1 00:01:06,108 --> 00:01:08,110 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:30,966 --> 00:01:34,261 మన తల్లిదండ్రులు కలవకపోయుంటే, మన జన్మ ఉండేదే కాదు. 3 00:01:35,220 --> 00:01:40,976 నిజానికి, మన తాతల ముత్తాతలు, ముత్తవ్వలు కలవకపోయున్నా కూడా 4 00:01:41,476 --> 00:01:42,853 మన జన్మ ఉండేదే కాదు. 5 00:01:44,938 --> 00:01:49,860 ఈ విశ్వంలోని ప్రతి మనిషి కూడా ఇద్దరు మనుషుల కలయిక ద్వారా పుట్టినవారే, 6 00:01:49,943 --> 00:01:52,779 వాటిని సైకో హిస్టరీ అస్సలు పట్టించుకోదు కూడా. 7 00:02:00,495 --> 00:02:01,747 గుడ్ మార్నింగ్. 8 00:02:04,124 --> 00:02:05,459 ఎందుకలా ముఖం మాడ్చావు? 9 00:02:06,043 --> 00:02:07,419 ఇవాళ జోస్యాన్ని మనం కనులారా చూడవచ్చేమో. 10 00:02:07,503 --> 00:02:10,297 జోస్యమా. ఓరి దేవుడా. 11 00:02:11,715 --> 00:02:14,843 వెళ్లి మన అతిథి సంగతి చూడు. దీన్ని నేను నడుపుతా. 12 00:02:46,333 --> 00:02:49,628 నీకు సౌకర్యంగా ఉన్నట్టు లేదు. ఈ నౌకలో ఇంకో సీటు లేదు, సారీ. 13 00:02:49,711 --> 00:02:51,129 పర్వాలేదులే. 14 00:02:51,213 --> 00:02:55,717 నాకు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది, 15 00:02:55,801 --> 00:02:58,762 డీహైడ్రేట్ చేయబడిన బంగాళా దుంపలున్నాయి… 16 00:03:00,889 --> 00:03:02,516 "రాల్ఫ్ భార్న్స్" కూడా ఉన్నాయి. రాల్ఫ్ భార్న్స్ అంటే ఏంటి? 17 00:03:02,599 --> 00:03:05,727 ఆహార బార్లు. తెస్పిన్ వాళ్లు చేస్తారవి. చాలా బాగుంటాయి. 18 00:03:05,811 --> 00:03:07,312 నేను నా మీద వాంతి చేసుకున్నానా? 19 00:03:07,396 --> 00:03:08,647 అవును. 20 00:03:12,651 --> 00:03:13,861 అది క్లెరిక్ డ్రెస్. 21 00:03:15,612 --> 00:03:17,906 నాకు ఈ రంగు నచ్చదు కానీ, క్లెరిక్ ది అయినా కానీ నేను పట్టించుకోను. 22 00:03:28,250 --> 00:03:31,044 నువ్వు ఒకసారి క్లెరిక్ వేషం వేశావని విన్నానే. 23 00:03:31,128 --> 00:03:33,839 కొద్ది సేపు వేశా. కానీ కొందరి క్లెరిక్స్ కి నిజమైన స్వరూపం అర్థమైపోయి, దొరికిపోయా. 24 00:03:33,922 --> 00:03:35,591 అందరికీ ఆ పదవి దక్కదులే. 25 00:03:35,674 --> 00:03:38,177 అధికారిక వ్యవస్థలోనే ఉండి సేవ చేయాలనేమీ లేదు కదా. 26 00:03:38,260 --> 00:03:41,180 అవును. కానీ అలా కాకుండా అత్యాశపరులను మోసగిస్తూ, ఇష్టమున్నవారితో పడుకుంటూ, 27 00:03:41,263 --> 00:03:42,764 డబ్బు ఖర్చు చేసేసుకోవచ్చు కదా. 28 00:03:42,848 --> 00:03:44,850 అయితే నువ్వు ఊహల్లోనే మంచి పనులు చేస్తావన్నమాట. 29 00:03:48,687 --> 00:03:49,771 ఇంతకీ ఏంటది? 30 00:03:51,773 --> 00:03:52,691 ఇది… 31 00:03:54,651 --> 00:03:56,653 లొక్రీస్ వైన్. 32 00:03:57,654 --> 00:03:59,031 ఇది రెండు శతాబ్దాలకు ముందు తయారైంది, 33 00:03:59,114 --> 00:04:02,201 జియానియన్ తిరుగుబాటుకు పదేళ్ల ముందే చేశారు దీన్ని. 34 00:04:02,284 --> 00:04:04,077 లొక్రీస్ లో ఒక వైపు అంతా ఎండగానే ఉంటుంది, 35 00:04:04,161 --> 00:04:06,330 కాబట్టి అక్కడ పెరిగే ద్రాక్షా పళ్లు ఇంకా తీయగా ఉంటాయి. 36 00:04:07,039 --> 00:04:09,249 ఆ గ్రహాన్ని చాలా కాలం క్రిందటే మహారాజు అణ్వాయుధాల దాడితో నాశనం చేశాడు, 37 00:04:09,333 --> 00:04:13,462 అంటే, ఈ పాతది చాలా అంటే చాలా అరుదైనది, 38 00:04:13,545 --> 00:04:16,548 ఇంకా, నాకు తెలిసి నిజంగా విలువ గల అసలైన లగ్జరీ వస్తువు ఇదే. 39 00:04:16,632 --> 00:04:18,216 రుచి చూశావంటే, ఫ్లాట్ అయిపోతావు, సోదరి. 40 00:04:18,300 --> 00:04:22,387 నేను తాగను. కానీ ఎండ కారణంగా చక్కగా తయారైన వైన్ గురించి వింటుంటే ఆసక్తిగా ఉంది. 41 00:04:23,680 --> 00:04:24,681 ఎందుకు దాన్ని దాచుకుంటున్నావు? 42 00:04:24,765 --> 00:04:26,934 ఏదైనా మంచి సందర్భం వస్తే దీన్ని తాగుదామని వేచి చూస్తున్నాను. 43 00:04:27,434 --> 00:04:30,437 ఇది నా దగ్గర 15 ఏళ్ల నుండీ ఉంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తెరవనే లేదు. 44 00:04:30,521 --> 00:04:32,523 నువ్వు గొప్ప ఆశావాదిలా ఉన్నావు. 45 00:04:33,440 --> 00:04:34,733 సారీ, అలా ఎలా నువ్వు… 46 00:04:34,816 --> 00:04:37,069 పదిహేనేళ్ల పాటు గొప్పది ఏదైనా జరిగినప్పుడు, 47 00:04:37,152 --> 00:04:39,905 -ఇంకా గొప్పది జరుగుతుందని నువ్వు ఆగావు. -బహుశా అంత గొప్పదేమీ జరగలేదేమో. 48 00:04:39,988 --> 00:04:42,407 ఆ గ్రహంలో ఒకవైపంతా ఎప్పుడూ ఎండ కాస్తూనే ఉంటుందని కూడా నువ్వు అన్నావు. 49 00:04:43,575 --> 00:04:45,577 ఆశావాది కాకపోతే, ఒకవైపు అంతా చీకటే ఉండేదని అనేవాడు. 50 00:04:46,745 --> 00:04:49,081 ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో, ఆ వైన్ ని అతనికి కనిపించకుండా దాచు… 51 00:04:50,040 --> 00:04:52,084 మందు వాసన వస్తే చాలు, అతనికి ఇంకేమీ తెలీదు. 52 00:04:53,085 --> 00:04:54,962 -అది మందు వల్ల అన్నమాట. -అది చాలా మందికి ఉండే గుణమే. 53 00:04:55,045 --> 00:04:57,047 నా పేటర్ కి అక్కడ ఓ పబ్ ఉంది. ఫోర్ మూన్స్ దాని పేరు. 54 00:04:57,589 --> 00:05:00,259 -నేను అక్కడ చాలా మందికి మందు సర్వ్ చేశా. -ఇప్పటికీ చేస్తున్నావుగా. 55 00:05:01,969 --> 00:05:03,846 నీ అసలైన పేరు ఏంటి, సోదరి? 56 00:05:03,929 --> 00:05:05,639 నా పేటర్ కి సేటా-తెస్పిన్ మూలాలు ఉన్నాయి. 57 00:05:06,515 --> 00:05:09,393 సాంస్కృతికపరంగా మాది మైనారిటీ వర్గం, మా పేర్లను ఎవరికీ చెప్పం. 58 00:05:09,476 --> 00:05:12,354 సరే, నీ పేరును నేను సరిగ్గా ఊహించి చెప్తే, నీ సూత్రాలను నువ్వు పక్కకు పెట్టేసి, 59 00:05:12,437 --> 00:05:14,022 దీన్ని నాతో కలిసి తాగాలి, సరేనా? 60 00:05:14,690 --> 00:05:17,526 జొర్నేట్, ఔరన్, కావల్కేడ్? 61 00:05:18,235 --> 00:05:19,903 -కావల్కేడ్ అనే పేరు ఉంటుందా? -లేదు, లేదు. 62 00:05:19,987 --> 00:05:25,075 నేను కంగారుపడిపోయాను. బర్మా? కేట్రిన్? ఆగటిష్. 63 00:06:01,987 --> 00:06:05,115 డైరెక్టర్, ఇదుగో హోబర్ మాలో. 64 00:06:05,199 --> 00:06:07,492 సెఫ్ కి నేను తెలుసులే. మేము పాత మిత్రులం. 65 00:06:07,993 --> 00:06:09,620 -మాలో. -ఫాదర్. 66 00:06:10,120 --> 00:06:10,996 కాంస్టన్ట్. 67 00:06:13,415 --> 00:06:16,335 మీ ఇద్దరూ తండ్రీ కూతుళ్లని నేను గ్రహించలేకపోయానే. 68 00:06:17,794 --> 00:06:20,130 మంచి ప్రయోజనం కోసం కూతురినే దారాదత్తం చేశావా! ఇది అవాక్కయ్యే విషయమే మరి! 69 00:06:20,214 --> 00:06:22,132 -వాల్ట్ విషయంలో ఏమైనా పురోగతి ఉందా? -ఏమీ లేదు. 70 00:06:22,216 --> 00:06:24,343 సెల్డన్ జాడే లేదు. మేము దూరాన ఉంటూ అంతా గమనిస్తున్నాం. 71 00:06:24,426 --> 00:06:27,387 ఇతను బ్రిగేడియర్ మాన్లియో, ఇక ఇతను నా విశ్వసనీయ సలహాదారు, కౌన్సిలర్ సట్. 72 00:06:27,471 --> 00:06:29,097 మీరందరూ నాతో రండి. 73 00:06:31,642 --> 00:06:34,144 ఇక అందరం మళ్లీ ప్రాఫెట్ చెంతకు వెళ్దాం పదండి. 74 00:06:34,937 --> 00:06:36,313 భలే ఉత్సాహంగా ఉంది కదూ. 75 00:06:53,914 --> 00:06:56,500 ప్రతీదాని మీద రాయల్ సీల్ ఉంది. 76 00:06:56,583 --> 00:06:59,086 ఈ ఉదయం, అది నా ముఖం మీద కనిపించినట్టు అనిపించింది. 77 00:06:59,169 --> 00:07:00,045 ఒకటి చెప్పనా? 78 00:07:01,171 --> 00:07:04,341 నేను పడుకున్న దిండుపై ఆ ముద్ర ఉంది కాబట్టి ఆ అచ్చు నా ముఖంపై పడింది. 79 00:07:06,677 --> 00:07:10,472 మామూలు మహిళలా ఉంది నీ ముఖం. మేకప్ ఎందుకు వేసుకోలేదు? 80 00:07:10,556 --> 00:07:12,140 సైకలాజికల్ గా పైచేయి సాధిద్దామని. 81 00:07:12,933 --> 00:07:14,434 నేను అన్నీ చెప్పేస్తున్నానని అతనికి అనిపిస్తోంది, 82 00:07:14,518 --> 00:07:16,061 కాబట్టి అతను కూడా నాకు అన్నీ చెప్పేసే అవకాశముంది. 83 00:07:16,144 --> 00:07:20,023 ఎలాగైనా నా కుటుంబం గురించి నిజాన్ని నేను తెలుసుకుంటాను అనుకో. 84 00:07:20,107 --> 00:07:22,943 ముగ్గులో ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు. 85 00:07:23,026 --> 00:07:24,528 వాటిలో ఎక్కువ శాతం నువ్వే నాకు నేర్పావు. 86 00:07:24,611 --> 00:07:27,197 మహారాజు ఎవరినైనా ఉంపుడుగత్తెగా మార్చుకోగలడు. 87 00:07:28,699 --> 00:07:29,700 చివరికి. 88 00:07:36,123 --> 00:07:38,041 రాత్రి రాజు, ఇంకా సలహాదారు రూనా? 89 00:07:39,585 --> 00:07:40,586 ఏంటి? నిన్న రాత్రా? 90 00:07:40,669 --> 00:07:41,712 కాదు, చాలా దశాబ్దాల క్రితం. 91 00:07:42,254 --> 00:07:44,131 అప్పుడు రూ, గొసామర్ కోర్ట్ లో ఉంపుడుగత్తెగా ఉండేది. 92 00:07:44,923 --> 00:07:48,385 శృంగారం కోసం మీ తాతయ్య రూని ఎంచుకున్నాడు, దాంతో అంతా మారిపోయింది. 93 00:07:48,468 --> 00:07:50,804 తను ఇంటికి బాగా డబ్బుతో, పేరుతో వచ్చింది. 94 00:07:51,388 --> 00:07:52,973 అతను నాకు చెప్పే ఉండేవాడే. 95 00:07:53,891 --> 00:07:56,185 ఇంకో విషయం, ఆయన నాకు తాతయ్య కాదు. 96 00:07:56,810 --> 00:07:57,811 సారీ, అవునులే. 97 00:07:59,146 --> 00:08:01,023 మీ దగ్గర అంతా వేరుగా ఉంటుంది కదా, అది ఊరకూరకే మర్చిపోతుంటా. 98 00:08:01,106 --> 00:08:03,358 బయటి నుండి చూస్తే చాలా వింతగా అనిపిస్తుంది. 99 00:08:04,109 --> 00:08:06,153 ఒక్కోసారి అంతర్గతంగా కూడా వింతనే అనిపిస్తుంది. 100 00:08:08,906 --> 00:08:10,032 ఇటు వైపు వెళ్దామా? 101 00:08:10,616 --> 00:08:13,493 అక్కడ చిన్న తోటలా ఉంటుంది. అక్కడ ఎవరూ ఉండరు. 102 00:08:16,079 --> 00:08:18,040 అక్కడికి మీ సహాయకుడిని పిలిపించి అన్నీ పర్యవేక్షించమని చెప్తాం. 103 00:08:19,416 --> 00:08:20,667 అతనికి జాగ్రత్త చాలా ఎక్కువ. 104 00:08:50,113 --> 00:08:54,243 నీకు కావాల్సిన ఏకాంతం దొరికిందిగా. చాలా బాగుంది ఇక్కడ. 105 00:08:57,079 --> 00:08:58,830 ఇప్పుడు నువ్వు అడగాలనుకుంది అడుగుతావా? 106 00:09:03,585 --> 00:09:06,004 హత్యా ప్రయత్నం వెనుక నా హస్తం ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? 107 00:09:06,088 --> 00:09:08,465 అది జరిగిన సమయం చూస్తే అనుమానం కలగవచ్చు కదా. 108 00:09:08,549 --> 00:09:09,800 అవునులే. 109 00:09:10,592 --> 00:09:14,221 నేను అనుమానం వచ్చేంత వెధవతనంగా ప్రవర్తిస్తానని అనుకుంటున్నావా? 110 00:09:14,972 --> 00:09:17,307 -అది నీ పని అయ్యుండకూడదనే నేను కోరుకుంటున్నా. -అది నా పని కాదు. 111 00:09:18,392 --> 00:09:20,143 అదుగో, సమాధానం చెప్పేశాగా. 112 00:09:21,144 --> 00:09:22,813 నేను అబద్ధం చెప్తున్నానో లేదో నువ్వే తేల్చుకో మరి. 113 00:09:25,357 --> 00:09:30,737 అడిగినవాటికి నేను చక్కగా సమాధానాలిస్తూ ఉన్నా కాబట్టి… 114 00:09:35,909 --> 00:09:37,828 నా కుటుంబాన్ని పగటి రాజే చంపించాడా? 115 00:09:38,412 --> 00:09:39,246 లేదు. 116 00:09:43,208 --> 00:09:44,209 రుజువు ఎమైనా ఉందా? 117 00:09:45,669 --> 00:09:46,670 మంచిగానే ప్రతిస్పందించావు. 118 00:09:48,130 --> 00:09:49,548 అందులో నీకు భాగం లేదనే భావిస్తున్నా. 119 00:09:50,132 --> 00:09:51,550 నిజంగానే నాకు భాగం లేదు. 120 00:09:52,050 --> 00:09:55,179 ఒకవేళ అదే జరిగి ఉంటే, కానీ అది జరగలేదని నమ్మకంగా చెప్పగలను. 121 00:09:55,262 --> 00:09:58,682 సాక్ష్యాలన్నీ పక్కాగా ఏమీ లేవు. 122 00:09:59,349 --> 00:10:02,102 కానీ ఒకసారి నేను చెప్పేదాని గురించి ఆలోచించు. 123 00:10:03,645 --> 00:10:05,814 సింహాసనం నాకు దక్కే అవకాశాం చాలా తక్కువ ఉండింది. 124 00:10:07,065 --> 00:10:10,277 సింహాసనానికి నా ముందున్న వారసుల్లో ఒక్కరు కూడా 125 00:10:10,360 --> 00:10:11,612 ఈ సంబంధం పెట్టుకుని ఉండేవారు కాదు. 126 00:10:13,280 --> 00:10:17,075 కానీ విచిత్రంగా ఒక దుర్ఘటన జరగగానే సింహాసనం నాది అయింది. 127 00:10:19,119 --> 00:10:24,666 బలహీన స్థితిలో ఉన్న డొమీనియన్ ని అత్యంత బలహీనమైన నేను పాలిస్తున్నాను, 128 00:10:26,001 --> 00:10:28,212 అది కూడా సామ్రాజ్యం చుట్టూ శత్రువులు మూగి ఉన్న సమయంలో 129 00:10:28,295 --> 00:10:31,673 పగటి మహారాజు ఎలాగైనా అన్నీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్న సమయంలో. 130 00:10:34,718 --> 00:10:36,261 కానీ దాని వల్ల లాభపడ్డవాళ్లు కూడా ఉన్నారు కదా. 131 00:10:37,554 --> 00:10:39,348 ఉదాహరణకు మీ సలహాదారు రూనే తీసుకుందాం, 132 00:10:39,431 --> 00:10:42,392 ఆమె ఉంపుడుగత్తె స్థాయి నుండి కాబోయే మహారాణికి కుడి భుజం స్థాయికి ఎదిగింది కదా. 133 00:10:43,018 --> 00:10:45,103 ఇతర అనుమానితులు కూడా చాలా మందే ఉంటారు. 134 00:10:45,687 --> 00:10:48,398 కానీ నాకు భర్త కాబోయే వ్యక్తి అది చేసుంటాడా లేదా అని తెలుసుకోవాలనుంది. 135 00:10:52,402 --> 00:10:53,487 అంటే, నా ఉద్దేశం… 136 00:10:55,656 --> 00:10:56,740 అంటే… 137 00:10:58,450 --> 00:11:00,869 నువ్వు అలా చేయగలవని నీకు అనిపిస్తోందా? 138 00:11:02,454 --> 00:11:07,334 అంటే, మీరందరూ ఒకే వ్యక్తి అని అనుకుంటున్నాం కదా. 139 00:11:09,461 --> 00:11:10,712 నేనైతే అలా చేయగలిగి ఉండేవాడిని కాదు. 140 00:11:12,798 --> 00:11:14,258 కానీ వయస్సుతో పాటు మార్పులు జరిగే అవకాశముంది. 141 00:11:15,133 --> 00:11:18,262 నాకు కూడా ఆ వయస్సు వచ్చాక, నేను కూడా అలా చేయవచ్చనే అనుకుంటా. 142 00:11:23,058 --> 00:11:26,520 కాకపోతే, నీ గురించి తెలియక ముందు, నువ్వు నాకు నచ్చక ముందు అయితే… 143 00:11:29,064 --> 00:11:30,274 అలా చేయగలిగి ఉండేవాడినేమో. 144 00:11:33,777 --> 00:11:35,070 నాకు కూడా నువ్వు నచ్చావు. 145 00:11:38,907 --> 00:11:41,118 నీ నిజాయితీ నాకు నచ్చింది. 146 00:11:44,246 --> 00:11:46,081 మనిద్దరం ఎల్లప్పుడూ ఒకరికొకరితో ఇలా నిజాయితీగానే ఉందాం. 147 00:11:54,548 --> 00:11:58,093 నా కుటుంబంలో నేనే బలహీనమైనదాన్ని అని భావించి, నన్ను తన స్వార్థం కోసం వాడుకోవాలని పగటి రాజు కనుక చూస్తుంటే, 148 00:11:58,677 --> 00:11:59,678 అతను పప్పులో కాలేసినట్టే. 149 00:12:01,305 --> 00:12:05,225 మా విచిత్రమైన చిన్న కుటుంబంలో నువ్వు కూడా భాగం అవ్వడం భలే గమ్మత్తుగా ఉంటుంది. 150 00:12:07,102 --> 00:12:10,898 మీరందరూ ఒకే వ్యక్తి కాబట్టి, 151 00:12:12,441 --> 00:12:14,443 వాళ్లు మనిద్దరికీ పెళ్లి చేయాలని ఎందుకు అనుకోలేదని ఎప్పుడైనా అనిపించిందా? 152 00:12:16,278 --> 00:12:17,404 మనిద్దరి ఈడూ జోడూ బాగుంది. 153 00:12:40,802 --> 00:12:42,513 మీ చిత్రాలని చూస్తూ మైమరచిపోతున్నా. 154 00:12:43,472 --> 00:12:47,142 పాత విభాగాలను కూడా చూశా. అక్కడ కూడా మీ హస్తం ఉంది. 155 00:12:47,226 --> 00:12:49,728 రంగు పోయిన చోట, నా పనితనం చూపుతున్నాను, అంతే. 156 00:12:50,354 --> 00:12:54,274 ఆ రోజుల్లో, అసలైన డొమీనియన్ రంగులని వాడేవారు కాదు, వాటిని మీరు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. 157 00:12:54,358 --> 00:12:56,318 అది నీ సలహానే అయ్యుంటుంది. 158 00:12:56,401 --> 00:12:57,903 నేను సలహాలిస్తాను అంతే. 159 00:12:57,986 --> 00:13:00,405 మీరు చేసింది రంగులకు మెరుగులు దిద్దడం మాత్రమే కాదు. 160 00:13:01,073 --> 00:13:03,742 గత అయిదు తరాల వారు రంగులను ప్రస్ఫుటంగా కనబడేలా గీశారు, 161 00:13:03,825 --> 00:13:07,162 మీరు దిద్దిన మెరుగుల వల్ల, వారి పనికి మరింత అందాన్ని జత చేసినట్టు అయింది. 162 00:13:07,246 --> 00:13:09,790 కనీసం అంత బాగాలేని వాటిని కవర్ అయినా చేస్తున్నారు మీరు. 163 00:13:10,415 --> 00:13:12,167 నేను చాలా ముందుగానే ఈ పని ప్రారంభించాను. 164 00:13:13,460 --> 00:13:15,754 పగటి రాజుగా ఉన్నప్పుడే ఈ విభాగాన్ని పెయింట్ చేశాను. 165 00:13:16,880 --> 00:13:19,258 "ఒక పనిలా చేయడం ఎందుకు, ఇష్టంగా చేస్తే బాగుంటుంది కదా," 166 00:13:19,341 --> 00:13:22,052 అనే ఆలోచన వచ్చింది. 167 00:13:29,810 --> 00:13:32,563 ఈ కుడ్య చిత్రాలు మారినంతగా గొసామర్ కోర్ట్ ఏమంతగా మారలేదు. 168 00:13:32,646 --> 00:13:33,564 అస్సలు మారలేదని చెప్పవచ్చు. 169 00:13:34,106 --> 00:13:35,649 అది 30 ఏళ్ల క్రిందటి మాట అయ్యుండవచ్చు. 170 00:13:35,732 --> 00:13:39,152 కానీ నువ్వు ఇంకా అంతే అందంగా ఉన్నావు. 171 00:13:39,236 --> 00:13:40,654 అయితే నేను పడుకున్నది మీతోనేనా? 172 00:13:41,613 --> 00:13:43,824 నేనెంత మంది క్లియాన్లతో పడుకున్నానో మర్చిపోయా. 173 00:13:43,907 --> 00:13:46,702 లేదు, పడుకున్నది నేనే. పదహారవ క్లియాన్ ని. 174 00:13:46,785 --> 00:13:47,828 థ్యాంక్యూ మరి. 175 00:13:48,620 --> 00:13:52,124 ఎంచుకోబడిన దాన్ని అయ్యాక, రాజకీయపరంగా బాగా ఎదిగాను, అది మీకు తెలుస్తోంది కదా. 176 00:13:54,668 --> 00:13:55,669 రూ. 177 00:13:59,673 --> 00:14:04,052 జ్ఞాపకాలు తొలగించిన తర్వాత నేనెవరితోనూ మాట్లాడలేదు. 178 00:14:04,720 --> 00:14:05,804 పరిస్థితులు మారిపోతున్నాయి కదా మరి. 179 00:14:06,847 --> 00:14:09,725 మీరు చివరి రాత్రి రాజు, ఇంకా తొలి క్లియాన్ తాతయ్య కావచ్చేమో. 180 00:14:10,475 --> 00:14:12,477 ఒకవేళ పెళ్లి జరిగితేనే కదా. 181 00:14:13,312 --> 00:14:15,480 అవును. 182 00:14:15,564 --> 00:14:19,151 పగటి రాజుకు, ఇంకా నాకు తప్ప ఈ సంబంధం ఎవరికీ పెద్దగా ఇష్టం ఉన్నట్టు లేదు. 183 00:14:20,402 --> 00:14:22,821 కానీ, కీలకమైన ఓట్లు మా ఇద్దరికే ఉన్నాయిగా. 184 00:14:23,614 --> 00:14:24,907 మహారాణికి లేవా? 185 00:14:24,990 --> 00:14:28,535 తనకి నేను ఎంత చెప్తే అంతే, కానీ మీరన్నది నిజమే. 186 00:14:29,369 --> 00:14:32,789 తను స్వతంత్ర మహిళ. వెధవల సావాసం తనకి అస్సలు నచ్చదు. 187 00:14:33,290 --> 00:14:35,375 మహారాజుకు జ్ఞానం వయస్సు పెరిగే కొద్దీ వస్తుంది. 188 00:14:35,459 --> 00:14:39,963 ఉదాహరణకు, మనం చివరిసారి కలిసినప్పుడు కన్నా ఇప్పుడు నేను చాలా తెలివిమంతుడిని. 189 00:14:40,047 --> 00:14:41,423 నాకు గుర్తుండదుగా. 190 00:14:42,299 --> 00:14:44,009 అయ్యయ్యో, అది దారుణం. 191 00:14:45,177 --> 00:14:48,972 మనం చక్కగా ముచ్చట్లాడుకొని, పడక సుఖాన్ని తనివితీరా ఆస్వాదించాం. 192 00:14:49,473 --> 00:14:50,849 మంచి విషయమేగా అది. 193 00:14:50,933 --> 00:14:54,353 మేము రికార్డింగులను ఉంచుకుంటాం. కావాలనుకుంటే మనిద్దరం కలిసి వాటిని చూడవచ్చు. 194 00:14:54,436 --> 00:14:56,480 నా రూమ్ లో ప్రైవేట్ గా చూడవచ్చు. 195 00:14:58,899 --> 00:15:00,984 ఈ కొత్త జ్ఞాపకాలను నేను ఉంచుకోవచ్చా? 196 00:15:01,777 --> 00:15:03,153 తప్పకుండా. 197 00:15:07,658 --> 00:15:11,078 మనం జత కలిసి మన జాతిని వృద్ధి పరుస్తాం, అలా అనే మనకి బోధించారు. 198 00:15:11,870 --> 00:15:13,872 గెలాక్సీ అంతటి స్థాయిలో చూసినప్పుడు… 199 00:15:13,956 --> 00:15:14,957 సివెన్నా 200 00:15:15,040 --> 00:15:17,209 …ప్రేమ అనేది పెద్ద ముఖ్యమైనదిగా అనిపించదు. 201 00:15:28,262 --> 00:15:29,388 ఎట్ ఈజ్. 202 00:15:34,351 --> 00:15:35,853 స్టేటస్ ఏంటో చెప్పండి, ఆఫీసర్ క్రెస్. 203 00:15:35,936 --> 00:15:36,937 సరే, జనరల్. 204 00:15:37,479 --> 00:15:42,526 జియోసింక్, జీరో ఇంక్లినేషనులో ఉంది, మనం ప్రస్తుతం 40,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాం. 205 00:15:42,609 --> 00:15:45,445 ప్రారంభ దశలో ఉన్న నాగరికత ఇక్కడ ఉంది, ఎక్కువ వ్యవసాయం చేసుకొనేవాళ్ళే. 206 00:15:46,530 --> 00:15:49,700 ఉపగ్రహాలు లేవు, ఎలక్ట్రానిక్ ఫ్రీక్వెన్సీ ఆనవాలు కూడా లేవు. 207 00:15:50,367 --> 00:15:52,160 మనం ఇక్కడ ఉన్నామని ఇక్కడి వారికి తెలిసి కూడా ఉండదు. 208 00:15:52,244 --> 00:15:56,123 మంచిది. గెలాక్సీ అంచు భాగానికి, అధికారికంగా ఇంపీరయమ్ వచ్చి 209 00:15:56,206 --> 00:15:57,249 ఒక శతాబ్దానికి పైగానే అయింది. 210 00:15:58,083 --> 00:16:00,711 ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామని చెప్పి, హడావాడి వాతావరణం సృష్టించే ఉద్దేశం నాకు లేదు. 211 00:16:00,794 --> 00:16:02,462 దిగడానికి షటుల్ ని, దానికి సిబ్బందిని సిద్ధం చేయమంటారా, సర్? 212 00:16:03,297 --> 00:16:06,967 షటుల్ అక్కర్లేదు, ఆఫీసర్ కర్, అవసరమైతే తర్వాత చెప్తానులే. 213 00:16:07,551 --> 00:16:09,678 తుఫాను ముసుగులో ప్రయాణిస్తాం. 214 00:16:10,262 --> 00:16:12,347 ఇంజినీరింగ్ శాఖ ఒక ఎక్స్ ట్రాక్షన్ ప్యాకెట్ ని విడుదల చేస్తాయి, 215 00:16:12,431 --> 00:16:14,641 ఆ తర్వాత మేము మన ఇన్ఫార్మరును సంప్రదిస్తాం. 216 00:16:14,725 --> 00:16:19,646 ఈ మాంత్రికుల వల్ల నిజంగానే మనకి ప్రమాదం ఉంటే, అతనికి తెలుస్తుంది. 217 00:16:19,730 --> 00:16:21,064 అంతే, సర్. 218 00:16:40,709 --> 00:16:42,669 ఎక్స్ ట్రాక్షన్ ప్యాకెట్ ని విడుదల చేస్తున్నా. 219 00:16:42,753 --> 00:16:44,046 సిద్దంగానే ఉన్నా. నన్ను ల్యాండ్ చేయవచ్చు. 220 00:16:44,129 --> 00:16:47,341 లాంచ్ చేస్తున్నాను, మూడు, రెండు, ఒకటి. 221 00:17:29,508 --> 00:17:30,509 గ్లే? 222 00:17:42,145 --> 00:17:43,313 బెల్! 223 00:17:48,235 --> 00:17:50,612 సారీ. ఎక్కడో దిగా. 224 00:18:01,331 --> 00:18:05,210 మనం ఎక్స్ ట్రాక్షన్ ప్యాకెట్ ని కనిపెట్టాలి. ఇన్ఫార్మర్ దగ్గరకి వెళ్లాలి. 225 00:18:05,294 --> 00:18:07,171 ప్యాకెట్ ఇక్కడి నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. 226 00:18:11,675 --> 00:18:12,885 దాన్ని ఎవరో తీసుకెళ్తున్నట్టున్నారు. 227 00:18:15,304 --> 00:18:18,473 ఎక్స్ ట్రాక్షన్ ప్యాకెట్ 228 00:18:46,877 --> 00:18:49,671 వారిని తక్కువ అంచనా వేయకు, ఆయుధాలు ఉన్నాయి, పైగా మొరటువాళ్లు వీళ్లు. 229 00:18:57,429 --> 00:18:58,639 నమస్తే. 230 00:19:00,933 --> 00:19:01,934 హాని తలపెట్టే ఉద్దేశం మాకు లేదు. 231 00:19:13,695 --> 00:19:15,989 మా వస్తువు ఒకటి మీ దగ్గర ఉంది. 232 00:19:16,073 --> 00:19:20,452 ఇప్పుడు అది మీకు చెందినది కాదు. ఇది ఇప్పుడు మాది, దీన్ని అమ్ముకుంటాం. 233 00:19:20,536 --> 00:19:25,082 సరే మరి. సివెన్నాదే పైచేయి. మీకు ఎంత కావాలో చెప్తే, ఇచ్చేస్తాం! 234 00:19:28,836 --> 00:19:32,047 మనకి ఎంత కావాలట? చూద్దాం! 235 00:19:33,131 --> 00:19:35,759 నీ పళ్లు చాలా బాగున్నాయి, అవి ఆరు ఇవ్వు, ఏమంటావు? 236 00:19:37,177 --> 00:19:41,306 సివెన్నాలో ఎవరికీ అలాంటి పళ్లు లేవు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? 237 00:19:41,390 --> 00:19:42,683 జెన్నిసెక్. 238 00:19:42,766 --> 00:19:43,934 నమ్మకు. 239 00:19:44,017 --> 00:19:46,228 ఇంపీరియల్ వస్తువులు ఉన్నప్పుడు అస్సలు నమ్మకూడదు. 240 00:19:46,311 --> 00:19:47,729 మాకు ఏ సమస్యలూ వద్దు. 241 00:19:48,730 --> 00:19:51,066 అతను అన్నాడు కదా, మేము డబ్బులివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 242 00:19:51,149 --> 00:19:52,818 " మేము డబ్బులిస్తాం." 243 00:19:54,903 --> 00:19:56,113 అది జరగని పని, పరదేశీ. 244 00:19:59,324 --> 00:20:02,202 సామ్రాజ్యానికి చెందిన చవటలు రక్తం చిందించాల్సిందే. 245 00:20:06,248 --> 00:20:07,291 బెల్! 246 00:20:14,131 --> 00:20:15,257 ఇక చాలు! 247 00:20:15,924 --> 00:20:18,093 మా వస్తువును మాకు ఇచ్చేయండి! ఈమెని మేము ఏమీ చేయకుండా వదిలేస్తాం. 248 00:20:19,887 --> 00:20:21,430 ఏడిచావులే పోరా! 249 00:20:26,059 --> 00:20:27,477 అబ్బా! 250 00:21:09,645 --> 00:21:12,314 అయ్య బాబోయ్. వాడు మరింత మందిని తీసుకొని వస్తాడు. 251 00:21:12,397 --> 00:21:14,691 మనం ఇన్ఫార్మర్ దగ్గరికి త్వరగా చేరుకోవాలి. 252 00:21:25,911 --> 00:21:27,871 దేవుడా. భలే కిక్కు వచ్చింది. 253 00:21:27,955 --> 00:21:29,623 అవును, నీ ముఖం చూస్తేనే తెలిసిపోతోందిలే. 254 00:21:29,706 --> 00:21:32,042 ఇలా రా. ఎంత రక్తం వచ్చిందో చూడు. 255 00:21:32,543 --> 00:21:35,295 సరే, కొట్టాక మంచి ఫీలింగ్ వచ్చింది. నిజం ఒప్పుకుంటున్నాలే. 256 00:21:35,379 --> 00:21:36,588 సరే, కానీ అది అవసరమా? 257 00:21:37,214 --> 00:21:38,715 రక్తం చిందించకుండా పని ముగించుకొని ఉండవచ్చు. 258 00:21:39,508 --> 00:21:40,509 కానీ అలా జరగలేదుగా. 259 00:21:40,592 --> 00:21:43,595 హా, అలా ఎందుకంటే, నువ్వు నన్ను చూడకుండా, సంజ్ఞ చేయకుండానే 260 00:21:43,679 --> 00:21:44,972 వాళ్ల మీదికి దూకేశావు. 261 00:21:45,055 --> 00:21:48,308 మనం పని చేసే విధానం అదే కదా! ఉన్నట్టుండి ఆమె ముక్కుని పగలగొట్టేశావు. 262 00:21:48,934 --> 00:21:50,727 కొత్త ట్రిక్స్ నేర్చుకున్నానేమో. 263 00:21:56,108 --> 00:21:59,111 -అబ్బా! -మహారాజు నీపై ప్రతికూల ప్రభావమే చూపాడుగా. 264 00:22:02,114 --> 00:22:05,617 బెల్, వాళ్లు నిన్ను వాళ్లకి నచ్చినప్పుడు ఆయుధంలా వాడుకుంటున్నారు, 265 00:22:05,701 --> 00:22:08,579 -ఆ అవకాశం నువ్వు వాళ్లకి ఇవ్వకూడదు! -అబ్బా, గ్లె. చెప్పా కదా, నన్ను నన్నులా ఉండనివ్వు! 266 00:22:10,956 --> 00:22:11,957 కానివ్వు. 267 00:22:14,251 --> 00:22:18,297 నేనేం చెప్తున్నానంటే, దేన్ని అయినా దారుణమైన పని అని నువ్వు గ్రహించేలోపే, 268 00:22:19,464 --> 00:22:21,508 దానిలో నీకూ భాగం ఉందని తేలిపోతుంది. 269 00:22:22,593 --> 00:22:23,760 నోర్మూసుకొని నడువు! 270 00:22:54,583 --> 00:22:56,376 ఏంటది? 271 00:22:56,877 --> 00:22:57,961 వాల్ట్ నీ కోసం అడిగింది. 272 00:22:58,837 --> 00:22:59,880 బాబోయ్. 273 00:22:59,963 --> 00:23:00,964 హోబర్ మాలో 274 00:23:02,299 --> 00:23:05,302 అది కాదు పోలీ! ఇది ఇలా పని చేయదు కదా. 275 00:23:05,385 --> 00:23:08,180 చెప్తున్నా కదా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. 276 00:23:08,263 --> 00:23:10,891 కానీ నువ్వు ఎంత పిస్తావి అయితే నీ పేరు చెక్కి నీకు ఆహ్వానం అందుతుంది చెప్పు! 277 00:23:10,974 --> 00:23:12,601 అది ఆహ్వానం అని మనకి పక్కాగా తెలీదు కదా. 278 00:23:13,310 --> 00:23:15,270 వార్డెన్ కి జరిగింది చూశాక, ఆ అనుమానం తప్పక వస్తుంది మరి. 279 00:23:16,146 --> 00:23:17,481 హా? 280 00:23:21,693 --> 00:23:22,819 అది ఒక వ్యక్తి బూడిదనా? 281 00:23:28,617 --> 00:23:30,035 -అయ్య బాబోయ్. -మనం అతనికి ముందే చెప్పుండాల్సింది. 282 00:23:30,118 --> 00:23:32,663 ఏంటి? ఒక వ్యక్తి కాలి బూడిదైన విషయమా? అది మీరు తప్పకుండా చెప్పుండాల్సింది! 283 00:23:32,746 --> 00:23:35,832 -అప్పుడు నువ్వు వచ్చుండేవాడిని కాదు. -అవును. వచ్చుండేవాడిని కాదు. 284 00:23:35,916 --> 00:23:38,293 ఆశావాదంతో నిండిన నీ మనస్సు ఏమైపోయింది, హోబర్? 285 00:23:39,419 --> 00:23:41,380 వాల్ట్ నిన్నేమీ చేయదు. అది నీ కోసమే అడిగింది. 286 00:23:41,463 --> 00:23:45,008 నన్ను చంపడానికి నన్ను తీసుకురమ్మని అడిగిందేమో? హా? 287 00:23:46,802 --> 00:23:50,764 లేదు. లేదు మీది బూటకపు మతం, 288 00:23:51,348 --> 00:23:54,810 మీ పిచ్చి మతానికి ఇంకెవరినైనా బలి ఇచ్చుకోండి, నేను మాత్రం ఈ పని చేయను. 289 00:23:56,186 --> 00:24:00,065 అయ్య బాబోయ్. అయ్య బాబోయ్! 290 00:24:05,988 --> 00:24:08,866 -నీ పద్ధతిలో చేస్తే ఏమైందో చూశావుగా. -ఇది నా తప్పని అంటున్నావా? 291 00:24:08,949 --> 00:24:12,035 మనం హోబర్ మాలోని ఎలాగైనా తెచ్చేవాళ్లమే. మన భవిషుత్తు ముందే లిఖించబడింది! 292 00:24:12,119 --> 00:24:13,120 మిత్రులారా? 293 00:24:14,162 --> 00:24:16,123 రండి మీ ఇద్దరూ కూడా. మనం హోబర్ కి సాయపడాలి! 294 00:24:18,584 --> 00:24:19,668 నేనొక్కదాన్నే వెళ్లాలన్నమాట అయితే. 295 00:24:31,180 --> 00:24:32,890 నువ్వు కూడా వస్తున్నావా? 296 00:24:32,973 --> 00:24:37,269 నేను పాలన చూసుకోవాలి కదా. 297 00:24:49,031 --> 00:24:50,073 హోబర్? 298 00:24:52,701 --> 00:24:53,785 హోబర్? 299 00:24:55,120 --> 00:24:56,121 విచిత్రంగా ఉందే. 300 00:24:57,122 --> 00:24:58,165 ఇక్కడ నా గొంతు బిగ్గరగా వినిపిస్తోంది. 301 00:25:06,215 --> 00:25:07,466 నిజంగానే గొంతు బిగ్గరగా వినిపిస్తోంది. 302 00:25:09,051 --> 00:25:10,677 ఇంతకీ హోబర్ ఎక్కడ? 303 00:25:10,761 --> 00:25:11,970 హోబర్? 304 00:25:15,474 --> 00:25:16,975 -హోబర్? -కాంస్టన్ట్! 305 00:25:19,102 --> 00:25:22,231 -ఏమైంది నీకు? -నీళ్ళు ఉన్నాయా? 306 00:25:23,023 --> 00:25:24,233 ఇవ్వు, ఇవ్వు. చాలా దాహంగా ఉంది. 307 00:25:25,234 --> 00:25:27,528 రెండు రోజులు అయింది! రాకుండా గాడిదలు కాస్తున్నారా? 308 00:25:27,611 --> 00:25:30,322 రెండు రోజులా? రెండు నిమిషాలేగా అయింది. 309 00:25:35,994 --> 00:25:37,538 చెప్తున్నా కదా, రెండు రోజులైంది. 310 00:25:37,621 --> 00:25:40,999 తిరుగుతూనే ఉన్నాను. ఎంత తిరిగినా ఇక్కడ ఏం తెలీట్లేదు. 311 00:25:41,083 --> 00:25:43,043 ఇక్కడ కూడా సమయం గడిచే తీరు వేరుగా ఉంటుందేమో. 312 00:25:43,126 --> 00:25:45,087 మనం బయటకు వెళ్లి అవసరమైన సామాన్లు తెచ్చుకోవాలి. 313 00:25:45,170 --> 00:25:48,841 బాబోయ్. రాల్ఫ్ బార్న్ ఉందిగా. 314 00:25:53,679 --> 00:25:55,013 సెల్డన్? 315 00:25:57,266 --> 00:25:58,267 నాన్నా? 316 00:25:59,560 --> 00:26:02,813 పాలన, పాలించాలి అని ఏదో అన్నావు కదా, డైరెక్టర్? 317 00:26:05,941 --> 00:26:07,317 సట్ ని ఇన్ ఛార్జ్ గా పెట్టొచ్చా. 318 00:26:08,026 --> 00:26:10,571 నువ్వు కూడా మాతో చేతులు కలిపినందుకు ఆనందంగా ఉంది. 319 00:26:10,654 --> 00:26:11,905 అయ్య బాబోయ్. 320 00:26:12,823 --> 00:26:16,076 నేను వాల్ట్ యొక్క మృత్యు కిరణాన్ని ఆపానో లేదో, ఎవరు పడితే వారు లోపలికి వచ్చేస్తున్నారు. 321 00:26:16,159 --> 00:26:18,245 కాస్త మర్యాదగా మాట్లాడరా సన్నాసి. 322 00:26:18,328 --> 00:26:23,000 మనం హారి సెల్డన్ సృష్టించిన అద్భుతమైన గణిత ప్రపంచంలో ఉన్నాం. 323 00:26:25,252 --> 00:26:29,256 హా. అటు వెళ్లకండి. అక్కడ టాయిలెట్ వెళ్లా. 324 00:26:32,259 --> 00:26:36,054 సరే. ఇలా వెళ్దాం పదండి. 325 00:27:07,669 --> 00:27:10,589 వావ్. ఇక్కడ అడుగుపెడితే తప్పిపోతామేమో. 326 00:27:11,423 --> 00:27:13,008 మనం తప్పిపోయే ఉన్నాం. 327 00:27:23,185 --> 00:27:24,228 మీకు సంగీతం వినబడుతోందా? 328 00:27:46,416 --> 00:27:47,793 అది ఇటు వైపు నుండి వస్తోంది. 329 00:28:13,318 --> 00:28:16,989 ఏమైనా తినండి. మీకు ఆకలిగా ఉండుంటుంది. 330 00:28:17,739 --> 00:28:18,991 ప్రాఫెట్. 331 00:28:22,286 --> 00:28:23,871 ఇక్కడ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? 332 00:28:23,954 --> 00:28:25,622 లైబ్రరీ ఎక్కడి నుండి వచ్చింది? 333 00:28:27,541 --> 00:28:30,586 వాల్ట్ మాలిక్యూల్స్ ని మార్చగలదు. 334 00:28:31,587 --> 00:28:35,382 అన్నీ మాలిక్యూల్సే కదా, ఆహారంతో సహా. 335 00:28:35,465 --> 00:28:38,260 వాల్ట్ తయారు చేస్తోందంటే, వాటిని మీ దేహం నుండే తీసుకొని తయారు చేయాలి. 336 00:28:40,846 --> 00:28:42,848 -డాక్టర్ సెల్డన్. -డైరెక్టర్ సెర్మక్. 337 00:28:43,807 --> 00:28:48,562 నిన్ను చూస్తుంటే అవకాశాన్ని సద్వినియోగపరుచకొని శిఖరాగ్రానికి చేరుకోగల వ్యక్తిలా అనిపిస్తున్నావు. 338 00:28:48,645 --> 00:28:50,439 సూట్ కూడా చాలా బాగుందే. 339 00:28:50,522 --> 00:28:51,773 నేనేమీ… నేను… 340 00:28:51,857 --> 00:28:53,650 ధన్యవాదాలు, ప్రాఫెట్. 341 00:28:54,151 --> 00:28:59,323 నేను కాంస్టన్ట్ సోదరిని. డైరెక్టర్ కూతురిని. మీ గురించి ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాను. 342 00:28:59,406 --> 00:29:02,910 మీ వేషధారణ చూస్తుంటే, ఫౌండేషన్ లో మతం ప్రవేశించినట్టుగా అనిపిస్తోంది. 343 00:29:04,453 --> 00:29:07,831 నిన్ను కలవడం చాలా బాగుంది, విధేయ పుత్రికా. 344 00:29:15,672 --> 00:29:16,798 పోలీ వెరిసోఫ్. 345 00:29:17,466 --> 00:29:19,009 పోలీ వెరిసోఫ్… 346 00:29:20,761 --> 00:29:21,762 ఆ అబ్బాయివి నువ్వేనా? 347 00:29:23,096 --> 00:29:25,265 నువ్వు మొన్నేగా చిన్నపిల్లాడిలా ఉన్నావు. 348 00:29:26,350 --> 00:29:28,810 నువ్వు కూడా సేవలో ఉన్నట్టున్నావుగా… 349 00:29:28,894 --> 00:29:31,146 మీరేమని పిలుస్తారు? చర్చికా? లేకపోతే… 350 00:29:31,230 --> 00:29:33,398 మేము సేవలో ఉన్నాం. నేను కూడా. 351 00:29:33,899 --> 00:29:36,318 మంచి వాడివి. నిజంగానే చెప్తున్నా. 352 00:29:36,902 --> 00:29:39,780 మీరు మమ్మల్ని ట్రాంటార్ కి తరలించేశారమో అనుకున్నా. 353 00:29:40,447 --> 00:29:44,409 మేము ఒక టెసెరాక్ట్ లోపల ఉన్నాం కదా? నాలుగు డైమెన్షన్ల వస్తువు లోపల. 354 00:29:44,493 --> 00:29:48,622 మూడు డైమెన్షన్ల స్పేస్ లో, నాలుగు డైమెన్షన్ల వస్తువులో ఉన్నాం. నువ్వు సరిగ్గానే చెప్పావు, పోలీ. 355 00:29:49,873 --> 00:29:53,585 అంటే, నువ్వు హోబర్ మాలోవి అయ్యుండాలి. 356 00:29:55,337 --> 00:29:57,923 నీ సంచారాల ద్వారా కొన్ని విషయాలు నాకు తెలిశాయి. 357 00:29:59,007 --> 00:30:05,681 చనిపోయిన తాతలకు, అమ్మానాన్నలకు ప్రార్థనలు, ఎంత మందితో పడితే అంత మందితో శృంగారం. 358 00:30:06,974 --> 00:30:10,143 హా, నేను సంచారం చేసేటప్పుడు ఇలా ఆహార మాలిక్యూల్స్ ని నా కోసం పంపించవచ్చు కదా? 359 00:30:11,186 --> 00:30:12,604 నీ దేహం ద్వారా తయారైన ఆహారం బాగుంది. 360 00:30:13,480 --> 00:30:14,314 క్షమించాలి. 361 00:30:14,898 --> 00:30:17,568 భౌతికపరమైన అవసరాలకు నేను అతీతుడిని అయిపోయాను. 362 00:30:17,651 --> 00:30:19,528 ఇక సమయం… 363 00:30:21,613 --> 00:30:23,073 అది ఇక్కడ చాలా వేగంగా గడుస్తుంది. 364 00:30:23,699 --> 00:30:25,450 అదీగాక, నాకు కావాల్సింది నువ్వు ఒక్కడివే కాదు. 365 00:30:27,744 --> 00:30:29,162 నాకు మీరందరి సాయమూ కావాలి. 366 00:30:30,289 --> 00:30:31,540 దేనికి? 367 00:30:31,623 --> 00:30:33,000 యుద్ధాన్ని ఆపడానికి. 368 00:30:33,625 --> 00:30:34,835 యుద్ధం ఆపడానికా? 369 00:31:14,291 --> 00:31:17,461 కదలకండి, లేదంటే ఇద్దరూ చస్తారు. 370 00:31:21,882 --> 00:31:23,342 మీరు పట్రీషియన్ బారే కదా. 371 00:31:23,926 --> 00:31:25,177 వచ్చిన పనేంటో చెప్పండి. 372 00:31:25,677 --> 00:31:30,224 నేను జనరల్ బెల్ రియోస్ ని. ఇతను దళ నాయకుడు, ఆఫీసర్ కర్. 373 00:31:32,226 --> 00:31:34,895 మాంత్రికుల గురించి సమాచారం తెలుసుకోవాలని వచ్చాం. 374 00:31:34,978 --> 00:31:36,730 నాకు మాంత్రికులు ఎవరో తెలీదు. 375 00:31:36,813 --> 00:31:39,608 నేను వైన్ ఉత్పత్తి చేసే సాదాసీదా మనిషిని, అది మీకు తెలుస్తూనే ఉంది కదా. 376 00:31:40,108 --> 00:31:41,276 పట్రీషియన్, 377 00:31:42,277 --> 00:31:46,573 నాకు కావాల్సిన మాంత్రికులు, నక్షత్రాలు అక్కడక్కడే ఉండే సుదూర ప్రాంతాలకు 378 00:31:47,658 --> 00:31:49,785 చెందిన వాళ్లు. 379 00:31:50,494 --> 00:31:53,247 ఆ మారుమూల ప్రాంతాలలో శూన్యం దడ పుట్టిస్తుంది. 380 00:31:55,290 --> 00:31:57,793 అయితే నన్ను డూసెమ్ అని పిలవండి చాలు. 381 00:31:59,044 --> 00:32:03,465 "పట్రీషియన్" అంటే గతంలో నేను గొప్పోడిని అయినట్టు, ఆ గొప్పతనాన్ని డబ్బులతో నిలుపుకుంటున్నట్టు ఉంది. 382 00:32:03,549 --> 00:32:06,802 ఒక్క మాట, ఇక్కడికి వచ్చే ముందు మీ స్థానికులతో మేము గొడవపడాల్సి వచ్చింది. 383 00:32:07,719 --> 00:32:10,430 అయితే, ఎందుకైనా మంచిది, త్వరగా మాట్లాడి వెళ్లిపోండి. 384 00:32:11,056 --> 00:32:14,893 సామ్రాజ్యం మనుషులు వెళ్లిపోయినప్పటి నుండి సివెన్నాలో ఆటవికత రాజ్యమేలుతున్నట్టుగా ఉందే. 385 00:32:17,229 --> 00:32:19,439 వాళ్లు వెళ్లిపోయినప్పటి నుండి చాలా జరిగాయిలే. 386 00:32:20,524 --> 00:32:24,486 మహారాజు గారి నియంతృత్వం, అలాగే దాని నుండి విముక్తి, ఆ రెండు కూడా వాటి ముద్ర వేశాయి. 387 00:32:26,363 --> 00:32:28,365 అయినా ఇంకా మీరు విధేయులుగానే ఉన్నారు. 388 00:32:29,366 --> 00:32:32,578 నా పని నేను చేస్తున్నా. మహారాజు గెలాక్సీ అంచు ప్రాంతం నుండి 389 00:32:32,661 --> 00:32:36,206 వారి పట్టును సడలించినప్పటి నుండి నేను రహస్యంగా వర్తమానాలను పంపుతూనే ఉన్నా. 390 00:32:36,707 --> 00:32:40,127 నలభై ఏళ్లుగా ఏ ఒక్కరూ ప్రతిస్పందించలేదు. 391 00:32:40,627 --> 00:32:42,880 ఇప్పుడు మేము వచ్చాంగా. 392 00:32:43,589 --> 00:32:44,590 వచ్చేశాంగా. 393 00:32:46,383 --> 00:32:47,843 మీరు అల్లం టీ తాగుతారా? 394 00:32:48,552 --> 00:32:52,222 సివెన్నాలో అల్లం టీ తాగకపోతే గౌరవం ఇచ్చినట్టు ఉండదని చెప్పారు. 395 00:32:53,182 --> 00:32:55,267 అవును, అది నిజం. 396 00:33:10,699 --> 00:33:11,700 బెల్. 397 00:33:37,518 --> 00:33:41,104 నా పుస్తకాలను చూశారా. నేను వాటిని సేకరిస్తూ ఉంటా. 398 00:33:43,357 --> 00:33:47,861 మీరు యోధులు కాబట్టి, ఈ పుస్తకం మీకు ఉపయోగపడవచ్చు. 399 00:33:48,362 --> 00:33:51,949 రెండు భారీ సైన్యాలు ఎదురెదురుగా మోహరింపబడి ఉంటాయి, 400 00:33:52,032 --> 00:33:57,079 అప్పుడు ఒక రాజు, అతని సారథి కలిసి యుద్ధం సమంజసమా, కాదా అని చర్చించుకుంటారు. 401 00:34:04,962 --> 00:34:07,214 నిజానికి, నేను ఇప్పటిదాకా ఒక్క పుస్తకాన్ని కూడా చూడలేదు. 402 00:34:08,382 --> 00:34:11,802 చాలా మందిది కూడా అదే పరిస్థితి. పుస్తకాలనేవి ముసలివాళ్ల కాలక్షేపం కోసమే. 403 00:34:13,011 --> 00:34:14,804 గతంలో సాధించిన విజయాలు వారికి సంతృప్తినివ్వవు, 404 00:34:14,888 --> 00:34:18,308 అదీకాగ పాతకాలం నాటి కథలలో సగం కల్పితాలే ఉంటాయి. 405 00:34:20,726 --> 00:34:22,020 తాగండి, తాగండి. 406 00:34:23,938 --> 00:34:25,399 యుద్ధం చేసేవారికి జయహో. 407 00:34:25,482 --> 00:34:27,734 ఎందుకో తెలుసుకొని యుద్ధం చేసేవారికి జయహో. 408 00:34:30,487 --> 00:34:32,656 అతను అన్నదానిలో న్యాయముంది. అలా ఉండాలి టోస్ట్ అంటే. 409 00:34:33,949 --> 00:34:37,619 ఎందుకు అని అడిగేవాళ్లు ఆ మాటను తప్పక చేర్చాలి. 410 00:34:38,745 --> 00:34:43,792 ఈ మాంత్రికులు అనబడే వారు రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. 411 00:34:43,876 --> 00:34:48,088 మొదటగా వచ్చిన వ్యక్తిని స్థానిక రక్షక దళం చంపేసింది. 412 00:34:48,922 --> 00:34:50,132 కానీ తర్వాత వచ్చిన వాళ్లు… 413 00:34:53,969 --> 00:34:56,722 స్పిరిట్ కవచానికి ఉన్న శక్తిని చూడండి! 414 00:35:00,809 --> 00:35:03,979 ఒక్క నిమిషం, అది వ్యక్తిగత అదృశ్య కవచమా? 415 00:35:04,062 --> 00:35:07,649 ఇంపీరియల్ డిజైన్ నుండి స్ఫూర్తి తీసుకొని చేసుకున్నారు. 416 00:35:08,901 --> 00:35:12,863 గెలాక్టిక్ స్పిరిట్ ప్రతినిధులందరి దగ్గరా అది ఉంది. 417 00:35:17,242 --> 00:35:22,623 ఈ ప్రతినిధులు ఎవరైనా ఫౌండేషన్ గురించి ప్రస్తావించారా? 418 00:35:26,919 --> 00:35:30,339 వాల్ట్ తెరుచుకుంది. ప్రాఫెట్ బయటకు వచ్చి, మాట్లాడాడు. 419 00:35:30,422 --> 00:35:35,093 అతని మాటలు విన్నవాళ్లందరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. 420 00:35:36,803 --> 00:35:38,388 ఈ "వాల్ట్" గురించి మీకేమైనా తెలుసా? 421 00:35:38,472 --> 00:35:42,434 అందులో చనిపోయిన డాక్టర్ సెల్డన్ ఆత్మ ఉంటుందని చెప్పుకుంటుంటారు. 422 00:35:43,018 --> 00:35:46,188 దానికదే వృద్ధి చెందే కృతిమ మేధస్సును ఎన్నో శతాబ్దాల క్రితం నుండే నిషేధించారు. 423 00:35:46,271 --> 00:35:50,734 హా, జంప్ టెక్నాలజీని ఇంపీరియల్ వాళ్లు తప్ప ఇంకెవరూ వాడకూడదు, మరి వాడుతున్నారుగా. 424 00:35:50,817 --> 00:35:53,737 ఇంతకీ మీరేమంటున్నారు? ఈ మాంత్రికులు స్పేస్ ని ఫోల్డ్ చేస్తున్నారా? 425 00:35:54,404 --> 00:35:56,073 మీరే చూసి తెలుసుకోండి. 426 00:36:03,330 --> 00:36:05,624 వాటిని మర్మ నౌకలని అంటుంటారు. 427 00:36:06,542 --> 00:36:09,878 వాటిలో ప్రయాణానికి స్పేసర్స్ అక్కర్లేదట. 428 00:36:09,962 --> 00:36:11,004 కానీ ఎలా? 429 00:36:11,088 --> 00:36:13,549 ఆర్గానిక్ కంప్యూటింగ్ ఏమో. 430 00:36:13,632 --> 00:36:19,137 కానీ పుకార్ల ప్రకారం, ఈ నౌకలకు సొంత మేధస్సు ఉంటుంది. 431 00:36:19,221 --> 00:36:21,849 ఇలాంటి నౌక ఏ క్షణంలైనా ట్రాంటార్ ముంగిట వాలవచ్చు. 432 00:36:21,932 --> 00:36:22,933 హా, ఒకవేళ అవే నిజమైతే. 433 00:36:24,101 --> 00:36:28,230 మనం కళ్లారా చూసినప్పుడే, ఈ మర్మ నౌకలని నమ్ముదాం. 434 00:36:29,147 --> 00:36:30,440 అప్పటి దాకా అవి కేవలం పుకార్లే. 435 00:36:35,362 --> 00:36:38,323 బార్! బయటకు రా! 436 00:36:39,241 --> 00:36:41,577 నువ్వు, ఇంకా ట్రాంటార్ నుండి వచ్చిన ఆ సోగ్గాళ్లు కూడా! 437 00:36:42,411 --> 00:36:43,871 స్థానిక రక్షక దళం వాళ్లు వచ్చారు. 438 00:36:45,330 --> 00:36:46,373 అబ్బా. 439 00:36:51,712 --> 00:36:53,380 ఇలా వెళ్తే మీరు పైకి వెళ్లవచ్చు. 440 00:36:55,007 --> 00:36:56,216 ఇదుగో. తీసుకో. 441 00:36:56,884 --> 00:36:59,219 -అయ్యయ్యో, పర్వాలేదు. -తీసుకోండి. 442 00:36:59,303 --> 00:37:02,681 ఇప్పుడు మీరు నన్ను కాల్చాలి. 443 00:37:02,764 --> 00:37:04,975 -ఏంటి? -నేను చాలా కాలం బ్రతికాను. 444 00:37:05,058 --> 00:37:09,980 ఈ స్థానికుల చేతిలో నరకయాతనను అనుభవించాలని నాకు అస్సలు లేదు. 445 00:37:10,898 --> 00:37:12,441 మీకు ఊరట కలిగిస్తుందో లేదో కానీ, 446 00:37:12,524 --> 00:37:17,404 నేను పొగ తాగాను కదా, అందులో విషం కలుపుకున్నాను. 447 00:37:17,487 --> 00:37:23,243 కానీ తుపాకీ ద్వారా చనిపోతే అది కాస్త గౌరవప్రదంగా ఉంటుంది. 448 00:37:23,994 --> 00:37:25,162 ప్లీజ్? 449 00:37:32,336 --> 00:37:33,337 థ్యాంక్యూ. 450 00:38:26,849 --> 00:38:28,851 మీరు వైన్ తీసుకుంటారుగా. 451 00:38:29,601 --> 00:38:33,856 కాసొపేన్ డి అబ్రూజో. సూపర్ గా ఉంటుంది. 452 00:38:37,150 --> 00:38:40,362 -నీకు టీ, కాంస్టన్ట్ సోదరి. -థ్యాంక్యూ. 453 00:38:41,738 --> 00:38:44,575 -పోలీ? -ప్రాఫెటే ఇస్తున్నాడు కనుక తీసుకుంటా. 454 00:38:48,787 --> 00:38:50,789 అది నేననుకుంటున్నదేనా? 455 00:38:55,043 --> 00:38:56,503 ప్రైమ్ రేడియంటా? 456 00:38:56,587 --> 00:38:58,672 -అవును. -కానీ ఎలా? 457 00:38:59,256 --> 00:39:02,092 శాల్వార్ హార్డిన్ దాన్ని తీసుకొని వెళ్లి ఒక శతాబ్దానికి పైగానే అయిందిగా. 458 00:39:02,176 --> 00:39:05,345 ఇంత సంక్లిష్టకరమైనదాన్ని మాలిక్యూల్స్ తోనే చేసేయడం సాధ్యం కాదేమో. 459 00:39:06,597 --> 00:39:08,432 మంచి కుతూహలం ఉంది నీకు, పోలీ. 460 00:39:11,059 --> 00:39:16,064 ప్రైమ్ రేడియంట్ అనేది ఒక కంప్యూటర్ కంప్యూటర్, ఇది సూపర్ పొజిషన్ స్థితిలో ఉంటుంది. 461 00:39:16,773 --> 00:39:19,735 అంటే, ఒకే సమయంలో అది రెండు చోట్ల ఉండగలదా? 462 00:39:19,818 --> 00:39:21,904 హా, అలా అనే అనుకోవచ్చు. 463 00:39:21,987 --> 00:39:23,238 ప్రాఫెట్. 464 00:39:23,322 --> 00:39:25,282 డాక్టర్ సెల్డన్ అని పిలువు, చాలు. 465 00:39:25,365 --> 00:39:26,366 డాక్టర్. 466 00:39:27,784 --> 00:39:31,246 మేము ఎలా ఉపయోగపడగలమో చెప్పండి. ఎవరితో జరగబోయే యుద్ధాన్ని మేము ఆపాలి? 467 00:39:31,330 --> 00:39:35,542 ఎప్పుడో ఊహించిన రెండవ విపత్తు ముంచుకు వచ్చినప్పుడు సామ్రాజ్యంతో జరగబోయే యుద్ధాన్ని. 468 00:39:35,626 --> 00:39:38,712 డాక్టర్ సెల్డన్, యుద్ధానికి మేము సంసిద్ధమవుతూ వస్తున్నాం. 469 00:39:38,795 --> 00:39:40,797 -మేము ధీటుగా ఎదుర్కోగలమని మీకు… -ఆపు, సెఫ్. 470 00:39:41,632 --> 00:39:46,386 ఆపు నీ సోది ఇక. యుద్ధాన్ని నివారించే అవకాశం ఉంటే, వినడంలో తప్పు లేదుగా. 471 00:39:46,470 --> 00:39:47,763 థ్యాంక్యూ, పోలీ. 472 00:39:49,097 --> 00:39:53,143 వారు ట్రాంటార్ కి వెళ్లి దౌత్య సంబంధాలకు తెరతీయాలి. 473 00:39:53,227 --> 00:39:55,354 ఫౌండేషన్ గురించి చక్కగా ఎలా ప్రచారం చేయాలో నీకు తెలుసనే అనుకుంటున్నా. 474 00:39:55,437 --> 00:39:57,105 ఇప్పటిదాకా ఏడు గ్రహాలను మన వైపుకు తిప్పుకున్నాం. 475 00:39:57,189 --> 00:39:58,565 ఇది నువ్వు పాస్ అయిన రోజు అనుకో. 476 00:39:58,649 --> 00:40:00,859 వాళ్లకిచ్చే బోధనలు న భూతో న భవిష్యతి అన్నట్టు ఉండాలి. 477 00:40:00,943 --> 00:40:05,155 వాళ్లకి మనమంటే అభిమానం పెరిగిపోయేలా చేయ్, ఈ యుద్ధాన్ని వీలైనంత కాలం ఆలస్యం చేయ్. 478 00:40:05,239 --> 00:40:09,743 శాంతిధూతగా అన్నమాట. తప్పకుండా. నా జన్మ సార్థకం అయినట్టే కదా. 479 00:40:10,577 --> 00:40:13,956 ఈపాటికి మీరు మహారాజుకు తెలీకుండా చిన్న జంప్ షిప్స్ ని తయారు చేసే ఉంటారు కదా? 480 00:40:14,039 --> 00:40:15,624 హా, చేశాం. 481 00:40:15,707 --> 00:40:18,752 అక్కడికి వాటిలో వెళ్లవద్దు. మన దగ్గర అవి ఉన్నాయని వాళ్లకి అప్పుడే తెలియాల్సిన పని లేదు. 482 00:40:18,836 --> 00:40:21,338 వారి జంప్ షిప్స్ లోనే వెళ్లి సమయం వృథా కాకుండా చూసుకుంటాం. 483 00:40:21,421 --> 00:40:24,132 మీ పేరు మీద రాయబారులుగా వ్యవహరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం, డాక్టర్ సెల్డన్. 484 00:40:35,644 --> 00:40:37,896 ఆ అదృష్టం నాది, నా విధేయ పుత్రికా. 485 00:40:41,817 --> 00:40:45,487 డైరెక్టర్ సెర్మక్, మళ్లీ చెప్తున్నా, నీ సూట్ బాగుంది. 486 00:40:46,780 --> 00:40:51,368 సమయం చాలా కీలకమైనది. కాబట్టి, త్వరగా బయలుదేరండి. 487 00:40:51,451 --> 00:40:53,245 నీతో ఎకాంతంగా మాట్లాడాలి. 488 00:40:53,328 --> 00:40:54,413 నాతోనా? 489 00:40:54,496 --> 00:40:56,540 నీకేమీ కాదులే. మేము బయటే ఉంటాం. 490 00:40:58,458 --> 00:40:59,459 పద, నాన్నా. 491 00:41:12,806 --> 00:41:14,224 నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా, పోలీ? 492 00:41:14,933 --> 00:41:17,644 జేగ్గర్ గురించే. 493 00:41:20,355 --> 00:41:21,356 జేగ్గర్? 494 00:41:21,440 --> 00:41:24,443 మీరు అగ్నికి ఆహుతి చేసిన వార్డెన్ గురించి. అతడిని ఎందుకు చంపారు? 495 00:41:24,526 --> 00:41:25,736 తప్పలేదు. 496 00:41:27,070 --> 00:41:31,408 దేవుని మీద నమ్మకం పెరగాలంటే, అప్పుడప్పుడూ క్రూరంగా కూడా ఉండాల్సి వస్తుంది. 497 00:41:32,534 --> 00:41:36,413 అదీగాక, నేను ఉండే చోట దగ్గరికి వచ్చి వార్డెన్ అన్న మాటలను అన్నాడు. 498 00:41:36,496 --> 00:41:41,001 వాటిని బట్టి చూస్తే, నా కన్నా అతనే గొప్ప అని త్వరలోనే ప్రచారం చేసుకుంటాడని అనిపించింది. 499 00:41:41,627 --> 00:41:43,003 కాబట్టి… 500 00:41:45,005 --> 00:41:46,006 మీరు దేవునిగా అతడిని శిక్షించారా? 501 00:41:48,425 --> 00:41:51,386 నేను అందరినీ ఊరికే కరుణించేస్తానని అందరూ అనుకోకూడదు. 502 00:42:18,622 --> 00:42:20,290 నేను ఒక వ్యక్తిగత ప్రశ్న అడగవచ్చా? 503 00:42:22,835 --> 00:42:24,211 ఇక్కడి నుండి నేను ప్రాణాలతోనే బయటపడతానా? 504 00:42:24,294 --> 00:42:25,754 నిస్సందేహంగా. 505 00:42:25,838 --> 00:42:28,799 కానీ నువ్వు చావలేదు అని ఇతరులకి తెలియాలంటే, ఎవరైనా సాక్షులు ఉండాలి కదా. 506 00:42:30,050 --> 00:42:33,470 అదేం లేదులే, నీకు మంచి పలుకుబడి ఉంది కాబట్టే నిన్ను కోరాను. 507 00:42:33,554 --> 00:42:34,680 నాకు పలుకుబడి ఉందా? 508 00:42:35,556 --> 00:42:38,600 ఒక ఇన్ఫార్మర్ నీ పేరు చెప్పారు. 509 00:42:39,101 --> 00:42:40,102 ఇన్ఫార్మర్? 510 00:42:41,103 --> 00:42:42,187 నీ గురించి చెప్పు. 511 00:42:43,856 --> 00:42:46,108 నేను స్మిర్నోలో పుట్టాను. 512 00:42:47,818 --> 00:42:51,154 ఒకరకంగా చెప్పాలంటే, చిన్నప్పట్నుంచీ మా నాన్న చేత తన్నులు తింటూ పెరిగా, 513 00:42:51,238 --> 00:42:53,448 కానీ, బయటపడ్డానులే. 514 00:42:53,532 --> 00:42:57,035 నేను కూడా మా నాన్న చేత తన్నులు తిన్నా. నేను కూడా బయటపడ్డా. 515 00:42:57,870 --> 00:43:00,205 కానీ నువ్వు అక్రమ మార్గాల ద్వారా బయటపడ్డావు అనుకుంటా. 516 00:43:02,207 --> 00:43:05,794 హా. కొన్ని నకిలీ ప్రాచీన వస్తువులను, చేతివేళ్ల ఎముకలను, ఇంకా చాలా వాటిని అమ్మా. 517 00:43:05,878 --> 00:43:07,546 కానీ నీకు ఆ అపరాధ భావమే లేదు కదా. 518 00:43:07,629 --> 00:43:10,424 అబ్బా చాల్లే. సెల్డన్ చర్చ్ వాళ్లు చేసేదేంటి! 519 00:43:10,507 --> 00:43:12,843 వాళ్లు కూడా నమ్మకం కలిగించడానికి ట్రిక్స్ చేస్తారు, నేను కూడా అంతే కదా? 520 00:43:12,926 --> 00:43:15,679 తాము అద్భుతాలను సృష్టించగలమని మీ ఫాదర్లు ప్రచారం చేసుకుంటుంటారు కదా. 521 00:43:16,471 --> 00:43:18,724 మరి, వాళ్ల లక్ష్యం ఏంటంటారు? 522 00:43:19,308 --> 00:43:20,893 అభివృద్ధి, హోబర్. 523 00:43:21,476 --> 00:43:25,272 విజయవంతమయ్యే నాగరికతలన్నీ కూడా ఆ దశను దాటుతాయి. 524 00:43:25,355 --> 00:43:27,274 కొన్ని అయితే, నిత్యం అభివృద్ధి అవుతూనే ఉంటాయి. 525 00:43:27,858 --> 00:43:32,112 కాలం గడిచే కొద్దీ, చర్చ్ వ్యవస్థ పతనమవచ్చు, దాని స్థానంలో… 526 00:43:34,281 --> 00:43:35,574 ఇంకేదైనా రావచ్చు. 527 00:43:36,158 --> 00:43:38,952 కానీ ఈ మిషన్ లో నీ సంశయం బాగా పనికివస్తుంది. 528 00:43:39,661 --> 00:43:41,413 నిన్ను ఎవరి దగ్గరికి అయితే వెళ్లమంటున్నానో, 529 00:43:41,496 --> 00:43:46,668 వారికి అన్నీ బాగా తెలుసు, ఆధ్యాత్మిక విధానానికి వారు చేతులు చాచి స్వాగతించకపోవచ్చు. 530 00:43:46,752 --> 00:43:48,420 అయితే, ఆ తాగుబోతును, సోదరిని 531 00:43:48,504 --> 00:43:52,090 శాంతి దూతలుగా పంపుతున్నారు కదా, 532 00:43:52,174 --> 00:43:53,175 లేదు. 533 00:43:53,258 --> 00:43:56,887 నీ మిషన్ వేరు, చెప్పాలంటే వారి మిషన్ కి నీది పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. 534 00:43:57,429 --> 00:44:01,266 స్నేహ హస్తం అందించే వ్యక్తి, 535 00:44:01,350 --> 00:44:04,394 తనతో పాటు ఒక కత్తిని కూడా తీసుకెళ్తే మంచిది. 536 00:44:06,522 --> 00:44:07,689 హా, కత్తిగా నేను ఉండగలనులే. 537 00:44:11,610 --> 00:44:14,279 సరే మరి. ఇంతకీ నన్ను ఎక్కడికి పంపుతున్నారు? 538 00:44:30,671 --> 00:44:32,422 నువ్వు ఇక రావేమో అనుకున్నా. 539 00:44:34,842 --> 00:44:36,093 మనోడు వస్తే కదా. 540 00:44:37,511 --> 00:44:40,305 మా దర్యాప్తులో భాగంగా నువ్వు మాకు సాయపడగలవని విన్నాం. 541 00:44:41,932 --> 00:44:43,642 నీ ముఖాన్ని దాచుకోవాల్సిన పని లేదు. 542 00:44:43,725 --> 00:44:47,271 నా అసిస్టెంట్ దగ్గర ఫీల్డ్ డిస్రప్టర్ ఉంది. నిశ్చింతగా మాట్లాడు. 543 00:44:47,896 --> 00:44:50,732 దాని వల్ల లాభం లేదు. మాకు ప్రతీ వారం జ్ఞాపక తనిఖీలు ఉంటాయి. 544 00:44:50,816 --> 00:44:53,694 నేను ఇక్కడ ఉన్నానంటే, మీతో ఉన్న నా జ్ఞాపకం రికార్డ్ అవుతూ ఉంటుంది. 545 00:44:53,777 --> 00:44:54,903 కంగారు అక్కర్లేదు. 546 00:44:56,029 --> 00:44:58,615 మా సలహాదారు రూ కూడా ట్రాంటార్ నుండి చాలా ఏళ్ల క్రితం మా దగ్గరికి వచ్చినప్పుడు, 547 00:44:58,699 --> 00:45:00,117 తన జ్ఞాపకాలని కూడా ఈ సామ్రాజ్యం వాళ్లు మార్చేశారు. 548 00:45:00,200 --> 00:45:03,453 మా మనుషులు జ్ఞాపకం తీసివేతను బ్లాక్ లేదా పునరుద్ధరించే టెక్నాలజీని రూపొందించారు. 549 00:45:03,537 --> 00:45:04,746 జ్ఞాపకాల తనిఖీని బోల్తా కొట్టించవచ్చు. 550 00:45:05,873 --> 00:45:07,374 నీకేమీ కాదు. 551 00:45:19,052 --> 00:45:21,805 -నీ పేరేంటి? -మార్క్లీ. 552 00:45:23,098 --> 00:45:25,392 నేను మీకు ఏ విధంగా సాయపడగలనో లేదో, మహారాణి. 553 00:45:26,768 --> 00:45:28,812 మీకేం కావాలి? 554 00:45:29,897 --> 00:45:30,939 మీరు నాకు ఎంత చెల్లించగలరు? 555 00:45:31,523 --> 00:45:35,110 డొమీనియన్ ఖజానా అంతా నా చేతుల్లో ఉంది. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. 556 00:45:37,863 --> 00:45:41,325 నా కుటుంబ సభ్యుల మరణానికి, పదిహేనవ క్లియాన్ కి సంబంధం ఏమైనా ఉందో లేదో నాకు తెలియాలి. 557 00:45:44,203 --> 00:45:47,789 దాని ఎలా కనిపెట్టాలో నాకు తెలీదు, కానీ ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలుసు. 558 00:45:51,126 --> 00:45:52,169 ఇప్పటికి అది చాల్లే. 559 00:45:54,087 --> 00:45:55,464 నువ్వు అది తెలుసుకొనే పనిలో ఉండగా, 560 00:45:56,840 --> 00:45:58,842 గెలాక్సీకి చెందిన అరివీర భయంకరులైన హంతకుల నుండి పగటి రాజు 561 00:45:58,926 --> 00:46:00,427 ఎలా తప్పించుకున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. 562 00:46:02,846 --> 00:46:04,765 ఆ సంఘటనకు సంబంధించిన విజువల్ రికార్డులు కావాలి. 563 00:46:42,302 --> 00:46:45,305 -బయట చీకటిగా ఉందే. లోపల ఎంత సేపు ఉన్నానేంటి? -నీ కోసం మూడేళ్లగా ఎదురు చూస్తున్నాం. 564 00:46:45,389 --> 00:46:46,974 -హా? -మూడు గంటలే కదా. 565 00:46:47,057 --> 00:46:48,809 అబ్బా, అల్లుకుపోవడమే రాదు కదా నీకు? 566 00:46:58,569 --> 00:47:00,571 ఇక బయలుదేరండి అని అది మనకి సంకేతం అనుకుంటా. 567 00:47:00,654 --> 00:47:02,698 మనం వెంటనే ట్రాంటార్ కి బయలుదేరుదాం. 568 00:47:03,240 --> 00:47:07,703 మనం స్పిరిట్ లో అప్సిలాన్ అవుట్ పోస్టుకు వెళ్దాం, అక్కడి నుండి ఒక రవాణా నౌకలో… 569 00:47:08,203 --> 00:47:11,748 ట్రాంటార్ కి నేను రావట్లేదు. డాక్టర్ నాకు వేరే పని అప్పగించాడు. 570 00:47:13,834 --> 00:47:14,918 మనమందరం కలిసి వెళ్తామనుకున్నానే. 571 00:47:15,002 --> 00:47:18,297 హా. సారీ. మీ నౌకలో వెళ్లమని చెప్పాడు. 572 00:47:18,922 --> 00:47:21,049 -స్పిరిట్ రైజింగ్ లోనా? -మీకు అది నచ్చదని కూడా ఆయన చెప్పాడు, 573 00:47:21,133 --> 00:47:24,344 కానీ మీ నౌకలోని నావిగేషన్ సిస్టమ్ లో ఆయన కో-ఆర్డినేట్స్ ని ఎంట్రీ కూడా చేశాడు, సరేనా? 574 00:47:24,428 --> 00:47:26,054 నా పని చాలా రహస్యమైనది అన్నమాట. 575 00:47:26,138 --> 00:47:28,223 హా, నువ్వు స్పిరిట్ ని తీసుకుని వెళ్లు, పర్వాలేదు. 576 00:47:29,892 --> 00:47:32,060 కానీ దానికి మాత్రం మరీ ఎక్కువ ఆహారం పెట్టేయకు. 577 00:47:32,144 --> 00:47:33,645 -దేన్ని? -బెకీ. 578 00:47:41,945 --> 00:47:44,281 నేను వెళ్లి మన సామాను తీసుకొస్తా. 579 00:47:51,205 --> 00:47:52,206 నీకేమీ కాదులే. 580 00:47:53,498 --> 00:47:54,791 నువ్వంటే నాకు ఇష్టమని అది గ్రహించేసింది. 581 00:47:59,463 --> 00:48:00,797 అంతా ఓకేనా, సోదరి? 582 00:48:01,632 --> 00:48:02,633 ఓకేనే! 583 00:48:03,926 --> 00:48:06,136 మనం ఇలా విడిపోవలసి వస్తుందని ఊహించలేదు, అంతే. 584 00:48:07,846 --> 00:48:09,014 నేను వేరే ఆశలు పెట్టుకున్నా. 585 00:48:10,891 --> 00:48:12,768 మనం ఒకరికొకరం సన్నిహితులం అవుతూ ఉన్నాం. 586 00:48:12,851 --> 00:48:15,103 ఎప్పుడోకప్పటికి నీకు నా మీద ఇష్టం కలుగుతుంది, 587 00:48:15,187 --> 00:48:17,856 ప్రాఫెట్ చెప్పినట్టు, నాతో కూడా నువ్వు పడుకుంటావు. 588 00:48:21,902 --> 00:48:22,903 అవునా? 589 00:48:26,281 --> 00:48:27,908 మత ప్రబోధకులని నేను ఆ ఉద్దేశంతో చూడను. 590 00:48:27,991 --> 00:48:30,327 అప్పుడు నేను శృంగారం చేసిన మొదటి వ్యక్తివి నువ్వే అవుతావు. 591 00:48:30,410 --> 00:48:31,411 సోదరి… 592 00:48:33,747 --> 00:48:35,582 నేను గాల్లో తేలిపోతున్నా, కానీ నువ్వు నైతికతను నిలువెత్తు రూపానివి. 593 00:48:36,542 --> 00:48:38,126 నిజంగా చెప్తున్నా, అంత సీన్ లేదు. 594 00:48:39,002 --> 00:48:40,128 ఆ విషయంలో లేదనే చెప్పాలి. 595 00:48:41,129 --> 00:48:44,132 ఎక్కువ మందిని కలిసే అవకాశం నాకు రాదు, వచ్చినా నాకు ఎక్కువ మంది నచ్చరు. 596 00:48:46,218 --> 00:48:47,678 సమయం వచ్చినప్పుడే జరుగుతుందిలే. 597 00:48:48,345 --> 00:48:51,932 హా. కానీ నా మనస్సులో మాట చెప్పాలంటే. 598 00:48:53,350 --> 00:48:55,143 నీ జాబితాలో పదవ వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా. 599 00:48:55,227 --> 00:48:57,187 సాధారణంగా మొదటి వ్యక్తిగా ఉండటం నాకు ఇష్టం లేదు. 600 00:48:57,271 --> 00:49:00,274 ఇందాక చూశావుగా. వాల్ట్ లోకి అరుచుకుంటూ, గిలా గిలా కొట్టుకుంటూ వెళ్లాల్సి వచ్చింది నేను. 601 00:49:00,357 --> 00:49:02,568 మన మధ్య సంభోగం 602 00:49:02,651 --> 00:49:04,653 స్వర్గానికి మించిన సుఖం అందించేలా ఉండేదని అనుకుంటున్నాను. 603 00:49:07,447 --> 00:49:08,490 హేయ్, చూడు. 604 00:49:10,367 --> 00:49:13,370 బహుశా, పని అయ్యాక, డాక్టర్ మనల్నందరినీ మళ్లీ ఇక్కడికే రమ్మంటాడేమో. 605 00:49:14,037 --> 00:49:15,831 ఎందుకో నాకు మనం మళ్లీ కలవమని అనిపిస్తోంది. 606 00:49:17,749 --> 00:49:19,209 అది దారుణం. నేనేమీ… 607 00:49:21,753 --> 00:49:23,630 నేను ఎక్కువ మందికేమీ పడిపోను. 608 00:49:23,714 --> 00:49:26,466 అవునులే. ఎందుకు పడతావు? జనాలు దారుణంగా ఉంటారు. 609 00:49:27,301 --> 00:49:28,468 బహుశా నువ్వు మరీ ఎక్కువ ఆశిస్తావేమో. 610 00:49:29,803 --> 00:49:32,055 నువ్వు సానుకూలవాదివని ఒప్పుకోకపోయినా నీ మాటల ద్వారా అది తెలిసిపోతోంది చూశావా? 611 00:49:33,056 --> 00:49:35,893 హా, అలాగే నాకు తెలుసు నీ పేరును నేను కనిపెట్టేస్తా అని. 612 00:49:36,768 --> 00:49:37,936 కాలియోప్. 613 00:49:38,478 --> 00:49:41,190 -కాదు, అది బ్రుసిల్లా… డ్రుసిల్లా. -కాదు. 614 00:49:41,273 --> 00:49:45,736 ఇక నువ్వు బయలుదేరవచ్చు, మాలో. కలిసి తక్కువ సేపే ఉన్నా, బాగుంది. 615 00:49:53,285 --> 00:49:54,745 నీ గమ్యస్థానానికి క్షేమంగా చేరుకో. 616 00:49:57,080 --> 00:50:01,084 హా. మహారాజు దగ్గరికి శాంతి సందేశంతో వెళ్తున్నారు కదా, గుడ్ లక్. 617 00:50:02,961 --> 00:50:03,962 మర్నా? 618 00:50:05,088 --> 00:50:06,089 ఫిఫీ? 619 00:50:07,090 --> 00:50:08,091 డెస్డారియా? 620 00:50:12,387 --> 00:50:13,555 -వీనస్? -హా. 621 00:50:13,639 --> 00:50:14,640 -వీనస్. -కాదు. 622 00:50:14,723 --> 00:50:15,724 కాదు. 623 00:50:21,480 --> 00:50:23,106 నీది చాలా మంచి హృదయం. 624 00:51:12,781 --> 00:51:17,661 కొన్నింటిని పక్కకు పెట్టేస్తే, మానవ చరిత్రలో ఆకర్షణకు పెద్దగ పాత్ర లేదనే చెప్పాలి. 625 00:51:18,537 --> 00:51:21,832 అది మానవ హృదయానికి మాత్రమే ముఖ్యమైనది. 626 00:52:22,226 --> 00:52:24,228 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్