1 00:01:06,525 --> 00:01:08,026 {\an8}ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:47,441 --> 00:01:48,567 జీవులు ఏవీ లేవు... 3 00:01:50,611 --> 00:01:51,820 నీరు కూడా పెద్దగా లేదు. 4 00:01:52,446 --> 00:01:54,531 ద్వితీయ ఫౌండేషన్ ని ఇక్కడ నిర్మించడం అంటే వింతే. 5 00:01:55,199 --> 00:01:56,450 అది నిజమే. 6 00:01:58,202 --> 00:01:59,203 నాలుగు నిమిషాల్లో గ్రహంపైకి దిగుతాం. 7 00:01:59,912 --> 00:02:01,914 అంటే, మనం ఇంకా మాట్లాడుకోని వాటి గురించి 8 00:02:01,914 --> 00:02:04,208 మాట్లాడటానికి మనకి నాలుగు నిమిషాల సమయం ఉందని అంటున్నావా? 9 00:02:04,208 --> 00:02:05,918 సీట్ బెల్ట్ పెట్టుకోండి. దిగేటప్పుడు కుదుపులు తప్పవు. 10 00:02:05,918 --> 00:02:07,085 శాల్వార్. 11 00:02:07,085 --> 00:02:09,086 నువ్వు నాకు ఇప్పటికే చాలాసార్లు చెప్పావు. 12 00:02:09,086 --> 00:02:11,673 నీకు వచ్చిన ప్రతి పీడకల నిజమైంది. 13 00:02:11,673 --> 00:02:14,885 అలా అని ఇది కూడా నిజమవుతుందని కాదులే. దీన్ని మనం మార్చగలమని నేను నమ్మాలి. 14 00:02:14,885 --> 00:02:16,428 కానీ నీకలా లేదు. 15 00:02:17,304 --> 00:02:18,514 మార్చగలవన్న నమ్మకం నీకు లేదు. 16 00:02:20,557 --> 00:02:25,604 నూట యాభై ఏళ్ల తర్వాత, మానవజాతిని పరిరక్షించాలని జరిగే యుద్ధంలో నేను చనిపోతాను. 17 00:02:25,604 --> 00:02:28,190 - ముసలిదాన్ని అయి మంచం మీద పడి చావడం కన్నా అదే మేలు. - నువ్వు అలా తోసిపుచ్చేస్తే ఎలా 18 00:02:28,190 --> 00:02:30,234 అంటే, నేనెలాగూ ఇప్పుడల్లా చావననే అర్థం కదా? 19 00:02:30,234 --> 00:02:33,153 - నాకు ఇప్పుడు యమ జోష్ గా ఉంది. - నువ్వు క్రయోపాడ్ ఎక్కు. 20 00:02:33,153 --> 00:02:34,947 ఇప్పుడే ఎక్కేసి టర్మినస్ కి వెళ్లిపో. 21 00:02:34,947 --> 00:02:38,450 ఈ మలుపు దగ్గర కాకపోయినా, తర్వాతి మలుపులో యుద్ధంలో పాల్గొనాల్సిందే కదా. 22 00:02:39,117 --> 00:02:44,206 ఎంతైనా, యుద్ధం తప్పదు. అది ఎలాగైనా జరగవచ్చు. 23 00:02:44,206 --> 00:02:47,084 హెచ్చరిక, గ్రహం ఉపరితలం పలచగా ఉంది. 24 00:02:47,084 --> 00:02:48,669 దిగే నేలలో పట్టు లేదు. 25 00:02:48,669 --> 00:02:50,337 మాకు మరో మార్గం లేదు, బెగ్గర్. 26 00:02:52,631 --> 00:02:56,593 - నువ్వు నడుపుతున్నావా? - హా, నా కంట్రోల్ లోనే ఉంది. మీరు గట్టిగా పట్టుకోండి. 27 00:02:57,511 --> 00:02:58,720 నేను దింపుతాను. 28 00:03:33,714 --> 00:03:35,174 ఇది ఇగ్నిసా? 29 00:03:35,174 --> 00:03:36,341 నిర్మానుష్యమైన గనులున్నాయే? 30 00:03:39,386 --> 00:03:40,762 ఇది ఇగ్నిస్ కాదు. 31 00:03:43,557 --> 00:03:45,392 మరి ఏంటి? 32 00:03:45,392 --> 00:03:47,895 ఊనాస్ వరల్డ్, ఒకప్పుడు సామ్రాజ్యం వాళ్ల గనులు ఇవి, 33 00:03:47,895 --> 00:03:51,064 గనులన్నీ 3,000 ఏళ్ల క్రితం అయిపోయాయి, అప్పట్నుంచీ ఇది ఇలా ఉంది. 34 00:03:51,064 --> 00:03:52,941 ప్రస్తుతం ఈ గ్రహం నిర్మానుష్యంగా ఉంది. 35 00:03:52,941 --> 00:03:57,237 హారి, ద్వితీయ ఫౌండేషన్ కి ఇగ్నిస్ చాలా ముఖ్యమని నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. 36 00:03:57,237 --> 00:03:59,406 ఒప్పుకున్నా. ఇది కూడా ముఖ్యమైనదే. 37 00:03:59,406 --> 00:04:00,532 ఎప్పట్నుంచీ? 38 00:04:01,200 --> 00:04:02,910 రేడియంట్ కి ఇది కావాలి, అప్పట్నుంచీ. 39 00:04:02,910 --> 00:04:04,703 గణితం ఎలా పని చేస్తుందో నాకు తెలుసు. 40 00:04:04,703 --> 00:04:06,747 అది నిర్దిష్టంగా సమాధానాలను ఇవ్వదు. 41 00:04:06,747 --> 00:04:07,915 ఇప్పుడు ఇస్తోంది. 42 00:04:08,624 --> 00:04:11,793 ఇక్కడి నుండి 500 మీటర్ల దూరంలో, ఆ పర్వతాలలో ఒక చోటు ఉంది, 43 00:04:11,793 --> 00:04:13,462 అక్కడికి వెళ్ళమని అది నన్ను కోరింది. 44 00:04:13,462 --> 00:04:18,091 హారి, రేడియంట్ మోడల్ అనుకూలంగా మారగలదు, కానీ దానికి వివేకం లేదు. 45 00:04:18,091 --> 00:04:20,928 నీకు అక్కడికి వెళ్లాలనుంటే, ఒక్కడివే వెళ్లి చావవచ్చు కదా 46 00:04:20,928 --> 00:04:24,932 నేను ప్రొజెక్షన్ ని, గాల్, దగ్గర్లో ఏ నెట్వర్క్ ఉంటే, దానిపై ఆధారపడుంటాను. 47 00:04:24,932 --> 00:04:27,267 నన్ను నేను రేడియంట్ లోకి బదిలీ చేసుకోగలను, 48 00:04:27,267 --> 00:04:29,603 కానీ మీలో ఒకరు అక్కడి దాకా నన్ను తీసుకెళ్లాలి. 49 00:04:29,603 --> 00:04:32,856 నేను ధృవీకరించలేనిదాని విషయంలో నిన్ను ఎలా నమ్మను! 50 00:04:32,856 --> 00:04:35,692 ఈ పని అయ్యే దాకా, నేను బెగ్గర్ ని నా గుప్పెట్లోనే ఉంచుకుంటాను. 51 00:04:35,692 --> 00:04:37,361 అతనితో వెళ్లు, గాల్. 52 00:04:37,361 --> 00:04:41,782 లేదు. చంకలో పిల్లిని పెట్టుకొని తిరిగినట్టు నేను నిన్ను పట్టుకొని తిరగాలా 53 00:04:41,782 --> 00:04:43,575 - ఆ పని నేను చేయను, హారి. ఇది... - హేయ్! 54 00:04:48,288 --> 00:04:49,748 వెళ్లు, గాల్! 55 00:04:49,748 --> 00:04:52,626 అతడిని తీసుకెళ్లు, అలా అయితేనే మనం ఇక్కడి నుండి వెళ్లగలం. 56 00:04:54,419 --> 00:04:56,505 వాటిని "పరిశ్రమ స్థూపాలు" అని అంటారు. 57 00:04:57,172 --> 00:04:59,216 వాటిని దగ్గరి నుండి చూసే అరుదైన భాగ్యం మనకి లభించనుంది. 58 00:05:00,425 --> 00:05:04,263 - మేము లేనప్పుడు జాగ్రత్త. - ఎందుకు? ఈ గ్రహం నిర్మానుష్యంగానే ఉందిగా. 59 00:05:04,263 --> 00:05:06,557 దానర్థం మనం ఒంటరిగా ఉన్నామని కాదు కదా. 60 00:05:23,240 --> 00:05:25,784 వార్డెన్ అలా దహించుకుపోవడం ఊహించడానికి కష్టంగా ఉంది. 61 00:05:26,535 --> 00:05:28,745 - అది చాలా దారుణం. - ఏమైనా లోపం జరిగిందేమో. 62 00:05:29,580 --> 00:05:31,373 ఎంతైనా వాల్ట్ కూడా ఒక పరికరమే కదా. 63 00:05:31,373 --> 00:05:32,457 కాదు. 64 00:05:33,166 --> 00:05:37,129 వాల్ట్ అంటే ఒక వ్యక్తి, హారి సెల్డన్ కి నిలువెత్తు రూపం అది. 65 00:05:37,129 --> 00:05:39,756 మీరు ఇక్కడ చేసే పనులు ఆయనకి నచ్చవని మీకు చెప్పాను కదా. 66 00:05:39,756 --> 00:05:42,217 ఇది దైవం విధించిన శిక్ష అంటావా, క్లెరిక్? 67 00:05:42,217 --> 00:05:44,595 దైవం విధించింది అయినా కాకపోయినా, ఇది శిక్షే కదా. 68 00:05:46,096 --> 00:05:47,306 ఏదేమైనా, 69 00:05:47,306 --> 00:05:49,933 ఏడుస్తూ, భయపడుతూ గడిపేంత సమయం మనకి లేదు. 70 00:05:51,018 --> 00:05:56,148 సెల్డన్ గణితం, నిర్దిష్టంగా హోబర్ మాలో అనే పేరు ఎలా చెప్పగలిగింది, 71 00:05:56,148 --> 00:05:59,818 అతడిని వెతికి పట్టుకోవడం ఒక ఎత్తైతే, అసలు అతను ఇప్పటికి పుట్టి ఉన్నాడో లేదో కూడా తెలీదు. 72 00:05:59,818 --> 00:06:02,237 వాల్ట్ అభ్యర్థిస్తోందో, లేదో మనకి ఖచ్చితంగా తెలీదు కదా. 73 00:06:02,237 --> 00:06:04,239 - అది హెచ్చరిక కూడా కావచ్చు. - అవును. 74 00:06:04,239 --> 00:06:06,950 ఆ చెత్తగాడిని మనం వాల్ట్ దరిదాపుల్లోకి కూడా 75 00:06:06,950 --> 00:06:09,161 - తీసుకెళ్లకూడదు. - కామెడీ చేయవద్దు. 76 00:06:09,161 --> 00:06:10,829 మనం హోబర్ మాలో ఆచూకీని తప్పక కనిపెట్టాలి. 77 00:06:10,829 --> 00:06:12,456 అతడిని వాల్ట్ దగ్గరికి తీసుకెళ్లాలి కూడా. 78 00:06:12,456 --> 00:06:15,083 సైకో హిస్టరీలో ఒక్క మార్గమే ఉండదు కదా, పోలీ. 79 00:06:15,083 --> 00:06:18,545 ఒక్క మార్గమే ఉండదు, కానీ ఒక్కోసారి అది కాస్త ప్రమాదమైన చేయాల్సిందే, 80 00:06:18,545 --> 00:06:21,632 లేదంటే దానికన్నా భయంకరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. 81 00:06:21,632 --> 00:06:24,218 అందుకే మనం దాన్ని విపత్తు అని అంటున్నాం. 82 00:06:24,218 --> 00:06:29,806 తొలి విపత్తులో విజయం సాధించాలంటే దానికి తగ్గ చర్య అవసరమవుతుందని సెల్డన్ కి తెలుసు. 83 00:06:29,806 --> 00:06:33,018 అప్పుడు మనం తీసుకున్న చర్య ఏంటంటే, ఒక వ్యక్తిని సారథిగా ఎంచుకోవడం. 84 00:06:33,018 --> 00:06:34,144 {\an8}శాల్వార్ హార్డిన్. 85 00:06:34,144 --> 00:06:37,773 {\an8}కానీ ఆ సమయంలో శాల్వార్ హార్డిన్ అనే పేరును హారి సెల్డన్ కనుక ప్రస్తావించి ఉంటే, 86 00:06:37,773 --> 00:06:39,024 నువ్వు చెప్పేది అర్థవంతంగా ఉండేది. 87 00:06:40,067 --> 00:06:41,068 పోలీ? 88 00:06:42,945 --> 00:06:44,238 లేదు. 89 00:06:44,238 --> 00:06:47,491 అయితే, మన కొత్త చర్య హోబర్ మాలోని కనిపెట్టడమని అంటావా? 90 00:06:47,491 --> 00:06:48,909 చూడు, నాకు కారణమేంటో తెలీదు. 91 00:06:49,576 --> 00:06:53,163 కానీ, సెల్డన్ ప్లాన్స్ విషయంలో మన దగ్గర ఆ పేరు తప్ప ఇంకోటేదీ లేదు. 92 00:06:53,163 --> 00:06:54,456 నువ్వు అసలు ఇలాంటివి నమ్మవు కదా. 93 00:06:54,456 --> 00:06:56,124 నేను సైకో హిస్టరీని నమ్ముతా. 94 00:06:56,124 --> 00:06:58,669 సామ్రాజ్యం కుప్పకూలనుందని నమ్ముతా. 95 00:06:58,669 --> 00:07:02,172 తెలివిగా పని చేసి, ఆ పని సఫలమయ్యేలా చూడటం మన బాధ్యతే. 96 00:07:03,298 --> 00:07:07,010 సెల్డన్ మనకి అందించిన వాటిని ఉపయోగించి 97 00:07:07,010 --> 00:07:09,388 ఆ భయంకరమైన మార్గం గుండా 98 00:07:09,388 --> 00:07:11,765 ఆ సన్నాసి హోబర్ మాలోతో కలిసి ప్రయాణించాలి, లేదంటే మనుషులందరూ 99 00:07:11,765 --> 00:07:14,601 చాలా కాలంపాటు ఆటవిక పశువులు అయిపోతారు. 100 00:07:16,019 --> 00:07:17,271 సరే. 101 00:07:17,896 --> 00:07:19,022 హోబర్ మాలో? 102 00:07:19,815 --> 00:07:23,026 ఆ పేరు వినడం ఇదే తొలిసారి. అది అస్సలు ఒక వ్యక్తి పేరే అంటావా? 103 00:07:23,026 --> 00:07:26,780 నన్ను అడిగితే, మాలో ఒక ప్రాంతం కావచ్చు, లేదా పిచ్చిపట్టిన వ్యక్తి కావచ్చు. 104 00:07:26,780 --> 00:07:29,116 నాకు తెలిసి, అతను పిచ్చోడే అనుకుంటా. 105 00:07:29,116 --> 00:07:30,659 మత గురువు అవ్వాలని శిక్షణ పొందాడు, 106 00:07:30,659 --> 00:07:32,911 కానీ అతడిని హ్యాండిల్ చేయడం మతపెద్దల వల్ల కాదు. 107 00:07:32,911 --> 00:07:37,708 దానికి బదులుగా, నా తోటి మత ప్రచారకులకు అతను తెగులులా తగులుకున్నాడు, 108 00:07:37,708 --> 00:07:41,378 మతపరమైన వస్తువులను, నకిలీ చారిత్రాత్మక వస్తువులను అమ్మేవాడు. 109 00:07:41,378 --> 00:07:45,132 ఫౌండేషన్ అతని వాణిజ్య లైసెన్సును రద్దు చేసే ముందు 110 00:07:45,132 --> 00:07:47,968 సెల్డన్ చేతి వేలి ఎముకలని చెప్పి 38 చేతి వేలి ఎముకలను అమ్మాడు. 111 00:07:47,968 --> 00:07:49,887 అలాంటి వాడి కోసం ప్రాఫెట్ ఎందుకు అడిగాడంటావు? 112 00:07:49,887 --> 00:07:52,264 సెల్డన్ కి మంచి జోకులంటే ఇష్టం. 113 00:07:52,264 --> 00:07:54,099 అతను కూడా మనిషే కదా? 114 00:07:54,725 --> 00:07:57,895 ప్రాఫెట్ అనే తోకను, మనమే ఆయనకి తగిలించాం. 115 00:07:57,895 --> 00:08:02,107 - మరి మన పయనం ఎటు? - నా ఇన్ఫార్మర్ల ప్రకారం కొరెల్ గ్రహానికి. 116 00:08:02,107 --> 00:08:03,859 వసేలియన్ రిఫ్టులో ఉండే గ్రహమే కదా అది? 117 00:08:04,860 --> 00:08:06,153 వర్తకులని అసలు అక్కడికి రానివ్వరు కదా. 118 00:08:06,153 --> 00:08:10,324 అతను నిషేధాన్ని సవాలుగా స్వీకరించే రకం. 119 00:08:10,324 --> 00:08:13,493 నిషేధం అనే పదం వింటే, హోబర్ కి ఊపు వస్తుంది. 120 00:08:54,785 --> 00:08:55,786 ఏంటి అవి? 121 00:08:56,578 --> 00:08:58,247 గనులను తవ్వే, కృతిమ మేధస్సు గల యంత్రాలు. 122 00:08:59,289 --> 00:09:01,458 గ్రహంలోని పల్లాడియమ్ ని పీల్చి పిప్పి చేశాయి. 123 00:09:01,458 --> 00:09:03,418 ఆ తర్వాత, గ్రహంలో విలువైనది ఏదీ లేనప్పుడు, 124 00:09:03,418 --> 00:09:05,379 జనంపై విరుచుకుపడ్డాయి. 125 00:09:06,630 --> 00:09:11,093 మహారాజులు హృదయం లేని వాళ్లు, వాళ్ల ప్రపంచాలను నాశనం చేయడమే వాళ్లకి తెలుసు. 126 00:09:12,052 --> 00:09:13,345 ఇవన్నీ నీకెలా తెలుసు? 127 00:09:13,345 --> 00:09:14,888 అసలు ఎందుకు తెలుసుకున్నావు ఇవన్నీ? 128 00:09:14,888 --> 00:09:17,307 దాన్నే సైకో హిస్టరీ అంటారు గాల్. 129 00:09:17,307 --> 00:09:20,394 హారి, నేను నీకు సాయపడగలను. కానీ నువ్వు నాకు మొత్తం విషయం చెప్పాలి. 130 00:09:20,394 --> 00:09:23,730 ఈ సమస్త విశ్వంలో, రేడియంట్ ని చదవగలిగింది, నువ్వు కాక నేనొక్క దాన్నే. 131 00:09:23,730 --> 00:09:25,858 అవును, కానీ నువ్వు చక్కగా ఉండవు. 132 00:09:25,858 --> 00:09:28,360 ఎంత సేపూ ఇలాగే కొట్టుకుంటూ ఉంటాం మనం. 133 00:09:29,111 --> 00:09:31,446 మనం రేడియంట్ అభ్యర్థన మేరకు ఇక్కడికి వచ్చాం. 134 00:09:32,281 --> 00:09:35,200 నీకు కావాల్సింది అడ్డుకొనే పిచ్చి పనేమీ కాదు ఇది. 135 00:09:35,200 --> 00:09:37,327 నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ చెంప చెళ్ళుమనిపించడం. 136 00:09:38,036 --> 00:09:39,371 అది ఇదివరకే ప్రయత్నించి చూశావు కదా. 137 00:09:39,371 --> 00:09:41,248 నేను శాల్వార్ గురించి మాట్లాడుతున్నా. 138 00:09:42,457 --> 00:09:44,376 నువ్వు తనకి ఆశ కలిగిస్తున్నావు. 139 00:09:45,294 --> 00:09:46,295 అది తప్పు. 140 00:09:46,879 --> 00:09:49,715 నువ్వు చూసిన భవిష్యత్తును మార్చడం కుదరకపోవచ్చు. 141 00:09:49,715 --> 00:09:53,010 "ఇగ్నిస్" అని నేను చెప్పగానే నువ్వు సంబరపడ్డావు, తగిన పని చేద్దామనుకున్నావు. 142 00:09:53,010 --> 00:09:54,595 ఇప్పుడు అదే నేను చేస్తుంటే, తప్పైపోయిందా? 143 00:09:54,595 --> 00:09:56,847 మనిద్దరి చర్యలకి ఒక తేడా ఉంది, అది ఈపాటికే నువ్వు గ్రహించి ఉండాల్సింది. 144 00:09:56,847 --> 00:10:01,310 భవిష్యత్తులో జరగబోయే పెద్ద సంఘటనలు సరిచేయడానికి నా ప్లాన్స్ ఇప్పుడు చిన్న చిన్న మార్పులు చేస్తాయి. 145 00:10:01,310 --> 00:10:04,271 కానీ నువ్వు భవిష్యత్తులో జరగబోయే ఒక చిన్న ఘటనకు మాత్రమే అతుక్కుపోయి ఉన్నావు, 146 00:10:04,271 --> 00:10:06,565 ఒక మనిషి మరణానికి అన్నమాట, 147 00:10:06,565 --> 00:10:09,401 దాన్ని నివారించడానికి, ఇప్పుడు చాలా పెద్ద మార్పులని సృష్టించాలనుకుంటున్నావు. 148 00:10:09,401 --> 00:10:12,321 - శాల్వార్ వల్లే తొలి విపత్తు నుండి బయటపడగలిగాం. - తనకి సాయం అందింది. 149 00:10:12,905 --> 00:10:14,781 ప్రతి చారిత్రక పరిస్థితి కూడా తనకి అనుకూలంగానే ఉండింది. 150 00:10:14,781 --> 00:10:16,950 తను కాకపోతే, ఇంకెవరైనా సరి చేసి ఉండేవారు. 151 00:10:16,950 --> 00:10:18,035 పరిస్థితులా? 152 00:10:18,035 --> 00:10:21,121 టర్మినస్ లో నువ్వు సైకోహిస్టోరియన్లను పెట్టలేదే 153 00:10:21,121 --> 00:10:24,333 - తన సామర్థ్యం వల్లే కాకపోతే... - టర్మినస్ లో ఒక సైకోహిస్టోరియన్ ని 154 00:10:24,333 --> 00:10:25,626 పెడదామనే నేను భావించాను. 155 00:10:26,335 --> 00:10:27,336 అవును కదా? 156 00:10:28,212 --> 00:10:30,506 అనుకున్న విధంగా జరిగి ఉంటే, 157 00:10:31,298 --> 00:10:34,009 నీ కూతురికి నా వాల్ట్ గురించి మొత్తం వివరించి ఉండేదానివి. 158 00:10:34,593 --> 00:10:38,055 నువ్వు పెద్ద పిస్తావని ఫీల్ అయిపోతున్నట్టున్నావుగా. 159 00:10:38,055 --> 00:10:40,349 గాల్, నా ప్లాన్ అదే. 160 00:10:41,475 --> 00:10:45,145 కానీ తగినంత పరిమాణంలో ఉంటే, నేను పిస్తాని కానే కాదు. 161 00:11:05,374 --> 00:11:07,125 ఇది మనిద్దరికి మాత్రమే పరిమితం కాదు. 162 00:11:08,502 --> 00:11:09,878 - ఏంటి? - ఇందాక అన్నావు కదా, 163 00:11:09,878 --> 00:11:12,965 రేడియంట్ ని చదవగిలిగింది నేను కాక నువ్వొక దానివే అని. 164 00:11:12,965 --> 00:11:14,716 అది నిజం కాదు. 165 00:11:16,218 --> 00:11:18,762 నాకు యానా అనే జీవిత భాగస్వామి ఉండేది. 166 00:11:18,762 --> 00:11:21,306 సైకో హిస్టరీ నిర్మాణంలో తను నాకు సాయపడింది. 167 00:11:21,306 --> 00:11:24,017 అది మా ఇద్దరి ఏకైక సంతానం అని చెప్పవచ్చు. 168 00:11:24,017 --> 00:11:26,019 అంటే, సఫలమైంది అనుకో. 169 00:11:29,439 --> 00:11:31,149 అప్పుడే మొత్తం తాగేయకు. 170 00:11:31,817 --> 00:11:33,569 ఇంకా మనం చాలా దూరం వెళ్లాలి. 171 00:11:34,486 --> 00:11:35,904 నువ్వు 500 మీటర్లే అన్నావు కదా, 172 00:11:36,738 --> 00:11:38,031 అది హారిజాంటల్ దూరం. 173 00:11:43,662 --> 00:11:46,081 హారి, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి, లేదంటే అయిపోతావు. 174 00:11:46,081 --> 00:11:47,457 మంచి ప్రతిఫలమే దక్కుతుంది. 175 00:11:48,667 --> 00:11:50,169 మనం ఓ పాత నేస్తాన్ని కలవబోతున్నాం. 176 00:11:50,169 --> 00:11:52,129 పాత నేస్తాన్నా? 177 00:12:39,760 --> 00:12:41,845 {\an8}లెప్సిస్ పీనల్ కాలనీ 178 00:12:48,602 --> 00:12:50,771 442 నంబర్ ఖైదీ, పైకి లేయ్! 179 00:12:53,941 --> 00:12:55,067 లేయ్! 180 00:13:07,621 --> 00:13:08,622 ఆగు! 181 00:13:09,164 --> 00:13:12,209 429 నంబర్ ఖైదీని వదిలేయ్, 713 నంబర్ ఖైదీ. 182 00:13:12,209 --> 00:13:15,045 ఒక్క నిమిషం ఓపిక పట్టు. అతని కోటాను అతను పూర్తి చేస్తాడు. 183 00:13:21,885 --> 00:13:23,595 అతను ఇలా కావాలని చేయట్లేదు. 184 00:13:24,596 --> 00:13:26,849 పని చేయగల సత్తా ఇంకా ఇతనిలో ఉంది. 185 00:14:02,926 --> 00:14:03,927 బెల్ రియోస్. 186 00:14:04,595 --> 00:14:05,888 డెమెర్జల్. 187 00:14:06,722 --> 00:14:08,056 నేను ఒక ఆఫరుతో వచ్చా. 188 00:14:08,056 --> 00:14:10,726 మహారాజుకు 20వ బలగం యొక్క వీరుడు కావాలి. 189 00:14:10,726 --> 00:14:12,227 కొన్ని యుద్ధాలు చేయాల్సిన పనుంది. 190 00:14:14,605 --> 00:14:16,565 - ఎక్కడ? - అంచు భాగంలో. 191 00:14:16,565 --> 00:14:19,193 ముందు నోర్మానిక్ సెక్టారులో ఉన్న సివెన్నా గ్రహంలో ప్రారంభించాలి. 192 00:14:19,193 --> 00:14:20,944 ఒక కొత్త శత్రువు పుట్టుకొచ్చాడు. 193 00:14:20,944 --> 00:14:22,863 సివెన్నా మారుమూల ఉన్న, ఎందుకూ పనికిరాని చోటు. 194 00:14:23,530 --> 00:14:25,365 ఇక్కడ ఉన్న ఒకరు ఆ మాటలు అన్నారు. 195 00:14:26,158 --> 00:14:28,118 మిషన్ పూర్తి చేయ్, స్వేచ్ఛ లభిస్తుంది. 196 00:14:30,078 --> 00:14:31,580 ఎందుకంత బంపర్ ఆఫర్? 197 00:14:31,580 --> 00:14:35,083 - నువ్వు ఒప్పుకోవని పగటి రాజు భావించాడు. - హా. అతని భావన నిజమే. 198 00:14:35,709 --> 00:14:38,587 అతని నాయకత్వంలో స్థిరత్వం కానీ, ఆలోచన కానీ ఉండదు. 199 00:14:38,587 --> 00:14:41,965 అది నీకు మేలే కదా? 200 00:14:43,383 --> 00:14:44,635 వీరి స్వేచ్ఛ కూడా కావాలి నాకు. 201 00:14:46,011 --> 00:14:50,015 ఇంకో విషయం, ఈ షరతులన్నీ నేను నీతో రావడానికి కాదు. 202 00:14:51,183 --> 00:14:54,061 నీతో మాట్లాడటానికే ఈ షరతులన్నీ. 203 00:14:54,061 --> 00:14:58,023 నీ తోటి నావికులకు సురక్షితమైన మార్గాన్ని కోరావు, అందుకే నిన్ను లెప్సిస్ కి పంపించారు. 204 00:14:58,774 --> 00:15:01,193 మళ్లీ అదే తప్పు చేసి ఇక్కడే ఉండిపోతావా? 205 00:15:01,193 --> 00:15:03,779 వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. 206 00:15:03,779 --> 00:15:05,113 స్వేచ్ఛ కష్టం. 207 00:15:08,242 --> 00:15:11,912 సుదీర్ఘ కాలం పాటు విరామాలు, మెరుగైన సామాగ్రి, వైద్య సదుపాయాలు కల్పించబడతాయి. 208 00:15:18,168 --> 00:15:19,169 సరే. 209 00:15:20,170 --> 00:15:23,966 ఇప్పుడు నేను మళ్లీ ఇక్కడికి రావాలా, లేదా అనేదాని గురించి మాట్లాడుకుందాం. 210 00:15:26,593 --> 00:15:27,886 నాకు స్వయంప్రతిపత్తి కావాలి. 211 00:15:28,554 --> 00:15:30,806 మహారాజు మధ్యలో వేలు పెట్టకూడదు. 212 00:15:30,806 --> 00:15:32,641 అదే ప్లాన్. 213 00:15:33,225 --> 00:15:34,393 నా వెంటే రా. 214 00:15:34,393 --> 00:15:40,065 తూర్పుకు తిరిగి దండం పెట్టమని మహారాజుకు చెప్పు. 215 00:15:42,651 --> 00:15:45,112 రాను అని నువ్వంటే ఓ పని చేయమని నన్ను ఆదేశించారు. 216 00:15:46,572 --> 00:15:48,198 చావంటే నాకు భయం లేదు. 217 00:15:49,116 --> 00:15:50,450 అందుకే మాకు నువ్వు కావాలి. 218 00:15:52,828 --> 00:15:55,414 నిన్ను ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. 219 00:15:57,374 --> 00:15:58,834 గ్లేవన్ కర్. 220 00:16:05,632 --> 00:16:12,347 ఆరేళ్ల క్రిందటే నా భర్తకి మహారాజు మరణ శిక్ష వేశాడు. 221 00:16:12,973 --> 00:16:14,933 అతడిని చంపేశారని నీకు చెప్పారు. 222 00:16:14,933 --> 00:16:16,727 అది కూడా నీ శిక్షలో భాగమే. 223 00:16:21,064 --> 00:16:22,524 నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. 224 00:16:23,609 --> 00:16:24,985 మహారాజే నీకు వివరిస్తాడు. 225 00:16:24,985 --> 00:16:27,613 అంతా సవ్యంగా జరిగితే, నీ భర్తని నువ్వు చూస్తావు. 226 00:16:36,288 --> 00:16:37,873 ఆశ అనేది బాధాకరంగానే ఉంటుంది. 227 00:16:39,124 --> 00:16:40,250 నువ్వు ఆశ పెట్టుకోనక్కర్లేదు. 228 00:16:41,043 --> 00:16:42,211 నాతో రా చాలు. 229 00:17:24,086 --> 00:17:26,839 మనం వెళ్లాల్సిన చోటు, ఈ తలుపుకు అవతల వైపు ఉంటుంది. 230 00:17:28,674 --> 00:17:31,760 తలుపులు అంటే కీళ్లు, గడిలు ఉండాలి. 231 00:17:32,636 --> 00:17:33,971 ఇది గోడ. 232 00:17:33,971 --> 00:17:36,306 గోడను తెరువు, తలుపు అయిపోతుంది. 233 00:18:55,844 --> 00:18:58,388 ఇసుక మీద నడుస్తూ రావడం 234 00:18:58,388 --> 00:19:01,016 ఎంత కష్టపడటానికైతే సిద్ధమయ్యావో, అంత కష్టంగా నీకు అనిపించలేదనే ఆశిస్తున్నా. 235 00:19:01,016 --> 00:19:02,809 నాకు మీరు ఎవరో తెలుసు. 236 00:19:02,809 --> 00:19:05,812 మీ ముఖాన్ని చిత్రాలలో చూశాను... ఆ మాట్లాడే విధానం కూడా నాకు సుపరిచితమే. 237 00:19:07,981 --> 00:19:09,024 మీరు కాలె, కానీ... 238 00:19:10,359 --> 00:19:12,694 మీరు ఎన్నో శతాబ్దాల క్రితమే చనిపోయారు కదా. మరి ఇలా ప్రాణంతో ఎలా ఉన్నారు? 239 00:19:12,694 --> 00:19:15,531 మనం మళ్లీ కలుసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకుందాంలే. 240 00:19:17,032 --> 00:19:20,202 ఒకవేళ భవిష్యత్తులో మనం కలుసుకొనే అవకాశం వస్తే. 241 00:19:20,953 --> 00:19:22,120 నువ్వు వెళ్లిపో. 242 00:19:22,996 --> 00:19:23,997 అలా అంటావేంటి! 243 00:19:23,997 --> 00:19:26,124 రేడియంట్ నుండి దూరంగా ఉండలేను అని అన్నావు కదా. 244 00:19:26,124 --> 00:19:29,253 సంపూర్ణ డిజిటల్ స్వరూపానికి ఏం కాకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. 245 00:19:29,878 --> 00:19:32,756 - అతను నెట్టుకురాగలడు. - నెట్టుకురాగలగడం ఏంటి? 246 00:19:32,756 --> 00:19:37,135 తర్వాత ఏం జరగబోతుందో నాకు తెలీదు. కాబట్టి మనం తుది వీడ్కోలు చెప్పుకుంటే మేలేమో. 247 00:19:37,135 --> 00:19:41,390 ఆరు గంటల్లో నేను రాకపోతే, మీరు వెళ్లిపోండి. 248 00:19:41,390 --> 00:19:44,309 బెగ్గర్ నియంత్రణని ఎప్పుడో శాల్వార్ కి బదిలీ చేసేశాను. 249 00:19:44,309 --> 00:19:45,936 ఆగు, వెళ్లిపోకు! 250 00:19:46,645 --> 00:19:48,981 అయ్యో! 251 00:20:01,076 --> 00:20:04,580 {\an8}కొరెల్ వసేలియన్ రిఫ్ట్ 252 00:20:15,174 --> 00:20:17,217 దీన్ని పరిశీలించమని మిమ్మల్ని కోరడం జరిగింది. 253 00:20:18,177 --> 00:20:20,429 మహా వర్తకుడు పోన్యెట్స్ మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు, సర్. 254 00:20:25,893 --> 00:20:28,187 కమ్యూనికేషన్స్ వ్యవస్థని ప్రారంభించండి. 255 00:20:37,946 --> 00:20:42,075 కొమ్డోర్ ఆర్గో, నా నమస్కారములు స్వీకరించండి. 256 00:20:42,075 --> 00:20:43,243 మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. 257 00:20:43,243 --> 00:20:45,329 మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. 258 00:20:45,329 --> 00:20:48,498 పోన్యెట్స్, మీలాంటి వాళ్ల గురించి మాకు బాగా తెలుసు. 259 00:20:49,249 --> 00:20:53,837 మతంతో జోడించబడిన ఏ వ్యాపార లావాదేవీని కూడా నా జనాలు అంగీకరించరు. 260 00:20:53,837 --> 00:20:57,341 లేదు. నేను మహా వర్తకుడిని. డబ్బే నా మతం, ఇంకా... 261 00:20:59,176 --> 00:21:00,344 కొమ్డోర్? 262 00:21:00,844 --> 00:21:01,929 ఒక్క నిమిషం ఆగు. 263 00:21:03,639 --> 00:21:05,265 ఇతను పోన్యెట్స్ కాదు. 264 00:21:05,265 --> 00:21:08,727 అతను హోబర్ మాలో, పరమ కేటుగాడు. 265 00:21:10,395 --> 00:21:14,566 ఫోర్సర్, అతను నాకు ఒక పనికిరాని పరికరాన్ని అమ్మాలని చూస్తున్నాడని నాకు తెలుసు. 266 00:21:15,567 --> 00:21:17,277 అదీగాక దానికి మన ఖజానాలో సగం అడుగుతాడు చూడు. 267 00:21:17,277 --> 00:21:20,280 వాడితో మంచిగా మాట్లాడుతూనే వాడొక మోసగాడని అందరికీ తెలిసేలా చేస్తాను. 268 00:21:21,031 --> 00:21:22,366 ఏం చేయాలో నాకు తెలుసు. 269 00:21:23,784 --> 00:21:25,619 నేనొక మోసగాడినని మీ ఫోర్సర్ చెబుతోందా? 270 00:21:26,411 --> 00:21:29,039 అవును, తను అన్నది నిజమే. వ్యాపారం చేసేవారందరూ మోసగాళ్లే మరి. 271 00:21:29,039 --> 00:21:33,877 కానీ, ఓ మహాశయా, మోసగాడికి కూడా ఒక అద్భుతమైన తారసపడవచ్చు కదా. 272 00:21:33,877 --> 00:21:36,129 నీ ఆత్మవిశ్వాసం చూస్తే ముచ్చటేస్తుంది, పోన్యెట్స్. 273 00:21:37,005 --> 00:21:37,923 సరే మరి. 274 00:21:37,923 --> 00:21:40,175 నీ అద్భుతమేంటో చూపించు. 275 00:21:40,175 --> 00:21:43,220 దీన్ని తారుమారు పరికరం అంటారు. 276 00:21:43,220 --> 00:21:48,976 కొరెల్ నేత్రం అంటే మీకు ఎంత ఇష్టమో, దీనిపై కూడా మీరు అంతే ఇష్టం పెంచుకుంటారన్న నమ్మకం నాకు ఉంది. 277 00:21:53,647 --> 00:21:54,940 అది మామూలుగానే ఉందే. 278 00:21:55,440 --> 00:21:57,442 "తారుమారు" అనే పదాన్ని మేమెప్పుడూ వినలేదు. 279 00:21:57,442 --> 00:21:59,736 చదరంగ ఆటలో తప్ప. 280 00:21:59,736 --> 00:22:01,071 సరిగ్గా చెప్పారు. 281 00:22:01,071 --> 00:22:06,618 అవును, రాజు, ఏనుగు చదరంగంలో తమ స్థానాలు మార్చుకుంటాయి కదా, ఆ ట్రిక్ పేరే దీనికి పెట్టడం జరిగింది. 282 00:22:06,618 --> 00:22:09,621 క్వాంటమ్ ఎంట్యాంగెల్మెంట్ పై పని చేస్తున్న ఒక శాస్త్రవేత్త, 283 00:22:09,621 --> 00:22:11,206 ఒక జీవిని సుదూర దూరాలకు తరలించగల పద్ధతిని 284 00:22:11,206 --> 00:22:15,169 అనుకోకుండా కనిపెట్టేశాడు, 285 00:22:15,169 --> 00:22:17,880 కాకపోతే, ఆ జీవికి ఎంత ద్రవ్యరాశి అయితే ఉంటుందో, అవతలి వ్యక్తికి కూడా ఇంచుమించుగా 286 00:22:17,880 --> 00:22:19,381 అంతే ద్రవ్యరాశి ఉండాలి. 287 00:22:19,381 --> 00:22:23,135 ఇది నీ చేతికి ఎలా వచ్చింది? 288 00:22:23,135 --> 00:22:27,347 ఆ శాస్త్రవేత్త తన ప్లాన్స్ ని మహారాజుకు ఇవ్వడానికి నిరాకరించాడు. 289 00:22:27,347 --> 00:22:29,433 దాన్ని చెడు పనులకు వాడతారేమో అని ఆమె భయపడింది. 290 00:22:30,475 --> 00:22:34,229 అంటే, పౌర నివాస ప్రాంతాలలోకి సాయుధ సైనికులకు పంపడం. 291 00:22:34,229 --> 00:22:37,941 ఖైదీలలోకి బాంబులు పెట్టేసి, రాజకీయ ప్రచారాల మధ్యలోకి 292 00:22:37,941 --> 00:22:39,484 వారిని తరలించడం. 293 00:22:41,403 --> 00:22:43,071 - చాలా దారుణమైన పనులవి. - అవును. 294 00:22:43,071 --> 00:22:45,699 మీలాంటి ధర్మాత్ముడే 295 00:22:45,699 --> 00:22:47,701 దీన్ని సరైన విధంగా ఉపయోగించగలరని మీ వద్దకు తీసుకొచ్చాను. 296 00:22:47,701 --> 00:22:48,994 కానీ అది వాడటం క్షేమమేనా? 297 00:22:48,994 --> 00:22:51,955 కొరెల్ లో, మేము చాలా భయంకరమైన కథలు విన్నాం, 298 00:22:51,955 --> 00:22:55,083 ఒక గ్రహం నుండి మరో గ్రహానికి టెలిపోర్ట్ చేయబడిన మనుషులు నరకయాతన అనుభవిస్తూ చనిపోయారని. 299 00:22:55,083 --> 00:22:58,212 లేదు, అదేం లేదు. కంగారుపడనక్కర్లేదు, కొమ్డోర్, సరేనా? 300 00:22:58,212 --> 00:23:03,884 శరీరంలోని బయోఎలక్ట్రికల్ ఫీల్డులో ఉండేదంతా కూడా 301 00:23:04,468 --> 00:23:05,511 టెలిపోర్ట్ అవుతుంది. 302 00:23:05,511 --> 00:23:08,722 కాబట్టి, శరీరం బయటే ఉండే వస్తువులే తరలింపబడవు. 303 00:23:09,431 --> 00:23:10,974 బట్టల వంటివి. 304 00:23:11,892 --> 00:23:13,227 అంటే నగ్నంగా టెలిపోర్ట్ అవుతారా? 305 00:23:13,227 --> 00:23:15,604 కాదు. 306 00:23:15,604 --> 00:23:21,401 టెలిపోర్ట్ అయ్యే వ్యక్తికి అవతలి వ్యక్తి బట్టలు ఉంటాయి కదా. 307 00:23:22,444 --> 00:23:26,782 - అలాగా. - నా దగ్గర ప్రధాన బ్రేస్ లెట్ ఉంది, 308 00:23:27,449 --> 00:23:30,410 నా నౌక బయట ఉండే అసిస్టెంట్ దగ్గర 309 00:23:30,410 --> 00:23:31,828 మీ దగ్గర ఉన్న బ్రేస్ లెట్ లాంటిదే ఉంది. 310 00:23:31,828 --> 00:23:33,872 నువ్వు మోసగించే అవకాశం ఉంది. 311 00:23:33,872 --> 00:23:34,957 అవునవును. 312 00:23:34,957 --> 00:23:37,835 మనకి ఎదురయ్యేదాకా అన్నీ మోసాలే. 313 00:23:37,835 --> 00:23:41,755 ఎలాగూ ఒక బ్రేస్ లెట్ ని పంపావు కదా, దాన్నే వాడు మరి. 314 00:23:42,631 --> 00:23:43,465 ఏమన్నారు? నేను... 315 00:23:43,465 --> 00:23:45,759 క్షేమంగా వాడవచ్చని అన్నావు కదా... 316 00:23:48,053 --> 00:23:50,222 - కాబట్టి నన్ను టెలిపోర్ట్ చేయ్. - అంటే... అలా నేను చేయలేను. 317 00:23:50,222 --> 00:23:53,934 రాజులకు, సామాన్య పౌరులకు మధ్య టెలిపోర్టింగ్ చేయకూడదని నియమాలు ఉన్నాయి. 318 00:23:53,934 --> 00:23:58,480 ఈసారికి వాటిని రద్దు చేస్తున్నాను. చేయ్, లేదంటే నీ తల నరికి గుమ్మానికి వేలాడదీయిస్తా. 319 00:23:58,480 --> 00:23:59,690 మీరు మరీ బలవంత పెట్టేస్తున్నారు. 320 00:24:09,283 --> 00:24:12,411 కొరెల్ ప్రజలారా, మీకు వందనాలు. 321 00:24:18,584 --> 00:24:20,335 - దీనికి నీకు ఎంత కావాలి? - ఇప్పటికే ఆలస్యమైపోయింది. 322 00:24:20,335 --> 00:24:21,712 నేను మనస్సు మార్చేసుకున్నా. 323 00:24:23,255 --> 00:24:24,131 ఫోర్సర్. 324 00:24:25,674 --> 00:24:27,134 వాడు కొరెల్ నేత్రాన్ని దొంగిలించాడు. 325 00:24:35,517 --> 00:24:37,060 అయ్యయ్యో. 326 00:24:43,525 --> 00:24:45,944 హోబర్ మాలో, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. 327 00:24:56,663 --> 00:24:58,290 మాలో, వజ్రాలను మింగేశావే. 328 00:24:58,790 --> 00:25:00,876 హా. నా బయోఎలక్ట్రికల్ ఫీల్డులో ఉండాలి కదా. 329 00:25:01,877 --> 00:25:03,879 హేయ్, హేయ్. దాని విషయంలో జాగ్రత్త. 330 00:25:03,879 --> 00:25:05,297 అది చాలా అరుదైన ప్రాచీన వైన్. 331 00:25:05,297 --> 00:25:06,381 వీడి నుండి ఆ పరికరాన్ని తీసేయండి. 332 00:25:07,466 --> 00:25:08,342 నేను తీయనా? 333 00:25:14,598 --> 00:25:16,433 విచారణ తర్వాత ఆ వైన్ నా దగ్గర ఉండాలి. 334 00:25:17,017 --> 00:25:18,227 విచారణ ఏం లేదమ్మా. 335 00:25:19,228 --> 00:25:21,563 నీకు మరణశిక్డ విధించమని కొమ్డోర్ ఆర్గో ఆదేశించేశాడు. 336 00:25:41,416 --> 00:25:44,753 నువ్వు బాగా తయారయ్యావని నాకు అనిపించినప్పుడు మహారాజు దగ్గరికి తీసుకువెళ్తాను. 337 00:25:55,556 --> 00:25:56,682 లేదు. 338 00:26:02,020 --> 00:26:04,398 పగటి రాజుని నేను ఇలాగే కలుస్తాను. 339 00:26:05,107 --> 00:26:06,733 నన్ను ఇలా మార్చింది అతనే. 340 00:26:12,781 --> 00:26:15,450 థ్యాంక్యూ, మహారాజా. 341 00:26:16,243 --> 00:26:19,037 లెప్సిస్ నుండి విడిపించినందుకు కృతజ్ఞతలు. 342 00:26:19,037 --> 00:26:21,248 హా, నీ వాలకం చూస్తుంటే తెలుస్తోందిలే. 343 00:26:23,083 --> 00:26:25,460 డెమెర్జల్ గారి పుణ్యమా అని నువ్వు బయటపడ్డావు, నా వల్ల కాదు. 344 00:26:25,460 --> 00:26:29,298 నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన వాహనం, మళ్లీ నిన్ను వెనక్కి కూడా తీసుకెళ్లగలదు. 345 00:26:30,799 --> 00:26:33,260 గ్లేవన్ ఇంకా బతికే ఉన్నాడని డెమెర్జల్ గారు అన్నారు. 346 00:26:33,260 --> 00:26:36,054 - గ్లేవన్... - ఆటలు ఆడవద్దు. 347 00:26:36,054 --> 00:26:37,890 అతను ఆ తలుపు వెనుక ఉన్నాడు. 348 00:26:37,890 --> 00:26:40,058 మన మాటలయ్యాకనే నువ్వు అతడిని కలుసుకోవడం జరిగేది. 349 00:26:40,058 --> 00:26:42,477 మన సంభాషణ నాకు నచ్చితే, నువ్వు అతడిని ప్రాణాలతో చూడగలవు. 350 00:26:43,562 --> 00:26:45,480 - మిషన్ ఏంటి? - నిఘా. 351 00:26:45,480 --> 00:26:48,317 - సివెన్నాలో మనకి ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. - అది గూఢచారి పని. 352 00:26:48,317 --> 00:26:50,068 సివెన్నా వల్ల సైనికపరంగా మనకు ఏ ముప్పూ లేదు. 353 00:26:51,236 --> 00:26:53,405 ఎడారి మొక్కలని వారు ఆయుధాలుగా మలిచే ప్రయత్నం చేస్తే తప్ప. 354 00:26:53,405 --> 00:26:55,532 కాబట్టి, మీ అసలైన ఆందోళన ఏంటో చెప్పండి. 355 00:26:55,532 --> 00:26:59,161 సుమారుగా వందేళ్ల క్రితం, నువ్వు ఎక్కడైతే నిలబడున్నావో, అక్కడే హారి సెల్డన్ అనే వ్యక్తి కూడా నిలబడ్డాడు. 356 00:27:00,078 --> 00:27:02,664 అతను ఫౌండేషన్ ని ఏర్పాటు చేస్తానని, దాని ద్వారా 357 00:27:02,664 --> 00:27:06,126 భవిష్యత్తును ఊహించి చెప్పి, రాబోయే చీకటి యుగాన్ని తగ్గిస్తానని చెప్పాడు. 358 00:27:06,126 --> 00:27:10,881 అతని మనుషులకు తగినంత సమయాన్ని ఇవ్వడంతో పాటు, వారిని దూరంగా ఉంచాలని అతని సాకు అని నా అభిప్రాయం. 359 00:27:10,881 --> 00:27:13,383 ప్రస్తుతం, అతని అనుచరులు అతడిని ఒక దేవుడిలా కొలుస్తున్నారు, 360 00:27:13,383 --> 00:27:16,428 సామ్రాజ్యం అంచున ఉండే లోకాలను వారి వైపుకు తిప్పుకుంటున్నారు. 361 00:27:17,179 --> 00:27:21,600 ఫౌండేషన్ వల్ల నాకేమైనా ముప్పు ఉందో లేదో నువ్వు కనిపెట్టి నాకు చెప్పాలి. 362 00:27:25,145 --> 00:27:26,355 వాళ్లు భవిష్యత్తును ఊచించి చెప్పగలరా? 363 00:27:26,355 --> 00:27:29,983 ఆ విషయం కూడా నువ్వు కనిపిట్టాలి. 364 00:27:30,859 --> 00:27:32,778 వెట్టిచాకిరీ వల్ల ఇతని సామర్థ్యాలు తగ్గిపోయాయి. 365 00:27:33,904 --> 00:27:35,155 అతడిని తీసుకెళ్లిపోండి. 366 00:27:35,155 --> 00:27:36,782 ఇతని భర్తని చంపేయండి. 367 00:27:39,201 --> 00:27:41,578 `నేను ముక్కుసూటిగా మాట్లాడవచ్చా, మహారాజా? 368 00:27:43,413 --> 00:27:44,748 అలాగే ఏకాంతంగా కూడా. 369 00:27:45,916 --> 00:27:47,084 కేవలం మనిద్దరమేనా? 370 00:27:50,754 --> 00:27:52,214 అలాగే. 371 00:28:02,349 --> 00:28:03,684 సోదరులారా, మీరు కూడా. 372 00:28:13,360 --> 00:28:15,529 - చెప్పు. - నువ్వు సన్నాసివి. 373 00:28:17,990 --> 00:28:22,703 నన్ను ఇక్కడికి చంపడానికే పిలిపించి ఉంటే, అంత కంటే వెర్రితనం ఇంకోటి ఉండదు. 374 00:28:22,703 --> 00:28:26,415 యుద్ధంలో నా ఆదేశాలను ధిక్కరించి, నన్ను అవమానించావు. 375 00:28:27,624 --> 00:28:30,043 ఒక మామూలు మనిషి దాన్ని భరించగలడేమో, మహారాజు అయితే అస్సలు సహించడు. 376 00:28:31,086 --> 00:28:35,591 మహారాజుకు గౌరవం ముఖ్యం, అది జీవితాంతం చూపించాల్సిన అవసరం ఉంది. 377 00:28:37,593 --> 00:28:40,262 మహారాజుకు గౌరవంతో పాటు గ్రహాల వ్యవస్థలు కూడా కావాలి. 378 00:28:41,889 --> 00:28:45,017 ఫౌండేషన్ వాటిని గుంజుకుంటోందంటే, 379 00:28:45,767 --> 00:28:49,438 అత్యంత సమర్థవంతమైన బలగం నీకు అవసరం అవుతుంది. 380 00:28:49,438 --> 00:28:51,607 ఇరవయ్యో బలగం ఇప్పుడు నీది కాదు. 381 00:28:53,483 --> 00:28:54,693 అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. 382 00:28:55,819 --> 00:28:58,155 నాపై నీకు కోపం, నిన్ను గౌరవించనందుకు కాదు కదా. 383 00:28:59,781 --> 00:29:01,742 నా చర్య వల్ల నువ్వు దద్దమ్మవి అయ్యావు, అంతే కదా? 384 00:29:02,784 --> 00:29:03,785 నువ్వు. 385 00:29:03,785 --> 00:29:07,873 ఈ తొక్కలో సూట్ వేసుకున్న పోటుగాడిలా ఫీల్ అయిపోతుంటావు, 386 00:29:07,873 --> 00:29:10,542 యుద్ధం జరిగే చోటు దరిదాపుల్లోకి కూడా రావు. 387 00:29:10,542 --> 00:29:12,836 - నన్ను కొట్టాలనుకుంటున్నావా? - కొట్టడం కాదు. 388 00:29:13,629 --> 00:29:15,380 నీ తల నరికేద్దాం అనుకుంటున్నా. 389 00:29:16,757 --> 00:29:20,177 - మరి కానివ్వు! - నేను ప్రమాణం చేశాను, నువ్వు నా రాజువి. 390 00:29:22,429 --> 00:29:23,847 - కొట్టు. - కొట్టలేను. 391 00:29:23,847 --> 00:29:26,642 - నన్ను కొట్టు, లేదంటే నీ భర్తని చంపేస్తా. - ఇంకో ఆటనా? 392 00:29:26,642 --> 00:29:29,102 నాకు ఏం సమాధానం కావాలంటావు? నువ్వు నన్ను కొట్టడం నాకు కావాలంటావా, 393 00:29:29,102 --> 00:29:31,772 నువ్వు కొడితే, నీ భర్త పేరు చెప్పి నిన్ను నా గుప్పెట్లో ఉంచుకోవచ్చని నాకు తెలుస్తుంది, 394 00:29:31,772 --> 00:29:36,193 లేదా నువ్వు కొట్టకుండా ఉండటం నాకు కావాలంటావా, అలా చేస్తే ఏం జరిగినా నన్ను కాపాడతావని నాకు తెలుస్తుంది. 395 00:29:36,193 --> 00:29:38,987 ఒక పని చేస్తే నీకు కావలసినదంతా నీకు దక్కుతుంది. 396 00:29:39,571 --> 00:29:42,491 ఇంకోటి చేస్తే, నీ భర్త చస్తాడు, నువ్వు మళ్లీ గనులకు వెళ్తావు. 397 00:29:42,491 --> 00:29:43,909 నేను ప్రమాణం చేశాను. 398 00:29:45,827 --> 00:29:47,746 నా రాజును నేను కొట్టను. 399 00:29:48,997 --> 00:29:50,666 గ్లేవన్ ప్రాణాలు పోయినా పర్లేదా? 400 00:29:52,668 --> 00:29:55,337 గత ఆరేళ్ళుగా నా భర్త చనిపోయాడన్న భావనలో బతికాను. 401 00:30:32,833 --> 00:30:34,168 గ్లేవన్? 402 00:30:34,710 --> 00:30:35,711 హా. 403 00:30:41,508 --> 00:30:42,885 నేనే... నేనే. 404 00:30:55,856 --> 00:30:57,024 బెల్? 405 00:31:00,485 --> 00:31:01,695 వాళ్లు నన్ను ఇక్కడికి రమ్మంటే... 406 00:31:02,821 --> 00:31:05,199 నువ్వు చనిపోయావేమో అనుకున్నాను. 407 00:31:05,782 --> 00:31:06,992 నాకేం చెప్పారంటే... 408 00:31:09,203 --> 00:31:11,371 నువ్వు చనిపోయావని చెప్పారు. 409 00:31:12,748 --> 00:31:15,459 - ఆరేళ్ల క్రిందటే చెప్పారు. - బెల్, నీకు సందేశం పంపాలని ప్రయత్నించాను. 410 00:31:15,459 --> 00:31:18,587 - ఆ పని చేస్తే నిన్ను చంపేస్తామని బెదిరించారు. - ఏం పర్వాలేదులే. 411 00:31:18,587 --> 00:31:20,506 మరేం పర్వాలేదు, గ్లే. 412 00:31:20,506 --> 00:31:22,341 ఈ చెత్త నాయాళ్లు. 413 00:31:23,884 --> 00:31:25,135 మాటలు జాగ్రత్త. 414 00:31:26,720 --> 00:31:28,430 మనం మళ్లీ వారి సర్వీసులో ఉన్నాం. 415 00:31:29,890 --> 00:31:31,767 అదీగాక ఇది వాళ్ల కోటే. 416 00:31:31,767 --> 00:31:33,894 సర్వీసులోనా? 417 00:31:35,312 --> 00:31:38,106 సర్వీసులో ఉంటే జుట్టు అలా ఉండకూడదే. 418 00:31:54,915 --> 00:31:56,041 వద్దు. నా... 419 00:31:57,709 --> 00:32:00,796 నేను ఇంకా ఖైదీ నంబర్ 713నే. 420 00:32:02,631 --> 00:32:03,674 చండాలంగా ఉన్నా. 421 00:32:05,217 --> 00:32:06,260 నా పళ్లు... 422 00:32:08,720 --> 00:32:10,764 తల నిండా పేలు ఉన్నాయి. 423 00:32:54,725 --> 00:32:55,726 ఏం పర్వాలేదులే. 424 00:33:14,786 --> 00:33:15,954 హేయ్. 425 00:33:26,340 --> 00:33:27,799 నన్ను క్షమించు. 426 00:33:45,901 --> 00:33:46,902 ఇప్పుడు చూడు, ఎలా ఉన్నావో! 427 00:33:48,570 --> 00:33:49,571 హా. 428 00:33:51,657 --> 00:33:52,658 ఇప్పుడు నాలా ఉన్నాను. 429 00:34:02,668 --> 00:34:04,711 అతను చెప్పింది సరైన సమాధానమేనా? 430 00:34:05,295 --> 00:34:06,421 ఏమో. 431 00:34:08,090 --> 00:34:11,592 అతని కళ్లలోకి చూశా, బాగా దృఢ నిశ్చయమున్న వ్యక్తిలా అనిపించాడు. 432 00:34:14,929 --> 00:34:16,889 మొదలుపెడుతున్నారమ్మా. 433 00:34:16,889 --> 00:34:19,476 చంచలంగా కాకుండా స్థిరంగా ఉండేవాడిని కావాలనుకున్నావు అన్నమాట. 434 00:34:20,268 --> 00:34:25,107 ఒక నిర్ణయాన్ని ఎంచుకొని దానికి కట్టుబడి ఉండేవారు. అది చాలా మంచి విధానం. 435 00:34:25,690 --> 00:34:31,071 మంచి పాలసీ అంటే ఏంటి అనేదాన్ని, ఆలాగే ఆ జ్ఞాపకాన్ని కూడా నేను వదిలేశాను. 436 00:34:35,242 --> 00:34:37,286 నువ్వు ఇక్కడ ఉండటం మా అదృష్టం. 437 00:34:38,078 --> 00:34:39,204 నువ్వు బాగానే చేస్తున్నావు. 438 00:34:40,873 --> 00:34:42,331 చక్కగా చేస్తున్నావు. 439 00:34:44,376 --> 00:34:45,960 నువ్వు మహారాజువి. 440 00:34:47,920 --> 00:34:48,922 కొనసాగించు. 441 00:35:17,868 --> 00:35:20,078 చెప్తున్నా కదా, తను నిజమైన మనిషిలానే అనిపించింది. 442 00:35:22,039 --> 00:35:25,167 కానీ అసలైన కాలె చనిపోయి చాలా శతాబ్దాలు అయింది. 443 00:35:26,627 --> 00:35:28,837 ఆ గుహలో అతని చెంత ఉండేది ఎవరో కూడా అర్థమవ్వడం లేదు. 444 00:35:29,796 --> 00:35:30,964 ఏదో తేడా కొడుతోంది. 445 00:35:31,965 --> 00:35:33,300 ఈ గ్రహమే తేడాగా ఉంది. 446 00:35:34,468 --> 00:35:36,053 కాసేపట్లో ఆరు గంటలు ముగిసిపోతాయి. 447 00:35:36,803 --> 00:35:38,055 అప్పుడు మనం అతడిని వదిలేసి వెళ్లిపోదాం. 448 00:35:38,555 --> 00:35:39,765 అదే సరైన పని కూడా. 449 00:35:41,558 --> 00:35:42,559 అవును. 450 00:35:44,520 --> 00:35:47,940 అతను హారి కాదు. కేవలం డిజిటల్ రూపం మాత్రమే. 451 00:35:48,607 --> 00:35:50,567 అదీగాక, వందేళ్లు బందీగానే ఉన్నాడు కదా. 452 00:35:50,567 --> 00:35:53,153 అంత ఏకాంతంగా ఉంటే ఎవరికైనా పిచ్చి పడుతుందని కూడా అతను అన్నాడు. 453 00:35:53,153 --> 00:35:55,697 నువ్వు నచ్చజెప్పాల్సింది నాకు కాదు. 454 00:35:57,741 --> 00:36:01,370 చూడు, ఇది హారి తాలుకు ఏ వెర్షనో ఏమో కానీ... 455 00:36:03,789 --> 00:36:04,998 అతడిని చూస్తే నాకు భయమేస్తోంది. 456 00:36:07,543 --> 00:36:08,961 ఇక మీ ఇద్దరూ ఒకే చోట ఉంటే... 457 00:36:11,296 --> 00:36:15,467 గాల్, అతని వల్ల ఇంకాసేపు ఉంటే నువ్వు ఊపిరాడక చనిపోయి ఉండేదానివి. 458 00:36:15,467 --> 00:36:17,553 దాన్ని నువ్వు ప్రోత్సహించావు కూడా. 459 00:36:19,304 --> 00:36:23,934 కాబట్టి "ఇక్కడి నుండి వెళ్లిపోదాం పద" అని నువ్వంటే, నేను టక్కున ఆ పని చేసేస్తాను. 460 00:36:26,270 --> 00:36:27,271 మరి? 461 00:36:28,105 --> 00:36:30,566 కానీ నీకు కావాల్సింది అది కాదని నాకు అనిపిస్తోంది. 462 00:36:37,114 --> 00:36:39,074 మీరిద్దరూ భలే ముచ్చటగా మాట్లాడుకుంటుంటారు. 463 00:36:40,742 --> 00:36:42,828 అది నాకు అర్థం కాదు కూడా. 464 00:36:48,500 --> 00:36:50,043 చూడు, నేనేం చెప్తున్నానంటే... 465 00:36:52,421 --> 00:36:54,464 నీకు ఒప్పుకోవడం ఇష్టం లేదేమో కానీ, నువ్వు కూడా అతనిలాంటి దానివే. 466 00:36:56,967 --> 00:36:58,177 నువ్వు చెప్పింది నిజమేనేమో. 467 00:37:00,304 --> 00:37:01,722 ఒకప్పుడు అతనే నాకు ఆరాధ్య దైవం. 468 00:37:03,182 --> 00:37:05,642 అతడిని తండ్రిలా భావించి, స్ఫూర్తిగా తీసుకోవాలని అనుకున్నాను. 469 00:37:06,977 --> 00:37:08,979 హా, తల్లిదండ్రులతో అదే కదా సమస్య? 470 00:37:08,979 --> 00:37:11,106 వారి ఆశలకు, అంచనాలకు పిల్లలు చేరుకోవడం కష్టమే. 471 00:37:17,112 --> 00:37:18,405 మా నాన్న ఏమనేవాడంటే... 472 00:37:20,532 --> 00:37:24,578 "సరైన పని చేయడానికి ముందూ వెనకా ఆలోచించకు," అని. 473 00:37:25,871 --> 00:37:27,456 కాబట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, గాల్. 474 00:37:28,081 --> 00:37:32,002 నువ్వు హారి స్థానంలో ఉండి, అతను నీ స్థానంలో ఉండుంటే, అతను ఏం చేసి ఉండేవాడు? 475 00:37:40,093 --> 00:37:41,303 చెక్కేసేవాడు. 476 00:38:03,909 --> 00:38:06,328 ఏం జరుగుతోంది అంటావు? సంబరాలా? 477 00:38:06,328 --> 00:38:12,125 మొదటి ఖైదీని రాకాసి బల్లెంతో చంపేయండి. 478 00:38:12,668 --> 00:38:14,711 కానివ్వండి! కానివ్వండి! 479 00:38:16,672 --> 00:38:20,467 అదీ లెక్క! 480 00:38:23,887 --> 00:38:25,514 తర్వాతి ఖైదీని తీసుకురండి! 481 00:38:25,514 --> 00:38:27,015 రెండవ ఖైదీని తీసుకురండి. 482 00:38:29,810 --> 00:38:30,811 - హోబర్ మాలో. - పోరా! 483 00:38:30,811 --> 00:38:32,354 - పోరా! - అయ్య బాబోయ్! 484 00:38:32,354 --> 00:38:35,065 రాకాసి బల్లెంతో చంపేయండి! 485 00:38:35,649 --> 00:38:37,192 హోబర్ మాలో! 486 00:38:39,278 --> 00:38:41,029 - హోబర్! - హలో. 487 00:38:41,780 --> 00:38:42,614 అదీ లెక్క! 488 00:38:42,614 --> 00:38:44,032 ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. 489 00:38:44,032 --> 00:38:49,162 నోర్మూసుకోరా. నిన్ను విడిపిద్దామనే వచ్చాం. ఫౌండేషన్ కి నీతో పని ఉంది. 490 00:38:49,162 --> 00:38:52,583 వాల్ట్ నిన్న తెరుచుకుంది. నువ్వు కావాలని అడిగింది. 491 00:38:52,583 --> 00:38:55,669 పోలీ వెరిసోఫ్, ఎంత దరిద్రమైన టైమింగ్ స్వామీ నీది! 492 00:38:59,298 --> 00:39:00,299 ఫోర్సర్ వాలిక్. 493 00:39:01,425 --> 00:39:04,094 నీ ఉత్సాహాన్ని నీరుగార్చాలని నాకు లేదు, 494 00:39:04,094 --> 00:39:06,180 కానీ ఒక పని పడింది, ఫౌండేషన్ కి నాతో ఏదో పని ఉందట. 495 00:39:06,180 --> 00:39:08,599 కాబట్టి, నన్ను చంపకుండా వదిలేస్తే, ఆ పనేంటో చూస్తా. 496 00:39:10,559 --> 00:39:11,685 మాట వినట్లెదు, పోలీ. 497 00:39:12,853 --> 00:39:15,606 నువ్వు క్లెరిక్ తో పాటు వచ్చావా? మనోడు భలే కామెడీగా ఉన్నాడు కదా? 498 00:39:16,356 --> 00:39:19,610 నాకు ఈ మరణ శిక్ష విధించేశారు, లేకపోతే నీకు చాలా కథలు చెప్పుండేవాడిని. 499 00:39:24,323 --> 00:39:25,908 ఫోర్సర్ వాలిక్, దీన్ని నువ్వే రూపొందించావా? 500 00:39:26,491 --> 00:39:28,577 చాలా బాగుంది. సౌకర్యంగా కూడా ఉంది. 501 00:39:32,998 --> 00:39:33,999 మహారాజా, 502 00:39:34,666 --> 00:39:38,837 హోబర్ తో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి, 503 00:39:39,379 --> 00:39:43,133 మరణించే ముందు 504 00:39:43,133 --> 00:39:45,969 అతనికి కొంచెం ధైర్యం ఇస్తాను. 505 00:39:46,720 --> 00:39:50,140 మీరు ఆత్మకు శాంతి చేకూర్చేవారా? 506 00:39:50,140 --> 00:39:52,559 ఫౌండేషన్ కు చెందిన క్లెరిక్ కదా మీరు? 507 00:39:52,559 --> 00:39:54,353 ఆ శిక్షణే ఇచ్చారు మరి నాకు. 508 00:39:56,939 --> 00:40:02,236 ప్రతీ మనిషి కూడా, తన పూర్వీకుల ఆత్మల చెంతకు చేరే ముందు, అందుకు సన్నద్దమ్మవాల్సి ఉంటుంది. 509 00:40:02,236 --> 00:40:07,866 కానీ, మీరు హోబర్ ని అతను చనిపోయాక సిద్దపరచండి. 510 00:40:07,866 --> 00:40:10,702 - రాకాసి బల్లెంతో చంపేయండి! - వద్దు! వద్దు! 511 00:40:14,831 --> 00:40:17,000 దీన్ని వెంటనే ఆపేయండి! 512 00:40:17,000 --> 00:40:19,545 గెలాక్టిక్ స్పిరిట్ నామమున, మేము లొంగిపోతున్నాం. 513 00:40:23,423 --> 00:40:28,178 మహారాజా, మరణించాక మళ్లీ నన్ను పుట్టించడం సాధ్యం కాదు. ఏదోక... 514 00:40:28,929 --> 00:40:31,056 కానీ ఇంకేదైనా మార్గం ఉందేమో ఓసారి ఆలోచించండి. 515 00:40:31,056 --> 00:40:33,350 ఇక ఆలోచించేదేమీ లేదు. 516 00:40:37,980 --> 00:40:41,733 కానీ చనిపోబోయే ముందు నువు ఇచ్చిన కానుకకి చాలా చాలా థ్యాంక్స్, వర్తక మహాశయా. 517 00:40:43,652 --> 00:40:45,904 ఈ సాయంత్రం ఈ వైన్ తాగి పండగ చేస్కుంటా. 518 00:40:45,904 --> 00:40:47,698 చనిపోయే ముందు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేయరా. 519 00:40:48,282 --> 00:40:49,867 కొరెల్ వాసులారా, 520 00:40:51,410 --> 00:40:58,125 నేను బీదరికంలో పుట్టాను, జీవితంలో చాలా కష్టాలను అనుభవించాను. 521 00:40:59,334 --> 00:41:05,090 కానీ నేను బాధపడాల్సింది నా గతం గురించి కాదు, నాకు దక్కకుండా చేస్తున్న భవిష్యత్తు గురించి. 522 00:41:06,258 --> 00:41:08,844 నేను చేయలేని దాతృత్వ కార్యక్రమాల గురించి. 523 00:41:10,345 --> 00:41:11,513 నేను ఎప్పటికీ కలుసుకోలేని... 524 00:41:13,932 --> 00:41:15,184 కొత్తవారి గురించి. 525 00:41:15,184 --> 00:41:19,646 స్నేహితులుగా చేసుకొనే అవకాశమున్న శత్రువుల గురించి. 526 00:41:21,148 --> 00:41:23,942 కానీ ఇవేమీ జరగవు. 527 00:41:24,526 --> 00:41:28,322 మరీ ఎక్కువ తెగువతో బతికేశాను, అది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. 528 00:41:30,699 --> 00:41:36,038 ఇక ఇప్పుడు నాకు చావు తప్ప అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. 529 00:41:36,038 --> 00:41:37,080 - ఇక చాలు! - ఇక నేను... 530 00:41:37,080 --> 00:41:38,498 బల్లెంతో అతడిని చంపేయండి! 531 00:41:39,583 --> 00:41:41,877 ఇంకా నేను చెప్పాల్సింది పూర్తి కాలేదు. 532 00:41:42,377 --> 00:41:44,213 నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది... 533 00:41:56,099 --> 00:41:59,019 హేయ్, హేయ్! ఏం జరుగుతోంది? 534 00:41:59,019 --> 00:42:02,356 నన్ను లేపండి. నేను హోబర్ మాలోని కాదు. 535 00:42:02,356 --> 00:42:04,858 అది కొమ్డోర్! బల్లాన్ని ఆపండి! 536 00:42:06,443 --> 00:42:08,612 ఒరేయ్ హోబర్ మాలోగా! 537 00:42:13,825 --> 00:42:15,953 మోసపాయారు, మహారాజా. 538 00:42:15,953 --> 00:42:19,540 టెలిపోర్ట్ చేసేది బ్రేస్ లెట్ కాదు, ఈ నోడ్. 539 00:42:19,540 --> 00:42:22,626 - పోలీ, నిన్ను కలవడం చాలా చాలా బాగుంది. - అతడిని అడ్డుకోండి! 540 00:42:27,089 --> 00:42:29,132 వావ్. అతని ఆత్మ విశ్వాసానికి జోహార్లు. 541 00:42:29,925 --> 00:42:31,176 మరీ దరిద్రుడిలా ఉన్నాడే. 542 00:42:31,885 --> 00:42:34,429 - ఆ వాహనంలో ఎంత దూరం వెళ్లగలడు? - విమాన పోర్టులకు హెచ్చరికలు పంపండి! 543 00:42:34,429 --> 00:42:37,474 మన దగ్గర వ్యోమనౌక ఉందని అతనికి తెలుసు. అతను దాన్ని దొంగిలించేస్తాడు. 544 00:42:38,350 --> 00:42:39,893 స్పిరిట్ ని దొంగిలించేస్తాడు! 545 00:42:56,827 --> 00:42:59,329 కానివ్వు, ఎగురు! ఎగురు! 546 00:43:00,163 --> 00:43:01,415 కాంస్టన్ట్! 547 00:43:21,101 --> 00:43:24,146 సుస్వాగతం. భలే కిక్కు వచ్చింది కదా? నాకు మీ వ్యక్తిగత యాక్సెస్ కోడ్లు కావాలి. 548 00:43:24,146 --> 00:43:27,149 నువ్వు చట్టబద్ధం కాని ప్రాంతాలకు పోవాలంటే, అలా దీనిలో పోవడం కుదరదు. 549 00:43:27,149 --> 00:43:30,319 ఏంటి? ఆలోపు వాళ్లు మనల్ని కాల్చి పారేస్తారు! కాబట్టి ఎక్కడికో దగ్గరికి వెళ్లడమే మేలు... 550 00:43:30,319 --> 00:43:31,612 వాడిని నా దగ్గరికి రానివ్వవద్దు. 551 00:43:33,614 --> 00:43:34,740 హలో. 552 00:43:34,740 --> 00:43:36,241 దగ్గర్లోని గ్రహశకలంపై నన్ను వదిలేయండి. 553 00:43:36,241 --> 00:43:38,911 - నువ్వు టర్మినస్ కి రావాలి. - నేను రాను. 554 00:43:40,370 --> 00:43:43,457 దాన్ని అరవనివ్వకుండా చూసుకో! నేను నడిపే పనిలో ఉన్నాను. 555 00:43:50,547 --> 00:43:51,882 ఎస్కేప్ పాడ్ లో చెక్కేద్దాం అనుకుంటున్నావా! 556 00:43:51,882 --> 00:43:54,426 చూడు, నువ్వు మహిళవి కదా నిన్నేం చేయనని అనుకుంటున్నావేమో, నాకు అలాంటి... 557 00:43:54,426 --> 00:43:57,179 అబ్బా. ఏంటది? ఏదో గుచ్చావు. కొంపదీసి అది... 558 00:44:00,015 --> 00:44:01,475 ఏంటది... 559 00:44:03,310 --> 00:44:04,311 అంతే. 560 00:44:05,854 --> 00:44:06,855 మొత్తం కక్కేయ్. 561 00:44:24,039 --> 00:44:25,749 నీకు కావాల్సినదంతా దక్కింది కదా. 562 00:44:28,752 --> 00:44:30,045 మనం దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. 563 00:44:34,049 --> 00:44:36,343 మహారాజు నీ పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడు, బెల్. 564 00:44:37,803 --> 00:44:39,096 నా పట్ల క్రూరంగానే ప్రవర్తించాడు. 565 00:44:39,096 --> 00:44:40,973 అందుకే మనం పారిపోలేం. 566 00:44:40,973 --> 00:44:44,434 బలహీనమైన రాజు వద్ద తప్పనిసరిగా బలవంతమైన సేనాధిపతి ఉండాలి. 567 00:44:44,434 --> 00:44:46,144 అతనికి ఆ సేనాధిపతి అంటే భయం ఉంటుంది. 568 00:44:47,062 --> 00:44:48,814 తిరుగుబాటు ఎప్పుడు జరుగుతుందా అని ఆలోచిస్తూనే ఉంటాడు. 569 00:44:48,814 --> 00:44:52,025 నిన్ను అతను జైలుపాలు చేసింది, నువ్వేదో ఆదేశాన్ని ధిక్కరించావని కాదు, 570 00:44:52,025 --> 00:44:53,902 నువ్వంటే అందరికీ అభిమానం అని. 571 00:44:53,902 --> 00:44:55,028 ఏదైనా ఇప్పుడు అది అనవసరం. 572 00:44:56,071 --> 00:45:01,034 నేనేమీ విప్లవకారుడిని కాదు, గ్లేవన్, అలా అని నమ్మకద్రోహం చేసే వాడిని కూడా కాదు. 573 00:45:03,620 --> 00:45:06,707 మహారాజు పాలనలో ఉండే ఈ కోట్లాది జనులందరినీ... 574 00:45:07,916 --> 00:45:09,543 మహారాజు చిత్తు కాగితంలా చూస్తాడు. 575 00:45:11,753 --> 00:45:16,008 నేను అతనికి ముఖ్యం కాబట్టి, వాళ్లని కాపాడాల్సిన బాధ్యత నాదే, గ్లే. 576 00:45:17,217 --> 00:45:18,844 - అందరినీ. - కానీ ఇప్పుడా? 577 00:45:20,262 --> 00:45:22,181 బెల్, కోలుకోవడానికి నీకు సమయం కావాలి. 578 00:45:22,681 --> 00:45:26,727 ఇంకా, మనం మళ్లీ పూర్తి స్థాయిలో ఏకమవ్వాడానికి, మనకి కూడా కొంత సమయం కావాలి. 579 00:45:28,228 --> 00:45:30,230 ఏది ఏమైనా, నేను నీ పక్షానే ఉంటాను. 580 00:45:30,230 --> 00:45:31,356 కానీ ఒకటి మాత్రం చెప్తాను, 581 00:45:32,774 --> 00:45:37,029 మహారాజు కాలి చెప్పు కింద అణిగి ఉంటే, ఆ చెప్పు ముద్ర మన మీద ఖచ్చితంగా పడుతుంది. 582 00:45:38,030 --> 00:45:39,948 అతను ఆ చెప్పు తీసినా కూడా, ఆ ముద్ర అంత తేలిగ్గా పోదు. 583 00:45:39,948 --> 00:45:42,326 అయితే, ప్రతీ క్షణం నువ్వు నా పక్షానే ఉంటావు కదా? 584 00:45:42,910 --> 00:45:44,620 నా ముఖంపై చెప్పు ముద్రలేవైనా ఉన్నాయేమో గమనిస్తూ. 585 00:45:46,288 --> 00:45:47,664 అవి ఉండేది నీ ముఖంపై కాదు. 586 00:45:54,713 --> 00:45:57,883 గమ్యస్థానం చేరుకుంటున్నాం. ల్యాండింగ్ కోసం సిద్ధంగా ఉండండి. 587 00:46:00,636 --> 00:46:01,637 నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నా. 588 00:46:03,430 --> 00:46:05,390 ఈ పగటి రాజు మహారాజుగా ఉన్నంత కాలం, 589 00:46:06,433 --> 00:46:08,143 ఈ జనులందరి గురించి ఆలోచించి చెప్తున్నా, 590 00:46:09,770 --> 00:46:12,105 అతనిపై ప్రతీకారం తీర్చుకునేంత పని నేను చేయలేను. 591 00:46:13,941 --> 00:46:20,155 నువ్వు అలా అంటావని నేను ముందే ఊహించా, అందుకే దీన్ని నాతో పాటు తీసుకొచ్చాను. 592 00:46:25,077 --> 00:46:26,245 జనరల్. 593 00:47:22,968 --> 00:47:23,969 ఇక పనులు కానివ్వండి. 594 00:47:28,390 --> 00:47:30,058 మీ నౌకలోకి సుస్వాగతం, జనరల్ రియోస్. 595 00:47:30,058 --> 00:47:32,186 మళ్లీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, షి-బెండ్స్-లైట్. 596 00:47:37,107 --> 00:47:39,109 గ్రహంలో ఉండీ ఉండీ, అంతరిక్ష యాత్రలంటే ఎలా ఉంటాయో 597 00:47:39,109 --> 00:47:40,986 మీరు మర్చిపోలేదనే ఆశిస్తున్నాను. 598 00:47:42,237 --> 00:47:44,907 ఎందుకంటే, వాంతి చేసుకోవడానికని వాడే బ్యాగులను మేము తీసుకురాలేదు. 599 00:47:47,284 --> 00:47:50,204 - నీ జోకులని మిస్ అయ్యాను, షి-బెండ్స్. - మీ చిరునవ్వు కూడా మిస్ అయ్యాను, జనరల్. 600 00:47:51,205 --> 00:47:52,873 ఒపలెస్క్ గనుల్లో చాలా ఏళ్లు పని చేసి కూడా, 601 00:47:52,873 --> 00:47:55,918 నా కోసం మీరు ఒక చిరు కానుకని కూడా తీసుకురాలేదు. 602 00:47:57,252 --> 00:47:58,837 జోక్ చేస్తున్నా, జనరల్. 603 00:47:59,463 --> 00:48:02,466 మా జాతి దాన్ని అదుపులో ఉంచుకోకపోతే, మహారాజు మమ్మల్ని సహించగలిగేవారు కాదు. 604 00:48:03,634 --> 00:48:05,427 గెలాక్సీ అంచు ప్రాంతానికి నౌకని మళ్లించు. 605 00:48:13,727 --> 00:48:15,395 ఆ ఆదేశాన్ని ఆలస్యం కాక ముందే ఉపసంహరించుకో. 606 00:48:16,355 --> 00:48:17,773 జంప్ చేసే ప్రదేశాన్ని లాక్ చేశా. 607 00:48:18,524 --> 00:48:19,608 ఇప్పుడు చేయగలిగిందేమీ లేదుగా. 608 00:48:20,484 --> 00:48:22,236 అందరూ జంప్ స్టేషన్స్ కి రావాలి. 609 00:48:46,426 --> 00:48:49,471 సరే. హారి లేకుండానే ద్వితీయ ఫౌండేషన్ ని నిర్మిద్దాం. 610 00:48:51,765 --> 00:48:53,183 టేకాఫ్ లో కుదుపలు తప్పకపోవచ్చు, 611 00:49:05,946 --> 00:49:07,990 హెచ్చరిక, గ్రహం ఉపరితలం పలచగా ఉంది. 612 00:49:07,990 --> 00:49:09,449 - నీకేం కాలేదు కదా? - ఏం కాలేదు. 613 00:49:09,449 --> 00:49:11,910 - దిగే నేలలో పట్టు లేదు. - సరే, థ్యాంక్స్. 614 00:49:11,910 --> 00:49:13,161 మరేం పర్వాలేదు. మనం... 615 00:49:17,541 --> 00:49:19,042 అయ్యయ్యో. 616 00:49:20,794 --> 00:49:22,629 నిర్మానుష్యంగా ఉందంటే మనం ఒంటరిగా ఉన్నామని కాదు. 617 00:49:31,180 --> 00:49:34,933 - ఇక్కడి నుండి బయటపడేయి! పద! - హా, ఆ ప్రయత్నంలోనే ఉన్నా! 618 00:49:46,195 --> 00:49:47,738 చూసుకో, చూసుకో, చూసుకో! 619 00:49:52,868 --> 00:49:54,369 కానివ్వు. కానివ్వు. 620 00:49:54,369 --> 00:49:55,954 వచ్చేశాం. వచ్చేశాం. 621 00:50:10,052 --> 00:50:11,762 అసలు ఏంటవి? 622 00:50:12,888 --> 00:50:13,889 వాటి నుండి తప్పించుకున్నామా? 623 00:50:13,889 --> 00:50:17,768 లేదు. అవి వెనక్కి వెళ్లిపోయాయి. వేరే జీవిని అవి గుర్తించినట్టు వెళ్లిపోతున్నాయి. 624 00:50:19,561 --> 00:50:22,022 అది అసాధ్యం. ఇక్కడ మనం తప్ప జీవి అనేదే లేదు. 625 00:50:30,364 --> 00:50:31,365 ఒక్క నిమిషం. 626 00:50:33,534 --> 00:50:36,620 పరిశ్రమ స్థూపాలలో ఏదో జరుగుతున్నట్టు ప్రోబ్స్ గుర్తిస్తున్నాయి. 627 00:50:36,620 --> 00:50:37,704 ఏంటి? 628 00:50:38,288 --> 00:50:39,289 ఏదో జీవి ఉన్నట్టు. 629 00:50:39,790 --> 00:50:41,834 బహుశా ఆ కాలె నిజంగానే బతికి ఉందేమో. 630 00:50:42,417 --> 00:50:44,086 అక్కడ ఇంకేదో ఉంది. 631 00:50:48,131 --> 00:50:49,383 ప్రోబ్స్ గుర్తించింది హారిని. 632 00:50:49,383 --> 00:50:50,843 ఏంటి? అది అసాధ్యం. 633 00:50:50,843 --> 00:50:53,595 చెప్తున్నా కదా. ప్రోబ్స్ గుర్తించింది అతడినే. 634 00:50:55,848 --> 00:50:56,932 వెనక్కి తిప్పు. 635 00:50:56,932 --> 00:50:58,225 కానీ అక్కడ దిగడానికి అనువైన చోటు లేదు. 636 00:50:58,225 --> 00:50:59,977 చేతి మీద దించు. 637 00:51:25,711 --> 00:51:27,087 ఎయిర్ లాక్ తెరువు. 638 00:51:49,651 --> 00:51:51,278 నువ్వు ఇంకాస్త దగ్గరగా రావాలి! 639 00:52:02,164 --> 00:52:03,665 ఇతనికి పల్స్ ఉంది, శాల్వార్. 640 00:52:03,665 --> 00:52:04,875 ఇతను నిజంగానే బతికి ఉన్నాడు. 641 00:52:09,296 --> 00:52:10,672 అసలు ఎవరు నువ్వు? 642 00:52:24,353 --> 00:52:27,356 గాల్, త్వరగా రా. అవి పర్వతాన్నంతటినీ నాశనం చేసేస్తాయి. 643 00:52:36,573 --> 00:52:38,575 స్పృహ తెచ్చుకో. 644 00:52:42,663 --> 00:52:44,957 శాల్వార్, మమ్మల్ని లాగు! లాగు మమ్మల్ని! 645 00:52:44,957 --> 00:52:46,625 తాడును గట్టిగా పట్టుకోండి! 646 00:53:00,973 --> 00:53:03,225 హారి. హారి, లేయ్. లేయ్. 647 00:53:03,225 --> 00:53:04,309 లేయ్. 648 00:53:08,730 --> 00:53:12,067 నీకు దేహం ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఇదెలా సాధ్యమైంది? 649 00:53:12,776 --> 00:53:15,279 నాకు తెలీదు. 650 00:54:19,134 --> 00:54:21,136 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్