినప్పుడు ఎలా అయితే అనిపించిందో, అలాగే. 48 00:06:29,515 --> 00:06:35,270 కాలెతో ఆ గుహలోకి వెళ్లాను. చీకట్లో బరువులేని తనంతో ఎదురు చూస్తూ ఉన్నాను. 49 00:06:36,522 --> 00:06:40,984 కళ్లు తెరిచి చూస్తే నువ్వు నా పక్కన ఉన్నావు, గురుత్వాకర్షణ శక్తి నామీద పని చేయడం నాకు తెలిసింది. 50 00:06:40,984 --> 00:06:42,069 తను నిన్ను క్లోన్ చేసింది. 51 00:06:43,111 --> 00:06:47,032 అంటే, ఒకటిన్నర శతాబ్దం తర్వాత, జన్యు ఆధారిత వంశానికి ఒక ప్రత్యర్థి తయారయ్యాడు అన్నమాట. 52 00:06:47,533 --> 00:06:49,034 ఎలాగైనా వాళ్లకి ప్రత్యర్థి నేనే అంటావా! 53 00:06:49,034 --> 00:06:50,911 ఎవరికో నువ్వు ప్రాణాలతో ఉండటం కావాలి. 54 00:06:50,911 --> 00:06:54,289 నువ్వు అంత కష్టపడి, నిన్నే ఒక ఐడియాలా మార్చుకున్నా కూడా. 55 00:06:54,790 --> 00:06:57,793 ఒకసారి దీన్ని చూడండి. కొన్ని సిగ్నళ్ళను అందుకొని గమనించాను. 56 00:06:58,502 --> 00:07:01,630 గెలాక్సీ అంచు ప్రాంతమంతా ఫౌండేషన్ విస్తరించింది. 57 00:07:02,130 --> 00:07:05,384 సైకో హిస్టరీని మ్యాజిక్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. 58 00:07:05,926 --> 00:07:08,303 నిన్ను ప్రాఫెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. 59 00:07:08,303 --> 00:07:10,639 నన్ను కాదు. వేరే సెల్డన్ ఉన్నాడుగా, అతడిని. 60 00:07:10,639 --> 00:07:13,433 అది సాధారణమేలే. జనాలకి దాసులుగా బతకడమంటేనే ఇష్టం. 61 00:07:13,433 --> 00:07:15,185 ఇగ్నిస్ సమీపిస్తున్నాం. 62 00:07:15,185 --> 00:07:16,478 ఇగ్నిస్ ని సమీపిస్తున్నాం. 63 00:07:16,478 --> 00:07:18,272 నువ్వు మళ్లీ నా నౌకని హైజాక్ చేసి, ఏదైనా చేసి ఉంటే తప్ప. 64 00:07:24,611 --> 00:07:27,781 ఇగ్నిస్. వెయ్యి ఏళ్ళ క్రితం సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 65 00:07:27,781 --> 00:07:31,326 చాలా రకాల జీవజాతులు ఇక్కడ ఉన్నాయి, కానీ సామ్రాజ్యం వాళ్లు వెళ్లిపోయాక, మనుషులు మాత్రమే లేరు. 66 00:07:32,244 --> 00:07:34,079 ఇక్కడ ఎవరూ లేనప్పుడు, మనల్ని పిలిచింది ఎవరు? 67 00:07:35,205 --> 00:07:36,415 వాయుమండలంలోకి ప్రవేశిస్తున్నాం. 68 00:07:40,544 --> 00:07:42,171 - అబ్బా! - ఏమైంది? 69 00:07:44,381 --> 00:07:47,301 గాల్లో ఉన్న నెగెటివ్ ఐయానికి పార్టికల్స్ వల్ల సిస్టమ్ రీబూట్ అవుతోంది. 70 00:07:47,301 --> 00:07:48,218 అంటే? 71 00:07:48,218 --> 00:07:50,470 అంటే, నౌక నా ఆధీనంలో లేదని, ఇంజిన్స్ ఆన్ లో లేకుండా అది ఎగురుతోందని అర్థం. 72 00:07:50,470 --> 00:07:51,889 - అది మంచి విషయం కాదా? - కాదు! 73 00:07:56,810 --> 00:07:58,103 - కాస్త మంచిగా దింపగలవా? - మూసుకో! 74 00:07:59,313 --> 00:08:01,857 - చెట్లు! - తెలుసు! నాకు తెలుసు! 75 00:08:07,863 --> 00:08:09,364 కానివ్వు! కానివ్వు! 76 00:08:20,584 --> 00:08:21,543 హారి, నీకేమైనా నొప్పిగా ఉందా? 77 00:08:21,543 --> 00:08:26,048 కొంచెం నొప్పిగా ఉంది. నొప్పిగా అనిపించి నాకు చాలా కాలమైంది కదా. భరించలేకపోతున్నా. 78 00:08:26,548 --> 00:08:27,799 దీన్ని కొంచెం కొంచెం వాడు. 79 00:08:27,799 --> 00:08:29,718 ఒకసారి విశ్లేషణను రన్ చేయ్. నేను ఇప్పుడే వస్తా. 80 00:08:29,718 --> 00:08:31,053 ఎక్కడికి వెళ్తున్నావు? 81 00:08:31,553 --> 00:08:33,429 అడవిలోకి. మన రాకను ఎవరో గమనిస్తూ ఉన్నారు. 82 00:08:33,931 --> 00:08:36,058 ముందు నౌక మరమ్మత్తులో మాకు సాయపడితే మేలేమో. 83 00:08:36,058 --> 00:08:37,934 దిగేటప్పుడు బాగా హడావిడిగా దిగాం కదా. 84 00:08:37,934 --> 00:08:40,895 ఎవరైనా మన కోసం చూస్తుంటే, వాళ్లని నౌకలో కలవడం కన్నా, బయట కలవడమే మేలు. 85 00:08:41,438 --> 00:08:44,775 అబ్బా! దిగేటప్పుడు బోర్డింగ్ ర్యాంప్ పాడైంది, నేను ఎయిర్ లాక్ ద్వారా బయటకు వెళ్తా. 86 00:08:54,743 --> 00:08:58,330 నువ్వు విజన్ లో ఏదైతే చూశావో, దాని ప్రభావానికి గురవుతున్నావు. అలా జరగనివ్వకు. 87 00:09:10,008 --> 00:09:11,760 ఇది అంత సులభమైన పని కాదని నాకు తెలుసు. 88 00:09:11,760 --> 00:09:14,680 హత్యాప్రయత్నానికి సంబంధించిన రికార్డింగును ఇతరులు చూడకుండా వారు నిషేధిస్తారు. 89 00:09:14,680 --> 00:09:17,140 అవును. మహారాజు పడక గదికి సంబంధించిన రికార్డింగులను అయితే ఎవరూ చూడకూడదు. 90 00:09:17,140 --> 00:09:18,934 మరి నా కుటుంబానికి సంబంధించినవి? 91 00:09:18,934 --> 00:09:20,477 ఏమీ లభించలేదు, డొమీనియన్. నన్ను మన్నించాలి. 92 00:09:21,436 --> 00:09:24,439 థ్యాంక్యూ, మార్క్లీ. త్వరలోనే ఇంకో సాయం చేసిపెట్టమని అడుగుతాంలే. 93 00:09:25,023 --> 00:09:26,900 హత్యాప్రయత్నం జరిగింది పగటి రాజు పడక గదిలోనే. 94 00:09:28,318 --> 00:09:30,070 నేను వేరే మార్గం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటా. 95 00:09:30,070 --> 00:09:32,030 అదొక్కటే మార్గం అంటావా? 96 00:09:32,614 --> 00:09:35,617 సమాచారం పొందడానికి నా నవ యువ శరీరాన్ని అర్పించడం నీకు ఇష్టం లేదా? 97 00:09:36,410 --> 00:09:38,829 కంగారుపడకు, రూ. ఎంత ఇవ్వాలో అంతే ఇస్తా. 98 00:09:38,829 --> 00:09:43,750 ఏమో అబ్బా. ఒక్కోసారి దీన మొహం వేసుకొని, సిగ్గు పడిపోతూ ఉండే మా శారెత్ ఏమైపోయిందా అనిపిస్తూ ఉంటుంది. 99 00:09:44,251 --> 00:09:45,794 తన కుటుంబంతో పాటే తను కూడా చనిపోయింది. 100 00:10:01,143 --> 00:10:02,561 తను సంభోగంలో పాల్గొనాలనుకుంటోంది. 101 00:10:02,561 --> 00:10:05,606 నువ్వు ఆశించిందీ అదే కదా. ఏదో నామ్ కే వాస్తే కాకుండా నిజంగా పెళ్లి బంధాన్ని కోరుకున్నావు. 102 00:10:05,606 --> 00:10:08,567 అవును. అంతా అనుకున్నట్టే జరుగుతోంది. కానీ... 103 00:10:09,359 --> 00:10:11,945 ఈ విషయంలో నేను నీకు అలవాటుపడిపోయాను. 104 00:10:12,946 --> 00:10:16,033 నువ్వు మగాడివి. ఎలా చూసినా కత్తిలాంటి వాడివి. 105 00:10:16,033 --> 00:10:17,910 తను నీలాంటి మగాడిని చూసే ఉండదు. 106 00:10:18,702 --> 00:10:19,578 అవును. 107 00:10:19,578 --> 00:10:25,334 తనే సంభోగ ప్రతిపాదన తెచ్చింది కనుక, తను సిద్దంగానే ఉంటుంది. పెద్ద ఎక్కువ సమయమేమీ పట్టదులే. 108 00:10:27,836 --> 00:10:29,505 నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావని నాకు తెలుస్తోంది. 109 00:10:33,884 --> 00:10:35,302 - నేను దగ్గర్లోనే ఉంటాను. - సరే. 110 00:10:38,680 --> 00:10:39,681 నన్ను తలుచుకుంటూ చేయ్. 111 00:10:54,947 --> 00:10:57,950 రా, శారెత్. నీ కోసమే చూస్తూ ఉన్నా. 112 00:10:59,868 --> 00:11:01,119 ఈ పనికి ఒప్పుకున్నందుకు థ్యాంక్యూ. 113 00:11:01,620 --> 00:11:05,958 యువతులకు శృంగార సంబంధిత పనులు ముఖ్యమైనవని అర్థం చేసుకోగలను. 114 00:11:07,084 --> 00:11:09,753 ఆంతరంగిక గది. నేను ఒకసారి చూడవచ్చా? 115 00:11:09,753 --> 00:11:11,421 తప్పకుండా. అంతా చూడు. 116 00:11:13,882 --> 00:11:19,137 వావ్. ఇక్కడ సూపర్ గా ఉన్నావే. చాలా బాగుంది. 117 00:11:19,638 --> 00:11:20,639 థ్యాంక్యూ. 118 00:11:21,932 --> 00:11:23,141 దీన్ని బాగు చేస్తున్నారా? 119 00:11:24,601 --> 00:11:27,896 అంటే బూజు, చదలు పట్టాయి. 120 00:11:28,522 --> 00:11:31,400 చాలా పాతది అది. నిజానికి అది మొదటి క్లియాన్ విగ్రహం, 121 00:11:31,400 --> 00:11:35,320 కానీ ప్రతీ పగటి రాజు, సామ్రాజ్యానికి ఏం అందించాడో తెలియజడానికి, 122 00:11:35,320 --> 00:11:36,321 దానిలో మార్పులు చేస్తుంటారు. 123 00:11:36,905 --> 00:11:39,825 మీ మీద ఉన్నవి ఆర్బిటల్ రింగ్స్ ఆ? వావ్. 124 00:11:40,450 --> 00:11:43,704 దాన్ని నా సోదరుడు ప్రారంభించాడు. ఆ పని నేను పూర్తి చేశాను. 125 00:11:44,788 --> 00:11:47,082 నేను అవి పెద్దగా కనబడవు అనుకున్నా, కానీ చాలా బాగా కనబడుతున్నాయి. 126 00:11:47,082 --> 00:11:50,377 అసలు వాటిని నేల మీద నుండి చూసినప్పుడు కనిపించకుండా ఉండేలా డిజైన్ చేశారు. 127 00:11:50,377 --> 00:11:55,674 కానీ ఆ ఆర్కులు ప్రజలకి కనిపించాలని నేనే అన్నాను, అవి ఈ ప్రపంచానికి సంకెళ్లలా అనిపించాలని. 128 00:11:57,176 --> 00:11:59,928 ప్రజలందరూ బతికి ఉన్నారంటే అది నా వల్లే అని 129 00:11:59,928 --> 00:12:01,263 వాళ్లకి తెలియాలి. 130 00:12:04,099 --> 00:12:06,810 మీ అదృశ్య కవచం. సంభోగ సమయాల్లో కూడా దాన్ని ధరించే ఉంటారా? 131 00:12:08,187 --> 00:12:09,396 ఎప్పుడూ ధరించే ఉంటా. 132 00:12:09,396 --> 00:12:13,150 మరీ ఎక్కువగా ఉంటే ఎలా? ఒకవేళ మీకు 133 00:12:13,734 --> 00:12:16,069 ఏమో... తడుతూ చేయడం ఇష్టమేమో? 134 00:12:16,695 --> 00:12:19,781 పిర్రల మీద కొట్టినప్పుడు రాచరిక ముద్ర పడేలా 135 00:12:19,781 --> 00:12:20,741 కొన్ని ప్యాడిల్స్ ఉంటాయనుకున్నా. 136 00:12:20,741 --> 00:12:22,034 కొన్ని చేయిస్తాలే. 137 00:12:26,413 --> 00:12:27,915 మీ బెడ్ చాలా సౌకర్యంగా ఉంది. 138 00:12:30,792 --> 00:12:32,461 ఒక పాత సామెత ఉంది, 139 00:12:33,295 --> 00:12:36,048 రాజుకు, తన దిండు ఎంత మెత్తగా ఉన్నా నిద్ర సరిగ్గా పట్టదట. 140 00:12:36,048 --> 00:12:37,424 అది నిజమేనా? 141 00:12:37,424 --> 00:12:40,636 ఆ రాజులు ఇంకా మంచి దిండ్లు చేసుకోవాలనుకుంటా. 142 00:12:41,220 --> 00:12:43,722 ఆ జోకు మీరు నాకు ముందే చెప్పారనుకుంటా. 143 00:12:47,351 --> 00:12:48,894 ఇంకా దిండు విషయం గురించే నవ్వుతున్నారా? 144 00:12:48,894 --> 00:12:50,354 లేదు. నిన్ను చూసి. 145 00:12:50,938 --> 00:12:53,857 మగ, ఆడ కలిసినప్పుడు, అన్నీ సక్రమంగా జరగాలంటే 146 00:12:53,857 --> 00:12:59,530 మగాడు పైన ఉండాలి. 147 00:13:00,948 --> 00:13:02,032 నేను వెర్రిబాగులదాన్ని అనిపిస్తోంది. 148 00:13:02,032 --> 00:13:05,244 నేర్చుకుంటావులే. నేర్పుతా ఆగు. 149 00:13:06,703 --> 00:13:07,704 మీ మోకాళ్లా? 150 00:13:07,704 --> 00:13:08,956 - కాదు. - అబ్బా! మీరేం... 151 00:13:08,956 --> 00:13:10,958 లేదు, నేను చూసుకుంటా. 152 00:13:11,875 --> 00:13:14,920 అబ్బా. అది నా బొటనవేలు. సరే. ఏం కాలేదులే. 153 00:13:18,715 --> 00:13:20,217 - నేనేమైనా... - మాట్లాడకు. 154 00:13:26,849 --> 00:13:28,308 నువ్వు ఈ పని ఇంతకు ముందే చేశావు. 155 00:13:28,892 --> 00:13:30,519 నిజం చెప్తున్నా కదా, ఇలా ఎప్పుడూ చేయలేదు. 156 00:13:30,519 --> 00:13:32,938 నువ్వు నటిస్తున్నావు. నీకు లవర్ ఉండేవాడని నాకు తెలుసు. 157 00:13:33,605 --> 00:13:35,858 వాళ్లందరూ ఒక దుర్ఘటనలో చనిపోయారు, దానితో నీకు సింహాసనం దక్కింది. 158 00:13:35,858 --> 00:13:39,194 నా కుటుంబానికి చెందిన ఆఖరి రోజుల గురించి మీకు చాలా బాగానే తెలిసినట్టుందే? 159 00:13:39,194 --> 00:13:40,904 నాతో పడక పంచుకోవడం నీకు ఇష్టం లేదు. 160 00:13:43,198 --> 00:13:47,703 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఈ గదిలో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. 161 00:13:47,703 --> 00:13:48,912 అది జరిగింది ఈ గదిలోనేనా? 162 00:13:48,912 --> 00:13:52,165 నువ్వు ఇక్కడంతా తిరుగుతూ, మొత్తం ఎలా జరిగి ఉంటుందో అంచనా వేస్తూ ఉన్నావు, 163 00:13:52,165 --> 00:13:53,959 వాళ్లు ఎలా విఫలమయ్యారా అని తెలుసుకోవాలనుకుంటున్నావు. 164 00:13:53,959 --> 00:13:56,086 వాళ్లు నన్ను చంపి ఉంటే బాగుండు అనే కదా నీ కోరిక? 165 00:13:56,086 --> 00:13:59,214 అలా జరగడం కాస్తయినా న్యాయమని నువ్వు ఫీల్ అయిపోతున్నావు కదా? 166 00:13:59,214 --> 00:14:01,550 ఆ ప్రయత్నం కూడా నువ్వే చేయించావేమో? 167 00:14:01,550 --> 00:14:04,261 అవును! హంతకులు ఇక్కడికి ఎలా వచ్చారో తెలుసుకోవాలని నేను అనుకున్న మాట వాస్తవమే. 168 00:14:04,261 --> 00:14:06,221 దానికి కారణం నేను వాళ్లకి సుపారీ ఇచ్చానని కాదు. 169 00:14:06,221 --> 00:14:08,849 ఇక్కడ ఉండటం సురక్షితమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నా, అదే కారణం. 170 00:14:08,849 --> 00:14:12,144 నా దృష్టి కోణం నుండి ఎప్పుడైనా ఆలోచించారా? 171 00:14:12,769 --> 00:14:14,855 మరో కోణం కూడా ఉండవచ్చని మీకు అసలు అనిపించిందా? 172 00:14:14,855 --> 00:14:18,025 ఎలా తెలుస్తుందిలే? మీకు సన్నిహితులెవరూ లేరు, మీరు తప్ప. 173 00:14:18,025 --> 00:14:20,360 నీకు ఏం కాకుండా చూసుకోలేనని అనుకుంటున్నావా? 174 00:14:20,360 --> 00:14:24,072 ట్రాంటార్ అంతా జల్లెడ పడుతున్నాను నేను. ఆ దేశద్రోహులను తప్పక పట్టుకుంటా... 175 00:14:24,072 --> 00:14:26,241 ఎన్నో రోజుల నుండి ఆ పని చేస్తున్నారు, కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలేకపోయారు. 176 00:14:26,241 --> 00:14:29,244 మన్నించాలి, మహారజా, నాకు నమ్మకం కుదరట్లేదు. 177 00:14:29,244 --> 00:14:32,372 నా పెళ్లి ప్రతిపాదనని తిరస్కారించాలనుకుంటే, ఆ ముక్క ఇప్పుడే చెప్పేయ్! 178 00:14:32,372 --> 00:14:33,832 చెప్పి, నేను కూడా చావాలా? 179 00:14:34,958 --> 00:14:38,378 చేతనైతే ఆ నమ్మకద్రోహిని కనిపెట్టి, నాకేమీ కాదని నమ్మకం కలిగించండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. 180 00:14:38,378 --> 00:14:40,589 తప్పకుండా ఆ పని చేయగలను. మాటిస్తున్నా! 181 00:14:40,589 --> 00:14:43,342 - అప్పుడు నేను ఒప్పుకుంటా! - ఇక బయలుదేరు! 182 00:15:07,282 --> 00:15:08,534 మొత్తం విన్నావా? 183 00:15:08,534 --> 00:15:10,702 లేదు. పనివాళ్ళ మార్గంలో వెళ్లిపోయాను. 184 00:15:11,995 --> 00:15:15,499 తన కుటుంబాన్ని నేనే చంపానని అనుకుంటోంది. నా మీద హత్యా ప్రయత్నం చేయించింది తనే అని నేను కూడా అన్నాను. 185 00:15:15,499 --> 00:15:18,168 పరిస్థితి గాడి తప్పి, మేము అరుచుకున్నాం. 186 00:15:19,378 --> 00:15:20,379 అంతా మంచే జరుగుతుందిలే. 187 00:15:21,463 --> 00:15:24,383 తన కుటుంబ హత్య విషయానికి వస్తే, దానికీ, నీకూ లింకే ఉండదు. 188 00:15:24,383 --> 00:15:25,634 ఆ విషయంలో నేను జాగ్రత్తపడ్డానులే. 189 00:15:25,634 --> 00:15:27,302 మనం తనతో జాగ్రత్తగా ఉండాలి. 190 00:15:28,804 --> 00:15:31,932 తను తెలివైనది, చాలా పెద్ద పెద్ద ప్లాన్సే వేస్తోంది. 191 00:15:35,102 --> 00:15:38,105 చెప్పాలంటే, ఆమెకి మహారాణి స్థానం చాలా ఎక్కువ. 192 00:15:43,110 --> 00:15:44,528 నీ దాహం కూడా తీరలేదు. 193 00:15:49,616 --> 00:15:51,910 {\an8}ముప్పై ఏళ్ల క్రితం... 194 00:15:53,203 --> 00:15:54,496 థ్యాంక్యూ, మహారాజా. 195 00:15:54,496 --> 00:15:55,581 నన్ను క్లియాన్ అని పిలువు. 196 00:16:02,129 --> 00:16:03,130 అది బాగుంది. 197 00:16:05,757 --> 00:16:09,803 చాలా అందంగా ఉన్నావు. ఇంత అందం ఎక్కడిది? 198 00:16:09,803 --> 00:16:11,847 చాలా ఉప్పు తింటా కదా, అందుకే, క్లియాన్. 199 00:16:14,725 --> 00:16:15,726 నేను మల్లె తీగని. 200 00:16:16,935 --> 00:16:17,936 నీ పేరేంటీ? 201 00:16:20,022 --> 00:16:22,608 రూ. రూ కొరింతా, నేను డొమీనియన్ కి చెందిన దాన్ని. 202 00:16:23,734 --> 00:16:27,237 పేరు అందంగా ఉంది. నువ్వు కూడా అందంగా ఉన్నావు. 203 00:16:29,907 --> 00:16:35,120 నేను అదృశ్య కవచాన్ని ఆపివేస్తున్నాను, నీకు కూడా కొరకాలని అనిపిస్తే, కుదరాలి కదా. 204 00:16:46,965 --> 00:16:48,050 సూపర్ గా ఉంది. 205 00:16:49,885 --> 00:16:52,930 ఇంకాస్త ముందుది చూడవచ్చా? మీరు నన్ను గొసామర్ కోర్టులో ఎంచుకున్నారు కదా, అది? 206 00:16:55,265 --> 00:16:58,227 ఇప్పుడు వాతావరణం బాగా వేడెక్కుతోంది కదా. 207 00:16:58,227 --> 00:17:03,524 వద్దాంలే. ఎంత ఆగితే అంత కిక్కు. 208 00:17:03,524 --> 00:17:06,568 సరే. ఆ రోజు ముందు ఏం జరిగిందో చూద్దాం. 209 00:17:10,864 --> 00:17:14,492 గొసామర్ కోర్టులో ఉన్న అనేక లెన్సుల నుండి దీన్ని రూపొందించడం జరిగింది. 210 00:17:19,998 --> 00:17:21,290 అదుగో నువ్వు. 211 00:17:40,936 --> 00:17:43,105 వాళ్లందరూ మీ దృష్టిలో పడాలని చూస్తున్నారు అనుకుంటా. 212 00:17:43,689 --> 00:17:46,024 వాళ్లలో ఒకరికి కాలు పట్టేసినా పట్టేయవచ్చు. 213 00:17:47,109 --> 00:17:48,110 పాపం. 214 00:17:50,153 --> 00:17:52,865 ఎవరి దృష్టి అయినా ఆకర్షించడానికి నువ్వేం చేస్తావు? 215 00:17:53,490 --> 00:17:56,743 నేనా? నా ఆట నేను ఆడుకుంటా. 216 00:17:57,452 --> 00:17:59,288 మరి నువ్వు ఆశించిందే జరిగిందా? 217 00:18:01,331 --> 00:18:05,085 నాకు మీ కాళ్లు కనిపిస్తున్నాయంతే, కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఫలితం ఇస్తుందనే ఆశిస్తున్నా. 218 00:18:09,548 --> 00:18:12,467 అది నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు. 219 00:18:13,135 --> 00:18:14,803 ఇక సంభోగం రికార్డింగ్ పెట్టండి. 220 00:18:21,310 --> 00:18:24,146 నీ జ్ఞాపకం తొలగించారని నీకు తెలుసా? 221 00:18:25,022 --> 00:18:26,064 తెలీదు. 222 00:18:26,773 --> 00:18:30,944 నేను నీ చేయి పట్టుకుందామని చేయి చాచాను, కట్ చేస్తే నేను ఇంటికి వెళ్లే దార్లో ఉన్నాను, 223 00:18:31,778 --> 00:18:35,240 నా భుజంపై ఎవరో కొరికిన గాటు ఉంది, నా బ్యాంక్ ఖాతాలో బోలెడంత డబ్బు కూడా ఉంది. 224 00:18:36,241 --> 00:18:38,952 ఏదీ మిస్ కాలేదని అప్పుడు నాకు బాగా అర్థమైంది. 225 00:18:39,453 --> 00:18:40,412 నిజంగానా? 226 00:18:41,413 --> 00:18:45,167 ఒక విచిత్రమైన చీకటిలా ఉంటుందని, అంటే ఏదో అడ్డుపడుతున్నట్టుగా ఉంటుందేమో అని... 227 00:18:45,167 --> 00:18:47,711 నేను అనుకున్నాను. 228 00:18:49,004 --> 00:18:51,757 నాకు ఒక ఆలోచన వచ్చింది, మీకు అవకాశం ఉంది కాబట్టి, మీరు... 229 00:18:54,676 --> 00:18:56,345 మీ జ్ఞాపకాలకు మీరు మార్పులూ చేర్పులూ చేసుకోరా? 230 00:18:57,554 --> 00:19:01,016 మహారాజు ఏవైనా గుర్తుంచుకోకూడదంటే, ఆ క్షణాలను ఆయన తొలగించేయగలడని అనుకున్నా. 231 00:19:02,059 --> 00:19:03,936 అలా అని వాటీని మీరు కాలగర్ణంలో కలిసిపోనివ్వరు కదా. 232 00:19:05,562 --> 00:19:11,276 లేదు, మా సాధారణ తనిఖీలతో పాటు వాటిని కూడా మేము మెమోరియంలో ఉంచుతాం. 233 00:19:12,736 --> 00:19:14,321 కానీ ఆ ఐడియా చాలా బాగుంది. 234 00:19:15,322 --> 00:19:16,156 ఏ ఐడియా? 235 00:19:21,912 --> 00:19:24,039 అపరాధ భావాలకు ముగింపు పలకడం. 236 00:19:25,582 --> 00:19:26,750 నువ్వు అయితే ఆ పని చేస్తావా? 237 00:19:28,877 --> 00:19:32,923 చేయను. నేను వాటిని మనసారా ఆహ్వానిస్తా. 238 00:19:33,507 --> 00:19:36,134 నేను పర్వత శిఖరంపై నుండి మొత్తం చూడాలనుకుంటా. 239 00:19:38,512 --> 00:19:41,431 అలా చూడటం ద్వారా, నేను అక్కడి నుండి పడిపోయే అవకాశముందని నాకు తెలిసినా. 240 00:19:42,850 --> 00:19:46,895 మీ జ్ఞాపకాలను మీరు విశ్వసిస్తున్నారు, అంటే మీరు అదృష్టవంతులని చెప్పవచ్చు. 241 00:20:31,315 --> 00:20:35,110 చూస్తుంటే, దొంగచాటుగా వెంటబడటంలో నీకు ఓనమాలు కూడా వచ్చినట్టు లేవె. 242 00:20:36,320 --> 00:20:37,988 సూపర్. నువ్వు ఒకసారి ఆలోచించాలి... 243 00:20:37,988 --> 00:20:39,114 దాన్ని కింద పడేయ్. 244 00:20:42,409 --> 00:20:44,661 చేతులు పైకెత్తు. ముఖానికి ఉన్న ముసుగు తీసేయ్. 245 00:20:53,337 --> 00:20:54,630 హాయ్, శాల్. 246 00:20:56,173 --> 00:20:57,799 అసాధ్యం. నువ్వు ఈపాటికి చనిపోయి ఉండాలిగా. 247 00:20:58,383 --> 00:21:00,260 - నిరాశగా ఉందా? - లేదు, కానీ... 248 00:21:00,260 --> 00:21:04,348 కానీ నీ తీరు ఏమీ మారలేదు. నీ ముందు వజ్రాల మూట పడినా, ఆ మూట కట్టిన గుడ్డనే చూస్తావు నువ్వు. 249 00:21:04,932 --> 00:21:07,226 నువ్వు క్రయోస్లీప్ లోకి వెళ్తున్నావని బెగ్గర్ నాకు చెప్పింది. 250 00:21:07,226 --> 00:21:09,770 టర్మినస్ లో నాకంటూ ఏమీ లేదు, శాల్. కాబట్టి నేను కూడా క్లయోస్లీప్ లోకి వెళ్లా. 251 00:21:09,770 --> 00:21:12,523 బెగ్గర్ కి కమాండ్ అధికారాలు నీకే ఇచ్చా, అయినా కానీ అది నా నౌకే. 252 00:21:12,523 --> 00:21:15,859 బెగ్గర్ లో నువ్వు ఎప్పుడు నిద్రావస్థ నుండి లెస్తావో, దానికి మ్యాచ్ అయ్యేలా నా క్రయోపాడ్ ని సెట్ చేసుకున్నా. 253 00:21:15,859 --> 00:21:19,029 నువ్వు ఎప్పుడు లోకంలోకి అడుగుపెడతావో, అప్పుడే నేను కూడా అడుగుపెడదామని. 254 00:21:20,364 --> 00:21:21,865 కానీ ఇక్కడికి ఎలా వచ్చావు? 255 00:21:22,366 --> 00:21:24,910 నువ్వు ఈ భాగంలో ఎడాపెడా తిరిగేస్తున్నావు, శాల్. 256 00:21:26,078 --> 00:21:28,163 నువ్వు వెళ్లే మార్గాన్ని ఊనాస్ వరల్డ్ లో ట్రాక్ చేశాను. 257 00:21:30,916 --> 00:21:32,668 నీకన్నా సగం రోజు ముందే ఇగ్నిస్ కి వచ్చా. 258 00:21:34,253 --> 00:21:39,424 ఇక కట్ చేస్తే, నీ గొంతు వినబడింది. 259 00:21:59,862 --> 00:22:00,946 మన్నించు. 260 00:22:02,281 --> 00:22:06,285 శాల్వార్ గురించి, ఆ విజన్ గురించి ఇందాక నేను కటువుగా మాట్లాడాను, కానీ నా ఉద్దేశం అది కాదు. 261 00:22:07,578 --> 00:22:09,079 దాన్ని నేను మర్చిపోలేకపోతిన్నాను, 262 00:22:09,079 --> 00:22:12,165 కాబట్టి దాన్ని మర్చిపొమ్మని చెప్పడం వృథా. 263 00:22:12,708 --> 00:22:14,626 చేస్తే సాయం చేయ్, లేకపోతే ఆ ప్రస్తావన తీసుకురాకు. 264 00:22:16,003 --> 00:22:19,715 భవిష్యత్తు నిర్దిష్టమైనది కాదు అనే అంశం మీదనే సైకో హిస్టరీ నిర్మితమైంది. 265 00:22:20,215 --> 00:22:21,967 కానీ నా విజన్లన్నీ నిజమయ్యాయి. 266 00:22:25,095 --> 00:22:29,141 సినాక్స్ లో, నీ మీద ఒక భారీ అల పడటం నీకు విజన్ లో వచ్చింది. 267 00:22:29,141 --> 00:22:31,393 కానీ అలా జరగలేదు. నువ్వు ఇక్కడ ఉన్నావుగా. 268 00:22:32,311 --> 00:22:34,938 కాబట్టి మనం ఏం చేస్తే, శాల్వార్ కి అలా జరగకుండా ఆపగలమో 269 00:22:34,938 --> 00:22:36,273 మనకి ఎలా తెలుస్తుంది? 270 00:22:36,273 --> 00:22:39,443 మనం తెలుసుకోలేం. ఒకవేళ తెలుసుకోగలిగినా, ఆ ప్రయత్నం మనం చేయాలా? 271 00:22:40,903 --> 00:22:42,362 తన మానాన తనని వదిలేయమంటున్నావు కదా, 272 00:22:42,362 --> 00:22:44,907 ఎందుకంటే, నువ్వు ఎవరినీ పట్టించుకోవు, నీకు కావాల్సిందల్లా... 273 00:22:44,907 --> 00:22:47,284 హేయ్! తనలో రేయిచ్ రక్తం కూడా ప్రవహిస్తోంది. 274 00:22:47,784 --> 00:22:49,995 అంటే నాకు తను మనవరాలు అవుతుంది. 275 00:22:50,829 --> 00:22:51,872 నాకు తెలిసి ఉంటే... 276 00:22:51,872 --> 00:22:55,209 తెలిసి ఉంటే? ఆ పని చేసి ఉండేవాడివి కాదా? 277 00:22:56,335 --> 00:22:58,837 ఏమో. అలా చేయకుండా ఉందేవాడినేమో. 278 00:23:01,298 --> 00:23:04,927 కానీ అండానికి, వ్యక్తికీ చాలా వ్యత్యాసం ఉంది కదా. 279 00:23:09,097 --> 00:23:10,682 మేము ఇంకా నిర్ణయించుకోలేదు. 280 00:23:11,934 --> 00:23:13,810 బిడ్డని కనాలా వద్దా అని. 281 00:23:16,104 --> 00:23:19,525 ఎందుకంటే, అతను ఇక్కడ ఉండడని అతనికి తెలుసు. మేమిద్దరమూ కావాలనుకున్నాం. 282 00:23:24,571 --> 00:23:30,160 ఇప్పుడు తనతో గడిపే అవకాశం నీకు దక్కింది. అందరికీ అలాంటి అవకాశం రాదు. 283 00:23:35,916 --> 00:23:38,335 బెగ్గర్ యొక్క లామెంట్ డోర్ కంట్రోలర్ 284 00:23:38,335 --> 00:23:39,962 గాల్, ప్రైమ్ రేడియంట్ ఎక్కడ ఉంది? 285 00:23:41,046 --> 00:23:42,047 కాక్ పిట్ లో ఉంది. ఎందుకు? 286 00:23:43,882 --> 00:23:45,050 తన ముఖం మీద చిరునవ్వు ఉంది. 287 00:23:45,050 --> 00:23:47,261 దాన్ని దాచేయ్. ఎక్కడ పెట్టావో నాకు కూడా చెప్పకు. 288 00:23:47,261 --> 00:23:48,428 ఆ పని ఇప్పుడే చేయ్. 289 00:23:53,183 --> 00:23:56,520 శాల్వార్, మన నౌక వద్దకు నువ్వు తీసుకువస్తున్న ఆ అపరిచితుడు ఎవరో చెప్పు. 290 00:23:56,520 --> 00:23:58,105 ఒక రకంగా చెప్పాలంటే, అది నా నౌక కదా. 291 00:23:58,105 --> 00:23:59,022 సరే. 292 00:23:59,022 --> 00:24:00,816 టర్మినస్ కి చెందిన హ్యూగో క్రాస్ట్. 293 00:24:00,816 --> 00:24:02,818 నేను విజన్స్ లో తప్పిపోయినప్పుడు ఇతడినే తలుచుకుంటాను. 294 00:24:02,818 --> 00:24:04,862 నేను అంతకు మించి, శాల్. 295 00:24:05,362 --> 00:24:06,363 ఎయిర్ లాక్ ని తెరువు. 296 00:24:13,078 --> 00:24:14,079 సరే. 297 00:24:19,126 --> 00:24:20,252 లాక్ 298 00:24:24,673 --> 00:24:25,841 హారి, తలుపు తెరువు. 299 00:24:25,841 --> 00:24:27,092 తెరువు, హారి. 300 00:24:27,968 --> 00:24:30,179 పరిమిత యాక్సెస్ 301 00:24:30,179 --> 00:24:31,513 యాక్సెస్ మంజూరు చేయడమైంది 302 00:24:31,513 --> 00:24:32,848 హ్యూగో, నీ పొడవు ఎంత? 303 00:24:33,432 --> 00:24:35,100 రెండు మీటర్లకు కాస్తంత తక్కువ, అంతే. 304 00:24:35,601 --> 00:24:38,520 - బెగ్గర్ లోని రికార్డుల ప్రకారం, అది 181. - హారి, ఏం చేస్తున్నావు? 305 00:24:38,520 --> 00:24:42,191 నీ మొత్తం బరువు కన్నా నువ్వు మూడు కేజీలు తక్కువ ఉన్నావని బెగ్గర్ చెప్తోంది. 306 00:24:42,191 --> 00:24:46,278 జోక్ చేస్తున్నావా? అడవిలో నడిచాడు కదా, అందుకని తగ్గిపోయి ఉంటుందిలే. తెరువు. 307 00:24:48,322 --> 00:24:49,489 అతను హ్యూగో కాదు. 308 00:24:49,489 --> 00:24:53,994 మూడు కేజీలు పెద్ద విషయమే కాదు. కొన్ని బీర్లు వేస్తే కవర్ అయిపోతుంది. 309 00:24:53,994 --> 00:24:56,205 ద్రవ్యరాశిని పరిశీలించు, హ్యూగో విషయంలో అది తేడాగా ఉంది. 310 00:24:56,205 --> 00:24:58,123 అతని వస్త్రధారణ వల్లో, ధరించిన వాటి వల్లో అయ్యుండవచ్చు. 311 00:25:00,167 --> 00:25:02,669 నేను నౌక సిస్టమ్లను ఓవర్ రైడ్ చేశాను. నువ్వు తెరవలేవు. 312 00:25:02,669 --> 00:25:06,507 డాక్టర్ సెల్డన్, నేను హ్యూగోని. తొలి విపత్తు సమయంలో నేను ఉన్నాను. 313 00:25:06,507 --> 00:25:08,550 తెస్పిన్ల దగ్గరికి వెళ్లి, వాళ్లని వెంటబెట్టుకుని వచ్చింది నేనే. 314 00:25:08,550 --> 00:25:10,802 "హ్యూగోకి జయహో." గుర్తుందా? 315 00:25:11,303 --> 00:25:12,596 నిజం చెప్పాలంటే, అతనికి గుర్తు లేదు. 316 00:25:13,972 --> 00:25:16,225 హ్యూగో మనోడే. ఇది అతని నౌకే. 317 00:25:17,434 --> 00:25:18,852 అతని నౌకనా? థెస్పిన్ నౌక అన్నమాట. 318 00:25:19,728 --> 00:25:21,855 అంటే, సిస్టమ్ కి అతను జన్యుపరంగా అనుసంధానించబడి ఉండాలి. 319 00:25:21,855 --> 00:25:23,482 అవును. నిజమే. ఇతనెవరో బెగ్గర్ కి బాగా తెలుసు. 320 00:25:23,482 --> 00:25:24,942 నియంత్రణాధికారాలను మళ్లీ అతనికే బదిలీ చేసేయ్. 321 00:25:24,942 --> 00:25:28,195 అది నేను చేయలేను. నాకు శాశ్వతంగా దీన్ని పగ్గాలు ఇచ్చేశాడు. 322 00:25:28,195 --> 00:25:32,282 అవునా? నేను మెయిన్ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఒరిజినల్ సెట్టింగ్స్ కి నౌకని రీసెట్ చేసేశాలే. 323 00:25:32,282 --> 00:25:34,701 అబ్బా! నువ్వు తెరవకపోతే నియంత్రణాధికారాలను మళ్లీ అతనికే ఇచ్చేస్తా. 324 00:25:34,701 --> 00:25:35,702 శాల్వార్, ఆగు. 325 00:25:35,702 --> 00:25:36,787 బదిలీ చేయ్. 326 00:25:38,038 --> 00:25:39,665 బెగ్గర్, ప్రోటోకాల్ సెట్టింగ్స్ తెరువు. 327 00:25:39,665 --> 00:25:41,500 నౌకని మళ్లీ హ్యూగో క్రాస్ట్ ఆధీనంలోకి బదిలీ చేయ్. 328 00:25:41,500 --> 00:25:42,876 {\an8}బెగ్గర్ పరిసరాల స్కాన్ 329 00:25:42,876 --> 00:25:44,795 ఇప్పుడు ఎయిర్ లాక్ ని అతనే తెరుచుకోగలడులే. 330 00:25:45,712 --> 00:25:46,630 తెరువు. 331 00:25:48,340 --> 00:25:50,092 హారి, మనకు ఓ సమస్య వచ్చి పడింది. 332 00:25:51,426 --> 00:25:52,928 శాల్వార్, వెనుక చూసుకో! 333 00:25:55,389 --> 00:25:58,392 నౌక బాహ్య ఆయుధాలను డిజేబుల్ చేయండి లేదంటే తనని నేను చంపేస్తాను. 334 00:26:09,361 --> 00:26:10,320 హారి! 335 00:26:13,949 --> 00:26:15,784 - శాల్వార్! - గాల్! 336 00:26:26,170 --> 00:26:27,254 వారి మెదళ్లని స్తంభింపజేయండి. 337 00:26:36,638 --> 00:26:37,723 అయితే బాగా గొడవ జరిగింది అన్నమాట. 338 00:26:38,348 --> 00:26:40,976 నా వల్ల ముప్పు ఉందని అతనికి అనుమానం వచ్చింది. ఇక అతడిని శాంతింపజేయాల్సి వచ్చింది. 339 00:26:41,643 --> 00:26:45,480 పైగా, సింహాసనానికి దగ్గరగా వెళ్లడం వలన కొన్ని లాభాలు ఉంటాయని నువ్వు కూడా అంటూ ఉంటావు కదా. 340 00:26:46,481 --> 00:26:48,775 హత్యాప్రయత్నం చేసిన వాళ్లు అతని పడక గదిలోకి చొరబడ్డారని తెలిసిపోయింది. 341 00:26:48,775 --> 00:26:52,237 వాళ్లు బాగా పదునైన ఖడ్గాలను వాడారు, బెడ్ పక్కనున్న చిత్రంపై రక్తం పడింది. 342 00:26:52,237 --> 00:26:54,656 కానీ ఆ తర్వాతి రోజు రాత్రే అతను మనతో డిన్నర్ చేశాడే. 343 00:26:54,656 --> 00:26:58,243 అలా జరగడం సాధ్యమేనా? కొంపదీసి అతని స్థానంలో ఉన్నది కొత్త క్లియానా? 344 00:26:58,243 --> 00:27:01,079 మార్క్లీ, హత్యాప్రయత్నం జరిగిన రోజు ఆ గదిలో ఏం జరిగిందో మాకు తెలియాలి. 345 00:27:01,079 --> 00:27:03,165 నిజంగానే చెప్తున్నాను, డొమీనియన్, ఆ రికార్డింగులను ఎవరూ యాక్సెస్ చేయలేరు. 346 00:27:03,165 --> 00:27:05,918 ఉంపుడుగత్తెలపై, అలాగే ఆ కోటలో పని చేసే వారిపై జ్ఞాపకాల తనిఖీ నిర్వహించినట్టే 347 00:27:05,918 --> 00:27:07,461 మహారాజుపై కూడా ఆ తనిఖీలు నిర్వహించబడతాయి. 348 00:27:07,461 --> 00:27:08,712 వాటిని శాశ్వతంగా భద్రపరుస్తారు. 349 00:27:09,213 --> 00:27:11,590 ఒరిజినల్ డౌన్ లోడ్లను మెమోరియం అనే ప్రదేశంలో భద్రపరుస్తారు. 350 00:27:11,590 --> 00:27:12,758 ఆ ప్రదేశంలోకి నువ్వు వెళ్లగలవా? 351 00:27:12,758 --> 00:27:15,928 వెళ్లగలను. కానీ క్లియాన్ జ్ఞాపకాలు అంటే కష్టమే. వాటిని వాళ్లు అస్సలు విడుదల చేయరు. 352 00:27:17,304 --> 00:27:18,889 పగటి రాజువి కాకుండా వేరే వాళ్ల జ్ఞాపకాలు చూద్దాం. 353 00:27:21,558 --> 00:27:23,977 ఎవరోకరు అతని గాయాలకి చికిత్స చేసి ఉంటారు కదా. 354 00:27:29,274 --> 00:27:32,361 - క్లావిజర్? - కీపర్ యార్టెల్. మహారాజుగారి ఆదేశంతో వచ్చాను. 355 00:27:32,361 --> 00:27:34,655 అస్లేపియమ్ కి సంబంధించిన జ్ఞాపకాల తనిఖీ ఫుటేజ్ కావాలని పగటి రాజు అడిగారు. 356 00:27:34,655 --> 00:27:37,241 తేదీ, సమయం, హోర్డ్ నంబరు ఉన్నాయి. 357 00:27:37,241 --> 00:27:38,325 ఇలా ఇవ్వు. 358 00:27:41,578 --> 00:27:43,163 హత్యా ప్రయత్నం. 359 00:27:45,499 --> 00:27:47,209 ఆయన దగ్గర ఇవి ఇప్పటికే ఉండాలి కదా. 360 00:27:47,209 --> 00:27:49,628 ఈ ఆర్డర్లను ఎవరోకరు ట్రాక్ చేస్తూ ఉంటే బాగుండు. 361 00:27:49,628 --> 00:27:51,713 ఆ రోజుకు సంబంధించిన రికార్డులన్నీ ఆయన కోరుతున్నారు, 362 00:27:51,713 --> 00:27:54,508 - మూడవ అసిస్టెంట్ కుక్ కి సంబంధించిన వాటితో సహా. - నాకు చెప్పిన పని నేను చేస్తున్నానంతే. 363 00:28:08,605 --> 00:28:09,439 థ్యాంక్యూ, కీపర్. 364 00:28:12,526 --> 00:28:14,611 నాకు ఆందోళనగా ఉంది, డెమెర్జల్. 365 00:28:15,195 --> 00:28:19,783 జ్ఞాపకాలను మార్చుకునే అధికారం పగటి రాజుకు మాత్రమే ఉందని అంటున్నావా? 366 00:28:19,783 --> 00:28:23,620 అవును. మీవి, వేకువ రాజువి కూడా ఆయన మార్చగలరు. 367 00:28:24,788 --> 00:28:25,789 అదెలా కుదురుతుంది? 368 00:28:28,125 --> 00:28:30,836 అందరికీ ఒకే అధికారం కదా ఉండేది! 369 00:28:31,503 --> 00:28:34,214 ఒకప్పుడు అలాగే ఉండేది. కానీ హత్యా ప్రయత్నం జరిగాక, 370 00:28:34,214 --> 00:28:35,924 పగటి రాజుకు మీ ఇద్దరి మీద అనుమానం కలిగింది. 371 00:28:37,467 --> 00:28:40,304 కానీ ఆయన స్కాన్స్ అన్నీ చూశాడు కదా. మేము అమాయకులమని ఆయనకి తెలుసు. ఆయన... 372 00:28:46,977 --> 00:28:50,731 అయినా కానీ, తన ఈ ప్రత్యేకమైన అధికారాన్ని మా నుండి దాచాడు. 373 00:28:55,235 --> 00:28:58,530 ఒకవేళ వేకువ రాజు నా నుండి కానీ, లేదా వేకువ రాజు నుండి కానీ జ్ఞాపకాలను తీసేస్తే, 374 00:29:00,407 --> 00:29:02,034 ఆ విషయం మాకు ఎలా తెలుస్తుంది? 375 00:29:03,410 --> 00:29:05,746 మీ జ్ఞాపకాలన్నీ మెమోరియంలో భద్రంగా ఉంటాయి. 376 00:29:06,622 --> 00:29:09,875 అదీగాక, నా జ్ఞాపకాలను మార్చడం సాధ్యపడదు. 377 00:29:10,626 --> 00:29:13,128 కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే, ఈ బ్యాకప్ ఆప్షన్స్ నుండి మీరు తెలుసుకోవచ్చు. 378 00:29:15,839 --> 00:29:17,424 కానీ నాకు సందేహమే రాదు కదా. 379 00:29:20,177 --> 00:29:22,638 నాకు ఏదో మిస్ అయిన సంగతే తెలీదు. 380 00:29:23,430 --> 00:29:26,975 పగటి సోదరుడు అటువంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటే, ఖచ్చితంగా నాకు చెప్పేవాడే. 381 00:29:27,768 --> 00:29:32,981 అదీగాక, నేను సామ్రాజ్యం గురించి ఆలోచించాల్సి ఉంటుంది, కేవలం పగటి రాజు గురించే కాదు. 382 00:29:34,149 --> 00:29:36,276 నేను మీకు చెప్తాను, రాత్రి సోదరా. 383 00:29:37,277 --> 00:29:41,073 నేను ఎప్పటిలాగానే, ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. 384 00:29:42,991 --> 00:29:44,952 పగటి రాజు చాలా వరకు అతని సొంతంగానే చేసుకుంటున్నాడు. 385 00:29:56,922 --> 00:29:57,923 థ్యాంక్యూ, మార్క్లీ. 386 00:30:00,342 --> 00:30:01,343 ప్లే చేయ్. 387 00:30:02,803 --> 00:30:05,138 ఖడ్గం దూయడం కనిపించకపోతే, కనీసం ఆ ఖడ్గం ద్వారా ఎవరికి గాయమైందో చూద్దాం, 388 00:30:05,138 --> 00:30:06,682 అప్పుడు వాళ్లేం చేశారో కూడా చూద్దాం. 389 00:30:11,103 --> 00:30:13,272 మాలిక్యులర్ బ్లేడ్ ద్వారా నానోటాక్సిన్ శరీరంలోకి ప్రవేశించింది. 390 00:30:14,022 --> 00:30:17,025 పన్నెండు సెకన్లలో మెదడు పని చేయని స్థితికి వెళ్లిపోతుంది. 391 00:30:20,737 --> 00:30:21,738 అది ఇలా ఇవ్వు. 392 00:30:26,994 --> 00:30:28,912 - సగం తలనా! - అది అసాధ్యం. 393 00:30:28,912 --> 00:30:31,039 - తను డెమెర్జల్. - ఆమె యంత్రమా? నాకు అలాగే అనిపిస్తోంది. 394 00:30:31,039 --> 00:30:33,250 ట్రాంటార్ దగ్గర మర మనుషులు ఉండేవారే, కానీ అది కొన్ని వేల ఏళ్ళ క్రితం. 395 00:30:33,250 --> 00:30:34,459 నిషేధం విధించాక ఎవరూ మిగల్లేదు. 396 00:30:34,459 --> 00:30:37,421 నేను తన చేతిని పట్టుకున్నప్పుడు. నాకు అది మనిషి చేతిలానే అనిపించింది. 397 00:30:37,421 --> 00:30:39,089 అది రక్తం కాదు. 398 00:30:39,089 --> 00:30:41,300 కానీ అదేదైనా కానీ, ఖచ్చితంగా చింది ఉంటుంది కదా. 399 00:30:41,300 --> 00:30:42,885 ఆమె అతనితో పాటు పడక గదిలోనే ఉండింది. 400 00:30:45,804 --> 00:30:47,097 పైగా తను రోబోట్. 401 00:30:51,476 --> 00:30:56,231 పగటి రాజు మనిద్దరినీ సింహాసం ఉండే గది నుండి బయటకు పొమ్మన్నప్పుడే, మనం ఇక్కడికి వస్తామని గ్రహించా. 402 00:30:56,815 --> 00:31:02,279 అతను ఎంపికలు చేస్తున్నాడు, యుద్ధాలను కోరుకునే జనరల్స్ ని మిషన్స్ పై పంపుతున్నాడు. 403 00:31:02,863 --> 00:31:05,365 ఇప్పుడు అతను ఈ అధికారాన్ని లాగేసుకున్నాడు. 404 00:31:07,868 --> 00:31:10,871 - ఇలా జరగడం ఈయనకి అసలు ఇష్టం ఉండదు. - నేనెప్పుడూ ఈయనతో మాట్లాడలేదు. 405 00:31:11,747 --> 00:31:16,460 నేను కూడా మాట్లాడలేదు. మాట్లాడాలనిపించినా అహం అడ్డువచ్చి బయటకు చెప్పలేకపోయా. 406 00:31:18,086 --> 00:31:19,087 చూద్దాం. 407 00:31:22,508 --> 00:31:24,718 మన జన్యులకు చేసిన దిద్దుబాట్లలో ఎక్కడో లోపం ఉండి, 408 00:31:24,718 --> 00:31:26,220 మన చేతి ముద్రలు మ్యాచ్ కాకపోతే? 409 00:31:26,220 --> 00:31:27,304 ఆ మాట అనకు. 410 00:31:28,639 --> 00:31:32,643 మనం ఇతని క్లోన్స్ కాదని ఈయనకి తెలిస్తే, మనల్ని చంపేస్తాడు, 411 00:31:34,061 --> 00:31:35,062 ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండు. 412 00:31:38,357 --> 00:31:39,983 క్లియాన్, మేము మీ సమక్షంలో ఉన్నాం. 413 00:31:40,567 --> 00:31:44,488 పుత్రులం, సోదరులం, ఆత్మలం అయ్యుండి, మీ నుండి ఉద్భవించిన మేము 414 00:31:44,488 --> 00:31:46,657 మీ మహోన్నత అవతారానికి చెందిన జ్ఞాపకాన్ని దర్శించదలిచాము. 415 00:31:47,324 --> 00:31:51,870 మా చేతులలో మా గాథలు ఉన్నాయి, అది మీ గాథే. 416 00:31:53,205 --> 00:31:56,291 దయచేసి మా ధర్మ సందేహాన్ని నివృత్తి చేయండి. 417 00:31:58,544 --> 00:31:59,920 లోపం నా అరచేయిలోనే ఉండుంటుంది. 418 00:32:16,687 --> 00:32:20,399 నేను మొదటి క్లియాన్ జ్ఞాపకాన్ని. నా దర్శనం కోరింది ఎవరు? 419 00:32:21,483 --> 00:32:26,321 మేమే. మీకు చెందిన 16వ, 18వ భాగాలం. 420 00:32:27,197 --> 00:32:29,533 మాకు జీవితాలను ప్రసాదించినందుకు ధన్యవాదాలు. 421 00:32:30,742 --> 00:32:32,744 మీ సందేహం ఏంటో అడగండి, సోదరులారా. 422 00:32:33,328 --> 00:32:36,999 పగటి సోదరుడు మా జ్ఞాపకాలని సవరించడానికి సంబంధించిన అధికారాన్ని ఏకపక్షంగా అతనే తీసేసుకున్నాడు, 423 00:32:37,749 --> 00:32:40,752 ఒకవేళ అతను మా జ్ఞాపకాలని సవరిస్తే, దాన్ని కనుగొనే అధికారం కూడా మాకు లేదు. 424 00:32:40,752 --> 00:32:42,880 ఇలా ఉద్దేశించే మీరు ఈ వ్యవస్థని రూపొందించారా? 425 00:32:43,463 --> 00:32:45,132 మీ మధ్య గొడవలు వస్తున్నాయి కదా? 426 00:32:45,632 --> 00:32:47,217 అతను శక్తినంతా లాగేసుకుంటున్నాడు. 427 00:32:48,093 --> 00:32:52,764 సామ్రాజ్యానికి మూడు దిక్కులైన మా మధ్య సమతుల్యత లోపించింది. మేము మళ్లీ దిద్దుబాటు చర్యలను... 428 00:32:52,764 --> 00:32:53,849 ఇక ఆపండి. 429 00:32:56,351 --> 00:32:57,978 మీరందరూ ఒక వ్యక్తే. 430 00:32:57,978 --> 00:33:02,816 మీ మధ్య విభేదాలు వస్తే, నన్ను, ఇంకా నా రూపకల్పనను మీరు అగౌరవపరిచినట్టే. 431 00:33:02,816 --> 00:33:06,737 కలిసి ఒకే మార్గంలో పయనించడం మీ విధి. 432 00:33:08,113 --> 00:33:12,034 పగటి రాజుపై అసూయ పెంచుకుంటే, మీ మీద మీరే అసూయ పెంచుకున్నట్టు. 433 00:33:12,034 --> 00:33:14,453 జన్యుపరంగా మేమంతా ఒక్కటే. 434 00:33:14,453 --> 00:33:19,750 కానీ భావావేశాల విషయంలో మేము కాస్తంత భిన్నంగా ఉండవచ్చు. ఇక ఈ పగటి రాజు, 435 00:33:20,334 --> 00:33:25,464 అతను మా ఉనికి అంటేనే పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు... 436 00:33:25,464 --> 00:33:30,302 నా కోపోద్రిక్త స్వభావం గురించి నాకు తెలుసు, దానిలో అనేక కోణాలు కూడా ఉంటాయి. 437 00:33:30,969 --> 00:33:32,804 వాటన్నింటినీ లెక్కలోకి తీసుకోవడం జరిగింది. 438 00:33:33,514 --> 00:33:34,640 మీరేం అంటున్నారు? 439 00:33:34,640 --> 00:33:36,558 ఇది మీకు సంబంధించినది కాదు. 440 00:33:37,309 --> 00:33:38,310 అలా అంటారేంటి? 441 00:33:38,852 --> 00:33:41,939 మీ సాయం కోరే వీలు మాకు కల్పించడానికే కదా మీరు ఈ ప్రాంతాన్ని నిరించింది? 442 00:33:42,564 --> 00:33:46,318 మీకు కావాల్సింది ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాను. అంతకు మించి ఇవ్వడానికి కాదు. 443 00:33:49,154 --> 00:33:50,948 కల మీ ద్వారా కొనసాగుతుంది. 444 00:33:50,948 --> 00:33:53,784 ఎందుకంటే, దాన్ని మీలో మీరు సజీవంగా ఉంచారు. 445 00:34:02,376 --> 00:34:06,421 కీపర్, మా జ్ఞాపకాల చిట్టాలో ఎంత డేటా ఉందో మేము చూడాలనుకుంటున్నాం. 446 00:34:06,421 --> 00:34:09,299 మీ ఫైళ్లు ఎంత పెద్దగా ఉండవచ్చో నిర్దిష్టంగా చెప్పగలరా? 447 00:34:09,299 --> 00:34:12,803 మహారాజు మెటాడేటాను కూడా చూస్తారని నాకు తెలీదు. 448 00:34:13,428 --> 00:34:15,514 ఇంతకు ముందు పంపిన వాటిలో మీకు కావాల్సిన డేటా లేదా? 449 00:34:17,056 --> 00:34:18,058 లేదు. 450 00:34:18,058 --> 00:34:20,393 సరే. నేను చూసి ఇస్తాను. 451 00:34:20,393 --> 00:34:24,022 పనిలో పని, క్లియాన్లు అందరి డేటా కూడా ఇచ్చేయ్. 452 00:34:25,107 --> 00:34:26,525 మేము ఒక విషయంలో పోల్చి చూసుకోవాలి. 453 00:34:26,525 --> 00:34:30,237 అందరివా? అంటే ఎంత మంది ఉండవచ్చు? 454 00:34:30,904 --> 00:34:33,407 మొదటి క్లియాన్ నుండి ఇవ్వు. మేము మొత్తం 18 మందే ఉన్నాం. 455 00:34:33,407 --> 00:34:34,741 నువ్వు ఈ పని చేయగలవు, బాసూ. 456 00:34:34,741 --> 00:34:37,159 నాకు కొంత సమయం కావాలి. అయ్యేదాకా, దయచేసి ఎడమ వైపున కూర్చోండి. 457 00:34:40,121 --> 00:34:41,748 మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాడు. 458 00:34:42,416 --> 00:34:44,376 వాడి బొటన వేళ్లని కత్తిరించి పారేయాలి. 459 00:34:45,168 --> 00:34:48,839 ఇక ఇక్కడ మనకి విలువ సన్నగిల్లిపోతోందని నీకు అనిపించట్లేదా? 460 00:34:50,549 --> 00:34:52,301 నీ ఉద్దేశం... అంటే... 461 00:34:52,926 --> 00:34:55,596 మనకి ప్రాణహాని ఉందంటావా? మనం మహారాజులం కదా. 462 00:34:58,098 --> 00:34:59,683 అతనెవరో తెలుసా? 463 00:34:59,683 --> 00:35:01,685 ఆల్గ్రెన్ మహరాజు కదా? క్లియాన్ వంశానికి ముందు. 464 00:35:02,269 --> 00:35:05,147 అవును. మెడపై చూడు, అక్కడ పచ్చ రంగు కనిపిస్తుంది. 465 00:35:05,147 --> 00:35:08,734 అతను చనిపోయాక, గమనికగా దాన్ని జోడించారు. దాని అర్థం ఏంటో తెలుసా? 466 00:35:09,860 --> 00:35:11,361 అది తర్వాత, పైన గీసినది. 467 00:35:12,196 --> 00:35:17,826 అతను మోసగాడు, ద్రోహి అని అది సూచిస్తుంది. దేశద్రోహానికి పాల్పడినందుకు అతనికి మరణశిక్ష విధించారు. 468 00:35:18,577 --> 00:35:21,496 మనం ముగ్గుం ఉన్నాం, కానీ మనం అమరులమేం కాదు. 469 00:35:22,414 --> 00:35:27,252 నేను దీన్ని ముందే పసిగట్టి ఉండాల్సింది. దీన్నంతటినీ పసిగట్టి ఉండాల్సింది. 470 00:35:28,420 --> 00:35:29,630 ఇక పగటి రాజు అంటావా? 471 00:35:30,839 --> 00:35:35,928 ఏదోక విధంగా, పగటి రాజు తన గురించి గొప్పగా రాసుకుటాడు. 472 00:35:38,347 --> 00:35:39,556 నా ఏలుబడిలో 473 00:35:41,225 --> 00:35:44,102 కొన్ని చిన్న చిన్న ఘటనలు జరిగాయి, 474 00:35:44,770 --> 00:35:47,105 అలాంటివి చాలా శతాబ్దల తర్వాత అప్పుడే జరగడం మొదటిసారి, 475 00:35:47,648 --> 00:35:49,650 ఒక్కదాన్ని కూడా నేను చూసుకోలేదు. 476 00:35:52,027 --> 00:35:54,780 నా తరఫున డెమెర్జల్, గెలాక్సీ అంతటినీ శాంతపరిచింది. 477 00:35:54,780 --> 00:35:58,033 కానీ పగటి రాజు, అప్పుడు చిన్నవాడే అయినా, ఆ విషయంలో నా మీద గుర్రుగా ఉండేవాడు. 478 00:35:59,326 --> 00:36:01,537 చరిత్ర నన్ను ఏమని పిలుస్తుందో ఆలోచించావా అని అడిగాడు. 479 00:36:03,121 --> 00:36:08,794 శాంతి కాముకుడు, ఆక్రమణదారుడు, మోసగాడు, ఇవేవీ ఖచ్చితంగా నాకు రావు. 480 00:36:17,010 --> 00:36:18,262 నీలో ఇంకా ప్రాణం ఉంది కదా. 481 00:36:19,555 --> 00:36:20,931 నీ అస్తిత్వం ఇంకా రూపొందలేదు. 482 00:36:21,974 --> 00:36:26,728 ముసలివాళ్లకి, వాళ్ల ఆలోచన అంతా వాళ్లకి ఏం గుర్తుందో అని కాదు. 483 00:36:28,021 --> 00:36:29,898 వాళ్లని ఎలా గుర్తుంచుకుంటారో అనే దాని మీదనే ఉంటుంది. 484 00:36:31,066 --> 00:36:34,987 ఎంతైనా చివరికి మనందరం జ్ఞాపకాలుగా మిగిలిపోవలసిందే కదా. 485 00:36:35,529 --> 00:36:38,448 నీకు అధికారాన్ని దూరం చేయడం ద్వారా పగటి రాజు మంచి పనే చేశాడేమో. 486 00:36:41,034 --> 00:36:42,995 నేను ఏం కావాలి అని కోరుకున్నానో దాన్ని ఇప్పుడు నువ్వు పొందవచ్చు. 487 00:36:44,788 --> 00:36:45,998 నువ్వు ఏం కావాలని కోరుకున్నావు? 488 00:36:46,582 --> 00:36:47,916 యువకులందరూ కావాలని కోరుకునేదే. 489 00:36:49,793 --> 00:36:50,794 జీవితం. 490 00:36:52,713 --> 00:36:53,714 ప్రేమ. 491 00:37:00,053 --> 00:37:01,930 నేను అప్పుడు చాలా అందంగా ఉండేవాడిని. 492 00:37:05,142 --> 00:37:06,185 మహారాజా. 493 00:37:09,479 --> 00:37:10,856 ఇక నువ్వు వెళ్లిపో. 494 00:37:14,735 --> 00:37:15,736 డెబ్బై ఎనిమిదా? 495 00:37:16,695 --> 00:37:19,531 నా జ్ఞాపకాల మొత్తం యూనిట్లు. 496 00:37:19,531 --> 00:37:20,866 నాకు ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 497 00:37:22,910 --> 00:37:24,036 ఇరవై తొమ్మిది. 498 00:37:24,953 --> 00:37:26,580 మిగతా క్లియాన్ల యూనిట్లను చూద్దాం. 499 00:37:27,080 --> 00:37:31,043 ఎనభై తొమ్మిది, 87, 82. 500 00:37:31,627 --> 00:37:33,712 ఎనభై మూడు, ఇంకో 87. 501 00:37:35,172 --> 00:37:36,298 పర్వాలేదు. 502 00:37:36,798 --> 00:37:41,887 నేను పోయేసరికి, మిగతా క్లియాన్ల యూనిట్ల సంఖ్యే ఇంచుమించుగా నాకు కూడా వచ్చేలా ఉందిలే... 503 00:37:44,348 --> 00:37:45,724 - ఏంటి? - ఏమైంది? 504 00:37:49,645 --> 00:37:52,814 మొదటి క్లియాన్ కి 213 యూనిట్ల జ్ఞాపకాలు ఉన్నాయా? 505 00:37:53,941 --> 00:37:56,109 అతను ప్రత్యేకమైనవాడు కదా. 506 00:37:57,528 --> 00:38:00,572 కాబట్టి, అతను జీవితంలో చాలా చూసి ఉంటాడు. 507 00:38:00,572 --> 00:38:01,657 అది నిజమే. 508 00:38:03,116 --> 00:38:04,117 కానీ మరీ అంత ఎక్కువనా? 509 00:38:04,868 --> 00:38:06,495 ఆయన అంత నిండుగా జీవించాడా? 510 00:38:07,287 --> 00:38:10,207 లేదా మిగతా క్లియాన్ల విషయంలో ఏదైనా మిస్ అవుతోందా? 511 00:38:11,291 --> 00:38:12,292 ఇప్పుడు మనమేం చేద్దాం? 512 00:38:13,794 --> 00:38:18,257 మనకి సరైన అవకాశం వచ్చేలా నేను చేసే దాకా మనం ఏమీ చేయకుండా ఉందాం. 513 00:38:37,234 --> 00:38:38,235 శాల్వార్? 514 00:38:41,572 --> 00:38:42,573 బాగానే ఉన్నావు కదా? 515 00:38:42,573 --> 00:38:43,657 భౌతికంగానా? బాగానే ఉన్నా. 516 00:38:44,908 --> 00:38:48,120 - నువ్వు ఊహించింది నిజమే అయింది. - ఇప్పుడు అనుకొని ఏం లాభం? 517 00:38:49,162 --> 00:38:50,247 నా ఆయుధాలను తీసేసుకున్నారు. 518 00:38:50,247 --> 00:38:52,916 - అంటే మనం బంధీలం అన్నమాట. - ఎవరి బంధీలం, అసలు ఎక్కడ ఉన్నాం? 519 00:38:53,417 --> 00:38:55,502 ఇది జన్యు ఆధారిత వంశం కన్నా ముందే నిర్మితమైన చోటు. 520 00:38:56,461 --> 00:39:01,049 అయిదవ కాండార్ మహారాజు వేసవి విడిది ఇది, క్లియాన్లు దీన్ని పట్టించుకున్నట్లు లేదు. 521 00:39:01,550 --> 00:39:02,843 కాపలాదారులెవరూ లేరు. 522 00:39:02,843 --> 00:39:04,511 ఖైదీలకు కాపలాదారులు లేకపోవడమేంటి! 523 00:39:05,095 --> 00:39:06,430 మీకు కూడా అవి వినిపిస్తున్నాయా? 524 00:39:07,306 --> 00:39:08,724 మనం అటు వైపు వెళ్లాలి. 525 00:39:08,724 --> 00:39:09,808 నాకేమీ వినిపించట్లేదే. 526 00:39:09,808 --> 00:39:13,478 నాకు వినిపిస్తున్నాయి. స్వరాలు. గుసగుసలు. 527 00:39:21,904 --> 00:39:22,905 అవి అక్కడి నుండి వస్తున్నాయి. 528 00:40:05,030 --> 00:40:09,451 నా పేరు టెల్లెం బాండ్. వెలుతురుకు, జ్ఞానానికి, ఎగిరే జీవులకు దేవత అయిన, 529 00:40:09,451 --> 00:40:14,623 అలాగే ఎటర్నిటీకి రెండవ ఛాంబర్ అయిన పాఆకి నేను ఏడవ అవతారాన్ని. 530 00:40:15,290 --> 00:40:20,045 పాఆ మీకు స్వాగతం పలుకుతోంది. ఆమె సంజ్ఞను ఉపయోగించి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. 531 00:40:22,089 --> 00:40:28,387 నేను స్ట్రీలింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన హారి సెల్డన్ ని, తల్లీ. 532 00:40:28,971 --> 00:40:30,013 వీళ్లు నా సహచరులు. 533 00:40:30,013 --> 00:40:32,099 వాళ్లు పరిచయం చేసుకోలేరా? 534 00:40:36,812 --> 00:40:38,689 నేను సినాక్స్ కి చెందిన గాల్ డోర్నిక్ ని. 535 00:40:40,691 --> 00:40:41,859 శాల్వార్. 536 00:40:41,859 --> 00:40:45,404 హారి సెల్డన్, గాల్ డోర్నిక్, ఇంకా టర్మినస్ కి చెందిన శాల్వార్ హార్డిన్, 537 00:40:45,404 --> 00:40:49,366 మీ అందరికీ సుస్వాగతం. 538 00:40:49,366 --> 00:40:50,951 మీరు మా అతిథులు. 539 00:40:51,451 --> 00:40:53,787 ఒక్కోసారి నైవేద్యాలు రివర్సులో ఇవ్వాల్సి రావచ్చు. 540 00:40:53,787 --> 00:40:56,874 దేవుడు మనిషికి నైవేద్యం ఇవ్వడం. 541 00:40:57,416 --> 00:40:59,585 మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు, తల్లీ. 542 00:40:59,585 --> 00:41:01,044 ఆ ఆహారంలో విషం కలపలేదని గ్యారంటీ ఏంటి? 543 00:41:01,670 --> 00:41:05,924 చంపాలనుకుంటే మీరు నిద్రలో ఉన్నప్పుడే చంపి ఉండేదాన్ని. లేపి మరీ విషం పెట్టాలా? 544 00:41:06,550 --> 00:41:08,969 అసలు మాకు స్పృహ లేకుండా చేయాల్సిన అవసరం ఏంటో చెప్పగలరా? 545 00:41:08,969 --> 00:41:12,264 మాది ఎక్కడో మారుమూల ఉండే గ్రహం. ఇక్కడికి సందర్శకులు పెద్దగా రారు. 546 00:41:14,266 --> 00:41:18,896 మీ రాకకు కారణమేంటో తెలుసుకోవాలి కదా. కానీ మీకు బంధీలమనే భావన వచ్చి ఉంటే, 547 00:41:18,896 --> 00:41:20,647 అది ఉన్నంత మాత్రాన క్షేమమని అనిపించేస్తుందా? 548 00:41:20,647 --> 00:41:22,399 ఆయుధం ఉందనే ఆత్మవిశ్వాసమైతే ఉంటుంది కదా. 549 00:41:23,400 --> 00:41:26,153 స్ట్రీలింగ్ కి చెందిన హారి సెల్డన్, నువ్వు దేవతను చూసే చూపులో అనుమానం కనిపిస్తోంది, 550 00:41:26,904 --> 00:41:30,449 క్షమించాలి. ఏంటంటే, సూర్యుడు సరిగ్గా మీ నడినెత్తిపైనే ఉన్నాడు. 551 00:41:31,575 --> 00:41:33,327 పా వెలుతురు దేవత. 552 00:41:33,327 --> 00:41:37,581 అవును. కానీ ఎండ అంత బాగా కాస్తున్నా కూడా 553 00:41:37,581 --> 00:41:39,416 మీ నీడ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. 554 00:41:41,668 --> 00:41:44,713 మీ అవతారం డొల్లగా అనిపిస్తోంది, తల్లీ. 555 00:41:45,297 --> 00:41:48,759 ఇక్కడ ఇన్ ఛార్జీగా ఉన్నవారికి విన్నపం, ఈ నాటకానికి ఇక తెరదింపేయండి. 556 00:41:55,974 --> 00:41:57,976 మీరే అసలైన టెల్లెం బాండ్ అనుకుంటా. 557 00:41:58,477 --> 00:42:00,854 మీరు పసిగట్టేస్తారని ఊహించా, హారి సెల్డన్. 558 00:42:00,854 --> 00:42:04,650 మానసికంగా అదోలా ఉన్నా కానీ, మీ ఇతర భావాలు బాగానే పని చేస్తూ దాన్ని కవర్ చేస్తున్నాయి. 559 00:42:04,650 --> 00:42:08,570 క్షమించాలి, మా గురించి మీకు తెలియకుండా, మీ గురించి తెలుసుకోవాలనుకున్నాను. 560 00:42:09,279 --> 00:42:12,699 మేము ఇంత జాగ్రత్తగా ఎందుకు ఉంటున్నామో, మాతో కొన్ని రోజులు గడిపితే మీకే అర్థమవుతుంది. 561 00:42:14,409 --> 00:42:16,328 ఇంతకీ మా గ్రహానికి మీరు ఎందుకు వచ్చారు? 562 00:42:17,329 --> 00:42:18,330 సిక్త్ సెన్స్ ని అనుసరించి వచ్చాం. 563 00:42:20,332 --> 00:42:22,876 ఎవరో మనల్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీకు కూడా వినిపిస్తోందా? 564 00:42:24,044 --> 00:42:25,045 హా. 565 00:42:25,838 --> 00:42:28,549 మీకు వినిపించింది గొంతేనా? అయితే అది నాదే. 566 00:42:28,549 --> 00:42:31,426 అందరికీ అలానే వినిపిస్తుంది. మేము శరణార్థులం, 567 00:42:31,426 --> 00:42:33,387 మీకు మా స్వాగత సందేశం వినిపించింది. 568 00:42:33,387 --> 00:42:38,600 మీ ఇద్దరూ మాలాంటి వాళ్లే కాబట్టి మీకు వినిపించింది. మీలో భావాలన్నీ ఉన్నాయి. 569 00:42:38,600 --> 00:42:42,312 కొందరు దాన్ని మెంటాలిక్స్ అంటారు, కానీ నేను "దివ్యదృష్టి" అని అంటాను. 570 00:42:42,938 --> 00:42:44,690 ఇక్కడికి మొదట వచ్చింది నేనే. 571 00:42:45,274 --> 00:42:50,112 దివ్యదృష్టి ఉండే ఇతరులకు ఇగ్నిస్ చక్కని ఆవాసం కాగలదని అనిపించింది, అందుకే అందరినీ పిలిచా. 572 00:42:50,737 --> 00:42:55,993 సముద్రంలో ప్రయాణించే నౌకలు లైట్ హౌస్ లా అన్నమాట. కానీ నేను మీ ఇమేజిని వాడాను. 573 00:42:55,993 --> 00:42:59,746 నేను అయిస్కాంతానికి అతుకున్నే ఇనుప వస్తువులని ఊహించుకుంటాను. 574 00:43:00,539 --> 00:43:01,623 లేదా మంటకి దగ్గరగా వెళ్లే పురుగుని. 575 00:43:03,083 --> 00:43:04,168 అంత భయంకరంగా ఆలోచించనులే. 576 00:43:05,586 --> 00:43:12,050 ఏదేమైనా, అందరం ఒకచోటికి చేరుకున్నాక, మనం సురక్షితంగా ఉండగలం, మన బలం కూడా పెరుగుతుంది. 577 00:43:13,260 --> 00:43:16,180 వివిధ రకాల సామర్థ్యాలు, నైపుణ్యాలు గల టెలిపాత్ శక్తి ఉన్న వ్యక్తులం అన్నమాట. 578 00:43:16,180 --> 00:43:18,849 పాపం ఆ చిన్ని దేవత, మీరే కదా. 579 00:43:19,433 --> 00:43:23,854 నా సామర్థ్యాలను చూసి నన్ను దేవతగా భావించారు, ఆ పొరపాటు వల్ల నాకు పిచ్చి పట్టినంత పనైంది. 580 00:43:23,854 --> 00:43:27,316 పిల్లలను దేవతలుగా పూజించవద్దు. అది వాళ్లకి మంచిది కాదు. 581 00:43:28,150 --> 00:43:29,401 చాలా మంది జీవితాలైతే దారుణంగా దెబ్బతిన్నాయి. 582 00:43:29,985 --> 00:43:34,823 వాళ్ల సొంత గ్రహాల్లో వాళ్ల పట్ల క్రూరంగా ప్రవర్తించారు, చంపేలోపు ఎలాగోలా తప్పించుకున్నారు. 583 00:43:36,658 --> 00:43:37,910 లొరాన్ శరీరంపై ఉన్న కాలిన గాయాలను చూడండి. 584 00:43:42,206 --> 00:43:43,373 జోసయ్యా మచ్చని చూడండి. 585 00:43:45,209 --> 00:43:47,419 అదెలా ఉంటుందో మీకు బాగానే తెలుసు కదా, గాల్? 586 00:43:48,170 --> 00:43:50,297 వాళ్లు మిమ్మల్ని చంపేలోపే తప్పించుకొని వెళ్లిపోయారు. 587 00:43:50,923 --> 00:43:53,342 తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగా మీరు పొడిపిచ్చుకున్న మచ్చలను చూడగలుగుతున్నా. 588 00:43:54,676 --> 00:43:58,514 మీకు దివ్యదృష్టి ఉంది, కానీ మీ దేవుడు మిమ్మల్ని చూడలేకపోతున్నాడు. ఆ విషయం భలే గమ్మత్తుగా ఉంది కదా? 589 00:43:59,223 --> 00:44:02,226 మీ దేవుడు చూడలేకపోతున్నా, నేను చూస్తున్నాగా. 590 00:44:03,352 --> 00:44:08,857 ఇక శాల్వార్, మీ వాళ్లు మీ పట్ల ఏమీ పట్టనట్టు ఉంటే, ఎలాగైనా వాళ్లతో కలిసిపోవాలని మీరు ఆరాటపడుతుంటారు. 591 00:44:09,358 --> 00:44:10,609 మీరు మా ఆలోచనలని చదువుతున్నారు. 592 00:44:11,735 --> 00:44:13,737 మీ ఆలోచనలు నాకు పెద్ద కష్టం లేకుండా తెలిసిపోతున్నాయి. 593 00:44:14,988 --> 00:44:18,408 మీరు కోల్పోయినవి. మీరు కోల్పోయిన మనుషులు. 594 00:44:19,993 --> 00:44:23,372 మీ లవర్ ముఖాన్ని వాడుకున్నందుకు మన్నించండి, శాల్వార్. 595 00:44:24,414 --> 00:44:27,626 బయటకి కనబడకున్నా, మీరు చాలా సెంటిమెంటల్. 596 00:44:28,377 --> 00:44:31,380 హా, అతను నన్ను ముద్దాడాడు. దానికి మిమ్మల్ని ఏం చేయాలి? 597 00:44:32,089 --> 00:44:35,968 అలా పెట్టాల్సివస్తుందని నేను ఊహించలేదు. సారీ. 598 00:44:35,968 --> 00:44:39,930 కానీ, సెంటిమెంటల్ అన్నందుకే మీకు ఎక్కువ కోపంగా ఉంది. 599 00:44:40,848 --> 00:44:41,849 మీరు నాకు భలే నచ్చారు. 600 00:44:44,309 --> 00:44:48,897 నా ఆలోచనలలోకి రేయిచ్ రూపంలో వస్తూ ఉంది మీరే కదా. 601 00:44:49,815 --> 00:44:55,112 చనిపోయిన ప్రఖ్యాత హారి సెల్డన్ మనస్సును చదవడం చాలా కష్టం కదా. 602 00:44:56,196 --> 00:44:58,407 మీ చావు గురించి, మళ్లీ ఇలా బతకడం గురించి మిమ్మల్ని ఆలోచింపజేయాలని చూశా, 603 00:44:58,407 --> 00:45:00,909 అలా అయినా ఏం జరిగిందో తెలుసుకోవాలని నా ప్రయత్నం. 604 00:45:00,909 --> 00:45:02,995 మరి ఏం జరిగిందో అర్థం చేసుకోగలిగారా? 605 00:45:03,495 --> 00:45:07,416 లేదు. హారిని చదవడం చాలా కష్టం. 606 00:45:08,000 --> 00:45:09,835 కానీ మీకు ఒక ప్లాన్ ఉందని అర్థమైంది. 607 00:45:10,544 --> 00:45:14,214 ఈ చోటు, ఇంకా దూరదృష్టి ఉన్న నా వాళ్లు మీ ప్లాన్ లో భాగమనే మీరు అనుకుంటున్నారు. 608 00:45:15,507 --> 00:45:18,844 అది నిజం. ఈ చోటు, ఇంకా మీ వాళ్లు నా ప్లాన్ లో భాగమే. 609 00:45:20,721 --> 00:45:23,098 రేపు నా దగ్గరికి రండి, దాని గురించి చర్చించుకుందాం. 610 00:45:24,016 --> 00:45:26,894 మీ అందరిలో చాలా ఆలోచనలు మెదులుతున్నాయి, 611 00:45:27,811 --> 00:45:29,688 కాబట్టి నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. 612 00:45:30,981 --> 00:45:32,649 మా వాళ్లకి విశ్రాంతి అవసరం. 613 00:45:39,198 --> 00:45:42,201 నా మనస్సులో ఉన్నదాన్ని మీరు ఎంతవరకు చదవగలిగారు? 614 00:45:44,244 --> 00:45:45,245 చాలినంత. 615 00:45:54,421 --> 00:45:55,422 ఏంటి సంగతి? 616 00:45:56,798 --> 00:45:57,799 మీ ఉద్దేశం ఇదేనా? 617 00:46:00,260 --> 00:46:01,970 దీన్ని ప్రైమ్ రేడియంట్ అంటారు అనుకుంటా. 618 00:46:02,471 --> 00:46:03,472 హా, ఇదే. 619 00:46:05,516 --> 00:46:07,809 దీని గురించి ఆలోచించకుండా ఉండాలని వాళ్లు పాపం చాలా కష్టపడ్డారు. 620 00:46:09,478 --> 00:46:11,355 దీన్ని దాచమని గాల్ కి హారి చెప్పడం నేను విన్నాను. 621 00:46:19,571 --> 00:46:22,908 అది ఎక్కడుందో కనిపెడతా, ఆ తర్వాత పగలగొట్టేస్తా. 622 00:46:25,077 --> 00:46:27,496 ద్వితీయ ఫౌండేషన్ అనే మాటే లేకుండా చేద్దాం. 623 00:47:28,682 --> 00:47:30,684 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్