1 00:00:20,751 --> 00:00:23,879 అయ్య బాబోయ్. ఈ దెబ్బలకి కారణం నైటింగేలా? 2 00:00:23,879 --> 00:00:26,715 కాదు. ఎక్కువగా వేరే పోలీసే కొట్టాడు. 3 00:00:29,635 --> 00:00:32,054 మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? డిడియర్ ఇంటికా? 4 00:00:32,054 --> 00:00:33,138 కాదు, కార్లా ఇంటికి. 5 00:00:34,640 --> 00:00:37,809 వాళ్లు ఆడిన అబద్ధాలు, చేసిన చెత్త పనులు ఇప్పుడు నాకు ముఖ్యంగా అనిపించలేదు, 6 00:00:37,809 --> 00:00:41,563 నన్ను కాపాడబోయి, కార్లా చనిపోలేదని, బతికే ఉందని నిర్ధారించుకోవడమే నాకు ప్రథమ కర్తవ్యమైంది. 7 00:01:50,215 --> 00:01:51,800 ఎంత పని చేశావు, అబ్దులా? 8 00:01:51,800 --> 00:01:55,262 అబ్బో, నువ్వూ, కార్లా అంతా చేసి, నన్ను అంటున్నావే! 9 00:01:55,262 --> 00:01:56,471 తను ఎక్కడ? 10 00:01:56,471 --> 00:01:57,597 నాకు తెలీదు. 11 00:02:03,353 --> 00:02:04,354 ఇతని స్థితి దారుణంగానే ఉంది. 12 00:02:05,063 --> 00:02:07,733 హేయ్, మొడీనా, నా మాటలు వినిపిస్తున్నాయా? 13 00:02:07,733 --> 00:02:09,775 మొడీనా. -ఇతను బతకడం కష్టం. 14 00:02:09,775 --> 00:02:10,861 హా, బతికి తీరాలి. 15 00:02:10,861 --> 00:02:13,488 కార్లా, లీసాలు ఎక్కడ ఉన్నారో ఇతనికి మాత్రమే తెలుసు. 16 00:02:16,116 --> 00:02:18,869 మమ్మల్ని వదిలేయ్, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేయమని ఖాదర్ తో నేను చెప్తాను. 17 00:02:19,661 --> 00:02:23,123 ఖాదర్ బతుకు బస్టాండేలే. ఆ సంగతి వలీద్ చూసుకుంటాడు. 18 00:02:24,416 --> 00:02:27,919 నా పని పడదామనుకున్నావు, ఇప్పుడు నేను నీ పని పడుతున్నా. 19 00:02:28,754 --> 00:02:30,213 దాని గురించి ఖాదర్ కి ఏమీ తెలీదు. 20 00:02:31,381 --> 00:02:34,134 అయితే, నువ్వు మునగడంతో పాటు ఆయన్ని కూడా ముంచేశావు పో. 21 00:02:34,134 --> 00:02:36,094 వీలు ఉన్నప్పుడు పారిపో, నీకే మంచిది. 22 00:02:36,094 --> 00:02:38,180 ఎక్కడికి? ఎందుకు? 23 00:02:39,222 --> 00:02:40,849 నా సర్వస్వం ఇదే. 24 00:02:42,643 --> 00:02:45,270 ఎవరెవరో ఏదేదో హడావిడి చేస్తూనే ఉంటారు, 25 00:02:46,396 --> 00:02:50,233 కానీ ప్యాలెస్ మాత్రం అలాగే ఉంటుంది. 26 00:02:51,401 --> 00:02:53,028 మమ్మల్ని ఏం చేయబోతున్నావు? 27 00:02:53,570 --> 00:02:57,199 మీ ఇద్దరినీ వేలం వేస్తాను, ఎవరు ఎక్కువకు పాడుకుంటే వాళ్లకి ఇచ్చేస్తా. 28 00:02:59,076 --> 00:03:00,077 వద్దు! 29 00:03:11,755 --> 00:03:12,839 బొంబాయి నేషనల్ 30 00:03:29,022 --> 00:03:31,108 సెక్స్, స్కాండల్, సాగర్ వాడ. 31 00:03:31,108 --> 00:03:33,860 "విదేశీ వేశ్యావాటికలో జోరుగా నడుస్తున్న అక్రమ కార్యకలాపాలు." 32 00:03:38,407 --> 00:03:40,867 అతనికి చాలా రక్తం పోయింది, కానీ పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉంది. 33 00:03:42,661 --> 00:03:44,496 లిన్, నేను వెళ్లాలి. 34 00:03:44,496 --> 00:03:46,707 వలీద్ బొంబాయి అంతటా ఉన్న మా వ్యాపారాలపై దాడి చేస్తున్నాడు. 35 00:03:49,167 --> 00:03:51,837 చూశావా, పరిస్థితులు ఎంత భయంకరంగా మారాయో? నువ్వు ఖాదర్ మాటలని విని ఉండాల్సింది. 36 00:03:52,671 --> 00:03:54,548 మీరు నాకు అబద్ధాలు చెప్పకుండా ఉండాల్సింది కాదేమో. 37 00:03:57,009 --> 00:03:59,469 ఇక్కడే ఉండు. నాకేమైనా తెలిస్తే, నీకు కాల్ చేస్తాను. 38 00:03:59,469 --> 00:04:01,638 ఇతను లేస్తే, ఖాదర్ ఇంటికి ఫోన్ చేసి నాకు చెప్పు. 39 00:04:01,638 --> 00:04:03,724 ఏమైనా కానీ, ఇతడిని మాత్రం చావనివ్వకు. 40 00:04:08,186 --> 00:04:11,857 "బొంబాయిలో ఈ ముఠాల ఆగడాలు శృతి మించిపోతున్నాయి, 41 00:04:11,857 --> 00:04:14,067 మన ప్రజాస్వామ్య వ్యవస్థలను భ్రష్టు పట్టించడానికి 42 00:04:14,067 --> 00:04:16,360 విదేశీయులతో చేతులు కలపవచ్చని అవి భావిస్తున్నట్టున్నాయి. 43 00:04:16,862 --> 00:04:19,031 వాళ్ల ఆగడాలను ఎవరైనా ఎదిరిస్తే 44 00:04:19,031 --> 00:04:20,741 వాళ్లని చంపేస్తారు, లేదా పదవీచ్యుతులని చేస్తారు. 45 00:04:21,867 --> 00:04:24,828 తనంటే ప్రజలకున్న భయాన్ని వలీద్ షా సద్వినియోగపరుచుకుంటున్నాడు, 46 00:04:24,828 --> 00:04:28,165 జనాల్లో చాలా మందికి డబ్బు ఆశ చూపెడితే చాలని, మానం మర్యాదలు సైతం మర్చిపోతారని 47 00:04:28,165 --> 00:04:29,291 అతనికి బాగా తెలుసు." 48 00:04:30,876 --> 00:04:33,170 ఈ జర్నలిస్ట్ రాతలు భలేగా ఉన్నాయే. 49 00:04:33,754 --> 00:04:37,507 ఖాదర్ మనుషులు పారిపోతున్నారు. అతను ఎలుకలా కలుగులో దాక్కున్నాడు. 50 00:04:37,507 --> 00:04:39,051 అయినా కానీ అతనికి చావు తప్పదు. 51 00:04:39,051 --> 00:04:40,969 నేను ఇతర ముఠాలతో కూడా మాట్లాడాను. 52 00:04:40,969 --> 00:04:43,138 వాళ్లకి కూడా ఖాదర్ కథ నచ్చలేదు. 53 00:04:44,097 --> 00:04:46,475 వాళ్లు మధ్య దూరరని నాకు మాటిచ్చారు. 54 00:04:46,475 --> 00:04:48,101 ఒత్తిడిని అలాగే కొనసాగించు, రఫీక్. 55 00:04:48,727 --> 00:04:49,936 ఒకదాని తర్వాత ఇంకోదానిపై దాడి చేయ్. 56 00:04:50,771 --> 00:04:55,025 ఖాదర్ దందాలన్నీ ఆగిపోవాలి, ఒక్కటి కూడా అతనికి మిగలకూడదు. 57 00:04:55,525 --> 00:04:58,070 అప్పుడు అతనిపై దాడి చేద్దాం. -అలాగే, బాస్. 58 00:04:58,820 --> 00:05:01,949 ఇంకో విషయం, ఈ సన్నాసిని కూడా ఊరికే వదలకూడదు. 59 00:05:02,449 --> 00:05:03,909 రాతలు బాగారాసినంత మాత్రాన వదిలేయకూడదు. 60 00:05:15,712 --> 00:05:18,632 మన పత్రాల ఫ్యాక్టరీపై దాడి చేశారు. ముగ్గురు చనిపోయారు, సర్వం నాశనం చేశారు. 61 00:05:19,508 --> 00:05:21,009 వాళ్లకి కావలసిన సాయం అందేలా చూడు. 62 00:05:34,523 --> 00:05:37,359 ఈ కథనాన్ని చదివాక, నేను వలీద్ ని అయితే, నేను కూడా ఇలాగే చేసేవాడిని. 63 00:05:37,359 --> 00:05:40,195 కార్లా ఏం చేసినా, బాగా చేస్తుంది. 64 00:05:40,696 --> 00:05:42,614 అది దాడులని ఎదుర్కొంటున్న మనవాళ్లకి చెప్పండి. 65 00:05:44,157 --> 00:05:45,367 వలీద్ దగ్గరే కార్లా బందీగా ఉందంటారా? 66 00:05:45,367 --> 00:05:49,788 కార్లా చనిపోయిండాలి, తప్పించుకొని ఉండాలి, లేదా ఏమైనా జరిగితే నాతో బేరసారాలకైనా వలీద్ తనని ఉంచుకొనుండాలి. 67 00:05:49,788 --> 00:05:51,540 నేను ఇవన్నీ చూస్తూ ఊరికే ఉండలేకపోతున్నాను. 68 00:05:51,540 --> 00:05:52,874 ఇతర భాయిల సంగతేంటి? 69 00:05:53,375 --> 00:05:55,836 భాయిలు, వాళ్ల ముఠాలు కలుగజేసుకోవు. 70 00:05:55,836 --> 00:05:57,296 అందరూ పిరికిపందలు. 71 00:05:57,296 --> 00:06:00,090 లేదు. బతకనేర్చినోళ్లు. 72 00:06:05,262 --> 00:06:08,974 అరె, వద్దు, చెల్లాయి. నువ్వు నా అతిథివి. వంట పని నాకే వదిలేయ్. 73 00:06:08,974 --> 00:06:11,184 "విక్కీ ఇంట్లో ఉండమని కూడా నా గుడ్ల కూర నన్నే వండుకోమన్నాడు," 74 00:06:11,184 --> 00:06:13,395 అని నువ్వంటే నా పరిస్థితి ఏం కాను! 75 00:06:13,395 --> 00:06:15,897 వద్దమ్మా వద్దు. -నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో. 76 00:06:16,523 --> 00:06:18,525 హేయ్, మీ పత్రిక హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది, పాపా. 77 00:06:18,525 --> 00:06:20,485 బొంబాయిలోని జనమంతా నీ కథనం గురించే గుసగుసలాడుకుంటున్నారు. 78 00:06:21,069 --> 00:06:22,988 నా కథనమా? -ఏంటి? 79 00:06:24,656 --> 00:06:25,574 వ్యాసకర్త, నిషాంత్ పటేల్ 80 00:06:25,574 --> 00:06:26,867 నిషాంత్ తన పేరు పెట్టుకున్నాడు. 81 00:06:28,035 --> 00:06:30,579 దొంగ. పెద్ద దొంగ వాడు! 82 00:06:30,579 --> 00:06:32,122 ఎక్కడైనా తప్పు జరిగి ఉండవచ్చేమో. 83 00:06:32,122 --> 00:06:35,042 ఈ పత్రికలు తప్పులు చేస్తూనే ఉంటాయి, క్షమాపణలు చెప్తూనే ఉంటాయి. 84 00:06:35,042 --> 00:06:36,376 అయినా నీకు డబ్బులు ఇస్తారు కదా? 85 00:06:36,376 --> 00:06:38,754 అరె, డబ్బు ఎవడికి కావాలి, బాబూ. 86 00:06:39,254 --> 00:06:40,714 ఇది నేను కష్టపడి రాసిన ఆర్టికల్. 87 00:06:42,674 --> 00:06:43,675 ఎక్కడికి వెళ్తున్నావు? 88 00:06:43,675 --> 00:06:47,638 నీకు ఏ అపాయమూ కలగకూడదనే కదా నువ్వు ఇక్కడ ఉండేది! 89 00:06:47,638 --> 00:06:48,847 ఈ కథనంలో అసలు నా పేరే లేదు, 90 00:06:48,847 --> 00:06:51,266 అలాంటప్పుడు నాకు అపాయం అనే ప్రశ్న ఎక్కడిది? 91 00:06:54,353 --> 00:06:58,106 మా రిపోర్టింగుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆ కథనంలోని వివరాలన్నీ నిజాలే అన్ని మేం బల్లగుద్ది చెప్పగలం. 92 00:06:58,106 --> 00:07:01,944 ఈ జూ మహిళ, భారతదేశ అమ్మాయిలను కొని, బలవంతంగా వ్యభిచారకూపంలోకి దింపుతోందా? 93 00:07:01,944 --> 00:07:04,488 అసలు తన గురించి తనేం అనుకుంటోంది? -ఇది చాలా దారుణం, లిన్ బాబా. 94 00:07:04,488 --> 00:07:05,822 జనాలకు చాలా కోపం వచ్చేస్తుంది. 95 00:07:07,491 --> 00:07:08,492 ఇది ఒక మచ్చని చెప్పవచ్చు... 96 00:07:09,952 --> 00:07:11,203 హేయ్, హేయ్, మొడీనా. 97 00:07:11,912 --> 00:07:15,540 హేయ్, హేయ్. నా మాటలు వినిపిస్తున్నాయా? 98 00:07:16,291 --> 00:07:17,417 లీసా? 99 00:07:17,417 --> 00:07:18,835 నాకు తెలీదు. 100 00:07:18,835 --> 00:07:20,587 నీ దగ్గరికి వచ్చేసరికి, వాళ్లు అక్కడ లేరు. 101 00:07:21,296 --> 00:07:22,673 ఇది ఎవరి పని? 102 00:07:22,673 --> 00:07:23,924 మరీజియో. 103 00:07:25,050 --> 00:07:28,261 జూ. -జూ? తనకి దీనితో సంబంధం ఏంటి? 104 00:07:28,261 --> 00:07:32,683 తన డబ్బే. వాళ్లని ప్యాలెస్ కి తీసుకెళ్లారు. 105 00:07:32,683 --> 00:07:35,060 మొడీనా. మొడీనా, చెప్పేది విను. 106 00:07:35,060 --> 00:07:37,562 కదిలితే నీకు రక్తస్రావం అవుతుంది. నువ్వు కదలకుండా ఉండాలి. 107 00:07:39,481 --> 00:07:41,942 సరే. నిదానం. నిదానం. నేను తీసుకున్నాను. 108 00:07:43,568 --> 00:07:47,656 లిన్, డబ్బు రైల్వే స్టేషనులో ఉంది. 109 00:07:48,657 --> 00:07:52,035 నువ్వు తనని విడిపించి తీసుకురావాలి, లిన్. ప్లీజ్. 110 00:07:52,035 --> 00:07:56,498 సరే, చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కదలకూడదు, అర్థమైందా? 111 00:07:57,082 --> 00:07:58,083 వాళ్లని నేను విడిపించి తీసుకువస్తా. 112 00:09:02,564 --> 00:09:04,232 ఎంత ఉంది? 113 00:09:04,232 --> 00:09:06,234 తెలీదు. కనీసం రెండు లక్షల డాలర్లైనా ఉండుంటుంది. 114 00:09:06,234 --> 00:09:08,070 లిన్, అంటే కోటిన్నర. 115 00:09:09,154 --> 00:09:11,573 నా జీవితంలో ఇంత డబ్బును నేనెన్నడూ చూడలేదు, 116 00:09:11,573 --> 00:09:13,116 ఈ సంచిలో చూడటమే తొలిసారి. 117 00:09:14,076 --> 00:09:15,077 పద. 118 00:09:19,706 --> 00:09:21,541 పోలీసు 119 00:09:35,180 --> 00:09:37,432 నువ్వు నేను అడిగింది మళ్లీ కాదనవచ్చని తెలిసి కూడా అడుగుతున్నా, 120 00:09:37,432 --> 00:09:40,352 నీకు ఆ ట్యాక్సీ నంబర్ ఇచ్చా కదా, దాని గురించి ఏ సమాచారమైనా తెలిసిందా? 121 00:09:41,186 --> 00:09:43,855 బొంబాయిలో ఎన్ని ట్యాక్సీలు ఉంటాయో తెలుసా? 122 00:09:45,274 --> 00:09:49,069 ఆ ట్యాక్సీ యజమాని సాగర్ వాడలోనే ఉన్నాడు, కానీ ట్యాక్సీయే లేదు. 123 00:09:49,069 --> 00:09:52,155 కాబట్టి, ట్యాక్సీ కోసం వెతికి చెప్పమని ఒక పోలీసోడిని పురమాయించాను, 124 00:09:52,155 --> 00:09:54,199 అతనే మనకు గతి ఇప్పుడు. 125 00:09:54,199 --> 00:09:56,743 ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? -ఇలాంటి వాటికి సమయం పడుతుంది. 126 00:09:58,161 --> 00:10:02,124 నువ్వు గమనించావో లేదో, బొంబాయిలో ఇద్దరు డాన్లు కొట్టుకుంటున్నారు. 127 00:10:02,666 --> 00:10:04,668 ఇప్పుడు మా తొలి ప్రాధాన్యత డేల్ కాంటీ కాదు. 128 00:10:11,883 --> 00:10:13,468 నిషాంత్ పటేల్. 129 00:10:13,468 --> 00:10:15,262 మనం ఆరోజు కలవడానికి వెళ్లింది ఇతడినే. 130 00:10:16,054 --> 00:10:20,350 మనం డేల్ ని ఏ మురికివాడలో అయితే పట్టుకోబోయామో, ఆ మురికివాడ గురించి ఇప్పుడు ఇతను ఓ కథనం రాశాడు. 131 00:10:21,435 --> 00:10:22,769 అది కాకతాళీయం అంటావా? 132 00:10:24,396 --> 00:10:25,897 నేను ఇప్పుడు చెప్పేది కాస్త వింటావా? 133 00:10:25,897 --> 00:10:29,234 "హేయ్, వాలీ, నీకు కావలసిన ట్యాక్సీ దొరికింది," అని చెప్తే నేను ఖచ్చితంగా వింటాను. 134 00:10:33,405 --> 00:10:34,615 జోక్ అదిరింది, డిటెక్టివ్. 135 00:10:43,123 --> 00:10:44,625 ఇంత డబ్బును నువ్వు ఎప్పుడైనా చూశావా? 136 00:10:44,625 --> 00:10:46,001 నేనయితే చూడలేదులే. 137 00:10:46,001 --> 00:10:50,130 దాన్ని ఎప్పుడెప్పుడు దొంగిలిద్దామా అని నాకే అనిపిస్తోంది, ఇక మరీజియో చంపాలనుకోవడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. 138 00:10:50,130 --> 00:10:52,257 నాకు మాత్రమే కాకుండా ఇతరులకి కూడా ఆ ఆలోచనలు వస్తున్నాయి, అది చాల్లే. 139 00:10:53,383 --> 00:10:55,302 దీని కంటే ఇంకో మంచి మార్గం లేదా, లిన్? 140 00:10:55,302 --> 00:10:58,930 నేను మధ్యవర్తిగా వెళ్లి, ప్యాలెస్ లో కాకుండా ఇంకెక్కడైనా ఇచ్చిపుచ్చుకోవడం జరిగేటట్లు మాట్లాడగలను. 141 00:10:58,930 --> 00:11:00,223 కానీ మనకి అంత సమయం లేదు. 142 00:11:00,223 --> 00:11:02,559 కనీసం అబ్దులా వచ్చేదాకా అయినా ఆగు. 143 00:11:02,559 --> 00:11:04,603 అబ్దులాకి ముఠా కొట్లాటలతోనే సరిపోతుంది. 144 00:11:05,896 --> 00:11:09,566 చూడు, రెండు గంటల్లో మేము రాకపోతే, అతనికి కాల్ చేసి, నేనెక్కడికి వెళ్లానో చెప్పు. 145 00:11:11,026 --> 00:11:12,027 ఆగు. 146 00:11:18,283 --> 00:11:21,870 నువ్వు ఉపయోగించినా ఉపయోగించకపోయినా భయపెట్టడం కోసమైనా నువ్వు దీన్ని తీసుకెళ్లాలి. 147 00:11:21,870 --> 00:11:23,664 అదుంటే కాల్చినా కాలుస్తాను, బాసూ. 148 00:11:25,582 --> 00:11:26,583 పద. 149 00:11:26,583 --> 00:11:29,962 దీన్ని నాకు ఇవ్వు. బరువు ఎంత ఉంటుందో చూడాలనుంది. 150 00:11:31,421 --> 00:11:32,631 ఇదుగో. 151 00:11:37,970 --> 00:11:41,974 బొంబాయి అంతా వలీద్ పిచ్చోడిలా పేట్రేగిపోతున్నాడు, అయినా కానీ నేను ఏ ప్రతీకార చర్యకూ పూనుకోలేదు. 152 00:11:42,474 --> 00:11:44,393 కానీ పోలీసులు మాత్రం వలీద్ పై ఏ చర్యా తీసుకోరా? 153 00:11:44,393 --> 00:11:48,188 వలీద్ ని అరెస్ట్ చేస్తే, ఆ అరెస్ట్ చేసిన వాడి కుటుంబానికి ఏ గతి పడుతుందో మీకు తెలుసు కదా? 154 00:11:49,731 --> 00:11:51,525 ఈ యుద్ధం ముగిసేదాకా ఎవరూ ఏ చర్యా తీసుకోరు, 155 00:11:52,317 --> 00:11:55,737 యుద్ధం ముగిశాక, మేము ఓడిపోయినవారి మనుషులను అరెస్ట్ చేస్తాం, గెలిచినవారితో ఒప్పందాలు చేసుకుంటాము. 156 00:11:55,737 --> 00:11:57,155 వలీద్ ఎక్కడుంటాడో తెలుసా? 157 00:11:58,949 --> 00:12:00,242 అతని నైట్ క్లబ్బులో ఉన్నాడు. 158 00:12:01,076 --> 00:12:04,288 అతని దగ్గరే ఎక్కువ మనుషులు ఉన్నారు, ఖాదర్ భాయ్, పైగా యుద్ధం మొదలుపెట్టడంతో పైచేయి కూడా అతనికే ఉంది. 159 00:12:06,081 --> 00:12:08,292 నువ్వు ఓడిపోయే పక్షాన్ని ఎంచుకున్నందుకు బాధ పడుతున్నావా, సంజయ్? 160 00:12:10,252 --> 00:12:13,130 అతని మనుషులందరూ మనపై దాడులు చేస్తున్నారంటే, అతనికి రక్షణగా ఎవరూ లేరనే అర్థం. 161 00:12:15,007 --> 00:12:16,383 నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? 162 00:12:16,383 --> 00:12:19,553 మనం క్లబ్బుపై దాడి చేసి అతడిని వేసేయాలి. అతను దాన్ని అస్సలు ఊహించడు. 163 00:12:20,053 --> 00:12:23,807 మనం భయపడి దాక్కున్నామని అనుకుంటున్నాడు. కానీ మనం సర్వశక్తులు ఒడ్డీ దాడి చేసి, దీన్ని ముగిద్దాం. 164 00:12:26,685 --> 00:12:29,313 వలీద్ కూడా ఇలాగే చేస్తాడు. 165 00:12:30,230 --> 00:12:33,609 మంచిది. వాడి అస్త్రాన్ని వాడిపైనే ప్రయోగిద్దాం. 166 00:12:38,530 --> 00:12:41,533 జూ గమనిస్తూ ఉంటుంది. రహస్య దారులు ఉంటాయి. 167 00:12:52,252 --> 00:12:53,587 ఏం చేస్తున్నావు? 168 00:12:55,213 --> 00:12:56,214 మనల్ని బయటపడేసే ప్రయత్నం. 169 00:12:56,214 --> 00:12:58,050 ఆపు! వాళ్లకి వినబడుతుంది. 170 00:13:02,512 --> 00:13:04,890 జనాలకి కోపంగా ఉందని తెలుసు, 171 00:13:04,890 --> 00:13:09,353 కానీ మినిస్టర్ పాండే హత్య, ముఠాల మధ్య ఘర్షణలు, 172 00:13:09,353 --> 00:13:14,232 ఇంకా మీరు ఫోన్ చేయడం, ఇవన్నీ కథనం నిజమని చెప్పకనే చెప్తున్నాయి, సర్. 173 00:13:14,733 --> 00:13:15,734 ఇన్ని జరిగాక కూడా, 174 00:13:15,734 --> 00:13:17,402 దీన్ని కొట్టిపారేయమని అడుగుతున్నారా? 175 00:13:17,402 --> 00:13:19,029 మీరు దీన్ని అధికారికంగా చెప్పగలరా, సర్? 176 00:13:19,863 --> 00:13:22,407 హా, నేను కూడా అదే అనుకున్నా. సరే, థ్యాంక్యూ, సర్. 177 00:13:22,407 --> 00:13:24,618 నువ్వు నా కథనాన్ని దొంగిలించావు. 178 00:13:24,618 --> 00:13:26,662 నీకు ఏం కాకూడదనే ఆ పని చేశా. అంతే. 179 00:13:26,662 --> 00:13:29,206 మా ఎడిటరుతో కూడా దీని గురించి చర్చించా, ఆయన కూడా ఒప్పుకున్నాడు. 180 00:13:29,206 --> 00:13:31,959 పరిస్థితులన్నీ సద్ధుమణిగాక... -అదే ఒక మగాడైతే, నువ్వు ఇలా చేసుండేవాడివా? 181 00:13:31,959 --> 00:13:34,252 ఈ కథనం నాకు దొరికినందుకు నువ్వు ఓర్వలేకపోయావు, 182 00:13:34,252 --> 00:13:36,755 ఇంత ముఖ్యమైనది నీ సొంతం కాలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయావు. 183 00:13:36,755 --> 00:13:39,257 లేదు, నాకు నీపై చాలా గర్వంగా ఉంది, అదే సమయంలో 184 00:13:39,257 --> 00:13:41,593 నిన్ను సురక్షితంగా ఉంచాలనుకున్నా, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి. 185 00:13:41,593 --> 00:13:43,971 అదే నిజం అయ్యుంటే, అసలు నువ్వు ఈ పని చేసుండేవాడివే కాదు. 186 00:13:43,971 --> 00:13:45,597 కవ్వీ, అతను చెప్పేదాంట్లో కూడా నిజముంది, పాపా. 187 00:13:45,597 --> 00:13:48,350 నీ కథనం ప్రజల్లోకి వెళ్లింది, నువ్వు కావాలనుకున్న ప్రభావం పడింది. 188 00:13:48,350 --> 00:13:51,853 నీకేమైనా జరగరానిది జరిగితే, నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను, కవిత. 189 00:13:51,853 --> 00:13:54,064 కానీ ఇప్పుడు నేను కూడా నిన్నెప్పటికీ క్షమించను. 190 00:13:54,064 --> 00:13:55,315 కవిత. -మాట్లాడకు! 191 00:13:55,315 --> 00:13:58,652 నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. 192 00:13:59,653 --> 00:14:00,946 కవిత. -కాస్త ఓపిక వహించు, బాసూ. 193 00:14:00,946 --> 00:14:03,240 నేను తనతో మాట్లాడుతాలే. -తప్పకుండా మాట్లాడు, బాసూ. అబ్బా. 194 00:14:04,032 --> 00:14:05,784 కవ్వీ, ఒక్క నిమిషం ఆగు. ఆగు. 195 00:14:05,784 --> 00:14:07,369 నిషాంత్ పటేల్ కి ఒకటి ఇవ్వాలి. 196 00:14:07,369 --> 00:14:09,288 ఆ దరిద్రుడు ఆ ఆఫీసులో ఉన్నాడు. 197 00:14:09,288 --> 00:14:10,497 అక్కడా? -హా. 198 00:14:13,750 --> 00:14:14,960 మీకొకటి ఇవ్వమన్నారు. 199 00:14:14,960 --> 00:14:16,545 వలీద్ భాయ్ ఇవ్వమన్నారు. 200 00:14:22,175 --> 00:14:25,178 నిషాంత్. నిష్... నిష్... -ఆగు, ఆగు. 201 00:14:25,178 --> 00:14:28,473 నిషాంత్! నిషాంత్! నిష్... 202 00:14:30,017 --> 00:14:31,810 నిషాంత్. 203 00:14:31,810 --> 00:14:33,395 నిషాంత్! నిషాంత్! 204 00:14:40,193 --> 00:14:42,696 ఇప్పుడే ఎందుకు? ఇది ఇక్కడ చాలా ఏళ్ల నుండీ ఉంది కదా. 205 00:14:42,696 --> 00:14:44,489 వాళ్లకు సిగ్గుచేటుగా అనిపిస్తోంది మరి, అంతే కదా? 206 00:14:44,489 --> 00:14:46,325 అంటే, వాళ్లకి ఇది తలకొట్టేసినట్టు అన్నమాట. 207 00:14:46,325 --> 00:14:48,910 అక్కడ చెడు పనులు జరుగుతున్నాయని అందరికీ తెలుసు, 208 00:14:48,910 --> 00:14:52,581 కానీ వాళ్లు ఏమీ చేయలేకపోయేవాళ్లు కదా? కాబట్టి అక్కడ ఏమీ జరగట్లేదన్నట్టే నటించేవాళ్లు. 209 00:14:52,581 --> 00:14:56,835 కానీ ఆ నటించే అవకాశం లేకుండా చేసినప్పుడు జనాలకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. 210 00:14:56,835 --> 00:15:00,464 మేడమ్ జూ ఇప్పుడు పెద్ద సమస్యలో ఉంది. 211 00:15:00,464 --> 00:15:03,383 మంచిది. ఈ చెత్త ప్యాలెస్ ని అందరూ తగలబెట్టేస్తే బాగుండు. 212 00:15:04,092 --> 00:15:06,470 అంటే, ఈ డబ్బు కావాలని జూకి చాలా ఉంటుంది. 213 00:15:06,470 --> 00:15:09,473 హేయ్, వీళ్లకి మొత్తం డబ్బు ఇచ్చేయాల్సిందే అంటావా? 214 00:15:11,016 --> 00:15:12,017 మాటంటే మాటే. 215 00:15:31,495 --> 00:15:32,496 ఇంకా ఎక్కువ శబ్దం చేయ్! 216 00:15:34,873 --> 00:15:38,460 నన్ను వదిలేయండి! మమ్మల్ని వదిలేయండి! 217 00:15:39,294 --> 00:15:43,090 నేను ఏమైనా చేస్తాను! నేనేమైనా చేస్తానని జూకి చెప్పండి! 218 00:15:43,590 --> 00:15:47,928 దయచేసి వినండి. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాను. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను! 219 00:15:47,928 --> 00:15:50,013 వెంటనే తలుపు తెరవండి! 220 00:15:54,768 --> 00:15:56,228 దయచేసి నన్ను పంపించేయండి. నేనేమైనా చేస్తాను. 221 00:16:04,278 --> 00:16:05,404 పద. 222 00:16:12,494 --> 00:16:16,665 మిమ్మల్ని చంపడానికి ఖాదర్ ఇక్కడికి వస్తున్నాడు. మీరు దాన్ని అస్సలు ఊహించరని అనుకుంటున్నాడు. 223 00:16:17,249 --> 00:16:21,670 పాపం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. దీన్నంతటినీ వెంటనే ముగిస్తే తప్ప గెలవలేడని అతనికి తెలుసు. 224 00:16:22,337 --> 00:16:23,797 నీకు ఇది ఖచ్చితంగా తెలుసా? 225 00:16:23,797 --> 00:16:25,924 నేను అతనికి సాయపడుతున్నానని అనుకుంటున్నాడు. 226 00:16:25,924 --> 00:16:30,554 ఇక్కడికి వచ్చే దారిలోనే అతనిపై మెరుపుదాడి చేసి, 227 00:16:31,221 --> 00:16:32,848 దీన్నంతటినీ ఇవాళే ముగించేయండి. 228 00:16:35,934 --> 00:16:37,686 నువ్వు ఉన్నావే, 229 00:16:38,562 --> 00:16:41,106 నీ అంత పనికిమాలినోడు ఎవరూ లేరు, సంజయ్. 230 00:16:41,898 --> 00:16:44,735 నేనెప్పుడూ గెలిచే పక్షానే ఉండటానికి ఇష్టపడతాను. 231 00:16:45,694 --> 00:16:46,903 అంటే మీ పక్షానే, వలీద్ భాయ్. 232 00:16:52,284 --> 00:16:53,285 వెళ్దాం మరి. 233 00:18:31,049 --> 00:18:33,510 హేయ్, వాలీ. నీ ట్యాక్సీ దొరికింది. 234 00:18:33,510 --> 00:18:34,594 జోక్ బాగుందిలే. 235 00:18:39,016 --> 00:18:40,058 తస్సాదియ్యా. 236 00:18:43,603 --> 00:18:44,813 మిస్టర్ పార్కర్. 237 00:18:46,023 --> 00:18:51,612 నీకు ధైర్యం ఎక్కువేనయ్యో. లేదా పిచ్చివాడివైనా అయ్యుండాలి. బహుశా ధైర్యం, పిచ్చీ రెండూ ఉన్నాయేమో. 238 00:18:53,071 --> 00:18:55,490 అప్పుడు నేను చెప్పింది నిజమే కదా? 239 00:18:56,950 --> 00:18:57,951 దేని గురించి? 240 00:18:58,619 --> 00:19:00,537 కార్లాపై నువ్వు మనస్సు పడ్డావని. 241 00:19:01,538 --> 00:19:03,248 తను కూడా నిన్ను ప్రేమించిందా? 242 00:19:04,541 --> 00:19:06,168 నిజం చెప్పాలంటే, అది నాకూ అర్థం కాని విషయమే. 243 00:19:07,836 --> 00:19:09,921 ఏదేమైనా, నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది. 244 00:19:11,882 --> 00:19:13,759 నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. 245 00:19:14,343 --> 00:19:15,802 అందులో ఏమీ లేదు. 246 00:19:15,802 --> 00:19:19,890 ఇందులో ఇప్పుడు ఏముందన్నది ముఖ్యం కాదు, ఇందులో నుండి నేనేం తీశానన్నదే ముఖ్యం. 247 00:19:19,890 --> 00:19:20,974 అంతే కదా, మరీజియో? 248 00:19:21,558 --> 00:19:24,353 లేదు, లేదు... మొడీనా దొంగిలించినప్పుడు డబ్బులు ఆ బ్యాగులోనే ఉండాలి. 249 00:19:24,353 --> 00:19:26,647 డబ్బులు ఎక్కడ? -కార్లా, లీసాలు ఎక్కడ? 250 00:19:27,814 --> 00:19:29,733 వాళ్లని వదిలేయ్, నీకు డబ్బులిస్తా. 251 00:19:33,570 --> 00:19:35,113 బయట ఎంత మంది జనాలున్నారో చూశారా? 252 00:19:35,906 --> 00:19:37,532 ఏ క్షణమైనా వాళ్లు లోపలికి వచ్చేయవచ్చు. 253 00:19:37,532 --> 00:19:39,785 బొంబాయి నుండి పారిపోవడానికి మీకు ఈ డబ్బు చాలా అవసరం. 254 00:19:44,790 --> 00:19:45,958 వాళ్ళని వదిలేయ్. 255 00:19:46,833 --> 00:19:49,002 ఎలాగూ వాళ్ళని త్వరలోనే వలీద్ లేపేస్తాడుగా. 256 00:19:50,879 --> 00:19:52,089 నిన్ను ఖాదర్ పంపాడా? 257 00:19:52,714 --> 00:19:55,467 నేను ఖాదర్ దగ్గర పని చేయట్లేదు. అసలెప్పుడూ పని చేయలేదు. 258 00:19:58,011 --> 00:20:00,931 నాకు కూడా డబ్బులు అక్కర్లేదు. వాటి కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు. 259 00:20:02,224 --> 00:20:03,600 కానీ కార్లాతో తేల్చుకోవాల్సిన విషయం ఒకటుంది, 260 00:20:04,685 --> 00:20:08,105 అది తేలేదాకా తను ఇక్కడి నుండి కదలదు. 261 00:20:08,605 --> 00:20:10,732 మేము కూడా తనకు అదే చెప్తాములే 262 00:20:10,732 --> 00:20:13,652 నువ్వు కూడా అది కళ్లారా చూడటానికి వచ్చావని. 263 00:20:13,652 --> 00:20:15,696 అబ్బా! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 264 00:20:15,696 --> 00:20:17,114 వాళ్ళు గేటులోంచి లోపలికి వస్తున్నారు. 265 00:20:23,161 --> 00:20:25,080 అయితే మనందరి బతుకు బస్టాండే అన్నమాట. 266 00:20:25,080 --> 00:20:27,791 ఆ జనం కనుక ఇక్కడికి వస్తే, నీ డబ్బులను ఇక నువ్వు మర్చిపోవచ్చు. 267 00:20:34,715 --> 00:20:37,009 వలీద్ కి కాల్ చేయ్. కొందరు మనుషులని పంపమని చెప్పు. 268 00:20:37,009 --> 00:20:39,177 వాళ్లు వచ్చేసరికి జరగరానిది జరిగిపోతుంది. 269 00:20:40,345 --> 00:20:42,347 వెనక్కి వెళ్లండి! అందరూ వెనక్కి వెళ్లండి! 270 00:20:42,931 --> 00:20:46,310 ఎవరైనా కదిలితే, కాల్చి పారేస్తా. 271 00:20:46,893 --> 00:20:49,855 నువ్వు నన్ను డబ్బు దగ్గరికి తీసుకెళ్లాలి, అర్థమైందా? -ముందు కార్లాని వదిలేయాలి. 272 00:20:51,815 --> 00:20:54,818 ఎలా అనిపిస్తోందో నువ్వే చెప్పరాదూ. లేయ్. పైకి లేయ్. 273 00:20:55,402 --> 00:20:57,529 లేవరా సన్నాసీ! 274 00:20:57,529 --> 00:20:59,489 నన్ను డబ్బున్న చోటికి తీసుకెళ్లు, 275 00:20:59,489 --> 00:21:03,160 లేదంటే నీ వెన్నపూసలోకి తూటా దింపి, అక్కడి దాకా ఈడ్చుకుంటూ వెళ్తా. 276 00:21:03,160 --> 00:21:05,537 ఈ గది దాటి పైకి వెళ్తే చచ్చిపోతావు, మరీజియో. 277 00:21:05,537 --> 00:21:08,457 నోర్మూసుకోవే, పనికిమాలినదానా. 278 00:21:08,457 --> 00:21:11,043 పద. తెరువు. తలుపు తెరువు. 279 00:21:11,043 --> 00:21:14,087 ముందుకు రాకండి. ఇద్దరూ ముందుకు రాకండి. 280 00:21:14,087 --> 00:21:15,672 తెరువు. తెరువు. 281 00:21:24,890 --> 00:21:26,266 తుపాకీని తీసుకోండి! 282 00:21:59,466 --> 00:22:01,760 మీ అందరినీ చంపేస్తా! చంపేస్తా! 283 00:22:02,511 --> 00:22:04,763 మీ ఆగడాలని ఇక నేను భరించలేనురా సన్నాసులారా! 284 00:22:07,224 --> 00:22:09,309 లీసా, లీసా, లీసా. 285 00:22:09,309 --> 00:22:10,978 తుపాకీని ఇలా ఇవ్వు. 286 00:22:28,412 --> 00:22:29,621 ఓరి నాయనోయ్. 287 00:22:51,810 --> 00:22:54,646 ఆమెని జనాలే చూసుకుంటారు. మనం వెళ్లిపోదాం. 288 00:23:04,906 --> 00:23:07,159 మీరు ఆనందంగా జీవితం గడిపేయగలమని అనుకుంటున్నారా? 289 00:23:22,215 --> 00:23:23,842 ప్రభు మన కోసం ఎదురు చూస్తున్నాడు. 290 00:23:31,266 --> 00:23:32,726 అబ్బా. 291 00:23:34,394 --> 00:23:37,189 మనం వెనక్కి వెళ్లాలి. వెంటనే వెళ్లాలి. 292 00:23:38,649 --> 00:23:40,108 వాడు వెళ్లిపోయాడా? 293 00:23:40,108 --> 00:23:41,193 నీకు అప్పగించిందే ఒక పని! 294 00:24:11,848 --> 00:24:13,308 అతను వస్తున్నాడు. 295 00:24:47,634 --> 00:24:50,262 వాడిని ఇప్పుడే లేపేద్దాం, రఫీక్. 296 00:25:10,782 --> 00:25:12,826 ఆ చెత్త పోలీసుగాడు మనల్ని మోసం చేశాడు. 297 00:25:12,826 --> 00:25:14,911 ఇక్కడి నుండి మనం వెంటనే వెళ్లిపోవాలి. 298 00:25:14,911 --> 00:25:15,996 వెంటనే! 299 00:25:18,332 --> 00:25:19,333 ఒంగోండి, బాస్! 300 00:26:08,840 --> 00:26:10,175 ఎవరు? 301 00:26:10,926 --> 00:26:12,094 లిన్ ని. 302 00:26:15,305 --> 00:26:16,515 రండి, త్వరగా లోపలికి రండి. 303 00:26:17,307 --> 00:26:18,475 మీకందరికీ ఏమీ కాలేదు కదా? 304 00:26:18,475 --> 00:26:19,685 పెద్దగా ఏమీ కాలేదులే. 305 00:26:23,563 --> 00:26:25,148 ప్రభు ఇక్కడికి వచ్చాడా? 306 00:26:25,148 --> 00:26:27,734 లేదు. నువ్వు అతడిని పంపి ఎంత సేపైంది? 307 00:26:27,734 --> 00:26:30,696 నేనేం పంపలేదు, మేము బయటకు వచ్చేసరికి అతను లేడు. 308 00:26:30,696 --> 00:26:31,863 అతడిని తప్పుపట్టలేములే. 309 00:26:31,863 --> 00:26:34,658 అంత డబ్బు చూశాక, మురికివాడలో బతికే ఏ మనిషికైనా ఆశ పడుతుంది. 310 00:26:36,785 --> 00:26:38,287 ఏం జరిగిందో చెప్పండి. 311 00:26:38,287 --> 00:26:41,456 ఒక్క మాటలో చెప్పాలంటే, అంతా గడబిడ అయిపోయింది. 312 00:26:42,457 --> 00:26:44,042 ఏమైనా డ్రింక్ ఉందా? 313 00:26:44,042 --> 00:26:46,712 హా. ఉంది, ఇక్కడే ఉంది. 314 00:26:47,587 --> 00:26:49,631 ఇంకో విషయం, వలీద్ షా చచ్చాడు. 315 00:26:49,631 --> 00:26:53,010 రేడియోలో విన్నాను. పోలీసుల ఎన్ కౌంటరులో చనిపోయాడట. 316 00:26:53,760 --> 00:26:55,304 ఖాదర్ గెలిచాడు. 317 00:26:55,304 --> 00:26:56,388 అలాగే అనిపిస్తోంది. 318 00:27:01,852 --> 00:27:03,270 నేను ప్రభుని. 319 00:27:12,446 --> 00:27:13,864 ఏమైపోయావు నువ్వు? 320 00:27:13,864 --> 00:27:16,241 ఏంటి? కనిపించకుండా దాక్కున్నా. 321 00:27:16,241 --> 00:27:18,452 మీరు ఇక్కడికే వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నా, 322 00:27:18,452 --> 00:27:21,788 ఇంకాస్త ఉంటే పోలీసులకి చిక్కి ఉండేవాడిని. అక్కడి నుండి వెళ్లక తప్పలేదు. సారీ. 323 00:27:25,542 --> 00:27:28,462 మూడు లక్షల రెండు డాలర్లు. మొత్తం ఉంది. 324 00:27:29,338 --> 00:27:31,673 నేనే స్వయంగా లెక్కపెట్టా. రెండుసార్లు. 325 00:27:33,342 --> 00:27:34,760 నేను మొడీనా దగ్గరకి వెళ్లాలి. 326 00:27:34,760 --> 00:27:36,386 మనమంతా ఒక చోట ఉంటేనే మేలు అనుకుంటా. 327 00:27:36,386 --> 00:27:39,431 లేదు, అతను నాకోసం చూస్తూ ఉంటాడు. ఒక్కడే ఉన్నాడు, కాబట్టి నేను వెళ్తా. 328 00:27:41,224 --> 00:27:42,267 లీసా. 329 00:27:44,061 --> 00:27:45,062 ఇదంతా అతనిదే. 330 00:27:48,649 --> 00:27:49,858 మరేం పర్వాలేదు. 331 00:27:50,651 --> 00:27:52,152 లీసా, ఇద్దరూ మా ఇంటికి వెళ్లండి. 332 00:27:58,659 --> 00:28:00,369 మూడు లక్షల రెండు వేల డాలర్లు. 333 00:28:10,712 --> 00:28:11,713 ఇప్పుడు ఏం చేద్దాం? 334 00:28:15,258 --> 00:28:18,261 ఈ పోలీసు, నైటింగేల్ కి నా గురించి తెలీదు కదా? 335 00:28:33,110 --> 00:28:34,486 నిజానికి చనిపోయి ఉండాల్సింది నేను. 336 00:28:35,779 --> 00:28:37,322 అలా అనుకోవద్దు. 337 00:28:37,990 --> 00:28:39,825 నా కథనం కారణంగానే నిషాంత్ చనిపోయాడు. 338 00:28:41,451 --> 00:28:42,995 నన్ను కాపాడే ప్రయత్నంలో చనిపోయాడు. 339 00:28:44,288 --> 00:28:47,749 చివరిగా నేను అతడిని అన్న మాటలు కూడా దొంగ, అబద్ధాలకోరు అని. 340 00:28:49,668 --> 00:28:51,461 కానీ చంపింది నువ్వు కాదు కదా. 341 00:28:53,964 --> 00:28:55,882 అతని మరణానికి కారణం ఎవరా అని 342 00:28:57,634 --> 00:28:59,845 ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. 343 00:29:00,429 --> 00:29:01,722 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 344 00:29:02,347 --> 00:29:05,350 కార్లా నన్ను మోసగించి, నన్ను వాడుకుంది అనుకుంటా. 345 00:29:06,643 --> 00:29:09,521 దీని ద్వారా ఆమె ఏం సాధించాలనుకుందో కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. 346 00:29:12,441 --> 00:29:13,650 ఇన్ని మరణాలు, 347 00:29:14,443 --> 00:29:16,028 ఈ ముఠా తగాదాలు దేనికి? 348 00:29:16,862 --> 00:29:19,114 తన ప్రియుడితో హాయిగా కులకడం కోసమా? 349 00:29:31,376 --> 00:29:32,377 నేను ఓ రెండు నిమిషాల్లో వస్తా. 350 00:29:35,756 --> 00:29:39,051 నీ సాయానికి థ్యాంక్యూ, ప్రభు. -భలేవారే. 351 00:29:49,978 --> 00:29:54,524 తుది విజయం ఎప్పుడూ ప్రేమదే అవుతుంది, లిన్ బాబా, భారతదేశంలో అయితే దీనికి తిరుగే లేదు. 352 00:29:57,277 --> 00:29:58,362 నీ చేతిని ఇలా ఇవ్వు. 353 00:30:04,576 --> 00:30:05,577 ఇది నీకే. 354 00:30:07,079 --> 00:30:08,664 లీసా పట్టించుకోదులే. 355 00:30:09,665 --> 00:30:14,044 నేను వెళ్లిపోయాక, ఈ డబ్బును నువ్వు, పార్వతి కలిసి ఖర్చుపెట్టుకోవాలనే నా కోరిక, 356 00:30:14,962 --> 00:30:16,713 మీరు కోరుకొన్న జీవితాన్ని ఏర్పరచుకో. 357 00:30:26,264 --> 00:30:28,558 నేను కలిసిన అత్యంత మంచివాళ్లలో నువ్వు కూడా ఒకడివి, ప్రభు. 358 00:30:28,558 --> 00:30:31,144 నాకు నువ్వు పరిచయమవ్వడం నా పూర్వజన్మ సుకృతమో ఏమో తెలీదు, 359 00:30:31,144 --> 00:30:32,354 కానీ అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 360 00:30:36,066 --> 00:30:38,110 మన స్నేహానికి గౌరవసూచకంగా, 361 00:30:38,110 --> 00:30:41,113 ఆఖరిగా నేను నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడుగుదామనుకుంటున్నా. 362 00:30:41,113 --> 00:30:43,782 లిన్, ఏదైనా అడిగేసేయ్. -నీ మొదటి కొడుక్కి నా పేరు పెట్టు. 363 00:30:45,284 --> 00:30:47,369 అది తప్ప ఇంకేమైనా అడుగు. లిన్ పరమ చండాలమైన పేరు. 364 00:31:02,592 --> 00:31:04,177 నా గుర్తుగా. 365 00:31:05,762 --> 00:31:08,515 నేను మళ్లీ 5:30కి వచ్చి నిన్ను రైల్వే స్టేషనులో దింపుతాను. 366 00:31:08,515 --> 00:31:12,102 ఇంకేమీ మాట్లాడకు. నీకు తుది వీడ్కోలు నేను పలకాల్సిందే. 367 00:31:13,270 --> 00:31:14,271 ఉచితంగా దింపుతా. 368 00:31:20,611 --> 00:31:23,697 నేను వేరే రోగి దగ్గరికి వెళ్లి వచ్చేసరికి, ఇతను వెళ్లిపోయాడు. 369 00:31:24,448 --> 00:31:27,659 కానీ అతడిని తూటా గాయాలయ్యాయి. అలాంటప్పుడు ఎలా... 370 00:31:29,745 --> 00:31:30,829 అతనికి ఏమీ కాదు కదా? 371 00:31:31,580 --> 00:31:34,833 కానీ అతనికి ఇంకా అస్సలేమాత్రం బాగాలేదు. నేను అతడిని వెళ్లనిచ్చేవాడిని కాదు. 372 00:31:54,978 --> 00:31:57,648 సరే మరి. నేనొకసారి చూస్తాను ఆగు. 373 00:32:24,633 --> 00:32:26,093 నీకు చిన్న మచ్చ ఏర్పడుతుంది. 374 00:32:31,390 --> 00:32:34,142 ఇంత చేసినదానికి అది చాలా తక్కువ అనిపిస్తోంది. 375 00:32:36,436 --> 00:32:38,605 నాకోసం నువ్వు వచ్చావంటే నమ్మలేకపోతున్నా. 376 00:32:40,190 --> 00:32:41,316 ఎందుకు నమ్మలేవు! 377 00:33:32,492 --> 00:33:35,287 నా కోసం ఇప్పటిదాకా ఎవరూ యుద్ధాలు మొదలుపెట్టలేదు. 378 00:33:36,538 --> 00:33:38,498 ఆ పని నేను చేశా కదా? 379 00:34:02,272 --> 00:34:04,024 ఒక మేధావి ఒకసారి నాతో ఒకటి అన్నాడు, 380 00:34:04,942 --> 00:34:08,695 "భారతదేశంలో తుది విజయం ఎప్పుడూ ప్రేమదే అవుతుంది," అని. 381 00:34:22,376 --> 00:34:23,835 అతను చెప్పింది నిజమేనని అనుకుంటున్నా. 382 00:34:28,005 --> 00:34:30,007 ఎందుకంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నా. 383 00:35:35,824 --> 00:35:37,784 ప్రతీసారి ఇది నా వల్ల కాదు, 384 00:35:37,784 --> 00:35:38,827 నువ్వు... 385 00:35:39,411 --> 00:35:41,955 నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా లేదా అని ఎదురు చూస్తూ చావడం. 386 00:35:43,540 --> 00:35:45,667 నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారేమో అనుకున్నా. 387 00:35:45,667 --> 00:35:48,420 పోలీసు స్టేషనుకు వెళ్లమని నాన్నని అడిగా, కానీ ఆయన వెళ్లను అన్నాడు. 388 00:35:48,420 --> 00:35:51,048 నువ్వేం అయిపోయావో ఎవరికీ... -సా... సారీ. సారీ. 389 00:35:53,133 --> 00:35:54,468 ముందు ఇలా వచ్చి కూర్చో. 390 00:35:56,428 --> 00:35:58,764 ఖాసిమ్ భాయ్ కి ఎలా ఉంది? 391 00:35:59,890 --> 00:36:01,141 బాగానే ఉంది. 392 00:36:01,141 --> 00:36:03,685 ఖాదర్ భాయ్ కొందరు మనుషులని పంపించాడు, వాళ్లు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 393 00:36:04,936 --> 00:36:05,937 అయితే లిన్ తప్పించుకొని వెళ్లిపోయాడా? 394 00:36:06,605 --> 00:36:07,606 వెళ్లిపోతాడు. 395 00:36:15,030 --> 00:36:17,032 ఈ డబ్బు నీకు ఎక్కడిది? -ఇది కానుక. 396 00:36:18,533 --> 00:36:19,952 మనిద్దరి భవిష్యత్తుకు. 397 00:36:21,078 --> 00:36:22,579 లిన్ ఇచ్చాడు. 398 00:36:28,669 --> 00:36:30,295 నేను మాటిస్తున్నాను... 399 00:36:32,589 --> 00:36:37,386 ఇప్పటి నుండి, నిన్ను కంగారుపెట్టే పని కానీ, భయపెట్టే పని కానీ నేనేమీ చేయను. 400 00:36:40,514 --> 00:36:41,640 దేవుడి మీద ఒట్టు. 401 00:36:49,773 --> 00:36:52,317 నీ దగ్గర ఇంత డబ్బు ఉన్నట్టు మా నాన్నకి తెలీకూడదు. 402 00:37:13,714 --> 00:37:14,715 కార్లా? 403 00:37:16,633 --> 00:37:18,552 నీకు శుభ్రంగా ఉండే ఒక చొక్కా ఉంచిపెట్టా. 404 00:37:27,519 --> 00:37:30,564 నీ కోరిక తీరిపోయిందని నన్ను వదిలేసి వెళ్లిపోతున్నావా? 405 00:37:30,564 --> 00:37:33,442 నీకు కొత్త పాస్ పోర్ట్, ఇంకా పత్రాలు కావాలి కదా. 406 00:37:33,442 --> 00:37:34,776 మనకి అంత సమయం లేదు. 407 00:37:34,776 --> 00:37:37,529 సమయం ఉంది, నీ కోసం డిడియర్ చేయించినదాన్ని తీసుకువస్తాగా. 408 00:37:38,572 --> 00:37:41,241 ఖాదర్? -నేను అతడిని కలవాల్సిన అవసరముంది, లిన్. 409 00:37:42,034 --> 00:37:43,035 నిజంగానే ఉందంటావా? 410 00:37:45,537 --> 00:37:46,663 ఎందుకు? 411 00:37:46,663 --> 00:37:49,916 నేను బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు, నేను చాలా కృంగుబాటులో ఉన్నాను. 412 00:37:49,916 --> 00:37:52,961 నేనెందుకూ పనికిరాని దాన్ని అనుకుంటున్నప్పుడు, ఆయనకు నాలో ఏదో కనిపించింది. 413 00:37:54,004 --> 00:37:56,006 నన్నెలా అయితే వాడుకున్నాడో, నిన్ను కూడా ఆయన అలానే వాడుకున్నాడు. 414 00:37:56,006 --> 00:38:01,219 లేదు. అతనే కనుక లేకపోయుంటే మనిద్దరమూ కలుసుకొని ఉండేవాళ్లమే కాదు. 415 00:38:01,803 --> 00:38:05,265 ఖాదర్ ఏం పనులైనా చేసుండవచ్చు, నాకు తండ్రి లేని లోటును ఆయన తీర్చాడు. 416 00:38:05,849 --> 00:38:07,643 నేను ఆయనకి ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. 417 00:38:07,643 --> 00:38:09,019 ఏ విషయం? 418 00:38:09,019 --> 00:38:11,605 నిన్ను ఎంచుకున్నానంటే దానర్థం ఆయన్ని మోసం చేసినట్టు కాదని. 419 00:38:12,689 --> 00:38:16,652 అదీగాక, తుది వీడ్కోలు అనేది చాలా ముఖ్యం. ఆ విషయం నువ్వే నాకు ఓసారి చెప్పావు. 420 00:38:16,652 --> 00:38:18,528 హా, చెప్పే ఉంటాను కదా? 421 00:38:23,241 --> 00:38:24,743 మొడీనా ఎక్కడ? 422 00:38:24,743 --> 00:38:25,827 అతను లేడు. 423 00:38:28,413 --> 00:38:30,165 అయ్యో, నా సానుభూతి, లీసా. 424 00:38:30,165 --> 00:38:32,876 కాదు, కాదు. అక్కడ లేడు. 425 00:38:34,127 --> 00:38:35,170 ఎటో వెళ్లిపోయాడు. 426 00:38:35,671 --> 00:38:38,298 తీవ్రమైన గాయాలున్నా నడుస్తూ ఎటో వెళ్లిపోయాడు. 427 00:38:40,676 --> 00:38:43,178 దాని కోసమా ఇదంతా? 428 00:38:45,222 --> 00:38:46,932 ఇంత చేసీ లాభమేంటి? 429 00:38:48,225 --> 00:38:51,186 మీరు ఈ దేశం నుండి వెళ్లిపోతారని నాకు మాటివ్వండి. 430 00:38:51,895 --> 00:38:54,690 మీ ఇద్దరూ ఎవరో తెలీని కొత్త చోటికి వెళ్లిపోండి. 431 00:38:56,024 --> 00:38:57,150 ఆనందంగా కలిసి జీవించండి. 432 00:39:00,612 --> 00:39:02,281 నువ్వు కూడా మాతో రావాలి. 433 00:39:02,781 --> 00:39:04,866 సెబాస్టియన్ లేకుండా నేనెక్కడికీ రాను. 434 00:39:07,202 --> 00:39:09,288 వీలు కుదిరినప్పుడు నాకోసం వస్తాడు. అందులో సందేహమే లేదు. 435 00:39:12,249 --> 00:39:13,875 వెళ్లండి. నాకేమీ పర్లేదు. 436 00:39:22,676 --> 00:39:25,679 నేను ఆరు గంటలకి, స్టేషనులో ప్లాట్ ఫామ్ పైకి వచ్చి ఉంటాను. 437 00:39:25,679 --> 00:39:26,763 సరే. 438 00:39:26,763 --> 00:39:27,848 ఆలస్యం చేయకు. 439 00:39:37,941 --> 00:39:38,942 నేను మీతో అబద్ధం చెప్పాను... 440 00:39:40,819 --> 00:39:41,945 లిన్ ఫోర్డ్ గురించి, 441 00:39:42,904 --> 00:39:44,489 అతను ఎక్కడ ఉంటాడో తెలీదనే దాని గురించి. 442 00:39:46,617 --> 00:39:49,411 అప్పుడు మీకు నిజం చెప్పుంటే, నిషాంత్ బతికే ఉండేవాడేమో. 443 00:39:55,167 --> 00:39:57,628 ఇది కార్లా సారనెన్ ఇంటి చిరునామా. 444 00:39:58,670 --> 00:40:02,633 లిన్ ఎక్కడ ఉన్నాడో, తనకి ఖచ్చితంగా తెలుస్తుంది. 445 00:40:10,807 --> 00:40:12,768 మిమ్మల్ని నేను మళ్లీ చూడగలనని అనుకోలేదు. 446 00:40:12,768 --> 00:40:16,730 నిన్ను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు చనిపోయి ఉంటావేమో అని ఆందోళన పడ్డాను. 447 00:40:20,943 --> 00:40:25,989 నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడు, నీ కళ్లల్లో బెదురు, భయం కనిపించాయి, 448 00:40:25,989 --> 00:40:29,952 ఈ లోకం నుండి ఏదో తెలియని తీరాలకు శాశ్వతంగా వెళ్లిపోవాలని నీకు ఉన్నట్టుగా. 449 00:40:31,203 --> 00:40:33,038 మళ్లీ నీ కళ్లలో నాకు అదే కనిపిస్తోంది. 450 00:40:35,248 --> 00:40:38,710 మనం గెలిచాం. నువ్వు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. 451 00:40:38,710 --> 00:40:40,087 వెళ్లాలిలెండి. 452 00:40:41,338 --> 00:40:42,798 లిన్ తోనా? -అవును. 453 00:40:44,508 --> 00:40:46,009 ఇవాళ ఉదయం వచ్చే మొదటి రైలులో. 454 00:40:49,262 --> 00:40:50,555 నేను అతడిని ప్రేమిస్తున్నాను. 455 00:40:54,142 --> 00:40:56,812 "పిరికివానికి ప్రేమించేంత దమ్ము ఉండదు, 456 00:40:58,397 --> 00:41:00,440 అది దైర్యవంతులకే చెల్లుతుంది." 457 00:41:02,276 --> 00:41:04,027 నీ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది, కార్లా. 458 00:41:05,153 --> 00:41:06,947 మీకు ఇంత సమస్యలు సృష్టించిపెట్టినా కూడానా? 459 00:41:08,490 --> 00:41:11,326 మీరు ఊహించింది నిజమే, మీకు కావాలసినదాన్ని నేను ప్రమాదంలో నెట్టాను. 460 00:41:11,326 --> 00:41:13,745 సాగర్ వాడకి ఏమీ కాదు. 461 00:41:13,745 --> 00:41:15,372 ఆ మురికివాడకి ఏమీ కాదు, 462 00:41:15,372 --> 00:41:18,667 ఒక ఏడాది తర్వాత, ఈ గోల అంతా సద్దుమణిగాక, 463 00:41:19,668 --> 00:41:21,420 అక్కడి ఓట్లు నాకే పడతాయి, 464 00:41:21,420 --> 00:41:24,047 ఎందుకంటే, అక్కడి వారు నన్ను ఇంకా దైవంగా కొలుస్తారు. 465 00:41:24,798 --> 00:41:27,592 వలీద్ ఇప్పుడు లేడు కాబట్టి, నా స్థానం మరింత సుస్థిరం అవుతుంది. 466 00:41:29,970 --> 00:41:31,513 నాకు ఇక ఎదురు ఎవరూ లేరు కదా? 467 00:41:32,931 --> 00:41:34,433 నాకు ఓపిక ఎక్కువ, కార్లా. 468 00:41:35,642 --> 00:41:37,102 మంచి తండ్రులకి ఓపిక ఎక్కువే ఉంటుంది. 469 00:41:42,232 --> 00:41:45,152 లిన్ కీసం ఒక విదేశీ డిటెక్టివ్ ఈ ఊరికి వచ్చి గాలిస్తున్నాడు. 470 00:41:46,403 --> 00:41:49,031 మేము దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి, కానీ అతని దగ్గర పాస్ పోర్ట్ లేదు. 471 00:41:50,949 --> 00:41:54,077 నీకు అతని పాస్ పోర్ట్ కావాలి కదా. -అడిగే హక్కు నాకు లేదని తెలుసు. 472 00:41:56,079 --> 00:41:58,248 మీ ఇద్దరికీ ఇది నేనిచ్చే వీడ్కోలు కానుక అనుకోండి. 473 00:41:59,124 --> 00:42:02,753 స్టేషనులో మీ ఇద్దరినీ ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా నేను చూసుకుంటాను. 474 00:42:04,838 --> 00:42:08,091 నువ్వు లిన్ కి ఒకటి చెప్తావా, అతను ఏమనుకున్నా కానీ, 475 00:42:08,592 --> 00:42:11,136 వేరొక ప్రపంచంలో అతను నాకు కొడుకే అని? 476 00:42:12,137 --> 00:42:13,138 థ్యాంక్యూ. 477 00:42:14,973 --> 00:42:15,974 ఇలా రా. 478 00:42:25,400 --> 00:42:27,235 నీకు ఏమీ కానందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 479 00:42:28,528 --> 00:42:31,782 నా కోసం నువ్వు వచ్చావని లిన్ అన్నాడు. అందుకు థ్యాంక్స్. 480 00:42:31,782 --> 00:42:32,866 ఏం జరిగినా, మనదొకే కుటుంబం కదా. 481 00:42:32,866 --> 00:42:34,993 అబ్దులా నిన్ను స్టేషన్లో దింపుతాడు. 482 00:42:48,423 --> 00:42:50,759 లీసా, నువ్వు వాటిని మాకు ఇవ్వాల్సిన పని లేదు. 483 00:42:50,759 --> 00:42:51,843 కానీ నాకు ఇవ్వాలని ఉంది. 484 00:42:54,054 --> 00:42:56,098 మీరే లేకపోతే మాకు ఇది కూడా మిగిలేది కాదు, కాబట్టి... 485 00:42:58,809 --> 00:43:00,352 సగమే చాలా ఎక్కువ, 486 00:43:00,352 --> 00:43:02,396 మీకు కూడా డబ్బులు అవసరం కదా? 487 00:43:09,403 --> 00:43:11,029 డబ్బులు తీసుకో, లిన్. 488 00:43:11,822 --> 00:43:14,574 ఒక్కసారైనా సుఖంగా బతకాలన్న ఆలోచనే నీకు రాదా? 489 00:43:16,410 --> 00:43:18,745 మొడీనా కూడా అదే అంటాడని నాకు తెలుసు, కాబట్టి... 490 00:43:18,745 --> 00:43:19,871 థ్యాంక్యూ. 491 00:43:21,081 --> 00:43:22,499 సెబాస్టియన్? -లీసా. 492 00:43:25,002 --> 00:43:26,169 ఎవరు? 493 00:43:26,169 --> 00:43:28,755 మిసెస్ సారనెన్, మేము పోలీసులం. 494 00:43:28,755 --> 00:43:29,881 తలుపు తెరవండి. 495 00:43:35,679 --> 00:43:36,722 దయచేసి తలుపు తెరవండి. 496 00:43:38,473 --> 00:43:39,474 కార్లా ఇంట్లో లేదు. 497 00:43:41,018 --> 00:43:42,436 మీరు ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడారు? 498 00:43:42,436 --> 00:43:43,854 అది మీకు అనవసరం. 499 00:44:03,540 --> 00:44:04,833 నీ యెంకమ్మ! 500 00:44:06,335 --> 00:44:07,794 వద్దు, వద్దు. వద్దు! 501 00:44:29,942 --> 00:44:30,943 డేల్! 502 00:44:34,404 --> 00:44:36,031 ప్రతీ మార్గం దగ్గర పోలీసులు ఉన్నారు. 503 00:44:41,411 --> 00:44:43,080 ఇక తప్పించుకోలేవు, డేల్. 504 00:44:49,962 --> 00:44:55,092 ఇక్కడ చాలా డబ్బులు ఉన్నాయి. నన్ను వదిలేస్తే, ఇది నీకు ఇచ్చేస్తా. 505 00:44:55,092 --> 00:44:56,343 నీ తొక్కలో డబ్బు ఎవరికి కావాలి! 506 00:44:57,094 --> 00:45:01,098 ఇంకో అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు. నీకు ఇదివరకే చెప్పాను కూడా. 507 00:45:02,683 --> 00:45:05,894 ఏమైనా కొంపలు అంటుకుపోతాయా? నిజం చెప్పు! 508 00:45:08,438 --> 00:45:10,357 నిన్ను పట్టుకొనే ఇక్కడి నుండి వెళ్తా. 509 00:45:12,651 --> 00:45:14,027 ఇదుగో. ఒక్కసారి చూడు. 510 00:45:35,007 --> 00:45:36,675 కింద చాలా మంది పోలీసులు ఉన్నారు. 511 00:45:40,929 --> 00:45:42,014 మా అందరినీ కాల్చేయగలవా? 512 00:45:44,224 --> 00:45:46,727 లేదు, నిన్ను ఒక్కడినే. 513 00:46:02,451 --> 00:46:03,702 లేదు! 514 00:46:20,260 --> 00:46:23,680 నీకు నన్ను పట్టుకోవాలనే కోరిక బలంగా ఉందేమో, కానీ నాకు స్వేచ్ఛగా ఉండాలనే కోరిక ఇంకా బలంగా ఉంది. 515 00:46:26,224 --> 00:46:29,061 హేయ్! చవాన్, వాడు దూకేశాడు. పారిపోతున్నాడు. 516 00:47:06,556 --> 00:47:08,642 హలో చిట్టోడా. నన్ను గుర్తుపట్టావా? 517 00:47:09,226 --> 00:47:12,104 నీ భవిష్యత్తు బంగారు బాట కావాలో, ముళ్ల బాట కావాలో నువ్వే ఎంచుకో. 518 00:47:12,980 --> 00:47:14,481 వాడు ఎక్కడికి వెళ్లాడు? 519 00:47:31,164 --> 00:47:35,502 తప్పుకోండి. తప్పుకోండి. మన్నించాలి. నా రైలుకు ఆలస్యం అయిపోతోంది. 520 00:47:35,502 --> 00:47:38,046 తప్పుకోండి. -అందరూ శ్రద్ధగా వినండి. 521 00:47:38,046 --> 00:47:40,465 రైలు నంబరు... 522 00:49:01,213 --> 00:49:02,839 ఒకరికి నీకు నరకం చూడటమే కావాలి, తెల్లోడా. 523 00:49:06,635 --> 00:49:08,011 దీని నుండి నువ్వు బయటపడలేవు. 524 00:49:21,483 --> 00:49:23,318 ఒక మనిషిని బంధించిన ప్రతిసారి, 525 00:49:24,444 --> 00:49:26,488 అతనిపై మనం మిక్కిలి విద్వేషం చూపుతాము. 526 00:49:27,614 --> 00:49:29,032 దాన్ని నేను స్వీకరించాను. 527 00:49:31,118 --> 00:49:33,704 ఆ క్షణంలో నేను నిబ్బరంగా ఉండగలిగానంటే దానికి అదే కారణం. 528 00:49:39,543 --> 00:49:43,588 ఇక్కడ నాకు దొరికిన ప్రేమని నేను వదులుకోవాల్సి వచ్చింది. 529 00:49:43,588 --> 00:49:46,091 చివరికి కార్లా చెప్పిందే నిజమైంది. 530 00:49:46,091 --> 00:49:47,801 ప్రేమ అంటే బలహీనతే. 531 00:49:48,468 --> 00:49:52,222 కాబట్టి, నా రాత ప్రకారం జరిగిన ఆ క్షణానికి సంపూర్ణంగా లొంగిపోయి, ఆ విధి అనే చక్రానికి 532 00:49:52,723 --> 00:49:57,936 నేను నా జీవితాన్ని అర్పించడం తప్ప ఇంకేమీ చేయలేదు. 533 00:50:00,147 --> 00:50:03,817 సశేషం... 534 00:50:11,908 --> 00:50:13,827 గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రచించిన శాంతారాం ఆధారంగా తెరకెక్కించబడింది 535 00:51:33,907 --> 00:51:35,909 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్